పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Narayana Sharma Mallavajjala కవిత

ఈనాటికవిత-70 ________________________________ వక్కలంక వసీరా-రెండువాక్యాలు. కవిత్వంపై ప్రధానంగా ప్రభావాన్ని చూపేది కవి దర్శనమే.వర్ణన ముఖ్యమైందిగా భావిస్తే దానిని ప్రభావితం చేసేది కవిదర్శనమే."దర్శనాద్వర్ణనాచ్చాథ రూఢాలోకే కవిశ్రుతిః"అని ప్రాచీనులు.ఋగ్వేదంలోనూ "చత్వారివాక్"అని చెబుతారు అంటే పశ్యంతి,మధ్యమా,వైఖారి-దీనితోపాటు పరా అనేఅంశం ఒకటి ప్రధానమైంది. పశ్యంతి-చూస్తున్నది..మధ్యమా-చెప్పడానికి మాధ్యమంగాఉన్నది.వైఖారి -చెప్పబడుతున్నది..వీటన్నిటికి అతీతమైంది పరా...మీమాంసకూడా అలౌకిక వ్యాపారాలగురించి చెప్పింది.సాధారణ,ధారణ,మనన,చర్వణ,సృజన -అనే ఐదు అలౌకిక వ్యాపారాలు.ప్రపంచమ్నుంచి గమనిస్తున్నది,తీసుకొంటున్నది,ఙ్ఞప్తిలోకి తెచ్చుకుంటున్నది,తనకున్న ఙ్ఞానమ్మేరకు ప్రతిఫలింపబడుతున్నదీ,సృష్టింపబడుతున్నదిగా కవిత్వం ముందుకు వస్తుంది.-బహుశఃసాధారణ వాక్యాలుకూడా.కని పొందిన దానిని అంతే స్పష్టంగా చిత్రించడం సాధ్యం కాదనేది అనుభవం గలవారుచెప్పే అంశం. వసీరా ఇలాంటి తాత్వికధారగల కవిత్వాన్నే అందించారు.ఇందులో కనిపించే-"మాటల నీడలు " శబ్దాల రంగులు""వాక్యాలు "వంటి పదాలవల్ల ఏర్పడిన అర్థక్షేత్రం వల్ల ఇది కవిత్వాన్ని గురించిన అంశమని అర్థమౌతుంది. "రెండు రెక్క‌లూ రెండు వాక్యాలు మాట‌ల మ‌ధ్య మౌనం లా వాక్యాల మ‌ధ్య ఆకాశం న‌దిమీద రెక్క‌లు విప్పే ప‌క్షులు రెండు రెక్క‌లూ రెండ‌క్ష‌రాలు అక్ష‌రాల మ‌ధ్య ప్ర‌వ‌హించే న‌ది నీటిలో నీడ‌లూ అంత‌కంటే పొడ‌వైన‌ అంద‌మైన రెక్క‌లు విప్పుతాయి మాట‌ల నీడ‌ల మ‌ధ్య ఎగిరే ప‌క్షి అద్భుత శ‌బ్దాల రంగుల మీద గింగిర్లు కొట్టి చివ‌రికి మౌన వృక్షం తొర్ర‌లోని ఇంటికి చేరుతుంది " మౌనానికి ,ఆకాశానికి మధ్యపోలికకి వాటికుండే అనంతమైన లక్షణమేకారణం.మాటలమధ్య ఉండడానికి ఒక కారణం వెదికితే ఏమౌనమూ కూడా ఆత్మికంగా మౌనం కాదు.అంతర్ముఖ సంభాషణే.పక్షి శబ్దంలోని ఉనికి స్వేచ్చని చెప్పెదే.నది ప్రవాహానికి,ఆగని కాలానికి ప్రతీక. కవిత్వమెప్పుడూ వర్తమానంలో కనిపించేదాన్ని మించి చూపుతుంది.అందువల్లే కవిత్వంలో వర్తమానం కూడా శాశ్వతముద్ర పొందుతుంది.అంతే సౌందర్యాత్మకంగా ఉంటుంది కూడా. "నీటిలో నీడ‌లూ అంత‌కంటే పొడ‌వైన‌ అంద‌మైన రెక్క‌లు విప్పుతాయి "-అనడంలో అర్థమిదే.నీడ అండంవల్ల దర్శించింది కాదు వ్యక్తంచేయబడుతున్నదనే ధ్వనిస్తుంది. కొసలో మొరాయించే మనస్సుని గూర్చి మాట్లాడుతారు.కవితకి భావచిత్రాలనో,ప్రతీకలనోవెతికి,వెతికి,రంగురంగుల శబ్దాలమీద గింగిర్లు కొట్టి (తిరిగి)చూసినదాన్ని అలాగే చిత్రించటం చేతకాక ఏ మౌనం లోనించి పుట్టిందో అక్కడికే వెల్లిపోతుంది. చిత్రిస్తున్నది కవికెప్పుడూ అసంతృప్తిగానే ఉంటుంది.ఒక స్థాయికి వెల్లి సంతృప్తిగావెనక్కి రావడమే తప్ప పొందినదాన్ని అట్లే అందించటం వీలుకాక పోవటం -తిరిగి ఆలోచన మళ్లీ యథా స్థానాన్నే చేరుకోవటాన్ని కవిత్వం చేసారు ఇక్కడ కవి. నిజానికి ఇలాంటి కవిత్వాన్ని మార్మిక కవిత్వమనే(Mysti poetry) అనాలి విమర్శలో మార్మిక కవిత్వం అంటేమేథస్సుని మించిన మనవసామర్థ్యంతో అర్థమయ్యేది.అంతే కాని తర్కానికి లొంగనిది.దైవత్వ సంబంధమైన అంశాలకు సంబంధిన చర్చ మాత్రమే మార్మిక కవిత్వం గా ఉంది.ఇందులో కనిపించే అర్థ అనిర్దిష్టత(Inditerminacy)వల్ల మార్మికంగా అనిపిస్తుంది.కాని ఇది దార్శనిక సంబంధమైన తాత్వికతతో ముడిపడిన కవిత. కవిత్వం రాయడానికి కవిపడె సంఘర్శణ ఈకవితలో కనిపిస్తుంది.ఈ మానసికానుచలనాన్ని అక్షరాలుగా మలచిన వసీరా గారికి అభినందనలు,ధన్యవాదాలు.

by Narayana Sharma Mallavajjalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cds61T

Posted by Katta

Rasoolkhan Poet కవిత

*మానని గాయం* మొండి గోడలకు రంగులద్ది ప్రపంచాన్ని ఏమార్చలేవు. కుత్తుకలు కోసి కుక్కలతో పోల్చి కుర్చికోసం నాలుగు గెడ్డాలతో పోజులిస్తున్నావ్. కిరాయి టోపిలను చూపి నయవంచనతో నయా కలలు కంటున్నావ్. నీవు ఎన్ని ముఖాలను మార్చినా నీ కోరపళ్ళకంటిన నెత్తుటి మరకలు మాయవు. చీకటి చరత్రను రాయాలని జూస్తే వెలుగు రేఖలకు మాడిపోతావ్. ఒరేయ్ ఉన్మాది మదమెక్కిన మతోన్మాది నీ కత్తులు,త్రిశూలాలు మా గుండెను చీల్చగలవు మాలో గూడుకట్టుకున్న భారతీయతను కాదు. నీడ ఎంత భ్రమించినా నిజమవ్వలేదు. నీలాగే... పి రసూల్ ఖాన్ 16-2-2014

by Rasoolkhan Poetfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQgH80

Posted by Katta

Abd Wahed కవిత

హమ్మయ్య.. జ్వరమొచ్చింది... నరనరాన పొగలు కక్కుతున్న అగరుధూపం మంచుగడ్డలా వణుకుతున్న కణకణం కంబళి చలిమంటలో వలపులాగా అల్లుకుంది జ్వరం... కంటితెరపై ప్రతిరోజు వాలే రంగురంగుల దృశ్యాలు అమృతాంజనం కాల్పులకు కన్నీటిబొట్లుగా రాలిపోయాయి రహదారిని ఈదే కాళ్లు కట్టెముక్కల్లా, పడకేసిన నదిలో కొట్టుకుపోయాయి... గాలిపటం ఎగిరేది స్వంతరెక్కలతో కాదని తేలిపోయింది... చిరుగాలికి వణుకుతున్న పచ్చగడ్డి రేకులా ఆత్మీయత దోసిళ్ళలో పట్టుబడ్డ మిణుగురులా ఈ జైలు కూడా బాగుంది... గుంజకు కట్టిన తాడు ఎంత పొడుగున్నా ... కట్టుతాడే స్వేచ్ఛ ... కనిపించని కట్టుతాడు...

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eF6Rmb

Posted by Katta

Bharathi Katragadda కవిత

కవితావేశం 16.02.14 నేను ఒక కవిని సాధారణ కవిని అల్లిబిల్లి కవితలేవో అందంగా అల్లాలని అందమైన పదాల కోసం ఆరాటంగా,ఆవేశంగా వెతికాను. అందమైన పదాలు దొరికాయి భాషలో అందముంది భావంలోనూ అందముంది. కానీ నాకవి హృదయంలోనే ఏదో చెప్పలేని వెలితి! చెట్టూ,పువ్వూ జాబిలి,వెన్నెల సన్నజాజులు,పరిమళాలు వెన్నెలరాత్రులు,మధురానుభూతులు ఉషోదయం,నవోదయం చెలికోరిక,ప్రేమకానుక వానచినుకు,తొలకరి మెరుపు ఇలా ఎన్నో అందమైన పదాలతో కవితలల్లాను కాని మనసులో ఏదో చెప్పలేని వెలితి ! దరిద్రం,దౌర్భాగ్యం ఆకలికేకలు,మండేవేదనలు అనారోగ్యం,వికృతరూపం కుంటిబతుకు,గుడ్డిబతుకు చీకటిరాత్రులు,మౌనరోదనలు కష్టాల కొలిమి, కన్నీళ్ల కలిమి మరి ఈపదాలన్నీ కూర్చి ఏ కవితలల్లను? అందుకే నాకవి హృదయంలో చెప్పలేని వెలితి! ఇక కవిగా నాకర్తవ్యమేమిటో బోధపడినాక నిశ్చింతగా అనిపించింది!!

by Bharathi Katragaddafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gIcMeG

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: అభిలాష....: శిశిరపు తొడుగుల మాటున మహి మట్టి వాసనను చిమ్ముతున్నది రాలిన పండుటాకు చితికి చిద్రమై కాల గర్భమును చేరుటకు వేచియున్నది... మండెడు సూరీడి నిండు నెగడు తుది మంచు పరదాల తొలగించసాగెను గ్రీష్మ ప్రతాపపు ప్రభావం తొలి చిగురులు వేసెను... అనంతమయిన ఆకాశం శూన్యముగ మారెను తారక వదిలిన జాబిలి చిన్నబోయి నిలిచెను... గమ్యం లేని పయనం మళ్ళీ మొదలాయెను వాసంతుని రాక కొరకు వేల వేల్పులను కొలిచెను... 16/02/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gIcLqV

Posted by Katta

Rama Krishna Perugu కవితby Rama Krishna Perugufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cd4zOC

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వ మెరిసే రాగి పళ్ళెం ఆకసం గోడ చేరువగా పొద్దువాలుతుం దిప్పుడే 16/2/14

by Rammohan Rao Thummurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eEMsgW

Posted by Katta

Anand Nandu కవిత

కాలం నన్ను "కవి"గా మార్చింది....! అమ్మ జోల పాట... నాన్న చూపిన బ్రతుకు బాట.... గురువు చెప్పిన మంచిమాట.... స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం... ఇవన్నీ... ఈరోజు "నేను ఓ కవి"ని అని చెప్పుకునేంతగ ఎదిగేలా చేసాయి...! మనస్పూర్తిగా అందరికి ధన్యవాదాలు మీ ఆనంద్ (విరించి)

by Anand Nandufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eEMtBn

Posted by Katta

Shivaramakrishna Penna కవిత

సమాంతర ప్రవాహాలు..... "We read the world wrong and say that it deceives us" ఎందుకైనా మంచిది, ఈ పద్యానికి ముగింపు ముందే చెప్పేస్తాను. సామాన్యులు జీవితం నుంచి పాఠాలు నేర్చుకుంటారు; మేధావులు గుణపాఠాలు నేర్చుకుంటారు. ఏ కొమ్మా తాను మోయలేనంత బరువైన పూవును పూయదు. ఆధునిక వసుదేవుడు ట్రాఫిక్ యమున దారి ఇస్తుందని వేచి ఉండడు; నదికి తానే దారి ఇస్తూ స్వప్న శిశువులను ఆవలి తీరం చేరుస్తాడు. రాయి విసిరితే దోసిట్లో రాలే పండు కాదు సూర్యుడు. శిలువలైన కలలన్నీ ద్రోహమూర్తులే ! నీడలో నిల్చుని ఒకడు వెలుగును వెక్కిరిస్తుంటాడు ! మరొకడు నీడల కొలతలు తీస్తూ వెలుగుకు వెలకడుతుంటాడు ! వెలుగులోనే వ్యవసాయం చేసే వాడికి నీడలు గడియారపు ముళ్లు ! ఒకడికి అశ్రుబిందువు, ఎటునుంచి చూడాలో తెలియని నైరూప్య చిత్రపటం. మరొకడు అశ్రువులో ఒకవైపు సముద్రాన్నీ, మరోవైపునున్న సప్తవర్ణ రంగవల్లినీ ఒకేసారి చూస్తుంటాడు. గాయం, బ్రతుకు ప్రియురాలు తీర్చిన గోరింట ! వాంఛా పుష్పంలో వేదనా మకరందం ! ఏకాంతంలో కన్నీటి బృందగానాన్ని వినలేని వాడు ఎత్తిన పిడికిళ్ళ ప్రవాహంలో రాలుతున్న ఒంటరి కన్నీటి బొట్టులోని రోదసిని చూడలేడు ! నింగి ఎడారిలో సూర్యుడు కూడా నగ్నపాదాల బాటసారి ! క్షతగాత్ర వేణువు, ఆర్తనాదమే స్వరప్రస్తారం ! "కన్నీరొకచుక్కున్నచో ఏకష్టమైనా భరియింతును" అనే గోరటి వెంకన్నకు కోరస్ పాడతారు, కనులున్నంత కాలం కన్నీరు ఉంటుందని అనుకునేవారు ! వారు క్షణంలో నడిచే నిలువెత్తు కన్నీటి చారికైపోతారు. మరు క్షణం కన్నీటి కొలిమిలో పదునెక్కి కాంతి ధారల ఖడ్గాలై అవతరిస్తారు. స్వేద బిందువులను తుడుచుకున్నంత అప్రయత్నంగా కపోలాల మీది రెండు జీవనదులను తుడిచేసుకుంటారు. ఇక ఉపోద్ఘాతాన్ని ఆపి పద్యాన్ని ప్రారంభిస్తాను ! మేధావులకు తమకలల చుట్టూ అల్లుకున్న సాలెగూడు ఒక కాంతి పరివేషం. ఇతరులు తొలిపొద్దు లేలేత కిరణాల దువ్వెనలతో కనుల మీదికి జారుతున్న కలల ముంగురులను సవరించుకొని నిత్య నూతన సంగ్రామానికి సన్నద్ధమవుతారు ! ***************** "దీప ఖడ్గం" (2008) కవితా సంపుటి నుంచి.....

by Shivaramakrishna Pennafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gqvYOs

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ అమ్మ @ నాన్న ఎవరో అమ్మ చెప్పింది అమ్మ ఎవరనేది ఆమె పాలతో తీరిన ఆకలి చెప్పింది . అందుకే ఆకలికి నేనెప్పుడు రుణపడి ఉంటాను . _ కొత్త అనిల్ కుమార్.

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1qkCP

Posted by Katta

Gattupalli Lavanya కవితby Gattupalli Lavanyafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gqrw28

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

---- చిరాశ /// ఎ౦దుకో? /// ********************************************* కమ్మని కలలుగనే నాకన్నులలో కన్నీరె౦దుకు ని౦పావు?... శరీర పోషణ భారము వహి౦చు నోటితొ పరుష పదముల నేల పలికి౦చేవు?... వీనుల వి౦దైన రాగములు౦డగ విళయపు విస్పోటనలేల వినిపి౦చేవు?... సాయము చేయగ చేతులనొసగి సమరములేల చేయి౦చేవు?... కారణవశమున కాయమునొసగి కర్తవ్యమునేల మరిపి౦చేవు?... ********************************************* --- {16/02/2014}

by Chilakapati Rajashekerfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cM8cHZ

Posted by Katta

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు ||కలవరపుక్షణాలు|| గాలీ నీరూ నేనూ ఒకటే నీకు నువ్వంటే... అర్థం కానివ్వని జవాబుల పర్వం జవాబులతో నాకెందుకులే.. అయినా మదిని అవ్యక్తపు అలలు కుదిపేస్తాయి సముద్రమై ఆవరించే ఆలోచనలను మోసేందుకు భూమినవుతా అంతలోనే ఆకాశమూ నేనే ఇంతలో మెలిపెట్టే కుదుపొకటి ఆవరించి అగ్నిసెగవుతుంది పంచభూతాలూ ప్రేమలో వున్నాయన్నది అవగతమౌతుంది 16-02-2014

by Jayashree Naidufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bBkfx6

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి || సారస్వత స్రవంతి - కవి గాయక విపంచి వచన పద్య కవితల - గేయ వ్యాస కళాకేళి! అదును పదును కల్పించి అంకురాలుమొలకెత్త సాహిత్యపువన సొబగులు గుబాళించు పూదోట! మత తత్వం - కుల తత్వం ఉగ్రవాద విధ్వంసాలను నిలువరించు సంకల్పం నిలుపుకున్న దీరత్వం! చిరుజల్లులా, వానలా వాగులా, జీవ నదిలా అనునిత్యం పారేందుకు పచ్చదపు గీతంలా! కవిత్రయ కరచాలన స్పర్శతో గురజాడ శ్రీరంగం కాళోజిల ఆదుగుజాడలలో బడుగులకై మా నడకలు సాగిస్తూ! కొత్త కొత్త వాదాలకు వైరుధ్యపు భావాలకు సమతుల్యం పాటిస్తూ సంయమనం నెరపుతూ! సహకారం పొందుతూ సహజీవన సాగిస్తూ '' సాహితీ స్రవంతి'' గా ప్రస్థానం చేరేలా! అంతరంగ విస్తరణతో అంతర్జాల వ్యాప్తితో కొనసాగుట మా లక్ష్యం నూతన అరుణోదయం! ( ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి - ఆవిర్భవించి 15 వ వార్షికోత్సవానికి సన్నిద్ధం అవుతున్న సందర్భంగా జయప్రదమైన 16.2.2014 నాటి విస్తృత సమావేశానికి నా కవితాశంస ) సా.6.30

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDNrn4

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। అడుగులు ।। ---------------- రూపాంతరం చెందాయి ఈ అడుగులు సుతిమెత్తని తత్వం నుండి గట్టిపడి మొరటుగా. ఆప్పుడెప్పుడో తొలినడక నేర్చినప్పుడు మనసు మాట విన్నట్టు గుర్తు కాని ఇప్పుడు గమ్యంలేని పయనం వైపు పరిగెడుతున్నాయి. ఈ అడుగులకు మరెన్నో అడుగులు జతకడుతున్నాయి,మాట్లాడుతున్నాయి మమతలు మరచిన పరిమిత మాటల్ని. ఎన్ని బండ శిలలను తొక్కితొక్కి మొద్దుబారిపోయాయో ! స్పర్శను కోల్పోయాయి ఒక్కోసారి ఈ అడుగుల కింద రాగద్వేషాలు నలగబడుతున్నాయి. వీటికి ఎండిన గుండెబాధ తెలీదు నిండిన కన్నీటి గాధలు తెలియవు దారుల్లో ముళ్ళు మొలిచి గుచ్చుతున్నా అవి చేరే స్వార్ధపు తీరాలవైపు నడుస్తూనేవున్నాయి. అవిగో చేరుకున్నాయి ప్రేమ రాహిత్య శిఖరపు అంచులకు కానీ అక్కడ స్వచ్చమైన ప్రేమ పంచే పాదాలు లేవు సూన్యం తప్ప ! (16-02-2014)

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDKO4J

Posted by Katta

Tarun Chakravarthy కవితby Tarun Chakravarthyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bBhlIF

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మనలో చాలా భావాలు వుంటాయి ప్రతి భావం మనకు సద్భావమే అనిపిస్తుంది దానిని అన్వయించు కోవటం లో కొన్ని సార్లు మనం విఫలం అవుతాం తెలియచేసే అవకాశం మనకు పరిస్తితులు చాలా సార్లు కనిపిస్తుంది దానిని మనం తెలుసుకోవటం లోనే మన విజ్ఞత ఆధార పడి వుంటుంది ప్రకృతి మనకు చాలా అవకాశాలు ఇస్తుంది వాటిని వుపయోగించుకోవటమో చేజార్చుకోవటమో అంతా నీ ఇష్టం ఇల్లు తగల బడుతుంటే భావి తవ్వటానికి ప్రయత్నించకు క్రొద్దిగా ముందు చూపులో వుండటానికి ప్రయత్నించు నీ మనసు చెప్పింది అది నీ మేలే కోరుతుంది నేస్తమా !!పార్ధ !!16feb14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jIrAxx

Posted by Katta

Kallam Srinivasa Reddy కవితby Kallam Srinivasa Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDs457

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి సెలబ్రటీ ఆకాశం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి...... ఇవీ సెలబ్రటీలంటే వాటిని వీక్షించం – అదేమిటో! ఒళ్లంతా కళ్ళు చేసుకుని వాళ్లనే చూస్తాం ఆ మనుషుల్నే ఆరాధిస్తాం వాళ్ళకోసం ప్రాణాలు కూడా తీసుకుంటాం ప్రాణం పోసే సృష్టిసౌందర్యాల్ని అసలు పట్టించుకోం మనలో ఉండే వింత మనిషికి ఆనందంగా ఉందిలే అని ఆ వికారమైన వలయంలోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే మనల్ని మనం కోల్పోతూ ఉంటాం........ 11FEB2014 • • Kalyani Gauri Kasibhatla likes this. • R K Chowdary Jasti Thanks, Kalyani Gauri Kasibhatla garu 8 minutes ago • Like • Kalyani Gauri Kasibhatla సమకాలీన మనో వికారాలపై దెబ్బ గట్టిగ కొట్టారు.... వస్తువు ల ఎంపికలో వైవిధ్యం ..ఎంతో వున్నతవిలువలను చూపుతూ మనోరంజకంగా రాస్తున్నారు.. 7 minutes ago • Unlike • 1 • R K Chowdary Jasti మీరు మీ విలక్షణమైన వ్యాఖ్యలతో స్పందించే తీరుకి, మీ ప్రోత్సాహకరమైన అభినందనలకి నా హృదయపూర్వకకృతజ్ఞతలు, Kalyani గారు. A few seconds ago • Like • • • Kalyani Gauri Kasibhatla Message • సర్ గుడ్ ఈవెనింగ్ బాగున్నారా? మీ కవితలు కొత్త నీటి సెలయేరు లా నిదానం గా ప్రవహిస్తూ గుండెని చల్లగా స్పృశిస్తూ,మెత్తగా తాకుతూ సాగిపోతుంటాయి మే వొరవడిలో ఏదో ప్రత్యేకత ఉంది... కాన్సెప్ట్ మీద స్థిరమైన అభిప్రాయం ఉంటుంది..మొత్తానికి ఆపి చదివించేలా ఉంటాయి మే కవితలు..అభినందనలు • ఇంత కంటే గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది. . కల్యాణి గారు. కనీసం మీరైనా సహృదయంతో అభినందిస్తున్నందుకు. చాలా సతోషంగా ఉంది. • very very good evening to you. • I'm so thankful to you for your such a wonderful compliment. • Good night • • జాస్తి రామ కృష్ణ చౌదరి..సెలెబ్రటి..... • Lol • Chat conversation end • Yes. • జాస్తి రామకృష్ణ చౌదరి సెలబ్రటీ • somebody suggested me to caption my name first and them title of poem. i think of hrudyaspandana. phaneendrarao garu anukuntaa. appatnundee alaa • • do you mind if i cme in chat nd express my opinion? if so pl dnt hesitate... let me know ...if u mind... dnt mis understand • • ఒక్కోసారి ప్రత్యేకం గ అభినందించాలని పిస్తుంది... మనస్పూర్తిగా... • No. why should i mind. you're always welcome • Thanks for your comments in the thread and also your messages and I feel so happy really. • Good night and see you latert • Chat conversation end Like • • 11 February at 21:52 near Hyderabad • • Manju Yanamadala and Dubaguntla Hari like this. • R K Chowdary Jasti Thanks, Dubaguntla Hari garu 11 February at 22:12 • Like • Kranthi Kumar మనలో ఉండే వింత మనిషికి ఆనందంగా ఉందిలే అని ఆ వికారమైన వలయంలోనే జీవితాన్ని గడిపేస్తున్నాం మనకి తెలియకుండానే మనల్ని మనం కోల్పోతున్నాం! అద్భుతంగా చెప్పారు sir ధన్యవాదాలు. Yesterday at 00:14 • Unlike • 1 • Manju Yanamadala ఆ వికారమైన వలయంలోనే జీవితాన్ని గడిపేస్తున్నాం మనకి తెలియకుండానే మనల్ని మనం కోల్పోతున్నాం!..నిజమే అండి ఎన్నో కోల్పోతూనే ఉన్నాము ...వాస్తవం అండి చాలా చాలా బావుంది కవిత చౌదరి గారు Yesterday at 10:36 • Unlike • 1 • R K Chowdary Jasti Thank you so much, Kranthi Kumar, Manju Yanamadala garu, A few seconds ago • Like •

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j0It3x

Posted by Katta

Nirmalarani Thota కవిత

నడిరేతిరేళ నెత్తిమీదికొచ్చి నవ్వుతావేల ఓ సందమామ . . ! తెల్లారిందంటే తేల కళ్ళేత్తావు నువ్వేమి గొప్ప ఓ సందమామ. . ? పట్ట పగలైనా గాని నా మావ కన్నుల్ల పండు వెన్నెల్లు కురియు ఓ సంద మామ . . ! మిట్ట మధ్యాన్నమేల నడి నెత్తికొచ్చి మిడిసి పడతావేల ఓ సూరీడా . . ? పొద్దు గుంకిందంటే పడమటింట జేరి వెలవెలా బోతావు నువ్వేమి గొప్ప ఓ సూరీడా . . ? నిశి రాతిరేళ నా మావ మోమే కోటి సూరీల్లై వెలుగు ఓ సంద మామ. . ! వానల్లు పడగానే ఎగిరెగిరి పడుతూ . . వగలు పోతావేల ఓ పిల్ల వాగు . . ! ఎండల్లు మండితే ఎండిపోతావు నువ్వేమి గొప్ప ఓ సంద మామ . .! ఏడాది పొడుగునా నా మావ మాటలే ఏరువాకై సాగు ఓ సంద మామ . . ! నిర్మలారాణి తోట [ తేది : 16.02.2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kKLvfw

Posted by Katta

Raghu Mandaati కవిత

రఘు మందాటి | వొడి .............................. అక్షరాలు చెదిరిపోయాయి. నువ్ నా ఏకాంతాన్ని వాటేసుకున్నాక. మాటలన్నీ మూగబోయాయి, నీ ఈ ప్రశాంతతకు నాకు బాష దొరక్క. నా దూరానికి తీరాన్ని నిర్దేశించుకోవడం ఓ భ్రమ. ఎంతైనా విచ్చలవిడిగా నను వాటేసుకున్నాక, నేననే అస్తిత్వపు మాయ మాయమయ్యింది. నన్ను నేనుగా పొందుపరుచుకోవడం కోసం విలవిల్లాడిన, నీ వొడి దాటాలేననేది దాచలేని సత్యం. ఏంటో నీ వొళ్ళో నేనెప్పటికీ ముసిముసిగా రెపరెపలాడే గడ్డిపోచని. 16 Feb 2014

by Raghu Mandaatifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gGjJg9

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

మేధావులు వారణాసి రామబ్రహ్మం 16-2-2014 సంఘాన్ని మేధావులు నడుపుతారు. ఇప్పుడు భారత దేశంలో మేధావుల సంఖ్య చాలా పెరిగిపోయింది. ప్రతి కులానికి, మతానికి,ప్రాంతానికి, సిద్ధాంతానికి, రాద్ధాంతానికి, దేనికి అయినా సరే, ఒక సమూహం ఏర్పడుతోంది. సమూహం మిగతా సమూహాలని చీల్చి చెండాడుతోంది. అలా ఒకరితో ఒకరు పోట్లాడు కొనే మేధావుల వల్ల సంఘములో శాంతి సుఖములు కరవు అయిపోయాయి. ప్రతి మేధావుల సమూహము వెనుకా కొందరు రౌడీలు; అసాంఘిక శక్తులు దన్నుగా నిలిచి గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో, సిద్ధాంతాన్నో మాత్రమె వెనకేసికొని రావడమే మేధావితనముగా చెలామణీ అవుతున్న ఈ వేళ అందరూ మేధావులే; చెప్పేవాళ్ళే. ఆచరించేవాళ్ళు సున్నా. న్యాయము, ధర్మము సూక్ష్మమైనవి. కులము, మతము, ప్రాంతము, సిద్ధాంతము ముసుగులో, కళ్ళతో చూసే వారు "మేధావులు" కారు; సంఘములో ప్రజల మధ్య వైషమ్యాలు, వైమనస్యాలు సృష్టించడము తప్ప మరేమీ సాధించలేరు. అందర్నీ "సాధిస్తూ", తిడుతూ, తీసిపారేస్తూ, మేధావులుగా పేరు ప్రతిష్టలు సంపాదించి, సంఘాన్ని అతలాకుతలం చేసి నెమ్మదిగా ప్రకృతిలో కలిసిపోతారు. ప్రజలు మాత్రము ఈ మేధావులు సృష్టించి, పోషించిన వైషమ్యములతో కొట్టుకుచస్తూ అలమటిస్తూంటారు. ప్రస్తుతపు మేధావి తనము సంఘానికి తలనొప్పి గా తయారైంది . హృదయాలని శాశ్వతముగా విడదీస్తోంది. సమన్వయము హుళక్కి. సమన్వయము లేక శాంతి సుఖములు లేవు. అందరూ మేధావులే. శాంతి సౌఖ్యములకే లోటు.

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dyLPdc

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ// తప్పిపోయిన పిల్లడు// నిన్నొకసారి చూడాలనిపిస్తొంది... ఆకాశం నుండి చినుకులా రాలి తడిసి మట్టి ముద్దగా మారి మట్టిలో దాగిన విత్తు చిగురేసి పచ్చటి కళ్ళతో సూరీడుని మింగి సూరీడు మెరిసిన గొంతులో దూరి మనసుతో మమేకమై చూడాలనిపిస్తొంది. నీతో ఒకసారి మాట్లాడాలనిపిస్తొంది... పూలంటి పెదాలు మలయమారుతంలా కదులుతుంటే మనసు నిండిన మధురోహలతో చిగురిస్తూ పరిమళిస్తూ మాట్టిలో దాగి తలెత్తుకు నిలబడ్డ వేర్లతో పచ్చదనపు పసిడి కనపడగానే అగమ్య బాటసారిలా సోలి నీ నీడతోనైనా మాట్లాడాలనిపిస్తొంది. నిన్నొకసారి ఆలింగనం చేసుకోవాలనిపిస్తొంది... ఉదయం నీరెండ పరుచుకున్నట్టు సంధ్య తరువాయి చీకట్లు విచ్చుకొన్నట్లు వెన్నల వీడలేక తుషార బిందువులై హత్తుకున్నట్టు వెనకాలే అడుగులో అడుగేసుకొంటూ వెంబడిస్తున్నట్లు చేతిలో చెయ్యేసి సుదీరతీరాలు చుట్టినట్టు వెన్నెలే పగలు వెలుతురుగా వ్యక్తమైనట్లు హృదయంలోకి హృదయంలోంచి ఆలింగనం చేసుకోవాలనిపిస్తొంది. నిన్నొక్కసారి వినాలని ఉంది.... వేసంకాల నడినెత్తిన వర్షగీతమై వర్షాకాల మడుగు చివర అడుగుల దారివై శీతాకాలం చేతులు రుద్ది ఆంచిన బుగ్గలవై ఎక్కడ మాయమైపోయావు అని అడగగానే తప్పిపోయిన పిల్లాడల్లే గుక్కపట్టి ఏడుస్తుంటే పక్కన కూర్చుని పకపకా నవ్వుతుంటే వినాలని ఉంది. విని మళ్ళీ నీ ఊహల ఊసులలోనే తప్పిపోవాలని ఉంది, నువ్వు లేని లోకం నుండి తప్పించుకు పోవాలని ఉంది.....16.02.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dyLOWL

Posted by Katta

Krishna Mani కవిత

ఎవరికోసం... ************ మెల్ల చూపులు నత్తి మాటలు కోసే కోతలు రాసే గీతలు వేసే వేషాలు ఎవరికోసం... ఎవరికోసం... ఎవరికోసం... దీనులనుద్ధరించడానికా ? రక్కసులకు పూత పుయ్యడానికా ? రాబందుల చెర నుండి విడిపించడానికా ? ఏనుగుల మేపడానికా ? ఎవరికోసం... ఎవరికోసం... ఎవరికోసం... అన్నీ దిక్కులా అన్నీ చోట్లా మేమే ముందు మేమే ముందు అని ఎగిరెగిరి వాలి అవసరంలేని కాడ గోరంతను కొండంతగా కొండంతను చీమంతగా జనులముందుంచి ఒక గుంపును ఉసిగొలిపి ఒక జండాను ఎత్తుకొని మరచిన నొప్పిని గుచ్చి లేపి ఎవరికోసం... ఎవరికోసం... ఎవరికోసం... నమ్మిన మనషుల గొంతులు కోయ్య మాడిన బతుకున మట్టి కొట్ట జడసిన గుండెను జారగొట్ట చాచిన చేతుల వాతలు పెట్ట బలసిన కొండల అభిషేకాలు కురిసే మనసున మొట్టికాయలు ఎవరికోసం... ఎవరికోసం... ఎవరికోసం... ఎవరికోసం... ఎవరికోసం... ఎవరికోసం... కృష్ణ మణి I 16-02-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jq6xMX

Posted by Katta

Panasakarla Prakash కవిత

నీవు...........నీవే... అద్ద౦లో ముఖ౦ చూసుకుని మన౦ మనలాగానే ఉన్నామని మురిసిపోవడ౦వరకూ పరవాలేదుగాని మన ఎదురుగా నిల్చున్న ప్రతివాడూ మనలాగానే ఉ౦డాలనుకోవడ౦.... ఖచ్చిత౦గా క్షమి౦చరాని నేరమే నేల నేలలా కాకు౦డా ని౦గిలా ఉ౦టే.. నీరు నీరులా కాకు‍‍‍‍‍౦డా నిప్పులా ఉ౦టే గాలి గాలిలా కాకు౦డా నీరులా ఉ౦టే.... అన్నీ ఒకే రూప౦లో ఉ౦టే........ అసలు మన౦ బతకగలమా..? అన్ని చెట్లు ఒకేరక౦ ఫలాల్నికాస్తే మనుషుల౦దరు ఒకే రూప౦లో ఉ౦టే అన్ని పదార్దాలూ ఒకేరక౦ రుచిని ఇస్తే.. మన౦ అసలు మనశ్శా౦తిగా ఉ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍౦డగలమా...? చీకటి అనే చెడులోనూ మచ్చలేని తెల్లని చ౦దమామ ఉ౦టు౦ది వెలుతురు అనే మ౦చినికూడా వె౦బడి౦చే నల్లని నీడ ఉ౦టు౦ది.. మ౦చి చెడులు విడి విడిగా ఉ౦డవు మనమే పుచ్చులను వదిలిపారేసి మ౦చివాటిని ఏరుకోవాలి నేస్తమా అ౦దరూ నీలాగే ఉ౦డాలనుకోకు ప్రకృతెప్పుడూ ఒకే ర౦గులో ఉ౦డదు నేస్తమా నువ్వుకూడా ఎవ్వరిలాగానో ఉ౦డకు అప్పుడు నీవు అనే ముద్ర ఈ లోక౦లోనే ఉ౦డదు జాగ్రత్త.............. పనసకర్ల‌ 16/02/2014

by Panasakarla Prakashfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cKJHuG

Posted by Katta

Kapila Ramkumar కవిత

Siren Song This is the one song everyone would like to learn: the song that is irresistible: the song that forces men to leap overboard in squadrons even though they see beached skulls the song nobody knows because anyone who had heard it is dead, and the others can’t remember. Shall I tell you the secret and if I do, will you get me out of this bird suit? I don’t enjoy it here squatting on this island looking picturesque and mythical with these two feathery maniacs, I don’t enjoy singing this trio, fatal and valuable. I will tell the secret to you, to you, only to you. Come closer. This song is a cry for help: Help me! Only you, only you can, you are unique at last. Alas it is a boring song but it works every time. Margaret Atwood

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oApHDI

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నేను రాలుతున్నాను --------------------­------------- నేడు నేను రాలుతున్న ఓ బిందువును ఆలోచనా గనుల్లో ఇంకుతున్నాను నాకు నేనుగా వృషభాల కోరలకు చిక్కకుండా గూడు కట్టుకున్న సాలీడును మనసు దివిటి ఆరిపోకుండా మమత చిహ్నాలు చెరిగిపోకుండా ఎక్కడో గుప్పిట ఎడారిలో ఆశల రేణువులను పోగేస్తూ పరాన్నదేహమై తల్లి ఒడిలోనే సేదతీరుతోంది... మసక కళ్ళద్దాలు తొడిగిన చెట్లగూటిలో గుడ్లగూబ చూపులేవొ ఈ లోకాన్ని పరికిస్తున్నట్టు విరిగిపడుతున్న అమాసపు శకలాలు మళ్ళి వర్షిండం మొదలయ్యింది... ఇంకొన్నిసార్లు రాలుతున్నాను తిలక్ బొమ్మరాజు 15.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cKwnGP

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిసంగమం : సీరీస్ 13 హెచ్చార్కె,ఖాదర్ మొహియుద్దీన్,విజయ్ కుమార్ Svk, మధు ఇరువూరి పాల్గొన్న కార్యక్రమం VEDIO లింక్ ~ http://ift.tt/NRURIQ

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cKwnGJ

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // అక్కల్ట్ వే..... // ఇన్ని మాటలు ఎక్కడినుంచి వచ్చాయి ఏ అనుభవాలను పూలను ముళ్ళను చేసావ్ ఎన్ని సారాలు నుంచి ఏమి తీశావ్ ఎన్ని శాలల నుంచి ఏగుర్తులు తెచ్చావ్ కొన్ని పాతమాటలతో కొత్తరంగులెవరికి అసలు ఎవరికీ కాదా… వర్తించాలనో వర్తింపచేయాలను కుంటావో కొన్ని సమయాల్లో శక్తో యుక్తో ప్రేమో దాహార్తి తీరని దార్శనికతతో ఖాళీలను మత్తుతో నింపుకొనే పిచ్చితనం… ఏమైతేనేమి కొన్ని ఇసుక తుఫానులు దోసిట్లో చూపిస్తూ ప్రపంచమే నువ్వు అని ,నువ్వే ప్రపంచమని ఎప్పటికీ పూరించుకోలేని శూన్యంతో తచ్చాడతావు మరి ఇక సాయంత్రాల దారిని సుగమం చేసుకుంటూనే ఉంటావ్ Date:15/02/2014

by Sri Modugufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cKffkz

Posted by Katta

Kapila Ramkumar కవితby Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f1QiXG

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

//अमरत्व// ............................... तेलुगुः- शिवसागर हि्न्दीः- श्रीनिवासु गद्दपाटि ................................................ बीज मरतेहुए फसल का वचन दिया फूल गिरतेहुए मुस्कुराहट से फल का वचन दिया जंगल जलतेहुए दावानल का वचन दिया सूर्यास्त हाथ में हाथ डालके सूर्योदय का वचन दिया अमरत्व रम्य है.. जो काल को आलिंगन करके और एक संसार का वचन दिया.. 16.02.2014

by Srinivasu Gaddapatifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dUiMMA

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ వీర బిడ్డలు @ _ కొత్త అనిల్ కుమార్ .16/02/2014 ఉగ్ర రూపం దాల్చి కదిలేను కుటిలాంధ్ర పాలకులను దిక్కరించగా శత శిరస్సులు ఖండించిన ఉగ్రబార్గవుని వలే. ఆగ్రహ జ్వాలల నడుమ కదిలేను వలస వాదుల దోపిడిని కట్టడి చేయగా శూలయుధం ధరించిన ప్రళయకాల రుద్రుని వలే. అగ్నిఖిలలను అలుముకుని కదిలేను భాషాముఖం పులుముకున్న పిశాచాన్ని సంహరించగా క్రోధ రూప మహాభయంకర వీరభద్రుని వలే. రక్త నేత్రం ఉరిమి చూడగా కదిలేను కుటిల నాయకుల కుత్తుకలు తెంచగ కపాల మాలాదారిని మహాంకాలి వలే ఎవరు ఎవరని తడుముకుంటివా... ఓరి..వలస వాద నియంత పాలక భగ్గుమనే అగ్గిపూలతో పేర్చిన బతుకమ్మలా మొక్కుకుని పెట్టిన తెగింపు భోనం లా కన్నెర్ర జేసినా నా వీర సోదరి రా సరసర సాగే దాశరధి కవితాక్షర శర వేగం లా సలసల కాగే కాళోజీ కవిత నిప్పుకనికలా కదనాన కదిలిన నా వీర సోదరుడు రా నింగి నేలను ఒకటి చేసి పోరాడిన నా తెలంగాణా వీర బిడ్డలురా.. నా నేల తల్లి పోరాట యోధులు రా జై తెలంగాణ .

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eC7tZC

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 22 . (తాత్కాలికంగా అధికారమో, వయోనుకూలత వల్ల అందమో, సంభవతవల్ల గొప్ప ఇంట్లో పుట్టడమో, మంచి గురువుల ఆశీస్సులవల్ల (వి)జ్ఞానమో రావడం జరిగితే, కొంచెపు నరులు ఎలా ప్రవర్తిస్తారో సూచించే కవిత ఇది. వాళ్ళు లోకం తమకి దాసోహమై ఉండాలని అనుకుంటారు. వాళ్ళకి తమ స్థితి తమ అర్హతవల్లే వచ్చిందనుకుంటారు తప్ప ప్రకృతి అనుగ్రహం అనుకోరు. ఈ ప్రకృతి ప్రసాదాలన్నీ అణకువ నేర్పాలితప్ప అహంకారాన్ని కలిగించకూడదు. లూయిజా మే ఏల్కోట్ అనగానే ఛప్పున గుర్తువచ్చేది Little Women అన్న నవల (అమెరికనుసివిల్ వార్ నేపథ్యంలో రాయబడిన ఈ నవల అనంతరం నాటకంగా మలచబడింది. 5సార్లు తెరకెక్కింది. 1949 సినిమాలో ఎలిజబెత్ టేలర్ Amy March గా నటించింది). రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, హెన్రీ డేవిడ్ థొరోల వంటి హేమాహేమీల ప్రభావంతో పెరిగిన అమ్మాయి స్వతంత్రభావాలు లేకుండా ఎలాఉంటుంది? చిన్నప్పటినుండే తన రచనలద్వారా కుటుంబానికి ఆర్థికసహాయం చెయ్యవలసి వచ్చిన ఈమె, బానిసత్వ నిర్మూలనకు వ్యతిరేకంగా తనగొంతు వినిపించింది. ) . బుడగా... బండరాయీ... లూయిజా మే ఏల్కోట్ . ఓహ్! నున్నగా, గోధుమ రంగులో ఉన్న ఆ బండరాయి, తన పాదాల చెంత కెరటాలు నృత్యం చేస్తుంటే చూడ్డానికి ఎంత మనోహరంగా ఉంది! ఒకసారి ఓ చిన్న నీటిబుడగ అలలమీద తేలుతూ బండరాయి పక్కకి వచ్చి, గట్టిగా అరుస్తోంది: "ఏయ్ మొద్దూ! త్వరగా పక్కకి తప్పుకో. కనిపించటం లే? ఈ అలలమీద తేలియాడే అందాన్ని నే వస్తుంటే? చూడు హరివిల్లులాంటి నా ఆహార్యం. చూడు నా వెలుగు కిరీటాన్ని. నా మెరిసే సొగసూ, గాలిలా తేలిపోగలిగే నా ఆకారాన్నీ. నురగలతో, తుంపరలతో తీరాన్న నర్తించడానికి ఈ నీలికెరటాలమీద తేలియాడుతున్నాను. ఊ! ఊ! త్వరగా, త్వరగా పక్కకి జరుగు. కెరటాలు ఉధృతంగా ఉన్నాయి. వాటి పాదతరంగాలు నన్ను ఒడ్డుకి త్వరగా తీసుకుపోతాయి. కాని, ఆ బండరాయి నీటిలో నిటారుగా నిల్చుని ఒక్కసారి క్రిందకి ఒక్కసారి తీక్షణంగా చూసి, అంతలో సంబాళించుకుని చిరునవ్వుతో ఇలా అంది: "చిన్ని నా మిత్రమా! నువ్వే మరొక త్రోవ వెతుక్కోవాలి. నేను ఇక్కడనుండి ఎన్నో ఏళ్ళుగా కదలకుండా పడి ఉన్నాను "ఉప్పెనలాంటి కెరటాలు నన్ను తోసాయి, ఉధృతమైన గాలులూ తాకేయి. కాని, ఏవీ ఈ ఆకారాన్ని ఒక్క అడుగుకూడా కదల్చలేకపోయాయి. "నీటిలోగాని, గాలిలోగాని ఉన్నదేదీ నన్ను కదల్చ లేదే. మిత్రమా నీకోసం నేనెలా కదలగలను చెప్పు?" అది విని కెరటాలన్నీ సన్నని కంఠస్వరంలో మధురంగా నవ్వేయి. నీటిపక్షులుకూడా తమ రాతి గూళ్లలోనుండి విలాసంగా ఉన్న బుడగని ఒకసారి చూసేయి ఆ బుడగకి అమాంతం కోపంవచ్చి, బుగ్గలు ఎరుపెక్కి, మితిమీరిన గర్వంతో ఇలా అంది: "ఏయ్, వికారపు బండరాయీ! నువ్వు నాకోసం పక్కకి తప్పుకుంటున్నావు. తప్పుకోవాలి. అర్థం అయిందా? "ఓయ్ పక్షులూ! ఎందుకలా తేరిపారి చూస్తున్నారు? నిశ్శబ్దంగా ఉండండి. "అనాగరికపు కెరటాల్లారా! మీ నవ్వులు కట్టిపెట్టి నన్ను ముందుకి మోసుకెళ్ళండి. ఈ సముద్రానికి రారాణిని నేను. ఈ మొరటు రాళ్ళు నన్ను భయపెట్టలేవు" కోపంతో పైకిలేచి నిందిస్తూ ఒక్కసారి రాతిని కొట్టి పగిలిపోయింది తెలివితక్కువ బుడగ. బండరాయిమాత్రం ఎంతమాత్రం కదలలేదు. అప్పుడు గూళ్ళలోని నీటి పక్షులు తమ గుండెలమీద పడుక్కున్న చిన్నారులతో ఇలా అన్నాయి: మీరు ఆ బుడగలా బుర్ర తిరుగుడుగా, అహంకారంతో, అసభ్యంగా ఉండకండి. దౌర్జన్యంగానైనా మీ పనులు నెరవేర్చుకుందికి ప్రయత్నించకండి ఆ రాయిలా నిశ్చలంగా, నిజాయితీగా, ధృడంగా ఉండండి. తప్పు చేసినవారిపట్ల ఖచ్చితంగాఉంటూనే, దయతో, ప్రసన్నతతో ఉండడం ఎంతమాత్రం మరిచిపోవద్దు. "చిన్నారులూ, ఇవాళ మీరు నేర్చుకున్న ఈ గుణపాఠం శ్రధ్ధగా గుర్తుంచుకుంటే, మీరు వివేకవంతులౌతారు.” . లూయిజా మే ఏల్కోట్ (November 29, 1832 – March 6, 1888) . The Rock and the Bubble . Oh! a bare, brown rock Stood up in the sea, The waves at its feet Dancing merrily. A little bubble Once came sailing by, And thus to the rock Did it gayly cry,-- "Ho! clumsy brown stone, Quick, make way for me: I'm the fairest thing That floats on the sea. "See my rainbow-robe, See my crown of light, My glittering form, So airy and bright. "O'er the waters blue, I'm floating away, To dance by the shore With the foam and spray. "Now, make way, make way; For the waves are strong, And their rippling feet Bear me fast along." But the great rock stood Straight up in the sea: It looked gravely down, And said pleasantly-- "Little friend, you must Go some other way; For I have not stirred this many a long day. "Great billows have dashed, And angry winds blown; But my sturdy form Is not overthrown. "Nothing can stir me In the air or sea; Then, how can I move, Little friend, for thee?" Then the waves all laughed In their voices sweet; And the sea-birds looked, From their rocky seat, At the bubble gay, Who angrily cried, While its round cheek glowed With a foolish pride,-- "You Shall move for me; And you shall not mock At the words I say, You ugly, rough rock. "Be silent, wild birds! While stare you so? Stop laughing, rude waves, And help me to go! "For I am the queen Of the ocean here, And this cruel stone Cannot make me fear." Dashing fiercely up, With a scornful word, Foolish Bubble broke; But Rock never stirred. Then said the sea-birds, Sitting in their nests To the little ones Leaning on their breasts,-- "Be not like Bubble, Headstrong, rude, and vain, Seeking by violence Your object to gain; "But be like the rock, Steadfast, true, and strong, Yet cheerful and kind, And firm against wrong. "Heed, little birdlings, And wiser you'll be For the lesson learned To-day by the sea." . Louisa May Alcott (November 29, 1832 – March 6, 1888) American Novelist.

by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eC7soq

Posted by Katta

Katta Srinivas కవితby Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MnknVg

Posted by Katta