పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, మే 2014, శనివారం

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ దేహం విరమించిన వేళ ॥ దీపస్తంభాన్నెవరో ఎత్తుకు పోయినట్టున్నారు ఈ గోడ చీకటి నీడ కప్పుకుని వుంది కాళ్ళు రెండూ ముడుచుకుని డొక్కలోకి తన్నిపెట్టి ఆకలిని చంపుతూ చినిగిన దుప్పటి యింత వెన్నెలను లోపలికి చొరబెడుతూ చల్లని స్పర్శనేదో ఒకింత పులుముతున్నట్టుంది చిన్నగా మెలకువని మింగి ఏదో మగతనిద్రలో కలవరిస్తూ దేహాన్ని విరమించిన వేళ కాసింత విశ్రాంతిని మిగిల్చి ముసురుకున్న కలల కత్తి అంచు మీద మనసు నాట్యం చేస్తూ ఊపిరి స్వరం నెమ్మదిగా చివరి వత్తినంటిన చమురులా ఈ అసంపూర్ణ పద్యాన్నిలా కత్తిరించి కాసేపు గాలిపటంలా ఎగరేసి తోకచుక్కను తాకాలని ఓ అసహజ ప్రయత్నమేదో చేయబూనుతూ (తే 24-04-2014 దీ)

by Kumar Varma K Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mj5MYn

Posted by Katta

Maheswari Goldy కవిత

|| చె లి ని రీ క్ష ణ || మహేశ్వరి గోల్డి ప్రాణమా....!! మౌనంగా పరిఢవిల్లిన మన ప్రేమకు చిహ్నంగా నవ లావణ్య సుమ చామంతి వనమున ఓ వరూధినిలా ఎన్ని మధుమాసములు అయినా తరగని మధుర దరహాసంతో భాషెరుగని మమతల సౌధమున ప్రణవాక్షర పత్రికలపై నే రాస్తున్నా ఓ ప్రణయ సందేశం...!! ముత్యాల ముక్కెర అలంకరించుకుని ఓ ముగ్ధరాలు మేనక నర్తించిన నట సౌధంలో చిరునగవుల అపరంజిలా శివరంజనీ రాగం శృతి చేస్తూ...........!! మన ప్రణయ సందేశాల సారాంశాలను సరిగమల సాక్షిగా మహతీ లతల పై శ్రావ్యంగా నవీకరిస్తుంటే......!! అమృతాల దివిలో నిను వలచిన నిహారిక మాత్రం నీ కవితా భాష్యపు నీరాజనాలకై వెన్నెల సాక్షిగా సజీవ దరహాసంతో నిరీక్షిస్తూనే ఉన్నది....!! 24/05/2014

by Maheswari Goldyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nEw7Q4

Posted by Katta

Pratapreddy Kasula కవిత

దీము - కాసుల ప్రతాపరెడ్డి బాపూ! కావలి ప్రాణంతకమే కావచ్చు కానీ బాయికొక దీము బాయి అమ్మ దేహంలోని గుండె కదా! కోడి కూత యాల్లనో గోరుకొయ్యల పొద్దునో మీ ముచ్చట్లే చెవులను తాకుండేవి రెప్పల బరువు కన్నులు తేరుచుకునేవి కావు ఎవుసం సుద్దులేవో సుడులు సుడులు మగతమత్తులో నాకు అర్థమైనట్టూ కానట్టూ.... ఒలపటికుంటే దాపటికుండదు దాపటికుంటే ఒలపటికుండదు చాలీచాలనీ ఎవుసం ఎల్లీయెల్లని సంసారం దొడ్డెడు ఆవులు, ల్యాగలూ ఒక్కటొక్కటే కుప్పకూలుతుంటే గుండెను చిక్కబట్టుకుంటూ తోకలు పట్టి లేపుతూ మనం పడిన యాతన... ఒక్కో పసురం ఇంట్ల నుంచి శవం వెళ్తున్నట్లే.... అమ్మ అంటుండేది నువ్వు ముడసమానమేస్తవని దుఃఖాన్ని తాడులా పేనుతుంటే విషాదమూ ఆనందమూ ఏదీ లేదు నీకు బుగులేది, భయమేది? పురుగూ బుస్సీ నీ నేస్తాలు కదా! దొడ్డి దొంగలు, వడ్ల కుప్పల దొంగలు ఇద్దుమో ముత్తుమో రెక్కల కష్టం పోయేది విషమంటే నీకెంతో బుగులో పాడుకాలమేదో దాపురించింది విషాన్ని తేనెలో కలిపే పెట్టే కాలమిది కాలు మర్లబడితేనో, చేతులు పట్లు తప్పితేనో మన బాయి మీది నల్లాలం ఆకుపసరే మందు ఇప్పుడెంత నాశనగాలం ముక్కు కారితే ముసురు పడితే ఒంటినీ ఇంటినీ గుల్ల చేసే మంత్రగాళ్లు ఒక్కటేమిటి, ఏది తక్కువని... అందుకేనేమో అందరూ నిద్ర పోయే యాల్ల బొట్లు బొట్లుగా చీకటి రాలిపడుతుంటే నువ్వు ఇంటి గల్మకడ్డం కూర్చొని గుస గుస పెడుతున్నట్లు ఈ లోకానికి కావలి కావాలంటవు నువ్వు అప్పుడప్పుడు రామయ్య పటేలువు అందరికీ వొరస పెట్టి పిలిచే చుట్టానివి దొరలకూ, దొంగలకూ తప్ప రెక్కలు ముక్కలు చేసుకున్నవు కదా! నీ ఒంటికి కులమంటిందా? 'బావా! నీదేం అదృష్టమో గానీ నీ కొడుకులు పొలాలను, వొయ్యిలను కలె దున్నుతరు' అన్నప్పుడు నీ ఛాతీ పెరిగిన గుర్తులేవీ లేవు మడ్లల్ల పొర్లాడిన పోరు వీరుడివి కదా! ఇప్పటిలా ఆశలు లొంగదీయలేదు అప్పులూ లొంగదీయలేదు ఆకలొక్కటే.. ఆత్మ ఒక్కటే.... కడుపులోని ఆకలి మంటలు నెత్తురు ముద్దలై నోరు నుంచి పడుతుంటే అర్థమైపోయి గుండె మీద రాయి పడింది ఏ పాలకులకూ ఏ ప్రపంచ బేపారికి లొంగని తెగువ ఆత్మగౌరవమే ఊపిరైన రైతువు కదా! నాకూ, ఈ దేశానికీ దీమువి కదా!

by Pratapreddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vXtG0M

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/మార్చుకో ..................................... రె0డు రాత్రులను చీల్చితే ఒక పగులు బయిటికొస్తు0ది. అతుకులుగా ఎన్నో తరాలు ఎదురుగున్నా....అ0దులో ను0చి ఏ తరం మారి రాలేదె0దుకు. కిరణాలు సోకకు0డా బంది0చి నీ చెమటను కల్లాపిగా చల్లుకు0టు0టే ఎన్నాళ్ళు వాడి, వేడి గాడ్పులకు మాడిపోతు0టావు. తర తరాల నీ తల రాతలను కాపి కొట్టి బ్రతికే వీళ్ళ కోసం ఆవిర్లు కక్కుతున్న శరీరాన్ని ఎన్నాళ్ళు చల్లబరుచుకు0టావు. ముక్కులోని చీమిడికి నీ వంటికి తేడా ఎ0టి ముట్టుకోకపోవడానికి. చెగువేరా పోరాడి పోలేడు మార్క్స్ రాలేడు కత్తివై నడు మెదడు పొరల్లో కాపిటల్ పుస్తకాన్ని పెట్టుకో తిరుగు. వంట పట్టి0చుకోవలసి0ది తెలివిని గాని వాడి మురికి కాలువల్లోని మట్టిని కాదు. చరిత్రలన్ని నిన్ను చెత్త కుప్పలోకి చిమ్మెశాయి స్పిట్ బాక్సులోకి ఉమ్మెశాయి ఇసర్జి0చు నీ బుర్రలోని బానిసత్వ ఆలోచనని. కష్టం మొలకెత్తన్నప్పుడు ఎ0త రాపిడి జరిగినా ఎ0 లాభం.... వ్యర్థం చెయ్యలేవా ఒక్క చంచా రక్తాన్ని. 24-05-2014

by Mothi Mohanarangafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TGq98o

Posted by Katta

Sriarunam Rao కవిత

హృదయపు ముళ్ళు..!!! ఎవరు కనిపెట్టారీ గడియారాన్ని? క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. సెకను సెకనుకూ వొణుకుతున్న ముళ్ళు హృదయాన్ని కసుక్కున పలకరిస్తుంది!!! జీవితకాలానికి సమాధానం చెప్పే గుండె ఆగి ఆగి భయపెడుతుంది!!! అలవాటయిన రోజులు వింతగా జూలు విదిలిస్తున్నాయి!!! కడుపులో ఆకలి దహిస్తుంటే కొసరి ముద్దలు తినిపిస్తునట్లుంది!!! నీ నిష్క్రమణంలా పెద్దముల్లు చిన్న ముల్లుని మ్రింగేస్తుంది!!! ఆగమని నువ్విచ్చిన సమయం కాలాన్నంతా నెట్టేస్తుంది!!! మన ప్రేమని గడియారపుముల్లు అనంతానికి తాకట్టు పెట్టేసింది. నా "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు" కవితాసంపుటి నుండి... శ్రీఅరుణం 9885779207 విశాఖపట్నం-530001

by Sriarunam Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1neLY9G

Posted by Katta

Mukharjee Madivada కవిత

గుండె లోతుల్లో అంతులేని బాధ నా కణాల్లో, కళ్ళల్లో, కలలలో, కణజాలాల్లో, అపరితమయిన అంధకారం! కారణాలేమయినా, గాయం ఒక్కటే, యుగాలైనా వీడని చిక్కుముడే! నీ కళ్ళల్లోకి చూడలేను నీ హృదయంలో నే ఉండలేను నీ తోడుగా నే నడవలేను నీకు దూరంగానూ ఉండలేను నీ నవ్వుకు కారణం కానప్పుడు అసలు,నేను బ్రతికున్నా, లేను. నీటి లోంచి బలవంతంగా బయట పడిన చేపను నేను. కాటి కంటూ చేరలేని బ్రతికున్న శవాన్ని నేను. నీ వేదన నా వల్లే నా ప్రేమే నీ శాపం నీ హృదయం, నా రుధిరం మన కలయిక ఇక కల్లే. నిశ్శబ్ద స్దబ్థత కు నే చెరువయ్యే వేళలో, గుండె లోతుల్లో అంతులేని బాధ!

by Mukharjee Madivadafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tx0VG3

Posted by Katta

Sivaramakrishna Valluru కవిత

వచ్చేస్తాం...! ॥ - వల్లరి ॥ జీవితాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన మీరంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నారు.. మీతో పంచుకున్న క్షణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.. ఏదో ఒకరోజు మావంతూ వస్తుందని తెలుసు మౌనంగా వెళ్ళిపోక తప్పదని తెలుసు... బతుకు పోరు భయంకరమే అయినా నిత్య ఘర్షణ తప్పకపోయినా నిజగానే చస్తూ జీవిస్తున్నాం... క్షణ క్షణం మరణిస్తూనే ఉన్నాం... మీ ఆత్మ సాక్షిగా రేపటికోసం.. తపిస్తూనే ఉన్నాం...! ...................... - వల్లరి 24-05-2014.

by Sivaramakrishna Vallurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1twWcnF

Posted by Katta

Ro Hith కవిత

Translation of బాలసుధాకర్ మౌళి's poem 'Ajeyulu' Immortals Ocean wanders and barks around the feet of those two kids. They don't mind it. It barks and barks wagging its tail of waves and finally retrieves. Feet as ferryboats they walk through the village on shore. Their eyes are seashells enclosing moonlight, Misplacing them unknowingly And rediscovering them- Somewhere at the entrance of a deluded house Sometime in an imagined street. No doubt that, for them Ocean is either a dog or a dead snake. They are immortals They won over the ocean.

by Ro Hithfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1twWbjD

Posted by Katta

Nishi Srinivas కవిత

*** प्यार का एहसास *** ---------------------------------- Nishigandha अलविदा आपने कहा हम तो विदा हो चले... साथ मे खामोश प्यार का जनता लेचले.... घूट घूट के जी लेगे हम ' आह ' तक न निकालेगे जब याद तुम्हारी आएगी दो आसू बहा देंगे.... कफन तो ओढ दिये जनता उठाकर तेरे खामोश प्यार का एहसास भूले नही भूलता... क्यू याद आते हो बार बार... गमो को दुनिया मे बहाने को न वादा न शिकवा था फिर भी प्यार का एहसास क्यों था ! ( Nishigandha) 24-05-2014

by Nishi Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNGRxc

Posted by Katta

Girija Nookala కవిత

ప్రేమ విలాపం అందమైన భారతీయం పొందికైన పొదరిళ్ళు యౌవ్వనానికి స్వాగతం పలుకుతూ చిరువయసు పెళ్ళిళ్ళు పిల్లలే ఆస్థులు,మానవ సంభందాలే అంతస్థులు పిల్లలు, పెద్దలు అయ్యే వరకు అండ మళ్ళీ ఆ పెద్ద వ్రుధ్ధులకు పిల్లల ఆలన పిల్లలకు, పెద్దలకు, భద్యతాయుత భద్రత కాలం చేసిన వారినీ తలుచుకొనే తత్ దినాల మరిచిపోలేని మర్యాద వంశ వ్రుక్షాల మీద మానవ రంగుల హరివిల్లు మనసుల చుక్కలు కలిపే ముత్యాల ముగ్గులు. పాశ్చాత్య వడి గాలికి చెదిరిపోతున్న పరంపరలు ఔట్ సోర్సింగ్ మోజులో కళ తప్పుతున్న మానవ పరిమళాలు బాల్య వివాహం నేరం సరే, ఈ బాల్య డేటింగులు దేనికో? భాధ్యత లేని సంభంధాలు,కామంలో కాలుతున్న కాగితపు పూవులు ఫలాలు ఒద్దంటున్న మోడు పోయిన చెట్లు ఋతురాగాలు వినలేక బదిరి అయిన అనురారాలు పండు టాకులు,లేతచిగుళ్ళు,ఆకులు,పూవులు, మొగ్గలు, అన్ని అన్ని ప్రేమ లేక కళ తప్పిన విలాపగీతాలు, మానవ సంభందాల గొలుసు కధలో జారిపోతున్న అనుబంధాలు పబ్బుల జోరు, డిజేల హోరులో ఎక్కడో వినిపిస్తున్న వేణుగానం ఆశల చిగుళ్ళు తిని ఆలపిస్తున్న పాత కోయిళ్ళ సంప్రదాయగానం.

by Girija Nookalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gqJjce

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || ఎవరన్నారు..? || ఎవరన్నారు గుండెలు నిండా నువ్వే ఉన్నావని ******* నేనే అనివుంటాను నీ వెన్నెల నాలో నిండిన రాత్రి నా బదులు నువ్వు వెలుగుతున్నపుడో నువ్వు నా రక్తంలో కలిసి మత్తుగా ఒక బలహీనతవై ఆవహించిన అమావాస్య నాడో బహుశా అనివుంటాను అయినా నువ్వు నమ్మకు ఆత్మ చెప్పని సంగతులను ******* ఈ గుండెల్లో నువ్వు కాక చాలా ఉన్నాయి అవి నా నుండి ఉద్భవించిన నా ప్రతిరూపాలు నా రక్తం, నా ఆత్మ .. అదే "నేను" దయచేసి ఇలా ఎప్పటికీ అడగకు వాటి శవాల మీద నీతో శయనించమని ******* రేయి అస్తిత్వం ఈ చీకటి వెన్నెల కురిసిందని రేయి పగలవ్వదు నీ రక్తం నాలో, నా రక్తం నీలో ప్రవహించనపుడు గుండెలునిండా నువ్వే ఉండాలనుకోవడం.. బానిసత్వమే కదూ మీ చాంద్ || 24.05.2014 ||

by Chand Usmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hjtXS3

Posted by Katta

Maheswari Goldy కవిత

M A H A M R T Y U N J A Y ….. MAHESWARI GOLDY. As I came to know about 1. Love 2. Compassion and 3. Bliss of realization But amazing Mahadeva Yes, it was amazing sweetness to my heart…..!! Oh lord! My god of gods, I open my heart to worship you hearty To stay in the permanent reality of the universe…..!! I believe You nourish all and sustains everything…..!! Lift me lord Just like a NANDIVARDINI flower To enjoy life’s fragrant breath daily…..!! Thank you lord! I found the soft beautiful 3 things 1. Love 2. Compassion 3. Bliss of realization Are the soft beautiful eyes of you…..!! Oh my lord!! I have reached the heights of devotion…..!!

by Maheswari Goldyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1necKil

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

ప్రతి ఒక్కరూ అందంగానే ఎందుకుండరూ? ఎవరికి వాళ్ళు తమకుతామే అందగత్తెలు, అందగాళ్ళు అని అనుకొంటూ ఉంటే?

by Chandrasekhar Sgdfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mh5FfQ

Posted by Katta

Ro Hith కవిత

Malayalam had always synthesised many beautiful poems and a great literary culture. I have been seeing some poignant poems written by very young people in Malayalam. Please pay attention. Here are some poems translated by my friend Ra Sh. Map By Uma Rajiv / Translated from Malayalam by Ra Sh I read my nudity Like a map. What I gather by the ear I learn by touch. I run my fingers Along the routes To my destinations By foot, sea, air, Apprehensive about Border disputes. Unpolluted by smoke or dust Of any uprising, It stretches prone Or rolls up. In every map roll There are codes Commonly accepted By the world. I seek the sign That a people/nation Degenerated by signs Cannot exist. On realizing that I have to own it first Before discarding, I locate my home on that map. Every dawn, I leave my home. At dusk, I observe familiar landmarks And establishing that the map follows not The real model of the earth, I try to make it whole In a globe made of darkness. --- Something that can happen to the nation that is `I' ! By Samudra Neelima / Trans from Malayalam by Ra Sh As I get apportioned In different directions – I I I I I I Military I. The Republic Day parade Of Iiiiiiis. As I go on a stroll With Iiiiiiis, I dispatch one I In the other direction. Another I to the beach. Plant an I in the classroom. Assign one to do the graffiti. Send one to the opponent’s house to demolish it. Sometimes,they meet. They exchange their duties Without my knowledge. Thus, some days, I meet at the beach The one I planted In the classroom. The one I sent To write a test Is caught writing poetry. The walls meant for graffiti are demolished. Graffiti encroach the opponent's house. The telecommunication system In the Ministry that is `I' Goes haywire. The regime is overthrown. I am removed from power. Forsaken By all the Iiiiiiis, I sleep My last sleep In the palace I have to vacate Next day. Only an I Whom I can trust Sleeps with me. As I wake up to a phone call, I shed myself Of the I Who slept with me. The other end of the phone Makes a demand For the I Who was shed. In search of the I who was shed, My eyes travel down From the upper floor Through the window That is never opened. Below, In the soft glare of the sun, Amulances graze. Inside it, My eyes discover The I That I Shed Earlier. Its voice on the phone In my ears. Its gun Pointing at my eye. I on the phone above. I on the phone below. A bullet From below Opens the window That is never opened And exiles A frozen I. --- Repose By Samudra Neelima / trans by Ra Sh Between the rails A body prostrate Waits for the next train, Even after its suicide, In its own blood Flesh Grief, To ensure again and again That it is dead. As it dies Under many many trains, Many many times, Anxiety grows within - Am I dead, Am I Dead? The minced Body pulp Tours the country Under the wheels.

by Ro Hithfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r2toWm

Posted by Katta

Rajeswararao Konda కవిత

నను తాకుతున్న ప్రతి చినుకు నీ జ్ఞాపకమే @ రాజేష్ 240514

by Rajeswararao Kondafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t4CjSQ

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // టెంపరరీ అవేర్నెస్ // కొన్ని నవ్వులో పువ్వులో పంచుకుందామని వస్తానా ఉన్నవో లేవో అర్ధంకాని మౌనంలో మరలా కాలానికి ఒదిలేసి ఒక అశాంతి నిశ్చలంలో ఒదిగిపోతా గుచ్చుకొనే ముళ్ళని ఎలా తప్పించుకోవాలో గుచ్చుకున్నవాటిని ఎలా తీసుకోవాలో తెలియని అర్ధరహితమైన స్థితిలో మిగిలిపోతా వాదాలు ప్రతివాదాలు అన్నీ శబ్దకాలుష్యాలే ఇక ఎరుకవుతుంది కారణాలులేని ప్రేమలు, అంతులేని దుఖాలు , మన్నించలేని మనసులు, ప్రేమించలేని మనుషులు , స్వప్నించలేని హృదయాలు, పుష్పించలేని మొగ్గలు గూడు మరిచిన పిల్లలు, శాశ్వితమైన మరణాలు అన్నీ ప్రకృతి సూత్రాలని …… Date:23/05/2014

by Sri Modugufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oetqIM

Posted by Katta

Arcube Kavi కవిత

నేను-వాళ్ళు ______________ఆర్క్యూబ్ నేను-నేను వేసుకున్న తొవ్వలో నడుస్తంటే వాళ్ళు-వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నరు నేను-నవ్వుతూ కాలిపోతుంటే వాళ్ళు చరిత్రలో బూడిదయ్యారు

by Arcube Kavifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqoaPG

Posted by Katta

Srinivas Vasudev కవిత

త్యాగం అందమైతే అదే-- చార్లెస్ లాంబ్ Charles Lamb --------------------------------------------------------------- ఓ కవి గురించో, కవయిత్రి జీవితం గురించో మనం చాలా విన్నాం ఇక్కడ, ఐ మీన్ చదివాం కదా...కానీ ఓ కవి తన కవిత్వాన్ని, అది ఏ జాన్రా ఐనా, జీవితానికి ముడిపెట్టాల్సి వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు? ఎలా రాస్తాడు? ఇదిగో ల్యాంబ్ ని చదివితే మనకే తెలుస్తుంది. ఔను! అతను మగాడూ, అందమైనవాడు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా. మనోజ్ఞంగానూ, మనోహరంగానూ రాస్తానని తెల్సుకున్నప్నట్నుంచీ రాస్తూనే ఉన్నాడు. తన వాళ్ళని ఆదుకుంటూనే ఉన్నాడు. అదే ల్యాంబ్……. Charles Lamb అతను ఓ గొప్ప కవీ, రచయితా, కానీ ఇద్దరి మధ్య ఇరుక్కుపోయాడు. ఒకరు- అతని అక్క మేరీ ల్యాంబ్, రెండు అతని ప్రేయసి (ఆమె Fanny Kelly). ఫిబ్రవరి 10, 1775 న జన్మించిన ల్యాంబ్ తన జీవితంలో కొన్నే రచనలు చేసాడు, ఆ రచనల్లో హ్యూమర్ నీ, ట్రాజెడీనీ మిళితం చేసి మరీ రాసాడు. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి Essays of Elia, Tales from Shakespeare. ఇవి ప్రపంచానికి తెల్సినవే. ముఖ్యంగా పిల్లల సాహిత్యానికి ఈయన ఆద్యుడు. అది ల్యాంబ్ కి పిల్లలంటే, ప్రేమంటే ఉన్న ప్రేమ గాఢతకి నిదర్శనం. మనకీ ఈ గాఢత ఉంటుంది కానీ అది మనం వ్యక్తపర్చలేకపోయాం--ల్యాంబ్ చెప్పగలిగాడు. తనకున్న కొద్దిపాటి నత్తి వల్ల తన పద్యాలని తను చదవలేకపోయాడుకానీ, ఆయన రాసిన పద్యాలు ప్రపంచ సాహిత్య స్థాయికి తగ్గవనే విషయం అతనికీ తెల్సు. జీవితంలో ఎదుగుతున్నప్పుడల్లా ఏదో ఒక దెబ్బ తగుల్తూనే ఉంది ల్యాంబ్ కి. మనందరిలాగనే... మొదట్నుంచీ ఓ రకమైన ఉన్మాదానికి లోనైన మేరీ ల్యాంబ్ అంటె చార్లెస్ కి అక్క, ఓ రోజు అదె ఉన్మాద స్థితిలో తన తల్లినే వంటగదిలోని కత్తితో పొడిచేయటంతో ఆమె మరణిస్తుంది. దాంతో మేరీనీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి, విచారించి ఆమెకి ఆజన్మ కారాగార శిక్ష విధిస్తారు. శిక్ష ప్రకారం ఆమె ఓ మానసిక (రోగ) వైద్యశాలలో జీవితాంతం గడపాలనీ నిర్ణయిస్తారు. కానీ చార్లెస్ తన ప్రాబల్యంతో ఆమె మానసిన వ్యాధిగ్రస్తురాలే ఐనా ఆమెని తను ఆజన్మాంతం చూసుకుంటునాననీ ఆమె వల్ల సమాజానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా సహాయపడ్తాననీ రాతపూర్వకంగా మాటిచ్చి ఆమెని తన ఇంటికి తెచ్చుకుంటాడు. అప్పట్నుంచీ అతను మరణించే వరకూ ఆమెనే అలానే చూసుకున్నాడు కూడా....ఓ ప్రముఖ కవీ, రచయితా ల్యాంబ్! 44 ఏళ్ళ వయసులో ల్యాంబ్ ఫ్యానీ కెల్లి తో ప్రేమలొ పీకల్లోతు ప్రేమలో పడ్తాడు. ఇద్దరికీ ఇష్టమే కానీ ఆమె ఓ షరతు విధిస్తుంది. 'నేను కావాలా, నీకు మీ అక్క కావాలా, నేను కూడా మీ అమ్మ లాగా ఓ అర్ధరాత్రి మీ అక్క చేతిలో కత్తిపోటుకి గురై చనిపోలెను, సో ఆమెని మళ్ళి అసైలమ్ లో దింపేయ్, మనం పెళ్ళి చేసుకుందాం లేదంటే నన్ను పూర్తిగా మర్చిపో" అని. దానికి ల్యాంబ్ దగ్గరున్న రెండు పరిష్కారాల్లో తనకి మేరీనే ముఖ్యమనుకున్నాడు. తన ప్రేయసికి మరెవరైనా దొరకొచ్చు, కానీ తన అక్కలాంటి వ్యక్తిని మరెవ్వరూ చూసుకోరు కాబట్టి ఇద్దరిలో తన అక్కనే ఎంచుకుని తన "ప్రేమ" ని వదులుకున్నాడు ల్యాంబ్..మన చార్లెస్ ల్యాంబ్! తను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఇలాంటి సంఘటనలు మన దేశంలో మాములుగానే తోస్తాయి. ఇలాంటి త్యాగాలు మనకి మాములేగా ఇవేమీ కొత్తకాదు అని మనం అనుకుంటాం కానీ విదేశీ చరిత్రలోనూ మానవసంబంధాలు ఎప్పుడూ "మాములే". త్యాగానికి సిధ్ధపడాలేకానీ!! ఐనా మానవసంబంధాలకి దేశ,కాల, మాన పరిస్థితులు ఓ లెఖ్ఖకాదని మరోసారి ఋజువయింది.అదే సాహితీవేత్తలకి కావల్సింది కదా? మేరీ ల్యాంబ్ తో కల్సి ఆమె సృజనాత్మకతనీ వాడుకుంటూ ఆమెకీ ఓ వ్యాపకం కల్పిస్తూ ఓ గొప్ప పని మొదలుపెట్టాడు ల్యాంబ్. షేక్స్‌‌పియర్ రాసిన నాటకాలని పిల్లలకి అర్ధమయ్యెలా "Tales of Shakespeare," అనే శీర్షికతో దాదాపు ఇరవై కథలవరకూ అనువదించి, ప్రపంచానికి ఇచ్చారు ల్యాంబ్స్ ఇద్దరూ. కవిత రాసినా, కథ రాసినా, నవల రాసీనా పిల్లలని దృష్టిలో పెట్టుకునే రాసాడు చార్లెస్ ల్యాంబ్. ఇది అతనికి పిల్లలంటే ఎంత మక్కువో తెలిపే ఓ అంశం. ఐనా పిల్లల్ని ప్రేమించే మనసున్నవాడు ఎవర్నైనా ప్రేమించగలడులెండీ. Blank Verse (1798), అని ఓ కవితా సంకలనం వెలువరించినా The Adventures of Ulysses (1808) అని ఓ నవల రాసినా ఇలా అన్నింట్లోనూ పిల్లల సాహిత్యప్రధానంగా సాగిన ల్యాంబ్ రచనా వ్యాసంగానికి అతన్ బతికుండగానే ప్రపంచం నీరాజనాలర్పించింది. తనకోమంటూ అతను రాసుకున్న ఏకైక వ్యాససంకలనం On the Tragedies of Shakespeare (1811) లో మాత్రం తను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు ల్యాంబ్. జీవితంలో పేదరికం నుంచీ కట్టుబాట్లనుంచీ బయటపడీ చివరి రోజుల్లో అక్కతో సహా విలాసవంతమైన జీవితాన్నే అనుభవించిన ల్యాంబ్ ఓ రోజు హఠాత్తుగా తన ఇంటికి తిరిగివస్తూ రోడ్డుపై పడి ముఖంపై తగిలిన గాయం ఇన్ఫెక్షన్ గా మారటంతో ఆ గాయంతోనే మరణిస్తాడు. (అప్పట్లో యాంటి బయాటిక్స్ లేకపోవటంతో చిన్న గాయాలకే తగిలిన ఇన్ఫెక్షన్ కి మందు లేకపోవటం ప్రతీదీ ఓ ప్రాణాంతక వ్యాధే). అతని మరణం తర్వాత కొన్నాళ్లకే మరణించిన మేరీనీ అతని సమాధి పక్కనే పూడ్చటం ఆంగ్ల సాహిత్యంలో చెప్పుకోదగ్గ కుటుంబ పాశానికి సంబంధించిన సంఘటనల్లోఒకటి. చివరిగా ల్యాంబ్ రాసిన అతని కవితలన్నింటిల్లోకి ఇదే నాకు నచ్చిన కవిత. ఓ కవి హృదయం ఆక్రోశంతో రగిలిపోయినప్పుడు ఇలా రాస్తాడేమో.. అంతే కాదు బహుశా ల్యాంబ్ ఇది తనకోసం తను రాసుకున్న కవితనుకుంటా...... The Old Familiar Faces By Charles Lamb I have had playmates, I have had companions, In my days of childhood, in my joyful school-days, All, all are gone, the old familiar faces. I have been laughing, I have been carousing, Drinking late, sitting late, with my bosom cronies, All, all are gone, the old familiar faces. I loved a love once, fairest among women; Closed are her doors on me, I must not see her — All, all are gone, the old familiar faces. I have a friend, a kinder friend has no man; Like an ingrate, I left my friend abruptly; Left him, to muse on the old familiar faces. Ghost-like, I paced round the haunts of my childhood. Earth seemed a desert I was bound to traverse, Seeking to find the old familiar faces. Friend of my bosom, thou more than a brother, Why wert not thou born in my father's dwelling? So might we talk of the old familiar faces — How some they have died, and some they have left me, And some are taken from me; all are departed; All, all are gone, the old familiar faces.

by Srinivas Vasudevfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpPWf0

Posted by Katta

Abd Wahed కవిత

జలతారుల పరదాలుగ కనుపాపల తడిచూపు దొరకదెక్కడా ఇల్లునొదిలి వెళ్ళిపోతె నీ నీడకు నీ రూపు దొరకదెక్కడా నడినెత్తిన ఎండవేడి నిలువెత్తున నీ ఉనికి నీరవుతుంటే నీలికురుల గొడుగనీడ ఆ చల్లని చెలివలపు దొరకదెక్కడా కంటి నుంచి జాలువారే నీటి బిందు పొగమంచు కాదు కాదుగా బతుకు బీడు పడనీయకు అనురాగపు వరి నారు దొరకదెక్కడా కునుకుపడని కళ్ళతోటి కలలవెంట పరుగులను మానకపోతే కనురెప్పలు నడుంవాల్చి విశ్రమించే చిరు పరుపు దొరకదెక్కడా చిరునవ్వుల హాయినొదిలి భ్రమల గాలి పటమెక్కి ఎగురుతుఉంటే నేల పైన నిల్చున్నది, దియా మనకు, మన ఇల్లు దొరకదెక్కడా

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t3m1ts

Posted by Katta