పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఏప్రిల్ 2014, బుధవారం

DrAcharya Phaneendra కవిత

‘శిరాకదంబం’ అంతర్జాల పత్రికా నిర్వాహకులు ‘రావు ‘గారు ఆ పత్రిక ద్వారా అద్భుతంగా నిర్వహించిన “ఉగాది స్వరాలు” – అంతర్జాల శ్రవ్య (ఆడియో) కవిసమ్మేళనాన్ని ఈ క్రింది లింకును క్లిక్ చేసి వీక్షించండి. http://ift.tt/1mzqjHp

by DrAcharya Phaneendrafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mzqjHp

Posted by Katta

Viswanath Goud కవిత

విశ్వ మాలికలు. 1.రాజ్యం వీర బోజ్యమే ఒకప్పుడు.! వీరులెవరు లేరిప్పుడు ఉన్నదంతా క్రూరులే.!! 2.ముక్కలయిన నా హృదయ శకలాల్లో చూడు.! ప్రతీదాంట్లో నీజ్ఞాపకమింకా శిథిలమవకుండా పునర్నిర్మాణానికై తపిస్తూనేఉంది.!! 3.కోరికలు.! గణించగ సాధ్యం కాని పుట్టుకలు.!! 4.అసంపూర్ణమే నాజీవితం.....! నువ్వు తోడులేని ఏ జన్మైనా..!! 5.నీఊహలెంత తుంటరివి.! నామనసుని అల్లరిపెడుతూ తుళ్ళిపడేలా చేస్తున్నాయి.!! 6.వయ్యారి వెన్నెలమ్మకిది అలవాటే.! సూరిడొచ్చే వేళకి తను మాయమవుతూ విరహంతో మండించడం.!! 7.ఆకలేసిన నా మది... నెమరేస్తూ నీ జ్ఞాపకాలు.! 8.నింగి చేలో విరగకాసిన చుక్కల పంట.! పంటకోతకు కూలీలే దొరకట్లేదు రైతు చంద్రయ్యకి.!! 9.నాదేహం... రెండు ముక్కల కలయిక.! నువ్వో సగం... నేనో సగంగా.!! 10.యుగాలు క్షణాల్లా పరిగెడుతున్నాయి.! నీతో సాగే నాజీవితకాలంలో.! 12.పుట్టేందుకే.... తొమ్మిది నెలల కాలం.! పోయేందుకు ఊపిరాగితే చాలును క్షణకాలం.! 13.అఖండజ్యోతిలావెలిగిపోతూ కాలం.! క్షణాలు ఆజ్యంగా కరుగుతుంటే.!! 14.కాలం కొండ పైనుండి దొర్లే బండరాళ్ళు క్షణాలు.! ఉపయోగించుకుంటే ఆనందాలకు పునాదిరాళ్ళవుతాయి...ఆదమరిస్తే జీవితాన్ని కాలరాస్తాయి.!! 15.మది భావాలను మస్తిష్కంతో మదించా.! దొరికింది అక్షయపాత్ర నిండా కవితామృతం.!! 16.నాది రోజూ చుక్కల పక్కనే.! నా చక్కదనాల చుక్క పక్కనుంటే.! 17.అలగకే సఖి.! అలకలో నీఅందం రెట్టింపవుతుందన్నానని అస్తమానం అలిగితే ఎలా? 18.రెండిళ్ళపూజారి.... సూరీడు.! ఉదయం తూరుపింట్లో....సాయంత్రం పడమరింట్లో.!! 19.చెదిరిన నా మనసులో... చెరగనివి నీ జ్ఞాపకాలు.! 20.క్షణాలు లెక్కెట్టడం తేలికేంకాదు.! నువ్వు లేనపుడు అవి యుగాలుగా తోస్తాయి మరి.! 21.సంగమించిన మన మది నదులు.! ప్రేమ సంద్రంలో లీనమయ్యేందుకు ఉరకలెత్తుతూ.!! 22.దిష్టితీయాలినా కళ్ళకు.! నిన్ను రెప్పలమాటున దాచినా కూడా చూసేస్తున్నాయి కలలు.!! విశ్వనాథ్ 02APR14

by Viswanath Goudfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mzqkuO

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :-23 (కవి సంగమం) ----------------------------- కవిత్వ సంపుటి పేరు :- "తెల్ల కాగితం" ( _-కవిత్వం_-) ########## ******************** సంపుటిని రాసింది :- "సతీష్ కుమార్ యశస్వీ"- ---------------------------- పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి" ------------------------ "తెల్ల కాగితం పై యశస్వీ కవిత్వ ఇంద్రధనువు వొంపుల చిత్రం" ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ " నా తలపుల్లో నిలిచి ఉన్నది నీవైనప్పుడు.. ఎడబాటుకు అర్థమేముంది- పగలైనా రేయైనా నీ ఊహే నన్ను నాకు వివరించేది" అని ఆవిర్లు విరజిమ్మే గుండె చప్పుడు ఆగే లోగా తన ప్రేయసిని జీవితంలా శ్వాసించాలని భావిస్తున్నవాడు ఎవరంటే యశస్వీ సతీష్. "ప్రవాహం కవితావేశంలా లాగేస్తుంది ఎటోకటు ఉద్వేగం ముంచేస్తుంది అది కలలపై రోకటి పోటు నైరాశ్యం నమిలేస్తుంది పంటికింది పెదవిని" ఇలా ఓటమి అంచుల్లోంచో జారిపోతున్న మనల్ని మనమే ఎలా నిలబెట్టుకోవాలో చెబుతున్న కవి ఎవరంటే సతీష్. "పసి పిల్లల పిప్పరమెంట్ నౌతా తీయ తీయగ కరిగిపోతా స్కూలు పిల్లల బ్యాగ్ నౌతా పుస్తకాలను మోసి పెడతా ముసలి అవ్వకు చేయూత నౌతా అవసరమైతే కొడుకు నౌతా నాకే గనక చేతనయితే పైనవన్నీ తానే ఔతానంటున్న కవి ఎవరంటే యశస్వే. ఒక వైచిత్రితో కొత్తగా కవిత్వ సంపుటిని నిర్మించి,తెలుగు వర్ణమాలలో ఎన్ని అక్షరాలు వుంటే అన్ని కవితా కుసుమాలు కూర్చి తెలుగు పాఠకుల మెడలో వేసిన కవి యశస్వీ. యశస్వీ సతీష్ కవిత్వం సంపుటి పుస్తకం తెరువగానే నాకు తెల్ల కాగితం....క్రింద ఆయన సంతకం మాత్రమే కనిపించింది.చిత్రంగా అన్పించలేదు నేను ఇట్లా అంటుంటే.అయితే కవిత్వం కళ్లజోడు ధరిస్తే మాత్రం ఆ"తెల్ల కాగితం " మీద కవిత్వ ఇంద్ర ధనువు వొంపులోని సప్త వర్ణాల సమ్మేళనం మెరుపై నిగ నిగ లాడుతు కనిపించింది.యశస్వీ సతీష్ కీ తన కవిత్వ గురువు కొప్పర్తి లాగే తనదైన అనుభవాల్నీ కవిత్వీకరించే నేర్పుంది.ఏదీ సూటి చెప్పనితనముంది.ఆయన చుట్టువున్న సమాజాన్నీ భావించిన పద్దతి అందర్ని ఆకర్షిస్తుంది.ఒక్కోసారి సరికొత్త పోలికలతో,ఇంకోసారి వస్తువును దృశ్యీకరించే చిత్రణతో వొక కొత్త హాయిని తన కవిత్వంతో అందజేస్తాడు. అందుకేనేమో చాల మంది యిష్టపడతారు. "నీ ప్రపంచంలోకి కవిత్వమై వస్తున్నా నీ సాక్షిగా నన్ను నేను పోగొట్టుకోవాలి నా పేరూ ఊరు చెరిపేసుకోవాలి అక్షారాలను ఆవహించుకొన్న నన్ను చదివించుకొని మనసును తెల్ల కాగితంచేసుకోవాలి నేనే నీ సొంతమైనప్పుడు మన మధ్య అక్షరాలు అనుభూతుల్నీ మాత్రమే మిగిల్చాలి అక్షరాలు మనలోకి కరగి స్వచ్ఛమైన తెల్ల కాగితం మిగలాలి కవిత్వం మన అంతరాంతరాల్లొకి వెళ్ళి ఇంకి లోకమంతా తెల్లకాగితమవ్వాలి" ఈ కవి కవిత్వాన్ని సర్వమానవ హృదయాంతరాంతరాళ్లోకీ ప్రవహింపచేసి,ఆ కవిత్వం అక్కడే ఇంకి పోయేటట్లు చేసి ఈ ప్రపంచం వొక "తెల్ల కాగితం "అయ్యెటట్లు చేయాలనే వొక సుందర స్వప్నం వాస్తవం కావాలని తపిస్తున్నాడు.తెలుపు స్వఛ్చతకీ,నైర్మల్యానికీ సంకేతం. కుటిల,కుత్సిత,దుర్మార్గ,దురంత భరిత మానవ మనస్సుల క్షాళనకు కవిత్వం కారణం కావాలనే గాఢ ఇఛ్చను యశస్విసతీష్ తన కవిత్వంలో ప్రకటిస్తాడు."నాది నీదైనప్పుడే నిజంగా నేను మనిషి నౌతాను"-అని అంటున్నా ఈ కవి "అలవాటైన కొద్ది నాతో చేరిపోతుంది నాకు ప్రతీకగా మారిపోతుంది"-అని చెబుతూ,అక్షరాల పలకరింపుల్ని,పులకరింపుల్ని,పగలబడే నవ్వుల్ని నచ్చనప్పుడు తనతో వాటిని పుచ్చుకొని నడువలేనని నిష్కకర్షగా చెబుతాడు.ఇలా తెల్లకాగితం పై కవిత్వ ఇంద్రధనుస్సును కలకంటాడు తన మాస్టర్ బాటన నడుస్తూ.. "నువ్వే నా గురువంటే కోసి ఇమ్మన్నాడంటా వేలు ఈ కాలంలో ఎవడైనా వింటాడా!! నా వేలు నీ కిస్తాను...చేయి పట్టు అంటాడా!! వినడం ఎందుకు!!..జివిత కాలపు వేదనకా!! గురువంటే చెప్పొచ్చు మంచి ఎన్నైనా... మరి అడుగొచ్చా ఎదురేదయినా..అడిగారా ఎవరైనా!! ఏకలవ్యుడి నుండి కాస బియాంక వరకూ విని చెడి పోయినవారే తడవ తడవకు!!" గురువుకు గౌరవం ఇస్తూనే గురువు ఎలా వుండాలో.. నిజమైన గురువు ఎవరో నిర్వచిస్తూ "నువ్వే నా గురువంటే"-అనే కవితలో పై మాటలు అంటాడు.గొప్ప శిష్యునికీ ప్రతీక అయిన ఏకలవ్యుడు వంచలేక విరిచిన ద్రోణుని వంచనకు గురయ్యాడు.నైలు నదీ యుధ్దంలో తండ్రి అస్పష్ట మాటల కారణంగా దేశం కోసం ఓడ డెక్ మీద నిలువెత్తు మంటలమధ్యనిలువునాకాలిపోయినవాడుకాసాబియాంక.ఏకలవ్యుడు, కాసా బియాంక ఈ ఇరువురు "classical examples of devotion and sevice"కు ప్రతీకలు.ఈ పాత్రలకీ జరిగిన అన్యాయాన్ని "లోక మర్యాదకు తల వంచేవాడు ఇంతకన్నాఏంచేస్తాడు!!"త్యాగధనులజాబితాలపేరుకోసంపాకులాటతప్ప"అనేమాటతోవ్యంగ్యంగావ్యాఖ్యానిస్తాడు. శిష్యలక్షణం అనన్య సాధ్యత్వమే కాని బొటనవేలు నరికినివ్వటం కాదు,త్యాగధనుల జాబితలో చేరటానికీ పాకులాట వుండకూడదని,గట్టి పూనిక ఉన్నవానికి ధ్యాస,శ్వాస.. విద్యమీదే వుండాలని,విద్య నేర్పేదెవరైనా ఆదరంగా అందుకోవాలని,పుస్తకాల్ని కాదు మనుషుల్ని చదవాలని ఈ కవి శిష్యుని లక్షణం కూడా చెబుతాడు. కవి అన్ని వేళల ఆశావాదిగా మనలేడు.జీవితంలో కొన్ని క్షణాల్లో నిరాశతో కవి తన చుట్టూ వున్న మనుషుల మీద విసుగును పొంది నమ్మకం కోల్పోయి కొన్ని సందర్భాల మీద అసహ్యంతోనో,అపనమ్మకంతోనో కవిత్వపు కళ్ళజోడుతో దర్శించి వాటిని తమకు నచ్చినట్లుగా చిత్రించుకొంటారు.కవిత్వం నా కళ్లజోడు-అనే కవితలో వొకానొక భావ తీవ్రతతో సౌందర్యం వెల్లివిరియాల్సిన అదే నింగి నీరు నీలాలు కలిసేచోట సంధ్యా భీభత్సంలా నెత్తుటి చారికల విషాదాన్ని కవిత్వపు కళ్ళజోడు లేకుండా దర్శించలేనని ఈ కవి భావిస్తాడు. 'అది నా చెంత లేకపోతే అంతా మసక మసక నింగి నీరు నీలాలు కలసే చోటున సౌందర్యం బదులు నెత్తుటి చుక్కల చారల... భీభత్సం నా ముందున్న మనిషి వెంటాడే నీడై నను అభద్రతా భావనలోకి నెట్టుతాడు అలికిన అక్షరాలు రెటినా నంటినట్టు నా కంటికీ నలకలై నకలై ఎంత నలిపినా అడ్డంగానే కనిపిస్తాడు ఎదుటి వారంతా సాటివారు-తోటివారులా కాక బోటి ముద్దల్లా కనిపిస్తారు" ఇలా అంటూ కవి "అప్పుడప్పుడు కవిత్వ కళ్ళజోడుతో లోకాన్ని చూస్తాను/ఇప్పుడంతా..నాకు తెల్ల కాగితం..కింద తన సంతకం వుందంటాడు.ఇలా అనటంలో మారిన మార్పుని ఆకలించుకోలేని మనిషి స్థితిని కవిత్వం మారుస్తుందన్న భావనను అందిస్తాడు. "తెల్ల కాగితం" కవితా సంపుటిలో "ఆమె నా..." అనే పద్యం అంది.ఇందులో ఇది వొక అందమైన పద్యం. "నే పుట్టినప్పుడే... ఆమెకు పాతికేళ్ళు వచ్చాయి/మేము మేమే కానీ మేమిరువురం ఒక్కరమే/నా ఏడుపు ఘోష వేరు/ఆమె లాలించే భాష వేరు"-అని ప్రారంభమయ్యే కవిత మాములు పదాలతోనే ఎంతో హృద్యంగా నడుస్తుంది.బిడ్డ ఎదిగే క్రమంలోతల్లిబిడ్డమధ్యగలబంధాన్ని,అనుబంధాన్నీ చెప్పడమే కాదు,ఆ బిడ్డ పెద్దయింతరువాత "ఊరు నాది మారింది నేను తనతో ఉండరాక"అని అనుకొనే స్థితిని ముసలిదైన తల్లి మీద అణుమాత్రం జాలి లేని తనాన్ని యశస్వీ వాస్తవికంగా కవిత్వం చేశాడు.ప్రారంభంలో "నే పుట్టినప్పుడే.. ఆమెకు పాతికేళ్లు వచ్చాయి"-అని వొక ఉత్కంఠను కలిగించి "నేనేమో కొడుకుని ..ఆమె నా కన్న తల్లి"-అని వొక దిగ్భ్రాంత ముగింపును ఇస్తాడు.ఇలా ముగింపు నివ్వటం మంచి కవిత్వ శిల్పం. "ఙ్ఞానమైనా,ధనమైనా అర్థానికున్న సమస్థ నానార్థాలకు పర్యాయ పదం నాన్నే"-అని భావించే ఈ కవి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకొంటూ "పేపర్ తో నాన్న"-అనే కవిత రాశాడు.కన్న బిడ్డ ఆశల మెరుపులను కురిపించాలనే తండ్రి తపనను కవి ఘనీభవించిన మేఘంలా చిత్రించాడు."ఉద్యోగ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే పావు రాయై/ఆ నాలుగు రాళ్ళ మనిషి మీదే వాలుతుంది తెల్లారగానే"-ఈ పంక్తుల్లో కవి ప్రాణం లేని వార్త పత్రికకు ప్రాణం పోసి పావురాయిని చేశాడు.ఇట్లాంటి అద్భుత వాక్యాలకు ఈ సంపుటిలో కొదవే లేదు."వాన కారు కోయిలై ఫలితాల కోసం/రాశి -ఫలాల వేటలో../మళ్ళి పేపర్ తో నాన్న/నా కాలం కలిసోచ్చేదాక కదలని చిత్తరువులా/పేపర్ తో/తన మా నాన తానే"-అనే ఈ మాటల్లో కవి తనకు తన తండ్రికీ,తన తండ్రికీ వార్తపత్రికకు కల బంధాన్ని ఆవిష్కరించాడు. కవులకు చాల వరకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు జీవితం పట్ల వుంటాయి.వాటిని ఏదో ఒక సందర్భంలో తమ కవిత్వంలో పొదుగుతుంటారు.ఈ జీవితం ఇలాగే సాగిపోవాలని కూడ మనుషులు భావిస్తువుంటారు."బతుకంటే గుదిగుచ్చిన పనులూ,చిట్టా పద్దులూ కాదు"అని అంటున్న యశస్వి "సాగిపో"అనే కవితలో "ప్రభాతపు తొలి వీక్షణం లోంచే కలలు వెలుగు రేఖల్ని ముద్దాడాలి/రాత్రైనా,పగలైనా కలల్ని వెలిగించుకోవడం..నింగికీ,నేలకు నడుమ మేఘంలా/గాలిలో తేలి నిప్పునీ.. నీరునీ కౌగలించుకోవడం/కాలంతో కరిగి పోయేవరకు కదిలిపోవడం"-ఇలా జీవితం సాగిపోవాలనే ఆలోచనను చేస్తాడు."ఎదురీతకు సిధ్దపడితే విస్తరించిన సాగరాన్ని చీల్చుకొంటూ వడి వడిగా సాగే ఓడను తలపిస్తుంది"- అని వో విజయం తరువాత జీవితం అలా వుంటుందని కవి ఊహిస్తాడు.ఒక వ్యక్తిత్వ పాఠం కవిత్వమైంది ఈ కవితలో. "ఏదో కారణం"-అనే కవితలో "రైలు మంటల్లో ఎందుకు కాలాలి!!/ఆయిల్ రిగ్గో,కారో ఎందుకు పేలాలి!/బాధ,హింస,అతివాదం,ప్రమాదం,/పశుత్వం,విధ్వంసం,పక్క వాడి నిర్లక్ష్యం"-మున్నగు కారణాలు బయటవైనప్పుడు అంటే సంబంధితం కానప్పుడు సహజ న్యాయం కోసం ప్రశ్నిస్తాడు.ఏదో ఒక కారణం లేకుండా ఏవీ జరుగవు అనే కార్యకారణ సంబందాన్ని కవి ఇక్కడ ప్రస్ఫుటం చేస్తాడు. కవిని చూడ్డమంటే కవిత్వాభిమానులకీ వొక యిష్టం.తన వ్యక్తిత్వానికీ ఇష్టమైన బి.వి.వి ని చూడ్డమంటే యశస్వీ కి ఎంతో యిష్టంలాగుంది.అందుకే "ప్రశాంతమైన్ నిద్ర లేని రాత్రుల్ని వరంగా అందించిన వాడు/అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపక శక్తి ప్రసాదించినవాడు/అతడెలా ఉన్నా..అ కళ్ళల్లో వెలుగును చూద్దామని వెళ్ళాను"-అని ఈ కవి అనటంలో కవి వ్యక్తిత్వాన్ని చిత్రిక పట్టే నేర్పు వుందని చెప్పోచ్చు."మతం మత్తుకు మధురసాల కైపు"ను పొందే హైద్రాబాద్ పాత బస్తీ నీ గూర్చి రాసిన కవితే "చార్మీనార్ ...చెంపన".పాపం, పుణ్యం ఏమి ఎరుగని చిన్నారులు సాన్వీ లాంటి పసిమొగ్గల్ని కిడ్నాప్ చేసి తుంచేస్తున్న అంశాన్నిఎంతో వేదనతో ఆ భగవంతున్ని "ఇదేం న్యాయం దేవుడా?"-అని తీవ్రంగా ప్రశ్నించిన కవిత "ఇదేం న్యాయం దేవుడా?" అనేది.ఉప్పుని ధనంగా చేస్తూ "సమన్వయం లేకపోతే జీవితం ఉప్పు లేని చప్పిడి మెతుకులు" అని చెప్పే కవిత"ఉప్ప ధనం". "భయ్యా! Diversity ఎక్కడ!!"-అనేది జీవ వైవిధ్య సదస్సులోని డొల్ల దనాన్ని వెల్లడించే కవిత.తాలిబాన్ల పిరికితనానికి బదులిచ్చిన అసలుసిసలైన జవాబు "మలాలా".మలాల ను "గుల్ మకాయ్" చేస్తూరాసిన కవిత ఇది.ఇలా ఎన్నో కవితలు( ఉన్న56లో) పాఠకుల తెల్లని మనసు మీద కవిత్వ రంగుల చిత్రాన్ని గీస్తాయి. ఈ సంపుటిలో ఎన్నో కవితలు నన్ను కదిలించినా,నన్ను బాగా వెంటాడి వేటాడిన కవిత,నచ్చిన కవిత "ఓ రైలు ప్రయాణం ".ఇష్టం లేని ప్రయాణాన్ని అయిష్టంగా కష్టంగా చేయించాడానికి రైలు రావాడాన్ని వొక అంతర్లీన దుఃఖంతో కంటిని చెలమగా చేసి రాశాడు యశస్వి సతీష్.ఈ కవిత చదివినప్పుడు కొప్పర్తి గారి "విషాద మోహనం"లోని "ఎంతెంత దూరం "అనే కవిత స్ఫురణకొచ్చింది.తన కిష్టమైన వాళ్ళని వదిలి వెళ్ళి పోతున్నప్పుడు పోవడానికి ఎంత అయిష్టపడతాడో,బయలు దేరాల్సిన క్షణం దగ్గరయ్యే కొద్ది సర్దుకున్నవే మళ్లి సర్దుకొంటూ,దువ్వుకున్న తలనే మళ్లీ దువ్వుతూ వుండే మానసిక స్థితిని,ప్రయాణాన్ని ఖరారు చేస్తూ రైలు వొచ్చి ఆగి నప్పుడు...కలిగే వేదనను కొప్పర్తి అద్భుతంగా చిత్రించాడు.ఇట్లాగే యశస్వీ కూడా "ఓ రైలు ప్రయాణం" వొక మంచి కవితగా నిర్మించాడు.యశస్వి కవితని కొప్పర్తి కవితతో పోల్చటం ఆయన్ని అనుకరించాడని కాదు."గుండెలు రెండూ లాగి వదిలిన స్ప్రింగ్ ల్లా గిలగిల లాడే" కవిత్వం యశస్వీ రాయగలడని చెప్పడానికే. "రాయడాన్ని ఎవరూ కాలరాయలేరు"-ఇట్లా పదాలతో ఆడుకోవటం యశస్వీ కూడా చేస్తాడు."పేపర్ తో తన మా నాన తానే"-ఇలాంటి వైచిత్రులు ఈ సంపుటిలో అనేకం."మనస్సాక్షి చెప్పినట్టు పేజీ చివర సంతకం చేసే క్షణమొకటి వేచి వుంది కాబట్టి ఈ పరిచయాన్ని ఇంతటితో ముగిస్తూ..యశ్వస్వి మంచి యశస్సుతో వొక మంచి కవి కాగలడని విశ్వసిస్తు....వచ్చే మంగళ వారం నన్ను బాగా కలవరపెట్టి కదిలించే "జీరో డిగ్రీ","నీ లాగే ఒకడుండేవాడు" ఏదో ఒక సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1msK5nJ

Posted by Katta

Patwardhan Mv కవిత

పట్వర్ధనీయాలు::: సీసా పెంకుల వట పత్ర శాయి చెత్త కుండీలో వదిలిన పేరులేని పాపాయి *********************************** కమలంలో చిక్కిన తుమ్మెద పలవరిస్తున్నది స్వేచ్ఛ! *********************************** నేను నిజంగా నిజాన్ని నమ్ముతా నిజాన్నే తుమ్ముతా ! *********************************** తప్పిపోయిన శాంతి కోసం వెతుకుతున్నాను అశాంతీ ! నీకేమన్నా కనిపించిందా ?? ************************************ ఇల్లు ఖాళీ చేయాలి ఇంకో ఇల్లెక్కడో ఏమో మరి :( ************************************ నన్ను రక్షించుడీ సన్యాసుల్నుండీ సన్నాసుల్నుండీ ! ************************************ బాల్యం విస్ఫోటించింది మూల్యం సమాజం చెల్లించింది. ************************************ సైనేడు నవ్వుల లోకం సత్యవ్రతా! జాగ్రత్త. ************************************ గడ్డిపోచ కోరుకుంటున్నది ఓట్ల పండుగ ఒడిసిపోవద్దని. ************************************ శిథిలమైన మనస్సులో శిలీంద్రాలు మొలుస్తాయి. *********************************** ప్రభూ!! విశ్వ రూపం ఈ కళ్ళతో చూడలేను హిజ్ ఎక్సలెన్సీ హిపోక్రాట్ కళ్ళియ్యి. *********************************** చంద్రున్లో మచ్చ పేదరాశి పెద్దమ్మదీ,కదలని కుందేలుదీ కానే కాదు. అచ్చం తుపాకీ పట్టిన నా చిన్న కొడుకుదిలా లేదూ? ************************************** వేటగాడికి తెలిసింది నేను కలల కుందేళ్ళను పెంచుతున్నానని! 02-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mvfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jZ9bO0

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

'కవిత్వం వేరే ఎక్కడో లేదు నిస్సహాయుడు నిరాయుధుడైన ఒక గిరిజనుడు లేదా ఒక దళితుడు మాట్లాడేదంతా కవిత్వమే తెలంగాణా లో ఒక గ్రామం చాలు లేదా మాన్య ప్రాంతంలో ఒక గ్రామం నా మరో జీవితం అక్కడే అని నా ఆశ' ------- అజంతా

by కోడూరి విజయకుమార్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghpJZx

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | ఫైట్ ఫర్ లైఫ్ | వైవిధ్యపు వైర్ చివర జీవితానికో జడ్జ్ మెంట్ డే దొరుకుతుందో లేదో అంటూ పూల కోసం యే మార్గం లో వెతుకుతున్నావు చీకట్లో పరిపూర్ణత కోసం ఎన్ని సార్లు పాత మొహాన్నే పగలకోట్టుకుంటూ అసందర్భంగా యే వాదాన్ని యాచిస్తున్నావు రెస్క్యూ కోసం జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు యుద్ధాలన్నీ శాంతికోసమేనట ఇంకా మొదలవని యుద్ధాల వెనక అశాంతి నీడల కదలిక తెలుస్తుందా నీకు జనోద్దరణ పేరుతో భారీహస్తాల పెట్రోలు యుద్ధాలు తెలుస్తున్నాయా ? మెలుకువగా ఉండు , మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి నిన్ను శాశ్వత నిద్ర కి పంపి నీ ఎముకల పొడి తో వ్యాపారం చేసే నయా వలస వాదం మరో సారి మతం ముకౌటా తగిలించుకొని నీ రక్తం తాగడానికి సిద్దమయింది అందుకే అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ ఇంద్రధనస్సు కిరణాల లో సమ తత్వపు సమాధానాలు వెతుకు గత సమస్యల శంకువు తోకచుక్క లా పగిలినప్పుడు రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు భయాలన్నీ సమూలంగా బహిష్కరించి బ్రతుకు కోసం పోరాడు . నిశీ!! 02/04/14

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAtBcD

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ఐదు 1. నేల నా పొలం నింగి నా తలరుమాలు గాలి నా చెమటల ఆవిరి ఎండ నా వెచ్చని వూపిరి నా కన్నీళ్ళు ఇంకని సముద్రం 2. వాడిపోని వసంతాలన్నీ నా పొలంలోనే మరిగిపోని రాత్రింబవళ్ళు నా కంటిలోనే ఊపిరులూదే ఆశల సేద్యగాణ్ణి రేపటి నక్షత్రాల సోపతిగాణ్ణి పచ్చటి నేల, పచ్చటి నీరు, పచ్చటి ఎండ పచ్చటి చందమామ, పచ్చటి ఆకాశం నేనొక పచ్చటి వెలుగురాగాల ఏక్ తారను మిన్ను మన్నునేకం చేసిన పాటను 3. కైగట్టని దుక్కంలేదు, కైగట్టని నవ్వూలేదు కైగట్టరాని దేముంది ఈ లోకంలో ఊకుంచడానికయినా, చెప్పరాని బాధలయినా పట్టరాని సంతోషమయినా, పట్టి దాచుకున్న పచ్చరెక్క ముచ్చట్లయినా కైగట్టరానిదేముంది 4. పులకరించిపోయే కలలకు ఈ దేహం పలవరించిపోయే వూహలకు ఈ మోహం నేను నాకే చాలని విశ్వాన్ని నేను నాకే చిక్కని రహదారిని 5. నా లెక్కనె నా కవిత్వం కూడా నా పక్కనె నా కవిత్వం నీడ

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAtAFR

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్ //కాళ్ళిరిగిన ప్రస్తానం లో// కదిలీ కదలని దారొకటి కొండ చిలువలా కాళ్ళని చుట్టుకుని పడుకుంటే.. తాబేటి చిప్పల్లో తమశరీరాలని దాచుకొని పయనిస్తూన్నామనే అనుకుంటాం అతనూ,నేనూ... చిరిగిపోయిన భూమి పొరలని చూసి జాలిపడకుండా పగలబడి నవ్వుతూ భుజాల మీది శిలువలని సర్దుకుంటూ నిలబడి పోయిన మనుషుల రహస్య జేబులని కత్తిరించి దొంగిలించిన ఉరి తాళ్ళని మెడచుట్టూ అల్లేసుకొని కాళ్ళని చుట్టిన కొండచిలువ ఎప్పుడు వదిలేస్తుందా అని ఎదురుచూస్తూ పగిలిన ఎముకల మోకాళ్ళ మీద నిలబడి చూస్తూంటాం ... నెనూ,అతనూ మాతో పాటుగా ఓ పాఠకుడా ఇప్పుడు నువ్వూనూ...... 02/04/14

by Naresh Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAtAFy

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mq9BtV

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/ ఏదో జరుగబోతున్నది కొత్త ఆశలతో కొత్త కోర్కెలతో నవ వసంతమవతరించింది త్యాగాల ఆత్మబలిదానాల సకల ప్రజా ఉద్యమాల ఫలం అమౄత భాండ స్వర్ణపీఠమది గులాబీపూలు గోదావరీ ప్రవాహమై పొంగుతూన్నాయి కమలం కుల పర్వతమై(స)మతంగా ఎదుగుతూన్నది అదృశ్య హస్తమొకటి అంచెలంచెలుగా రంగులు మారుస్తూన్నది భుజాలు చేతులు కాళ్ళు ఒకసారి కనిపిస్తే పెదవులు కళ్ళు తొడలు మరోసారి కనిపిస్తూన్నాయి శిరస్సు లేదు శిస్నం లేదు అసలు దేహమే శూన్యం శతాబ్దాలు శతాబ్దాలుగా నిత్యం నేను మరణిస్తూనే ఉన్నాను నాలికలు చాపిన సకల అధికార దాహం చంపుతూనే ఉన్నది నన్ను కొత్త విద్య నేర్చిన శిష్యగణం మరణించిన మృతపుండరీకానికి ప్రాణమిచ్చి శక్తినిచ్చి కొత్త రూపానిచ్చి అలంకరణాభరణాలనిచ్చి ఒక స్వేచ్చా సౌందర్యాగ్ని కీల వెలిగించబడింది అభివృద్ది రాకాసి పైశాచిక శక్తి మృత్యు కుహరాలను తెరిచింది ప్రాణమిచ్చిన వాడిదా వాడిదా-వీడిదా-వాడిదా కర్ణభేరులను చేదిస్తూన్న వాటాల వాదం నేనెక్కడా శిధిల శకలమై కూడా మిగలలేదు విజయోత్సాహం వీరంగమేస్తూన్నది రాజ్యం ఒక రాజకీయ రంగస్థలం ఒకే నటుడు దశావతారాలనెత్తి ప్రజావాహినిని ఉర్రూతలూగిస్తూంటే గొర్రెలన్నీ కాయితాలను తిని సిరాతో నాలుక తడుపుకుంటున్నాయి మేక వన్నె మెఖాలు 'మెకాలే'సిధ్ధాంతాన్ని కప్పుకున్నాయి చీరలన్నీ మాయమై చైతన్యాన్ని చుట్టుకున్నాయి ఇక్కడ సామూహిక లక్కాగృహాల దహనం జరుగుతూన్నది ఇప్పుడు మర్మ మార్గాలు చూపే"విదురులు" అలభ్యం సంజీవనీ వనాలు మాయారణ్యాలయి మారణ హోమాల సాక్ష్యాలను కోల్పోతున్నాయి నీళ్ళు నిధులు ఊళ్ళు ఉద్యోగాలు పదవులు పొట్లాలు పొట్లాలుగా-పెట్టెలు పెట్టెలుగా కట్టలు కట్టలుగా-సీసాలు సీసాలుగా కంచెలు దాటి మందల మధ్య నుండి ప్రవహిస్తూన్నాయి మళ్ళీ నేను ఒక మాంసపు ముద్దనై ఉప్పూకారము అద్దబడి మాటలతో చేతలతో నగ్నీకరించబడ్డాను ఒక సమూహమై నిలిచి-కీర్తి లాలసనై అపకీర్తి కళంకితనై శూన్య మహార్ణవమయినాను ఒక పసివాడు చిరిగిన లాగును పైకి గుంజుకుంటూ మధ్యం పాకెట్టు నీళ్ళ పాకెట్టు పట్టుకొని తల్లి కొంగు చాటు నుండి తండ్రి కొరకు నడుస్తున్నాడు చరిత్ర టర్నింగ్ పాయింట్ లో రక్తమోడుతున్న స్త్రీ దేహం ఒక రుడాలి చేతిలో ఏదో జాగ్రత్తగా పట్టుకొని నడుస్తూన్నది నడక ఆగగానే ఏదో జరుగబోతున్నది అవును ఏదో జరుగబోతున్నది ------------- జ్వలిత 9989198943,02/04/2014,7.58పి.ఎం

by Jwalitha Denchanala Jwalithafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pLf2Wg

Posted by Katta

Kapila Ramkumar కవిత

సరుకై వచ్చిన రొయ్యలు తిమింగలలాలైపోడం మాయ చుట్టమై వచ్చిన వాడు దయ్యమై పట్టుకునే కుట్రొక మాయ దోపిడీ యుద్దం కోసం కట్టిన వారధి అభివృద్ధి రహదారి కానేకాదు. ఎన్నిసార్లు ఎల్లగొట్టినా కోడికి ఎండుగు మీదనే కన్ను! ఒకడు పాగా వేసి చొరబడితే ఒకడు జాగానే నాదన్నాడు మరొకడు బతుకులన్నీ చిందరవందర చేసి సుందర నగరాన్ని నిర్మించానన్నాడు. నువ్విక్కడ అడుగుపెట్టిన తర్వాత మాకు వెన్నెల వెలుగునుంచి మాయా కాంతిలోకి వచ్చినట్లైంది. పల్లెతల్లి ఒడినుంచి అనాథాశ్రమంలోనికి వచ్చినట్లైంది. నువు చూపే నగర సంపదకు లిట్మస్‌ టెస్ట్‌ చేసి చూద్దాం. అది తప్పకుండా నువు మా ముఖం మీద చల్లిన ఆమ్లమనే తేలిపోతుంది నీ సిమెంట్‌ బలుపు భవనాలకు అగ్ని పరీక్షలు నిర్వహిద్దాం అప్పుడు మా నెత్తురు కాలిన వాసనే వస్తుంది ఈ నగరం తళుకు బెళుకుల్లో మా చెమట చుక్కల మెరుపుంది ఈ అరవై ఏండ్లకాలం నీ ముసుగును తొలగించింది నీ కుట్రల కండ్ల మంటది ఒక్కనాలుకైతే మాది వేయి నాలుకల పోరాట జ్వాల కాటికెల్లినా పోని పగనీదైతే కడుపుల దాచుకునే ప్రేమ మాది మా భద్రాచల రామదాసు కారాగారంలోంచి దుఃఖపు రాగమై అడుగుతున్నడు ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవని! నవ్వుతూ విషాన్ని చిమ్మడం నీకే చెల్లును నాయకా! హైదరాబాద్‌ను చూసిన మొఖం తోనే అటుగూడ జూడాలె గొలుసులు తెంచుకున్న పులులనాప ఇగ ఎవల తరం గాదు! http://ift.tt/1pLf2FK

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pLf2FK

Posted by Katta

Nirmalarani Thota కవిత

Money v/s Male LOVE పదివేలు పెట్టి పట్టు చీర కొని తేలేను గాని నువ్వంటే నాకు ప్రాణమే పంకజాక్షీ ! పైసాకు కొరగాని ఈ పరాచికలేం కొదవలేదు.. హు.. మూతి తిప్పుకుంటూ విసవిసా వంటింట్లోకి... ఈమేనా కలరాకుమారుడనీ, ప్రేమ తప్ప ఇంకేం వద్దనీ ఒకనాడు బాస చేసిన ప్రియురాలు ? నిన్ను మెడిసిన్ చదివంచలేను, చెల్లికి అమెరికా సంబంధం తేలేనుగాని మీరిద్దరూ నాకు రెండు కళ్ళు రా కన్నా . . పో డాడీ . . డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ . . మొహం చిట్లించుకొని హాల్లోకి నిర్లక్ష్యంగా . . చిన్నప్పుడు నా వీపు మీద కూర్చొని గుర్రం ఆడిస్తే తెగ సంబరపడిపొయిన చిన్నారులేనా ఈ పిల్లలు ? అమ్మా.. నీకు మోకాళ్ళ మార్పిడి చేయించి కాశీ, రామేశ్వరాలు తిప్పి చూపించలేను గాని రోజూ నీ కాళ్ళు పిసుకుతూ కబుర్లు చెబుతానే . . నాన్నా.. కృత్రిమ దంతాలు పెట్టించే స్థోమత నాకు లేదు గానీ పాలు, పండ్ల జ్యూస్ తెచ్చిపెడతా.. పారాయణమూ చదివిస్తా . . అవునురా.. నీ పెండ్లాం, పిల్లలకీ డబ్బులొస్తాయిగాని ఈ ముసలోళ్ళకి మాత్రం ఉండవురా.. అవున్రా అవును ఊరికే అన్నారా.. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదనీ . . గోరు ముద్దలు తినిపించిన అమ్మ, వేలు పట్టి నడిపించిన నాన్నలేనా వీళ్ళు ..? మాటలతో మనసు నింపడం మగవాడికి చేతనవదా..? కరెన్సీ కొలమానాల్లోనే నా ప్రేమను కొలుస్తారెందుకో ? విలాసాల అద్దంలోనే నా ప్రతిబింబాన్ని చూస్తారెందుకో ? ప్రేమించడానికి డబ్బు అవసరం లేదేమో కానీ ఆ ప్రేమను ప్రదర్శించడానికి డబ్బు కావాలి . . తిరిగి ప్రేమింప బడడానికీ డబ్బు కావాలి . . ! డబ్బే కావాలి.. డబ్బే కావాలి.. స్వంత ఇంటి కోసం స్టేటస్ అంచున మిమ్మల్ని కూర్చోబెట్టడం కోసం తలకు మించిన భారాన్ని మోస్తూ సంపాదనకై పరుగులు తీస్తూ క్షణ క్షణం కలతల కణతలతో, టెన్షన్లతో స్వేద సంద్రమై లబ్ డబ్ అని పదే పదే కొట్టుకునే నా యెద సడి ఎవరికీ పట్టదా .. ఏ గుండె పోటో విత్త గునపమై పొడిచే దాకా . . ఏ పక్షవాతమో పాతమిత్రుడై పలకరించే దాక ! [ తేది: 02.04.2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpVb

Posted by Katta

కాశి రాజు కవిత

1 పతి మేఘంలో నీల్లుంటాయంటే నమ్మను గానీ అమ్మైన ఆడది కురుస్తుందను నేనూ కాస్త తడుస్తాను. 2 సంద్రుడి సుట్టూ వరదగూడూ ఆకాత ఎన్నెల్లోనూ కనపడే వొరిపొలాలు ఓ మడత మంచమ్మీద నాన దగ్గర కాళ్ళు నొక్కుతూ మాఅమ్మ రాత్రీ పగలని కాదు ఎప్పుడూ ఎలాగోలా కురుస్తూనే ఉంటది . 3 ఎండా? ఎన్నెలా? ఏమని సెప్పను 4 ఏసవి రాత్రి బయట పడుకున్నాక అకస్మాత్తుగా పట్టిన మేఘం అందర్నీ ఇళ్ళలోకి తరిమేస్తే అమ్మక్కొతే నాన్నతో ఎందుకేడుస్తాది? 5 వర్షం వచ్చిన జాడ ఆవాన కళ్ళకి తెలీదు అమ్మది ఆకాశమంత దుఃఖం. అమ్మకల్లకి నాన్న ఉపనది మా దాహాలు తీరడానికి వాళ్ళు దుఖాల్లా ప్రవహిస్తారని మాకెవ్వరికీ తెలీదు

by కాశి రాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpEM

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ అనంధభాష్పువు @ వెళ్ళిపోతున్నాను మిత్రమా...! ఉద్విగ్న భరితమైన నీ హృదయం లోంచి విషాదపు కనీటి చుక్కగా... బాధ పడకు నేస్తమా...! నువ్వెప్పుడైన కుదుట పడక పోతావా అప్పుడు వస్తానులే., ఒక అనంధభాష్పువుగా... _ కొత్త అనిల్ కుమార్ ** ** ** @ మిత్రమా.! @ నువ్వు భయ పడుతున్నపుడు నా కవిత్వం నీకొక మూలమంత్రం ఔతుంది, నువ్వు బాధ పడుతున్నపుడు నా కవిత్వం నీకొక ఓదార్పు అవుతుంది. దిగులు పడకు మిత్రమా... నేను శ్వాసించినన్నల్లు నువ్వు సంతోషంగా ఉంటావు. _ కొత్త అనిల్ కుమార్. ** ** ** @ కృత్రిమం @ కృత్రిమంగానే సాగుతుంది జీవనం కృత్రిమంగానే మొదలయింది కృత్రిమంగానే ముగిసింది. ఆపరేషన్ తో పుట్టడం ఆక్సిడెంట్ లో చావడం. _కొత్త అనిల్ కుమార్ ** ** ** @ సముద్రాలు @ ఆత్మీయత లేని ఎడారి లాంటి హృదయాలకు పలకరింపు ఒయాసిస్సులు ఎదురు పడగానే, కన్నులు సముద్రాలౌతాయి. _ కొత్త అనిల్ కుమార్ ** ** ** @ పాత పదాలు @ జాలి దయ కరుణ ప్రేమ వాత్సల్యం సానుభూతి.. అణకువ వినమ్రత వినయం విధేయత వివేచనా.... ............. ఇవన్ని ఈ మధ్యే కోతగా నిర్మింప తలపెట్టిన నవ నాగరికభవనం పునాదుల తవ్వకాల్లో బయట పడ్డ కొన్ని పదాలు. __ కొత్త అనిల్ కుమార్ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pLeZd6

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

" ఒక స్వాప్నికుడి సంభాషణల్లో ఏమున్నాయో ఎలా చెప్పడం ? కాలంలో కరిగిపోతున్న మనిషిని పట్టుకోడానికి ఒక భావుకుడూ, విమర్శకుడూ కలిసి తీస్తున్న పరుగు నుంచి ఎన్ని పదచిత్రాలని ఒడిసి పట్టుకోగలం? కలల దారులు ...నిజాలు నమ్మకాలు.... అశలు అద్భుతాలు ....నిరసనలు ధిక్కారాలు ... ఈ రచనల టాగ్ వర్డ్స్. వాటి చుట్టూ కట్టిన ఈ సంభాషణా సౌధంలో కావలిసినన్ని కవిత్వ పాదాలు, గొంతు చించుకోగలిగినన్ని నినాదాలు , కంఠతా పెట్టగలిగినన్ని సుభాషితాలు, కళ్ళు చూడగలిగినన్ని కాంతి స్తంభాలు కనపడతాయి. అందుకే ఆగి ఆగి వెళ్ళండి.వీలై నన్ని మజిలీలు చేయండి . పైనున్న నగిషీలతో పాటు కాళ్ళ కింద నేలను కూడా చూస్తూ సాగండి. సన్నటి దారేదో కనిపిస్తుంది. కనిపించకపోతే కనిపించేదాకా వెతకండి.ఆది తప్పకుండా మిమ్మల్ని మనిషి దగ్గరికి తీసుకెళుతుంది. ఆదమరిచిన క్షణాలలో మీరు పోగొట్టుకున్న మీ లోపలి మనిషి దగ్గరికి తీసుకెళుతుంది. మనిషి అంతరంగానికి మించిన రణస్థలి ఏదీ లేదు ఇవాళ. అక్కడ నిలబడి ఇరుపక్షాలతోనూ మాట్లాడటమే సంభాషణకు కొత్త అర్థం.ఆ సాహసం చేసినందువల్లే ఈ అక్షరాలు,ఆలోచనల పట్ల మనకు ఇంత మోహం." పర్స్పెక్టివ్ (ఆర్.కె) ప్రచురణలో భాగంగా కె.శ్రీనివాస్ ( ఆంధ్రజ్యోతి సంపాదకులు) ఆంధ్రజ్యోతి లో ( 2004-2010) వరకు నిర్వహించిన' కాలమ్స్' లలో కొన్ని వ్యాసాలను కలిపి "సంభాషణ " గా (2011) లో తీసుకువచ్చిన పుస్తకం అట్ట వెనుక 'వేమన వసంతలక్ష్మి' రాసిన మాటలవి. " నూరు పూలు వికసించనీ .. వేయి ఆలోచనలు సంఘర్శించనీ " అన్న సిద్ధాంత విశ్వాసానికి నిబద్దతే ఈ గ్రంధాన్ని చదవడం. 2-4-2014.

by దాసరాజు రామారావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpol

Posted by Katta

Prabhakar Mandaara కవిత

తెలంగాణ రాష్ట్రం లో ఆవిర్భవిస్తున్న తొలి తెలంగాణ సాహిత్య త్రైమాస పత్రిక " జంబి " కి స్వాగతం ... సుస్వాగతం ! ఈ పత్రిక ఆన్ లైన్ లొ కూడా లభ్యం : www.ejumbi.com

by Prabhakar Mandaarafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pQaXON

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నిశ్శబ్ద యుద్ధం... పచ్చని చెట్టు నుండి ఆకులు రాలిపడినప్పుడల్లా ఓ నిశ్శబ్ద యుద్ధం ఎవ్వరికీ కనిపించకుండా కాలం మధ్యలో ఎవరో ధారగా పారబోసినట్టు కొన్ని ఆశల నిక్షేపాలు రహదారి నిండా ఆకులు తమకు తాముగా కాక ఏదోక సున్నిత పాదం కింద చిట్లుతుంటాయి నొప్పి తెలియకుండా ఆ క్షణం మళ్ళా ఓ సంఘర్షణ ఎవరూ ఆక్షేపించకుండానే నిధులన్నీ చెత్త కుప్పల్లో గనులుగా నేరేడు నీరాజనం కొంగ్రొత్త స్పర్శలో ఆ ఆకాశాన్ని ఇవాళ కూడా దులిపేదీ నీ చేతి కొనలే మేఘాలు మొరిగినప్పుడల్లా ఈ మనసు పుటాలకు ఇంకా మోజు తీరలేదు ఎన్ని మట్టి రాత్రులను శ్వాసించినా మరికొన్ని యుద్ధాలు నిశ్శబ్దంలోనే... తిలక్ బొమ్మరాజు 02.04.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPEmsi

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jYfWj7

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

""మట్టివేళ్ళు-మిత్ర పొత్తం"" ఇంతకీ ఏముంది మిత్ర పొత్తంలో! రెండు మూడుసార్లు చదివినా ఇంకా ఏదో ఉంది మళ్ళీ చదవాలని ఎందుకు అనిపిస్తొంది? మట్టి వేళ్ళు పుస్తకమేనా మనిషా?మనిషి అంతరాలయం ఈ కవిత్వమా? అడగగా అడగగా కవి "మరోసారి" ఇలా అన్నాడు "చెప్తానంటే వినే ఓపికా నాకుంది వింటానంటే చెప్పే సహనమూ ఉంది" సరే అగ్రజా చెప్పు నారాత లేవో నేను తర్వాత రాసుకుంటా అన్నాను, అప్పుడింక "అంచుల దాకా" తీసుకెళ్ళి "బహుశా ఇది ప్రపంచానికి చివరి కామోసు అరె అదేమిటి? నాకంటే ముందుగా ఎగురుతూ కనిపిస్తొంది ఆశ్చర్యం అదో కవిత్వాన్ని పులుముకున్న కాగితం" అని అన్నాడు. ఇక నేను కవిత్వం వెంటపడ్డాను. చదువుతూ మళ్ళీ ఆలోచనలో పడ్డాను, కవిత్వమంటే స్పందించడమేనా పాఠకుడిలోకి పరావర్తనం చెందటమేనా!నిత్య సామాజిక మానసిక సంఘర్షణ నడుమ సగటు మనిషికి కవిత్వం ఏమిస్తుందని అడగటమే తడవు "ఏ స్వాంతనలో దుఃఖం ఉపశమిస్తుంది? కన్ను తుడిచేచేయి,వెన్ను నిమిరే ఒడికోసం అంగట్లో అంగలార్చకు" అంటూ హెచ్చరించి ఇలా అన్నాడు. "నిన్ను నీవే ఆవిష్కరించుకోకుంటే ప్రపంచం తన నిశబ్దంతో బహిష్కరిస్తుంది" ఒకటికి రెండు సార్లు ఎందుకు చదివాను అంటే కొన్ని కవితలు నిగూడంగా ఇంకేదో ఏదో చెబుతున్నట్టు అనిపించాయి నాకు,ఇంత ఓపిక ఎక్కడిదీ మనిషికి అనుకొంటూ మట్టిలో అన్వేషణ కొనసాగించాను, వీపు మీద బళ్ళున చరిచినట్టు ఉలిక్కిపాటులో ఊహకందక నిక్కబొడుచుకొన్న వెంట్రుకలు,ఒక్క చొట కళ్ళూ మనసూ రెండూ ఆగిపోయాయి. "సుదృడ కాండపు దేహాన్ని నిటారుగా నిలిపి ప్రపంచమే నాదన్నట్లు గర్వంగా వొదిగినా" "గర్వంగా ఒదిగినా" ఈ రెండు పదాలు చాలవూ కవీ కవిత్వమూ ఒకటేనని చెప్పడానికి,నిజాన్ని నిజంగా చూడాలన్నా చదవాలన్నా కించిత్ సాహసం చెయ్యలని తెలిసొచ్చింది ఈ పూట నాకు. కట్టా శ్రీనివాస్ పరిచయమున్న వారందరికీ ఆతని ప్రజ్ఞా పాటవాలు, బుద్దికుశలత, మృదు మధుర స్వభావం తెలిసినవే మరి ముందు మాటలో అఫ్సర్ గారన్న లోపలి యుద్దం ఏమిటంటే "కూర వండేందుకు వేడి ఉడాల్సిందే పరిస్థితులలో మార్పు పండాలంటే కోపమూ ఉండాల్సిందే" కవి తనలో లేని కోపాన్ని, తనకూ అవసరమే అనుకొన్న కోపాన్ని..ఎంతవరకూ అవసరమో తెలుసుకోవడం లోపలి యుద్దమే కదూ..... అక్కడా ఇక్కడా విశ్లేషనలూ విమర్సలూ చదివి అభివ్యక్తిని కూడా వెదికాను.కవి; "ముడి చెదిరిన జడలా రెప రెపలాడుతున్న కొబ్బరాకుల సవ్వడి" అనగానే నేనికి పుష్కర స్తానానికి బయలుదేరాను. ఇంతకీ ఏముంది మిత్ర పొత్తంలో! మట్టి వేళ్ళలో? చిలక వాత్సల్యపు ఇస్మైయిల్ బాబా పలకరింపు ఇంపు ఉంది. మిత్రమా కట్టా శ్రీనివాస్ నీమాట నీకే ఇప్పుడిక: నీకు, నీలాంటి వాళ్ళకు మరో ప్రదేశముంది అక్కడికే వెళ్ళు ఫో కుదురితే వాళ్ళతో ఉండిపో దాన్ని స్వర్గమని నీలాంటి వాళ్లనే దేవతలనే పేర్తొ తిడతారని ఎక్కడో విన్నా ఆ ప్రదేశం జనం నాలుకలని, అక్కడ మీ కవితలు నిరంతరాయంగా ప్రవహించాలని కోరుకొంటూ.... గర్వంగా వొదిగినా పచ్చని చెట్టుని నిలబెట్టిన మట్టివేళ్ళ నడుమ ఒకానోక వానపాము.....మీ వర్మ.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPElES

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || వాడిపోయిన పువ్వు || వాడిపోయిన పువ్వు కొమ్మనుండి రాలిపోయే క్షణానికి ముందు జీవితాన్ని శ్వాసించడం ఎంత కష్టమో నీకు తెలియదు నన్నెవరూ చేతులలోకి తీసుకోరు మురిపెంగా సిగలో దోపుకోరు మాలలో కలవనివ్వరు, దేవునిపై జల్లనివ్వరు కనీసం నేనూ పువ్వునని గుర్తించరు ******* వింటున్నావా లేక నువ్వూ ఈ లోకం లాగే సమాధిలో నిదరోతున్నావా చెంపలపై ఎండిన కన్నీటి గుర్తులు ఎర్రని ప్రేమ లేని పగిలిన పెదాలు రోగాలతో చిల్లు పడిన దేహం ఏముంది నా దగ్గర ఆకర్షించడానికి మనసూ నీతోనే పాతిపెట్టబడింది ******* నాకేమీ వద్దు ఒక చుక్క ప్రేమ ఈ ముసలి గుండెను తడిపితే చాలు కొమ్మనుండి నవ్వుతూ రాలిపోతాను మీ చాంద్ || 02.04.2014 ||

by Chand Usmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPEiJ7

Posted by Katta

Chakra Pani Yadav కవిత

ఆటవెలది పద్యాలు నందికొట్కూరు - ఈనాడు 2-4-2014

by Chakra Pani Yadavfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPagFw

Posted by Katta

Vijay Kumar Svk కవిత

ఆధునిక కవిత్వంలో భావాన్ని ప్రకటించడానికి "ప్రతీకలు" బహుళంగా తోడ్పతున్నాయి. అయితే, ఈ ప్రతీక విధానంలో ఒక లోసుగుబాటు ఉంది. స్వభావ సిద్దంగానే వాటి అర్ధం అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని అందుకోడానికి కవితో చదువరికి సాదృశ్యమయిన భావన, దృష్టి అవసరం. లేకపోతె ప్రతీకలు అర్ధం కావు. అర్ధమైతే అపూర్వానందం. లేకపోతె అయోమయం. కవితలో ప్రతీకలు వాడేటప్పుడు కవులు అవి అర్ధమయ్యే వాతావరణాన్ని పరోక్షంగా అయినా కల్పించాలి. ---యం. రవీంద్రా రెడ్డి ( 'వచన కవిత్వం- అస్పష్టత ' నుండి)

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jY4bJj

Posted by Katta

Satya NeelaHamsa కవిత

కలిసి విడదీసాం ^^^^^^^^^ -సత్య మరి, జరిగిందేదో జరిగిపోయింది ఏది ఏమైనా మనమే కలిసి చేసేసాం నేనొక చోటా నువ్వొక పూటా వెరు వేరైనా విడివిడిగా ఒకే చందమామని కలిసి చూసేసాం నా నిరీక్షణ నీ దారి వేరువేరైనా ఒకరి తలపుల్లో ఒకరుగా కలిసి నడిచేసాం నా తలపు నీ మరుపు వేరు వేరైనా ఒకరి మనసుల్లో ఒకరం కలిసి మరిచేసాం నా తెగువా నీ బిడియం వేరువేరైనా ఎడభాటుకి మాత్రం కలిసి అడుగేసాం నా ఆవేదన నీ అలోచన వేరువేరైనా పంచుకున్న కాలాన్ని కలిసి మూసేసాం నా హరివిల్లూ నీ బొమ్మరిల్లూ వేరువేరైనా కలల సౌధాన్ని కసిగా కలిసి కూల్చేసాం నా విరహం నీ తమకం వేరువేరైనా తడబాటులో కన్నీరు కలిసి వదిలేసాం నా విడుపు నీ పట్టు వేరువేరైనా పెనవేసుకున్న కౌగిలి కలిసి విడదీసాం -సత్య

by Satya NeelaHamsafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pPadJN

Posted by Katta

RajendraKumar Devarapalli కవిత

ఎండ మండిపోతుందని చెప్పేందుకు రాజేంద్రకుమార్ దేవరపల్లి,2-4-2014 ఎండ మండిపోతుందని చెప్పేందుకు మొహమాటమెందుకోయ్ కవీ!! తల మాడుతోందనీ కాళ్ళుకాలుతున్నాయని చెప్పేందుకూ సిగ్గేనా? దాహమవుతుందనీ దప్పికతీర్చమని అడిగేందుకు అడ్డంకేమిటోయ్ పిచ్చివాడా? చెప్పులో,గొడుగో,తలగుడ్డో ఇవన్నీ తాత్కాలికమేనోయ్ బాబు పైకప్పు పాడయ్యింది పద తాటితోపులవైపు వెళదాం.

by RajendraKumar Devarapallifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jY4dB3

Posted by Katta

Viswanath Goud కవిత

చీకటి భాణాలు ఆకాశంలో కొన్ని చుక్కలు పరిగెడుతుంటాయి ఎవరో తరుముతున్నట్టు, ఏ ఆపన్నహస్తమో అందుకోవాలన్నట్టు... చీకటి తరిమితే వెన్నెల పంచన చేరాలనుకుంటున్నాయి కాబోలు... వెన్నెలను వెంటాడుతూ చీకటిమంట వ్యాపిస్తోందని, నల్లగా కాల్చి రాత్రులకు కాటుక దిద్దబోతోందని.. చీకటి భాణాలు సంధిస్తుంటుంది అమాసని.. వెన్నెలను పడగొట్టాలని వెలుగుల నుండి విడగొట్టాలని... పక్షానికో మారు యుద్ధం ప్రకటిస్తుందని. తాము రాత్రి గుమ్మానికి కట్టిన రాలిపోయే తారాతోరణాలయితే.... వెన్నెల ఆకాశానికి దిష్టి తీసి పెట్టిన కరిగిపోయే కర్పూరమని. ఆకాశపు కొలనులో అమావాస్య అలజడికి చెదిరిపోయే ప్రతిభింబమని.... చెదిరిన ప్రతీసారీ... గడ్డకట్టి పగిలిపోయిన మంచు ముక్కలుగా కరిగి కనుమరుగవుతుందని... తెలియదేమో వాటికి. తెలిసుంటే రావు చుక్కలు వెన్నెలను ఆశ్రయించి..ఏదో ఆశించి. ఎవరు చెప్పారు చుక్కలకు పరిగెడితే పారిపోవచ్చని.. చీకటి నుండి తప్పించుకున్నా పగలుకు తప్పక పట్టుబడి రాత్రిలో బంధీ కాక తప్పదని, ఇదో చక్రవ్యూహమని ఎవరైనా చెప్పాలి వాటికి.! -విశ్వనాథ్ 31MAR14

by Viswanath Goudfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRlRTo

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbEeF

Posted by Katta

Annavaram Devender కవిత

పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది అన్నవరం దేవేందర్ .....................................తొవ్వ...02.04.2014 అవును పున్నం పున్నం కు కవిత్వం ఎన్నీలై పరుచుకుంటంది .కరీంనగర్ లో ఇది గత ఎనిమిది నెలలలు గా సాగుతంది .ఒక్కో పున్నం నాడు ఒక కవి ఇంటి డాబా మీద కవులంతా సాయంత్రం ఏడింటికి జమ అయితరు.గుండ్రగా కూసోని మనిషో కవిత సదువుతరు .అటేనుక ఆ కవితలన్నీ మల్లవచ్చే పున్నం కు పుస్తకంగా వస్తయి.తెలంగాణా రచయితల వేదిక జిల్లా శాఖ దీన్ని ఏర్పాటు చేస్తే సాహితీ సోపతి అచ్చోస్తది. ఇది ఇప్పుడు మహా అద్బుతంగా నడుస్తంది .ఒక్కో పున్నం కు అరవై ,డెబ్బై మంది కవులు వస్తుండ్రు .ఇందులో యువ కవులు పది పదిహేను దాక ఉంటరు.ఇలా కొత్తగా రాస్తున్నవారు హాజరవడం పాత వాళ్లకు ఆనందం అయితంది . మల్లా కవిత్వం కూడా కొత్త పుంతలతో రాస్తండ్రు .ఇలా కరీంనగర్ లో కవిత్వ వాతావరణం వెళ్లి విరుస్తుంది ఒక్కో కవి ఇంటి డాబా మీద ఎన్నీల కవిత్వం నడుస్తుంటే అక్కడికే పులిహోర ,బజ్జీలు ,సమోసా ,గుడాలు ,గారెలు ఇలా ఎదో ఉపాహారం వస్తుంది .ఆ రాత్రి సాహిత్య అనుభూతి తో గడుస్తుంది .కవిత్వం చదివే ఇల్లు ఇంటి పక్కాలు సుట్టాలు ఈ సమ్మేళనం ల పాల్గోటండ్రు.ఆతిథ్యం ఇచ్చే కవి ఇంటికి జిల్లాలోని కవులంతా కలిసి రావడం గొప్పగానే ఉంటంది .అపార్ట్ మెంట్ అయితే ఆ నివాసులు అంతా సమ్మేళనం కు వచ్చి కవిత్వం వినుడు .కవిత్వ సభల్లగా వేదిక లు ఉండయి .సుట్టు కూసునుడు రాత్రి తొమ్మిది దాటిందాకా కవిత్వం మాట్లడుకునుడు .ప్రతి సారి కొత్త వాళ్ళ తోని ప్రారంభిచుడు.ఆ తరువాత బస్సులెక్కి దూరం పోయేవాళ్ళు .అటేనుక లోకల్లున్న పాత కవులు ..ఇలా కరీంనగర్ కవిత్వం కొత్త పోకడలు పోతంది .దీన్ని ప్రేరణ గా ముంబై ,జనగాం ,సిద్ధిపేట లలో మొదలైతంది ...దీని పేరు ‘ఎన్నీల ముచ్చట్లు ‘ ఇది పత్రికల్లో బాగా ప్రచారం సుత అయ్యింది .నమస్తే తెలంగాణా బతుకమ్మ లో కవర్ పేజి ఆర్టికల్ .ఇండియన్ ఎక్స్ ప్రెస్ ల స్టేట్ పేజీల వచ్చింది v6 లో ప్రసారం అయ్యింది .దిన పత్రికల జిల్లా పెజీలనైతే పున్నం పున్నం కు వస్తంది .ఈ ప్రచారం తోని ఇదివరకు తెలువని కవులు ఎందరో కలుస్తుండ్రు .కవిత్వం సడువుతుండ్రు వచ్చే పున్నం కు పుస్తకం అచ్చు ల కవిత సూసుకున్టుడ్రు......... కవిత్వం కావాలె...కవిత్వం కావాలె ......ఎన్నెల ముచ్చట్ల కవిత్వం ల తడిసి పోవాలె ... జయ హో కవిత్వం

by Annavaram Devenderfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbDYb

Posted by Katta

Krishna Mani కవిత

మనసు ********** నా మనసు అలల తాకిడికి నడి కడలిలో దిగింది అంతుపట్టని ఆలోచనల సుడిగుండంలో గమ్యం చేరని నిర్జీవిలా చేపల ఆకలికి ఆహారంగా కనిపిస్తుంది ! ఆకాశంలో గద్ద చూపులకు గురిగా మారాను నిశి రాత్రి అడవి సింహాలకు లేడి పిల్లలా దిక్కు తోచక తిరిగితిని పెద్ద పులి కామ చూపులకు బలినై నిలచితిని గాలి హోరుకు తెగిన గాలి పటమై ఎగిరితిని కొనజేరిన జీవితపు క్షణాలని గుండె కార్చిన నెత్తుటిలో మునిగితిని ! తల్లి చూపుకు దూరమైతి తండ్రి యదపై భారమైతి దూది పింజకు నీరు తగిలి అడుగు బడితి ! కృష్ణ మణి I 02-04-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIbBQg

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | వీక్షణ కాంక్ష ---------------------------- చుట్టుపక్కలకి చూపులు ప్రసరించటం ఇంకాస్త తీవ్రతరం కావాలి, కనుమరుగౌతున్నవన్నీ కళ్ళలోకి పట్టేయాలి. కబోదికి కళ్ళు వస్తే, దృగ్గోచర ప్రపంచ రూపురేఖల్లో ధీర్ఘకాల దుఃఖిత మమకారంతో లీనమయ్యే రీతి చెందాలి: కొత్త కళ్ళుంటే బాగుండునని ఉంది. కళ్ళ నుంచి కాంతి పుంజం నలుదిక్కులా పరావర్తనం చెంది ప్రకృతి దర్పణంలో భాసిల్లే ప్రతిరూపాలు పలుకరిస్తుంటాయి రాతిలో రంగులు గమనిస్తున్నాను ఏటిలో కెరటాలు పసిగడుతున్నాను వింత ఆకృతులూ ఊహిస్తుంటాను మరి, ఇంకా ఎందుకీ వీక్షణ కాంక్ష? స్మృతి పథంలో దృశ్యాలు మనసు ఆవరణకి తేవాలి విస్పష్టమైన రూపాలని మరొకసారి పరిశీలించాలి తిరస్కృతి లో చేజార్చుకున్న జ్ఞాపకాలు ఉన్నాయేమో తరిచి చూడాలి చూపుని ఏమార్చి లోలోపల చోటుచేసుకున్న గురుతులని పదిలం గా పొదిగి వెలికి తీయాలి నా కనులకి అలవోకడ అలవాటు కావాలి రాతి గుండెలో కదలిక కనిపెట్టాలి ఉదాసీనత పట్టి పీడిస్తున్న మనిషిని చుట్టుముట్టాలి 'సగటు', 'మామూలు' కొలతల్లో మునిగిన వారికి 'శూన్యం', 'సంపూర్ణం', 'నిశ్శేషం' ఉంటాయని చూపగలగాలి మూగ/వోతున్న/ జీవుల వేదన కంటిపాపకి అందాలి సాగిపోతున్న కాల చరిత్ర ని కనులారా చదవాలి లోపలా వెలుపలా నడిచే యోచనలకి సమన్వయం కుదర్చాలి... 01/04/14

by Usha Rani Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h0OtuZ

Posted by Katta

Rajeswararao Konda కవితby Rajeswararao Kondafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pLXkAd

Posted by Katta

Kamal Lakshman కవిత

చిత్ర విచిత్రం.................కమల్ ఆశ్చర్యం...ఆనందం..అద్భుతం...!!! గోవు వరాహానికి పాలియ్యటం..... దేవుడు సృష్టించిన ఈ అనంత విశ్వం, ఈ నాటికీ మానవుడి మేధకందని పద్మవ్యూహమే. అందులో ఇలాంటి చిత్ర విచిత్రాలన్నోకదా! మనుషులకన్నా పశువులు మేలు అని ఊరకే అనలేదేమో మన పెద్దలు అందుకు ఇది తార్కాణం కాదా! ఈనాటి మనుషులమైన మన నిజ జీవితాల్లోకి తొంగి చూస్తే,నిశితంగా పరిశీలిస్తే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు కులం, మతం,రాజకీయం అంటూ అడుగడునా అణువణువునా మన ప్రతి చర్యా (ముసుగులేవైనా ) వాటి అంతిమ లక్ష్యం మాత్రం డబ్బుల కోసం వేట..... ఇలా ఇందుగలదందు లేదు, ఎందెందు వెదకినా.... స్వార్థం... స్వార్ధం ....స్వార్ధం..అంటూ మన నర నరాన జీర్ణించుకుపోయిన ఈ పరిస్థితులలో..... పైన కనిపిస్తున్న ఈ దృశ్యం మనందరం తప్పకుండా చూడాలి.. చూసి ఒక్క క్షణం.. ఒక్క క్షణం... ఒక్క క్షణం... ఆలోచించాలి...!!! అవునంటారా...? కాదంటారా...? మీ కమల్ 02.04.2014

by Kamal Lakshmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h0OteD

Posted by Katta

Nirmalarani Thota కవిత

మంచు దుప్పటి కప్పుకొని మగత నిద్రలోకి జారి ఒళ్ళు విరిచి ఆవులింతల ఆకుల్ని రాల్చి పక్కకు ఒత్తిగిలి మళ్ళీ మాగన్నుగా కునుకు తీస్తూ తన కాళ్ళ కింద మొలచిన గడ్డి పువ్వు పరవశం సోకితే స్వాప్నిక జగత్తు నుండి తుళ్ళి పడి నిదుర లేచిన ప్రకృతి ! నవ నవోన్మేషపు పత్ర హరితాల పరవశాల జాతర ! యాంత్రిక జీవన స్రవంతిలో కొట్టుకు పోతూ కూడా సున్నితత్వపు స్పర్శ సడలని కవి మనస్సులా కాకి గూట్లో పొదిగినా మార్దవం వీడని కోకిలల కుహూ కూజితాల రాగ రంజితాలు ! సంధ్య వారగానే సమ్మోహనాల పరిమళంతో తనువును, ఎదనూ మత్తెక్కించే మల్లెల సౌరభాల సోయగాలు ! అదిరే లేలేత చివుళ్ళ కెంపైన పెదవులతో తరుణం వచ్చేసిందని తన్మయాన తరువు తరుణులు ! అరవిచ్చిన కంజాత దళాక్షుల కాంక్షా సమ్మిళిత శోభిత దృక్కుల్లా నును సిగ్గుతో కందిపోయిన కన్నెపిల్లల బుగ్గల్లా అక్కడక్కడా మోహరించిన కెంజాయ వన్నె గుల్ మొహార్లు ! ధరణీ కాంత చిలక పచ్చ చీరె సింగారించుకొని తన ఒడిలొని పసి కూనలకు పురిట్లోనే జీవన సారమంతా రంగరిస్తూ ఉగ్గు పాలతో ఉద్వేగాల చేదును దిగమింగే అత్మీయతా, ఆత్మ విశ్వాసం మేళవించిన తీపిని పంచుతూ ఎదురొచ్చే సవాళ్ళ కారాలను మమకారాల్తో జయిస్తూ చీకూ చింతా లేని చిన్నారుల అల్లరి చింతల పులుపులతో ఆలుమగల అలకల కులుకుల వగరుతో షడృచుల ఆస్వాదనకు సమాయత్తం చేస్తూ . . చివుళ్ళు మేసిన చైత్ర కోయిలలు చిరుగాలి సన్నాయి మైత్రి పిలుపులు కొమ్మ పాటల ఊసుల ఊయలలు కొంగొత్త ఆశల విరుల లాహిరులు . . ఒక్కసారిగా ఈ చిత్తరువును కనురెప్పల గుండెల్లో బంధిస్తే . . ఓహ్ . . ! మనసంతా విచ్చిన వసంతం ! బ్రతుకంతా పరుచుకున్న పచ్చదనం ! { కవి మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు . . ! } నిర్మలారాణి తోట [ తేది: 31.03.2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSPa4C

Posted by Katta

Radha Manduva కవిత

ఊటబావి మనసు ------------- నిర్జన నదీతీర ఒంటరి కుటీరానికి వెళ్ళాలని ఉంది ఊహాజగత్తులో రమ్యహర్మా్యలను నిర్మించాలని కాదు దూర తీరాలతో నాకు నిమిత్తమూ లేదు నాలోని అస్తవ్యస్త భావాలన్నింటినీ ఒకచోట చేర్చి చూసుకోడానికీ నాలో ఉన్న ఎత్తు పల్లాలను చదును చేసుకోవడానికీ మీద పడుతున్న దాహపు కోరికల అలల తీరాన్ని కనుగొనడానికీ వెళ్ళాలి - ఒక్కసారి ఆగి నన్ను నేను సంభాళించుకోవాలి సాంత్వన పొందాలి కాని అదేమిటో… బంధాల అనుబంధాల చట్రాల్లో భ్రాంతుల వలయాల్లో గతకాలపు జ్ఞాపకాల్లో చిక్కుకుని చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇక్కడిక్కడే ఊరుతుంది ఊటబావి మనసు ***

by Radha Manduvafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PgHCBW

Posted by Katta

Shash Narayan Sunkari కవిత

కొత్త "బిచ్చగాల్ల" బిక్షాటన మొదలయే "అమ్మా అని అడుక్కునేవాడు ఒకడయితే ఇంకోడు అమ్మలార అంటాడు వేసింది తిసుకుని వెల్లే వాడు ఒకడయితే నాకే ఒటు వేయమంటాడు ఇంకొకడు కృతఙ్ఞతతో నాలుగు కాలలు చల్లగా ఉండమని దివించేవాడు ఒకడయితే 5 సంవత్సరాలు మా తడాక చూపిస్తాము అంటాడు ఇంకోకడు. తమ అవసారాల కోరకు ఒకడు అక్కున చేర్చుకున్నట్టు,నుదుట ముద్దులు పెడుతు ఇంకోకడు", మరొకడు పిల్లల ముక్కులు తూడుస్తున్నట్టు వారి ముడ్డిలు కడుగుతున్నట్టు ఫోటోకు పోజులిస్తారు. గెలిచినాక ఓటేసిన మననే తంతారు,ఏదో చెత్త,కంపు వచ్చినట్టు అసహ్యించుకుంటారు మేలుకోండి జణాలు ఇప్పుడు మీ చేతిలో ఉంది అయుధం దద్దమ్మ,స్వార్థా రాజకీయ నాయకుల తలలు ఓటుతొ తెగ నరకండి అందివచ్చిన అవకాశం చేజారనివ్వొద్దు ఓటరంటే గౌరవం ఉండేల బుద్దొచ్చెటట్టు మీ తీర్పు ఉండాలి అంతే కాని మీకు వేసె పాతికో పరకకో కక్కుర్తి పడి మరో స్వార్థ పరుడికి వోటేస్తే మీరు మరో అభినవ బిచ్చగాడివి అవ్వక తప్పదు,మి కుటుంబాన్ని బిచ్చగాళ్ళ కుటుంబం చేయకు.

by Shash Narayan Sunkarifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSPa4E

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఉగాది పోటీలో పాల్గొన్నా కవులందరూ తమ చిరునామాలు నా చాట్ బాక్స్ లో ఇవ్వ వలసినదిగా కోరుతున్నాం , నిన్నటి నిర్ణేత RVSS శ్రీనివాస గారు కొంతమంది విజేతలకు , మరియు శ్రీ యశస్వి గారు కవిత సంగమం వారు కొంతమందికి తమ విలువైన కవితా సంకలనాలు బహుమతి గా అందచేస్తాం అని తెలియచేసినారు . కావున దయచేసి తమ చిరునామా పూర్తీ వివరాలతో తెలియచేయ గలరు . కృష్ణా తరంగాలు పార్ధసారధి ఊటుకూరు 9059341390

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKZwYy

Posted by Katta

Veera Sanker కవిత

II ఆత్మగౌరవ విలాసం II - వీరశంకర్ గ్రామ సింహాలు మొరుగుతాయి సింహఘర్జనలనుకుని భ్రమపడుతూ.. శునకరాజం ఆ వీధికి తానే మృగరాజనుకుంటుంది ఎంగిలి మెతుకులకు ఆశపడుతూ.. వీధి కుక్క గుంటనక్కలా మాటేసి కూర్చుంటుంది మరెవ్వరూ తన రాజ్యంలోకి రాకూడదని.. అంతలోనే ఆ అతుకుల గతుకుల అహంభావపు అడ్డదారిని చదునుచేసుకుంటూ ఓ గజరాజం రాజసంగా ప్రవేశిస్తుంది రహదారిన. ప్రతి ఒక్కరూ ఎదిగొచ్చేలా ప్రతి ఒక్కరూ పయనించేలా ప్రతి ఒక్కరిలో ఆధునిక వికాసాన్ని వెలిగించుకుంటూ ప్రతి ఒక్కరిలో ఆత్మగౌరవ విలాసాన్ని లిఖించుకుంటూ ఈ రహదారిని ప్రతి ఒక్కరికి అంకితం ఇస్తుంది. తన సామ్రాజ్యాన్ని ఎవరో దోచుకున్నట్టు ఆ గ్రామసింహం మొరుగుతూనే వుంటుంది.. భయపడి బెదిరించాలనుకుంటూనే రాళ్ళ దెబ్బలు తింటుంది..

by Veera Sankerfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKx5dh

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

'అక్షర ప్రవాస కోకిల - నాగరాజు రామస్వామి ఏప్రిల్ 2014 పూలకారు మీద కోకిల షికారు కొమ్మ కొమ్మన పుప్పొడి పొట్లం ఆమని మీటిన కలకంఠం అడవి పూచిన పూల పాట. వసంత గీతాన్ని మోసుకుంటూ వచ్చింది వలస కోకిల కొత్తపూలను హత్తుకోవాలని. ఇక్కడ మావిళ్లు లేవు వేపలు లేవు, పలాశలు లేవు లేవు మధుమాసపు మల్లెలు. ఐనా, వాడలేదు కోకిలమ్మ మొఖం! స్వర్ణ వర్ణ గోల్డెన్ రాడ్ ఎర్రని పూల తివాసి పరచింది నీలి రేకుల బ్లూ బోనెట్ స్నేహ హస్తం అందించింది ఒళ్ళంతా తెలి పూల పొంగై ఆపిల్ చెట్టు పలకరించింది ‘తొలి చిగురును’చూసేందుకు వలస పక్షి రాబిన్ తిరిగొచ్చింది ఆకు పచ్చని ఆహ్వానపత్రమై పొరుగు చైత్రం చిగురించింది. వసంత గీతమై వచ్చిన వలస కోకిల కొత్త పూలను గుండెకు హత్తుకుంది! March 22, 2014 6:58 PM (జయభేరి మొదటి భాగం – కవిత 8)వాకిలి' మార్చ్ 2014 సంచికలో లో వచ్చిన నా కవిత:

by Ramaswamy Nagarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dPo0A1

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1pwOCYl

by Pratapreddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pwOCYl

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఒంటి గ్రామం 1ఈ పూట కురిసిన వాన చినుకుల్లో ఏదో కొత్తదనం ధరణి చెక్కిళ్ళను కొత్తగా ముద్దాడిన నింగి పెదవులు 2ఆ మట్టి పరిమళం మనసు గట్టుపై అలానే పేరుకుపోయింది ఎన్నాళ్ళైనా 3ముక్కుపుటాల్లో ఎడారి రాతలు కొన్ని ఇంకకుండా నడుస్తూ తనువుల్లో తలపుల్లో తడియారని సంతకాలు వసంతం వచ్చినప్పుడల్లా 4కన్నీటి జీరలు పదే పదే చిట్లినా ఒణుకుతున్న ఒంటి గ్రామాలు ఎన్నిమార్లు గండిపడినా అంటుకట్టని విగత సత్యాలు 5చినుకులు చిదిమిన నేలంతా కొండగుహల్లా చిద్రమై వాన భాష్పాలను ఎన్నాళ్ళుగానో మోస్తూ 6పాదాల కిందా మట్టిగాలి ఊపిరాడక చెదలుపట్టి వేలికొనలతో కాసిని పిచ్చి రాతలు 7చిరునవ్వులను లిఖిస్తూ బాధలను మింగేస్తూ మళ్ళీ ఒక వాన కురవాలి తిలక్ బొమ్మరాజు 31.03.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pwOCHK

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

శేషప్రశ్న రావెలపురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ నీటిచినుకుకోసం నిరంతరం ఎదురుచూసే నెర్రెలుగొట్టిన నేలలా నా హృదయం ఆమె రాకకోసం అన వరతం పరితపిస్తున్నది చివురుజొంపాలతో సయ్యాటలాడేందుకు తయారయే పచ్చని పైరు పొలంలా ప్రతిక్షణం నాకళ్ళెదుటన తిరుగాడిన ఆమె నిత్య సుమంగళిరూపం నన్ను విషాదాల అంచున పరదాలమాటున కప్పెట్టి పదే పదే దోబూచులాడుతూ దొరకబుచ్చుకోడానికి వీలుగాకుండా అదృశ్యమై అలరిస్తున్నది ఆపసోపాలు పడేలా ఆటపట్టిస్తూ అందకుండా పరుగెడుతున్నది. విధిచేతిలో కీలుబొమ్మలంగదా అందుకే ఇలా నా జీవన సరళిని అస్తవ్యస్తంజేసి ఆ పరాత్పరుడు ఈ ప్రహేళికను రచించి గొప్ప నాటక కర్తగా ప్రశంసలనంద్కునే ప్రక్రియలో మునిగి తేలుతూ మానవాస్తిష్కాలను తొలిచేస్తూ మరో రచనను విజయవంతంగా రూపొందించేదుకు సమాయత్తమవుతూ సందడిజేస్తూ సాగిపోతున్నాడు అవహేళన లేమీ అడ్డుపడకుండా జాగ్రత్త వహిస్తున్నాడు మనిషేమో విధి లిఖితమనుకుంటూ కన్నీళ్ళను కడలిలా పేర్చుకుంటూ శేషజీవితం నిశ్శేషంచేసుకుంటున్నాడు సదసత్సంశయంలో ఊగిసలాడుతూ జీవనరధాన్ని కాలానుగుణంగా మనసును మరల్చుకుని సాలోచనకు ప్రతిరూపంగా సాగిస్తున్నాడు ************************************************************02-04-2014

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s4ABmF

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ --- ।। నా తెలుగు।। --- పెదవులు పలికే షోకుల పలుకుల్లో నలిగిపోతోంది నా తెలుగు భాష. చేతులు రాసే భవిష్యత్తు రాతల్లో బలైపోతోంది నా తియ్యని తెలుగు . ఇది జీవనోపాదికి పునాది మార్గమో .. ! తీయని భాషను మరిచిపోయే తరుణమో .. ! నిద్ర లేచింది మొదలు పరభాషతో నిత్యం యుద్ధమే నా తెలుగుకు . కొలువుల అవసరాల్లో ,పలువురి నిర్లక్ష్యాల్లో కొలిమిలో కాలే ఇనుపముక్కలా. తీయని నిద్రలోనూ ,తెలియని కలవరింతల్లోనూ కానరాదు నా ప్రియతమ తెలుగు . చేదు భాధాలోను ,లోతు గాధలొనూ అవసరమే లేదు అనవసరం అయిపోయిన మన తెలుగు . మా తెలుగుతల్లి మల్లెపూదండ వాడిపోతోంది మా తెలుగు పలుకులు మననుండి వేరు పడిపోతున్నాయి . ఎవరు బ్రతికిస్తారు ?ఎవరు కీర్తిస్తారు ? నా తేటతెలుగు పూల సౌరభాలను ! (తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలతో ... ) (31-03-2014)

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWcd6S

Posted by Katta

Sahir Bharathi కవిత

! ఆధునిక సంగమంలో ఏకాంతత ! .................................................................. పొడుగవుతున్నతరంలో అస్తిత్వం కోల్పోయిన ఆత్మ తాను తన లోకం మరిచి తన జీవనంతో ఉండే తాడును భంగపరిచి ఏ కార్యాన్ని మోసుటకు వాని భుజాల సత్తువని ఎగిరేస్తున్నాడో మరి..! ఏ వంతెనపై నడుచుటకు వాడి దేహనిజస్వరూపానికి సెలవు పలుకుతున్నాడో మరి ..! ఓ ఈ పొద్దు మానవా! నన్ను ఈ సంఘంనుండి బహిష్కరించవా............. ఈ బతుకుకి భేదమైన త్రోవని ఆవిష్కరించే సత్తువను తెలియజేయవా................. sahir bharati. *31.3.2014 : ugaadi : 3.40 am.

by Sahir Bharathifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hScAXP

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె . ••నాలో కొన్ని రాతలు •• బోయీల కాలి దుమ్ము యెరుపు సాయంత్రం నిద్ర- ••• పిచుక పూల రెక్కల్లో ముసుగు రెప్ప తొలగింపు- ••• ఆకురాలు పూట ముళ్ళ పొద మనసు చేయు దుఖ్ఖ పాట కూర్పు- ••• గదీ వెలుతురూ చీకటి కనే నాలుగు ముఖాల మట్టి జ్ఞాని- ••• మొదటా లేదూ చివర గొన్తుపొరలో మాట తడి- ••• బలి కోరు నలుపు దేవుడు ఊరి చివర ఒంటరి చెట్టు- ••• అల ముద్దు ఒడ్డు మొద్దు నిద్ర- ••• పడవలు నీటిపై తేలు ఒక రెక్క వింత సీతాకోకలు-

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jVxxrS

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//జీవితపు రుచి// మోగకుండానే వినపడిన రింగుటోన్ వీపుమీద చరుస్తూ ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది ఆలోచనలు సమాధానాలు పోచేస్తుంటే సమాధానాలు ప్రశ్నలు వేస్తుంటాయి ఎక్కాలకి తెగని లెక్కలు వేలల్లో లక్షల్లో వెక్కిరిస్తాయి మార్చి ముగింపుకి శీర్షాసనం కూడా బదులివ్వలేనంది గుప్పిట విప్పమంటూ ఎకౌంటెంటూ ఆడిటరూ ఆదేశిస్తారు బ్యాంకరు బ్యాలన్స్ షీట్ తెమ్మని శెలవిస్తాడు తలనొప్పుల టర్నోవరులో వసూలు కాని పద్దు సప్లయర్సుకి చెల్లించాల్సిన బాకీలు కరెంట్ అకౌంటు బ్యాలన్స్ బ్లాంక్ చెక్కులా నవ్వుతుంది ఏ మార్చి31కి కైనా ఈ తిప్పలు తప్పేవి కాదు గానీ ఈ సంవత్సరం ముగింపే ఓ సంవత్సరాది రండి విజయ నామ సంవత్సర ఉగాది పచ్చడి తిని జీవితాన్ని మరోసారి రుచి చూద్దాం!....31.03.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rWcbf6

Posted by Katta

Kavi Yakoob కవిత

చదివారా ?! ............ విశ్వమానవ స్వప్నాన్ని ఆవిష్కరించిన 'దేవరాజు మహారాజు ’ January 10th, 2010 : ఆంధ్రభూమి సుధామ ---------- కవిగా, విమర్శకునిగా, కథా రచయితగా, అనుసృజనశీలిగా ఇప్పటికే సుప్రతిష్ఠితుడైన దేవరాజు ‘్భషకనే కల- కవిత్వం’ అంటూ విశ్వమానవ స్వప్నాన్ని ఆవిష్కరించాడు. మహారాజు మానవతా విలువలకు పట్టంకట్టాడు. ‘‘అనువాదానికి గ్రామ్యదృష్టి, జాతీయదృష్టి మాత్రమే సరిపోదు. అవి ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి. విశ్వమంతా నాది అనే భావనకి ఎదిగినవాడే అనువాదానికి పూనుకుంటాడు. ప్రపంచ ప్రజలంతా నావాళ్లు, ప్రపంచ సాహిత్యమంతా నాది అనే భావన అనువాదానికి తప్పనిసరి. కవిత్వం, కథ మొదలైన సృజనాత్మక ప్రక్రియలన్నీ ఎగసిపడ్డ మనిషి చైతన్యానికి ప్రతీకలు. దాన్ని నిలుపుకోవాలనుకునేవారే అనువాదాలవైపు ఆకర్షితులౌతారు’’ అంటూ తన అనుసృజన వెనుకగల అనుభూతి లక్ష్యాన్ని ఆవిష్కరించాడు. అంతేకాదు! అనువాదంలోని, అందునా కవిత్వానువాదంలోని సమాంతర సృజనాత్మకతను ఎరిగినవాడు కనుకనే- ‘‘ఒక భాషలోని మాటల్ని మరో భాషలోకి మార్చడమే అనువాదం కాదు. మాటల్లో అంతర్గతంగా దాగిన స్పర్శను, స్పృహను స్ఫూర్తిని, ఆర్తిని, అనుభూతిని మార్చగలగాలి’’ అని గుర్తించి, ఆ పనే నిజాయితీగా చేసాడు. దేవరాజు మహారాజు మునుపే భారతీయ కవితాత్మను ‘కవితా భారతి’గా ఆయా మూల కవులను చాలామటుకు నేరుగా సంప్రదించి మరీ అనువదించి, ఆవిష్కరించి అందించాడు. ఇప్పుడీ కవితా ప్రపంచంలో అర్జెంటీనా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, చైనా, చెకొస్లొవేకియా, డెన్మార్క్, ఫ్రాన్స్ జర్మన్, ఇండొనేషియా, ఇటలీ, జపాన్, లాటిన్ అమెరికన్, లెబనాన్, మెక్సికో, పాకిస్తాన్, పోలెండ్, రష్యా, సౌత్ ఆఫ్రికా, దక్షిణకొరియా, స్పెయిన్, సిరియా, అమెరికా, యుగోస్లేవియా దేశాల కవితలను కవితా ప్రపంచంగానూ, రెండవ భాగంలో ‘కవితా భారతీయం’గా గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మలయాళం, మరాఠి, ఒరియా, పంజాబి, ఉర్దూ కవుల కవితలను, మూడవ భాగంలో ప్రత్యేకించి భారతీయ కవయిత్రుల అనువాదాలను కవితా భారతీయం-3గా, అస్సామీ, బెంగాలీ, డోగ్రీ, గుజరాతి, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళ, ఇండియన్ ఇంగ్లీష్ భాషలనుంచి అనువదించడం ఈ సంపుటికి ఒక విస్తృతిని, వైశిష్ట్యాన్ని సంతరించింది. మరే భాషలోనూ ఇలాంటి అనుసృజన కృషి జరగలేదేమో! నిజంగా ప్రపంచాన్నీ, ప్రపంచ మానవాళి ఆలోచనానుభూతుల సరళినీ ప్రతిబింబించే మానవాత్మ దర్పణం ఈ సంపుటి- ‘నీకూ నాకూ మధ్య ఒక రంగుల నది.’ సహచరి క్రిషి (కృష్ణకుమారి)కి ఈ కృషిని అంకితం చేయడం ఇంకా బాగుంది. మూలాలు మనకు తెలియకపోయినా- ఆ మూలాగ్రం ఆ కవుల అక్షరాల్లోని కవిత్వ స్పృహను, స్పర్శను, అనుభూతిని అందించేందుకు దేవరాజు పడిన శ్రమ ఈ కవిత్వం చదువుతుంటే ఫలిస్తుంది అనడానికి పఠితకు కలిగే స్పందనలే ప్రబల తార్కాణాలు. దేవరాజు చిత్తశుద్ధి, నిజాయితీ వున్న కవి. ఇతర భాషాభినివేశం వున్న కొందరు ప్రముఖ కవులే, ఆయా మూల భాషల కవిత్వ సృజనను తెలుగు చేసుకుని, మూలాలను విస్మరించి తమదిగా మూలమూలల్లో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్న వంచనా సందర్భంలో నేడు ఆయా భాషా కవుల సృజనాత్మకతను సంరక్షించడానికే, తెలుగులో అనుసృజనచేసి, కొన్నిచోట్ల ఆ భావాలకు మెరుగులు దిద్దినట్లుగా కూడా చేసినా, తాను ఆ కవుల కవితాత్మ ముందు ఒదిగే వుండడం నిజంగా ఎదిగిన లక్షణం. అమ్మ చివరి క్షణాలను అమెరికాలోని తమ్ముడు అద్భుతమైన వీడియోగా తీసి పంపించమని ఫాక్స్ పంపిన అయ్యప్ప ఫణిక్కర్ మలయాళ కవితను దేవరాజు లేఖగా అనువదించిన తీరు- మానవ సంబంధాల పరిణామాల తీరు గ్రహించాక, నిజంగానే హృదయాన్ని కలచివేస్తుంది. * నీకూనాకు మధ్య ఒక రంగుల నది (కవితా ప్రపంచం) డా. దేవరాజు మహారాజు జీవన ప్రచురణలు

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PdbAqj

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ |||చిటారు కొమ్మల్లో మిటాయిపొట్లం||| =================================== అసమానతల నడుమ నిత్యం నయవంచనకు లోనవుతూ పంటి గాటుల మధ్య బాధను అదిమిపట్టి నవ్వుతూ... కృత్రిమం గా బతికేస్తున్నా అవశేషాలు శాపాలై వెంటాడే నీడల్లా తరుముకొస్తుంటే- నీడలోనే ఎన్నో చిత్ర విచిత్రాలు కాలంలో మెరుగులు అద్దుకుంటున్నాయి సూర్యోదయం కూడా ఎర్రగానే ఉంది అస్తమయం కూడా నిప్పులు చెరిగేస్తుంది హఠాత్తుగా జారిపోయే భానుడు కదా నా ఆలోచనల్లా !భావోద్వేగం ఎక్కువే ! తెల్లారని జీవితాల మధ్య ఎన్నో ఎన్నెన్నో నూతన సంవత్సరాలు కరిగిపోతున్నాయి జీవన పోరాటం ఎక్కడి వేసిన గొంగలి అక్కడేలా కొట్టు మిట్టాడుతుంది జ్ఞాపకాలు వారసత్వ పునరావృతాలై పాత చిగురునే తెచ్చుకుంటున్నాయి చెడు జ్ఞాపకాల మధ్య వేప కాడలై అను నిత్యం వెక్కిరిస్తున్నాయి రుచులెరుగని జీవితం షడ్రుచుల కష్టాలు మాత్రం చూపెడుతుంది తరాలు మారిన మారని నవ వసంతం చిటారు కొమ్మల్లో మిటాయిపొట్లం లా కనపడుతుంది నేనింకా చెట్టు కిందే ఉండిపోయా పైకి అమాయకం గా చూస్తూ ఆకాశంలో దాగిన ఆశలన్ని తుర్రు పిట్టల్లా ఎగిరిపోతున్నాయి గోటి పై చుక్క కోసం నేను నిస్తేజం గా చూస్తుండిపోయాను ================== మార్చి ఆఖరు /2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2HoN

Posted by Katta

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || ఉగాది || అవనిని పలకరించే అరుణారుణిమ గీతికలు పచ్చికబయళ్ళపై మంచు తుంపరల తుషారాలు మత్తిల్లిన కోయిల హిందోళగానాలకి ...దంతక్షతాలకి... మావిచివుళ్ళు సిందూర వర్ణాలనే పులుముకున్నాయి ! తుమ్మెదల ఝంకార నాదాలకి సిగ్గుతో తలవాల్చిన కుసుమపరాగాలు వాసంత సమీరాలకి తేనెసోనలు కార్చే సుమబాలలు మలయమారుతాలు వనకన్య చెక్కిళ్ళపై వ్రాసే మకరికాపత్రాలు తటాకంలో మెరిసే బంగారు వర్ణపు నీరు..సూర్యకిరణాల ప్రతిబింబాలే ! లతల లావణ్యంతొ వనమంతా వింతసౌరభాలు, కమ్మతెమ్మెరల రసభావనలకి .. మయూరాల వింజామరలు కోనేటిలో రాయంచల వలపు విహారాలు..జలపుష్పాల నాట్య విలాసాలు కొమ్మ కొమ్మనూ పలకరించే వసంతుని శ్వాసతో ఆమనికే వింత సొబగులు సెలయేటిలో దాగిన తుంబురుని వీణానాదాలు ! శుకపికాల సంగీతవిభావరి..వేపపూతల సుగంధాలతో..మామిడిపూతలతో మధురఫలాలతో ..మకరందాల జల్లులు కురిపిస్తూ..వనకన్య ధవలవర్ణ కాంతుల్లో హిమవత్పర్వతాలు ..రసమయ జగత్తులో ఒంపుసొంపుల మందాకినీ సోయగాలు ! వయ్యారుల సిగలో మల్లెజాజుల విరహతాపాలు నవనవలాడే నవమల్లికలు కొత్తజంటకు శృంగార ఉద్దీపనలే మదుప సేవనంలో అలిసిన తుమ్మెదలు రెమ్మరెమ్మకు ఆరాటమే మన్మధబాణాల స్పర్శతో పులకించి పోవాలని ! వీధివీధిన పంచాంగ శ్రవణాలు పుట్టింటికి కళ తెచ్చే కొత్త అల్లుళ్ళ ఆగమనం షడ్రుచుల సమ్మేళనం..ఉగాది పచ్చడితో శ్రీకారం..నవ్యజీవనానికి జయనామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. పచ్చదనాల హారతినిస్తూ ...వసంతకన్య

by Swarnalata Naidufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dIIs5t

Posted by Katta