పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి శిక్షావిధి అంతా చీకటి ఆ చీకటిని చూస్తుంటే చీకటే భయపడుతోంది ఆ భయానక చీకటిలో ఆ మనసుకి ఒక రాక్షస ముల్లు గ్రుచ్చుకుని రక్తం స్రవించింది ఆ గాయపడిన మనసుని జీవితమే బ్రతికించుకుంది విషాదం తప్ప సంతోషం లేని ఆ మనసుని ఇప్పటివరకూ కాలమే ఓదార్చింది సమయం ఎప్పుడూ ఒకలాగే ఉండదు చేసిన కర్మకి ఫలితం అనుభవించాల్సిందే ఎవరైనా ఎప్పుడైనా నేరం బంధీ కావాల్సిందే చేసిన ఘోరానికి మరణదండన పడాల్సిందే ఓ జీవితమా నీకు జరిగిన అన్యాయానికి కాలం తీర్పునిచ్చింది నిర్భయంగా నిశ్చింతగా బ్రతకమని నీకు స్వేచ్చనిచ్చింది న్యాయం ఓ మనసా ఇక గతాన్ని మరిచిపో భవిష్యత్తులోకి ఎగిరిపో! ఓ మనిషీ నీవెవరో ఇప్పటికైనా తెలుసుకో నీ మృత్యువు నీలోనే ఉంది చూసుకో! 01Apr2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kpq8wR

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kpq8gv

Posted by Katta

Sai Padma కవిత

సాయి పద్మ // .............................. గడియయేని విరహం తాళని సగ భాగాన్ని మాటలతో హింసించని మూల దాచి పెడదామని పరిసరాలు చూడకుండా శరాల్లా విసిరే మాటలని పూలబాణాలనుకొని బ్రతికా చాన్నాళ్ళు నా ఆశయాల జమ్మి చెట్టు లో దాచిన అపురూప అస్త్ర శస్త్రాలు కర్ణుడి శాపాల్లా కళ్ళ నీళ్ళవుతుంటే మమతల ఎరువులేసి పెంచిన పిల్లలు కాళ్ళకు మోగని పాంజేబులవుతుంటే నింపుకుందామనుకున్నా ..జీవన మాధుర్యాన్నీ కాంక్షనీ రెండు చేతులా .. కానీ, ఒక చెయ్యేమో సగభాగం వదలదాయే రెండో చెయ్యేమో ఇంటిపనుల్లో తలమునకలాయే ఓయి చిన్నదానా.. జీవితం చిన్నది మనసిలాయో ..!! --సాయి పద్మ

by Sai Padmafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QCXa45

Posted by Katta

Kks Kiran కవిత

ఈమధ్య శ్రీ కృష్ణదేవరాయలు రాసిన "ఆముక్తమాల్యద " చదివాను,,అందులో రాయల వారు అన్ని ఋతువులను అద్భుతంగా వర్ణిస్తాడు, అందులో వసంత ఋతువు వర్ణన చూడండి. విరహ తాపం ఎక్కువైందని ,దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి చేరటం తో వసంతం ఆరంభమయింది .ఆమె విరహ నిట్టుర్పుల వేడికి ఆగ లేక సూర్యుడు చల్లగా ఉంటుందని హిమాలయం వద్ద ఉత్తరానికి మొగ్గాడట .విరహం అనే బాట సారికి దాహమైతే అగ్ని వెంట తడి కూడా వచ్చినట్లు మన్మధుడు దండెత్తి వస్తున్నాడని సూచించే అతని జెండా పై గల మీనం (చేప )తో పాటు మేషం (రాశి )కూడా వచ్చింది .హేమంత చలి యువతుల్ని కావలించింది .వసంతుడు అనే ప్రియుడు ముందుకు వచ్చి వెచ్చదనం కల్పిస్తాడనే భావంతో హేమంతం చివరి ముద్దు పెట్టుకొని వెళ్లిందట .చలాకీ చంద్రుడు సూర్య కిరనాలంత వేడి పుట్టించి విరహుల్ని వేధిస్తున్నాడు .వసంత రుతువు అనే మంత్రిని ,కొత్త గా పుట్టిన వసంతుని బొడ్డు కోసిన కొడవలి లాగా కోయిల కూత యువతీ యువకుల్ని విరహం తో కోస్తున్నాయి .శివునికీ పార్వతీ దేవికీ ప్రణయం కల్పించ టానికి మన్మధుడు వేసిన పూల బాణాల మొనలు విరిగి ,చివుళ్ళు గా వేలుస్తున్నాయత. భూదేవి కడుపు లోంచి పుట్టిన వ్రుక్షాలనే పిల్లలకు పాల పళ్ళు ,దంతాలు మొలిచి నట్లు లేత చిగుళ్ళు పువ్వులు , పిందెలు పుడుతున్నాయి .వన లక్ష్మి రాబోయే మాధవుని అలంకరించ టానికి సింగారించు కొందిట .”. దేవత్వం సిద్ధిన్చినా ,మధు పానం అనే దురభ్యాసాన్ని వదలని తుమ్మెదలను వెక్కిరిస్తూ , తనకుపంచత్వం రారాదని ,పంచమ స్వరం తో కోయిల కూస్తోంది .మాధవుడు మామిళ్ళకు , పూలను సృష్టించి ,పిందెలు గా మార్చి ,మన్మధునికి ఆయుధాలు ,సరఫరా చేస్తున్నాడట .దేవుడే శత్రువుకు మేలు చేస్తుంటే విరహ గ్రస్తులకు దిక్కు లేకుండా పోయిందట .మధు మాసం అనే ఆవు పొదుగు నుండి పాలు కారు తున్నట్లు చంద్రుని వెన్నెలల తో భూలోకం తడిసి ,కమ్మని వాసనలనిస్తోంది .తుమ్మెద బారులు మన్మధ బాణానికి నారిగా మారు తోమ్దట .యువతుల చంద్ర బింబాల వంటి మొహాల కన్నా ,చను దోయి కంటే మాకే ఎక్కువ యవ్వనం వుందని పద్మాలు విరగ బూసి నవ్వు తున్నాయట .భ్రుగు మహర్షి తన్నినా నవ్వేసిన విష్ణు మూర్తి వెంకటేశ్వరుడై ,పద్మాతిని పెళ్ళాడాడు .ఆమె సత్య భామ గా మారింది .స్త్రీలందరికీ ఆ అంశ అంటించింది .ఏ స్త్రీ తన్నినా అశోకవృక్షం బంగారు పూలతో పూసినట్లు నవ్వు తోందట .మాధవుడు రాసాతలాన్ని , మకరంద వర్షం తో ,భూమిని పూలతో ,ఆకాశాన్ని పుప్పొడి తో జయించి ,త్రిలోక విక్రముడైనాదట .చిలకకు జామి పళ్ళు మేత గా ఇచ్చిన వసంతుడు ,ప్రేయసీ ప్రియులకు పూలు పంచి , తుమ్మెదలకు తేనె లిచ్చి ,వసంత లక్ష్మికి వెచ్చని కొగిలి ఇచ్చి ,పక్ష పాతం లేదని పించాడట.....!!!!! - Kks Kiran

by Kks Kiranfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pw2Kkv

Posted by Katta

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. ఐదవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఇప్పటికి ఇరవై ఆరు షేర్లు అయ్యాయి. 22వ షేర్ మత్లాగా రాసాను. మత్లాతో కలిపి చదివితేనే గజల్ అందం. గజల్లో ప్రతి షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది, కాబట్టి ఇలా ఒక యాభై లేదా వంద వరకు షేర్లు రాయాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. దరహాసం విరబూసిన జాజిమల్లె లాగున్నది చెంపలపై చిరుసిగ్గే మందారం లాగున్నది గుండెల్లో ప్రవహించే చిరునవ్వుల సుమధారలు నరనరాన హాయినిచ్చే ఉత్సాహము లాగున్నది నడుం చుట్టి ముడివేసిన పైటకొంగు గర్వంగా మల్లెమొగ్గపై జారే మంచుబిందు లాగున్నది అలలాగా ఊహల్లో అందమైన వదనాన్నే చూస్తుంటే జీవితమే పూలరథము లాగున్నది నగుమోము అలకల్లో తగ్గదుగా సౌందర్యం అప్పుడపుడు తప్పవుగా పరీక్షలు లాగున్నది

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PeJawm

Posted by Katta

Pusyami Sagar కవిత

!!జయ నామ వత్సర శుభాకాంక్షలు ...!! ముందుగా అందరు మన్నించాలి...బుధవారం ఉదయం పెట్టాల్సిన విశ్లేషణ ను మంగళవారం రాత్ర్హి పెట్టినందుకు ...!! మా గృహం లో నెట్ పని చెయ్యటం లేదు ...అందుకు బయటికి వచ్చి నెట్ సెంటర్ లో రాసి పెడుతున్నాను...మీ అందరి సహకారానికి ధన్యవాదాలు ...!!! నిశి గారు రాసిన కవిత !!దురాశ!! కవిత్వ విశ్లేషణ జీవితం లో ఆశ నిరాశ రెండు కోణాలు, ప్రతి అడుగు లో ను అవి నీడలా తోడూ వస్తు వుంటాయి, ప్రతి ఒక్కరి కి జీవితం ఎంతో కొంత అనుభవాలను పంచి ఇస్తుంది, అవి మంచివి కావొచ్చు ...చెడు వి కావొచ్చు...తనలో తానూ అంతర్మధనం చెందుతూ జీవితం లో తను కోల్పోయిన అనుభూతలను మరల ఒకసారి నాకివ్వు అంటూ నిశి గారు ఆశని రంగరించి అడుగుతారు. కోల్పయిన వాటిని తిరిగి కావాలనుకోవటం దురాశ నే ....కాని మనిషి ఆశ జీవి కదా....ప్రయత్నిస్తూనే ఉంటాడు ... తనలో ని ఉన్న బాహ్య ప్రపంచపు ముసగులన్ని తొలిగించి తనను తను తెలుసుకొనేల కొత్త గా అవిస్కరించేల ప్రయత్నం సఫలం చెయ్యి జీవితమా .....ఒక ఆశావహ ద్రుక్పధం మాటల్లో తోనికిసలాడుతున్నది ....!! మీరు దీన్ని ఆత్మ విమర్శ అంటారా ? లేదు తనను తానూ తెలుసుకొనే క్రమమా, ఏది అయిన కావొచ్చు ...సున్నితం గ చెప్పే ప్రయత్నం తడికళ్ళతో తమకంగా//తత్వాలకి తపనలకి దూరంగా//నాలో నన్ను వెతుక్కునే//ప్రయత్నం ఫలించేలా ఒక్కోసారి మనం జీవితం లో తప్పు అడుగులు వేసిన, అవి మనకు మేలే చేసి ఒప్పు గా మారిపోవచ్చు, అవే ముందు అడుగులు వెయ్యటానికి ప్రేరణ ఇస్తుంది ...అలగే ఇంకోచోట కళ్ళ నుంచి కారిపోయే పుసులు లా కాకుండా ఉసులను గట్టి గా బంధించి కంటి రెప్ప లా అప్యాయతవవ్వు ...పసితనాన్ని జోకట్టేల అక్కున చేర్చుకో అంటూ మానవులు యాంత్రికత లో పడి వారు ఏమి కోల్పోయారో అవి తిరిగి ఇచ్చేమన్న విన్నప్పం మనకి కన్పిస్తుంది ... తెలియక వేసిన తడబాటు//తెలిసిన మెలుకువ ఒప్పులు..//ముందుటడుగుల్లా మిగిలిపోయేలా//కళ్ళ పుసుల్లా కరిగిపోయే ఊసులుగా కాకుండా//కంటి రెప్పలా మిగిలే ఇంకో ఉదయాన్నివ్వు నిద్ర లో ఉలిక్కిపడే పసితనం ని//జో కొట్టే అప్యాయతవవ్వు మనం సున్నిత్వతాన్ని ..మృదుత్వాన్ని మరచిపోయామా ??, పువ్వులని ప్రేమించే గుణాన్ని, నవ్వులను ఆస్వాదించే స్థాయి ని అందుకోగాలిగామా, లేదు ....ప్రతి నవ్వు వెనక దాగి వుండే బాద ని అర్థం చేసుకొనేలా మాకు మృదుత్వాన్ని అందివ్వు ....కనీసం ఒక్కసారి మనసు తో అర్థం చేసుకోనేంత సున్నితత్వాన్ని జీవితమా మాకివ్వు ....!!! పువ్వులో నవ్వు చూడగలిగే//నవ్వుల వెనక దాగున్న బాధ అర్ధం అయ్యేలా//మృదుత్వాన్ని ఒక సారైనా ఇవ్వు ఇప్పటి దాక ఒక విన్నపాన్ని జీవితానికి విన్నవిన్చినట్టుగానే వున్నది ......కాని కింద వాక్యాలలో నిలదీస్తున్నట్టు గా మా కోసం ఆ మాత్రం చెయ్యలేవ ....నీతో అన్ని అనుభవాలను పంచుకుంటూ, నీతో ఓటమి ని , గెలుపు ని సమంగా పంచుకుంటూ , జీవితం లో కలిగే భయాలను వేదనలను ..ఎడుపులను ఒకటి ఏమిటి సమస్తాన్ని నాలో దాచుకుంటున్నాను కదా... బాధలు అన్ని మేఘం కన్నీటి వరదలో కొట్టుకుపోయేలా నన్ను పరిగెత్తించలేవా జీవితమా....నా కోసం ఆ మాత్రం చెయ్యలేవా అంటూ తన ఆశ ని వ్యక్తం చేసారు ... నీతో పాటు ఓడిపోతూ//నాలో నిన్ను గెలిపిస్తూ//నీ భయాలు వేదనలు నాలో దాచుకుంటూ ప్రయాణిస్తూన్నానుగా// బాధలన్ని బరువు తగ్గిన మేఘాల్ల్లా//కరిగి కన్నీటిలో జారి//పరుగులెత్తేలా కౌగిలించుకోలేవా ? నిశి గారు శీర్షిక లో !!దురాశ !! అని పెట్టారు , బహుశ ...జీవితం లో వారు ఉహించిన పలు ఆశలు దుర్లబం కామోసు ....ఎందుకంటే జీవితం అందరికి ఒకేలా ఉండదు కదా....కొంత మంది కి ఆనందాన్ని ఇస్తే మరికొంత మంది కి విషాదం ....ఇస్తుంది ....!! "మనిషి ఆశ జీవి" ప్రతి ఒక్కరికి కలలుంటాయి ...వాటిని సాకారం చేసుకోవటానికే ముందుకు సాగుతాడు ....ప్రతి ఒక్కరి జీవితం లో అలంటి ఆశ లు సఫలం చెయ్యమని జీవితానికి విన్నవించటం చాల బాగుంది .... వారు సున్నితత్వం ని మేళవించి కవిత ని బాగా రాసారు ...హృదయాన్ని హత్తుకునేలా మరిన్ని మంచి రచనలు అందిస్తారని ఆసిస్తూ .... సెలవు ... దురాశ | జీవితం ఒక్కసారి హత్తుకో నన్ను మనస్పూర్తిగా , మరో ఆశగా తడికళ్ళతో తమకంగా తత్వాలకి తపనలకి దూరంగా నాలో నన్ను వెతుక్కునే ప్రయత్నం ఫలించేలా తెలియక వేసిన తడబాటు అడుగులు మధుర జ్ఞాపకాలై తెలిసిన మెలుకువ ఒప్పులు ముందుటడుగుల్లా మిగిలిపోయేలా కళ్ళ పుసుల్లా కరిగిపోయే ఊసులుగా కాకుండా కంటి రెప్పలా మిగిలే ఇంకో ఉదయాన్నివ్వు నిద్ర లో ఉలిక్కిపడే పసితనం ని జో కొట్టే అప్యాయతవవ్వు పువ్వులో నవ్వు చూడగలిగే నవ్వుల వెనక దాగున్న బాధ అర్ధం అయ్యేలా మృదుత్వాన్ని ఒక సారైనా ఇవ్వు తీరని కోరిక అంటావా ? హుమ్మ్ నా నిన్నుగా నీతో కలిసి నీతో పాటు ఓడిపోతూ నాలో నిన్ను గెలిపిస్తూ నీ భయాలు వేదనలు నాలో దాచుకుంటూ ప్రయాణిస్తూన్నానుగా ఆ మాత్రం చేయలేవా? నా కోసం ? ఒక్కసారి మెత్తగా హత్తుకోలేవా ? బాధలన్ని బరువు తగ్గిన మేఘాల్ల్లా కరిగి కన్నీటిలో జారి పరుగులెత్తేలా కౌగిలించుకోలేవా ? ఏప్రిల్ 2, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PeJaw8

Posted by Katta

గుండు మధుసూదన్ కవిత

తేది: ఆగస్టు 09, 2012 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన... శివునకు అలంకారాలైన చంద్ర - నాగ - గంగ - భస్మ పదాలను ఉపయోగిస్తూ నచ్చిన ఛందస్సులో శ్రీకృష్ణుని స్తుతిస్తూ పద్యం వ్రాయమనగా నేను రాసిన ఆటవెలది పద్యము యదు కులాబ్ధి చంద్ర! యవనారి! గోపాల! పాద జనిత గంగ! వాసుదేవ! నగధర! వ్రజ మోహనా! గరుడ గమన! శౌరి! పద్మనాభ! స్మర జనయిత! మరిన్ని వివరాలకు: నాబ్లాగు "మధుర కవనం...http://ift.tt/1mwK6r1

by గుండు మధుసూదన్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PeJ9bE

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

ఏది ఏమైనా వో...కోయిలా..! కోయిలా..! నీ నోట ఆమని రాగం ఆలపించకముందే ఎన్నికల కోడి కూసింది షడ్రుచుల ఉగాది పచ్చడి అంగిట్లో రంగవల్లులు వేయక మునుపే షడ్రాజకీయ పార్టీలు నవరసాల పొత్తు చట్నీని ఆబగా జుర్రుకుంటున్నాయి పండితుల పంచాంగ శ్రవణం విందు చేయక మునుపే పంచమ శృతిలో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. కోయిలా..! నువ్వు లేత చివుళ్ళ రుచినాస్వాదించక మునుపే ఓటరన్న పచ్చని జీవితపు చిగురాశల్ని మేస్తూ కొత్త బెల్లం పానకం చవి చూడక మునుపే బెల్లపుసారాయి ,బీరు, చేరువాల ఘుమాయింపుతో మెదడుకు మత్తెక్కి తొక్కిసలాడుతున్నాడు. కోయిలా..! నీ కూత ఒక వసంత ఋతువు!! ఎన్నికల మోత! పంచ వసంతాల పరిపాలనా క్రతువు!! పచ్చని చెట్లతో రంగు రంగుల పూలతో ప్రకృతి తనువంతా పులకింత.! పచ్చ నోట్లతో రంగు రంగుల జెండాలతో ఓటర్లకు కూసింత కలవరింత.!! ఏది ఏమైనా వో ...కోయిలా...! నువ్వు "జయ"నామ వత్సరాన్ని నీ గొంతుతో స్వాగతించు మేము నవతెలంగాణా విజయోత్సవ గీతమై దిగ్దిగంతాలలో ...ధ్వనిస్తాం....ప్రతిధ్వనిస్తాం. (మీకూ మీ కుటుంబానికీ, జయ ఉగాది శుభాకాంక్షలు)

by Kanneganti Venkatiahfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mmcPyr

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్||ఆశాకిరణం కోసం!|| కుప్పిగంతుల సర్కస్ రాజకీయ కారడవిలో గూళ్ళు మార్చిన పిట్టలు ఆ గూటి గులాంగిరి చేస్తుంటాయి! అపస్వరాలలవాటుగదా! అవేపాత రోత వదలలేక తిట్లపురాణాల్లో నిష్ణాతులు కనుక నోటి దురుసు, దురద వదలలేక పాత రోకటిపాటే పాడుతూ నిన్న తిట్టిన వారి పంచ నేడు చేరి నేడు పొగిడే నరంలేని గాయక నాయకులవుతుంటారు! పద బంధాలకు నిఘంటువులతో పనిలేదు వెతికినా దొరకని భాషాశాస్త్రజ్ఞులు! కొత్త స్వరంలో స్వంత రాగాలాలపిస్తూ మీడియా ప్రలోభాలొదుకోలేక బఫూన్‌ పాత్రధారులతో పోటీ పడుతుంటారు! ప్రణాళికలు లేవు, విధివిధానాలు లేవు! సిద్ధాంతాలు బలాదూరు చేసి బజారుకీడ్చి, సింహాసనావరోహణే ధ్యేయం! దుమ్మెత్తి పోయడానికే ప్రాధాన్యతిస్తారు! పాత సినిమాలో పాటలా " చవటయను నేను! నీ కంటే ఒట్టీ చవటాయను నేను " అని చెవులకు చిల్లులు పెడుతుంటారు! రంగులుమార్చే ఊసరివెల్లులమించి ఎంత గుంజుకోవచ్చు! ఎంత మిగుల్చుకోవచ్చు ననే రంధి తప్ప ఊరివారి బాగోగుల వూసుండకుండా జాగ్రతపడతారు! ఓట్లను రాబట్టుకోటంలో వెర్రివేషాలెన్నైనా వేస్తుంటారు ఇచ్చిన మాట నిలబెట్టరు కాని, చిచ్చులు పెట్టటంలో సిద్ధహస్తవాసులు! కడుపులోంచి మాటలు రావు, వచ్చినా అవి నోటి చివరివే అదీ నోటు చివరివే! చెల్లని నోట్లను యిచ్చి నల్లధనాన్ని తెల్లబరచుకునే యెత్తులువేసి చల్లగా జారుకుందామనుకూంటారు! వట్టి కారు కూతగాళ్ళ ఎత్తులు చిత్తు చేసి చేవకలిగిన నేతల్ని ఎన్నుకోవాలని సామాన్యులు ఈ ఎన్నికల కూడలిలో తోడుకోసం ఎదురుచూస్తున్నారు! వారిని పట్టించుకునే వారికోసం, యిన్నాళ్ళు పడ్డ దగా కుహురంనుండి విముక్తి కలిగే నిత్య జీవన సమరంలో పాలుపంచుకునేవారికోసం,లంచగొండులను, రాజకీయ విటులను '' నోటా ''తో నైనా పోటు పొడవాలని కాదు కాదు ధీటైన నేతను ఎన్నుకోవాలని ఎదురుచూస్తున్నారు! సహస్ర వృత్తుల బడుగుజీవుల సమరశీల పోరు పటిమ జయకేతనమేగిరేలా సమ సమాజ శక్తులపునరేకీకరణ కోసం సర్వ సత్తాక సామాజిక పాలకులకోసం రేపటి ప్రజాస్వామ్య నూతన అరుణకాంతికోసం ఎదురుచూస్తున్నారు! 31.3.2014 ఉదయం 5.30

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNbh3e

Posted by Katta

Patwardhan Mv కవిత

కాల్ కత!! మనం కాలాన్ని గోడకు వేలాడదీసి సంబరపడుతుంటామా అదేమో నిశ్శబ్దంగా మన కాళ్ళ కింది ఇసుకను తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. . ********************************************************* తేదీల పేర్లూ రోజుల పేర్లూ వారాల పేర్లూ వత్సరాల పేర్లూ మారుతున్నాయి కానీ ఓ పిచ్చి తమ్ముడూ! మన బత్కు లేమైనా మారుతున్నాయా? కాలందీ,రాజ్యందీ ఒకే స్వభావం. 31-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mvfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hQ67N4

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

మృదువుగా , మధురం గా కవిత ని కవిత లా రాయాలన్న విశ్వప్రయత్నం లో ఇంకో సారి ఓడిపోతూ ............... నిశీధి | దురాశ | జీవితం ఒక్కసారి హత్తుకో నన్ను మనస్పూర్తిగా , మరో ఆశగా తడికళ్ళతో తమకంగా తత్వాలకి తపనలకి దూరంగా నాలో నన్ను వెతుక్కునే ప్రయత్నం ఫలించేలా తెలియక వేసిన తడబాటు అడుగులు మధుర జ్ఞాపకాలై తెలిసిన మెలుకువ ఒప్పులు ముందుటడుగుల్లా మిగిలిపోయేలా కళ్ళ పుసుల్లా కరిగిపోయే ఊసులుగా కాకుండా కంటి రెప్పలా మిగిలే ఇంకో ఉదయాన్నివ్వు నిద్ర లో ఉలిక్కిపడే పసితనం ని జో కొట్టే అప్యాయతవవ్వు పువ్వులో నవ్వు చూడగలిగే నవ్వుల వెనక దాగున్న బాధ అర్ధం అయ్యేలా మృదుత్వాన్ని ఒక సారైనా ఇవ్వు తీరని కోరిక అంటావా ? హుమ్మ్ నా నిన్నుగా నీతో కలిసి నీతో పాటు ఓడిపోతూ నాలో నిన్ను గెలిపిస్తూ నీ భయాలు వేదనలు నాలో దాచుకుంటూ ప్రయాణిస్తూన్నానుగా ఆ మాత్రం చేయలేవా? నా కోసం ? ఒక్కసారి మెత్తగా హత్తుకోలేవా ? బాధలన్ని బరువు తగ్గిన మేఘాల్ల్లా కరిగి కన్నీటిలో జారి పరుగులెత్తేలా కౌగిలించుకోలేవా ? నిశీ !! 30 / 03 / 14

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPkWB

Posted by Katta

Rvss Srinivas కవిత

||జయ ఉగాది || మావిచివుళ్ళను ఆరగించిన గండుకోయిల మత్తెక్కి మధురగీతాలు ఆలపిస్తుంటే వగరు మామిడిపిందెలను కొరుకుతూ తీపి పలుకులు వల్లిస్తూ చిలుకలు సందడి చేస్తుంటే ప్రతితరువు చిత్రసుమాల సొబగులద్దుకుంటూ వసంతునితో కళ్యాణానికి ముస్తాబులౌతుంటే ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర చుట్టుకొని ప్రతి మార్గంలో సుమాలు వెదజల్లుతుంటే కొమ్మల కొప్పులెక్కిన సిరిమల్లెలు పలుదిశల పరిమళనృత్యం చేస్తుంటే తుంటరి తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ విరికన్నెల ప్రసాదాలకై ప్రదక్షిణలు చేస్తుంటే చెరకు విల్లుతో మదనుడు సుమశరసంధానం చేస్తూ తేనెటీగల అల్లెతాడును ఏకబిగిన మ్రోగిస్తుంటే శ్రీగంధం పూసుకొని సుమలతలు చుట్టుకొని చైత్రరథం చక్రాలధ్వనితో పుడమిని పులకింపజేస్తూ తరువులన్నిటినీ పలకరిస్తూ…సుమగంధాలను ఆఘ్రాణిస్తూ శిశిరాన్ని తరిమి కొడుతూ…విజయదుందుభి మ్రోగిస్తూ జయకేతనం ఎగురవేస్తూ…విచ్చేసాడు ఋతురాజు అపజయమెరుగని ‘జయ’నామధేయుడు. - శ్రీ. 31/03/14

by Rvss Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPfxvK

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//పరిష్వంగనం// కొన్ని నిశబ్దాలు తరుముతాయి ఏకాంతంలో మరీను ఏకాంతమంటే నువ్వు లేవని కాదు నువ్వుండగానే నీలోకి నేనుండగానే నాలోకి కొన్ని శబ్దాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి నువ్వుండగానే ఏరి కోరి నువ్వు మాట్లాడకుండానే నానుంచి నాలోకి నీనుంచి నీలోకి అకస్మాత్తుగా ఒకేసారి మనమిద్దరం మాట్లాడటం మొదలుపెడతాం ఒకేసారి ఆపేసి నువ్వుముందంటే నువ్వుముందని ఒట్టు పెట్టుకుంటాం, నవ్వుతో బెట్టు వీడి బెంగటిల్లిన మనసుకు వసంతం వస్తుంది నిశబ్దాలు, శబ్దాల నడుమ ఒక్కటై గడ్డకట్టుకుపోయిన రెండు శరీరాలు ఒదిగిన ఎదల మద్య వార్పుకు ముందు ఎసరులో అన్నం ఉడుకుతున్న వాసన....31.03.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OaUWGT

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

అమ్మ కూచి రావెల పురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ఔను నిజం నేను అమ్మ కూచినే అభిమానం అనురాగం ముందు మాటగా రాయబడ్డ కవితా స్రవంతి అమ్మ. ఉదయం ముఖప్రక్షాళనం కాగానే నొసటన రూపాయంత కుంకుమ బొట్టుతో ప్రత్యక్షమయే మాఇంటి గృహదేవత మా అమ్మ చిన్నప్పుడు తెలిసీ తెలియని తనంలో నేను చేసిన అల్లరినంతా భరించి జాగ్రత్తరా కన్నా అంటూ నొసటన ముద్దుల వాన కురిపించిన అమ్మ కూచినే నేను నా ఐదో ఏటనే అమ్మ మరో బిడ్దకు జన్మనిచ్చే ప్రసవవేదనలో గుర్రపు వాతం వచ్చి తిరిగి రానిలోకాలకు చేరి ఆ మధురాతి మధురస్మృతులలోనే మమ్మల్ను పునీతంజేసిన అమ్మ కూచిని నేనే నని చెప్పుకోగల సుపుత్రుడిని నేనని విన్నపం ____________________________________________01-04-2014

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hvNamz

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ఒక’ సారీ‘ నిన్న రాత్రి సినీవాలి వెన్నెలలు రాలిపోయిన జాబిలి చెట్టు నింగిలో చుక్కలు నిదురవనంలో కలలసుమాలు ఎత్తుకపోయినట్లు గాలిపెదవులు తడారిపోయి కీచురాళ్లతో మాట్లాడించినట్లు నేలజారిన పూలపుప్పొడుల మీద కరుకుపాదాల మరకలు వెనకకు మర్లిపోయిన కొండవాగు ఆత్మీయశైతల్యం మనసుబండలైపోయిన గుండెకొండ శైథిల్యం ప్రశ్నలే పట్టువిడని విక్రమార్కులై జవాబుల బేతాళులే అంతులేని అహాల చెట్లెక్కి పోతే జీవితకావ్యంలో చింపేసిన మాటలకథలు అతుకుపడని ఆంతర్యాల అంతర్యానం ఎవరు ముందు ఎవరు వెనుక సందేహాలే శాసించే స్నేహాల మోహంమీద నిస్సందేహంగా కన్నీటిలిపి వుండే వుంటుంది నీవైతేనేం, నీదైతేనేం ఏకాంతమేగా నేనైతేనేం వొదలని మౌనం

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQuCyx

Posted by Katta

Satya NeelaHamsa కవిత

-- అయినా ఆ కళే వేరు.. ^^^^^^^^^^^^^^^^^^^^^^^ -సత్య విధి వధిలేసిన బతుకుల మధ్య గొంతులొ ఎండిన మెతుకుల మధ్య పల్లపు దారుల గతుకుల మధ్య కడుపు కాలితే పుట్టేది కళ, అయినా ఆ ఆకలితీర్చే కళే వేరు... రెప రెప లాడే నెత్తుటి జెండా భుజాన మోసే పథాన సాగి ఎదురు నిలిచిన నిబ్బర గుండెల విప్లవాల తో పుట్టేది కళ, అయినా ఆ ఉద్యమాల కళే వేరు... విజయవికాస కష్ట స్వేధమై సత్యబీజపు నిత్యసేధ్యమై కృషి కార్యాల ఇష్ట సాధనై ప్రతిఘటన నుండి పుట్టేది కళ, అయినా ఆ ప్రగతినిచ్చే కళే వేరు... పెద్దలు పేర్చిన ఫలాల పంట తోడుక నీడగ కదిలే వెంట ధార్మిక జ్ఞాన కర్మలనుండి సంప్రదాయం నుండి పుట్టేది కళ, అయినా ఆ సంస్కరించే కళే వేరు... -సత్య

by Satya NeelaHamsafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mkPlK9

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

కన్న పేగు వ్యధ | విష్వక్సేనుడు వినోద్ ఎడతెరిపిలేని నీతిసూక్తులు బోధిస్తూ వింటున్నావని వశపరుచుకోగలనా ? ఆపాదమస్తకం గమ్యాన్ని నింపేస్తూ చిగురుటాశలకు కళ్ళెం వేయగలనా? ఉన్నతంగా జీవించాలని కాంక్షిస్తూ ఉన్న సంస్కారాన్ని విదిల్చగలనా? సృష్టిలో కనరాని వింతల్ని చూపిస్తూ వాడిన మనసును ఆకట్టుకోగలనా ? వ్యధను పరిచయం చేయకుండానే విలాసాలకు బానిస చేయగలనా ? కాలం కన్నీటి రుచిని చూపకముందే జీవితపు మాధూర్యాని నేర్పగలనా ? రెక్కలు మొలిచాయని ఎగిరిపోతానంటే జన్మనిచ్చానని నియంత్రించగలనా ? పేగు తెంచుకున్నాకే ఊపిరిపీల్చానంటే కన్న పాపానికి కుమిలిపోక ఉండగలనా? 31-03-2014

by విష్వక్సేనుడు వినోద్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mvqK5B

Posted by Katta

Murthy Kvvs కవిత

Don't tell me how educated you are,tell me how much you have travelled. --Prophet Mohammed KVVS MURTHY|జ్ఞానీలు-36 ప్రయాణాల్లోనే తెలిసింది జీవితం విలువేమిటో... ప్రయాణమే నేర్పించింది ప్రపంచమెంత విశాలమో.. దాని పొరలకింద ఎంత గ్రంధాలకందని వికాసమున్నదో.. ప్రయాణమే పంచేద్రియాలకి ఇంకొక ఇంద్రియాన్ని జత చేర్చేది.. దేహస్థితి ని దాటని వారికి ప్రయాణం గూర్చి ఎంత చెప్పినా వృధయే..! -------------------------------------- 01-4-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jTQKdD

Posted by Katta

Gvs Nageswararao కవిత

//సంకల్పం// గరిమెళ్ళ నాగేశ్వర రావు// మొన్న రాత్రివేళ హఠాత్తుగా మాయమైపోయిన వెన్నెల ఎక్కడికి వెళ్ళిపోయిందో అని వెదుక్కుంటూ వుంటే... వేపచెట్టు కొమ్మల రెమ్మల్లోంచి పువ్వులై నవ్వుతూ కనిపించిందది. కోయిల గానం లోంచి వినిపించే ధ్వానం లోనూ చిగురుల వగరులని దానం చేసిన మామిడి కొమ్మ త్యాగం దాగుందట మొగ్గ తొడిగేవేళ మల్లె మొక్క మదిలో.. మన్మధుడు రధమెక్కి కదులుతూ మెదిలి ఉంటాడు.. అందుకే గమ్మత్తుగా మత్తెంకించే ఈ పరిమళం. తూరుపు కొండల లోంచి శిరసెత్తిన తొలికిరణం వేకువ దేహం మీద కాలం కానుకలా వెలిగే ఆభరణం మేఘం తో మేఘం తాకినప్పుడు మోగిన మోహన రాగమేదో మలయ వీచికతో కలిసి మంగళ గీతం పాడిందట ఊహా జనిత ఉత్ప్రేరకం లాంటి ఉత్సాహమే కదా ఉగాది అంటే! ఊహల ఉయ్యాల దగ్గర హృదయపు చెవి పెట్టి విను కొత్త శిశువు చెబుతుంది రేపటి ఉగ్గుపాల ఊసులు వసంతాన్ని స్వాగతిస్తూ తొలికోడి కూయగానే మొదలయ్యింది సంవత్సరం పొడవునా సాగాల్సిన జీవనోత్సవం. నోరు తెరచి స్వాగతించగానే ఆరు రుచులపచ్చడి ఆలోచనల లోలోపలికీ చేరి అరిగినట్టే ఉంది.. నవనాడులనూ శుద్ది చేసి జీవన యుద్ధానికి సిద్ధం చేస్తుంది. పంచాంగ శ్రవణంలో వినిపించే భవితవ్యం ఒక హెచ్చరిక రాజ్యపూజ్యమెదురైతే ఉప్పొంగి పొంగి పోకు అవమానం బెదిరిస్తే భయపడుతూ లొంగిపోకు మేషమైన సింహమైన, మిధునమైన మీనమైన రాశి ఫలం చెబుతుందట గంటల పంచాంగం రాశేదైన రాసిందేదైనా అసలు బలం నీలోనే ఉందన్నది యదార్ధం కందాయ ఫలంలో సున్నా ఎక్కడ ఉన్నా నీహృదయం లో దానిని చేరనీకు ఆగ్రహం పోయి గ్రహాలన్నీ అనుగ్రహాలించాలంటే చెయ్యాలి నువ్వొక దానం..నువ్వుల దానం కాదది అహాన్ని దహనం చేస్తూ 'నేను ని వదిలే దానం అది. మిత్రమా ఈ పండగవేళ మది మలినానికీ తలకడిగి కొత్తగా ధరించి మానవత్వాన్ని పట్టుదల వస్త్రంలా. శాంతి ఎప్పుడూ హోమగుండం లోచి పుట్టదు. అది ప్రేమ భాండం లోంచి పుడుతుంది. పదిమంది కలిసిన చోటే పండగ మొదలౌతుంది చిరునవ్వు పూసిన చోటే ఉగాది చిగురిస్తుంది . 30/3/2014

by Gvs Nageswararaofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeNhn

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-35 బొంది లో కరెంట్ ఉన్నట్టుండి కట్ అయినపుడు అంతసేపు నవనవలాడే దేహం బిర్ర బిగుసుకొని కట్టెలా మారిపోతుంది... సంపాదించుకున్న అనుభవాలన్నీ అంతటితో తెగిపోవలసిందేనా...? పునర్జన్మ ఉంటేగనక అక్కడికి బదిలీ అవుతాయా ...? ఏ ఉపన్యాసమూ..ఏ ఉపదేశమూ ఈ దాహాన్ని పూర్తిగా తీర్చదెందుకని..? శూన్యంలో ప్రవహించే వాయువు వంటి మన్సు ఏదో చెబుదామని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది... అంతర్జాలంలో ఒక కిటికీ నుంచి ఇంకో కిటికీ కి ఎలా పోతుంటామో అంతర్ ప్రపంచంలో కూడా అదే తంతు..! ------------------------------------------------- 30-3-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLRcdM

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఏదో పద సవ్వడి..వడివడిగా గుమ్మానికి వ్రేలాడుతూ చూపుల తోరణాలు . . వయ్యారి వసంతమా వచ్చేస్తున్నావా? నీ మూన్నాళ్ళ వగలన్ని మళ్ళీ ఒలికిస్తావా ? చివుళ్ళు వేయడం ఆనక చిదిమేయడం నీకే చెల్లు.. వినిపిస్తుందా నీకు ఎండుటాకుల గలగలలో అడియాశల ఆత్మ విలాపం కనిపిస్తుందా నీకు మోడుబారిన గుండెల్లో ఆత్మీయతల చరమ గీతం నా పిచ్చిగానీ . . గడిచిపోయిన నిన్నటి శిథిల శిశిరంలో రాలిపోయిన ఆశల ఆకులెన్నని ఈ వసంతాన్నడిగితే ఏం చెపుతుంది ? అది రాలిన చోటే తను పుట్టానని మిడిసిపడుతూ గర్వంగా చెపుతుందా..? లేక ఇదే ప్రశ్న రేపు నేను రాలిపోయాక వచ్చే వసంతాన్నడుగుతావా అని దిగులు పూల హారాలతో బదులిస్తుందా.? కాలానికి ఋతువులెన్ని మారినా అనుభూతుల చివుళ్ళ జాడేది? పంచ వన్నెల పంచాంగాలెన్ని పరచినా మస్తిష్కపు మంచు పొరలు తొలగవేం? యుగాలు దాటే ఉగాదులెన్ని ఎదురొచ్చినా ఎద కోయిల కూయదేం? పల్లవించని స్పందనల్లో గొంతు దాటని కూజితాలన్నీ నిశ్శబ్ధ సంగీతాలేనా? ఉదయించని స్తబ్ధ ఉగాదులేనా? నిర్మలారాణి తోట [ తేది: 30.03.2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeOBN

Posted by Katta

Santosh Kumar K కవిత

||శిథిలం|| శీర్షిక : చినిగిన కాగితంపై వ్రాసిన కావ్యం ప్రణయమనే నాగిని కాటేసిన జీవితం!! అటువంటి జీవిత పతనానికి గల కారణాల విశ్లేషణ నేను వ్రాసిన ఈ కవిత్వం. ప్రేమలో మోసపోయిన ప్రతి ప్రేమికుడికీ అంకితం నా ఈ "శిథిలం"!! మంచు అక్షితలే కురిసేవి నీతో సాగే పయనంలో.. మలయమారుతాలు వీచేవి నీతో గడిపే సమయంలో.. పన్నీటి జల్లులు తుళ్ళేవి నిను చూసే తరుణంలో.. అలా ఊహకందని ఓ అందమైన జీవితాన్ని కాదంటూ.. కుదరదంటూ వెల్లిపొయావు.. వాస్తవాలన్నీ వికృతంగా వెక్కిరించేలా నీ వియోగంతో నిదురలేచిన నాకు కల్లోలమైన లోకాన్ని పరిచయం చేసింది అనుక్షణం కన్నీటికి నానినాని తడిచి ముద్దైన నా కనుపాపలను వదిలి వెళ్ళలేక కొలువై ఉన్న నీ రూపం!! ఆ క్షణమే గ్రహించాను.. జాలి ఎరుగని విధి ఆగ్రహాన్ని.. నిజానికి నేను నడిచింది ఎడారి త్రోవలో ఎండమావులతో నిండిన ఎండాకాలమని, అడుగు సైతం వేయలేని ముళ్ళదారని, కరుణలేని కానరాని కటికచీకటని, నీ అనుగ్రహానికి నోచుకోని నా జీవితానికి మిగిలింది గ్రహణమని నేనొక వెలుగెరుగని కలుగు వాసినని.. మదిగదికి జీవిత ఖైదుని విధించి విషాద ఊబిలో చిక్కుకుపోయి అనాథగా మిగిలిన అసమర్థుడనని.... కానీ అడగకుండా ఉండలేకపొతున్నాను అతి మధురమైన తల్లి ప్రేమని అనిర్వచనీయంగా చూపుతారు కదా, హృద్యమైన అనురాగ బంధంతో ఒక కూతురిగా తండ్రిని ప్రేమిస్తారు కదా, తోబుట్టిన అన్ననీ, తమ్ముడినీ అక్కున చేర్చుకుని సాకుతారు కదా, మనువడి కాలు కందకుండా ముద్దాడుతూ మోసుకు తిరుగుతారు కదా, జీవితమంతా ఇందరి మగవాళ్ళని ఆదరించి ఒక్క ప్రియుడి విషయంలో మాత్రం ఎందుకని కనికరించరు?? అవునులే మనకు రక్త సంబంధం లేదు కదా మమకారం అనే మత్తుని పరిచయం చేసినా ఆప్యాయతనే ముసుగులో అవిటివాడిగా మార్చినా ప్రతిక్షణం సఖియే ప్రపంచం అన్నట్టు ఏమార్చినా ఒక్కసారిగా ప్రేమశిఖరాగ్రం నుండి నయవంచన కావించి నట్టేటిలోకి తోసేసినా అడిగేవాడు ఉండడు అనే ధైర్యం నీది.. పొరపాటున అడిగినా సరే.. మగాడివి నువ్వు, ఆత్మహత్య చేసుకోటానికి సిగ్గులేదా అని నీ తప్పుని మరిచి నాదే ఒక తప్పని నిరూపించే సమాజం మనది!! అయినాసరే.. నా ఒటమికి నాదే భాద్యత.. ఎందుకంటే, ఒట్టేసిన చేతికి తెలియదు పాపం తను కేవలం చేతకాని చెయ్యిని అని, నీ చేతిస్పర్శ మంట పుట్టించే ఒక చురకని...! చూసిన కంటికి తెలియదు పాపం తను చూసింది కేవలం పైపైన మెరుగులని, నిలువెత్తు నిఖార్సైన నకిలీలేని బంగరం కాదని...! వింటున్న చెవికి తెలియదు పాపం చిలిపిపలుకుల ఆంతర్యం చైత్రంకాక శిశిరమని, మాటలతో ప్రణయాన్ని మదించటం సులభమని...! అన్నింటికిమించి నా హృదయానికి తెలియదు పాపం మన ఎడబాటుకి, నా ఎదపోటుకి కారణం నువ్వని, నీ జ్ఞాపకాల గాయాలకు ఛిద్రమైన తాను ఒక శిథలమని!! #సంతోషహేలి 01APR14

by Santosh Kumar Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkksQS

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మకరందం || ====================== మకరందం కోసం వెతికితే నీ పెదాలు కనిపించాయి మకరందాన్ని జుర్రుకోవాలని ఆశగా ఉంది సీతాకోకలా మారి నీ పెదాలను తాకాలని ఉంది నీ పెదాలను నా పెదాలుతో తేనెటీగలా గుచ్చాలని ఉంది నీ పెదాలు గాయ పడుతాయేమోనని బాధగా ఉంది తేనె పట్టు నీ శరీరమైతే మకరందాన్ని పిండెయ్యాలని ఉంది తేనెపట్టు నడుమ తుట్టలో ఈగనై గిలిగింతలు పెట్టాలని ఉంది మకరందాల అందాలను అదిమి పట్టాలని ఉంది ఆశల అనుభూతులను పంచుకోవాలని ఉంది ఆశల నడుమ ఎన్నో ముళ్ళు సీతాకోకల... తొలుత గొంగళ్ళు పరిణామ క్రమమ లో మార్పులు (సరదాగా రాసిన కవిత ) ================= ఏప్రిల్ ఫస్ట్ /2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gXvhy6

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gkksjW

Posted by Katta

Tarun Chakravarthy కవిత

తరుణ్ చక్రవర్తి ||నేను ....|| నేను మాట్లాడకపోతే ప్రపంచం మూగవోతుంది నేను కదలకపోతే ఈ జగం నిశ్చలమవుతుంది నేను వినకపోతే ఈ లోకం వేదన అరణ్య రోదనవుతుంది నేను చూడకపోతే వెలుగు చీకటయిపోతుంది నేను శ్వాసించకపోతే గాలులు స్థంభించిపోతాయి ........ నేను అనంతాన్ని నేను దిగ్దిగంతాన్ని నేను తరంగాన్ని నేను కిమ్మీరపు గాలి తెమ్మెరను నేను రేణువును, గోపగోపికా కోపతాప స్వాంతనపు వేణువును నేను భావాన్ని, నేను పక్ష్యాదుల కిలకిలారావాన్ని నేను జగత్తును, నేనే మహత్తును నేను మరచిపోబడ్డ గతాన్ని, నేను దద్ధరిల్లుతున్న ఉద్యమకారుడి స్వగతాన్ని.... నేను మరీచిని, నేను లోక పునర్నిర్మాణం కోసం వెన్నెముకనిచ్చిన దధీచిని. నేను చేతస్సును, నేను ప్రజాశ్రేయస్సు కోసం ఆవిష్కృతమవుతున్న హవిస్సును... నేను కుసుమపేశల శిరీశను, నేను జిగీషను నేను కవిత్వపు వస్త్వైక్యాన్ని, నేను కవి భావనలోని ఏకాత్మతను నేను ప్రపంచపు చైతన్యాన్ని, మానవ హృదయాశావధి నిండిన భావనాత్మక ఔన్నత్యపు ఉనికిని.. నేను భీరువును, నేను ధీరుడిని.... నేను భీకర ఆయుధాన్ని, తండ్రి యెదపై ఆడే చిన్నారి నవ్వుల శీకరాన్ని... నేను బలవంతుడి ధాష్టీకానికి తెగిపడ్డ మెడను.. నేను చలిచీమల చే కట్టబడ్డ దుర్భేద్యపు గోడను... నేను మానవాంతర్గత సంద్రపు కల్లోలాన్ని.. నేను తిమిరలోకపు గుండెలు చీల్చిన ఉదయ శరాన్ని... నేను యుద్ధ సేనాని రథ కేతనాన్ని.. నేను సమాజంలోని అధిపత్యవాదులచే కుంచించబడుతున్న గౌరవమనే వేతనాన్ని... నేను మనిషి గుండెలో విరుస్తున్న వాత్సల్య శిల్పాన్ని.... నేను బండరాళ్ళ ను చీల్చుకుని మొలకెత్తుతున్న వికసిత పుష్పాన్ని.... ... ... ... నేను గాలిని.... నేను వెలుగును... నేను స్వాంతనను... నేను చైతన్యాన్ని.. నేను మనిషి మస్తిష్కంలో ఇంకా ఇంకని మా న వ త్వ పు జా డ ను.....

by Tarun Chakravarthyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNXm9E

Posted by Katta

Radha Rao కవిత

సరస్వతీ పుత్రుల పఠన శాల అంటే అతిశయోక్తి అనుకోవచ్చు ? ఎవరైనా ఏమైనా అకోవచ్చు ? "పాడుటాతీయగా" డాక్టర్. శ్రీ పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం ఈ టీవీ ద్వారా ప్రసారం ఇంటిటా సంగీత కళాశాల. సంగీతం అంటే అది శాశ్విత సజీవ విజ్ఞాన సంపుటాలే ! నటులు, నాటించే వారెవరైనా అంది సభ్యత సంస్కారం ఆచరించి నంతవరకే విలువలు ? కొంతకాలానికి వారెవరైనా మరిచిపోవడం సహ�జం ! అదే సంగీతాలాపన సజీవం !! ఒక పాటకు ఎవరు ఎంత కుప్పి గంతులేసినా వాళ్ళు గుర్తుం డరు.

by Radha Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1knlU95

Posted by Katta

Gudipati Palapitta కవిత

పాలపిట్ట బుక్స్ పబ్లిష్ చేసిన శివారెడ్డి ముందుమాటల పుస్తకం విడుదల అయింది. For copies contact : 040-27678430

by Gudipati Palapittafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ol7P1R

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || నా చెలి! || దూరంగా ఎక్కడికో నీవు వెళ్ళిపోతూ తలుపులు మూసివేస్తున్న భావనే కన్నీళ్ళై, నా బుగ్గలపై జారి నా ప్రపంచం .... శూన్యం అయిపోతున్నట్లుంటుంది నా భుజస్కందాలే నాకు దూరమై .... నా మనోగతం చీకటి అయోమయమై కాలం భారంగా కదులుతున్నట్లు గోడమీద గడియారమూ, గుండె లయను కోల్పోయి అసంతులనంగా వేగంగా కొట్టుకుంటున్నట్లుంటుంది. నీవు పక్కనున్నప్పటి నీ స్నేహ ఆత్మీయ బుజ్జగింపులు నా మది తెరపై జ్ఞాపకాలై అస్పష్టంగా .... పదే పదే కదులుతూ నీ ప్రతి ఊహ తోనూ నా హృదయం ఆవిరై ఒంటరితనం పై .... తీవ్రమైన అసహ్యం పెరుగుతూ తెలియని అలజడి, నా నరనరాల్లో పెరిగి ముచ్చెమటలు పడుతుంటాయి. గదిలోని ప్రతి వస్తువు మౌనంగా నీ పేరే జపిస్తూ నా మనసును కలవరపెడుతుంటుంది. తీయని సెంట్ వాసన .... ఏదో బెడ్ రూం లో వరదలై పారి తలగడను అతుక్కునున్న సువాసనల జాడలు బెడ్ రూం నేలపై పరుచుకునున్న నీవు విడిచిన ఆ దుస్తులు వెదజల్లుతున్న నీ స్వేద మత్తు వాసనలు పీల్చేకొద్దీ .... విపరీత భావనలేవో చెలరేగి నా గుండె అల్లల్లాడుతుంది. అకస్మాత్తుగా నా మనస్సు ఖాళీ అయిపోయి నేను అపస్మారక స్థితిలోకి జారుకుంటున్నట్లు నా సర్వమై అమూల్యమైన లక్షణం నిన్ను శాశ్వతంగా కోల్పోతున్నానన్న కారణం ఏదో నన్ను ప్రశ్నిస్తుంటుంది. నిజానికి .... నీవు నానుంచి కోరుకున్నదేమిటని? నా ఆత్మ సమర్పణ నీన్నే ప్రేమిస్తున్నాననే ఆలోచనను దాచలేని నా ఎద భావనను .... నా నోట వినాలనే అని. నీ ఆత్మ సౌందర్యం ప్రకాశమేమో నీ కళ్ళలోనే కనిపిస్తుంది నీ పెదవుల్నుంచి త్రుళ్ళిపడే .... తియ్యని మాటలు మదిని ఊరిస్తూ స్వర్గం ఎంతో సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు నా పక్కన ఉన్నప్పుడు నీ నవ్వు నా ప్రపంచాన్ని ఆశావహం గా మారుస్తూ, జంట నక్ష త్రాల్లా ఏ వజ్రాలూ కెంపులకు లేని మెరుపుల్లా లక్షల్లో అరుదైన ఒకే ఒక్క జంటలా మన ప్రేమ మనకు అరుదైన ఆనందాన్నిస్తూ ఏ ప్రత్యామ్నాయమూ లేని దివినుంచి దిగివచ్చి .... భువిలో నా కోసమే జన్మించిన మణివో మాణిక్యానివో అన్నట్లు ఎన్ని జన్మలైనా ఎంత మదనపడైనా పొందాల్సిన సందర్శనీయ బహుమానం నీ అనురాగం అనిపిస్తుంది. నా హృదయం నీకు సమర్పించుకుంటున్నాను నీపై నాకున్న ప్రేమకి గౌరవ సూచన గా సంపూర్ణంగా .... అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది ఆ బ్రహ్మ ఎంతో కష్ట పడి అనురాగము, ప్రేమ .... సమతుల్యం గా శిల్పంగా నిన్ను చెక్కాడేమో అని నా అంతరాంతరాల్లో తుడిచివెయ్యలేని రాగ బంధం నీ ప్రేమే అని అంకితమిస్తున్నాను. నా అమరప్రేమను .... ఎంతో వినమ్రంగా నీవూ, నేనూ ఒకరికి ఒకరం చేరువైన క్షణాల్లో తగిలే నీ వెచ్చని శ్వాస కోసం .... నీ అనురాగం స్నేహం ఆత్మీయతల కోసం .... శారీరకంగా, మానసికంగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నీ ప్రతి కోరిక నా ఆత్మ అభీష్టమే అనుకుని జీవన చరమ ఘట్టం .... స్వర్గం చేరేవరకూ .... కలిసుంటానని మాటిస్తున్నాను. నా ఆత్మ, నీ ఆత్మ ప్రేమకు కట్టుబడి ఉంటుందని 30MAR14

by Chandrasekhar Vemulapallyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNXmq4

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

అరుణమణులు... 1 మరో మారు పార్టి జెండ మార్చావా కండువా!? ఎటుబడితే అటునడిచే రాజకీయ శిఖండివా!? 2 ఎవరికైన వుండాలోయ్ ప్రజాస్వామ్య నిబద్దత వోటు తోటి ఋజువుచెయ్ రాజకీయ విశుద్దత. 3 ఎన్నికలపుడే పుట్టే "నేత" కాడు హ్యూమనిస్టు ఓట్లు గుంజె ఎత్తుగడల చిఠాయే మ్యానిఫెస్టు. 4 చేతిలోకి డబ్బువస్తె అవుతావా నరపతి!? నోటు కోరకు ఓటునమ్మి కోల్పోకోయ్ పరపతి!! 5 "మూసీ"నది చరిత్రంత మురుగు నీట మునిగింది ప్రజాస్వామ్య ఘనతనంత పచ్చ నోటు మింగింది. . 30.3.14.

by Kanneganti Venkatiahfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rSrUvQ

Posted by Katta

Manjunadha Reddy కవిత

ఏమి చేయాలో ఏమి చేస్తున్నామో ఎక్కడికి వేళ్ళలో ఎవరిని కలవాలో ఎవరితో మాట్లాడాలో తెలియలేదు ఎవరికి ఏమి ఇష్టము ఏది కష్టము తెలియదు ధర్మము ఏమి అధర్మము ఏమి తెలియదు దానమేది దొరతనమేది తెలియదు దావా ఏది ద్వారం ఏది తెలియదు మంచి ఏది మర్మము ఏది తెలియదు అందము ఎందుకు ఆనందము ఎందుకు తెలియదు ఆవేశాలు ఆక్రోశాలు ఎందుకు తెలియదు ఆలోచనలు అవసరాలు ఎందుకు తెలియదు సుఖమెందుకు దుఖమందుకు తెలియదు వేశామెందుకు వెతుకులాట ఎందుకు తెలియదు వేదన ఎందుకు వెక్కిరింత ఎందుకు తెలియదు పాట ఎందుకు అట ఎందుకు తెలియదు పల్లవి ఎందుకు పరువం ఎందుకు తెలియదు శాసనం ఏంటి చామంతి ఎవరు తెలియదు భంధం అనుభంధం ఏమిటికి తెలియదు త్యాగం స్నేహం ఏమిటికో తెలియదు @ G. Manju 30/03/2014

by Manjunadha Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mj4nA3

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి|| జయ ఉగాదితో.. మాటా-మంతీ|| {జయ నామ సంవత్సర ఉగాది సందర్భంగా దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్ నిర్వహించిన కవిసమ్మేళనం లో చదివిన కవిత: నిన్న ప్రసారమైంది..} || జయ ఉగాదితో.. మాటా-మంతీ|| ** రా జయా! రా!! ఇదేనా రావడం? ఎక్కడ్నించీ రాక? అమెరికా నించేనా!! అక్కడంతా కులాసాయేనా! ఏడేళ్ళైందన్న మాటేగానీ.. సర్వధారికొట్టిన ఆర్ధికమాంద్యం దెబ్బకి మా గూబలు.. ఇంకా గుయ్యమంటున్నాయబ్బా! అందుకే అడుగుతున్నా!! ఈ మధ్య తెలుగుదనమంతా ప్రవాసంలోనే నివాసమటగా!! మంచినీళ్లేమైనా తాగుతావా! మినరల్ వాటరేలే!! ఇంకా ఆ నీళ్ళ గొడవలు మొదలు కాలేదిక్కడ ముందొచ్చిన విజయ పాత డైరీ పట్టుకుని మాపటివేళే ప్రయాణం కట్టింది వెళ్తూ- వెళ్తూ మా అన్నదమ్ముల మధ్య పంపకాల పని పెట్టింది నీకేమైనా దారిలో ఎదురై మంచీ-చెడు చెప్పిందా ఏమిటి!! నిరుడు కల్పించిన ఆశలన్నీ ఇక్కడే వదిలి పెట్టింది డబ్బున్న బిడ్డనే గెలిపించాలని ఊరూరూ యాత్ర చేపట్టింది కబుర్లు.. ఎవరితో పంచుకోవాలో తెలియక ఇప్పటిదాకా ఎదురుచూసాను జరిగినయవి కొన్ని నేను చెబుతాను జరగాల్సినవి నువ్వే చెప్పాలి. ** సాగి ఆగిన ఉద్యమాలన్నిటిలోనూ కాలం కాళ్ళుచాచి ఇరుక్కుంది ప్రజా సమస్యలు పట్టని ప్రస్థానాలు, ఎవరికోసమో తెలియని యాత్రలతో జన జీవితానికి తిక్కెక్కింది ఎన్నిసార్లు బందులు జరిగాయో! ఎన్ని బతుకులు నలిగాయో! చెప్పేదెవరా!! అనిచూస్తే.. గట్టి లెక్కల శకుంతలక్కయ్య కాలం చేసిందని తెలిసింది అరమరికలు అవసరమయ్యాక తెలుగునేల నలిగింది విజయానికి మొహం వాచి ‘పేరుగొప్ప’గా మిగిలింది ఎక్కడైనా తన పేరు మనిషితో నిలబడాలని ‘విజయ’ తన ముద్ర కనపడాలని ‘ఆమ్ ఆద్మీ’కి చీపురిచ్చి ఢిల్లీ దర్బారుకి పనికి పంపించింది వాడేమో కమలాన్ని తెంపలేక, కళ్ళాపు జల్లిన చేతి వాసన పడక నగరవీధుల్లో లొల్లి చేసి పోయాడు అవినీతి అన్నింటా అంటకాగిఉన్నప్పుడు ఏ ఇంట ఉండాలని మామిడిపళ్ళ మనిషిలా అరచిపోయాడు ఓదినం.. పేపరు చదువుతుంటే పసిపిల్లల మరణాలలో ప్రధమ స్థానం మనదేశానిదేనని తెలిసిందట ఇదేమి శివా! అని కేదార్నాధుడ్ని అడగబోయింది వసువుల్ని ముంచిన గంగమ్మకు ఉక్రోషం వచ్చినట్టుంది అప్పట్నించి మీ అక్క చావుల్నీ లెక్కెట్టలేకపోయింది టీవీ చూస్తేనే తెలిసింది తెలుగునేలలోనే కాదు.. టర్కీలోనూ ప్రజా ఉద్యమం పతాకస్థాయికి చేరిందని అసలు కధ వేరని నాణెం రెండోవైపు చూపించబోయినా విజయవిలాసం అప్పటికే ఖరారైపోయింది అన్నట్టు టెలిగ్రాం అందిందా నీకు.. నువ్వొచ్చేదాక ఆగలేక పంపాను ముందే ఓ పెద్ద నిజం పంచుకుందామని ప్రపంచంలో అతిశక్తిమంతుల జాబితాలో మన ప్రధాని కూడా ఉన్నారని. నీ అడ్రెస్ తెలియక బట్వాడా చేయమని రేస్ కోర్స్ రోడ్డులో ఏడో నెంబరు ఇంటికి పంపా. తర్వాత ఆ సర్వీసే రద్దయ్యింది అప్పుడు అర్థమయ్యింది జాబితా నిజమే చెప్పిందని జీవితమే అబద్దాలాడుతుందని బయటోళ్ళకు ఉన్న గౌరవం లోపల వారికి ఉండదని బ్రిటన్ ప్రభుత్వం మాత్రమే ఉమ్మడాన్ని తీవ్రనేరంగా నిర్ణయించిందని తల్లీ! ఈ మధ్య..లోకం చాల మారిపోయింది అన్నదమ్ములకు అభిప్రాయ భేదాలొస్తే ఇల్లు ముక్కలైపోయిందంటున్నారు పంపకాలు జరగకుండానే కుంపట్లు కొనుక్కుంటున్నారు చెవిలో ఇల్లుకట్టుకునే పుకార్ల హోరు దేశ మంతా వినపడుతుంది. భూతద్దంలో దొరకలేనిదేదో టీవీ ఛానళ్ళలో కనపడుతుంది మొన్నీ మధ్య ప్రజా ప్రభుత్వం రద్దయినప్పుడు పాతరోజులు గుర్తుకు తెచ్చావు అరవై ఏళ్ళ నాటి మాట ఆంధ్రకేసరినే ఒక్కఓటుతో ఓడించావని రాష్ట్రపతిపాలన మొదటి సారి రుచి చూపించావని.. * లోకమంతా ఎన్నికల కోడై కూస్తుంటే.. ఇప్పుడే లేచి ఇలా కుర్చున్నాను ఇంతలో నువ్వొచ్చావు.. చెప్పు.. నువ్వేం కబుర్లు మోసుకొచ్చావు? ** మన సిధ్ధాంతి గారికి తెలుసో-లేదో ప్రజానాయకుల యోగ కరణాలు ఏ చారుదత్తుడ్ని ఇక్కట్లపాలు చేస్తుందో ఈ జయవసంతసేన విన్యాసాలు యజమానుల జెండాకు లోబడే.. వార్తాఛానళ్ళ వంశోత్తర దశల ప్రసారాలు! పంచాంగ శ్రవణాలలో తారుమారై వినిపిస్తున్నాయి రాజపూజ్య- అవమానాలు సామాన్యుడ్ని అందలమెక్కిస్తానంటూ అందరూ అబద్దాలే వినిపిస్తున్నారు తీపి కబురు చెబుతానంటూ ప్రతిసారీ చేదే తినిపిస్తున్నారు ఏ సంవత్సరమైనా .. ఇంతేనా అని అన్నిసార్లూ అనిపిస్తున్నారు కొత్తగా వచ్చావని కోటి కోర్కెలు కోరను నేను షడ్రుచుల వశంకాని సుఖ సంతోషాలు కలగలిపిన కమ్మని జీవితం కోసం ఎదురు చూపులు చూస్తున్నాను మీ తమ్ముడు మన్మధుడొచ్చి* మాయ చేసేలోగా మంచిరోజులు ఆశిస్తున్నాను చెప్పు.. నీ సంచుల నిండా ఏం మోసుకొచ్చావు? ఎవరికందించి వడ్డిస్తావు!! సీలుతీయని ప్రేమలేఖలా ఇలా ఎన్నిరోజులు ఊరిస్తావు చెప్పు.. నీ సంచుల నిండా ఏం మోసుకొచ్చావు? ఎవరికందించి వడ్డిస్తావు!! =1.4.2014=

by Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fJfi1s

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1juLtqe

Posted by Katta

Venkata Hanumantha Ramakrishna Tummalachervu కవిత

నా కాశ్మీర్ భూలోకం లో నాకం లా విలసిల్లేది నా కాశ్మీర్ // నా తల్లి తలపై మల్లె పువ్వై పరిమళించేది నా కాశ్మీర్ // ఆకశం లో వెలుతురు తోటై మురిపించేది నా కాశ్మీర్ // అందాల గుల్మొహర్ లా విరబూసేది నా కాశ్మీర్// పసి పాప నవ్వులా మంచు వెన్నెలలు కాసేది నా కాశ్మీర్ // శంకర బోధామృత పునీత పులకిత గాత్ర నా కాశ్మీర్ // సనాతన భారత జీవిత పథ నిర్దేశిక నా కాశ్మీర్ // అరమరిక లెరుగని నా పూర్వీకుల అమాయకత్వానికి బలి పశువైంది నా కాశ్మీర్ // ఆశ్రయ దాతలను నిరాశ్రయులను చేసి// స్వాతంత్ర పోరాటం అంటారు నర మాంస భక్షకులు // వితండ వాదాన్ని చరిత్ర చేసి అబద్ధాన్ని బాగ అలంకరించి // మా నెత్తుటి మరకలపై మసి పూసి మాయం చేసి // అన్యాయాన్ని న్యాయం గా నిరూపిస్తున్నాయి ధివాంధములు // మా శరీరాన్ని ఒక్కో ముక్కా కొరుక్కు తింటూ // చచ్చి పోతున్నాం బాబో అని మొత్తుకొంటుంటే // మా ఆకలి తీరడమే సెక్క్యులరిజం అంటాయి గుంట నక్కలు // నా వాళ్ళను చంపే ఇజం నాభూమిని దిగమింగే ఇజం // నా దెశం విడగొట్టే ఇజం ఎంత పెద్ద నిజమైనా // అది మా పాలిటి పగబట్టిన మరణ శాసనం // మా కాశ్మీర్ మాకు కావాలి మా దెశం మాది కావలి // మాకు బిరుదులొద్దు మాకు సెక్క్యులరిజం భుజ కీర్తులొద్దు// మాకు మాకశ్మీర్ కావాలి మా స్వర్గం మాకు కావాలి // హెల్ విథ్ యువర్ సెక్క్యులరిజం . హెల్ విథ్ యువర్ ఎక్ష్స్ట్రీమిజం // కశ్మీర్ మాది మా తాత తండ్రులది మా కాశ్మీర్ మాకు కావాలి // 30/3/14

by Venkata Hanumantha Ramakrishna Tummalachervufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNw1Eo

Posted by Katta

Chinni Krishna కవిత

జయ గీతిక మండే ఎండల్లో నల్లటి కోయిల సల్లటి చెట్టై పాడుతున్నట్టు.. ఆ.. సందు మలుపు తిరగంగానే గుండెలోకి ప్రాణం తిరిగొస్తుంది గుప్పెడంత ఆశ చిగురేస్తుంది యాసంగి బీడుల్లో వసంతం పురుడోసుకున్నట్టు.. పూలపాన్పులను పరచి, మధుపాత్రలు కూర్చినట్టు.. ఆ సందు మలుపు తిరగంగానే అడవి మల్లెల వాసన గుప్పుమంటుంది ఆకాశం ఆశల పందిరవుతుంది అమవస నిశిలో ఆకసానికి కాటుకద్దినట్టు.. సుక్కల వెలుగులో సినీవాలి సుట్టూ పరుసుకున్నట్టు... ఆ సందుమలుపు తిరగంగానే సల్లగాలులు సెమటసుక్కలతో నెయ్యమొందుతుంటాయి.. మనసు సెలిమెలో ఊసుల గలగలలు వినిపిస్తుంటాయి.. సుక్కలన్ని ఒక్కటై సూరీడై మొలిసినట్టు.. సుట్టూరా సీకటిని సూరులోకిజెక్కినట్టు ఆ సందు మలుపు తిరంగానే మనుసు మబ్బుల్ల కొత్త పొద్దు పొడుసుకొస్తుంది.. కనులముందు.. వుగాది పరుసుకుంటుంది.. ... చిన్నికృష్ణ

by Chinni Krishnafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN9tp

Posted by Katta

Avvari Nagaraju కవిత

||మోడిఫికేషన్||ఎ.నాగరాజు ఒక మిట్ట మధ్యాహ్నపు ఎండలో ఆకాశానికి కాషాయం పులుముతూ అంతా వీరంగం వేస్తున్నప్పుడు త్రిశూలపు పదునుటంచుల కొసలలో బలవంతంగా పెకలించిన గర్భస్త శిశువుల జాడ- తొణికిన ఒక్క ఉమ్మ నీటి చుక్కయినా ముఖాలకు ఉప్పెనయి తాకకపోతుందాని దారుల వెంట నువ్వు ఉన్మత్తుడవై వెతుకుతావు బలిసిన ధనాగారపు ఖార్ఖానాల దోసిళ్ళలో కొన్ని కలలను టోకుగా తయారుచేసి ఊళ్ల మీదకు రంగులురంగులుగా చిలకరిస్తున్నప్పుడు అధికారాలలో, మతాలలో అంచెలు అంచెలుగా అలుముకున్న ఆధిపత్యపు ఉన్మాదాలలో దేశమంటే మగతనమయి నిటారుగా లేపుక నిలుచున్న శిశ్నాలలో పొగలు కక్కుకునే విద్వేషం దేశభక్తయి చివరకూ ఎంతకూ కుతి తీరక యోనులలో తాగి పడేసిన సీసాలను జొనిపి - అది నెత్తురో, కరిగి పారుతున్న దేహమో తెలియక మండుతున్న దిసపాదాలతో అవే అవే అవే మాటలను పిచ్చిగా వదురుతూ కనపడని ఆ జాడల వెంట ఒక ప్రళయంలా తిరిగిన చోట్లలో మళ్ళీమళ్ళీ తిరుగుతావు ఎక్కడా దారి దొరకదు ఎవ్వరూ ఒక్క మాటను కూడా ఆశ్వాసనగా జ్వలిస్తున్న నీ దేహంపై కప్పరు రాలిన పూవుల కోసం పిచ్చిగా కవితలల్లి వాడిన ఆకులపై అదే పనిగా ఎక్కడెక్కడివో జీవజలల జాడలు వెతికి పలవరించి మరీ మాట్లాడే పుణ్యాత్ములు ఒక్కరూ నోరు విప్పరు అవును ప్రభూ అంబానీలు మెచ్చినవాడూ, జనాన్నంతటినీ మూకుమ్మడిగా ఏకతాటిపై నడిపించెడివాడూ, మాయలఫకీరు వంటి వాడూ అయిన నాయకుని కోసం నా దేశమిప్పుడు కలవరిస్తోంది 1-4-2014

by Avvari Nagarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mtHFFA

Posted by Katta

Kapila Ramkumar కవిత

|| గాదికింది పందికొక్కు || సుప్రభాతవేళ కోకిల పాట కోసం మావిడిచెట్టుకేసి చూసా! కర్ణకఠోరంగా ప్రహరీగోడమీద కాకి గోల మాత్రం చికాకు పెడుతోంది! కిటికీ భళ్ళున మూసిన శబ్దం విని '' కాకి అరుపు విన్నారుగా - ఇక ఎవరో కొంపకు దిగేటట్టున్నారు!'' మా ఇంటావిడ శరసంధానానికి '' అదొక్కటే తక్కూవైంది మనకి, నా మొహాన కాస్త టీ నీళ్ళు పోస్తావూ '' అన్నమాట వినిపించుకోకుండా '' పండుగ నెత్తిమీద పడింది దాని సంగతి దేవుల్లాడరా? '' ఎదురు దాడి టీ తోనే! '' అందుకోలేనంత ఎత్తులో ధరలున్నపుడు కొన్నింటిని పక్క వారినుండి అడుక్కోక తప్పదు గాని - సంచి యిటు యివ్వు '' అన్నా అడుగునబడ్డ బడుగు జాతి వాళ్ళం కదా అడుక్కోటానికి సిగ్గులొదిలేసిన వాళ్ళం కూడ! ముక్తసరిగా ముగించి టీ చప్పరించి రోడ్డెక్కాను కొనేవి యేమిటి, అడుక్కునేవేమిటి నెమరువేసుకుంటూ '' వేప పూవు, మామిడాకు, మామిడిపింది బెల్లం ముక్క, చింతపండు '' ఉగాది ప్రసాదానికి! ''ఈ మాయదారి పండుగలు నెలాఖరునే రావాలా? వేతన జీవుల వెతలు మాటటుంచితే బోడి విశ్రాంత బడుగుజీవి గతేమిటీ '' అనుకుంటు మోహనరావు అంగడి చేరాను అడగలేక చేతులు నలుపుకుంటుంటే '' పాత బాకీ ఎప్పుడు చెల్లుబాటు పండగ సరుకులకు పొద్దున్నే దాపురించారు?'' మునిసిపాలిటీ వారి ఇంటిపన్ను నోటీసులా! లేని నవ్వు తెచ్చుకుని '' నిజమే దండగే అదే పండగ '' నా సంజాయిషి పూర్తికాకుండా, నా మీద జాలో, నానుండి అతను వసూలు పెరుగుతందనే ఆశో! నాకు తెలీదు కాని '' పట్టండి తప్పుతుందా. .’’ విసుక్కుంటూ యిస్తుండగా నా దృష్టి మాత్రం ఇంకెక్కడో..... అటు పక్కో జీపు యిటుపక్కో జీపు ''మాతో వస్తే 100 రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యాని పొట్లం '' చెరో పక్కనుంచి నన్ను లాగుతున్నటనిపించింది! '' ఆఁ...మాతో వస్తే 100 రూపాయలు, రెండు బిర్యాని పొట్లాలు '' ఎన్నికల ప్రచారానికి కూలివాళ్ళ వేటలో నా దగ్గరకే వచ్చినట్టుంది! '' ఇటు చూస్తే బాదం హల్వా అటు చూస్తే ఇడ్లీ సాంబారు '' ఎదో అవే మాటలు శ్రీశ్రీ అన్నట్లు గుర్తుకొచ్చి, సంచి అందుకుంటూండగా '' ఈ బాకీ, పాత బాకీ చెల్లింపు ఎప్పుడు.'' వెంటనే జవాబు చెప్పలేను......ఎదురుగావున్న అహ్వానాన్ని అందుకుని, మౌనంగానే ఇంటి ముఖం పట్టాను! చలపతి దొడ్లోంచి మామిడాకులు, మామిడిపిందెలు, వెంకట్రావు దొడ్లో వేపపూవు సేకరించి హడవుడిగా అడుగుపెట్టానో లేదో ఇల్లు కడిగిన బురదలో జారి బొక్క బోర్లపడ్డాను సరుకులన్నీ బురద, రెండు బిర్యాని పొట్లాలు వెక్కిరిస్తూ! దులుపుకుని లేచాను, హతవిధీ అనుకుంటూ, పండుగ సంబరం మాట అటుంచి అటు వెతికి, యిటు వెతికి (పోపుల డబ్బా, చెక్కా బీరువా వెతకగా) యాభై జమకూడితే సరితా క్లినిక్‌కు వెళ్ళి ఇంజెక్షన్‌ చేయించుకుని మంచం మీద విశ్రాంతి తీసుకుని నిద్రలోకి ఎప్పుడు జారుకున్నానో కాని '' నాన్నా! పండుగపూట దెబ్బలు తగిలాయా? '' అంటూ మా అమ్మాయి పలుకరింపుతో నా బాధలు, నొప్పులు మటుమాయమైనాయంటే నమ్మండి అలా పలకరించిన మా అమ్మాయి అభిమానానికి అన్నీ చికాకులు మటుమాయమయ్యాయి! ''పరామర్శలు ఆపితే ఉగాది పచ్చడి తీసుకొని అన్నం తిందురుగాని రండి '' హోం మినిస్టర్ కేకతో ఒక్కొక్కప్పుడు గాదికింది పందికొక్కు శబ్దాలు కూడ సుమధుర కోకిల స్వరాలవుతాయని నన్ను నేను సముదాయించుకున్నాను! ** కపిల రాంకుమార్ 9849535033 31 మార్చి 2014 కవి సమ్మేళనం - ఖమ్మం

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN8FI

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కోపం ॥ కోపం ఉండచ్చు.. కానీ అది, అద్దం మీంచి జారిపోయే నీటి బిందువులా ఉండాలి తప్ప తారాజువ్వని ని అంటించే నిప్పు రవ్వలా కాదు కాలువ లో పరవళ్ళు తొక్కే కొత్తనీరు లా ఉండాలి తప్ప భూకంపం తర్వాత వచ్చే సునామీ లా కాదు పులిహోర లో కలిసి మెత్తబడిపోయే పోపు లా ఉండాలి తప్ప అన్నం లోనో, పప్పులోనో నక్కి పంటికింద పడే తెల్లని రాయిలా కాదు గోడకేసి కొట్టిన రబ్బరు బంతిలా ఉండాలి తప్ప లక్ష్యాన్ని తునాతునకలు చేసే బాణపు మొనలా ఉండకూడదు శీతాకాలపు పలుచని ఎండలా చురుక్కుమనిపించాలి తప్ప వడదెబ్బతో నిర్జీవం చేసే గ్రీష్మ ప్రతాపం లా ఉండకూడదు దువ్వెన ని ఇబ్బందిపెట్టే గిరజాల జుట్టు చిక్కులా ఉండాలి తప్ప ఎంతకీ విడదియ్యలేని చిక్కుముడి లా ఉండకూడదు కోపం అనేది మన మనసుకి తగిలిన గాయాన్ని మాన్పే టందుకు బహిర్గతమవ్వాలి తప్ప దావానలంలా వ్యాపించి మనతో పాటు పక్కవారిని కూడా మాడ్చి మసి చెయ్యకూడదు !!!! (ప్రస్థానం ఏప్రిల్ సంచిక లో వచ్చిన నా కవిత http://ift.tt/PcN8pe) పోస్ట్ చేసిన తేది 01. 04. 2014

by Bhavani Phanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN8pe

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ రాజకీయ పార్టీ @ అసత్యపు పునాది తవ్వి అవినీతి రాళ్ళు తెచ్చి కుటిలత్వపు మట్టి కలిపి కుసంస్కార పూత పూసి నయవంచన సున్నమేసి నానారంగుల జెండాలు చుట్టి కట్టిన కొత్త పార్టీ భవనం అదిగో రాజకీయ విషసర్పాల పుట్టగా ప్రజాసేవ టికెట్ల కొట్టుగా పూటకొకడు వచ్చిపోయే సానికొంపగా పైరవి బ్రోకర్ల అడ్డాగా మారింది.. అది చివరికి పెట్టుబడి దారుని కాలి బూటులా అధికారకామందుని వెంట ఉంపుడుగత్తెగా ప్రజా గొంతుకు మానిఫెస్టో ఉరితాడులా ప్రజాస్వామ్య విచ్చేదనపు పటాలక్షేత్రంగా మారింది... అది కొత్త పార్టీ..రేపటి చెత్త పార్టీ పొత్తుల దృతరాష్ట్ర కౌగిలిలో కుదేలై చితికి పోయే చిన్న పార్టీ ఒకడి ధనదాహం కోసం ఒకడి మంత్రి పదవి కోసం ఇంకొకడి వంశ అభ్యున్నతి కోసం ఇంకొకడి రాజకీయ వ్యభిచారం కోసం పెట్టబడిన భారతదేశపు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే రాజకీయ పార్టీ. _ కొత్త అనిల్ కుమార్. 1 / 4 / 2014

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN60C

Posted by Katta

Radha Manduva కవిత

అస్థిత్వం - రాధ మండువ 1. శబ్ద కాలుష్యంతో వేడెక్కిన సాయంత్రం నియాన్ లైట్లలో మెరుస్తున్న సిల్కు చీరల డంబం హాయ్! హలో! అంటున్న రంగు పెదవుల వ్యంగ్యం అధికారాలను బట్టి చూపిస్తున్న కపటాభిమానం జీవితం మీద అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. 2. నల్లని కాటుకను మింగిన నిశాంధకారం 'నలుగురితో కలవడం తెలియదం'టూ చేస్తున్న అవమానం ఇష్టం లేకుండా దురాక్రమణం గావింపబడ్డ శరీరం లేడిని చంపి తింటున్న సింహంలా నవ్వుల వెటకారం జీవితాన్ని అంతం చేసుకోమంటున్నాయి. 3. చల్లని ప్రభాత గాలుల ఉదయం బాలభానుడి కౌగిలి వెచ్చదనం ఆశల అడియాశల బేరీజుతనం అంధకారపు ఆలోచనలను విడనాడమంటున్న స్థిరత్వం బిడియపు శృంఖలాలను తెగ్గొట్టుకోమంటున్న ధీరత్వం జీవితం పట్ల నిర్లిప్తతను తొలగిస్తున్నాయి. 4. నిశ్శబ్ద ప్రశాంత మధ్యాహ్నం ఎండలో నిగనిగలాడుతున్న ఆకుల పచ్చదనం రేడియోలో వినబడుతున్న ఆర్ద్ర స్వరం పక్కింటి పిల్లవాని మాటల్లోని అమాయకత్వం వంటింటి నేలపైనున్న చెమ్మదనం జీవితం మీద ఆశను కలిగిస్తున్నాయి 5. దారాన్ని తెంచుకుని ఎగురుతున్న గాలిపటం గూడుని వదిలి స్వేచ్ఛగా విహరిస్తున్న విహంగం గలగలమంటూ దూరతీరాలకు పరిగెడుతున్న ప్రవాహం పురివిప్పి ఆడుతున్న మయూరం జీవిత గమ్యాన్ని తెలియజేస్తున్నాయి. ****

by Radha Manduvafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN88F

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

వాకిట్లో వసంతం .............................. ధర్మనిష్ఠ తో రాముడు పదునాలుగేళ్లు పాండవులు పుష్కర కాలమే అరణ్యవాసం చేసింది అస్థిత్వపు ఆరాటంతో అలుపెరుగని పోరాటపటిమతో అరువదేండ్ల జనారణ్యవాసం చేసిన నాలుగున్నరకోట్ల గుండెవాకిళ్లలోకి గెలుపు చప్పుళ్లతో మెరుపు గుప్పిళ్ళతో ఎగజల్లిన గులాలై వలపులా వసంతం దిగివచ్చింది ఎన్నిత్యాగాల పచ్చిమామిడి కాయలు ఉరితాళ్ళు మెడలకు పూల హారాలుగా వేసుకున్నాయో ఎన్ని కలాలు అక్షరాయుధాలయ్యి పోరాటయోధుల పోడిమి వసివాడకుండా నిద్రలేమిని వరించాయో ఎన్ని గళాలు కళాజాతరలుగా నిరవధిక ఉద్యమస్ఫూర్తికి నిరంతరం మోగే యుద్ధ భేరీలయ్యయో ఎన్ని మేధస్సులు చరిత్రపుటలను చెదలు వదలించడానికి తపస్సులు చేశాయో ఆరుదశాబ్దాల తిమిరంతో సమరం వేయి వెలుగుల విజయ విహారమై కోటి గొంతుల జయ జయ నినాదమై నిద్రాణమైయున్న ఆశల ఆశయాల మేల్కొల్పిన కాహళారవమై నిర్ణయాలను నీరుగార్చడానికి పన్నిన కుట్రల కుతంత్రాల శకునుల పన్నాగాలను సైంధవుల శిశుపాలుర ఆగడాలను అరికట్టడానికి ఎన్ని కృష్ణరాయబారాలు జరిగాయో నిన్నటి విజయ విక్రమం నేడు జయ జయధ్వానం కోటిరతనాల వీణా నిక్వాణం వాకిట్లో వసంతవిలాసం చిమ్మచీకట్లో చిరుదివ్వెల చిరుదరహాసం 'వాధూలస' జయ ఉగాది

by Rammohan Rao Thummurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN5JW

Posted by Katta

Kapila Ramkumar కవిత

అక్షర క్షిపణి (వాకిలి పత్రికలొ0 - కపిల రాంకుమార్ ఏప్రిల్ 2014 ఓ అక్షరానికి మరో అక్షరం పేర్చటం కాదు అది క్షిపణిలా పేలినపుడే కవిత్వం! పళ్ళగొర్రుతో దమ్ము చేసిన చేలో వరినాట్లున్నట్టు చదరంగపు గళ్ళున్నట్టుండాలి! గాలికి వూగే జొన్నకంకులమీద వాలిన పిట్టలాగుండాలి మబ్బులను అహ్వానిస్తూ ఆకాశంలో విన్యాసం చేసే తూనీగల్లాగుండాలి! ధైర్యపు భుజంమీది సంధించిన ఆయుధంలా! శత్రు స్వప్న సింహంలా ! జతగూడే అక్షరమే జతగాడౌతుంది! పదాలతో పదాతిదళానికి మొనగాడైన అధిపతౌతుంది! http://ift.tt/1mtHCJO

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mtHCJO

Posted by Katta

Sree Kavitha కవిత

'' మనసంతా నువ్వే''లో నన్ను త్రుతియ విజేతగా నిలిపిన నా ''కవితా సుమం '' ------------- ********** -------------- 'శ్రీకవిత' ||'జయ'కేతనాల ఉగాది || (ఉగాది కవితల పోటీకి) ఆకులు రాల్చి మోడు వార్చిన శిశిర ఋతువు చిద్విలాసాలున్న విజయ నామ సంవత్సరం ఆఖరి అంకానికి చిరునవ్వుల వీడ్కోలు కాల చక్రంలో నీ 'విజయ ' 'ఆపజయాలు ' చిరస్మరణీయం ఉద్వేగ భరితం రసరమ్య రాగ భరితం నీతో గడిపిన క్షణాలు మనోహరం ఆ మధురస్మృతులతో మమేకమై ముందుకు వెళ్తూ... మరో నూతనానికి "నీరీక్షణాలు"..!! నీరీక్షణాలకు చరమగీతం పలుకుతూ చైత్ర మాస శుక్ల పక్షం శుభారంభం మోడువారిన జీవకోటిని వర్షించి హర్షించుటకై వసంత ఋతువు ఆగమనం ఆశయాల చెట్టను చిగురింప జేసే ఘడియ చైత్ర శుద్ధ పాడ్యమి బ్రహ్మ దేవుడి సృష్టికి చక్కని ముహూర్త గడియ 'యుగ్ ''ఆది "ఉగాది".ఆ పర్వదినాన నూతనానికి నాంధి పలకమంటూ ఆభయమిస్తున్న "జయనామ సంవత్సరానికి " !!స్వాగతం సుస్వాతం!! ఆ శుభవేళ అరుణకిరణాల విభావరిలో ఆశల ఉత్తేజంతో తేజం సరిచేసుకొని జయంకోరే వారికి జీవితం షడ్రుచుల సమ్మిళితం, రాగద్వేషాల రసరమ్యమని తెలిపేందుకు వేపపువ్వుతో చేదు అనుభవాల దుఃఖాన్ని,భెల్లంతో మధురమైన తీపిగుర్తులను, పచ్చిమిరపకాయల కారంతో కోపాన్ని, ఉప్పుతో భయాన్ని, చింతపండుతో చిరాకుని లేతమామిడితో ఆశ్చర్యాన్ని మిశ్రమం చేసి ఆరగించమనే మధుర ఫలహారం "ఉగాది పచ్చడి" ...!! ఆరుణోదయాన శతమానం భవతి అంటూ శథగోపునికి శిరసావహించి మనోవాంఛ ఫలసిద్ధికై వేదోపనిషత్తులు ఆవిఘ్నం కోసం విఘ్నేశ్వరుఁడి ముందు గుంజిళ్లు, సాష్టాంగ ప్రణామాలు, పూజారుల ఆశీర్వచనాలు కాలచక్రంలో గ్రహాల గమనాన్ని గుణించి బేరీజు వేసుకొని అనుగ్రహం పొందటానికి అనువైన తిథి,వార,నక్షత్ర,యోగ,కారణ కూడిన రాశి ఫలాల శుభగడియలు పన్నెండు మాసాల ఆణుకువలు మెళకువలు విపులంగా తెలుసుకొనేలా సంపుటించిన పుస్తకాన్ని కర్తవ్యంగా ఆలకించడమే "పంచాంగ శ్రవణం"...!! ముంగిలిలో ముగ్గులా, షడ్రుచుల మృస్టాన్నభోజనంలా ,ఆమని కోయిలలా వచ్చింది ఉగాది మళ్ళీ పన్నెండు మాసాల బంధంతో మావి చిగురుల హరితవర్ణంతో భవితల బాంధవ్యాల వేడుకై నటనకు నందులు, కవులకు సన్మానాలు, సాహితీ సేవకు సముచిత పురస్కారాలు మళ్ళీ మొదలు కమ్మని వంటల ఘుమఘుమలు,కొత్త ఆల్లుళ్ళకు కానుకల దీవెనలు మన సాంప్రదాయాలు ప్రపంచ తెలుగు వారందరికి జయనామ సంవత్సరంలో హర్షాతి జయకేతనాలు అందాలని ప్రార్ధిస్తూ ఉగాది శుభాభినందనలు

by Sree Kavithafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5ENM

Posted by Katta

Nvn Chary కవిత

డా .ఎన్.వి.న్.చారి 01-04-2014 ఓటరన్న కో మాట 1. ఓటు ఓటు అంటు ఒడుపుగా వస్తారు మాట లెన్నొ జెప్పి మాయ జేయ ఆశ లెన్నొ జూపి అందల మెక్కింత్రు ఒక్క చూపు చూడు ఓట రన్న 2. కాస్టు పేస్టు పూసి కంగారు పెడతారు హార్టు బీటు పెంచి స్మార్టు గాను మతము పేరు జెప్పి మర్యాద జేస్తారు ఒక్క చూపు చూడు ఓట రన్న 3. కొత్త నోట్ల తోడ పుత్తడి తోడను చెత్త కాగితముగ చేతురు నిన్నయ్య డబ్బుకాశ పడక ధక్షున్ని గెలిపెంచు ఒక్క చూపు చూడు ఓట రన్న 4. బ్రాంది బాటిలిచ్చి భ్రాంతిలో ముంచేసి దండు కుందురోట్లు దండి గాను త్రాగి చెడకు మయ్య తత్వంబు తెలుసుకో ఒక్క చూపు చూడు ఓట రన్న 5. చెప్ప నలవి కాని తిప్పలెన్నొ పడుచు మాయ చేతు రయ్య మంత్ర మేసి వారి మాట వినిన పాణిలో చిప్పరా ఒక్క చూపు చూడు ఓట రన్న

by Nvn Charyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5Exg

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hufWDU

Posted by Katta

Thilak Bommaraju కవిత

My baby@vaakili... http://ift.tt/Oa5GFw తిలక్/ప్రసవం ---------------------------- 1/గర్భం దాల్చిన నిండు మేఘాలు చినుకులను ప్రసవించడానికై ఉరుములు 2/ఆకాశం(లో)తో ప్రతి నిత్యం మబ్బుల అధరీకరణం ధరణిలో కూరుకుపోవడానికి 3/కొన్ని వెలుతురుల ప్రసరణ ఈనాడు మళ్ళా పుడమిపై సంతృప్తిగా ఓ నిట్టూర్పు 4/చెట్ల కొమ్మల మధ్యగా జరుగుతున్న పిడుగుల ప్రక్షాళన వాటి మొదళ్ళను కుదించేస్తూ 5/కొన్ని చేతులు చాపిన ఆవరణం ప్రకృతి ఒడి ఎన్నిమార్లు ఇంకిపోయాయో గుర్తుపట్టని పదార్థాలు 6/కణాలు ప్రతి కణాలు అంతమవుతూ మళ్ళీ ఆవిర్భావం. తిలక్ బొమ్మరాజు 23.03.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5GFw

Posted by Katta

Kancharla Srinivas కవిత

పచ్చని హృదయం కోసం గాలి పయనం... పొత్తుల జిత్తులతో రాజకీయ వేడి రాజుకున్నాక.. చర్చల్లో దూరి నేతల నోళ్ళలో ఊరిన గాలికి గాలాడటంలేదు.. వాతా వరణం వేడెక్కింది పల్లెనుంచి నగరం దాకా పచ్చని గాలి కరువయ్యింది...

by Kancharla Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5E0q

Posted by Katta

Shash Narayan Sunkari కవిత

నాకు తెలియకుండానే యెద తలుపులు తెరుచుకుంటున్నాయి ఎందుకో? ఏదో తెలియని గుబాళింపు నన్ను ఆవహిస్తున్నట్టున్నది ఎమిటి వింత ఎవరి ఆగమనానికి ఈ సుచిక కనులు తెరిచి చూస్తే నా నుదుట ముద్దాడుతున్న నా ప్రాణ సఖి. శేష్ నారాయణ...

by Shash Narayan Sunkarifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hufYf7

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే ||బుంగలు (2)|| ఓహో నాకు ఓ రోజున్నదన్న మాట! జీవన పోరాటంలో ప్రతి రోజు అయినా అధికారంగా ఏప్రిల్ ఒకటని - ఒకటే అని!! పోన్లే ఇదో తుత్తి..... ఆర్కే ||బుంగలు (2)|| 20140401

by Rajkumar Bungafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5GoS

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :-23 (కవి సంగమం) ----------------------------- కవిత్వ సంపుటి పేరు :- "తెల్ల కాగితం" ( _-కవిత్వం_-) ########## ******************** సంపుటిని రాసింది :- "సతీష్ కుమార్ యశస్వీ"- ---------------------------- పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి" ------------------------ "తెల్ల కాగితం పై యశస్వీ కవిత్వ ఇంద్రధనువు వొంపుల చిత్రం" ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ " నా తలపుల్లో నిలిచి ఉన్నది నీవైనప్పుడు.. ఎడబాటుకు అర్థమేముంది- పగలైనా రేయైనా నీ ఊహే నన్ను నాకు వివరించేది" అని ఆవిర్లు విరజిమ్మే గుండె చప్పుడు ఆగే లోగా తన ప్రేయసిని జీవితంలా శ్వాసించాలని భావిస్తున్నవాడు ఎవరంటే యశస్వీ సతీష్. "ప్రవాహం కవితావేశంలా లాగేస్తుంది ఎటోకటు ఉద్వేగం ముంచేస్తుంది అది కలలపై రోకటి పోటు నైరాశ్యం నమిలేస్తుంది పంటికింది పెదవిని" ఇలా ఓటమి అంచుల్లోంచో జారిపోతున్న మనల్ని మనమే ఎలా నిలబెట్టుకోవాలో చెబుతున్న కవి ఎవరంటే సతీష్. "పసి పిల్లల పిప్పరమెంట్ నౌతా తీయ తీయగ కరిగిపోతా స్కూలు పిల్లల బ్యాగ్ నౌతా పుస్తకాలను మోసి పెడతా ముసలి అవ్వకు చేయూత నౌతా అవసరమైతే కొడుకు నౌతా నాకే గనక చేతనయితే పైనవన్నీ తానే ఔతానంటున్న కవి ఎవరంటే యశస్వే. ఒక వైచిత్రితో కొత్తగా కవిత్వ సంపుటిని నిర్మించి,తెలుగు వర్ణమాలలో ఎన్ని అక్షరాలు వుంటే అన్ని కవితా కుసుమాలు కూర్చి తెలుగు పాఠకుల మెడలో వేసిన కవి యశస్వీ. యశస్వీ సతీష్ కవిత్వం సంపుటి పుస్తకం తెరువగానే నాకు తెల్ల కాగితం....క్రింద ఆయన సంతకం మాత్రమే కనిపించింది.చిత్రంగా అన్పించలేదు నేను ఇట్లా అంటుంటే.అయితే కవిత్వం కళ్లజోడు ధరిస్తే మాత్రం ఆ"తెల్ల కాగితం " మీద కవిత్వ ఇంద్ర ధనువు వొంపులోని సప్త వర్ణాల సమ్మేళనం మెరుపై నిగ నిగ లాడుతు కనిపించింది.యశస్వీ సతీష్ కీ తన కవిత్వ గురువు కొప్పర్తి లాగే తనదైన అనుభవాల్నీ కవిత్వీకరించే నేర్పుంది.ఏదీ సూటి చెప్పనితనముంది.ఆయన చుట్టువున్న సమాజాన్నీ భావించిన పద్దతి అందర్ని ఆకర్షిస్తుంది.ఒక్కోసారి సరికొత్త పోలికలతో,ఇంకోసారి వస్తువును దృశ్యీకరించే చిత్రణతో వొక కొత్త హాయిని తన కవిత్వంతో అందజేస్తాడు. అందుకేనేమో చాల మంది యిష్టపడతారు. "నీ ప్రపంచంలోకి కవిత్వమై వస్తున్నా నీ సాక్షిగా నన్ను నేను పోగొట్టుకోవాలి నా పేరూ ఊరు చెరిపేసుకోవాలి అక్షారాలను ఆవహించుకొన్న నన్ను చదివించుకొని మనసును తెల్ల కాగితంచేసుకోవాలి నేనే నీ సొంతమైనప్పుడు మన మధ్య అక్షరాలు అనుభూతుల్నీ మాత్రమే మిగిల్చాలి అక్షరాలు మనలోకి కరగి స్వచ్ఛమైన తెల్ల కాగితం మిగలాలి కవిత్వం మన అంతరాంతరాల్లొకి వెళ్ళి ఇంకి లోకమంతా తెల్లకాగితమవ్వాలి" ఈ కవి కవిత్వాన్ని సర్వమానవ హృదయాంతరాంతరాళ్లోకీ ప్రవహింపచేసి,ఆ కవిత్వం అక్కడే ఇంకి పోయేటట్లు చేసి ఈ ప్రపంచం వొక "తెల్ల కాగితం "అయ్యెటట్లు చేయాలనే వొక సుందర స్వప్నం వాస్తవం కావాలని తపిస్తున్నాడు.తెలుపు స్వఛ్చతకీ,నైర్మల్యానికీ సంకేతం. కుటిల,కుత్సిత,దుర్మార్గ,దురంత భరిత మానవ మనస్సుల క్షాళనకు కవిత్వం కారణం కావాలనే గాఢ ఇఛ్చను యశస్విసతీష్ తన కవిత్వంలో ప్రకటిస్తాడు."నాది నీదైనప్పుడే నిజంగా నేను మనిషి నౌతాను"-అని అంటున్నా ఈ కవి "అలవాటైన కొద్ది నాతో చేరిపోతుంది నాకు ప్రతీకగా మారిపోతుంది"-అని చెబుతూ,అక్షరాల పలకరింపుల్ని,పులకరింపుల్ని,పగలబడే నవ్వుల్ని నచ్చనప్పుడు తనతో వాటిని పుచ్చుకొని నడువలేనని నిష్కకర్షగా చెబుతాడు.ఇలా తెల్లకాగితం పై కవిత్వ ఇంద్రధనుస్సును కలకంటాడు తన మాస్టర్ బాటన నడుస్తూ.. "నువ్వే నా గురువంటే కోసి ఇమ్మన్నాడంటా వేలు ఈ కాలంలో ఎవడైనా వింటాడా!! నా వేలు నీ కిస్తాను...చేయి పట్టు అంటాడా!! వినడం ఎందుకు!!..జివిత కాలపు వేదనకా!! గురువంటే చెప్పొచ్చు మంచి ఎన్నైనా... మరి అడుగొచ్చా ఎదురేదయినా..అడిగారా ఎవరైనా!! ఏకలవ్యుడి నుండి కాస బియాంక వరకూ విని చెడి పోయినవారే తడవ తడవకు!!" గురువుకు గౌరవం ఇస్తూనే గురువు ఎలా వుండాలో.. నిజమైన గురువు ఎవరో నిర్వచిస్తూ "నువ్వే నా గురువంటే"-అనే కవితలో పై మాటలు అంటాడు.గొప్ప శిష్యునికీ ప్రతీక అయిన ఏకలవ్యుడు వంచలేక విరిచిన ద్రోణుని వంచనకు గురయ్యాడు.నైలు నదీ యుధ్దంలో తండ్రి అస్పష్ట మాటల కారణంగా దేశం కోసం ఓడ డెక్ మీద నిలువెత్తు మంటలమధ్యనిలువునాకాలిపోయినవాడుకాసాబియాంక.ఏకలవ్యుడు, కాసా బియాంక ఈ ఇరువురు "classical examples of devotion and sevice"కు ప్రతీకలు.ఈ పాత్రలకీ జరిగిన అన్యాయాన్ని "లోక మర్యాదకు తల వంచేవాడు ఇంతకన్నాఏంచేస్తాడు!!"త్యాగధనులజాబితాలపేరుకోసంపాకులాటతప్ప"అనేమాటతోవ్యంగ్యంగావ్యాఖ్యానిస్తాడు. శిష్యలక్షణం అనన్య సాధ్యత్వమే కాని బొటనవేలు నరికినివ్వటం కాదు,త్యాగధనుల జాబితలో చేరటానికీ పాకులాట వుండకూడదని,గట్టి పూనిక ఉన్నవానికి ధ్యాస,శ్వాస.. విద్యమీదే వుండాలని,విద్య నేర్పేదెవరైనా ఆదరంగా అందుకోవాలని,పుస్తకాల్ని కాదు మనుషుల్ని చదవాలని ఈ కవి శిష్యుని లక్షణం కూడా చెబుతాడు. కవి అన్ని వేళల ఆశావాదిగా మనలేడు.జీవితంలో కొన్ని క్షణాల్లో నిరాశతో కవి తన చుట్టూ వున్న మనుషుల మీద విసుగును పొంది నమ్మకం కోల్పోయి కొన్ని సందర్భాల మీద అసహ్యంతోనో,అపనమ్మకంతోనో కవిత్వపు కళ్ళజోడుతో దర్శించి వాటిని తమకు నచ్చినట్లుగా చిత్రించుకొంటారు.కవిత్వం నా కళ్లజోడు-అనే కవితలో వొకానొక భావ తీవ్రతతో సౌందర్యం వెల్లివిరియాల్సిన అదే నింగి నీరు నీలాలు కలిసేచోట సంధ్యా భీభత్సంలా నెత్తుటి చారికల విషాదాన్ని కవిత్వపు కళ్ళజోడు లేకుండా దర్శించలేనని ఈ కవి భావిస్తాడు. 'అది నా చెంత లేకపోతే అంతా మసక మసక నింగి నీరు నీలాలు కలసే చోటున సౌందర్యం బదులు నెత్తుటి చుక్కల చారల... భీభత్సం నా ముందున్న మనిషి వెంటాడే నీడై నను అభద్రతా భావనలోకి నెట్టుతాడు అలికిన అక్షరాలు రెటినా నంటినట్టు నా కంటికీ నలకలై నకలై ఎంత నలిపినా అడ్డంగానే కనిపిస్తాడు ఎదుటి వారంతా సాటివారు-తోటివారులా కాక బోటి ముద్దల్లా కనిపిస్తారు" ఇలా అంటూ కవి "అప్పుడప్పుడు కవిత్వ కళ్ళజోడుతో లోకాన్ని చూస్తాను/ఇప్పుడంతా..నాకు తెల్ల కాగితం..కింద తన సంతకం వుందంటాడు.ఇలా అనటంలో మారిన మార్పుని ఆకలించుకోలేని మనిషి స్థితిని కవిత్వం మారుస్తుందన్న భావనను అందిస్తాడు. "తెల్ల కాగితం" కవితా సంపుటిలో "ఆమె నా..." అనే పద్యం అంది.ఇందులో ఇది వొక అందమైన పద్యం. "నే పుట్టినప్పుడే... ఆమెకు పాతికేళ్ళు వచ్చాయి/మేము మేమే కానీ మేమిరువురం ఒక్కరమే/నా ఏడుపు ఘోష వేరు/ఆమె లాలించే భాష వేరు"-అని ప్రారంభమయ్యే కవిత మాములు పదాలతోనే ఎంతో హృద్యంగా నడుస్తుంది.బిడ్డ ఎదిగే క్రమంలోతల్లిబిడ్డమధ్యగలబంధాన్ని,అనుబంధాన్నీ చెప్పడమే కాదు,ఆ బిడ్డ పెద్దయింతరువాత "ఊరు నాది మారింది నేను తనతో ఉండరాక"అని అనుకొనే స్థితిని ముసలిదైన తల్లి మీద అణుమాత్రం జాలి లేని తనాన్ని యశస్వీ వాస్తవికంగా కవిత్వం చేశాడు.ప్రారంభంలో "నే పుట్టినప్పుడే.. ఆమెకు పాతికేళ్లు వచ్చాయి"-అని వొక ఉత్కంఠను కలిగించి "నేనేమో కొడుకుని ..ఆమె నా కన్న తల్లి"-అని వొక దిగ్భ్రాంత ముగింపును ఇస్తాడు.ఇలా ముగింపు నివ్వటం మంచి కవిత్వ శిల్పం. "ఙ్ఞానమైనా,ధనమైనా అర్థానికున్న సమస్థ నానార్థాలకు పర్యాయ పదం నాన్నే"-అని భావించే ఈ కవి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకొంటూ "పేపర్ తో నాన్న"-అనే కవిత రాశాడు.కన్న బిడ్డ ఆశల మెరుపులను కురిపించాలనే తండ్రి తపనను కవి ఘనీభవించిన మేఘంలా చిత్రించాడు."ఉద్యోగ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే పావు రాయై/ఆ నాలుగు రాళ్ళ మనిషి మీదే వాలుతుంది తెల్లారగానే"-ఈ పంక్తుల్లో కవి ప్రాణం లేని వార్త పత్రికకు ప్రాణం పోసి పావురాయిని చేశాడు.ఇట్లాంటి అద్భుత వాక్యాలకు ఈ సంపుటిలో కొదవే లేదు."వాన కారు కోయిలై ఫలితాల కోసం/రాశి -ఫలాల వేటలో../మళ్ళి పేపర్ తో నాన్న/నా కాలం కలిసోచ్చేదాక కదలని చిత్తరువులా/పేపర్ తో/తన మా నాన తానే"-అనే ఈ మాటల్లో కవి తనకు తన తండ్రికీ,తన తండ్రికీ వార్తపత్రికకు కల బంధాన్ని ఆవిష్కరించాడు. కవులకు చాల వరకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు జీవితం పట్ల వుంటాయి.వాటిని ఏదో ఒక సందర్భంలో తమ కవిత్వంలో పొదుగుతుంటారు.ఈ జీవితం ఇలాగే సాగిపోవాలని కూడ మనుషులు భావిస్తువుంటారు."బతుకంటే గుదిగుచ్చిన పనులూ,చిట్టా పద్దులూ కాదు"అని అంటున్న యశస్వి "సాగిపో"అనే కవితలో "ప్రభాతపు తొలి వీక్షణం లోంచే కలలు వెలుగు రేఖల్ని ముద్దాడాలి/రాత్రైనా,పగలైనా కలల్ని వెలిగించుకోవడం..నింగికీ,నేలకు నడుమ మేఘంలా/గాలిలో తేలి నిప్పునీ.. నీరునీ కౌగలించుకోవడం/కాలంతో కరిగి పోయేవరకు కదిలిపోవడం"-ఇలా జీవితం సాగిపోవాలనే ఆలోచనను చేస్తాడు."ఎదురీతకు సిధ్దపడితే విస్తరించిన సాగరాన్ని చీల్చుకొంటూ వడి వడిగా సాగే ఓడను తలపిస్తుంది"- అని వో విజయం తరువాత జీవితం అలా వుంటుందని కవి ఊహిస్తాడు.ఒక వ్యక్తిత్వ పాఠం కవిత్వమైంది ఈ కవితలో. "ఏదో కారణం"-అనే కవితలో "రైలు మంటల్లో ఎందుకు కాలాలి!!/ఆయిల్ రిగ్గో,కారో ఎందుకు పేలాలి!/బాధ,హింస,అతివాదం,ప్రమాదం,/పశుత్వం,విధ్వంసం,పక్క వాడి నిర్లక్ష్యం"-మున్నగు కారణాలు బయటవైనప్పుడు అంటే సంబంధితం కానప్పుడు సహజ న్యాయం కోసం ప్రశ్నిస్తాడు.ఏదో ఒక కారణం లేకుండా ఏవీ జరుగవు అనే కార్యకారణ సంబందాన్ని కవి ఇక్కడ ప్రస్ఫుటం చేస్తాడు. కవిని చూడ్డమంటే కవిత్వాభిమానులకీ వొక యిష్టం.తన వ్యక్తిత్వానికీ ఇష్టమైన బి.వి.వి ని చూడ్డమంటే యశస్వీ కి ఎంతో యిష్టంలాగుంది.అందుకే "ప్రశాంతమైన్ నిద్ర లేని రాత్రుల్ని వరంగా అందించిన వాడు/అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపక శక్తి ప్రసాదించినవాడు/అతడెలా ఉన్నా..అ కళ్ళల్లో వెలుగును చూద్దామని వెళ్ళాను"-అని ఈ కవి అనటంలో కవి వ్యక్తిత్వాన్ని చిత్రిక పట్టే నేర్పు వుందని చెప్పోచ్చు."మతం మత్తుకు మధురసాల కైపు"ను పొందే హైద్రాబాద్ పాత బస్తీ నీ గూర్చి రాసిన కవితే "చార్మీనార్ ...చెంపన".పాపం, పుణ్యం ఏమి ఎరుగని చిన్నారులు సాన్వీ లాంటి పసిమొగ్గల్ని కిడ్నాప్ చేసి తుంచేస్తున్న అంశాన్నిఎంతో వేదనతో ఆ భగవంతున్ని "ఇదేం న్యాయం దేవుడా?"-అని తీవ్రంగా ప్రశ్నించిన కవిత "ఇదేం న్యాయం దేవుడా?" అనేది.ఉప్పుని ధనంగా చేస్తూ "సమన్వయం లేకపోతే జీవితం ఉప్పు లేని చప్పిడి మెతుకులు" అని చెప్పే కవిత"ఉప్ప ధనం". "భయ్యా! Diversity ఎక్కడ!!"-అనేది జీవ వైవిధ్య సదస్సులోని డొల్ల దనాన్ని వెల్లడించే కవిత.తాలిబాన్ల పిరికితనానికి బదులిచ్చిన అసలుసిసలైన జవాబు "మలాలా".మలాల ను "గుల్ మకాయ్" చేస్తూరాసిన కవిత ఇది.ఇలా ఎన్నో కవితలు( ఉన్న56లో) పాఠకుల తెల్లని మనసు మీద కవిత్వ రంగుల చిత్రాన్ని గీస్తాయి. ఈ సంపుటిలో ఎన్నో కవితలు నన్ను కదిలించినా,నన్ను బాగా వెంటాడి వేటాడిన కవిత,నచ్చిన కవిత "ఓ రైలు ప్రయాణం ".ఇష్టం లేని ప్రయాణాన్ని అయిష్టంగా కష్టంగా చేయించాడానికి రైలు రావాడాన్ని వొక అంతర్లీన దుఃఖంతో కంటిని చెలమగా చేసి రాశాడు యశస్వి సతీష్.ఈ కవిత చదివినప్పుడు కొప్పర్తి గారి "విషాద మోహనం"లోని "ఎంతెంత దూరం "అనే కవిత స్ఫురణకొచ్చింది.తన కిష్టమైన వాళ్ళని వదిలి వెళ్ళి పోతున్నప్పుడు పోవడానికి ఎంత అయిష్టపడతాడో,బయలు దేరాల్సిన క్షణం దగ్గరయ్యే కొద్ది సర్దుకున్నవే మళ్లి సర్దుకొంటూ,దువ్వుకున్న తలనే మళ్లీ దువ్వుతూ వుండే మానసిక స్థితిని,ప్రయాణాన్ని ఖరారు చేస్తూ రైలు వొచ్చి ఆగి నప్పుడు...కలిగే వేదనను కొప్పర్తి అద్భుతంగా చిత్రించాడు.ఇట్లాగే యశస్వీ కూడా "ఓ రైలు ప్రయాణం" వొక మంచి కవితగా నిర్మించాడు.యశస్వి కవితని కొప్పర్తి కవితతో పోల్చటం ఆయన్ని అనుకరించాడని కాదు."గుండెలు రెండూ లాగి వదిలిన స్ప్రింగ్ ల్లా గిలగిల లాడే" కవిత్వం యశస్వీ రాయగలడని చెప్పడానికే. "రాయడాన్ని ఎవరూ కాలరాయలేరు"-ఇట్లా పదాలతో ఆడుకోవటం యశస్వీ కూడా చేస్తాడు."పేపర్ తో తన మా నాన తానే"-ఇలాంటి వైచిత్రులు ఈ సంపుటిలో అనేకం."మనస్సాక్షి చెప్పినట్టు పేజీ చివర సంతకం చేసే క్షణమొకటి వేచి వుంది కాబట్టి ఈ పరిచయాన్ని ఇంతటితో ముగిస్తూ..యశ్వస్వి మంచి యశస్సుతో వొక మంచి కవి కాగలడని విశ్వసిస్తు....వచ్చే మంగళ వారం నన్ను బాగా కలవరపెట్టి కదిలించే "జీరో డిగ్రీ","నీ లాగే ఒకడుండేవాడు" ఏదో ఒక సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1msK5nJ

Posted by Katta

Girija Nookala కవిత

ఉగాది క్రొత్త ఆశల ఆమని కోయిలా జయ గానాలు కూయవే క్రొత్త హద్దుల హ్రుదయపు ముంగిట రాగాల రంగవల్లి వేయవే అందాల జీవన రాగమాలికలో అపస్వరాలు రానీయకే అత్యాశలు,దురాగతాలు నీటిపై గతాలై కరిగిపోనీయవే కొమ్మకో గూడు.మనసుకో తోడు పూవుకో కాయపై ఊయలూగవే అవమానం లేని అతివ వైభవం పంచమంలో పలికించవే భారత భారతి రాజ్యపూజ్యము శుభ స్వరాలు సవిరించవే ఆనంద ఆదాయాలు ఆనందభైరవిలో వీనుల వేడుకగా వినిపించవే వ్యధలు వ్యయమై,వ్యవసాయం రైతు వరమై లాభాల రాగాలు పండించవే హిందోళ రాగాల సామజ గమనంతో పంచాంగ శ్రవణము చేయవే!

by Girija Nookalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghpKwk

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

'కవిత్వం వేరే ఎక్కడో లేదు నిస్సహాయుడు నిరాయుధుడైన ఒక గిరిజనుడు లేదా ఒక దళితుడు మాట్లాడేదంతా కవిత్వమే తెలంగాణా లో ఒక గ్రామం చాలు లేదా మాన్య ప్రాంతంలో ఒక గ్రామం నా మరో జీవితం అక్కడే అని నా ఆశ' ------- అజంతా

by కోడూరి విజయకుమార్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghpJZx

Posted by Katta