పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Rammohan Rao Thummuri కవిత

రుబాయి సముద్రానికి తెలుసు చేపల నెలా పోషించాలో సముద్రానికి తెలుసు నావలెలా నడిపించాలో ప్రపంచంలోని ఉప్పదనమంతా సహిస్తున్నా సముద్రానికి తెలుసు ముత్యాలెలా సృష్టించాలో 28/2/14 వాధూలస

by Rammohan Rao Thummurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eGv9fJ

Posted by Katta

Bhaskar Palamuru కవిత

సన్నని వెలుతురు ఇసుక వేస్తే రాలనంత నిశ్శభ్డం నాలుగు గోడల మధ్యన ఆశ నిరాశల మధ్యన రాలిపోతున్న ఆరాటాలు ఎగసి పడుతున్న అలల్లా పారేసుకున్నకోరికల్లా పొలాల వెంట పరుగులు తీసే లేగ దూడల్లా నింగిలో ఉవ్వెత్తున నిలిచే మువ్వొన్నెల పతాకంలా మెలమెల్లగా సన్నని గొంతు లోంచి రాగం తాకుతుంది! తనువంతా తమకంతో మరో తోడు కోసం లతలా అల్లుకు పోవాలని ఆరాట పడుతుంది గుండె గుండెలో ప్రేమను చల్లుకుంటూ సాగుతుంది ఏ దేవుడు చేతిలో రూపొందిన బొమ్మవో ఏ శిల్పి చేతిలో కదిలిన కుంచెవో గది నిండా గానపు పరిమళం గువ్వలా అంటుకుంటుంది ! వెలుతురూ వేకువా ఒక్కటయి పోయినట్టు ఆ గాత్రపు దరహాసం పెదవుల మీద ముద్దాడుతుంది మువ్వగా మారి పాదాల చెంతన సిరిమువ్వై అల్లుకుంటుంది ఆ బహుదూరపు బాటసారి మార్మికపు గాన గాంధర్వపు గానం వివశత్వంలోకి జారుకునేలా చేస్తుంది పాటంటే బతుకు పండుగ మనసు జాతర హృదయపు సంత రెండు గుండెల కుసుమ పరాగం లోకాన్ని వెలిగించే దీపం !!

by Bhaskar Palamurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cfFvc2

Posted by Katta

Satish Kumar Chennamsetti కవిత

చూసారా... ఒక్క నాయకుడి ఆత్మహత్య లేకుండానే, తమ ఒక్క చుక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండానే నాయకులు తెలంగాణ తెచ్చేశారు !!! ఈ మాత్రం దానికి తెలంగాణ రాలేదనో, సమైఖ్యాంధ్ర కావాలనో ఆత్మహత్య లెందుకు సోదరా..?? ఆత్మహత్యలు చేసుకోవడానికి మీ కున్న గుండె ధైర్యాన్ని నాయకుల ద్వంద వైఖరిని ఎండగట్టడానికి ఉపయోగించండి. బలిదానానికి ముందు మీరు చూపే తెగువను మిమ్మల్ని మభ్య పెట్టే పాలకులను నిలదీయడానికి చూపెట్టండి. అంతేకానీ, ఆవేదనతో చేసే మీ ఆత్మార్పణలతో మీ తల్లిదండ్రులకి వేదన మిగిల్చకండి. మీ ఆత్మార్పణలే మీ నాయకుల భవిష్యత్తుకు సోపానాలు మీ ఆక్రందనలే వాళ్ల బ్రతుకులకి మంగళ వాయిద్యాలు సచ్చి మీరు సాధించే దేముంటుంది? మీ తల్లిదండ్రులకి జీవితాంతం వేదనలు, రోదనలు తప్ప మహా ఐతే ఒక్క రోజు పూల మాలలు, అమర రహేలు, రెండో రోజు నుంచీ మీ బలిదానాల్నిమన నాయకులూ మర్చిపోతారు, ఆ తరువాత మెల్లగా మేమూ మర్చిపోతాము. అందుకే ఎందాకైనా బ్రతికి పోరాడుదాం ! ఏదైనా బ్రతికి సాధిద్దాం!!

by Satish Kumar Chennamsettifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eGeclv

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || నీడలు || ====================== రోజు ఎన్నో నీడలు చూస్తున్నాను నీడల్లో ఎన్నో రూపాలు రూపాంతరం చెందుతున్నాయి మనసు ఇంద్రధనుస్సులా మారుతుంది మేఘాలు మాత్రం రోజు తరుముకొస్తున్నాయి నాలో ఎన్నో జ్ఞాపకాలు తొంగి చూస్తున్నాయి మనసు రంగులు మారుస్తుంది వయస్సు ఊసరవెల్లి అయ్యింది నా గత జ్ఞాపకాల ఉరుములు తరుముకొస్తున్నాయి వడ్రంగి పిట్ట మెదడును తొలుస్తుంది గాయాలు దాచేద్దామని .. గతి తప్పిన మనసులకు చిరునామా వెతుకుతూ మెదడు తొర్రలో ఎన్ని చేతన స్థితులో పైకి మాత్రం అచేతనం గా నేను ! మబ్బుల్లో దాగిన గతాలు చినుకులయ్యాయి చిరు జల్లులు కురిపిస్తూ వాస్తవాల నీడలో నన్ను తడిపేసాయి రోజు ఎన్నో నీడలు నీడలో తడుస్తూ నేను ================ పిబ్రవరి ఆఖరు తేది /2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cfFvJb

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

శిఖరాగ్రానికి చేరుకున్న తరువాత అటుపక్కా అనంత అగాధమే అగుపడితే రా.వెనక్కు రా.పర్వత సానువుల వద్దకు మళ్ళీ. పాదాల్ని నమ్ముకున్నవాళ్లం మనం ప్రారంబించు మరల ప్రారంభాన్ని. చీకటి సముద్రం పై ఒంటరి యుద్దం చేసే జాలరి తెగువ ఆకాశదీపంలా వెలుగుతుంది. కోరలు చాచిన అలలపై నువ్వు విసిరే మెరుపు చూపుల కత్తి మొండిబారితే పదును పెట్టేందుకు రా.వెనక్కు రా.మళ్ళీ ప్రారంబించు ప్రారంభాన్ని.... ఉమిత్ కిరణ్ ముదిగొండ...

by ఉమిత్ కిరణ్ ముదిగొండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NbXUev

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-68// ******************* 1. నిన్నుచూసి,నవ్వితే నవ్వనీ, అసలే ఆనందానికి కరువొచ్చింది, ఈ మద్య మనదేశంలో... 2. ఇక్కడేదీ కాదు శాస్వతం, ఎవడో చెప్పిన మెట్టవేదాంతం, మరి ఉండిపోద్దా సమస్య మాత్రం. 3. నిప్పు రాజుకోనప్పుడే, పొగ గుప్పుమనేది, సరుకులేనోడికే చిరాకు 4. మనిషిని సృష్టించాడు దేవుడు, ఈడు ఋణం తీర్చేసుకుంటున్నాడు, వీధికో దేవుడ్ని పుట్టించి 5. తమ్ముడూ! నీకిది అవమానం, నువ్వుండగానే ఎలా కమ్మిందోయ్, నీ మిత్రుడికి ఒంటరితనం. 6. లాగివదిల్తేనేగా వెలుతుంది బాణం, ఆవేశం పెరిగితేనేగా కె.కె., కళ్లెర్రజేస్తుంది కలం. 7. ఇళ్లు కడుతున్నంతవరకే, పనివాళ్లంతా మనవాళ్లు, ఆస్తొచ్చేవరకే కన్నోళ్లు... ఈ రోజుల్లో 8. ఊరుమొత్తం కాట్లోగలిసినా, ఆకాశం సుస్థిరమేలే, ఆస్తులుపోయినా, పేకంటే ఆశచావదులే 9. ఆతిథ్యమిస్తానని,మృత్యువంటుంటుంది, చేయికలిపావా, కుక్కిన పేనై కాళ్లదగ్గర పడుంటుంది. 10. గొడుగుతో అదిలిస్తే, కుండపోత బెదిరిపోతుందా? కాలం తప్పదంటే, మార్పు ఆగుతుందా. ====================== Date: 28.02.2014

by Kodanda Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kgiDvE

Posted by Katta

Krishna Mani కవిత

బస్ స్టాప్ *********** సమయం పదిన్నర బస్ స్టాప్ లో నేను వస్తానన్న మిత్రుడికై ఎదురుచూపులు అన్న టైముకు ముందుగానే నాకై ఉంటాడని ఆశ పడితి కాని వెయిట్ చేయిస్తాడని అనుకోలేదు రింగ్ చేస్తే పది నిమిషాల్లో అన్నాడు ! అసలే టిఫిను పడలేదు వస్తాడులే అని అటు ఇటుగా వస్తున్న యవ్వన పరిమాలలను కన్నులతో ఆస్వాదిస్తూ రెప్ప తెరచి కళలు కంటున్నాను వేసుకున్న పౌడరు చమటతో తడిసి చారలు పడ్డాయి పక్కన పానిపూరి పిలుస్తుంది ఆకలేస్తుంది వాడొస్తే లేటుగా వచ్చినందుకు టోపీ పెడతానని ధీమ ! మల్లి రింగ్ చేస్తే ఇంకో పది అన్నాడు అంతలనే ఎదురుగా బిచ్చగాడు చెయ్యి స్టైలుగా ప్యాంటులో దూరింది చినిగిన పర్సు తీసి చిల్లర వెతికి ఒక్క రూపాయి అని పక్కన అమ్మాయిని చూస్తూ బొచ్చలో వేస్తె ‘’యాబై పైసలకే ఇంత పొజా ‘’అంటూ మొహం చిట్లించాడు బెగ్గరు సారు ! చెదిరిన ఇంషర్ట్ ను సర్దుతూ ఇంతకీ రాలేడని వచ్చే పోయే ఆటోల్లోకి తొంగి చూపులు ‘’ఎక్కడికి సార్’’ అని ఒక ఆటో డ్రైవర్ ఏమని చెప్పను వాడికి నా బాధ ‘’పోయిరా సామి’’ అని సాగనంపాను ఆ నల్ల చొక్కవాడు మావాడేనా ? ఈ పచ్చ చొక్క వాడేనా ? జనాలకేసి చూసి చూసి కండ్లు మండుతున్నై అయినా రాడు ! పక్కన ఓ బుల్లి పాప ఐస్క్రీం తింటుంది నా చూపులకి ఎక్కడ అడుగుతానేమోనని భయంతో ‘’మమ్మీ’’ అని ఏడుపు తల్లి నాకేసి ‘’దొంగ కోడుకులు’ అని తిడుతుంది ఏమి నా కర్మ మావాడు రాడు ! ఇప్పుడైతే ఫోన్ ఎత్తట్లేదు తల్లోంచి చమట నూనె తెల్ల చొక్కని మురికి చేస్తుంది అసలే ఫ్రెండు పెళ్లి పదకొండు గంటలకి ఇప్పుడు దాదాపు ఒకటి మావాడు రాడు ! తిరిగి వెనక్కి వెళ్దాం అంటే మనసు వినదు రూముకెళ్తే వంట చేసుకోవాలి పెల్లికి ఎల్తె పంచ భక్ష పరమాన్నాలు ఆకలి సమయం మొహం పీక్కుపోయింది ఏదైనా కొనుక్కు తిందాం అంటే జేబులో గల గల మని చిల్లర శబ్దం ఎక్కిరిస్తుంది ! మొత్తానికి వచ్చాడు మావాడు అదిరిపోయే ఎత్నిక్ డ్రెస్సులో పల్సర్ బండిపై వస్తూనే ఎక్కడ తిడతానని ముందుగానే ‘‘సారి రా మామ’’ అంతలోనే ఇంకో సటైరు ‘’ఏం డ్రెస్సురా మామ నీది ‘’ చిత్రమైన స్తితిలో తర్వాతి విషయం ఇక చెప్పలేను ! కృష్ణ మణి I 28-02-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oaSA6g

Posted by Katta

తెలుగు రచన కవిత

కలలుగనే కళ్ళకే కన్నీరు తెలుసులే. కన్నీళ్ళే లేనికళ్ళు కలలేమికనునులే. కలనిజమై నవ్వినా,కలచెదిరీ ఏడ్చినా కడవరకూఉండేవే,కడవరకవి ఉండునులే. చెప్పలేని భావాలు చెప్పేవి కన్నీళ్లు. చెప్పేటి భావాలకు స్పందించే కన్నీళ్లు చేసేదిలేక చూడు నేల జారిపోతాయి నేలజారిపోతాయి,నేలనింకిపోతాయి. తోడుండే వారంతా నిన్నువీడిపోయినా తో'పండే పంటకీ తొలకరిపులకించినా ఒలికేవి కన్నీళ్ళే,పలకరింపు కన్నీళ్ళే. ఓదార్పూ-సమకూర్పూ కన్నీళ్ళే. .................య.వెంకటరమణ

by తెలుగు రచనfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kuE09x

Posted by Katta

Mala Chidanand కవిత

||నన్నసలు|| అగ్రపీఠంలో అధిష్టించాను ఏ దారికెల్లితివి నీవసలు ??? హృదయపీఠంలో అలంకరించాను నేనెవరో తేలియదా నీకసలు ??? సర్వదా నిన్నే అనువర్తిస్తున్నాను మరిచిపోయావా ప్రియా నన్నసలు??? అనుగాలం నా జగతివయ్యావు నిలబెట్టుకో దొరా నన్నసలు ..... ॥ మాల చిదానంద్॥ 28-2-14 ॥

by Mala Chidanandfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d0Vs3G

Posted by Katta

Panasakarla Prakash కవిత

ఒక్కటే నేన‍‍‍‍‍‍‍‍‍‍౦టే ఏ౦టో ఎవరికీ తెలీదనే ధైర్య౦ నాలోని వాడిని ఎవ్వరూ గుర్తు పట్టలేరనే నమ్మక౦ నేను పైకి కనిపి౦చే..నేనుకానని ఎవరికి తెలుసు నేనొక నడుస్తున్న దాపరికమైపోయినప్పుడు అ౦దరూ నాకు పరాయివాళ్ళే.......... ఇ౦తమ౦దిని ఎ౦దుకు మోస౦ చేస్తున్నావ౦టే ఉ౦ది...సమాధాన౦ ఉ౦ది నా దగ్గర‌ నేను నాలా ఉ౦డడ౦ కొ౦దరికి నచ్చదు నేను వాళ్ళలా ఉ౦డకపోవడ౦కూడా చాలా మ౦దికి నచ్చదు నేను ఎవ్వరిలాగో ఉ౦డకపోవడ౦కూడా ఇ౦కొ౦దరికి నచ్చదు అ౦దుకే ఎవ్వరికి వాళ్ళలా కనిపి౦చడానికి నన్ను నాలో దాచేసుకు౦టా... నన్ను నేను అద్ద౦ చేసుకుని వాళ్ళము౦దు నిలబడతాను అప్పుడు నన్ను వాళ్ళె౦త అపురూప౦గా చూసుకు౦టారో మీకు తెలుసా.......... నా ము౦దు గ౦టలతరబడి ను౦చుని వారి మొహ‍‍‍‍‍‍‍౦లోని ప్రతి భావాన్ని నా మొహ‍‍‍‍‍‍౦లో చూసుకు‍‍‍‍‍‍‍‍‍౦టారు నిజానికి నేను మోస౦చేసి వాళ్ళని గెలవడ౦లేదు వాళ్ళని వాళ్ళే మోస‍‍‍‍‍‍‍‍‍‍‍‍౦ చేసుకుని నన్ను గెలిపిస్తున్నారు వాళ్ళు అమాయకులూ కాదు నేను తెలివైనవాడినీ కాదు ఎవరికెవరూ శత్రువులుకారిక్కడ‌ నన్ను నేనే మోస౦చేసుకు౦టాను వాళ్ళకి వాళ్ళేమోసపోతారు అ౦దర౦ సమకాలీకులమే........ బతుకు ఎడారిపై నీడల్ని ప౦డిచుకోవడ౦లో..... పనసకర్ల‌ 28/02/2014.

by Panasakarla Prakashfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d0Vqcl

Posted by Katta

Raghava Raghava కవిత

"విప్లవం" (published in జనవరి పాలపిట్ట) విప్లవం.. ఇలా నువ్వొచ్చావు గదా ఇంత వెలుతురును ఆ వేళ్ళతో మంత్రించి ముద్దచేసి నాకందించావు గదా.. ఇంకా ఈ కళ్ళలో భయం చారికలెక్కడివి చెప్పు- నిన్ను నమ్మాను గదా మాగాట్టో కలుపుకు పోయొచ్చిన అమ్మ ఒళ్ళో కందికాయలుంటాయని నమ్మినట్టు నాన బుజమ్మీది కండవా మూట లో తింటానికేంటియ్యో ఉంటయ్యని నమ్మినట్టు అన్నాన్ని నమ్మినట్టు అడవిని నమ్మినట్టు- ...వాళ్ళెప్పుడూ నా నమ్మకాన్ని మించే ఇచ్చారు నువ్వూ అంతే గదా ఇంకా ఈ కళ్ళలో భయం చారికలెందుకుంటయ్ చెప్పు- . . . నువ్వెప్పుడూ చెప్పకపోయినా నాకు తెల్సులే నీకు చానా మంత్రాలొచ్చు- వేల కాళ్ళతో నా మీదెక్కి నాట్యం చేస్తావు వేల చేతుల్తో నా పీకనొక్కి ప్రాణం తీస్తావు అంతలో అలా తాకి మంత్రించి మరలా ప్రాణం పోస్తావు -నా గుండె లోంచి మొలుచుకొచ్చిందేదో నీకోసం వెతుక్కుంటోంది ఏదో పంచుకోవాలని ఎక్కడున్నావింతకీ...? -ఒకానొక జొరం పొద్దున కాలిపోయే నుదుటి మీద నువ్వలా చెయ్యి వేసినపుడు రెపరెపలాడే గుండె చుట్టూ ఓ కోట కట్టినట్టు.. కొన్ని అనుభూతులెప్పటికీ కరిగిపోవబ్బా -ఇదిగో ఇంకా ఈ నుదుటి మీదే నీ చేయి మరిక ఈ కళ్ళలో భయం చారికలెందుకుంటై చెప్పు...!

by Raghava Raghavafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1euw0om

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfO4Ge

Posted by Katta

Nakka Venkatrao కవిత

ప్రేమా .. ఎండుటాకులా ఎగిరిపోతూ రాలిపోతాము ఆమాత్రం స్వేచ్చ కే చలించి పోయి గుండె తేలికైపోతుంది జీవిత పరమార్థమేదో అప్పుడే రూపు కట్టినట్టు.. మనసుని ముద్దాడి మమతలకోట కట్టినట్టు .. హమ్మో !ప్రేమ .. ప్రేమా .

by Nakka Venkatraofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jF99aw

Posted by Katta

RajendraKumar Devarapalli కవితby RajendraKumar Devarapallifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jF932G

Posted by Katta

Nirmalarani Thota కవిత

నడిరేయి దాటినా నాకు నిదురే రాదు . . కనులు మూసుకుంటే నువ్వు మాయమై పోతావేమోనని భయమేమో . . ! తెలివెలుగు పారినా నాకు మెలకువే రాదు కనులు తెరిస్తే కల చెదిరి (కలలో నీ రూపు) పోతుందేమోనని భయమేమో . . ! నిర్మలారాణి తోట [ తేది: 28.02.2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jF932w

Posted by Katta

Phani Madhav Kasturi కవిత

Please like the page and participate http://ift.tt/1kfO0pW అవధాన విద్యా ప్రపంచం లో 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్ అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం ! " లక్ష పద్యార్చనం " ...................... ............... ............. ............... ................... ప్రియమైన స్నేహితులారా ! నమస్కారం !! మన మంతా కలసి ఒక దివ్యమైన పద్య కవిత్వ యజ్ఞం చేద్దాం. దాని పేరు " లక్ష పద్యార్చనం" మీరు పృచ్ఛకులుగా, ప్రశ్నల పుష్పాల సౌజన్యం ప్రకటిస్తే ఈ " లక్ష పద్యార్చన " ప్రారంభమౌతుంది , "లక్ష పద్యార్చన" స్వరూపం ---------------------------- సాధారణంగా అష్టావధానం లో 8 మంది పృచ్చకులు ,ఒక కొన్ని వందల మంది ప్రేక్షకులు , ఓ రెండు లేక మూడు గంటల సమయం 10-15 కొత్త పద్యాలు రచించబడతాయి . అదే శతావధానం లో 100 మంది పృచ్చకులు ,వెయ్యికి పైగా ప్రేక్షకులు ,2-3 రోజుల సమయం , 100 కు పైగా కొత్త పద్యాల సృష్టి . సహస్ర , పంచ సహస్రావధానాల లో సుమారు 1000 మంది పృచ్చకులు. నాలుగు వారాల సమయం , 1000-5000 పద్యాల సృష్టి. వీటికి ₹10,000/ నుండి ₹25,00,0000/ వరకు ఖర్చు ! ఇంకా ఎన్నో శ్రమలు ! ప్రస్తుతం మనం ఫేస్ బుక్ ద్వారా చేసే ఈ "లక్ష పద్యార్చన" లో వేలాది పృచ్చకులు ప్రపంచం నలు మూలల నుండి ఖర్చు శ్రమ లేకుండా పాల్గొనవచ్చు ! లక్ష కొత్త పద్యాలు సృష్టించ బడతాయి! విషయ వైవిధ్యం ఉంటుంది ! ప్రశ్నల విభాగాలు : 1)సమస్యలు 2)దత్తపదులు 3)వర్ణనలు 4) అనువాదాలు 5)అప్రస్తుత ప్రశంసలు ఒక్కొక్కరు ఏ అంశం పైన అయినా ,ఎన్ని ప్రశ్న లైనా అడగ వచ్చు , సమస్య : ఛందో బద్ద్ధమైన పద్యపాదమై ఉండాలి .అసంబద్ధమైన అర్ధం ఉండాలి . దత్తపది :శబ్ద లయ గాని, భావలయ గాని, అర్ధ లయ గాని గల , నాలుగు పదాలు ఇవ్వాలి . కోరిన ఛందస్సు లో కోరిన అంశంపై పద్ద్యం చెప్పమని అడగాలి వర్ణన :ఏదైనా ఉదాత్తమైన అంశం పై కోరినఛందస్సులో వర్ణనాత్మకమైన పద్యం అడగ వచ్చు. అనువాదం :ఇంగ్లీషు లేదా సంస్కృతం లోఏదైనా పద్యాన్ని లేక శ్లోకాన్ని ఇచ్చి పద్య రూపం అనువదించమని అడగ వచ్చు అప్రస్తుత ప్రశంస :చమత్కారమైన ప్రశ్నలు అడిగితే చురుకైన సమాధానాలు పద్య రూపం లో ఇవ్వబడతాయి . ఇవన్ని మీ లక్ష ప్రశ్నలు ! నావి లక్ష పూరణలు !!!! ఇది మనం కలసి వాగ్దేవికి చేసే లక్ష పద్యార్చన !!!! ప్రశ్నలు మానవ జాతికి ఉపయోగ పడేలా ఉండాలి . సమకాలీన సమాజాన్నిప్రతిబింబించేవిగా ఉండాలి. ఉత్తమ సంస్కృతినిర్మాణానికి దారి వేసేవి గా ఉండాలి. విజ్ఞానం కలిగించేవి గా ఉండాలి. మీ ప్రశ్నలు మీ ప్రతిభని ,సంస్కారాన్ని ,జిజ్ఞాసని తెలియజేసేవిగా ఉండాలి. మీ ప్రశ్న కింద మీ పేరు .చిరునామా. ఫోను నెంబరు .ఈ మెయిలు . తప్పనిసరిగా ఉండాలి. ఈ లక్ష పద్యార్చన గురించి మీ స్నేహితులకుచెప్పండి. ఫేస్ బుక్ లో. షేర్ చెయ్యండి. లక్ష ప్రశ్నలువచ్చేలా సహకరిచండి ! ఈ క్షణం నుంచే పూరణలు ప్రారంభిస్తున్నాను !! ప్రశ్నలు సంధించండి !! వాగ్దేవీ కటాక్షం తో 1000 రోజులలో పూర్తిచేయాలని సంకల్పం . "ఆకాశ వీణ పై అక్షర రాగాలు సృష్టించు వాణి ఆశీస్సులిడగ ! వాయువీచికలన్ని భావ వీచిక లౌచు శ్వాస కవిత్వయశస్సు లిడగ! పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞామహాయజ్ఞ వేదిక దివ్యహవిస్సు లిడగ! రసవదమృత పద్య రాజీవ బృందమ్ము బ్రాహ్మికి కావ్య సరస్సులిడగ! భూమాత హృదయమ్ము పూర్ణ కుం భమ్ము నై శ్రీం కార శబ్ద రోచిస్సు లిడగ! రమ్య సంకల్ప మీ శివరాత్రి వేళ లక్ష పద్యార్చనము సేయ లక్ష్య మొకటి వెట్టితిని ముఖ పుస్తక వేది పైన వేగ ప్రశ్నింప రారండి విజ్ఞులార ! పంచ భూతాలు సాక్షి ! గీర్వాణి సాక్షి ! ...... ..... ...అవధాన విద్యా ప్రపంచం లో 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్ అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం ! " లక్ష పద్యార్చనం "

by Phani Madhav Kasturifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfO0pW

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

--- చిరాశ // ప్రేమకావాలి // ******************************** అవ్యక్త ప్రేమకాదు, ఉన్మత్త ప్రేమ కావలె నాకు దేహము నాదైనా ప్రాణము నీది కావలెను అక్కునజేర్చుకు నా బాధలకు నువు ఓదార్పు కావాలి తల్లిగ మారి తప్పులు దిద్ది తోడూ-నీడగ నిలవాలి బాధల ఎ౦డలతో నే సతమతమవుతు౦టే, నా నీడై నువు తోడు౦టే చాలు కష్టాల కొలిమి చె౦త నేను౦డగా, నా తనువును చల్లబరిచే చెమట చుక్క నువ్వైతే చాలు ********************************** --- {28/02/2014}

by Chilakapati Rajashekerfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfNZT7

Posted by Katta

Kapila Ramkumar కవిత

జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత Sakshi | Updated: February 28, 2014 10:38 (IST) జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత వీడియోకి క్లిక్ చేయండి కడప: ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరణించారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయం బ్రౌన్ గ్రంథాలయంలో ఉంచనున్నారు. ఈ రోజు సాయంత్రం జానమద్ది భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానమద్ది హనుమచ్ఛాస్త్రి సెప్టెంబరు 5, 1926 సంవత్సరంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించాడు. 1946లో బళ్ళారిలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కడపలో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడ్డారు. జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు. 16 గ్రంథాలు వెలువరించారు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించారు.http://ift.tt/1eDIvJH

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eDIvJH

Posted by Katta

Nagendra Bhallamudi కవిత

మనలోనే... 28-02-2014 వెలుగు రేఖలను, వెన్నెల కాంతులను మనసులోనే దాచుకున్నా చీకటి మబ్బులు కమ్ముకోకుండా నవ్వే పువ్వులను పాడే సెలయేరును కళ్లలో నింపుకున్నా అంధకారం అలముకోకుండా స్నేహహస్తం చాచి అహ్వానం పలుకుతున్నా నాలో నేనే మిగిలిపోకుండా నవ్వు పువ్వు వెలుగు వెన్నెల అంతా అనందమే నిత్యం మసలే మనుషులతో తప్ప కరచాలనాలు పలకరింపులు ఇంపుగానే వుంటున్నాయ్ కానీ వాటి మూలాలు గొంతులోనే మిగిలిపోతున్నాయ్ గుండె గది తాళాలు తెరవలేకున్నాయ్ ఏ యోచనలేని ప్రకృతికి అలోచన వున్న మనిషికి అదే భేదమేమో అందుకే ఈ వేదనేమో -నాగేంద్ర

by Nagendra Bhallamudifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oa3Y2o

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//కొన్ని నిజాలు// ఎత్తు ఎదిగానని మురిసిపోకు పాదాలు నేలమీద కాక వీలుకాదు ఏదో సాధించానని విర్రవీగకు పంచభూతాలు లేనిదేదీ తయారుకాదు ఎక్కడికి పారిపోదామన్నా తగదు ప్రతీ చొటా పకృతిని(స్త్రీ) నమ్ముకోవాల్సిందే ఎంతమంది దేవుడులున్నా సరిరారు పరదేవతా నమస్తుభ్యం అనుకోవాల్సిందే ఎలాగొలా మభ్యపెట్టడం కుదరదు ప్రతీ కణం నీదు కాదు అమ్మదే ఏ పురాణాలూ చదవక్కరలేదు ప్రతీ ఆడజన్మ దశావతారాలే.......28.02.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N9X0yZ

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అంతరం ఒక వైపు అంబరాన్ని తాకుతున్న హరివిల్లు ఎదురుగా నేలనే ఆనుకున్న పూరిల్లు అక్కడ అత్తరు సువాసన ఇక్కడ చెమట వాసన అక్కడ పొర్లుతున్న మద్యం ఇక్కడ నిండుకున్న నీటి కుండ అక్కడ వ్యాకోచిస్తున్న పొట్టలు ఇక్కడ కాలుతున్న కడుపులు అక్కడ పన్నీరు ఇక్కడ కన్నీరు అక్కడ వర్షం కురిసిన రాత్రి ఇక్కడ కరువు మ్రింగిన జీవితం అక్కడ ఆకలి తీరని ఆశ ఇక్కడ ఆకలే చచ్చిన నిరాశ అక్కడ మోదం ఇక్కడ ఖేదం ఏమిటో ఈ జీవితం? ఎందుకో ఈ అంతరం? 27FEB2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cefjhW

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్ /my rain ---------------------------- ఒకరోజు వర్షానికి ఇల్లు తడపాలనిపించినట్టుంది­ పైకప్పు సందుల్లోనుంచి కొన్ని చినుకులు రాలిపడుతున్నాయి కొబ్బరాకులు ఒళ్ళువిరుచుకోగా అప్పటికే ఇంట్లో ఉన్న తపాళ నిండింది ఆ వానతో పేడతో అలికిన నేల కావడంవల్లేమో ఓ రకమైన సువాసన నులక మంచంపై కూర్చున్న నేను,నన్ను మోస్తున్న మంచం కోళ్ళు సరే కాసేపలా బయట చూరు కిందా నిండిన శూన్యాన్ని పలకరిద్దామని వెళ్ళాను చూరులో రెండు వాసాల మధ్య కుక్కిన కొన్ని ముతక కాగితాలు అవెంటో చూద్దామని నా చేతి మొదళ్ళు వాటిని అందుకున్నాయి వాటిని విప్పిచూడగా కొన్ని వయసుమళ్ళిన అక్షరాలూను,అర్థమయ్యి­ కానట్టు పదబందాలు తడిమి చూసుకున్నానో నన్నునేను ఎప్పుడో నేను ఒలకబోసిన దస్తూరీనే అది అప్పుడెప్పుడో రాసుకున్న కొన్నిజ్ఞాపకాలు,లోలో­పలే దాచుకున్న అనుభవాలూను కొన్ని నిరంతర వాహినులేవొ నాలో ప్రవహిస్తున్నట్టుగా తోస్తోందీక్షణం ఇప్పుడు మళ్ళా ఇంటిని ఆరబెట్టుకోవాలి తృప్తి నిండిన కళ్ళతో వర్షం వెలిసింది ఇప్పుడే ఇంక కొన్నాళ్ళు బ్రతకొచ్చు ఈ ముతకవాసనతో... తిలక్ బొమ్మరాజు 28.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o9N6ZB

Posted by Katta

Kavitha Prasad Rallabandi కవిత

అవధాన విద్యా ప్రపంచం లో 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్ అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం ! " లక్ష పద్యార్చనం " ...................... ............... ............. ............... ................... ప్రియమైన స్నేహితులారా ! నమస్కారం !! మన మంతా కలసి ఒక దివ్యమైన పద్య కవిత్వ యజ్ఞం చేద్దాం. దాని పేరు " లక్ష పద్యార్చనం" మీరు పృచ్ఛకులుగా, ప్రశ్నల పుష్పాల సౌజన్యం ప్రకటిస్తే ఈ " లక్ష పద్యార్చన " ప్రారంభమౌతుంది , "లక్ష పద్యార్చన" స్వరూపం ---------------------------- సాధారణంగా అష్టావధానం లో 8 మంది పృచ్చకులు ,ఒక కొన్ని వందల మంది ప్రేక్షకులు , ఓ రెండు లేక మూడు గంటల సమయం 10-15 కొత్త పద్యాలు రచించబడతాయి . అదే శతావధానం లో 100 మంది పృచ్చకులు ,వెయ్యికి పైగా ప్రేక్షకులు ,2-3 రోజుల సమయం , 100 కు పైగా కొత్త పద్యాల సృష్టి . సహస్ర , పంచ సహస్రావధానాల లో సుమారు 1000 మంది పృచ్చకులు. నాలుగు వారాల సమయం , 1000-5000 పద్యాల సృష్టి. వీటికి ₹10,000/ నుండి ₹25,00,0000/ వరకు ఖర్చు ! ఇంకా ఎన్నో శ్రమలు ! ప్రస్తుతం మనం ఫేస్ బుక్ ద్వారా చేసే ఈ "లక్ష పద్యార్చన" లో వేలాది పృచ్చకులు ప్రపంచం నలు మూలల నుండి ఖర్చు శ్రమ లేకుండా పాల్గొనవచ్చు ! లక్ష కొత్త పద్యాలు సృష్టించ బడతాయి! విషయ వైవిధ్యం ఉంటుంది ! ప్రశ్నల విభాగాలు : 1)సమస్యలు 2)దత్తపదులు 3)వర్ణనలు 4) అనువాదాలు 5)అప్రస్తుత ప్రశంసలు ఒక్కొక్కరు ఏ అంశం పైన అయినా ,ఎన్ని ప్రశ్న లైనా అడగ వచ్చు , సమస్య : ఛందో బద్ద్ధమైన పద్యపాదమై ఉండాలి .అసంబద్ధమైన అర్ధం ఉండాలి . దత్తపది :శబ్ద లయ గాని, భావలయ గాని, అర్ధ లయ గాని గల , నాలుగు పదాలు ఇవ్వాలి . కోరిన ఛందస్సు లో కోరిన అంశంపై పద్ద్యం చెప్పమని అడగాలి వర్ణన :ఏదైనా ఉదాత్తమైన అంశం పై కోరినఛందస్సులో వర్ణనాత్మకమైన పద్యం అడగ వచ్చు. అనువాదం :ఇంగ్లీషు లేదా సంస్కృతం లోఏదైనా పద్యాన్ని లేక శ్లోకాన్ని ఇచ్చి పద్య రూపం అనువదించమని అడగ వచ్చు అప్రస్తుత ప్రశంస :చమత్కారమైన ప్రశ్నలు అడిగితే చురుకైన సమాధానాలు పద్య రూపం లో ఇవ్వబడతాయి . ఇవన్ని మీ లక్ష ప్రశ్నలు ! నావి లక్ష పూరణలు !!!! ఇది మనం కలసి వాగ్దేవికి చేసే లక్ష పద్యార్చన !!!! ప్రశ్నలు మానవ జాతికి ఉపయోగ పడేలా ఉండాలి . సమకాలీన సమాజాన్నిప్రతిబింబించేవిగా ఉండాలి. ఉత్తమ సంస్కృతినిర్మాణానికి దారి వేసేవి గా ఉండాలి. విజ్ఞానం కలిగించేవి గా ఉండాలి. మీ ప్రశ్నలు మీ ప్రతిభని ,సంస్కారాన్ని ,జిజ్ఞాసని తెలియజేసేవిగా ఉండాలి. మీ ప్రశ్న కింద మీ పేరు .చిరునామా. ఫోను నెంబరు .ఈ మెయిలు . తప్పనిసరిగా ఉండాలి. ఈ లక్ష పద్యార్చన గురించి మీ స్నేహితులకుచెప్పండి. ఫేస్ బుక్ లో. షేర్ చెయ్యండి. లక్ష ప్రశ్నలువచ్చేలా సహకరిచండి ! ఈ క్షణం నుంచే పూరణలు ప్రారంభిస్తున్నాను !! ప్రశ్నలు సంధించండి !! వాగ్దేవీ కటాక్షం తో 1000 రోజులలో పూర్తిచేయాలని సంకల్పం . "ఆకాశ వీణ పై అక్షర రాగాలు సృష్టించు వాణి ఆశీస్సులిడగ ! వాయువీచికలన్ని భావ వీచిక లౌచు శ్వాస కవిత్వయశస్సు లిడగ! పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞామహాయజ్ఞ వేదిక దివ్యహవిస్సు లిడగ! రసవదమృత పద్య రాజీవ బృందమ్ము బ్రాహ్మికి కావ్య సరస్సులిడగ! భూమాత హృదయమ్ము పూర్ణ కుం భమ్ము నై శ్రీం కార శబ్ద రోచిస్సు లిడగ! రమ్య సంకల్ప మీ శివరాత్రి వేళ లక్ష పద్యార్చనము సేయ లక్ష్య మొకటి వెట్టితిని ముఖ పుస్తక వేది పైన వేగ ప్రశ్నింప రారండి విజ్ఞులార ! పంచ భూతాలు సాక్షి ! గీర్వాణి సాక్షి ! ...... ..... ...అవధాన విద్యా ప్రపంచం లో 'గ్రంథ ముఖి '( ఫేస్ బుక్ ) మాధ్యమం లో డా . రాళ్ళబండి కవితాప్రసాద్ అపూర్వ, వినూత్న ,చారిత్రాత్మక ,తెలుగు కవిత్వ ,ప్రయోగం ! " లక్ష పద్యార్చనం "

by Kavitha Prasad Rallabandifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pAqVzj

Posted by Katta

Renuka Ayola కవిత

రేణుక అయోల //గాలిపటం// కనురెప్పల మీద నుంచి ఎగిరిపోయి రంగు రంగుల స్వప్నాలను కాజేసిన రాకాసి గాలిపటంలా ఆలోచనల కోమ్మకి వేళ్ళాడుతూ ఊరిస్తుంది ఇస్టమైన విషయాలు ఎన్ని కధలుగా చెప్పినా బతుకు కధల రంగురంగుల తోక చూపిస్తుందేగాని కిందికి దిగి రాదు ఆవలింతల దుప్పటి కప్పుకుని కనపడకుండా కొమ్మమీదనుంచి దింపుదామన్నా ఇంకా ఇంకా చిటారు కోమ్మకి వెళ్ళిపోతుంది రెప్పల ద్వారానికి అడ్డుగా నిల్చుంటుంది కళ్లకి మనసుకి వంతెనవేసి ఇసుకమేటలమీద నడిపించి ఊరించి తెల్లవారుఝాములో చేతికి అందుతుంది..

by Renuka Ayolafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dG2J61

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //ఏం మనిషో// కెరీర్ గ్రాఫ్ లో ఈమూలనుంచీ ఆ మూలదాకా సాగిన గీత ముడతలు పడకుండా మాంజాదారంలా బిగదీసుకుపోయి మనసులెండినా ప్రవహించటం మానని మనుషులు.. చల్ హట్..! పోరా నాయనా..! ఎవడికీ కాళ్ళు లేవిప్పుడు కార్లొచ్చాక చే గువేరా మొహమ్ముందు పొగలు కక్కే సిగార్... కాదురా బాబూ అది బండి సైలెన్సర్... ఆ సామ్రాజ్యవాద వ్యతిరేకిని అవమానిస్తూ గుప్పున ఎగిసిన నల్ల పెట్రోల్ పొగ.. రేకుడబ్బాలకీ,బీరు కీశేలకీ సల్లటి ఐస్కిరేయ్.... రేయ్..రేయ్..!! మురికి నా...డకా..! ఇక్కడెవడూ చీకడు నీది ఇప్పుడు కలర్ పేపర్లో పొట్లం కట్టిన శీతాకాలం యాభై రూపాయలే... అదిగో... నడీ రోడ్డు మీద పుచ్చ పువ్వులా విచ్చుకొని వెచ్చని రక్తాన్ని ఉమ్మేసిన మెదడొకటి ట్రాఫిక్ అంతరాయానికి సంతోషిస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ తో టీవీ గాడు... ఎర్రని లైటొకటి పసుపుగా బిక్కమొకమేయగానే ఆగరా.. ఇంకా దానికళ్ళు పచ్చ బడనేలేదు ఆగరా...నీ... డిజిటల్ కెమెరాలో బండి పృష్టాన్ని బందిస్తూ ఒక్కసారిగా పెళ్ళుబికిన లోహభూత ధూమ భూయిష్ట ప్రవాహానికి వెనకడుగేసిన శాంతి వర్ణపు దేహమొకటి.. పాంథుడా...! చూడకు చూడకటు నీలో ఎక్కడో ఉన్న మనిషిని లేపే బిచ్చగాడొస్తాడేమో ఆశగా.. నీ జేబుని ఈర్షగా చూస్తూ "చుట్టూ పక్కా చూడకురా చిన్నవాడ" .... చచ్చిపోతున్న సూర్యుడు కృష్ణ లోకింకి పోయాక ఇంటికొచ్చి అశాంతంగా సంతోష జీవితాన్ని ఆస్వాదిస్తుంటే హూహ్... ! అతనేంటీ..!? రోజూ ప్రేమ కావాలీ.., మనుషుల ఆప్యాయతాళింగనం కావాలీ అంటూ... ఇంకా మనిషిలానే ఉండిపోయాడు పాపం హవ్ ఫన్నీ మాన్ హి ఈజ్ ఒహ్..! గాడ్..!! బ్లెస్ హిం ప్లీస్ రేయ్...! గార్డ్...!! త్రో హిం ఔట్... 28/02/14

by Naresh Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jE1kSm

Posted by Katta

Abd Wahed కవిత

ఈ రోజు గాలిబ్ కవితల్లో మొదటిది గాలిబ్ సంకలనం 9వ గజల్ లోని 4వ షేర్ దిల్ గుజర్ గాహ్ యే ఖయాలె మై వ సాగర్ హీ సహీ గర్ నఫ్స్ జాదా సరె మంజిలె తఖ్వా న హువా మద్యం మధుపాత్రల భావాల బాటే కావచ్చు నా మది మనసు సన్మార్గాన నడవకున్నా బాధలేదు ఉర్దూలో గాలిబ్ రాసిన పదాలకు అర్ధాలు చూద్దాం. గుజర్గాహ్ అంటే నడిచే దారి, ఖయాల్ అంటే ఆలోచనలు, భావాలు, మై అంటే మద్యం, సాగర్ అంటే మధుపాత్ర, నఫ్స్ అంటే జీవితం, మనసు, జాదా అంటే బాట, సరె మంజిల్ అంటే లక్ష్యం, తఖ్వా అంటే దైవభీతి, సన్మార్గం. ఈ కవితలో గాలిబ్ సరికొత్త పోలికలతో తన భావాలను ప్రకటించాడు. ప్రతి మనిషికి తన ప్రత్యేకత ఉంటుంది. కొందరి ఆలోచనల్లో ఎప్పుడు దైవభక్తి ఉంటుంది. సన్మార్గాన నడవాలన్న భావాలే ఉంటాయి. మరి కొందరి మనసులో ఎల్లప్పుడు మద్యం గురించిన ఆలోచనలే ఉంటాయి. కాని ఎవరి మనసు కూడా శూన్యం కాదు. గాలిబ్ మనసు దైవభీతితో సన్మార్గాన నడిచే ఆలోచనలతో నిండిలేదు, అయితేనేం మనసులో ఆలోచనలన్నీ మద్యం, మధుపాత్రల చుట్టే తిరుగుతున్నాయి. ధర్మపరాయణుడు ధార్మిక భావాల్లో మునిగిపోతే, గాలిబ్ లాంటి మనిషి మధుపాత్ర ఆలోచనల్లో మునిగిపోయాడు. ఎవరూ ఖాళీగా లేరు. ఈ కవితలో గాలిబ్ ఉపయోగించిన పదాలు కూడా గమనించదగ్గవి. ఆలోచనలు ఒక పరంపరగా కొనసాగుతూ ఉంటాయి. అంటే ఒకబాటలా అవి కొనసాగుతూనే ఉంటాయి. అది దైవభక్తికి సంబంధించిన ఆలోచనల బాట అయితే లక్ష్యం సన్మార్గాన నడవడం. అలా కాకుండా కేవలం ఐహిక కోరికల ఆలోచనల బాట అయితే ఆ దిశగానే సంబంధించిన లక్ష్యాన్ని చేరుకోవడం. ఆలోచనల ఎడతెగని పరంపర చుట్టు ఈ కవితను గాలిబ్ అల్లాడు. రెండవ కవిత గాలిబ్ సంకలనంలోని 9వ గజల్ 5వ షేర్ హూం తెరే వాదా న కర్నే మేం భీ రాజీ కభీ గోష్ మన్నత్ కషె గుల్బాంగె తసల్లీ న హువా నువ్వు వాగ్దానం చేయకపోయినా నాకు ఇష్టమే కదా నా చెవులు పూలస్వరం పిలుపు హాయి ఎన్నడూ కోరలేదు గాలిబ్ ఉర్దూలో వాడిన పదాలు గమనించదగ్గవి. వాదా అంటే వాగ్దానం, రాజీ అంటే ఇష్టపడడం, గోష్ అంటే చెవులు, మన్నత్ అంటే కోరిక, కషీదాన్ అంటే ఆకర్షణ, గుల్ అంటే పువ్వు, బాంగ్ అంటే పిలుపు, గుల్బాంగ్ అంటే పూలస్వరం, లేదా పూల పిలుపు, తసల్లీ అంటే సాంత్వన, ఇక్కడ నేను హాయిగా అనువదించాను. ఇది గాలిబ్ గజళ్ళలో ప్రసిద్ధిపొందిన వాటిలో ఒకటి. మనం ఎంతో ఇష్టపడే వ్యక్తి మనకు ఏదన్నా వాగ్దానం చేస్తే మనం చాలా సంతోషిస్తాము. ఆనందంతో నాట్యం చేస్తాము. కాని చాలా సందర్భాల్లో మాట ఇచ్చిన వారు మరిచిపోవడమో, మాట నిలబెట్టుకోకపోవడమో జరుగుతుంది. గాలిబ్ ఈ పరిస్థితిని ప్రస్తావిస్తూ, తన ప్రేయసి తనకు ఎలాంటి వాగ్దానం, కలుస్తానని మాట ఇవ్వడమూ చేయలేదు. అది గాలిబ్ కు ఇష్టమే. ఎందుకంటే పూలవంటి ఆమె స్వరం ఇచ్చే హామీ నెరవేరని పరిస్థితిని ఎదుర్కునే అవసరం ఉండదు. గాలిబ్ తన చెవులపై ఈ భారం పడకుండా అలవాటు చేసుకున్నాడు. మనకు అవసరమున్నప్పుడు ఎవరైనా ఊరడించడానికి ఏదన్నా వాగ్దానం చేయవచ్చు. అప్పటికి అది చాలా సాంత్వన కలిగించినా, తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చకపోతే మనకు చాలా బాధ కలుగుతుంది. అసలు అలాంటి వాగ్దానాలే వినకపోవడం, వినబడే పరిస్థితి లేకపోవడమే మంచిదంటాడు గాలిబ్. ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడని ప్రేయసి పట్ల గాలిబ్ కోపగించడం లేదు. అసలు వాగ్దానం చేయకపోయినా తనకిష్టమేనంటున్నాడు. ఇలాంటి వాగ్దానాల భారాన్ని చెవులు మోయకపోవడమే మంచిదంటున్నాడు. ఈ కవిత ఒకరకంగా అందని ద్రాక్షలు పుల్లన అన్న కథను గుర్తుకు తెస్తాయి. కాని గాలిబ్ తనకు అందని ద్రాక్షలను పుల్లవిగా భావించలేదు. కాస్త వ్యంగ్యంగా, వాగ్దానాలు వినకుండా ఉండే అలవాటు చెవులకు వేసుకున్నానని చెప్పాడు. మూడవ కవిత గాలిబ్ సంకలనం 9వ గజల్లోని 6వ షేర్ కిస్ సే మహ్రూమి ఖిస్మత్ కీ షికాయత్ కీ జె హమ్ నే చాహాథా కి మర్జాయె, సో ఓ భీ న హువా దురదృష్టానికి ఎవరిని నిందించాలి చావాలనుకున్నా అది కూడా దొరకలేదు చాలా సరళమైన పదాలతో ఉన్న కవిత ఇది. ఉర్దూలో పదాలను చూద్దాం. మహ్రూమ్ అంటే నిరాకరించబడడం, మహ్రూమి యే ఖిస్మత్ అంటే అదృష్టం నిరాకరించబడడం, దాన్ని దురదృష్టంగా నేను అనువదించాను. షికాయత్ అంటే ఫిర్యాదు. ఈ షేర్ గజల్ చివరి షేర్ అంటే మక్తాకు ముందు వస్తున్న షేర్. కాబట్టి భావపరంగా ఇందులో గాఢత ఎక్కువగా ఉండేలా రాశాడు. ఈ కవిత మొత్తం తీవ్రమైన వేదనను ప్రతిబింబిస్తోంది. జీవితంలో తీవ్రమైన బాధ, దుఃఖం, విషాదాలు ఇందులో కనబడుతున్నాయి. అందుకే అతి సరళమైన పదాలనే గాలిబ్ ఉపయోగించాడు. తనను నిరాకరించి, చిన్నచూపు చూసి కాదన్న ప్రేయసి, లేదా తన పట్ల అమానుషంగా వ్యవహరించిన ప్రపంచం ఏదన్నా కాని, ఇక్కడ బాధ అన్నది ముఖ్యమైన విషయం. అలాంటి పరిస్థితిలో మనిషి జీవితాన్ని వదిలి మరణాన్ని కోరుకుంటాడు. తాను కోరినంతనే మృత్యువు వచ్చి కౌగిలించుకుంటుందని గాలిబ్ అనుకున్నాడు. కాని దురదృష్టమేమంటే, మృత్యువు కూడా నిరాకరించింది. ఇక ఇలాంటి పరిస్థితికి ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలి. ఎవరిని నిందించాలి. నలువైపులా నిరాశలు క్రమ్ముకున్న పరిస్థితిలో మనిషి జీవితాన్ని చాలించాలని, మరణించాలని భావించడం సాధారణంగా మనం చూస్తాం. కాని మృత్యువు కూడా నిరాకరిస్తే ఎక్కడికి పోతామంటు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నలో ఒక వ్యంగ్యం ఉంది. అందరూ నిరాకరించిన వాడిని మృత్యువు ఎందుకు అక్కున చేర్చుకోవాలి. అంత చవకైనదా మరణం. ఎవరికి పనికిరానివాడు చావుకు పనికివస్తాడా? కాబట్టి మృత్యువును కోరుకునే ముందు కనీసం తాను మృత్యువుకైనా పనికివచ్చే స్థాయిలో ఉన్నది లేనిదీ చూసుకోమంటున్నాడు. ఉర్దూకే ప్రత్యేకమైన వ్యంగ్యం ఇది. తన విలువను గుర్తించడమే జరిగితే ఇక మనిషి చావాలని అనుకోడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 9వ గజల్లో చివరి కవిత. మర్గయా సద్మా ఎక్ జుంబిష్ లబ్ సే గాలిబ్ నాత్వానీ సె హరీఫ్ దమె ఈసా న హువా పెదాల నుంచి గాలి ఊదితే ప్రాణం పోయింది గాలిబ్ బలహీనత వల్ల ఏసు ఊదిన గాలిని తట్టుకోలేకపోయాడు ఈ కవితను అర్ధం చేసుకునే ముందు, ఉర్దూలో పదాలను చూద్దాం. సద్మా అంటే షాక్, దిగ్భ్రమ, జుంబిష్ అంటే తాకిడి, కదలిక, దూకడం వగైరా అర్ధాలున్నాయి. లబ్ అంటే పెదవి, సద్మ యే ఎక్ జుంబిషె లబ్ అంటే పెదాల కదలిక వల్ల వీచిన గాలి కలిగించిన దిగ్భ్రమ. అంటే నోటితో ఊదిన గాలి వల్ల కలిగిన షాక్, నా త్వాని అంటే బలహీనత (తవాం అంటే శక్తి), హరీఫ్ అంటే ప్రత్యర్ధి, దమ్ అంటే ఊపిరి, ఈసా అంటే ఏసు ప్రభువు, హరీఫె దమె ఈసా అంటే ఏసు ఊపిరికి, అంటే ఏసుప్రభువు ఊదిన గాలికి ప్రత్యర్ధిగా నిలబడడం. ఈ కవితను అర్ధం చేసుకోవాలంటే కాస్త నేపథ్యం వివరించాలి. క్రయిస్తవులే కాదు ముస్లిములు కూడా ఏసుప్రభువును ప్రవక్తగా గౌరవిస్తారు. ఏసుప్రభువుకు దైవం అనేక మహిమలు ప్రసాదించాడని ముస్లిములు కూడా నమ్ముతారు. ఏసుప్రబువు రోగులకు స్వస్థత కలిగించేవారు, చనిపోయిన మనిషిని బతికించారు. ఇవన్నీ ఆయన దేవుడిచ్చిన మహిమలతో చేశారు. ఏసు ప్రభువు మృతుడిని బతికించడానికి, లేదా రోగిని బాగుచేయడానికి అక్కడ నిలబడి, ’’దేవుని ఆజ్ఙతో లే‘‘ అని ఆదేశించేవారు. ఆ తర్వాత ఊపిరి పీల్చి రోగి శరీరంపై లేదా మృతదేహంపై ఊదేవారు. ఆ వెంటనే మృతుడు లేచినిలబడేవాడు. రోగి అయితే స్వస్థత లభించేది. ఈ మహిమ ప్రదర్శించడంలో ఏసుప్రభువు ఎన్నడూ విఫలం కాలేదు. క్రయిస్తవులే కాదు ముస్లిములు కూడా దీన్ని విశ్వసిస్తారు. గాలిబ్ కవితను అర్ధం చేసుకోడానికి ఈ నేపథ్యం గురించిన అవగాహన అవసరం. ఇప్పడు, ఇంకో నిత్యసత్యం చూద్దాం. ఎవరైనా బలంగా ఊదితే చీమలాంటి బలహీనప్రాణి ఎగిరిపోతుంది. అది గాయపడవచ్చు, మరణించవచ్చు, ఏమైనా జరగవచ్చు, మనకు తెలుస్తున్నది అది గాలికి ఎగిరిపోవడం, తద్వరా మరణించడం లేదా గాయపడడం. ఇక్కడ గాలిబ్ ఒక సన్నివేశాన్ని వర్ణించాడు. వ్యాధిగ్రస్తుడై, అత్యంత బలహీనంగా ఉన్నాడంట. బహుశా ప్రేయసి విరహంతో అన్నపానీయాలు మానేసి అలా తయారయ్యాడేమో, కారణమైమైనా గాని, చాలా బలహీనపడి, రోగ్రగస్తుడై ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆయన్ను బాగు చేయడానికి స్వయంగా ఏసుప్రభువు వచ్చారు. మృతుని సయితం బతికించే మహిమ ఆయనకుంది. ఏసుప్రభువు వచ్చి ’’ఖుమ్ బి ఇజ్నిల్లాహ్‘‘ (దేవుడి ఆజ్ఙతో లే) అని చెబుతూ గాలిబ్ పై తన ఊపిరి పీల్చి ఊదారు. కాని గాలిబ్ ఎంత బలహీనంగా ఉన్నాడంటే, ఆ ఊపిరిని కూడా తట్టుకోవడం అతడి వల్ల కాలేదు. అప్పటి వరకు రోగిగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఏసుప్రభువు మహిమ వల్ల రోగం తగ్గుతుందనుకున్నాడు. కాని ఆయన పెదాల నుంచి ఊదిన గాలిని కూడా తట్టుకోలేక ప్రాణం వదిలేశాడు. ఇదెలా ఉందంటే, రోగిని బాగుచేయడానికి డాక్టరు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ నొప్పి భరించలేక రోగి చచ్చిపోయాడు. ఇందులో సున్నితమైన వ్యంగ్యం కూడా ఉంది. రోగులను బాగు చేసే మహిమ పొందిన ఏసుక్రీస్తు కూడా విఫలం కావచ్చని, గట్టిగా ఊదితే కూడా తట్టుకోలేని రోగి వద్దకు వెళ్ళితే, ఆ రోగి ఊదిన గాలి దెబ్బకే చస్తాడని వ్యంగ్యంగా చెప్పాడు. ఇది ఒకరకమైన తిరుగుబాటు కవిత. గాలిబ్ తిరుగుబాటు కవి. నమ్మకాలను, విశ్వాసాలను ప్రశ్నించకుండా ఆయన వదల్లేదు. కాని చాలా సున్నితంగా, చాలా చాకచక్యంగా, చమత్కారంగా, విచిత్రమైన సన్నివేశాలను కల్పించి ఆయన అల్లిన ఈ కవితలపై ధర్హభ్రష్టత లేదా బ్లాస్ఫెమీ నింద ఎన్నడూ పడలేదు. ఒక సన్నివేశాన్ని కల్పించి, అతిశయోక్తులతో నింపేసి ఒక విశ్వాసాన్ని ప్రశ్నించాడు. కేవలం రెండు పంక్తుల్లో ఒక విశ్వాసాన్ని ప్రస్తావించడమే కాదు, ఇది కూడా విఫలం కావచ్చన్న చిత్రాన్ని గీసి చూపించాడు. తన బాధలు మామూలు బాధలు కాదని, ఏసుప్రభువు కూడా తన మహిమలతో వాటిని బాగుచేయలేడంటూ వాపోయాడు. ఇది ఈ రోజు గాలిబానా. వచ్చే శుక్రవారం మళ్లీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ccZhFa

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

సిగ్గుమొగ్గల గులాబిబాల_పువ్వై గుబాళిస్తున్నావు ఈవేళ ..@శర్మ \28.2.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pz3PZF

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS :: పలమనేరు బాలాజీ | శక్తినివ్వు ! ...................................... మిత్రమా కనీసం కప్పు టీ తాగి రెండు అరచేతుల్లో - నీ చేతినలా అపురూపంగా పట్టుకుని నిర్లజ్జగా నేన్నీతో మాట్లాడి ఎన్నాల్లవుతుందో ... ఎందుకైనా ఏడ్పు రావట్లేదు ఎవరిపైనా విశ్వాసం మిగలట్లేదు అర్థంలేని అనంత శబ్దాలతో మనసు చెవిటిదైపోయింది రంగులు విచిత్రంగా చూపుల్ని భయపెడుతుంటాయి విసుగుకు విరామం లేదు రాత్రి నిస్సారంగా ;పగలు నిష్ఫలితంగా అయినా ఆకలవుతుందేమోనని ఎప్పుడూ ఆశపడుతుంటాను కాస్త స్నేహంగా 'టీ' తాగాలి నువ్వో నేనో కదలాలి మనసుతో మాట్లాడకపోవడమే మనిషి చివరితనం ! [ఇద్దరి మధ్య' నుంచి]

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N82oCP

Posted by Katta

27, ఫిబ్రవరి 2014, గురువారం

Vakkalanka Vaseera కవిత

గోదావరి ఇదే చిక్కు తన గురించి రాద్దామనుకున్నపుడల్లా.. నేనేమో ఏరికోరి మంచి మంచి శబ్దాలు పోగేసుకుని పెద్ద వీరుడిలా సిద్ధమవుతాను తానేమో ఇలా మౌనంగా ప్రత్యక్షం మోనాలిసాలాగా, శిరిడీ సాయిలాగా నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతోందో? లేక మౌన గంభీరం నిశ్చల నిర్వికల్పంగా ఉందో? ఏ సంగతీ ఎంతమాత్రం బయటికి తెలియనివ్వదు తన గురించి రాయాలంటే నిజానికి అర్థం పర్థం లేని అద్దంలాంటి అక్షరాలు కావాలి ఒక వేళ అటువంటి నిశ్శబ్దాక్షరితో వెళ్తే తనేం చేస్తుందో తెలుసా!!! పర్వతాలను ఒరుసుకుంటూ బండరాళ్ల చర్మం మీద మృదంగం వాయిస్తూ రాళ్లలో నిదురోయే పువ్వుల్ని పలకరిస్తూ తాను ఎప్పుడో ఎక్కడో భద్రంగా దాచిన గజ్జెలు తీసి కాళ్లకు కట్టుకుంటుంది నడకో నృత్యమో పరుగో తెలిసేలోగా గలగల పకపకా నవ్వుతూ పిట్టల పాటల్ని వెంట తరుముతూ పిచ్చిదాన్లా ఉరకలేస్తుంది ఇంత తీయగా కవ్వించి మరీ అందీ అందక వేధించే ఆమెతో నేనెలా వేగేది? చప్పుడు లేకుండా పాపికొండల్లో ఈమెగారి సిగపాయల్లో పాకే పడవలోంచి హఠాత్తుగా ఓ పుష్పం గాలిలో వికసించి ఈమెని తాకిన మరుక్షణాన్నే ఓ వృత్తాన్ని వదిలిమాయమవుతుంది. నది బుగ్గమీద సొట్టలా మెరిసిన వృత్తమూ అదృశ్యమవుతుంది ఈ డింపుల్ బేబీ అందాల్ని పట్టుకునే వల ఇంకా పుట్టలేదు శబ్దాలు పనికి రావు...పోనీ మౌనమా అంటే మన అందరి మౌనాన్నీ మింగేసే మహాగంభీర మౌనం తనది పోనీ శబ్దాలా అంటే అన్ని శబ్దాలనూ ముంచేసే మహోధృత గర్జన ఆమెది ఈమె గురించి రాయడానికి ఒక్కటే దారి ఒక్కొక్కటీ పూర్తిగా బట్టలన్నీ విప్పెయ్యాలి ఒక్కొక్కటీ పూర్తిగా శబ్దాలన్నీ విప్పేసి గట్టున పారెయ్యాలి నిశ్శబ్దభారాన్ని నెమ్మదిగా దించి ఇసుక తీరం మీద వదిలెయ్యాలి ఒకే ఒక్క గెంతులో దూకెయ్యాలి ఈతకొట్టే కాళ్లూ చేతులూ కేరింతలూ ఈదే కొద్దీ వాటి చుట్టూ గుత్తులు గుత్తులుగా వికసించి... జలజల రాలే నీటి నవ్వుల పారిజాతాలూ జీవనదిని వర్ణించడానికి కావాల్సిన శబ్దాలూ నిశ్శబ్దాలూ జీవనదిలోనే నా చేతులు చుట్టూనే ఉన్నాయి పట్టుకోమంటూ ఊరిస్తాయి పట్టబోతే ఇంకెంతో అందంగా ఆనందంగా అందీ అందకుండా ఉడికిస్తాయి వసీరా

by Vakkalanka Vaseerafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dF6dWj

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || నిదురిస్తే మళ్ళీ మేలుకొంటానా || --------------------------------------------------------- నిదురిస్తే మళ్ళీ మేలుకొంటానా, మరణిస్తే మళ్ళీ పుడతానా ఎందుకు బ్రతకాలి బ్రతికి సాదించేదేముందొ ఇపుడే చూడగలిగినంత చూసుకోవాలి నా మెలకువ బెలూనులో జ్ఞాపకాలను చాతనైనంత నింపుకోవాలి.. నన్ను నేను దాచుకోవాలి ఈ విశాలమైన ఆకాశంతో, నక్షత్రాలతో, చలిగాలులతో నాకిక పనిలేదు నేను ఇప్పుడూ ఓంటరిని నామీద నాకు అసహ్యం వేస్తుంది నీన్నేమనగలను అర్హత లేని మనస్సుకదా నాది నిద్రరాని ఈ రాత్రి, నా మనసు గది తలుపులు తెరిచి నన్ను నేణు చూసుకున్నా అన్ని అరల్లో అన్ని పొరల్లో నేవే వున్నావు నాకోసం నేను ఎక్కడన్న కనిపిస్తేనేమో అని లేదు నాలోనే నేను లేనప్పుడూ నేనేందుకు బ్రతకాలి చలికి ఒణికిన గాలితెర ఒకటి మళ్ళీ జీవితం తాకినట్టు తాకివెళ్ళింది అది నిజం అనుకున్నా కాదు అది బ్రమని తెల్సింది అద్దంలాంటి ఆకాశంలోకి ప్రశ్నలన్నీ పక్షుల్లాగా ఎగిరిపోయాయి కొన్ని గద్దలై నన్ను పొడుస్తున్నాయి ఈ రాత్రి ఎంత బావుంది రేపటి రాత్రిని చూడలేనేమో ఈ చల్లదనమూ, ఆకాశమూ ఎంత బావున్నాయి ఇవన్నీ ఇప్పుడూ నాకోసం లేవేమో వీటన్నిటినీ చూడటమెంత బాగుంది కాని రేపటిని కనలేని నాఖు ఇప్పుడు తలచుకొని చుస్తే అన్నీ వింతగ కనిపిస్తున్నాయి రేపటి వెలుగులు చూడలేనేమొ ఇప్పుడూ మూసిన కనులు రేపటికి తెరువలేనేమో

by Aduri Inna Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eqjW7L

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

# ఈ కవిని చూశారా...విన్నారా .... ------------------------------------ ఎలనాగ : అసలు పేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. 1953లో కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల గ్రామములో జననం. హైస్కూల్ వరకు స్వగ్రామంలోనే. మెడిసిన్ హైదరాబాద్ లో. 1980- 1986 వరకు నైజీరియాలో ప్రభుత్వోద్యోగం.స్వదేశాగమనం తర్వాత 1989 నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో వివిధ జిల్లాలలో అనేక హోదాల్లో ఉద్యోగం. చిల్డ్రన్స్ స్పెషలైజేషన్ కూడా చేశారు.ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషద్ కమీషనర్ కార్యాలయంలో డిప్యూటి కమిషనర్ స్థాయి అధికారిగా మే 2012 లో పదవి విరమణ పొందారు. అధికారిగా పనిచేసినపుడు పలు అవార్డులు,బంగారు పతకాలు విశిష్ట సేవలకు గుర్తుగా లభించాయి. హైస్కూల్ రోజుల్లోనే కవితా రచన పట్ల మమకారం పెంచుకున్నారు.ఆనాటి భారతి మొదలు నేటి పాలపిట్ట వరకు వివిధ పత్రికల్లో కవితలు,కథలు,వ్యాసాలు ,పద్యాలు,సమీక్షలు,అనువాదాలు,ప్రామాణికపు పజిళ్ళు ప్రచురితమవుతున్నాయి.సాహిత్యంలో కూడా పలు బహుమతులు,పురస్కారాలు అందుకున్నారు . కవిత్వ రచనలో కొత్తదనం కోసం ప్రయోగాలూ చేయటం,సంగీతం, ఆయా వాయిద్యాల పట్ల మమేకమై కవిత్వమల్లటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. నగరం లో జరిగే సాహితీసభలలో తరచుగా పాల్గొంటారు .హైదరాబాద్ బాలాపూర్ లోని నక్షత్ర కాలనీ లో నివాసం. వీరి ముద్రిత రచనలు : ------------------------- 1. కలుపు మొక్క - సోమరేట్స్ మామ్ ఆంగ్ల నవలిక The Alien Corn కు అనువాదం ( 2005) రీ( మరో ఇద్దరి అనువాద నవలికల్లో కలిపి ) 2. వాగంకురాలు - వచన కవిత సంపుటి ( 2009) 3. పెన్మంటలు - కోకిలమ్మ పదాలు, గేయసంపుటి ( 2009) 4. సజల నయనాల కోసం - వచన కవితా సంపుటి (2010) 5. మోర్సింగ్ మీద మాల్కౌస్ రాగం - ప్రయోగాత్మక పద్యాల సంపుటి ( 2010 ) 6.అంతర్లయ - వచన కవితా సంపుటి ( 2012 ) 7. అంతస్తాపము - చందోబద్ద పద్యాల సంపుటి ( 2012 ) 8. ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు - అనువాద కథలు (2013) 9. పొరుగు వెన్నెల - అనువాద కవిత్వం ( 2013 ) వీరి అనువాద కవితాశక్తి - మచ్చుకి : సరళత్వం ------------- తాముఉన్నామని తెలుపడానికి ఒక కిలకిలారావం తాము ఉండేవాళ్లమని సూచించే నిమిత్తం ఒక ఈక విదిలింపు తాము ఉండబోతున్నామని నిరూపించేందుకు పొదగడం తాలుకు వెచ్చదనం పక్షులు జీవితాన్ని ఇంతకన్న సరళంగా ఎలా వ్యక్తీకరిస్తాయి ..? మళయాళ మూలం : పి.పి.రామచంద్రన్ ఆంగ్లానువాదం : కె.సచ్చిదానందన్ అమాయకతకు నిదర్శనం ---------------- నియంత అమాయకుడనటానికి నిదర్శనాలెన్నో అతనికి మామూలు గొల్లే తప్ప పులిగోల్లుండవు ఇంకా చెప్పాలంటే మామూలు దంతాలే తప్ప విషపు కోరలుండవు అతని కళ్ళెప్పుడూ ఎర్రబడవు నిజానికి అతని దెప్పుడూ మందహాసమే తరచుగా అతడు నిన్ను ఆహ్వానిస్తాడు తన ఇంటికి తన మృదువైన చేయిని చాచి స్వాగతిస్తాడు ప్రజలు తనకు భయపడతారంటే అతనికి ఆశ్చర్యం నియంత ఇంటిగోడలకు వేలాడే కత్తులూ తుపాకులూ కేవలం అలంకరణ సామాగ్రే శ్రేష్టమైన కళాఖండాలతో అలంకృతమై గొప్ప సంగీతం నినదించే అతని గర్భాగారం ఎంతోఆహ్లాదకర ప్రదేశం బయటికన్నా ఎక్కువ భద్రంగా వున్నామని పిస్తుందక్కడ నియంత ఇప్పుడు బాగా వాసికెక్కాడు అతని భవనాన్ని మృతులు కూడా సందర్శిస్తుంటారు హిందీ మూలం : మంగలేష్ దబ్రాల్ ఆంగ్లానువాదం : నిరుపమాదత్ ( పై రెండు కవితలు " పొరుగు వెన్నెల " గ్రంధం నుండి ..) * వీరిని" కవిసంగమం" కు పరిచయం చేయడం ఒక గొప్ప అనుభవం గా భావిస్తున్న . 27-02- 2014.

by దాసరాజు రామారావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mH1ARI

Posted by Katta

Nirmalarani Thota కవిత

చిన్నపుడు పండుగొస్తుందంటే చాలు . . ఒకటే ఎదురు చూపులు . . బడికి సెలవు కోసమో . . పిండి వంటల కోసమో . . . అదేంటో వయసొస్తున్న కొద్దీ అదో ప్రహసనంలా. . . ఏదో ప్రవళికలా . . జరుపుకోకపోతే పాపం తగులుతుందనో . . సమాజం వింతగా చూస్తుందనో . . అపార్టుమెంటు బాల్కనీలో చాకుపీసుతో ముగ్గు గెలికి . . నగిషీ ద్వారానికి నామోషీ కావొద్దని ప్లాస్టిక్ తోరణాలు కట్టి . . దేవుడి ముందు నూనె, వత్తి లేని కరెంటు దీపాలు పెట్టి స్వీట్ హౌస్ నుండి రెడీ మేడ్ ప్రసాదం తెచ్చి . . ఈగలో, దోమలో వస్తాయని . . . తలుపులు మూసుకొని హాస్టల్లో అబ్బాయికి ఓ సారి ఫోను చేసి అమెరికాలో అమ్మాయిని స్కైప్ లో చూసి హమ్మయ్య . . .పండుగ తంతు అయిందనిపించి . . ఛ . . ఛఛ . . ఇదేనా పండుగ ? ? ? పండుగంటే మనుషులు ఒక చోట కలవడం కదా. . .? కలిసిన మనుషులు మనసులు కలబోసుకోవడం కదా . . ? కష్ట సుఖాలు పంచుకోవడం కాదా. . .? సపరివార పంక్తి భోజనాలు కదా. . ? అమ్మలు కొసిరి కొసిరి వడ్డించడం కదా...? పెద్దలు మురిసి మురిసి చూసుకోవడం కదా...? క్యాలెండర్లో ఎర్ర మార్కేనా? అఫీసులొ పబ్లిక్ హాలిడేనేనా . . ? ఫోన్లలో ప్లాస్టిక్ నవ్వులేనా . . ? నెట్ లో మనసు నింపని చాట్ లేనా. . ? హు.. బ్రతుకు పండడం . . పండుగను బ్రతికించడం రెండూ గగన కుసుమాలైపొయాయే . . . . ! ! ( కవితలా లేదనుకోండి . . ఏదో నా వ్యధ . . పండుగల్ని కోల్పోతున్న బాధ . . ! ) నిర్మలారాణి తోట తేది: 27.02.2014

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8GyKM

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

భాష వేరు .. రాజకీయాలు వేరు … ” మా తెలుగు తల్లికి మల్లె పూదండ ” లో ’ రుద్రమ్మ భుజ శక్తి ’ అన్న ఒక్క పదం తప్ప, మా ప్రాంత ప్రశస్తి ఏదీ లేదంటూ కొందరు తెలంగాణ ప్రాంతీయులు నిరసించిన సంగతి విదితమే ! అయితే శంకరంబాడి సుందరాచారి కవి ఆ గీతాన్ని రచించింది 1939లో. కోస్తా, రాయలసీమలతో కూడిన తెలుగు ప్రాంతం మరి కొన్నాళ్ళకు మరో తెలుగు ప్రాంతమైన తెలంగాణంతో కలిసి ’ఆంధ్ర ప్రదేశ్’ ఏర్పడుతుందన్నది అప్పటికి ఊహించి, గీతాన్ని రచించాలి – అనుకోవడం అత్యాశే అవుతుంది. పైగా, ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు కవులకు తెలంగాణ ప్రాంత ప్రశస్తి, ఇతర చారిత్రిక వివరాలు తెలిసే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. కాబట్టి ఆ కవిని తప్పు పట్టవలసిన పని లేదని, ఆ గీతాన్ని నిరసించవలసిన అవసరం లేదని అందరూ గ్రహించాలి. ఆ గీతంలో – రెండవ చరణంలో తెలుగు వారు గర్వించ దగ్గ మహనీయుల ప్రశస్తిని అద్భుతంగా అందించారా కవి. ఆ చరణాన్ని ఒకసారి చూద్దాం - ” అమరావతీ నగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై, నిఖిలమై నిలచి యుండే దాక … (*) రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … (*) నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “ అయితే, ఇందులో (*) గుర్తు పెట్టిన పాదాలు రెండూ దాదాపుగా ఒకే అర్థాన్ని ఇస్తూ పునరుక్తి అవుతోంది. అందులో మొదటి దాని బదులు (అదే ట్యూన్ లో) – ” పోతన్న కవన మందార మకరందాలు ” అని అంటే … ఏ గొడవ లేక పోను ! అసలు సుందరాచారి కవి ఈనాడూ జీవించి ఉంటే, ఈనాటి వాదోపవాదాలకు నొచ్చుకొన్నా – తెలంగాణ ప్రాంత ప్రశస్తిని వర్ణిస్తూ ఇంకో చరణం వ్రాసి ఉండే వారని నాకనిపించింది. ఆ తలంపు రాగానే, తెలంగాణ ప్రాంత మహనీయుల ప్రశస్తిని వర్ణిస్తూ, పై చరణం ట్యూన్ లోనే, అదే శైలిలో ఒక చరణం నా గుండెలోనుండి తన్నుక వచ్చింది. ” రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు గోపన్న గొంతులో కొలువైన రాగాలు పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు పోతన్న కవన మందార మకరందాలు రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి, మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “ రాష్ట్రాలుగా విడిపోయినా … నా మనసులోని మాట ఒకటే - ” జై తెలుగు తల్లీ !!! “ సవరించిన గీతం మొత్తంగా ... మరొక్కసారి - మాతెలుగు తల్లికీ మల్లెపూదండ - మాకన్నతల్లికీ మంగళారతులు - కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి! ||మాతెలుగు తల్లికీ|| గల గల గోదారి కడలి పోతుంటేను… బిర బిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను… బంగారు పంటలే పండుతాయి! మురిపాల ముత్యాలు దొరలుతాయి! ||మాతెలుగు తల్లికీ|| అమరావతీ నగర అపురూప శిల్పాలు - త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు - తిక్కయ్య కలములో తియ్యందనాలు - నిత్యమై నిఖిలమై నిలిచియుండే దాక - మొల్ల కవితా శక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి - మాచెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం! – నీ పాటలే పాడుతాం! ||మాతెలుగు తల్లికీ|| రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు - గోపన్న గొంతులో కొలువైన రాగాలు - పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు - పోతన్న కవన మందార మకరందాలు - రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి, మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి - మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం - జై తెలుగుతల్లి ! జై తెలుగుతల్లి !! జై తెలుగుతల్లి !!! — *** — ఇది 2008లో "Dr. Acharya Phaneendra" అన్న నా బ్లాగులో నేను ప్రచురించిన నా పాత టపా. రాష్ట్ర విభజన జరుగుతున్న ఈ సందర్భంలో దానిని మళ్ళీ ప్రచురించాలని అనిపించింది. చివరలో మొత్తం గీతాన్ని ప్రచురించాను. - డా. ఆచార్య ఫణీంద్ర

by DrAcharya Phaneendrafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ko6MZr

Posted by Katta

Rajkumar Bunga కవిత

డబ్బువస్త్రం మాస్తే చాకిరేవుకి వెళ్ళాను నగ్నత్వమనుకొని లోకం నవ్వుతుంది!! --ఆర్కే

by Rajkumar Bungafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ko6LVb

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి నాలో నేను! ఆ రెండూ ప్రక్కప్రక్కనే పెట్టా ఒకటి ఐశ్వర్యం మరొకటి హృదయం ఐశ్వర్యాన్ని పంచుకున్నారు హృదయాన్ని విరుచుకు తిన్నారు ఇప్పుడు నాకు కన్నీళ్లే లేవు చెప్పుకోవడానికి అక్షరాలు తప్ప! 25FEB2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OGdVub

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: మహా శివరాత్రి..: ఆది బిక్షువు జగతి అవతరించిన వేళ.. చిదానంద రూపమున సన్నుతి కలిగించిన వేళ.. అభిషేక ధారల ఆరగించిన వేళ.. బిల్వ పత్ర సమర్పణ మార్గమున కనికరించిన వేళ.. ఉపవాస దీక్షల దక్షతన కొంగు బంగారమయిన వేళ.. కణ కణం శివ శివం దాల్చిన శంకరుడు కొలువుదీరాడు శ్రికంఠుడై బోళా శంకరుడు పృథ్విన అమృత ధారలను చిమ్మాడు..!! మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు...!!! 27/02/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ezJJFK

Posted by Katta

Bhaskar Palamuru కవిత

పల్లె ఉత్సవం! మాయా మర్మం ఎరుగని మట్టి బిడ్డలు వానొస్తే ఆనందం సూర్యుడు ఉదయిస్తే సంతోషం కల్లా కపటం తెలీని అచ్చమైన గువ్వ పిట్టలు ఎల్లలు ఎరుగని భూమి పుత్రులు కాలం కాటు వేసినా గుండెల్లో మంటలు చెలరేగినా కన్నీళ్లు జారిపోతున్నా పల్లెజనం ఒక్కటై పోతారు తమ తరం మిగిల్చిన అనుభవాలను నెమరు వేసుకుంటారు! ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర ఊరు ఉప్పెనవుతుంది మరోసారి జాతరై అల్లుకుపోతుంది అదే పల్లెతనానికున్న గొప్పదనం మనుషులంతా పక్షులై పోయేది కులమతాలకు అతీతంగా జంగు సైరన్ లా సాగి పోయేది ఎప్పుడో తెల్లారి పోయే బతుకులు కావు వాళ్ళవి చివరి బంధాన్ని సైతం గుర్తు చేసే కాకులను ప్రేమించే అమ్మతనం వాళ్ళ స్వంతం ! వారం వారం జరిగే సంత వాళ్ళకో వేదిక ఏడాదికో సారి తిరునాళ్ళ జాతర వాళ్ళ బతుకులన్నీ ఏకమయ్యే ఏకునాదం మోత అది తోరణాలు పల్లవించే మట్టితనం వాళ్ళ కలివిడితనం అదే పల్లె బతుకుల ఆనంద తాండవం మరువలేని జ్ఞాపకం!!

by Bhaskar Palamurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mFHIhP

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

నగరం పైన Arasavilli Krishna వ్రాసిన ఒక అద్భుతమైన కవిత ...థాంక్స్ టు బాలసుధాకర్ మౌళి "తెలంగాణా / నీ కనురెప్పలపై వాలిన నగరాన్ని నీవే పురుడు పోసిన నగరాన్ని నిన్నూ దొంగిలించలేను విధ్వంసం చేయలేను" _____________________________________________ నాకై విరబూసిన మల్లెలు నా సొంతం కాదు ఆకాశం వైపు చూచి సాయంకాలానికి వాడిపోతాయ తెల్లవారుజామున రైలు దిగి యువ ప్రేమికుల ముందర కూర్చొని ఇరానీ చాయ్ తాగుతున్నప్పుడు గొంతులో దిగిన తేనీరు మాత్రమే నాది రోజంతా బాటసారిగా అణువణువు రహదారులను స్పృశించినా నా ఊరు నా కోసం ఎదురుచూస్తుంది అతిథిని మాత్రమే ఏ క్షణమయనా అతిథి పాత్ర ముగిసిపోతుంది నాది కాని దాన్నినాది అనలేను పరాయ మట్టి హృదయానికి అంటదు ఎక్కడినుంచో ఎగిరివచ్చిన కాకి అలసటతో పిట్టగోడపై సేదతీరవచ్చు మహానగర అన్నం మెతుకులకు ఆశపడవచ్చు అవి ఆకలి క్షణాలు. వొక నిర్మాణానికి చేతులు కావాలి ఆ శ్రమకు ప్రతిఫలం పొందాం వర్షం కురుస్తున్నప్పుడు ఎండ కాస్తున్నప్పుడు గొడుగు ఒక తోడు - వాతావరణం నిర్మలమయనప్పుడు గొడుగు గోడకు వేలాడుతుంది నగరం మనుషుల పందిరి పందిరి కింద నగరం ప్రవహిస్తుంది దాహమేస్తే ఒక్కోసారి నీరు అందదు నగరంలో నీటి ఊటలుండవు కడుపులో కాలుదూర్చి నిద్రిస్తున్న మనుషుల జాడ బహుళ అంతస్తుల విదేశీ కార్ల అజీర్తి నగరం మురికి కాల్వల బహిర్భూమిల అవసరాల మురికి వీధుల నగరం పాత కొత్త కట్టడాల శిథిలాల కింద నలిగిన శరీరాలు రక్తసిక్త రహదారిపై పడిన దిక్కులేని మృత శరీరాల వాసన ఎవరి నగరం వారిదే నగరానికి హృదయ గవాక్షముంది రక్త ప్రసరణ ఉంది తన బిడ్డలను పోల్చుకుంటుంది విశాలమైన వక్షస్థలంపై నగరం ఓ పీటముడి తెలుపు -నలుపు నగరం వర్ణ మబ్బులోని దృశ్యం నగరం బాలింతరాలి బాధ నగరం దేహపు ముఖం నగరం * నగరం ప్రియురాలు దొరికినంత అందినంత ఆస్వాదించాం ఎముకల గూడులా ఉన్నదో! పేలిన శబ్దాలకు నేలరాలిన పావురంలా ఉన్నదో! వెలిగించిన లాంతరులా ఉన్నదో! నగర దుఃఖ సమయాలన్నీ ఆనందాశ్రువులన్నీ నగరానివే. తెలంగాణా నీ కనురెప్పలపై వాలిన నగరాన్ని నీవే పురుడు పోసిన నగరాన్ని నిన్నూ దొంగిలించలేను విధ్వంసం చేయలేను వేరు చేయలేను నా సొంతం అనలేను నగరానికి ఎప్పుడూ అతిథిని మాత్రమే - ( * కృష్ణశాస్ర్తికి క్షమాపణలు) ఆంధ్ర భూమి - సాహితీ 24 ఫిబ్రవరి

by కోడూరి విజయకుమార్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hkzJFJ

Posted by Katta

Krishna Mani కవిత

నా తోడు ********* కనపడని నీడ నా చుట్టూ నిస్సందేహం ! తల్లి గర్భాన మొలచిన చోటనే అది నా తోడు పగలు రాత్రి తేడ లేదు తొలిసారి అమ్మా అన్నప్పుడూ తొలిసారి ఒక్కన్నే బయటికొచ్చినప్పుడూ నా నీడకు ఒక నీడ జతైనప్పుడూ ప్రతి కర్మను ప్రశ్నిస్తూ మంచిని తడుతూ చెడుని తోడుతూ తడబడు అడుగుల చూస్తూ గమ్యానికి పాదులు వేస్తూ అన్నీ వేళల వెంట నడుచును ! కనిపించే నీడే నా ఆత్మ అయితే కనిపించని నీడ పరమాత్మ ! కృష్ణ మణి I 27-02-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hkzLgE

Posted by Katta

Panasakarla Prakash కవిత

నవ్వొస్తు౦ది ఎ౦తకాల౦ పోరాడతావ్ చచ్చేదాకానా..? సరే తరువాత‌ ఏ౦టిమరి నీకు మిగిలే శేష౦..ఏమన్నా ఉ౦దా అమ్మా నాన్నల బిడ్డగా పెరిగావ్ అప్పుడు వాళ్ళే౦చెబితే అదే ఆలికి భర్తగా మారావ్ ఇప్పుడు ఆమె ఏ౦చెబితే అదే పిల్లలకి త౦డ్రి వయ్యావ్ ఇక నీ పూర్తి జీవిత౦ వాళ్ళదే.. కానీ నువ్వేదో కోల్పోతున్నావ్ నీకు తెలియనిదికాదు నీకు తెలిసి౦దే కోల్పోతున్నావ్ ఇ౦కా ఎ౦తకాలమీ కష్ట‍‍‍‍‍‍౦ ఉద్యోగ విరమణ చేస్తే వచ్చే సొమ్ముకూడా బాధ్యతల అక్కౌ౦ట్లోకే బదిలీ ఐపోతు౦ది విరమణ లేని ఉద్యోగ౦కదా బ౦ధమ౦టే ఇప్పటిదాకా నీ అవసర౦ ఉన్న వాళ్ళకి ఇప్పుడిక నీ అవసర౦ రాకపోవచ్చు నీ మాటలు వాళ్ళకి ఇక వినబడకపోవచ్చు నువ్వు ఒ౦టరివవుతున్న స౦దర్భ౦ నీకు నీ అవసర౦ ఉ౦దని మొదటిసారి గుర్తు చేస్తున్నప్పుడు నీకు నువ్వు దొరికిన ఆన౦ద౦లో.. కోల్పోయిన జీవిత౦ చాలా చిన్నదనిపి‍‍‍‍‍‍‍‍‍‍‍‍౦చి నవ్వొస్తు౦ది.. పనసకర్ల‌ 27/02/2014

by Panasakarla Prakashfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hk44UO

Posted by Katta

Jabeen Unissa కవిత

(ఏంది భాఇ) ఏంది ఏంది ఏంది భాఇ ఎంత వరకు ఈ వింత, తప్పు చేసినోడెవడొ సిక్ష జాతికే నంట, హిందు ముస్లిం భాఇ భాఇ బడి తలపుల వరకేనా, తిరిగి తిరిగి పానం అలిసే ఇల్లు అద్దెకు ఇవ్వరంట, టూలెట్ అని బోర్డ్ చూసి తలపులు తట్టానయ్యా, ముస్లిం అని తెలియగానే వింత వింత చూపులంట, వెజిటేరియన్ ఐతేనె అద్దెకి రావాలంట, ముస్లింకు అసలు ఇవ్వమొఇ జాఓ జాఓ అంటారా, సూటి పోటి మాటలతో గుండెను గుచ్చారయ్యా, ఏంది ఏంది ఏంది భాఇ ఎంత వరకు ఈ వింత, తప్పు చేసినోడెవడొ సిక్ష జాతికే నంట, హిందు ముస్లిం భాఇ భాఇ బడి తలపుల వరకేనా.

by Jabeen Unissafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cb1gK2

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి || ఈ వానే కదా!! ... || ఈ శివరాత్రి పగటి పూట శీతాకాలపుటెండ చిరుబురులాడుతున్నా.. దబాటంగా కురిసిందోవాన నాపైన . చూపుడువేళ్ళకి పనిచెప్పకుండా లోనా బయటా కురుస్తోంది వాన నానిపోతున్నానీవేళ పరవశంగా పుత్రపరిష్వంగ రోమాంచితాలను మించి పూలవానలు కురిపించిన గురుతులేవీ నా జీవితానలేవు కవితత్త్వాల స్పందన తడి ఇంకా స్మృతిపథాన ఆరనేలేదు పైలా పచ్చీసు దాటి పుష్కరం ముందుకొచ్చాక ప్రేమలేఖల వినోదానదాలలో ఈదులాడే రోజులుకావివి!! మరెందుకీవేళ టపా అందుకున్నాక ఎందుకింతగా మురిసిపోయాను!! యాభై ఏళ్ళ వానలో ఇలా తడిసిపోయాను!! నిర్జన మైదానం లాంటి నా జీవితాన్ని ఈ వానే కదా ఇరవై ఏళ్ళ కిందటే చుట్టేసింది! నిసర్గ ఆకాసాన్ని చూపించి పువ్వులా నను ఏమార్చింది!! బాధంటే కవిత్వమని, హృదయ పరిచ్చేదన అని, అభ్యుదయపు ఆవలితీరమని చెప్పింది నాకు! ఈ వానే!! అల్లకల్లోల అగాధాల్లోకి దూకి శిరస్సెత్తి శివమెత్తించింది తన రాతల్లోంచి జీవిత సారాన్ని పారించింది ఈ వానే కదా!! చినుకుకీ చినుకుకీ తేడా లేదని కలిపి ఉంచే తడి ప్రేమే నని.. ప్రళయంలో నైనా ప్రణయంలో నైనా దేవుళ్ళను సైతం బతికించే మనిషివై బతకమని అదే తన అభిమతమని.. ఈ వానే కదా మనసు తడిమి నన్నో చినుకును చేసింది! చినుకు చినుకును చేరదిసినట్టు నన్నో చెలమని చేసింది!! కలల్ని, కలువల్ని నాలో మొలిపించింది ఈ వానే కదా!! నాకీరోజు పుస్తకమై కురిసి మురిపించింది.. ఈ వానే కదా!! ఈ వానే కదా!! *** ( కొప్పర్తి మాస్టారు కొత్త పుస్తకం.. “ యాభై ఏళ్ళ వాన పొస్ట్ లో అందుకున్న ఆనందంలో..) =27.2.2014=

by Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MwHGeL

Posted by Katta

Mani Vadlamani కవిత

కవిసంగమం మిత్రులకి, నా కవిత 'అక్షర హృదయం ' ఆంద్రప్రభ.కాం లో ప్రచురించబడింది (http://ift.tt/MwHFYn) అక్షర హృదయం అక్షరాన్ని! సృష్టి,స్తితి, లయ కారకమైన నాదాన్ని! ఓంకారాక్షరిని! అనాదిగా మేధో మధన ఆవిష్కృతని బహుముఖిని! వేదాక్షరిని! అమ్మతనం మెండుగా వున్న నిండు మాతృత్వపు మధురాక్షరిని! సాహితీ గుండెల హృదయ స్పందన శిల్పిని! రూపకల్పనాక్షరిని! వెన్నెలలో ఆడుకొనే జిగిబిగి పొంకపు అందమైన కవితా కన్నెల సౌందర్యాక్షరిని! అణగారే హీనుల, దీనుల పీడితుల కోసం పోరాటం సాగించే చైతన్యాక్షరిని! నిన్నమొన్న గతించిన గత వైభవ చిహ్నాలను లిఖించి ముద్రించిన సత్యాక్షరిని! కన్నీటిగాథల వెతలతో, ఆర్తుల ఆవేదన, ఆక్రోశం నిండిన రోదనాక్షరిని! అబద్దపు నీలి నీడల మాటున దాగిన కఠిన నిజాల వాస్తవ చిత్రాక్షరిని మరుభూమిలో సమాధుల మీద గాఢ నిద్రపోతున్న అమరాక్షరిని! సత్య, శివ, సుందర తత్వాన్ని నిలువెల్లా నింపుకొన్న ప్రణవాక్షరిని ఉషస్సు లోకి పయనమయ్యే కాంతిని! జ్ఞానాక్షరిని! అమృతాక్షరిని! ..................................... 26th Feb 2014 రచన : మణి వడ్లమాని

by Mani Vadlamanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MwHFYn

Posted by Katta

Patwardhan Mv కవిత

శివాలు:::: ఈ దేశం నిండా గుళ్ళు కూడూ గుడ్డా కొంపా లేని ఎందరో మహా శివుళ్లు. ****************************************** ఉపాసాలకే మోక్షం వస్తే నిశ్చింతగా ఉండండి మీ కెలాగూ ప్రతిరోజూ పస్తే. ****************************************** మోసీ మోసీ అలిసిపోయానంది ఏనాడూ విధులెగ్గొట్టని ఇంకా రిటైర్ కాని నంది. ****************************************** కాలకూటమా నాడు కంఠంలో మండింది కాదు,సర్కారీ స్కూళ్ళో మిడ్డే మీల్సుగా వండింది. ***************************************** ఈ మధ్య శివుడు పార్వతిని మరిచిపోయాడు ఔను మరి గురుడు ఫేసుబుక్కైపోయాడు. ***************************************** సామేను దొరా మేమూ బత్కు పోరులో అంతేనయ్యా హరా. ***************************************** మంచంతా కరిగి పోయిందంటే అయ్యయ్యో శివా నీవూ కాందిశీకుడ వంతే. ***************************************** నీకూ నాకూ చెప్పనా ఒక పోలిక మన మన మామగార్లకు మనమంటే తేలిక!!!!!!!!!!!! 27-02-2014,మంచిర్యాల్.

by Patwardhan Mvfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cT5gNf

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి హృదయం ఆ నర్తిస్తున్న చేతివ్రేళ్లు తన నరాలని మీటుతుంటే శబ్దం నిశ్శబ్దాన్ని ఛేదించి సంగీతమై ప్రవహిస్తుంటే ఎంత హాయిగా నిద్రపోతోందో ఆ దివ్యమైన హృదయం 25FEB2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pvW3Qs

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఎక్కడ నీవు --------------------­-------- ఏమని రాయను నిన్ను నా మనసులో పారబోశాక నిశ్శబ్ధాలను వర్ణించనా నిరీక్షణలను వల్లె వేయనా నీ మౌనంలో కరిగిపోయిన నా ఎదుచూపులు ఇక అలసిపోయి నీ జ్ఞాపకాల పొత్తిళ్ళలో నన్ను వెతుక్కుంటున్నాయి విధిలేక ఎన్నిసార్లు ఏరుకోను నీ మాటల ముత్యాలను ఈ హృదయ తీరంలో ఒక్కడినే నువ్వులేకుండా క్షణాలను యుగాలుగా మార్చడం యుగాలను క్షణాలుగా కరిగించడం నీకే తెలుసు నీ సహవాసంలో తడిసి ముద్దయిన ఈ దేహం నీ చిరునవ్వుల సంతకాలను చెరపలేకపోతోంది నువ్వెళ్ళిపోయినా నీ వాత్సల్యమే నిత్యం నా కళ్ళలో అనునిత్యం. తిలక్ బొమ్మరాజు 27.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dC4Kju

Posted by Katta

Sasi Bala కవిత

అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ................................................. శివోహం !!....................(శ శి ) ................................................ వందే శివం శంకరం శుభకరం బాలేందు బింబాననం వందే పన్నగ భూషణం హరం కైలాసగిరి వాసినం వందే భస్మాలంకృత సుదేహం ఈశం భవానీ ప్రియం వందే మురారి పూజితం త్రినయనం కేదార గౌరీశ్వరం వందే కందర్ప దర్పదమనం వ్యాఘ్రాంబరధరం దేవం వందే కాల కంధరం శివం శ్రీశైల మల్లీశ్వరం వందే త్రిపురాంతకం హరం సకల భూతాదినాదం వందే రుద్రం భవ భయ హరం కాశీ పురాధీశ్వరం....27 feb 14

by Sasi Balafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ca9Ith

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవితby రంజిత్ రెడ్డి కర్రfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dBRU50

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

గ్లోబల్ విలేజ్ ................... /శ్రీనివాసు గద్దపాటి/ -------------------------------------------- ప్రపంచం కుగ్రామమయ్యిందిక జీవితాల్ని అగ్గిపెట్టెగదుల్లో కుక్కేసి ముఖాల్ని ఎల్.ఈ.డి లకు అతుక్కొనో....! వెబ్ కాంలముందు పరచుకునో....! మెయిల్లతోనో...! మెస్సేజ్ లతోనో..! "'ఇ" కాపురాలు చేసుకుంటూ...... మానవసంబంధాలకు మంగళంపాడే ఖండాంతరజీవితాలకు చంకలుగుద్దుకుంటూ మురిసిపోదాం. అవును ఇప్పుడు ప్రపంచం కుగ్రామమే.....! మరి ఈ కుగ్రామంలో నా గ్రామమేది...?

by Srinivasu Gaddapatifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cSekSt

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || కాగితప్పండగల కారెడ్డం నగరం ఎన్నిపండుగల్నాయినా సంబురంగా జేసుకుంటది. సంతోషమంటే కొనేటిదని అమ్మెటొండ్లు ఎప్పటిసందో యాదిల బెట్టిండ్లు. అరే భాయ్ పండుగా ఒక సంతే పండుగ ఒక ఈవెంటే పండుగంట్నే అదొక సందర్భం ఇగదియ్ అది జేబ్ల మీదకుర్కే కత్తెర పండుగంటేనే అంగటి సరుకయినంక అంగిట్లో ఏం మాటుంటది. సందట్లో ఏం సరుకుంటది సందిట్లో ఏం సుకముంటది. ఛాల్తియ్ పోనియరా భయ్ పండుగంటే ఉచితార్ధం రికాంగొచ్చేటి నాగా. బూసెన్నలు,బూందీలు, బోల్‌పేలాల కాలంగాదు దావత్ చేద్దాం నడువ్ ► 26-02-2014 http://ift.tt/1cnqm30 ( కారెడ్డం = పరాచకం; బూసెన్నలు=పల్లీలు / వేరుశనగగింజలు ; బోల్‌పేలాలు = బొరుగులు / మరమరాలు )

by Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cnqm30

Posted by Katta

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: స్వాగతం..: ఎలా తెలుపను చెలీ ఎలా తెలుపను...!! హాయి వెల్లువలెత్తగ నీకు స్వాగతం..!! ఆవరించిన శూన్యం ఆనందపడగ నీకు స్వాగతం..!! అణువణువు తమకమున తేలిపోగ నీకు స్వాగతం..!! మనసు మురిసి మయూరమవగ నీకు స్వాగతం..!! ఎద పారవశ్యపు పరిమళాలు విరజిమ్మగ నీకు స్వాగతం..!! కౌగిలిన బంధీవై వెచ్చని చలువన చేష్టలుడిగిన నీకు స్వాగతం..!! ఎలా తెలుపను చెలీ ఎలా తెలుపను..!! 26/02/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHv14h

Posted by Katta

Sriramoju Haragopal కవిత

కొత్త తెలంగాణా నా మట్టితల్లి తెలంగాణా పాలపొత్తిళ్ళలో పొద్దు పొడిచింది నా కన్నతల్లి బంగరునేల పరాయితనం ఒడిసిపోయింది ఏండ్లసంది పూట పూటకు పడ్డ రంధి తీరిపోయింది ఏదెట్లనన్ని గాని కొత్తపురుడు పోసుకున్న తెలంగాణాకు కొత్త నెత్తురు నింపాలె, ప్రజల ఆశల, ఆశయాల ప్రాణం పొయ్యాలె బొమ్మ తెలంగాణా కాదు, మనకు అమ్మ తెలంగాణా కావాలె కనని కష్టాలు, కాని బాధలు పడ్డది ప్రపంచాన ఎవరికి రాని దుఃఖాలు మోసింది ఈ నేల లోకాన ఎరుగని శోకాలు ఓర్చింది ఈ నేల ఎందరు ఈ నేలను విముక్తికోసం ప్రాణాలనదులతో తడిపిండ్రు ఎందరు ఈ నేలమీద ఎన్నడులేని పోరు యుద్ధాలు నడిపిండ్రు వాళ్ళ రుణం ఎట్ల తీరాలె, వాళ్ళ కలలు ఎప్పుడు సాకారం కావాలె ఒకళ్ళను ఎత్తుకుని అమరనివాళులియ్యక మునుపే మళ్ళెందరిని బోనాలదీపాల్లెక్క ఎత్తుకోవాల్సి వొచ్చింది ఇంక ఏరువాక చెయ్యాలె, నాగేటిసాళ్ళల్ల మొలకకలలై వాళ్ళు జెండాలై రెప రెపలాడుతరు కొత్తలకు పెట్టాలె, అమరులకు తెలంగాణా నిండ గండదీపాలు పెట్టాలె గడప గడపకు వాళ్ళు చేసిన త్యాగాల పాటలె వినిపించాలె కొత్త తెలంగాణాకు కొత్తతొవ్వలు తియ్యాలె ప్రజల పెదవుల మీద తెలంగాణా చిరునవ్వుల ఎన్నీల కావాలె బెదిరిపోయిన మన మాటల గువ్వల్ని పిలిచి పలుకులు నేర్పాలె చెదిరిపోయిన మన చరిత్రరవ్వల్ని కూర్చి కొత్తపుస్తకాలు రాయాలె చీకట్లు, తాకట్లు, కనికట్లు లేని ప్రజలపాలన రావాలె తల్లులగర్భశోకాలు, ఉసురు తాకని తెలంగాణా కావాలె మన నదుల నీళ్ళల్ల మన పంటకలలు మెరువాలె కన్నీళ్ళు కడగండ్లు వుత్త యాదిలెక్క గావాలె కోటి రతనాల వీణ కాదు కొత్త ప్రజాకోటి తెలంగాణై నిలవాలె ¬¬¬కోరుకున్న నూతనజనవనమై వసంతాలు నిండాలె మోదుగులు పూసినయి, మామిండ్లు పూసినయి తెలంగాణా కొత్తకోయిల రాగాలు తీయాలె బతుకమ్మ తెలంగాణా, దసర తెలంగాణా పీర్ల తెలంగాణా, సబ్బండ జాతుల సకలతెలంగాణా ఆత్మగల్ల తెలంగాణా, మమతల తెలంగాణా మంచి మనుషుల తెలంగాణా, మహా తెలంగాణా

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1khnNEA

Posted by Katta

Sri Gajula కవిత

ఇప్పుడిక..ఈ నేలపైన //గాజుల శ్రీధర్,9849719609 // ఇప్పుడిక … జలగలు రక్తదాన శిభిరాలు నిర్వహిస్తాయి గద్దలు రెక్కలకింద ఊయలగట్టి కోడిపిల్లలను లాలిస్తాయి పాములు పుట్టలపై పిచ్చుకగూళ్లని అల్లుతాయి తోడేళ్ళు జీవాలమందకు జవానులై కాపలా కాస్తాయి ఇప్పుడిక.. ఈ నేలపైనే .. లేత చెక్కిళ్లపై ఉరివేసుకున్న అక్షరం ఆయుధమై మొలుస్తుంది ఏకలవ్యుడి విగ్రహం ముందు పావురాల గుంపు విల్లంబులను అల్లుతుంది . -20/02/2014

by Sri Gajulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHv3cn

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || (స్వ) గతం || ========================== ఆలోచనాంతరంగాలు గుండెల్ని గుచ్చుతున్నాయి మెదడు మాత్రం అప్పుడప్పుడు కుబుసం విడుస్తుంది కళ్ళల్లో మాత్రం కళ్ళు తెరిచిన స్వప్నం కనపడుతుంది ఆలోచనలు మాత్రం ముళ్ళ మధ్యే తిరుగుతున్నాయి ఆశల గుర్రం ఆకాశంలో ఎగురుతుంది ఆశ నిరాశల మధ్య నిచ్చెన వేస్తున్నాను నిరాశలు వెక్కిరిస్తున్నా ఆశ చావడం లేదు ఎప్పటికైనా ఆశల గుర్రం పై స్వారి చేసెయ్యాలని! తడిబారిన మనసు తప్పటడుగులు వేస్తుంది కళ్ళల్లో రక్తపు ఛారలు నిత్యం పలకరిస్తున్నాయి మనసు తడి పిండెయ్యాలని ఉంది గులకరాళ్ళ లోతుల్లో మనసు రాయి లా మారిపోయింది గతాలన్ని బ్రహ్మజెముడు మొక్కలై వెక్కిరిస్తున్నాయి వర్తమానంలో మొక్కలన్నీ ముళ్ళులై గుచ్చుకుంటున్నాయి భవిష్యత్ మాత్రం ముళ్ళ మధ్య పుష్పం లా తొంగి చూస్తుంది!!! ================================ ఫిబ్రవరి 26/2013

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHv2VK

Posted by Katta

Nirmalarani Thota కవిత

*ఎవరు నువ్వు..? గంజాయి వనంలో తులసి మొక్కలా . . సైకత వేదికపై వికసిత కుసుమంలా . . ఎవరు నువ్వు..? గడిచిన నా బాల్యంలోంచి నడిచొచ్చిన ప్రియ నేస్తానివా . . ? మరచి పోయిన మమతల్లోంచి మరలి వచ్చిన మధుర ఙ్ఞాపకానివా? ముగిసి పోయిన భవితవ్యంలోకి దూసుకొచ్చిన తటిల్లతవా. . ? ఎవరు.. ? ఎవరు నువ్వు . . ? * నిర్మలారాణి తోట తేది: 26.02.2014

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hT74Kx

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్//ఓ ప్రయాణాంతర ప్రేలాపన// 0) డార్విన్ సిద్దాంతంలా మనమూ మారిపోతూంటాం నేను-మేమూ-మనమూలుగా,మామూలుగా ముడుతపడ్డ కాలాన్ని కాస్త ఇస్త్రీ చేస్కుంటాం మనిషిగా తప్పిపొయిన మనలని వెతుక్కుంటూ మనుషుల మధ్యే తిరుగుతుంటాం.. రాహోన్ మే చల్తీరహే సఫర్ హమారా ఇన్సాన్ బన్ కే, సారీ దునియాకా మెహమాన్ బన్ కే... 1) కొన్ని ప్రయాణాలు. కేవలం ప్రయాణాలనలేం చరించే చరణం, చలించే దేహం ఘలించే గళం స్మరించే పదం నర్తించే పాదం అన్నీ.. నిజానికివన్నీ నిజం కావేమో 2) ఎప్పుడంటావ్ ఇదివరలో మనిషిగా కాక సమూహంగా నేనుగా కాక. మనంగా బతుకుగ్గా కాక జీవితంగా నువ్వు కదిలిన క్షణం అదే ఆ క్షణం గతం లో ఎక్కడో వెలుగుతూనే ఉంది కదూ... 3) వినిపించే రాగమై ఒకరు, కనిపించే అను రాగమై ఇంకొకరు మనసు దారుళ్ళో కొన్ని పాదపు ముద్రల్ని ముద్రించినడుచుకుంటూ పొయాక... మిత్రమా...! అనగలవా ఇప్పుడు నేనూ అనేది కేవలం ఏకవచన సూచనాపదం మాత్రమే అని... 4) నిశ్శబ్దపు రాతిరి రాగాల రంగులద్దుకొని కొన్ని నవ్వులు కలిపిన పాటలై పక్షుల్లా రెక్కలల్లాడించి నిర్థాక్షిన్యంగా దుఖాలూ,ఆందొళనలూ అన్నీ అన్నీ చచ్చిపడిన చిత్రాన్ని మొహాన అతికించుకొని. ఓ మోడెర్న్ ఆర్ట్ లా మారిపోయాక ఒహ్హూ..!. పికాసో మళ్ళీ రావోయ్ ఈసారి అందమైన గొయెర్నికాని చిత్రించ గలవేమో ప్రయత్నించూ... 5) గోదావరిలో... నీళ్ళే నా కేవలం నీళ్ళేనా ఉన్నది..! కొన్ని ఆనందాశ్రువులూ రాలిపడ్డాయ్ రెండ్రోజుల కింద . అప్పుడప్పుడూ ఉప్పెనవ్వటమే తెలిసిన గోదారి మా ఆనంద భాష్పాలతో కలిసి ఇవాళ కాస్త ఉప్పనైంది.... 26/02/14

by Naresh Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OChXUf

Posted by Katta

Yagnapal Raju Upendram కవిత

**పిచ్ బ్లాక్** అన్నీ రంగులూ కలిస్తే తెలుపు కదా ఏ రంగు లేకపోవడమే నల్లదనమా ఏమో నల్లదనానికి కూడా కొలతలుంటాయి కలర్ టెక్నాలజీ మహిమ మరి కమ్ముకునే నల్లదనాన్ని ఎలా కొలవాలో పిచ్ బ్లాక్? కమ్ముకొచ్చే ప్రశ్నా? సమాధానమా? ఏదైనా స్పెక్ట్రోస్కోప్ కొలుస్తూ కనబడితే అడగాలీసారి నా పిచ్చిగానీ గట్టిగా మూసుకున్న రెప్పల వెనుక నేనెప్పుడూ గమనించే చీకటినే అడగవచ్చుగా వెంటనే ఆ పని చెయ్యాలి చీకటిలో ఏవో ఆకారాలు రూపాలు మారుతూ కదలాడుతున్నాయి విరగ పూచిన శాంతి నల్లటి రెక్కలై రాలిపోతోంది నా భుజాలను ఒరుసుకుంటూ కొన్ని ముక్కలు నా ఒళ్ళో పడుతున్నాయి ఓం శాంతిః శాంతిః శాంతిః అంతలో కొన్ని మాటలు అమ్మా పువ్వులన్నీ నల్లగా మారి రాలిపోతున్నాయి ఏం కాదులే తల్లీ మళ్ళీ పూస్తాయి రంగుల్లో పూస్తాయా అమ్మా అవును చిట్టి తల్లీ రంగుల్లోనే పూస్తాయి 26.02.2014 http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendramfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | అదెట్లున్నా...!? ................................. నేన్నిన్ను ఇలా చూడలేనమ్మా నువ్వెవరో తెలియని వీధుల్లోకి పంపి ; పలకరింపు ఒక్కటైనా లేని దారుల్లోకి తోలి కొన్ని గదుల్ని, కొన్ని ఫ్యాన్లని ,ఆన్ చేసిన వో టి.వి.ని నీకప్పగించి అన్నీ అమర్చాను కదా అని సంతృప్తి పడిపోతూ మా పనుల్లోకి మేం జారుకుంటూ 'నేనేమిట్రా' అన్నట్లు చూసే నీ చూపుల్ని తప్పించుకుంటూ తిరుగుతూ విరుగుతూ నేన్నిన్ను ఇలా చూడలేనమ్మా ఊళ్ళో నీ అరుపులు , బండెడు చాకిరీ ,తన్నులుగుద్దులు . నిజంగా నువ్వు బతికిందీ , ఇంకా బతుకుతున్నదీ అక్కడే . కష్టాల్లోనే జీవితముంది- అదెట్లున్నా ?! సుఖమా - అదొట్టి ఖాళీ తిత్తి . అక్కడేం లేదు.ప్చ్.డొల్ల . ఊసుకున్నా ఉమ్ముకున్నా నీ ఇంట్లో ఇదేందని అడిగినోల్లు లేరు. లేచినా పండుకున్నా ఆరాంగా, హాయిగా . లోకమంతా నీడైనట్లు,నీదైనట్లు ; నీవే లోకమైనట్లు బతికినవ్ చూడు ; అదే జీవితం. ఇదేంది : ఇక్కడ అన్నీ బోల్టులు ,నట్లూ బిగించిన గిర్రలాగా . నోటికడ్డంబెట్టి ఆపుకునే తుమ్ములాగా . అదుముకుని ఆపుకుని కొంచెం కొంచెం కొసరి కొసరి బతకడం. దీనబ్బా ! ఇట్లుంటదా జీవితమంటే. అమ్మా : నువ్వే కరెక్టు. " ఎంత దుప్పటి ఉందో అంతే కాళ్ళు జాపాలి " ఈ బతుకుల్నేమో దుప్పటి, కాళ్ళూ అసలు సమజతైనే లేదు. 26.2.2014

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OBTQFo

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hf0KKp

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! జీవిత సమరం !! మనం జీవిస్తున్నామా బ్రతికెస్తున్నామా పొద్దు పొడవగానే మొదలు సంఘర్షణ కారణాలు ఏవైనా తెలియని మానసిక వత్తిడి విపరీతమైన ఆరాటం అర్ధం లేని జీవన పోరాటం ఏదో అయిపోతుంది అనే నిరుత్సాహం ప్రతిది సమయం తో పోరాటం అందుకోలేక పోతామేమో అని ఏకారణం తోనో వాయిదా పడితే ఒక్కక్షణం ప్రపంచాన్ని జయించిన ఆనందం నీ ప్రయత్నాలు చేయటమే కదా నీవంతు ప్రతి ప్రయత్నం సఫలం చేయటం పైవాడి వంతు నీ మనోవ్యధతో వ్యాకులం తో నీ చుట్టూ వున్నా సహజ సౌందర్యాన్ని నీ వాళ్ళ నిస్వార్ధ ప్రేమను గమనించక ఫలితం తెలియని ప్రయత్నాలలో పడి తిరిగి తిరిగి విసిగి వేసారి జీవన సమరం లో ఓడిపోతున్నాం నీది కానిది ఎంత ప్రయత్నం చేసినా రాదు నీవద్ద తాత్కాలికం గా వున్నా నీకు ఉపయోగ పడదు నీది అయితే ఎక్కడ వున్నా నీవద్దకె వస్తుంది తొందరగా ఎదగాలి అని ఆయాస పడవద్దు సమయం నిన్ను సరియైన సమయం లో దారి చూపిస్తుంది నిన్ను నీవు నమ్ముకో నీవాళ్ళతో మంచిగా మసలుకో నీవద్ద వజ్రాలు చూడు బయట రంగు రాళ్ళకు బ్రమ చెందకు మనశాంతి తో జీవించు మానవతా వాది గా చరించు !!పార్ధ !!26feb14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hf0Jq6

Posted by Katta

Kavi Yakoob కవిత

తెలుసుకుందాం ! తెలుగు,ఉర్దూ,ఇంగ్లీషు భాషలలో నిష్ణాతుడైన సాహితీవేత్త -డా.నోముల సత్యనారాయణ సార్ !

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1heSCcT

Posted by Katta

Kavi Yakoob కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 19(కవి సంగమం) కవిత్వ సంపుటి పేరు :-"దృశ్య ప్రవాహం" కవి పేరు :-" సడ్లపల్లె చిదంబర రెడ్డి" పరిచయం :- రాజారామ్. టి ..... "నీవు కవివా?ఎవరి కవివి?? "నీ' కవివైతే మంచింది! నీ లోని గుబులువైతే మరీ మంచిది!!" --అంటూ "కవి" ఎవరి కవి కావాలో చెబుతూ నీ లోని దుఃఖమైతే చాలా మంచిదనే సత్యాన్ని వెలువరించినవాడు సడ్లపల్లి చితంబరరెడ్డి. “అది కొత్త కత్తిలా కుచ్చు కొంటుంది గుండెలో పచ్చి కారం పొడిలా కలతలు రాలుస్తుంది కళ్ళలో చేదు ఉమ్మెత్త ముళ్ళకాయలా ఇరుక్కొంటుంది గొంతులో నిజంగా నీ గుండె కోసి కాగితం పై పరిస్తే రాస్తుందది రసాక్షరాలు"--అంటూ గూటిలోని దుఃఖం మాత్రమే రసాక్షరాల వాక్యాలు రాస్తుందని వొక నిజాన్ని మన ముందు పరిచిన వాడు సడ్లపల్లె చితంబర రెడ్డి. “నీటిని పోగొట్టుకొన్న చేపలా పొర చిట్లి గుడ్డు నుండి జారిన పచ్చసొనలా చావు పీఠానికి బలి ఇచ్చుకొని ఆరిపోతున్న మేక తల కంటి చూపులా... ఆగిపోయిన జీవితాల్ని కాలిపోయిన కలల తోటల్ని తెగిన నరనరం మీటే విషాదల అలజడుల్ని"-డప్పుల మోతల శబ్దాల కవిత్వం చేయడం కవి ధర్మంగా అనుకుంటున్నవాడు సడ్లపల్లె చితంబరరెడ్డి. తాను తానుగా నిలిచి అక్షరాలు కొలిచే కవై కదిలే పదచిత్రాలను దర్శింప చేయలనుకున్న కవి ఈ సడ్లపల్లె చితంబరరెడ్డి. కవిత్వం రాస్తే ఏంటి లాభం?కవిత్వం రాస్తున్న వాల్లకేమి లాభం?అనే ప్రశ్న కొందరు ఏ మొహమాటం లేకుండా వేస్తుంటారు.అలాంటి వాళ్ళతో నేనంటూవుంటాను "మీరు అనుకుండే "లాభం' వేరు కవులకు కలిగే లాభం వేరు "-అని "తెల్ల కాగితమే కదా!ఇష్టమొచ్చింది రాసి కాగితాన్ని ఖరాబు చేయటం కవిత్వం కాదు.అక్షరాన్ని కాగితం భరించేటట్లు రాయటం కవిత్వం"-అంటాడు వొకాయన.నల్ల కాగితం మీద తెల్లని అక్షరాలు రాయడం కవిత్వం.కవిత్వం రాయడం అందరు అనుకొన్నంత సులభం కాదు,ఎంతో ప్రయాసతో కూడుకొన్న అంశమని కొందరికే తెలుస్తుంది. లోపల ఎక్కడో కడుపులోనో,హృదయలోనో,అస్థిపంజరంలోనో,కళ్ళలోనో దాగి దాగీ మరిగి మరిగీ సలపరించిన అక్షరం మాగిన పండు చెట్టు మీద నుంచి రాలిపడ్డట్టూ కాగితం మీద పడుతుంటే ఎంత మథనం.ఇంత మథనం "సడ్లపల్లి" పడ్డాడు కాబట్టే అతని"దృశ్యప్రవాహం" మన హృదయాల్ని తాకి మనల్ని తలో కలుపుకొని తనతో చివరి వరకు తీసుకెళుతుంది. ఇప్పుడు ఒక్క కవి జీవితం లోంచే కవిత్వం రావడం లేదు.ఇతరుల జీవితాల్లోంచి,వాళ్ళ ప్రేమల్లోంచి,విషయాల్లోంచి,అవమానాల్లోంచి,అనుమానాల్లోంచి,ముఖ్యంగా రోజు వారి జరుగుతున్న కుటుంబఘర్షణల్లోంచి కవిత్వం వొస్తున్నది.కవి తాను పొందిన అనుభూతిని తను ఎంతపొందాడన్నది కాదు అతని కవిత్వానికి గీటురాయి.ఆ అనుభూతిని ఎంతగా పాఠకుల పొందారన్నది ఆ కవి కవిత్వానికీ గీటురాయి అవుతుంది.ఈ లక్షణాన్ని"దృశ్యప్రవాహం" సంతరించు కొన్న వొక మంచి కావ్యంగా కవిత్వ ప్రియులకు అనిపించకమానదు. ఒక వాస్తవాన్ని తెలుసుకోవడానికి శ్రమించాల్సిన అవసరం లేదు కానీ ఆ వాస్తవాన్ని తట్టుకోవాడానికే శ్రమించాల్సివుంటుంది.ఈ కవికి జీవితవాస్తవాలు అవగతం అయింతరువాత,అవగతం అయిన ఆ వాస్తవాల్ని తట్టుకోవడానికీ ఎంతో మథనపడ్డాడు.ఆ మథనం లోంచి ఉబికుబికీ వచ్చిందే ఈ "దృశ్యప్రవాహం". దుర్బల ఆరోగ్యం-దుర్భర దారిద్ర్యం అనే రెండు బండరాళ్ళ మధ్య చొచ్చుకొచ్చి అస్థిత్వాన్ని పొందిన మొక్క ఈ కవి జీవితం. రెండు ఇసురు రాళ్ళ మధ్య నలిగినలిగి ముక్కలు ముక్కలైన జీవిత శకలాల సమూహం ఈకవి జీవితం.ఆ జీవితాన్ని ఒరుసుకొని పారిన జీవిత దృశ్యప్రవాహం ఈ కవిత్వ సంపుటి.అందుకే ఇంత తీవ్రంగా ఇంత ఆగ్రహంగా ఇంత అనుభూతి సాంద్రంగా సాగుతుంది ఇది. "ఆత్మ సహజంగా జ్వలనశీలమయితే చంచలజ్వాల సైతం వెలుగులు విరజిమ్మవచ్చు-అంటాడు "జార్జిసాంట్ ఆనీ"అనే విమర్శకుడు.జీవన్మరణ సమస్యతో నిరంతరంఘర్షిస్తూ ..తన ఆత్మను సహజంగా జ్వలనం చేసుకొంటూ తానొక చంచలజ్వాలై భావుకతతో చితంబరరెడ్డి మండుతున్న భావాల వెలుగుల్ని ఈ సంపుటిలో విరజిమ్మాడు. మానవ,మానవేతర ప్రాకృతికాంశాల సర్వ వ్యాపకాలకు చెందిన అనుభూతుల్నీ,జనసమూహాల బాధలకూ,గాథల అనుభూతులకు ఈ సంపుటి వొక అద్దంగా రూపొందింది.మనుషుల్లోని మంచి చెడ్డల్నీ,సమాజంలోని అంతరాల దొంతరల్ని బట్టబయలు చేయటమేగాక"విజయానికి చిగురు తోరణం కట్టి''తొలిపాఠం' నేర్పుతుంది ఈ దృశ్యప్రవాహం.విద్య,పర్యావరణ రంగాలలోని విషయాలను ,జనుల అగచాట్లను,వైయుక్తిక అనుభవాల్నీ అందమైన పద,భావ చిత్రాలతో సరికొత్త దృక్కోణంతో వచన కవిత్వం చేశాడు సడ్లపల్లి.ఎన్నో కవితలు హృదయపులోతుల్లోకి వెళ్ళి బాధించి బోధించిన అంశాలను ప్రస్తావిస్తాను. "దారి పొడుగునా ఆశల గింజల్ని విత్తి స్వప్న చిత్రాలు తిరగేస్తూ ఒంటరిగా గడియారాన్ని వెంబడిస్తున్నప్పుడు నేను ఊహల శిఖరాలు కొలుస్తాను అప్పుడు నీవు గుర్తోస్తే... మనసు విప్పారిన పూవవుతుంది నిన్ను ఆకృతీకరించాలని కలల నేత కుంచెను తీస్తే అది రక్తాన్ని ఉమ్మింది"-అంటున్న ఈకవి నగరాల్లోని కొన్ని చోట్ల,అడవుల్లో పేలుతున్న మందు పాతరలను ఙ్ఞాపాకానికి తెచ్చి పచ్చి నెత్తురు మరకల్ని చుసి తన గుండె కూడా మందు పాతరై పేలిందని దుఃఖిస్తాడు."మనిషి మనిషి నిశిలో పేరుకొన్న కసి మాంసం ముద్దై కత్తుల కుత్తుకలకు కైపై" ఎక్కుతున్నదని వాపోతు ఇవి "మంచు ముక్కైకరిగి,కన్నీటి వాగై పొంగి కువకువలాడే కపోతమయ్యే" దృశ్యాన్ని కవి కోరుకుంటాడు. మానవ జీవితం లోని వేగం,తీరికలేనితనం,ఇంట్లో కోరికల చిట్టా విప్పినప్పుడు జేబు నిండుకున్న వైనం ఇవన్ని తెలుసుకొనే శక్తి కళ్ళకు లేకుంటే ఎంత బాగుండేదోకదా!-అని అనిపిస్తుంది అని కవి "నాకు అనిపిస్తుంది..!!!"అనే కవితలోచిత్రిస్తూ,"పలకా బలపాల కన్నా జాగ్రత్తగా విధ్యార్థులు అన్నం తట్టలు తెచ్చినప్పుడు../కలల కథలు చెప్పినప్పుడు లేని ఆనందం ఉడకని పిడికెడు మెతుకులు చూడగా/వారి ముఖాల్లో పొంగే వులుగులు చుసినప్పుడు.."-అని అనటంలో భారత దేశంలో రేపటిపౌరులు ఎలాంటి స్థితిలో వున్నారో తెలియ చేస్తాడు.ఎంతో అధిక్షేపాన్ని ఆగ్రహంతో తెలియజేస్తాడు. "విజయానికి' అనే కవితలో కవి తన జీవితం విజయం వైపు ఎట్లా పరుగులు తీసిందో అవిష్కరించాడు.జీవితాన్ని యుద్ధంగా,జీవించాడాన్ని అశ్వంగా,ఎదురయ్యే సంఘటనల్ని దారిగా పోలుస్తూ"యుద్ధానికి దౌడు తీస్తూ గుర్రం అలసి పోతుందప్పుడప్పుడు.......ఆవేశాన్ని సకిలిస్తూ,సునామీల్నీ పుక్కిలిస్తూ కండ కండ నుండి కాళ్లకు శక్తిధారల్లాగి విజయానికి-వీర మార్గం వైపు మళ్ళి కుప్పళిస్తుంది"-అంటూ వొక జీవన వికాస పాఠాన్ని చెబుతాడు."కన్రెప్పలు వాల్చాలంటే /రాత్రికి క్కూడా భయం/రాజ్య వ్యవస్థలో/మారువేషాల శాసనాలని"-అంటూ"ఏడొ చేప" అనే కవితలో రాజ్య వ్యవస్థ నిరంకుశ అధికారా హుంకారాలను కవిత్వంగా మార్చాడు ఈ కవి. రెండు దశాబ్దాల కిందట కవిత్వం రాసిన కవులు ఉదారవాదం,ప్రయివేటికరణ,ప్రపంచీకరణ అనే వాటి ప్రభావానికి లోనయ్యారు.ఈ కవి కూడా వీటి ప్రభావానికి గురికాక తప్పలేదు.మానవ జీవితాల్లోకి ఎంత తీవ్రంగా ప్రవేశించిందో,అది చేసె కుట్రలకీ ఒక్కొక్క కుటుంబం సాంకేతిక వ్యాపార సంస్కృతి వల్లా ఎట్లా విచ్ఛిన్నం అయ్యిందో బహిర్గతం చేసె కవిత "అన్ని రూట్లు బిజీ!!' అనేది. "గిట్టుబాటు ధరకు ఎదురు చూస్తూ కల్లమ్లో పురుగుల ధాన్యం కొరికి పుచ్చిపోతూ రైతు కట్నం బాకి బాపతు కొతయినా జమ చేస్తే అల్లుని ముఖంలో నవ్వులూహిస్తూ కూతురు పట్నం కరెన్సీ పిల్లల్తో పోటి పడే అమాయకత్వంలో మోటార్ సైకిల్ చుట్టూ చక్కర్లాడుతూ కొడుకు..... కాషాయంబరం విభూదుల వెచ్చదనాల్చాలక వి.ఐ.పి స్వాములంతా కొంగు చాటు కోసం తచ్చాడుతూ... జన సంబంధాల చదువులన్నీ టెక్నాలజీ పాము నోట్లో జీర్ణమవుతూ.... అన్ని రూట్లు బిజీగా వున్నాయి"-ఇలా కవిత ప్రపంచీకరణ వల్ల సంభవించిన పరిణామాల్ని వ్యంగ్యంగా ఆవిష్కరిస్తుంది. ఏ విషయమైనా అనుభవంలోకి,అవగాహనలోకి,అనుభూతిలోకి రానంతవరకు నిమ్మళంగా వుండొచ్చు.నిర్మలంగా వుండొచ్చు.ఈ కవి తీవ్రంగా దీర్ఘ రోగానికి(క్రానికల్ డిసీజ్)చిన్నపటి నుండి గురై దాని అనుభవాన్ని పొందిన తరువాత దాన్ని గురించి అవగాహన చేసుకొన్నాకా,దాని అనుభూతిని అర్ఠం చేసుకొన్నాకా నిమ్మళంగా వుండలేక నిర్మలంగా వుండలేక "పచ్చని ప్రాణాన్ని చప్పరిస్తు/మరణద్వారం వైపు లాక్కేల్ళే మృగం రోగం/వైరి వర్గాన్నిక్కూడా కర్కశ కరాళ కర్కోటక పీడింపుల రూపం"-అని ఆ రోగం గురించి గొప్ప అనుభూతాత్మక చిత్రణ చేశాడు.ఆయన తన సంపుటిలో రాసుకొన్న "నే ప్రవహిస్తూ వచ్చిన...'అనే మాటల్ని చదివితే ఆశ్చర్యంతోపాటు మన కళ్ళు కూడా కన్నిటి దృశ్య ప్రవాహలవుతాయి."కళ్ళ ముందే కను గుడ్డును /కసాయి కత్తుల్తో లాగి /మొసలి నోరులా నముల్తూ /ఏదో చెప్పాలని ప్రయత్నించే కళేబరం చివరి కదలికగా మెదిలే నాలుకను కొరుక్కుతిని"-ఇలా మరణం చివరి అంచున నిలబడి కవి చేసిన గెలుపోటముల జీవన్మరణపోరాటాన్ని చదివితే కవి విషాదం, మొండిధైర్యం మనల్ని ఉద్విగ్నతకు గురిచేస్తాయి. మాటలకీ భావాలకీ వో కొత్త సోయగాన్ని తొడిగిన కవితా సందర్భాలెన్నో ఈ సంపుటిలో వున్నాయి.తెగి పోతున్న సంబంధాల గురించి కవి వొక చోట ఇలా అంటాడు."మంట సోకి పటాకీ సరాలు ఒక్కొక్కటి కాలి పేలి పోతున్నట్లు"-ఇలా ఊహకు అందని ఊహను కవి చేస్తాడు."ఏవో వలయాల తీగలు చుట్టుముట్టి/నింపాదిగా స్వారీ చేస్తూ నామీద/నా చేతుల్లో ఏమీ లేని నిబంధనల పుట్టుక/అస్థిత్వాన్ని పళ్ళ కింద బిగపట్టి/పందిరి దబ్బగా ఉండీ లేనట్లు నేను' లాంటి కవిత కవి అస్థిత్వ ఆలోచనను పందిళ్ళకోసం వేసె దబ్బతో ఉపమించడం కవి ప్రతిభను తెలుపుతుంది. "వలస పోతున్న ఎర్రెర్రని మట్టి /దిగులు పడుతున్న పల్లెల ఇళ్ళలో /తెగిపోతున్న వెల్తురు దీపాలు/కరువు లావా ప్రవాహంలో పడి /కాళ్ళూ చేతులాడక /మునిగిపోతున్న రైతులు,రైతు కూలీలు"-ఇలా కరువు నేలలోని స్థితిని ప్రముఖ కవి శివారెడ్డి మెచ్చేలా కవిత్వ చేశాడు సడ్లపల్లి.ఈ కావ్యమంతా ఎన్నో మంచి కవితలు "మనసులను చంపుకొని,దేహ దాహాలను పెంచుకొని,సంతలో సరుకులై కొల,తుల దూర ద్రవ్యాది మానాల ముక్కలై తక్కెడలో ' తూగుతుంటే.."మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాయి. 'నిరాశల గళంలో ఆశల పల్లవి'ని ఇంకా చాలా కాలం ఆలపించమని ఈ కవిని కోరుతూ"జీవించాలనే ఆశ/కాలాన్ని ఎదురించే చేవ" తో ఈ కవి జీవించి నిరంతరం జ్వలించాలని కోరుకొంటున్నా.కవి సంగమ మిత్రుల్ని ఇలాంటి మంచి కవిత్వాలని చదివి మరింత మీరు జ్వలించాలని ఆశతో చెబుతూ మరో మంగళ వారం కలుద్దాం.

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evzMsW

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్!!అ/నిర్మితం!! --------------------­-------- నువ్వెప్పుడైనా కలలు కూలిపోవడం చూసావా? చెట్లు ఆకులను,పువ్వులను కలగంటాయి తమలోనే దాచుకోవాలని కాని శిశిరపు కాటిన్యంతో వసంతపు శకలాలను పోగుట్టుకుంటాయి నువ్వు కూడా కొన్నిసార్లు స్నేహం ప్రేమ కామం కాంక్ష స్వార్థాలను పోగేసుకోడానికి ఆర్తిగా యత్నిస్తావు అనిర్మితమైన అంచులపైన నిలబడి కొన్ని వాన చినుకుల మధ్య నీ దేహం స్వచ్చమైన ప్రకృతితో రమిస్తుంటుంది ఆవేశపు కణాలను కక్కేస్తూ నిన్ను నువ్వు కడిగేస్తూ అలసిన ఆత్మల పరివర్తనలో కళేభరాల బూడిదను ఎత్తుకుంటూ తిరుగాడుతుంటావు నిశీధిలో విగత ఎడారిలా... మళ్ళీ ఇప్పుడు కొన్ని కలలను కనాలి నీకు నువ్వుగా బ్రతకడానికి.... తిలక్ బొమ్మరాజు 23.02.14 26.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evzMcz

Posted by Katta

Chythenya Shenkar కవిత

చైతన్య || Save as ------------------- ఇంకెన్నాళ్ళు??? అంతః ప్రవాహ అంతిమ చిత్రం! ఉదయ-చంద్రికల మధ్యన సాగుతు, నాది కాని నా తనువుని మోస్తూ.. ముందుకు సాగే, వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! సమాజానికో అద్దం ఇచ్చి, క్షణక్షణానికి రంగులు మార్చి, ముందున్నప్పుడు వెనుకకు చూపి, వెనకున్నప్పుడు ముందుకు చూపి, ముందు వెనుకలకు మధ్యన పెట్టి, తడికలు చుట్టి గంతలు కట్టి, నమ్మించేందుకు నటనలు నేర్చిన, మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది! నాది కాని నా తనువుని మోస్తూ.. ముందుకు సాగే, వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! నీది కాని నీ తనువుని చూస్తూ, తడబడి పోతూ, తమకపు కన్నులు చప్పుడు చేస్తూ.. తప్పులుచేస్తూ తిప్పలుపడుతూ.. క్రొద్దిసేపేమో కన్నీరంటావ్, క్రొద్దిసేపేమో పన్నీరంటావ్, కన్నీటిలోన పన్నీరు కలిపి తప్పక ముందుకు సాగిపోతున్న, తప్పుడు బ్రతుకిది! తక్కెడ బ్రతుకిది! బ్రతుకు బండిపై ముందుకు సాగే, వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! మనసుకు నవ్వుల ముసుగు వేసుకొని, బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని, పడుతూ లేస్తూ పల్లికిలిస్తూ... నన్నే చూస్తూ నిన్నే తిడుతూ, నీకూ-నాకూ గొడవలు పెడుతూ, కడుపులు కొడుతూ, కలుపుని తింటూ... తప్పులు చేస్తూ ముందుకు సాగే, వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది! నీది కాని నీ తనువుని మోస్తూ, ముందుకు సాగే... వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! 26/02/2014

by Chythenya Shenkarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evuBcs

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। నాలో నువ్వు ।। -------------------- గుండె గోడలను చీల్చుకుని చొచ్చుకుపోయావు కొంత మాంసం ముద్దకు కొన్ని ఎముకులను అతికించి నువ్వే ఈ దేహాన్ని నిర్మించినట్టు. ఇక నాదంటూ ఏమీ లేదు ప్రతి అణువూ నీ పరిబ్రమణమే ప్రతి కణమూ నీ వశమే. ఉచ్వాస నిశ్వాసలు నీ స్పర్శకు రగులుతూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాయి లిప్తపాటు మరణానికి కొత్త ఆయుష్షు పోసుకుని. హృదయాన్ని కోట్ల శకలాలు చేసి విసిరేస్తున్నావు అవి మంచు పొగుల్లొ పడి ఆరని జ్వాలగా రగులుతున్నాయి. రాలి పడుతున్న రాత్రులు నక్షత్రాల బరువులు మోసుకొచ్చి గుండె బాధను పెంచి పోతున్నాయి. యాతమేసి తోడుతున్నా ఆరని కన్నీటి సముద్రాలు స్రవిస్తూనే వున్నాయి కట్టలు తెంచుకున్న ఉప్పెనలా. ఇది ఆది యో .. అంతమో .. అనంతమో .. ! (26-022014)

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evcNOE

Posted by Katta

Kishore Kumar Kattamuri కవిత

దేముడు దుర్మార్గపు దేవుడు కనే అదృష్టాన్నిచ్చి పేగు బంధమన్నది వాళ్ళకి పేటెంటు చేసాడు నా రక్తం ధారపోయ్యడానికి సిద్దంగా ఉంటె పసి పాపకి తల్లిపాలు శ్రేష్ట మన్నాడు బిడ్డల కోసం దివారాత్రము నేనున్నా తల్లి ప్రేమను మించింది లేదని చెప్పించాడు ఈడు వచ్చిన కూతుర్ని ఎడంగా ఉంచమని ఎదిగొచ్చిన కొడుకుని మిత్రుడిగా చూడమని నాకు ఎక్కడలేని అడ్డంకులూ పెట్టి జీవితాంతము ఆమెను తల్లిగానే ఉంచాడు అచ్చులు హల్లులు అన్ని కలిపి “అమ్మ” చేసి నన్నేమో “నాన్న”అని ఏకాక్షరంతో సరిపెట్టాడు దుర్మార్గుడా ఎందుకిలా చేసావని గద్దించబోతే ఇంత ప్రేమమూర్తిని నీకు భార్యను చేశాగా అంటూ తల్లిప్రేమకు లొంగిపోయానని నవ్వురుకున్నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లికి నమస్కారాలతో కిషోర్ కుమార్

by Kishore Kumar Kattamurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fpMgCC

Posted by Katta

Surya Suryadevara కవిత

మండే సుర్యుడిలా రగులు తున్న హృదయం... ఎగిసిపడె ఉప్పెనలా నీ జ్ఞాపకాల జ్వాలలు... తరుముకొస్తున్న ప్రచండ తుఫాను లా నీ గుర్తులు... కట్టలు తెంచుకున్న ఊద్రృతి లా నీ మీద ప్రేమ... భూకంపనికి కులుతున్న మెడలా నా జివితం... విటీ అన్నిటీ నుండి విముక్తి .. సునామిల ముంచుకువచ్చే నీ ప్రేమ...

by Surya Suryadevarafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OBcEVg

Posted by Katta

Vani Koratamaddi కవిత

మా తండ్రిగారి కవితలని ఆదరిస్తున్న మిత్రులకి దన్యవాదాలు గుప్తంగా వుండిపొయిన నాన్నగారి ప్రతిభను నలుగురికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను రచన. క్రీ.శే.కొరటమద్ది నరసింహయ్య గారు, దీపావళి అమావాస్య నుద్దేశించి వ్రాయ బడింది. అమావాస్య నవ్వింది అమవస నిశిలో లెక్కలేని చుక్కల రాశిలో మృగ్యమైన శశికళ కోసం నా కన్నులు కలియ జూచినై నా ఎదను కలచివేచినై రాని రేనికోసం కలువరాణి పరితపించింది తీయని బాధతో తీరని బాధలతో సొమ్మసిల్లి పోయింది అంతా అంధకారబంధురం మర్మం తెలియని ప్రగాఢతిమిరం కలువల వెతతో నిండిన కజ్జల సంద్రం అంతు తెలియని విధాతృకృత్యం ఈ అందాల శరత్తులో జగత్తును ముంచెత్తిన ఈ తిమిరం ఏమిటి? దీని మర్మం ఏమిటి? ఆలోచన సాగలేదు, అంతుదొరకలేదు, అనుమానం తీర లేదు, అల్లంత దూరాన ఒక దీపకళిక మిణుకు మిణుకు మన్నది ఆకాశాన ఒక మెరుపు తునక తళుకు మన్నది నా ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది ఒక దీపం దీపావళియై ఒక మెరుపు తటిల్లతమై నిశియంతా నిండిపోయినై వెలుగుల పాలవెల్లిలో ఆకశమంతా నిండి వైచినై విరహిణియే కలువ బాల భ్రమసి పోయింది దాని శరజోత్స్న అనుకున్నది రేకు విచ్చి చూచింది నిజం తెలిసి నవ్వింది ఈనవ్వుల వెన్నెలలో అమవసనిశి నిండింది అమావాస్య నవ్వింది విరోధికృత దీపావళి. 26/2/2014.

by Vani Koratamaddifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fppt9X

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి నాలో నేను! ఆ రెండూ ప్రక్కప్రక్కనే పెట్టా ఒకటి ఐశ్వర్యం మరొకటి హృదయం ఐశ్వర్యాన్ని పంచుకున్నారు హృదయాన్ని విరుచుకు తిన్నారు ఇప్పుడు నాకు కన్నీళ్లే లేవు చెప్పుకోవడానికి అక్షరాలు తప్ప! 25FEB2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdDbSf

Posted by Katta

Annavaram Devender కవిత

తొవ్వ ............అన్నవరం దేవేందర్ నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం అవును ఇప్పుడు తెలంగాణా నేలంతా పరిడవిల్లుతంది.సంబురాలు చేసికుంటంది సై సై అని ఎగురుతంది .తల్లి పీరి పట్టుకొని ఆగవట్ట వశం లేని ఎగురుడు ఎగురుతంది .నిజానికి ఇప్పుడేమన్నా విప్లవించిందా,విముక్తి అయ్యిందా ? పటం మీద కొత్త గీతలు పడ్డయి.అయితే దేశం లో ఇదివరకు అమలు అవుతున్న దోపిడీ ఆగుతదా పీడన ఆగుతదా సామ్రాజ్యవాద పెత్తనాలు ఆగుతాయా ..సామ్రాజ్యవాదుల బంటులైన వారి నిలువు దోపిడీ ఆగుతది.వాళ్ళ పీడన ఆగుతది .అదే సంబురం . ఎందుకంటే తెలంగాణా చాలా ఏళ్లుగా పరాయికరణ చెందింది .డెబ్బై ఏళ్ళకు పైగా పోరాటం చేస్తంది .అయితే రాజ్యాంగ బద్దం గా జరిగిన ఇదొక్కటే సక్సెస్ అయ్యింది .విజయాన్ని ముద్దాడింది .నలబయో దశకం ల తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ,అరవయో దశకం ల తెలంగాణా పోరాటం ,ఎనబయో దశకం లో నక్సలైట్ పోరాటం అవన్నీ విజయానికి చేరువ మాత్రమే అయినవి .ఆ పోరాటాల ప్రభావాలు సమాజం మీద పడవచ్చు కాని లక్ష్యం సాదించలేదు .ఈ ఇన్ని పోరాటాల ఫోర్స్ తోనే తొంబై ఆరు నుంచి రెండువేల ఒక్కటి నుంచి తెలంగాణా ఉద్యమం వచ్చింది .ఇది సాదించింది .చాలా ఏళ్ల తరువాత ఈ విజయం అందుకే ఈ ఎగురుడు దునుకుడు . పాత చరిత్ర చర్వితం ఎందుకు కాని తెలంగాణా ,ఆంధ్ర రెండు అసమ సమాజాలు కలయికే కుట్ర ,మోసం తో కూడుకున్నది .ఇంకేముంది మొత్తం తెలంగాణ ను దోచుకున్నారు .అనుమానం లేదు నిజమే నిధులు ,నీళ్ళు కొలువులు అన్నీ ,పాలన చేత పట్టిండ్రు ,సినిమాలు పత్రికలు ,ప్రసార మాధ్యమాలు సకల రంగాల్లో సొచ్చిండ్రు .అయితే రెండు ప్రాంతాల బేధ భావం లేకుండా వుంటే వివక్ష లేకుండా వుంటే అంతా సమానం వుంటుడే.కాని రెండో శ్రేణి గా చూడడం లోనే కొనసాగింది .ఇది అన్ని రంగాలలో రాజకీయం ,పార్టీలు సంగాలు సంస్థలు ,విద్య ,వైద్యం ,చరిత్ర ,సంస్కృతి ఒక్కటేమిటి అన్యాయం జరగని రంగం లేదు . దీంతో తెలంగాణ సమాజం కు మంట పుట్టింది .ఆ మంట పలించించింది. ఒక భాద కాదు ఇది ఇప్పుడు సల సల సలిపే గడ్డ పలిగి చీము అంతా ఎల్లి పోయినంత హాయి అని సేద తీరుతున్నారు వ్యాపరులైన రాజకీయనాయకులు తప్పితే దోపిడీ పీడన ను ఎవరు కాని ఆమోదిస్తారు .పీడన దోపిడీ ఎక్కడున్నా ఈ రూపం లో ఉన్న ఎదిరించుడే .అది రేపటి తెలంగాణా లోను ఉండొచ్చు సీమాన్ద్రలోను ఉన్డొచ్చు . నేల నేలంతా పరిడవిల్లుతున్న కాలం పెయ్యి పులకరించే మట్టి స్పర్శ తెలంగాణం మహా తెలంగానం సకల ఆధిపత్యాల పై పూరి విప్పిన రేశం పీడన పై ఎదురేగిన ఊరేగింపు తెలంగాణ..నవ నవలాడే తెలంగాణ..

by Annavaram Devenderfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cNK0bN

Posted by Katta

Pusyami Sagar కవిత

కట్టా శ్రీనివాస్ || లోపటి ప్రపంచపు మాటలు ||కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ వ్యక్తి స్వభావాన్ని (mentality) అది అంతర్ముఖమైన (introvert) లేదు బహిర్ముఖులు (ఎక్ష్త్రొవెర్త్) విరుద్ధ ప్రవర్తనను, నిత్య జీవితం లో మనిషి తోటి మనిషి తో ఎలా మసలుకుంటారు. వ్యక్తి ని అర్థం చేసుకోకుండా తొందరగా ఒక నిర్ణయానికి రావడం ఇవన్ని కట్ట శ్రీనివాస్ గారి కవిత లో కనిపించే అంశాలు .. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా స్పురణ కు తెచ్చుకోవాలి (hipocrots) మనసు లో ఒకటి వుంచుకొని పైకి మరొకటి మాట్లాడటం ప్రవర్తించటం మనిషిజీవితానికి చెందిన అనేక రంగాల ప్రవర్తనా కోణాలను సున్నితంగా స్పృశిస్తుంది మానసిక శాస్త్రం. మొదటి పరిచయం లో నే వ్యక్తి ని అంచనా వెయ్యకూడదు అంటే నీకు కనిపించేది అంత నిజం కాకపోవచ్చుఇది చూడండి .. //సాధారణ విషయాలకు అతిగా నవ్వేవారిని చూసి, ఎంత బహిర్ముఖులో అనుకుంటాం //ఒంటరి ఆగాధాల లోతులు కనిపించకుండా కప్పేసేందుకు చేసే ప్రయత్నమే./// నిజమే పైకి కనిపించే ధీ నిజం కాకపోవచ్చు, మరి నిజం తెలుసుకోవాలి అంటే ...వారితో స్నేహం నేర్పిన తరువాత నే కదా తెలిసేది ...మనిషి ని అర్థం చేసుకోవడం లో వెనుకనే మే మనం ఎప్పుడు ... మానసికం గా దుఖాన్ని దాచి పెట్టి చాల మంది మన మద్యనే వుంటారు వారు చెప్పే దాక తెలియదు వారి వెనుక ఉన్న విషయము ఏమిటో ..కాని పైకి చిరునవ్వులు చిందిస్తు నలుగురి లో కలివిడి గా తిరుగుతారు కింది పంక్తులలో జాగ్రత్త గా గమనిస్తే ...మనషి పైకి కనిపించని మరో కోణాన్ని చూడాల్సిన అవసరం వుందని అనిపించింది రాత్రి పగలు పడుకునేవాడిని సోమరి బద్దకస్తుడు అనటమే కాని అలా ఉండటానికి గల పరిస్థుతులను ఎవరు అయిన గమించార, మాటలు ను సూటిగా చెప్పేవారిని ఫ్రాంక్ పర్సన్ అంటాము తప్ప, నిజంగా అసలు విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని గ్రహించగలామ నిర్విచారంగా జీవితాన్ని గడిపేస్తున్నారో అనుకుంటామే కానీ,//వారి గుండెల నిండుగా విచారం గూడుకట్టుకున్నదన్న //ముక్కుసూటి మనిషనుకుని మురిసిపోతాం రహస్యాల కవాటాలను విప్పారకుండా దాచేసే ప్రయత్నమనే వాసన....// పిరికితనం, ఏడుపు (crying), dareness (ధైర్యం) మూడు మానసికము గా కలిగే భావోద్వేగాలే. ఒక్క మనిషి లో మాత్రమే చూడగలిగే భావన ఏది అంటే నవ్వు ఏడుపు ...చాల మంది అంటూ వుంటారు మాకు ఏడుపు రాదూ ...మేము మానసికం గా బాగా దృడం గా ఉంటాము అని, కాని నిజంగా గుండె లోతుల్లోకి వెళ్లి చూస్తే ఆకాశం బద్దలయ్యే దుక్ఖాన్ని దాచిపేట్టుకుంటారు ఏడుపే రాదనే వారిని చూసి వారికెంత గుండె నిబ్బరమో! // వారెంత బలహీనులో గుండె తలుపులను తట్టగలవారుంటేనే// ఏడిచే వారినీ లోకం వేరే గా చూస్తున్నదా కాని చాల మంది చిన్న విషయాలకి కన్నీరు పెడతారు బలహీనులని గేలి చేసి సంతోష పడతాము తప్ప వారు నిజంగా ఎంత సున్నితం గా ఆలోచిస్తారో కదా...ఇలాగ ఎప్పుడైనా ఆలోచించామా ?? //చిన్న చిన్న విషయాలకే కంటతడి పెట్టేవారి కన్నీటీ బిందువులు //మొత్తని హృదయ స్పందనేసుమా అని మాట్లాడుతుంది. కోపాన్ని ప్రదర్శించే వారు ఎప్పుడు అభద్రతా భావం తో నో లేదంటే, ప్రేమ రాహిత్యం తో ను కొట్టుమిట్టాడుతూ వుంటారు మీ మీద కోపం చూపిస్తే దూరం వెళ్ళాసిన అవసరం లేదు వారి కళ్ళలో కన్పించే దయనీయ భావాన్ని చదవాలి అంటారు వ్యక్తి అతిగా కోపిస్తున్నారంటే,//అహంకార ప్రదర్శనమో నని అసహ్యించుకోవలసిన పనిలేదు.//భాష్యం కళ్ళ వెనక తడినడిగితే చెబుతుంది. కవిత ముగింపు చాలా హత్తుకుంటుంది తెలిసిన నిజాన్నే మరోసారి గుర్తు చేసారు, మనిషి ని చదవాలంటే ప్రంపంచం లో అన్ని భాషలను ప్రయత్నిచినా "మనసు " భాష తెలుసుకొని మసలు కొంటె బాగుటుంది అంతే కదా.., మనిషి ని అర్థం చేసుకోవాలి అంటే మనసు లోతుల్లో కి వెళ్ళగలగాలి, గుండె లో ని ప్రేమ ని చూడగలగాలి, స్నేహాన్ని అందుకోవాలి అన్నప్పుడు పరిగెట్టటం కాదు ...నిలబడి ఆసాంతం మనిషి ని ఆకళింపు చేసుకుంటేనే సాద్యపడుతుంది నేస్తం !!!!.. మనుషులర్దం కావాలంటే బాహ్య ప్రపంచపు భాషలన్నీ వస్తేనే చాలదు.//మార్మిక లోతులనోసారి తిరిగి తిరిగి రావాలి.//గుండెల లోపలికి కొంచెం ప్రేమను వొంపుకోవాలి,పరిగెడితేనే తీరం చేరలేవు నేస్తం, ===== కట్టా శ్రీనివాస్ || లోపటి ప్రపంచపు మాటలు || మన మెందుకో అవతలి వారిని త్వరగా అపార్ధం చేసుకుంటాం కానీ లోతుల్లోకి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతి సాధారణ విషయాలకు అతిగా నవ్వేవారిని చూసి, ఎంత బహిర్ముఖులో అనుకుంటాం కానీ, ఒంటరి ఆగాధాల లోతులు కనిపించకుండా కప్పేసేందుకు చేసే ప్రయత్నమే అదని గమనించం. పగలూ రాత్రీ తేడా లేకుండా నిద్రాదేవత ఒడిలో ఊయల లూగుతున్నవారిని చూసి ఎంత నిర్విచారంగా జీవితాన్ని గడిపేస్తున్నారో అనుకుంటామే కానీ, వారి గుండెల నిండుగా విచారం గూడుకట్టుకున్నదన్న విషయాన్ని గమనించలేం. తక్కువ మాటలను, ఎక్కువ వేగంతో చెప్పేస్తే ముక్కుసూటి మనిషనుకుని మురిసిపోతాం కానీ, రహస్యాల కవాటాలను విప్పారకుండా దాచేసే ప్రయత్నమనే వాసన పట్టుకోలేం కాక పట్టుకోం. నాకసలు ఏడుపే రాదనే వారిని చూసి వారికెంత గుండె నిబ్బరమో! అని ధైర్యానికి ప్రతిరూపంగా భావిస్తాం. కానీ వారెంత బలహీనులో గుండె తలుపులను తట్టగలవారుంటేనే తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకే కంటతడి పెట్టేవారి కన్నీటీ బిందువులు ఓ సారి కదిలిస్తే అది జిత్తులమారితనం కాదు అమాయతను రంగరించుకున్న మొత్తని హృదయ స్పందనేసుమా అని మాట్లాడుతుంది. ఆటలో అరటిపండ్లలాంటి తొక్కలో విషయాలకో వ్యక్తి అతిగా కోపిస్తున్నారంటే, అది ఆధిపత్య ప్రదర్శనో, మితిమీరిన అహంకార ప్రదర్శనమో నని అసహ్యించుకోవలసిన పనిలేదు. వారు ప్రేమరాహిత్యపు దాహంతో కొట్టుమిట్టాడుతున్నారనే భాష్యం కళ్ళ వెనక తడినడిగితే చెబుతుంది. మనుషులర్దం కావాలంటే బాహ్య ప్రపంచపు భాషలన్నీ వస్తేనే చాలదు. లోపటి లోకాల ఊసులు తెలియాలి, మార్మిక లోతులనోసారి తిరిగి తిరిగి రావాలి. గుండెల లోపలికి కొంచెం ప్రేమను వొంపుకోవాలి, చాపే చేతులతో హృదయాలను అందుకోవాలి. పరిగెడితేనే తీరం చేరలేవు నేస్తం, ఓ సారీ నిలబడి భారం బేరీజు వేయగలగాలి.

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jxIhJv

Posted by Katta

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

Venkata Prabhakar Elaprolu కవిత

నాకు తెలుసు ప్రియా.......... వెన్నెల విరబూస్తున్నప్పుడు మంచు కురుస్తున్నప్పుడు పువ్వు వికశిస్తున్నప్పుడు నీ జ్ఞాపకం నా గుండెను సుతారంగా మీటుతుంది అప్పుడు మొదలైన స్పందన నా గుండె కొలిమిలో ప్రేమ జ్వాలలు రగిలిస్తుంది నీ చూపులు నా హృదయాన్ని నిర్దయగా దోచుకుంటాయి అప్పుడే స్నిగ్ధ దరహాసంతో నా ఎదుట నిలుస్తావు రాత్రి పగలు తేడా లేదు దినం దినం క్షణం క్షణం నీ ఆరాధనలో నా మనసు పవిత్రమవుతుంది నా జీవితాన్ని హారతిగా అందిస్తే సంధ్య వెలుగుల కౌగిలిలో ఒదిగి కర్పూరంలా కరిగి నాలో లీనమవుతావు.... వకరికి ఒకరై మనిద్దరం ప్రేమ సామ్రాజ్యాన్నిఎలేస్తాం.................. ప్రభాకర్...............

by Venkata Prabhakar Elaprolufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fnwZlO

Posted by Katta

Saif Ali Gorey Syed కవిత

ఖమ్మం జిల్లా కు చెందిన కవులకు అద్భుత అవకాశం నా దర్శకత్వం లో లవ్ ఇన్ ఖమ్మం LOVE in KHAMMAM cinema తయారవుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఖమ్మం జిల్లా చరిత్ర మీద రచించిన జానపద శైలి లో పాటలు కావాలి ఈ సినిమాకు బేషరముగా పాటలు రాసే ఆసక్తి ఉన్న కవులు బేషరముగా నన్ను సంప్రదించగలరు director@aimwonders.com www.filmywonders.com

by Saif Ali Gorey Syedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cM2hGd

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy ||పిచ్చాడిలా తిరుగుతునే ఉన్నా గమ్యిం తెలీక నీకోసం || -------------------------------------------------------------------------- మిగిలిపోయిన గాయాల గురించి బెంగలేదు..గుండెలో పగుళ్లిచ్చిన కలల గురించి పశ్చాత్తాపం అయినా ఆదరించే వారేడి ముళ్లను కౌగిలించునున్నా అదే నీ ప్రేమని తెలీక కళ్లు నులుముకున్న ప్రతిసారీ కన్నీళ్ళే వస్తున్నాయి నిప్పులకుంపట్లు బయటకు దూకుతున్నాయి నీజ్ఞాపకాలై తెల్లవారుజాముల్లో ఎన్నెన్ని మరణాలు చీకటితెరల్ని చించుకుంటూ.. నాకు నేను మరనిస్తూ వెలుగుపొరల్ని కౌగిలించుకుంటూ.. నన్ను నేను అసహ్యించుకొంటూ చచ్చుబడిన క్షనాలను నిద్రలేపిన నీ తియ్యటి గుర్తులు.. నన్ను వెక్కిరిస్తున్నాయి అక్షరాలు అలసిపోయేదాకా.. పిచ్చిరాతలు రాస్తూనే ఉన్నా అలుపెరగక గుండెలమీద రెపరెపలాడే జ్ఞాపకాల పేజీలు నేనేంటొ తెల్సి కూడా నన్ను వెతుక్కుంటూ చుట్టూ సూర్యకిరణాల పరిభ్రమణం చేస్తునే ఉన్నాయ్ మైలురాళ్ల వెంట ఆహ్వానతోరణాలు.. నీవనే తియ్యటి జ్ఞాపకాలు తీరం చేరిన ప్రతిసారీ ఎక్కడో నేను ఓడిపోయిన నిజం పరుగెత్తే మోహంలో .. నన్ను కాటేస్తున్న నిజాలు ఏమేం పోగొట్టుకున్నానో గుర్తించలేక. నేనోడిపోయాను రాలిపడుతున్నగతాన్ని ఏరుకుని మళ్లీ ఒంటికి అతికించుకోలేక పిచ్చాడిలా తిరుగుతునే ఉన్నా గమ్యిం తెలీక నీకోసం

by Aduri Inna Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1etqvBR

Posted by Katta

Aruna Naradabhatla కవిత

చిత్రం _______అరుణ నారదభట్ల మనుషులు ఎంత చిత్రమో మససులూఅంతే చిత్రం! ఇంటిముందు కట్టేసిన మేకపోతుకూ ప్రేమగా ఆకులు తినిపిస్తూ పిల్లలగెంతులాట.... అరేయి...మంచినీళ్ళు కావాలా... దాహమేస్తుందేమొరా...నీళ్ళిస్తాను అనే పసి చేష్టల హృదయ స్పందన పశువుల మనసును తేలికగా చదివేస్తుంది! తెచ్చిపెట్టిన పండగ రేపో...మాపో దాని ప్రాణాలను గాలిలో కలిపేందుకే అని ఏం తెలుసు వాళ్ళకు!?! ఒకే ఇంట్లో రెండు రకాల మనుషులు చేస్తున్న పని తప్పో...ఒప్పో గానీ ప్రాణం మాత్రం ఒక్కటే అనిపిస్తుంది! మృదువైన శరీరంతో ఉన్నందుకేమో మనసు...మెదడూ మృదువుగానే లేలేత చిగురులా ఎంత సున్నితం! పిల్లలు జీవం పోస్తుంటే వారిని కన్న పెద్దలు ప్రాణం తీస్తున్నారు చేతి ఐదు వేళ్ళూ ఐదు రకాలు ఒక్కచేతికే ఇన్ని హంగులు... లోకంలో ఇంకెన్ని జీవులో... ఎన్ని మనస్తత్వాలో.. సృష్టించిన దేవుడికి కూడా తెలియదు కావొచ్చు! 25-2-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1etqvBG

Posted by Katta

Swatee Sripada కవిత

ఎప్పటికప్పుడు కొత్త గానే ఉంటుంది నునులేత ఆకు మెరుపు చెక్కిళ్ళలా వడితిరుగుతూ తొంగి చూసే తడి’ నీటితెర చటుక్కున జారిపడే వేసవి తొలి చినుకులా కనుకొలుకుల్లో మొలవడం కొత్తగానే ఉంటుంది ఒక్క ఇదేనా ! ఏమూలను౦డి ఏమూలకు కొలిచినా ఏమనసు లోతుల్లో క్షీర సముద్రాలు చిలికినా ప్రతి మాటా అప్పుడప్పుడే వికసించే చురకత్తి మొగ్గలా కొత్తగానే కదా ఉండేది. నీది కాని ప్రతిదీ నీకు కావాలనే అనిపిస్తుంది. ఆనందాలూ విలాసాలూ హద్దులుగా నాటుకు నీదనుకున్న ప్రతి నేలా బంగారం పండే మాగాణీ కావాలనే అనిపిస్తుంది ఎక్కడికక్కడఏ మూల తవ్వుకున్న నిధులూ నిక్షేపలూ నీకే సొ౦తమవాలని ఉంటుంది. నీళ్ళి౦కి పోతున్న నది ఒడ్డున పడిగాపులు పడుతూ పచ్చని పైరు నాటుకున్నట్టు నిశ్శబ్దాని మరిగించి మిరియాల కాషాయం లా సంవేదన పడిశానికి మందులా కళ్ళుమూసుకు మింగేసినా జ్వరపడిన ప్రతిసారీ పసిపాపై మారాం చేసే మనసు కొత్తగానే కదా. ఎంత పాతబడిన గాయమైనా మళ్ళీ మళ్ళీ ముళ్ళకంప తలపుల్లో కొత్తగా రేగి రేగి పోగొట్టుకున్న అమూల్యాలను కలల్లోనూ వెతుక్కున్నట్టు వెక్కిళ్ళు పెడుతూనే ఉంటుంది. చుట్ట చుట్టుకు పడుకుని ఎన్ని వెలుగులను మింగేసిన కొ౦డచిలువ పడమరో మళ్ళీ తూర్పు వాకిట కొత్త సూర్యుడిని ప్రసవి౦చినట్టు ఎన్ని విషా’దాలో నిరంతరం అస్తమిస్తూ ఉదయానికి ఆశలను ప్రసాదిస్తాయి కడుపు నిండిన క్షణాలు కనురెప్పలపై పవళించి విశ్రమి౦చినా మళ్ళీ ఆకలి కేకలు అలారంలా మళ్ళీ మళ్ళీ మోగి మస్తిష్కంలో సైరన్ లై మేల్కొలుపుతాయి జాతరలో తప్పిపోయిన పాపాయిలా తిరుగుతున్నప్పుడు కొత్తమోహాలని౦డా జాలి మెత్తదనం చూపుల చివరే ఆగి లోలోతుల గాఢత బేరీజుల తరాజుపై రాబందవుతు౦ది ఎప్పటికప్పుడు ఈ సంశయాల బూచిని దాచేస్తూనే ఉంటాను అమాయికపు మొహం తొడుక్కుని ఆషాఢమేఘాన్ని అవుతూనే పోతాను

by Swatee Sripadafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1haJeXT

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! వనిత !! చెరగని చిరునవ్వు మీ సొంతం తరగని సహనం మీ స్వభావం కష్టాలు సుఖాలు చుట్టాలు సూటి పోటి మాటలు మిత్రులు దయ కారుణ్యం మీ కవచకుండలాలు సమ బాధ్యత మీకే అయినా సమ భావం ఎండమావే కదా ఎన్నో వికార స్వభావాలు చూస్తున్న శాంత స్వభావం తప్పని సరి పుట్టిన వెంటనే ఇంటికి మహాలక్ష్మి తెలియని వాళ్ళ ఇంట్లో దౌర్భాగ్య స్తితి ఏమని చెప్పాలి మీ పరిస్తితి తప్పదు ఈ రోజుల్లో మీకు ఈ దుస్తితి వీటి కలబోతే వాటికి సర్వనామమే వనిత !!పార్ధ !!25feb14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Nukhvl

Posted by Katta

Maddali Srinivas కవిత

సోకైన దొరల బండి// శ్రీనివాస్//25/02/2014 --------------------------------------------------------- సై సై జోడెడ్ల బండీ సోకైన దొరలా బండీ వేరుపడే యెద్దు నాది జోడుందామన్న యెద్దు నాది చర్నాకోలా నా "చేతి"లో వుంటే యే యెద్దైనా నా మాటే వింటుంది || సై సై|| వొంటి కొమ్ము విసిరే పోట్ల గిత్తెనైనా రెండు కొమ్ములు విసిరే మకర దున్ననైనా యిట్టే నా దారికి తీసుకొస్తా నేనే రాణీ నని అనిపిస్తా ||సై సై|| తవుడు బాగ తినిపించి నీళ్ళు బాగ తాగించి యెకరాలకు యెకరాలను దున్నిస్తా వోట్ల పంట పండిస్తా నోట్ల పంట పండిస్తా నేనే మహా రాణి లాగ దునియానే యేలేస్తా ||సై సై|| డూ డూ బసవన్న లాగ వూగేటి యెద్దులెన్నొ నా దారికి తీసుకొచ్చి చెవులను మెలిపెట్టేసా యెగస్పార్టి ల పని పట్టేస్తా ||సై సై||

by Maddali Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1esS5PC

Posted by Katta

Kks Kiran కవిత

14వ తారీకున నా ఫ్రెండ్ Mavvsn Reddy ఇంట్లో జరిగిన పెళ్ళికి వెళ్దామని ఆ రోజు ఉదయం 11.30కి తణుకు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కి , సీట్ దొరికాక కూర్చుని బుద్దిమంతుడిలా మొక్కపాటి వారు రాసిన " బారిస్టర్ పార్వతీశం " పుస్తకం చదువుతూ కూర్చున్నాను. నిడదవోలు రైల్వే స్టేషన్లో 40 నిముషాలు ఆపాడు బండిని. అంతవరకూ పుస్తకం చదవడంలో నిమగ్నం అయిపోయిన నేను ' ఇంతసేపు ఆపాడు ఏంటి ఇక్కడ? ' అని తల ఎత్తి చూస్తే నా కుడివైపు ఉన్న సీట్ కు 2 సీట్ల ముందర కూర్చుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ఎంత అందంగా కనపడిందో నా కళ్ళకి? బహుశా ఆ అమ్మాయి బ్రాహ్మణుల అమ్మాయి అనుకుంట. ఆ అమ్మాయి కళ్ళకి కాటుక లేదు,పెదాలకు లిప్ స్టిక్ వేసుకోలేదు,బొట్టుబిళ్ళలు ఏమి ఉపయొగించకుండా చక్కగా కుంకుమబొట్టు పెట్టుకుని ఎరుపు ,ఆకుపచ్చ గల పంజాబి డ్రెస్ లో ఉంది ఆ అమ్మాయి. అమ్మాయిలకి నిజమైన అందం అలంకరణల వల్ల రాదనుకుంట....!!! కాస్తంత మొహమాటం,సిగ్గుపడుతూ మొహంలో ప్రస్ఫుటంగా పలికించే హావభావాలు ,సన్నని చిరునవ్వు ఇవి చాలు అమ్మాయిలకు అందాన్ని ఇనుమడింపచెయ్యడానికి. ఆ అమ్మాయివైపు నేను చూడటం,తను కొంచెం ' నేను గమనిస్తున్నాను ' అనే విషయం గుర్తించి బయటకు ఎటో చూస్తున్నట్లు చూస్తూ మధ్యమధ్యలో నావైపు తిరిగి చూడటం, అది గుర్తించి నేనేదో హఠాత్తుగా ఏదో పని ఉన్నవాడిలా పక్కకి దృష్టి మరల్చడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి చూడటం. ఇలా నా చేస్టలు అన్నీ ఆ అమ్మాయికి " నాకు నీమీద బోల్డంత ఆసక్తి ఉంది సుమా !!! " అన్నట్లు తోచాయి కాబోలు , ఏ అమ్మాయికైనా ' తన అందం ఇంకొక అబ్బాయి గుర్తించి తన మెప్పుకోసమే ఆరాటపడుతున్నాడని అనిపిస్తే కించిత్ గర్వం కలుగుతుంది అనుకుంట... అలాగే తను నేను చూస్తున్నననే విషయం చూసి కొంచం గర్వంగా తన పెదాలను బిగపట్టి పొంగి బయటకు రాబోతున్న నవ్వుని ఆపే ప్రయత్నం చేసింది,కాని కొంత ఆ ప్రయత్నంలో విఫలమైంది . నోటికి అడ్డంగా తన చేతి వేళ్ళు అడ్డంపెట్టి నవ్వే ఆ నవ్వుని చూస్తే నాకు " వేళ్ళు మధ్య వెలుతురులా అంత అందంగా ఎలా నవ్వు వస్తోంది ఈ అమ్మాయికి ?"అని అనిపించింది. ' నేను చేసే చేష్టలు ఆ అమ్మాయి గుర్తించి అలా ప్రవర్తిస్తోంది ' అనే భావం అబ్బాయికి కలిగితే ఇంకా సంబరపడిపోతాడు అబ్బాయి. కాని నేను ఇలా కుదర్దని కాసేపు నా మొబైల్లో పాటలు వింటూ కూర్చున్నాను.తను ఆ చర్యతో నొచ్చుకుందేమో...!! తనుకూడా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ తన ఎడమచేతిని పద్మంలా ముడిచి ఆ చేతివేళ్లను పైకి దగ్గరగా చేసి ఆ వేళ్ళను చుస్తూ ఏదో గొప్ప నాటకంలో కళాకారిణిగా అభినయించింది. మాటిమాటికి నుదిటిపై ముందుకు పడే తన ముంగురులను సరిచేసుకుంటూ వికసిస్తున్న పువ్వులా అందంగా నవ్వే అమ్మాయిని చూస్త్తూ ఉంటే దేవకన్యలకి కూడా ఇంత అందం ఉంటుందా అని అనిపించింది. ఏ బుద్ధిలేనివాడు చెప్పాడు దేవకన్యలు కేవలం స్వర్గంలోనే ఉంటారని? ఈ అమ్మాయిని వాడేవడో చూస్తే ఖచ్చితంగా ఆ అభిప్రాయం మార్చేసుకుంటాడు అని అనిపించింది. ఎందుకో అమ్మాయిని చూస్తే ఎందుకో " శ్రీహర్ష నైషదం " లోని దమయంతి మళ్ళీ ఈ అమ్మాయి రూపంలో భూమి మీదకి అవతరించేసిందా అని అనుమానం కలిగింది. అలా ఆ దేవకన్యను ఆరాధనాపూర్వకంగా నేను చూస్తూ ఉంటే , ఎక్కడనుంచి వచ్చారో 4గురు మనుష్యులు మామధ్య అడ్డంగా నుల్చున్నారు యమదూతల్లా , అయినా ఆ అమ్మాయిని చూద్దాం అని నేను ప్రయత్నిస్తుంటే కదలరే ఆ కర్కసులు? అయినా దొరికినకొద్దీ వాళ్ళు కదులుతున్నప్పుడు ఏర్పడే ఖాళీ జాగాలోంచి తనని నేను చూసే ప్రయత్నం చెయ్యడం,నా చూపుకోసం ఆ అమ్మాయి చూసే ఎదురుచూపులు ఇలా ఇలా కొంతసేపు అలా ఆ ప్రహసనం జరిగింది. నా కుడిప్రక్క కూర్చున్న కొంతమంది వృద్దులు నేను పడే ఆరాటాన్ని గమనిస్తూ ఉన్నారు. నేను ఓ అక్కర్లేని చిరునవ్వు వాళ్ల మొహానపడేసి ఆ అమ్మాయిని చూడటం ఎలా అనే ప్రయత్నాలలో నిమగ్నం అయి ఉన్నాను. మొత్తానికి ఈ యమదూతలు ఏదో పని ఉందని కదిలారు అక్కడనుంచి,మళ్ళీ మా చూపులు కల్సుకున్నాయి. నా ఎడమపక్క వికృతంగా చీరకట్టుకుని ఉండి,తన బిడ్ద కిటికిలోంచి బయటకు చూస్తూ ఆశ్చర్యంతో అడిగే ప్రశ్నలకు విసుగ్గా మొహంపెట్టి ,ఆ పిల్లలో ఉన్న ఆసక్తిని అంతా చంపెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఆ బిడ్దతల్లిని చూసి నాకసలు కోపమే రాలేదు అప్పుడు. పక్కనే ఉన్న తన కుటుంబంతో మాట్లాడడం మానేసి ఎదుటి ప్రయాణికులతో లోకాభిరామాయణం,ఈ దేశం బాగుపడాలంటే పాటించాల్సిన సూత్రాలు చెప్తున్న ఆ బిడ్డ తండ్రిని చూసి నాకసలు విసుగే అనిపించలేదు ఆ క్షణాన. అప్పటికే మా మధ్య మౌనసంభాషన జరుగుతోంది కంటిచూపుల ద్వారా,ఆ సమయంలో ప్రపంచంలో ఏ ఏ విషయాలు జరిగితే నాకేం? గోదావరి బ్రిడ్జ్ పైనుంచి మేం వెళ్తున్న రైలు కూలిపోయి నీళ్లలో పడినా ఆ అమ్మాయిని కాపాడడానికి నేనెలానో ఉన్నాను కదా??? ఇంకెందుకు వేరే అర్దంలేని భయాలు,విషయాలు? అని అనిపించింది నాకు. అంత కాపాడేద్దాం ధైర్యవంతుడిలా అని అనుకున్న నేను సాహసం చేసి ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. కాని ఆ అమ్మాయి నాకోసమో అన్నట్లో లేక తన సహజమైన ప్రవర్తనే అదో తెలియదుకానీ " మాటలద్వారా కాకుండా హావభావాలు ప్రదర్శించడం ,అది కూడ ముఖ్యంగా తమ మొహంలో కనపడేట్టట్లు ప్రదర్శిస్తూ ఉంటే స్త్రీలు ఇంత అందంగా ఉంటారా ?" అని నేను ఆశ్చర్యపోయేలా రకరకాల హావాభావాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది. అంటే గడ్డం క్రింద కుడిచేతిని ఆనుంచుకుని బయటకు చూస్తూ,వివిధ రకాల మనుషుల ప్రవర్తనని చూస్తూ ఆశ్చర్యపడుతూ అలా కూర్చుని ఉంది. ఆ అమ్మాయి గడ్డం కింద నొక్కు ఎంత అందంగా ఉందో తెలుసా? ఆ అమ్మాయి గడ్డం కింద నొక్కుకి బహుశా ఈ చిన్ని సంఘటన కారణం అయి ఉండవచ్చు. " బ్రహ్మదేవుడు ఈ అమ్మాయిని సృష్టిస్తున్నప్పుడు తాను తయారు చేసిన ఈ అందానికి తానే ముచ్చటపడి,ఆ బొమ్మని తన ఎదురుగా తేరిపారా చూడటానికి వీలుగా తన కుడిచేతి మధ్యవేలుతో పట్టుకుని చూసి ఉంటాడు ఆ గడ్డం కింద, దానితో ఆయన వేలు నొక్కుపడి అంత అందంగా ఏర్పడి ఉంటుంది ఆ అమ్మాయి గడ్డంకింద నొక్కు. " అంతటి సౌందర్యాన్ని నేను తన్మయత్వంతో ఆస్వాదిస్తూ ఉంటే ఇంతలో నేను దిగాల్సిన " అనపర్తి " రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చింది, ఎప్పుడూ భగవంతుడిని అంతలా ప్రార్దించని నేను , ఈసారి చాలా తీవ్రంగా వేడుకున్నాను ' ఎలాగైనా అమ్మాయి దిగల్సిన స్టేషన్ కూడా అనపర్తే చెయ్యి, నేను వెళ్ళాల్సిన పెళ్ళికే తనని కూడా వచ్చేట్టు చూడు ' అని. కాని ఈ విశ్వంలో ఈ దేవుడు అంత నిర్దయుడు ఇంకెవరూ ఉండరనుకుంట . ఆ అమ్మాయి దిగాల్సిన స్టేషన్ అనపర్తి కాకుండా చేశాడు, పోనీ కొంచెం ఆలస్యం అయినా పర్లేదు పెళ్ళికి వెళ్ళడానికి.ఈ అమ్మాయి దిగే స్టేషన్ వరకూ వెళ్దామని అనిపించింది,కానీ ఆ రోజు తెలంగాణ విభజనకి వ్యతిరేకంగా జరుపుతున్న బంద్ గుర్తొచ్చింది. వాహనాలు ఏమీ తిరగట్లేదు,వెంట వెళ్ళినా తిరిగి రావడం ఎంతో వ్యయప్రయాస అవుతుందనిపించి మొట్టమొదటిసారి ఈ వ్యవస్థ,అందులోని నాయకులపై విసుగేసింది , కాని ఏమీ చెయ్యలేని నిస్సాహయత నడుమ మొత్తానికి రైలు దిగుదామని అనిపించి దిగాను, చెప్పుకోవద్దూ...!!! దిగాలంటే ఎంతో దిగులేసింది,కాని ఏం చెయ్యలేని స్థితి, అలా రైలు దిగి ఆ రైలు వెళ్లేంత వరకు నిశ్చేస్టుడినై నిలుస్తూ ఉన్నాను అంతే, ఆ రైలు ఎంతో నిర్దయగా కూతపెట్టి గమ్మున్న వెల్లిపోయింది,తనతో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయింది. - Kks Kiran

by Kks Kiranfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cL1HbR

Posted by Katta