పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: హృదయాంజలి: కుక్కపిల్ల,అగ్గిపుల్ల,సబ్బుబిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్టి శ్రీశ్రీ పలుకులు నీ కవితా కుసుమాల్ని గాంచిన మరొకమారు స్ఫురించాయి హృదయాన్ని ఆనంద సాగరంలో ఓలలాడించాయి.. నేస్తమా! నీ ప్రయత్నాన్ని ఏమని మెచ్చను..? నీ స్పందనను ఏమని అర్థం చేసుకోను..? నీ హృదయగీతిని ఏమని కీర్తించను..? నీ బాధను ఎలా పంచుకోను..? నీ వ్యధను ఎలా తృంచను..? నీ ప్రయత్నాన్ని మెచ్చుకునే విద్వాంసున్ని కాకున్నా.. నీ స్పందనను అర్థం చేసుకుని ప్రతిస్పందించే స్థాయి లేకున్నా.. నీ హృదయగీతిని ఆలపించే తంత్రిని నేను కాకున్నా.. నీ బాధను పంచుకునే అవకాశం లేకున్నా.. నీ వ్యధలను తృంచే శక్తి సామర్ధ్యాలు లేకున్నా.. నీలో కలిగిన చైతన్యానికి ఆ చైతన్యానికి నిలువుటద్దములా ప్రదర్శించిన నీ కవితా కుసుమాలకు ఏం ఇవ్వగలను బదులుగా.....? ...................................................... "క్షోణీ తలమ్మున నుదురు సోకగ మ్రొక్కి నుతింతున్ ప్రాణ మితృండనై"....!!!!! 10/02/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1obseDT

Posted by Katta

Vijaykumar Amancha కవిత

//గెలుపు // ఓ నింగీసూర్యుడు నీ గెలుపు నిండు చీకటీపైనేనా కరీగీనా ముత్యము నీ గెలుపు పాలపుంతపైనే..నా గెలుపు ఓటములు నీ గెలుపు అధీపత్యంపైనా ప్రకృతివనరులు నీ గెలుపు పచ్చదనంపైనే నా సెలహెటికీఇ నీ గెలుపు ప్రవహించే యెరుపైనే నా వర్షీంచే వర్ణుడీకీ నీ గెలుపు మెరుసేటి ఉరుములాపైనే ..నా . ********************* //అమంచ విజయ్ కుమార్ //

by Vijaykumar Amanchafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h4ruzH

Posted by Katta

Parameshwary Pulipati కవితby Parameshwary Pulipatifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NuaxBO

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | మరణమృదంగం | వందేమాతర గీతం వరస మారుతున్నది , హిందువే మన తరం గా రూపుదిద్దుతున్నది ముచ్చటయిన మూడు రంగుల దేశం ఆఫిషియల్ కాషాయంలో మునిగి తేలనున్నది . గొర్రె మనస్తత్వం కి తోడేలు కాపలా కలల బేహారుల ఆటలో కార్పోరేట్ కధల వేటలో చివరాఖరు వేటుకి బలి నీతల పారి పోయే దారిలేదు మతం ముళ్ళకంచె అడ్డంగా కోస్తుంది ముందుకెళ్ళే బాట లేదు పులి వేషపు నక్క పీక్కు తింటుంది ఇంకెందుకు రామ డ్రామా రంగులలో నీదయిన భీరువు మొహంని కప్పుకొని కట్టేయ్యి మంచితనపు నటన నింపెయ్యి మనసు భాండం లో కులం విషం చుక్క కక్కెయ్యి నిలువెత్తి సర్ప కీలల మాటలు ఇంకోక్కసారి కరసేవల కసాయితనం లో ఇటుక ఇటుక తో “భాయి “లందరికి ఘోరీ లు పేర్చే మారణ హోమం లో వేసెయ్యి నీదంటూ ఓ సమిధ పసి నవ్వుల సమాధుల పై సాగించే జైత్ర యాత్ర లో నలుగురు నడిచే నడమంత్రపు నైమిశ్యం కొంచం పులుముకొని కోసెయ్యి " హే అల్లా "ఆర్తనాదాల కుత్తిక ని మోబ్(Mob) బలాల వెనక దాగి మ్రోగించు నీదయిన మరణ మృదంగం వహ్ రే వహ్ నయా జమానా మనువు మనవడా మనుష్యుల రక్తం తో మానవత్వానికి కుంకుమ బొట్టు అద్దుకొని నిషిద్ధ గోడుగుల్లో దూర్చిన మగతనం ని "ఫక్ " మంత్రాల్లో నింపుకొని న "పుంసత్వాన్ని " మనసులో దాచుకొని మరొక్కసారి జై బోలో నమో( డి ) కి నిశీ !! 10-2-14.

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWpwn7

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-23 నన్ను వెంటాడే ఒక ఆలయ స్మృతి ఎప్పటికప్పుడు ఓ రహస్య సంకేతం పంపుతున్నట్టుగా అనిపిస్తున్నది... యక్షిణులతో,భూత పరివారాలతో సర్పాలతో,రకరకాల శిల్ప అలంకారాలతో ఎర్రని ఇసుకరాతి శరీరంతో అలరారే ఆ గర్భాలయంలోనికి అడుగుపెట్టగానే ఎవరో చాచి ముఖం మీద కొట్టినట్టు అక్కడ ఎలాంటి దేవుని విగ్రహమూ లేదు...శబ్దమూ..లేదు...ప్రాణి లేదు... ప్రాణం లేని ఆ అందమైన శవం నాకిచ్చిన సందేశం ఒకటే.. నువ్వే ఆలయం...నువ్వే దేవుడివి నీ ప్రయాణం ముగిసినప్పుడు నీ లోపల ఇంకేమీ మిగలదు ..! -------------------------------------------- 10-2-2014 (భువనేశ్వర్ లోని రాజారాణి ఆలయాన్ని సందర్శించిన తరవాత రాసినది)

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lpyUMz

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

మందార దామం ------------------ రావెలపురుషోత్తమరావు ******************************* ఆమె కనులను కాదు కళ్ళవెంట దాచుకున్న విషాద సాగరాలను చూడు ప్రపంచపు నయవంచన ఇట్టే పసిగట్టే వీలు దొరుకుతుంది. ఎత్తయిన ఉరః కుహరాలను కాదు అవి నీకిచ్చి పెంచిన ఆమె గుండె లోతుల వెనుక దాగి మిగిలిపోయి గూడు కట్టుకు ఘనీభవించిన బాధను గమనించే వీలు కలుగుతుంది. కాల యవనిక ఆమె పై గీసిన ఉదయాస్తమానాల ఉప్పెనల చిత్రం సాక్షాత్కరిస్తుంది. ఆమె వయసు ముఖం పై గీసిన ముసలి రేఖలను కాదు నీవు చూడాల్సింది ఆ ముడుతలవెనుక దాగిన ఆమే కష్టపు కాల ఘడియలను ఊహించు. గతకాలంలోని భారంగా బ్రదుకునీడ్చిన ఆమె శ్రమైక జీవన సౌందర్యపు చెమట వాసన దృగ్గోచరమై నిలుస్తుంది బ్రతుకునిచ్చిన అమ్మను బొమ్మగాకాదు నిన్ను శిల్పసుందరంగాచెక్కిన ఆమే కళాకొశలాన్ని గణించు. జన్మ జన్మల పర్యంతం ఆమెకునీవెంత రుణపడి వున్నావో జమా ఖర్చుల జాతకం బయట పడుతుంది ఆమె అంతరాంతరలంతటా అనురాగమే హిమాలయమై గోచరిస్తుంది. అంతు అడ్డులుగనరాని నదిలా ఆమె కదిలొస్తుందిరా . జాగ్రదావస్థ నందయినా ఆమె పాడిన జోల పాట వీనుల విందుగా నిన్ను ప్రేమ భావనతో అభిషేకిస్తుంది. తన స్వహస్తాలతో నీవు ఆమెను అభిషేకించాలన్న తపన కంఠ దఘ్నమై ఊప్పొంగుతుంది ఎటునుంచి ఎటు చదివినా ఒకేఒక పదమై భాషిస్తుంది.

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1npxjp5

Posted by Katta

Sita Ram కవిత

నీనవ్వులోనున్న కిలకిల రాగం రేపింది నాలో తాపం నీమౌన గానాలలోనున్న వలపుల రాగం కోరింది నా పంచప్రాణం నువ్వే రాక జాడే లేక మదిలో రేగెను కరహరప్రియ రాగం 10-feb-2014

by Sita Ramfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpYYZR

Posted by Katta

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || అఘాయిత్యం|| కొసరి తినిపించిన అమ్మను విడిచి బుజాలపై మోసిన నాన్నను మరిచి ఏంటి తమ్ముడూ ఈ అఘాయిత్యం? చదువులో తడబడితే మళ్ళీ నిలబడలేవా ప్రియురాలు కాదంటే ఇహ ప్రేమే దొరకదంటావా! అర్ధాంతరంగా తనువుచాలిస్తే కష్టం కరిగిపోతుందా? తాళంకప్పతోటే చెవికూడా తయారవుతుందిగా ప్రతిసమస్యకీ పరిష్కారంకూడా తప్పకుంటుందిగా విరక్తి చీకటి కమ్మినా అభిమతపు వేకువ రాకుండదుగా! సృష్టిలోని జీవులన్నిటిలో తెలివైన మానవుడివే నవ్వగలిగే వరాన్ని నువ్వొక్కడివే పొందినోడివే ఆలోచించగలిగే ఐశ్వర్యం కలిగినోడివే కదామరి! సమస్యలన్నిటికీ చావే పరిష్కారమై ఉండివుంటే మానవజాతెప్పుడో తన మనుగడ కోల్పోయుండేదిగా! నమ్ముకున్నాళ్ళ నెప్పుడూ నట్టేటముంచకు..తమ్ముడూ.. >--బాణం--> 10FEB14 (క్షణికావేశంలో, వత్తిడిలో జీవితాల్ని త్యజిస్తున్న యువతకి నా ఆత్మీయ విన్నపం ...)

by Prasad Atlurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dc2KCl

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఎందుకమ్మా విధీ . . ! నీ మతి లేని చేతలతో ఈ మదిని వెతల పాల్జేస్తావు . . ఒక్క క్షణం లేత గుండెలో ఆశలేవో చిగిర్చి . . మరుక్షణమే బడబానలాన్ని రగిల్చి. . అంతులేని విషాదాన్ని మిగిల్చి . . ! వయసు మొక్కకు పూచిన పూలు కోసుకునే లోపే రాలి పోయాయి . . రాలిన పూలను ఏరుకొని మాల కడుతున్నంతలోనే వాడి పోయాయి . . వాడిన పూలను వికసింప చేయడం ఏ వసంతానికి సాధ్యం . . ? నిర్మలారాణి తోట [ తేది: 10.02. 2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bj3C9s

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

కమ్ముకున్న కీడు... ఈ కాంక్రీటు జంగిల్ లో నోట్ల కట్టల వెదురు పొదలమాటున ఎన్ని గుడిసె లేడిపిల్లల్ని అరవంగ మింగేశాయో కదా!? వాటి పిల్లర్ల వెన్నుపూసల బలుపు చూడు కూలి డబ్బులు ఎరవేసి ఎన్ని పల్లె చెమటచుక్కలతో స్నానమాడాయో కదా!? మెరిసే వాటి రంగుల కుబుసాల సింగారం చూడు . ఎందరి కార్మికుల కలల నేత్రాలను తీగల పక్కటెముకలతో చుట్టి మెలిపెట్టాయో కదా!? మిట్టమధ్యాహ్న సూర్యుల్లా వెలిగే వాటి కరంటు కళ్ళు చూడు. ఎందరి అమాయక కూలీల దాచిన కలల్ని సిమెంటు నాలుకతో జుర్రుకున్నయో కదా!? గుభాళించే వాటి ద్వారతోరణాల నోళ్ళు చూడు. ఎన్నివేల అడుగుల మన్ను నీళ్ళను గుటకేశాయో కదా!? వెన్ను విరుచుకొని నిలబడి మిన్నుచూస్తూ ... బడుగుజీవుల ప్రాణవాయువునూ స్వాహాచేస్తున్న బహుళ అంతస్తుల భీకర భవనపు అనకొండల్ని చూడు . రేపటి ప్రభాత కిరణాలకూ కమ్ముకున్న కీడు చూడు. తేది;10.2.14.

by Kanneganti Venkatiahfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvBItr

Posted by Katta

Lingareddy Kasula కవిత

అందని స్తన్యమై గోదావరి సాకి: తెలంగాణ ముద్దుబిడ్డల జీవధార గోదావరి కష్టాల కడగండ్లదేలె పేదరైతుల చూసి గుండె చెరువవ్వ తల్లడిల్లె తల్లి గోదావరి పల్లవి: ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను కన్నీటి కాలువై గోదావరి వలపోతలను చూసి గోదావరి వలస కలబోతలొద్దంది గోదావరి చరణం1: కాలాలు మారినై- రాజ్యాలు కూలినై కడలి కౌగిలినెవరు విడిపించరైరి కండ్ల కారంకొట్టి కవ్వింతురైరి కష్టజీవుల చేర దారిడువరైరి ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి-తాను నెత్తుటి గాయమై గోదావరి చరణం2: ఎరుకకైనారాదు ఎల్లంపల్లిగోడు తలువనైనాలేరు ఇచ్ఛంపల్లి నేడు ఏండ్లు గడిసిపాయె ఎవుసమెండిపాయె దూపగొన్న బిడ్డల దేహమవిసిపోయె ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను ఒంటరి దుఃఖమై గోదావరి చరణం3: విడిదిచేసే చోట విసిరిసిరి కొట్టారు నడిసొచ్చె దారుల్ల నిలదీసి తరిమారు కువ్వారం పట్టిండ్రు కుట్రలూ చేసిండ్రు తల్లిబిడ్డలవాపి తంద్లాటజూస్తుండ్రు ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను అందనీ స్తన్యమై గోదావరి చరణం4: పంట సెలుకలల్ల పర్రెలూ వాసాయి ఏడ్చి అలసిన పల్లె కంట నీరెండాయి తకరారులన్నీ తవ్వి తీస్తున్నాయి తల్లి గోదావరి చెరవిడువ కదిలాయి పోటెత్తి లేచింది గోదావరి- తాను పోరాటగీతమై గోదావరి ఉగ్రమై ఉరిమింది గోదావరి- తాను ఎత్తిన పిడికిలై గోదావరి 16 నవంబర్‌ 2012 'నమస్తే తెలంగాణ' దినపత్రిక 'చెలిమె'

by Lingareddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bNk5Aq

Posted by Katta

Abd Wahed కవిత

అద్దం అద్దం తెర కాస్త తప్పించి ప్రతిబింబంతో మాట్లాడాలి కంటి పొరల వెనుక ఎన్ని సముద్రాలున్నాయో అడగాలి ప్రాణం వదులుతున్ననిశ్వాస లెక్కలడుగుతుంది తప్పొప్పుల మూటలు మోసుకుపోతోంది... కునికిపాట్లు పడుతున్న మధ్యాహ్నపు వీధిలా నినాదాల గోడ మూగబోయింది... చిరుగాలి ఊహల స్పర్శకు చిగురాకులా తలఊపాలా? వాస్తవాల పెనుగాలికి ఎండుటాకులా వణికిపోవాలా? దోసిట్లో కొత్తజాబిలి పాలనది నుంచి జారిపడింది కంటి నుంచి రాలుతున్న క్షణాల్లో కరిగిపోయింది... ఎగిరిపోతున్న కలరెక్కల్లో చిక్కుకున్న చూపులు చివరికి నేలపడక తప్పదు... కందకం లాంటి అద్దంలో ప్రతిబింబాలు పడి ఉన్నాయి జ్ఙాపకాలపై జారిపడి... నడుం విరిగి... అద్దం కిటికీగా మారితే తొంగి చూసే ముఖాలు ఎన్నుంటాయో... అల్లుకునే హాయి కూడా బందీఖానాయే ...

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lV52Lv

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి వాన అదొక బీడువారిన జీవితం నెరలు పోయిన హృదయం నేల గాయాలు పాలై మౌనంగా రోధిస్తోంది ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఇంకిపోయి ఎండిపోయిన కళ్ళల్లోకి తనలో మిగిలిన కొన్ని కన్నీటిబొట్లని రాల్చింది ఆకాశం చిరుజల్లులా దాహంతో ఆవిరైపోతున్న ఆ జీవితాల గొంతు తడుపుకోవడానికే ఆ చుక్కలు చాలవు ఇక జీవితాలేం తడుస్తాయ్ ఆకాశం దీనంగా చూస్తోంది ఇక నేలతల్లికి తల పైకెత్తి చూడడానికి కూడా ఓపిక లేదు అసలు వాన ఎందుకు కురవదు ఆ వానని ఏ రాక్షసి మింగేస్తోంది? మళ్ళీ అదే వాన రాక్షసిలా మీద పడి బ్రతుకుల్ని మింగేస్తుంది ఇదేం చోద్యమో! 08FEB2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1egImeD

Posted by Katta

Kavi Yakoob కవిత

ఓ నాలుగు రోజులనుండి తీరిక దొరికినప్పుడల్లా Shivaramakrishna Pennaగజళ్ళ పుస్తకాలు 'సల్లాపం', 'శిశిరవల్లకి' చదువుతూ గడిపాను. గజల్ గురించిన ఆయన అవగాహనను 'తనమాట'గా ఎంతో విలువైన సమాచారంతో పొందుపరిచారు. ఉపయోగకరమైన వ్యాసాలు అవి. ఇక గజళ్ళ విషయానికి వస్తే ,ఒకదానికి మించి మరొకటి. తెలుగులో ఇలా గజల్ రాయగలిగినవాళ్లు అతి కొద్దిమందే ఉన్నారు. ఎన్నుకునే వస్తువులు, అభివ్యక్తి, అద్భుతమైన పదబంధాలు,పోలికలు,-వావ్...జస్ట్ సూపర్బ్ !

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LOPA2I

Posted by Katta

Kavi Yakoob కవిత

జనవరి 25న జరిగిన ~ కవిసంగమం : కవిత్వసందర్భం ~ సల్మ, మమత సాగర్ ,రతి సక్సేనా ల కార్యక్రమం 10 Tv లో ఆదివారం [10.1.2014].నాడు ప్రసారమైంది.

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMzPoB

Posted by Katta

Kishan Mayu కవిత

ప్రేమకి..10.02.2014 ఇ రోజు ఉండి రేపు పోయే ప్రాణానికి నీవు కట్టే విలువ ఏంత..? నేను నీపై పెంచుకున్న స్నేహానికి నీవు కట్టే విలువ ఏంత..? మరిచినవా నువు మరిచినవా నాతో చేసిన స్నేహం..! ఒకసారయిన గురుతుకు రాధా కలలోనైనా నా స్నేహం..!

by Kishan Mayufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eg2EVB

Posted by Katta

Krishna Mani కవిత

మది తీరం ******* నా మది తీరాన నీకై ఎదురుచూపులు ఎన్నాళ్ళనుండో పడిగాపులు ! ఎందరో ముద్దుగుమ్మలు వచ్చారు నీకై దాచిన చోటును దోయదలచి ! ఇత్తునా అంతటి అవకాశం నా అలల పొంగుతో ఉప్పెనలు చుపా త్సునామి అని భయపడి దరిదాపుకు రాలేరు ! నా తీరం నీదని రాసాను యదపై నీకై పరిచా కొబ్బరి తోటని నీకై పేర్చ ఒడ్డున రాళ్ళని నీకై ఉంచా మెత్తని ఇసుకని నీకై దాచా అలల సవ్వడిని నీకై ఒంపా ప్రేమ తెప్పల్ని నీకై పంపా గాలి ఖబురుని నువ్వొస్తావని ప్రతిదినం ఆలోచన రవి లేచిన గడియన మొదలు రవి మునిగే కాలం వరకు ! రాణివై ఏలా రావే సొగసరి పువ్వుల పానుపే దినసరి తొలకరి మత్తున గడసరి ! కృష్ణ మణి I 10-02-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kuCEyq

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||పగుళ్ళు లేని చీలిక || వాని చెవిలో విరుగుడు మంత్రం ఊదారు వాడప్పుడే వాగడం మానేయడు ............ తెరవెనుక ప్రాంప్టింగ్ను అరువు గొంతుగా మార్చుకొని మహా నటుడయ్యాడు ఇంకొకడు .... కలువలు చంద్రుణ్ణి వికసింపచేస్తాయని కలలు కంటున్నాడు .....విచిత్రంగా మరొకడు ఏంజరిగినా ...ఎవడో ఒకడి మీద ఒరగదోయచ్చని పగలయునా రేయయునా పొరపాటులేదోయ్ నిషాలో తేడా అసలు రానేరాదోయ్ అంటూ ఒకడు మామిత్రుడు చెప్పిన కవిత ..నిజమేనేమో .. గొడుగుకూ పుల్ల లుంటాయు ........... అవసరమయునప్పుడు తెరుచుకొంటాయు ... లేకుంటే ముడుచు కొంటాయు ... కుర్చీకి కట్టేసుకొన్న రాజకీయ ఆత్మల స్వరాలాపనలు జాతి జనుల నరాలను తెంపేస్తున్నాయు ....... ఇక ఎప్పుడో అప్పుడు తప్పదని తెలిసినా పగుళ్ళు లేని చీలిక అసాధ్యం చేస్తున్నాయు

by Kranthi Srinivasa Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMfzDl

Posted by Katta

Ramesh Bandi కవిత

ఓడిన నేస్తమా గెలిచే తపనున్నదా నీకు? నిలబడి నడవడిక సాగించే సత్తువున్నదా నీకు? అరణ్యమని ఎదురిడి అడుగిడడం మానేస్తావా? ముల్లని మృగాలని సాకేదో చెప్పి తప్పుకుంటావా? నీ దారి వేయలేవా? నడి వీధిన నడుస్తూ నీడ చూసి బెదిరేవు ఇంటికి, ఇల్లాలికి, బంధానికి బతకడానికి భయపడి భయపడి కనుమరుగై ఆత్మగా తిరిగే పిరికివాడా గెలిచావా ఏనాడైనా? గెలుస్తావా ఇకనైనా? || ఓడిన || అడుగుతో పాటు అక్షరం నేర్చి, పరిణితి పెంచి కాలగంగలో పయనిస్తూ కనుచూపు మరిచావు అంధుడై తిరిగావు ఓ రాతి దూలమైనావు కారణమేదైనా మారాలి ఇకనైనా గెలిచావా ఏనాడైనా? గెలుస్తావా ఇకనైనా? ||ఓడిన ||

by Ramesh Bandifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMfAHw

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

మన ప్రేమ అన్ లిమిటెడ్_నీ సెల్లో టాక్ టైములా ..@శర్మ \10.2.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmQrEW

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || నా మది ఎప్పుడో చీకటి మాటున దాచేశావు || ----------------------------------------------------------------------- మన ఇరువురి మది మధ్యన సాగిన ఈ పోరాటంలో అలిసిపోయాను, నా మది ఎప్పుడో చీకటి మాటున దాచేశావు మన కలయికనే ఓ కలగాతేల్చేశావు ఎటుపోవాలో తెలియక నన్ను నేను నా మనసుకు ఓదార్పు సమకూరుస్తున్నాను నా కన్నీళ్ళూ నీకోసం వూగిసలాడుతున్నాయి కంటినుండి జారే ఒక్కో చుక్క నీకోసం వెతుకుతూ, మెల్లగా నా కనుపాప నుండి జారుతోంది చూడు, అందులో ఏ ఒక్క నీటి బొట్టు నీ మనసును తాకలేదా, నిజమైన ప్రేమకు అర్థం ఇది కాదేమో ఒకసారి నీ మనసును అడుగు నాకోసం అంతమందిలో నీకు నేనెలా గుర్తుంటాను చెప్పు నీవు గుర్తుపెట్టుకునేంత గొప్ప స్నేహం కాదని తేల్చావుగా.. గాలిలో తేలియాడే నీడిబుడగల్లా జీవితాన్ని ఏమార్చావు నీకు ఏదైనా సాద్యమే ... అందమైన నటివి ఎలా గైనా నటించగలవు మెప్పించగలవు నువ్వు నాతో గడిపిన ఆ క్షణం, మన పరిచయం స్నేహం శాశ్వితం అనుకున్నా. నన్ను కాదని నీవె వెళ్ళావు అప్పుడే ఆ క్షణం నన్ను నేను విడిచి వెళ్ళిపోయాను నీకు స్నేహానికి అర్దం తెలియదు తెల్సుకోలేవు అది తెలిసిన సమయం దూరమైంది నీకు నువ్వు నాతో లేని ఈ క్షణం తెలిసింది, నువ్వు లేని జీవితం ఎంత నరకమో నీకేం తెలుస్తుంది నాకు తప్ప

by Aduri Inna Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bLUoAn

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||బంధం || నేను చెప్పింది, నీకు అర్ధం కాదో, అర్ధం కానట్టు నటిస్తావో, నా కెప్పటికి అర్ధం కాదు. మాట్లాడుకుంటూనే వుంటాం, నవ్వుకుంటాం, తిట్టుకుంటాం. మనమెప్పుడూ, అద్భుతంగా కలసి జీవిస్తూనే వుంటాం కదూ! ఒకే తలుపుకి చెరో పక్క, గడియలు పెట్టుకొని. Oct 2012-------------------------------10/2/2014

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1efOZOn

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

ఊరేగింపు రావెల పురుషోత్తమ రావు ************************** ఉప్పెనేదో వొచ్చి ఊరివెంటబడి ఒక్క బిగిన పల్లెనంతా ముంచేసింది పచ్చని పల్లె కూ ప్రభుత్వానికీ మధ్య గత్తరలా పుట్టుకొచ్చి పంట విరామం నిర్ణయం అగ్నిధారలా స్రవిస్తున్నది గిట్టుబాటుధర రాని టమాటా పంటంతా రోడ్డుమీదకొచ్చి రభస చేసింది దాని ధర అమాంతంగా ఆకాశాన్నెలాచేరిందో కాయదు దారినడగమని పీకల వాగు పిలిచిమరీ చెపుతున్నది. నీటివసతి సరిగ్గా అందక కన్నీటితో సాగెలా చేయాలో అర్ధంగాని రైతాంగం అవస్థలకు చిరునామాగా మిగిలింది. అబ్బాయి చదువు అమ్మయి పెళ్ళీ రెండూ విడివడని చిక్కు ముడులై తంద్రికి ఊపిరందకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రేపు దినం తెల్లవారురుందొ లేదొ తెలియక పల్లె పల్లెంతా నిద్రపట్టకుండా పీడకలల సఁరం భంతో సతమతమై పోతున్నది. 09-02-2004 ***********************************

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iO9iqZ

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || సాహిత్యంలో ఇజాలు-నిజాలు || '' అధునికత '' పదనిర్వచనానికి , '' సమకాలిక '' పద నిర్వచనానికి తేడా వుంది. ఆధుని క కాలవాచికా చెప్పుకునే అర్థం. ఒక కాలానికి ' ఆముక్త మాల్యద ఒక ఆధునిక గ్రంథం అని చిన్నయసూరి అంటారు. కొన్ని విలువల సంప్రదాయం, చారిత్రికనేపథ్యం మార్పులతొ మరికొన్నింటిని అభ్యుదయ కావ్యాలు అంటాము. సమకాలిక అంటే ఏక కాలంలోవచ్చిన కావ్యాలకు విశ్వనాథ, చలం,శ్రీశ్రీల రచనలను సమకాలిక సాహిత్యం అంటాం. రెండూ భిన్న ధోరణులను,వాదాలను, ప్రతిబింబిస్తూ సాహిత్య సృజనతో ముందుకొస్తాయి. సాహిత్య దృక్పథం దృష్ట్యా విశ్వనాథ ఆధునికుడు కాదు. సమకాలీనత:- ఈ దృష్టితో చూస్తే ఆ కాలంలో వచ్చిన ఏ సాహిత్యమైనా సంప్రదాయం గానీ, నవీనంకాని ఆధినికతే అనిపించుకుంటుంది. ఆధినికత:- కాలంలో వచ్చే ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులను గమనిస్తూ, కాస్త దృక్కోణంలో కవితసృజనలో కావించడమే ప్రత్యేకతను సంతరించుకోవటంద్వారా ఆఢునికతగా గుర్తింపబడుతుంది. కొన్ని విలువలు, తత్త్వాలు కలిగివుంటుంది. సామాజిక ప్రయోజనం, హేతుబద్ధ శాస్త్రీయ దృక్పథం వాస్తవికతలపైఆధారపడటం అనే అంశాలను ముడివేసుకుని సహిత్య దృక్పథం కలిగిన తాత్త్వికతతో నిలడేదే ఆధునికత. *** అభ్యుదయవాదం, విప్లవ వాదం వాస్తవికతావాదాలు కొంతవరకు హేతు వాదాలు ఈ కోవలోకే వస్తాయి.ఆధినికతాతత్త్వం పరకాష్ట చేరిన దశలో సింబాలిజం, ఇమేజిజం, ఇంప్రెషనిజం, ఫ్యూచరిజం, డాడాయిజం, సర్రియలిజం, నేచురలిజం అనే ధోరణల సమూహమే '' ఆధునికతకు '' మారుపేరులయ్యాయి.ప్రపంచంలో 1748 లో వచ్చిన వైజ్ఞానిక పారిశ్రామిక విప్లవం, 1780 లో వచ్చిన రాజకీయ ఫ్రెంచ్ విప్లవం 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధ నేపథ్యాలలో ఈ సాహిత్య ప్రపంచంలో కవిత్వం కొత్తపుంతలు తొక్కింది. కాల్పనిక వాదం, సాంప్రదాయికతా వాదం, హేతువాదం లాంటివి 18, 19 శతాబ్దంలో మానవుడికీ ప్రకృతికి మధ్యగల సంబంధాలు, వైరుధ్యాల నేపథ్యంలోనే ఉద్భవించాయి. తదుపరి స్వేచ్ఛావాదం, ఫ్రాంస్‌ లోను, ఆదర్శవాదం జర్మనీలోనూ, సౌందర్యవాదం బ్రిటన్‌లోనూ పుట్టాయని తెలుస్తోంది. *** మన తెలుగునాట కాల్పనిక వాదానికి ఆర్థిక పునాదులు లేవు. అర్థ ధనస్వామ్య, అర్థ భూస్వామ్య విధానాలు కొనసాగి భావ కవిత్వం పురుడుపోసుకుంది. పై పాశ్చాత్య ధోరణులు ప్రభావంతో, భిన్న ధోరణులతో భావ కవిత్వంలో చోటుచేసుకున్నాయి. స్వీయ నియంత్రణ ద్వారా అమలిన శృంగారం, విషాదం,నిరాశ, పునరుద్ధరణ, జాతీయోద్యమం, దేశభక్తిలాంటివి భావ కవిత్వంలో మార్పులు మనం గమనించవచ్చును.అలాగే సామ్యవాద వాస్తవికతకు, కాల్పనంకతను జోడించినపుడే సాహిత్యం ప్రజలకు చేరువౌతుంది అని విప్లవవాదుల భావన. తాత్వికంగా ఆధునికతలో భాగంగా తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న ధోరణి వాస్తవికతావాదం సహజవాదం(నేచురలిజం)పేర అమెరికా రష్యాలలో 19 వ శతాబ్దం చివరిలో విరివిగా కనిపించింది. వాస్తవికతా వాదంలో (క్రిటికల్ రియలిజం) సవిమర్శక వాస్తవికత(సోషలిస్టు రియలిజం) సామ్యవాద వాస్తవికత ప్రధాన అంశాలుగా పేర్కొనవచ్చును. వాస్తవికతను ప్రతిబింబించడంతోపాటు సామాజిక జీవిత సమస్యలకూ పరిష్కారం సూచించడం ఒక భాగమని తెలుస్తుంది. సమాజ చరిత్ర దృష్టితో చిత్రీకరించడం కూడ వాస్తవికతలోని భాగమే. '' కమ్యూనిస్టు అన్విక్షకి విషయంలో అచంచల నిష్ట, ప్రజాసేవానిరతి, పాక్షికత,శ్రామికజన సమరశీల పోరాటాల సంబంధం, మానవీయ సోషలిజం'' సామ్యవాద వాస్తవికతకి అద్దం. ఈ పరిస్థితిని వివరించేది మాత్రం గతితార్కిక భౌతిక వాద సిద్ధాంతమే. ఆ సిద్ధాంతమే అభ్యుదయ సాహిత్యానికి పునాది. త్రిపురనేని రామస్వామి చౌదరి రచనల్లు రేషనలిజం ఆధారంగా వుంటాయి. పాశ్చాత్య దేశాలలో 17 వ శతాబ్దంలో ఆరంభమై మనదేశానికి 20 శతాబ్దానికి మాత్రమే యిది మొగ్గతొడిగింది. కాల్పనిక వాదానికి సమాంతరంగా హేతువాదం ఆరంభమైంది. ముద్దుకృష్ణ '' అశోకుడు ''- చలంగారి '' సావిత్రి ''- పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి '' మహాభారత విమర్శనం'' - నార్ల వారి '' జాబిల్లి '' - త్రిపురనేనివారి '' ఖూని. భగవద్గీత, '' లాంటివి ఉదహరించుకోవచ్చు. *** తరువాతి పరిణామాలు అధివాస్తవికత, అస్తిత్వవాదం, అనుభూతివాదం, చైతన్య స్రవంతి, విప్లవ వాదం సంప్రయదాయవాదం, రూపవాదం, జనామోద వాదంలాంటీ ధోరణులు శాఖోపశాఖలుగా వాదాలు, వివాదాలు నినాదాలు ఉద్ధానకతనాలతో సాగింది. సాహిత్యోద్యమం దిగంబరకవిత్వం, దళిత వాదం, స్త్రీవాదం, అంటూ ఎన్నో రకాలుగానూ సాగింది. అరసం, విరసం, సరసం..ప్రరసం...అంటూ సంఘాలూ వచ్చాయి.సాహితీకృషి విరివిగా జరిగింది. ఉపసంహారం: దేవీప్రియ ఒక వ్యాసంలో '' రచయితలకేమైనా చెబితే లెక్చరిచ్చినట్టుంటుంది. జనామోదం కోసం యేదిపడితే అది రాయకండి. జనానికేమి అవరమో? ఎటువంటి జాగృతి అవసరమో? అది రాయటానికి మాత్రమే ప్రయత్నించండి! కె.వి.రమణారెడ్డి చెప్పినట్లు '' మార్క్సిజమే '' వల్లెవేయాల్సిన పనిలేదు. కాని, కావలసింది జీవిత వాస్తవాన్ని కాస్త చైతన్యవంతంగా అర్థంచేసుకుని, స్పష్టమైన అవగాహనతో సాహిత్య రూపంగా ( కథ/కవిత/పద్యం.గేయం/వ్యాసం/రూపకం)రూపమేదైనా దాన్ని లోకానికి చేరేలా చేయగలిగితే - ఆ సాహిత్యానికి అసలు సిసలు జనామోదం లభించి తీరుతుంది '' Betrot Bretcht అభిప్రాయం ప్రకారం '' Popular means intelligible to broad maasses, taking over their own forms of expression and enriching them (by adopting and consolidating their stand point) representing most progressive section of the people in such a way than it can take over to leadership.'' *** ఇవాళ కొత్త ధోరణి ప్రబలింది. మార్క్సిస్టు సిద్ధాంత నినాదాలు, విప్లవ అలంకారికత వాడే రచయితల తెగ యింకొకటి పుట్టుకొచ్చి, '' కవిత్వ పదార్థం '' యెక్కడున్నా అస్వాద యోగ్యమే! మార్క్సిస్టు సిద్ధాంతం పోరాట ప్రవచనాలు తమకీ తెలుసు. అచరణకీ సిద్ధాంతనికీవున్న మార్క్సిస్టు నిబంధనని విస్తృతం చేయడమే వారి లక్ష్యం. ఆంధ్ర దేశంలో యీనాడు వెలువడుతున్న సాహిత్యాన్నీ పలాయనవాద సాహిత్యం, బూర్జువా సిద్ధాంత పునాది అధారంగా వున్న సాహిత్యం అతి '' వామ '' పక్ష సిద్ధాంత ప్రేరిత సాహిత్యంగా స్థూల విభజన చేసుకోవచ్చు.పై తరహాలన్నీ కూడ ప్రయోజనపుష్టమైన సాంస్కృతిక రంగాన్ని యేర్పాటు చేయవు. ఫెడ్రిక్ ఎంగిల్స్చెప్పినట్టు '' Freedom is recognition of necessity '' ఇదే అంశం మీద క్రిస్ట్‌ఫర్‌ కాడ్వెల్‌ అన్నమాట గుర్తు తెచ్చుకుందాం '' Art is the expression of man's freedom in the world of feeling, just as science is the expression of freedom in the world of sensory perception, because both are conscious of the necessities of their worlds and can change them-art the world of feeling of inner reality, science the world of phenomena of outer reality'' (Illusion and reality - Christfer Caudwel) (ఆర్వీఆర్ వ్యాాసాల నుండి సేకరణ ) 10.2.2014 ఉ.7.30 -

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iO9kzf

Posted by Katta

Narayana Sharma Mallavajjala కవిత

ఈనాటి కవిత-69 _______________________________ డా.కాసుల లింగారెడ్డి-ఇడుపుకాగితం తెలుగులో 55,60 ప్రాంతలకు ముందు వచ్చిన చారిత్రక సాహిత్యానికి తరువాత వచ్చిన చారిత్రక సాహిత్యానికి మధ్య ప్రధానవైరుధ్యమొకటి ఉన్నది.ముందు సాహిత్యం రాజుల కథలు,ఇతి వృత్తాలపై ఆధారపడితే తరువాతి సాహిత్యం ఈ సంప్రదాయం నుండి దూరమయ్యింది.ఈ క్రమంలోనే చారిత్రక వాస్తవికత(Historical Reality) ఒకటి కనిపిస్తుంది.చరిత్రని కల్పనతొ కాక వాస్తవధరంగా కవిత్వంలో నిర్మించడం.ఈ సందర్భం లోనే చారిత్రక నేపథ్యం(Historical Context)అనే పదాన్ని కూడా పరిశీలించాలి.ఒక కాలంలో ప్రబలంగా ఉండే ఆలొచనా ధోరణులు,జీవన విలువలను చారిత్రక నేపథ్యం అంటారు.నిర్దిష్టకాలంలోని రచయితలు విడివిడిగా,బృందాలుగా ఒకే రకమైన అలొచనా ధోరిణితొ ఉండటం. జాతీయోద్యమ కాలపు సాహిత్యానికి దేశభక్తి,భాషాభిమానం ,హరిజన సమస్య,వితంతు వివాహం,వరకట్నం మొదలైనవి చారిత్రక నేపథ్యం గా ఉన్నాయి.60 కి ఈ ఇవతలిభాగంలో ప్రాన్స్ లో విద్యార్థి ఉద్యమాలు,చైనాలో సాంస్కృతిక ఉద్యమం,వియత్నాం ఉద్యమం తో పాటు ఈనెలమీద వచ్చిన తెలంగాణా సాయుధ పొరాట గీతాలు,శ్రీకాకులం నగ్జల్బరీ గీతాలు మొదలైనవి చారిత్రక నేపథ్యం గా కనిపిస్తుంది.విప్లవ సాహిత్య ధోరణిగా వ్యవహారంలో కివచ్చింది కూడా ఇదే. ఈ దశాబ్దికాపు తెలంగాణ ఉద్యమ సాహిత్యంలోనూ అనేక చారిత్రకాంశాలు సాహిత్యాంశాలుగా రూపు దిద్దుకున్నాయి.డా.కాసుల లింగారెడ్డి గారు రాసిన "ఇడుపు కాగితం" కూడా అలాంటిదే. ఒక చారిత్రకాంశాన్ని ఉల్లేఖనం(Allusion)ద్వార వాస్తవవాద దృక్పథంతో వర్తమాన దృష్టితో రాయటం కనిపిస్తుంది. "పుస్తెలతాడు కట్టించి తన్నుకు చావమని సాపెన పెట్టిండు సచ్చినోడు." 1 "తాటికమ్మల గుడిసన్నా లేదని రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన. కాసులు లేని కనాకష్ట కాలంల నిలువ గరిసెలిచ్చి నిలబెట్టిన. గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె కుడిదాయి కుడిపి కుతిదీర్చిన. నా రామసక్కని కుర్చీ ఇచ్చి సదువుకున్నోనివని రాజును చేసిన. నిన్నేమన్న కర్రె కుక్కను చేసి ఎంటదిప్పుకుంటినా?" ఇందులో మొదటి వాక్యమే ఉల్లేఖనం.తెలంగాణాను కలిపి "విశాలాంధ్ర"నుఏర్పాటు చేస్తూ నెహ్రూ గారన్న మాటల స్పృహ ఇక్కడ కనిపిస్తుంది."నిన్నే మన్నా కర్రె కుక్కను చేసి ఎంట దిప్పుకుంటినా ? "అన్న ప్రశ్నలో కూడా జానపద కథల్లో వినిపించే"బాల నాగమ్మ "కథ స్ఫురిస్తుంది. ఉత్తరనిర్మాణవాదం(Post -Strcturalism)ఈమలుపులో కనిపిస్తుంది.స్థిరమైన సత్యం అనే అంశం నించి బయటికి వచ్చి చెప్పటం,ప్రధానాంశంలోని ఆదర్శాన్ని తోసివేసి .వాస్తవాన్ని చెప్పడం,పెద్ద పెద్ద సిద్ధాంతాలని(Meta naretivs)నమ్మి వాస్తవాన్ని నిర్బంధించకుండా ఉండటం,బాహ్య వాస్తవికతని కాకుండా "స్వతంత్రంగా ఉండే వాస్తవాన్ని" చెప్పటం.వర్గం బదులుగా వ్యష్టివిలువలపై ఉత్తర నిర్మాణ వాదం దృష్టి నిలిపింది.దాంపత్యం అనెదానికన్నా స్థ్రీ,పురుషుడు అనె జెండర్ మీదా దృష్టి పెడుతుంది...పెళ్లి అనే అంశాన్నే కొనసాగిస్తూ చూపిన అంశాలుకూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తాయి. "మర్లువెళ్ళన్నా కాలేదు కాళ్ళ పారాణన్నా ఆరలేదు ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి. పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య అడ్డు తెరలెందుకంటివి సంపదలు నీకు సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి ఈ కాపురం నేనొళ్ళనంటె కూసున్న పెద్దమనుషులు కాసింత సర్ది చెప్పి కాయితం మీద కాపురం నిలిపిరి." ఈ భాగం లో "ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి/నీకు నాకు నడుమ/నియమాలెందుకంటివి./పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య/అడ్డు తెరలెందుకంటివి/సంపదలు నీకు/సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి"- ఈ వాక్యాలు అందుకు నిదర్శనం, ఒక చారిత్రక వాస్తవాన్ని అంతే పటిష్టమైన సైద్ధాంతిక ధర్మంతో అందించటం లింగారెడ్డి గారి కవితలో కనిపిస్తుంది.కేవల ఉద్వేగం కాక నిబద్ధమైన దార్శనికతని ప్రదర్శించిన కవిత.బల మైన కవితావాక్యాలు కూడా అడుగడుగునా కనిపిస్తాయి.-"పొలిమేరలు చెరిపేసిన దేహాలు","వరిమొవ్వలోని మంచు ముత్యం","ఉనికి ఉనుక పొట్టవటం","కాలపు పలుగురాళ్ళమీద పదునెక్కి పారుతున్న జీవనదులసొంటి భాష" -లాంటి ప్రయోగాలు ఎంతో కొత్తగా ,కవిత్వాన్ని,వస్తువును నిలబెడతాయి. తాటికమ్మల గుడిసె,కర్రెకుక్క,పుస్తెలతాడు,మర్లువెల్లి,కుడిదాయి,ఇకమతులు,మల్లెసాల-వంతి ప్రాంతీయ పదజాలం కూడా ఈ కవిత సౌందర్యాన్ని అధికం చేస్తాయి..మంచి కవిత అందించినందుకు డా.కాసుల లింగా రెడ్డి గారికి ధన్యవాదాలు.

by Narayana Sharma Mallavajjalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bhpYIr

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

చల్లని దేవుల అల్లరిలో రాధ! డా. వారణాసి రామబ్రహ్మం 10-2-2014 చల్లని దేవుల అల్లరిలో రాధ ఉల్లము పొంగ పొందె తీయని బాధ ఆహ్లాదము కలిగించు కిరణములతో స్పృశించి రాధను వివశను చేసెను ప్రేమికుల పాలిటి ప్రియ శత్రువు పున్నమిని చల్లదనములు పంచు కలువల రేడు గాయములు కనిపింప నీయక పూలబాణములతో తనువునంతా అతలాకుతలం చేసే రూపు లేని దొర తీపుల బారిని పడవేసి రాధను నిలువనీయడము లేదు మనసు పంచుకుని; ఊసుల మురిపించుచు వయసు పండింప వలసిన రస తరుణమున రాదు మాధవుడు సంకేత స్థలమునకు అభిసారికయై అరుదెంచి వేచియున్న రాధను రతిని ముంచి తేల్చి రసైక్యము నొందుటకై ఇలా చల్లని దేవుల అల్లరిలో రాధ ఉల్లము తల్లడిల్ల పొందె తీయని బాధ "మల్లెల వలపుమాలలు వైచి కొని ప్రణయ జీవులమైతిమి తెల్లని వలువలు విడచి పొర్లాడుటకునై, ఏమిది?" అనుకొనుచున్నది మాధవ సంగమేచ్ఛతో రాధ వలపుల మల్లెల మాల శృంగార తార ప్రణయ సితార

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gd5nUp

Posted by Katta