పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

Abd Wahed కవిత



by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kiunfM

Posted by Katta

Srivalli Radhika T కవిత

http://ift.tt/1gHyMtL

by Srivalli Radhika T



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gHyMtL

Posted by Katta

Swarnalata Naidu కవిత

అందరికీ సాదర ఆహ్వానం _/\_ Swarnalata Naidu

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2ZkQv

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి జబ్బు నాకు నిజంగా సందేహం కలిగింది వాళ్ళని చూస్తుంటే జబ్బు చేసింది నాకా లేక వాళ్లకా అని చికిత్స అవసరం నాకా వాళ్లకా అని జబ్బు ఉన్న నేనేమో జీవిస్తున్నాను జబ్బు ఉన్నా లేనట్టు వాళ్ళు నటిస్తున్నారు ఆ జబ్బే సుఖమనుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళ మీద నాకు చాలా జాలి వేసింది వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళని రక్షించాలనిపించింది కానీ ఏం చేయను వాళ్ళేమో గోప్పోళ్లు నేనేమో పేదోడ్ని వాళ్ళు నన్ను తమ చూపులతోనే నన్ను గెంటేస్తుంటే తమ నవ్వులతోనే నన్ను చంపేస్తుంటే ఇక నా ఉనికి వాళ్ళకి అంటనంత దూరంగా వెళ్ళి పోయాను నేనిక్కడ సజీవుడ్ని వాళ్ళ సంగతేమో నాకు తెలియదు! 19May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lFO1R8

Posted by Katta

Pratapreddy Kasula కవిత

ఆమె, నేను, ఒక ఆటో - కాసుల ప్రతాపరెడ్డి ఎట్లా చెప్పేది నిందల్లో నా శీలాన్ని చెరిచినప్పుడు దేహంతో దేహాన్ని ఛిద్రం చేసినా బాగుండు అనుమానించకుండా మనిషిని నమ్మలేవు నీ అవసరాల కోసమో నీ రాతకోతల కోసమో ఆటోలో నీ పక్కన ఒదిగొదిగి ప్రయాణించాను కదా. బిడియం కాకపోవచ్చు నువ్వు తప్పులెంచకూడదనే కావచ్చు నీకు గుర్తుందో లేదో నాకైతే గుండెలో కెలుకుతున్నట్లే ఉంది కొంగైనా తాకలేదని నొచ్చుకోవాలా.. నలబై ఏళ్ల పడిలోనూ ముగ్గురు తల్లుల పసిపోరన్ని నేను ముద్దులు, ఆలింగనాలు, దేహస్పర్శలు గుండె నుంచి గుండెకు తాకాలి కదా... నాదంతా మూగప్రేమ ఇద్దరినో ముగ్గురినో ప్రేమించే ఉంటాను చెప్పలేక, దాచుకోలేక రాత్రుళ్లను నిద్రలేమితో వెలిగించినవాణ్నే వాళ్లకంతా నేను మొద్దు రాచిప్పనే కావచ్చు. తల్లీ... నా పెదవులపై గుండెతో పెట్టే ముద్దోటి చాలు హృదయం లేని దేహరాపిళ్లు వద్దు ఎంత చెప్పినా వినవు నీ పంతమేదో నీది నీ వాదనకు ఒకటే కొమ్ము నేను మనసుతో మాట్లాడుతా నువ్వు మనసుతో చూడవు కళ్ల కిటికీలు తెరవవు నువ్వు ఊహల సీసాలో బందీవి నేనేం చేయను... పదేళ్ల స్నేహమో, పరిచయమో నోరు జారానా, మాట తూలానా... జానే కహాఁ.. గయే ఓ దిన్ హసా హసా కే...

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1taOL5n

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/ఇస్ దునియా మే కొయి బి అల్గ్ నహి .............................................. కంట్లో నలక పడి పంటి కి0ద రాయి వచ్చి కాలికి ముల్లు గుచ్చుకొని అబ్బా........ జేబు చిల్లు పడి చదువు చితికల పడి కుటు0బం బజారున పడి ఛా....... పక్కోడు తగలబడి పక్కోడు చంపబడి పక్కోడు చంపబడి ఆహ...హ్హ హ్హ హ్హ .... ఇస్ దునియామే కోయి బి అల్గ్ నహి హర్ ఆద్మీ అయిసే రెహెతే. 19-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oJ14WW

Posted by Katta

Jaligama Narasimha Rao కవిత

//ఆశావాదిని// నేను...ఆశావాదిని.... మీరు...ముంచరని.... పాపం...పంచరని... పేద..గుండెల్లో..నిధ్రిస్తారని.... ధనికులకు...ధాసోహమ్...కారని.. రాజ్యాంగం....రాతల...చెడిపేయరని... మెరుగులు...దిద్దుతారని..... జమా...ఖర్చులు..మాయ..చేయరని... అబలల...కంటికి..రెప్పల..చూస్తారని... సబలల...అంధెలమెక్కిస్తారని..... అంధరికి...మెతుకులు..తినిపిస్తారని... ఆశతో....చిన్న...ఆశతో... ప్రజలెన్నుకున్న....సాములు...మీపై...ఆశతో..... ది: 19-05-2014

by Jaligama Narasimha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tm5rdR

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

అనువాద కవిత్వం : ......|| కాంతి / Light ||..... కాంతి ! అనంత కాంతి ! లేదిక చీకటికి చోటు . జీవన అంధ తమస్సులు విడుతున్నవి గుహాంతర తిమిర మర్మాలు విడివడుతున్నవి అంతుచిక్కని గత అవిద్యా అగాధాలు ఆశావహ చలిత కలికల్లా జ్వలిస్తున్నవి . కాంతి!కాలాతీత పరివర్తనాతీత సుదూర కాంతి! బంధిత పవిత్ర రహః కవాటాలు తెరుచుకుంటున్నవి అనంతం లో జ్వలిస్తున్న వజ్రాత్మ కాంతి నా అంతరంగం లో ప్రకంపించి మరణాతీత అమర సుమమై వికసిస్తున్నది ! కాంతి! నరనరాన నర్తిస్తున్న వైవశ్య కాంతి ! కాంతి! చిరంతన చింతనానంత కాంతి ! ప్రతి తాడిత రజోగుణ కణం మౌన జ్వాలై అనశ్వర జీవన స్పృహను పదిల పరుస్తున్నది. ఒక మహాద్భుత కాంతి కడలిలో నా ఈ కదలిక నా అగాధాలనూ ఆతని అనంత శిఖరాలనూ అనుసంధిస్తూ. మూలం : మహర్షి అరవింద ఘోష్ (Sri Aurobindo collected poems ) సేచ్చానువాదం : నాగరాజు రామస్వామి.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TlRiO3

Posted by Katta

Girija Nookala కవిత

మనసు లేని మరబొమ్మలు మానవత్వం చచ్చిపోయింది పిశాచాల్లా బ్రతకండి రోజూ నెత్తురు ధారలు తెగి పడిన శరీరాలు కాలిన మాంసపు ముద్దలు చూసి కడా చలించకుండా మీ పనిలో మీరు తిరగండి కులం,మతం,రంగు,రూపు కసి,కోపం,క్రోధం,అసూయ, ప్రతినిత్యం నింపుకొని విషపు మనసుల మలిన శ్వాసలతో కాలుష్యం నింపుతూ నడవండి దూరశ్ర్వణాలు,దూరదర్సనాలు, ఫేస్ బుక్ పలకరింపులు దగ్గర కాలేని వాట్సాప్ పరిచయాలు, పరిమళం లేని ప్రణయ ప్రలాపాలు డేటింగులు,ఔటింగులలో కాలుతున్న యవ్వనంతో మనసు లేని మరబొమ్మల్లా డబ్బు చుట్టూ తిరగండి. డాలర్ల రిప రిపలు,విదేశీ యానాలు పట్టు చీర్ల పెర పెరలు మే'కప్పు మఖాలు హొదాలు చాటే డిజైనర్ నగలు సినిమా సెట్టింగుల కల్యాణ మండపాలు, ముగ్ధ శిశిర అమాయక ఆనందం పొగొట్టుకొన్న లేటు వ్యాపార పెళ్ళి నటించండి. రెండు జీవితాల ఆత్మీయ బంధం నూరేళ్ళ కాసుల పంటై సహజ భావాల రంగులు కోల్పోయిన ఇంద్ర ధనస్సును విడియోలలొ చూసుకోండి. మాత్రుత్వం,మానవత్వం.రెడింటికీ దగ్గర అనుభందం ఇద్దరు వద్దని,ఒక్కరు కాడా ఎందుకని కంటే భారమని,ఆనందాలకి అడ్డని పిల్లలు లేని ప్లాస్టిక్ నవ్వులతో పూవులు పూయని ఎడారిలో ఆనందంగా గడపండి అందరిలో ఒంటిరై జంటకి కూడా దూరమై నీకు నువ్వే భరమై నిన్ను నువ్వే ప్రేమించుకోలేని అనాధ జీవివై శ్వాస మాత్రమే మిగిలిన శవమై ఏకాకివై,చచ్చే వరకు చితివై చచ్చినట్టు బ్రతకండి. కన్నీళ్ళు కడా తుడవలేని కాసులు చూసుకొని తనివి తీరా ఏడవండి. ఈ మధ్య పెళ్ళి ఒద్దు,పిల్లలు ఒద్దు లివింగ్ ఇన్ రెలేషన్లు,లేటు వ్యపార పెళ్ళిళ్ళు,చిన్న వయసులో డేటింగులు... మన చక్కటి సమాజ వ్యవస్థ ఏమై పోఅతున్నాదన్న వేదనతో.....

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jv0mus

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //నేనూ అలియాస్ మీరు ఉరఫ్ అందరూ// ఎప్పట్నుంచో... మనం ఒకలాగే ఉండిఉంటాం నమ్మకం లేని తనాన్ని నమ్మలేదనుకుంటూ.. ఇవాళ అనుమానమొచ్చిందంతే... నన్ను అతనుగా అనుకొని ఉండడు నాలానే ఉన్న నువ్వూ బహుశా.. అద్దానికెదురుగా నిలుచునొని ఉండవు నెనూ అతన్నీ, నిన్నూ నాలా చూసి ఉండను... . పాంజియా పగిలినప్పుడు శబ్దం విన్నదెవడూ..!! భళ్ళుమందా..!,ఫెటిళ్ళుమందా అనంతానంత విశ్వపు కపాల మోక్షం చితికిపోయి "చితి"కిపోయుంటుంది అచ్చంగా నాలో పేరుకున్న నమ్మకపు కుడ్యం కూలిన శబ్దంలా ఉండిఉంటుంది... వినిపించకుండిఉంటుంది వేళ కాని వేలలలో దారేలేని దారులలో క్యా.... మియా...! క్యా డూడ్రా ఇధర్...?? ఎక్కాడా వెతక్కు వెతక్కు ఇంకో మనిషికోసం శ్రీ శ్రీలూ, స్త్రీ స్త్రీలూ.. అందరూ నువ్వే.. ఇంకోలా ఎవరూ ఉండరూ కాస్త తేడాలతో అందరూ నువ్వై... బహుఏక వచనమై ఉంటావ్... లేరిచటా,అచ్చటా ఎచ్చ్చోటనూ వెరు వేరు మనుషులు అంతా నువ్వే అన్నీ నువ్వే మహోద్విగ్నతల మద్య నీ శిలా విగ్రహావిష్కరణ నాలుగు మనసుల చౌరస్తా మీద.. నువ్వేనా...! అది నేనేనా...!! అనుకున్నామో కనుగొన్నామో తెలిసేటప్పటికే భగవత్ గీత మీద చేతులు పెట్టబడ్డాయ్... "మై లార్డ్...! నేనూ అలియాస్ మీరు ఉరఫ్ అందరూ అనబడే నేను... నన్ను నేనుగా పోల్చుకొనుటలోనూ, ఇతరులందు నా లక్షణములను గుర్తించుటలోనూ... విఫలమై నన్ను నేనే మొసగించుకున్నానను నేరారోపన నిరూపింపబడి దోషిగా తేల్చబడినాను కావున ఈ దోషి దోసిట్లో కాస్త శిక్షని వెయ్యండి" "పాప పరిహారమునకు రక్తతర్పనమనివార్యము" అని పవిత్ర గ్రంథములందున చెప్పబడియే యున్నది.. 19/05/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vsfegR

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/కొత్త కాళ్ళు కొత్త కాళ్ళ పుట్టుక నాలో పాత దారులే నడకే నూతనం దారంతా ముళ్ళ ముచ్చట్లే రాళ్ళ గుసగుసలు రాత్రంతా ఖాళీ ఆకాశాన్ని నింపే ప్రయత్నంలో తారా కూటమి నీలపు రంగులో ఈదుతున్న ఓ జడపదార్థం నన్ను మోస్తున్న రెండు పునాదులు చెమ్మ ఇంకని ఆసరా వనం నా కళ్ళు మంచి నీళ్ళే...గొంతు గోడలకు కొత్త రుచిని పరిచయం చేస్తూ ఈ పూట అలసటకు ఆలంభనగా ఇంకాస్త దూరమే గమ్యం నా ముందు తిలక్ బొమ్మరాజు 19.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gGvSFK

Posted by Katta

Smitha Tati Smitha కవిత

పోటుగాడి పక్కన సంప్రదాయంగా సన్నీలియోన్ http://goo.gl/k09cCG

by Smitha Tati Smitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://goo.gl/k09cCG

Posted by Katta

Sreekanth Yadav Talasani కవిత

http://ift.tt/1iqqfek ఇది పక్కా తెలంగాణ చానల్...ఈ పేజీని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.... ఇది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు....

by Sreekanth Yadav Talasani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dE8ULo

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLJ1rb

Posted by Katta

Indira Bhyri కవిత

....అని ! చిన్నప్పుడు నా బాధ నీకు తెలియాలని... నా ఏడుపు మొహం నువ్వు చూడాలని ఎన్ని పాట్లు పడేదాన్నో నీ మరణయాతన చూడలేక నా కన్నీరు నీ కంటపడకుండా ఉండాలని ఏవో వ్యర్థప్రయాసలు అమ్మా ఇప్పుడు 19/5/14

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jLJ1aK

Posted by Katta

Uday Dalith కవిత

సరస్వతిని చదువుల తల్లిగా కొలిచే దేశం ఐతే మాత్రం సగానికి పైగా ఆడవాళ్లకు చదువే లేదు భరతమాత అని దేశాన్నే పూజిస్తాం ఆ పేరుతోనే ఆడవాళ్లను అణగత్రొక్కుతాం గుళ్లు గోపురాలు ఎన్నో కట్టిస్తాం నీ చెల్లికి తల్లికి స్వేఛ్ఛ ఇవ్వడానికి కూడా ఒప్పుకోం ఆదిశక్తి పరాశక్తి అని వల్లెవేస్తాం ఆడవాళ్ల హక్కులన్నా రిజర్వేషన్లన్నా ఆమడదూరంలో వుంటాం సమానత్వం గురించి గొంతు చించుకు అరుస్తాం ఆడదంటే శృంగార వస్తువే కానీ వ్యక్తిత్వం వున్న మనిషిగా గుర్తించం పెళ్లి చేసుకుని భర్తకు సేవ చేసుకుని అత్త మామలతో అణకువ ప్రదర్శించే ఆడవాళ్లంటేనే సమాజానికి ఎక్కడలేని మర్యాద చదువుకుంటే ఉద్యోగం ఎందుకు యింట్లో మగాడు వుంటే బయటకు తానెందుకు సంసారాన్ని మించిన వేరే ప్రపంచం ఎందుకు ఝాన్సీరాణి రుద్రమ్మదేవిల చరిత్రలు పుస్తకాల్లో చదివి వదిలేద్దాం సీతా అనసూయల కధలతో పవిత్రత పుణ్యస్త్రీ పేర్లతో వంటిటికి మహారాణిని చేద్దాం ఏపూజలు వ్రతాలు దేవుళ్లు దేవతలు బానిసత్వాన్ని నీకు వరంగా యిచ్చారో వాటి నుండి విముక్తి కానంతవరకు స్వేచ్ఛకై పోరాటం చేయనంతవరకూ ఈ హింస ఆగదు నీ తలరాత మారదు నవ్వుతూ అనుభవిస్తున్నంత కాలం నవ్వులపాలవుతూనే వుంటావు ఉదయ్ 19.05.14

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p57P2I

Posted by Katta

Panasakarla Prakash కవిత

"అప్పుడే నయ౦" అప్పుడెప్పుడో..... పెళ్ళికాక ము౦దు తెలియని నీకోస౦ తెగ ఆలోచి౦చేవాడిని అప్పుడప్పుడు నిన్ను ఊహి౦చుకుని సినిమా పాటలుకూడా పాడుకునేవాడిని నువ్వు నా జీవిత౦లోకి రాకమునుపు కనీస౦ రోజుకొక్కసారైనా నీగురి౦చి కలలు కనేవాడిని అప్పటికి నువ్వెవరో నాకు తెలియకపోయినా నీ ఊహలకోస౦ రోజులో కొ౦త సమయాన్ని ఖచ్చిత౦గా కేటాయి౦చేవాడిని మరి ఇప్పుడు... నువ్వు నాజీవిత భాగస్వామివయ్యాక‌ నువ్వు నాలో సగమయ్యాక నీతో నా పయణ౦ మొదలయ్యాక‌ నన్ను క్షమిస్తావా...! నీకోస౦ క్షణ కాలాన్నికూడా కేటాయి౦చలేకపోతున్న౦దుకు.. పనసకర్ల 19/05/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5XQtZ

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||లిపిలేని భాష || జీవితమా........ సాయంత్రమై వస్తావు మొగలిరేకుల మొనపై వెన్నెలవై వాలుతావు అంతటితో ఆగక ... మొదలులో పడివున్న కుబుసానికి మెరుపులు పూస్తావు నేను ఉదయుంచే లోపే .. రెండుగాట్ల అగచాట్లను కానుకగా ఇచ్చిపోతావు జీవిత మొక లిపిలేని భాష ............ అందుకే ఎన్ని కాగితాలున్నా ఒక్క ముక్కా రాయలేం ...

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nY6Gwz

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1oH1cGw

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oH1cGw

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-44 వానలో కొంచెం తడవనీ ఎండవచ్చినపుడు కొంచెం ఎండనీ చలిగాలిలో కొంచెం చల్లబడనీ,ఏ ఆచ్చాదన లేకుండా నేలమీద కొంచెం పొరలనీ- శరీరాన్ని మరీ సుకుమారించడంతోనే ఈ సమస్త రోగాలు... భూమిలో లేనివి ఏమి ఉన్నాయని ఈ దేహంలో సూక్ష్మీకరించబడిన భూమిలోని సకల పదార్థాల సమ్మేళనమే ఈ శరీరం - నాకయితే అర్ధం అయింది అదే...! ------------------------------------------- 19-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TkDsLO

Posted by Katta

Rajender Kalluri కవిత

## చాయ్ ## నా ప్రతి మొదలు నీతోనే .... నా ప్రతి ఆలోచన నీ ద్వారానే నువ్వు నాతో ఉంటె అలసట దరికి రానంటుంది నువ్వు లేక పోతే అది నన్ను వీడనంటుంది బంధువులు లేని రోజున కుడా అంతగా బాధ పడలేదు కాని నువ్వు లేని రోజల్లా నాకు బాదే నీకు దూరంగా ఉండాలని చాలా ప్రయత్నిస్తుంటాను కాని అది జరిగే పని కాదు ప్రతి క్షణం నీ గురించి ఆలోచించలేకపోయినా గంటకోసరైనా నువ్ గుర్తొస్తుంటావ్ ఎంత ప్రయత్నించినా నిన్ను మరవడం కష్టమన్న సంగతి మా ఇంట్లో వాళ్ళు కుడా గ్రహించారు అదేంటో తెలిదు గాని , నేను నీకు ఆకర్షితున్నయ్యానా లేక బానిసయ్యానా అన్న విషయం నాకె అర్ధం కావట్లేదు kAlluRi [19 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sJo4CQ

Posted by Katta

Pranayraj Vangari కవిత

తెలుగు వికీపీడియాలో కవి సంగమం, కవి సంగమం కవులు..... http://ift.tt/1gY9L89

by Pranayraj Vangari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gY9L89

Posted by Katta

Srivalli Radhika T కవిత

జీవుడు || టి. శ్రీవల్లీ రాధిక కనులు తెరచి చూస్తున్నాను కదా కదలిక కొంతైనా వుందనుకుంటారు కవితలేవో వ్రాస్తున్నాను కదా కలలు కొన్నైనా మిగిలాయనుకుంటారు మాటల గునపాలతో త్రవ్వితే కన్నీటి జల వుబుకుతుందనుకుంటారు ప్రపంచంలో మసలుతున్నాను కదా ప్రాణమింకా నిలిచి వుందనుకుంటారు కాటికివతల కనిపిస్తున్నాను కదా హృదయమింకా పగలలేదనుకుంటారు పాత నాటకమే ప్రదర్శిస్తే పొరపాటున పలుకుతాననుకుంటారు *** (18/5/2014 ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురితం)

by Srivalli Radhika T



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gftepK

Posted by Katta

Buchi Reddy కవిత

5--19-2014 *****దేశం లో మట్టి కరిచిన కాంగ్రెస్ పాలన????no more NEHRU gari family palana?? ఇక అంతే ??????? దేవుని ప్రమాణం చేసి నిజమే చెబుతున్నాను అబద్దం చెప్ప ను సమ్మక్క--- సారక్క మీ ధ వో ట్టూ ఈ రోజు తో దేశం లో మట్టి కరిచిన కాంగ్రెస్ పాలన నెహ్రూ గారి ఫ్యామిలీ పాలన అంతరించి పోయింధీ మటుమాయం అయిపోయింధీ దేశ ప్రజలు ఇంతకాలానికి నిర్ణయాత్మకమయినా తీర్పు నిచ్చారు అవకాశ విధానాలకు అవనీతి కరమయనా అనర్థ ధాయకమయినా అసమర్థ పాలన ఆంధిచిన కాంగ్రెస్ ను ఘోరంగా తి ర స్క రించారు జనం సృష్టిం చిన జాతీయ విప్లవం ఈ ఎన్నికల ప లీ తా లు ప్రజలు గళమెత్తడం ధ్వ జ మెత్తడం--- ఈ ఎన్నికల గుణపా ట౦ 12 రాష్ట్రాల్లో ఒక్క సీట్ కూడా గెలువని కాంగ్రెస్ పార్టీ ??? ఆర్థిక మంత్రి గా రాణి ౦ చిన సాధు శీలి మన్మోహన్ గారు సోనియా --అమ్మ చేతి లో తోలు బొమ్మలా--- ఆడుతూ--పాడుతూ-- పసిడి పలుకులు పలుకుతూ--- కూరలో కరివా పాకు లా వాడుకోని--- పారేసీన ?????? ఇందిరమ్మ సంక్షేమ పథకాలు రాజీవ్ గృహ నిర్మాణాలు జల యజ్ఞం--పావులా వడ్డీ ఆరోగ్య శ్రీ--అంటూ నమ్మిస్తూ లేని పోనీ ని నా ధా ల తో మోసగిస్తూ సమస్యల ను మిగిలిస్తూ--- స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఏ క్కువ ఏళ్లు దేశాన్ని పరిపాలించింధీ--కాంగ్రెస్ పార్ట్ ఏ నెహ్రూ గారి ఫ్యామిలీ మాత్రమే--- ఈ స్థితి కి కారణం దేశం లో అవనీతి కుంభ కోణాలు-- స్కాం లు-- స్క్కిం లు ల ౦ చ గో ౦ డి తనం ధరల పెరుగు ధ ల వ్యవసాయ సంక్షోభం ధుష్ట విధానాలు-- ప్రపించీకరణ కభంధ భ ౦ ధ ౦ అభద్రతా భావం పేరుగడం--- దేశరాజకీయాలు ఒక వ్యాపారం గా మారి కోట్ల సంపాధన కోసం నిమిషాల్లో జెండాలు మారుస్తూ టి క్క ట్ ల కోసం --ఎగబడు తూఒ--- రాజనీతి--ర ణ నీతి లేని లీడర్‌షిప్ స్కిల్స్ లేని ప్రతి ఒక్కడు--ప్రజా సేవ అంటూ----???? ఈ దోపిడీ వ్యవస్థ లో రాజకీయాలంటే మోసం-- ధగా చేయాలి లంచాలు తీసుకోవాలి--ఇవ్వాలి లోల్ళులు లేపాలీ-- అల్లర్లు చేపించాలి అబద్దాలు చెప్పాలి సొల్లు కబుర్లు వినిపించాలి ప్రజల మిధ జులుం చేయాలి--వాడుకోవాలి ???? యిధి---మన నేతలు --రాజకీయ దొర లు నడుపుతున్న తీరు-- సారె జహాసే అచ్ఛా-- హిందూస్థాన్ హమారా పాటలో --శ్రుతి -- గమకాలు తప్పాయి గాంధీజీ పుట్టిన దేశం లో -- నేడు ?? హిందూస్థాన్ హమారా-- దోపిడీ ధారులకు ఆ గ్ర కులాలకు అవనీతికి పాటు పడుతున్న నాయకుల ధో ర ల కు-- దేశం వాళ్ళ ధె ????? కంట్రోల్ రాజకీయాల తో డిక్టేటర్‌షిప్ తో ఏధి చేయాలన్న-- సోనియమ్మ ను అడుగాలి-- ధీ వ న లు పోంధాలి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రులు--- వారాని కి మూడు రోజులు -- డిల్లీ వెల్లుతూ ఒక్కొక్క సారి వెళ్ళిన ముఖ్యమంత్రుల కు సోనియాజీ అపాయంట్‌మెంట్ దొరకక తిరిగి వస్తూ___ కొద్దిమంధీ పెత్తనం తో కాంగ్రెస్ పార్టీ అమెరికా లో దొర ల తెలుగు సంగాల లా ఎంధుకు ఈ అధిపత్య ధోరీనీ ఏధి ప్రజాసామ్యం ఏధి రాజ్యాంగం ఎక్కడ ఉంధీ సామాజిక న్యాయం?? ఈ నేతలు--- అక్కడ దోచుకుంటూ అమెరికా కు వచ్చి నీతులు వల్ళిస్తూ మాటలు మారుస్తూ వీళ్ళకు-- ఈ అవనీతి పరుల కు అమెరికా దొర లు సన్మానాలు-- శాలువలు కప్పడాలు కప్పించుకోవాడాలు బ్యాంక్వెట్ విం ధు లు ఫండ్ రేసింగ్ లు టి . వి --ప్రెస్ క వ రెజ్ లు---- అక్కడ అయినా ఇక్కడ అయినా అమెరికా అయినా--అమలాపురం అయినా న్యాయం-- నీతి నిజాయితీ-- మంచితనం-- మానవత్వం ధారి తప్పుతుంధీ ఈ బ్లాక్-- అండ్ బ్లూ సూట్ దొర లు డాలర్ల బలుపు తో--- రాజకీయ లబ్ధి కోసం గుర్తింపు కోసం ఎంత కయినా ధిగజారి పోతూ--- అవే రాజకీయాలు చేస్తూ--ఆడుతూ--- దేశం లో ఇన్ని ఏళ్ల కు--ఒక పెద్ద మార్పు సె క్యూ ల రిజం-- పత్రికా స్వేచ్ఛ స్వతంత్ర మై న న్యాయ వ్యవస్థ ఆర్థిక సమానత్వం-- మన ప్రజా సామ్యానికి పట్టుకొమ్మలు వంటివి ప్రజా సామ్యం కూలీపోతే ప్రజలకే మనుగడ ఉం డా ధు ఒక ప్రజా సామ్య దేశం గా ఒక సర్వ సత్త్హాక స్వతంత్ర దేశం గా సగర్వం గా వి రా జిళ్లుతూ మనుగడ సా గించాలి అధె మన బాట-- మాట ఆ శయం కావాలి మార్పు వచ్చి తీరాలి రాకతప్పధు----- ----------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFy2oZ

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

ఈ పొద్దున్నే లేవగానే వొక అద్భుతమైన కవిత చదివాను. వస్తువు గానీ, అభివ్యక్తి గానీ విష్మయం కలిగించేటట్టు - మరీ యింత కొత్తగా, యింత విన్నూత్నంగా కవిత్వాన్ని సృజించొచ్చా ! ఆశ్చర్యానందం ! కవిత చదువుతున్నాను - అది మనసు మీద వేసిన అనుభూతి పొరలను ఆలోచనా స్పర్శతో విప్పుకుంటూ విప్పుకుంటూ - కవితా శీర్షిక వైపు 'మళ్లొక్కసారి వెనక్కి, మళ్లొక్కసారి వెనక్కి' - అంటూ తలతిప్పుకోకుండా వుండలేకపోయాను. ఆలోచననను రేకిత్తించే స్వభావమే - కారణం. ఈ కవిత ఆకలి కేంద్రీకృతంగా నిర్మించబడినా - లోలోన రగులుకుంటున్న వొక ప్రవాసవేదన, ఆ దుఃఖం నేపథ్యంగా లేకుండా ఈ కవిత యిలా రాకపోవచ్చు. ఈ కవితకు ఎత్తుగడ ప్రాణభూతమైంది - కవితను, కవిత చదివే పాఠకుణ్ణి లోలోపకు లాక్కునేటట్టు - వొక అయాస్కాంత తరంగం ఆవరిస్తూ ! కవి యిక్కడో మాట అనేసి పోయాడు. ఏం లేదు వొక మాట.. వొక పదునైన మాట ! ఏ మానసిక అలజడి కేంద్రం నుంచో ! ఏ ఆకలి సముద్రాల తీవ్ర సుడిగుండాల ప్రవాహఉధృతి నుంచో ! ? ? కవి : అఫ్సర్ నోరు, చెయ్యి అను ఆ రెండు దేశాలు ----------------------------------------- దూరాల మాటే కదా అనుకుంటున్నదిప్పుడు నోరూ చెయ్యి - ఈ రెండు దేశాల మధ్య దూరాన్ని దేనితో కొలవాలో ఎవరూ ఇంకా చెప్పలేదు పోనీ, ఏదయినా వొక కొలమానం కనిపెట్టి, ఈ దూరాల లెక్క అయినా తేల్చలేదు ! 1 నోరు దీంట్లో మన్నుపడ ! దీని నోట్లో ఎన్ని భూఖండాలూ ఎన్ని సముద్రాలూ ఎన్ని శూన్యాలూ ఎన్ని ఆకాశాలూ ఎన్ని సూర్యగోళాలూ, అన్నీ గప్ చూప్ లే ! దాగుడు మూతా దండా కోర్ లే ! అన్నీ పెదాల దాకా వచ్చి సర్వసమాధి అయిపోతాయి చెయ్యి దీన్ని తుంచి పొయ్యిలో పెట్ట ! ఇది ఎన్ని చేస్తుంది ? కత్తులు పట్టీ, కటార్లు తిప్పీ, గొంతులు కోసీ, కడుపులో ఇంకా కన్ను కూడా తెరవని ఆడ పిండాల్ని నొక్కీ, నిలుచున్న పణాన నిలువెత్తు మనిషిని శవాన్ని చేసీ, అయినా... దీని వేళ్లు ఎంతకీ నోటి దాకా వెళ్లవే ! 2 దూరాల లెక్కే కదా అందరూ అడిగేది ఈ దూరాల్ని చెరిపెయ్యాలనే కదా ఎల్లరూ భూమ్యాకాశాలు కలపెట్టేది చెయ్యి వొక దేశం నోరు వొక దేశం నువ్వూ నేనూ శరీరఖండాలం ఇంకా తెగిపోతాం సరిహద్దులు తెంపి పోతాం వొకే వొక అన్నం మెతుకు నీ, నా వునికి ! మిన్ను విరిగి మీదనే పడనీ భూమి బద్దలయితే బద్దలవ్వనీ - మరి, ఆ క లి ! ( వివిధ - 19 మే 2014 )

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKXjOy

Posted by Katta

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // రేపటి ఆశ // నాకు నిన్న రాత్రి మగత నిద్ర లో ఒక మధుర స్వప్నం ఎవరో దైవ దూత ఒక చక్కని సువార్త లోకానికి మోసుకొచ్చినట్లు దేవేంద్రుడు తన కన్నా కలియుగానికే ఎక్కువ అవసరమని "కల్ప వృక్షం" బహుమతిగా పంపినట్లు అక్రమర్కులంతా తమ అక్రమాస్తులన్ని కనువిప్పుతో ప్రజలకు పంచినట్టు కొత్త నాయకత్వం అంతా ఏ సామాన్యుడి చెమట చుక్క దోచుకోమని శభదమ్ చేసినట్టు అది చూసి లోకులంతా ఆనంద పారవశ్యంలో నృత్యం చేస్తున్నట్టు నేను వారి సంతోషానికి రెండు ఆనంద బాష్పలనై రాలుతున్నట్టు నన్ను నేలను తాకకుండా నా ప్రేయసి కళ్ళతో తాగేసి తన హృదయ పానుపు పై సేద దేర్చినట్లు... నేనేమో దిగ్గున లేచి అన్ని కలల్లాగే ఇదికూడా ఎక్కడ కరిగి పోతుందో నని,, ఇలా మీ ముందుకు వంపి మళ్లీ కరిగి పోనీ చీకటి లోకి జారుకుంటూ ఈ కల "రేపటి ఆశ" ఆయి మొలకెత్తునేమో అన్న ఆశతో ... (19-05-2014)

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jdCni3

Posted by Katta

Kapila Ramkumar కవిత

తెలుగు కవిత్వంలో ఎర్రజెండా Posted on: Mon 19 May 00:04:41.573374 2014 ఎర్రజెండా... శ్రమైన జీవన సౌందర్య వైజయంతిక. తెలుగువారి సమస్త రంగాల్లోలాగానే తెలుగు సాహిత్యంలోకి 30వ దశకంలోనే ధగద్ధగాయమానంగా ప్రకాశించింది. 'సింధూరం, రక్త చందనం/ బందూకం, సంధ్యా రాగం/ పులి చంపిన లేడి నెత్తురు/ ఎగరేసిన ఎర్రని జెండా / రుద్రాలిక నయన జ్వాలిక/ కలకత్తా కాళిక నాలిక/ కావాలోరు నవ కవనానికి' అని 1937 ఆగస్టు 3న నవకవిత రాశారు శ్రీశ్రీ. దీనికి రెండేళ్ల ముందే 1935లో - 'ఎగరాలి ఎగరాలి/ మన ఎర్రజెండా/ అదురు బెదురూ లేక/ అడ్డేమియును లేక' అని తుమ్మల వెంకట్రామయ్య రాశారు. 40, 50 దశకాల్లోనూ, ఆ తర్వాత కాలంలోనూ 'అడ్డేమియూ లేక' పుంఖాను పుంఖంగా ఎర్రజెండాలతో తెలుగు కవిత్వం నిండిపోయింది. 'వేగరావోరు కార్మికా / వేగరావోరు కర్షకా/ కలసి మెలిసి పలకవోరు/ అరుణ పతాకాకు జై' / 'తుపాకి బారులు ప్రేలినా / బాంబుల వర్షం కురిసినా/ ఎత్తిన జెండా దించకోరు / అరుణ పతాకాకు జై'/ 'పటేలు నెవురూలొచ్చినా / గూర్ఖా సిక్కులు తోలినా / ఎత్తిన జెండా దించకోరు/ అరుణ పతాకాకు జై' అంటూ 1946లో ప్రజాశక్తిలో ముక్కామల నాగభూషణం రాసిన మార్చింగ్‌ సాంగ్‌ బాగా ప్రాచుర్యం పొందింది. కయ్యూరు కామ్రేడ్స్‌ని ఉరి తీసిన సందర్భంలో 1948 ప్రజాశక్తిలో ప్రముఖ గాయక కవి బి.గోపాలం- 'కార్మిక రక్త పతాకము/ కోటలపై పేటలపై/ ఎగరేస్తాం యుగయుగాలు/ వెలిగిస్తాం జగజగాలు' అని రాశారు. అదే సంవత్సరం కాటూరు యలమర్రు సంఘటనలపై స్పందించిన అవసరాల సూర్యారావు 'విశాలాంధ్ర' డిసెంబరు సంచికలో- ఎర్రజెండా ఎగరేస్తూ/ కొడవలి ఝళిపిస్తూ/ సందులను గొందులను చవిటి సంస్థలను../ చరిత్రకెప్పుడూ మూడు యోజనాల ముందు చూపు మానవుడా! నవ మానవుడా!' అని రాశారు. ప్రముఖ సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి ఎరుపుని అగ్నితో పోల్చి- 'అనల పతాకం అనల పతాకం / అంబర వీధుల మెరిసింది/ కాంచన గంగా ధవళ శిఖరిపై/ రక్తధీదితులు విరిశాయి/ అనల పతాకం అనల పతాకం/ అంబర వీధుల మెరిసింది / అజస్త మజస్త మెరిగింది/ అనలంగరళం క్రక్కింది' అంటూ ప్రజాశక్తిలో 1945లో రాశారు. బహుశా చైనా విప్లవ విజయాన్ని కీర్తించటం ఆయన ఉద్ధేశం కావచ్చు. ఏటుకూరు ప్రసాద్‌ ఏకంగా- 'ఎర్రజెండేరా తమ్ముడ ఎర్రజెండారో...' పల్లవితో ఎర్రజెండాపైనే గేయం రాశాడు. గజ్జెల మల్లారెడ్డి- 'ఎత్తరా మన ఎర్రజెండా/ ఎర్రకాంతులు దిశలు నిండా/ ఎత్తరా సంఘర్ష కీలల అవతరించిన ఎర్రజెండా/' గేయం చాలా ప్రాచుర్యం పొందింది. రెంటాల తెలంగాణా సమర గీతం 'సర్పయాగం'లో - 'పగలేయి నిజాం కోట/ ఎగరేయి ఎర్రబావుటా' అని గానం చేశాడు. సోమసుందర్‌ వజ్రాయుధంలోని సమధర్మం దీర్ఘకవితలో (1949)- 'భువియొక విప్లవ మూర్తై / నిలువు కాళ్ల నిలుస్తుంది/ అరుణారుణ పతాకమై/ ఆకాశాన మెరుస్తుంది' అని రాశారు. వామపక్ష రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని సుప్రసిద్ధ కవి 'కరుణ శ్రీ' ... - 'త్యాగోజ్జ్వల మహిమా మండిత రాగారుణ రక్త పతాకం/ నవ భారత హృదయాంబరమున / ప్రసరించిన మహేంద్రచాపం' అని రాశారు.. కయ్యూరు కామ్రేడ్స్‌ని ఉరి తీసినప్పుడే- ఆచార్య 1948 మార్చి ప్రజాశక్తిలో - 'ఎర్రజెండా నీడ ఏకమై మేమంత / మన లక్ష్య సిద్ధికై కూలిపోయిన బాట / తప్పకిదె వస్తామురా... కామ్రేడ్స్‌/ శపధమిదె చేస్తామురా..' అరుణాంజలి ఘటించారు. దీర్ఘ కవితలు, మినీ కవితలు ఏకకాలంలో మిక్కిలిగా రాసిన సింగంపల్లి అశోకకుమార్‌ తన వ్యూహం కవితా సంపుటిలో- 'దేశాలను తెలిపేది ఎగిరే జెండా/ దేశాలను కలిపేది ఎర్రని జెండా' అని పేర్కొన్నారు. పొద్దు పూసింది కవితా సంపుటిలో - 'ఉదయించే సూరీడు నింగి నిండా ఎగిరే ఎర్రని జెండా' అని అన్నాడు మరో ప్రముఖ కవి యం.కె.సుగంబాబు.. 'ఓ అరుణ పతాకమా!/ చేకోనుమా రెడ్‌ సెల్యూట్‌/ శ్రమజీవుల కేతనమా..' అని ఏనాడో శ్లాఘించాడు ప్రజాకవి సుబ్బారావు పాణిగ్రాహి. చెరబండ రాజు తన కవిత్వంలో అనేకసార్లు 'ఎర్రజెండా'ని ప్రస్తావించి ప్రశంసించాడు. 31-8-1973న రాసిన 'ఊపిరి' కవితలో - 'కష్టజీవుల నెత్తెరెరుపు / కమ్యూనిస్టు జెండ ఎరుపూ... ఎర్రజెండా విడువకండి..' అని రాశాడు. ప్రజాయుద్దానికి, శ్రీకాకుళానికి, ఎర్రజెండాకి ఇదే సంపుటిలో మరోచోట చెరబండరాజు లాల్‌ సలాం చెబుతాడు. వచన కవి ఎ.ఎన్‌. నాగేశ్వరరావు 'సముద్రం నా స్వప్నం' సంపుటిలో - 'కామ్రేడ్స్‌ మీరెత్తిన ఎర్రజెండా/ నిటారుగా తలెత్తుతుంది/ ఆరు ఖండాల ఆకాశమ్మీద/ స్వేచ్చగా ఎగురుతుంది/ సుత్తీకొడవలి హత్తుకొని/ ప్రజా పిడికిళ్ళు ఆవేశంతో/ ' అంటూ అరుణ పతాక విస్తృతిని వివరించాడు. రంగనాయమ్మ సంపాదకత్వంలో వచ్చిన వసుధ డిసెంబరు 72 సంచికలో- 'తిరగబడ్డ ఎర్రజెండా/ పాడుతున్న గీతం/ సమగ్ర విప్లవాన్ని/ కోరే సంగీతం' అని రాస్తాడు శివసాగర్‌. అప్పటికే అనేకసార్లు తెలుగు సినిమా తెరపై ఎగిరిన ఎర్రజెండాని 'చీమల దండు' సినిమాలో ఎర్రజెండేర్ర జెండ ఎన్నియలో, ఎర్రెర్రని ఈ జెండెన్నియల్లో అంటూ ఎగరేశారు.. బీజింగ్‌ ప్రపంచ మహిళా మహాసభ 28.8.1995లో చైనా రాజధాని బీజింగ్‌లో జరిగినప్పుడు ప్రతినిధిగా వెళ్లిన ఓల్గా- 'ఇక్కడ ఎగురుతున్న ఎర్ర జెండాల్ని చూస్తుంటే/ శరీరంలో రక్తమంతా వెల్లువై/ వేల జెండాలుగా మారుతున్న అనుభూతి..' అంటూ పరవశించారు. ఇంకా వందల సంఖ్యలో కవులు, గాయకులు ఈ శ్రామిక జెండాను కీర్తించారు. జనవిముక్తి కేతనంగా, ప్రజారక్ష పతాకంగా అభివర్ణించారు. ఎంత రాసినా, ఎంత పాడినా ఎర్రజెండా ఘనత తరగనిది.. ప్రతి క్షణం విశాల శ్రామిక ప్రపంచానికి ప్రేరణ అది. - చెరుకూరి సత్యనారాయణ http://ift.tt/Tk4SRK

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tk4SRK

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

కోడి గుడ్లను పొదుగుతుంది కవి కవితల్ని పొదుగుతాడు

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t7H3Jq

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//నవ్వు// 11 ***************************** తే.గీ!! అధరపుష్పము వికసించునటుల నవ్వు మోము భాసించు నిండైన పున్నమ వలె హృదయపుష్పము వికసించునటుల నవ్వు దేహమారోగ్యభరితమై తేజరిల్లు (ఓ నవ్వూ...నువ్వు నవ్వుతూ కలకాలం వర్థిల్లెదవు గాక ) 19-5-2014 10/1/2014

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sIMzzU

Posted by Katta

Swatee Sripada కవిత

ఎక్కడి గాలి ఇది 1. ఎక్కడి మేఘమో ఒకటి తారట్లాడుతూ చుట్టపు చూపుగా వచ్చి చుట్టూ చుట్టూ తిరుగుతూ నాలుగు నీటి చుక్కలుగా కరిగి పలకరింత జల్లుగా కిటికీ పక్కన కూనిరాగమై గుండె తడిమి పరిమళాలు రాలుస్తూ ..... చినుకు చినుకునా ఒదిగి పొదిగిన తలపుల రవ్వలు సంకీర్ణమైన సమయాలను వెయ్యి ముఖాలతో వికర్ణీకరిస్తూ ... చూపులు హరివిల్లులై............. పెదవులపై పాకే ఊహై విరగబూసిన కాశీ రత్నం తీగలా ... 2. నీళ్ళల్లో కాళ్ళాడిస్తూ ప్రవాహాన్ని బేరీజు వేసుకుంటున్న స్వప్నాలు గాలివాటుకే జలజల మంటూ రాలిపడే పున్నాగల మెత్తని సవ్వడి అక్షరాలనూ పెదవి దాటని అలవోక రాయభారాలనూ పెనవేసుకొన్న రాధామనోహరాల సుతి మెత్తని సుగంధం మళ్ళీ ఓ పులకరి౦తగా ........... ౩. ఎప్పుడూ అంతే రెండడుగులు ము౦దుకు ‘ మూడడుగులు వెనక్కు ‘’ గుడు గుడు గు౦చా లాడుతూ ఉనికి

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKtbCX

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||చీకటి సౌక్యం || చీకటి కూడా కొన్ని సౌక్యాల నిస్తుంది రేపటి రోకటి పోటుల రుచి తెలిసేదాకా తెలియనితనం మందుమాత్రయి ఇచ్చే ఆనందం ముందు తరాలను ముంచేదాకా తెలియదు మొత్తు కొనేది మీరే.... మోదు కొనేది మీరే ఎవడో వచ్చి ఆదుకొంటారని ఎదురు చూసేది మీరే ... ఎంతయునా.... చీకటి.. రోజులో ఒకబాగం మాత్రమే రోజంతా ఆకలే అయునప్పుడు ....నిజం తెలియక మానుతుందా తిరుగుబాటురధం కదలక ఆగుతుందా ....

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lBgasv

Posted by Katta