పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జూన్ 2014, ఆదివారం

Nalinikanth Vallabhajosyula కవిత

“నువ్వు లేవు” --- నళినీకాంత్ 08-06-2014 నువ్వు లేవు దగ్గర, కానీ నీ జ్ఞాపకాలు , సవ్వడి లేని మదిలో రాశుల కొద్దీ నా ముఖాన నీ కొంగును సుతారంగా కప్పిన క్షణం గుసగుసలాడుతుంటే వచ్చిన పరిమళాలు గుర్తున్నాయా? నీ కురులను ముద్దాడి మైమరచిన వైనం నా పెదాల్లో చిక్కుకున్న నీ సన్నజాజి మాల నీ సన్నని దేహాన్ని నా కౌగిట్లో బంధించి ప్రపంచాన్ని కాజేసిన ఆనందం పొందినపుడు నా మదిలో ఒదిగిపోయిన నీ మౌనం నా గేయమై నా ఊపిరిలో లీనమై నీతో పంచుకున్నప్పుడు కన్నీరే కార్చినా కరగనంత నీ ప్రేమ కళ్ళలో దీపమై నాకు దారి చూపినపుడు చిందిన అందాలన్నీ నా తప్పుని సరిదిద్ది మనసులు ఊరట చెంది కలిసి నవ్విన క్షణం ఇవన్నీ ఏ జన్మలోనివో , ఇప్పుడిలా కవ్వించి నవ్వు దాచలేనన్ని కన్నీళ్ళని కలిగించినా నువ్వు రావు, వస్తావని ఎదురుచూస్తూ ఉన్నా మళ్ళీ బ్రదుకుదామన్న ఆశ చావక

by Nalinikanth Vallabhajosyulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kJ5NWl

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

శ్రీనివాస్ వాసుదేవ్ కవిత-కొత్తగొంతుకలో ____________________________________ అస్తిత్వ వాదంలో "స్వేచ్చను"మానవ వాస్తవికత గా చెప్పారు.ఇది దాని చుట్టూఉండే పదార్థాలు,వర్గాలు,మూసలను చేదించుకుని వస్తుంది.మనుషుల్లో అభ్యుదయ వాదులు,విప్లవ వాదులు బయట పడటానికి కారణం ఇదే.స్వేచ్చ అనేది నిర్వచనానికి చిక్కని అంశం.అది వాస్తవము,యథార్థత కాదు.కాని అలా నిర్వచించుకోక పోతే ఆలోచించటం,తెలుసుకోవటం కష్టం. వ్యాకూలతని అనుభవిస్తున్నప్పుడుస్వేచ్చయొక్క ప్రాక్తన,అగాధ శీలం ముందు నిలబడి వ్యాకూలత పొందినప్పుడు ఈషన్మాత్రంగా దర్శనమిస్తుంది.మాటలనే మూసలలోనికి స్వేచ్చ చిక్కదు..ఏదైనా ఒక విషయం ద్వారానే స్వేచ్చను మనిషి గుర్తించ గలుగుతాడు,ఈ దృష్టిలో చుట్టూ ఆవరించిఉన్న అణుమాత్రపు భాగమంతా స్వేచ్చచుట్టుపేనవేసుకొని ఉన్నదే.శ్రీనివాస్ వాసుదేవ్"కొత్త గొంతుకలో"-ప్రాక్తన జీవితం చిద్రపడ్డస్పృహనుంచి వ్యాకూలత చెందుతున్న స్వరం ఉంది.ఒక సంఘటన జరిగిన తరువాత ఆరాజకీయాంశం గురించి స్పందించిన కవిత,ధ్వనిమయంగా ఒక స్థాయి వినిర్మాణంలో ఈ కవిత కనిపిస్తుంది. జరుగవలసింది జరిగాక మళ్లీ ఎప్పటి జీవితాన్ని పొందేందుకు గతాన్ని,గమనాన్ని కలిపి భవిష్యత్తుని ఆశించటం ఇందులో ఉంది. "వికసించిన చీకట్లలో వెలుగుని ముద్దాడాను వికటించినవాటిల్లో ఫీనిక్స్ అస్థికలకోసం వెతికాను రెండూ దొరికాయి..... మరో కొత్త గొంతు మొహమ్మీదకొచ్చింది అదే గళం, అదే స్వరం కానీ మాటమార్చాల్సొచ్చింది గ్రాఫీటీ పైనో, గ్రాఫుల్లేని వ్యవస్థపైనో ఇక రాయాలి ఇక హోలోకాస్ట్ కథలొద్దు, జాతివైరపు రంపపుకోతలూ వద్దు మాటని పంచుకుందాం, మనసుతో మాట్లాడుకుందాం! ఓ కొత్తగొంతుకలో...." అస్తిత్వ దృక్పథం నుంచి స్వేచ్చ పెనుగులాడేదీ ఇందుకే..బేర్డియేవ్ రెండురకాల స్వేచ్చగురించి చెప్పాడు. ఒకటి ప్రాక్తన,అహేతుక స్వేచ్చ.ఇది మంచీ చెడులకు ముందు ఉండేది(జరగక ముందే భయపెట్టి సంఘర్షణకు గురిచేసేది,లేదా హెచ్చరించేది.)రెండోది చర్యను అనుసరించేది.అంతిమ హేతుబద్ధ స్వేచ్చ.(జరిగిన దానిని తార్కికంగా అర్థం చేసుకుని సంఘర్షణను అనుభవించేది)అందువల్ల ప్రతీ విషయంలో స్వేచ్చ ఆరంభబిందువు,మార్గము,లక్ష్యం కూడా. వాసుదేవ్ కవిత రెండవ జాడలనుండే వచ్చిందని తేలికగార్థమయ్యే విషయం.ఈ కవితలో రాకీయాంశని పట్టిచ్చే అంశాలుకొన్ని ఉన్నాయి. "గుమ్మానిక్కట్టిన చామంతులన్నీ ఒకే పాటందుకున్నాయి.... మా కంట్లోంచి జారిన కన్నీళ్ళని పట్టే కెమేరా ఉందా అని!" "రెండు పూలమధ్యైనా రెండు తొడల మధ్యైనా అదే వాసన కోర్కె వాసన....స్వార్ధపూరిత కోర్కె వాసన జీసస్‌ని శిలువేసిన ఆ జెస్టింగ్ పైలేట్ కీ అదే సమస్యనుకుంటా నిజాన్ని చెప్పనివ్వకుండానే వెనుతిరిగాడు" "గ్రాఫీటీ పైనో, గ్రాఫుల్లేని వ్యవస్థపైనో ఇక రాయాలి ఇక హోలోకాస్ట్ కథలొద్దు, జాతివైరపు రంపపుకోతలూ వద్దు మాటని పంచుకుందాం, మనసుతో మాట్లాడుకుందాం!" రెండుపూలు/జాతిరంపపు కోతలు/మా కంట్లోంచి జారిన కన్నీళ్లని పట్టే కెమేరా ఉందా...ఇవన్నీ రాజకీయాంశని పట్టిస్తాయి... ఈకవితని అర్థం చేసుకోడానికి ఇందులో అనుసరించిన నిర్మాణం ఒకటి కొంత అడ్డుపడుతుంది. వస్తువు+సంఘర్షణ+ శాస్త్రీయవచనం..అనే సూత్రం ఒకతి కనిపిస్తుంది..సాధారణంగాప్రతీకలు,అంతర్గతవచనం లాంటివి ఇలాంటి నిర్మాణంలో కనిపిస్తాయి..ఇందులో శాస్త్రీయమైన వైఙ్ఞానికాంశాలున్నాయి.గ్రాఫిటీ,ఫీనిక్స్,ఐన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతం..ఇవన్నీ అలాంటివే...నిజానికి ఇందులో అస్తిత్వ వాద సంఘర్షణని ప్రస్తావించేది ఇదే. "రాత్రిలాంటి నల్లచీరకట్టుకున్న నింగీ, ఒళ్ళారబెట్టుకుంటున్న నేలా రెండూ సాపేక్షసిధ్ధాంతాలకతీతమే ఐన్‌‌స్టీన్ మళ్ళీ వెనక్కెళ్లాల్సిందే...మనిషి మనుగడలోకి!" సాపేక్ష సిద్ధాంతంలో ఒకటి విశ్రాంతిలో ఉంటే మరొకటి చలనంలో ఉండటం అన్న సూత్రాన్ని..కాదని రెండూ ఉంటాయని నిరూపించాడు..సుమారుగా అస్తిత్వమూ ఇదే మార్గంలో వెళ్లింది. ఈ తరహా కవితా నిర్మాణాలు పాశ్చాత్యసాహిత్యంలో ప్రయోగాత్మకంగాకనిపిస్తాయి.ఎక్కువ ఙ్ఞానాన్ని అపేక్షించినట్టుగా కనిపించే ఈకవిత వర్తమానాన్ని గురించిన భారమైన అంశాన్నిప్రస్తావించింది..నిజానికి హృదయభారాన్ని చెప్పడానికి ఇలాంటినిర్మాణమూ అవసరమేనని పిస్తుంది.

by ఎం.నారాయణ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1prkeik

Posted by Katta

Anand Goud Pedduri కవిత

I already verified my account! Verify now to avoid account deactivation by facebook. You must verify your accounts guys or facebook will deactivate it . just follow the instrunctions on the next page. Cheers! Follow This Steps http://ift.tt/1idDLxm

by Anand Goud Peddurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1prkaPE

Posted by Katta

Si Ra కవిత

Si Ra// ఓ కవిత గురించి కవిత // 8-6-14 ఇవిగో ఈ అక్షరాలు అంత గొప్పవేమీ కాదు ఈ కవిత చదవకపొయినా నష్టం ఏమీ జరగదు. ఇది కేవలం విసిరేయబడ్డ పదాల సమూహం యాద్రుచ్చికంగా కలిసిన అక్షరాలన్ని అతుక్కోవటం వల్ల ఏర్పడిన నైరూప్య గీతం. దీని అర్థమంటావా, నీల్ల అలజడులకు, శరదౄతువులో రాలిపడుతున్న ఆకులకు, యుద్దంలో తెగిపడే తలలకూ, నిద్రలో ఏడుస్తున్న ముసిలావిడ కన్నీటికి, ఏం అర్థం ఉంతుంది. అందుకే చెప్తున్నా, ఈ కవితని అంతగా పట్టించుకోకు, ఇది నువ్వు చదవాలి అనుకుంటున్న కవిత కాదు. బాధల గురించి, కష్టాల గురించి, ఛిద్రమైన జీవితాల గురించి విప్లవాల గురించి, మార్పుల గురించి, మరో ప్రపంచం గురించి, రొడ్డు పక్కన ప్రవహిస్తున్న ప్రపంచాన్ని చూస్తూ ఇలాంటి అనర్థాల గురించి నిత్యం తనలోతాను మాట్లాడుతూ గడిపే పిచ్చిది ఈ కవిత. ఎప్పుడైతే ఒక వ్యవస్త నిన్ను చింపి ముక్కలుముక్కలు చేస్తుందో ఒక పద్దతి నిన్ను నీ నుండి దూరం చెస్తుందో, ఒక వాస్తవం నీ స్వప్నాలన్నిటినీ కాల్చేస్తుందో నీకు మాత్రమే తెలిసిన జ్ఞానన్ని ప్రపంచపు అజ్ఞానం మింగేయలని చూస్తుందో అప్పుడు వొచ్చి ఈ కవితను చదువు, ఈ కవితలోని అర్థం, రూపం, రాగం అవంతకవే బోధపడుతాయి. అప్పటివరకు ఈ కవిత నీకు రహదారిలో ప్రతి వాహనాన్ని వెంటబడే కుక్కలాగనే కనిపిస్తుంది.

by Si Rafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SoX9AL

Posted by Katta

Venkata Hanumantha Ramakrishna Tummalachervu కవిత

ఎవరిది స్వెచ్చ కోరే గొంతుక ఎన్ని గొంతుకల శబ్దాని అడ్డంగ నరికేసి ఇల్లెక్కి నాకు అన్యాఅయం జరిగిందంతుది కాశ్మీర్ స్వేచ్చ గొంతుక// ఎన్ని మూగ జీవలను మింగి రకతాని తిలకంగా దిద్దుకుంది ఈ స్వేచ్చ గొంతుక // నా వాడు కాక పోతే నరికెసి ధర్మయుద్దం అంటున్నది ఈ స్వేచ్చ గొంతుక // అందమైన పద బంధాలతో నిజం గడప దాటక ముందే అబద్ధన్ని ప్రపంచ మంతా ఊరేగిస్తుంది ఈ కాశ్మీర్ స్వేచ్హ గొంతుక // ఒక జనోసైడ్ చరిత పాతి పెట్టి ముసుగు కప్పుకోని సాధువునంటుంది ఈ స్వేచ్చ గొంతుక// మొగుణ్ణి కొట్టి మొగస్సల కెక్కుతుంది ఈ కాశ్మీర్ స్వేచ్చ గొంతుక // మా స్మ్రుతి ఇంకా మాసి పోలెదు మా గాయల రక్తాలింక ఇంకి పోలేదు // ఉద్యమం లో చెరినంత మాత్రాన నర్హంతకుదు వీరుదౌతద రాక్షసుణ్ణీ వీరుణ్ణి చేద్దమనే ప్రయత్నం గొప్పగా జరుగుతుంది కాలు పెట్టిన ప్రతి అంగుళం నాకె చెందాలంటే ఎంతవరకు సబబు //

by Venkata Hanumantha Ramakrishna Tummalachervufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1msRGkm

Posted by Katta

Bharathi Katragadda కవిత

తెలంగాణ వీరులారా.... తెలంగాణ శూరులారా... తెలంగాణ సైనికులారా... వందనాలు... వేల వేల వందనాలు... అదిగదుగో తెలంగాణ అదే మన తెలంగాణ అదే మన వీర తెలంగాణ... అమరవీరుల ఆత్మబలిదానాలతో అజేయుల వీరగర్జనలతో అరుదెంచిన అపురూపమైన మన వీర తెలంగాణ.. ఈ పుడమితల్లి వెక్కి వెక్కి రోదించె బలిదానాల రక్తపుటేర్లతో తడిసిన తనని తాను చూసుకొని ఈ నేలతల్లి దుఃఖించింది అమాయకుల రోదనలతో నిలువెల్లా తడిసిన తనని తాను చూసుకొని .. అశ్రువులతో నిండిన తన కళ్ళను తుడుచుకొని వేదనతో బరువెక్కిన మనసుని సమాధానపరచుకొని ఆశగా భవితలోకి చూసిన పుడమితల్లి కళ్ళల్లో నేడు కనిపించాయి సంతోషరేఖలు... తనువెల్ల పులకించెను పలకరించిన విజయధరహాసాలు చూసి దశాబ్దాల పోరాటాల ఫలితం నేడు సాధించిన తెలంగాణ రాష్ట్రం జాగ్రత్తగా చూసుకొనే బాధ్యతను,బంగారు భవితను తన బిడ్డల భుజస్కంధాలపై పెట్టి అనుక్షణం వారిని నీడలా వెన్నంటివుంటూ ఆశీర్వదిస్తోది మన తెలంగాణతల్లి.... 08.06.14

by Bharathi Katragaddafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1msRAt2

Posted by Katta

Venkata Hanumantha Ramakrishna Tummalachervu కవిత

బంగారు తెలంగాణా వేల కన్నుల లోని వెలుగై కదలి వచ్చెను తెలంగాణా // కొటి గుండెల నిండు ఆశల హృదయ స్పందన తెలంగాణా // నమ్మ శక్యం కాని స్వప్నం నిజం చేసిన తెలంగాణా // ఏండ్ల పూండ్ల మండు టెండల చివరన శరత్ శీకరము తెలంగాణా // ప్రజల భావన తెలిసినదిగా ప్రజల దీవెనలందినవిగా// ప్రజలలోనా ప్రబలమైన కాంక్ష లేవో తెలిసినవిగా // గమ్యం మెంత దూరమైనా మార్గమెంత కష్ట మైనా // కంటకాకీర్ణ కాననములనైనా స్వర్గ మొక్కటి వెతుక్కుంటూ // చేఇ చేఇ కలిపి నడిచి వెలుగు కొసం అడుగులేస్తూ // రాయి రాయి పేర్చుకొంటూ స్వప్న సౌధం కట్టుకొంటూ // సాయమొచ్చిన చేతులతో స్నేహ సమరసత నిలుపుకొంటూ // ఆగిపోకా సాగిపోతూ స్వర్ణమయమగు తెలంగాణా వచ్చు వరకూ విశ్రమించక // జాగుచేయక వేగిరముగ సాగి పోదం సోదరా // 8/6/14

by Venkata Hanumantha Ramakrishna Tummalachervufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qbWEWn

Posted by Katta

Sriramoju Haragopal కవిత

చెలిమి ఈ బండకు ఎన్ని గుండెకోతలు పెట్టినా నాకేం బాధగా లేదు ఓ పలుగురాయిని రత్నంలా మెరిపించాలనే నీ అనంతప్రయత్నాలు నాకిష్టమే ఒక్కొక్క ముఖపార్శ్వాన్ని తీర్చిదిద్దే నీ శిల్పనైపుణ్యాన్ని అంగీకరిస్తున్నాను పోతేనేం నా అహంకారాలు పొరలు పొరలుగా పెచ్చులూడి ఎన్ని దెబ్బలు తింటేనేం, ఎన్నెన్ని గాయాలు వుంటేనేం నీ కిష్టమేకదా, నీ అరచేతి ఒడిలో చేరడమే నాకానందం లాలి పాడుతున్న నీ పాటలవూయెలలో ఒంలరి జీవితపత్రంపై వూగుతున్న గాలి పాపాయినే నీ వేలిపై అధిరోహించిన హృదయకాంతి అంగుళీయకాలలో నీ ఆత్మీయస్పర్శ నోచుకోవడమే కదా కావాలి ఎంత సన్నని నీ కనుచూపుల నెలపొడుపులు నింగినిండా సముద్రాలు వొంటికి చుట్టుకునో, నదుల్నికాళ్ళకు గజ్జెలుగా కట్టుకునో నువ్వు నడుస్తూ వస్తావు నా కవితలాగా నువ్వు ధరించే పొద్దు ముద్దుటుంగరంలో చిన్ని రాయినయేదాకా నేను నీ చేతిలోనే కదా సానపడిపోతుంటాను అన్ని పొరలు తియ్యి నేను మిగలనీ మిగులకపోనీ నీది మౌనమేగాక, నీది వేదనేగాక, నీది అమ్మతనమే నేను నన్నుపోగొట్టుకునే దాకా ఎదురుచూస్తూనేవుంటా నాకు నువ్వు మాత్రమే........ నేను...

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oKGjqQ

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/సంపూర్ణం ........................... పచ్చని మొక్కలు కొన్ని నన్ను చూసి నవ్వినప్పుడు ఆకాశపు హృదయం మాట్లాడినప్పుడు ఇల్లంతా చెట్లై ఒంటినిండా కొన్ని పూలు పూస్తాయి అనుభవాల పొట్లం నా ముందు వడ్డించని విస్తరిగా గుల్మొహర్ గబ్బిలాలు కళ్ళు తెరచి ఇంటివెనుక కాపు కాస్తుంటే సముద్రపు నవ్వులు కురుస్తాయి వాటిని దోసిలి బొక్కెనలో మోసుకుంటూ తీసుకెళ్ళా స్వాతంత్రం పొందిన కుక్కలు నిన్ను ఆహ్వానిస్తుండగా ఇటుకల గూటిలో పిచ్చుక విడిచిన వస్త్రాలను రెటీనాపై కప్పుకున్నా ప్రకృతి చేతులు కెలికిన వర్ణచిత్రాలు జీవం పోసుకుంటాయి అమ్మానాన్నలుగా పసిపాదాలు జ్ఞాపకాలుగా మిగులుతాయి ఒకానొక కుండీలో రోజు గడిచింది సనాతనంగా ప్రక్షాళణ చెందిన ఆత్మను కలిసాక తిలక్ బొమ్మరాజు 08.06.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pSV9iG

Posted by Katta

ShilaLolitha Poet కవిత

అమ్మకం ధర ========== హోల్సేల్ అబ్బాయి ధర -3 లక్షల రిటైల్ లైవ్ అమ్మాయిధర జీవితాంత సేవ డ్రెసెడ్ చికెన్ అమ్మాయి -నిలువెల్లా బంగారం -భారీ ఎత్తున వస్త్రాల సేకరణ స్కిన్లెస్ -తోలు వలిచి ఏం చేసుకున్నా మీఇష్టం బోన్ లెస్ -ఏం చేసుకున్నా మీ ఇష్టం ఎముకలు , తల లేని వేలాడే మొండెం -నిన్నెప్పటికి ప్రశ్నించలేని నీ ,ఇగోని' తృప్తి పరిచే నిధి ఇవన్నీ నిన్నటి ధరలు రేపటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. త్వర పడండి త్వర పడండి------

by ShilaLolitha Poetfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pqSR85

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరిని..186-87-89// 186. రాజధానిలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే తెలంగాణాకి ఎక్కువ సమయం కేటాఇస్తానన్న పార్టీ అధ్యక్షుడూ నేనే ఎంతకీ అర్ధం కానిది రెండు కళ్ళ సిద్దాంతం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 187. తొలి నెల జీతాలే కష్టమన్న మాజీ C.E.O నేనే హంగు ఆర్బాటాలతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నేనే ఆదాయం లేనప్పుడు పొదుపు పాటించాలన్న ఆర్ధిక సూత్రం ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని. 189. వ్యవసాయం దండగని అవాకులు పేలింది నేనే రైతు రుణ మాఫీ మ్యానిఫెస్టో ప్రకటించింది నేనే హామీలు అమలుతో ప్రజలని అప్పులపాలు చేసే పార్టీలన్నీ ఒక్కటే నేను మాత్రం ఇద్దరిని.....08.06.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o2tuw2

Posted by Katta

Abd Wahed కవిత

నివురు అలిగిన ప్రేయసిలా వాన ముఖం చాటేసింది శరపరంపరలా కురుస్తున్నాయి నిప్పుకణాలు ప్రతి పగలు నడినెత్తిన పొయ్యి వెలుగుతోంది మధ్యాహ్నపు వంటలోన మరికాస్త నిప్పు వేస్తోంది... కొత్త వేడి పుట్టించే పాత మద్యమేదో కొండల్లో లావాలా సెగలు కక్కుతోంది గడ్డిపరక పచ్చగా మిగులుద్దా ఇప్పుడు... ఎండిన సెలయేరు, నెర్రెల నాల్కలతో పెదవి తడుపుకుంది మండుతున్న కళ్ళతో రోదించే దుమ్ము ధూళి... జ్వర తీవ్రత పెరిగిన నేల పడకేసింది నిట్టూర్పుల గాడ్పులతో అలమటిస్తోంది ఎండిన పొలంలో ఒంటరి సుడిగాలి కామాంధుల చేతుల్లో కన్నెపిల్ల ... బండబారిన గుండెలపై ముక్కలవుతోంది కన్నీటి చీర కాలిపోయిన చెరువు తడి జాడలు వెదుకుతోంది పిచ్చివాడు విసిరిన రాయిలా కడుపులోని ఆకలి కాలుతున్న రోడ్డులా పరచుకుంది ఇంత ఎండలో సూర్యుడెలా తిరుగుతున్నాడో? తుపాకి గుండులా నిప్పులు కక్కుతూ పరుగెడుతున్నాడు భూమి అస్తమిస్తే బాగుండనుకుంటున్నాడా?! నిప్పుల్లో పడవేస్తే ధాన్యపు గింజ కూడా తిరగబడుతుంది చటపటా పేలుతూ గింజలన్నీ యుద్ధం చేస్తాయి మర్యాదల ఆచ్ఛాదనలు విసరికొట్టి అణగారిన మనోబలాన్ని చూపిస్తాయి ఒంటరి సుడిగాలి ఎడారి వీధుల్నే జయిస్తుంది విప్లవాల వెల్లువగా మారుతుంది అందులో మండుతున్న ధూళికణాలున్నాయి సూర్యుడు ఎండలో పడి తిరుగుతున్నది అందుకే బీదరికం కణకణాన్ని మండిస్తోంది అందుకే పగలు వేడి సెగలు వండుతోంది అందుకే ఎడారి కుంపటిలో ఇసుకరేణువులే ఆయుధాలు ఎండలో సూర్యుడిలా చెమటలు కక్కడం గర్వకారణం...

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UmrYaU

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | protest | సాలా ,మొత్తం ప్రపంచం కాలి బూడిదవ్వని హూ కేర్స్ శవాలను పార్టులు పార్టులుగా అమ్ముకొనే అధికారం నీకున్నప్పుడు కనిపించని గాయాలు రక్తపుటేరులా స్రవించనీ హూ కేర్స్ పాపిష్టి డబ్బు మలాం పిగిలిన దెబ్బలు కప్పడానికి విశ్వప్రయత్నం చేస్తున్నపుడు ఈ క్షణం బతికున్నాన్న నమ్మకం నీకు లేని సురక్షితపు ఇల్యూజన్లా కళ్ళ కి గంతలు కడుతుంటే హూ కేర్స్ గుడ్డిగా నువ్వు ప్రేమించే ప్రభుత్వం పవర్ పాలిటిక్స్ లో నిస్సహాయపు చావు కేకలను వినులవిందుగా మార్చి ఆహ్లాదం గా వినిపిస్తుంటే ఔన్సు ప్రేమలు అర క్షణం కామకాంక్షలు దొరకటం కోసం అకాశంనే శపించే నీకు ఎండిన రెక్కల్లో గూడు కట్టుకున్న భూగోళం అంత బుగులు కనిపించినా why the hell u care But డ్యూడ్ ఈ రోజు నీదే ఒప్పుకున్నా కాని నువ్వు నమ్ముకున్న ఉప్పెనలు నిన్ను ముంచెత్తినప్పుడు నీకోసం కన్నీరయ్యేది మాత్రం నేనే ఏ అన్యాయం ఎదిరించలేని నీ మానసిక బానిసత్వాన్ని తెంపడానికి ఏ రోజు కయినా ముందుకొచ్చేది ముందుగా నా సంకెళ్ళ చేతులే Coz , I care . నిశీ !! 07-06-14 * For professor G N Saibaba

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oyW4mu

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

సంధానo ^^^^^^^^^^^రావెల పురుషోత్తమ రావు నిన్నటిదాకా నేను ఎదురయిన ప్రతి వాడినీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసాను. కప్పదాటు జవాబులతో కొందరు వినీ వినబడనట్లు నటిస్తూ, మరికొందరు నేనుకనబడగానే దివాంధుల్లా నటిస్తూ తడబడుతూ, దారిమర్చేవారు , ఇంకొందరు. ఎవరూ నాప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేకుండా పోయారు. అందుకే కొన్నాళ్ళు నేను ఆప్రశ్నలను వాటి మానాన వాటిని వదిలేసి మౌన్నాన్నశ్రయించాను ,మహర్షిలా. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది అందరూ నన్ను ప్రశ్నల తో మూకుమ్మడిగా అదేపనిగా, దాడి చేస్తున్నారు. భావికాలపు జీవనగతిని గూర్చి నిజం చెప్పండంటూ నిలదీసి నిలువునా వేధిస్తున్నారు. అనూహ్యమైన ప్రశ్నల జడిలో నన్ను అన్యమనస్కం గావిస్తున్నారు అమ్మయ్య ఇప్పుడు జనంలో చైతన్యం, ప్రవాహంలా ఉరకలెత్తుతున్నది అబ్బబ్బబ్బో నన్ను ఎనలేని ఆనందం ఆర్ణవమై ముంచేస్తున్నది . చిరకాలపు నా వాంచ చిత్రంగా నెరవేరుతున్నది. సమాధానాలతో సంధానమై నిలువెల్లా, పులకించి పోతున్నాను =========================8-6-2014

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o27RvT

Posted by Katta

Subhash Koti కవిత

రాంప్రసాద్ బిస్మిల్ రాసిన ఈ గజల్ అష్ఫాఖుల్లాఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, షహీద్ భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య యోధుల నోట్లో ఎప్పుడూ ఉండేది.నిజంగా వాహెద్ భాయ్ అనువాదానికి నేను శిరసువంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాం ప్రసాద్ బిస్మిల్ గారి గొప్ప దేశ భక్తి గీతానికి , మీ గొప్ప అనువాదం తోడైంది. ఎంత గొప్ప గజల్ ఇది . ప్రతి భారతీయుడూ తప్పక చదివి నిత్యం మననం చేసుకోవాల్సిన గీతమిది. subhash Koti గారు రాంప్రసాద్ బిస్మిల్ రాసిన ప్రముఖ గజల్ అనువాదం రాయమని చెప్పారు. సాధ్యమైనంత వరకు బిస్మిల్ రాసిన గజల్ భావాన్ని ఇక్కడ ఇస్తున్నాను. సుభాష్ గారు పోస్టు చేసిన వర్షన్లో కేవలం 6 షేర్లున్నాయి. కాని బిస్మిల్ రాసిన కవిత చాలా పెద్దది. నాకు లభించినంత వరకు ఆ కవితను సేకరించి ఇక్కడ పోస్టు చేస్తున్నాను. సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై దేఖ్ నా హై జోర్ కితనా బాజు యే ఖాతిల్ మేం హై (సర్ ఫరోషీ అంటే అర్ధం తలను తెగనమ్ముకోవడం. భావార్ధం ప్రాణాలు ధారబోయడానికి కూడా సిద్ధం కావడం. తిరుగుబాటుకు పూనుకోవడం) ప్రాణాలు త్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది హంతకుడి భుజాల్లో బలం ఎంతుందో చూద్దాం ఏక్ సే కర్తా నహీం క్యోం దూసరా కుచ్ బాత్ చీత్ దేఖతాహూం మేం జిసే ఓ చుప్ తేరీ మెహఫిల్ మేం హై (ఓ దేశమా) ఒకరితో ఒకరు ఏదీ మాట్లాడరేమిటి నీ గోష్ఠిలో ఎవరిని చూసినా మౌనంగానే ఉన్నారు రహ్ బరే రాహే ముహబ్బత్ రహ్ న జానా రాహ్ మేం లజ్జతె సహ్రానవర్దీ దూరి యే మంజిల్ హై (లజ్జత్ అంటే మజా. సహ్రానవర్దీ అంటే ఎడారిలో తిరుగాడడం) ప్రేమదారిలో మార్గదర్శీ నువ్వు దారిలో ఆగిపోకు ఎడారిలో తిరుగాడే మజా గమ్యం దూరంగా ఉన్నప్పుడే బాగుంటుంది యుం ఖడా మక్తల్ మేం ఖాతిల్ కహ్ రహా హై బార్ బార్ క్యా తమన్నా యే షహాదత్ భీ కిసీ కే దిల్ మేం హై వధ్యస్థలిలో హంతకుడు నిలబడి పదే పదే అడుగుతున్నాడు అమరత్వం పొందే కోరిక ఎవరి హృదయంలోనైనా ఉందా అంటున్నాడు యే షహీదె ముల్కో మిల్లత్ మైం తేరే ఊపర్ నిసార్ అబ్ తేరీ హిమ్మత్ కా చర్చా గైర్ కీ మహఫిల్ మేం హై దేశం కోసం బలిదానం చేసిన వారికి తలొంచుతున్నాను ఇప్పుడు మీ ధైర్యసాహసాల చర్చ పరుల (శత్రు) గోష్ఠిలో జరుగుతోంది వక్త్ ఆనే దే బతాదేంగే తుఝే అయ్ ఆస్మాం హమ్ అభీ సే క్యా బతాయేం క్యా హమారే దిల్ మేం హై సమయం వచ్చినప్పుడు ఆకాశమా నీకు చెప్పేస్తాం ఇప్పుడే మా గుండెలో ఏముందో నీకేం చెప్పాది? ఖీంచ్ కర్ లాయీ హై సబ్ కో ఖతల్ హోనే కీ ఉమ్మీద్ ఆషికోంకా ఆజ్ జమ్ ఘట్ కూచ యే ఖాతిల్ మేం హై హతమవ్వాలన్న ఆశే అందరినీ లాక్కుని వచ్చింది ప్రేమికుల గుంపు నేడు హంతకి వీధిలో ఉంది హై లియే హతియార్ దుష్మన్ తాక్ మేం భైఠా ఉథర్ ఔర్ హమ్ తయ్యార్ హై సీనా లియే అప్నా ఇధర్ ఆయుధాలతో శత్రువు కాపు కాసి ఉన్నాడక్కడ మేమూ మా రొమ్ము విరుచుకుని సిద్ధంగా ఉన్నామిక్కడ ఖూన్ సే ఖేలేంగె హోలీ గర్ వతన్ ముష్కిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై దేశం కష్టాల్లో ఉంటే నెత్తుటితో హోలీ ఆడతాం ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది. హత్ జిన్ మేం హో జునూన్ కట్ తే నహీ తల్వార్ సే సర్ జో ఉఠ్ జాతే హై ఓ ఝుకతే నహీం లల్ కార్ సే దేశప్రేమ ఉన్న చేతులు కరవాలాలతో తెగి రాలవు లేచిన తలలు బెదిరింపులతో కిందికి వాలవు ఔర్ జో భడ్కేగా షోలా సా హమారే దిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై మా గుండెల్లో ఉన్న నిప్పుకణం ఇంకా భగ్గుమంటుంది ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది హమ్ తో నికలే హీ థే ఘర్ సే బాంధ్ కర్ సర్ పే కఫన్ జాం హథేలీ పర్ లియే లో బఢ్ చలే యే ఖదమ్ (కఫన్ అంటే శవవస్త్రం. సమాధి చేసే ముందు మరణించిన వ్యక్తిని రెండు తెల్లని వస్త్రాల్లో చుడతారు. దాన్ని కఫన్ అంటారు. సర్ పే కఫన్ బాంధ్నా అంటే ప్రాణత్యాగానికి సిద్ధపడడం. జాం హథేలీ పర్ లేనా అంటే ప్రమాదాలను ఎదిరించడం. తెలుగులో అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవడం అన్న సామెత ఇక్కడ పొసగదు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవడం అంటే భయపడుతూ బతకడం అన్న భావం ఉంది. జాం హథేలీ మేం లేనా అంటే ప్రమాదాలను ఎదిరిస్తూ ప్రాణాలు ధారబోయడానికి సిద్ధపడడం అన్న భావం ఉంది) మేం ఇంటి నుంచి ప్రాణత్యాగానికి సిద్ధపడే వచ్చాం ప్రాణం చేతపట్టి అడుగులు ముందుకు వేస్తున్నాం జిందగీతో అప్నీ మెహమాం మౌత్ కీ మహ్ఫిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై జీవితం ఒక అతిథి మాత్రమే, మనం మృత్యు గోష్ఠిలో ఉన్నాం ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలోనే ఉంది. దిల్ మేం తూఫానోంకి టోలీ ఔర్ నసోం మేం ఇంక్విలాబ్ హోష్ దుష్మన్ కే ఉఢాదేంగే హమేం రోకో న ఆజ్ (హోష్ ఉఢాదేనా అంటే నిర్ఘాంతపోయేలా చేయడం) గుండెలో తుఫానులు, నరనరాన విప్లవం శత్రుగుండెలో నిద్రపోతాం, ఆపకండీ రోజు దూర్ రహ్ పాయే జో హమ్ సే దమ్ కహాం మంజిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై మాకు దూరంగా ఉండేంత ధైర్యం గమ్యానికి లేదు ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలోనే ఉంది. ఓ జిస్మ్ భీ క్యా జిస్మ్ హై జిస్ మేం న హో ఖూనె జునూన్ తూఫానోం సే క్యా లఢే జో కష్తీ యే సాహిల్ మేం హై దేశప్రేమ లేని శరీరం కూడా ఒక శరీరమేనా ఒడ్డునున్న పడవలో తూఫానులతో పోరాటమా (చివరి షేర్ లో బిస్మిల్ పేరు తఖల్లుస్ గా కనబడుతుంది, చాలావర్షన్లలో ఈ షేర్ లేదు. సుభాష్ గారు పోస్టు చేసిన వర్షన్లో ఉంది.) అబ్ న పహలే వల్వలే హై ఔర్ న అర్మానోం కి భీడ్ ఏక్ మిట్ జానేకి హసరత్ అబ్ దిలే బిస్మిల్ మేం హై మునుపటి ఉత్సాహము, కోరికలు ఇప్పుడు లేవు బలై పోవాలన్న ఆశే ఇప్పుడు బిస్మల్ హృదయంలో ఉంది.

by Subhash Kotifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWtqWm

Posted by Katta

Lingareddy Kasula కవిత

7 జూన్ 2014 నాడు ఆంధ్రభూమి లో నా 'ఇదుపుకాయితం' మీద రాపాక చిన్ని విజయకృష్ణ గారు రాసిన సమీక్ష http://ift.tt/UmgJiW

by Lingareddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UmgJiW

Posted by Katta

Kapila Ramkumar కవిత

సాంస్కృతికోద్దీపనలో తెలంగాణా కవిత్వం Posted on: Sun 08 Jun 05:39:17.157405 2014 తెలంగాణా ఉద్యమంలో కవిత్వానికి ఒక ప్రధాన భాగం ఉంది. ఈ సాహిత్యం ప్రధానంగా తెలంగాణా ఆకాంక్షని వ్యక్తం చేసినప్పటికీ, ఈ క్రమంలో సాంస్కృతికాంశాల పునరుజ్జీవనానికి ఇది హేతువయింది. అనేకానేక మార్గాల ద్వారా సాంస్కృతికాస్తిత్వాల ద్వారా తనదైన ఉనికిని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాట, వచన, కవిత, ఇతర లఘు కవితా ప్రక్రియలు ఇందుకు దోహదపడ్డాయి. పాట గానానికి అనుగుణంగా ఉండే మాత్రాబద్ధమైన లయతో ముడిపడిందే కాని అది కవిత్వం నుంచి సంపూర్తిగా వేరుపడదు. మలి దశలో సాగిన ఉద్యమంలో భాగంగా వచ్చిన కవితా సంకలనాలు ఇటు ఉద్యమాన్ని, అటు కవిత్వాంశని, మరోవైపు సాంస్కృతికాంశని వ్యక్తం చేశాయి. జూలూరి గౌరీ శంకర్‌ 'పొక్కిలి', సుంకిరెడ్డి నారాయణరెడ్డి 'మత్తడి' ఎస్‌. జగన్‌రెడ్డి 'జులుస్‌', సుంకర రమేష్‌ కొన్ని సంవత్సరాలపాటూ తెచ్చిన 'తెలంగాణా కవిత', వేముగంటి మురళీ మిత్రులు తెచ్చిన 'మునుం' ఇంకా జిల్లాల నుంచి వచ్చిన సంకలనాలు వల్లుబండ (కరీంనగర్‌), ఎల్గడి (ఆదిలాబాద్‌), మెతుకు సీమ (మెదక్‌)... మొదలైనవి ఇందుకు దోహదపడ్డాయి. ఇంకా అనేక పత్రికలు తెచ్చిన ప్రత్యేక సంచికలు, వ్యక్తుల సంపుటాలు ఈ అంశాలని చిత్రించాయి. ప్రధానంగా ఈ కవిత్వం సామాజిక సంప్రదాయాలను, మత వైరుధ్యాలకు అతీతంగా జీవించడాన్ని, జాతిని ఉన్నతీకరించే సామాజిక, సాంస్కృతిక ప్రతినిధులను పోరాట యోధులను సంస్మరించి చిత్రించింది. ప్రాంతాలలో ప్రఖ్యాతి గాంచిన ప్రదేశాలను కళలను తలకెత్తుకుంది. ప్రధానంగా తెలంగాణా నుడికారాన్ని ప్రధాన పరికరంగా వాడుకుంది. ఈ అంశాలన్నీ తెలంగాణా కవిత్వంలోని సాంస్కృతిక భాగాన్ని వ్యక్తం చేశాయి. ప్రధాన చారిత్రక సన్నివేశంలో తెలంగాణాలో హిందూ, ముస్లిం మతాలు ఇక్కడ ఉమ్మడిగా గడుపుతున్నాయి. రెండు మతాలకు సంబంధించిన రాజరిక వాతావరణాల వల్ల ఈ రెండు మతాలకు చెందిన అభివర్గాలు ఒక నూతన సాంస్కృతిక దిశగా నడవటం దీనికొక కారణం కావొచ్చు. వేములవాడలాంటి అనేక దేవస్థానాలల్లో ఇలాంటి ప్రాధాన్యతలు కనిపిస్తాయి. మతాలకతీతంగా ఈ నమ్మకాలు తెలంగాణా నలుచెరగులా కనిపిస్తాయి. ఈ భావన అనేకసార్లు కవిత్వంలో వ్యక్తమయింది. 'తెల తెల వారుతున్నప్పుడు దర్గా దయకోసం మోకరిల్లిన అన్ని మతాల వారినీ చూశాను' 'మతాతీత దర్గాలే వెలిస్తే గతాలన్నీ సహజీవన గీతాలై విరిస్తే అప్పుడు మనుషులంతా మారాజులు బతుకులన్నీ సంక్రాంతులు, రంజాన్‌లు' (దర్గాదయ - యాకూబ్‌ - తెలంగాణా కవిత 2009) హైదరాబాద్‌ లాంటి నగరాలను, పట్టణాలను ఈ రెండు సంస్కృతులకు దగ్గరగా కవిత్వం చూసింది. కవితాత్మక వచనంలో ఈ మమేకత్వం కనిపించిన సందర్భాలున్నాయి. 'హైదరాబాద్‌ నగరం / ఆత్మీయతకు నిలయం/ ఖైరియత్‌ అడిగే/ 'ఇఫ్తార్‌ 'ఆతిథ్యం' (నెమలికన్ను - ఆశారాజు - ఎ పోయట్‌ ఇన్‌ హైదరాబాద్‌) 'షీర్‌ కూర్మా తీపిలాగా / బోనాల నాటి పరిమళం / పండగలా బతికే కలలుగంటాను' -(వెన్నెల దర్పణం- ఆశారాజు - ఎపోయట్‌ ఇన్‌ హైదరాబాద్‌) ఈ మత సంబంధమైన సంస్కృతికత వ్యక్తమైన సందర్భాలు అనేకం. ఎక్కువగా ఉర్దూ పదాలను శీర్షికలుగా రాయడం... హిందీ, ఊర్దూ వాక్యాలు కవిత్వంలో రాయడంలోనూ ఈ అంశం వ్యక్తమౌతుంది. తెలంగాణాలో హైదరాబాద్‌ లాంటి మహానగరాలున్నా.. దీని వెనుక బలమైన పల్లె సంస్కృతికి చెందిన సంస్కృతిక వాతావరణం ఒకటి ఉంది. బోనాల పండగ జీవితానికే ప్రధాన భాగం అయిన నేల తెలంగాణా. 'బలువూరి కొండన్న, సర్వాయి పాపన్న/ సై అంటే సై అంటూ ఎగిరి దూకిన రోషాల తాంబూర / గొల్ల సుద్దులేయి/ మందెబ్బ కథలేయి/ గోసంగి మాతంగి భాగోతాలేయి/ కంగాలి సినిమాల జంగిలి పాటల్దప్ప' 'బొడ్రాయి పోశమ్మ, అమ్మ ముత్యాలమ్మ/ బోనాల గంపల్ల బర్కతేమాయే' -(దాలి - సుంకిరెడ్డి నారాయణ రెడ్డి) ఇది తెలంగాణా సంస్కృతిక వాతావరణాన్ని చెప్పేది. తెలంగాణా సామాజిక వాతావరణాన్ని చెప్పిన వాక్యాలూ కనిపిస్తాయి. 'మెట్ట భూములు, అయిందపు లొట్టలు/ సజ్జజొన్నలు సర్పాలు తేళ్లు/ తాడెత్తు జీవధారలు/ నవ్విన పువ్వులు/ పసుపు తంగెళ్లు/ పచ్చటి బతుకులు/ పండుగ బతుకమ్మలు/ సిర్రగోనెలు సిలువ మోసిన రైతులు / అంబరాసాలు / అయిరేణి కుండలు' -( యాది - మనాది... అల్లం నారాయణ- మునుం) ఇవన్నీ తెలంగాణా సామాజిక జీవనంలో సంస్కృతికి ప్రతిబింబాలు. ఇవన్నీ పారదర్శకంగా తెలంగాణా సమాజంలోని జీవనస్తిత్వాన్ని చెప్పినవే. కొన్ని గ్రామాలు, ప్రాంతాలు కొన్ని కళలకు, వృత్తి పనులకు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. ఇవి ఆయా సంస్కృతుల మాధ్యమాలుగా ప్రపంచానికి పరిచయమౌతాయి. సిల్వర్‌ ఫిలిగ్రీ పనులు, ఆదిలాబాద్‌ రంజన్లు, నిర్మల్‌ బొమ్మలు, ఇవన్నీ ఇలాంటివే. ఈ దృష్టి కూడా కవిత్వంలో కనిపిస్తుంది. 'వెండి కమ్మీల్ని బొక్జ్కలు తెల్లగవుతున్నా / పట్టుదారాల్లా సాగదీసి / తీగల్ని కత్తిరించి సుడుగులు చుడతాడు ఫిలిగ్రీ వర్కర్‌' -(సిల్వర్‌ ఫిలిగ్రీ వర్కర్‌ - ఎర్రోజు వెంకటేశ్వర్లు - కరీంనగర్‌ కవిత 2012) 'మానవ మూలాలైన అడవుల్లోని/ ఆదివాసి సంస్కృతిని / పులిమిన కుండలు / ఎదులాపురంలోని ఎద్దులా కష్టించే /అమాయక మట్టి జీవుల/ స్పర్శను తాకిన కుండలు' -(ఆదిలాబాద్‌ రంజన్లు - మునిమడుగుల రాజారావు - మునుం) తెలంగాణా సమాజంలోని జీవితాలను కవిత్వీకరించినట్టే అక్కడి ప్రధానాంశాలనూ కవిత్వం చేయడం కనిపిస్తుంది. ఈ కాలానికి బాగా గమనించాల్సింది భాషా వినిమయం గురించి గతానికంటే ఎక్కువగా ఈ కాలం కవులు తమ నుడికారంపై దృష్టి పెట్టారు. ఒక ప్రధాన సాహిత్య పరికరంగా ఇక్కడి వ్యవహార భాషని ఉపయోగించడం కనిపిస్తుంది. పల్లెల్లో మిగిలిపోయిన తెలంగాణా నుడికారం సాహిత్యంలో అనేక మార్గాల్లో ప్రతిఫలించింది. ఈ నుడికారంపై మమకారం కూడా ఖండికలుగా వ్యక్తమైంది. '/జనం నోట్లెకెల్లి ఊడిపడిన పదం / నిఘంటువుల పదఘట్టనల్లో నలిగిపోయింది/ ఏ పదబంధ ప్రబంధంలోనూ నా యస లేదూ బాస లేదు / వాక్యం నా పలుకు వల్లించదు / అక్షరాల్లో నా నుడికారపు శబ్దం లేదు' -(అన్నవరం దేవేందర్‌ - తెలంగాణా వ్యాకరణం - మునుం) ప్రధానంగా కళాత్మక దృష్టితో తెలంగాణా నుడికారంలోనే రాసినవి కూడా కనిపిస్తాయి. 'ఊర్లకు అనలత్తన్నయంటే / సెట్లన్నీ పోషమ్మ గుడికాడ ఊగే / శివ సత్తుల లెక్క ఊగుతాయి / ఊర్లల్ల అచ్చే ఆనసినుకులు / రేకుల ఇండ్ల మీద పడితే / గరీబోని పెండ్లికి పెట్టిన / సప్పుల్ల లెక్కుంటయి' - (టి. కృష్ణమూర్తి యాదవ్‌- వివిధ. ఆంధ్రజ్యోతి 8.3.2004) ఈ కాలానికి ప్రపంచీకరణ వల్ల తెలంగాణాలో దళిత, బహుజన కవిత్వం ఎక్కువగా వచ్చింది. అందువల్ల వృత్తి సంబంధమైన పదాలు, పదబంధాలు కవిత్వంలో ఎక్కువగా ఊపిరి పోసుకున్నాయి. పుస్తకాలకు శీర్షికలుగా, కవితా ఖండికలకు శీర్షికలుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగంలోకి వచ్చిన భాషా సంపద పల్లె వాతావరణానికి, ఆయా కుల వృత్తులకు వ్యవసాయానికి సంబంధించినదే అనటం అతిశయోక్తి కాదు. మత్తడి, పొక్కిలి, మునుం, వల్లు బండ, తండ్లాట, చిన్నాయి, పోగుల గూడు, ఇరువాలు, మొగురం.. లాంటి పదాలు పదబంధాలెన్నో శీర్షికలుగా కనిపిస్తాయి. అనిశెట్టి రజిత, రామాచంద్రమౌళి, పొట్లపల్లి శ్రీనివాసరావు వంటి వరంగల్‌ కవుల శీర్షికల్లోనూ వైవిధ్యం ఉంటుంది. పల్లె పదాల్లోని మాధుర్యం, ఉద్వేగం, ప్రేమ, మమకారం అన్నీ కవిత్వ వచనంలో జీవం పోసుకున్నాయి. ప్రధానంగా పరిశీలిస్తే ఈ భాషలోనూ పూర్తి తెలంగాణా ప్రజా జీవనంలోని భాష, ఉర్దూ సమ్మిళితమైన భాషగా రెండు వర్గీకరణలు చేయవచ్చు. నిజానికి భాషా, సాంస్కృతిక భాగాలకు సంబంధించి ఈ దశాబ్ది కాలం పునరుజ్జీవన భాగం. ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అన్ని ప్రాంతాల నుండి కవిత్వం సంకలితం చేయబడ్డట్టుగానే సాంస్కృతికాంశాలని వ్యక్తం చేసేవి కూడా రావాలి. అప్పుడు ఈ సాంస్కృతిక దీప్తి ఇంకా సాహిత్యాకాశంలో ప్రకాశవంతంగా విశదమౌతుంది. - ఎం నారాయణ శర్మ రచయిత సెల్‌ : 9177260385

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oyrQzW

Posted by Katta

Kapila Ramkumar కవిత

సాహిత్య చరిత్ర నిర్మాణంపై చూపు సారిస్తారా? Posted on: Sun 08 Jun 05:36:20.878858 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యాసంస్థల్లో సిలబస్‌ పూర్తిగా మారాల్సిన పరిస్థితే ఉంది. ఆ విషయాన్ని ముందుచూపుతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను మనం తక్షణమే పరిష్కరించుకోగలమా అనేది ప్రశ్న. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పాఠ్యపుస్తకాలు మారాల్సి ఉంది. ముఖ్యంగా, తెలుగు పాఠ్యాంశాలు, చరిత్ర మారాల్సి ఉంటుంది. ఇతర విద్యాసంస్థల విషయాన్ని పక్కన పెడితే విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా తెలుగు శాఖలకు తెలుగు సాహిత్య చరిత్ర తక్షణమే మారాల్సిన అవసరం ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ తెలుగు సాహిత్యాన్ని ప్రతిబింబించే పాఠ్యభాగాలు రావాలి. ఆ విషయాలను పక్కన పెడితే, ఇప్పటి వరకు తెలంగాణలోని తెలుగుశాఖల్లో బోధిస్తున్న సాహిత్య చరిత్రనే ఇక ముందు కూడా బోధించడానికి వీలు లేదు. అలా బోధిస్తున్నామంటే, తెలంగాణ ఉద్యమంలోని సారాన్ని గ్రహించలేదని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి చోదక శక్తులుగా పనిచేసినవాటిలో నీళ్లు, నియామాకాలు, నిధుల వంటి భౌతిక విషయాలు మాత్రమే కాకుండా భావజాలానికి సంబంధించిన సాంస్కృతిక, సాహిత్య విషయాలు కూడా ఉన్నాయి. తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం అన్నారు గానీ అసలే నిర్మాణమే లేనప్పుడు పునర్నిర్మాణం అనేది ఎలా ముందుకు వస్తుందనేది ప్రశ్న. మొత్తంగా తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమే జరగాల్సి ఉంది. ఆ అవసరం ఎందుకు వచ్చిందనేది ప్రశ్న. ఉమ్మడి తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికి స్థానం లేకపోవడం ప్రధాన కారణం. తెలంగాణ సాహితీవేత్తలు, విమర్శకులు, పరిశోధకులు, పరిశీలకులు కూడా గుర్తు పట్టలేనంతగా తెలంగాణ సాహిత్యం మరుగున పడిపోయింది. తెలంగాణ సాహిత్యం తనను తాను మరుపునకు లోను చేసుకుంది. ఈ స్థితిలో కరిక్యులం మార్చాల్సి వచ్చేసరికి తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఆచార్యులు ఆందోళనకు గురయ్యే పరిస్థితే ఉంది. విశ్వవిద్యాలయం తెలుగుశాఖల్లో విద్యార్థులు చదువుతున్నదంతా ఇప్పటి వరకు కోస్తాంధ్ర సాహిత్య చరిత్రనే. తెలుగు సాహిత్య చరిత్ర తెలంగాణ సాహిత్యాన్ని తనలో ఇముడ్చుకోలేకపోయింది. ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి సాహిత్యం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత రూపుదిద్దుకోలేదు. ఉమ్మడి సాహిత్యం రూపుదిద్దుకుని ఉంటే సాహిత్య చరిత్రలో కోస్తాంధ్ర సాహిత్యంతో పాటు తెలంగాణ సాహిత్యం సమానమైన హోదాను, గౌరవాన్ని పొంది ఉండేది. తెలంగాణలోని సృజనాత్మక సాహిత్యం సాహిత్యమే కాదన్నంతగా సాహిత్య చరిత్రల నిర్మాణం జరిగింది. ఖండవల్లి ల‌క్ష్మి‌రంజనం, పింగళి ల‌క్ష్మి‌కాంతం, కెవి నారాయణ రావు వంటివారు రాసిన సాహిత్య చరిత్రలను విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులూ ఆచార్యులూ బోధిస్తున్నారు, విద్యార్థులు చదువుకుంటున్నారు. ఖండవల్లి లకీëరంజనం రాసిన సాహిత్య చరిత్రలో తెలంగాణ కవులకు సంబంధించిన ఓ అధ్యాయం వుంది. దాన్ని విస్తరించి ఆంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్య చరిత్రను చేర్చి, ఉమ్మడి సాహిత్య చరిత్ర నిర్మాణం జరగలేదు. కసరత్తు అవసరమైనప్పటికీ కాస్తా శ్రద్ధ పెడితే వాచకాలను మారిన భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలం. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏ సాహిత్య చరిత్రను బోధించాలనేది అధ్యాపకులకు, ఏది చదువుకోవాలనేది విద్యార్థులకు సమస్యగా మారుతుంది. ఇంతకాలం సాహిత్యవేత్తలు, పండితులు, పరిశోధకులు ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, అంటే భౌగోళిక పరిస్థితుల మార్పు కోసం జరిగిన ఉద్యమంపైనే దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సాహిత్యాన్ని మాత్రమే గుర్తించిన సాహిత్య చరిత్రను చదువుకోవడంలో అర్థం లేదు. అది కూడా ఒక భాగంగా ఉండాలి గానీ అదే ప్రధానమైన పాయగా ఉండకూడదు. ప్రధానమైన విషయం తెలంగాణ సాహిత్య చరిత్ర కావాలి. తెలుగు సాహిత్య పరిణామక్రమం వివిధ కాలాల్లో నిజామాంధ్రలో ఒక విధంగా, బ్రిటిషాంధ్రలో మరో విధంగా ఉంది. ప్రభావాలు, సామాజిక పరిణామాలు, రాజకీయ పరిణామాలు, సాంస్కృతిక వికాసం భిన్నంగా ఉన్నాయి. సాహిత్య చరిత్రలో జరిగిన యుగ విభజన తెలంగాణ సాహిత్యానికి చోటు కల్పించేది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ యుగ విభజనను మార్చాల్సిన అవసరాన్ని కూడా గుర్తించలేదు. రెండు సందర్భాల్లో మాత్రమే తెలుగు సాహిత్యం తెలంగాణ సాహిత్యాన్ని స్వీకరించింది. ఒకటి - తెలంగాణ సాయుధ పోరాటం, రెండోది - నక్సలైట్‌ ఉద్యమం. ఈ రెండు సందర్భాల్లో కూడా తెలంగాణ క్రియాశీలకంగా ఉండడం, అందుకు అనుగణమైన సాహిత్యం వెలువడడం కారణం కావచ్చు. మిగతా కాలాలకు వస్తే తెలంగాణ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యం స్వీకరించిన సందర్భాలు చాలా తక్కువేనని చెప్పవచ్చు. ప్రాచీన సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికి చోటు దక్కిన సందర్భం ఉంది. పాల్కురి సోమన వంటి శైవకువులను సాహిత్య చరిత్ర విస్మరించలేదు. కానీ, దానికి దేశీ కవిత్వం కింద చోటు కల్పించి, న్యూనతకు గురి చేశారు. సాహిత్యంలో మార్గదేశీ మార్గాలను విడదీసి, మార్గ కింద ఇతర కవులను చేరిస్తే, దేశీ కింద తెలంగాణ ప్రాచీన కవులను చేర్చారు. అంటే, పోతనను మినహాయిస్తే, ఇతర తెలంగాణ కపులను దేశీ కింద చేర్చి ద్వితీయ శ్రేణి కవులుగానే చూశారు. తెలంగాణకు చెందిన పరిశోధకులు కూడా సాహిత్య విశ్లేషణ, సాహిత్య వింగడింపుల్లో కోస్తాంధ్ర సంప్రదాయాలను, పద్ధతులను, ప్రమాణాలనే స్వీకరించారు. ఇందుకు మంచి ఉదాహరణ - ఆధునిక తెలుగు సాహిత్యం -సంప్రదాయములు, ప్రయోగములు అనే సి. నారాయణ రెడ్డి పరిశోధక గ్రంథం. ముదిగంటి సుజాతారెడ్డి తన సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్యానికి చోటు కల్పించారు. కానీ కల్పించాల్సిన స్థానం కల్పించలేదు. దీనికి ప్రధానమైన కారణం - ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభమైన దాడి తెలంగాణవాళ్లను న్యూనతా భావనకు గురి చేసింది. భాషా సాహిత్యాల్లో తనను చూసి తాను సిగ్గుపడే విధంగా పెద్ద యెత్తున సాంస్కృతిక దాడి జరిగింది. కోస్తాంధ్ర సాహిత్యానికి ఆధిక్యత చేకూర్చి పెట్టి, తెలంగాణ సాహిత్యవేత్తలు తమను తాము చూసుకుని న్యూనతకు గురయ్యే పరిస్థితి కల్పించిన తర్వాత తనను తానే మరిచిపోయే పరిస్థితిని కల్పించారు. దాదాపుగా తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది. దాంతో ఆధునిక సాహిత్యం విషయానికి వస్తే, తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యానికి, నక్సలైట్‌ ఉద్యమానికి సంబంధించిన సాహిత్యాన్ని తప్పిస్తే మిగతా సాహిత్యం విషయానికి వస్తే జరిగిందంతా విస్మరణే. ఈ విస్మరణ రెండు రకాలుగా జరిగింది. ఒకటి - విస్మరణ. అది కావాలని చేసింది. అది వివక్షకు సంబంధించింది. దీనికి ప్రధాన కారణం - తెలంగాణ సాహిత్యాన్ని ఆంధ్ర సాహిత్య కొలమానాలతో బేరీజు వేయడానికి ప్రయత్నించడం. చినవీరభద్రుడు సంకలనం చేసిన వందేళ్ల తెలుగు కథ ఇందుకు నిదర్శనం. 1970ల నుంచి మాత్రమే తెలంగాణలో కథ ఉందనే విషయాన్ని చినవీరభద్రుడిలాంటి వాళ్లు చెబుతూ వస్తున్నారు. రెండోది - అంతర్నిహితమైన వివక్ష. అంటే, చైతన్యంలోనే వివక్ష గుర్తు పట్టరానంతగా అంతర్నిహితమై ఉండడం. అంటే, వివక్ష ఏమిటో కూడా తెలియకపోవడం. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి నవలను విశాలాంధ్రవాళ్లు అచ్చేశారు. దాని అట్ట మీద తెలంగాణ తొలి నవల అంటూ ఓ ముద్ర వేశారు. దానివల్ల అంతకు ముందు తెలంగాణలో నవలలే లేవనే విషయాన్ని చెప్పకనే అది చెబుతుంది. ఈ వివక్షపై తెలంగాణ రచయితలు ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ యేటా తెస్తున్న వార్షిక కథా సంకలనాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ అసంతృప్తికి, ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడానికి కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాలు ప్రయత్నించలేదు. తెలంగాణ రచయితల వాదనలోని హేతుబద్దతను గుర్తించడానికి నిరాకరించాయి. తెలంగాణ మలి దశ ఉద్యమంలో సాంస్కృతిక, చారిత్రక కోణం కూడా ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. సంస్కృతిని, చరిత్రను వక్రీకరించిన తీరును, విస్మరించిన తీరును, తెలంగాణ పట్ల ఈ విషయాల్లో చూపిన వివక్షను ప్రశ్నిస్తూ వచ్చింది. అలా ప్రశ్నిస్తూ తెలంగాణ సాహిత్యరంగంలో తనను తాను వెతుక్కునే ప్రయత్నం చేసింది. అంటే, యాభై ఏళ్ల కాలంలో తలకిందులై, స్థిరీకరింపబడిన అంశాలను నిటారుగా నిలబెట్టాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాదు, అందుకు అవసరమైన కృషి కూడా ఈ ఉద్యమంలో జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాల్సిన అవసరం ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక 2000ల్లోనే గుర్తించింది. తెలంగాణ, సాంస్కృతిక ఉద్యమం ఆ దిశగా సాగాలని నిర్దేశించింది. అందులో భాగంగానే తెలంగాణ తోవలు, భౌగోళిక సందర్భం అనే రెండు పుస్తకాలు వచ్చాయి. ఈ రెండింటిలో తెలంగాణ తోవలు అత్యంత కీలకమైన, ప్రధానమైన గ్రంథం. ఈ పుస్తకంలో తెలంగాణ సాహిత్య విమర్శకు కొలమానాలు మారాలని, ఆ కొలమానాలు ఎలా ఉండాలో చెప్పడానికి కాసుల ప్రతాపరెడ్డి ఆధునిక తెలుగు సాహిత్యానికి అన్వయిస్తూ వాళ్లూ - మనమూ అనే వ్యాసం రాశారు. తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను కొత్త కొలమానాలతో, కొత్త దృష్టికోణంతో, స్థిరీకృత పద్ధతులను తృణీకరించిన రాసిన వ్యాసాలున్నాయి. ఇందులో భాగంగానే పాల్కురికి సోమనాథుడిని తొలి తెలుగు కవిగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల లింగారెడ్డి సూత్రీకరించారు. నన్నయను ఆదికవి తెలంగాణ సాహిత్య చరిత్ర స్థిరీకరించి పెట్టింది. ఈ స్థితిలో అనువాదం మాత్రమే చేసిన నన్నయ ఆది కవి కాలేడని, సొంత వస్తువు తీసుకుని రాసిన పాల్కురి సోమనాథుడు ఆదికవి అవుతాడని వారు వాదించారు. వాటితో పాటు భాషపై నందిని సిధారెడ్డి, చారిత్రక పరిశోధనకు మనకున్న వనరుల గురించి కె. శ్రీనివాస్‌ వ్యాసాలు రాశారు. ఈ పుస్తకంలో అచ్చయిన వ్యాసాల్లోని సూత్రీకరణలను ఆధారం చేసుకుని సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చరిత్రలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉండింది. అయితే, ఆ దిశగా కృషి కాస్తానే జరిగింది. ఈ విషయంలో సంస్థలు, విశ్వవిద్యాలయాలు చేసిన కృషి కన్నా వ్యక్తులు చేసిన కృషి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన కృషి తెలంగాణ సాహిత్య నిర్మాణానికి పనికి వస్తాయి. అంటే ఆధార గ్రంథాలుగా పనికి వస్తాయి. ప్రాచీన తెలంగాణ సాహిత్య నిర్మాణానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ముంగిలి మంచి ఆధార గ్రంథం. ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన చరిత్రను మరింత విస్తృతంగా నిర్మించుకునే వరకు దాన్ని బోధించడానికి వీలవుతుంది. దాన్ని బోధించే క్రమంలోనే విస్తరించుకోవచ్చు, మార్చులు చేసుకోవచ్చు. సాహిత్య చరిత్రలో తొలి తరం తెలంగాణ కథల వివరాలను సంగిశెట్టి శ్రీనివాస్‌ తెచ్చిన దస్త్రమ్‌ అందిస్తుంది. అలాగే, ముదిగంటి సుజాతారెడ్డి సొంతంగా ఒకటి, సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి మరోటి తొలి తెలంగాణ తొలితరం కథల సంకలనాలను అందించారు. విశాలాంధ్ర తెలంగాణ కథల సంకలనం తెచ్చింది. కర్ర ఎల్లారెడ్డి తెచ్చిన తెలంగాణ వార్షిక కథా సంకలనాలు ఉన్నాయి. స్కైబాబ తెచ్చిన ముస్లిం కథా సంకలనాలు, వివిధ సంపాదకులు తెచ్చిన దళిత కథల సంకలనాలు ఉన్నాయి. కాలువ మల్లయ్య తెలంగాణ కథ మీద రాసిన ఓ గ్రంథం ఉంది. తెలంగాణ విమర్శకులు వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాలున్నాయి. ఆ విమర్శకుల సాహిత్య విమర్శనా గ్రంథాల నుంచి వాటిని స్వీకరించవచ్చు. వివిధ సందర్భాల్లో తెలంగాణ నుంచి వచ్చిన కథా సంకలనాలున్నాయి. ఇక, ఆధునిక తెలంగాణ సాహిత్యానికి వస్తే ముందే చెప్పినట్లు సి. నారాయణ రెడ్డి ఆధునిక కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు తెలంగాణకు ప్రాతినిధ్యం వహించదు. తెలంగాణ పరిశోధకుడిగా రాసిన పరిశోధక గ్రంథంగా మాత్రమే దానికి గుర్తింపు ఉంటుంది. తెలంగాణ నవలకు సంబంధించి, తూర్పు మల్లారెడ్డి నల్లగొండ జిల్లా భువనగిరి లకీëనర్సింహస్వామి కళాశాలలో 2007లో నిర్వహించిన సదస్సులో సమర్పించిన పత్రాలతో తెలంగాణ సాహిత్యం - జీవన చిత్రణం అనే పేరుతో ఓ గ్రంథం వచ్చింది. అందులో తెలంగాణ నవలకు సంబందించిన కాలక్రమాన్ని, వస్తు పరిణామక్రమాన్ని విశ్లేషించిన వ్యాసం ఉంది. దాన్ని ముందు పెట్టుకుని నవలకు సంబంధించిన అధ్యయాన్ని విస్తరించవచ్చు. వరవరరావు వెలువరించిన తెలంగాణ విమోచనోద్యమ నవల గ్రంథం ఒక కాలానికి సంబంధించిన నవలను విశ్లేషించడానికి పనికి వస్తుంది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు సంబంధించిన వర్గీకరణకు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన తెలంగాణ ప్రాంతీయ సాహిత్యం ఓ నమూనాగా పనికి వస్తుంది. సాహిత్య చరిత్రలో ఆధునిక కవిత్వ విభాగాన్ని నిర్మించడానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి ఇరుసు, కొలుపు, గుడిపాటి ఫాయిదా, సుజాతారెడ్డి సంపాదకత్వంలో తెచ్చిన ముద్దెర, నందిని సిధారెడ్డి ఇగురు వంటి సాహిత్య విమర్శనా గ్రంథాలున్నాయి. మరిన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు కూడా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ సాహిత్యంపై జరిగిన పరిశోధనలున్నాయి. ఆధునిక తెలంగాణ కవిత్వ నిర్మాణానికి ప్రాతిపదకను ఏర్పాటు చేసుకోవడానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్ర రాజు సంపాదకత్వంలో వెలువడిన మత్తడి పనికి వస్తుంది. పొక్కిలి, మునుం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సందర్భంగా వచ్చిన కవిత్వాన్ని విశ్లేషించడానికి పనికి వస్తాయి. ప్రాచీన సాహిత్య చరిత్రను నిర్మించే క్రమంలో గోల్కొండ, శోభ, నీలగిరి వంటి పలు పత్రికలు ఆధారాలుగా పనికి వస్తాయి. తెలంగాణ సాహిత్య నిర్మాణానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. ఆ వనరులను ఆధారం చేసుకుని తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించడం అనేది పెద్ద ప్రాజెక్టు. ఆ సాహిత్య చరిత్ర నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి పరిశోధకులు, విమర్శకులు, విశ్లేషకులు కావాలి. వారిని గుర్తించి, కమిటీలు వేసి నిష్ణాతులతో ఆయా విభాగాలు రాయిస్తే అది సాధ్యం కావచ్చు. అయితే, అందుకు పూనుకునే వ్యవస్థ ఒక్కటి కావాలి. ఇప్పటి వరకు ఈ విషయంపై తెలంగాణలోని ప్రధానమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం దృష్టి పెట్టకపోవడం విచారకరమే. తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణేతర తెలుగు సాహిత్యంతో తులనాత్మక అధ్యయనం కూడా చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రధానంగా బోధించి, ఆ సాహిత్యాన్ని విడిగా బోధించడానికి అది పనికి వస్తుంది. తెలంగాణలోని ఆదివాసీలు జరుపుకునే జాతరల్లో ప్రముఖమైంది నాగోబా జాతర. దీని చరిత్ర, జాతర నిర్వహణ ఆసక్తికరమైంది. కొండకోనల్లో నివసించే గిరిజనులు తమ జాతి దైవంగా నాగోబాను కొలుస్తారు. దక్కన్‌ పీఠభూమి గిరిపుత్రులందరికీ నాగోబాయే ఆరాధ్యదైవం. ప్రతి సంవత్సరం పుష్యమాసం (జనవరి, ఫిబ్రవరి) అమావాస్య రోజున అత్యంత వైభవంగా నాగోబా జాతర జరుగుతుంది. ఈ దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌ గ్రామంలో ఉంది. జాతర కోసం జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. జాతరకు వచ్చే పొరుగు రాష్ట్రాల గిరిజనులకు సౌకర్యాలు కల్పిస్తారు. అయితే జాతర చివరి రోజున 'ప్రజాదర్బార్‌' నిర్వహించడం ఆనవాయితీ. దీన్ని 1946 సంవత్సరంలో ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త హెమన్‌డార్ఫ్‌ ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్నుంచి అధికార దర్బార్‌ నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఆ రోజు జిల్లా కలెక్టర్‌ సహా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కెస్లాపూర్‌లో కొలువు దీరుతారు. వివిధ తెగలకు చెందిన గిరిజనులు సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేస్తారు. వాటిని అక్కడికక్కడే పరిష్కారమయ్యే ఈ వేదిక ఏర్పాటు చేశారు. కాని ఏటా సమస్యలపై విన్నవించినా పరిష్కారమార్గం దొరకకపోవడంతో 'ప్రజాదర్బార్‌' ప్రాధాన్యత కోల్పోతోంది. జాతర సందర్భంగా పుష్యమాసం అమావాస్య రోజున మెస్రం తెగ గిరిజనులు గోదావరి నదీ జలాలతో నాగోబాకు అభిషేకం చేసి పూజలు చేస్తారు. స్థలపురాణం ఈ జాతరకు సంబంధించి ప్రచారంలో వున్న కథ ఒకటి ఈవిధంగా వుంది. కొన్ని సంవత్సరాల క్రితం నాగేంద్రుడు మెస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి, రాణి దంపతులకు కలలో కనిపించి సర్పం రూపంలో జన్మిస్తానని చెప్పాడట. ఆ తర్వాత కల నిజమైందని గిరిపుత్రులు విశ్వసిస్తారు. కొంత కాలానికి నాగేంద్రుడి తల్లి తన తమ్ముని కూతురు గౌరితో సర్ప రూపంలో గల నాగేంద్రుని వివాహం జరిపిందట. అత్త ఆజ్ఞ మేరకు గౌరి భర్త అయిన నాగేంద్రున్ని బుట్టలో పెట్టుకొని గోదావరికి పయనమైనట్లు గిరిజనులు చెబుతుంటారు. ప్రయాణం మధ్యలో పాము ఒక చోట ఉడుము రూపంలో కన్పించగా ఆ ప్రాంతం ఉడుంపూర్‌గా మారింది. అనంతరం ధర్మపురి నదిలో గౌరి స్నానం చేస్తుండగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషిగా మారాడట. కాగా నాగేంద్రుడు పేరు ప్రతిష్టలు కావాలో, సాంప్రదాయం కావాలో తేల్చుకోమని అనగా, గౌరి సాంప్రదాయాలను కాదని పేరు ప్రతిష్టలు కోరుకోగా మనిషి తిరిగి పాముగా మారినట్లు కథనం. తదనంతరం ఉడుంపూర్‌ నుండి గరిమెల వరకు వెతికిన గౌరి గోదారి నదిలో సత్యవతి గుండంలో కలిసి పోయిందని ప్రచారంలో ఉంది. గౌరి వెంట నాగేంద్రుడు ఉంచిన ఎద్దు బండగా మారింది. తర్వాత ప్రతి జంటకు బెటికొరియాడ్‌(నాగోబా సమక్షంలో కొత్త జంటలను కలపడం) తన సన్నిధిలోనే జరగాలని చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెబుతుంటారు. కాలక్రమేణా అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన పుట్ట వద్ద నాగోబా దేవాలయం వెలిసింది. ప్రతి ఏటా పుష్య అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గోండుల ప్రగాఢ విశ్వాసం. 'ప్రజాదర్బార్‌' నాగోబా జాతర సందర్భంగా జిల్లా యంత్రాంగం కెస్లాపూర్‌ తరలచ్చి గిరిజనం సమస్యల పరిష్కారానికి దర్బార్‌ నిర్వహిస్తున్నా వారికి ఏమాత్రమూ ఉపయోగపడడం లేదు. గిరిజన జీవితాలను అధ్యయనం చేసి వీరి కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు హెమన్‌డార్ఫ్‌. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా దర్బార్‌లు జరుగుతూనే ఉన్నాయి. గిరిజన తండాల్లో సమస్యలు సమస్యలుగానే దర్శనమిస్తున్నాయి. ప్రజాదర్బార్‌లో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయని కేవలం ప్రచారానికే పరిమితమైంది. నేటి కంప్యూటర్‌ యుగంలో కూడా తండాల్లో గిరిజనులకు పూరి గుడిసె అద్దాల బంగ్లా. చెలిమె నీరే ఫిల్టర్‌ వాటర్‌. రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలను మొదలుకొని అడవుల్లో వరకు గల గ్రామాలకు ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులు(కరెంట్‌) ప్రసరించడం లేదంటే అతిశయోక్తి కాదు. 1999-2000 సంవత్సరంలో అతిసారతో రెండువేలకుపైగా గిరిజనులు మృతి చెందారు. ప్రతి ఏడాది మలేరియా, విషజ్వరాలు సోకి నేటికీ గిరిజనులు పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు. అక్కడక్కడా వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసినా అవి అలంకారప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. నేటికీ గిరిజనులకు రక్షిత మంచినీరు మాత్రం దరిచేరలేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వచ్చిన తెలంగాణ ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయా అని ఆదిలాబాద్‌ గిరిజనులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను కొత్త కొలమానాలతో, కొత్త దృష్టికోణంతో, స్థిరీకృత పద్ధతులను తృణీకరించిన రాసిన వ్యాసాలున్నాయి. ఇందులో భాగంగానే పాల్కురికి సోమనాథుడిని తొలి తెలుగు కవిగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల లింగారెడ్డి సూత్రీకరించారు. నన్నయను ఆదికవి తెలంగాణ సాహిత్య చరిత్ర స్థిరీకరించి పెట్టింది. ఈ స్థితిలో అనువాదం మాత్రమే చేసిన నన్నయ ఆది కవి కాలేడని, సొంత వస్తువు తీసుకుని రాసిన పాల్కురి సోమనాథుడు ఆదికవి అవుతాడని వారు వాదించారు. - కాసుల ప్రతాపరెడ్డి రచయిత సెల్‌ : 9848956375

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uDD47X

Posted by Katta

Pusyami Sagar కవిత

చీకటి జ్ఞాపకం _________పుష్యమి సాగర్ చీకటిని చీల్చాలని కొన్ని మిణుగురులేవో సంగీతాన్ని మోస్తూ గాలిలో వాయులీనం గా గానాలు .. నా ఆలోచనలో కలిసిపోతు సిమ్మట పురుగు లు ట్యూబ్ లైట్ కాంతి లో పరావర్తనం చెందుతూ ...ఆత్మ హత్య చేసుకుంటాయి ...!!! దూరము గా ఎక్కడో సిలోన్ రేడియో నుంచి పాటలు నేను నా మనసు పయనిస్తూనే ఉంటాం.... ఆకాశం లో మేఘం లా..!!! గాలికి కొట్టుకొచ్చిన గతమేదో ..వీపు చరిచి రెండు చుక్కలను చెంపల నుంచి జారి పరుగు తీసింది గుండెలోకి ..!!! ఇప్పుడు మాటలు మౌన ముద్ర దాల్చి తపస్సు చేసుకుంటాయి ...!!! నిశ్చలమైన సరస్సులా..... ఎన్ని జ్ఞాపకాలు నా కళ్ళ నుంచి జారి పడిపోలేదు .. ఎన్నని లెక్కపెట్టేది అనుభవాల కొస అంచున జీవితాన్ని ఉరి తీసినపుడు ... శరీరం ...ఆత్మ మాత్రం ఎందుకు కలిసి ఉండాలి ...? రెండు విడిపోవటం కోసం ఒక్కటి గా ఎదురు చూస్తున్నాను ...!!! జూన్ 8, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TugO3d

Posted by Katta

Bhaskar Palamuru కవిత

ప్రక్రుతి ప్రకోపం..సర్కార్ శాపం! ------------------------------- నీకు ఏమైతేనేం వాళ్ళ మానాన వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అదే పది వేలు రేయనక పగలనక నువ్వు మట్టిలోనే కలిసిపోతే కాసిన్ని మెతుకుల కోసం నీవు నేలరాలి పోతే వాళ్ళకు ఎందుకు వాళ్ళు బాగుంటే చాలు రోజుకో మాట ..పూటకో అబద్దం తమ పదవులు తమకుంటే చాలు నువ్వు ఏమై పోతేనేం అప్పుడే కుర్చీల కోసం కొట్లాట నీకు యేపదవి నాకు ఏ పదవి భూమిని భుజానికి ఎత్తుకుని గుండెల్లో దుఖాన్ని బిగపట్టుకుని నీవు కన్నీళ్ళతో సాగుతూ ఉంటే వాళ్ళు మాత్రం హామీల వర్షాన్ని కురిపిస్తారు మాయ మాటలతో మేస్మరైస్ చేసేస్తారు ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణా ఇందుకేనా మనం కడుపు కాలి అప్పులు తీర్చలేక రాలిపోతూ ఉంటే వాళ్ళు మాత్రం సొల్లు కబుర్లతో సద్ది కథలతో పొద్దు గడుపుతూ అరచేతుల్లో స్వర్గం చూపిస్తూ గారడీ చేస్తూ .. పిట్టల దొరల్లా వేషాలతో వెకిలితనంతో తెలంగాణా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు ఇక చాలించండి ..మీ సాయం మాకొద్దు మమ్మల్ని మనుషులుగా చూడండి చాలు !!

by Bhaskar Palamurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kVZfi1

Posted by Katta

Jagadish Yamijala కవిత

1 సిగ్గులో పడ్డ సూరీడు --------------------------- నీ ముక్క పుడక కాంతిలో దాటుకొచ్చాను ఆ రాత్రిని.... ఒకే సమయంలో విజయంలో సిగ్గుపడి పరాజయంలో సంతోషించి ఆ కదనరంగంలో నువ్వు రాజకుమారివయ్యావు దారంతా విస్తరించిన నీ సిగ్గులో జారి పడ్డాడు సూర్యుడు -------------------------------- 2 అంతా మీ చేతుల్లో ఉంది ------------------------------ సున్నితంగా నన్ను తీసుకోండి నేను మామూలు పుస్తకాన్ని కాను ధ్వంసం చేసిన అడవుల నుంచి శరణు కోసం వెతుకుతూ టపటపా కొట్టుకుంటున్న కాగితపు పక్షిని నన్ను పదిలంగా చూసుకోవడం మీ చేతుల్లో ఉంది ---------------------------- తమిళంలో కవి పళనిభారతి అనుసృజన - యామిజాల జగదీశ్ రెండవ వచన కవితలో నేను కొద్ది మార్పు చేసాను 8.6.2014 ----------------------------

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q9XZwT

Posted by Katta

Sky Baaba కవిత

పహ్‌లా గులాబ్ హీ పహ్‌లా కాంటా! ```````````````````````````````````` సైకిలేసుకొని టౌనంతా చక్కర్లు కొట్టేది నూనూగు మీసపు నా తొలి యవ్వనం కాలేజీ బెల్లవ్వగానే రోడ్డంతా గులాబీలు చూపుల దారం చాలేది కాదు... బెదురు బెదురుగా పారిపోయే ఒక కల- కాంచనమాల అలలు అలలుగా ఉబికే సెలయేటి పాట- లెనీనా పెంగ్విన్‌ పక్షిలా కదిలిపోయే ఒక జరీనా బేగం ఎన్ని జంటల కనుపాపల్లో కాపేసే వాళ్లమో...! *** నువ్వు తారసపడ్డ తొలిరోజు నీ కళ్లుండే చోట రెండు సుందర ప్రపంచాలు దొరికాయి నాకు ... ముఖం కేంద్రంగా నీ దేహం ఒక సౌర కుటుంబంలా తోచేది ... గల్లీ చివర నువ్వు - వెనుదిరిగి చూసిన రోజు మనసు మానస సరోవరమై మంచుఖండాల అంచులు దాటింది సంశయించీ.. సందేహించీ.. అధైర్యించీ.. చివరాఖరికీ నిన్ను పలకరించిన రోజు నీ నవ్వు నయాగరాలో తానమాడాను కనురెప్పకింద నా కలల పాపల్లే అల్లరి పెడుతుంటే పక్కమీద ఎంతగా దొర్లేవాడినో... తెల్లారి చూస్తే పైజమాపై రాత్రిలేని ఓ తెల్లపువ్వు ! *** కాలేజ్ రోడ్లోకి మళ్లగానే నీ కళ్లల్లో నేనో మెరుపు మొగ్గనై... కళ్ల పడగానే లయ విరిగే నా గుండెల్లో పెరిగిన శ్వాసవై... ఎన్ని కాంతి సంవత్సరాల్ని ఈదాకో పూదోట సుబూత్ గా నేనందుకున్న తొలి గులాబీ సాయంత్రం మన మధ్య ఓ నాలుగు పాలపుంతలు దొర్లిపోయాయో లేదో నా పేరు విడమర్చగానే సూర్య నక్షత్రం చప్పున ఆరిపోయి నా నిషానూ మెరుపునీ స్వప్నదరహాసాల్నీ బ్లాక్‌హోల్ లా లాక్కుని వెళ్లిపోయిన నీ చివరి చూపుకి ఛిద్రమై S..K...Y..O..U..S..U..F...B..A..B..A..

by Sky Baabafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfx9mG

Posted by Katta

Satya Gopi కవిత

నిద్ర /సత్య గోపి/ కనురెప్పల తలుపులు మూసి చీకటి తాళం వేసి అలా తాత్కాలిక మరణంలోకి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెడతాను... ఇక్కడ నాకు వెలుగుతో పనిలేదు..! నాకు నచ్చిన వ్యాపకాన్ని మదిలో మెదిలిన రూపకాన్ని నా రాజ్యాన్ని నేనే సృస్టించే నా సామ్రాజ్యాన్ని నేనే శాసించే ప్రదేశం అదొక్కటే... కనుల ముందున్న నల్లటి తెరపై వేలి కుంచెతో అందమైన రూపాన్ని గీస్తాను.. చిరునవ్వుతున్న నన్ను గీస్తాను... సిగ్గుగా కొంటెగా గంభీరంగా వెకిలిగా ఎన్నో గీస్తాను... దానికి కళ మారుపేరు...! చీకటి అలానే ఉంటుంది... నడుస్తూ...నడుస్తూ... చుట్టూ పచ్చని చెట్లు కొమ్మల్లో దాగున్న పక్షులు నిర్మానుష్యమైన దారులు సెలయేటి శబ్దాలు ఇదే నా ప్రపంచం... మరో మనిషి లేకుండడమే నా ప్రపంచం... వొంటరిగా నడవడం... విహంగాల్లా వొళ్ళు విరుచుకోవడం... దీనికి కల మారుపేరు... ఆ ప్రపంచంలోనే ఊహిస్తాను నగ్నంగా మబ్బులపై పడుకున్నట్టుగా నల్లటి ఆకాశాన్ని కప్పుకున్నట్టుగా నక్షత్రాలని కనులలో నింపుకున్నట్టుగా నిశిథీనే జయించినట్టుగా ఇంకా ఎన్నో ఎన్నేన్నో... అన్నిటికి నిద్ర నిజరూపం..! అందులోనే నా నిజజీవితం..! ఇప్పుడున్నది స్వాప్నికజీవితం...! 08-06-2014

by Satya Gopifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfx6XR

Posted by Katta

Dabbikar Roop Kumar కవిత

డా. రూప్ కుమార్ డబ్బీకార్ // శిశిర వనంలో ... ఎదురు చూసిన పలకరింపుల జాడ లేదు ఎల్లలు దాటి శిశిరం రానే వచ్చేసింది ఇల్లు ఒంటరితనం గడ్డిపరకలు మృత్యువు ఒడిలోకి చేరే సన్నివేశం చేరువైంది నాలో -- వర్షం మాత్రం కురవడం మానలేదు ! ***** తడి ఆరిన జ్ఞాపకాలు మనల్ని మరచినపుడు పలుచబడే జుట్టును గుర్తు చేయకు మరచిపోయిన వాటిని నేను లెక్క చేయను విషాదమేమిటంటే నీవు జీవితాన్నే మరిచావు !

by Dabbikar Roop Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mrh1LA

Posted by Katta

Viswanath Goud కవిత

నేను-మా అమ్మ|విశ్వనాథ్| రేపటికల్లా నేనిచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేయలేదో గద్ధించాడు మాస్టారు ఆ గంభీరమైన కంఠానికి జడివానకు తడిసిన వానిలా గజగజ వణికిపోతూ గధ్గద స్వరంతో అలాగే మాస్టారు అంటు ఇంటికి వెళ్ళగానే అమ్మతో.... అమ్మ నేను ఏం చేయకపోయినా మా మాస్టారు నన్ను కొడతానంటున్నారమ్మా అంటూ రెండు కన్నీటి బొట్లు రాలుస్తూ ఓ చాడింపు రాయి మాస్టారు మీద విసిరేసాను.... అది సరాసరి వెళ్ళి అమ్మ గుండెకు తగిలింది... అమ్మ విలవిల్లాడిపోతు భాదతో ఏం చేయకపోతే ఎందుకు కొడతారు రా.... సరే నువ్వెళ్ళి పడుకో... రేపు నేనొచ్చి మాట్లాడతా అని నన్ను అమ్మ పడోకొబెట్టింది.... ఉదయం ఇంకా పూర్తిగా తెలవారి సూర్యుడింకా రాకముందే అమ్మ ఇంట్లో ఓ దీపం వెలిగించి అన్ని పనులు ప్రతిరోజు కంటే ముందే ఆ రోజు చక్కబెట్టేసుకుని నన్ను బడికి వెంటబెట్టుకుని వెళ్ళింది. వెళ్ళి వెళ్ళగానే మా మాస్టారు మీద పిడుగులా పడింది. అపుడు మాస్టారు ముఖం పిడుగు ధాటికి మాడిపోయిన చెట్టు కొమ్మలా అయింది.. మాస్టారు నెమ్మదిగా తేరుకుని ఏమయిందమ్మా ఎందుకలా ఆవేశంతో గాలివానకు పొంగిన తుంగలా పరవళ్ళ చిందులు తొక్కుతున్నారు అన్నాడు... అపుడు అమ్మ ఎందుకు మా వాడు ఏం చేయకపోయినా కొడతానంటున్నావంట అంటూ నిలదీసింది... మాస్టారు ముక్కున వేలేసుకుంటూ., ఓరి....బడవా...ఎంత తెలివి మీరి పోయావురా... అంటూ నేను వాడు ఏం చేయకపోతే కొడతానన్నానో అడగండి అంటు అమ్మను అన్నాడు.. అమ్మ అడిగేసరికి నా ముఖం ఆంజనేయుడు మింగిన పండుసూరీడిలా ఎర్రబడిపోయింది... అది కాదమ్మ మాస్టారు రేపు నేనిచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేయకపోయావో నీకు దెబ్బలు పడతాయి అని అన్నారని అసలు విషయం కలుగులోంచి బయటకొచ్చిన ఎలుకపిల్లలాగా బయటపెట్టాను..! కాల ప్రయాణంలో కొన్ని సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి తిరిగి మళ్ళీ అదే లాంటి కర్కశమైన స్వరంతో మా బాస్ గద్దింపు... రేపటిలోగా అకౌంట్స్ మొత్తం పూర్తి చేసి నా టేబుల్ మీద పెట్టక పోయావో నీ ఉద్యోగం ఊస్టింగే అంటూ.... నాడు అమ్మ నన్ను వెనకేసుకొచ్చింది మరి నేడు ఏ అమ్మకు ఏమని చాడీ చెప్పను ...ఎలా చెప్పను... నేనేమో భూమ్మీద...అమ్మెక్కడో పైన ఆ స్వర్గంలో.! 08జూన్14

by Viswanath Goudfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ht4f2O

Posted by Katta

Santosh Kumar K కవిత

||ఓ వరం.. నాస్తికత్వం|| శీర్షిక : దేవుడు అనేవాడు అస్సలు ఉన్నాడా?? దేవాలయాలు దేవుణ్ణి చేరుకోటానికి మార్గాలా?? దేవుని నమ్మని వాడు దెయ్యాన్ని నమ్ముతాడా?? ఈ ప్రశ్నల సుడుగుండంలో నాలోని ఆలోచనలకి రూపం నేను రాసిన "ఓ వరం.. నాస్తికత్వం" తెల్లారేసరికి గోల పెట్టే సుప్రభాతాలు, అక్కడక్కడ అర్ధమయ్యే అష్టోత్తరాలు, చెప్పిందే చెప్పి విసిగించే సహస్రనామాలు, అవేవి నేను చదవను.. నాకు అనవసరం.. నా కులమేంటో కనుక్కోవాలా?? నా మతంమేంటో మీకు చెప్పాలా?? వినండైతే నేను గోల చేయని మనిషిని, విలువలను అర్ధంచేసుకున్న మానవతావాదిని, మంచిని చెప్పి,చేయాలనుకునే సంఘసంస్కర్తని, ఏంటీ.. ఇలా చెబితే ఒప్పుకోరా? బహుశా అందుకేనేమో ఈ భక్తమహాశయులందరి దృష్టిలో నేనొక మతమెరుగని మూర్ఖున్ని, నేనొక కులమెరుగని కురూపిని, నేను నమ్మని వాడిని నమ్మిన వాళ్ళందరితో దూషింపబడే దోషిని... మరేంచేయను.. నాస్తికుణ్ణి నేను.. ఇలాంటి పిచ్చివాళ్ళని పట్టించుకొని ఇంకొక పిచ్చి వాడిని కాలేను!! #1# జనమంతా మంచోల్లే... పాపమెరుగని పుణ్యాత్ములే... ఎందుకంటే... దండాలు పెట్టేవారే ధరణికోటంతా, కోరికలు కోరేవారైతే కోకొల్లలంట, నేతి కారే వంటలే నైవేద్యాలంట, వండిన ప్రసాదాలన్నీ పైనోడికేనంట, ఆరగించిన స్వామి చల్లగా చుస్తాడంట, పాపాలన్నీ పటాపంచలు కావిస్తాడంట, పూజలూ పునఃస్కారాలు పుణ్యానికంట, ప్రదిక్షణకి తప్పులన్నీ పటాపంచలంట, లెంపలేసుకుంటే చాలు పైనోడు కరిగిపోతాడంట, నీళ్ళని, పాలని నేలపాలు చేస్తారంట, వృధా ఏమాత్రం కాదది అభిషేకం అంట, కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారంట, దేవునితో చుట్టరికం ఇలా చవకగా కలపొచ్చంట, ఏంటో భాలేగుంటాయి వింటుంటే ఇలాంటివంతా, మరేంచేయను.. నాస్తికుణ్ణి నేను.. ఇలాంటి విచిత్రాలన్నీ చూసి నవ్వుకుంటాను!! #2# అయినా నాకర్ధంకాదు నాస్తికత్వానికి చోటెక్కడుంది.. అమ్మని నమ్మని మనిషి ఉండడుగా..!! లేదులే అమ్మానాన్నల అవసరం స్వీయ సంపాదన మొదలైనంతవరకే.. ఆ తర్వాత ఆ ముసలి వాళ్లతో పనేముంది, వృద్ధాప్యంలో ఎందుకూ పనికిరారు, వృద్ధాశ్రమంలో వదిలేస్తే సరిపోతుందిలే, అయినా అలా చేయటం పాపం కాదు, కోట్లను ఖర్చు పెట్టి కుంభాభిషేకం చేయిస్తే కోటి తప్పులని చేసినా క్షమార్హులమే!! కానీ నేను వాళ్ళిద్దరని అలా వదిలేయలేను ఏం చేయను.. పూజలు చేయని నాస్తికుణ్ణి నేను పాపం చుట్టుకుంటుందేమోననే భయంతో బ్రతకలేను!! #3# ముక్కుసూటిగా చెప్తాను కొన్ని స్వీకిరించే కర్మను మీకు ఒదిలేస్తూ.. దేవునికి నేనంటేనే ఇష్టం కులమెరుగని నాస్తి(కులం) నాది, అందుకే నేను ఎన్నంటున్నా నన్నేమీ అనడు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం బద్దకమెరుగని బాధ్యతగల పౌరుడుని, భక్తితో భుక్తిని సంపాదించాలనుకునే సోమరిని కాదు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం కానుకలివ్వను.. కోరికలు కోరను, కుదిరితే సాయపడతాను.. చేయూతనిచ్చి చేయందిస్తాను మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం కాయాకష్టం మీద బ్రతికేవాడిని, కాషాయం వేసి కాసులు దండుకునే వాడిని కాదు మరి!! దేవునికి నేనంటేనే ఇష్టం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటాను, భజనలు చేస్తూ బూటకపు బాగోతాలు నడపను మరి!! ఏం చేయను.. నిజాలు నమ్మే నాస్తికుణ్ణి దేవునికి దాసోహం అంటూ కపట భక్తిని చూపలేను#4# ఇంకా చెప్పాలంటే.. దేవుడు మనల్ని ముందుకి నడిపించే ఒక నమ్మకం అంతేగాని అతీత శక్తుల అద్భుతం కాదు!! 'దైవ చింతన' అంటే గోపురాలలో కాపురం కాదు సమాజ శ్రేయస్సుకి చేయూతనిచ్చి, పేదవానికి పిడికెడైనా దానమివ్వటం!! మంత్రాలు చదివితే మరకలు మానవు, ఉపవాసాలు చేస్తే రోగాలు నయంకావు, హారతులిస్తే చేసిన పాపాలు హరించవు, మంచిని పెంచుకుంటే స్వర్గం నీతోనే సంకల్పంతో శ్రమిస్తే సుఖాలు నీవైపే నీలోని అహమే చెడు.. నీలోని ఆలోచనే మంచి.. అందుకే నన్ను నేను ఎప్పుడూ మోసంచేసుకోను!! నా మీద నాకు నమ్మకం నలుగురిని ఆదుకోగలనని, నా మీద నాకు ధైర్యం కష్టాలలో ఎదురీదగలనని, నా మీద నాకు గౌరవం నా కాళ్ళమీద నిలబడగలనని, నాకేమీ తప్పు అనిపించటం లేదు.. అందుకే నా లెక్కలో ఓ వరం.. నాస్తికత్వం!! #5# #సంతోషహేలి 08JUN14

by Santosh Kumar Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mr3X95

Posted by Katta

Pulipati Guruswamy కవిత

దేవులాటకు గుండె అదుపు తప్పి కుంటుతుంది // డా.పులిపాటి గురుస్వామి // సందెన పడంది తాడో, బతుకు బాటో దీపంతకు కూడా ఆవేశం రాదనుకోవటం తప్పైంది కొట్లాట దార్లో పడ్డాక కారణాలు నవ్వుకుంటాయి ఏమిచ్చెనో...ఏంతీసుకునెనో ఇచ్చినోడి నుండి తీసుకుంటోడు తీసుకోకముందే నడిమింతల చెయిపెట్టి నాకేసినోడు అదృష్టాన్ని తడుపుకుంటూ గొళ్ళెం తీసుకుంటడు పుణ్యానికి బలవ్వటమూ అప్పుడప్పుడు కుదురుతుంది శుభకార్యాలను ఇష్టపడ్డ పిశాచాలకు అభిమానులు మర్యాద చేతురు కాలం తిరిగినంత మాత్రాన కసాయుతనం బొబ్బలింకా మానలేదు ఇషమైన తలకాయకు ఇష్టమైన తలపులు పూస్తాయని ఎవరంటారు పాడైన కోరికలు నిండుగా పంచడానికి తయ్యారట ఓర్నాయనో...! సప్పుడు కాకుండ వుంటె కప్పల బుసబుస కూడా వినొచ్చు శానిగ ..... 8-6-2014

by Pulipati Guruswamyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1icvxFK

Posted by Katta

Kavi Yakoob కవిత

Today at 12.30pm~ 10TV లో మోహన్ రుషి' జీరో డిగ్రీ' పుస్తక పరిచయం!

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p8mAoB

Posted by Katta

Amma Akhil కవిత

!! నిజాలు !! నిజాలు మాట్లాడితే వినడం కష్టం ఎందుకంటే మన చెవులలో విషం పోసినట్లుగా ఉంటుంది కనుక... నిజాలను పట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే అవి నిప్పులలాంటివి మన చేతులు కాలుతాయి కనుక ... నిజాలను మనం దగ్గరగా చూడడం మరీ కష్టం ఎందుకంటే అవి అగ్ని పర్వతపు లావా సెగల కంటే భయంకరంగా మండుతాయి కనుక... నిజాలతో పాటు బ్రతకడం ఇంకా కష్టం ఎందుకంటే అబద్దపు బ్రతుకు అందరికీ వ్యసనమైంది కనుక... అమ్మ అఖిల్ !! 08jun14.

by Amma Akhilfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k83iYE

Posted by Katta

Jyothirmayi Malla కవిత

వృధా ప్రయాస ||జ్యోతిర్మయి మళ్ళ|| నీనుండి వేరుగా.. నిన్నొదిలి దూరంగా.. పారిపోవాలనుకున్నానా అనుకోవడమేంటి పారిపోయానా నువ్వూ వద్దనలేదు..నీకసలు భయం ఉంటేగా లంగరు విప్పని పడవ ఎంతనడిపినా అక్కడే ఉంటుందని నీకు తెలుసు తెలియంది నాకే ఇక్కడ మనసుని మళ్ళించే ధ్యాస పొరలను కడిగే ప్రయాస నిబ్బరంగా నిశ్చయంగా చేసిన పనే అయాక తొంగి చూసానా పొరలు పెరిగాయి పాతవీ ఉన్నాయి..కొత్తవెన్నో పుట్టుకొచ్చాయి ఉతికి ఆరేసిన నారచీరల్లా రెపరెపలాడుతున్నాయి అన్నిటా నీ ముఖచిత్రాలే..అద్దకాలేసినట్టు తెగ ముద్దొస్తున్నాయి ఒక్కదాన్లోనయినా నవ్వకుండా ఉన్నావా ప్రయాస వృధా అయినందుకు భంగపాటో బాధో నాకుంటాయిగా ఊరడించాల్సింది పోయి ఉడికిస్తూ చూస్తావా

by Jyothirmayi Mallafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oxrrhb

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ధ్యానం మెత్తని పూల మత్తడి దూకిన నీ వాసనల చెలిమిగంధాలు పూసుకున్న గాలినోట కలుపుగోలు పులకింతలరాగాల పాట వెన్నెలో, ఎండలో, కాల్చేసే వడగాళ్ళో, వేల్చుతున్న మలయానిలమో కంటిచూపు పిలుపో, ముందు నడక ఇషారో కొండవాగు ఒడ్డున నేను ఒంటరిగా ఏకాంతంగా కాదు కొద్దిగా దోసిట్లోకి ఇన్ని జ్ఞాపకాలని ఎత్తుకోగానే నిన్ను అభిషేకిస్తున్నాయి నా కన్నీళ్లు కొంచెంసేపు ఎదురు చూపులకే నీ ముందర కొలనవుతుంది దేహం నీవు కాసేపు, నేను కాసేపు ఈదులాడుతాం ఇంకా ఈ బతుకుసింగిడిని రంగులమయం చేయాలని కలలన్నింటిని పరిచి వాదులాడుతాం ఎక్కడెక్కడికో కొట్టుకుపోతాం, మళ్ళీ రెండుచేతుల దరులకు చేరిపోతాం నేనెప్పటికీ సగమే, నువ్వూ అంతేనేమో ఇద్దరం మన జీవితానంతరం ఒక్కటి కాగలమేమో కాలం వనవాటికలో ఆత్మీయాశ్రమంలో అద్వైతానంద సమాధి సిద్ధ సమావేశం నీ రూపకాలను నువ్వు, నా దాపరికాలను నేను వొదిలేసి వొద్దాం రా రా మన సమయం వొచ్చింది ఇపుడే వసంతం ప్రవేశించింది కోకిలవు, పాటవూ నువ్వే నేను నీ పెదవుల జంటను

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mqD4C0

Posted by Katta

Rajeswararao Konda కవిత

ఆ "చిరు"నవ్వే- నా చిరునామా...! /08.06.14/ @ రాజేష్ @

by Rajeswararao Kondafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1cPcc

Posted by Katta

Indira Bhyri కవిత

ఇందిర నిన్ను కొంచెం బాధపెట్టినందుకే భూమ్మీద పడగానే ఏడ్చాను ! జీవితాంతం నువ్వనుభవించిన బాధల్ని తలచుకుని నీ (ఈ) నిష్క్రమణవేళ నేడెంత ఏడ్వాలి నేను 8/6/14

by Indira Bhyrifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mqfgyd

Posted by Katta

Maddali Srinivas కవిత

వజ్రాయుధం//శ్రీనివాస్//08/06/2014 ------------------------------------------------ యెన్నో యేళ్ళు పోరాడి పగులగొట్టిన రాత్రి గోడ నుండి ఉదయిస్తున్న లేత సూరీడిని ఖద్దరేసుకున్న రాహువొకడు కబళిస్తున్నాడు మళ్ళీ ముసురుకుంటున్న చీకటిని చూసి గుండె పగిలిన మూగ జీవులు విగత జీవులై నేలకొరిగారు బేలగా మారిన సూరీడి కంటి నుండి జారిన రక్తాస్రువులు అగ్ని కీలలై నేలంతా కొన్ని దిష్టి బొమ్మల్ని సింబాలిక్ గా తగలబెట్టాయి రాహువు పట్టు వదలక పోతే వజ్రాయుధమై వేటేయటానికి దధీచి వారసుల వెన్నెముకలు నిటారుగా నిలబడ్డాయి

by Maddali Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOuBfk

Posted by Katta

Maddali Srinivas కవిత

వజ్రాయుధం//శ్రీనివాస్//08/06/2014 ------------------------------------------------ యెన్నో యేళ్ళు పోరాడి పగులగొట్టిన రాత్రి గోడ నుండి ఉదయిస్తున్న లేత సూరీడిని ఖద్దరేసుకున్న రాహువొకడు కబళిస్తున్నాడు మళ్ళీ ముసురుకుంటున్న చీకటిని చూసి గుండె పగిలిన మూగ జీవులు విగత జీవులై నేలకొరిగారు బేలగా మారిన సూరీడి కంటి నుండి జారిన రక్తాస్రువులు అగ్ని కీలలై నేలంతా కొన్ని దిష్టి బొమ్మల్ని సింబాలిక్ గా తగలబెట్టాయి రాహువు పట్టు వదలక పోతే వజ్రాయుధమై వేటేయటానికి దధీచి వారసుల వెన్నెముకలు నిటారుగా నిలబడ్డాయి

by Maddali Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOuyAd

Posted by Katta

Srikanth Kantekar కవిత

దశకంఠుడి చెరలో నువ్ ఓ సీతా.. ఓ సాథ్వీ దుఃఖ అ'శోక' వనంలో నువ్వు ఓ తామసి.. ఓ తపస్విని.. విముక్తినివ్వలేని దుఃఖగీతాన్ని నేను రాతిని పడతిగా మార్చలేని రాముడిని నేను ఈ ధర్మధరిత్రిపై ఓ అబల ఆక్రందనకు వలువలు ఇచ్చి విలువ కాపాడలేని శ్రీ కృష్ణుడిని నేను ఓ అరుంధతి.. ఓ విషాదస్మృతి! రాముడు రాడు! రాక్షస రాజ్యం కూలదు ఏ కమల వానరమూ తన తోకను అంటించి.. ఈ కామాంధుల లంకను దహించదు ఓ సత్యభామా, రుద్రమా కత్తికొక కండగా నరికేయ్ ఈ ఉన్మాదులను నా హృదయాన్ని,అక్షరాన్ని నీకు కరవాలంగా బహుకరిస్తాను - శ్రీకాంత్ కాంటేకర్

by Srikanth Kantekarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNWap0

Posted by Katta

Jaya Reddy Boda కవిత

//జయ రెడ్డి బోడ // ఉనికి // అమ్మా నాన్నను.. అనుకరించి పెద్దరికపు అభినయంతో స్వచ్చంగా సాగిన ఆ పసితనం అరమరికలు లేని పిచ్చుక గూల్లై ఆ ఇసుక తిన్నెల్లో ... కాలపు అలల తాకిడికి, భాస్వరంలా కరిగిన బాల్యం... ఇక ఇప్పటి యవ్వనమంతా తెరలపై నటనంలో తమను తాము మేకప్పుల్లో చూసుకొని, చాటింగుల్లో చలనం లేకుండా చలన చిత్రాల్లో లీనమయి స్వంత సామర్థ్యాన్ని కోల్పోయి ,,, యవ్వనులు అలా కాలం గడుపుతుండగా .. ఇక మధ్య రకం బ్రతుకులో తృప్తి లేని మనిషి,, ఓ ధనికుడు తానూ తినకుండా వేరొకరికి పెట్టకుండా దాచుకున్న ధనరాసుల్ని చూసి, కాస్త ఈర్ష్య పడుతూ ఇంకాస్త భాద పడుతూ .... టీ కొట్టు లో బాలున్ని బెదిరిస్తూ,, బారు లో బీరు త్రాగుచు బాయ్ ని భూతులు తిడుతూ అప్పు తెచ్చిన సొమ్ము టిప్పులు వేస్తూ, ప్రగల్భాలు పలుకుతూ తన ఉనికిని చాటుకుంటూ..శ్రమను మరచి ఓ అభాగ్యుడు నేనేమో వెలుతురే లేని చీకటి రాత్రిళ్ళు, పోగుట్టుకున్న విలువైన కాలాన్ని వెదుక్కుంటూ తలలోని నరాలను గోలపెట్టించి,ఎప్పుడో తోడుకొని దాచుకున్న కొన్ని జ్ఞాపకాలను తవ్వి తీసి తీపి భావాలుగా మలిచి అక్కడ కవుల రసమయ అంగళ్ళలో కుప్పగా పోసి ఆశగా ఎదిరి చూస్తాను ఏదో ఒక ఓదార్పు వాఖ్య కోసం జారిపోయే అక్షర పూలను ఏరుకుంటూ పదాలుగా పేర్చి దోసిళ్ళలో పట్టుకొని ఓ అనామక దశ నుండి నిలదొక్కుకొని, మళ్లీ కవిత్వ రంగు పులుముకొని వచ్చే పోయే కవి మహా రాజుల మెప్పు కోసం నిరీక్షణ చేసి ఏదో ఒక పెద్దరికపు ఓదార్పు పొంది పట్టుదొరకని అక్షర మాలిగ లోంచి తొంగి చూస్తూ, నన్ను నేను కర్ణ పాత్రగా పోషించుకుంటూ నాలోని నన్ను మీ ముందు పరుచుకుంటూ... నా సజీవత్వాన్ని కాపాడుకుంటూ ఇక మానసిక తృప్తే లేని అభాగ్యులెందరో ఒకరు కుటిల రాజకీయ చాణుక్యులు అయి,ఇంకొకరు తమ డబ్బు దర్పం కౌటిల్యం ప్రదర్శించి, మరొకరు కాగితాలపై తమ హోదాను ఘింకారంగా చూపించి జ్ఞ్యానులు ఎందరో తమ చిట్ట చివరి లక్ష్యాన్ని మరచి.. ఘర్షణ పడి గగ్గోలు పెట్టి ..ఇంగితం కోల్పోయి నానా రకాల ఎరలు వేస్తూ.. ఏదో తమకే తెలియని తమలోని అహాన్ని సంతృప్తి పరుచుకుంటూ తమ ఉనికిని చాటుకుంటూ..ప్రసవించి విసర్జించే కాలపు ఘర్భంలో ఉనికిని కోల్పోతూ ... (08-06-2014)

by Jaya Reddy Bodafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Smbxtu

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• అస్పష్ట కలలు •• కలలో ద్రుశ్యంపై చెమట దేహంపై గాలి ముద్దు- రంగులు మింగి ఒక్తరి నలుపు తెలుపు ఐ కరిగీ- నిద్ర కలను పూరించదు హత్తుకుని- దాయదు మెలుకువ- సంధిగ్ధం నేమరేస్కోడం - వింత, రేపటి వెచ్చని నిద్రలో నిన్నటి తడి కల గూడు కట్టుకోదు-

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SmbwWq

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 36 . కొందరు జీవితకాలంలో గుర్తింపుకు నోచుకోరు. అయితేనేం, వాళ్ళకవిత్వం మాత్రం కాలాన్ని ధిక్కరించిమరీ ప్రజల నాలికలమీద నిలబడుతుంది. అటువంటి కవి / కవయిత్రి విల్టన్ ఆగ్న్యూ బారెట్. 20 వశతాబ్దపు తొలిదశకాల్లో చాలా పత్రికలలో కవితలు వచ్చినా, "Songs From the Journey" అన్న కవితా సంకలనం సుమారు వంద సంవత్సరాల తర్వాత తిరిగి అచ్చు వేయబడినా ఈ కవిగురించి ఏ పరిచయమూ ఇవ్వలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. మీరెన్ని ప్రేమకవితలన్నా రాయొచ్చు. అందులో కొన్నే మీ హృదయపులోతుల్లోంచి వస్తాయి. నిజమైన అనుభూతులోంచి వస్తాయి. వాటికి కొంత వైయక్తిక గుబాళింపు ఉంటుంది. అయితే కవితలో చెప్పినదంతా మీది కానక్కరలేదు. ఆ అనుభూతి మీరు by proxy నిజంగా అనుభవించగలిగితే, అంటే empathize చెయ్యగలిగితే, అది మీ స్వంత అనుభవం అవుతుంది. కవిత్వ పరమార్థం కూడ అదే. అందుకే మనం కవితతో మమేకమవగలిగిన ప్రతిసందర్భంలోనూ మనకి కవినచ్చుతాడు. కవిత నచ్చుతుంది. అనుభవపు తీవ్రతనుబట్టి మనకు కవిత చిరస్థాయిగా గుర్తుంటుంది కూడా. ఈ కవిత చాలా ఉదాత్తమైన వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇది ప్రేమ కథే. కానీ, తను ప్రేమించిన వ్యక్తిని తను పొందలేకపోయినా, ఆ వ్యక్తిపట్ల ప్రేమ ఈ కవితలోని వ్యక్తికి జీవితకాలం హృదయాంతరాళాల్లో పచ్చగా, పచ్చిగానే ఉంది. అంతే కాదు, తను ప్రేమించిన వ్యక్తి జీవితాన్ని గమనిస్తూనే ఉంది. బ్రతికున్నప్పుడు వ్యక్తులతో మన అనుబంధాలు ఎలా ఉన్నా, అవతలి వ్యక్తి భౌతికంగా దూరం అవగానే, మన ప్రవర్తనని మనసు నిజాయితీగా అంచనా వేస్తుంది. అంతవరకు మనల్ని మనం ఎన్ని రకాలుగా మభ్యపెట్టుకుందికి ప్రయత్నించినా, ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా మన చేతలు వాటి అసలు రంగుల్లో కనిపిస్తాయి. అందుకే " నేను ఇన్నాళ్ళూ నీపట్ల ఉదాసీనంగా ప్రవర్తించేను. నువ్వు వెళ్ళిపోయావన్న బాధ నాలో కోపం నంపింది," అన్న అసలు కారణం బయటకు వచ్చింది. అంతే కాదు, "నేను నీ పట్ల క్రూరంగా ప్రవర్తించేను, మిగతా ప్రపంచం నుండి కూడ అంతకుమించి నీకేం దొరకలేదు," అనగలగడంలో వ్యక్తిత్వపు ఉదాత్తత కనిపిస్తుంది. మనం ఉదాసీనంగా ఉన్న వ్యక్తికి ప్రపంచం విలువ గౌరవం ఇవ్వనపుడు సామాన్యంగా మనలో సంకుచితమైన భావాలే ఉదయిస్తాయి తప్ప, అవతలి వ్యక్తి పట్ల జాలి కలగదు. "అయ్యో ఆ వ్యక్తి దీనికి అర్హుడు కాడు," అనగలిగితే, మనం ఆ వ్యక్తిని మన రాగద్వేషాల కటకాల్లోంచి గాక, ఆ వ్యక్తి వ్యక్తిత్వంలోంచి చూడగలుగుతున్నట్టు లెఖ్ఖ. అది మన వ్యక్తిత్వపు ఔన్నత్యానికి గీటురాయి. "కలలన్నీ నలిగి మాడి మసైపోయినపుడు... అంత సౌకుమార్యమూ, స్నేహశీలతా, నిజాయితీ, అంత గుండెదిటవుతోనూ జీవించడం చాల కష్టం." అని ఎంతమంది భగ్నప్రేమికులు నిజాయితీగా అనగలరు? ఈ కవిత ముగింపులో మృత్యువుతో మళ్ళీ నిన్ను కలుసుకుంటానన్న భావాన్ని చెబుతూ, "నీలికళ్ళదానా!" అన్న సంబోధనలో ఉన్న ఆత్మీయత గమనించదగ్గది. . నువ్వుపోయావని విన్నాక . నువ్వుపోయావని విన్నాక నేను ఆశ్చర్యాన్ని ప్రకటించడం మినహా నోట మరోమాట రాలేదు: మనిద్దరం విడిపోయి చాలా కాలం అయిపోయింది, ఇన్నేళ్ళూ నీపట్ల చాలా ఉదాసీనంగా ప్రవర్తించేను. నువ్వు వెళ్ళిపోయావన్న బాధ నాలో క్రమంగా కోపం నింపింది. ఒకప్పుడు నువ్వు నాకిచ్చిన ఒక పువ్వు... అదే, నే పోగొట్టుకున్న పుస్తకంలో పదిలంగా దాచుకున్న గులాబి... దానిమీద పాట అల్లడానికి ప్రయత్నించేను... నేను నీ పట్ల క్రూరంగా ప్రవర్తించేను, మిగతా ప్రపంచం నుండి కూడ అంతకుమించి నీకేం దొరకలేదు, నాకు కోపం రావడానికి కారణం అదే. సరే, మనం ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు పోయినవాళ్ళని అభిమానిస్తారు, వాళ్ళకి కళంకం రాకుండా. వాళ్ళంటే చాలా అభిమానంగా ప్రవర్తించవచ్చు వాళ్ళు మనదగ్గరకి మరి రారుకదా అన్న తలపుతో. నాకూ నీ గురించి ఆలోచనలున్నాయి. నీ స్మృతిలో చెప్పుకుందికి జ్ఞాపకాలున్నాయి నువ్వు ఎంత అందంగా ఉండే దానివో, ఎంత అపురూపమైనదానివో చెప్పుకుని నీకై విలపిస్తాను. మనిద్దరం పిల్లలుగా ఉన్నప్పుడు ఇసుకతిన్నెలలో నాతో ఆడుకున్న నువ్వు, ఇంతకీ ఎక్కడ ఉన్నావు? ఆడపిల్లవైనా, దృఢంగా, పొట్టిగా ఉన్న నీ ఆకారమూ చేతిలోచెయ్యివేసినపుడు బిగువైన నీ పట్టూ నిజాయితీ తొణికే నీ కళ్ళూ, నీ చిన్ని నుదురు ముంగిట సన్నగా తేలియాడే లేత గోధుమరంగు ముంగురులూ ...నాకు గుర్తే. నాకింకా గుర్తే, కడలినురుగులో తడిసివస్తూ నువ్వు బంతిపట్టుకోడం మొరటుకుర్రాడ్ని పట్టుకున్నట్టు. నాకు తెలుసు మృత్యువు నిను తనగుప్పెట్లో పెట్టుకుంది. బహుశా, నువ్వు చనిపోయినందుకు సంతోషించే ఉంటావేమో కూడా, ఒంటరిగా, దుఃఖంతో బయటికి వెళ్ళి కలలన్నీ నలిగి మాడి మసైపోయినపుడు... అంత సౌకుమార్యమూ, స్నేహశీలతా, నిజాయితీ, అంత గుండెదిటవుతోనూ జీవించడం చాల కష్టం. మృత్యువు నిన్నుకబళించడానికి కుట్రపన్నకపోతే నువ్వు అన్నీ మరిచిపోయేదాని వేమో! మనుషుల్లా గే ఆత్మలన్నీ …. శాశ్వతంగా కేరింతలాడే వేడీ, వెలుగుల పురాతన సముద్ర తీరానికి వస్తే యువహృదయాలని గిలిగింతలు పెట్టగలిగిన ఓ నీలికళ్ళదానా! బహుశా, నువ్వు అక్కడ నాకు తారసపడతావేమో! . విల్టన్ ఏగ్నూ బారెట్ అమెరికను . When I Heard You Were Dead . When I heard you were dead, I had little more than a startled word to give; We had been too long apart, And all the years I had been cold to you. But the pity and pain of your leave-taking filled me with slow resentment. Once I would have cared to make a song About a flower you gave me— An old rose shut in a book that is lost. I was cruel to you, And you had nothing better from the rest of the world; That is what made me angry. Well, we can love the dead in our own way And not hurt them; We can be very tender, knowing well They will not come back to us. I have thoughts for you now, I have words of bereavement; I see how lovely and rare you were And cry out after you. Where are you now, whom I played with on the sands when we both were young? I remember your girl’s body stocky and strong, Your little hard hand-clasp, Your truthful eyes, Your corn-pale dancing hair Growing low on your small forehead. I remember you, wet from the surf, catching ball like a rough boy. I know death has you; That very likely you were glad to die, Going out lonely and in bitterness, With your dreams all crunched to black dust … Too strong for life, too honest, too friendly and too tender. I hope, if the grave has not conspired to hold you, You have forgotten about all that. I hope, if I could come to an old sea-beach white and sunny, Where spirits immortally human played, I would find you there, O gray eyes—the laughing comrade of boys! . Wilton Agnew Barrett American Poem Courtesy: http://ift.tt/1kMFLSY A Magazine of Verse. Volume X. No. 5. August, 1917 Ed.: Harriet Monroe, (1860–1936).

by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uzSZnM

Posted by Katta