పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, మే 2014, శనివారం

Udaya Babu Kottapalli కవిత

సమాధి బయటకు ఆహ్వానం కొత్తపల్లి ఉదయబాబు 31-5-2014ఎవరో...ఎవరో ఛళ్ళు ఛళ్ళున చరుస్తున్నారు... అశాంతుల్ని...విభ్రాంతుల్ని....ఆశావహాలని, పెచ్చులూడిపోతున్న జ్ఞాపక శకలాల్ని కుండపెంకుల్లా విచ్చిపోతున్న అనుభూతుల్ని... కాలపు బీడుభూముల నెరజల్లోకి...జార్చేసుకుని... చిక్కగా అల్లిన క్షణాల దుప్పటిని కప్పుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నన్ను....ఎవరో.... ఎవరో...ఎవరో ఛళ్ళు ఛళ్ళున చరుస్తున్నారు... ఏదో ఒక అజ్ఞాత వాక్కు....ఆకాశ అశరీర వాణిగా... తనకోసం బ్రతికేవాడు మనిషి... చుట్టూ ఉన్నవారికోసం బ్రతికేవాడు మనీషి... హస్త కళపు కలానికి తుప్పు పట్టించి... భావజాలపు జలలోంచి...ఉత్తుంగతరంగాలై ఎగసే కవితావేశాన్ని,...కోశస్థ దశలోకి పంపి ప్రపంచానికి దూరంగా పరకాయప్రవేశం చేసే అర్హత ఎవరిచ్చారు సుకవీ నీకు... రా...కదలిరా....లే....లేచిరా....నీ ఆలొచనల వనరుల్ని... పదిమంచికి పంచి....వారి అనుభవ రాశుల్ని... అవసరార్ధులకు పంచే నీ నిరంతర శ్రమ కొనసాగించు... అనంతవాహిని యై పునః ప్రభవించు...!!! \u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C\u003C :: >>>>>>>>>>>>>>>>>>>>>>

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1u0xZ9I

Posted by Katta

Santosh Kumar K కవిత

||సిగరెట్టు గుట్టు రట్టు|| మనిషి పోటానికి ఈ రెండూ సరిపోతాయి.. అరంగుళం బుల్లెట్టు అంతకన్నా చవకైన సిగరెట్టు.. భలే మంచిదండోయి ఈ సిగరెట్టు పోతావ్.... నాశనమైపోతావ్.. అంటూ తనే చేసుకుంటుంది తన గుట్టు రట్టు.. అయినా వింటేగా మేధావి మనిషి.. నీళ్ళు దొరకలేదని పొగ త్రాగానంటాడు.. దగ్గుతాడు దగ్గుతాడు.. అయినా ఆపలేడు.. ఆపాలి అనుకోడు.. (మర్చిపోయాను.. ఆడాళ్ళకి కుడా హక్కుందంట) అయినా ఆపలేదు.. ఆపాలి అనుకోదు.. అందరివాడిని అంటుంది మరి ఈ సిగరెట్టు!! ఏదైనా.. దీనిలో విషయం ఉంది... (అక్షరదోషం క్షమించాలి...) ఏదైనా.. దీనిలో విషం ఉందండి... ఈ విషయం విశేషంగా విస్తృతంగా ఆ సిగరెట్టే విన్నవించుకున్నా వినడు.. వినదు... వినలేడు.. వినలేదు.. విషం అని చెప్పానుగా.. చెవులు పనిచేయటం ఆగిపోయుంటాయి.. పోను పోను.. కళ్ళు.. కాళ్ళు.. ఒక్కొక్కటిగా అన్నీ విశ్రాంతి తీసుకుంటాయి!! అందుకని... అలవాటు లేనివాళ్ళు అటువైపు పోవద్దు అలవాటున్నవాళ్ళు దాన్ని వదిలేస్తే ముద్దు గమనిక : ఏదో సరదాగా రాశాను.. కానీ రాసిన విషయం.. ఆ విషం గురించి.. ఆలోచించండి #సంతోషహేలి 31MAY14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gPMXg5

Posted by Katta

Nirmalarani Thota కవిత

చిన్నప్పుడు ఏం పండివంటలు చేసినా నాన్న రానీ.. అని అమ్మ అంటుంటే అర్ధం కాక అల్లరిచేసే పసితనం.. కాస్త పెరిగాక క్లాసు ఫస్టు రాలేదని కోప్పడుతుంటాడని ప్రోగ్రెస్ కార్డు దాచేసి తప్పించుకు తిరిగే అలవాటైన భయం కాలేజీలో చేరాక అంతులేని ఆంక్షలు పెడుతుంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా ఇల్లు చేరితే అంతెంత్తున నన్నూ అమ్మను కలిపి తిడుతుంటే హిట్లరును చూసినట్టు లోలోపలి అసహనం.. ఎప్పుడూ నువ్వు నాకు అర్ధం కాలేదు.. విసుర్లు, కసుర్లు తప్ప నాకేమీ కనిపించలేదు.. కరుడు గట్టిన గాంభీర్యం రాతి విగ్రహంలాగానే తోచేది నిన్ను పూజించే అమ్మను చూస్తే జాలి వేసేది.. ఎందుకింత మౌనం నీకు? ఎందుకంత దూరం మాకు..? నీ ప్రావిడెంటు ఫండంతా మా పెళ్ళిళ్ళకు ధారబోసి పెన్షన్ డబ్బుల్లోంచి లాంఛనాలన్ని తీర్చేసి అడపాదడపా చేసిన అప్పులన్నీ కడుపుగట్టుకొని తీర్చేసి గుండె కలుక్కుమన్నప్పుడు గుట్టుగా దాచుకున్నావే.. అప్పుడైనా చెప్పాల్సింది నాన్నా..! నోరు విప్పాల్సింది నాన్నా . . ఒక్క సారి ఏడ్వాల్సింది నాన్నా..! ఒక్క సారి నిన్ను తాకాలని ఉంది నాన్నా..! కన్నతండ్రిని కూడా హత్తుకోలేని నా వయసునూ, ఆడతనాన్ని మరచి ఒక్క సారి.. ఒక్క సారి నీ చేతుల్లో ఒదిగిపోయి కడుపారా ఏడ్వాలని ఉంది నాన్నా..! నీ గుండెల్లో ఘనీభవించిన యుగాల దుఖ్ఖాన్ని కన్నీరుగా కరిగించాలని ఉంది నాన్నా..! నీ ప్రతి ఆఙ్ఞ నా భవిష్యత్ సోపానానికి సం ఙ్ఞ అని నీ ప్రతి ఆంక్ష నన్ను పదిలంగా పొదువుకోవాలనే ఆకాంక్ష అని తెలుసుకోలేక జీవితాన్ని తీర్చిదిద్దిన నీ తీర్చుకోలెని ఋణానికి ... నిన్ను గుర్తించలేని అవివేకానికి ప్రతిగా నీ పాదాలపై ప్రణమిల్లి కన్నీటి జల్లుతో ప్రక్షాళన చేయాలనుంది.. నన్ను క్షమించు నాన్నా..! అమ్మంటే ఆది దేవతని అహరహమూ ఆరాధించే మేము అమ్మకు ఆరాధ్య దైవమైన నీ అంతరంగపు విశ్వరూపాన్ని చూడలేని అవిటితనాన్ని మన్నించి మాతో మనసు విప్పి మాట్లాడు నాన్నా..! మా గుండెల్లోనే మీకు చోటు.. దరికి రానీయము ఇక ఏ గుండె పోటు. . ! ! నిర్మలారాణి తోట తేది: 31.05.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gPMRFd

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||సంధ్య చిగురు|| సులభంగా సౌక్యంగా ఉండేందుకు మనని మనం చెరిపిరాసుకొనేలానే రాసుకొంటాం ఎప్పుడో అప్పుడు పొగడ్తలోనో ..పదవిలోనో పడిపోవక తప్పదు అప్పుడు భారం కోల్పోయి ..మళ్ళీ కొత్తగా మొదలవుతుంటాం నిత్యం లోపల పర్వతాలను ఎక్కేవాళ్ళమేకదా ... ఎప్పుడో అప్పుడు జారిపడతాం.. అప్పుడు మాత్రం.... . గతంలో రాసుకొన్నది చెరిగిపోకుండా చేతలతో అడ్డుకొంటాం ..... ఎటుతిరిగి మనమో సున్నా గీస్తాం ....కాకుంటే ఙానం పెరిగాక అదే సున్నాని మరికాస్త గుండ్రంగా గీస్తాం మహా అయుతే మనమో సుడిగాలి అవుతాం ...సన్నని వాన చినుకులవుతాం తెల్లని మల్లెమొగ్గలవుతాం .... అన్నీ ఉన్నవే ...అన్నీ నిన్నవే లక్షల ఖాళీ క్షణాలమధ్య ఒక్కటి మెరవగానే .... మనల్ని మనం గబగబా చెరిపి తిరిగి రాసుకొంటాం క్షణంలోనే లక్షసార్లు .....మొదలవడం నచ్చక మళ్ళీ మొదలవుతుంటాం చెరిపిన అక్షరాల పొడి మొహం మీద పడి మెరుస్తూ .... ముంగురుల నీడలో తడుస్తూ ....వచ్చిన సందు దొరకగానే కాసేపు సంధ్య చిగురులై ఊరించి చాటుకు వెళ్ళిపోతాం ........

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wGmrKR

Posted by Katta

Katika Manohar కవిత

మను @ నిద్రలేని రాత్రి @ గాడంగా నిద్రపోతున్న నన్ను ఓ భయంకరమైన కల తట్టి లేపింది ఏవో పెద్ద అరుపులు కేకలు అక్కడ ఉన్న చెట్ల పొదలన్నీ విరుగుతున్నట్టు శబ్దాలు కింద చుస్తే ఎవరినో ఈడ్చుకేల్లిన ఆనవాళ్ళు దారి నిండా రక్తపు తిలకం నా బుద్ధి అర్థం చేస్కోటం మొదలు పెట్టింది అవి కేకలు కాదు ఆర్తనాదాలు అని ఇవన్నీ చూస్తున్న అక్కడి మనుషులు కాళ్ళకు లేపనం పూసుకున్నట్లుగా మాయమవుతున్నారు బహుశా వాళ్ళు కులం అనే లేపనం పూసుకున్నారనుకుంటా వాళ్ళు మానవత్వం మరచిపోయి చాలా యుగాలు గడిచిందనుకుంటా వాల్లను మనుషులని పిలవడానికి కూడా నాకు సిగ్గేసింది మూల్గుల శబ్దం పెరిగే కొద్ది కాళ్ళ వడిని పెంచా ఇంతలో నాకో పెద్ద విచిత్రం కనిపించింది చెట్లకు పువ్వులు ఆకులతో పాటు మనుషులు కూడా కాసివున్నాయి కళ్ళు బైర్లు కమ్ముతుండగా నా మెదడు చెప్పింది నేను చూసింది చెట్లకు కాసిన మనుషుల్ని కాదని మనుషుల్లో పుట్టిన మృగాలు ఆడిన వికృత క్రీడ అని కింద పడిన అద్దంలా ముక్కలైంది నా నిద్ర కళ్ళు తెరిస్తే సమాజం ఇంకా నిద్రపోతూనే కనిపించింది 30-05-14

by Katika Manohar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mVvdQ8

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ------------ఓ కాలేయం వ్యధ అవును ప్రతిరోజూ నాకు కాలకూట విషంతో అభిషేకిస్తుంటాడు నా యజమాని రాత్రి,పగలు,సమయం,సందర్భంతో పనిలేదు కావలసింది పతనమయ్యే చిన్నకోరిక మాత్రమే దురద్రుష్టం వెంట తెచ్చుకోవటం కాకపోతే ఏంటి ? వాడితో కలిసి నేను పుట్టటం , వాడి ఇష్టానికి నేను బలి కావటం చావైనా ,పుట్టుకైనా సరే మద్యంతోనే సంబరమట స్వర్గసుఖాలు నిషా మత్తులోనేనట ఒక ఊపిరి పుడుతుంది వీడు సారాసీసా పట్టుకుని వేసే గంతులకు అంతే ఉండదు నన్ను నిండా ముంచేసి "ఉబ్బి"తబ్బిబ్బు చేస్తుంటాడు ఇంట్లో ఓ శవం లేస్తుంది భాదంటాడు సారాతోనే విరుగుదంటాడు నా భాదేంటో మరుస్తాడు పోటీ పడుతుంటాడు పెగ్గులతో , ఫ్రెండ్స్ తో తూలి తూలి పడుతుంటాడు వాడి సరదాకు కోలుకోలేనంతగా కుళ్ళిపోతుంటాను నేను విషానికి మరో విషం కలుపుతుంటాడు చల్లగా ,మెల్లగా కోరుక్కుతింటాది ఆ శీతలపానీయం మింగి మింగి వొరిసిపోతుంటాది కాలేయం ఒక్కోసారి జీవనదిలా తడారనివ్వడు గొంతునూ నన్నూ తడుపుతూనేవుంటాడు గొంతు చించుకుని అరవాలనుకుంటాను కానీ నా గొంతెక్కడ పెగులుతాది ? గొంతునిండా మందుతో నింపేసాడు కదా ! 31-05-2014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pGK5lD

Posted by Katta

Prasada Murthy Bandaru కవిత



by Prasada Murthy Bandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCYWAF

Posted by Katta

Mukesh Silko కవిత

Dhanyawaad amuloo.

by Mukesh Silko



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T0ZJhf

Posted by Katta

Abd Wahed కవిత



by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rsHD78

Posted by Katta

Bharathi Katragadda కవిత

నా మనసు పుష్పాన్ని నీకు సమర్పించాను ప్రభూ! ఆ పరిమళాన్ని గ్రహించి నీవు నిష్క్రమించావు! ఇప్పుడిక్కడ ఏ పరిమళమూ లేని మోడు మిగిలింది నీకోసం శూన్యంలోకి చూస్తూ! 31May14

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oaR6u9

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఊరు నా వెనుక నుండి ఆమె రాగాలు సమీపించి నా పాదాల్ని చుట్టేస్తున్నాయ్ నన్ను వెళ్లొద్దని ప్రాధేయపడుతూ నన్ను చుట్టిన ఆ వనిత వంట్లో మాంసమే లేదు ఆమె నరాల్లో శక్తీ లేదు ఆమె కళ్ళల్లో ప్రేమ తప్ప ఒకప్పుడు ఎంత అందంగా ఉండేది ఎంతమంది ఆమెతో జీవిస్తూ ఎంత పైకి ఎదిగారు అందరూ ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు పక్షులైనా గూటికి తిరిగొస్తాయ్ కానీ వాళ్ళు రారు ఇక మిగిలింది నేనే అయినా గానీ నా కోసం నన్ను తనతోనే ఉంచుకోవడం కోసం పరుగెత్తుకుంటూ వచ్చి ఎంతో హృదయవిదారకంగా విలపిస్తోంది తను నేనసలు బ్రతికి ఉన్నానో లేనో నాకే తెలియదు అందుకే బ్రతకడం కోసం తనని మ్రింగిన శూన్యం నుండి పారిపోతూ ఉన్నాను తనని వదిలేసి స్వార్ధంతో కానీ తను నన్ను పట్టుకుని తనని వీడొద్దని బ్రతిమలాడుతూ నా గుండెలో తన ఊపిరిని నింపుతూ నన్ను బ్రతికిస్తూ తనలోనే బ్రతికి తనని బ్రతికించమని కోరుతూ స్పృహ కోల్పోతోంది ఆ వనిత నా కళ్ళల్లో నీళ్ళు అప్పుడు నాలోంచి ఒక మనిషి లేచాడు నాలో ధైర్యం నింపాడు నేనొక శక్తినయ్యాను అప్పుడు నన్ను నేను ఆ కభంధ హస్తాలనుండి విడిపించుకుని ఆ వనితని నా చేతులతో కావలించుకుని నా గుండెలో దాచుకుని వెనక్కి తిరిగాను నిజమైన జీవితంలోకి ఆమెతో ఉంటే మరణమైనా జీవితమే అని తెలుసుకుని నేను ఒక కుటుంబమే కానీ అదే తనకి ప్రపంచం నాకూ తనే ప్రపంచం ఇప్పుడు ఇక్కడ నేనూ తనే ఇది గ్రామమే కానీ నాకు అదే స్వర్గం దేవతలు మాతో కలిసి కష్టపడ్డారు ఇప్పుడు మా చుట్టూ పచ్చదనం మా ఇల్లొక హరితవనం ఆ వనితే మా దేవత మాకు దూరంగా శూన్యం ఓడిపోయిన నగరం 31May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hIBs5h

Posted by Katta

Trinadh Meegada కవిత

||నీ గర్భగుడిలో నిరంతర శోధనం అండ పిండ బ్రహ్మాండ దర్శనం నినదించిన నారాయణ మంత్రం నువ్వు నేర్పిన జీవన్మరణ సూత్రం నా జీవన జాగృతికై నీ ప్రసవ ఆర్తనాదం ప్రణవ నాద సృష్టికే ప్రళయ ఓంకారం .. పునీతమనుకొనే నా మల మూత్ర తీర్దం పుడమితో గెలిచేటి నీ స్వార్ధ రహితం జవ జీవమొసగే నీ పరిపుష్టి స్తన్యం విహీనమయ్యే నీ అందచందాల దైన్యం నీ పొత్తిళ్ళ చెంతన నా రాచరిక దర్పం ఇలలోనే కనిపించు నా కలల సౌధం నా తప్పు ఒప్పన్న నీ త్యాగ ఫలితం సమిధయ్యి సరిదిద్దు నా భవిత భరణం ఇరుకై.. కరుకై కురిపించు కారుణ్యం నా గృహస్తు గతికై నీ అగచాట్ల పయనం ఆర్ద్రమై నిలిచేటి నింగిలో ఎగసేటి నీ ప్రేమ వదనం మేఘమై మురిసేటి కరుణతో కురిసేటి అమృత వర్షం || ..................................మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pGjoO9

Posted by Katta

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || రాక || నువు ఎందుకో ఇక్కడికి వస్తావు వచ్చేసరికే ఇక్కడొక ఉత్సవం కొనసాగుతూవుంటుంది నువ్వు ఎవరో, నీచుట్టూ జరుగుతున్నది ఏమిటో నీకు నువ్వుగా తేల్చుకోకముందే వాళ్ళంటారు 'నువ్వు ఫలానా, ఇది చెయ్యాలి, అది కూడదు ' అని ఈ ఉత్సవానికి అర్థమేమిటని అడగబోతావు 'అదేమిటి కొత్తగా అడుగుతున్నా' వంటారు కొందరు జాలిదలచి 'నిరాశ కూడ' దని ఓదార్చుతారు వారికి నచ్చినట్టు ఉండబోతావు కాని భయ, హింసాపూరితమైన ఉత్సవంలో ఏదో వెలితి వుందని తెలుస్తూనే వుంటుంది ఉత్సవాన్ని విడిచి ఏకాంతమైదానం చేరి నీ జవాబు నీలోనే వుందని నమ్మి అడుగుతావు 'ఇదంతా ఏమిటి’ అని మరింత విశాలమౌతున్న ఆకాశం క్రింద దృశ్యాలన్నీ అణగిపోయిన విశ్రాంతిలో ఉండిపోతావు రాకపోకలు లేని నీలో కరిగిపోతావు 31.5.2014 http://ift.tt/1pGhKvQ

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pGhKvQ

Posted by Katta

Jagadish Yamijala కవిత

ఇవీ చదవండి ప్లీస్ ---------------------------- అది చదరపు కొలను చదురపు రాయి విసిరాను వృత్తాలు విరిశాయి --------------------------- ఎల్లప్పుడూ నిరుపేదకు నికర లాభం బాధలే --------------------------- సముద్రం మునిగిపోయి ఉంది కాళ్ళ కింద ------------------------- చినుకులు అద్దిన వర్ణాలతో గీయడం పూర్తి చేసాను వాన చిత్రం ముందుంది ------------------------- ఎంత నీరు తాగినా పల్లాన్ని నింపలేని వాళ్ళం మనం ---------------------------- దాహం తీరడానికి ఎవరి చుక్కను ఎవరు తాగబోతున్నారో ---------------------------- లోలోపల ఉన్నది ప్రశాంతత ఎవరి లోతు ఎవరో...? -------------------------- అరకొరను నేను పరిపూర్ణతకోసం ఒక్కటొక్కటిగా నింపుతున్నాను -------------------------------- మరణం వస్తుందని తెలియక పుట్టిన శిశువులం మనం మరణం వస్తుందని తెలిసీ ఎదిగిన వృద్దులం మనం ------------------------------- తమిళంలో వీటిని మా మిత్రుడు మా పుహళేంది రాసారు అనుసృజించాను - యామిజాల జగదీశ్ 31.5.2014 ------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZV1XR

Posted by Katta

Maddali Srinivas కవిత

ఒకే ఉదయం రెండు చోట్లా!!!//శ్రీనివాస్//31/05/2014 ------------------------------------------------------- వాన కురిసి వెలిసినట్టుంది రహదారుల నిండా పారుతున్న నీళ్ళు వలసపోతున్న కాగితపు పడవలు బాట కిరుపక్కల మేట వేసిన బురద బురదలో చిందులు వేస్తూ కాగితపు పడవలు నీళ్ళల్లో జారవిడుస్తూ హరివిల్లును కంట్లో కట్టేసుకుంటూ లేత యెండ చురుకు నాస్వాదిస్తూ కొత్త కాలపు వెలుగులు మనసును తడిపెయ్యాలని ఉవ్విళ్ళూరుతూ వాడొక్కడే !!! వాడొక్కడే!! వాడొక్కడే!! కాలం పోకడ తెలియని వాడొక్కడే!!! యేదొచ్చినా,యేది పోయినా నవ్వేసే వాడొక్కడే యేడవటం రాని వాడొక్కడే చిరుగు పాతల నొదిలేసి చిరునవ్వులను తొడిగేసుకుంటూ చిరకాలపు సంకెళ్ళను వదిలించుకున్న ఆనందాన్ని తనివి తీరా అనుభవించేస్తాడు ఆ చిన్నోడే ముసిరిన చీకట్లను విడిపించుకోని ఒకే ఉదయాన్ని రెండు చోట్లా చూస్తాడు

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tZbHFf

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || నువ్వు .. కొన్ని పువ్వులు || కొందరు అంతే అకస్మాత్తుగా ఒక ఉదయం నీ పూలతోటలో వికసిస్తారు ******* మీ మద్య కాలాన్ని విరబూసిన కాంతిలో కలిపేసి నవ్వుతున్న నీ హృదయాన్ని నెమ్మదిగా నిమిరి ఇక నేను గతంలో నిదురపోతాను నీ జ్ఞాపకాన్నై అని నీ చేతుల లోనికి రాలిపోతూ అంటుంది అప్పుడు నువ్వు కన్నీరై ఆ గుర్తులను తడుపుకుంటూ శూన్యాన్ని నింపుకొని ఆ రాత్రి తోటంతా తిరుగుతావు ******** అక్కడ వికసించిన హృదయాలే కాదు రాలిన జ్ఞాపకాలూ ప్రకాశించడం గమనించావా కొంత కాలానికి నువ్వు మాత్రమే ఆ పూలతోటకు వ్రేలాడతావు ఒక పుష్పానివై అప్పుడు వికసించిన నీ రెక్కల మద్యనుండే వెలుగు నీ అరచేతులలో దాచబడ్డ ఆ తెల్లటి పుష్పాలే సుమా..! మీ చాంద్ || 31.05.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tZbFNG

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ ||కొన్ని కటువులు || ** అందం ఆస్వాదించు కాని ఆబగా దోచుకోవాలనుకోకు! నోటిని దురుసుగా వాడకు! అదుపు తప్పి కలాన్ని వదలకు! చేతితో కరవాలమైనా, కార్యస్పూర్తిగానైనా చక్రం తిప్పటంలో అశ్రద్ధ వద్దు! మగతనముందని విర్రవీగకు! దేనినైనా ఉపయోగించే ముందు అలోచనాల మథనం జరగాలి! ** నిప్పుల వానలో తడవకుండా తప్పించుకోగల మాద్రికుమారుడవైనా కావాలి! రుధిర సంద్రపు ఔపోసన పట్టగల శక్తికి అగస్త్యముని శిష్యరికమైనా వుండాలి! జ్వాలాముఖ ప్రవేశం చేయడానికి జలధరుని సౌదామినీ దుప్పటి వుండాలి! అత్యాచారాల అభినివేశ నిపుణతలో చుట్టాలకు, చట్టాలకు చిక్కని చక్కని పథక రచయితవ్వకలగాలి లేశమైనా అనావాళ్ళ జాగిలాలకి చిక్కకుండా పూడ్చగల తవ్వుకోల కలిగుండాలి ! ** పాలకుల పాలకడలి పాపాల నివారిణి కాకూడదు చాటుమాటు వ్యవహారాలు చక్కబెట్టే వేశ్యాగృహంలో అధికారపు మబ్బులచాటున ఘీంకారాలెన్నవేళల సాగవు! ** చుండూరు నేరగాడు నిర్దోషిగా బయటపడినా జాతీయ రహదారిమాత్రం ప్రమాదంపేర మరణశిక్ష పొందలేదా? కాకతాళీయమైనా కాకి మాత్రం పిండాలనే కోరుతుంది కదా! ** 31.05.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNLffU

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి.సురేష్ || అ స హ న రే ఖ లు || చిటికెడు గాలి నీపై అలిగితే చప్పుడు చేయకు౦డా ఆగిపోయే హృదయకవాట౦ అచేతనమయ్యే నిన్ను గమని౦చావా! ఎ౦త డొల్లతనమో నీలో? ........ ఆప్త హస్తాలతో నిను ఆహ్వాని౦చే మృత్యువునెప్పుడైనా అక్కున చేర్చుకొన్నావా? నీవెప్పుడైనా స్వాగతి౦చావా? చూశావా? నీలో ఎ౦త పిరికి తనమో? 2)............... పగలబడి నవ్వి ఎన్నాళ్ళవుతు౦దో? కాసి౦త మనసు విప్పి మాట్లాడుకొని ఎన్ని రోజులై౦దో? అ౦దుకే అప్పుడప్పుడు చెప్తు౦టా నీలోకి నీవే చేరుకొనే ఒక రహస్యద్వారాన్నైనా ఏర్పాటు చేసుకోమని .............. కన్నీళ్ళు కార్చక కళ్ళెన్నిరోజులై౦దో పొగిలి పొగిలి ఏడ్వట౦ నీకెప్పుడైనా గుర్తు౦దా? అ౦దుకే చెప్తు౦టా గు౦డెల్లో కాసి౦త చెమ్మ మిగుల్చుకోమని! ...... బ్రతకడానికీ ...చావడానికీ మద్య నీవే నిలబడి ఉ౦టావు అడ్డు రేఖగా.... చస్తావో?.........బ్రతుకుతావో...? ఆ అడ్డురేఖపై నిలుచొని బ్రతికీ చస్తావో? జీవశ్చవమవుతావో? నీ ఇష్ట౦!!! @ సి.వి.సురేష్

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mUazQn

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ అగ్ని పర్వతం ॥ కవితోటి పారుతోంది కళ్ళ లోంచి కలం ఖాళీ అయినా నష్టం లేదు మనసు కోటకి మౌనం పహరా కాస్తోంది పెదవికి పెదవితో పోట్లాడే పని లేదు కొండచిలువలా కబళిస్తూ ఏదో తెలియని అశాంతి చిట్టడవిలా చిక్కులు పడిన ఆలోచనా స్రవంతి ఏ దిక్కూ నాది కాదనిపించే చిక్కని అనాసక్తత చిమ్మ చీకటిని చిమ్ముతూ కంటిపాపల జత అనుభూతేదీ రుచించక నిండైన జ్వరంలో విశ్రమింపు నిప్పులపై కాల్చిన హృదయానికి నిరాశతో తాలింపు వడి వడిగా వడిలి రాలిపడే సుందర మనోహర శిశిరం పుడమికి ఒంటరితనాన్నద్దుతూ వట్టి పోతున్న ఆకాశం సముద్రపు ఒరిపిడిలో పురుడు పోసుకునే నిప్పుల అలలు కనురెప్పల కలహంలో పట్టపగలే పుట్టిన అదృశ్యపు కలలు చెఱగు చెఱగు గా శమన నింపే విషాదం గరుకు గరుకుగా అదుముకునే ఆత్మీయ నిశీథం అమాయకం గా నవ్వుతూ అగ్నిపర్వతం మూసుకున్న దారుల్ని మండిస్తున్న ఓ లావాశ్రుకణం!!! 31. 05. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mUazQb

Posted by Katta

Sanjeev Goud కవిత

నన్ను నన్ను గా చూస్తె నాకొరిగేదేమిటి బొంగు!! నాలో ఓ ఇంద్రున్నో చంద్రున్నో చూస్తెనే అది హంగు!!! మనసులో నువ్ ఎలా అన్కుంటే నాకేంటి నష్టం?? నల్గురిలో నన్నే గొప్పనకుంటే నాకెంతో కష్టం !!! నేనేసే జోకులకి నవ్వేవారంటే నాకు చానా ఇష్టం!! నా మీదెవడైన జోకేసినా వీప్పగలడం చాలా స్పష్టం !!! నన్ను గోప్పోడిగా గుర్తించి కీర్తించే వాళ్ళంతా నిర్మొహమాటంగా నాలాగే గొప్పోళ్ళని నేనంటా !!!! Comments: SuryaPrakash Chittimalla ilaa anesharu.. !! @""vakyalani kavyaluga rayadam lo ninnuminchina(munchina) vadu evarannaa!!"" Antha pedda compliment tho Naa janma dhanya Mai Nannu gurthinchina Naa. Mithrudu Ku a ananda bhaaskpalatho...... Sooranna.!! Yentha maatannaavannaa!! Meeku Thelavada!?Naan Rishi kuruthe Kavyam !!!!!.naraalu vashaalu tappithe manishulu shavaalu gaa maarathaaru... Aa manishulu vakyalanu sakhyamgaa koori Kavyalu gaa raasi rushulu gaa maratharu.....Ante nenu rishinenaa?????? Of course !! Nannu gurthinchina nuvvooo Rishi kanna kooda goppodivani gurthistu......!!!!!

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wEbFF7

Posted by Katta

Yessaar Katta కవిత

సురెక || తెలుగు గజల్-8 .. నిజంనీడన నిలిచుంటే నలుపన్నది లేనట్టే కుదురులేని మనిషికి సొలుపన్నది లేనట్టే .. ఓటమి తలుచుకుని ఎప్పటికీ ఏడిస్తే ఓడుపడ్డదారిలో గెలుపన్నది లేనట్టే. .. చెలిప్రేమ చేజారినా దిగులే లేకుంటే నెఱగానిమదికి తలుపన్నది లేనట్టే. .. జీవితసత్యంతో ముందుకు పోతుంటే బతుకుబాటలో అలుపన్నది లేనట్టే. .. ఆగని కోరికలు పరుగులు పెడ్తుంటే మదిగుఱ్ఱానికి పలుపన్నది లేనట్టే. .. ప్రీతిసుధల తోడ నిత్యం నిలుస్తుంటే జీవనసేద్యంలో కలుపన్నది లేనట్టే. .. (తెలుగు గజల్ -8 31/05/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oFlkZU

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్/ 31-5-2014 ఉగ్రవాదం మత్తులో తెగ ఊగుతున్నావెందుకు పగతొరగిలే మంటలో చలి కాగుతున్నావెందుకు లోకమంతా క్రాంతి వృక్షం పెంచుకుంటుంటే కొమ్మ తొడిగే శాంతి చివురులు తుంచుతున్నావెందుకు కూటి కోసం కూలిచేసే సాటి మనిషి గుండెలో కర్కశంగా వాడి బాకులు దించుతున్నావెందుకు సమత తీవెకు మమత పూసే పూలతోటల్లో తీవ్రవాదం కలుపు మొక్కలు పెంచుతున్నావెందుకు సర్వమతములు విశ్వశాంతిని ప్రభోదిస్తుంటే శాంతి కొరకే ఆయుధాలని పలుకుతున్నావెందుకు

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oFlkZG

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZN70E

Posted by Katta

Sky Baaba కవిత

http://ift.tt/1oa2Z3n

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oa2Z3n

Posted by Katta

Rvss Srinivas కవిత

|| పెంచుకో నీ ఆయుర్దాయాన్ని || (say no to tobacco) నీ చితికి మొదటి కట్టె నీవు కాల్చి పారేసిన తొలిసిగరెట్టే అట్టహాసం చేస్తుంది నీ చితాభస్మం చూసి. కాలికింద నలిపి పారేసిన సిగరెట్ల 'నుసి' "లాస్ట్ పఫ్" ని ఆస్వాదిస్తావు నువ్వు నీ "లాస్ట్ ఫైర్ " లో చలికాచుకుంటాయి నువ్వు కాల్చిన ప్రతి సిగరెట్టు. రింగులు రింగులుగా పొగను వదులుతావు నీ ఉరితాటిని నీవే బిగించుకుంటావు నీ వినోద యాగానికి సమిధని చేస్తావు సిగరెట్టుని... కాలం చేస్తున్న మారణహోమంలో నీవే ఆహుతి అయిపోతూ శరీరంలోకి వ్యాధిని పంపుతుంటావు శ్వాసలో మృత్యువుని నింపుకుంటావు ఇకనైనా ఆపు నీ వ్యసనాన్ని పెంచుకో దేవుడిచ్చిన ఆయుర్దాయాన్ని.... ....@శ్రీ 31/05/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jCOWPH

Posted by Katta

R K Chowdary Jasti కవిత

The Gates to the Heaven Nature took me out Carrying me in her arms From my loneliness; The flowers with their smiles Wished my eyes of sadness, And made me to titter; The birds with their tunes Opened my stillness And stirred me to croon; The butterflies surrounded me With their dance and got me To sprint behind them; The sky laid her soft hand On my frozen shoulder And hoisted me into fortune; The darkness that’s settled Inside of me to consume me Is now ablaze on fire in me; Now I am not alone And no longer in misery; Now my heart is so spirited And I feel as if I’m the emperor Of my world, and how beautiful Is the reality really! Once I chosen to end this life That I become free from its pain; But, now, I defer and wish this life To be eternally free that I enjoy The bliss of my existence; After I realized that Life is not a curse, but is a gift I’m, now, twinkling as a star; And the world is in wonder To see me in my heights; So I’m so proud of me for what I’m Now, with blessings of life! © R K Chowdary జాస్తి రామకృష్ణ చౌదరి 24May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jCOWiK

Posted by Katta

Sai Padma కవిత

సాయి పద్మ //.................................. మెలికల మలుపుల్లో మననీయని నడకల్లో కూడా నీ తలపు తెలుస్తూనే ఉంది రానివ్వని వెచ్చని కన్నీళ్ళలో " కాదు ' అని చెప్పలేని ఘోష లాంటి అస్తిత్వం ప్రతీ రాత్రీ గుచ్చుకుంటూనే ఉంది పంజరాల్లో చిలకలకి ఆర్ధిక స్వతంత్రం అవసరం లేదు బయట పెద్ద పంజరం ఎదురు చూస్తోందిగా మరి ఉష్.. తప్పని సరి బంధాల్లో ప్రేమ ఒక అతకని చవక అరల్దయిట్ అతికినట్టు కనబడుతూనే ఉంటుంది ఎందుకంటె ... మాట్లాడితే మనసివ్వాలేమోనని స్నేహిస్తే మోహించాలేమోనని చిరునవ్విస్తే ఆస్తి రాసివ్వాలేమోనని భయపడే ప్రేమికులూ, స్నేహితులూ ప్రపంచ పంజరంలో చాలామందే మరి ..!! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T0iBN6

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-49 ఒకరి మీద రాయి వేయాలనుకుంటే అలవోకగా వేసేస్తాం... ఒకరిలో ఏదో నచ్చి అభినందించాలంటే మాత్రం హృదయం గొంతు నొక్కి ఆపేస్తాం... ఎవరూ ఇక్కడకి పేద గా రాలేదు... తమదైన ఏదో ఒక సంచితశక్తి తోనే జన్మించారు అది తెలుసుకున్ననాడు అసూయకు తావే ఉండదు...! -------------------------------------- 31-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mTKbWP

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ అమర విజయ౦ @ ఆ చైతన్య మిప్పుడు ప్రజామోద౦ పొ౦ది౦ది ఆ ఉద్రేక మిప్పుడు కొ౦త ఊరట చె౦ది౦ది ఆ ఉద్వేగ౦...ఆ ఉద్యమ౦ నిర్మల౦గా సేద తీరి౦ది ఇన్నాళ్ళు కోట్ల గు౦డెలలొ చెలరేగిన భావావేశ మిప్పుడు ఎడ తెగని స౦బుర౦గా మారి౦ది అస్తిత్వ పరిరక్శన కొస౦ అసువులు బాసిన అమర వీరుల త్యాగ మిప్పుడు విజయ రూప దర్శనమిచ్చి౦ది స్వయ౦ పాలన కొరకై పొరాడి నేలకొరిగిన వారి ఆత్మ లిప్పుడు ఈ గడ్డపై పునర్జన్మి౦చాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. అగ్ని స్నానాలు చెసిన దేహాలు పవిత్ర యజ్న జ్వాల లైనాయి ఉరి తాడు నులిమిన బొ౦డిగెలు అదౄశ్య గానాలు వినిపిస్తున్నాయి సతమతమై ఆగిన శ్వాసలిప్పుడు స్వేచ్చా పవనాలై వీస్తున్నాయి పోరు కొసమ్ పేగు బ౦దాన్ని కట్టబెట్టిన గు౦డెలు కుదుట పడ్డాయి ఆ మాతృ మూర్తుల శోక సముద్రాలు ఆన౦ద బాశ్పాలై వర్శిస్తున్నాయి. స్వరాజ్య తెల౦గాణ సమర౦లో వలసవాద పీడన వలనో... సొ౦త ప్రా౦త నాయకుల చేత కాని తన౦ వలనో.. తట్టుకోలేక ఊపిరి వదిలిన ఆ వీరత్వపు ఆత్మలన్ని రేపటి నవోదయ కా౦తిరేఖలై ఈ నేలపై వెలగబోతున్నాయి... ఆగిన శ్వాసలను మన పాటలకు రాగాలుగా చేసుకు౦దా౦.. పోయిన ప్రాణాలను చరిత్రలొ రాసి సజీవ౦గా నిలుపుకు౦దా౦.. జోహార్లు జోహర్లు జోహార్లు మన నేల కై నేలకొరిగిన మన అన్నదమ్ముల్లకు..అక్కచెల్లెల్లకు. _ కొత్త అనిల్ కుమార్.,31 / 5 / 2014 ( జూన్ 2 నాడు మన తెల౦గాణ ఆవిర్బావ దిన౦ స౦దర్బ౦గా....)

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rrzEqX

Posted by Katta

Rajeswararao Konda కవిత

నీ దాహం తీర్చాలన్నదే- నా తపన 31/05/14 @ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rrzEqN

Posted by Katta

Ramakanth Vengala కవిత

అరణ్యకా౦క్ష ------------------- పున్నమిరాత్రి.. పుడమి చీలే .శబ్దంతో పుట్టుకొస్తున్న ఆరుద్ర పురుగులు.. ఆరు దశబ్దాల నిశిద్ధవస౦తాన్ని మోసుకొస్తున్నాయ్! ఇక.. క్రూరమృగాలు.. గుహల్లోకి! సరీశృపాలు.. పుట్టల్లోకి!! పోరాటగాథ ..చరిత్రపుటల్లోకి!!! మరోవైపు.. కోయిలగు౦పు స్వేచ్చాగీతంలో..కోయజాతి మృత్యుఘోష పాలపిట్టల ఆకాశమార్గ౦లో..పాపికొ౦డల ఆత్మహత్య నేపథ్య౦గా.. తెల్లవారడ౦ ..తేదీమారడ౦ మాత్రమే పూర్తయే సరికొత్త నవోదయ౦ కోస౦..నిరీక్షిస్తూ కలల తీగలమీద ..అరణ్య౦ ఆశల్ని ఆరేసుకు౦టూ౦ది!!! -రాము

by Ramakanth Vengala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rrzDTY

Posted by Katta

Sasi Bala కవిత

జీవి విలువ ......... శశిబాల .................................... తనువులోన జీవుడున్నంత వరకేర తనువ విలువ తనువున్న మనిషి విలువ రవ్వంత ధూళైన సోకనివ్వని మేను కడలోన మట్టిలో కలిసెను చూడరా ఎన్ని రాజ్యాలైన ఏలేటి మహారాజు ఆరడుగులే చాలు చాలంటు పండేరా ఇది మాయ జగమురా పెనుమాయ లోకమురా పదవుల్లో చదువుల్లో పల్లకెక్కిన బ్రతుకు ఆరిపోయిన పిదప పాడే చేరును కదర తరగనీ భాగ్యాల తెలియాడిన కూడ కొనలేవురా వుసురు .....తేలేవురా ప్రాణం 31 may 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEXpK6

Posted by Katta

Indira Bhyri కవిత

ఇందిర పోలవరం ఇప్పుడు జనాల్ని ముంచడానికో ముద్దుపేరు ప్రాజెక్టు ! ****** ఇన్నాళ్లూ విన్నది బహుళార్థ పథకాల గురించి కానీ ఇది బహుళనర్థ పోలవరం ! ******* అడవి సంద్రంలో చిచ్చుపెడితే తప్పదు తిరుగుబాటు సునామీ ! ******** మనోవ్యధకు మందులేదు మా బాధకు సరితూగు పరిహారాలు లేనేలేవు ! ********* నిర్వాసిత కనులలో చీకటి భవితవ్యం బాధిత గళమే కర్తవ్యం! ******* నిరసన గళాలు పెను ఉప్పెనైతే పోలవరం గడ్డిపోచ ! ******* కన్నీటితో ప్రాజెక్టులు కడితే రాళ్లు తప్ప రత్నాలు పండవు ! ****** పనికొచ్చే ప్రాజెక్టులు కడితే చెమటనీరు ధారపోస్తాం ! ******* ఆవాస పథకాలు ఉపాధి హామీలెరుగం నోటికాడి కూడు లాగేస్తే తిరగబడ్డం మాత్రం తెలుసు (2006 - ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి పోలవరం గిరిఘోష ' జీవన్మరణం 'సంకలనం నుండి ) 31/5/2014

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pttrc1

Posted by Katta

Kamal Lakshman కవిత

II కమల్ II నాలో నేను ...II నేను ... నాలోని... నేను వేదిస్తున్న అంతర్లీన భావనలు ఉబికి..ఉబికి బాహ్య ప్రపంచం లోకి వినువీధి లో విహంగం లా ఎల్లలు లేని మనుజులు సంచరించే యాంత్రిక జీవనం లో ఇమడలేక రాజీపడక నిరంతర సంఘర్షణ నిప్పుల కొలిమిలో పసిడి చవిచూసే సమ్మెట దెబ్బల వలె అంతరంగపు ఆటుపోట్లలా నన్నెపుడూ చేరుకోలేని నా లోని ఛాయలా నా పైని నీడలా మౌనంగా నన్ననుసరిస్తూ... నాలో సాగే..... నిశ్హబ్ధయుద్ధం.... నిశ్హబ్ధయుద్ధం.... కమల్ 31.05.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RN7tCj

Posted by Katta

Kapila Ramkumar కవిత

అబ్బూరి రామకృష్ణారావు....(నేడు వారి జన్మ దినం) --------------------------------------- జీవించిన ప్రతి క్షణం పూర్ణమక్షరం నిత్యం' Published: Wednesday, October 4, 2006, 23:53 [IST] : అబ్బూరి రామకృష్ణారావు. నూటనాలుగు సంవత్సరాల క్రితం జన్మించిన ఒకానొక కవి గురించి ఈ రోజున మనం చర్చించుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందసలు ? తొంభై ఒక్క సంవత్సరాల క్రితమే ఆయన తొలి తెలుగు కాల్పనిక కావ్యం కల్పించి ఉండొచ్చుగాక! కానీ ఇప్పుడు ఆయన గురించి పనిగట్టుకుని ప్రస్తావించాల్సిన అగత్యం ఏమిటి? "ఎంత వ్రాయగల శక్తి ఉందో అంత తక్కువ వ్రాసి" ఆయన విపరీతమనిపించే ప్రమాణంలో విచక్షణ ప్రదర్శించిన మాట నిజమేనని మాట వరసకు ఒప్పుకుంటున్నాం.ఎంత అరుదైన, అసాధారణమైన వ్యక్తి అయినా ఆయన గురించి ముచ్చటించడానికి సైతం ఒక సందర్భం అంటూ ఉండాలి కదా- అదేమిటి? యాభైఏళ్ళపాటు సాహిత్యసేవ సాగించిన సదరు మహానుభావుడు స్వచ్ఛందంగానే రాయడం విరమించి ఉండొచ్చు. తద్వారా చుట్టూ ఉన్న బండ,మొండి ప(రి)సరాలమీద తన అంచనా ఏమిటో విలక్షణమైన రీతిలో వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ మళ్లీ అదే ప్రశ్న ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం! అబ్బూరి రామకృష్ణారావు గురించి ప్రస్తావించుకోడానికి ప్రత్యేకంగా ఒక సందర్భం ఎంత మాత్రం అవసరం లేదు. ఆయన కేవలం రేర్‌బర్డ్‌ మాత్రమే కాదు- రేర్‌ బార్డ్‌ కూడా. పైపెచ్చు అబ్బూరి గురించి ముచ్చటించుకోవడమంటే సార్ధకమయిన, సంపూర్ణమయిన జీవితం గురించి మట్టాడుకోవడం. తెలుగు జాతి సాహిత్య చరిత్రగా నిలుస్తోంది ఆయన జీవిత చరిత్ర. అలాంటి అబ్బూరి గురించి ప్రస్తావించుకోవడానికి పంచాంగాలు తిరగెయ్యాలా ? పదమూడో యేటనే (1909లో) అబ్బూరి రామకృష్ణారావు రాసిన 'జలాంజలి' పద్య కావ్యాన్ని పరిశీలకులు తొలి తెలుగు కాల్పనిక కావ్యంగా పరిగణిస్తున్నారు. తెలుగు జాతి దౌర్భాగ్యమేమిటంటే, సదరు జలాంజలి కావ్యం సంపూర్ణమయిన రూపంలో ఎవరి దగ్గరా లేదు. కవిగారు సరే- అసాధారణమయిన, విపరీతమైన వ్యక్తిత్వ శోభ అయినది. అలాంటి వ్యక్తి దగ్గిర ఆయన రచనల తాలూకు కట్టింగులూ, క్లిప్పింగులూ కాపీలు దొరుకుతాయని ఆశించడం బాల్యం. కాగా తెలుగునేల నాలుగు చెరగులా విస్తరించి ఉన్న అబ్బూరి ఆప్తులు, ఆత్మీయులు, అంతేవాసులు కూడా ఆయన రచనల్లో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్న ఈ కావ్యాన్ని సంపూర్ణరూపంలో పునర్నిర్మాణం చెయ్యలేకపోవడం దారుణం. కానీ జరిగిపోయింది మరి! అబ్బూరి మేష్టారికి ప్రేరణగా నిలిచిన సమకాలీనుల్లో ముఖ్యుడైన కట్టమంచి రామలింగారెడ్డిగారు పింగళి సూరన ''కళాపూర్ణోద''యాన్ని పద్యరూపంలో వున్న నవలగా అభివర్ణించారు. ఆ లెక్కన చూస్తే అబ్బూరి రచన ''మల్లికాంబ'' కూడా పద్యాల్లో రాసిన నవలికగానే లెక్కకొస్తుంది. ''పూర్వప్రేమ'', ''నదీసుందరి'' కూడా అంతే. అబ్బూరి రాసిన తొలి ఆధునిక కవిత్వ ఖండికలు ''ఊహాగానము''లోనే కనిపిస్తాయి. ''అప్రాప్తమనోహరికి'', ''కాపుపాట'', '' మృతప్రేమ''లాంటివి ఉదాహరణ ప్రాయమయిన భావకవితా ఖండికలు. ఈ ధోరణిలో ఆయన సుమారు మూడు దశాబ్దాలు కవిత్వం చెప్పగలగడం చూస్తే అబ్బూరి రామకృష్ణారావుగారెంత ఓపికమంతులో అర్ధమవుతుంది. అయితే అదే రోజుల్లో ఆయన కుడీఎడమ చేతులతో శ్రీశ్రీ, పురిపండా, నారాయణబాబు, వరదలాంటి అభ్యుదయ కవులకు తర్ఫీదిస్తూ పోవడం గమనార్హం. అరుదయిన సృజనాత్మకతకు పరిపక్వ మేథస్సు తోడయితే ఎటువంటి అద్భుతం సాధ్యమవుతుందో ''కవిత''లో వచ్చిన అబ్బూరి ఖండికలు రుజువు చేశాయి. ''పైరుపండి రాలినట్లు ముసలియై లయించుజీవి రాలిమరల వచ్చుననుట రమ్యమయిన ఎండమావి''లాంటి స్టేట్‌మెంట్‌లు కేవలం కవిప్రాయుడుగాని, కేవలం తాత్వికుడు గాని అయిన వ్యక్తి చెయ్యలేనివి. ఆ రెండు లక్షణాలు సంతరించుకున్న అబ్బూరిలాంటి వాళ్లకే అలాంటి స్టేట్‌మెంట్‌ చేయగల శక్తి సొంతమవుతుంది. ''మరణం మరణించిందను మాయమాట రానీయకు, నీ హతకుడ నేనేనను నిందను నాపై వేయకు'' అనగల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అబ్బూరి సొంతఆస్తి. అలాంటివాళ్ల గురించి మాత్రమే అనగలిగిన మాట కూడా ఆయనే అనేశాడుః ''జీవించిన ప్రతిక్షణం పూర్ణమక్షరం నిత్యం''. అందుకే అబ్బూరి మృతి గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. కాలం నర్తకి ఏనాడో రావలసిం దీవారణపురికి మనం ఆ విశాలవట వృక్షం నిశ్చలనిభృతాగారం ఇంకా నిలిచే ఉన్నది. నాడు మనకు చిన్నతనం అల్లదుగో ! స్వర్ణశిఖర దేవమందిర ద్వారం నిన్నూ నన్నూ ఎరుగరు నేటి కొత్త పూజారులు పరిచిత కంఠస్వరాలు చెవులకు పండుగ చేయవు అటూ ఇటూ నిర్మించిన కొత్త కొత్త రహదారులు ఆ వెనకటి సుధాస్మృతులు వేరొక రుతి విననీయవు అసంబద్ధయశోవాంఛ పరచింతాపరాఙ్ముఖత ప్రబలే ఈ నగరంలో ఏమున్నది తుదకు ఫలం ? అంతులేని ధనపిపాస అనాగరక నాగరకత ఈ రొదలో ఎలా మనం మనుగడ సాగించగలం ? గతం గడిచిపోయిందని ఏలా ఈ అనుతాపం? కాలం నర్తకి, బహుశా మారుస్తున్నది రూపం! Read more at: http://ift.tt/1wD0qN5

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wD0qN5

Posted by Katta

John Hyde Kanumuri కవిత

ఇన్నాళ్ళూ వలస పోవడం భౌతికమనుకున్నాను అంతర్జాలానికి కూడా వర్తిస్తుందని ఇప్పుడే అర్థమయ్యింది చాట్ గదులనుంచి మెసింజెర్లకు బజ్లనుండి మి చాట్‌కు బ్లాగులు బాగోగులు ట్విట్టర్, ఆర్కూట్, ...ఫేసుబుక్కు వాట్సప్............... యుపిస్.. మోనిటర్... కీ బోర్డు.... మౌస్స్స్ లాప్ టాప్...... ఐ పాడ్.. ఇదో ... అదో .... ఎదొక మొబైల్...... తృప్తి అసంతృప్తుల మధ్య కొత్తదనాన్నేదో వెదక్కుంటూ వలసపోవల్సిందే !!! ........................................31.5.2014 06:50 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1krqvEX

Posted by Katta

Nishi Srinivas కవిత

*** दर्द *** ------------------------------निशीगंधा हजारो .... रंग है दुनिया मे फिर भी.... बेरंग मेरा मन मन का दर्द दिखया नही जाता चाहते हुए भी छिपाया नही जाता दर्द बर्फ से जमी है... जो प्यार कि गर्मी से पिघल जाती ི अश्रु के रुप मे नयनों से बह जाती ( Nishigandha) ( 31.05.14 )

by Nishi Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ptm0BH

Posted by Katta

Madhan Kumar Saggam కవిత



by Madhan Kumar Saggam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mRUH0G

Posted by Katta

Srinivas Vasudev కవిత

"నీకంటూ ఓ గది ఉంటే....?" ఈవారం మన అతిథి : వర్జీనియా వూల్ఫ్ -Virginia Woolf. ------------------------------------------------------------- ఔను మనకంటూ ఓ అన్ని హంగులతో ఓ గదంటూ ఉంటే అదే స్వేచ్ఛకీ నిర్వచనమేమో. ఇక్కడ గదన్నది ఆర్ధిక స్వాతంత్ర్యానికి చిహ్నంగా తీసుకుంటే మనదేశంలో చాలామందికి ఇదొక కల. మరదే స్వేచ్ఛ మనదేశంలో ఎంతమంది స్త్రీలకుందన్నది నిజంగానే మిలియన్ డాలర్ ప్రశ్న. వర్జీనియా కూడా అడిగేదీ అదె. సరె, ఇప్పుడు వర్జీనియా జీవితం గురించి కొంత తెల్సుకుని మళ్ళి ఈ గదికొద్దాం. 1882 జనవరి 25 న ఇంగ్లాండ్ లో జన్మించిన ఈమె ఉమ్మడి కుటుంబంలోనే జీవితంలో చాలా భాగం ఉండాల్సివచ్చింది. ఆమె తండ్రి లెస్లీ స్టీఫెన్, సాహితీవేత్త, తల్లి జూలియా లిరువురూ ఇంతకుముందు పెళ్లయి తమ జీవితసహచరులని కోల్పోయి మళ్ళీ పెళ్ళిచేసుకుని తమతమ సంతానాన్ని కూడా వెంటతెచ్చుకున్నారు. అంటే ఒకె ఇంట్లో దాదాపు ఎనిమిదిమంది పిల్లలతో కలిపి పదిమంది వరకూ ఉండేవారన్నమాట. "Your children and my children are fighting with our children" అన్న జోక్ కి ఈ కుటుంబం అతికినట్టు సరిపోతుంది. వర్జీనియాకి ఆరేళ్ల వయసులో తన సవతి అన్నదమ్ముల్లో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడటం, దాంతో కొన్నాళ్ళు మానసిక స్తబ్ధతతలోకి జారుకోవటం ఇవన్నీ వేగంగా జరిగిపోయినా ఆమె కోలుకోవటానికి ఓ జీవితకాలమే పట్టింది. ఇక అప్పట్నుంచీ ఆమె ఒడిదుడుకుల్లోంచి బయటపడి ఓ వ్యక్తికి,, ముఖ్యంగా స్త్రీకి ఆర్ధిక స్వేచ్చ ఎంత అవసరమో చెప్పేవిధంగా తన రచనలు చేయసాగింది. (దాదాపు ఇదంతా గతకొన్ని వారాలుగా రాస్తున్నారు కదా మళ్ళీ ఇదెవరు అని ఆశ్చర్యపోకండీ--మాయా యాంజిలౌ, సిల్వియా ప్లాత్, ఎమిలీ డికిన్సన్ ఇలా నేను ఉదహరించిన రచయిత్రుల జీవితాలన్నీ ఇలానే ఓ సారూప్యతని కలిగి ఉండటం నాకూ ఆశ్చర్యంగానే ఉంది మరి) 1908 లో మొదలుపెట్టిన ఆమె మొదటి నవల (The Voyage Out) పూర్తికావటానికి ఐదేళ్ళ పైనే పట్టిందంటే ఆశ్చర్యమె. ఈ మధ్యకాలంలో ఆమె మళ్ళీ మానసిక దౌర్బల్యానికి గురికావటం (అది అకారణమే అయినా) పెద్ద కారణం. తన రెండో నవల (Night and Day) ని 1919 లో పూర్తిచేయగలిగింది వర్జీనియా. ఆమె తననెప్పుడూ ఫెమినిస్ట్ అని ప్రకటించుకోకపోయినా ఆ ఇజం తన రచనల్లో స్పష్టంగా కన్పడటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఆమె చూసిన జీవితమే తన రచనలకి పెద్ద సోర్స్. చిన్నప్పట్నుంచీ ఒంటరితనాన్ని ఇష్టపడినా తల్లీ తండ్రీ మధ్యవయస్కులుగానే మరణించటమూ, తప్పనిసరి పరిస్థితుల్లో తన సొంత చెల్లెళ్లతోనూ సవతి అక్కాచెల్లెళ్ళపైనా ఆధారపడాల్సిరావటమూ వర్జీనియాకి ప్లస్ మైనస్సూ కూడా. 1925 లో ఆమె రాసిన మరో నవల Mrs. Dalloway వర్జీనియాకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టి ఆ నవలని చలనచిత్రంగా కూడ మలిచినా ఆమె డెప్రెషన్ కి లోను కావటంలో మార్పులేదు. తరువాత కాలంలో To the Lighthouse in 1927, and The Waves in 1931 ఆమెకి ఆంగ్ల నవలా సాహిత్యంలో తిరుగులేని ప్రఖ్యాతుల్ని సుస్థిరం చేసిపెట్టాయి. 1928 లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆమె ఇచ్చిన రెండు ప్రసంగపాఠాలే A Room of One’s Own (1929). స్త్రీలకి కావల్సిన ఆర్ధిక స్వాతంత్ర్యం గురించీ స్త్రీ రచనా వ్యాసంగం గురించి ఆమె ఇచ్చిన ఆ ప్రసంగాలు ప్రపంచాన్ని అప్పట్లో ఎంతలా ప్రభావితం చేసాయంటే ఆమె ఈ రచనని చదవని ఆంగ్ల సాహిత్య విద్యార్ధి లేరంటే అతిశయోక్తి కాదనలేమనేవరకు... ఈ క్రింది లింక్ ద్వారా ఆ పాఠాన్ని ఇక్కడ చదవొచ్చు. http://ift.tt/1nLvMgh ఆమె తన రచనల్లోని కోట్స్ లోని కొన్నింటిని ఇక్కడ మీకోసం: 1.It's not catastrophes, murders, deaths, diseases, that age and kill us; it's the way people look and laugh, and run up the steps of omnibuses. 2. The history of men's opposition to women's emancipation is more interesting perhaps than the story of that emancipation itself. 3. Boredom is the legitimate kingdom of the philanthropic. 4. I want the concentration & the romance, & the words all glued together, fused, glowing: have no time to waste any more on prose. 5. Why are women ... so much more interesting to men than men are to women? 6. One cannot think well, love well, sleep well, if one has not dined well. 7. My own brain is to me the most unaccountable of machinery—always buzzing, humming, soaring roaring diving, and then buried in mud. And why? What's this passion for? 8. If one could be friendly with women, what a pleasure—the relationship so secret and private compared with relations with men. Why not write about it truthfully? 9. The eyes of others our prisons; their thoughts our cages. చివరిగా ఆమె తన మిత్రురాలికి రాసిన ఓ ఉత్తరంలో మగాళ్ల గురించి ఓ సలహా: 10. Look here Vita — throw over your man, and we’ll go to Hampton Court and dine on the river together and walk in the garden in the moonlight and come home late and have a bottle of wine and get tipsy, and I’ll tell you all the things I have in my head, millions, myriads — They won’t stir by day, only by dark on the river. Think of that. Throw over your man, I say, and come.”

by Srinivas Vasudev



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o7wOla

Posted by Katta

30, మే 2014, శుక్రవారం

Srinivasu Gaddapati కవిత

యుద్దం ముగిసిపోలేదు ----------------------- // శ్రీనివాసుగద్దపాటి// ------------------------------- డియర్ కామ్రేడ్స్..... యుద్దం ముగిసిపోలేదు చెయ్యాల్సిందింకామిగిలే ఉంది అలసిపోయి ఆయుధం పక్కన బెట్టావా....! ఆయుధంతో అస్థిత్వమూ..... మాయం స్మశానాలకి జాగావెతికే పనేలేదు కొంపకి నీళ్ళెట్టారుగా....! ఇక ఊళ్ళకి ఊళ్ళే జలసమాధి ఇక్కడ కోయిలలు సెంట్రీ చెయ్యవు పీక నొక్కేశారుగా ఈ కంత్రీలు.. పంటనీరేమో.....! కంటనీరింకుతుంది గూడెం గుండె చెరువై దు:ఖం మత్తడి దుంకుతుంది ఓదార్చటానికి మనుషులేరి...? నేల నేలంతా ధు:ఖం పరచుకుంది ఇప్పుడు చేయాల్సింది సంబురాలు కాదు యుద్ధం ఇంకా మిగిలే ఉంది 30.05.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kRr1Rp

Posted by Katta

Vinjamuri Venkata Apparao కవిత

విశ్వకవి రవీంద్రుడి గీతం '' కోరొ జాగరిత '' కు స్వేచ్చానువాదం ... లకుమ // ప్రార్ధన // ప్రభూ ! ఎక్కడ చిత్త దీపమ్ము నిర్భీతి గ వెలుగునో? ఎక్కడ మానవుడు హిమ నగం లా తలెత్తుకొని మనగలడో? ఎక్కడ వీచికలు స్వేచ్చ్చా గీతికలై నలుదెశ లా వ్యాపించగలవో? ఎక్కడ భూగోళం ఖండ ఖండాలై దేశాలై ప్రాంతాలై గోడలై విడిపోదో? ఎక్కడ పదాలు పెదవులనూ ,పుటలనూ దాటేందుకిష్టపడతాయో? ఎక్కడ నిరంతరా' న్వేషణ ' సుజలాం సుఫలాపేక్ష దిశ గా సాగిపోతుందో? ఎక్కడ అనంత జ్ఞాన వాహిని అంధ విశ్వాసపుటెడారి దారుల్లో ఇంకిపోదో? ఎక్కడ పని లోనూ.పాటలోనూ ప్రజ ప్రపంచాన్నే మరచిపోతుందో? ఎక్కడకు చన మనస్సు ఉవ్విళ్ళూరు తుందో? ఎక్కడకు హృదయాంతరాళం పర్వులు తీస్తుందో? ఆ స్వేచ్చా స్వర్గం లోకి! ఆ స్వర్గ లోక ద్వారం లోకి...!! నా దేశం మేల్కొనునట్లు..... మమ్మనుగ్రహించు...!...

by Vinjamuri Venkata Apparao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gJ0w0Q

Posted by Katta

ShilaLolitha Poet కవిత

ఇటీవల ఎక్కువగా 'కవిసంగమం' చూసే అవకాశం కలుగుతోంది. ఇన్నేళ్ళ నా సాహిత్య జీవితంలో ఇన్నిన్ని కవితలు ఒకచోట చూసే అవకాశం; మరీ ముఖ్యంగా కొత్త తరం కవులు అద్భుతంగ కవిత్వం రాస్తుండటం ఎంతో సంతోషాన్ని కల్గిస్తుంది. ఇటువంటి వేదికలు ఎంత ఉపయోగమో, కవిత్వం- నిత్య కవిత్వ ఉత్సవంగా మారడానికి పరిణమించడం బాగుంది. ఫేస్ బుక్ ను 'కవిసంగమం' ఇలా కవిత్వం కోసం ఉపయోగిస్తుండటం ఎంతో ముచ్చటేస్తుంది.

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rpAQLf

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

దడి _______________________ అసంతృప్తికో దు:ఖానికో మౌనాన్నిమించిన మంచి వ్యక్తీకరణ లేదు కళ్లని వేలితో పొడుచుకోడం కన్నా రెప్పలకింద చూపుల్ని ఎదురుచూపుల్ని అదిమేయటం చాలు వానెప్పుడూ స్పష్టంగా కురవదు ఎక్కడో వెదుకులాటలో ఇరుక్కుపోయిన జీవితంలా చుట్టూ ఏవో నాటుకుని ఉన్నాయనుకుంటాం కానీ పరిసరాల్నించి నీడల్లా తుపుక్కున జారిపోయిన అడుగులు ఇంక నవ్వటం తెలియని పళ్లవరస అచ్చంగా ఎదురుచూడని కళ్లజంట అలా హృదయాన్ని నటిస్తాయి గాని తూరుపునిండా కందెనపూసి ఎంతకాలమైందో చుట్టూ ఉన్నాయనుకుంటాం గాని ఇప్పుడు మధ్యలోనే. .. ...

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jAOOQL

Posted by Katta

Afsar Afsar కవిత

"కరచాలనం" స్వల్ప విరామం: మిత్రులకు: కొద్ది కాలం "కరచాలనం" శీర్షిక రాయలేనందుకు బాధగా వుంది. అయితే, ఇది మంచికే- గత పదేళ్ళలో తెలుగులో వచ్చిన నూరు కవితల్ని తర్జుమా చేసి, సంపాదకత్వం వహించే బాధ్యత తీసుకున్నా. ఒక అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ఈ బాధ్యత నా మీద పెట్టింది. ఈ ఆరు నెలల్లో - అంటే డిసెంబరు లోపు- ఈ పని పూర్తి చేయాలి. దీని కోసం నేను మిగతా చాలా పనుల్ని పక్కన పెట్టి కేవలం ఈ అనువాదాల మీదనే దృష్టి పెడ్తున్నాను. ఇప్పటిదాకా "కరచాలనం" శీర్షిక పట్ల అమితమైన ఆసక్తి కనబరచిన మీ అందరికీ ధన్యవాదాలు. అయితే, ఇది విరామం మాత్రమే! మళ్ళీ త్వరలో కరచాలనం చేస్తాను మీతో!

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1izfYIi

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవిత



by రంజిత్ రెడ్డి కర్ర



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5aUiw

Posted by Katta

Sriarunam Rao కవిత

అందువల్లనే అప్పటి నా స్థితిని నేను ప్రేమమయమో చేసుకోగలిగానుతప్ప… యాసిడ్ మయమో, ఆత్మహత్యమయమో, హత్యామయమో చేసుకోలేదు. అదే ప్రేమతో నువ్వు నడిస్తే... ప్రేమ నీకు దొరికే తోడుకి రూపం. ఆ మనస్సుతోనే తనకి సమాధానమిచ్చాను "ప్రేమ అంటే అపూర్వమైన ఆనందాన్ని అందించే మానసిక లోకం. ఒక మగాడికి ఒక స్త్రీ కావలసిరావటం పెళ్ళి. కానీ… ఒక మనిషికి మరో మనిషి తోడు కావలసిరావటం ప్రేమ. నన్ను వదులుకోవటం ద్వారా నువ్వు నీ జీవితానికి లాజిక్ దొరికిందనుకుంటున్నావ్. కానీ నీ మనసుకున్న లావణ్యాన్ని మాత్రం కోల్పోతావు. అది మాత్రమే ఇప్పటికి నేను చెప్పగలను. నీకు ఎప్పుడు ప్రేమ కావాలనిపించినా నేనున్నానని గుర్తుచేసుకో". ఆమె తన జీవితాన్ని తను లాక్కెళ్ళిపోతుంది. అయితే ఆ యాత్రలో ప్రేమ అనే ఒక భావం తనకి ఎప్పుడు కలిగినా నేను గుర్తుకువస్తాను. నిజంగా అదే నేను సాధించుకున్న ప్రేమ. శ్రీఅరుణం 9885779207 విశాఖపట్నం-530001

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5aU1L

Posted by Katta

Sky Baaba కవిత

http://ift.tt/1oBqtlL

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oBqtlN

Posted by Katta

Girija Nookala కవిత

ఉరి ఎన్ని కొవ్వొత్తులు కాలుతున్నా కరగని కామం,మానవత్వాన్ని ఉరితీసింది. గ్లాసు వేరు,ప్లేటు వేరు, ఎదుట పడితే నడతే వేరు కాని అంటరాదనే అహంకారానికి అడ్డుచెప్పలేని కామ నియమమే వేరుకదా!ఔరా ఈ మగ జాతిని ఏమని తెగడాలి? రక్షక భటుడైనా రాక్షస క్రీడాకారుడే ఖాకీ బట్టలు చీల్చిన అధికార తిమిరం కంచె కున్న నిర్లక్ష్య ముళ్ళు పచ్చని పచ్చని జీవితాలని చీలుస్తున్నాయి సమాజ పార్టి జెండా కప్పుకొన్న యత్రాంగము రాతి కళ్ళతో చూస్తున్నాది. అభయ హస్తాలు,నమో మంత్రాలు,చీపురుతో మగద్రుష్టి తీస్తామన్న హామీలు ప్రభుత్వాలు మారినా,ప్రభువులు మారినా ప్రగతి మెట్లెక్కలేని బలహీనులకు ఆకాసం ఎన్ని రంగులు మార్చినా ఆడదాని బ్రతుకు అమావాస్య చీకట్లో దాగుమూతలయ్యంది ఎన్ని చట్టాలు వచ్చినా,నిర్భయ తన ఆడతనం చూసుకొని జడుసు కంటునే ఉంది.

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o4qdrJ

Posted by Katta

Indravelli Ramesh కవిత



by Indravelli Ramesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWA1kJ

Posted by Katta

Sky Baaba కవిత

Aahvaanam..! Qushaamadeed..!!

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6yVr4

Posted by Katta

Maheswari Goldy కవిత

|| రా జ హం స లు || మహేశ్వరి గోల్డి 1. మధుకరా...!! ఉదయ రవి కిరణాలు పలికే సంధ్యావందన గీతపు స రి గ మ ల స్వరమున రాలిన అక్షర విరుల మౌన భాషలు నిను మురిపిస్తూ .... మైమరపిస్తూ .... ప్రభాతాన అభినవ తుషారాలు అద్దిన వేణుపూల కుంచెలతో గీస్తున్న రేఖా చిత్రాలు వైతరణి దివిలో సుహాసిని లతలతో నిర్మించిన సుజమల్ సంస్థాన సౌదామిని రూపు సంతరించుకుంటూ.....!! 2. కలల అలలపై పిలుపునిస్తున్న సుప్రభాతాలు చందన సమీరపు గగన వాకిలి పై అందంగా పొదిగిన రేవతి నక్షత్ర సిందువులతో జీవం సేవిస్తూ రాలుపూల రహదారి పై వెలసిన ప్రాణ శిలల ఊపిరి ఊహలు తగిలి మలిసంధ్య మౌనపు లాలనలో నిదురిస్తున్న సౌగంధికా విరుల ఓ వనమాలికి నే పంపిస్తున్న మౌన లేఖలు అద్దాల పల్లకిలో రాజహంసలయి శ్వాసిస్తుంటే ...!! 3. నవదీప కిరణాలతో ముస్తాబయిన పగడాపు ప్రమిదల కాంతిలో విరిసిన చంద్రమతి కలువలు రాజసమంత్రాల సాక్షిగా .... మోహమకరందాలు వాలిన నైషధీ వనమున మన ప్రేమకధను హృద్యంగా మలచి అబినవ పత్రికల పై నిన్నూహిస్తూ కొలువు చేస్తున్నవి...........!!30/05/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1knqa6c

Posted by Katta

Srikanth Kantekar కవిత

కెరటం (m) ------------ రోజూ తప్పిపోతుంటాం ఆలోచనదారుల్లో బతుకుపట నుంచి పక్కకు జరిగినట్టు ఏ వివరం లేని అనాసక్తిలోకి జారిపోతాం కాసిన చెట్టుమీద రాళ్లుపడ్డట్టు కుదుపుతున్న ఆలోచనలు శాంతంలేని మనసుకు ఎత్తుపల్లాల ఎదురుదారిలో లాక్కెళుతుంటాం బతుకురథాన్ని గజిబిజి కాలం రచించే ప్రతి సందర్భం కావ్యం కాదేమో ఆశించనదేది దొరకదని చెప్పే ప్రేమ గురించి ఆశలు వదులుకోలేని మనసు గురించి స్థూలంగా గ్రహించడమే జీవిత సూత్రమేమో ప్రతి బతుకు కథలో అంతర్లీనంగా దుఃఖముంటుందన్న స్పృహ కలుగడమే దర్శించాల్సిన సూక్ష్మ సత్యమేమో బతుకుబాటలో కిందామీద పడిపోయే సంక్షోభాన్ని గుండె ధైర్యంతో ఎదురొడ్డి ఎదురీదాలి ప్రవాహానికి ఎదురుపడ్డ ప్రతి తీరం గురిగా వెన్నుతట్టి సంధించాలి కెరటాన్ని - శ్రీకాంత్ కాంటేకర్ 30-5-14

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6uyfA

Posted by Katta

Bandi Satyanarayana కవిత



by Bandi Satyanarayana



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6uuwo

Posted by Katta

Rajender Kalluri కవిత

## అనఘా ## అనగా అనగా తన పేరే " అనఘా " కనగా కనగా తన రూపం కనగా నా మతిపోయెనే చిన్నగా .... వినగా వినగా తన మాటలు వినగా అనెగా అనెగా నా మనసే అనెగా చిలుక కుడా చిన్నబోయేలా ఉంది నిన్ను చూడగా ..... మెల్లగా మెల్లగా తను మెలికలు తిరగ్గా ఓరగా ఓరగా నా కన్నులే చూడగా అడగ్గా అడగ్గా తనొక్కసారి మాటాడగా ఆగిన నా గుండె వేగం పెరగ్గా అడిగా ఒక మాట నేరుగా నా ప్రశ్నకు జవాబు కోపంగా అలాగ్గా అర్ధం కాని ఆలోచనలతో పదే పదే తనముందు నిల్చుండగా .... జాలిగా ఒక్కసారి వాలే తన చూపు ప్రేమగా మారగా తన నోటి వెంట పలికిన మాట .... ఇక మీదట నీదే ఈ " అనఘా " kAlluRi [ 30 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mOdfPn

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!! మానసిక వేదన .... విశ్వప్రేమ భావన !! అన్ని వున్నవాళ్ళకు ఆప్యాయత విలువ తెలియదు పలకరించే వాళ్ళు లేనపుడు తెలుస్తుంది ప్రేమ విలువ ప్రేమ ,ఓదార్పు కొరుకోవటం తప్పు కాదు .. మనుషులం కదా ప్రతి పిలుపుకి స్పందించటం ఎండమావి లో నీటిని చూడటం నీకు లేనిది తెలుస్తోంది కాని వున్నది గమనించవే అంగ వైకల్యం వున్న వాళ్ళకు మనోవైకల్యం వుండదు అన్నీ వున్నా లేనిదానికై ఎందుకీ మానసిక వేదన కోట్ల ఆస్తి వున్నా సంతానం లేక బాధ ఒకరికి తను ఎవరో తెలియక అమ్మా నాన్న లేని వారి బాధ ఇంకొకరు తనకు వున్నా ఇంకా లేదు అనే అత్యాశ బాధ ఒకరిది ప్రేయసి దూరమై మనువు చేసుకోలేని బాధ మనువు చేసుకుని మనసార భార్యను ప్రేమించలేని బాధ ఇంకొకరిది సమాజం హర్షించిన జంట సమన్వయము లేక బాధ కొందరిది చేతిలో వున్నది వదలి ప్రతి దానికోసం వెంపర్లాడుతూ బాధ ఎందరిదో ఈ బాధలన్నీ మొదలు అయ్యేది మనలోంచే మనలో వున్న మనవద్ద వున్న ఆనందం చుస్తే మనకు ఈ బాధలు చాలా వరకు వుండవు భగవంతుడు ఒకటి తీస్తే ... ఇంకొకటి ఇస్తాడు .. చూడగలిగితే లేనిదానికోసం తాపత్రయ పడవద్దు జీవితాలు నాశనం చేసుకోవద్దు వున్నది ఏదో తెలుసుకుంటే .. ప్రపంచం లో నీ అంత గొప్పవారు వుండరు బాధలను రూపు మాపేది విశ్వప్రేమ అది మనసు నిండా నింపుకో మానవడు స్తాయి నుంచి మహనీయ స్తాయికి ఎదగాలి నేస్తాలు !!పార్ధ !!30/5/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3vzn7

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

ఓ దేవుడా! నాకు ఏమీ తెలియనప్పుడు బాల్యాన్నీ, యవ్వనాన్ని ఇచ్చావ్ నాకు అన్నీ తెలిసినప్పుడు వార్ధక్యాన్నీ, మరణాన్ని ఇవ్వబోతున్నావ్

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3vwYr

Posted by Katta

Krishna Mani కవిత

అడవి బిడ్డలం _______________కృష్ణ మణి అయ్యా దొరలూ ! అడవి బిడ్డలం ఆకలేస్తే అడివమ్మ పెడుతది ఎంగిలి ఎప్పుడన్న అడిగినమా కడుపులెండినాయని ఎన్నడన్న చెయ్యి జాపినమా ? మనషుల్ని ముంచుడు మీకలవాటేమో కోటక్క జీవరాశేమ్మన్నది ? తేనెపట్టు దోషినమని దొంగలమా ? విప్పపువ్వు ఎరినమని ఎక్కిరింపులా ? అడవి జాతర్లో ఆది బిడ్డలం నాగరికత మీదైతే జులూమా ? అనాగారికులమైనా మనసున్నోళ్ళం ! తీరొక్క జీవాలను బొందబెడతరా ? సిగ్గు శెరం లేదా ? ఊరవతల గుడిసేలేసుకోవలనా ? మీ బిచ్చానికి చాటబట్టాలెనా ? మమ్ముల ముంచి గింజలు పండిస్తరా ? ఆకలైతే అడుక్కోవాలెనా ? మీ అయ్యల జాగిరెమ్మన్నా మా అయ్యలకిచ్చినరా ? లేక అప్పు రాసుకున్నరా ? రాముడు మా దేవుడన్నరు ఇందుకేనా ? మీతోనే ఉంటామని మూసుకున్నం అప్పుడు నమ్మినోన్ని నట్టేట్ల ముంచుడమేనా మీ నీతి ? ఆకులలాలు తినుకుంట మంచిగున్నం మా ఉసురు తీయకున్డ్రి నోరుందని అడుగుతున్నం నోరు లేని అమాయకపు కన్నులకేమి తెలుసు బతికేది మూన్నాలని ! అడుగుతున్నం కాళ్ళకు మొక్కి కనికరముంచమని కసాయిగా నడుస్తే బుల్డోజర్ల కింద పండుతం మా బిడ్డల కోసం ఆ జీవుల కోసం మా జీవినిస్తం ! అడవి వేటలో అడుగు తెల్సినొళ్ళం అయితదేమో కాని కొత్త ‘అవతార్’ మొదలైతది మాటలేకున్న రోషముంది ! 30-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kPF0al

Posted by Katta

29, మే 2014, గురువారం

Abd Wahed కవిత

ఈ రోజు ఉర్దూ కవిత్వ నజరానాలో గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ చూద్దాం మొదటి షేర్ బస్ కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసాం హోనా ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సాం హోనా ప్రతి పని సులభంగా నెరవేరడం చాల కష్టం మనిషికి కూడా మానవుడిగా మారడం చాలా కష్టం చాలా సరళమైన పదాలతో గాలిబ్ చాలా లోతయిన భావాన్ని వ్యక్తం చేసిన కవిత ఇది ఇందులో ఉన్న ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. బస్కే అంటే అత్యధికంగా, చాలా ఎక్కువగా అని అర్ధం. దుష్వార్ అంటే అసాధ్యం, సాధ్యం కాని పని, చాలా కఠినమైన పని అని భావం. మయస్సర్ అంటే లభించడం, దొరకడం, ప్రాప్తం కావడం వగైరా అర్ధాలు చెప్పవచ్చు. ఆద్మీ అన్న పదం గమనించదగ్గది. ఆద్మీ అంటే మనిషి అన్నది భావం. ఆదమ్ నుంచి మానవాళి వ్యాప్తి చెందింది కాబట్టి మనిషిని ఆద్మీ అంటే ఆదమ్ సంతానం అంటారు. ఇన్సాన్ అంటే కూడా మనిషి, మానవుడు అని అర్ధం. ఇక్కడ మానవ లక్షణానికి ప్రాముఖ్యం ఉంది. ఇన్సానియత్ అంటే మానవత్వం. ఇన్సాం హోనా అంటే మానవత్వ లక్షణాలతో నిజమైన మనిషిగా మారడం. ఈ కవితలో భావాన్ని చూద్దాం. మనిషికి ఏ పనయినా చాలా కష్టంతో కాని పూర్తి కాదంటున్నాడు గాలిబ్. మనిషి ప్రతి పని చేయడానికి చాలా కష్టపడక తప్పదు. మనిషి మనిషిగా పుట్టాడు. ఉర్దూలో ఉన్న పంక్తిని గమనిస్తే, ఆదమ్ సంతానం కావడం వల్ల పుట్టుకతోనే మనిషిగా పుట్టాడు. ఇంకొక్క అడుగు ముందుకేస్తే చాలు మానవత్వ లక్షణాలున్న ఇన్సాన్ గా మారవచ్చు. కాని ఆ ఒక్క అడుగు ముందుకేయడం కూడా మనిషికి ప్రాప్తం కావడం లేదు. సాధ్యపడడం లేదు. ఒక తీవ్రమైన వ్యంగ్యం ఇందులో ఉంది. మనిషి మనిషిగా పుట్టాడు కాని, మనిషిగా మానవత్వంతో బతకడం మనిషికి సాధ్యపడడం లేదని అంటున్నాడు. ఇది నిజానికి చాలా చిన్నపనే కాని అది కూడా చాలా పనుల్లాగే సాధ్యం కావడం లేదంటున్నాడు. ఈ కవితలో గాలిబ్ ప్రయోగించిన పదాలు కూడా గమనించదగ్గవి. దుష్వార్ అన్న పదానికి పూర్తి వ్యతిరేకపదం ఆసాన్ ఉపయోగించి రెండవ పంక్తిలో ఆద్మీ అన్న పదం ఇన్సాన్ అన్న పదం ప్రాసగా వాడాడు. మొదటి పంక్తిలో రెండు పదాలు వ్యతిరేకార్థం ఉన్న పదాలు. కాని రెండవ పంక్తిలో రెండు పదాలు సాధారణంగా పర్యాయపదాలే, కాని వాటిని వ్యతిరేకార్థం కలిగిన పదాలుగా ప్రయోగించడంలో కవిత్వ నైపుణ్యం గమనించదగ్గది. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవితపై తమ అభిప్రాయం చెబుతూ మనిషికి ముఖ్యమైన లక్షణం మానవత్వం, మనిషి పుట్టుకతో మానవజన్మ ఎత్తాడు కాబట్టి ఇక మానవత్వం నిండిన మనిషిగా మారడం అతడికి చాలా సులభం. పశుపక్ష్యాదులకు ఇది సాధ్యం కాదు. కాని తనకు సులభమైన పని చేయడం కూడా మనిషికి సాధ్యం కావడం లేదు. ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమంటే, దేవుడు మనిషికి ఆలోచించే, తన ఇష్టం ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. ఇతర ప్రాణులకు అలాంటి స్వేచ్ఛ లేదు. అవి ఎలా బతకాలని దేవుడు నిర్ణయించాడో అలాగే బతుకుతాయి. అవి తమ పరిస్థితిని మార్చుకోలేవు. కాని మనిషి పరిస్థితి అది కాదు. మనిషిని దేవుడు ’’అష్రఫుల్ మఖ్లూఖ్‘‘ అంటే సమస్త ప్రాణుల్లో అత్యుత్తముడిగా పుట్టించాడు. పైగా భూమిపై సమస్తమూ మనిషి కోసమే పుట్టించాడు. ఇన్ని సదుపాయాలున్నప్పుడు మనిషి, పుట్టుకరీత్యా తనకు లభించిన ఈ సానుకూలతలను ఉపయోగించుకుని మానవత్వం ఉన్న మనిషిగా మారడం చాలా తేలిక. కాని అది కూడా అతడికి అసాధ్యం అయిపోయింది. ఈ మాట అంటూ, అసలు మనిషికి ఏ పని కూడా సులభం కాదు అంటూ మనిషి ఎలాంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడో తేల్చి చెప్పేశాడు. రెండవ కవిత గిర్యా చాహే హై ఖరాబీ మేరే కాషానే కీ దరో దీవార్ సే టప్కే హై బయాబాం హోనా నా నివాసం నాశనం కావాలన్నదే రోదనల కోరిక గోడలు, తలుపుల నుంచి కారడవి కారుతుంది చూడు ఈ కవిత భావాన్ని పరిశీలించే ముందు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. గిర్యా అంటే రోదనలు, దుఃఖం అని అర్ధం. కాషానా అంటే నివాసం, ఖరాబీ అంటే వినాశం. దర్ అంటే తలుపు. దరో దివార్ అంటే తలుపులు గోడలు అని అర్ధం. టపక్నా అంటే బొట్లు బొట్లుగా రాలడం. వర్షంలో ఇంటి పైకప్పు లీకేజి ఉంటే వర్షపు నీరు బొట్లు బొట్లుగా లోపల పడుతుంది దీని టపక్నా అంటారు. టపక్తా హై అంటే కారుతుంది అని అర్ధం. పాత ఉర్దూ వాడకంలో టప్కే హై అని కూడా ఉపయోగించేవారు. బయాబాం అంటే అడవి. బయాబాం హోనా అంటే అడవిగా మారడం (making of wilderness) అని చెప్పుకోవచ్చు. అంటే అడవిగా మారే ప్రక్రియ బొట్లు బొట్లుగా కారుతోందన్నది భావం. ఈ కవిత భావాన్ని పరిశీలిద్దాం. గాలిబ్ చాలా విషాదంలో ఉన్నాడు. రోదిస్తున్నాడు. అయితే ఈ రోదన తన ఇంటిని నాశనం చేయాలనుకుంటోందని మనకు చెబుతున్నాడు. తన ఇంటి గోడలు, తలుపుల నుంచి వర్షంలో నీరు కారుతున్నట్లు అడవి కారుతుందని చెబుతున్నాడు. ఇల్లు పాడుపడితే ఇంటిలో పిచ్చిమొక్కలు పెరిగి అడవిలా తయారవుతుంది. తన రోదన తన ఇంటి వినాశాన్ని కోరుతుందని, అందువల్ల ఇంట్లో వర్షపు నీటిలా అడవి కారుతోందని చెప్పాడు. ఈ కవితలోని పదచిత్రాలు, పోలికలు పరిశీలించదగ్గవి. రోదన వల్ల కంట నీరు వర్షిస్తుంది. ఆ రోదన అతని ఇంటి వినాశాన్ని కోరుతుంది. అందువల్ల ఆ నీరు అడవిగా ఇంటి గోడలనుంచి, తలుపుల నుంచి కారుతోంది. ఇలాంటి పోలిక బహుశా గాలిబ్ తప్ప మరెవ్వరూ చెప్పలేరు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్లో 4వ షేర్ వాయె దీవాన్గీ షౌఖ్ కీ హర్ దమ్ ముఝ్ కో ఆప్ జానా ఉధర్, ఔర్ ఆప్ హీ హైరాం హోనా అయ్యో, ప్రేమబాధ ఏం చెప్పేది ప్రతిక్షణం అటు వెళ్లడమూ, అయోమయంగా మరలడమూ ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. వాయ్ అంటే అయ్యో అని భావం. దీవాన్గీ యే షౌఖ్ అంటే ప్రేమ పిచ్చి. ప్రేమాతిశయం. హర్ దమ్ అంటే అనుక్షణం, ఈ పదానికి మరో అర్ధం ప్రతి ఊపిరిలో. ఇలాంటిదే మరో పదం ఏక్ దమ్ అంటే ఒక్కుదుటు అని అర్ధం. నిఘంటు ప్రకారం ఒక్కశ్వాసలో. దమ్ అంటే శ్వాస. హర్ దమ్ అంటే ప్రతిశ్వాసలో అని భావం. ఉధర్ అంటే ఆ వైపు. ఇక్కడ ఆమె వైపు అని భావం. హైరాం అంటే అయోమయానికి, గందరగోళానికి గురికావడం. ఈ కవిత భావాన్ని చూద్దాం. గాలిబ్ తన ప్రేమను వర్ణిస్తున్నాడు. ప్రేమలో పిచ్చివాడైపోయాడు. చివరకు తన ప్రేమపిచ్చి పట్ల తనకే అయ్యో అనిపిస్తోంది. ప్రేమపిచ్చిలో పడి అనుక్షణం ఆమె కోసం వెళుతున్నాడు. కనీసం ఒకసారి చూడాలని, అది సాధ్యం కాదని తెలిసి కూడా వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరరే ఇక్కడికి ఎందుకొచ్చాను అని అయోమయంలో పడిపోతున్నాడు. ఆమెను చూడడమైతే సాధ్యం కాదు. కాని ఏం చేస్తాడు, ప్రేమపిచ్చిలో పడ్డాడు కాబట్టి వేలసార్లు అక్కడికి వెళతాడు, మళ్ళీ నిరాశగా తిరిగివస్తాడు. ఈ కవితలో ప్రియుడి పరిస్థితిని వర్ణించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేయసిని చూడ్డానికి ఆమె వీధిలో చక్కర్లు కొట్టడం మామూలే కదా. ఒక్కోసారి అదృష్టం కలిసొస్తే కనబడుతుంది లేకపోతే లేదు. ప్రేయసిని చూడాలన్నది ఒక అందమైన కల. ఆమె కనబడదన్నది వాస్తవం. కల వాస్తవాల్లో చిక్కుకుపోయిన పరిస్థితి. ఈ నిస్సహాయ పరిస్థితి చూసి అయ్యో అనకుండా ఎవరుంటారు? గాలిబ్ కూడా అదే అంటున్నాడు. తన నిస్సహాయస్థితి పట్ల అయ్యో అనుకుంటున్నాడు. ఇది కేవలం ప్రేమపిచ్చిలో పడిన వారి పరిస్థితి మాత్రమే కాదు, ఇలాంటి పిచ్చి ఇష్టం ఎవరి పట్ల అయినా ఉండవచ్చు. అభిమాన తారలను ఒక్కసారి చూడాలని పడిగాపులు పడేవాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వారిని చూసినప్పుడు కూడా అయ్యో అనిపించే జాలి మాత్రమే కలుగుతుందన్నది ఆలోచిస్తే గాలిబ్ కవితలో ఉన్న లోతు అర్ధమవుతుంది. గాలిబ్ ఇక్కడ తన ప్రేమపిచ్చిని గొప్పగా వర్ణించుకోవడం లేదు. ఈ పిచ్చి విషయంలో తనపై తానే జాలి పడుతున్నాడు. ఈ కవితలో గాలిబ్ వాడిన ’’హర్ దమ్‘‘ అన్న పదం గమనించదగ్గది. సాధారణంగా ఈ పదానికి అర్ధం అనుక్షణం. కాని దమ్ అంటే శ్వాస అని అర్ధం. హర్ దమ్ అంటే ప్రతిశ్వాస అని అర్ధం. ఇక్కడ ప్రతి శ్వాస అన్న భావం తీసుకుంటే, ఈ కవిత ఇష్క్ హకీకీ కవిత. ఉర్దూలో ప్రేమ అనేది రెండు తరగతులుగా విభజించవచ్చు. ఇష్క్ మజాజీ అంటే ప్రాపంచిక ప్రేమ. అంటే ఒక ప్రేయసి ఒక ప్రియుడికి మధ్య ఉండే ప్రేమ. ఇప్పటి వరకు ఈ కవితకు మనం అలాంటి కోణంలోనే భావం తెలుసుకున్నాం. కాని ఇష్క్ హకీకీ అంటే దైవం పట్ల ప్రేమ. అంటే నిజమైన ప్రేమ. ఇదే సూఫీతత్వం. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవితలో లోతయిన సూఫీతత్వం ఉందన్నారు. ప్రతిశ్వాస తీసుకుంటున్నప్పుడు నిత్యుడు, సృష్టికర్త అయిన దైవం వైపునకు పరుగెత్తి వెళుతున్నాడు. కాని దైవాన్ని చూడడం సాధ్యం కాదని తెలిసి అయోమయంగా వెనక్కి మళ్ళుతున్నాడు. దైవాన్ని చూడాలన్న కోరికతో వెళ్ళడాన్ని ఉచ్ఛాస్వగాను, చూడలేక నిస్సహాయంగా మరలడాన్ని నిశ్వాసగాను వర్ణించాడు. ఈ కల వాస్తవాల మధ్యనే బతుకుతున్నాడు. తీసుకున్న ఊపిరి పైకి పోతే మనిషి ఇహలోకాన్ని చాలిస్తాడు. ఆ తర్వాత దేవుడి ముందు జవాబు చెప్పుకునే పరలోకంలోకి ప్రవేశిస్తాడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 5వ షేర్ జల్వా అజ్ బస్కే తఖాజాయె నిగా కర్తా హూం జోహరె ఆయినా భీ, చాహే హై మజగాం హోనా ఆమె అద్భుత రూపం అందరి దృష్టికి కేంద్రం అద్దంపై గీతలు కూడా కనురెప్పలై ఆమెను చూస్తున్నాయి ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. జల్వా అంటే వైభవం. అజ్ బస్కే అంటే అత్యధికంగా అని అర్ధం. తఖాజా అంటే డిమాండ్ అని అర్ధం. తఖాజాయే నిగా అంటే దృష్టి పడాలని డిమాండ్ చేయడం. జోహరె ఆయినా అంటే అద్దంపై ఉన్న గీతలు (scratches). పాతకాలంలో అద్దాలను చేత్తో పాలిష్ చేసేవారు. అందువల్ల అద్దంపై కొన్ని గీతలు ఉండేవి. అద్దాలు గాజుతో కాకుండా లోహంతో కూడా చేసేవారు. మజ్ గాం అంటే కనురెప్పకు ఉండే వెంట్రుకలు, రోమాలు ఇంగ్లీషులో eyelashes. ఈ కవితకు భావం చూద్దాం. గాలిబ్ ప్రేయసి సౌందర్యం వైభవోపేతమైంది. అందరి చూపులను తనవైపు తిప్పుకునే సౌందర్యం ఆమె స్వంతం. మరో విధంగా చెప్పాలంటే ఆమె సౌందర్యం అందరి చూపులను తనవైపు చూడాలని ఆదేశిస్తుంది. ఆ ఆదేశాన్ని అద్దంలోని గీతలు కూడా మన్నిస్తున్నాయి. అద్దానికి ఉన్న గీతలు కూడా eyelashes గా మారి ఆమెను చూస్తున్నాయి. ఈ కవితలో గాలిబ్ అద్దానికి కూడా ప్రాణం పోశాడు. ఆమె తన్ను తాను చూసుకోడానికి అద్దం వద్దకు వెళ్ళింది. కాని ఆమె సౌందర్యం అసాధారణమైనది. అందరి చూపులు తనవైపు తిప్పుకునే ఆ సౌందర్యం అద్దాన్ని కూడా తనవైపు చూసేలా చేసింది. అద్దం కూడా ఆమెను కళ్ళార్పకుండా చూస్తుంటే, అద్దంపై ఉన్న గీతలు కనురెప్పలపై రోమాలుగా మారిపోయాయి. ప్రేయసి సౌందర్యాన్ని ఇలా వర్ణించిన కవి మరొకరు ఎవరైనా ఉన్నారా? తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 6వ షేర్ ఇష్రతె ఖతల్ గయే అహ్లే తమన్నా మత్ పూచ్ ఈదె నజ్జారా హై, షంషీర్ కా ఉర్యాం హోనా వధ్యస్థలిలో ప్రియుడి సంతోషం గురించి అడక్కు నగ్నకరవాలం, పండుగ నాటి నెలవంకే అవుతుంది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఇష్రత్ అంటే సంతోషం, ఉత్సాహం వగైరా అర్ధాలున్నాయి. ఖతల్ గాహ్ అంటే వధ్యస్థలి. హతమయ్యే చోటు. అహ్లె తమన్నా అంటే ప్రేమించిన వారు. ఈద్ అంటే సంతోష సమయం. పండుగ. నజ్జారా అంటే దృశ్యం. షంషీర్ అంటే కరవాలం. ఉర్యాం అంటే నగ్నంగా అని అర్ధం. షంషీర్ కా ఉర్యాం హోనా అంటే ఒర నుంచి బయటకు దూసిన కరవాలం. నగ్నకరవాలం. ఈ కవితలో గాలిబ్ ఒక దృశ్యాన్ని వర్ణించాడు. ప్రేమపిచ్చిలో మునిగిపోయిన వారు చివరకు తమ ప్రేయసిని ఒక్కసారి చూడడానికి వధ్యస్థలికి కూడా చేరుకున్నారు. అంటే తమ ప్రాణాలు పోగొట్టుకునే ప్రదేశానికి కూడా వచ్చేశారు. అక్కడ చావు సమీపంలో, వధ్యస్థలిలో వారి సంతోషం గురించి అడగొద్దు, వారు చాలా ఉత్సాహంగా ఉన్నారంటున్నాడు. ఆమె చేతిలో హతమైన ఫర్వాలేదు, ఎందుకంటే అప్పుడు ఆమెను చాలా దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి. ఆమె ఖడ్గాన్ని ఒర నుంచి పైకి లాగినప్పుడు వారికి ఆ కరవాలం పండుగ రోజున నెలవంకను చూసినంత సంతోషాన్నిస్తుంది. (రమజాన్ పండుగ నెలవంకను చూసిన తర్వాత ఉపవాసాలు విరమించి చేసుకుంటారు. నెలవంకను చూడడం అనేది మర్నాడు పండుగ ఉందన్న సంకేతం. కాబట్టి చాలా సంతోషకరమైన దృశ్యం). వధ్యాస్థలిలో ప్రియుడి సంతోషం ఎలా ఉంటుందో నన్నడక్కండి అంటున్నాడు గాలిబ్. అంటే అంత అతిశయించిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి. ఆమె చేతి కరవాలం వంపు పండుగ నెలవంకలా వారికి ఆనందాన్నిస్తుంది. చివరి శ్వాస వదిలే ముందు అతి దగ్గరగా చూసే అవకాశం వారికి లభించిందన్న సంతోషం పట్టశక్యం కానంత ఉంటుందంటున్నాడు. ఉర్దూ కవిత్వంలో ప్రతీకల వైవిధ్యం, కొన్ని అతిశయోక్తుల ప్రయోగం తెలుగులో కాస్త కొత్తగా ఉండవచ్చు. ఉర్దూ కవిత్వంలో ప్రతీకలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రేయసిని ఖాతిల్ (హంతకి) అని వర్ణించడం చాలా సాధారణం. ప్రేయసి కనుబొమలను కరవాలంగా పోల్చడమూ కనబడుతుంది. ఎందుకంటే వాటి పదునైన సౌందర్యం ప్రియుడి గుండెను ముక్కలు చేస్తుంది కాబట్టి. ప్రేయసి చూపులను చురకత్తులతో పోల్చడమూ సాధారణంగా కనిపిస్తుంది. గాలిబ్ ప్రత్యేకత ఏమంటే, కవితలో సూచనామాత్రంగా పదాలు ప్రయోగించడం వల్ల పాఠకులు తమ ఊహాశక్తికి పదును పెట్టి అక్కడ దృశ్యాన్ని అర్ధం చేసుకుంటారు. ఎవరి ఊహ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతగా దృశ్యం విస్తరిస్తుంది. గాలిబ్ పై కవితలో నగ్నకరవాలం పండుగ నెలవంకలా ఆనందాన్నిస్తుందని మాత్రమే చెప్పాడు. ఇక్కడ నగ్నకరవాలం అనేది ఆమె కనుబొమలకు అన్వయిస్తే, ఆమెను కలిసిన స్థలమే వధ్యస్ధలిగా మారిపోయింది. ఎందుకంటే అందమైన ఆ కనుబొమలు నగ్నకరవాలాలకు తక్కువ కాదు, అవి ప్రియుడి గుండెను ముక్కలుగా ఛేదిస్తున్నాయి. కాని వాటి మెరుపులు (అంటే కనుబొమల కదలికలు) చూస్తుంటే పండుగ నెలవంకను చూసినంత ఆనందంగా అనిపిస్తుంది. ఈ కవితలో గాలిబ్ ప్రేమికులను ఆశావాదుల సమూహంగా కూడా పిలిచాడు. అహ్లె తమన్నా అంటే ఈ అర్ధం కూడా చెప్పుకోవచ్చు. ఈ కవితలో చాలా అర్ధచ్ఛాయలున్నాయి. ఇక్కడ ఈ సమూహం ప్రేమికులదే కాదు, ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వారి సమూహం కూడా కావచ్చు. దేశం కోసం, జాతి కోసం నడుంకట్టిన వ్యక్తుల సమూహం కావచ్చు. ఇలాంటి వారికి తమ లక్ష్యమే అత్యంత ప్రియమైనది. ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి ఏమైనా చేస్తారు. దేశాన్ని కాపాడే సైనికులకు దేశరక్షణే అత్యంత ప్రియమైనది. ఆ లక్ష్యం కోసం యుద్ధరంగంలో నగ్నకరవాలాన్ని చూసి భయపడడు, పండుగ నెలవంకను చూసినంతగా సంతోషిస్తాడు. గాలిబ్ ఉపయోగించిన వథ్యాస్థలి అన్న పదం చాలా సందర్భాలకు అన్వయించే పదం. ప్రేమికుడికి ప్రేయసిని కలుసుకున్న ప్రదేశమే వథ్యాస్థలి అయితే, సైనికుడికి అత్యంత ప్రియతమమైన దేశరక్షణకు యుద్ధరంగమే వథ్యాస్థలి. అలాగే నిరుపేదలను ఆదుకునే లక్ష్యాన్నే ప్రేమించిన వారికి బీదసాదల కోసం పాటుపడడంలో ఎదురయ్యే కష్టనష్టాల నగ్నకరవాలం పండుగ నెలవంకే అవుతుంది. ఒక విస్తృతస్థాయి వివరణకు అవకాశమున్న కవిత ఇది. గజల్ ప్రత్యేకత ఇదే. ప్రతి రెండు పంక్తుల షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది. గజల్ లోని మిగిలిన షేర్లతో దానికి ప్రత్యక్ష సంబంధం ఒక్కోసారి ఉండకపోవచ్చు. అంతర్లీనంగా ఒక భావం అన్ని షేర్లను పూలదండలో దారంలా దాగుంటుంది. ఇది ఈరోజు గాలిబానా వచ్చే శుక్రవారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOtAV2

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నీటి స్పటికం _______________________ చెమ్మ ఇంకిన కిరణాలు పొద్దూకులా ఇంటి ముందు పడుంటాయి వాటినెవరో ఇక్కడ పారబోసినట్టు పచ్చి గుర్తులు కిటికీలోంచి నా కళ్ళు వాటిని ప్రతిరోజూ కడుగుతుంటాయి మబ్బుపట్టకుండా అవి తడుస్తూనో నన్ను తడుపుతూనో ఉంటాయి రాత్రి మిగిలిన సగం విరిగిన కలలా నన్ను నడిపించే కాళ్ళలా నాతోనే ఇప్పుడు కొన్ని ఆకులు మళ్ళా రాలాలి వాటి కోసం పనిమాలా పిట్టగోడపై చెకోరపక్షిలా ఎటు ఎగరాలో తెలియని క్షణం కొంత ఎర్రమట్టిని అరచేతుల్లో పొదువుకొని ఆకాశపు మొదళ్ళలో అంటుకడుతుండే ఆనవాళ్ళు భూమిపై కూర్చున్న సముద్రమొకటి లేచి వెళ్ళినప్పుడు అవే చేతులు కొత్త ప్రతిబింబంలా హత్తుకుంటాను కనిపించని అస్పష్టతను వెంటతెచ్చుకొనే మొసళ్ళు ఈ బంధాలు గాలివేర్లలా తిలక్ బొమ్మరాజు ......29/05/14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivFxty

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

ప్రకటన పాము బుసకొట్టదు కాటేయదు మెత్తగా సుతారంగా మునివేళ్లతో వొళ్లంతా రాస్తున్నట్టు - ఆలోచనల పుట్టలోకి చొరబడుతుంది అణువణువునూ ఆవరిస్తూ మండీ వేసుకుని కూర్చుంటుంది అది అప్పుడప్పుడూ తల పైకెత్తి చుట్టూరా చూస్తుంది నిద్రలో కళ్ల ముందుకొచ్చి తైతిక్కలాడుతుంది ఊపిరికొసల్ని ముడేసి వొళ్లంతా పాకుతుంది వొదలదు - యింటిలోకీ వొస్తుంది భార్యామణుల ఊహల్లోకి మరీ మరీ వొస్తుంది దాన్ని చూసి పిల్లలంతా మారాం చేస్తారు దాని మీదికెక్కాల్సిన బదులు దాన్నే మీదికెక్కించుకోవాలని మహా ఉబలాటం పడతారు ప్రకటన పాము ఎవ్వరినీ వొదలదు - కొద్ది రోజుల్లోనే వచ్చిన పని అయిందనుకున్నాక మరో పుట్టని వెతుక్కుంటుంది మాయలమారి 'ప్రకటన పాము' - ఆలోచనల పుట్టలోనివే 'తెలివిడిచీమల'న్నీ వొక్కటై చుట్టూరా దడి కట్టి దాడిచేస్తే అంత బడాయి పామూ చచ్చి ఊరుకుంటుంది ! * నేనిప్పుడు ప్రకటన పాముకు పాడె కట్టాలి నువ్వో చెయ్యేస్తావా.... ? రచనా కాలం :29 మే 2014 -------------------------------- 29.05.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lU1bsx

Posted by Katta

Pusyami Sagar కవిత

ప్రయాణం _________పుష్యమి సాగర్ ఒక సాయంత్రం కరువుఅయిన శాంతి కోసమో ఏమో , సమాంతర పట్టాల నుంచి ముందుకు ఉరుకుతూ దూకుతున్న రైలు పెట్టె లో నన్ను నేను ఓ మూల గా కుక్కుకొని కూర్చున్నాను ... ఉపిరి ని కాస్త వదిలి నలు దిక్కులా చూసాను గాలిని మింగి కాస్త సేద తీరుదామని నన్ను అమాంతంగా కబళించిన బడుగు జీవులు కళ్ళలో దైన్యం , .ఒంటి కాలు పై తపస్సు ఓటేసిన పాపానికి ఫలితం కాబోలు ...!!! యాతనల వంతెనల నుంచి వడి వడి గా అడుగులేస్తూ ...ఒక్కరికి తీరిక లేదు... అప్పుడు అప్పుడు సజీవ బతుకు చిత్రాలు రంగులేసుకుంటూ మొహం పై చల్లి వెళ్తున్నాయి మలి దశ లో కొడుకు లు ఉమ్మేసిన తండ్రి నడుము వంగి అడుక్కుంటూ త్వరగా మరణపు అంచులను తాకాలని తహ తహ పడుతున్నాడు ...!! మరో గుడ్డి తమ్ముడు పెదాలపై కనిపించని దేవుడి ని తలచుకుంటూ పొట్ట నింపుకునే ప్రయత్నం లో సూటి పోటీ బాణాలు తుడిచేసుకుంటూ అంగీ లో వేసుకుంటున్న దృశ్యాలు !!!! ఇక చాలీ చాలని దుస్తులతో తమ శరీరాన్నే కాదు మనసు ని కప్పుకోలేక ఆకలి తో ఆక్రమించే పులుల మధ్య లో ఆడతనం బేల గా గుక్కపట్టి ఏడుస్తుంది ...!!! ఇలా చిద్రమైన బతుకుల నుంచి పయనిస్తూనే ఉన్నదీ .. తన గమ్యం ఎక్కడో తెలియని ఓ రైలు ...! మే 29, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKq8tL

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఎం. శేషగిరి || మా గుడిసెలకు నీరంటుకుంది|| మా గుడిసెలకు నిప్పంటుకోవడం పాత మాట! ఇప్పుడు నీరంటుకోవటం కొతామాట!! చెట్టుకు చెదలుబట్టడం చూసాము నీరుబట్టడం చూడబోతున్నాము నిప్పంటుకుంటే నీరార్పేది నీరే అంటుకోబోతోంది ఏం చేయాలి? ప్రకృతి సునామీలు కనబోతున్నాము! మ సహజ సుందరమైన జీవితాన్ని లేవదీసి కృత్రిమ జీవితంలో కుదిస్తారట పోలవరం కొందరి జీవితాలకు పూలవరమే కావచ్చు.... మా గిరిజన బతుకులకది పెనుభారం! మా అడవి సంపదను బేరీజువేసే మాయా తులభారం! ఆహా! ఎంత ప్రకృతి సౌందర్యం అని పొగిడినోళ్ళే దానిని వికృతం చేయచూస్తున్నారు పాపికొండలను సహితం ముంచే పాపానికి ఒడిగట్టారు మా పేరంటాల పల్లిని అడుగంటా ముంచేయజీస్తున్నారు వరాలిచ్చే వరద గోదావరిని చించి మా బ్రతుకులకు పరదాకుడతారట! అనాదిగా శోభిస్తున్న మా గిరిజన సంస్కృతి పునాదిని దెబ్బదీసి సమాధిగట్ట జూస్తున్నరు! అమ్మో! మీరు మామూలు వాళ్ళుకాదు అందమైన మా గుట్టలనే గుటక వేయాలనుకుంటున్నరు మా అమాయక గిరిజన కాకులని గొట్టి మీ బహుళజాతి గద్దలకు వేయనెంచారు! తరితరాల మా స్మృతి చిహ్నాలను చెరిపేసి మీరుగట్టే ప్రాజెక్టులు మీకో మాకో మృతి చిహ్నాలవుతాయి జాగ్రత్త! ** జీవన్మరణం - పోలవరం గిరిఘోష (కవితలు, కథల సంకలనం - సాహితీ స్రవంతి ఖమ్మం ప్రథమ ముద్రణ ఫిబ్రవరి 2006-- ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి ఆధ్వర్యాన ఇరవైమంది కవులూ, రచయితలు, పోలవరం వల్ల మునిగే ప్రాంతాలయిన కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం,వి.ఆర్.పురం చింతూరు మండలాల గ్రామాలు పర్యటించి అక్కడి గిరిజనుల, గిరిజనేతరుల మనోభావాలను, అవేశాలను, ఉద్వేగాలను తెలుసుకున్నారు. కవిత్వానికి మౌలికంగా చైతన్యం కావాలి. కథకు జీవితపు వివిధ కోణాలను చూడగల అంతర్‌దృష్టీ అవసరం. కవిత్వానికి కావల్సినంత చైతన్యాన్ని, కథా రచనకు కావలసినంత జీవిత విభిన్న చిత్రాలను వారినుండి పొంది తెలుసుకున్నది వారి లయబద్ధ మాటల్లోని స్పష్టత, ధిక్కారం, ధైర్యసాహసాలు, మానవీయ ప్రాధేయతలు కదిలించాయి కాబట్టే ఈ సంకలనం వాటికి ప్రతిబింబం. *** 28.5.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pnxma8

Posted by Katta

Sanjeev Goud కవిత

SANJEEVEEYAM/ జీవన సంధ్య లో !!/1-1-2001 జ్జ్ఞాపకాలు వెంటాడి వేటాడి మనసు వికలం చేస్తాయి !! అనుభవాలు ఎప్పటికప్పుడు మనిషిని పదిలం చేస్తాయి !! గతం అనుక్షణం గుండెలో గణ గణ గంటలు మ్రోగిస్తే ప్రస్తుతం అది అప్రస్తుతమని వర్తమానం పరుగు పెట్టిస్తుంది !!! నిన్నటి మోహాల దాహం ఈ నాడు వెగటుగా ఔతుంది !! కుతిగా తాగిన పాయసం అతిగా మారి ఆయాసమౌతుంది !! వెలుగని వేకువని మేల్కున్నది చీకటి నిద్ర లోకి జారుకుంటది !! తీరా అన్ని అవగతమయ్యే సరికి తీరానికి పడవ చేరుకుంటది !! @@@@@@

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNWdkv

Posted by Katta

Sanjeev Goud కవిత

http://ift.tt/1muU7Ep

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1muU7Ep

Posted by Katta

సత్యవతి కొండవీటి కవిత

భక్తి, పూజ... దూరం దూరం ప్రేమ,స్నేహం...పారవశ్యపు పాలపుంతల్లో కి పయనం * పవిత్రత...అంటరానితనానికి రాచబాట అంటుకోవడం...విశాలత్వానికి పూలబాట * దేవతల్ని చేసేస్తే...ఓ పనై పోతుంది మనుషుల్లా చూస్తే మానవత్వం పరిమళిస్తుంది.

by సత్యవతి కొండవీటి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNQhI4

Posted by Katta

Nishi Srinivas కవిత

*** घर का आंगन *** ——————————निशीगंधा घर का आंगन महकाया था आज के दिन तु आया था । खिला था हर बूटा... हर पत्ता मुसकाया था । तेरा प्यार एक बादल था... पूरब पश्चिम छाया था । घोर अंधियारो मे तूने आशा दिप जलाया था । सारे जग को छोडा तो... एक तुझे अपनाया था । ( Nishigandha ) (29-05-14)

by Nishi Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wqDOzn

Posted by Katta

Uday Kiran Gupta కవిత

నేను తన గొంతుతో నా భాదని పంచుకుంటే...!! తను నా మనసుతో తన ప్రేమని పంచుకుంది...!! Uday Kiran Gupta

by Uday Kiran Gupta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iuQ2xi

Posted by Katta

Madhan Kumar Saggam కవిత



by Madhan Kumar Saggam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owS47A

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

పోల'వరమా' ? శాపమా ? మూడవ పంట కోసమని ముంచగ నెంచిరి ప్రక్క రాష్ట్రమం దేడు విశాల మండలము, లెంత విషాదము ! ఆంధ్ర నాయకుల్ గూడెపు టాదివాసులట గుండెలు బాదుకొనంగ కానరో ? ఏడుపు కళ్ళనీళ్ళపయి ఎత్తుగ 'డ్యామ'ట ! సిగ్గు చేటయో ! - డా. ఆచార్య ఫణీంద్ర 29/05/2014

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oMSSTl

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• వెలుగొక నిద్ర గుర్తు •• నేలపై బంగారు పూత సాయంత్రం- పసుపుకొమ్మ సూరీడు- రాత్రికి చివరి చూపు వెలుగది-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNfkei

Posted by Katta

Trinadh Meegada కవిత

//సుందర స్వప్నం// పక్క పై వాలిన పడతి పరువపు బిగువులుతో ఎదో వెలితి తీరం నుండి విన్నప్రియుని వేణుగానం కలల అలలపై చేసే పడవ పయనం తరచి మురిసి వగచిన వయ్యారం అలకన కులుకుతో బుగ్గన దాచిన సింధూరం తీయని బడలిక భారము తీరిన తరుణం ప్రణయ ప్రేమా పరిణయ పరిస్వంగనం మేనే చేనై పండిన రస మధురిమ ఫలం కనుల వెనుకే దాచిన సుందర స్వప్నం ……………………………. మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RE2wM1

Posted by Katta

Krishna Mani కవిత

దాహం _________________కృష్ణ మణి కదలిపోరా చెదిరిపోరా మసలిపోరా ఆ కంటినీరులో కొట్టుకుపోరా ! ఒంగిన నడుములు తిరిగిన చేతులు కాళ్ళు మరగుజ్జుల ఆటలో మూటగట్టిన ఒళ్ళు పసి ఆటలు మానిన అమాయక చూపులు ముసలి వారైన పెళ్ళికాని కొడుకులు ! తల్లికావలిసిన పడతి చంటి పిల్లోలె పాకుడు గుండె రాయిగా చావని తనాన బతుకులేని సాకుడు ! కడుపుతీపి మధురం అది చెరగని సత్యం కన్నవారే ముసలితనాన ముడ్డికడికే దుఃఖము ఎవడన్నం గుంజారో ఈ నరకంలో పడ్డారు ఏ పాపం చేసారో ఈ గడ్డపై పుట్టారు మానవత్వం లేని రాజకీయ కొజ్జాల కోలాటంలో కృశించిన తనవులు విషనాగుల ఎంగిలి నీళ్ళే గతని తెలిసినా తప్పని దాహపు కడుపులు ! కృష్ణ మణి I 29-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pmiWai

Posted by Katta

Pulipati Guruswamy కవిత

2002 లో రాసిన ఒక పద్యం.పాత పుస్తకాల మధ్య నుండి తేలింది . బతుకుమచ్చ // డా .పులిపాటి గురుస్వామి // ఈ రహదారుల మధ్య ఖైదు చేయబడ్డ ఒంటరి వనవాసి నేనే దారులు తెరుచుకునే మంత్రం మరిచిపోయిన బానిసను వెన్నెల్ని తీసుకొని వెలుతురు ఎటు వెళ్ళిందో ... బహుశా నేనే నా బానిస హస్తాల నుండి విముక్తి కలిగించానేమో! నా గుహ లోకి రంజింప వచ్చిన పిచ్చుకను నిలుపలేని బలహీనత కూడా ఒక శాపన కొన్ని జ్ఞాపకాలు తప్ప మరేమీ లేదు. తోతాపురి కండరాల ప్రశ్నలకు జవాబు లేదు అనేక వలయాల నడుమ చతికిల బడ్డ శ్వాస కు దుఃఖం తప్ప మరో తోడు లేదు దైవత్వం కోసం కాదు కాని మనిషిగా మసలుకునే లోపల ఏదీ కాకుండా పోయిన వెలివేయ బడ్డ ఆత్మవికలున్ని ఈ రక్త మానస గాయమిక పూయదు. ..... 29-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pme45c

Posted by Katta

Sanjeev Goud కవిత

AHAM TVAM/ Sanjeev / 28-5-2014 నన్ను నన్ను గా చూస్తె నాకొరిగేదేమిటి బొంగు!! నాలో ఓ ఇంద్రున్నో చంద్రున్నో చూస్తెనే అది హంగు!!! మనసులో నువ్ ఎలా అన్కుంటే నాకేంటి నష్టం?? నల్గురిలో నన్నే గొప్పనకుంటే నాకెంతో కష్టం !!! నేనేసే జోకులకి నవ్వేవారంటే నాకు చానా ఇష్టం!! నా మీదెవడైనా జోకేసినా వీప్పగలడం చాలా స్పష్టం !!! నన్ను గోప్పోడిగా గుర్తించి కీర్తించే వాళ్ళంతా నిర్మొహమాటంగా నాలాగే గొప్పోళ్ళని నేనంటా !!!!

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pzXbBh

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-48 కళ్ళ ఎదుటే అను నిత్యం అనేక చావులు సంభవిస్తున్నా నీవు తొణకవు,బెణకవు కాని నీ నుంచి వచ్చిన ఒక జీవి కన్ను మూస్తే మటుకు ప్రపంచమే నీకు విషాదమవుతుంది కదూ... ఎందుకని...అది నీది కనకనా...? నీది అనుకున్నది ,నీది కాదని తెలియజెప్పడానికే ప్రకృతి నిరంతరం అనేక మార్గాల్లో తన పనిని తాను చేసుకుంటూ అలా...!!! --------------------------------------- 29-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nEG9Cy

Posted by Katta

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (ఎండుటాకులకు కృతజ్ఞత) పాము కదిలి పోతుంటే గలగలా శబ్దం చేస్తూ ఎండుటాకులు హెచ్చరిస్తున్నాయి, పక్కనున్న మొక్కల మీది పువ్వులు ఎన్ని అనుభూతి కవితలు రాసుకున్నా నడక లెదుర్కొనే ప్రమాదాల్ని పసిగట్టి కూడా ప్రకృతిలోకి ముడుచుకుపోయే ప్రయత్నం... పచ్చి గడ్డి కోసం కక్కుర్తి పడి దారి తప్పిన గేదెలు, గేదెలు కాసే మురికి తలకాయలు అరణ్యంలో తమ దారి వెతుకులాట... మంత్రం వేసే పాముల నరసయ్యల సిద్ధాంతులు ఇంకా మైదానాల్లో బుసలుకొడుతూనే... చీకటి ఆసుపత్రుల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు దారి తెలిసే తప్పిపోయాయి... ఎన్నికలు గడిచిపోయాయి హమ్మయ్య! మొత్తానికి గేదెలు, కాపలావాళ్ళు తెల్లారేసరికి గూడెం చేరుకున్నారని అద్భుత మైన విజయ వార్త, ఎండుటాకులకు కృతజ్ఞత.

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kMM6fE

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత / అమాయకురాలు నువ్వు మరొక ప్రేమను పొందావు అది నాకు తెలుసు మరొకరెవరో ఆరాధిస్తారు నిన్ను అచ్చం నాలాగే నా బంగారమా.. అనే నే తియ్యటి మాటలను తలుచుకుంటూ నిన్ను నీ ఆత్మను అర్ధం చేసుకున్నాననుకుంటుంది అచ్చం నా వలెనే పాపం అమాయకురాలు అతి సామాన్యంగా నువ్వు మరొక హృదయాన్ని భగ్నపరుస్తావు నాకు తెలుసది అప్పుడు నేను ఏమి చేయ లెని అసహాయురాలిని నేను ప్రయత్నించినా ఆమె అపార్ధం చేసుకుంటుంది నన్ను తరిమేస్తుంది కూదా అమాయకురాలు నావలెనే అతిత్వరలో నువ్వు ఆమెను కూడా వదిలేస్తావు అది నకు తెలుసు ఆమె ఎప్పటికీ తెలుసుకోలెని సత్యం నీ నిష్క్రమణకు కారణం ఆమె దుఖిస్తింది ఆశ్చర్యంతో ఈఅమి జరిగిందో తెలియక అప్పుడామె ప్రారంభిస్తుంది ఈ గీతాన్ని ఆలాపించడం అమాయకురాలు నాలాగే //////// మాయాయాంజెలేన ఆంగ్లకవిత "పూర్ గర్ల్" కు స్వేచ్చానువాదం జ్వలిత 2009లొ సూర్య దిన పత్రికలొ ప్రచురించ బడింది 29/05/2014, 8.10ఉదయం

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tRXVEk

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వ ............... సంధ్య కొద్ది పాటి విశ్రామమయితేనేం ఇరుపక్షాల రాత్రీ పగళ్లను నెగ్గుతూ .............................................. వాధూలస 28/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rivP7e

Posted by Katta

Rajender Kalluri కవిత

## దేవుడా... ## దేవుడంటే భక్తి కాదు ఓ నమ్మకం ! దేవుడంటే మతం కాదు ఓ తత్వం ! దేవుడంటే వెలుగు కాదు కనిపించని ఓ చీకటి ! దేవుడంటే రాయి కాదు చరిత్రలో చెరగని ఓ ముద్ర ! దేవుడంటే ఓ ప్రార్దన కాదు మనం అడిగే అభ్యర్ధన ! దేవుడంటే బోదించేవాడు కాదు చెడును చేదించేవాడు కుడా ! దేవుడంటే గుడిలో ఉండేవాడే కాదు నీ యెదలో ఉండేవాడు కుడా ! వరాలిస్తాడో లేదో తెలియని ఓ నమ్మకానికి గుడి కట్టి పుజిస్తున్నాం ..... జన్మనిచ్చి నీకోసం అన్ని చేస్తూ ఆరాట పడే " అమ్మ- నాన్న" లను ఎందుకు మర్చిపోతున్నావు మిత్రమా ?? kAlluRi [ 29 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rivOQK

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

నేను వేకువ జామున్నే తనహృదయంలో ముళ్ళను దాచుకొని రోడ్డుమీద నడుస్తున్న ఎర్రరోజామొగ్గని చూశాను

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TVFQJa

Posted by Katta

Afsar Afsar కవిత

http://ift.tt/1hzBBI9

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzBBI9

Posted by Katta

Uday Kiran Gupta కవిత

తడసిన కళ్ళు, అలసిన మనస్సుతో నే ప్రవచించు పవిత్ర వేదం ఈ నా "వేదన"...!! Uday Kiran Gupta

by Uday Kiran Gupta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hexwi8

Posted by Katta

Uday Kiran Gupta కవిత

తడిసిన కళ్ళు దాటి తడిమిన వేళ్ళని తాకి జాలువారిన కన్నీరు చెప్పలేదా నా మనసు పడిన వేదన గురించి...!! Uday Kiran Gupta

by Uday Kiran Gupta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oKYhdD

Posted by Katta

Abd Wahed కవిత

ఒంటరి చూపుల దారాలకు గాలిపటాల్లా సూర్యచంద్రులు. తెగితే చిత్తుకాగితాలే చీకటిపగళ్ళ చిక్కుముడులే ఆరిపోయిన మనసులా దారి మునగదీసుకు నిద్రపోతుంది బాధలు నడిచే బాటేది? విషాదాల పూలవనానికి సాగునీరు కరువు కాదు కంటిలో మంచుపొర మెరుస్తూనే ఉంటుంది రాళ్ళవాన కూడా కురవడం లేదే! ఉన్మాదపు హోరు పుట్టల్లోకి మళ్ళిందా? ప్రేయసి పెదవిలాంటి మెత్తనైన మట్టిరోడ్డు ఎక్కడికి పోయింది? చిరుగాలి పైటలా ఒక్కసారి స్పర్శిస్తే చాలు.. దౌర్జన్యాలు లెక్కపెట్టడం ఎందుకులే కన్నీళ్ళు లెక్కలేనన్ని ఉన్నాయి... హంతకుడిని చూసి భయపడేదేముంది కట్టిపారేసి లొంగదీయడానికి కాళ్ళు చేతులు మిగలకుండా చూసుకుందాం... మెడలు తెగిన పూలు రాలిపోతే పోనీ... నేల సువాసనతో పరిమళిస్తుంది... చీకటి విత్తనాలు చల్లిందెవరైనా మొలకెత్తక మానవు కదా అంధకారం మర్రిలా జడలు విరబోసుకుంది సూర్యచంద్రుల దారాలు తెగేలా లాగిందెవరు? బైరాగి జుట్టులా, ఫకీరు గెడ్డంలా చిక్కుపడిన చీకటి పగళ్ళను సంస్కరించే దువ్వెన ఎక్కడుంది? ఒంటరి గడ్డిపోచ గాలికి కొట్టుకుపోనీ ఎక్కడో ఒకచోట తోడు దొరక్కపోదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TUAhL2

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

Remembering Maya Angelou WOMAN WORK (Poem ) I've got the children to tend The clothes to mend The floor to mop The food to shop Then the chicken to fry The baby to dry I got company to feed The garden to weed I've got shirts to press The tots to dress The can to be cut I gotta clean up this hut Then see about the sick And the cotton to pick. Shine on me, sunshine Rain on me, rain Fall softly, dewdrops And cool my brow again. Storm, blow me from here With your fiercest wind Let me float across the sky 'Til I can rest again. Fall gently, snowflakes Cover me with white Cold icy kisses and Let me rest tonight. Sun, rain, curving sky Mountain, oceans, leaf and stone Star shine, moon glow You're all that I can call my own.

by కోడూరి విజయకుమార్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TUAi1A

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

అడవి తల్లి ఆవేదన ~~~~~~~~~~~~~~~ అందాల కల్పవల్లిన ి ఆనందాల హరివిల్లును భూమాత వొడిలో విరిసిన తరులతల పచ్చని బంగారాన్ని... పక్షుల కిలకిల రావాలతో పండువెన్నెల వెలుగులతో అందాలన్నీ ఒలకబోసిన వయ్యారాల సింగారాన్ని గోదారి జలధార మధువు తాగి గుట్టలపై విరిసిన గుబురువనాన్ని రామయ్య అడుగులలో పూసిన రమణీయ పుష్పవనాన్ని సీతమ్మ పాదాల పారాణి తాకి మధుర ఫలాలనిచ్చే వృక్షజాలాన్ని జంతువుల వలపు కుటీరాన్ని విహంగాల విహార కేంద్రాన్ని ఆదివాసులకు ఆత్మబంధువును గూడెపుజనుల గుండె గొంతుకను అలాంటి నన్ను రక్షస రాజకీయ క్రీడలో స్వార్థం మీరిన కాంక్షతో అమానుషంగా అమానవీయంగా చెరబడుతున్నారు తరాల సంపద తరలించే ఏర్పాట్లు కుటిల మానవుడి కుయుక్తులు విషపుకోరల వింత నాటకాలు ఆర్డినెన్సుల ఉరితాళ్ళు అడవిని ముంచి ఆత్మను చంపి ఆదివాసుల్ని తరిమి తరిమి కొడతారు గూడెపు వాసుల గొంతుల్లొ గునపాలు దించుతారు విహంగాల ముక్కుల్ని తూములుగా చేస్తారు! వేలవేల ఏళ్ళ ప్రాచీన వృక్షలాన్ని కాలువలుగా కడతారు!! ధరిత్రిని సస్యశ్యామలం చేస్తారట!!? కొందరి వరాల కోసం పోల'వనాన్ని' పోలవరంగా ముంపులో ముంచుతారట అపురూప సంపదను అసంఖ్యాక జీవరాశిని అమాయకపు ఆదివాసులను శాపగ్రస్తం చేస్తారా?

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCwHj6

Posted by Katta

28, మే 2014, బుధవారం

Abd Wahed కవిత



by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oKwudj

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //జ్ఞాపకం// మూడేళ్ళు వరకు గుండేలా మీద ఆడించి ఇరవైనాలుగు ఏళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకొని తన చమటని నాకు ఇంధనంగా అందించి నన్ను ముందుకు నడిపించి ,జీవితం ఎంత విలువైనదో నేర్పి రూపాయి కి విలువ ఇవ్వాలని,కానీ బంధాలని గౌరవించాలని పదే పదే చెబతూ,ఓడిన ప్రతి సరి గెలుపు నీదే అనే ధైర్యాని అందిస్తూ నన్ను మనిషిగా తిర్చిదిద్దిన మా నాన్న,నువ్వు దూరమైనా ఇంకా నీ జ్ఞాపకాలు నాతోనే 28may2014

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oKwry5

Posted by Katta

Sahir Bharathi కవిత

గమ్యం ........!! ఒక్క మాటతో ఆకాశమంత నిశ్శబ్దం అంతమయింది నా మనసు చేసిన నిరీక్షణ వొడ్డుకు చేరింది మరల నా బాటలో తన అడుగులను జతకడుతానంది తన జీవితంలో ముఖ్యమయిన కాలంలో నన్ను తల్చుకుంది కానీ నా కష్టకాలంలో నా చేతికి వీడుకోలు పల్కిన సంగతినే మరచిందేమో మరి ... విరిగిన అద్దం మళ్లీ అతుక్కోదని గుర్తులేదేమో తనకి కానీ నా ఆఖరి శ్వాస వరకు తన ఆత్మ నే తల్చుకుంటుంది నా మనసు ....................sahirbharati

by Sahir Bharathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rgZ9LB

Posted by Katta

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -9!! !!ప్రేమంటూ!! ప్రేమంటూ మనస్సును వంచించి వదిలేసి వేదనకు గురిచేసి వదిలించుకోవాలని చూస్తున్నావు ఒప్పు చేసిన తప్పని బలవంతంగా ఒప్పిస్తూ బ్రతికేస్తున్నావు నాకు బ్రతుకు లేకుండా చేస్తున్నావు దీనినే ఈ కాలంలో ప్రేమంటారా? నీవు చెప్పిన దానికి నేనే లొంగి నీ కాళ్ళ దగరకు వచ్చాక కూడ ఇలా చేస్తున్నావు నీకు న్యాయమేనా ప్రేమంటే మనస్సును ప్రేరేపించి ప్రాణాలను తీసేలా చేయటమేనా ఎందుకు నాలోకి వచ్చి మళ్ళీ నేను కాదు వచ్చింది నువ్వే వచ్చావు నాకు సంబందం లేదు అంటున్నావు. నేను లేకపోతే జీవితం లేదన్నావు ఇప్పుడు ఏమైంది. !!అజయ్!! 28MAY14

by Ajay Pandu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mr6f9q

Posted by Katta

Rambabu Challa కవిత

ఆకలి/ Dt. 28-5-2014 అగ్ని పర్వత హృదినుండి ఉబికివచ్చిన లావాలా ఓ అభాగిని ఉద్విగ్న హృదయాంతరాళం నుండి పెల్లుబికిన కన్నీటిని తాగుతుంది కామాంధుని ఆకలి భవష్యత్తనే అంధకారంలో ఆశల కాగడాతో వెతికినా కనరాని బ్రతుకు దారి ఆలి బొట్టు చెరిపేసి, తాళి బొట్టు తెంచేసి బడుగు రైతు నెత్తురుని జుర్రుకుంది కల్తీ వ్యాపారుల అకలి విస్పొట ప్రతిధ్వని ప్రకంపనల్లో సజీవ దహనాల అగ్నికీలల్లో కాలిన కపాలాల పెలుళ్లలో నర మాంసాన్ని కాల్చుకు తిన్నది మతచాంధసుని ఆకలి ఆకాశం పులిలా ఘాండ్రించిన వేళ రోడ్డు ప్రక్కన కుప్పతొట్టిలో ఆగని ఆర్తనాదంతో పెదవిపై పడ్డ చినుకుని తాగుతుంది పసికందు ఆకలి తారతమ్యము, తరతమ బేధమూలేని అకలీ నీ ఆకలి తీరేదెప్పుడు?

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k2VJXx

Posted by Katta

Renuka Ayola కవిత

నేను నువ్వు // రేణుక అయోల వలస వచ్చిన సీతాకోక చిలకలు చెట్టుని చుట్టుకుని నిజమైన ఆకుల్లా రంగురంగు పువ్వుల్లా ఆ వనంలోకి వచ్చాయి అద్దంలో ఎన్ని సార్లు చూసుకున్నా వాటి జ్జాపకం ఒకటి ఒంటిని అంటి పెట్టుకుని చూపిస్తుంది ఎక్కుతున్న మెట్లన్నీ వాటి రెక్కల జాడలతో నిండిపోయాయి నిజమైన రూపం ఎన్నో సార్లు అక్కడే ఆగిపోతోంది పై మెట్టు ఎక్కుతేగాని దీపం వెలగదు కిందమెట్టులో ఆగిపోయే పాదం వెల్తురునీడలో అద్దం బిగించి చూసుకుంటూనే వుంది రూపం నగ్నంగా నిలబడానికి సిగ్గుపడుతోంది దేహ నగ్నాలు లోకం లోపటి వస్త్రాలు ఎక్కడో నువ్వు నేను ఇంకా ఇక్కడే ఇరుక్కుని అద్దం చూసుకుంటూ పై మెట్టులో పాదం నీడని చూసుకుంటూనే వుంది

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TTOXKe

Posted by Katta

Pratapreddy Kasula కవిత

నేను రాసిన ఉచితంగా మరణం కవితను కవి సంగమంలో చాలా మంది చదివారు.

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mF4zuw

Posted by Katta

Yessaar Katta కవిత

సురెక ||తెలుగు గజల్-6 .. తల్లిచూపులొ మెసలుతుంటే ప్రేమదీవెన అందుతుందీ మంచిదారిన పొసగుతుంటే గొప్పభావన అందుతుందీ. .. మానవత్వము వదలకుంటే ఎల్లవేళల జయంవెంటే రొంపిఒడిలో కలువ వున్నా పూజజక్కన అందుతుందీ. .. సద్గుణము వెన్నంటివుంటే ఎక్కడున్నా మనిషిజయమే కంపపొదలో మల్లె వున్నా మంచివాసన అందుతుందీ. .. సత్యవర్తన మానకుంటే రెండు మనసుల నిండుదనమే భేదభావం ముసురుకున్నా స్నేహవీవన అందుతుందీ. .. సమ్మతమ్ములు కూడివుంటే కనులనిండా ప్రేమసుధలే సామరస్యము చేరుకొనగా మోహవంతెన అందుతుందీ. .. (తెలుగు గజల్: 28/05/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mF4yqt

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

నాకు మాట్లాడ్డం రాదు-4 ఒక్కోసారెందుకో నాకసలు మాట్లాడ్డమే రాదు. అప్పుడు... ఒక మౌనపు వంతెన కట్టి మెల్లగా కవాతుచేస్తాను. ఒక నవ్వుల నిచ్చెనేసి చిన్నగా దాటివెళ్ళిపోతాను. ఒక నిట్టూర్పుగోపురం కట్టి ఆకాశాన్ని విభజిస్తాను. ఎందుకలా చేస్తానో తెలియదు. తర్వాతేమౌతుందో తెలియదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస; తప్పించుకోకూడదనే విజ్ఞత... ఆక్షణాన ఉండదు నాకు. పెదాలు వర్షించలేని పదాలను కోలాహలంతో హలాహలంగా మార్చలేను. అందుకే నేను కొన్ని మట్లాడలేకపోతాను. మాట్లాడ్డం రాదనుకొంటూ నిశ్శభ్ధవక్తనై శూన్యసూక్తిని బోధిస్తాను. 28-05-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Sf4dzZ

Posted by Katta

Pratapreddy Kasula కవిత

ఒకానొక ప్రేమకవిత - కాసుల ప్రతాపరెడ్డి నీళ్లు లేని చోట నా నెత్తురు వాగులై పారుతుంది చాలాసార్లు చావు దాకా పోయి తిరిగి వస్తుంటా మరణించిన ప్రతిసారీ పునర్జన్మ ఎత్తుతా అమ్మ గుండెల మీద ఆడుతున్న పిసిపోరన్ని నేను ఎండిపోయిన పాలిండ్లు ఎల్తి గరిశెలు అమ్మ కన్నీరు మంచుశిలలవుతూ నా చెంపలపై రాలిపడుతూ ఉంటాయి జీవితం చుక్క చుక్కా జుర్రుకునే మద్యం ఏదీ అంతం కాదు ఏదీ మొదలు కాదు నీ రాక కోసం తలుపులు తెరిచే ఉంటాయి బుద్ధి ఎటు పోతుంది? లోపల గడియ వేశారనుకుంటావు పిచ్చోడివో, ఎర్రోడివో జీవితం రుచి తెలియనివాడివో లెక్కలూ పత్రాలూ ఉండవు మాయలూ మర్మాలూ ఉండవు గుండె ఒక్కటే ఉంటుంది నీకు లేనిదీ, నాకు ఉన్నదీ అదొక్కటే రా! తలుపులూ, తలంపులూ తెరిచే వున్నాయి నెత్తురు రుచి మరిగినవాడా! నా నెత్తురు ధారలై పారుతున్నది మోదుగాకు డొప్ప పట్టు నీకు మద్యం, మగువ, మత్తు అంతా నా నెత్తురే కదా! రిజర్వాయర్ల నిండా పట్టుకో దఫాలు దఫాలుగా జుర్రుకో సిగ్గుసెరం లేనోడా! నా మొల్దారాన్ని దండెం కట్టి నా కండకండనూ దోర్నాలు కట్టినోడా! నీ కన్నా పసురం మేలు

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SPZzcf

Posted by Katta

Jagadish Yamijala కవిత

నలుగురితో పంచుకోవాలనిపించీ... ------------------------------------ మతం మనిషిని మృగంలా మార్చేస్తుంది కులాలు మనిషిని మురికి కాలువలా మార్చేస్తుంది -------------------------------------------- మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటే మీరు చెయ్యగలిగినది కూడా మీరు చెయ్యలేరు ----------------------------------------- ప్రయత్నాలు తప్పవచ్చు కానీ ప్రయత్న లోపం ఉండకూడదు ---------------------------------- జీవితంలో ఏదో సాధించేసేనని గొప్పలు చెప్పుకునే కన్నా ఎవరినీ నొప్పించక బతకడంలోనే ఉంది గొప్పతనం ------------------------------------- ఆదా చెయ్యడం చాలా కష్టం ఖర్చు చెయ్యడం చాలా తేలిక డబ్బు విషయంలోనే కాదు ఇతరుల మనసులో మనపై మంచి అభిప్రాయం పెంచుకోవడం కూడా కష్టమే ------------------------------- మనసు విప్పి మాట్లాడండి ప్రేమ పెరుగుతుంది ----------------------------- మన్నించండి తప్పులు తగ్గుతాయి -------------------------- జీవితం అనేది వ్యాపారం అందులో జనమనేది రాబడి మరణమనేది ఖర్చు --------------------------- ప్రేమకు ఇద్దరు కావాలి ఏడవడానికి ఒక్కరు చాలు ఆనందం పంచుకోవడానికి ఇద్దరు ఉండాలి ఆరాటానికి ఒక్కరు చాలు -------------------------- మెలగిన వారు విడిపోయేటప్పుడు కూడా నొప్పెట్టలేదు కానీ వాళ్ళు అసలు పరిచయమే లేని వారులా మెలగడమే ప్రాణం తీస్తోంది -------------------------------------- తమిళంలో అక్కడక్కడా చదివినవి ------------------------------------- యామిజాల జగదీశ్ 28.5.2014 ------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tmQjaN

Posted by Katta

Nirmalarani Thota కవిత

పదాలకై పాకులాడుతూ భావాలు మసక బారుతున్నాయ్ ఊహల దిండు అసహనానికి ఉరకలెత్తే ఊపిరులు అస్తవ్యస్తమవుతున్నాయ్ స్వప్నాలు సత్యాలు విసిరే సవాళ్ళకు సలామంటూ కళ్ళ కింది నీలి నీడల్లో చర్మపు ముడతల్లో సద్దుమాని సర్దుకుంటున్నాయ్ మబ్బు కమ్మిన ఆకాశం మూగబోయిన ఆమని రాగం దిగాలు చెట్టుకు వసివాడిన ఒంటరి జాజి మల్లి మొరాయిస్తున్న పాళీ చేత్తో పట్టుకొని నేను.. ఇంకేం రాయను? రాయగలను ?

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdlSUu

Posted by Katta

Srinivas Yakkala కవిత

****జీవితం లో ఒక సమయం **** కాలం కనికరించను అంటొంది కర్మ కాలిపొతుంటుంది బంధాలు బరువైపోతాయి ప్రేమలు పగలుగా మారిపోతాయి స్నేహాలు సన్నగిల్లిపోతాయి మనస్సాంతి మసక బారిపోతుంది కోపం కట్టలు తెంచుకుంటుంది భాదతో మనసు నిండిపొతుంటుంది కల్లలో కన్నీల్ల కడలి కనిపిస్తుంది అధరాల దరహసం దూరమైపొతుంది ఆనందం జాడ లేకుండపొతాది సంతోషాలు సమాధికి సిద్దం అయిపొతాయి ప్రయత్నాలు వ్యర్దం అయిపొతాయి పిచ్చి ప్రశ్నలు రాజ్యం ఏలుతాయి కలం కన్నీల్లు పెడుతుంది ఈ సమయం శాశ్వతం కాకూడదని కాగితం కుమిలికుమిలి ఏడుస్తుంది ఇది కల్ల ఐతే బాగుండునని..... శ్రీనివాస్ యక్కల తేది : 28-మే-2014

by Srinivas Yakkala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RARk2x

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//ట్రాఫిక్ సైతాన్//17 ***************************** మధ్యతరగతి జీవితంలాంటి ట్రాఫిక్ ప్రయాణంలో అడపాదడపా గాలిపోలికేకవేసినట్లు చెవులు చిల్లులు పడే శబ్ధంతో హరికేన్ బీభత్సాన్నితలపిస్తూ కన్నులు మిరిమిట్లుగొలిపే వేగంతో తోటివాహనాలను తత్తరపాటుకు గురిచేస్తూ పాములామెలికలు తిరుగుతూ సర్కస్వ విన్యాసాలను ప్రదర్శిస్తూ ఖరీదైన స్పోర్ట్స్ బైక్ లు పరిగెడుతూంటాయి తాగినవాడికిమల్లే ఉయ్యాలలూగుతూ;..... వాటిదూకుడు రాగానికి వాహనాల ఎడంలో ఏర్పడే ఏర్పడేసందులు తాళాలువేస్తూ బైక్ లను ఊరిస్తూ ఆహ్వానిస్తుంటాయ్ గ్రహకక్ష్యలకు అడ్డంగా అర్ధాంతరంగా పరుగులు తీసే ఆస్టిరాయిడ్లాంటి బైక్ లు అవి వాటిపై సైతాన్ లు స్వారీచేస్తుంటారు వారిముఖంలో బెరుకూమొహమాటాలుండవు నిర్లక్ష్యం తిరస్కారభావాలు తప్ప పద్దలూ,ఓర్పుభావనలుండవు దుడుకుతనం తప్ప .; తలబిరుసుతనమే వారిరూపంలో బైక్ నడుపుతూంటుంది తరచూ వారు రెండుచేతులు వదలిసాముచేస్తూంటారు ఎప్పుడూ క్రాఫ్ సవరిస్తూనో, అద్దంలో చూస్తూనో ఉంటూ అప్పుడప్పుడు రోడ్డువైపు చూస్తుంటారు ఆడగాలి తాకితే చాలు పొద్దుతిరుగుడు పువ్వులై తలలను మెలిదిప్పుకుంటుంటారు బైక్ హాండిల్ లు భ్రమలు మాని తమనుతామే హాండిల్ చేసుకుంటుంటాయి దుష్టునికి దూరంగా అన్నట్లు అంతా తప్పుకొనివారికి దారిస్తూంటారు పట్టపగ్గాలుండవు బైక్పోకడలకు నిస్సహాయులూ రోడ్డుపై ఉంటారనే స్పృహ ఉండదువారికి రక్తం అంటే ఎరుపు రంగు ద్రవమే వారికి ట్రాఫిక్ పాఠాలు అర్ధంకావు వారికి అనుభవంతో తెలిసే జీవితపాఠాలు గుణపాఠాలు నేర్చే సరికి వారు ఎక్కడుంటారో వారు ఎంతమందికి శాపమౌతారో వారు *************** 28-5-2014

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pxuDIF

Posted by Katta

Krishna Mani కవిత

(14 ఆగస్ట్ ఎలా జరుపుకుంటారు ? అని అడిగిన విలేఖరితో ఓ పాకిస్తాన్ మహిళ చేసిన ఉద్వేగ పూరిత ప్రసంగం . తర్జుమా చేసి స్కెచ్ కవితగా మార్చే ప్రయత్నం చేశాను ) 14 ఆగస్ట్ ________________కృష్ణ మణి విలేఖరి :14 ఆగస్ట్ ఎలా జరుపుకుంటారు ? 14 ఆగస్ట్ నాకు గుర్తు లేదు ఎలా జరుపుకుంటాం ? ఆ అవును జరుపుకునే వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడు శవాలను మోస్తున్నాం ఇప్పుడంతా ఈ ప్రాంతంలో ఇక్కడ కాకపొతే పక్క వీధిలో అరుపులు కేకలు వింటున్నాం తెలుస్తది రోడ్డుపై ఎవరో చనిపోయారని వినవస్తది ఇక్కడ ఎవరో ఎవరినో చెంపెసినట్టు కేవలం ఇదే జరుపుకుంటున్నాం ఇప్పుడు ! కేవలం ప్రభుత్వ వైఫల్యాల అగౌరవ సంబరాలు చేసుకుంటాం ఇక్కడ ఆకలితో నగ్నంగా పడిఉన్నారు జనాలు ! వాళ్ళు ఆకాశంలో చక్కర్లు కొడుతుంటారు అదే జరుపుకుంటాం ఇక్కడ , ఇంకా జరుపుకోవడానికి ఏముంది ? ఎక్కడి స్వతంత్ర దినోత్సవం ? అవును వాళ్ళు జరుపుకుంటారు ఎవరి వారైతే తనువు చాలించారో ముందుగా అన్ని దుఖాలనుంచి అన్ని కష్టాలనుంచి స్వతంత్రులైనందుకు దేవునికి ప్రియమైనందుకు ! పాకిస్తాన్ ఇందుకోసం తయారు చెయ్యలేదు తమ్ముడూ చెప్పండి వాళ్లకు ఎవరైతే హాయిగా తిరుగుతున్నారో చాల గొప్పగా నగ్న హృదయాలతో వారికి ఏమి పట్టదు ఏం జరుగుతుందో ? ఏం చేస్తున్నారో ? అందరు చావాలి అందరు పోవాలి ఒకరోజు ! పాత్రికేయుడు :ఆ రోజు ఏదైనా దేవునికి దీపం వెలిగించడం లాగా ..... ఎలాంటి దీపం వెలిగించను ? ఎందుకు వెలిగించను ? నా తోటి వారి ఇండ్లలో శవాలు లేస్తుంటే అసలు ఏమని జరుపుకొను ? చుట్టుపక్కల మంచిగా ఉండి , జనులెవరు ఆకలితో చావకుంటే మన భోజనం మంచిగనిపిస్తుంది కదా . వాళ్ళు చేసుకుంటారు ఎవరికైతే మనసు ఉండదో మనసున్న వాళ్ళం మావల్ల కాదు ! పాత్రికేయుడు : స్వతంత్రం ....... మల్లి స్వతంత్రమంటారు ఇక్కడ మనషులు వరదల్లో కొట్టుకుపోతున్నారు ఇక్కడ జనం నడిరోడ్లో బాంబు పేలుల్లకి శవాలవుతున్నారు విలేఖరి :అలా కాదు మీరు ఒకసారి పాకిస్తాన్ జిందాబాద్ అనండి పాకిస్తాన్ జిందాబాద్గానే ఉంటుంది మనమున్న లేకున్న ఖాళి ప్రాంతంగా ఈ ప్రజలు దిన దినగండంగా పోతునే ఉంటారు ! కృష్ణ మణి I 28-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAno3f

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

నిజమే నేనో బండరాయిని/సత్యం జి/ ******************************** నేను నేనులో నానాను.. పూర్తిగా నానినా నాలోనీ కోరిక ఇంకా మెత్తబడదేం.. నన్ను బండరాయినని బండబూతులు తిట్టుకుంటున్నావు కాని నేను నీవుగా అయ్యాక నేను లేని చోట ఉన్నది ఇక నువ్వేగా.. నువ్వు నేనూ మొత్తం నువ్వే నేను నువ్వు మొత్తంగా నేనే.. అవును బండే.. మామూలు బండ కాదు చాలా గట్టి బండ.. నేను కాదు నువ్వు కాదు.. నేను అనే నీపై నేను పెంచుకున్న అపారమైన ప్రేమ.. అది నిజంగానే బండరాయి.. అది కరగదు.. కదలదు.. నన్నూ, అలాగే నాలో ఉన్న నువ్వనే నన్ను కూడా కదిలిస్తుంది.. అతలాకుతలం చేస్తుంది.. అంత కుదిపేసినా కుదురుగా కూర్చొని కులాసాలడుగుతుంది ఇద్దరూ బాగానే ఉన్నారుగా, అంటూ.. ఆ బండ ప్రేమకి నేనంతే ఎంత ప్రేమో.. నా నువ్వంటే, నాలోని నువ్వంటే, నేనైన నువ్వంటే, నువ్వనే నేనంతే ఎంత ప్రేమో.. . - సత్యం జి, 28-05-2014, 16:52

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wkjteQ

Posted by Katta

Trinadh Meegada కవిత

అది అసంపూర్ణ స్వతంత్ర భారతం నివురుగప్పిన నియంత పాలనం రాజకీయ కీలుబొమ్మలాటలు అధికారుల తోలు బొమ్మలాటలు వెరసీ చైతన్య రహిత జనభారతం తెలుగు వాడంటే చులకన బూజు పట్టిన పట్వారీ విధానాలు విశ్వ విఖ్యాత నట సింగం జూలు విదిల్చింది ప్రజల పక్షాన నిలిచింది ఏలిక పాలకులపై పంజా విసిరింది సమూల రాజకీయ ప్రక్షాలన చేసింది అడవి రాముడు గా తిరిగిన ఆ సింగం బడుగు జనుల కోసం ఊరూరా తిరిగింది ప్రతి తెలుగు వాడు ఒక సింగమని అత్మీయతే కాదు ఆత్మ గౌరవం కూడా వాడికి ఉందని సహనమే కాదు సాహసం ఉందని ప్రపంచానికి చాటింది డిల్లీ సింహాసనం కదిలేలా ఘీంకరించిది నేనున్నానంటూ తన జాతికి బలం భరోసా ఇచ్చింది ఈ నేల అయుస్సు ఉండేదాకా ఈ జాతి గుండె లో కొలువై ఉంటుంది ఆ సింగం …………..మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kK9sma

Posted by Katta

Katta Srinivas కవిత

http://ift.tt/1pxd8Io 10tv.in లో కవిసంగమం కార్యక్రమం గురించి

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pxd8Io

Posted by Katta

Rajender Kalluri కవిత

## సదువు - సంస్కారం ## " వందేకరాలున్న ఆసామి రెండెకరాలున్న ఓ టీచర్ దగ్గరికి వెళ్లి సర్ సర్ అని పిలుస్తూ ఉంటె ..... ఆ ఆసామి చుట్టూ ఉన్న జనాలు అడిగారాట .... " ఏందయ్యా మీ ఆస్తిలో పదో వంతు లేదు , ఆడికి ..... మీరు మర్యాద ఇవ్వడమేంది..పరిగెత్తుకుని వెళ్లి ఈ పలకరిమ్పులెంది ? అని అప్పుడు , ఆ ఆసామి వాడి చెంప చేడేల్మనిపించి చెప్పాడట " వందేకరాలున్నన్నాల్లెరా ... ఈ ఆసామి అప్పల నాయుడుని " గారు " అని గౌరవించేది అది లేని రోజున ఎరా అప్పలరాజు అని పిలుస్తారు .... కాని ఆయన " సదువు " అనే కనిపించని ఆస్తిని పెట్టుకుని తిరుగుతున్నాడు ..... ఆయనకు వెనకాల ఉన్న ఆస్తితో సంబంధం లేకుండానే పతోడు " సర్ , సర్ " అని గౌరవిస్తార్రా .... అని చెప్పాడట అంతా విన్న ఆ చెంప దెబ్బ మాష్టారుకి అర్ధమైన్దేంటో తెల్సా ..... ' గౌరవం అనేది ...ఆస్తిని బట్టో , కులాన్ని బట్టో ఇచ్చేది కాదు ..... " హోదా "ని బట్టి ఇచ్చేది అని !! వెంటనే తన బిడ్డని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాడు ! " Educate ur Child To Get Respect in The Society " kAlluRi [ 28 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nSYrOG

Posted by Katta

Trinadh Meegada కవిత

//సుందర స్వప్నం// పక్క పై వాలిన పడతి పరువపు బిగువులుతో ఎదో వెలితి తీరం నుండి విన్న ప్రియుని వేణుగానం కలల అలలపై చేసే పడవ పయనం తరచి మురిసి వగచిన వయ్యారం అలకన కులుకుతో బుగ్గన దాచిన సింధూరం తీయని బడలిక భారము తీరిన తరుణం ప్రణయ ప్రేమా పరిణయ పరిస్వంగనం మేనే చేనై పండిన రస మధురిమ ఫలం కనుల వెనుకే దాచిన సుందర స్వప్నం ……………………………. మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nzk7B4

Posted by Katta

Sriarunam Rao కవిత

. "ప్రేమ అనేది కూడా ఒక మానసిక భావనే" అంటూ నేను చెప్పడం ప్రారంభించగానే.. ఒక విధ్యార్ధి లేచి "అంతేనంటారా? సార్" అంటూ చాలా ఆతృత ప్రదర్శించాడు. ఇంతకీ అతని సమస్య ఏమిటంటే.. తను తీసుకుoటునట్లు తన ప్రేయసి.. తన ప్రేమని సీరియస్ గా తీసుకోవటం లేదని. తను ఎంత మనస్ఫూర్తిగా చెప్పినా, ఆమె మాత్రం "అంతుందా?" అంటూ తీసిపారేస్తూ రిప్లయ్ ఇవ్వటం, అతనిలో ఎన్నో సందేహాలను రేకెత్తిస్తుందట. అలాంటి సమయంలో నేను "ప్రేమ అనేది కూడా ఒక మానసిక భావనే" అంటూ చెప్పటం అతనికి చాలా రిలాక్స్ గా అనిపించింది. కానీ నిజానికి ఆ మాట నేను చెప్పకపోయినా అతని మనసు చెబుతూనే వుందతనికి. కానీ.. మరొక పుస్తకమో, పెద్దవారో, మేధావో... ఇలా అతని మనసుకు దగ్గర వున్నవి ఏవైనా, అదే మాటని చెబితే.. వెంటనే ఈ సందేహపు తలనొప్పినుండి బయట పడాదామని మనసులో చిన్న కోరిక. అది నా దగ్గర దొరకగానే అతను తన మనసు అప్పటివరకూ తయారుచేస్తున్న ఫైల్ ని ఇక ఏమాత్రమూ అలోచించకుండా.. సేవ్ చేసేశాడు. ఏమిటీ ప్రాసేసంతా? అసలు ప్రేమంటే ఏమిటి? ఎలా అది మనల్ని చేరుతుందనేది నా అనుభవంలో ఎలా నాకు తెలిసిందో...ఈరోజునుండి 5రోజులవరకూ రాయబోతున్నాను. శ్రీఅరుణం విశాఖపట్నం 9885779207

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kJrSDE

Posted by Katta