పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మే 2014, బుధవారం

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/మొస్తు0ది ............................................ మొస్తు0ది తొమ్మిది నెలలు బయిటికొచ్చాక రక్షిస్తు మొస్తు0ది పద్దెనిమిదేళ్ళు,తొమ్మిది నెలలు తీసేసి కుదురుకోకపొతే మరో పద్దెనిమిదేళ్ళు కలుపుకొని మొస్తు0ది. మొస్తు0ది మొస్తు0ది మొస్తు0ది. నీ ఒక్క బుజం అమెను మొసె వరకు.. .. ఏ ప్రపంచ కొసన ఉన్నాడో ఈ సృష్టికారుడు..... కనే భారాన్ని ఒక్క స్త్రీకే ఇచ్చి వెళ్ళాడు. 21-05-2014

by Mothi Mohanarangafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qVuPFT

Posted by Katta

Patwardhan Mv కవిత

పట్వర్ధన్ ఎం.వి---- // అర్థాంగీకారం || ఎలా ఉన్నాడు? నచ్చాడా? పెదవుల మీది పేలవమైన ప్రశ్న సమాధానాన్ని ఆశించని పరమ యాంత్రికమైన ప్రశ్న యథాలాపమైన ప్రశ్న ఇదే ప్రశ్న కొన్నేళ్ళ నుండి వేయబడీ,వేయబడీ మొదలూ,కొసా అరిగి పోయి జవ జీవాల్ని కోల్పోయి శూన్యంలో ఎగరేసిన వస్తువులా ఏ ఆకర్షణా లేక ,ఒకానొక నిరీహా నిశ్చల స్థితిలో ఒక వెర్రి నవ్వు పరిమళాన్ని నింపుకున్న ప్రశ్న గాయాల తుప్పుతో మొండుబారిన ప్రశ్న అప్పుల ఉరి కొక్కెంలా వేలాడుతున్న ప్రశ్న గంధక ద్రావణంలో మరిగి కరిగి చల్లారిన ప్రశ్న ఒక చక్కటి సౌశీల్యానికి మాపదండమైన ప్రశ్న తన గుడ్లను తానే తినే పాము నోరులా ఉంది ప్రశ్న పడి లేవని చచ్చిన కెరటంలా ఉంది ఇప్పుడు ప్రశ్న న్యాయ మూర్తి విరిచేసిన పాళీలా ఉంది కానీ... ఆమె హృదయ తీరంలో ఎక్కడో ఇప్పటికీ సమాధానం సజీవ శిలాజంలా ఉండే ఉంటుంది. 21-05-2014,మంచిర్యాల్.

by Patwardhan Mvfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jVgLCJ

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //ఆమె// ఆమె కన్నుల మాటున ఎన్నో భావాలు అవి చిత్రించే చిత్రకారుడు ఎవరు ఆమె మాటల్లో ఎన్నో సరిగమలు దానికి సంగీతం అందించేది ఎవరు ఆమె సైగాల్లో ఎన్నో అర్ధాలు దాని కవితగా మర్చెదిఎవరు ఆమె చిరునవ్వులో ఎన్నో ముత్యపు జల్లులు దాని హారంగా మర్చెదిఎవరు ఇంకెవరు ఆమెను అర్ధంచేసుకున్న అతనే ఆమెను బానిసలా కాకుండా మహారాణిలా చూసకునే అతనికే ఆమె ప్రేమ సొంతం 21may2014

by Venu Madhavfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kpoo97

Posted by Katta

Pranayraj Vangari కవిత

‘‘కవిసంగమం’’ లోని కవుల గురించి వికీపీడియాలో వ్యాసాలు రాయాలని ‘‘తెలుగు వికీపీడియా’’ ప్రయత్నంచేస్తుంది. కవి మిత్రులందరూ క్రింది లంకెలోని ఫారంలో తమ తమ వివరాలు తెలుగులో అందించగలరు (ఒక పుస్తకం అయిన ప్రచురితమై ఉండాలి).... రిఫరెన్స్ కోసం పుస్తకం వివరాలు (ప్రచురణ సంస్థ, సంవత్సరం, పబ్లికేషన్ పేరు), కవితలు అచ్చయిన పుస్తక/పేపర్ వివరాలు అందించగలరు.... http://ift.tt/1etALhQ ఫోటోలను pranayrajvangari@gmail.com కి పంపించగలరు....

by Pranayraj Vangarifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fLVz0g

Posted by Katta

Pratapreddy Kasula కవిత

వీరుణ్నీ, మనిషినీ నేనే! - కాసుల ప్రతాపరెడ్డి నేను దీపాలు ముట్టిస్తుంటాను మేధావులు దీపం కింది చీకట్లనే చూస్తారు వాళ్లు కోడిగుడ్డుకు ఈకలు పీకుతుంటారు నేను పొదిగి పిల్లలను చేస్తుంటాను దుర్గమారణ్యాల గుండా దారులు వేస్తుంటాను వాళ్లు దారికడ్డంగా గోడలు కడుతుంటారు కోడిపిల్లను గద్ద తన్నుకుపోతుంటుంది నేను ఎగిరి తన్ని బొక్క బోర్లా పడతాను వారు పోరాటంలోని అశాస్త్రీయతను విశ్లేషిస్తుంటారు నేను రెండు చెవులూ మూసుకుని దుఃఖాన్ని బాణాలు చేసి విసురుతాంటాను మొదట స్త్రీవాదం గురించి అనంతరం దళితుల గురించి, ముస్లింల గురించి చివరగా తెలంగాణ గురించి భూమి లోపలి వేళ్ల గురించి మాట్లాడుతుంటాను రక్తం నశించి వారి ముఖాలు తెగనరికిన చెక్కలవుతాయి ఏ గాయపడిన ప్రాంతానికో వెళ్లి వచ్చి ఇక్కడ పండుగలు చేసుకుంటారు చిందిన రక్తాలను, తెగిన పడిన మాంసం ముద్దలను కవిత్వాలుగా వండి ఆవురావురుమని ఆరగిస్తుంటారు నేను పంటి కింద రాయినని వారికి గుర్తొస్తుంది నా మీద గుమ్మల కొద్దీ రాళ్లు విసురుతారు పెడరెక్కలు విరిచి చెట్టుకు కట్టేస్తారు నేను చేసుకున్న ఆయుధాన్ని లాక్కుంటారు దాన్ని నా మీదికే గురి చూసి వదులుతారు నా చేతులూ కాళ్లూ ఆడవు యుద్ధభూమిలో విలవిలలాడుతుంటాను నన్ను చూసి వాళ్లంతా నొసళ్లను చిట్లిస్తూ వుంటారు వెటకారాలనో, వెక్కిరింపులనో ముళ్లలెక్క గుచ్చుతుంటారు అక్కడే వాళ్లంతా బొంగరంలా తిరుగుతుంటారు ఒక్క అడుగూ ముందుకు పడదు అది తెలుసుకోవడానికి వారికి ఈ జీవితం సరిపోదు నా ఆత్మ వెలుగుతూ వుంటుంది దాని చేయి పట్టుకుని నడుస్తూ వుంటాను ఇంకా - లోపల నా మీద పళ్లు పటపట కొరుకుతూనే వుంటరు బయటికి మాత్రం పెదవుల మీద నవ్వు అతికించుకుంటరు నేను మట్టిలో పొర్లాడి పోరాడుతున్నవాడిని కదా నాకు అంతా తెలుస్తూనే వుంటుంది కోపం రాదు గానీ ఒక బాధ నిరంతరం గుండెను తొలుస్తూనే వుంటుంది ఇక్కడ మనిషే ఆయుధం వాడికి ద్రోణాచార్యులెందుకు? హృదయమే సిద్ధాంతం వేల కొద్ది పేజీల రాద్ధాంతాలెందుకు? న్యాయాన్యాయాల గుట్టు విప్పడానికి కంటి పొరలు తొలిగిన చూపొక్కటి చాలు వారు ద్వేషాన్ని విసురుతుంటే నేను ప్రేమను పరుచుకుంటూ పోతుంటాను తమ విగ్రహాలను తామే చెక్కుకుంటూ వాలఖిల్యులు తలకిందులుగా వేలాడుతుంటారు నేను గుండెలను అతికించడంలో మునిగి తేలుంటారు చావు గుట్టు తెలిసినవాడిని జీవితమే యుద్ధమైనవాడ్ని కదా! మరణిస్తూ మళ్లీ మళ్లీ పుడుతుంటాను భూమ్మీద నాకు నూకలు పుడుతూనే వుంటాయి ప్రజలు వెలుగుల్లో నడుస్తుంటారు

by Pratapreddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUIqDS

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Trained Dog | లైఫ్ ఉంటే రాజీ లేదు రాజీ ఉంటే లైఫే లేదు . సింపుల్ ఈక్వేషన్ నమ్మినా నమ్మకపోయినా అర్ధం కావటానికి జీవిత కాలాలు పట్టినా అర్ధం కాకుండానే జీవితాలు అయిపోయినా బాలేన్సింగ్ ఆర్ట్స్ ఎన్ని నేర్చుకున్నా బాలెన్సు చెయ్యలేక సతమతం అయిపోయినా లైఫ్ ఉంటే రాజీ లేదు రాజీ ఉంటే లైఫే లేదు . ** పుట్టుకలు మరణాలు అన్నిటిలో తెలియకుండా ఆడే కాంప్రమైజ్ గేమ్ ఆడుతూ ఓడుతూ మిగిలిన బ్రతుకాటలో డర్నా కిస్ బాత్ కా దోస్త్ ఇలారా కొంచెం సర్దుకుపోదాం భయమా ?అదెందుకు జీవితం తో రాజీ నేర్చుకున్నాక మనసు తో రాజీ నీళ్ళలో మంచుగడ్డ ప్రయాణం అంత వీజీనేగా మునిగిన తెప్పల్లో నీరు ఎంతకని ఎత్తిపోసు కోవటం అసలు ఇంత ఎందుకు ప్రయాసపడటం ? ** మునిగిపోయాను అని తెలుసుకోవటం నిజం మునకే సుఖమనుకోవటమే అల్టిమేట్ రాజీ లేని జీవితాలు ఉన్నాయని ఇంకెంత కాలం మనసుని మభ్య పెట్టడం మునిగిపోవటానికి డర్నా కిస్ బాత్ కా దోస్త్ కోట్ల ఆత్మలు నీతో పాటు చిరునవ్వు చెరగకుండా నీకంటే ముందే మునిగున్నాయి చూడు ఇలారా కొంచెం సర్దుకుపోదాం destination లేని దార్లలో మునుగుతూ తేలుతూ నీళ్ళలో మనదయిన పాదముద్రలు వదులుతూ రాజీ లేని ప్రయాణం లో దారులతో రాజీ పడిపోతూ ** ఏమయినా ఎప్పటికి open అవ్వని వ్యవస్థల పారాచూట్ ని నమ్ముకొని మునగటం లో థ్రిల్లె వేరప్పా . దా ఇంకాస్త గట్టిగామునుగుదాం హే మర్చిపోయా కొంచం అసంట జరిగి మునగరాదు మా కులపోళ్ళు ఒప్పరు మా మతం కి సమ్మతం కాదు ఈ కలిసి మునగడాలు అవి! ఎక్కడయినా రాజీనే మతం వంగ తోటకాడ తప్ప హుమ్మ్ అక్కడ శవాలు కూడా రాజులే ఆకలి రాజ్యానికి కాపలాగా . ** నిశీ !! 21/05/14

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mXYsCn

Posted by Katta

Mala Chidanand కవిత

||హృదయేశ్వరుడు|| చిన్నదాని చందాలు చూసిన ఇందురూడు తన వెంటపడ్డాడు. నీలాకాశంపై ప్రేమ పత్రం రాసాడు నీవొక సౌందర్యవతివన్నాడు. నీ మనసొక అందాల కోవెలన్నాడు నిన్నొదిలి నేనసలు ఉండలేనన్నాడు. నీవే నా పాలికిక దేవత అన్నాడు నీ ఒడిలో నన్ను నేను మరిచిపోయానన్నాడు. అనితరసాధ్యమైన నీ అద్భుత ప్రేమ నాదైనందుకు ధన్యుడైనానన్నాడు. సర్వసంపదలకు అధిపతినైన నాకు నీ ప్రేమామృతముతో తనివి తీరినదన్నాడు. ప్రియురాలి హృదిలోని ఒక్కొక్క అంగులంలోను విరాజిల్లిపోయాడు. మనసిచ్చిన మగువను మనసారా మనువాడాడు మన్మథుడు. ఈ భువిలోనే కాదు ఆ స్వర్గములొ వెతికినా దొరకడిటువంటివాడు. చూడచక్కని అందాల సుందరుడు ఈ నా చందురూడు. నా స్వామి సొగసులు వర్ణించి సహస్రపదకుసుమాలనర్పించినా తనివి తీరదాయె. నేను జీవించే ప్రతిక్షణము అతని శ్వాసతో ఆచ్ఛాదితమాయె. నాలో నీవే నిండిపోయావన్న మధురభావమే నా ఈ కవితకు స్ఫూర్తియాయె. ఇదిగో ఈ మాలని నీ మాలగా మార్చుకున్న మహామాంత్రికుడివి నీవన్నది నిజమైపోయె. ॥మాలాచిదానంద్॥21-5-14||

by Mala Chidanandfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mXYpGB

Posted by Katta

ShilaLolitha Poet కవిత

కవిత్వం గురించి బివివి ప్రసాద్ గారు రాసిన కామెంట్ : నచ్చిన కామెంట్ ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: ".....కాస్త పెద్ద కవిత రాసినపుడల్లా అభివ్యక్తి పలుచన అయిందా అనిపిస్తుంది. కానీ, ఆ వస్తువూ, దాని ద్వారా ఇవ్వదలచిన అనుభూతీ అట్లా వచ్చినపుడు, బిగింపు కోసం అతిగా ఎడిట్ చేసినా, లేదా మరికొన్ని ఊహల్నో, పోలికల్నో జతచేసినా కవితలో ఉండవలసిన మౌలికమైన సౌకుమార్యం చెదిరిపోతుంది అనుకొంటాను. కవిత్వం రాసే అనుభవం ఏ కవికి ఆ కవిదే. ఒక సాంద్రమైన లేదా సుకుమారమైన అనుభూతినో, లోతైన ఆలోచననో అక్షరాల్లోకి మార్చే ప్రయత్నమే కవిత అవుతుంది నా వరకూ. రాసాక వెనుతిరిగి చూసుకొన్నపుడే ఈ కవిత శిల్పం, అభివ్యక్తీ ఇలా వచ్చాయి కదా అనిపిస్తుంది. కొన్ని బలమైన వ్యక్తీకరణలు స్పురించటం మాత్రం కవి సాధన చేసిన ఆంతరికశుద్ధి వలన, కవిలో మేలుకొన్న విశ్వ మానవుని వలనా సంభవిస్తుంది అనుకొంటాను. కవిత్వం సాధన చేయటమంటే అక్షర సాధన కాదనీ, వ్యక్తిత్వ సాధన అనీ అనిపిస్తుంది. ఆ వ్యక్తిత్వం కవి జీవితం మొత్తానికి చెందినదా, ఆర్ట్ వరకే పరిమితమా అనేది మరొక తరచి చూడవలసిన విషయం."

by ShilaLolitha Poetfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nesXqu

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఉభయకుశలోపరి// నడి వేసవిలో నీడలా ప్రయాణం మధ్యలో వాడు తారసపడతాడు ఒకటి వెనుక ఒకటి వెనువెంటనే గుక్కతిప్పుకోనివ్వక కుశల ప్రశ్నలు మొక్కుబడిగా కొన్నింటికి మరుగున దాగి కొన్నింటికి జవాబులిచ్చాను వచ్చినంత వేగంగా వాడెళ్ళెపోతూ మళ్ళీ వస్తానన్నాడు వాడిపోయిన వనంలా ఇప్పుడింక నావంతు వాడి కోసం ఎదురు చూస్తూ.....04.05.2014....21.05.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mXv7Iq

Posted by Katta

Santhisri Santhi కవితby Santhisri Santhifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R8soiH

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUj74B

Posted by Katta

Satya Srinivas కవిత

రొట్టమాకుల తెప్ప ఉదయం దీప స్థంభం పైన వాలిన పావురాళ్ళు గమ్యం నిర్దేశించుకున్నాయి ప్రయాణం ఆద్యంతం సరంగు పాటల్లాంటి కబుర్లు ప్రయాణపు బడలిక తీర్చిన ఆకాశ గంగ రొట్టమాకు వాగులో మజిలీ ఓ మోనోలిత్ చుట్టూ రాలిన ఎండుటాకుల మీద సహచరుల్మంతా పాదముద్రల దస్తూరిని వదిలి రెక్కలకు ఊరి మట్టి లేహ్యానద్దుకుని తిరిగి గూటికి చేరాం అప్పటికే నిశాచర రోడ్లకి వెలుతుర్లని పొదిగి పావురాళ్ళు నిష్క్రమించాయి మర్నాడు ఉదయం పసుపచ్చని ఆకుల్లా పావురాళ్ళు నగర గాలికి పచ్చిరొట్ట కబుర్లందించాయి నింగి పాదాలకి పారాణి రంగంటుకుంది తాజా తీర్మానం... ప్రయాణం గమ్యానికి, మొదటి, చివరి అడుగుల నడుమ అయిస్కాంతపు రేఖల గగనం రండి ఊరెండుటాకుల వ్యోమగామిలో పయనించి వద్దాం (రొట్టమాకు ప్రయాణంలో దారిపొడవున సహచరులైన వారందరికి) (21-5-17)

by Satya Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lP9kQk

Posted by Katta

Venugopal Rao కవిత

చందమామా నువ్వింకా చచ్చిపోలేదా ఆమె లేకుంటే నీతో నాకింకేమి పని ఆమే కదా చెప్పింది పున్నమి మంచిదని అందుకే నువ్వు నిండుగా వెలిగే రోజుకోసం నేనంతగా కళ్ళు కాయలు కాసేలా చూసింది వేంకటేశుని సన్నిధిలో ఆమె మెడలో నేను మంగళ సూత్రం కట్టినప్పుడు నువ్వు పైనుండి చూస్తూనే ఉన్నావుగా నీ వెండి వెలుగుల్లోనే కదా ఆమెలో నేను ఐక్యం అయింది నువ్వంటే తనకెంత పిచ్చి నాకెప్పుడూ అనుమానమే తను నిన్నా నాన్న ప్రేమించేది నేను తనకు తాజ్ మహల్ చూపిస్తానంటే ఇప్పుడొద్దు అన్నది, ఎందుకో అనుకున్నా నువ్వు నిండుగా ఉన్న రోజున నా ఒడిలో కూర్చొని తాజ్ ని చూస్తా అన్నది భద్రాచలం రాములోన్ని ధర్శించుకుందాం అంటే తాను వెన్నెల్లో గోదారినే చూస్తా అన్నది అంతలా ప్రేమించే ఆమెను ఎందుకు కాపాడలేదు వెన్నెల్లో నన్ను కలవాలనే కదా వస్తోంది మల్లెలు పెట్టుకున్న గులాబీలా ఆమె నడిచి వస్తుంటే చంద్రుని అందం తగ్గింధనా కన్నుకుట్టి ఆమెను ప్రమాదం లోకి తోశావు ప్రమాదంలో కూడా ఆమె నీవైపే చూస్తూ ఆనందంగా కన్నుమూసింది ఆమె లేని లోకంలో నువ్వేం చేస్తావు నువ్వెన్ని వెన్నెలలు కురిపించినా ఆస్వాదించే నా చెలి లేనే లేదుగా మరి నువ్వు ఉంది ఉపయోగం ఏముంది చందమామా.. నువ్వింక చచ్చిపో.

by Venugopal Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kofIQq

Posted by Katta

Chi Chi కవిత

_చోటంతే_ ముందున్నవి ముందరే వెనకున్నవెనకే.. తిరుగుతున్నాయ్ తిప్పుతూ ముందెనకల్లేనివి.. నువ్వాటి ముందో వెనకో తెలియకుండానే తిరుక్కొ!! ఈ గానుగలోపడి మొలుస్తూ పీనుగయ్యాక్కూడా తిరుక్కునే గమనం నీది స్థిరమై అస్తికలుగా!! ఆగమనమే లేని వెలుగుందిక్కడ ఆరిపోకుండా!! తెలుపుకాదు వెలుగంటే చీకటంటే నలుపే రంగుల్లేని వెలుగుతో రంగులన్నిటినీ రంగరించుకోడమే ఈ రంగస్థల బహిర్గత రంకు!! >మరి వెలుగంటే?? రంగస్థలానిది.. రంగులు కానిది ఏం లేని చోటులో వెలుగొందుతున్న వాటన్నిట్లో ఉన్నది..అంతే!! >ఏం లేని చోటా!!.. అంటే?? ఎలా ఉంటుందో చెప్పగల్గితే అదేంలేని చోటెలా అవుతుందిరా.. చచ్చుప్రశ్న చోటంతే!!_______________(21/5/14)

by Chi Chifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Si4RNw

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // రెండుగురం // నాకు నేనుగా కలిసిందీ కాదు. నువ్వు నన్ను పిలిచిందీ కాదు. అకస్మాత్తుగా, అనివార్యంగా. చూళ్ళేదని తప్పించుకోడానికి వీల్లేని ఒక క్షణంలో జరిగిందది. పేలిన మాటలు, జరిగిన గొడవ, తెగిన స్నేహం... ఒక రీల్ లా గిర్రున తిరగడం లాంటిదేదీ సంభవించలేదు. కనీసం నాకైతే. సందిగ్ధంలోనే ఒక అసంకల్పిత ప్రతీకార చర్యలా పలకరించుకోడం. దాన్ని దాటి ముందుకెళ్ళాలో లేదో తెలీని పునరాలోచనలో పడ్డం. మెదడులో ఉక్కపోత. మనసులో యుద్ధం మోత. తప్పుకుపోదామనే నిశ్చయం దిశగా. ఆ అడుగులు నీవా, నావా?! అంతలోనే తడబాటు, ఆలోచనల గ్రహపాటు. జరిగిందేదో జరిగిపోయిందన్న ఒక తేలిక వాతావరణానికి తెర తీస్తే... మరుక్షణం మనమెక్కడ?! మనదైన ఆరామంలో ఉన్నాం. ఆరాంగా ఉన్నాం. గతమంతా ఇప్పుడు కేవలం ఒక 'గ్యాప్'కం గా మిగిలున్నాం! 21.5.2014

by Mohan Rishifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ko9IqQ

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

////చల్లని తల్లి //// ప్రతి ఊర్లోనూ ఉంటుంది ఓ గ్రామ దేవత పాడి పంటలతో ఆరోగ్యాన్నిచ్చి దీవించే అమ్మ తల్లి పళ్ళూ, పానకాలతో నైవేద్యం తీసుకునే అమ్మ రూపం పండగ లప్పుడు వంటింటి మూలే ఆమె నివాసం చూడండి..మనూరి చల్లని తల్లి మనతోనే సిటీ వచ్చింది వంటింట్లో ప్రేమగా, ధీమాగా ఒదిగి కూర్చుంది పాలు, పెరుగు దాచి పెట్టి మనింటిని పాడిల్లు చేస్తుంది కూరా, నారా, పచ్చళ్ళతో అది అక్షయ పాత్రే అవుతుంది ఎమర్జెన్సీ మందులతో ఒక మెడికేర్ సెంటరవుతుంది పళ్ళూ, జా మ్, రసాలతో పళ్ళ తోటవుతుంది హిమాలయాలను సృష్టించి పిల్లలకి హిమ క్రీములిస్తుంది ఉద్యోగినుల చేత అతిధి దేవుళ్ళకు ఆతిధ్య మిప్పిస్తుంది మండు టెండలో మన సేద దీర్చే నట్టింటి కాశ్మీరం ఇల్లాలికి చేయూతనిచ్చే వంటింటి భండాగారం వంటలు స్టాక్ పెట్టుకుని ఇల్లాళ్ళను ఊళ్లకు పంపుతుంది చల్లని కూల్ డ్రింక్ లిచ్చి అందరినీ అమ్మల్లే అలరిస్తుంది మొక్కండి అప్పుడప్పుడూ ఈ ఇంటింటి చల్లని తల్లికి నమ్మండి నిర్భయంగా వస్తువునైనా దైవస్వరూపంగా తలిచి

by Gouri Lakshmi Allurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gki6b7

Posted by Katta

Arun Nallella కవిత

వీడ్కోలు పార్టి ఎంతో పున్యం చేస్తెగాని సిద్ధించని మానవ జన్మను తమ అంధమైన అనుభవాలతో ఆనందంగా మలిచే గురువుల్లార..!!!? గడిచిన గతానికి వీడ్కోలు చెప్పాలొ.? వడి వడిగా వస్తున్న భవితకు స్వాగతం పలకాలొ.? అన్ని తెలుసని ఏమితెలియని ఆలొచనల వలయంలో మీ అందరి ఆశిర్వాధాలె నాకు ఒక ఆశాకిరణం మీ కమ్మని మాటల్లొ తీర్చలేని జ్ఞానధాహం కన్నీటి పాటల్లొ కానరాని మౌన విరహం మీ సెవలే అందుకున్నాను సెదనే తీర్చుకున్నాను పది దశాబ్ధాల జీవితాన్ని పది వసంతాల్లో చూపించి మా భవిష్యత్తుకి దారిచూపిన ఆ.. జ్ఞానజ్యోతులకు ఇదే నేను అర్పించే వందన పుష్పాల కవితాహారతి******** **21.05.2014** అరుణ్

by Arun Nallellafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1odU6Xq

Posted by Katta

Aruna Naradabhatla కవిత

సాధికారం-స్వాధీనం ______________అరుణ నారదభట్ల ఊరేగింపుకు బయలుదేరిన ఉత్సవవిగ్రహంలా...పేరుకే నేను! కారుతున్న చెమటచుక్కలను కొంగుకద్దుకుంటూ ఏదో సాధించాలని ఆరాటపడతాను! సాధికారత పోరులో చింగు చెక్కుకొని కొంగు బిగించి అడుగులను వడివడిగా నాట్యమాడించాలని కలలు గంటాను...! వేసే ప్రతి అడుగూ నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానని అనుకుంటాను...పేరుకుపోతున్న దుమ్ము సాక్షిగా! క్షణకాలం తీరిక లేకుండా అలుపెరుగక నడుస్తూనే ఉన్నా...కానీ నెల ప్రారంభపు జీతం ...నెలాఖరు జీవితం... గమనిస్తే నా ఈ విప్లవం ముసుగు నిజరూపం తెలుస్తుంది! ఉద్యోగం చేసేది ఎవరో ఇప్పటికీ తెలియదు... చేతిఖర్చులకు చేయిచాచినప్పుడల్లా ఈ జీతం...జీవితం మరోసారి వెక్కిరిస్తుంది...నేను భరిస్తున్న శ్రమదోపిడి వైపు చూసి! సంపాదనలో సమానత్వాన్ని ఆహ్వానించిన మనసు చూసుకునే బాధ్యతలనీ సమంగా పంచుకుంటుందా...!?! మంచినీళ్ళూ...మురిపాలూ అన్నీ చేతికందించనిదే ముద్ద గొంతును దాటదు! ఇక రాజకీయమైతే సరేసరి! నిలబెట్టేది నన్నూ...ఏలుకునేది నువ్వూ! పెద్దరికంగా తెల్లకాగితంపై నల్లగీతలా సంతకం నాదే....సమ్మతి మాత్రం నీది! ఎలాగైతేనేమి నా ఆర్థిక స్వాతంత్రం నీకు పరిపూర్ణ స్వేచ్చనిచ్చింది! సంపాదించినా ఇంటికి ఇచ్చే పని లేదు... వ్యసనాలకు కొదవ లేదు! లెక్కలడిగి ఎదిరించేవారూ లేరు! స్వేచ్చా నీ జన్మ హక్కు... నిన్ను పెంచిన తల్లినీ నేనే... లాలించిన ష్త్రీమూర్తినీ నేనే! నీ అవసరాలకు నలుగుతున్న నాయికనూ నేనే! సమానత్వం....సాధికారం అన్నీ కూర్చుని కబుర్లు చెప్పినంతవరకే... లోపలంతా పాతప్రపంచమే! ఎదురీదితే అన్నీ అనుమానాల దుప్పట్లే ... వొంటినిండా చుట్టుకున్న పరువును... కలుషిత పదజాలంతో కాలరాచే కలిపురుషుడవు..... ఆత్మాభిమానంపై దెబ్బతీయడమే నీకు తెలిసిన చివరి అస్త్రం... మాటలతో లొంగదీయడం నీ అభిమతం... అందుకేనేమో విరుచుకుపడుతున్న విప్లవంలా ఆడతనం... సంస్కృతీ...సాంప్రదాయాలకు స్వస్తి చెబుతుంది... స్వేచ్చగా బతకడానికి పిడికిలి బిగించింది! ఈరోజే అంతం కాకపోయినా..... శిశుపాలుడూ కృష్ణుని చందానా తప్పులను జమచేస్తూనే ఉంది! అరాచకం కాలగర్భంలో కలిసేవరకూ... అలుపెరుగక పయనిస్తూనే ఉంది... ఆడతనం ..అమ్మతనం పక్కన బెట్టిన అగ్ని కణం! 21-5-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ndGFK7

Posted by Katta

Katta Srinivas కవిత

ఆకర్షించిన వార్త : కవిత్వం కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందా? అవుననే అంటున్నారు ఇంగ్లాండులోని దక్షిణ యార్క్ షైర్ లో వున్న షెఫిల్డ్ విశ్వవిద్యాలయం ప్రోఫెసర్ మరియు అనేక అవార్డులు గెలుచుకున్న కవి Simon Armitage. వీరు రాసిన Praise of Air అనే కవితను ఫోటోలో వున్నట్లు అది పెద్ద సైజులో అంటే 10 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు వుండే ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారుచేసిన పేపరుపై పద్యాన్ని వేయించారు. ఈ కాగితాన్ని రద్దీగా వుండే రోడ్డు పక్కన వున్న వారి Sheffield విశ్వవిద్యాలయం గోడలకు అతికింపజేసారు. అయితే ఈ కాగితం కాలుష్య హరణ పదార్ధాలతో పూతపూయబడివుంటుందట అది గాలిలోని టైటానియం డైయాక్సైడ్ పదార్ధాన్ని తినేస్తుంది. దానికోసం వేరే కరెంటు, బ్యాటరీలూ వాడటం కాకుండా కేవలం సూర్యరశ్మి, గాలిలోని ఆక్సిజన్ ను మాత్రం వినియోగించుకుంటుందట. ఈ పోస్టరు తయారీకి 100 యూరోల లోపుగానే ఖర్చయ్యింది అంటున్నారు. దీని కెపాసిటీ రోజుకి 20 కార్లనుండి వెలువడే కాలుష్యాన్ని హరించేంత. ఒక సంవత్సరం పాటు దీనిని యూనివర్శిటి గోడలపై ఇలాగే ప్రదర్శించేలా ప్రణాళిక రచించారట.ఇంతకీ సైమన్ ఆ కాగితం పై రాసిన కవిత ఏమిటంటే ఇది. ► Simon Armitage || A poem for the poster || I write in praise of air. I was six or five when a conjurer opened my knotted fist and I held in my palm the whole of the sky. I've carried it with me ever since. Let air be a major god, its being and touch, its breast-milk always tilted to the lips. Both dragonfly and Boeing dangle in its see-through nothingness… Among the jumbled bric-a-brac I keep a padlocked treasure-chest of empty space, and on days when thoughts are fuddled with smog or civilization crosses the street with a white handkerchief over its mouth and cars blow kisses to our lips from theirs I turn the key, throw back the lid, breathe deep. My first word, everyone's first word, was air. కవిత్వాన్ని పర్యావరణం కోసం వినియోగిస్తున్న క్రియేటివిటీ భలేగా వుంది. అదే యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ఈ ప్రాజెక్టుని గురించి చెపుతూ ‘‘ కళా,శాస్త్రం మధ్య ఈ తమాషా జోడింపు చాలా ప్రధానమైన ప్రమాదకరమైన సమస్యను సమర్ధవంతంగా ఎత్తిచూపగలుగుతోంది.’’ అన్నారట నిజమే కదా? ................... (భరత్ రావు మాస్టారు గారికి ప్రత్యేకధన్యవాదాలతో...)

by Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jBPkDC

Posted by Katta

Sriarunam Rao కవిత

కామం అనేది ఇద్దరు స్త్రీపురుషుల మధ్యన జరిగే ఒక మనసిక కళగా చెప్పిన వాత్యాయనుని కామసూత్రన్ని గౌరవించండి. జీవితంలోనే అలౌకికమైన అనుభూతిని అందించే కామరహస్యాన్ని అర్ధం చేసుకోండి. ప్రేమతో నిండిన ముద్దు కూడా నీకు జీవిత కాలం ఆనందించగలిగే అనుభూతిని అందిస్తుందన్న సత్యాన్ని, అనుభవపూర్వకంగా చెబుతున్నా నమ్మండి. "వస్తాను నాకోసం చూస్తుండు" అని నా ప్రేయసి నాతో చెప్పిన ప్రేమ పలుకులే, నా ఊహలతో ఆశలై.. నాకు కవిగా గొప్ప అనుభూతులను అంధించగలిగాయి. ఇక ఆమె నా కౌగిళిలోకి వస్తే...అంతకంటే కామం నాకు ఏ దేవుడివ్వగలడు? అదే మీ ఆశ కావాలి కామసుఖం కొరకు. వాంఛనీయమైన శృంగారానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి వివాహం. రెండు... నీకోసం ఏదైనా చెయ్యగల తోడుని అందించగలిగే ప్రేమ. ఇవిలేకుండా పొందే కామం... కేవలం అవసరం లేదా వ్యాపారం అంతే. అది మనిషికైనా పశువుకైనా ఒకటే. అలాకాకుండా... సంద్రపు ఇసుక తిన్నెలపై... పౌర్ణమి అందాన్ని వీక్షిస్తూ... కెరటాల నీటితుంపరలు చల్లచల్లగా పలకరిస్తుంటే... గాలికూడా దూరనంతగా బిగికౌగిళి బంధించివేస్తూండే అధ్బుత క్షణాలను అనుభవించి చూడండి. ప్రేమ మాత్రమే నిండిన రెండు అరసున్నలవంటి స్త్రీపురుషుల శరీరాలూ ఆత్మలూ సంగమిస్తుంటే... అలాంటి కామంకోసం ఆనందంగా చచ్చిపోవాలన్న ఎదురెళ్ళమూ. నా "అంతర్ భ్రమణం"పుస్తకం నుండి శ్రీఅరుణం 9885779207

by Sriarunam Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mVN9L1

Posted by Katta

Rajender Kalluri కవిత

## గమ్మత్తు జీవితం ## నడిచే పడవలోకి హటాత్తుగా దేవుడు మారు వేషంలో ప్రత్యక్షమయి ఆ పడవ లో ఉన్న వ్యక్తుల్ని అందర్నీ ఇలా అడిగాడట నీ జీవితంలో నువ్వేం నేర్చుకున్నావ్ ? అని అప్పుడు ... పడవలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెప్పాడట " నేను జావా , సి ++ లు నేర్చుకున్నానండి బాగా డబ్బులు సంపాదిస్తున్నాను " అన్నాడట అదే పడవలో పక్కనే ఉన్న ఓ విలేఖరి ని అడిగితే " అబద్దాన్ని ఎలా అమ్ముకోవాలో నేర్చుకున్నానండి అప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది అని తెల్సుకున్నాను" అన్నాడట అలా ఆలోచిస్తూ పక్కనే ఉన్న ఓ ఇరవై ఏళ్ళ అబ్బాయిని అదే ప్రశ్న అడిగితే చెప్పడట " అమ్మాయిల్ని ఎలా కెలికితే మన దారికోస్తారో నేర్చుకున్నాను సర్ " అని చివరగా మిగిలిన పడవ నడిపే వ్యక్తి దగ్గరికెళ్ళి అడిగాడట, అప్పుడతను .... " నాక్ సి , సి++ లు రావు సామి, డబ్బులు బా ఒస్తే బావుండును అని ఆశైతే ఉంది గాని , అమ్మా అయ్యని దూరం చేసే డబ్బు నాకొద్దు . అబద్దాన్ని ఎలా అమ్ముతారో తెల్సుకోలేని ఎర్రి బాగులోన్ని సామి. ఆళి మీద అరుస్తా ఉంటాం గాని ఆడోల్లని గౌరవిస్తాం సామి మేము , సిన్నగా సెప్పాలంటే ఉన్న దాంట్లో సద్దుకుపోయి తృప్తిగా సిగ్గుతో బతకడం నేర్చుకున్నా సామి " అన్నాడట అదంతా విన్న దేవుడు ... " చదువుకుంటే జ్ఞ్యానం పెరుగుతుందన్నాను , కాని వీళ్ళను అజ్ఞ్యానం ఆవహిస్తున్దనుకోలేదు. అవకాశం మంచితనాన్ని పెంచుతున్దనుకున్నాను,కాని మానిషి అసమర్ధత ని పెంచుతున్దనుకోలేదు . యువత ఈ దేశానికి వెన్నముక అవుతుందనుకున్నాను కాని విరిగిన ఎముకలా మారుతున్దనుకోలేదు." మత్తులో ఉన్నా సరే , గమ్మత్తు జీవితం ఐనా సరే , ఆ పడవ నడిపే వాడే నయం మనుషుల్ని మనుషులుగా చూడలేని ఈ వింత జంతువుల మద్య దేవుడితో సగటు మనిషిని పోలుస్తున్నాడని సంతోషించి . అలా అర్ధం కాని సందేహంతో అజ్ఞ్యానంలో బ్రతుకుతున్న అమాయకుల్ని చూసి జాలి పడుతూ , బాధ పడుతూ వెళ్ళిపోయాడట ! " Dignity is not based on Degree & Good Designation doesn't need any Degree " kAlluRi [ 21 - 05 - 14 ]

by Rajender Kallurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1thX4fO

Posted by Katta

Srikanth Kantekar కవిత

రోజూ తప్పిపోతుంటాం ఆలోచన దారుల్లో ఏ విషయంలోకి వివరంగా వెళ్తామో ఏ అనాసక్తి పట్టీపట్టి నెట్టుకుపోతుందో కాసిన చెట్టు మీదే రాళ్లు పడ్డట్టు కుదుపుతున్న ఆలోచనల అలజడి మనసుకింత ప్రశాంతత కావాలిప్పుడు ఎత్తుపల్లాల ఎదురుదారిలో బతుకుబండి పయనం గజిబిజితనాల్లో గడిచిపోతుంటే కాలమెక్కడ దారితప్పుతుందో ప్రేమించినది దొరకదని.. ఆశించుట భంగపాటు కొరకని తత్వమెప్పుడూ చెప్తుంటుంది! ధిక్కరించు.. సమాజమెప్పుడు నీకు నచ్చినట్టు ఉండనివ్వని సిద్ధాంతమే సత్యముందని నమ్మి.. ఆచరించి దాని కొన అంచు అయినా పట్టుకొని ముందుకేవెళ్లు.. బతుకుబాటలో బెంగటిల్లుతామో..బెజారెత్తుతామో గుండెధైర్యం సడలిపోతే కిందామీదా అయిపోయి సంక్షోభించుకుంటామో ఏదేమైనా ప్రవాహానికి ఎదురీదాలి ప్రవాహంలా ముందుకే డొల్లిపోతూ.. కెరటం వెన్నుతట్టి.. తీరం గురిగా ప్రతిసారి సంధిస్తూనే ఉండాలి - శ్రీకాంత్ కాంటేకర్ date: 20/5/14

by Srikanth Kantekarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1thX3bF

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//వైపరీత్యం//13 ************************* ఏమిటీ వైపరీత్యం తనకష్టాన్ని తలచుకొని కుమిలికుమిలి దు:ఖించే మనిషి సాటివాడిని నిర్ధాక్షిణ్యంగా ఎలాచంపగలుగుతున్నాడు ఎంత దుస్సహం సమస్తాన్నీ శాసించగలిగే మనిషి తోటివాడి అకృత్యాలనుమాత్రం నిరోధించలేకపోతున్నాడు ఏమిటీ చోద్యం ఎదుటివాడి చిన్నపొరపాట్లనూ నానాయాగీ చేసేమనిషి తనలోని తప్పిదాలను కప్పిపుచ్చుకోచూస్తున్నాడు చివరికి మనిషికన్నీటికి కూడా ఎంత పక్షపాతం తనచిన్న ఆపదకూ కడవలకొద్ది ప్రవహించే కన్నీరు సాటిమనిషి పెనువిషాదంలోకూడా ఒక్కబిందువైనా రెప్పగడపదాటదేం? ****** 21-5-2014(నేడు ఉగ్రవాద వ్యతిరేకదినోత్సవం)సందర్భంగా...

by Aravinda Raidu Devinenifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oddYdo

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వ ........... పుట్టుక మన చేతుల్లో లేని వాళ్లం కొట్టుక చావాల్సిందే .................................. 'వాధూలస'21/5/14

by Rammohan Rao Thummurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qSLgTF

Posted by Katta