పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఏప్రిల్ 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

My poem at saranga http://ift.tt/1juBWig ప్రాణం ----- నేను చూసాను గూటి నుండి కింద పడి పగిలిన ఓ పక్షి గుడ్డుని అందులో నుంచి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న మాంసపు ముద్ద గర్భస్రావమైనట్టు దానికి ఆసరా ఇస్తూ చేతులు చాపిన మట్టి దేహం తనలోకి దిగమింగడానికి ప్రయత్నిస్తూనే ఉంది రాలిపడ్డ రక్త మాంసాలను మిగిలిన కొన్ని శకలాలు వాటంతట అవే ఆకాశంలోని కొన్ని అంచులను తాకుతున్నాయి ఇప్పుడిప్పుడే నేను చూసాను మళ్ళీ పసికందు ఆత్రాన్ని ఓ కీచు శబ్ధాన్ని తల్లి రొమ్ములో కుతిక నింకున్న ఓ జీవాన్ని ఆబగా దప్పిక తీర్చుకుంటున్న కణాన్ని నేను చూసాను దేహ ప్రక్షాళన గావిస్తున్న ఒక పదార్థాన్ని పరాన్న జీవి దశ నుండి పరిణమం చెందిన గుండెరెక్కల చప్పుళ్ళను ఇంకా కంటూనే ఉన్నా రాలిపడుతున్న కొన్ని మాంసపు ముద్దలను నా కళ్ళనుండి నెత్తురు ఉబికినప్పుడల్లా.. తిలక్ బొమ్మరాజు

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1juBWig

Posted by Katta

Chi Chi కవిత

(9/4/14) _ అక్కడ _ పరికించదు ఏదీ పనికొచ్చేరానీ ముట్లని!! సత్యం సత్తువెంతో కొలిచే పరికరాల కోసం వెతికే పెత్తందారీతనమేదో పెత్తనమే లేకుండా సర్వాన్నికిలిస్తోంది సందే లేకుండా!! నవ్వే నవ్విస్తోంది..బాధే బాధిస్తోంది..మోహమే మోహిస్తోంది శూన్యమే శూన్యిస్తోంది..సర్వమే సర్విస్తోంది!! మోసం మొరుస్తుంటే , భారం భరిస్తోంది నాశనం నశిస్తోంటే , శ్యామలం శాసిస్తోంది ప్రకృతి నాట్యమాడే వేదికంతా మువ్వలెగురుతూ చేయించే ఆలస్యం మౌనమైతే మువ్వలే ప్రకృతై..మౌనమే వేదికై!! మరిక్కడ?? >ఇక్కడంటే ఇక్కడే.. అక్కడే ఇక్కడ అక్కడే ఇక్కడైతే అక్కడిక్కడనేది ఎవరిక్కడ?? >am loving this or that..దొబ్బెయ్ ముందు నువ్వు ఏ కలలో ఉన్నావో చెప్పు > ఏదో ఎర్రిపూ.. కలలో ఉన్నా!! నీకెందుకురా?? నీ కలాయోమయంలో ఉన్నా..కలలై ఉన్నా కలా నిజమై ఉన్నా..అందుకే మళ్ళీ అడుగుతున్నా ఏ కలలో ఉన్నావో చెప్పు?? >కల నిజాల మధ్య ఊహలోనో , నిద్రలోనో , మెలకువలోనో కలలోనో , నిజంలోనో అర్థమయినా కానట్టున్నా నేను నిన్ను తగుల్కున్నానో , నువ్వు తగుల్కున్నావో కూడా తెలీకుండా ఉన్నా అందుకే ఇలా అడుక్కుంటున్నా నీకు అర్థమయితే నువ్వైపోయి నేనుండను నేనున్నంత వరకు నీకు అర్థమవదు నేను నువ్వైపోవాలి..లేదా నువ్వు నేనైపోవాలి అప్పుడే అక్కడిక్కడైపోతుంది!! >అర్థమయిపోయింది..అయిపోయాం ఉన్నావా , పొయ్యావా.. అయిపోయావా?? lol దొబ్బెయ్ రా >

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1htkv32

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

రచయితలు తమ ముద్రిత గ్రంథాలను అమ్ముకోవడం ఎలా? 1. మొదట ... ముద్రణకు ముందే రచయిత నిష్పక్షపాతంగా ఆ గ్రంథానికి ప్రచురణ అర్హత ఉందా? .. లేదా? ... అని బేరీజు వేసుకోవాలి. రచనలో పటుత్వం ఉంది ... నలుగురికీ నచ్చుతుంది ... అనుకొంటేనే పెట్టుబడి పెట్టాలి. ముద్రణ సమయంలో గ్రంథం కాస్ట్ ప్రైజ్ కన్న ధర నాలుగింతలు ఎక్కువగా ముద్రించాలి. "గ్రంథం లభించే చోటు" అంటూ - స్వీయవిలాసంతోబాటు కొన్ని వివిధ నగరాల, జిల్లాలలోని ప్రసిద్ధ బుక్ షాపుల అనుమతితో, వారి వారి చిరునామాలను కూడా ఆ గ్రంథంలో ముద్రించాలి. 2. గ్రంథావిష్కరణ రోజు 'సగం ధరకే' అని ప్రకటించి, అమ్మడం వలన కొన్ని అమ్ముడు పోతాయి. లేదా "కొత్త పుస్తకం కొంటే కొన్ని పాత పుస్తకాలు (అమ్ముడు పోనివి) ఉచితం" అని ప్రకటించడం మరొక పద్ధతి. ఇలా బోణీ కొట్టవచ్చు. 3. తరువాత సమీక్షలు వివిధ పత్రికలలో వచ్చాక, కనీసం ఒక పది ఊళ్ళ నుండి గ్రంథం పంపమని లేఖలు వస్తాయి. వారికి “సగం ధరకు, ఇంకా పోస్టేజ్ ఫ్రీగా పంపుతాము” అని ... “డబ్బును ఎం.ఒ. చేయ”మని కార్డు ముక్క వ్రాయాలి. అలా కొంతమందికి అమ్మవచ్చు. 4. ఆ పైన తక్షణం డబ్బును ఆశించకుండా, గ్రంథంలో ముద్రించిన బుక్ షాపులలో 50 ప్రతుల చొప్పున ఉంచాలి. ఒక సంవత్సరం తరువాత తీరుబడిగా వెళ్ళి, అమ్ముడు పోయిన గ్రంథాల డబ్బును (ఆ షాపు వాళ్ళ కమీషను పోను మిగిలింది) తెచ్చుకోవచ్చు. 5. వివిధ నగరాల, జిల్లాల, గ్రామాల, విద్యాసంస్థల గ్రంథాలయాలకు వెళ్ళి కొన్ని ప్రతులను అమ్ముకోవచ్చు.(సాధారణంగా 40% డిస్కౌంటుతో) 6. కొన్ని కళాశాలల, పాఠశాలల ప్రిన్సిపాళ్ళ అనుమతితో తెలుగు పండితులకు, ఉపాధ్యాయులకు, సాహిత్యాభిరుచి గల విద్యార్థులకు కొన్ని ప్రతులను అమ్ముకొంటే కొంత డబ్బు వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపాళ్ళకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ఇచ్చి ప్రసన్నం చేసుకొని, విద్యార్థులకు 'సగం ధర' అంటే చాలా డబ్బే మూటగట్టుకోవచ్చు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను సంస్థ సిబ్బంది మరుసటిరోజు పుస్తకం కొనుగోలుకై డబ్బు పట్టుక రావాలని శాసించిన సందర్భాలు కూడా లేకపోలేదు. 7. వివిధ సాహిత్య సభలలో, ఎగ్జిబిషన్లలో, బుక్ ఫేర్ లలో పెట్టే పుస్తక విక్రయం స్టాళ్ళలో వాళ్ళ కమీషన్ రేట్ల ప్రకారం ఒప్పుకొని ఉంచితే, కొంత డబ్బు వస్తుంది. 8. వివిధ పురస్కారాల వివరాలు తెలుసుకొని పంపితే, బహుమతి లభించే స్థాయి ఉంటే, పెద్ద మొత్తమే చేతికందుతుంది. 9. రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయాల కొనుగోళ్ళ ప్రకటన ఎప్పుడు వచ్చేది కాస్త గమనించి, అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా మంచి మొత్తమే లభిస్తుంది. 10. చివరగా .. బంగారు కోడిపెట్ట వంటిది 'రాజా రామమోహనరాయ్ ఫౌండేషన్' వారి ప్రకటన! అది ఎప్పుడు వెలువడేది గమనించి అప్లై చేస్తే .. సెలెక్టైతే .. కాస్త ఆలస్యంగానైనా చాల పెద్ద మొత్తమే మన అకౌంటులో వచ్చి పడుతుంది. 11. ఈ మధ్య 'కినిగె ' వంటి సంస్థలు ఇంటర్నెట్ ద్వారా కూడా పుస్తకాలు విక్రయిస్తున్నారు. వారిని కూడా సంప్రదించవచ్చు. కొంత లాభం ఉండవచ్చు. అయితే వీటన్నిటిలోకి ప్రధానమయినది - నా 1వ సూచనే! పటుత్వ రచనను ముద్రించిన ఏ రచయిత కూడా - లాభం పొందినా .. పొందకపోయినా..., నష్టపోడని మాత్రం కచ్చితంగా చెప్పగలను. --- &&& ---

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kLnd1O

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | In search of the miracle called truth | ఎంత చదివినా అర్ధం కానీ తత్వాలలో విలువలు పట్టుకొని వివేకానికి అతుక్కున్న వర్చ్యువల్ పొరలలో నుండి రియాలిటీ అంచనాల కర్మల సిద్ధాంతం భళ్ళున పగిలే ఉదయపు ఎండల్లా కళ్ళలో బలంగా గుచ్చుకొని నవ్వుతుంటే అనార్కలి డిస్కో యాత్రల ఆది భౌతిక ఫలాలు అందుకోవటానికి ఆరాటపడే అసమర్ధుని జీవన నౌక పరిపుర్ణంగా అపరిపూర్ణత్వాన్ని సంతరించుకొని జాడలు దొరకని నీడలా తీరం కోసం వెతుక్కుంటుంది మీన్ వైల్ ఆటలో పావుల్లా కామపోరాటాలు ఉత్పత్తి చేసే మిగిలిన దురదృష్టపు శరీరాలన్నీ తీరపు ఆవలి అంచులు కనపడక ఎవరికీ కాని స్వార్ద ఆలోచనల లవ్లీ ప్రపంచంలో గమ్యాలు అన్ని సత్యం శివం సుందరాలే దారులే గందరగోళంగా భూగోళం కి రెప్లికాలా ఉంటాయని నమ్ముతూ , వాదిస్తూ .... ఒకే అక్షం లో ఊపిరిఆగేదాక ఎటేర్నిటీ మిస్టరీలు చేధిస్తూ తీరని దాహాల అనుభూతిని ఆస్వాదిస్తూ రాండమ్ గా పాలపుంతలో అవసరం లేని దుమ్ముకణాల్లా బ్రతికేస్తూఉంటాయి . మోరల్ యే వాదం అయితే ఏమిటి ? జిందా హు మై అనుకుంటూ ఎవరి చలి సమాదుల్లో వాళ్ళు వెచ్చగా ముడుచుకొని పడుకోవటానికి ? నిశీ !! 09/04/14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ixkF5P

Posted by Katta

వెంకట చలపతి బాబు కూరాకుల కవిత

కూరాకుల వెంకట చలపతి బాబు ||కళ్యాణం|| తాటాకు పందిర్లు.. ముతైదు సందడ్లు.. మామిడాకుల తోరణాలు.. అనుబంధాల పెళ్ళికి ఇవే అంకురార్పణలు.. కళ్యాణ వేడుకను కన్నులారా తిలకించుటకై విచ్చేయు బంధుజనాలు.. కన్నె పిల్లల కళకళలు.. కొంటె పిల్లల అల్లర్లు.. చంటి పిల్లల ఆట, పాటలు.. కళ్యాణ వేడుకకు కమనీయ సాక్షాలు.. ముత్యాల పందిరిలో, రత్నాల పీటలపై, వజ్రాల వధువును చూచి వెన్నెలే చిన్నబోయేనో..? మరో సీతమ్మ అని మూరిసిపోయేనో..? వరుడేమో రామయ్య తనకి సాటి వేరెవరు లేరయ్య తన మేనుసొగసుకు నెలరేడు కూడా నిలవలేడయ్య.. చూడచక్కని జంటని చూచి జామురాతిరి వెలుగును పంచేను తన్మయంతో జోల పాటను మరచేను.. బ్రహ్మలోక ప్రాప్తికోసం మామ చేసేను వరునకు దానం అదే "కన్యాదానం" తన వంశాభివృద్ధికై వరుడు గ్రహించేను "పాణిగ్రహణం" 'గృహ్ణామితే సుప్రజాస్త్వాయ హస్తం మయావత్య జరదృష్టిర్య దాసహ' దాంపత్యము కలిసి మెలసి ఉండవలెనని తెలుపుటకు జీలకర్రబెల్లము.. ఇదియే శుభయోగము.. ఇదియే శుభముహుర్తము.. మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా! కంఠే బధ్నామి సుభగే! త్వంజీవ శరదాం శతమ్!! కొంటె చూపుల నడుమ కొంగు కొంగు కలిపి ఏడుజన్మల బంధం ఏడు అడుగులతో మొదలై ఏకతాటిగా నడపగా వేసేరు సప్తపది.. నిశ్చల మనస్సుకై దృవ దర్శనం.. ముతైదు తనానికై అరుంధతి వీక్షణం.. కన్నవారు ఒకవైపు.. కడదాకా తోడు నిలిచేవాడు మరోక వైపు.. నడిమధ్యన కళ్యాణ కన్యకకు కన్నులారా కారేను బాధానంధ భాష్పాలు.. ఇవీ ఎవరు వర్ణింపలేని దృశ్యాలు.. 09-04-2014 //మా అక్క పెళ్ళికి నేను ఇచ్చిన చిరు కవిత

by వెంకట చలపతి బాబు కూరాకుల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hsn1GG

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి ||వర్షపునీటి బొట్లు|| ప్రేమను ప్రదర్శిస్తున్నాయేమో అని .... ఆడుకోవాలని ఆరాటపడి, వర్షపునీటి బొట్లు కొన్ని .... నీ ముఖంపై నర్తిస్తూ, ప్రేమోద్వేగ సమయాల్లో .... నా వేళ్ళ కదలికల లా చినుకు, చినుకూ పెరిగి, ఒక్కో చినుకై రాలి .... కొంటెగా బుగ్గపై సొట్టలను చేరి .... తియ్యని పెదవుల సరిహద్దుల్లో ఆనందం అమృతం కురిసినట్లు 09APR14

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hsfFTF

Posted by Katta

Sravana Saineni కవిత

"శ్రవణ సాయినేని" "వాహ్...తాజ్" తాజ్ మహల్ గొప్పప్రేమకు చిహ్నం ------------- -------------------- పండు వెన్నెల ముసుగులో తాజ్ ముంగిట ప్రపంచాన్ని తప్పించారు అందమైన ఒక ప్రేమ కావ్యపు దారుల్లోకి ------------- ------------------ వెన్నెల రాత్రుల్లో కాదు ఒక్క సారి ఎర్రటి ఎండలో నిల్చొని చూడండి ఒక పురాతనమైన చెమట చుక్క మెరుపు కనిపిస్తుందక్కడ ------------- -------------------- ఆకలి పునాదుల మీద కట్టిన ఏ మాన్యుమెంటును చూసినా బిగించి ఎత్తిన రోజుకూలీ పిడికిల్లా అనిపిస్తుంది ------------- -------------------- ఎన్ని గరుకు చేతులు నిమిరితే ఇంత నునుపు తేలిందో ఈ కట్టడం ------------- -------------------- ప్రతి సాయంత్రం ఇక్కడ గుభాలించే అత్తరు ఆవిర్ల వెనుక ఎన్ని చెమట చుక్కల పరిమళాలున్నాయో ------------- -------------------- పాలరాతి బరువుల కింద కోటి ఆశల పాలబుగ్గలు ఎన్ని చితికిపోయాయో ------------- -------------------- రాళ్ళ పాలైన రత్నాలన్నీ అన్నం మెతుకులుగా మారిన చారిత్రాత్మక సందర్భం ------------- -------------------- ఆకలిని ప్రేమించేవాడికన్నా గొప్ప ప్రేమికుడు ఎవడుంటాడు ----------------- ------------------- అన్నం కలుపుకున్నంత అపురూపంగా పాలరాళ్ళను పేర్చి వుంటారు అందుకే తాజ్ కంత అందం ------------- -------------------- నేనైతే తాజ్ మహల్ కంటే అన్నం ముద్దే అందంగా వుందంటాను ------------- -------------------- అవును తాజ్ మహల్ గొప్ప ప్రేమకు చిహ్నం --------- తరతరాలుగా ఎండిపోయిన డొక్కలకు రొట్టె మీద ఉన్న ప్రేమ అది ---------------- ------------------- వాహ్ ....తాజ్. ------------------- --------------------- 9-4-14 (వెన్నెల రాత్రుల్లో తాజ్ మహల్ సందర్శనకు అనుమతిచ్చినప్పటి ఒక పాత వెన్నెల్లో తాజ్ ఫోటో చూశాక ..... )

by Sravana Saineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hsfFD7

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ సర్వే జూదంలో @ ఎన్నికల పరుగు పందెం లో నాయకులూ గెలుపు ఓటముల సర్వే జూదంలో మాధ్యమాలు. విషయమేమంటే వాళ్ళిద్దరికీ పెట్టుబడి దారుడొక్కడే _ కొత్త అనిల్ కుమార్. @ ఆ బారం @ గెలిచినా నాయకుడొకడు అనుచరుల భుజాలపై కెక్కి హంగామా చేస్తున్నాడు ఇక,ఆ బారం మోసే పాపం ప్రజలేదే. _ కొత్త అనిల్ కుమార్.

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hgyMyW

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి|| మనవిజేసుకునేది..|| మాటల ఐస్ క్రీం ఎందుకు కరిగిందని అమాయకంగా అడుగుతున్నావు నీ చేతుల వెచ్చదనానికి తెలుసులే ఆ వివరం ఎగిరెందుకు పోతున్నావని నిలదీస్తున్నావా! నువ్వెత్తిన గాలిపటాన్నే నేను గట్టిగా లాగుతున్నావేమో నమ్మకాల తాడు పురులు విడుతుంది చూడు అడిగిందే అడగకు విన్నదే వినాల్సొస్తుంది నువ్వు మనసు ముసురు తరమడానికి కొత్త సుప్రభాతాన్ని ఎలా రాస్తాను! అప్పుడలా ఎందుకన్నానా! చీకటి చుట్టబెట్టుకుంది నన్ను నిన్ను కాదు..ఉషా కిరణాల ఆలస్యానికి మంచు దుప్పటిని తిట్టుకుంటున్నాను ఎద మలుపుల్లో నువ్వుకాక ఇంకెవరు నీ రూపం నిండిన కళ్ళకు చీకటి కనపడదు ఎందుకింత ఆలస్యమన్న మన తొలిపరిచయానికి సమాధానం దొరకనేలేదు ఓ రోజా పువ్వా! ఇంకేమి చెయ్యగలను నీకోసం నువ్వుకోరినట్టే ఉండాలని గుండె గువ్వ నీముల్లుకే గుచ్చుకుని వేలాడుతోంది చూడు నిలబడ్డ నిజమే మన ప్రేమ కధ నెత్తురేమైతేనేమిలే కన్నీరుని చులకన చేయకు చిలికిన గుండెలో చిందేదేదైనా చివరకు మిగిలేదేదో నీకు మాత్రం తెలియదా ఎన్నిసార్లు పలికినా అది నిన్నేకదా! ==9.4.2014==

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kKfalP

Posted by Katta

ShilaLolitha Poet కవిత

సముద్రఘోష ఎడారులుఒకప్పటి సముద్రలేనేమో ఎడారుల్లోని నత్తగుల్లను చెవి కానిస్తే సముద్రమై ఘోషిస్తుంది నత్తగుల్ల ఘనీభవించిన సముద్రానికి ప్రతీక నత్తగుల్ల విన్పించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారతాను సముద్రమే నా గమ్యం నత్త గుల్ల నినదించే హోరు సారాంశం ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుల్ల విన్పించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n2UqXN

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//విరామం// నేనొక పగలు బాకీ అని నీదొక జ్ణాపకం మిగులని తెలియదు నాకు బాల్యం బయటకి రాని ఒక రోజు నీతో ఆడుకోవటానికి వస్తానని మాట ఇచ్చానా ఏంటి... దా, అనగానే పొట్త ఎక్కి పండగైన చిదిలాస్వీ! నవ్వగానే నవ్వాలని మనకిద్దరికే తెలుసు ఎనిమిది నెలల నీబాష ముప్పయ్ తొమ్మిదేండ్ల నుంచీ నాది తెల్లనిబాష నీదీ నాదని మనకిద్దరికే తెలుసు నిదుర రాని ఆట నీది వెళ్లక తప్పని నడక నాది వింతల కోసం విహరిస్తూ చింతలు లేని లోకాన్ని విస్మరించా ఆయుస్సు పోసే జ్ఞాపకాలు నీవై ఎదురొస్తాయని తెలియదు నేను మాత్రం నీ బాకీ తీర్చలేదు మళ్లొక రొజొస్తాను ఆటలు మాటలు, నవ్వుల కోసం వెదుక్కొంటూ.....09.04.2014. (ఎంతసేపు ఆడుకున్నా తనివి తీరని మా మేనత్తగారి మనవరాలికి ప్రేమతో....)

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lJFY73

Posted by Katta

Satya Srinivas కవిత



by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g6eozF

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Q3hpH5

Posted by Katta

Krishna Mani కవిత

జాము రాతిరి ************** జరగనీ జాము రాతిరి అడుతా ఆనందంగా మనసును విహరింపజేస్తూ నల్లని లోకంలో ఎందరో రవిలు ! ఒక్కొకరిని పలకరించి పరవశిస్తా మనకెరుగని గోడులున్నాయేమో అడిగోస్తా మనకన్నా కష్టాల్ నష్టాల్ విని వస్తా బతుకు భారం నిత్యగాదం మనసు విరిగిన గుండెలను కదిపొస్తా కళ్ళు నిండి మెరుస్తున్న రంగులను చూసొస్తా ! మన రవే బగ్గుమనే అగ్గిగోళం తన గాధ వినుమని ఉబలాటం అందుకే పొద్దు పొడిచి కళ్లుమూయును ఇంకెవరిని చూడకండని ఆరాటం ! కృష్ణ మణి I 09-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1isM5IN

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | అంత వీజీ కాదు !? .................................... పైకి కన్పించకుండా బిగబట్టుకున్న కోపంతో కూడిన ఇష్టంతో చాలా జాగ్రత్తగా గడిపెస్తుంటాను రోజుని. ఏం ఫర్వాలేదు నీ స్నేహాన్ని వాళ్ళు వంచించారు ;వంచనను స్నేహానికి మరోముఖమని వాళ్ళు తేల్చేసారు . ముఖంపైకి ఒకానొక అనుమానపురాత్రిని విసిరారు. తుడుచుకుంటావో, లోపలికే తీసుకుంటావో నీ ఇష్టం. కలిసి ఉండటం కష్టమే అయినా కలిసే ఉండాలి,తప్పదు. విడిపోవడం ఇష్టమే అయినా ఇష్టాలన్నీ తీరుతాయా అంత వీజీగా ! అంత 'వీజీ'కాదు/అనుకున్నట్లు అన్నీ అలా అయిపోవడం. కన్నీళ్లు ఉంటాయి ,దు:ఖాలుంటాయి ,మెరమెరలాడే సత్యాలుంటాయి అన్నిటినీ వడగట్టి కొంచెంకొంచెంగానే బతుకుని గ్లాసుల్లోకి వొంపుకుంటాం. ఇది కూడా అంతే ! * ఎవరో తలుపులదగ్గర తచ్చట్లాడుతుంటారు సందేహంలో,సందిగ్ధంలో . లోపలికి తోసుకువస్తారో లేదో తెలియదు. కనుక్కోవాలి,అనుసంధానం జరగాలి,సంవాదం జరగాలి, తుప్పుపట్టిన లోపలిని మళ్ళీ సరికొత్తదిగా మార్చాలి. విరిగి,పగిలి,చిరిగి,మిగిలినట్లు మిగిలి చివరికి కొన్నిమాటలుగా మీ ముందుంటాను. విచిత్రం- " ఆకాశంలో వానపాములు పాకుతున్నాయి. భూమ్మీద చుక్కలు దాక్కున్నాయి" [ ఒక ఇంగ్లీష్ సినిమా చూసాక ] *9.4.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n1LdPD

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

ఓటు...సూత్రధారి..! ఓటు ఒక సజీవ మానవ స్వరూపం వ్యవస్థ నిర్మితిలో ప్రతిభగల సూత్రధారి సమాజ జీవితాన్ని రక్తికట్టించే పాత్రధారి. ఓటు తన సహజ నయనాలతో లోకం పోకడను తీక్షణంగా వీక్షిస్తుంది జ్ఞాన నేత్రంతో జగతిని జాగృతం చేస్తుంది . ఓటు తన వామ హస్త చూపుడువేలు సిరాచుక్కను తనివితీరా తడుముకొని కుడిచేతితో నాయకుల తలరాత రాసి పంచ వసంతాల పాలనా గమనాన్ని నిర్దేసించే రాజ్యంగ వాసి. ఓటు తన గుండె గొంతుకను విప్పి నమ్మిన ప్రజల భావాలకు బాణీకడుతుంది చట్ట సభలలో తన వాణిని ప్రతిధ్వనిస్తుంది మడమ తిప్పని యోధునిలా మాట నిలబెట్టుకుంటుంది. ఓటు ఎప్పటికీ వన్నె తరగని ప్రలోభాల ప్రభావలకు లొంగని ఒక మహోన్నత ఆశయ పథం లోక కల్యాణమే తన మొక్కవోని పంతం. ఓటు నడక ఒక మహాప్రస్థానం గతం నుండి వర్తమానం లోనికి శ్రమిస్తూ భవిష్యత్తు బంగారు భువనానికి బాటలు వేస్తుంది మరో భానూదయం కోసం పురోగమిస్తుంది. అందుకే ఎవరికైన ఉండాలోయ్ ప్రజాస్వామ్య నిబద్దత..! ఓటు తోటి ఋజువుచెయ్ రాజకీయ విశుద్దత...!! 9.4.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k1DBwp

Posted by Katta

Annavaram Devender కవిత

తొవ్వ .............................అన్నవరం దేవేందర్ .....................................9/04/2014 కాళోజీ .......ఒక ఉత్సవమే ........ఒక పతాకమే .. కాళోజీ జీవితం ఓక ధిక్కార పతాకం .కాళోజీ ఒక ప్రశ్నల గని .కాళోజీ హక్కుల దిక్కు .ఇలా ఎన్నైనా రాయొచ్చు .ఆయన జీవితం పోరాటం తెలియని వారు ఎవరు లేరు .ఇది కాళోజీ శత జయంతి సంవత్సరం .కాళోజి శత జయంతి ఉత్సవ కమిటి బి .నరసింగ రావు అధ్యక్షతన ఏర్పాటైంది .గత ఆరు నెలలుగా కాళోజీ జయంతి ఉత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తుంది .'కాలోజి ఉత్సవ్ ' పేరిట ఈ టాబ్లాయిడ్ నూ వేలువరిస్తంది.ఇప్పటికి రెండు సంచికలు వచ్చినయ్.దీనికి వేణు సంకోజు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు .అట్లాగే 'కాళోజీ కెంపులు ' పేరిట కాళోజీ రాసిన ఆనిముత్యల్లాంటి కోట్స్ తో ఒక పుస్తకం వెలువరించారు .కాళోజీ కెంపులు కొన్ని వేల ప్రతులు ముద్రించి రాష్ట్రం లోని బడి పిల్లలందరికీ పంపిణి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు .కాళోజీ సాహిత్యం ఈ తరానికి అందించే పనిలో ఈ కమిటి పని చేస్తుంది .ఈ ఉత్సవ్ సంచికలు నెల నేలా వెలువరించే పనిలో ఉన్నారు . కాళోజి ఒక ధిక్కారం ఒక గోడ గోడ ఏడ్పు అడుగుడు ఎదురు తిరుగుడు మర్లపడుడు ఆయన నైజం .ఆయన లో మార్క్స్ ,గాంధీ కలే కల్సి ఉన్నారు .ఆయన జీవితం తెలుగు సమాజానికి ఒక దీపం .

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivg7gs

Posted by Katta

Gundampati Vijaya Saradhi కవిత

/ / మినీ కవిత // సారధి పూలకు రంగులద్దాను అవి మిమ్మల్ని చ్చాయి అన్నాను నా పిల్లలతో పండ్లలో తీపి నింపాం అవి అమ్మానాన్నలనిచ్చాయి అన్నారు వారు నాతో

by Gundampati Vijaya Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PP56OZ

Posted by Katta

Pusyami Sagar కవిత

వొరప్రసాద్‌ గారు రాసిన కవిత ||వయసుడిగిన జీవితం !!కవిత్వ విశ్లేషణ మనిషి మూడు దశలలో బాల్యం, యవ్వనం, వృధ్యాప్యం, వీటి లో ఏది క్లిష్టమైనది, .బాధాకరమైనది అన్న ప్రశ్న ఉత్పన్నమైనపుడు మలి దశ లో నిరాదరణకు గురి అవుతున్న వృధ్యాప్యం కనిపిస్తుంది ..నేటి కాలపు యువత తమ ఉనికి కాపాడుకోవటానికి, పైకి ఎదగటానికి తమ కన్నవాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ తమ ప్రగతి కి అవరోధం గా భావిస్తున్నారు ...వోరప్రసాద్ గారి కవిత లో ..వయసుడిగిన వ్యక్తి కొడుకల చే నిరాదరింపబడిన వైనాన్ని కళ్ళకు కట్టినట్టు గా చూపించారు .. యవ్వనం లో సాదించిన విజయాలు మరుగున పడి జ్ఞాపకాలు గా మారిపోతాయి, నిజమే కామోసు ..వయసు లో ఎన్ని పెద్ద పెద్ద లక్ష్యాలను చేదించినా కూడా అది అంతా గతం వలయం లో నే కొట్టుకుపోతుంది కదా... // గడిచిన యవ్వనపు జీవిత విజయాలు//మరుగునపడిన జ్ఞాపకాలై వెక్కిరిస్తుంటాయి వయసు శక్తిని ముసలితనపు చాయలు లాగేసుకొంటే, పెరిగిన పోటి ప్రపంచం లో ధర లతో ...నిత్య సమస్యలతో యుద్ధం చేస్తున్న పుత్ర రత్నాలకు భారం గా తోచి మానవత అనేది లేకుండా, అక్కరలేని వస్తువు గా మూలన పడేసినపుడు .....కూడా ఇంటి చూరుకు వేలాడుతూ వుంటారు .......తమ నిస్సహయత ని తలచుకొని.. అసమానతల పోటీ ప్రపంచం//కుటుంబాల్లో మానవత్వాన్ని కబళిస్తుంటే వయసుడిగిన శరీరాలు//ఇంటిచూరుకి భారంగా వేలాడుతుంటాయి మిడిల్ ఏజ్ నుంచి మలి దశ లో కి అడుగుపెడుతున్నపుడు శరీరం లో ఏ భాగం సహకరించదు నిజమే కుర్రాళ్ళు గా వునప్పుడు ఉన్న ఉత్సాహం వయసుడిగిన తరువాత ఉండదు కదా...., అప్పుడు ...అచ్చం పగుళ్ళు బారిన భూమి లా మారుతుంది ... అలసిన శరీరం//పటుత్వం కోల్పోయి//పగుళ్ళు బారిన బీడుభూమిలా మారుతుంది వయసు జోరు మీద ఉన్నప్పడు గెంతిన గెంతులు కాస్తా ....వంగి ...వంపులు తిరిగి ....వెన్నముక కి ఆధారం లేకుండా దారి తప్పిస్తుంది ...తాము కోల్పోయిన యవ్వనాన్ని ఉత కర్ర సాయం తో నిలబెట్టటానికి యత్నిస్తారు .. యవ్వనాన్ని కోల్పోయిన వెన్నెముక/ధనుస్సులా వంపు తిరిగి గరిమనాభిని దారి తప్పిస్తుంటుంది వయస్సు కోల్పోయిన/శరీరాన్ని నేలపై నిలబెట్టడానికి//ఊత కర్రతో ప్రయత్నిస్తుంటారు// ఒకవైపు వంటి నిండా జబ్బులతో నిస్సహాయత ఆవరించి, ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే , అయినవారి ఈసడింపులు , విసుగు ద్వనించే మాటలు ....ప్రేమలేనితనం ....అన్ని కూడా ఆత్మ గౌరవాన్ని పరీక్షిస్తూ వుంటాయి శరీర నిస్సహాయత ఆత్మవిశ్వాసాన్ని//దెబ్బతీస్తుంటుంటే అయినవారి నిరాదరణ/ఆత్మగౌరవాన్ని నిత్యం పరీక్షకు పెడుతుంటుంది// కవిత చివరి రెండు పాదాల్లో ...వృధ్యాప్యం యొక్క దీనావస్థ ని కళ్ళెదుట ఉంచారు ...ప్రసాద్ గారు, ఆశ సచ్చిపోయి , పరాయికరణ లో సర్వం కోల్పోయి , ఏ మూల కొట్టు గది లో నో ..మరే ఇంటి వసారా లో ను ...కుక్కిన మంచం లో దగ్గుతూ మూలుగుతూ ...బతుకు ఈడుస్తారు , గతం లో తల్లి తండ్రి ని దైవం గా పూజించి నెత్తిన పెట్టుకునేవారు ...వర్తమానం లో మాత్రం అవి కరువు అయ్యి ...ఆత్మీయత కు నోచుకోక ....ఆశ్రమాల వెంట పరిగెత్తడం నిజంగా విషాదభరితమే, ప్రతి తల్లి , ప్రతి తండ్రి ఎదుర్కొంటున్న సమస్య నే .... //నిరుత్సాహం కమ్ముకుని//వ్యక్తిత్వం కోల్పోయి నిర్జీవులుగా మసులుతూ// అప్పుడప్పుడూ దగ్గుతూ ఇంట్లో ఉనికిని చాటుకుంటారు// త్మీయుల పలకరింపులకు నోచుకోని వృద్ధాప్యం మనిషిని ఓడించడం ఓ వర్తమాన విషాదం// నేటి సమాజం లో జరుగుతున్న ఎన్నో విషాద ఘటనలకు, చితికిపోతున్న ముసలి ప్రాణాల ఆవేదనకు అక్షర రూపం ఇచ్చారు ....ఇప్పుడు ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ తమని తాము సరి చూసుకోవాల్సి వుంటుంది తమ పెద్ద తరం విషయము లో, మరిన్ని జాగ్రత్తలు తీసుకొని కాపాడాల్సిన బాధ్యత ను గుర్తు చేసారు ..సమాజం అంత మారకపోయినా అక్షర జ్ఞానం ఉన్న ఏ కొద్ది మంది అయిన ఈ కవిత ని చదివి మారటానికి ప్రయత్నిస్తే ...వారు విజయం సాదించినట్టే . కవిత ని మొత్తం ఒకేసారి కుప్ప గా కాకుండా ..విడి విడి గా రాసి వుంటే ఇంకాస్త లోతు గా మనసులోకి వెళ్ళటానికి ఆస్కారం వుండేది ..అయినా కూడా సామజిక స్పృహ ని తట్టి లేపే ఇలాంటి కవితలు అవసరం ....మంచి కవిత ను అందించిన ప్రసాద్ గారికి అబినందనలు .. సెలవు ... అలసిన శరీరం పటుత్వం కోల్పోయి పగుళ్ళు బారిన బీడుభూమిలా మారుతుంది యవ్వనాన్ని కోల్పోయిన వెన్నెముక ధనుస్సులా వంపు తిరిగి గరిమనాభిని దారి తప్పిస్తుంటుంది వయస్సు కోల్పోయిన శరీరాన్ని నేలపై నిలబెట్టడానికి ఊత కర్రతో ప్రయత్నిస్తుంటారు శరీర నిస్సహాయత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటుంటే అయినవారి నిరాదరణ ఆత్మగౌరవాన్ని నిత్యం పరీక్షకు పెడుతుంటుంది గడిచిన యవ్వనపు జీవిత విజయాలు మరుగునపడిన జ్ఞాపకాలై వెక్కిరిస్తుంటాయి పెరిగిన ధరలు అసమానతల పోటీ ప్రపంచం కుటుంబాల్లో మానవత్వాన్ని కబళిస్తుంటే వయసుడిగిన శరీరాలు ఇంటిచూరుకి భారంగా వేలాడుతుంటాయి నిరుత్సాహం కమ్ముకుని వ్యక్తిత్వం కోల్పోయి నిర్జీవులుగా మసులుతూ అప్పుడప్పుడూ దగ్గుతూ ఇంట్లో ఉనికిని చాటుకుంటారు ఆత్మీయుల పలకరింపులకు నోచుకోని వృద్ధాప్యం మనిషిని ఓడించడం ఓ వర్తమాన విషాదం ఏప్రిల్ 9, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hqlcdh

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||అమ్మమనసు|| ఆ నాలుగు పిచ్చుకలు, అక్కడక్కడే తచ్చాడుతున్నాయ్, కిచకిచమని అరుస్తూ, చాలా సేపటినుంచి. వాటి విన్యాసాలను ఆనందంగా చూస్తూ, చాపమీద బద్దకంగా పడుకొని జంతుప్రేమతో ఆనందిస్తున్నాను, నేను. అయ్యో, ఆకలేస్తుందా పిచ్చుకలూ అంటూ, కాసిన నూకలు చల్లాక, మా పాప కొంచెం తిని,. ఇంకొన్ని నోటికి కరుచుకొని, గూటిలోని వాటి పిల్లల కోసం, సంతోషంగా ఎగిరిపోయాయి కిచకిచ కృతజ్ఞతలతో. ఎందుకో చాలా విషయాలు నాకెప్పటికి అర్థంకావు. కనీసం మా పాపలాగన్నా. -----------------------------------9-4-2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1egWUSR

Posted by Katta

Shash Narayan Sunkari కవిత

స్నేహితులందరికి చిన్న విన్నపం: నా పెరుతో ఎవరో ఒక చెడ్డ పోస్ట్ ఇన్ బాక్స్ లో పెట్టారు ఆ విషయం నా స్నేహితుడు నాకు చెప్పేవరకు నాకూ తెలియదు అదేల సాధ్య పడిందో నాకు అర్థం కావడం లేదు,సరే తరువత ఏం చేయలో అలోచిస్తాను కాని ముందుగా మీకు ఇలాంటి ఏదయిన పోస్ట్ వస్తే నన్ను క్షమించండి అలాగే దయచేసి నాకు తెలపండి అంతే గాని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు,నేను తెలంగాణ పైన కొన్ని విషయాలు వ్రాసినప్పుడు నాతో ఎంతో మంది విభెదించి వాదించారు నన్ను చాల చెడ్డమాటలు తిట్టారు అయినా నేను ఏనాడు చెడ్డగా వ్రాయలేదు అది అందరికి తెలుసు కాని ఇప్పుడు నా పైన ఇలాంటి చర్యలకు పాల్పడి నన్ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు నన్ను ఆదరించిన మీ అందరికి వేడుకుంటున్నా నన్ను అర్థం చేసుకొండి,ఇక విషయానికి వస్తే అలా పోస్ట్ చేయడం సాధ్యమ అని ముందుగ తెలుసుకుంటా ఆ తరువాత వారిపై కేస్ పెడతా అంతవరకు నాకు మీ సహాయం కావాలి. ఇట్లూ సదా మీ శేష్ నారయణ సుంకరి.

by Shash Narayan Sunkari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Q0eyyL

Posted by Katta