పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మార్చి 2014, బుధవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-31 ఒక ప్రణాళిక ప్రకారమే ఊగాలని ఆకులూ అనుకుంటాయి... ఏ గాలి ఏ వైపు నుంచి ఏ వేగంతో వీస్తుందో వాటికి మాత్రం ఏంతెలుసు కనక..! ఏవరి జీవితాన్ని వారు తమ ప్రణాళిక మేరకే రూపొందించుకోవాలనుకుంటారు.. ఏ అనుభవాలు ఏ వైపునుంచి ఏ దిశకి తోసుకుపోతాయో ఏవరికి ఎరుక...? జీవితం అంతా మన ప్రణాళిక కాదు అలాగని అనిపిస్తే అది నీ తప్పు కాదు..! -------------------------------------------- 5-3-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jRzHoT

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవితby రంజిత్ రెడ్డి కర్రfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kyaOla

Posted by Katta

Mohammad Abdul Rawoof Chinni కవిత

" చిన్ని " // నేటి ప్రపంచం // ================= రెండు చేతులు భగవంతుని వైపు చూపి తినడానికి తిండి లేక పనిచేసే ఓపికలేక ఎముకలలో సత్తువలేక ఎండిన డొక్కలతో వొంగిన నడుముతో బ్రతుకు జీవుడా అని ఒకవైపు తల్లడిల్లిపోతున్న ప్రాణాలు బ్రతుకుతుంటే మందు బాబుల మాయా ప్రపంచం మత్తులో ఊగుతుంది ధూమపానంతో దద్దరిల్లి పోతుంది పొగాకు పేరుతో ప్రక్కదారి పడుతుంది కుల, మత, వర్గ విభజనతో హోరెత్తిపోతుంది ఒకడి ఇంట్లో అన్నం తినడానికి గురుతుకురాణి కులం వాడికి న్యాయం చేయమంటే గురుతుకొస్తుంది. ఒకడి దగ్గర డబ్బులు తీసుకోవడానికి అడ్డం రాణి మతం వాడికి సాయం చేయమంటే అడ్డుపడుతుంది తల్లి, చెల్లి లాంటి సాటి ఆడపిల్లని చులకనగా చూస్తుంది పసిబిడ్డలని పోత్తిల్లలోనే చంపుకునే విష సంస్కృతితో అల్లాడిపోతుంది ప్రేమ, ఆప్యాయత, మనసు, మమత మరిచి మాయ మాటలు నేర్చుకుంటూ విషపు భీజాలు నాటుతుంది ఇదేనా సమాజం...ఇదేనా ప్రపంచం భగవంతుడా...! చిమ్మ చీకటింట్లో చందమామ బ్రతికినట్లు కారు చీకటిలో మినుగురు మెరిసినట్లు ఎదురీది పోరాడే జీవితం (శక్తి) ని మాకివ్వు. @ చిన్ని @// 05-03-2014

by Mohammad Abdul Rawoof Chinnifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f7hPBh

Posted by Katta

Krishna Mani కవిత

మా అవ్వ ********** మా అవ్వ ! కాళ్ళకు కడియాలు నడుముకు ఎండి పట్టి చేతులు మెరిశే గోట్లతోడ గాజులు మోజేతికి కడియమేషి మేడల గుండ్లారం ముక్కుపుల్ల చెవుల గెంటీలు ముతకశీరల నోసలుకు పెద్ద బొట్టుతో సున్నీకే తమాషగుంది ! మా అమ్మానాయిన అదృష్టం చూశిన్రు కండ్లనిండ ఆ అందం మాకయితే పాత పోటవల జూసి మురుసుడాయే ! కృష్ణ మణి I 05-03-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e10iv6

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || నీ పక్కనే నిలబడుంటాను || దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా నీవు ఎక్కడ ఉన్నా అయోమయం మబ్బులు నిన్ను కమ్ముకునున్నప్పుడు, నీవు ఆశా విహతివైన క్షణాల్లో నీకు నీడను కల్పిస్తూ, ఒక నమ్మకం అవసరాన్ని లా .... నీ పక్కనే, నేనుంటానని చెబుతున్నా ఆ నక్షత్రాల సాక్షిగా నేను, ఒక సామాన్యుడ్ని! నీముందే నడుస్తున్నా .... నీ తోడుగా చీకట్లు కడతేరేవరకూ నవ్వులు పంచుకుంటూ, నీ కన్నీళ్ళూ, బాధలకు ఊరడింపు ఉపశమనాన్నిస్తూ, నిన్నే ప్రేమిస్తూ, నీ బలహీన క్షణాల్ని బలోపేతం, ఆహ్లాదంగా మారుస్తూ, ఒక నమ్మకం, దృడ సంకల్పం లా .... నేను నీవు నిర్భయంగా వచ్చినప్పుడు నిన్ను పొదువుకునేందుకు సిద్దం గా మానసికంగా .... నీవు కృంగిపోతున్నప్పుడు, నీ భావనల ఒంటరితనం .... గతం నిన్ను వెంటాడుతున్నప్పుడు, వెనుదిరిగి చూడు .... నీ గతాన్ని కాదు .... నన్ను నిర్భయంగా నా వద్దకు రా! నీవు కృంగిపోతున్నప్పుడు, నీకూ తెలుసు .... ఎప్పుడైనా నిన్ను వంచించని నా దరికి రావొచ్చని నేను నీ పక్కనే ఉంటానని మాటిస్తున్నాను. నీకు నీవు విశ్చిన్నమయ్యాననిపించి ఏడుస్తున్నప్పుడు నీకు నమ్మకాన్ని కలిగించుతూ చేతిలో చెయ్యేసి ఒట్టేసి చెబుతాను. నా మాట నమ్మమని నా ఒట్టు ఎంత మాత్రమూ అబద్దం కాదని నీవు అసహాయురాలివి కాదని నీకు తెలిసేలా .... ఔను నీకూ తెలిసేలా నీవు ఎప్పుడైనా నా వద్దకు రావొచ్చని నేను నమ్ముతాను. ప్రతి రోజూ సూర్యోదయం లానే సూర్యాస్తమయమూ తప్పదని అయినా, నీపై నా ప్రేమకు అస్తమయం లేదు. అది రాత్రి వేళ దీప కాంతి లోనూ నీ నీడ లా నీవెంటే ఉంటుందని మాటిస్తున్నాను. 05MAR14

by Chandrasekhar Vemulapallyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kxARJ5

Posted by Katta

Kapila Ramkumar కవిత

మెరాజ్ ఫాతిమా||ఆయువు తరగని ఆకలి బూచి! బూచి..!|| పుట్ట్టల్లో,పిట్టల్లో,పువ్వుల్లో,నవ్వుల్లో కలిసిపోయి ఆడుకుంటూ..., గాలిలో,దూళిలో కలతిరుగుతూ, పావురంలా,పాలపిట్టలా ,గాలిపటంలా, వేపచెట్టుకింద నేనూ,చిట్టీ, మొగుడూ,పెళ్ళాం ఆట ఆడుతున్నాం. నేను తొడలకంటిన మట్టి దులుపుతూ, చెడ్డీలేకున్నా, పొడుగు చొక్కాచేతులు మడతపెడుతూ, పనికెళ్తున్నా తలుపెసుకోవే.. అన్నాను దర్జాగా. తలలో రిబ్బను పైటలా వేసుకొని, పోట్టిగౌను ఎగ్గట్టుకొని, పప్పూ,ఉప్పూ తెండీ, పిల్లగాళ్ళకు వన్నం వండుతా అన్నది చిట్టి, అదిగో..అదిగో.. అదిగో అప్పుడొచ్చింది బూచి....! అమ్మా, అయ్యా, తరిమేయలేని బూచీ, తరాల తరబడి మమ్ము తన్ని తమాషా చూస్తున్న బూచి. మా చిట్టి చేతుల్లో మట్టికొట్టి, మా పొట్టలో జొరబడి మమ్ము పట్టి పీడించే బూచి. ఎంగిలి ఆకులు నాకించి, కుక్కలతో కరిపించి, కక్కిన కూటిని తినిపించే, ఆకతాయి బూచి, అల్లరి బూచి, మా వంటి వేలాది మందిని, కబళించే బూచి, కాటేసే బూచి. ఎన్నితరాలైన ఆయువు తరగని బూచి, ఆకలి బూచి. అవును ఆకలి బూచి....! http://ift.tt/1kZdcyr

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZdcyr

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। స్పర్ష ।। ---------------- ఇరువురి మనసులూ నగ్నంగా తడుముకున్నప్పుడు నువ్వు నాలో.. నేను నీలో .. మొలకెత్తే సరికొత్త స్పందనల స్పర్ష . నీ దరహాసం మేనిని రాపాడి పోయినప్పుడు ఎద లోయల్లో కోట్ల అణువులు మణి రాశులై మెరిసేలా . కాలి అందెల చిరు సవ్వడులు నా కర్ణభేరి అర పొరల్లో సుమదుర గీతక సుస్పర్ష . గిరి అంచుల జారి నేలలో ఇంకిపోయిన నీటిచుక్కలా నా సావాసం వీడి కనుమరుగై వేధనల స్పర్ష . నువ్వు నాలో తొణికినప్పుడు నింగినుండి రాలి నేలను చుంబించిన చినుకు ముత్యంలా హిమపు స్పర్ష . నువ్వు సూన్యంలో తారకలా నా పిలుపు అందనంత దూరంగా నాలో నేను కాళీ అవుతున్నట్టు నన్ను నువ్వు కాల్చేస్తున్నట్టు జ్వాలా స్పర్ష ! (05-03-2014)

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fGZJGd

Posted by Katta

Poornima Siri కవిత

పూర్ణిమా సిరి || నువ్వు|| ఏదో ఒక మలుపులో మన కలయిక తప్పదు,నువ్వు కలుస్తావనే స్పృహతో జీవించడం నాకు సాధ్యం కాదు,చేరలేని తీర దూరాల కోసం వేచే నేను కలవక తప్పని నిన్నెందుకో మోహించలేను,అలా అని ద్వేషించనూ లేను.. నిశ్శబ్దనీరవంలోకి జారిన ప్రతీసారి నాకు నీ స్పురణ వస్తుంది,నువ్వు హత్తుకుంటే బాగుండు అని చిత్రమైన చిత్రాలను చిత్తం సృజిస్తుంది, నీకంటే నాకు ఆప్తులెవరున్నారు! నీకున్నంత మోహం నాపై ఎవరికుంది గనుక? నీలో నేను కరిగాక ఈ లోకం లోని బంధాలన్నీ అబద్దాలనిపిస్తాయి. నిజాన్ని జీర్ణించుకోవడం మొదలు పెడతాను కానీ ప్రయాసంతా కొన్ని ఘడియల్లోనే ముగిసిపోతుంది మళ్ళీ ఆట మొదలు, నాతో ఊహలో,నేను ఊహలతోనో ... మరిన్ని బొమ్మలు,కొత్త ఆట నీవు నన్ను గెలిపించేంత వరకు.. అన్నీ నన్ను నవ్విస్తూ,కవ్విస్తూ,అన్నీనిజాలేనని భ్రమింపజేస్తూ ,కొత్త ప్రయాణాలకు ప్రారంభ గీతికలు ఆలాపిస్తూ, జీవధారను ప్రసరింపజేస్తూ,నీకు దూరంగా పరుగెత్తుతూ వెనకటి వాసనలు వదలని కొత్త నేను కానీ నువ్వెప్పుడూ అలానే! ఏ మార్పూ లేకుండా,కరుణా భరిత నయనాలతో, ప్రేమగా హత్తుకోవడానికి సిద్దంగా!! నాకెన్నెన్నో పేర్లు,మరెన్నో రూపాలు...నువ్వేమో ఎప్పటికీ ఒకే పేరుతో... అన్నింటినీ నీలో దాచుకునేంత అనాదితత్వంతో ,అనురాగంతో నీటి బింధువులా నేను.. సముద్రం,సూర్యతాపాల సంతులిత శక్తిలా నువ్వు అప్పుడే నిన్ను మృత్యు కన్యకవనుకుంటా పునర్జన్మ నిచ్చే ఏకాంతమై ఎదురవుతావు లోలోని నీశీధి రాగమా! ఏకాంతమా! అంతులేని ప్రేమ నీది అర్థాలు వెతుక్కునే ఆరాటం నాది 5.3.14

by Poornima Sirifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dq3jbv

Posted by Katta

Kapila Ramkumar కవిత

అమ్మ ఫోటో||ప్రసాదమూర్తి మా అమ్మాయి మంచి పనేచేసింది నా సెల్ ఫోన్ లో అమ్మ ఫోటో పెట్టింది. అమ్మను ఎప్పుడు చూసినా... పొత్తిళ్లలో ఉన్నపుడు మా అమ్మాయి నవ్వినట్టే ఉంటుంది. నేనెక్కడికి వెళ్లినా అమ్మ ఫోటో నా చేతుల్లోనే ఉంటుంది పుట్టినప్పుడు నేను అమ్మ చేతుల్లోనే ఉన్నట్లు. ఎవరో తెలిసిన వారో..తెలియని వారో నా జేబులో రింగుమన్నప్పుడు అమ్మ ఒక్కసారిగా వెన్నెల పువ్వై విచ్చుకుంటుంది అమ్మ, ఫోటోలోనే ఉన్నా... ప్రాణమున్న బొమ్మలా నా చేతుల్లోనే ఉన్నట్టు నా శరీరం మొత్తాన్ని అమ్మకు స్తన్యం చేసి ఇస్తున్నట్టు ఏదో తన్మయత్వం ఎక్కడో ఊళ్లో ఉన్న అమ్మను తీసుకొచ్చి నాఒళ్లో పడేసింది మా అమ్మాయి నన్ను గుర్రం చేసి... మా పాప ఆడుకున్నట్టు ఇప్పుడు అమ్మ కూడా నాతో ఆడుకుంటోంది. ఊసుపోనప్పుడల్లా.. ఎందుకెందుకో ఏడుపొచ్చినప్పుడల్లా అమ్మ ఫోటోలో రెండు కళ్లూ రెండు తాళ్లుగా ఉయ్యాల ఊగుతుంటాను. అమ్మను ఫోటోలో చూస్తే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టే. అమ్మ ఫోటోలో నవ్వుతుంటే నేను జీవితంలో ఇవ్వలేని ఆస్తిని నా పిల్లలు అమ్మ ఫోటోని దస్తావేజుగా దాచుకుంటారులే అని ధీమా. నా సెల్ ఫోన్ వాల్ పేపర్ మీద అమ్మ ఫోటోని అతికించి నా బంగారుతల్లి భలేపని చేసింది పిచ్చిది నేనేమైపోతానో అని బెంగ దానికి ఏమైనా జరిగితే అమ్మ బతికించుకుంటుందట. అందుకే ఒక్కమాట చెప్పాలి సమాధులు కడతారో..దహనం చేస్తారో కానీ అమ్మనీ నన్నూ ఒకే ఫోటోలో పెట్టమని చిన్న రిక్వెస్టు. ========== ======== ( నాన్నచెట్టు కవితా సంపుటి నుంచి)

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hJcoO3

Posted by Katta

Panasakarla Prakash కవిత

అ౦తిమ స౦స్కార౦ వాళ్ళో వీళ్ళో ఎవరో కాదు... నేను లేని రోజే ఒకటి వస్తు౦ది.. అప్పుడు బహుషా నా శవ౦ పక్కన చాలామ౦ది విచారవదనాలతో ఉ౦టారు ప్రశా౦తవదన౦తో ఉ౦డేది....నా..పార్ధివ‌దేహ౦మాత్రమే.. ఎవరి మనసులో ఏము౦దో నాకు అప్పుడుకూడా తెలీదు తెలిసేదల్లా ఒకటే...కన్నీళ్ళ విలువ.. శవ౦మీదపడి ఏడ్చేవాళ్ళ౦తా నా వాళ్ళనుకోలేను.. కొన్ని కన్నీళ్ళు నా గు౦డె లోతుల్లోకి ఇ౦కకు౦డా పక్కకి జారిపోవడ౦ నేను గమనిస్తూనే ఉన్నాను కొడుకులు కోడళ్ళు మనుమలు మనుమరాళ్ళు.. కూలిన ఈ మూల వృక్షాన్ని కన్నార్పకు‍‍‍‍‍‍‍‍‍౦డా చూస్తున్నారు...ఇదే ఆఖరి చూపని కాబోలు.. స్నేహితుల కన్నీళ్ళు రాలి ఇ౦కుతున్నాయి నేలలోకి..నాకు తోడుగా ఉ౦డడానికి నన్ను కట్టుకున్నది మాత్ర౦ ఒకి౦త‌ అసహన౦తో రగిలిపోతూనే ఉ౦ది.. తను "పుట్టి"ని౦టి ను౦చి తెచ్చుకున్న పసుపు కు౦కాలని తీసుకుపోయిన౦దుకు కాదు పెళ్ళిపీటలమీద ఇచ్చిన మాట నిలబెట్టుకోకు౦డా నేను ఒ౦టరిగానే వెళ్ళిపోయిన౦దుకు.. నాగురి౦చి వచ్చినవాళ్ళు మాటలాడుకు౦టు౦టే..తెలిసి౦ది నా ఒక్కడిలో ఎన్ని అవతారాలున్నాయోనని... ఎదైతేనే౦ ఈ జన్మను చాలి౦చడ౦ ఆన౦దమే మరుజన్మ౦టూ మొదలయ్యేది బాల్య౦తోనేకదా అరవై స౦వత్సరాలుగా నన్ను బాబై బావ తమ్ముడు అన్నయ్య అని ఇన్ని వరసలతో పిలిచిన వాళ్ళే పోయి పదినిమిషాలైనా కాలేదు అ౦దరూ ఇప్పుడు నన్ను ఒకే వరుసతో పిలుస్తున్నారు....శవమని నన్నెక్కడ తగలెయ్యాలి అనే విషయ౦దగ్గర్ను౦చి పెద్దదినానికి ఎ౦తమ౦దిని పిలవాలి అనే విషయ౦వరకూ అన్ని చర్చలూ నా శవ౦దగ్గరే జరుగుతున్నాయి... అనవసరపు ఖర్చొద్దురా... చెబుదామని లేవబోయాను.. నేను శవాన్నని గుర్తొచ్చి౦ది... ఇ౦కా ఎవరైనా రావాల్సినవాళ్ళు ఉన్నారా....? లేరని రూఢి అయ్యాకా ఇక నా పయన౦ మొదలయ్యి౦ది.. ఒకప్పుడు నేను నడుస్తూ.. పరిగెత్తిన దారిలోనే.. ఇప్పుడు నలుగురి భుజాలమీద ఊరేగుతూ..... స్మశాన౦కూడా నాకు తెలిసి౦దే.... అది దాటే రోజూ మా పొల౦ వెళ్ళేవాడిని కాటికాపరినికూడా రోజూ పలకరి౦చేవాడిని.. ఇప్పుడు వాడే నన్ను తగలబెట్టాల్సి౦ది కొరివిపెట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు నేను మాత్ర‍౦ చివరివరకూ అక్కడే నిలబడ్డాను నాతో చివరివరకూ వచ్చి నన్ను బ౦ధ విముక్తుడ్ని చేసి దహనమౌతున్న దేహానికి చివరి నివాళినర్పిస్తూ........... పనసకర్ల‌ 5/03/2014

by Panasakarla Prakashfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1opizqL

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

అక్షరాలు సిగ్గిల్లుతున్నాయి_మధురోహల్ని కలం విదిలిస్తుంటే ..@శర్మ \5.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1opgnQ5

Posted by Katta

Aruna Naradabhatla కవిత

చినుకులు __________అరుణ నారదభట్ల అంతగా పరిగెత్తే మబ్బులను చూస్తుంటే ఎందుకో అనుకున్నా...! వెలుగును ముంచేస్తూ చిమ్మచీకట్లను మోసుకొస్తూ ఒక్కో మేఘాన్ని రాజేస్తూ చినుకుల్లా దులిపేస్తుంటే అనుకున్న చల్లగా నన్ను చేరేందుకేనేమో అని ఇంతటి పట్టణంలో వాటికి సేదతీరడానికి చోటెక్కడుందీ! అన్ని దారులూ నిండుకున్న భవంతుల సందుల్లోంచి వరదై రోడ్డునపడి వచ్చిపోయే వాహనాలను అక్కడే ఆపి కాళ్ళచుట్టూ పెనవేసుకొని తమను వెళ్ళనీయమంటూ వేడుకుంటున్నాయి...కన్నీళ్ళై! ఇలాంటి నగరాల్లో వర్షపు నీటికి చోటెక్కడుందీ... మనిషికి మనిషీ రాచుకుంటూ తిరిగే ఈనేలే దొరికిందా విశాలప్రపంచాన్ని వీడి ఇక్కడే పడిందీ వాన! అవసరానికి పనికిరాని స్నేహితురాలిలా ఈ వేసవి ప్రారంభాన వాన మొలకెత్తిన పంటలనూ ...మామిడి పూతనూ శిశిరాన్ని పంపించి వసంతాన్ని మోసుకొస్తూ కొత్తగా మళ్ళీ గొంతును సవరించే కోకిలలను బాధపెడుతూ భయంలో ముంచేస్తుంది! పంటనష్టం ఎలాగూ జరిగింది మరి అవసరమున్నప్పుడు మళ్ళీ తొంగిచూస్తుందో లేదో ఈవాన... ఈ మట్టిలేని నగరాల్లో కాకుండా మనసున్న పల్లె జీవనంలోకి కురిసిందో పచ్చదనపు శాలువలతో అక్కున చేర్చుకొని సన్మానిస్తారు...! అక్కడైనా తన ఉనికి కాపాడుకుంటే సరి అవసరానికి అందివచ్చిన ఆప్తుడిలా! 5-3-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1opgmvl

Posted by Katta

Srinivasa Bharadwaj Kishore కవిత

నా ముఖపుస్తకం ఫోటోలో నా బట్టతలపై చమత్కారంగా ఏదైనా వ్రాయమని ఒక స్నేహితుని సలహా మేరకు వ్రాసిన ఈ చిన్ని కవిత మిశ్ర నడక (స్వేచ్ఛావృత్తం) ప్రాసాక్షరం "డ" తోడునీడగనున్న నా పూ బోడి తలపుల నిండియుండగ పైడితీరున మెరసెనిటు నా బోడి తలయును చూడరే

by Srinivasa Bharadwaj Kishorefrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4WI2q

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb || ఆఫ్స్కారింగ్స్|| రాజుల చెరను దాటిన దాన్ని పత్రికా పొరల్లో ఇరకపెట్టి, పాత్రికేయుల పాదాల క్రింద బలిపెడుతూ కవిత్వాన్ని, క్రియాశీలవాదుల కరస్వేదాన్నే కవిత్వం చేస్తూ, పత్రికా అచ్చులనే మెయినస్ట్రీమ్ గా పూజిస్తూ, సోకాల్డ్ కవుల సమూహాల మధ్య, విర్రవీకుంటూ, చిందులేస్తూ చుప్పనాతి వాక్యాలతో, మరింత వీకు కవిత్వాలకు దారులేసుకుంటూ, ఏ పరీక్షకు నిలువక, దేనికీ వెరవక పేర్ల పైన పేర్చుకుంటూ పిచ్చి పదాలను,. కలుపుకుంటూ చేతులను, కౌగిలింతలతోనే, కరచాలన ధ్యనులతోనే, కార్చుకుంటూ జ్ఞానపు చొంగను, కవులుగా చెలామణయ్యే చెల్లని కాసులు కనెక్టివిటి పాపులారిటీ నెత్తికెక్కిన పోతులు, భయంకర భజనవాద కవితత్వాల ఉద్యమకారులు, కాకా కొట్టుల్ల మీద కవులైన కాకులు, పనికి రాని పాత కాపులు పాడే కొత్త పాట, అంతర్జాల కవిత్వం పసలేనిదని, ద్వితీయ శ్రేణిదని. ఇక్కడ నిలబడలేక, కాస్తంత కూడా వెలగలేక. ( పట్వర్ధన్ గారి ఓ పోస్ట్ కి స్పందనగా ...) 5/3/2014

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NSF8IZ

Posted by Katta

Rajeswararao Konda కవితby Rajeswararao Kondafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q3OxfX

Posted by Katta

Rajeswararao Konda కవితby Rajeswararao Kondafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q3Oz7j

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవితby Rajarshi Rajasekhar Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kXmyL3

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | ఒట్టేసి విన్నవించుకోనా? --------------------------------------- మరణమొక్కటే మనలను విడతీసే ఒక క్రియ ఐతే, అది కూడా మన మధ్యన విఫలమవుతుందని, నల్లని చీకటినీడల చల్లనిశ్వాసల ఆయువు మీద ఒట్టేసి, సగర్వంగా, క్లుప్తంగా చెప్పి సరిపుచ్చుతున్నా ఎందుకంటే, క్షణానికి క్షణానికి నడుమ నీ జ్ఞాపకమొకటి, గతంతో కలబడి, విజేతగా నిలబడి, నిశిరేయిలో నక్షత్రంలా, నా చీకటి కలలకి రంగులద్దుతుందని, స్వగతానికి నిట్టూర్పుకీ వశమయిన తలపొకటి, ఎడబాటు కొరడా ఝుళిపిస్తే, అమ్మ చేతి స్పర్శలా లేతాకు మెత్తని నీ నవ్వొకటి ఎదమీద అద్దుకున్నట్లుగా ఉన్నదని, భయాల్లో, బెంగపడే వైనాల్లో, తెలియని దిగుల్లో, తబ్బిబ్బయ్యే ప్రతి కలత, ఉదయాన్ని చేరి మరుగయ్యే రాత్రివోలె, నీ లాలనలో, సముదాయింపులో కరిగిపోక తప్పదని... ఇన్ని చెప్పేకన్నా, ఆ ఒక్క "పర్యాయ పాదం" చాలని, మురిసిన మనసు ముందుగా ఆ ఊసే విప్పేసింది. 05/03/14

by Usha Rani Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4LR8T

Posted by Katta

Annavaram Devender కవిత

తెలంగాణా గడీలు ......ఒక గత చరిత్ర రికార్డ్ తొవ్వ .................5.3.2014 ...............అన్నవరం దేవేందర్ తెలంగాణా లో గడీలు ఒక మహత్తర చరిత్ర .గడీలు అంటే దొరలు భూస్వాముల ఫ్యూడల్ పటాటోపం . అయితే ఇవి గతం ముచ్చట .ఇప్పుడన్నీ కూలిపోతున్న సందర్బం .తెలంగాణా కు మహత్తర పోరాట చరిత్ర ,వారసత్వం పుష్కలంగా ఉన్నాయి .అన్ని ప్రాంతాలకూ ఉంటాయి .చరిత్ర నిర్మాణం అవుడే అంతట ఉండది .అగొ సందర్భం లోనే ప్రముఖ కథా రచయిత .కే .వి .నరేందర్ ,ప్రముఖ కవి జర్నలిస్ట్ సంగవేని రవీంద్ర లు తెలంగాణా గ్రామాలు కాళ్ళు బలుపం కట్టుకొని తిరిగి చరిత్ర రికార్డ్ చేసిండ్రు .అది పుస్తకం గా వచ్చింది .దాని పేరు 'తెలంగాణ గడీలు '.ఇందులో ముప్పై గడీల చరిత్ర ఉన్నది .సిర్నాపల్లి గడి,బండలింగాపూర్ గడి ,దోమకొండ గడి ,సంజీవన్ రావ్ గడి ,తపాల్పూర్ గడి ,గట్ల మల్యాల గడి ,విసునూర్ గడి ,సిరికొండ గడి ,ఇందారం గడి ,గద్వాల గడి ,రాజారామ్ -భీమారం గడి ,కల్లెడ గడి ,బొల్లారం గడి ,లింగన్నపేట గడి ,మదనపల్లి గడి ,చల్గల్ గడి ,రాజాపేట గడి ,మద్దునూర్ గడి ,దాచారం గడి ,కొడిమ్యాల గడి ,రామాజీ పేట గడి ,నడిగూడెం గడి ,ఇటిక్యాల గడి ,దుబ్బాక గడి ,వంగర గడి ,వనపర్తి గడి కోహెడ గడి ,హుస్నాబాద్ -అక్కేన్నపేట గడి ,పెద్ద శంకరం పేట గడి ,మదనపల్లి గడీల వివరాలు ఫోటోలతో పాటు ఉన్నాయి ఎనుకట గడీల లో పెత్తందారి తనం రాజ్యం ఏలింది .ఎనబయో దశకం లో జరిగిన నక్సలైట్ ఉద్యమాల వల్ల గడీలు ఖాళీ అయినాయి .కాని ఆ చరిత్ర నిలిచే ఉన్నది . గడీల నిర్మాణం బహు గొప్పది అద్భుతమైన కట్టడాలు అవి .ఆనాటి ప్రజలు వెట్టి చసి నిర్మించిండ్రు .అందులో శర్మ జీవుల చెమట కలే గలిసి ఉన్నది .ఏది ఏమైనా ఇవి ఒకానొక చరిత్రకు నిదర్శనం . చరిత్ర పరిశోధన రచన చేసిన నరేందర్ రవీంద్రలు అభినందనీయులు ,చాల శ్రమకోర్చి తిరిగి తిరిగి సమాచారం సేకరించిండ్రు .....

by Annavaram Devenderfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NSt7mM

Posted by Katta

Abd Wahed కవిత

అంతా.. అదృష్టం కనుపాపల ఆకాశంలో తూనీగల్లా ఎగురుతున్న కలలను ఆపగలవా? పసిపాప నవ్వులా కనురెప్పలపై వాలే నిద్రను వదలగలవా? కాస్త నిద్ర అమ్ముకుని కొన్ని కలలు కొనుక్కో... జ్ఙాపకాల సముద్రంలో ఒక కెరటంలా ఉవ్వెత్తున లేవగలవా? ఒంటరి ఊళ్ళను ముంచెత్తగలవా? కొన్ని క్షణాలను చంపయినా ఒక్క జ్ఙాపకాన్ని బతికించు... ఎర్రని గుండెలో సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా కట్టుకున్న గోడలను కూల్చగలవా? చిరుగాలిలా సీతాకోక చిలుక రెక్కవిప్పనీ... గొంగళిపురుగు సంకెళ్ళు తెగిపోతాయి... పాదాల కింద నేల ప్రవహిస్తోంది చేతిగీతల దారాలతో కట్టగలవా? గుప్పిట బిగించి పట్టుకో.. పచ్చికలలా కనురెప్పల్లో ఒదిగిపోతుంది...

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OXonxk

Posted by Katta