పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఏప్రిల్ 2014, గురువారం

Santosh Kumar K కవిత

||అనగనగా ఓ బస్సు|| ఓ బస్సు.. మా బస్సు.. కస్సుబుస్సులకి అడ్రెస్సు ఏడ్చినా.. మూలిగినా కదలనని మొరపెట్టుకున్నా వదలము నిన్ను వదిలి కదలలేము నమ్ము..!! ఇరుకుగున్నా పర్వాలే ఎంతమందికైనా సరిపోతావే..!! హంస నడకలు మాకు అక్కర్లే.. కన్నెల నడకలైనా నీ ముందు బలాదూరే..!! గతుకుల రాదారులైనా నీకు ఓకే కుంటుకుంటూ సాగే నీ నడకే..!! మిస్సుకైనా మిసెస్సుకైనా ఓ ఎస్సు అంటావే మా ఎర్ర బస్సు!! పిల్లాడికి కిటికీ కట్నమిస్తావ్ ముసలాళ్ళకి ముందర చోటునిస్తావ్ కుర్రాళ్ళకి కనులవిందుని వడ్డిస్తావ్ కండక్టరుకి మాత్రం చిరాకు కోపాన్నిస్తావ్ అయినా సరే మా అందరికీ భలే ముద్దొస్తావ్!! ఆగితే పోదని తెలిసినా.. సమయానికి రాదనే అపవాదు నీకున్నా.. టైముకి చేరదనే కితాబు నీదైనా.. అలగము మేము... అరవము మేము.. ఎందుకంటే నువ్వేకదా మా అందరికీ స్వర్ణ రథము!! సామన్యుడికి నువ్వే పుష్పకవిమానము మురిపించి చేర్చేవు మమ్మల్ని మా గమ్యస్థానము!! #సంతోషహేలి 10APR14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lNebCU

Posted by Katta

Padma Bikkani కవిత

పద్మ **నేనైన నువ్వు ** అదమరచి నిద్దరోతున్న నన్ను , కిటికీలో నుంచి ఉషా సమీరాలు మేనును తడిమి అల్లరి చేస్తున్నాయి. అచ్చం నీలానే.. నా పాదాలు పుడమిని ముద్దు పెట్టుకొని పెరట్లో ఉన్న మల్లితీగకు చెలికత్తెల్లా మనసు సొద వినిపించేందుకు చేరువవ్వుతున్నాయి... నాలో ఇంకిన నీ స్పర్శ్హ ఆ విరులకు తాకినట్లుంది, నీ ఙ్ఞాపకం లా నన్ను తడిమేస్తుంది తీరా కుసుమాలను తాకబోతే మంచుకు తడిసిన పువ్వులు కొత్త మాటలేవో చెపుతున్నాయి.. గమ్మత్తుగా నువ్ తడివై ఓ ఙ్ఞాపకం ఆ పువ్వుకి అంటి పరిమళం లా నన్ను చుట్టేసావు అని.. తీరా నిన్నూ ఆ తొడిమ నుంచి వేరు చేసి నాలో కట్టేద్దాం అని చూడబోతే రెక్కలు తెగిన పక్షిలా విలవిలలడి పోయావు. నేను నీకేనా నేను నేను కానా..!? అని నిలదీస్తున్నట్లుగా.. ఏం చెప్పనూ ప్రేమంటే నిండైన స్వేచ్చే కదా..!! అందుకే నువ్వు కొమ్మపై నేనూ ఓ కొమ్మనై ఇద్దరమూ ఒకలానే మిగిలాం..

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5f3SK

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-5/ dated 10-4-2014 కల్లలెరుగని పల్లె ఒడికి చేరుకోవాలనుంది తీపి తలపుల కలల సడికి జారుకోవాలనుంది పట్టు పావడతో చిట్టి చెల్లెలు పరుగున దగ్గరికొస్తే మురిపాలూరే చెలమలో మమతలు తోడుకోవాలనుంది నెమ్మదైన మా అమ్మ ఆశగా ఎదురు చూసే వేళ చెమ్మగిల్లిన కనుల వాకిట వాలిపోవాలనుంది బాల్యమిత్రుల ఆట పాటల తలపే మదిలోకొస్తే గుడి వెనకాల బిళ్ళంగోడు ఆడుకోవాలనుంది పచ్చని చేలను పచ్చిక గట్లను దాటుకు పోయే వేళ పల్లవించిన పల్లె పాటలు పాడుకొవాలనుంది డాలరు జాలరినైనా "చల్లా" ఆఖరి పిలుపే వస్తే పుట్టినచోటనే కట్టెగ మట్టిలో కలిసిపోవాలనుంది

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5f0pT

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || ఓటు=వికెట్టు|| ====================== నోటుకు ఓటు నీ జీవితానికే రేటు ఐన మారని రూటు చివరకు చేటు పిరాయిస్తాడు ప్లేటు మనమే సపరేటు ఒంగి ఒంగి దండాలు ఒంగొంగి వందనాలు చేతుల్లో ఒట్టు చేతులు చేతల్లో ఒట్టి చేతులు అందితే జుత్తు లేకుంటే కాళ్ళు చీర జాకెట్టు మెరిసే బిందెలు బారుల్లో బీరులు మద్యం యేరులు పడేస్తాడు నీ ఓటు పడుతుంది నీ వికెట్టు ============== ఏప్రిల్ 10/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oQb3KX

Posted by Katta

తెలుగు రచన కవిత

వికలమాయే జీవితం-విచారమేశాశ్వతం. విఫలమైనమనసుకీ వేధనాయె శాపమూ... . వలపుకింత వంచనైతే విరహమేగా జీవితం వికలమాయే జీవితం-విచారమేశాశ్వతం.!! వేధనెంత వేధనో –వెధనకే వేధనయే ఏడుమడుగులేడ్చినా,ఎంతనిన్ను మాడ్చినా ఏమున్నది జీవితాన ఎండమావి పరుగులే! కలలుగన్న కళ్ళని కాలమిలా రోధించే... కలిసిబ్రతకనొట్టుబెట్టి, కడకు నువ్వునేతించే.. ఎలా చెప్పుకోనమ్మా ఎర్రిమనసుకీ.. వేధనెంత వేధనో –వెధనకే వేధనయే !! చిత్తమైనాలేకుండా చిత్తగించి వెళ్లావు. గింతప్రేమనెరజూపి నువ్ అంతవంచనెంచావు గింతకంతజేసి నువ్వు ఎంత ఏడిపించినా.. శ్వస్చమైనీ మనసున నిత్యమైనుందువులే .. వికలమాయే జీవతం, విచారమే శాశ్వతం వేధనెంత వెధనో –వేధనకే వేధనాయే. ....యలమంచిలి వెంకటరమణ

by తెలుగు రచన



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kveuFd

Posted by Katta

వెంకట చలపతి బాబు కూరాకుల కవిత

కూరాకుల వెంకట చలపతి బాబు || విషాద గీతం || అనుదినం.. అనుక్షణం.. ఈ గానం నీ కోసం.. అనుదినం.. అనుక్షణం.. ఈ రాగం నీ కోసం.. నా మౌనం కరిగే కన్నీటిపాటగా.. నా ప్రేమే మిగిలే విషాద కధగా.. నీ కొంటె చూపులతో నా గుండెను మీటావే.. నీ కోయిల పలుకులతో కొంగొత్త రాగం వినిపించావే.. సప్తస్వరాల ధ్వనిగా.. సుస్వరాల వీణానాదంగా. నా హృదయంలో కొలువైనావే.. నా మూగ గానం నీ యదనే తాకలేదా? ఈ మౌనవేదన నీ మనస్సును కరిగించలేదా? ఎన్నాల్లే ఈ విషాద రాగం.. ఎన్నేల్లే ఈ మూగ గానం.. వదలవే నన్ను అయ్యే వరకు మన్ను.. #10-04-2014

by వెంకట చలపతి బాబు కూరాకుల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kveuow

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ixI1qL

Posted by Katta

Chi Chi కవిత

(10/4/14) _చేతులారా_ బుద్ధి గడ్డెలా తింటుందంటే!! చేతి నిండా పండే కూడున్నానోటికి దారి తెలియక కడుపుని కొట్టుకుని ఆకలినిసిరేయాలని చేతి కాడ పంట మీద పడే చేతులన్నిటితో కడుపుని కొట్టించుకుంటూ పంటంతా జారిపోయాక చెయి లెయ్యక పండిన చేతులన్నీ కట్టు వదిలి నెట్టేసాక నోటికి దారి తెలుసుకున్న తల బుద్ధినే చేతిగా మార్చి పంటని పిలుస్తుంది అప్పుడు చేతిలో పండేదేదైనా గడ్డే!! ఆకలికి నోరొచ్చేదాకా చేతికి బుద్ధి రాదు గడ్డిని మేసేదాకా బుద్ధికి ఆకలి కాదు!!

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qkKx9Y

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| మినీలు|\ 1. ఆపదలో - ఆదుకునేందుకు బురద బాధించదు! అపవాదు మీదపడ్డపుడు మనసు దేనిని భరించదు! 2. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవు! వ్యక్తిత్వానికి పడ్డ మచ్చలు గతించినా తొలగవు! 10.4.2014 సాయంత్రం 6.30

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gctpjr

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/డేటింగ్ 1)డేటిచ్చింది గుందె రాయి చెసుకొని రమ్మన్నది వీక్షించినది కాంక్షించకుండా ఆకాంక్షలను తమ ఆంక్షల్లో వుంచి లెగ్గు పెగ్గుతో నిగ్రహం సమకూర్చుకొని రమ్మన్నది డేటిచ్చింది సహౄదయంతో ఆస్వాదించేందుకు పిలిచింది "డాన్సర్" 2)డేటిచ్చింది సిద్దపడి రమ్మన్నది అంటుకొనేవాటికి అంటిచ్చేవాటికి పొందబోయే వాటికి పోగొట్టుకొనే వాటికి సర్వాంగాల సిద్దపడి రమ్మన్నది డేటిచ్చింది విలువల వలువలతొ రమ్మన్నది "శౄంగార సేవకురాలు" 3)డేటిచ్చింది తయారయి రమ్మన్నది భాషణం భూషణం సకల విధాల రొక్కం పారితోషికం పరవాచకం మేకప్ ప్యాకప్ సర్దుకొని తయారయి రమ్మన్నది నటనకు సిద్దపడి డేటిచ్చింది ఆహార్య ఐంగికాలతో సిద్దమయి రమ్మన్నది "యాక్టర్" 4)డేటిచ్చింది అన్నీ సర్దుకొని రమ్మన్నది పూసేవి రాసేవి కొసేవి అతికించేవి తోడుకు వేడుకకు బిడ్డకు తల్లికి బిల్లుకు విల్లుకు వడ్డించిన విస్తరిలా డేటిచ్చింది అన్నీ సర్దుకొని రమ్మన్నది "హస్పిటల్" 5)డేటిచ్చింది అన్నీ సమకూర్చుకొని రమ్మన్నది వోడినా గెలిచినా మిగిలేది శూన్యమే అని గెలిచి ఓడినా ఓడిగెలిచినా దుఖమే లభ్యమని వూరుకు వాడకు వున్నవారికి తరువాత వారికి అన్నీ చెప్పి డేటిచ్చింది సమకూర్చి రమ్మన్నది "కోర్టు" 6)డేటిచ్చింది పదిమందిని వెంటేసుకొని రమ్మన్నది చప్పట్లు కొట్టేందుకు దుప్పట్లు కప్పేందుకు ఓట్ల లెక్క తేల్చేందుకు జనబలం చూపేందుకు పదవుల పంచపాళి పంచుకొనేందుకు డేటిచ్చింది నాటో దెబ్బ తట్టుకొనేందుకు రమ్మన్నది"రాజకీయం" 7)డేటిచ్చింది పదుగుర్ని ఎనకేసుకొని రమ్మన్నది హక్కులకు పోరాడేందుకు బాధ్యతలకు నిలబడేందుకు విజయమో వీరస్వర్గమో తేల్చేందుకు త్యాగమో భోగమో తెలుసుకొనేందుకు డేటిచింది పదిమందిని కలుపుకొని రమ్మన్నది"ఉద్యమం" 8)డేటిచ్చింది పలువురితో పంచుకోను రమ్మన్నది రాసినది చదువుకొని వినసొంపుగా చదివేందుకు ప్రశంసల పూజల్లులను విమర్శల వడగళ్ళను సమంగా స్వేకరించేందుకు అక్షరమై నిలిచెందుకు డేటిచ్చింది రాసింది చదువుకొని రమ్మన్నది "సాహిత్యం" 9)డేటిచ్చింది అనుభవించరమ్మన్నది జయాపజయాలను సుఖదుఖాలను ఎత్తుపల్లాలను ద్రోహాల దాహాలను వెన్నుపోట్లను వెలుగు నీడలను సునాయసంగా వెన్నెల మడుగుల్లా ఆస్వాదించేందుకు డేటిచ్చింది ఆహ్వానించ రమ్మన్నది "జీవితం" 10)డేటిచ్చింది అన్నీ వదులుకొని రమ్మన్నది సొంతవి అరువుయి మనవి మనవనుకొన్నవి పొందినవి పోగొట్టుకొన్నవి అహాలు ఇహాలు వదులుకొని ఈకలు రాల్చుకున్న పక్షిలా రమ్మన్నది డేటిచ్చింది ఆకురాల్చిన చెట్టులా రమ్మన్నది "మరణం' ........................ జ్వలిత /10-04-2014, 6.10

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gctp2X

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్||అ|­స్థిరం ::::::::::::::::: చీకటి పళ్ళెంలో వడ్డించిన నక్షత్రాలు తోకచుక్కల ఆరగింపు వెన్నెల రాత్రిని మింగేస్తూ ఊటబావిలో ఒళ్ళారబెట్టుకుంటున్న తాబేలు/ఊరి చివర దాక్కొన్న కొండచిలువ ఇష్టమైన కౌగిలింత కోసం ఎక్కడబడితే అక్కడ పరచుకున్న నేల కళ్ళు నువ్వు చూడకుండా/ రెండు పక్కలా కొరుక్కు తిన్న తారోడ్డు అప్పుడప్పుడు తొంగి చూస్తూ తొండి చేసే వర్షం కొత్తగా /రెక్కలు దులుపుకుంటున్న సీతాకోకచిలకలు కొండపై తీరిగ్గా కూర్చున్న గడ్డిపురుగు కాసే పచ్చని ఎండ కోసం మొద్దుబారుతున్న అడవి పడుచు ఎప్పటికి తడియారకుండా చాపిన ఆకుల చేతులు పద్దాకా ముడుచుకుపోకుండా పొద్దుతిరుగుడే రాత్రికి మళ్ళా షరా మామూలే తల ఒంచేస్తూ తిలక్ బొమ్మరాజు 09.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sFvNEI

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ---॥ ఈ రెప్పల వెనకాల ॥--- ఎప్పుడైనా గమనించావా ? ఈ రెప్పల వెనకాల నువ్వు చేసిన గాయాల గుర్తులు ఇంకా సజీవంగా ఉండటం . నువ్వు నాలో ఆవాహన అయిన ప్రతిసారి అవి ఇంకా పచ్చిగా గుచ్చుతూనే ఉన్నాయి చిధ్రమైన ఈ దేహాన్ని . చిత్రమో .. ! విచిత్రమో .. ! గాని నీ సావాసం కోసం అవి తహతహలాడుతుంటాయి ఖండాంతరాలు దాటి ఎగిరివచ్చే పక్షికోసం ఎదురుచూసే వనంలా. నీదో వింత వైనం అది అంతులేని మరో ప్రపంచాన్ని అల్లుతూ ఎప్పుడూ కొత్తగానే ఆవిష్కరిస్తుంటావు కానీ నీదైన నా మనసుకు అది ఎప్పుడూ సుపరిచితమే. ఇక ఏ గాయాన్ని ఈ హృదయం స్వీకరించదు ఇక ఏ భావాన్ని ఈ గుండె పలికించలేదు ఈ దేహం శిధిలం అవ్వకముందే మరికొంత ప్రేమతో నన్ను పునర్నినిర్మించాలి నువ్వు మరువవు కదా నేస్తం ! (10-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sFvMAD

Posted by Katta

Yasaswi Sateesh కవిత

ఒక్కమాట; కవిసంగమం కవుల కవితత్వాల పరిచయం....is now live on Kinige and is available to every reader around the world. link: http://ift.tt/1gb3s0d

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gb3s0d

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ హిమాగ్ని ॥ గాయమేదో అయిందని తెలుస్తోంది వెతికి చూస్తే కంటికి కనిపించడమే లేదు రుధిరపు ఊపిరి వెచ్చగా తగులుతోంది తడిమి చూస్తే చేతికి ఎర్రగా అంటడం లేదు ఎలా అంటావా? నీ వల్ల కలుగుతున్న బాధ నీకు చూపించకుండా నవ్వు ముఖం వెనుక నేను దాచిపెట్టినట్టు నా శరీరం కూడా నటిస్తోంది నా దగ్గర! జటిలమైన నా అసంతృప్తి వేళ్ళని మనసులోనే సమాధి చేసి పెదవులపై మాత్రం తియ్యని పలుకుల్ని నీకోసం నేను మెత్తగా పూయిస్తున్నట్టు నా బుద్ధి నన్నే మభ్యపెట్టాలని చూస్తోంది! నిన్ను ఒదులుకోలేని బలహీనత బలంగా నన్ను హత్తుకుని నాకు నువ్వెలా కావాలో చెప్పనివ్వక నీక్కావాల్సినట్టు నన్ను మారుస్తుంటే కాలుతున్ననా హృదయం సుగంధాల్ని వెదజల్లుతోంది! నీకు దూరం కావాలన్న కోరిక నన్ను మరింతగా నీ వైపుకి నెట్టి నా మనసుకీ శరీరానికీ సమన్వయాన్ని సమూలంగా నాశనం చేస్తున్నట్టు జ్వలించే నా కనుపాపలు హిమాన్ని వర్షిస్తున్నాయి! అవును .. నిజమైన నేను నీకు కనిపించను మరి నువ్వు నిజంగా చూడాలనుకునే వరకు !!! 10. 04. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gc08pa

Posted by Katta

Nirmalarani Thota కవిత

మసక చీకట్లు వీడి మగత బద్దకంగా ఒళ్ళు విరుచుకోగానే సూరీడి చూపులు చురుక్కుమనగానే ఒకానొక అడవిలో సిం హం లేచి జూలు విదిలిస్తుంది అదే అడవిలో ఒక లేడి పిల్ల మేలుకొని చెవులు రిక్కిస్తుంది రెండూ సాలోచనగా కమిట్ మెంట్తో కాళ్ళను కదిలిస్తాయ్ అలవోకగా తన నుండి తప్పించుకునే లేడి పిల్ల కంటే త్వరగా పరిగెత్తి పట్టుకోకపోతే ఆకలి తాళలేక చచిపొవాల్సి వస్తుంది సిం హం ! వేగంగా పరిగెత్తుతూ చాక చక్యంగా పంజా విసిరే సిం హం కంటే తెలివివిగా కనిపించకుండా పరిగెత్తకపోతే సిం హం ఆకలికి ఆహుతి అయిపోయి చచ్చిపోతుంది లేడి కూన.. రెండూ పరిగెత్తుతుంటాయ్.. పరిగెత్తుతూనే ఉంటాయ్. . నువ్వు సిం హానివా లేక లేడివా అనేది అప్రస్తుతం తూరుపు తెల్లవారగానే కమిట్మెంట్ తో పాదాలను పరిగెత్తించాల్సిందే ఈ జనారణ్యంలో నీ అస్తిత్వం కాపాడుకోవడానికి మరింత అర్ధవంతంగా జీవించడానికీ ! పరిగెత్తడం మానావో నీ బ్రతుకే తెల్లారిపోతుంది . . !! Nirmalarani Thota [ Date: 10.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbLnCA

Posted by Katta

Sriramoju Haragopal కవిత

యాదిమరుపు నన్ను వాకిట్లో నిలబెట్టి దూగుట్ల దీపాన్ని చేసి కాళ్ళనీళ్ళకు చెంబును చేసి పందిరి గుంజను చేసి దర్వాజకు శేరెడును చేసి వేసిపెట్టిన పెద్దపీటను చేసి దాచిపెట్టిన జున్నును చేసి నువ్వెందుకు రావు పిలుపులేదు పలుకులేదు అడుగుల చప్పుడులేదు నవ్వులసడిలేదు ఇంట్ల మొగురం లెక్క బట్టకట్టుకున్న కడియాలలెక్క దారం చుట్టుకున్న గాజులలెక్క దుక్కమాపుకుని నేను చీకట్ల ఎన్నీల మబ్బులెనక కన్నీళ్ళు రెప్పలెనుక నువ్వెందుకు రావు ... ... ... 12మెట్ల కిన్నెర మీద మొగులుపాటలు పాయె కండ్లు కాయలు కాసినయి నీ నిషానీలే మిగిలినయి ఎందుకు రంధి నీ మీదనే ఎందుకు మనసు నీ సోపతికి ఎక్కడ నన్న వుండు ఇష్టంగుండు ఎట్లనన్న బతుకు చల్లంగుండు నీ మీది యాది మల్లిందని గాదు మరిసిందే లేదు పానంగుంజినపుడు పాలకుతికి బిడ్డలెక్క నువ్వే వొస్తవు ... ... ... ... పానసరం పడుతున్ననని గోసపెట్టుకునేది కాదు లోకమంత అంతే పానంబెట్టుకున్నందుకె దేవులాడుకునే దిగులు తీగెలు పారుడు నిన్ను చూసుకుంటే పువ్వులపట్టెడ కట్టుడు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6Z1Za

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

మీ శ్రేయోభిలాషి ------------------------ రావెల పురుషోత్తమ రావు ఎన్నో కలలను సృజించే ఎన్నికల ఋతువు వచ్చేసింది వసంతంతో పాటు వాకిట్లో అడుగు పెట్టింది ఎన్నాళ్ళనుంచో పూయడం మానిన పసుపు మందారాలు కొత్త కొత్త పరిమళాలతో రెండుకళ్ళ వెలుగుతో హంగుగా విచ్చేసింది చీడపట్టి బంక తెగులుతో కృశిస్తూన్న అవినీతి అసమర్ధపు జాజిమల్లె చెట్టుకూడా మరోసారి గుబాళించాలని గుప్పెట్లో వాగ్దానాల వసంతాన్ని చల్లుకుంటూ కొంగ్రొత్త నవ్వును పులుముకుని హడావిడి విచ్చేసింది. పదేళ్ళ పాటూ పదవీ యోగంలేక మల మలా మాడిన కమలం గూడా కర్నాటకంలో తగిలించుకున్న బురదనూ గోధ్రాలో పులుముకున్న రక్త చరిత్రనూ లో దుస్తుల్లో కనబడకుండా దాచేసుకుని, లోపాయకారీ ఒప్పందాలజోరుతొ ఇదిగిదిగో రామమందిరమంటూ పాత పల్లవినే కొత్త రాగంలో వినిపిస్తూ హుషారుగా దేశ భవిష్యత్తును మార్చేస్తానంటూ బీరాలు పలుకుతూ ఒచ్చేస్తున్నది. అసలు పాలనంటే తెలియకుండా అర్ధ శతదినోత్సవమన్నా కాకుoడానే ఆకాశానికి నిచ్చెనలను వేసుకుంటూ ఆం ఆద్మీలను ఆకశానికి కెక్కిస్తామంటూ కొత్త కొత్త లతో గుబాళిస్తమని మరీ మరీ అభ్యర్ధిస్తూ వెంటపడి వేధిస్తున్నది. పంచాంగ శ్రవణంలో యే పార్టీకి ఆ కందాయఫలాలను అనుకూలంగ అభివర్ణిస్తూ జనానికి అవహేళనకలిగిస్తూ అందరూ అసహ్యమిచుకునేలా తయారయి వస్తున్నవి నీ భవిష్యత్తూ నీ ఊరి భవిష్యత్తూ నీ చేతుల్లో దాగుందని హెచ్చరిస్తూ పవిత్రమైన నీవోటును అపవిత్రమవకుండా అసలు వోటేయడం మానకండని హెచ్చరిస్తూ చిత్తగించే మీ శ్రేయోభిలాషి 10-4-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbHw8I

Posted by Katta

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర//ప్రేమంటే?//09.04.2014 అక్కున చేర్చుకొని,గిండెలకత్తుకొని, ముద్దులతో,మురిపాలతో.. అనుక్షణం,నన్ను చూసుకొని,పొంగిపోయే.. అమ్మ,నాన్నల,ప్రేమే ప్రేమంటే అనుకొనే.. చిన్ననాటి రోజుల్లో... ఒక్క ఐస్క్రీం కొనుక్కొని మరొక్కటి సీత కోసం కొనుక్కెళ్లితే బావుణ్ణు.. అనిపించే ఆ చిన్న హృదయంలో మెరిసే మెరుపే, ప్రేమని అప్పుడు తనకు తెలియదు! నిక్కర్ల నుంచి ఫాంటులకి మారిన రోజుల్లో, గౌనులనుంచి లంగా ఓణీలకి మారిన సీతతో, ఎంత సమయం కబుర్లతోగడిపినా.. ఇట్టే గడిచిపోయినట్లనిపించడం, నిద్ర లేవడమే,పక్కింటి పెరట్లో.. పువ్వులు కోసుకొనే సీత కోసం వెంపర్లాడటం, చూసిన క్షణం నుంచీ, చెప్పలేనంత ..హాయి! అదే..ప్రేమని యౌవ్వనంలో అప్పుడే అడుగుపెట్టిన తనకి తలియదు! కాలేజీ చదువులకి పట్టణ ప్రయాణం.. సితను చూడకుండా వుండలేనేమో అనే, చిత్రమైన భావన..మదిలో ఆరాటం.. ఏదో పోగొట్టుకుంటున్నట్లనిపించే వెలితి, పైకి చెప్పలేని మూగ వేదన.. అదే ప్రేమంటే..అనికూడా ఆరోజు అర్ధం కాలేదు! కొత్త ఊరు..కొత్త పరిచయాలు.. కాలేజీ మెట్లెక్కాం అన్న ఒకింత గొప్ప భావన! ఎందుకో సుందరి నన్నే చూసి నవ్వుతోంది! నవ్విన ప్రతి నవ్వుకీ హృదయం దూది పింజవుతోంది! సుందరితో మాట్ల్లాడలని వెళ్లటం..మాట్లాడలేకపోవటం! మాటలురాక, మూగవాడయిపోవడం, గలగలా మాట్లాడే సుందరి అందాలని నెమరువేసుకుంటూ, తీయని ఊహల్లో తేలిపోవడం.. ప్రేమటే..ఇదేనేమో మరి! కొంచెం కొంచెం అర్ధం అవుతున్నట్లనిపిస్తోంది! తీయని కలలతో దొర్లిపోయిన కాలేజీ రోజులు! పెద్ద డాక్టరయిపోవాలనే అమ్మ,నాన్నల ఆశలను, నిజంచేసి..నిరూపించిన ఆత్మ సంతృప్తి! సుచిత్రాడాక్టర్ సమయందొరికిన ప్రతి క్షణం.. తనరూంకివచ్చి కబుర్లు చెబుతోంది! వింటున్నంతసేపూ ఏదోతెలియని తన్మయత్వం! వారాంతాలలో..బీచ్ షికార్లకి ఆహ్వానం! ఉప్పొంగే హృదయాలతో..సముద్రపు కెరటాలతో పోటీలు, అలసిన గుండెల్లో ఏదో గుబులు!ఎన్నో ఊసులు. సుచిత్ర సమక్షంలో .. పులకించిపోతున్న హృదయంలో గిలిగింతలు మరి ఈ పులకింతే ప్రేమా? ఏమో! "ఏయ్ మొద్దూ ఎమిటాలోచిస్తున్నావ్?" అంత శ్వేచ్చగా,అంత చనువుగా,అంత ప్రేమగా.. సుచిత్ర అలా పిలిచిన పిలుపులోనే దాగుంది ప్రేమని.. అప్పుడేతెలిసింది! నాకుతెలియదనేమో.. ఐ లవ్ యూ రా! గోముగా అనేసి భుజంపై వాలిపోయింది! అప్పుడే పూర్తిగా తెలిసింది ప్రేమంటే అదేనని !! ………..08.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k75djQ

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ecrLj7

Posted by Katta

Sasi Bala కవిత

మట్టి (గట్టి )మనుషులు : ----------------------------------------- మట్టి మనుషుల బురద బ్రతుకులు ఎండిన హృదయానికి (మట్టికి ) నీటిని (కన్నీటిని ) జోడించి హృద్యమైన రూపాలను , వండుకునే కుండలను మలిచీ ,నిప్పుల కాచీ అందించే మానవుడా !!!! అలుపెరుగని శ్రామికుడా !!!! ఎన్ని చేస్తే తీరుతుంది నీవు పడే దారిద్ర్యం ఎంత నీరు (కన్నీరు )నింపితే నిండుతుంది మనం (మనసు ) పెళ్లి నుండి చావు దాక లేదు ఏ కార్యము నీ కుండ లేక చితికిన ఆశలు కొలిమిలో కాలుస్తూ ..బూడిద చేస్తూ నీ ఊహలు ఇటుకల నడుమ పూడుస్తూ సమాథి చేస్తూ సాగిపోవు బాటసారీ ..... లేదూ నీకిక వేరు దారి ..... శశిబాల (10 april 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1enbKr0

Posted by Katta

Sasi Bala కవిత

మట్టి (గట్టి )మనుషులు : ----------------------------------------- మట్టి మనుషుల బురద బ్రతుకులు ఎండిన హృదయానికి (మట్టికి ) నీటిని (కన్నీటిని ) జోడించి హృద్యమైన రూపాలను , వండుకునే కుండలను మలిచీ ,నిప్పుల కాచీ అందించే మానవుడా !!!! అలుపెరుగని శ్రామికుడా !!!! ఎన్ని చేస్తే తీరుతుంది నీవు పడే దారిద్ర్యం ఎంత నీరు (కన్నీరు )నింపితే నిండుతుంది మనం (మనసు ) పెళ్లి నుండి చావు దాక లేదు ఏ కార్యము నీ కుండ లేక చితికిన ఆశలు కొలిమిలో కాలుస్తూ ..బూడిద చేస్తూ నీ ఊహలు ఇటుకల నడుమ పూడుస్తూ సమాథి చేస్తూ సాగిపోవు బాటసారీ ..... లేదూ నీకిక వేరు దారి ..... శశిబాల (10 april 14 )

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1enbI2r

Posted by Katta

Renuka Ayola కవిత

// నీడలోపలిదేహం// రేణుక అయోల దీపం కింద నీడ దేహన్ని చాపలా పరుచుకుని కూర్చునట్లుగావుంది వెలుగు రెక్కలు జీవితాన్ని కాగబెడుతునట్లుగా వుంది మనసు జ్వాలతోపాటూ ఊగుతోంది కారణం లేకుండానే ఆశల రెక్కలు ఎగిరివచ్చి దీపాన్ని కౌగలించుకుంటున్నాయి మండుతున్న ఎరుపులో జారిపడిపోతూ లేస్తూ దీపం కింద నీడని వంగి చుస్తున్నాయి జవాబు రాని ప్రశ్నలా దీపం కొండేక్కుతోంది మునివేళ్లతో సవరించి నుసినిరాల్చి దీపాన్ని వెలిగించినప్పుడు అప్పుడు కూడా గాలి స్పర్శలో ఊగే దీపం ఆత్మలా మండుతోంది జీవితాన్ని వెలిగించాలన్న వెర్రికోరికతో ఎదుగుతోంది దారిచూపించాలన్న వేదన చీకటిని దాచేయాలన్న తపన వెలుగుకింద అన్ని దాగిపోతాయన్న నమ్మకం అదే దేహంతో దీపం చుట్టూ తిరుగుతూ దీపాన్ని జరిపి చూడగానే నీడ ఆత్మలోకి ఒరిగిపోయిన దీపం నిశ్సబ్ధంగానే వెలుగుతోంది...

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gNqTME

Posted by Katta

Gundampati Vijaya Saradhi కవిత

విజయ సారధి //మరమ్మత్తు // శిశిరానికి వసంతము చేస్తుంది మరమ్మత్తు గ్రీష్మ తాప విరహనికి వాన జల్లే మరమ్మత్తు చీకటి చలి రాత్రికి వెన్నెలమ్మ మరమ్మత్తు ఆకలి కేకల కడుపుకు అన్నమే మరమ్మత్తు శ్రమ దోపిడీ జరిగిసపుడు నివసించే గళమే కద మరమ్మత్తు.

by Gundampati Vijaya Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gavVXx

Posted by Katta

Kamal Lakshman కవిత

ప్రేమ జబ్బు....కమల్ లక్ష్మణ్ ప్రతి రోజూ నువ్వు,నీ జ్ఞాపకాలే ప్రతి పనిలో నీ ఆలోచనలే అనుక్షణం నీ నామస్మరణే ఆణువణువూ నీ పులకింతలే కళ్ళు తెరిచినా నువ్వే కళ్ళు మూసినా నువ్వే నువ్వే నా ఊపిరి,నా సర్వస్వం నువ్వు లేని నేను లేను ఏంటో..ఇది ప్రేమో..జబ్బో.. అంతుబట్టక చస్తున్నా.. అర్ధం కాక ఏడుస్తున్నా ప్రేమంటే మధుర స్వప్నమని తీయని భావాల తేనె అని గొప్పగా చెప్పారు ఎందరో కధలుగా చెప్పారు కొందరు మరిదేంటి..! నేనెందుకిలా అయ్యాను ఎవరికి ఏమని చెప్పను ఎవరిని ఏమని అడగను ఎలా ఉండేవాడిని....? అయ్యో .....నా ఖర్మ... ఏ హాస్పిటల్ కెళ్ళాలో ఎంత ఖర్చవుతుందో ఎప్పుడు నయమవుతుందో ఏమీ అర్ధం కావట్లేదు సరదాగా మీ కమల్ 10.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qtQWho

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb||రాహిత్యం|| 1 అలా వదులుకుంటూ పోతున్నావ్, ఒక్కోక్కరిని. మునిగిపోతున్నప్పుడు, చేయందించేవారు దొరకరేమో మరి నీకు మిత్రమా! అంటూ హెచ్చరించాడో ఆప్తుడు. కాస్తంత విరక్తితో కూడిన చిరునవ్వుని వదులుకుంటూ, కూడదీసుకున్న పదాలను వదిలేస్తు పెదాల చివరలనుండి, ఇలా అంటానిక. ఇంకాస్త కూరుకొని పోలేక పట్టుకున్న బరువులతో ఇంకా లోతుల్లోకి వెళ్లలేక కట్టుకున్న బంధాలతో ఒక్కోక్కటి వదిలేసుకుంటున్నాను, తండ్రీ ఇక పైకి తేలే మార్గాలు వెతుక్కుంటూ. భవసాగర జలాల పై పయనించాలంటే నేనుగా, తృణప్రాయంగా వదులుకోల్సిందే కదా, అన్నింటిని. ఇంకేమీ దాచుకోకుండా, లోపలి లోగిల్లలోన. 2 తేలికపడితే కాని తేలలేం కదా మరి. ------------------------------------------10/4/2014 ఈనెల వాకిలిలో ప్రచురితం, పంపినది 6/3/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R4ckj1

Posted by Katta

John Hyde Kanumuri కవిత

కొందరిని కలవాలని మనసు ఆశపడ్తుంది నగారానికి చెరో అంచులో ఇద్దరముంటాము నగర ఆంక్షలు కలవకుండా లాగిపడ్తున్నాయి యవ్వన దేహానికి సమయంచిక్కదు సమయందొరికేసరికి దేహం సహకరించదు నగరం ప్రతీకగా మిగుల్తుంది కార్లు, బస్సులు, ట్రైన్లు, ట్రాములు, విమానాలు పరుగెడుతూనే ఉంటాయి 10.4.2014 07:10 ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R4ckiM

Posted by Katta

Afsar Afsar కవిత

కవిత్వంతో కరచాలనం-౩ అన్నం మెతుకు ఆత్మ కథ: జ్యూడీ జోర్డాన్ కవిత్వం ~ జీవితం ఆమెని ఎంత విసిగించిందో లెక్క లేదు! కాని, ఆమె జీవితాన్ని వొక్క క్షణమూ విసుక్కోలేదు. గత వారం రోజులుగా నేను జ్యూడీ జోర్డాన్ కవిత్వం చదువుతున్నాను. చదువుతూ చదువుతూ ఆమె ఇప్పటివరకూ గడిపిన జీవితాన్ని వొక్క వాక్యంలో ఎలా చెప్పాలి అని కూడా ఆలోచిస్తూ వున్నా. ఆమె జీవితాన్నంతా వొక్క సారిగా విహంగ వీక్షణం చేస్తే ఆ పై వాక్యం తట్టింది నాకు! అవును, ఎన్ని కష్టాలు పడింది ఈ కవయిత్రి! ఎవరన్నారో గుర్తు లేదు తెలుగులో – “ఏ ధాన్యపు గింజని చూసినా నాకు రైతు అస్తిపంజరమే కనిపిస్తుంది” అని! మన అనంతపురంలోనే కాదు, మనది ఎప్పటికీ కాలేని అమెరికాలో కూడా రైతు కథ అదే! అమెరికాలోని కేరోలినాలో వొక పూట తింటే ఇంకో పూట పస్తులుండే సన్నకారు కౌలు రైతు ఇంట్లో 1961లో పుట్టింది జ్యూడీ. ఆమెకి బాల్యం అంటే ఏమిటో తెలియదు, బాల్యం అంతా పొలాల్లో పని చేసింది. ఆమెకి యవ్వనం అనేదొకటి వుందని కూడా తెలీదు, యవ్వనమంతా వారాంతాలు రైతు సంతల్లో కూరగాయలు అమ్ముకోవడంతో గడిచిపోయింది. అయితే, చదువు వొక్కటే ఆమె ఎలాగోలా కొనసాగిస్తూ వచ్చింది. ఆ దరిద్రపు యవ్వనంలోనే ఎలా పడిందో ఆమె కవిత్వపు ప్రేమలో పడిపోయింది. “కవిత్వం రాయాలంటే చదువుకోవాలి,” అన్నది ఆమె మనసులో నాటుకుపోయింది. ఆ రైతు కుటుంబంలో కాలేజీ మెట్లు ఎక్కిన తొలి వ్యక్తి కూడా ఆమెనే! అదీ, సాహిత్యంలో డిగ్రీ తీసుకుంది. యూటా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తరవాత ఆమె ఇప్పుడు సదరన్ ఇల్లినాయ్ యూనివర్సిటీ లో ఫిక్షన్ పాఠాలు చెప్తోంది. జ్యూడీ కవిత్వం నిండా తను పుట్టి పెరిగిన పల్లె జీవితమే వినిపిస్తుంది. “ఆ పల్లె లేకుండా నేను లేను, అక్కడి రైతుల కన్నీళ్ళలో తడవకపోతే నేనిలా వుండే దాన్నే కాదు.” అంటుంది జ్యూడీ. సమకాలీన అమెరికన్ రైతు జీవితంలోని విషాదాన్ని జ్యూడీ కవితలుగా రాసింది. బహుశా, ఈ కోణం నించి కవిత్వం రాసిన వాళ్ళు అమెరికన్ కవిత్వంలో తక్కువగా వుంటారు. అమెరికా వచ్చిన కొత్తలో అంటే 2002 ఆ ప్రాంతంలో మొదటి సారి నేను జ్యూడీ జోర్డాన్ కవిత్వం విన్నాను. అనంతపురం నించి నేరుగా వచ్చిన వాణ్ని కాబట్టి ఆమె కవిత్వంలో బాధ నాకు కొత్తగా అనిపించలేదు. కాని, ఆమె కవిత్వం చెప్పే తీరు కొత్తగా అనిపించింది. వ్యవసాయ ప్రతీకలు ఆమె ప్రతి వాక్యంలోనూ కనిపిస్తాయి. అలాగే, పల్లె జీవితంలో వుండే కథనాత్మక ధోరణిని ఆమె కవిత్వంలోకి బాగా తీసుకువచ్చింది. ఆమె కవిత్వ ధోరణిని వాల్ట్ విట్మన్ తో పోలుస్తారు ఇక్కడి విమర్శకులు. ఆమె వాక్య నిర్మాణం కూడా వాల్ట్ విట్మన్ దీర్ఘ వాక్యాలని పోలి వుంటుంది. ఉదాహరణకి: because somewhere in North Carolina there was a house and in it, my room and my bed, bare boards and the blood stains of a man that in each slant rain’s worried whispers puddles to the cries of a slave, murdered in 1863 trying to escape. ఈ కవితని అర్థం చేసుకోవాలంటే ఆమె వూరి చరిత్ర తెలియాలి. రైతుల జీవితాల్లోకి ప్రవేశించిన ఆర్ధిక హింస గురించి తెలియాలి. అందుకే, ఆమె కవితలు narrative poems (కథనాత్మక కవితలు)గా అమెరికన్ కవిత్వంలో వొక ప్రయోగానికి నాంది పలికాయి. ఆ లక్షణం వాళ్ళనే, అచ్చయిన తొలి కవిత్వ పుస్తకం Carolina Ghost Woods కి తక్షణ గుర్తింపు లభించింది. ఎంత గుర్తింపు అంటే, వెంటనే అమెరికన్ జాతీయ రేడియో (national public radio) ఆమె ఇంటర్వ్యూని ప్రసారం చేసింది. స్థల విస్తరణ భీతి వల్ల ఆమె కథనాత్మక కవితల్ని నేను ఇక్కడ అనువాదం చేయలేకపోతున్నాను. కాని, కొన్ని పంక్తులు ఇలా వినండి: 1 అమ్మకి తెలీదనా, అన్నీ తెలుసు జీవితం అంతా కుదువ బెట్టి సాధించిన పొలం వేలం పాటలో ఎగిరిపోయింది ఎటో. ఇప్పటికీ ఆమె చెవుల్లో ఆ వేలం పాట ప్రతిధ్వనిస్తుంది. బ్యాంకు వాడి కాగితాల రెపరెపలు వినిపిస్తూనే వుంటాయి. ముడుచుకుపోతున్న కాంతిలో వొక్కో చెట్టునీ వదిలి వెళ్ళిపోతున్న సూర్యరశ్మిలో తడినేలలో కుళ్ళిపోయిన విత్తనాలు ఆమె చూపుల్లో ఇంకా మిగిలే వున్నాయి. ఆమెకి తెలుసు ఈ నేలలో ఇక కలుపు మొక్కలు కూడా పెరగవు అని! ఇన్నేసి బాధల మధ్య నన్ను ప్రేమగా హత్తుకుంటాయి చూడు అమ్మ చేతులు, అవి పూల చేతులు అనుకుంటున్నావా, కాదు, పిండిని కలుపుతూ ఆదరాబాదరా నా దాకా వచ్చిన చేతులు! 2 ఈ రాత్రి ఈ గడియారానికి అర్థమే లేదు నేను ఇంకా చిన్న పిల్లనే ఏ మెట్ల కిందనో నక్కి వుంటాను ఇవాళ ఎలాగైనా సరే చచ్చిపోవాలని వొక తుపాకి పట్టుకొని నాన్న అడివిలోకి వెళ్ళిపోయాడు. దూరం నించి వొకే వొక్క తుపాకి మోత వినిపించింది నాకు, అది అడివిలో ప్రతిధ్వని మా నిద్రల్ని చెరిపేసిన చప్పుడు. ఇక్కడేం కొత్త కాదు బతికేందుకు వొక్క కారణమూ కనిపించక ఎవరో వొకరు చస్తూనే వుంటారు. కాని, అనుకోకుండా వొక రోజు అడివిలోంచి నాన్న వెనక్కి వచ్చేశాడు. ఆత్రంగా నేను నాన్న చేతులు పట్టుకున్నాను ఆ చేతుల్లో ఇంకా ఆ ఆత్మహత్య యత్నం తాలూకూ వొణుకు అలానే వుంది. కాని, నాన్నని ఎప్పుడైనా అడగాలి చావు దాకా వెళ్లి మళ్ళీ జీవితాన్ని ఎలా గెల్చుకొచ్చావూ అని!

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lRmHmQ

Posted by Katta

Kapila Ramkumar కవిత

Daffodils I wandered lonely as a cloud That floats on high o'er vales and hills, When all at once I saw a crowd, A host, of golden daffodils; Beside the lake, beneath the trees, Fluttering and dancing in the breeze. Continuous as the stars that shine And twinkle on the milky way, They stretched in never-ending line Along the margin of a bay: Ten thousand saw I at a glance, Tossing their heads in sprightly dance. The waves beside them danced; but they Out-did the sparkling waves in glee: A poet could not but be gay, In such a jocund company: I gazed--and gazed--but little thought What wealth the show to me had brought: For oft, when on my couch I lie In vacant or in pensive mood, They flash upon that inward eye Which is the bliss of solitude; And then my heart with pleasure fills, And dances with the daffodils. William Wordsworth

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g9QAuK

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ ఎడారి సముద్రాలు @ ఎడారులు ఒకప్పటి సముద్రాలేనేమో ఈనాటి నిరాశలు ఇసుక మేటలైతే ఒకప్పటి కలలన్ని అలలేమో.. నిశ్శబ్దం ఎక్కడ లేదు. ఉప్పొంగే సముద్రంలో అలల ఘోష . నీరసించిన ఎడారిది తుఫాను భాష . సముద్రాలై పొంగిన కనులన్ని నీరింకిన ఎడారిగా మారవా..? ఆ ఎడారి లోని ముళ్ళ పొదలకు ఏ పువ్వో పూయదా.. ఎడారికి తెలిసిందొక్కటే ఇసుక రవ్వలతో ఎగిరెగిరి పడడం. సముద్రం చేసేదోక్కటే ఎగిరిపడే అలల్ని తిరిగి ఒడి చేర్చుకోవడం. ఎడారులు తనలో తడిని ఆవిరి చేసి ఎండమావుల సముద్రాన్ని సృష్టిస్తే , సముద్రం తన గర్బంలో ఒక ఎడారిని నిక్షిప్తం చేసుకుంది. నిజానికి ఇది పరస్పర ఓదార్పు అవును..ఇరువురోక్కటే అనే రహస్యప్రకటన. _ కొత్త అనిల్ కుమార్. 10 / 4 / 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sBBYJY

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఆమె | విష్వక్సేనుడు వినోద్ ఆమె రోజూ నాముందు నగ్నంగా నిలబడుతుంది. తన హృదయాన్ని పెనవేసుకున్న ప్రేమలతని నాకే బహిర్గతం చేస్తూ మనసు పొరలు విప్పి మరింత నగ్నంగా, అప్పుడే పుట్టిన కాంతి పుంజ్యం లా నా ముందు నిలబడి తధేకంగా చూస్తుంది. నగ్నత్వం తన దేహంలోలేదు, తర్కించే నా మనసులో ఉందంటుంది. కోర్కెలు కాలానికి అతీతం కాదంటూనే కోరి మరీ కళ్ళెం వేస్తానంటుంది. కైపెక్కించే కళ్ళతో నన్ను కవ్విస్తూ కాల్చేసి, మరుక్షణమే తన స్పర్శతో బ్రతికించుకుంటుంది. నా జీవిత దస్త్రంలో మిగిలిపోయిన కాగితాన్ని తీస్కొని మరువలేని జ్ఞాపకాలతో నింపేస్తుంది. నింపేసిన కాగితాన్నీ వెళ్ళిపోతూ వెంటపెట్టుకుని పోతుంది. మనసులో అందంగా ముద్రపడ్డ అందమైన అక్షరాలను తేరిపారా చూస్తూ దస్త్రంలో మరో తెల్లకాగితాన్ని అమాయకంగా అతికించి ఆమె దస్తూరికై రేపటికోసం వేచిచూస్తాను. ఇవాళ మాత్రం ఆమె ఊహల్లో దాగి ఊపిరిగా మారిపోతాను. 10-04-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2g11S

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

..../ విశ్వాంతరాళ స్వగతం /..... (Soliloquy of the universe) నేను విశ్వాన్ని ! దూరదర్శనికి అందని దూరాన్ని అంచులు లేని అనంత గోళాన్ని. శూన్యం నుండి శూన్యానికి నా ప్రయాణం బిందువు నుండి బిందువుకు నా పరివర్తనం . నిన్న- అంటే: పద్నాలుగు బిలియన్ ఏళ్ల నాటి నా శైశవ ప్రాయంలో ఓ బిలియన్ వంతే ఉండేది నా దేహం ఈనాడు వంద కాంతివత్సరాల ఊబ కాయం ! ఆనాడు ఆ పరమాణు చిరుగర్భకోశం లో ఎలా ఒదిగానో? ఈనాడు బృహత్తర బ్రహ్మాండ పరీణాహంగా ఎలా ఎదిగానో? ఊహాతీతం ! నా అనుజకోటి 'సమాంతర విశ్వగోళాల' నా అనుంగు అనంత పాలపుంతల సంఖ్య అంతుచిక్కని ఒక అగణిత ఖగోళగణాంకం ! ఈ వైరుధ్య గురుత్వాకర్షణల సంగ్రామం అంతుపట్టని ఓ కాలాకాశ దేవరహస్యం ! అంతంలేని నా అనివార్య అంతిమ విస్పోటనం ఒక కుదింపో? ఓ తెగింపో? అనాది సంకోచ వ్యాకోచాల కొనసాగింపో?! నేను విశ్వాన్ని! అమేయ గోళాన్ని! దర్శించరాని దూరాన్ని! విశ్వాత్ముని మహత్తులో వికసించిన ఓ చిన్ని వైచిత్ర్య క్షణిక వర్తమానాన్ని!

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1elioOy

Posted by Katta