పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఏప్రిల్ 2014, బుధవారం

Chinni Krishna కవిత

విస్మృతగీతం నువ్ గాంచిన స్వప్నమొకటి నా ముందు మోకరిల్లి ఉంది.. జీవచ్ఛవమై, రెక్కలు తెగి, కొన ఊపిరితో... నువ్ ఎత్తిన బావుటా ఒకటి ఎండిన కట్టెగా మిగిలింది.. చీలికలై రెపరెపలాడుతూ.. వాలిన దుమ్ము దులిపేసుకుంటూ.. నువ్ పాడిన గేయమొకటి గాయమై మిగిలింది ఉఛ్వాస నిశ్వాసాలను స్వరాలుగా విడదీస్తూ.. ఏకాకి శరాలుగా మరణిస్తూ.. నువ్ సంధించిన బాణమొకటి గురితప్పి నా గుండెల్లో పాతుకుంది. నా కులాన్ని ధ్వనిస్తూ నాలో అశాంతిని రగిలిస్తూ నువ్ వెలిగించిన దీపమొకటి దావానలమై అంటుకుంది లక్ష్యమేదో తెలియని యజ్ఞానికి తరతరాలను సమిధలుగా మారుస్తూ.. ఓ మనూ... నువ్ సృజించిన బీభత్సంలో చివరి శకలాన్ని నేను నీ కుల వ్యవస్తలో చివరి శిథిలాన్ని నేను.. నీ అరికాలిని చేరిన మస్తిష్కంలోంచిపుట్టిన వాడిని భూస్థాపిత పునాదిరాయిని నేను.. కులక్షేత్ర పద్మవ్యూహంలో ఒంటరి అభిమన్యుడిని నేను అంబేద్కరుడిని నేను.. సహస్ర శీర్ష కుల సర్ప పరిష్వంగం చీల్చుకు వస్తున్నాను.. ద్వారపాలకులే జాతి పీడకులై పాతాలంలో తొక్కి పెట్టిన వేదామృతాన్ని వెలికి తీస్తాను.. ఓ మనూ... నీ కలం బలాన్ని నాకివ్వు నీ కలల ప్రపంచానికి నాందీ వాచకం రాస్తున్నాను నీ మనుస్మృతిని సరిదిద్ది మా నవ స్మృతిని నిర్మిస్తున్నాను.. ...అంబేద్కరుని స్మృతిలో చిన్నికృష్ణ

by Chinni Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1dvao

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || రక్త పాదాలు || ======================== పాదాలు పరిగెట్టలేక అలసిపోయాయి దేహాలు సొమ్మసిల్లి పడిపోయాయి ఎముకలు మాత్రం గూడై నవ్వుతున్నాయి గాయాలు మాత్రం పాద ముద్రలు వేస్తూనే ఉన్నాయి బ్రహ్మజెముడు మొక్కలు వెక్కిరిస్తున్నాయి మొగలిపొదల్లో మాత్రం విష పాములు బుషలు కొడుతున్నాయి నాలుకమచ్చల మాటలు ఇంకా కాటేస్తున్నాయి కుల అహంకారం కరిగే మంచుదుప్పటై కాటేస్తుంది నీ మాటాల విష తూటాలకు మొగలిరేకులు వాడిపోతున్నాయి కరిగే కాలం ముసుగేసింది దేహాలు మాత్రం సజీవంగానే చూస్తున్నాయి బతుకు జీవశ్చవాలను ఊహించుకుంటూ పాద ముద్రలను ముద్దెట్టుకుంటూ గాయాల లేపనం కోసం సంచరిస్తూ... రోదనలు అరణ్యం ఐతే మృత సంజీవని అక్కడే దొరుకుతుంది కాబోలు గాయాలైన అలసిన పాదాలు అటువైపే పరిగెడుతున్నాయి ============ 16/ఏప్రిల్ /2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2BKKP

Posted by Katta

DrRamalakshmi Tadepalli కవిత



by DrRamalakshmi Tadepalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gGWHah

Posted by Katta

Panasakarla Prakash కవిత

"అదేవృత్తి" గుడికెళ్ళి బైటికి వచ్చేసరికి సిద్ద౦గా ఉన్నారు యాచకులు అమ్మా బాబూ అయ్యా అ౦టూ చేతులు చాచి అర్ధిస్తూ.... చూసీ చూడనట్టో..... చూసికూడా చూడనట్టో... నా కాళ్ళు చెప్పుల ముసుగేసుకుని మౌన౦గా కదిలాయి నా కోప౦ యాచక వృత్తి మీద కాదు యాచకుల ప్రవర్తన మీద.... ఇచ్చిన డబ్బులని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోకు౦డా చుట్ట తాగుతాడో యాచకుడు ఖైనీ నములుతాడుమరొకడు పాన్ నములుతూనే డబ్బులడుగుతు౦ది మరొక ముదుసలి యాచకురాలు ఎ౦దుకిలా......... కొట్టుదగ్గర ఆగి నెమ్మదిగా సిగరెట్ వెలిగి౦చి ఆలోచిస్తున్నాను నేను డబ్బుకి గతిలేని వాడు ఎ౦దుకు తాగాలి అడుక్కుని మరీ ఎ౦దుకు డబ్బు తగలెయ్యాలి మన డబ్బు మీద వాళ్ళకెక్కడిది అధికార౦ ఇలా పొగచూరి సాగుతున్నాయి నా ఆలోచనలు మరి నేను తాగుతున్న సిగరెట్ కొన్నదెవరి డబ్బులతో ఒక ప్రశ్న ఆవహి౦చి౦ది నూటికి నూరుపాళ్ళూ నా కష్టార్జిత౦తోనే అ౦టే మన కష్టార్జితాన్ని ఎలాగైనా ఖర్చుపెట్టుకునే హక్కు మనకున్నట్టే యాచి౦చి ఆర్జి౦చిన మొత్తాన్ని ఇష్ట౦వచ్చినట్టు ఖర్చుపెట్టుకునే హక్కు కూడా వాళ్ళకు౦ది ఎ౦దుక౦టే అది వాళ్ళ కష్టార్జిత౦ ఉన్నోడు లేనోడు తేడాలు మనుషులకి ఉ౦డొచ్చు కానీ......వ్యసనాలకి అ౦దరూ ఒకటే ప్రతి మనిషి తన స౦పాదనలో కొ౦త భాగాన్ని తన వ్యసనాలకోస౦ ఖర్చు పెట్టడాన్ని కొన్ని సమస్యలను౦చి పొ౦దే ఉపశమన౦గా భావిస్తాడు.......... అన్న విషయ౦ గుర్తు రాగానే నా కాళ్ళు గుడివైపుకు కదిలాయి స౦దేహ౦ తీరాకా చేసే దాన౦ చాలా స౦తోషాన్నిస్తో౦ది అవసర౦కోస౦ గుడిలో నేను గుడిబైట వాళ్ళు చేతులెత్తి నేను చేతులు చాచి వాళ్ళు యాతన ఏదైనా చేసేది యాచనే......... పనసకర్ల‌ 16/04/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gGWGTG

Posted by Katta

Bolloju Baba కవిత

కొన్ని జ్ఞాపకాలు.... బెల్లంపల్లి బొగ్గు పుప్పొడి హన్మకొండ నూతి గుండె లోతూ చొప్పదండి వాసుల బుష్ కోటు ఆల్ఫా లో దమ్ బిర్యాని హెడ్డాఫీసులో లెమన్ టీ ..... కొన్ని జ్ఞాపకాల్ని వదిలించుకోలేం బుట్టలోని పాములా బద్దకంగా మెదులుతూంటాయ్. టాంక్ బండ్ పై అతిశయంతో అటూ ఇటూ తిరిగిన ఆంధ్రతేజాలు గద్దరన్న పాట, కెసియార్ అన్నమాట కాళోజీ, ఆశారాజు, అఫ్సర్, స్కైబాబ, గోరటి వెంకన్నల జ్ఞాపకాల్ని ఎలా చెరుపుకోవాలి? అయినా ఎందుకు చెరుపుకోవాలి? నీ తప్పేముంది నీకేంకావాలో ముందునించీ స్పష్టంగానే చెపుతున్నావ్! మాకే అర్ధం కాలేదు ఇంత జరిగేదాకా. నీకూ ఏవో జ్ఞాపకాలు ఉండే ఉంటాయిలే చెప్పుకోవటం లేదు కానీ! కొన్ని జ్ఞాపకాల్ని చెరుపుకోవాలనుకొన్న కొద్దీ నత్తగుల్ల మెలికల్లా వెలుగులోకే తెరుచుకొంటాయి పూల చుంబనాలలో చెట్లు అమరత్వం పొందినట్లు ఈ స్వప్నాలలోనే జీవిస్తాను నేను. బొల్లోజు బాబా

by Bolloju Baba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qJz049

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | కుడికాలు ........................... అలిసిపోతున్న నాకు మళ్ళీ ఇలా ఆశలా ఎదురయ్యావు కలలులేని రాత్రిలో సేదతీర్చే కవితలా మారావు రహస్యాలు లేని రోజులకు నీవే రూపశిల్పివయ్యావు కవియోధుని కాపాడే ఊహవయ్యావు. భావుకతవయ్యావు గాయపడిన దేహంపైన వాలిన అమృతహస్తంలాంటి పక్షివయ్యావు వసంతంలా భూమిని వరించిన రంగురంగుల నవ్వువయ్యావు సీతాకోకచిలుకలా మారిన రూపాంతర జీవనపరిణామానివయ్యావు. * ఊడుగుచెట్లు, పల్లేరు కాయలు, నల్లవాగులో నా రక్తం పీల్చిన జలగలు, మంచెల మీద నేనల్లిన పాటల గమకాలు, నోరూరించిన తుంగలు, తలలూపే జొన్నకంకులు,.. అన్నిటా తొంగి చూసిన అద్భుత, చిత్ర విచిత్ర భావాల మిశ్రమపు బతుకు పుప్పొడివయ్యావు. సానబట్టిన ఉలిలాంటి నాలోని కాంక్షవయ్యావు నా నిద్రించిన రాత్రుల్లో దోగాడిన పసి యవ్వనానివయ్యావు చిగిర్చే చింతచిగురుమీద ప్రకృతి గీసిన భవిష్యత్తు ఆకుపచ్చదనానివయ్యావు * అద్దం ముందునిలబెట్టి నన్ను నాకు చూపించిన ఆత్మవయ్యావు. మా అమ్మ ముఖం ముడతల్లో తొంగిచూసే వాత్సల్యపు మెరుపువయ్యావు. చెవుల్లో గింగిర్లుపోయే మా నాన్నగొంతులోని కూనిరాగంలా నా హృదయాన్ని తాకే అద్భుత వాహికవయ్యావు * ఎంత కరుణ ఎంత ప్రేమ ఎంత వాత్సల్యం నీకు ! నీ కుడికాలు నా జీవితపు వాకిలిలో మోపినప్పుడే నేను అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడాను నా మనసుకు తొడిగిన స్వప్నాలకు నీవిచ్చిన అర్ధంతోనే నేను కవినయ్యాను. # *పాతవాచకం - 5.2.2001/16.4.2014

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qJuToF

Posted by Katta

Ramakanth Vengala కవిత

ఇప్పుడు చెప్పు --------------------------- రక్తచారికలమయమవుతున్న వర్తమానం .. భవిష్యత్తుకోసం తవ్వుతున్న శాశ్వత సమాధి!! ఇక గతమంటావా.. ఎప్పుడో స్పృహ మరిచిన దేహం .. విసిరి పారేసిన వస్త్రం!! ఇప్పుడు చెప్పు.. చరిత్రలో చోటుకోసం.. నువ్వేసుకుంటున్న కర్చీఫ్ మిగిల్చేదేంటో?? ---ramu

by Ramakanth Vengala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eyYGP5

Posted by Katta

Kavi Yakoob కవిత

" అంతరాంతరాల్లో అలరారే తడివల్ల లోచూపు వెలుగంగ లోకమగుపించెన" -గోరటి వెంకన్న

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qJgYPG

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j01fqw

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//పాత వసంతం// తలుపులేసుకొన్న గతానికి గొళ్ళం విడివడుతుందని చిగిర్చిన ఓసాయంత్రం పరిమళిస్తుందని చెప్పలేదు ఏ జ్యోతిష్యూడూ... కాలం-కర్మం రెండు చక్రాలు బండి దారిలో సమాంతరంగా నడిచామని ఎరుకలో మీరు మీరు అని సంబోధించుకుటూ గోడల్ని కళ్ళతో గోకిన ఉభయకుశలోపరి మర్యాదలన్నీ పూర్తయ్యాక ఉండబట్టనివ్వని కబుర్లతో మళ్ళీ నవ్వులని తవ్విపోసుకున్నాం... కాలం ఎంత కఠినమైనదో సమయం ఎంత చిన్నదో మనకిద్దరికీ తెలుసు! ఉంటాను.. అన్నాను వెళ్తారా!! అన్నావు ఆరోపణల పర్వం అడుగిడి వివరణలు విడి వడి ఈసారి కుటుంబసమేతంగా కలుద్దామని వీడ్కోలు తీసుకొన్నా తీరా బయల్దేరాకా.. వెనుక నుంచి అడుగుల శబ్దం తిరిగి చూసే ధైర్యం లేక పక్కకి చూస్తే బండి హేండిల్ కి ఉన్న అద్దం బంధించిన దృశ్యం ఆకాశంలోంచి నవ్వుతూ చందమామ....అద్దంలో 15.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j01fa1

Posted by Katta

Nagaram Dprakash కవిత

:మరణ శాసనం: మరణం నిజం జీవితం అబద్దం నిజాన్ని మరచి జీవితాన్ని ప్రేమిస్తున్నావు అబద్దాన్ని ప్రేమించి మరణాన్ని మరచి పోతున్నావు ఒకరినొకరు అనిచివేయడంలో జీవితం నలిగిపోతున్నది ఒకరినొకరు మించిపోవడంలో జీవితం మునిగిపోతున్నది అందరికి విలువ యిచ్చి నిన్ను నువ్వు మరిచిపోతున్నావు అందని దానినికొరకు అందుకోవలసిదాన్ని విడిచిపోతున్నావు . ఈర్ష నిన్ను కబళించినపుడు వాస్తవాన్ని పలకరించు కోపం నిన్ను ఆవహించినపుడు మెల్లిగా కాలం కాలువదాటు ధైర్యం అంటే పిరికితనాన్ని దాచడం నిగ్రహం అంటే ఆగ్రహాన్ని కప్పడం జీవితమంటే అనుకో ఒక యుధ్ధంగా మరణించడానికి ఉండాలి సిధ్ధంగా నాగారం డి ప్రకాశ్ 9848865350

by Nagaram Dprakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j01f9S

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతుంది__2 -------------------ఆర్క్యూబ్ బెంజమిన్ మొలైసే ..ఓలే సోయెంకా కెన్ సారో వివా ..దస్తవిస్కి వీళ్ళంతా-రూపాయీకరించిన లిపిని అక్షరాలా సారవంతం చేసిన ఎర్త్ వార్మ్ స్ అది- ఆయుధాంబరి లోహచలనంలో ఉన్నది కదా రుబాబు జేసే చెయ్యిదే చరిత్రగా శాషిస్తున్నది అందుకే వాళ్ళిప్పుడు ఎక్కడి కక్కడ అగ్గి దుంకుతున్న నిషిద్ద కవిత్వం * * * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gGeDlt

Posted by Katta

Sri Gajula కవిత



by Sri Gajula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gG3PDF

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి || రామ.. రామ|| తమీజ్ ఎవడబ్బసొత్తు భాయీజాన్ గాయం సలపరించినపుడల్లా తడుముతున్నావ్ మనసును ఎవడ్నడ్డం పెట్టుకుని తిడుతున్నావ్ మర్యాదాపురుషోత్తముడ్ని తడవ తడవకూ నీకోరంగు నాకోరంగు అని రక్తానికి రంగులద్దినప్పుడే మూడురంగుల జెండాలో ధర్మచక్రం తెల్లబోయింది ఘాతుకానికి ఒడిగట్టింది రామ సంతానమన్నప్పుడే సహనపు పరిధుల్ని మాట దాటిపోయింది. మనుషులు మాంసం ముద్దలైన అకృత్యానికి జయధ్వానాల వేలంవెర్రి ఒకటి కళ్ళారా చూసినవాడ్ని ఓ సందర్భ అశుధ్ధం అది. భావోద్వేగ ప్రలాపాలను వారసత్వమనుకునే వెర్రికి పోటీ ఏది? దిగ్భ్రాంతి చెందిన దేశమంతా అయ్యో! రామ!! అని నోరుతెరిచినప్పుడు మనసు చెవిటిదయ్యిందా!! అదే నావారసత్వమని నువ్వు నమ్మేదెలా!! ఏ ఆహారంకోసమో చంపేది మనిషైనప్పుడు బలయ్యేది మూగజీవమేకదా ఏ వ్యవహారం కోసమో బలయ్యేది మనిషైనప్పుడు చంపేది ఉన్మాదమేగా దానికి మతాలతో పనుంటుదా అభిమతాల గొడవ కత్తికి పడుతుందా హింస రచన చేసేవాడెవడైనా కాఫిరే ఈ దేశంలో కట్టె ఏరంగులో మండినా దాన్ని మంటే అంటారు కత్తివేటును ఎక్కడన్నా కసాయితనమనే అంటారు బీభత్సానల వర్ణ వివరణలు నాకు చేతకావు రాజకీయ ఎత్తులను మతంతో మూటకట్టలేను నీకు అలాయ్-బలాయిచ్చే నీ భాయిని నేను విధివంచితులంతా నా తోబుట్టువులే ఏదో సందర్భాన్ని ఎత్తుకుని కళ్ళొత్తుకోకు ఏడ్చి- ఏడ్చి కళ్ళొరిసిపోయే ఉన్నా నీ కళ్ళద్దాలను సర్దుకో ఇలాంటివి ఎన్నో విన్నాం కన్నాం మోసాం ఇప్పుడిలా నువ్వూ- నేనూ మిగిలాం అవమానింపబడి కోల్పోయిన గతాన్ని ఇద్దరం మర్చిపోలేదెన్నడూ జరిగినదారుణాలెన్నో..వ్రణాలై స్రవిస్తున్నాయి తలవాల్చి నే నుంచున్నా మంచినే తలవాలని చిరుగుల చరిత్రను మరుగునపెట్టాలి మనం కోతిపుండుని ఎంతకాలం కెలుక్కుందాం తోచిన అర్థం వెతుక్కుంటూ నువ్వొద్దొన్న వాడేమీ నా చుట్టమూ కాదు వాడొక్కడే నా కున్న నాలుగు దిక్కులూ కాదు మోడును తిట్టుకుంటావో.. గోడను కట్ట్టుకుంటావో దుష్టుల దృష్టాంతాలు చూపించి వీళ్ళే నీవాళ్ళని...గిరిగీసి ' ఏ గాడిదను నాగాడిన పెట్టాలనుకుంటున్నావో!! నేను మాత్రం నీకన్నా పరాయిదేశపు సోదరుడే ప్రేమాస్పదుడేమోనని తలపట్టుకుంటున్నాను అయినా సరే.. భారతదేశం నా మాతృభూమి స్వధర్మనిరతులైన దైవనిందితులు.. నా సహోదరులు =16.4.2014=

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hUFc28

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/చీకటి పూలు ::::::::::::::::::::­::::::::::::: కొన్ని ఆలోచనలు కరగాలి ఆవేశాల వెనుక మరికొన్ని అవశేషాలు మిగలాలి ఆత్మల అర్పణం తరువాత నిన్నల్లోని క్షణాలు నేటిలోకి అనుభవాలుగా తోడుకుంటూ బ్రతకాలి కొన్ని చీకటి పూలు పూయాలి ప్రతి రాత్రి పగటి చొక్కా విడిచేశాక శూన్యంలో కొన్ని అక్షరాలు పదే పదే గుర్తొస్తూ/­గుర్తుచేస్తూ కొన్ని పక్షులు అప్పుడేపుట్టి రెక్కలు విదల్చకుండా కళ్ళతో లోకాన్ని వీక్షించే యత్నం మళ్ళీ కొన్ని ఊహలు అనిశ్చితంగా ఈరోజు నా ముందు... తిలక్ బొమ్మరాజు 16.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iZlJyv

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ _____''రెక్కలోచ్చాయి'' వొంటికి అంటుకున్న పురిటి వాసన ఇంకా ఆరనేలేదు వాడికి అప్పుడే రెక్కలోచ్చాయి ఎగిరిపొవటానికి. గుండెలపై ఆడిన ఆ పాదాలు ఇంకా బ్రతుకు నడక నేర్వనేలేదు కన్నవారిని మరచి కొత్తదారులు గాలిస్తున్నాయి . ఇక్కడ తన చిన్న ఉనికిని కూడా స్తాపించలేదు ఊహల లోకంలో ఆశల సౌదాన్ని నిర్మిస్తూ ఆత్మవంచనలను తవ్వుతూ .. వాడెప్పుడూ పోతూనే ఉంటాడు మూలాలను మారుస్తూ ,గతాలను విస్మరిస్తూ , కొన్ని జీవితాలను గాయపరుస్తూ . వెనుతిరిగి చూడదు కనుపాపలకు దూరమైన రాగబంధాలు కన్నీళ్ళతో పిలుస్తున్నాయని తెలిసీ ! (16-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eIsLMo

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||ఆకర్షణ|| 1 ఎంత సులభంగా మర్చిపోవాలనుకుంటావ్ అలా నవ్వి, ఇలా ఏడ్చి ఎలా మోహంచాటేస్తావో నువ్వు. మనం మనం మాట్లాడుకోవడానికి రాజ్యాంగాలతో పనేముంది. తప్పుదొర్లడం ఎంత సహజమో మాటజారడం ఎంత ప్రాకృతికమో వాదించుకోవడం ఎంత పురాతనమో తెలియనంత వృద్దతనాలలోకి ఎలా జారుకుంటున్నామో మనం. 2 జీవితం చిన్నదే, అన్నాననే కదా అలా దూరం వెళ్లిపోతున్నావ్. విలువలకుండే విలువను ప్రశ్నించాననే కదా భరించలేనట్లు చెవులు మూసుకున్నావ్. కాస్తబురదను పూసుకొని వొళ్లుకాల్చుకొని, తూగుతున్నాననే కదా అలా జరిగిపోతున్నావ్. 3 నువ్వుకన్నవెలుగుని, చీకటన్నానని నా చీకటిని చీకటనప్పుడు నవ్వుకున్నానని నువ్వేసిన దారెమ్మటి నడవలేదుని నీ పలుకులను నే వల్లేవేయలేదని నీ చేతిని విడిచి నడిచానని ఒక్కో కారణాన్నో, సాకునో వదలడానికి విడమరుస్తున్నప్పుడు నేను నీకు మరంత దగ్గరియ్యాను. --------నవంబర్ 13------16/4/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iZgRJK

Posted by Katta

Bhaskara Madhusudana Rao కవిత

రాహుల్ గాంధికి పాపం కారు కూదాలేదంట. పోని భొజనంచేసే ప ళ్ళె మైనా ఉందా? సీమాంధ్రలొ congress కు 1300 మంది ఎన్నిలలోపోటి చేసేవాళ్ళు ఉన్నారంట!.అంటే వాళ్ళకు వచ్చే votes అన్నే అన్నమాట

by Bhaskara Madhusudana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qItn6j

Posted by Katta

Padma Sreeram కవిత

నారీ....నిను రక్షించేవారేరీ!!! || పద్మా శ్రీరామ్|| హనుమజ్జయంతి....ఎండకన్నె ఆయన కోపంలా ఎదిగి ఎదిగి రాముని నామం విన్న హనుమయ్యలా మెల్లిగా చల్లబడుతున్నవేళ.... కోటీలో బయలుదేరిన బస్సు నిండుగర్భిణిలా మెల్లగా నడుస్తోంది... ఉన్నట్లుండి ట్రాఫిక్ జామ్...డప్పులతో గెంతులతో గుంపు ఎదురైంది. దేవుని ఊరేగింపనుకుని అర్జెంట్ గా కళ్ళు మూసేసుకుని (దేవుణ్ణి చూడకూడదనా, దేవుడెదురుగా ఉన్నాడనే మూఢభక్తా...) ఓ దణ్ణఁవెట్టేసుకున్నా. కళ్ళు తెరిచి చూసేసరికి దేవుడు కాదు...ఆయన సన్నిధికేగుతున్న ఓ జీవుడు. హ్మ్... అదృష్టవంతుడు డైరెక్ట్ వైకుంఠానికేగాడు అనుకుంటూ వెన్నంటి వస్తున్న మహిళల గుంపు చూసి ఉలిక్కిపడ్డాను. నలుగురు పెద్ద ముత్తైదువలు ఆ వెనుక ఓ పెద్దామె చేతుల్తో పొదివి పట్టుకున్న ఒక పదిహేనేళ్ళ పిల్ల. ఎర్రని చీర కట్టి నుదుట పావలాకాసంత సింధూరం దిద్ది మెళ్ళో మల్లెల దండ తలపై పూలతో చేసిన టోపీ... అంటే...అంటే.....అంటే....ఆ పిల్ల.... తాళిబొట్టంటే అదేదో గొలుసనుకునే వయసు. తనకి ఏం చేయబోతున్నారో తెలియని మనసు. మెళ్ళో దండ సర్దుకుంటూ...మామ్మతో అడుగులు వేస్తున్న ఒక బలి పశువు...ఊరేగింపులో స్నేహితురాళ్ళు వెనక వరసలో ఉన్నారు కాబోలు మాటిమాటికి వెనక్కి చూస్తూ అంధకారమని తెలియని జీవితంలోకి ముందుకడుగులేస్తూ.... బస్సులోంచి చూస్తున్న మహిళలందరికీ కళ్ళనీళ్ళొచ్చాయి కానీ నాకు రాలేదు. ఏదో నొప్పి ... చూపు తిప్పనీయక ఊపిరాడనీయక .... ఇల్లు చేరగానే విపరీతమైన తలనొప్పి. కళ్ళముందు ఎదపై తాళితో తొక్కుడుబిళ్ళాడుకుంటున్న పాపలు....తెల్ల చీర సర్దుకుంటూ నడవలేక (జీవితాంతం) బొక్కబోర్లా పడుతున్న పసి కూనలు.. ఎటు పోతున్నాం మనం ... మళ్ళి మరో వీరేశలింగం , రాజారామ్మోహన్ రాయ్ పుట్టాలా? వీధికెక్కి చేసే పోరాటాలన్నీ ఆర్ధికాలేనా...హార్ధికాలెప్పుడొస్తాయ్ !!! సంప్రదాయాలు సముచితమే అక్రమాలు కానంతవరకూ. పైగా అవి పది మందికీ ఊరేగింపుగా చాటిస్తూ చేసే సంబరాలా? జాతర్లలో బలిచ్చే మేకపిల్ల బ్రతుకే నయం ఒక్క వేటుతో బ్రతుకు భారమంతా హాంఫట్....కానీ ఈ ఆడపిల్లలు ? ఎప్పటికి ముగిసేనీ వింత అయోగ్య అక్రమ క్రతువు ? చిట్టికూనా ...నీకిక ఇదే జీవితమా... 16 Apr 2014

by Padma Sreeram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mbZrxp

Posted by Katta

Nirmalarani Thota కవిత

జీవితం ప్రతి మలుపు వద్దా సమాధి అవుతున్న ఒక్కో స్వప్నం ! వేసే ప్రతి అడుగునూ సవాలు చేస్తూ ఒక్కో సత్యం ! స్వప్నానికీ సత్యానికీ మధ్య యెడ తెగని నిరంతర సంఘర్షణ ! నిజమే.. జీవితం ఎప్పుడూ వీడని ప్రశ్నే ! బతుకు పోరులో అలసిన జీవపు శ్వాసకు ఊపిరి పోస్తూ ఒక్కో అమృత హస్తం ! జారే ప్రతి కన్నీటి బొట్టునూ ఒడిసి పడుతూ ఒక్కో బంధం ! మనిషికీ మనసుకూ మధ్య ఎల్లలు లేని అనిర్వచనీయ ఆత్మీయత ! అవును.. "ప్రేమ" ఎప్పుడూ వెచ్చని సమాధానమే ! మూకుమ్మడిగా గాయాలు రేపే గేయాలు జీవితం అయితే ఒకరికొకరుగా పెనవేసుకున్న ఆలంబనలే జీవించడం ! రెండూ నిజమే.. రెండూ మనమే . . ప్రశ్నలూ . . జవాబులూ .. చీకటి లేని చోట వెలుగుకు విలువెక్కడిది? 16.04.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hKMTOc

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నువ్వొంటరివి కాదే నా చెలి...: నువ్వొంటరివి కాదే నా చెలి నీ హృదయపు ఉద్యానవనంలో సేదదీరుతున్న నా ఊసులతో బాసలాడుతున్నావు కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి నీ మధుర భాషణపు భూషణమున నా సహానుభూతి తరగల తేలియాడుచున్నావు కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి ప్రకటిత పరిసరాలందున పంచ భూతాలను నేనావహించి నిను సంభ్రమాచర్యాలలో మునకలేయిస్తున్నాను కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి బయలుదేరు సమయాన అనుభూతుల దొంతరలను నీ మనమున బహు ప్రియముగా కూర్చినాను కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి మన మమతల బృందావనిలో మయురాంగనవై విహరించుటకు విధాత కల్పనల మొలచిన అనురాగ శిల్పం కదా..! నువ్వొంటరివి కాదే నా చెలి నీలో నేనున్నంత వరకు..!! నువ్వొంటరివి కాదే నా చెలి నన్నావహించి నువ్ నిలుచు వరకు..!! 16/04/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFhF9m

Posted by Katta

Rajeswararao Konda కవిత

నమస్తే.. నేస్తమా..! @ రాజేష్ @ //16-04-14// ఒకరిపై మరొకరు చేసుకుంటున్నారు విమర్శలు నేతలకు ఇన్నిరోజులూ గుర్తుకు రాలేదా ప్రజల సమస్యలు ..!! ఎన్నికలకే పరిమితమయ్యే ఈ నేతల వాగ్దానాలు అమలయ్యేనా ఇకనైనా ఈ నూతన హామీలు..!! ఎవరు ఏమి చేస్తారో చూస్తేనే తెలుస్తోంది ట్విస్ట్ అందుకే తెలియజేస్తారు ముందుగా మేనిఫెస్టో..!! ఎవరు న్యాయం చేస్తారో తెలుసుకోండి ఓటు వేసేముందే ఎవరికి వారు నిర్ణయించుకోండి..!!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l0hdGQ

Posted by Katta

Aruna Naradabhatla కవిత

మెరుపు కల _____________అరుణ నారదభట్ల ప్రేమాక్షరాలు రాలిపడుతుంటే నాకే అంకితమనుకున్న అక్షరానికే పరిమితమని తెలిసి వెనుదిరగలేనందుకు మౌనంలో మునిగిపోయా! ఆకాశం హరివిల్లై విరిసినప్పుడల్లా అన్ని రంగులు జీవితంలో పండుతాయనుకున్న! నువ్వు ఎరుపు రంగై కాలుస్తుంటే నేను ఊదారంగై మిగిలి పోయా! వర్షం కురిసినప్పుడల్లా అహ్లాదంగా ఆహ్వానించినందుకేమో నేనే ఓ వర్షంలా చినుకులు రాలుస్తూనే ఉన్న! ఎగిరే పక్షులను చూసినప్పుడల్లా నా స్వేచ్చా వృక్షంలా విశాలమైనదనుకున్నా మూడుముళ్ళ పంజరాన ముడుచుకుని కూర్చున్న! వెన్నెల రాత్రుల్లో చందమామ మనమధ్యన ఎందుకనుకున్న నువ్వే నా చందమామవని చీకటినిండిన శూన్యాకాశానివని నాలోకి నిండుకున్నాకగానీ తెలిసింది! పిల్లగాలిలో చల్లగా నడిచినపుడు ఆశలూ...ఆశయాలూ స్వచ్చంగా నిండుతాయనుకున్న ప్రకృతి కరువైన కంకర రోడ్డులా ఉత్తి రాళ్ళై గుచ్చుతున్నాయి! విరిసే పూలతోటలో తిరిగినప్పుడల్లా పరిమళాల పలకరింపులు జీవితాంతం నిండుతాయనుకున్న మండే సూరీడై వాడిన పూదోటలా మార్చే ఆయుధమవుతావని కలగనలేదు! మెరుపులా వచ్చే పిడుగులాంటి "ప్రేమ" వెలుగులో చీకటవడమె మనసున్న మనిషి వంతేమో! 16-4-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hK4Ooa

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXMtzm

Posted by Katta

Srinivas Denchanala కవిత



by Srinivas Denchanala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXIvGW

Posted by Katta

Sree Kavita కవిత

|| చిరునవ్వు || @ శ్రీ కవిత 16.04.2014 చెలీ ! ఓ నా ప్రియ సఖీ ! స్నేహార్ద్రపు నయనాలతో నాలో ప్రేమ మత్తును నింపావు కష్టాలను భరిస్తూ కన్నీళ్లను దాచుకొని నిన్ను నీవు మరిచి ప్రేమ సుధను కురిపిస్తావు నన్ను నేను మరచేల ముద్దు ముద్దుగా మురిపిస్తావు స్వార్థం లేని ఈ వలపుల వలయంలో నిస్వార్థంగా నేను కోరు కునేది ఒక్కటే అది ...... మచ్చలేని జాబిలిలా పవిత్ర గంగాజలంలా పున్నమి వెన్నెలలా ఆమనీ కోయిలలా విరిసిన పుష్పాలపై మంచు బిందువుల్లా కొండల మీద నుంచి కిందకి దూకుతున్న ప్రణయ గోదారిలా మధుమాసం మంచులో తడిసి విచ్చుకున్న ముద్ద మందారంలా గులాబీ రేకు మీద నుంచి జారి పడుతున్న నీటి బిందువులా అందాలా బృంధావనములా నయగారాల నందన వనములా పిల్లన గ్రోవిని విన్న గోపికలా మదిని పులకింపజేసే ........ ప్రకృతిలో ఏ అందానికి సాటిలేని నీ చిరునవ్వు ... నా మనసు కోరు కునేది..అదే ...నువ్వు నీలో ఆ చెరగని చిరునవ్వు ..ఎప్పటికి నవ్వుతు నవ్విస్తూ ఉండాలనీ

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hJOjsr

Posted by Katta

Rvss Srinivas కవిత

|| నా వసంత కౌముది || ఏ నీలిసాగరాల తరంగాలు నేర్పాయో నీ కురులకి ...నా ఊపిరుల వాయులీనాలకి నాట్యమాడమని ఏ విలుకాడు నేర్పాడో శరప్రయోగాలు నీ కన్నులకి ...గురితప్పకుండా నా మదిని భేదించమని ఏ నదులు నడుం బిగించాయో నీ నడుముకి కొత్త ఒంపులు నేర్పేందుకు మావి చివుళ్ళు మెక్కిన ఏ కోయిల నేర్పిందో గానాలు నీ గళానికి...మత్తెక్కించే గానంతో నన్ను వశపరుచుకోమని ఏ దివ్యసుమాల మకరందం గ్రోలాయో జుంటితేనెల మాధుర్యాన్ని మాటలలో కలిపే నీ అధరాలు ఏ లతల వద్ద నేర్చాయో నీ బాహువులు ఇంత చక్కని అల్లికలు...నను వదలని పెనవేతలు ఎన్ని పున్నములు కలగంటున్నాయో నీ వన్నెల నృత్యానికి యవనికగా మారాలని ఎన్నెన్ని వసంత కౌముదులు పోటీ పడుతున్నాయో నాలో నీవు కుమ్మరించిన వసంతాలకి నీడగానైనా ఉండాలని నా కన్నులు ఎన్ని స్వప్నాలు చూస్తున్నాయో నీతో కలిసే ప్రతి స్వప్నం...స్వప్నంలో కూడా అసత్యం కాకూడదని...@శ్రీ 16/04/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p8IlVV

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

*నోటా ఛాయిస్* నువ్వూ చూస్తున్నావ్! అరవై ఏళ్ళుగా ఎన్నికల్నీ ఎన్నికైన నాయకుల్నీ నిన్నూ, నీ దేశాన్నీ ప్రేమిస్తున్నామంటూ వాళ్ళు చేసే ప్రతిష్టాత్మకమైన పనుల్నీ నువ్వూ చూస్తున్నావ్! నువ్వు చూసే ఉన్నావ్! ఐదేళ్ళకింద నీ పొలంలో నాగలి పట్టుకొని నీ తువ్వాలను నడుముకు చుట్టుకొని నీతో నాలుగు అడుగులు నడిచి ఫోటోలు దిగిన వాళ్ళని విరిగిన నీ గుడిసె నిట్టాడును చూసి కళ్ళ నీళ్ళ పర్యంతమైన వాళ్ళని కూలిన నీ బతుకు బంగారం చేస్తానన్నవాళ్ళని నువ్వు చూసే ఉన్నావ్! నువ్వు అనుభవిస్తూనే ఉన్నావ్ ! ప్రజాసేవ పేర వ్యాపారీ, దళారీ, స్థానికుడూ, సామ్రాజ్యవాదీ నువ్వేసే ఓటుకు వెలకట్టి ప్రజాస్వామ్యాన్ని అంగడి సరుకుచేసి కులాన్నీ, మతాన్నీ, సంఘాన్నీ క్వింటాళ్ళ కొద్దీ డబ్బులతో తూకం వేస్తున్న స్థితినీ నువ్వు ఐదేళ్ళూ అడుక్కునే పరిస్థితినీ రెండు రూపాయల బియ్యంతో మొదలుపెట్టి ఇప్పుడు రెండు పడకగదుల దాకా నీ బిచ్చగాని వేషాన్ని డెవలప్ చేసిన దుస్థితినీ నువ్వు అనుభవిస్తూనే ఉన్నావ్ ! వాళ్ళు నీ ఒక్క ఓటునే అడుక్కునీ వీలైతే కొనుక్కొనీ నిన్నేం చేశారో నువ్వు చూస్తూనే ఉన్నావ్! చూస్తూ చూస్తూ ఊరికే ఉంటావా! నువ్వూ ఒక చూపు చూడు! ఈతాకులిచ్చి తాటాకులు దొబ్బే నాయకులకు షాకిచ్చెయ్! ఆ నోటా ఈ నోటా పాకిన గాలిబుడగ వార్తలు పేల్చేయ్! ఏ నోటూ వద్దని ఈ“నోటా” మీటెయ్! ఎందుకంటే! భారతదేశం నీ మాతృభూమి ప్రజాస్వామ్య రక్షణ నీ ఆజన్మ విధి తేదీ: 16.04.2014

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l5G5sz

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి ॥ కాలం ॥ కాలమా ... ! కన్నీటి గోదారివై నాకలంలోకి జారిపోతుంటావు ..!! వెలుగునీడల గాధలన్నీ నీ ముళ్ళుకు వేళ్ళా డుతూనే ఉంటాయి .. బాల్యం నుండి యవ్వనం లోకి ... యవ్వనం నుండి వృద్దాప్యం వేపు నిర్దయగా జీవకోటిని లాక్కెళ్తూ .. చివరికి నీ క్షణాలన్నీ మృత్యువు వేపే ... నీ ప్రవాహంలో పడి యాంత్రిక దేహం విలపిస్తూ ఉంటుంది ..!! రాగ ద్వేషాలకతీతంగా దేవుడే శాశించినా ఆగని నీయానం విషాదం వేపు సాగుతూ నే ఉంటుంది ..! సూర్యచంద్రులను గిరగిరా తిప్పేస్తూ సాగే నీ యానం చరాచరానికి సరికొత్త అధ్యాయం .. ! కాలం మాయాజాలం ... ! రాలిపడే క్షణాలని రాగరంజితం చేసుకుంటూ కాలం వెంట సాగటమే కదా జీవితం ... !! వజ్రానికన్నా విలువైన క్షణాల్ని వృధా చేయక మానవత చాటే మనుషుల మై తే ...! కాల చరిత్రలో చెరగని చిత్రాలమావుతాం ... !! --------------15 – 04 -2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eNFU14

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

మౌన రాగం ----------------- రావెల పురుషోత్తమ రావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ఆమె వెళ్ళిపోయినా ఆ మె అందించి వెళ్ళిన అనురాగ పరీమళం నన్నింకా కట్టిపడేస్తూనే వుంటున్నది పులకిత గాత్రుడిగానే ఉంచుతూ పునీతం గావిస్తున్నది. అందుకే ఆమె ఓ ఆనంద నందన వనం కాoక్షలనీడేర్చే కల్పవృక్షం. అనునిత్యం అభిమానించదగిన అపూర్వమౌ ఆమృతకలశం. ఆమె అనుస్యూతంగా నినదిస్తూ ప్రహించే ఓ సుమధుర గాత్రం వీనులకు విందుగా కనులకు పండుగగా కనిపించే ఓ పున్నమి వెన్నెల పురస్కారం అందంగా నడయాడుతూ వెల్లువై పొంగి పొరలుతూ సమ్మోహన పరిచే సౌందర్య సౌమనస్య శిఖరo శోభాయమానమై తళ్కొత్తే తనూ లతికగల అద్భుత కళాఖండపు చిత్తరువు. ఆమె స్మృతుల్లోనే నేను ఆశలపల్లకినై ఊరేగుతాను. జీవనదిగా నిరంతరం శోభిస్తూ అనునిత్యం ప్రవహిస్తాను. ఓ వెన్నెలలో వెలుగొందే కాళిందినౌతాను పచ్చని పంటపొలాలకు నీరందించే పవిత్ర గోదావరినౌతాను. సౌరభాలను ప్రసరించే సుమదళమై సోయగాలుపోతాను.16-4-14 ========================

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hTq7hj

Posted by Katta

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర//హైకూ హారం-4//16.04.2014 ఆక్వేరియం.. అక్కడక్కడే ఈదుతూ చేపపిల్లలు, స్వేఛ్చకు సంకెళ్ళు! రంగుల చీరల్లో.. పూలవేదికలపై ఆడుతూ.. సీతాకోకచిలుకలు! పాత పట్టుచీర.. ఉయ్యాలయ్యింది పాపకి, అమ్మే కనిపిస్తోంది! మంచుకడిగిన.. అందమైన పూలు, నిద్రలో పాపాయినవ్వులు.. కొంగకి చిక్కిన చేప.. ఒకరికి మరణం, మరొకరికి జీవనం! వానచినుకులు.. నదిలోకిదూకి ఆడుకుంటున్నాయ్! నీటిబుడగలతో! వానవెలిసింది.. ముస్తాబవుతున్న చెట్లాకులు, ముత్యాల దండలతో! పచ్చని పైరు.. కలుపుమొక్కలు పీకేయ్! జీవితం సుఖమయం! శాంతి పావురం.. చంపినా..ఎగరెసినా.. నీవ్యక్తిత్వమే! శ్రీమతిని.. విసిగిస్తున్న బాబు, అమ్మగుర్తొచ్చింది! ........16.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eGPl8b

Posted by Katta

Sasi Bala కవిత

కరుణ లేని కాలం !!!!.....శశిబాల (16 ఏప్రిల్ 14 ) ------------------------------------------------------- ఎందుకు కాలమా ! నీకింత నిర్దయ నా నేస్తానితో వున్నప్పుడు మాత్రం ఎందుకంత పరుగులు తీస్తావు అతనికై నిరీక్షణలో మాత్రం క్షణమొక యుగం లా అనిపిస్తావు నా వళ్ళంతా కళ్ళు చేసుకొని నా నేస్తానికై నేను చూసే ఎదురు చూపు నీకు ఎగతాళిగా అనిపిస్తున్నదా నీ గర్భం లోకి ... ఎన్నో రాజ్యాలు ,ఎన్నో శకాలు , ఎందరో రాజులు , మహారాజులు, సామాన్యులు జాతి బేధం ,మతం బేధం ,కులం బేధం అంతస్తుల బేధమన్నది లేకుండా కలిపేసుకున్నావు వారి కష్టనష్టాలను , దాచుకున్నావు గుండెలోవారి సుఖదుఃఖాలను ఏరీ వారేరీ ? ఏమై పోయాయి ? వారి హోదాలు ..వైభవాలు పేదల పట్ల వారు చూపిన నిర్లక్ష్యపు నిరసనలు ..కానరావే మనిషి ఎంత ఎదిగినా ..నీ కడుపులో ఒదిగి ఉండాల్సిందే అని నిరూపించావు ...

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gzy4so

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• ఉదయం కొన్ని పక్షులు •• ఉదయం చీరపై గింజలు బుక్కు పిట్ట బొమ్మలు- ••• మనసు కాలే అడివి రోజూ - నిప్పు కణికలు శరీరంపై జారు చెమటలు- నిస్సందేహం, వెనకా ముందూ కొన్ని గులకరాళ్ళ శబ్దం లోతును తెలుపు- ఎర్రమట్టి పాదం నీటి మీద మురికి మరక- ••• ఉదయం చీర గింజలు పిట్టలు గతం అంతా- మూలమలుపులో వేటగాడు గుండె ఆకలితో-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qFhiip

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -3 -------------------------------------------- ముస్లిం వాడలు - - - - - - - - - స్కైబాబ వాడు అందలంపై కూర్చొని నా దళితుల్ని కింద కూర్చోబెట్టేవాడు నా ఆదివాసుల్ని కాళ్ల దగ్గర పడి వుండమనేవాడు చేతులు కట్టుకొని నిలబడ్డం చేతులు జోడించడమే వాడు నా వాళ్లకు నేర్పింది మతం మారడం ఒక తిరుగుబాటు 'ఖాందా ఖాందా బరాబర్‌'గా నిలబడే మజీదుల్లోకి చర్చిల్లోకి నా వాళ్లు ప్రవేశించారు వాడి అహం దెబ్బతిని విడదీసి హత్యలు చేసే వాడి అసలు నైజాన్ని మరోమారు ప్రదర్శిస్తున్నాడు వాలి సుగ్రీవుల్ని విడదీసినట్లు దళితుల్ని ముస్లింలనుంచి వేరు చేశాడు వానరుల్ని వాడుకున్నట్లే ఆదివాసీల్ని ముస్లింలపైకి ఉసిగొల్పాడు యుగాల వారసత్వం కదా నా వాళ్లపైన సలసలకాగే సీసం పోశాడు బతుకు చక్రాన్ని నడపకుండా బొటనవేళ్లని నరికాడు ఖననానికి లేకుండా వేలమందిని సజీవ దహనం చేశాడు మళ్ళొకమారు నా వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డం చూస్తున్నాను మళ్ళొకమారు నా వాళ్ళు భయం భయంగా కింద కూర్చోడం చూస్తున్నాను ఒకరి మీద ఆధారపడడం తెలియని నా జాతిని ఇవాళ వాడు సర్కారు రూపమెత్తి 'దేహీ' అని చేయి చాపమంటున్నాడు అది వాడి హైందవ 'రాజ నీతి'! దళిత వాడలు ఊర్లలో కలుస్తున్న ఆనందం ఒళ్ళంతా పారకముందే ఇప్పుడక్కడ ఊరిబైట ముస్లింవాడలు వెలిశాయి

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QanK42

Posted by Katta