పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మార్చి 2014, గురువారం

Balu Vakadani కవిత

బాలు వాకదాని ||బ్రతుకు పోరాటం|| బిందాస్ మాటలన్నీ మనోనిబ్బరంకోసమే, కడుపు నిండికాదు వీధి వీధి తిరిగేది ఆసరాకోసమే, ఆనందం కోసం కాదు అంతర్జాల గోడలపై తగిలించిన బొమ్మలన్నీ పాతవే, కాస్త ఉరటకోసం బాకీ లెక్కల కాగితం గుండెను తడుముతుంది చొక్కా జోబులోనుంచి నా వాళ్ళంతా నిలదీస్తున్నారు నన్ను నిలబెట్టటానికి అణిచిపెట్టిన ఆసక్తినంతా కొలమానాలతో చూపించాలెమో! దగాపడిన హృదయం మరోసారి సిద్దమౌతుంది తాకట్టుకి తగలపెట్టిన ఆదర్శాలు, సిద్ధాంతాలలోనుంచి తీసిన ఆయుధంతో మంచి మనసుని పొడవాలి కావలిసిన దానికోసం కసితో నేన్నుంటే, కాకమ్మ కథలంటారేమో! దారంతా వెతుకులాటే, కాస్త వెలుతురు వేసేవాళ్ళు తోడైతే భావుండు మన:శాంతి, మనోవేదన పట్టింపులేమీలేవు, కాస్త పనుంటే చాలు ఇంతకన్నా సాక్షాలు ఏంచూపను? రూపీకోసం, రోటీకోసం చస్తున్నానని బాలు వాకదాని 09-03-2014

by Balu Vakadanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc5BP

Posted by Katta

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ పాత చొక్కా॥ అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు బస్సెక్కేటప్పుడు తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!! (తే 13/03/2014 దీ 08.09 PM )

by Kumar Varma K Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc5BF

Posted by Katta

Sreedhar Babu Pasunuru కవిత

"On a River Bank" - Origin (Telugu): Pasunuru Sreedhar Babu Translated by: Elanaaga What’s there on a river bank? Perhaps a few teardrops left by someone A few faint quartered conversations Some abandoned faces of loneliness Circles of grief furrows in sand. What else is there on a river bank? Some arid melancholy blended and soaked In the rippling sounds of flowing river What more are there on river bank? On a river bank there are Multi coloured pebbles Broken snail shells Footprints carrying tinkles of anklets Lamps of moonlight assembled on noon clouds Is that all? No. On a river bank There’s a nameless sweetheart A buddy without own place A celestial embrace And a surreal handshake Besides these There’s also a frisky river which unmindful of all these flows gleefully ***

by Sreedhar Babu Pasunurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc3d1

Posted by Katta

Srinivasa Bharadwaj Kishore కవిత

సమస్యా పూర్ణ౦ సమస్య ౼ కోడలిప౦చన {ఇ౦టనె} జేరెనుకూతురిగత్తే {కూతురిగా అత్తయే} {సరదా} పీడ౦చెనతిగ ప్రాణము వీడేవరకి౦కనుతనివితీరలేదో మూడునెలలలోనెతిరిగి కోడలి ప౦చను {ఇ౦టనె} జేరెను కూతురిగత్తే {ప్రాణమున్న౦తకాల౦ పీడి౦చి తనివి తీరక కోడలికే కూతురిగా తిరిగి వచచేసి౦ది అత్త} {తత్వ చి౦తనపరమన పద్య౦} ఉ౦డగ వేద సఘోషలు ని౦డుగ ఇల్లది వాణీ నిలయమ్మేన౦ దు౦డగవేడగ{రమ్మన}జనకుడు కోడలి ప౦చను {ఇ౦టనె} జేరెను కూతురిగత్తే {సరస్వతీ దేవి ౼ కోడలి ఇ౦ట కూతురిగా అత్త లక్ష్మీదేవి సీత రూప౦లో చేరి౦ది}

by Srinivasa Bharadwaj Kishorefrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rOAM

Posted by Katta

Aruna Naradabhatla కవిత

నడక _________అరుణ నారదభట్ల ఎందుకా నిరాశ... ఒద్దికగా...విరిసే ప్రతి పువ్వునూ అక్షరమాలగా తీర్చిదిద్దాలని కలగంటాం గానీ ఒక్క పూవు కూడా నీరసించ కూడదని కోరుకోవడం ఎంతవరకు సాధ్యం...! కొత్త పంటను పండించాలని విత్తనాలు చల్లగలం గానీ మొలకెత్తించే సారం భూమిలో కూడా ఉండాలి! నీచేతిలోని ధర్మం మూడు పాదాలా నెగ్గించాక నాలుగోపాదం నీది కానప్పుడు ఏమని క్రమబద్దీకరించగలవు! నదిలోనే జీవితం ... అయినా ఒక్కోసారి చేపకు కూడా దాహం వేస్తుంది... చుట్టూ అల్లుకున్న నీటిని చూసి నిబ్బరంగా ఉంటుంది కానీ నీరుగారిపోతుందా...! అరక్షణం పాటు అడుగు ఆగినంత మాత్రాన కాలం స్తంబించిందంటే ఎలా...ఊపిరి ఆగినట్టుగా! ప్రతి అడుగూ నీడగా రావాలంటే నువ్వెప్పుడూ సూర్యకాంతిలోనే తడవాలి... అందులో మార్పేముంటుందీ... వెలుగు విలువ ఎప్పుడూ చీకటి వల్లే! గాలి కదులుతుందీ...నీరు కదులుతుంది నువ్వూ...నేనూ..తో పాటుగా యావత్ విశ్వమూ కదులుతుంది... ఇక ఈ సమయం ఎంతలో పరుగెడుతుందీ... మరో ప్రస్తానం మొదలవడానికి! 13-3-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rOkm

Posted by Katta

Krishna Mani కవిత

ఆరాటం ********* చెదరని నవ్వుల చెరువు గట్టు నీ అడుగులని గుర్తు చేసి మూలుగుతుంది నీ చూపు కానక అడవి అద్దం నిదుర పోయింది నీ స్పర్శ కోసం ఆ గడ్డి మొదలు ఎదురుచూస్తుంది ! నీ ఒడిలో ఆడ అలసిన డొక్కల లేడి మందల గెంతులు నీ మెరుపు మెరవక ఏటి ఒడ్డున పక్షి గుంపుల ఆకలి తిప్పలు రాత్రి పగలు తేడా తెలియక కన్ను ఆర్పని ఎండిన చేపలు నీ వయ్యారాలను చూపిస్తూ ఆ వాగులు గీసిన బొమ్మలెన్నో ! హోమగుండంలో ఆకురాల్చిన చిన్న చితక రేపటి రోజుకు రేపటి తరముకు నీకై పరచిన స్వాగత గలగలలు ! అందం చెదిరి కొండల కోనల గుంతకనుల దిక్కులు ! అధరం పగిలి కారని నెత్తుటి మాడిన దుక్కులు ! కృష్ణ మణి I 13-03-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rPok

Posted by Katta

Kapila Ramkumar కవిత

Subba Rao Mandava వెలుగు జూపే పత్రిక రాహువు మింగిన చంద్రిక కానరావు మనకిక ఓ సుబ్బారావు బడులనెడి సంతలో చదువు ఒక సరుకు అంతరిక్షమున దొరుకు ఓ సుబ్బారావు మన దేశంలో హీరోలు విదేశాల్లో జీరోలు మన భారత రత్నాలు ఓ సుబ్బారావు 13.3.14

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rP7W

Posted by Katta

Sateesh Namavarapu కవిత

***అది అంతే..!!*** కొందరిని కలిసినప్పుడు కొన్ని మాట్లాడలేము, కొన్ని మాట్లాడితే కొందరిని మళ్ళీ కలవలేము.! కొందరికి బతికి ఉండగా కొన్ని చెప్పలేము, కొన్ని చెబితే..కొందరితో బతికి ఉండలేము.! కొందరు చూసినప్పుడు కొన్ని దాచకుండా ఉండలేము, కొందరు దాచినా ..కొన్ని చూడకుండా ఉండలేము.! కొన్ని చూపులు గుచ్చుతాయని కవచాలు తొడగలేము, తొడిగినా.. కొన్ని గుచ్చుకోకుండా ఆపలేము...! మనసుకు నచ్చినప్పుడు మెచ్చుకోకుండా ఉండలేము, మెచ్చుకున్నవి అన్నీ మనకు నచ్చినట్లు ఉంటాయని ఆశించలేము.! కొన్నిసార్లు మాట్లాడినప్పుడు నవ్వించగలము, కొన్నిసార్లు నవ్వించబోయి నవ్వులపాలు కాగలము.! ఇలా లాభం లేదని "త్రిశంకు స్వర్గం" సృష్టించలేము, ఎందుకంటే ఉన్నది, బతుకూ..చావూ కాని నరకంలో కాబట్టి..!!..13MAR2014.

by Sateesh Namavarapufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc1BS

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ••నీడ బొమ్మలు •• లోకం చీకటి అప్పుడు- లాంతరు వెలుగు యెదుర్గా జీవంలేని గోడ నేను అడవిని నీడల్లో దర్శిస్తా - జంగల్ రాత్రీ నేనూ నాన్న- వేటగాడి ఆకలిలా వెలుతురు దాడి- ••• అడివి నా కనుపాప చీకట్లో ప్రాణంతో మళ్ళీ- 13-03-14

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gng5sl

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Rest in peace | ఆలోచించలేదు పబ్లిక్ లో బుగ్గ పై చిన్న ముద్దు కే నీ భూగోళం బద్దలవుతుంది అని ఆ ఆలోచనే ఉంటే పవిత్రం గా పరువు కాపాడుకుంటూ రాత్రి నీడలలో మరో మగాడి కౌగిల్లో , కాంక్షతో నలిగే దాన్ని తెలియలేదు నా శ్రాద్ధ ఖర్మలకు మూలం నీ విలువుల హద్దుల ముంగిట్లో నిలబడి ఉందని తెలిస్తే 16 గజాల చీరలో ఇమిడి కోరుకున్న వాడికి కొంగు పరిచే దాన్ని ఏమి చేసాను ? ముద్దే కదా పెట్టాను ? రహస్యపు రతికేళి కాదే ? పరాయి వాడని తెలిసినా పది మంది ముందు ధైర్యం గా ఒక చిన్న ముద్దు అంతేగా ? ఏమి కోరుకున్నాను ? చిన్న అటేన్షన్ ఎదుటి వాళ్ళ కళ్ళలో కొంచం విబ్రమం మరి కొంత ఆశ్చర్యం ఇంతేగా ? నువ్వు రాకుమరుడివి కాకపోయినా నీ తనువు అసూయ వాసనలతో తడిచినా నీ కలల్లో నేను కాని నగ్నత్వం నాట్యం ఆడుతుందని తెలిసినా నా గుండెల్లో నీ నీడ తో పాటు రొమ్ముల పైన నీ అసహ్యాన్ని భరించానే ఒక్క ముద్దే తట్టుకోలేక పోయావా ? లేక తప్పుడు మాటలు విన్నావా ? ఏదయితేనేమి .. ఇపుడు కాలుతున్న నా చర్మం వెనక మాంసపు ముద్ద లో కరగుతున్న ఈ ప్రాణం హాయిగా ఉంది ఇహ నిన్ను నీ మూర్కత్వాలని భరించే అవసరం నాకు లేదు ప్రాపంచిక విలువలనుండి విముక్తి చెందే నా ఆత్మ ఎక్కడ ఎవరిని రమించినా ఆపలేవు, అడ్డుకోలేవు ఎలుగెత్తి చెప్పాలని ఉంది అందరికి మగతనం అంటే కుటుంబం విలువలని ఆడదాని కటి లో దాచటం కాదురా ఆమె మనసు లో విలువ సంపాదించుకోవడంరా అని కాని... నా స్వేచ్చాత్మ గోష మీకు వినబడ్డ మరుక్షణం అమ్మలను ,ఆత్మలను కూడా అమ్ముకొనే మీరు కాటికి కూటికీ కూడా కాకుండా పోతారని క్షమించి వదిలేస్తున్నాను . బ్రతికండి పొండి బ్రతుకుతున్నాం అనుకోని జీవచ్చవాల్లా బ్రతుకుతూ పొండి ఆఖరుగా .. ఐ పిటీ యూ సీత అనుమానం భర్త కి అందమయిన పిల్లలని బహుమతిగా ఇచ్చావు నీ పవిత్రతలకి తర్వాత తరపు ఆడజన్మలను బలి చేసావు . నువ్వే ఎదురించి అగ్నిదేవుడ్నే మోహించి బూడిధై ఉంటే నాలాంటి ఎన్నో హృదయాలను బలి కాకుండా ఆపేదానివి క్షమయా ధరిత్రిని నేను కాని నిన్ను మాత్రం క్షమించలేను . మానసిక వ్యభిచారుల మధ్య శారీరక పవిత్రతలు దాచుకుంటూ బ్రతకటం కన్నా నాకీ మరణమే మహాశాంతంగా ఉంది . నిశీ !! 13-03-14 R.I.p .... Assam woman who kissed Rahul Gandhi burnt to death by husband

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gng5sd

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మనసు నిండా నేనే వున్నా మనసులోనా నేనే వున్నా పెదవి దాటి రానియ్యవేమి నీ భావం కనిపిస్తే కలవరం పలకరిస్తే పులకరింత ఎన్నాళ్ళు నీకు ఈ పలవరింత నీ మనసులో వున్నా నన్ను లేనట్లు గా ఎందుకు నిన్ను నీవు మోసం చేసుకుంటావు నేస్తమా నాకై నీవు లేవు అని అనుకున్నా నీకొరకై నే వేచి ఉన్నా నా ప్రాణమా నీ మౌనం నా గుండె బరువైతే నీ పలకరింపు నాకు చైతన్యమే కదా నీ తలపు వచ్చిన క్షణం నీ ఉపిరి తెలుస్తుంది ప్రియా !!పార్ధ !!13mar14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gng5bV

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

ఎన్ని"కలలో"...!? ఇక్కడా..! అక్కడా..! మాటలు పగిలి పోతున్నయ్ మట్టిగాజుల్లా... తనువులు ఊగిపోతున్నయ్ చెట్టు కొమ్మల్లా... తలలు తెగిపడుతున్నయ్ పూల రేకుల్లా... మనసులు విరిగిపోతున్నయ్ అడుసు గోడల్లా... ఎన్నికలు ముంచుకొస్తున్నాయ్ సునామీ కెరటాల్లా... జీవితాలు నేలరాలేలాగున్నయ్ లేత పూతల్లా... బుద్దిజీవులు సిద్దం కావాలి!? వీరసైనికుల్లా...!

by Kanneganti Venkatiahfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gng6wv

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N9HRx2

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నూనె మరీచిక --------------------­---------- ఇక ఇప్పుడిక్కడ కొన్ని ఎడారులు నిశ్చింతగా నడుస్తున్నాయి ఎవరిని ఉద్దేశించని పదార్థంలా నేలపై తేలియాడే కొన్ని నూనె సెలయేళ్ళు సమర్థ వేగంతో ఇక ఎప్పటికి ఇంకిపోకుండా కళ్ళ జలపాతాలు మనసు ముచ్చట్లు ఎన్ని శిధిలాలో అక్కడక్కడా పరుచుకున్న కొన్ని అచ్చులు సంతృప్తంగా కరగని కొన్ని ద్రావణపు రాత్రులు వెన్నెల మధువులు తాగిన కొండ కళేభరాలు దాంపత్యం అలవాటుకాని వసంతపు శిశిరాలునూ కొన్ని క్షణాలు వెతుకుతూ కొన్ని క్షణాలు నడుస్తూ.... అయినా లభ్యం చేసుకోలేని ఇంకాసిని మరీచికలు. తిలక్ బొమ్మరాజు 13.03.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O5ZWwY

Posted by Katta

Anamika Veni కవిత

అనామిక**నువ్వు నువ్వు కానప్పుడు** ఎప్పుడైనా నువ్వు నువ్వే కదా మనస్సు ఆనంద తాండవం చేసినప్పుడో కళ్లు కన్నీటి చెలిమెలైనప్పుడో చిన్న విజయం తో మది ఉత్తుంగతరంగమైనప్పుడో ఎప్పుడైతేనేం ఎప్పటికీ నువ్వు నీలానే ఉంటావ్ కదా..! కానీ ఎప్పుడో ఒకప్పుడు నీ గమ్యం చేరకుండానేనీదారీంతమైనప్పుడో వాగొడ్డున ఏరుకున్న రాళ్ళూ,గవ్వలూ నీ చేతినుంచి జారిపోయినప్పుడో నిద్ర లేచినా నీ భయంకర కల అంతమవ్వక వెంటాడినప్పుడో నీ కళ్ళు వర్షిస్తున్నా,నీ మనస్సు దాహం తీరనప్పుడో అప్పుదు అప్పుడూ మాత్రం నువ్వు నువ్వుగా ఉండలేనప్పుడు నేను నువ్వౌతాను.... 13/02/14

by Anamika Venifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O5ZUoW

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ --------"ఆమె వెళ్లిపోయింది" ప్రేమను పంచి పంచి అనురాగాన్ని నింపి నింపి అలసిపోయి ఇక సెలవంటూ ఓ అమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. ఇరవయ్యేళ్ళుగా తోడూ నీడై ఆటపాటల్లోనూ,గిల్లికజ్జాల్లోనూ చిలిపితనం పంచిన ఓ తోబుట్టువు పెళ్ళయి అత్తారింటికి వెళ్లిపోయింది . గుండెను ఉండచుట్టుకుని కసాయి మనసుని బరించలేక ఓ ప్రేయసి తన దారిన తాను వెళ్లిపోయింది . దశాబ్ధాలుగా కష్టంలోనూ ,సుఖంలోనూ సంసార సాగరాన్ని ఈది ఈది.. సత్తువ సన్నగిల్లి పుణ్యస్త్రీగా ఓ భార్య వెళ్లిపోయింది . అనుక్షణం ఆమె ఆత్మీయతను ప్రతిక్షణం ఆమె అనురాగాన్ని పంచిన ఆ త్యాగమూర్తి వెళ్ళిపోయాక కూడా నేనింకా ఇక్కడ నా ఉనికిని నిర్మిస్తున్నాను ఈ శిదిల దేహపు గదుల కింద ! (13-03-2014)

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klAPBv

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే ||కిడ్నీలు|| చా ఊరుకో... ఎవడైనా వింటే నవ్వి పోతాడు! ---------------------------- కిడ్నీలకు దినమెలా చెయ్యమంటావ్, "జంట కిడ్నీలు" మార్వాడి కొట్టులో అటకమీద మగ్గుతుంటేను!! ------------------------------ మన ఊసులు విని, మనసు దేహంలో అన్వేషణ మొదలెడితే జవాబు చెప్పలేక ఉన్న గుండె ఆగిపోయీ రాతిరికి కాయాన్నికాటికి తాకట్టుపెట్టాలి.......ఇక చాల్లే ఊరుకో!!! ఆర్కే ||కిడ్నీలు||వరల్డ్ కిడ్నీ డే 20130313

by Rajkumar Bungafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klARt8

Posted by Katta

Katika Manohar కవిత

#మను# కంపెని రక్కసి # అప్పుడెప్పుడో మన దేశంలో కంపెనీ పాలన ఉండేదని విన్నాం ఇప్పుడు కంపెనీల పాలనను చూస్తున్నాం కంపెనీల కాలచక్రంలో సామాన్యుడి జీవితం సొట్టబోయింది కార్పోరేట్ల నీడలో కష్టజీవి కాలిపోతున్నాడు ప్రభుత్వ పెరేడ్లో కంపెనీలు కవాతు చేస్తున్నాయి గ్లోబలైజేషన్ రైతుల వెనక గోతులు తవ్వుతుంటే పారిశ్రామికీకరణ పచ్చటి పొలాల్ని మింగేస్తోంది అమెరికాలో ఆర్ధికమాంద్యమొస్తే అనకాపల్లి బెల్లం చేదెక్కుతోంది వాల్ మార్ట్ దేశీ వ్యాపారుల తోలు తీస్తుంటే దేశీ "కోల్" గేట్లు ఆర్ధికమూలాల్ని కోసేస్తున్నాయి మహాత్ముడు కలలుగన్న గ్రామరాజ్యం కార్పోరేట్లకు భోజ్యంగా మారింది ప్రపంచీకరణ ఫలితం పేదవాడిన పచ్చడిమెతుకులకు దూరం చేస్తోంది కాబట్టి ఎన్ని'కల'లో నిద్రపోతున్న నాయకులూ ..... ఇకనైన కాకలు తీరిన కార్పోరేట్లను కాకుండా కడుపు కాలే సగటు జీవిని కనికరించండి 13.03.14

by Katika Manoharfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTQo1M

Posted by Katta

Kapila Ramkumar కవిత

SELECTED READINGS: కపిల రాంకుమార్||యూనివర్సిటీ - డా.యస్వీ - జీవితం ఒక ఉద్యమం నుండి || ఏ మాత్రం పురిటి నొప్పులు పడకుండా డిగ్రీల పురుగుల్ని కంటున్న విశ్వ విద్యాలయమా! క్మొత బాధయినా ఫరవాలేదు - పడు మెరుపుల్లాంటి మేధావుల్ని ప్రసవించు! (ఆగష్టు 2005) 13.3.2014.....మ.2.52

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTQlms

Posted by Katta

Nirmalarani Thota కవిత

పుప్పొడి రేణువులు . . ! ప్రకృతి కాంత జుట్టు విరబోసింది చిమ్మ చీకటి . . ! పురి విప్పింది పూవుల పింఛాలతో వన మయూరం. . ! ఏ కీచురాయి అస్తిత్వ పోరాటమో పొగిలే కేక . . ! పంటపొలాల సరాగాల శ్వాసలు పైరగాలి( సమీరం ) సడి . . ! శ్రావణ మాసం మేఘాల భారం మోస్తూ నిండు గర్భిణి . . ! సాగర హోరు తరింగిణీ తరుణి కలవరింత . . ! వేసవి కాలం మబ్బుకెంత దాహమో నదిని తాగేస్తూ . . . . ! పొద్దు పొడుపు కాంతి బాటలు వేస్తూ నిద్ర లేపుతూ . . ! సందె కెంజాయ కమిలిన చేతులో కందిన బుగ్గలో . . ! కోయిల గానం చిగురించిన మోడు మళ్ళీ ఆశలు . . ! పూల గుండెల్లో పుప్పొడి రేణువులు కేళీ జాడలు . . ! శ్రావణ మాసం మేఘాల భారం మోస్తూ నిండు గర్భిణి . . ! రాలే శిశిరం అలసిన చెట్టుకు ఆటవిడుపు . . ! నీహారికలు మేఘాల సందేశాలు నిశి రాత్రంతా . . . . ! మఱ్ఱి ఊడలు మూడ నమ్మకాలలా పునర్జన్మిస్తూ . . ! చేనేత మగ్గం చిరిగిన బ్రతుక్కి మాసిక నేస్తూ. . . . ! కుమ్మరి చక్రం ఓటుపడ్డ జీవితం కుండల్ని చేస్తూ . . ! బుల్లి తెరపై చిందే చిరునవ్వులు ప్లాస్టిక్ పూలు . . ! అపార్టుమెంటు మబ్బులు కమ్మేసిన ఆకాశ హర్మ్యం . . ! ఏటిగట్టున వలస జీవితాల్లా పిచ్చుక గూళ్ళు . . ! లౌకిక రాజ్యం గొర్రెల కాపరిలా తోడేళ్ళ లోకం . . ! సమైక్య వాదం పిల్లిమెడలో గంట జాగ్రత్త సుమా . . . . ! సగటు పార్టీ తాటిచెట్టు నీడలో పాలు తాగుతూ . . ! నిర్మలారాణి తోట తేది:13.03. 2014

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZ1EOU

Posted by Katta

Narayana Sharma Mallavajjala కవిత

ఉనికి __________ 1 సందర్భమెపుడూ తాత్కాలికంకాదు అది సర్వకాలికమే డేగ ఎదైనా కావొచ్చు దాని పీతాంబరం ఏదైనా కావొచ్చు గద్ద ఎక్కడిదైనా కావొచ్చు దాని రంగు ఏదైనా కావొచ్చు జంతుబుద్ధిని అతిశయించి దాని బుద్ధెప్పుడూ సిoహాసనమైనప్పుడు ఏ నిముషమైనా ఏ సందర్భమైనా ఏ కుక్క గొడుగైనా ఏ రాజ చత్రమైనా సర్వకాలికమే. కుక్కతోలు కప్పుకొనో ఆవుపొదుగు అంటించుకొనో శాలువాకప్పి భుజాన్ని కత్తిరించే డేగ చూపులోని తర్కమెప్పుడూ శాశ్వతమే. కాలంతో పాటు నడిస్తే చాలదు నిన్ను నువ్వు కప్పుకోక పోతే నీలాంటివాడిగుండెవు కాకపోతే నువు క్రీస్తు పూర్వమే గడ్డకట్టుకు పోయి వుంటావు నీనుంచినువ్వు వేరైపోయి తరలివెళ్లిపోయే నీటిచుక్క వౌతవో సాయOనిల్చే కాల్వ వౌతవో రూపయికంకితమయ్యే నీళ్ల డబ్బావౌతావో. నిప్పై మండిపోయి పొలాలన్నీ పూలుపండిద్దామనుకున్నాక ప్రశాంతతమరక కప్పి ఇప్పుడు ఉనికి దోపిడీకి గురౌతుంది ఓ మొగిలి చెర్లో ..ఓ బషీర్ బాగో ఓ లక్ష్మీపురమో..కారంచేడో ఇప్పటికిప్పుడు పోలవరమో ఉనికికోసం ఉనికినినలిపే ప్రయత్నం ఆకలికోసం అకలినిదోచే పాచిక ముల్లుని ముల్లుతోనే తియ్యాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కుర్చీకి తెలిసిన సూత్రమింతే.

by Narayana Sharma Mallavajjalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pw0xch

Posted by Katta

Kapila Ramkumar కవిత

SELECTED READINGS: కపిల రాంకుమార్||చెలామణి - సుధామ - [చిత్ర గ్రంధి నుండి పే,119] మీరు మునపటిలా లేరు అంటుంది తను/ ఔనేమో అభివ్యక్తం కాకుండానే భార్యను అర్థం చేసుకోమనడం కవిత రాయకుండానే కవిగా గుర్తించమనడమే! స్పర్శ కవిత్వం లాలన కవిత్వం ఓదార్పు కవిత్వం! తన దు:ఖానికి తనను వదిలివేయడమంటే పట్టించుకోకపోవడమే! వనితనైనా, వ్యవస్థనైనా, ప్రేమించడం మానింది ఎప్పుడు కానీ అభిఉవయ్క్తే మందగిస్తుంది! భార్య కానీ, కవిత్వం కానీ! భార్యను పట్టించుకోకున్నా భర్తనే అంటే చెల్లుతుంది కాని..... కవిత్వం రాయకూండా కవినే అంటే.....చెల్లదు! ____________________ (ఆదివారం వార్త 19-2-2006) ____________________ 13.3.2014.... ఉ.11.44

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOLCEc

Posted by Katta

Madhav Murthy కవిత

ఎదురు చూపు నిను చూస్తూ ఉంటే కళ్ళల్లో .. నువ్వు నిలిచావే నా గుండెల్లో.. నీ రూపాన్నే ఒక శిల్పంగా నా గుండెల్లో నింపుకొని నిన్నే ప్రేమిస్తున్నట్టు నీకోసం నేనున్నట్టు నా ప్రేమ కథ నే చెబూతూ ఉంటే.. నాలో నువ్వున్నావంటూ నీకోసం ఉంటానంటూ అని నువ్వే చెప్పేస్తూ ఉంటే. నా ఆశ ఏమో ఆకాశాన్ని . మనసు ఏమో భూలోకాన్ని. విస్తరించి నా ప్రేమకథ నే చెప్పేస్తూ ఉంటే.. ఏ నాడు లేని సంతోషం తో... ఎన్నడు చూడని ఆనందం తో .... కళ్ళు తెరచి చూడగానే...., కళ్ళలోని కల ఏమో కన్నీరై కారుతుంటే.. మనసులోని ప్రేమ ఏమో మౌనంగా మారుతుంటే.. చిన్ననాటి ఆ స్నేహమే.. చిన్ననాటి ఆ భావమే ... కన్నీళ్లను తుడిచింది... గుండెల్లో నిలిచింది... ప్రేమ కోసం ఎదురేదురే చూస్తుంది... మాధవ (13/03/2014)

by Madhav Murthyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOLzZl

Posted by Katta

Swatee Sripada కవిత

మనసు భాష మనసు పొరల లోలోనికి ఇంకా అలలు అలలుగా పాకి పాకి వస్తున్న ఒక మసక వెలుతురు నీడ పెదవులపై ఆరని నీటి తేమ సంతకాలు స్వప్న హరివిల్లులు సీతాకోక చిలుకలై కనురెప్పలపై అలవోకగా వాలి పులకింతలు నెమరువేస్తున్న అలికిడి ఒక తపస్సులోనో తమకంలోనో పూర్తిగా అణువణువూ నీలోకి నీటి చుక్కల్లా ఇ౦కిపోయాక ఉనికి, ఒక నీరెండ చాలు, తెలీకుండానే మమేకపు సందుల్లో౦చి నిశ్శబ్దంగా జారిపోయాక నాకు నేను అదృశ్యమై నాకు నేను శూన్యమై నాకు నేను నీలాన్ని పులుముకున్న ఆకాశాన్నై నా చుట్టూ అలుముకున్న ఒకేఒక్క ప్రపంచంలో నా లోలోపలి నీలో ఒదిగి ఒదిగి నువ్వూ నేననే సరిహద్దులు చేరిపెసుకున్నాకా ... ఇహ అంచులు లేని అంతుచిక్కని సముద్రమేగా నిండు వెన్నెల వి౦దునారగిస్తూ... 2. నిశ్శబ్దపు ఊహ నాభాష హిమవన్నగాలపై విస్తరిస్తూ ఎప్పటికప్పుడు కొత్త నెత్తావి పరిమళమై నీ చుట్టూ అలుముకు౦టు౦ది మూసేసుకున్న తలుపుల వెనక గోడలూ కిటికీలూ ఏవీ లేని ఒక సువిశాల హరితవనం ఎప్పటికప్పుడు కొత్త చిగుళ్ళ ఆరాటంలో పసిపాపై పారాడుతూ ఉంటుంది. 3. నాజూకు వేలికొసల చివరంచుల్లో మోము దాచుకున్న మనసు అక్షరాలై ,మంచుపూలై అలా ఉ౦డీ ఉ౦డీ రాలుతూనే పోతుంది.

by Swatee Sripadafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxpbTE

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || గ్లాసుల్లో ప్రపంచం ద్రవంనింపిన గ్లాసుగుండా ప్రపంచం ఒంపులు తిరుగుతూ ఒయ్యారాలు పోతుంటుంది వికృతంగా జడిపిస్తూ విహల్యులుగానూ చేస్తుంటుంది. అసలుదేదో దాచినట్లు కొత్తహంగుల్ని కప్పేస్తుంటుంది పారదర్శకతలోనూ నిండుతూ రంగుల చమక్కులు చూపిస్తుంది తడి పండుతూ మనసుకి లిమరిక్కులు వాక్కుల ఋత్విక్కులు వ్యవహార దృక్కులు వ్యాపార దక్షులు సర్వం సమ్మిళితానంద సందోహ సందర్బాలను కల్పిస్తుంటుంది. నింపుతున్న కొద్దీ ఖాళీనిజాల్ని బయటకు పొర్లిస్తుంది ఆక్సిటోసిన్* ప్రేమతో ముంచేస్తుంది. గానుగ గాటన పరుగులకు కిణ్వణాల ప్రోబయోట్స్ క్షణాలు కొన్ని వత్తిడుల వేడి విడదీసే వేళల్లో చల్లదనాల అనుసంధానంలా జ్ఞాపకాల వీచికలకు ‘తలపులు’ తెరుస్తూ చుట్టూ మడుసుల్ని అల్లుకుంటుంది. అయినా నానేస్తున్నకొద్దీ దారాల్నే ఊడలుగా బిగిస్తుంది. ► 13-03-2014 http://ift.tt/1fxpbD8 =పాదసూచిక ఇస్తున్నందుకు ఇప్పటికే ఈ విషయాలు తెలిసిన మిత్రులు మన్నించాలి. *ఆక్సిటోసిన్ :known as the “love hormone” because of its role in social bonding **కిణ్వణం ( Fermentation ) is a metabolic process that converts sugar to acids, gases and/or alcohol. ***Probiotics are micro-organisms that some have claimed provide health benefits when consumed.

by Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxpbD8

Posted by Katta

Maddali Srinivas కవిత

సర్వే జనా సుఖినో భవంతు//శ్రీనివాస్//13/03/2014 ------------------------------------------------------- గిరి గీసుకూర్చున్న గిరీశానికి కధ అడ్డం తిరుగుంది ముందు ప్రాంతాలను పిదప కులాలను వేరుచేసి బీసీ లను దళితులను కాపులను రెడ్లను ధృతరాష్ట్ర కౌగిలి లో బంధిద్దామని చూసే గాంధీల పార్టీకి కధ అడ్డం తిరుగుతుంది పిల్లి గడ్డం మాయల ఫకీరుకు విజన్ మంత్రదండం మాయమౌతుంది మళ్ళీ మళ్ళీ చెప్పే పాత కధ రోత పుడుతుంది కధ అడ్డం తిరగడమే కాదు కంచికి కూడా చేరుతుంది నమో మంత్రం బెడిసి కొట్టి నా అన్న వాళ్ళు కరువై కమలం ముడుచుకుంటుంది చెద పట్టిన కధలే మేలని పాత కధలని పల్లకీ నెక్కించి నమో మంత్రం ఉట్టికెక్కించడం కధ మళ్ళీ మొదలవ్వటం కనపడుతోంది కొత్త శిశువు వూపిరి పోసుకోవటనికి సమయం వచ్చింది విరిగి ముక్కలయిన మతాలు,కులాలు,ప్రాంతాలు మనుషులుగా మరలొచ్చి నాటు మంత్రసానులకు వాటంగా వాతపెట్టే సమయం మళ్ళా వొచ్చింది తెగి పడ్డ శకలాలన్నీ మానవాతా దారానికి లొంగిపోయి నానా రంగుల కలబోతగా వొకే వస్త్రంగా పల్లవిస్తుంది నిరంకుశ నియంతల పాలిటి పాశుపతమై ప్రళయంలో ముంచేస్తుంది కొత్త సమాజ సృష్టికి బీజాలను నాటుతుంది మనిషి కధలిక పురుడు పోసుకుంటాయి మంచి కధలెన్నో పుట్టుకొస్తాయి సర్వే జనా సుఖినో భవంతు

by Maddali Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nQvsLZ

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxpain

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

ఎన్నికల ప్రస్థానం-3 ఇంకా పూర్తవలేదట ఆంధ్రప్రదేశ్ విభజన.. ఎంతకాలం చేస్తారిలా సమైఖ్యాంధ్ర భజన.. పదేపదే పెట్టకండి జనం చెవిలో పూలు.. చేతనైతే చేయండి సీమాంధ్రకు మేలు.. \13.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxp9Lz

Posted by Katta

Sasi Bala కవిత

మనిషి ...నిరంతర అన్వేషి .............శశి ............................................................ ఆనందం ఆవేశం ఆవేదన అనురాగం ..వీటన్నింటి కలయికే జీవితం ఆశల సౌథాల మధ్య వూగిసలాడుతుంటాడు మనిషి సంతోషం వుంటే ఎగిరెగిరి పడతాడు దుఃఖం వస్తే క్రుంగిపోతాడు ప్రతి మనిషి జీవితం .......కాదేదీ పూల వనం సుఖ దుఃఖాల నడుమ ...ఊగే ఊయల వైనం ఉన్నదాన్ని వదులుతాడు లేనిదానికి ఆరాట పడతాడు తన స్థితికి భగవంతుడిని తూలనాడతాడు ఏదైనా బాధ కలిగితే అది దైవం ఇచ్చిన శాపం సంతోషం వుంటే అది తను సాధించిన గొప్పదనం ఏమిటో ఈ మానవ నైజం కరిగిపోయే కలలే తన గమ్యమనుకుంటాడు తీరని కోర్కెలకు కళ్ళెం వేయనంటాడు వ్యర్థ నిరీక్షణలో కాలం గడుపుతాడు పరవారి విమర్శనలో తన గమ్యం మర్చిపోతాడు అలసిన గతాన్ని మరిచి రాబోయే మధుర క్షణాల్ని తలచి సంతోషపడనంటాడు దొరికే ఆనందాన్ని కాపాడుకోనంటాడు ఏమిటో ఈ మనిషి పుట్టించిన బ్రహ్మకైన అర్థం కాని అన్వేషి .............................................13 march 14

by Sasi Balafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PvJ3Nk

Posted by Katta

Vani Koratamaddi కవిత

గ్రీష్మం క్రొత్త సంవత్సరానికి ఆహ్వనం పలికి రాశిఫలాలు తెలుసుకుంటూ వెలుగురేఖలు వెల్లి విరియాలని ఆశ పడతారు కాలపురుషుని కదలికలతో ఋతువుమారి ప్రక్రుతిమాత ఒడిలోకి గ్రీష్మం కోయిల కుహుకుహు గానంతో చిగురాకుల చిరు సవ్వడితొ గ్రీష్మానికి అహ్వనం పలికాయి మల్లెలు గుబాళింపులు పలుకరిస్తూ మధుర ఊహలు మోసుకొస్తాయి మామిడిపండ్ల కమ్మదనాలు ఆవకాయ,మాగాయ పచ్చళ్ళతో హదావిడి ఎండవేడిమి తాళలేక పుచ్చపండ్లూ,తాటి ముంజలను ఆశ్రయిస్తూ తడి ఆరిపోయే గొంతులు కొబ్బరి నీళ్ళు పండ్లరసాలు పుచ్చుకుంటూసేద తీరుతాయి చిన్నారులకు వేసవి సెలవుల ఉత్సాహంఆటపాటలతో అల్లరి చేస్తూ తాత బామ్మల తో ముచ్చటిస్తూ విహారయాత్రకు ఉరకలు వేస్తారు దినకరుని ప్రచండతేజం ప్రతాపంతో బీడుబారిన పంటపొలాలు ఏడారులని తలపిస్తాయి ఎండిపోయిన నేల తల్లి నీటికోసం తల్లడిల్లి నోళ్ళు తెరిచి తడిసిపోవాలని తపిస్తుంది ఆకురాలిన చెట్లకొమ్మలు చిగురించాలని చినుకుకోసం ఎదురుచూస్తాయీ vani koratamaddi 12/3/2014

by Vani Koratamaddifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOtqe4

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // అంతు చిక్కని ..... // ఏమి ఇచ్చుకున్నందుకు ఇక్కడ ఏడుస్తామో ఎందుకు ఎదురు చూపులని చింతి స్తామో మారలేనందుకు మళ్ళీ మళ్ళీ భ్రమిస్తామో గడియారాల లెక్కలు అర్ధం కాకా మారిన రాగాలు వినలేక రైలు పట్టాలవలె నిరంతరం ప్రేమిస్తూ అడవులు గుట్టలు దాటుకుంటూ స్మశానాలను వీక్షిస్తూ నిన్ను నిన్నుగా వాంఛిస్తున్న మృత్యువును వంచిస్తూ పతనమవుతున్న కాంతిని వేడుకుంటూ వెలుగు కళ్ళను చూడలేక విధిని దిక్కరించలేక వలసలు ఆపలేక నిరంతరమూ చలిస్తూ చరిస్తూ ఒక్కటొక్కటిగా వదులుకుంటూ ఒక్కటిగా అంతమవుతూ అన్నీఉన్న ఏమిలేని శూన్యమవుదాం ….. Date: 12/03/14

by Sri Modugufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N8jXBV

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||పిచ్చూ! || ఎలా, ఇంకెలా? దీన్ని నాదంటాను. కాదు, ఇలా కాదు మరోలా, కాకూడదా మరి. అలా, ఇంకోలా గీత వెంట గీతలా లేదా బిందువే గీతలా పిచ్చిరాతలా! ఓ వేళ,. ఈ గోలంతా గోళమై, సూర్యతేజమై ఇలా , ఇదో కలా? --------------------13/3/2013

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N8jXlz

Posted by Katta

Padma Rani కవిత

!!ఆశయం!! ఆనంద ఆశలసౌధాల మధ్య నిర్మితమైన ఈ జీవనపయనంలో నడుమ కాస్త సేదదీరబోయి విరామంలో విశ్రాంతిగా మండుతూ నిన్ను నీవు ఓదార్చుకుంటూ భారం తగ్గించుకోబోయి పెంచుకోకు! ఆలోచనల చితిలో అనవసరంగా కాలుతూ నీకు నువ్వే దూరమై కన్నీటివాన కురిపించి నీ స్వప్నాలని నీవే భావాలతో బంధించేస్తూ మౌన నిట్టూర్పుల మధ్య హృదయం దేదీప్యమై వెలగాలి అనుకోకు! అర్థరాత్రి కరిపోయే జ్ఞాపకాలకు విలువ కట్టుకుంటూ నిద్రలేమిలో మరువలేని మరపురాని కోర్కెలకు కళ్ళెం విప్పి కొరడా ఝళిపేస్తూ భాధలో భుజం కాకపోయినా వేదనలో నీ మది నీ తోడని మరువకు! అనవసర క్షణాలని నిరీక్షణా కాలం అంటూ కార్యాలకి కాపలా పెట్టి సరదాలకీ సభ్యతకీ నడుమ జరిగే భీకరపోరులో నిస్సహాయతంటూ అలసట చెందిన గతానికి ఆలోచనల పందిరివేసి పైకి ఎగబ్రాకనీయకు! 06-03-14

by Padma Ranifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fv9vjR

Posted by Katta

Sivaramakrishna Valluru కవిత

నీలోకి...! ।। వల్లరి ॥ ----------- ---------------------- ఎడారిలో నీటి చెట్టు దాహార్తిని తీర్చినట్టు గొంతు దాటి నీటి బొట్లు జారి పడుతున్న భ్రాంతి.... తడారిన గుండె తల్లడిల్లే వేళ తన్మయత్వంతో నీలోకి తొంగి చూసిన భ్రాంతి.. అల్లంత దూరాన ఆకాశ దీపమై అనుక్షణం దేహాన్ని తడుముతున్న భ్రాంతి.... ఒక్కొక్క జ్ఞాపకం వదిలి వెళ్ళిన సంతకమై ఓదార్చుతున్న భ్రాంతి... తెలవారని రేయిలో తోలిచుక్కవై నీవు తోలకరిస్తావని భ్రాంతి.. ! ----------------------- - వల్లరి. -12-03-2014. ------------------

by Sivaramakrishna Vallurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fv9trY

Posted by Katta