పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, మార్చి 2014, ఆదివారం

Narayana Sharma Mallavajjala కవిత

ఈనాటికవిత-75 _________________________________ బాలు వాకదాని ||బ్రతుకు పోరాటం|| బిందాస్ మాటలన్నీ మనోనిబ్బరంకోసమే, కడుపు నిండికాదు వీధి వీధి తిరిగేది ఆసరాకోసమే, ఆనందం కోసం కాదు అంతర్జాల గోడలపై తగిలించిన బొమ్మలన్నీ పాతవే, కాస్త ఉరటకోసం బాకీ లెక్కల కాగితం గుండెను తడుముతుంది చొక్కా జోబులోనుంచి నా వాళ్ళంతా నిలదీస్తున్నారు నన్ను నిలబెట్టటానికి అణిచిపెట్టిన ఆసక్తినంతా కొలమానాలతో చూపించాలెమో! దగాపడిన హృదయం మరోసారి సిద్దమౌతుంది తాకట్టుకి తగలపెట్టిన ఆదర్శాలు, సిద్ధాంతాలలోనుంచి తీసిన ఆయుధంతో మంచి మనసుని పొడవాలి కావలిసిన దానికోసం కసితో నేన్నుంటే, కాకమ్మ కథలంటారేమో! దారంతా వెతుకులాటే, కాస్త వెలుతురు వేసేవాళ్ళు తోడైతే భావుండు మన:శాంతి, మనోవేదన పట్టింపులేమీలేవు, కాస్త పనుంటే చాలు ఇంతకన్నా సాక్షాలు ఏంచూపను? రూపీకోసం, రోటీకోసం చస్తున్నానని * * * చాల సార్లు కవిత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు మానసిక మైన అంసాల గురించి మాట్లాడుకొవాల్సి వస్తుంది.దాని కారణం వ్యక్తీకరణ అనేక అంశాలని దాటి మనొవైఙ్ఞానిక భూమికతో విరాడ్రూపాన్ని పొందింది. మనషి నిజాయితీగావ్యక్తమవడంలోని సంశయాన్ని,క్రియా రహిత స్పృహని బాలు కవిత్వీకరించారు.యూంగ్ ఉమ్మడి అచేతనల్లొ చెప్పిన అంశాలలొ ఆచ్చాదన ఒకటి.మనది కాని అంశాన్ని పట్టుకుని ప్రవర్తించడం అలాంటిదే.బయటీకి వ్యక్తమౌతున్న తీరుకు అనుభవిస్తున్న తీరుకు మధ్య వ్యత్యాసం ఉంటుంది.ఈ వ్యత్యాసాన్నే కవిత్వం చేసారు బాలు. ఈవాక్యాల్లో నిరాశ,నిరాసక్తత ఉన్నాయి.క్రియాశీల చైతన్య స్పృహ లోపించినప్పుడు మనిషిలోని భావాలు,చైతన్యము ముసుగువేసుకుని ఉంటాయని హెగెల్ అన్నాడు.దారిద్రయం పట్ల నిరసన క్రియాషీల చైతన్యంతొకాక దయ,సానుభూతి,పరొపకారం లాంటి రూపంలో వ్యక్తమౌతుంది.ఆధునికంగా ఇది లొటులేనితనాన్ని అనుభవిస్తున్నట్టు నటిస్తుంది. ఈ ఆచ్చాదననించే బాలు మాట్లాడారు. బాలు వస్తుపరంగానె కాదు.తనదైన వైయ్యక్తిక నిర్మాణ ముద్రకూడా వ్యక్తం చేసారు.బాలు మరిన్ని మంచి కవితలతో తనని నిలబెట్టుకోవాలని ఆశిద్దాం.బాలు వాకదాని కి అభినందనలు

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvlmDv

Posted by Katta

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || నిత్య హోళీ || తెలిమంచుతెరల్లొ నీ ఎదను తాకిన అరుణార్ణవం వర్ణరంజితమై ఇంద్రధనువుకే మెరుగుపెట్టే శతకోటి వర్ణాలు.. నీ మేనికాంతుల్లో ! ఎడారిలో మండే ఇసుకరేణువులకు రంగుల ఆస్వాదనని పరిచయించింది నీలోని పరమాణువుల స్పర్శకి పచ్చికనేలపై జీవంకోల్పోయే గడ్డిపరకపై నీ చెమటచినుకులు జారి సంజీవినిలా ప్రాణం పోసాయి ! గుప్పిట పట్టిన సగంవాడిన సుమాలు నీ హస్తరేఖల్ని కౌగిలించుకుని ఊపిరి పీల్చుకున్నాయి సంతోషంగా ! చీకటి ఎదపై నీ కురుల లాస్యాలు వెన్నెల పొదరిల్లే కట్టింది చంద్రుని భువిపై దింపింది ! నీ నిశ్వాసలు పీల్చి గాలిలోని దుమ్ముకణాలు ప్రకాశవంతమై ప్రకృతికి కాంతిలహరి అందించింది నిస్సారమైన మట్టిలోని పొరపొరకీ రంగుల అద్దకాలే... నీ పాదస్పర్శతో వెలువడే ఆత్మీయకిరణాల పలకరింపుతో విశ్వమంతా రంగులకేళీయే !

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvljI5

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్ /వర్ణం ---------------------------- ఇంకా ఎన్ని రంగులు పులుముకోవాలో కొన్ని దృశ్యాలాను ఈ ముఖంలో కప్పెట్టడానికి ప్రతి రోజు కొన్ని వాత్సల్యాలను అద్దుకొని ప్రేమించేస్తావు నగ్నంగా కళ్ళలో నిజాలు గుర్తించలేని సమయాలు ఎన్నో కరుగుతుంటాయి నీ ముందే కనిపించే వర్ణాల వెనుక మబ్బుపట్టిన చీకట్లు భల్లెం దెబ్బకి రెక్కలు విరిగిన కొన్ని కపోతాలు ఇప్పుడిక్కడ ఇంకా రంగులు మారుతూనే ఉన్నాయి ఈ దేహంపైన నీ దేహంలో కలవడానికి. తిలక్ బొమ్మరాజు 16.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83NDw

Posted by Katta

Sriramoju Haragopal కవిత

అనామకంగా..... మౌనమొకటేనా సమాధానం చిత్రితరూపసందోహాల స్వప్నావిష్కరణలు మౌనమే భూమ్యాకాశాల మధ్య ఈదులాడుతున్న పురాక్రుత జీవావశేషాలిప్పటికీ మౌనమే భాషకందని భావావేదనల సంక్షుభిత సంకలనాలన్నీ మౌనమే అలా గాలిలో తేలాడుతు రెక్కలతో రంగులువిసిరే సీతాకోకచిలుకలది మౌనమే మాటలన్ని కాలిపోయాక బూడిదైన ఇష్టాలు రహస్యధూమాలై మౌనమే పలకరింపుల పక్షులు తడిసిన ఈకలతో అందరి కళ్ళు తుడిచినంత సేపు మౌనమే నిద్రిస్తున్న అగ్నిపర్వతం వంటి మనసు మేల్కొంటున్నది భూమంతటా పరచుకున్న తెల్లనిచెట్లవేర్లలా నా తలపులు గుండెల్లోకి దిగిపోయాయి కాసేపు విశ్రమించని అలల్లా కొట్టుకుంటున్న వూపిరి మునుం సాగుతున్నది దయా దాక్షిణ్యాలు లేని చీకటిరాత్రుల వైకల్పిక కల్పనా విలయతాండవాల విక్రుతాలు రేపటి లేతచిగుళ్ళకు ఆశల హరితవర్ణాలు అద్దుతున్న మనసు మీద కల్లోలాల ఆసిడ్ దాడి పాదాలు, నేల నెర్రెలుబారి ఎడారులవుతున్న వేసవిబాటల్లో ఒంటరిగా నడుస్తున్న పొద్దు మౌనంగానే, ఎందుకీ మౌనం? కాలం కాలమంతా వసంతోత్సవమై గాలంటే ప్రేమతుషారాల స్పర్శగా రాగాలు తీసే నదులన్నింటిని తీగెలుగా మీటి పాడుతున్న పాటనెక్కి మోయు తుమ్మెదల వాగువెంట ప్రవహించి పోవాలి కాని మౌనమెందుకు ముట్టుకుంటేనే వేలపూలరేకులుగా విరబూసే తోటలో వెన్నెలచెట్లనీడలో పెదవులు కదలగానే మెదిలిన తలపులన్నీ రాసుకున్న కావ్యాలై పోవాలిగాని మౌనమెందుకు వాగ్దానాలడుగను కాని, వాగ్దత్తమై పోయి నలిగిపోకు చెప్పమని కోరను కాని రహస్యమై కుమిలిపోకు 16.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83KHy

Posted by Katta

Kalyani Gauri Kasibhatla కవిత

కవిసంగమంమిత్రులకు.. సప్తవర్ణాల సమ్మిళిత..నవ వసంతోత్సవ..శుభాభినందనలు

by Kalyani Gauri Kasibhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e83Lve

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-33 భద్రత కోసమో రక్షణ కోసమో సుఖం కోసమో ఆలంబన కోసమో రకరకాల బంధాల్లో చిక్కుకొని.. వీటినన్నిటిని పాము కుబుసం విడిచిపెడుతున్నట్టు విసర్జిస్తున్నపుడు అనిపిస్తుంది ఏ ఆటంకాలు సహింపని అడివి లోని పులి వలెనె ప్రతి మనిషి జన్మించాడు ... తనని తాను ఎంత కట్టడి చేసుకున్నా అంతరంతరాళంలో తానూ ఒక మృగమేనని ప్రతి ఒక్కరికీ తెలుసు... !! ------------------------------------------- 16-3-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fB9XrS

Posted by Katta

Vani Koratamaddi కవిత

స్వప్నం జ్ఞాపకాల బాష్పాలు అక్షరాలై వర్షిస్తాయి మనసుకైన గాయాలు గేయాలై మిగిలాయి ఒడిపోయిన కన్నీటి కధకు సాక్ష్యాలై నిలిచాయి స్వప్నంలో నీరూపం సాక్ష్యాత్కరిస్తుంది సరదాగామాట్లాడి సంగతులెన్నో చెపుతుంది నమ్మలేకపోతాను నీవులేని నిజాన్ని తెల్లార కుండావుంటే బావుండను కుంటాను భళ్ళుతెల్లారేసరికి గుండెగుభేలు మన్నది గతం నన్ను వెక్కిరించిది గాయం గుర్తు చేసింది తలగడపై తడి గుర్తులు కన్నీటికి ఋజువులుగా మిగిలివున్నా నేను.... బాష్పాలు రచిస్తూ..... వాణికొరటమద్ది 16/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdZ10

Posted by Katta

Kavi Yakoob కవిత

పసునూరు శ్రీధర్ బాబు కవిత్వం ఈ బ్లాగులో చదవండి : http://ift.tt/NkdZ0Q

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdZ0Q

Posted by Katta

RajendraKumar Devarapalli కవిత

యువ సాహితీ వేత్తలకు ఒక విజ్ఞప్తి/సూచన. ----రాజేంద్ర కుమార్ దేవరపల్లి,మార్చ్,16,2014 యువ సాహితీ వేత్తలకు ఒక విజ్ఞప్తి/సూచన. అన్ని సభలకు వెళ్ళండి.కేవలం సాహితీ సభలకే పరిమితం కాకండి. ముఖ్య అతిధిగానో,ప్రధాన వక్తగానో పిలిస్తే తప్ప ఏ సభకూ,ముఖ్యంగా సాహితీసభలకు వెళ్ళం,ప్రేక్షక/శ్రోతల్లో కూర్చోవటమా అన్న తలబిరుసు తగ్గించుకోండి. పదిమందితో కలిసే ఏ అవకాశాన్ని వీలైనంతవరకూ వదులుకోవద్దు. గుర్తుంచుకోండి-- సాహిత్యం సమాజం నుంచి పుడుతుంది. సారస్వతం పాఠకుల నుంచి,ప్రజల నుంచి వెలికివస్తుంది. దాన్ని అక్షరాల్లోకి బట్వాడా చేసి మరలా పాఠకులైన ప్రజల ముందు ఉంచటమే మీ ప్రధాన కర్తవ్యం. ఈ క్రమంలో కాగితం/కలం ఎంతో కంప్యూటరూ,కీబోర్డూ ఎంతో మీరూ అంతే అంతకంటే ఎక్కువ సమాజాన్నుంచి ఆశించకండి.ఆశాభంగం చెందకండి.

by RajendraKumar Devarapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdW5r

Posted by Katta

Sriramoju Haragopal కవిత

అనామకంగా..... మౌనమొకటేనా సమాధానం చిత్రితరూపసందోహాల స్వప్నావిష్కరణలు మౌనమే భూమ్యాకాశాల మధ్య ఈదులాడుతున్న పురాక్రుత జీవావశేషాలిప్పటికీ మౌనమే భాషకందని భావావేదనల సంక్షుభిత సంకలనాలన్నీ మౌనమే అలా గాలిలో తేలాడుతు రెక్కలతో రంగులువిసిరే సీతాకోకచిలుకలది మౌనమే మాటలన్ని కాలిపోయాక బూడిదైన ఇష్టాలు రహస్యధూమాలై మౌనమే పలకరింపుల పక్షులు తడిసిన ఈకలతో అందరి కళ్ళు తుడిచినంత సేపు మౌనమే నిద్రిస్తున్న అగ్నిపర్వతం వంటి మనసు మేల్కొంటున్నది భూమంతటా పరచుకున్న తెల్లనిచెట్లవేర్లలా నా తలపులు గుండెల్లోకి దిగిపోయాయి కాసేపు విశ్రమించని అలల్లా కొట్టుకుంటున్న వూపిరి మునుం సాగుతున్నది దయా దాక్షిణ్యాలు లేని చీకటిరాత్రుల వైకల్పిక కల్పనా విలయతాండవాల విక్రుతాలు రేపటి లేతచిగుళ్ళకు ఆశల హరితవర్ణాలు అద్దుతున్న మనసు మీద కల్లోలాల ఆసిడ్ దాడి పాదాలు, నేల నెర్రెలుబారి ఎడారులవుతున్న వేసవిబాటల్లో ఒంటరిగా నడుస్తున్న పొద్దు మౌనంగానే, ఎందుకీ మౌనం? కాలం కాలమంతా వసంతోత్సవమై గాలంటే ప్రేమతుషారాల స్పర్శగా రాగాలు తీసే నదులన్నింటిని తీగెలుగా మీటి పాడుతున్న పాటనెక్కి మోయు తుమ్మెదల వాగువెంట ప్రవహించి పోవాలి కాని మౌనమెందుకు ముట్టుకుంటేనే వేలపూలరేకులుగా విరబూసే తోటలో వెన్నెలచెట్లనీడలో పెదవులు కదలగానే మెదిలిన తలపులన్నీ రాసుకున్న కావ్యాలై పోవాలిగాని మౌనమెందుకు వాగ్దానాలడుగను కాని, వాగ్దత్తమై పోయి నలిగిపోకు చెప్పమని కోరను కాని రహస్యమై కుమిలిపోకు 16.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NkdW5c

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ----।। కూతురు మళ్లీ పుట్టింది ।। ఊపిరి విడిచి మరుభూమి చేరాల్సిన ఆ భౌతికకాయం ఎదురుచూస్తోంది వొళ్ళంతా మృతనేత్రాలు చేసుకుని . ఏ బండల సావాసంలో రాతిగా మారాయో ?ఆ గుండెలు కాలం చేసిన తండ్రి కట్టెను కటిక రాయిగా పడుండమన్నాయి . పంచుకున్న మాంసంముద్ద,పీల్చుకున్న నెత్తురుచుక్క, పెనవేసుకున్న పితృబంధమూ కనీసం పాశంగానైనా మారలేదు . తనువు చాలించి నిర్జీవమైన పార్ధివదేహం పొందింది స్వర్గం బ్రతికి మిగిలిపోయినా .. సుపుత్రుల నిర్వాకం బరించలేక అడుగడుగనా నరకం . చచ్చిన మనిషి పుచ్చిపోడుగా తన మరో పేగుబంధం ఉరికింది ముందుకు కొరివి చేతబట్టి ఆ తండ్రి అంతిమయాత్రకు అన్నీ తానై . కొడుకుల పాపపు నీడ పడకుండా పున్నామ నరకం తప్పించి,కన్నరుణం తీర్చి మరోసారి జన్మించింది ఆ తండ్రికి కొడుకుగా ! (ముగ్గురు కొడుకులు ఉన్నా ఓ తండ్రికి కొరివి పెట్టటానికి ముందుకు రాకపోవటంతో ఓ కూతురు ఆ కార్యక్రమం చేసిన వార్త పేపర్లో చదివి ... ) (16-03-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PFpT7M

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PFpSRi

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || మొలకపాఠం అప్పుడలా అన్నావు అవును నాతోనే నిజంగా అన్నావు. 1. శీతలం శరీరాన్ని ముట్టించిన రోజుల్లో మాటిచ్చావ్ తొలకరిజల్లు పడగానే తిరిగొస్తానని వేసవితాపంతో ఎదురుచూస్తున్నాను నీ రాకకోసం. 2. మొత్తంగా మూసిన పెంకుని తనువుని దాపిన మట్టిసమాధిని బద్దలుకొట్టుకొస్తూ, అదంతా నేర్పిస్తానన్నావు ... ... అన్నావు నీవు తప్పకుండా వస్తానన్నావు. 3. మూటకట్టి మూలన పడేసినా మనసెప్పటికీ వట్టిపోదని గట్టిగా చెప్పేందుకు పరాన్న జీవుల ప్రపంచానికి స్వతంత్రతేమిటో చూపిస్తూ అదంతా పాఠం రాసిస్తాననేశావు ... ... ఇచ్చావు నాకెప్పుడో మనస్పూర్తిగా మాటిచ్చావు. 4. మృత్తికనుండి దేహంలా పొత్తపు గవాక్షాల అక్షరంలా మస్తకపు దారిగుండా ముచ్చటలా బయటికొచ్చి ఆచరణల ఆకులతో ఆకాశాన్నే కాదు, ఆలోచనల పాదులతో భూమండలాన్నీ కూడా పొ దు వు కుం టా న ని, ... ... చెప్పావు నాలోపల మాత్రమే వినిపించేటట్లు ఘంటాపదంగా గుసగుసలాడుతూ చెప్పావు. 5. అబ్బా పగిలింది చెంప వేసవి వేడిలో సైతం ఎదురు చూస్తున్న నన్నెందుకు కొట్టావ్ ? మొలకై నేనే తలెత్తకుండా బులపాటంగా ఎదురు చూస్తున్నందుకేనా? ► 16-03-2014 http://ift.tt/1gpQ874

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gpQ874

Posted by Katta

Nirmalarani Thota కవిత

కోడికూసిందో లేదో తెలియదుగానీ కమిట్ మెంట్ కంగారుగా లేపింది . .. చీపురుకట్టతో ప్రస్థానం మొదలు గడియారం పెద్ద ముల్లు పరుగెత్తుతోంది చిన్నముల్లు ప్రేయసిని కలుసుకోవాలనే ఆత్రంలో ఇంకా ఇల్లు తుడవాలి..వంట చేయాలి ఇంట్లో మరో మూడు జతల చేతులున్నాయ్ తినిపెట్టడానికి మరో రెండు చేతులుంటే బాగుణ్ణు ఒకటి ఇంటి పనికీ.. మరొకటి వంట పనికీ రెండు హాల్లోకి మరో రెండు కిచెన్ లోకి క్షణాలు పరుగెడుతున్నాయ్ నిమిషాలుగా మారిపోవాలని స్కూలుకెళ్ళి పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి ఆఫీసుకెళ్ళాలి మరో రెండు కాళ్ళుంటే బాగుండు ఆఫీసుకెల్తూనే ఐదు నిమిషాల ఆలస్యానికి బాసు ధుమధుమలు పక్క సెక్షన్ నుంచి ఏమైందే అనే పలకరింపు చూపులు రెండు జతల చెవులుంటే బాగుండు రెండు మనుషుల్ని వినడానికి రెండు మనసుల్ని వినడానికీ సీట్లో కూర్చొని పని చేసుకుంటుంటే ఉరుములు మెరుపులు నాలుగు ఫైళ్ళు చూడాలి.. డ్రాఫ్టు రాయాలి వడియాలూ, బట్టలూ తడుస్తాయో ఏమో రెండు మెదళ్ళుంటే బాగుండు ఒకటి ఆఫీసు పనికి మరొకటి ఇంటి ధ్యాసకీ నిమిషాలు పరిగెత్తుతున్నాయ్ గంటలుగా గడవాలని. . పొద్దు వాలిపోయింది శరీరం మూలుగుతోంది పెరట్లో మల్లెమొగ్గలు విచ్చుకుంటున్నాయ్ రెండు ముక్కులుంటే బాగుండు ఒకటి అలసిన నిట్టూర్పులకు మరొకటి ఆశల ఉచ్వాసలకూ గంటలు పరిగెత్తుతున్నాయ్ రోజులుగా మురవాలని . . పక్క మీద నడుం వాల్చగానే ఆలోచనా మేఘాలు తరుగుతున్న సత్తువ పెరుగుతున్న పిల్లలు రెండు జతల కళ్ళుంటే బాగుండు ఒకటి కన్నీళ్ళకు మరొకటి కలలు కనేందుకు నిద్ర రాని రెప్పలు నిద్రపోనివ్వని పక్కలు రెండు మనసులుంటే బాగుండు ఒకటి కష్టపడడానికి మరొకటి ఇష్టపడడానికీ ఒకటి క్షమించడానికి మరోటి ప్రేమించడానికీ రోజులు పరిగెత్తుతున్నాయ్ సంవత్సరాలుగా మిగలాలని . . అర్ధరాత్రి దాటిపోతుంది తనువు మనసు స్తబ్ధమవుతున్నాయ్ రోజుకు మరో రెండు గంటలుంటే బాగుండు నాకోసం నేను బ్రతకడానికి . . సంవత్సరాలు పరిగెడుతున్నాయ్ జీవితాలవ్వాలని . . పడమటి సంధ్య తొంగి చూస్తుంది రెక్కలొచ్చిన పక్షులు గూటికి తిరిగి రాలేదు . . రెండు జన్మలుంటే బాగుండు మళ్ళీ తల్లిలా పుట్టడానికి మరో ప్రపంచానికి జన్మనివ్వడానికి . . మామూలు మనిషి అవయవాలతోనే పుట్టి కూడా మరమనిషిలా.. ఇంటా బయటా పనుల్నీ , మనుషుల్నీ, మనసుల్నీ గెలుస్తూ ముందుకుపోతున్న నన్ను నేను చూసుకొని మురిసిపోవడానికీ. . ఆడజన్మ పై గర్వంతో ఉప్పొంగడానికీ. . ! ! నిర్మలారాణి తోట [ తేది: 16.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoiLnq

Posted by Katta

Durga Prasad Gorasa కవిత



by Durga Prasad Gorasa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZJ0na

Posted by Katta

Nirmalarani Thota కవిత

కోడికూసిందో లేదో తెలియదుగానీ కమిట్ మెంట్ కంగారుగా లేపింది . .. చీపురుకట్టతో ప్రస్థానం మొదలు గడియారం పెద్ద ముల్లు పరుగెత్తుతోంది చిన్నముల్లు ప్రేయసిని కలుసుకోవాలనే ఆత్రంలో ఇంకా ఇల్లు తుడవాలి..వంట చేయాలి ఇంట్లో మరో మూడు జతల చేతులున్నాయ్ తినిపెట్టడానికి మరో రెండు చేతులుంటే బాగుణ్ణు ఒకటి ఇంటి పనికీ.. మరొకటి వంట పనికీ రెండు హాల్లోకి మరో రెండు కిచెన్ లోకి క్షణాలు పరుగెడుతున్నాయ్ నిమిషాలుగా మారిపోవాలని స్కూలుకెళ్ళి పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇవ్వాలి ఆఫీసుకెళ్ళాలి మరో రెండు కాళ్ళుంటే బాగుండు ఆఫీసుకెల్తూనే ఐదు నిమిషాల ఆలస్యానికి బాసు ధుమధుమలు పక్క సెక్షన్ నుంచి ఏమైందే అనే పలకరింపు చూపులు రెండు జతల చెవులుంటే బాగుండు రెండు మనుషుల్ని వినడానికి రెండు మనసుల్ని వినడానికీ సీట్లో కూర్చొని పని చేసుకుంటుంటే ఉరుములు మెరుపులు నాలుగు ఫైళ్ళు చూడాలి.. డ్రాఫ్టు రాయాలి వడియాలూ, బట్టలూ తడుస్తాయో ఏమో రెండు మెదళ్ళుంటే బాగుండు ఒకటి ఆఫీసు పనికి మరొకటి ఇంటి ధ్యాసకీ రాత్రయింది శరీరం మూలుగుతోంది పెరట్లో మల్లెమొగ్గలు విచ్చుకుంటున్నాయ్ రెండు ముక్కులుంటే బాగుండు ఒకటి అలసిన నిట్టూర్పులకు మరొకటి ఆశల ఉచ్వాసలకూ పక్క మీద నడుం వాల్చగానే ఆలోచనా మేఘాలు తరుగుతున్న సత్తువ పెరుగుతున్న పిల్లలు రెండు జతల కళ్ళుంటే బాగుండు ఒకటి కన్నీళ్ళకు మరొకటి కలలు కనేందుకు నిద్ర రాని రెప్పలు నిద్రపోనివ్వని పక్కలు రెండు మనసులుంటే బాగుండు ఒకటి కష్టపడడానికి మరొకటి ఇష్టపడడానికీ ఒకటి క్షమించడానికి మరోటి ప్రేమించడానికీ అర్ధరాత్రి దాటిపోతుంది తనువు మనసు స్తబ్ధమవుతున్నాయ్ రోజుకు మరో రెండు గంటలుంటే బాగుండు నాకోసం నేను బ్రతకడానికి . . పడమటి సంధ్య తొంగి చూస్తుంది రెక్కలొచ్చిన పక్షులు గూటికి తిరిగి రాలేదు . . రెండు జన్మలుంటే బాగుండు మళ్ళీ తల్లిలా పుట్టడానికి మరో ప్రపంచానికి జన్మనివ్వడానికి . . మామూలు మనిషి అవయవాలతోనే పుట్టి కూడా మరమనిషిలా.. ఇంటా బయటా పనుల్నీ , మనుషుల్నీ, మనసుల్నీ గెలుస్తూ ముందుకుపోతున్న నన్ను నేను చూసుకొని మురిసిపోవడానికీ. . ఆడజన్మ పై గర్వంతో ఉప్పొంగడానికీ. . ! ! నిర్మలారాణి తోట [ తేది: 16.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZJ06G

Posted by Katta

Sravanthi Itharaju కవిత

Naa kavitaku Peddalu Kapila Ramkumar gaarichchina andamaina roopam.Dhanyavaadaalu sir! ....హోలికా దహనం... చీకాకుల ఏకాకులు మదిని దూరి రొదపెడుతున్నాయ్ వీపున పాపపు మూటలు గుదిబండలుగా వ్రేలాడుతున్నాయ్ ఈ జన్మవా..గత జన్మవా.. మరి ఏ జన్మవో తెలియరాకున్నాయ్ నిరాశల ఈసుళ్ళు మోమునిండా ముసురుతున్నాయ్ అందినట్టె అంది ఆనంద ఝరులెండమావులై మారిపోతున్నాయ్ అందినది అందగించక మరి అందనివేవో అమృతభాండములౌతున్నాయ్ అందాల ఆనందాల అందలాలెక్కాలలన్న మనసు గారాలు మారాలు చేస్తున్నాయ్ అందాల రేడు లేడని ఆశల విరులు ఆవిరులౌతున్నాయ్ సంసార సారాల నీరాలు క్షార సాగర క్షీరాలౌతున్నాయ్ మదిని మధురోహల తావున మౌనఘోషలెక్కువయ్యాయ్ మాసిన తలపులు తలుపులు మూసుకుని తలనిండా తన్నుకు ఛస్తున్నాయ్ చివరన శృతి తప్పిన యద రాగాలు అరణ్య రోదనల తలపిస్తున్నాయ్ చాలు చాలు స్వామీ.. ఇకనైనా రావేమీ? ఈ కోరికల "హోలిక"ల దహియింప క్షీరసాగర తరంగిణుల నను రక్షింప త్వర త్వరగతిన్ దశావతారాల దేనినైనా పూనో లేక ఏకాదశావతారుడవై రమ్ము నన్నుద్ధరింప..

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kxhi1d

Posted by Katta

Rajasekhar Gudibandi కవిత

రాజశేఖర్ గుదిబండి (చంద్రం) || నేను ప్రవహిస్తానెప్పుడో... || నేనో బొట్టుని ! బ్రతుకు బాటలో వ్యధల మూటతో కృశించిన నశించిన బాటసారి గుండె కవాటాల శబ్ద నిశ్శబ్దాల మధ్య ఠప్పున జారిపడ్డ నెత్తుటి బొట్టుని ! చీకటి రక్కసి కబళించిన అబల కడుపు చించుకొని జన్మనిచ్చిన అనాధ బిడ్డ బొడ్డు కోసి రాల్చిన తొలి నెత్తుటి బొట్టుని ! ధనిక పేద వ్యత్యాసానికి కుల మతాల దౌర్జన్యానికి తాళ లేక వేసారిన ప్రేమ జంట కళ్లల్లో చిందిన కన్నీటి బొట్టుని ! రోజంతా ఒళ్లిరిచి గానుగలో ఎద్దులాగా రెక్కలేమో ముక్కలైన చివరికేమో పీనుగైన సగటు మనిషి పుడమిని తడిపే చెమట బొట్టుని ! నేను ప్రవహిస్తానెప్పుడో ** ** ** మీ దౌర్జన్యాలు , కులమత రాజకీయాలు, లైంగిక నిర్బంధాలు మీ అవినీతి , అమానవీయ అసమానతలు , మీ కుళ్ళు , కాఠిన్యం ఇంకా ఎన్నో ఎన్నెన్నో తుడిచేయడానికి, కడిగేయడానికి నేను ప్రవహిస్తానెప్పుడో హిమ శిఖరాలు కరిగి కన్నీరైనట్లు దిగంతాల స్వేదం మేఖాలై జలపాతాలై చిందిన రుధిరం చెలమలై ,సేలయేళ్ళై, ఉప్పెనై ప్రవహించినట్లు నేను ప్రవహిస్తానెప్పుడో ఉరుమై , మెరుపై , ఉత్తుంగ తరంగమై, కోటి కలల అలలనై ప్రవాహమే దేహమై దేహం ప్రవాహమై నేను ప్రవహిస్తానెప్పుడో.... || రాసింది 04.03.1988 || మొదటిసారి ప్రదర్శింది || 16/03/2014 ||

by Rajasekhar Gudibandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQsicl

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: హోలి...: హోలి అదెక్కడ.. సంధ్యా సుందరిని ముద్దాడి సిగ్గులుపోయిన తామరసాప్తుని కెంజాయ లోన కదా..! హోలి అదెక్కడ.. తుషార శీతల సరోవరాన నెలరేణి అనురాగ చూడ్కుల నడుమ వగలుపోయిన కలువ వాసంతి దగ్గర కదా..! హోలి అదెక్కడ.. రయమున పరుగెడుతున్న రవి కీరణం చందానికి నీలి వర్ణం పులుముకున్న అంబరపు సంబరానిది కదా..! హోలి అదెక్కడ.. మధ్యాహ్నాపు మార్తాండుని పరిష్వంగమున నలుపు తెలుపుల మిశ్రమాన్ని సంతరించుకున్న సముద్రుడి సరదాలది కదా..!! హోలి అదెక్కడ.. పంచశరుని వింటి దాటికి పులకించిన వనకన్య చిలిపిదనపు సెగల లోన కదా..! హోలి అదెక్కడ.. నీ చూపులు నా చూపులతో పెనవేసి విరితూపులు అయినప్పుడు కదా..! హోలి అదెక్కడ.. నా కన్నులు నీ కన్నులతో ఊసులాడి బాసలు చేసిన సేసల లోన కదా..! హోలి అదెక్కడ.. నీ హృదయం నా డెందం గూడి కుసుమ రంజిత సరాగములను ఆలపించుట లోన కదా..! హోలి అదెక్కడ.. నా ద్యాస నీ శ్వాస జతగూడి సంతసమున మయిమరచిపోవుట లోన కదా..! హోలి అదెక్కడ.. నీ మనో ఆకాశములో నా మనస్సు సంచరించి హరివిల్లయి విరిజల్లును వర్షించినపుడు కదా..! హోలి అదెక్కడ.. నేనే నీవై నీవే నేనై అనంతదారులలో అర్ధనారీశ్వర తత్వమును ఆవిష్కరించుట లోన కదా..! హోలి పండుగ శుభాకాంక్షలు..!! 16/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQshW3

Posted by Katta

Bandla Madhava Rao కవిత

Pasunuru Sreedhar Babu Kavitha Andhra Jyothi Sunday lo Chala adbhuthamaina kavitha

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQshVW

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కవి యాకూబ్ గారి ప్రోత్సాహం తో , ప్రముఖ రచయితల సహకారంతో మిత్రులిచ్చే లైకులు కామెంటుల ఉత్సాహం తో కవిసంగమం లో నేను రాసిన ""మట్టి రాతలు"" కవిత్వం ఇప్పుడు ఈ బుక్ గా కినిగే లో .... http://ift.tt/1kxhk9c

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQshFz

Posted by Katta

Kapila Ramkumar కవిత

నేటి సంస్మరణీయం...పేరుతో ఫేసు బుక్ లోకొంపెల్ల శర్మ గారు చాల విలువైన సమాచారాన్ని అందిస్తూ చేస్తున్న సాహిత్య సేవ ..శ్లాఘనీయం. వారికి వందనాలు!. మిత్రులారా మీరు చదవండి వారి సమాచాారాన్ని.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kxhk93

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ ||కలర్స్|| ======================== రంగులతో హోలీ ఆడుదామనుకున్నా జీవితమే రంగులమయమై గేలి చేసింది రంగుల కలయిక జీవిత అమరికగా మారి ఎరుపెక్కిన గుండెల్ని పిండేసింది ఎక్కడో ఆకాశంలో ఏడు రంగులు కనిపించాయి జీవితమే ఇంద్రధనుస్సుగా మారింది ఒక్కసారిగా దాగిన మబ్బులోచ్చి కమ్మేశాయి మనసుకు నల్లటి రంగు కప్పేసింది కనురెప్పల మాటున దాగిన కలర్స్ కళ్ళు తెరిసి చూస్తే రివర్స్ అయ్యాయి ఎందుకో కళ్ళల్లో కాంతి మనసులో బ్రాంతి ఒకేసారి కనుమరుగయ్యాయి అంతా రంగులమ(మా)యం ----------------------------------- మార్చి 16/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFOn61

Posted by Katta

Atmakuru Ramakrishna కవిత

kavithalaku swagatham

by Atmakuru Ramakrishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oj2xnz

Posted by Katta

Jagadish Yamijala కవిత

నాశం లేని బంధం --------------------------- రాయిగా ఉండేవాడిని శిలగా ఎందుకు మలిచావు ? శిలగా ఎదిగాను ప్రాణం ఎందుకు పోశావు? నా కనులు చెప్తాయి నువ్వు అందించిన భావాన్ని అది నీకే అర్ధమవుతుంది నీ హృదయంలో దాగిన నిజాన్ని నువ్వు చెప్పకుండానే నాకిక్కడ అర్ధమవుతుంది మనమిద్దరం పరస్పరం చెప్పుకునేటప్పుడు ఇక పరిభాష మనకెందుకు? అంతరాంతరాలలో మాట్లాడుకునే మనం ఇతరులకు అర్ధమవుతామా? ఆశా ఉలి ఘోషా నా ఊపిరి నాదమవుతాయి ప్రేమగా ప్రేమతో దీనిని చెప్పనా..? ఎప్పటికీ నాశం లేని బంధం మనది ----------------------------- మూలం తమిళ కవి పాలని భారతి అనుసృజన యామిజాల జగదీశ్ మూలానికి కొన్ని మార్పులు చేసాను. 16.3.2014 -----------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFOleA

Posted by Katta

Chennapragada Vns Sarma కవిత

ఎన్నికల ప్రస్థానం-6 ఘనచరితగల పార్టీకి అభ్యర్థులు కరువు.. పోటీ చేయబోమంటూ తీస్తున్నారు పరుగు.. ఓడలు బళ్లవడమంటె ఇదేనోయి భాయి.. జనం నాడి తెలుసుకుని మసలుకుంటే హాయి.. \16.3.14\

by Chennapragada Vns Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eFOleu

Posted by Katta

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు "స్రవంతి ఐతరాజు" హోలికా దహనం... చీకాకుల ఏకాకులు మదిని దూరి రొదపెడుతున్నాయ్ వీపున పాపపు మూటలు గుదిబండలుగా వ్రేలాడుతున్నాయ్ ఈ జన్మవా..గత జన్మవా..మరి ఏ జన్మవో తెలియరాకున్నాయ్ నిరాశల ఈసుళ్ళు మోమునిండా ముసురుతున్నాయ్ అందినట్టె అంది ఆనంద ఝరులెండమావులై మారిపోతున్నాయ్ అందినది అందగించక మరి అందనివేవో అమృతభాండములౌతున్నాయ్ అందాల ఆనందాల అందలాలెక్కాలలన్న మనసు గారాలు మారాలు చేస్తున్నాయ్ అందాల రేడు లేడని ఆశల విరులు ఆవిరులౌతున్నాయ్ సంసార సారాల నీరాలు క్షార సాగర క్షీరాలౌతున్నాయ్ మదిని మధురోహల తావున మౌనఘోషలెక్కువయ్యాయ్ మాసిన తలపులు తలుపులు మూసుకుని తలనిండా తన్నుకు ఛస్తున్నాయ్ చివరన శృతి తప్పిన యద రాగాలు అరణ్య రోదనల తలపిస్తున్నాయ్ చాలు చాలు స్వామీ.. ఇకనైనా రావేమీ? ఈ కోరికల "హోలిక"ల దహియింప క్షీరసాగర తరంగిణుల నను రక్షింప త్వర త్వరగతిన్ దశావతారాల దేనినైనా పూనో లేక ఏకాదశావతారుడవై రమ్ము నన్నుద్ధరింప..

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oj2zeV

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఆ జ్ఞాని ఏడి? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ఆ సరస్వతి బ్రహ్మలోకం దిగి వచ్చి ప్రేక్షకురాలై ఆసీనురాలవుతుందో ఆ జ్ఞాని ఏడి అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ఆ సప్తర్షులు సైతం దిగి వచ్చి ప్రేక్షకపాత్ర వహిస్తారో ఆ జ్ఞాని ఏడి అగుపించడేం! ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ఆ దిక్పాలకులు వచ్చి చుట్టూ కాపలా కాస్తారో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ఆ విశ్వజ్ఞానులు వచ్చి ఆ సభని అలంకరిస్తారో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం! ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే భూమాత తన బిడ్డలతో సైతం వచ్చి ఆ సభలో కూర్చుంటుందో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే అక్షరాలు ముసిముసినవ్వులు నవ్వుకుంటూ మురిసిపోతాయో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే పద్యాలు పరవశిస్తాయో పరిమళిస్తాయో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే ప్రశ్నలు దాసోహం అంటాయో బిక్కమొహం వేస్తాయో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఏడి? అతనేడి? ఎవరు జ్ఞానసభ నిర్వహిస్తే జ్ఞానవిజ్ఞానాలు అతనికి కిరీటాలవుతాయో అతని ప్రతిభకి పట్టం కడతాయో ఆ జ్ఞాని ఏడి? అగుపించడేం? ఓ జ్ఞానీ! ఏమైపోయావ్? నక్షత్రమండలం చేరి కనుమరుగైపోయావా? లేక ఆజ్ఞానాంధకారంలోకి చేరి అఖాతంలోకి కూలిపోయావా? ఏమైపోయావ్? నీ అదృశ్యంతో ఎంతమందిని నిరుత్శాహపరిచావ్! నీ కోసం నీ జ్ఞానదానం కోసం దాహంతో ఎదురుచూసే మాకు ఎంత నిరాశ మిగిల్చావ్! 15మార్చి20104

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oj2yYF

Posted by Katta

Kapila Ramkumar కవిత

Broken Music The mother will not turn, who thinks she hears Her nursling's speech first grow articulate; But breathless with averted eyes elate She sits, with open lips and open ears, That it may call her twice. 'Mid doubts and fears Thus oft my soul has hearkened; till the song, A central moan for days, at length found tongue, And the sweet music welled and the sweet tears. But now, whatever while the soul is fain To list that wonted murmur, as it were The speech-bound sea-shell's low importunate strain, - No breath of song, thy voice alone is there, O bitterly beloved! and all her gain Is but the pang of unpermitted prayer. Dante Gabriel Rossetti 16.3.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oix04Y

Posted by Katta

Saif Ali Gorey Syed కవిత

ఎప్పటికీ మనం ఇంతే .. a poem by GOREY SAIF ALI 1. నిన్ను నేను పోగోట్టుకోలేదు నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు జస్ట్ నువ్వు నా ఎదురుగా అలా చెట్టుకొమ్మల్లో వెళ్ళిపోయావ్ అంతే . 2. నిన్ను నేను ఏ రాత్రి వదిలిపెట్టలేదు నువ్వు నన్ను ఏ రాత్రి వదిలిపెట్టలేదు జస్ట్ మన మధ్య అలా మేఘాలు వచ్చి పోతున్నాయి అంతే. 3. నేను నిన్ను ఇంకా అర్ధం చేసుకోలేదు నువ్వు నన్ను అర్ధం చేయించే ప్రయత్నం చెయ్యడం లేదు జస్ట్ నీ పాటేదో అలా నా ముందుకు వచ్చి హమ్మ్ చేసి వెల్తుంటావ్ అంతే. 4. నేను నీ ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు నువ్వు నా ఇష్టమో లేదో అడగలేదు జస్ట్ నువ్వు నీ ఇష్టమొచ్చినప్పుడు నన్ను తడిపేసి వెల్తుంటావ్ అంతే. 5. నువ్వు ఇటువైపు లేవని బెంగ లేదు నేను అటువైపు లేనని బాధలేదు జస్ట్ గోడేదో అడ్డమున్నా కాని ఎక్కడో ఖుషి ఖుషిగా అల్లుకోపోతావ్ అంతే. 6. నేను నీ గురించి ఏమనుకుంటానో నువ్వు నా గురించి ఏమనుకుంటావో నాకు తెల్వదు జస్ట్ ప్రపంచం మనిద్దరి గురించి ఎంతో అనుకుంటది అంతే 7. నువ్వు వేరు నేను వేరు అయినా కలవక తప్పదు జస్ట్ పీచు మిఠాయి అయిపోయాక నన్ను పారేస్తారు అంతే. 8. నువ్వు కనిపించకడం లేదే అని నేను వెతకడం లేదు నా కోసం నువ్వు కనిపించాలనే ప్రయతం చెయ్యడం లేదు జస్ట్ నీ స్థాయిలో నువ్వు నన్ను ప్రేమించుకుంటూ వెల్తున్నావ్ అంతే .

by Saif Ali Gorey Syed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e552TJ

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 25 ఇది మార్చినెల కాబట్టి, మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం కాబట్టి ( ఇది క్రిందటివారం వ్రాసి ఉండాల్సింది. క్షంతవ్యుణ్ణి. మరచిపోడం కంటే ఆలస్యం మెరుగు.) అరేబియన్ నైట్స్ కథల నేపధ్యంలో వ్రాసిన ఈ కవిత స్త్రీత్వానికి Tribute. స్త్రీలో చూడవలసింది బాహ్య సౌందర్యం కాదని, ఆమెకున్న అపురూపమైన అంతస్సౌందర్యాన్ని చూడాలని ఎంతో సున్నితంగా చెప్పిన కవిత. కవిత్వంలోని అనేకలోపాలలో రొడ్డకొట్టుడు పదాలు వాడడం ఒకటి. సరోజినీ నాయుడు మొదట వ్రాసిన ఇంగ్లీషు కవితలని చదివి ప్రముఖ ఇంగ్లీషు విమర్శకుడు "Edmund Gosse" చక్కని కవిత్వం రాస్తున్న ఆమె తన భావాలని Anglicise చేస్తోందన్న బాధతో చాలా సున్నితంగా" స్కై లార్క్ లనీ, రాబిన్ లనీ మరచిపోయి, నీ పద్యాల నేపధ్యాన్ని అక్కడి కొండలలో, ఉద్యానవనాల్లో, దేవాలయాలకి పరిమితం చేస్తే మంచి భారతీయ కవయిత్రివి అవుతావని" సలహా ఇచ్చాడు. ఇది దేశానికే కాదు, కాలానికీ, పదాలకీ వర్తిస్తుంది. ప్రముఖకవులు వాడిన ఉపమానాలని వాడడం కవి భావుకతలేమికి సూచిక. కవిత్వంలో ఎప్పుడూ కొత్తదనముండాలి తప్ప ఒకరు చెప్పినది మరొకరు చెబితే విశేషమేముంది. అది అనుకరణో, గ్రంధచౌర్యమో అవుతుంది. ఒక ఉపమానం యొక్క ప్రాముఖ్యత కవి కవితలో చెప్పకుండ వదిలేసిన విషయాలని పరిపూరణ (Complement) చెయ్యడం. అందుకు పాఠకుడి అనుభవంలోని వస్తువులు బాగా దోహదంచేస్తాయి. ఇప్పుడెవరైనా చీకటి "సిరా"లా నల్లగా ఉందని అన్నారనుకొండి. అది నిజమే కావొచ్చు. కానీ బాల్ పెన్నుల వాడుకతప్ప సిరావాడకం ఎరుగని చాలా మంది పాఠకుల అనుభూతికి తెలియనిది. శ్రీశ్రీ అన్నాడనో, మరెవ్వరో వాడేరనో అదే పదప్రయోగం చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదు. కవి మార్గాన్ని వేసేవాడుగాని, వేసిన మార్గంలో నడిచేవాడు కాకూడదు. అలా అయినపుడు పదముద్రలు మిగలవు. అందుకు. . ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు . చంద్రముఖీ! పొద్దుతిరుగుడుపువ్వు సూర్యుడివైపు తన దళాలు తిప్పినట్లు, నేను పేజీ తిప్పినడల్లా నీ ముఖారవిందాన్ని నా కభిముఖంగా తిప్పుతావు సుహాసినీ! పత్రికలోని అందాల సుందరాంగీ! ఏ మగాడైనా నిన్ను చూడగానే మంత్రముగ్ఢుడౌతాడు . నీ మీద ఎన్ని కవితలు రాసి ఉంటారు? ఓ బియాట్రిస్! నీకెంతమంది డాంటేలు ప్రేమలేఖలు వ్రాసి ఉంటారు నీ భ్రాంతిమదాకారానికి? కల్పిత భావ వివశత్వానికి? . కానీ, ఈ రోజు నేను మరొకసారి అరిగిపోయిన మాటలనే వాడి నీ మీద కవిత వ్రాయదలుచుకో లేదు. చాలు, చాలు! ఇక ఈ రొడ్డకొట్టుడు పదప్రయోగాలు. . ఎవరి సౌందర్యం తెచ్చిపెట్టుకున్నదిగాక, వాళ్ళ స్వయం ఆకర్షణ శక్తిలో ఉంటుందో, వాళ్ళ తెలివితేటలలో ఉంటుందో, వాళ్ళ సహజసిధ్ధమైన నడవడిలో ఉంటుందో అటువంటి స్త్రీలకి నేనీ కవితని అంకితం ఇస్తాను . ఈ కవిత షహజాదేలా ప్రతిరోజూ ఒక కొత్త కథని చెప్పడానికి మేల్కొనే స్త్రీలకోసం, కొత్తదనాన్ని ఆలపించే కథలు... యుధ్ధాలని ఆహ్వానించే కథలు... పెనవెసుకునే హృదయాల ప్రేమకై యుధ్ధం... ప్రతి దినమూ మనసులో రగిల్చే వినూత్న రాగాలకై యుధ్ధం... ఉపేక్షించబడ్డ హక్కులకై యుధ్ధం... లేదా, మరొక్క రాత్రి బ్రతికి బయటపడడానికి సలిపే యుధ్ధం. . అవును, బాధామయజగత్తులోని స్త్రీలు మీకందరికీ, సతతవ్యయశీలమైన ఈ విశ్వంలో ప్రకాశించే నక్షత్రాలవంటి మీకు, వెయ్యిన్నొక్కరాత్రులు పోరు సల్పిన నీకు, నా ఆప్తస్నేహితురాలివైన నీకు. . ఇక నుండీ, అందాన్ని చూడడానికి నేను పత్రికలలో వెతకను... దానికి బదులు రాత్రినీ, వినీలాకాశం లోని మెరిసే తారకల్నీ ఊహిస్తాను. చాలు! ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు. . (షహజాదే: వెయ్యిన్నొక్క రాత్రులనబడే అరేబియన్ నైట్స్ కథల్లో, తెల్లవారేదాకా రోజుకొక కథ చెబుతూ, కథలోని ఉత్సుకత నిలబెడుతూ తనజీవితాన్ని మరొక్కరోజు పొడిగించుకుంటూ అతి చతురతతో తన లక్ష్యాన్ని నిర్వహించిన కథానాయిక) . ఆక్టేవియో పాజ్ . No More Clichés . Beautiful face That like a daisy opens its petals to the sun So do you Open your face to me as I turn the page. Enchanting smile Any man would be under your spell, Oh, beauty of a magazine. How many poems have been written to you? How many Dantes have written to you, Beatrice? To your obsessive illusion To your manufactured fantasy. But today I won't make one more Cliché And write this poem to you. No, no more clichés. This poem is dedicated to those women Whose beauty is in their charm, In their intelligence, In their character, Not on their fabricated looks. This poem is to you women, That like a Shahrazade wake up Every day with a new story to tell, A story that sings for change That hopes for battles: Battles for the love of the united flesh Battles for passions aroused by a new day Battles for the neglected rights Or just battles to survive one more night. Yes, to you women in a world of pain To you, bright star in this ever-spending universe To you, fighter of a thousand-and-one fights To you, friend of my heart. From now on, my head won't look down to a magazine Rather, it will contemplate the night And its bright stars, And so, no more clichés. . Octavio Paz March 31, 1914 – April 19, 1998 Mexican Poet (Former Ambassador to India)

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eEMLtx

Posted by Katta

Shaik Meera కవిత

ఎగిరేది తిరుగుబాటు ఎర్ర రంగు చిహ్నమే... ఎక్కడైతే మానసిక క్షోభకు గురి అవుతావో ఎవ్వరైతే నా అనుకున్న వాళ్ళు నిన్ను లెక్కకేసుకోరో పదుగురిలో నీకు పేరున్నా నిన్ను నీ చాటు మనుషులే దిగజారుస్తుంటే నువ్వేస్తున్నఅడుగు ముందడుగు అయినా బురద అంటగడుతుంటే బావిలో కప్పని నీ సమర్ధతని వంకపెడుతుంటే పిల్లి అని నిన్ను చులకన చేస్తుంటే నీ బతుకు నీకు బోర్ కొడుతుంటే నీ వాళ్ళు నిన్ను అవమానిస్తుంటే అప్పడే అప్పడే ఆ క్షణమే అటు పిమ్మటే ఆ తరుణం నువ్వో కిరణం అవుతావు బావిలో నుంచి పిల్లి కాన్నుంచి పులిలా గాండ్రిస్తూ క్రొత్త త్రోవ్వై నూతన కాలమై నవ గీతమై దశ అవతారమై మార్మోగే నాదమై మరో ప్రస్థాన మహా ప్రస్థాన రథ సారధి నువ్వై కోటి అశ్వాల గెలుపు సంకేత ధ్వని నువ్వై అనంత పతాక రెపరెపల పవన కెరట సడి నువ్వై జ్వలిస్తూ జ్వలిస్తూ లావాలా పెల్లుబికే సూర్యుడిలా ఎరుపెక్కే నీ దారికి ఎదురేది నీ నీడ కు గొడుగేది నీ చలనానికి అంతేది నీ వెలుగుకి చీకటేది నీ జెండే విప్లవ శిఖరమైనాకా శిఖరంపై ఎగిరేది తిరుగుబాటు ఎర్ర రంగు చిహ్నమే.......షేక్ మీరా ,,,,,,,, 16/03/2014

by Shaik Meera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7LAue

Posted by Katta

Jaya Reddy Boda కవిత

//జయ రెడ్డి బోడ // ఓ కవి కల ఇలా // మంచితనమంతా చరిత్ర ప్రవాహంలో కలిసి పోయి గతమంతా ఘనీభవించి ,, ఈ మర మనిషి లోకమంతా నాగరికతల ముసుగులో మునిగి మమతలు దహనమై మనసు మసి అయిపోయి.. విశ్వమంతా ద్వేష విషజ్వాలలు సంతరించుకున్నాక ఎక్కడి నుండి వచ్చారో ఆ కాంతి వీరులు, వారితో పాటు జతకట్టి ఇంకొంత "మానవత వాద" దూతలు, కొన్ని అనుభూతులు మిగుల్చుకున్న పిట్టలకు అవాసాలుగా మారి కల్లోల నిశీధి లో బలవన్మరణం లా కల్లుమూసుకొని, నిర్వీర్యుడు గా కాలం గడుపుతూ ఉన్న నన్ను, తమ సూటి ప్రశ్నల ములుకులతో గ్రుచ్చుతూ,ఒక ప్రక్క అక్షర తీపిదనాల ఆశ చూపుతూ వారంతా ఒకటే పోరు .. ఆశలు ఆవిరై .. ప్రేమ తైలం అడుగంటు నప్పుడు క్రొత్త వత్తులు వేయమంటారు ఎలా .. ఆకులు రాలి మోడువారిన మనసులకు క్రొత్త చిగురులు పూయించమంటారు .... మ్రొగ్గ దశలోనే ..పర భాషా యంత్రాలుగా మారుతున్న, పసి హృదయాలకు మాతృ భాషా కంచెలు నిర్మించమంటూ .. కానీ ఎలా ? ఏలిక లే, ఓటూ సీటూ కోసం మధ్యం వర్తకం వ్యాపింప చేస్తున్నప్పుడు ఇక పామరులు ఆ పాపపు నోటుకు అమ్ముడై, పంక రూపముగా మారి పోతున్నప్పుడు అనుమానపు వైవాహికం అదాలత్ అద్దాల్లో విడి వడి, బొమ్మలుగా మారినప్పుడు, ఉమ్మడి జీవనం తెగిన తోక చుక్కలుగా రాలి కనుమరుగైనప్పుడు, ఆరాద్యమె.. వెక్కిరింతలుగా తెరపై వాదోపవాదాలుగా పరిణమించినప్పుడు మనుష్య సంబంధాలన్ని తమను తాము,తామే సృష్టించుకున్న డబ్బు మూటల్లో బంధించుకున్నప్పుడు ఒక చోట తోట కోసం, ఒక చోట ఫ్లాటు కోసం, ఒక చోట మూల ధనం మూట కోసం పేచిలై, కన్న వారి పోషణ కాటిన్యమై ప్రస్నార్ధకం గా మారినప్పుడు.. ఇలా దేహాలన్నీ శత సహస్త్ర పైశాచిక అనందాల్లో పడి ఇహ పర సంబంధాలు వీడి కొట్టుకుంటుంటే, ఇక ఎలా జరుపను ? ? ? ఒకరి నొకరు ఆత్మలతో కలుసుకొనే ఆ కవి సంగమాలు కవిత్వపు ఇష్టా గోష్టులు, మనిషి మనసుకు మమతలు అద్దీ మళ్లీ మానవత్వపు పరిమళాలు వెదజల్లే ప్రక్రియ జరిగేనా? కవి కన్న కలలు నెరవేరేనా ఇక ఈ మనుష్య జీవితానికి మేలు జరిగేనా .. ఇంకొన్నాళ్ళకైనా ..ఇంకెన్నాళ్ళ కైనా .... ఇది ఇలా జరిగేనా ??? (16-03-2014.. ప్రపంచ కవిత్వ పండుగ రోజున..కవి కల నిజం కావాలి అని ఆశతో )

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eEMLcX

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్//ప్రేలాపన// నేనూ అతనూ రెండు గ్లాసులూ కొన్ని నిమిషాలూ ఒక జీవితం ఇంకేం లేదు కాస్త కవిత్వం వొలికి మనసుపై మరకలు పడ్డాయంతే మరక మంచిదే..... 15/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7AwgA

Posted by Katta

Vijaykumar Amancha కవిత

తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? తెలంగాణ వేరైతే తెలుగుబాస మరుస్తారా? తెలంగాణ వేరైతే కిలోగ్రాము మారుతుందా? తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపొతుందా? తెలంగాణ వేరైతే చెలిమి తుట్టి పడుతుందా? తెలంగాణ వేరైతే చెలిమి లెండిపొతాయా? కులము తగ్గిపొతుందా బలము సన్నగిలుతుందా పండించి వరికర్రల గింజ రాలనంటుందా? రూపాయికి పైసాలు నూరు కాకపొతాయా? కొర్టు అమలు అధికారము ఐ.పి.సి. మారుతుందా? పాకాల, లఖ్నవరం పారుదలలు ఆగుతాయా? గండిపేటకేమైనా గండితుటు పడుతుందా? ప్రాజెక్టులు కట్టుకున్న నీరు ఆగనంటుందా? పొచంపాడు వెలసి కూడ పొలము లెండిపొతాయా? తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? –కాళోజీ

by Vijaykumar Amancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m7Avtc

Posted by Katta

Aruna Naradabhatla కవిత

కన్నీటి విందు ___________అరుణ నారదభట్ల కొంత కాలంగా మా వాడలోని ప్రదాన రహదారంతా సందడే! వచ్చిపోయే వాహనాల రద్దీ పట్టణ జీవనానికి పరమావధే గానీ మూలమలుపు నుండీ ముక్కుపుటాలు గజిబిజి గందరగోళంలో గల్లంతులో పడతాయి! పొద్దున్నే రోడ్డెక్కి బాధ్యతగా పర్సునింపుకొని ఇల్లు చేరే ప్రాణాలకు ప్రేమగా అక్కున చేర్చుకునే ఆప్తుడిలా నడి బజారులో ఓ అద్దాలమేడ! మాయకమ్ముకోవడం అక్కడే మొదలు! మసక చీకటిలో మనసు జోరు నిండిన జేబులు నిలువునా నాళీలో ఖాళీగా పడిపోవడం! నూనెలో వేగే జీవితాలు ఆ అడ్డకు ఆనవాళ్ళు... బండెడు మల్లెపూలు కూడా అక్కడి గాలికి తలవంచుకొని పోతాయి! చుట్టుపక్కల జీవితాలు కొంగు కప్పుకొని పదిల పడాలి... ఏ మైకం మీద పడుతుందో తెలియని స్థితిలో అసహ్యించుకునే గుబులు చూపులు పక్కనున్న హాస్పిటలుకు వెళ్ళాలన్న అక్కడినుండే! నడిచే దారంతా మత్తు కమ్ముకొని స్వచ్చతకు కూడా మాయరోగం అంటగడుతూ పచ్చని పసి మొలకలు కూడా వాడిపోయేలా వీధిన పడి నిలుచుంది! సొమ్ము కోసం రాజకీయం భావితరాన్ని బలిపశువును చేసింది! యూత్ చేతులిక్కడ బాటిళ్ళతో చీయర్స్ కొడుతున్నాయి.... కాలేజీ కల్చర్లు బార్లముందర బారులు తీరి కన్నగుండెలను...కన్నె గుండెలను కన్నీటితో తమ గ్లాసులు నింపి వడగట్టి వడిపెట్టి తాగుతున్నాయి! ఇప్పుడీ విందు ప్రతి సందీ వ్యాపించింది నోళ్ళుంటే రోడ్డూ తల బాదుకొనేలా నేతన్నల నిర్వాకం జీవితాలతో ఇలా చెలగాటం! 16-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oXRmf6

Posted by Katta