పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, మార్చి 2014, సోమవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ఋణము..: ఈ ఎద వాకిలి తలుపు తెరిచింది నీవే అనంతాకాశపు శూన్యం ఆవరించిన నా మనో మండలములో కోటి ప్రేరణా తారకలను వెలిగించినావు..! ఈ బదిరాంధక హృదయ సంద్రాన్ని లంఘించినదీ నీవే నా నిరాశ నిస్సత్తువ నిశీధి చట్రాన్ని ధనుమాడి ఆశల జాబిల్లివై చైతన్య జ్యోతికల వెలుగులు నింపినావు..! కాంతి విహీన కన్నుల కోటి సూర్యుల దివ్య ప్రభలను వెలిగించినదీ నీవే అంకిత భావమును నా కణకణమున ప్రవహింపజేసి విజయ తీరాల దారుల్లో నను విహరింపజేసినావు..! చేష్టలుడిగి అలసిన హస్తపు ద్వయమున పరిపుష్ఠిని చేకూర్చినదీ నీవే రుధిర జ్వాలవై అణువణువును నన్నాక్రమించి కష్ట సహిష్ణతను చేతల కూర్చినావు..! జాజ్వల్యమానముగా అంతహ్ చేతనమై నాలో వెలసినావు..!! సాధనా చంద్రికల సరోజనివై నా ఎద తటాకమున శాశ్వతముగ నిలిచినావు..!! మరో జన్మ కావాలి..!! నీ ఋణము తీరాలి..!! 10/03/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fk3MgH

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవిత



by రంజిత్ రెడ్డి కర్ర



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PkclOX

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

--- చిరాశ // నిరుద్యోగ సోదరా... // ******************************* నిరుద్యోగ సోదరా... నీరుగారి పోకురా చిరుద్యోగమేదైనా దొరుకుతు౦ది చూడరా డిగ్నిటీకి లోపమని దిగులె౦దుకు సోదరా స్వయ౦శక్తినమ్ముకొనర, స్వయ౦ ఉపాధినె౦చుకొనర అత్యాశకు పోవొద్దుర, అవినీతికి లొ౦గొద్దుర నువ్వేమిటొ నిరూపి౦చి జగతికి చూపెట్టరా.. ******************************** --- {10/03/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fjOHf2

Posted by Katta

Jagadish Yamijala కవిత

అలా ఇలా --------------------- సంగీతంగా ఆస్వాదిద్దాం జీవితాన్ని తీయగానే సాగిపోతుంది ---------------------- వేల భాషలున్నా నా తెలుగు భాషలా అందంగా బిడియపడిన భాష మరేదీ నాకు కనిపించ లేదు ----------------------------- అందంగా ఉంది లాభం లేదు మన మాటలో ప్రేమ కలిసుండాలి --------------------------------- నీ జ్ఞాపకాలను మోయడం వల్ల నా హృదయం గర్భకోశ మైంది -------------------------------- మనం కోపంతో విసిరేసిన ఒక వస్తువు ఎక్కడో అక్కడ ఒకరికి కానుక అవుతోంది --------------------------- పువ్వు కన్నా పవిత్రమైనది వర్షం మనస్సు ---------------------------- నా ఏకాంతం లోనూ నవ్విస్తోంది నీ జ్ఞాపకం -------------------------- తమిళంలో అక్కడక్కడా చదివినవే ఇక్కడ తెలుగులోకి తర్జుమా చేసాను. కానీ మూల రచయితల పేర్లు అందుబాటులో లేకపోవడంతో ఇవ్వలేకపోయాను - యామిజాల జగదీశ్ 10.3.2014 ---------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oF95aW

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

ఎంతటి వాడికి అయిన ఒంటరి అంటే చులకనే గొప్ప ఉద్యోగం చేసిన సంస్కారం లేకపోతె మనిషే కాదు నూరు గొడ్ల తిన్న రాబందు గాలి వానకు చచ్చును ఎన్ని పాపాలు చేసినా ఏదో ఒకరోజు నీకి ఖర్మ తప్పదు కనబడ్డ ప్రతి ఆడది నీకు పెళ్ళాం కాదురా కళ్ళు తెరచి చూడు అపరకాళికలు నీకు మృత్యు ఘంటికలు నిజం తెలుసుకో దొర అని పిలిచే నోటితో దగుల్బాజీ అనిపించుకోకు ఈ సమాజం లో నువ్వొక్కడివే కాదు వెధవ వి ఏంతో మంది నీకు వారసులు వున్నారు జాగ్రత్త నీ చెల్లెళ్ళు , అమ్మ , వాళ్ళు ఆడావాల్లె తెలుసుకో ఒక్కసారి నీ జీవితంలో ఛీ అనిపిస్తే ఎలా బ్రతికినా ఎన్నాళ్ళు బ్రతికినా వెంటాడుతుంది తెలుసుకో మనిషిగా మారు చేతకాకపోతే చావు బాధ లేదు !!పార్ధ !!10mar14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fjfP9h

Posted by Katta

కాశి రాజు కవిత

కాశిరాజు ||వొంగపువ్వు|| వేలితో సబ్బుబిళ్ళరగదీసి అద్దాన్నొక సారీ, నాననొకసారి సూసాక నువ్వెట్టుకున్న కాస్త కుంకుంబొట్టూ నీ నొసటమీద ఉదయించిన సూరీడు. నాన లెగిసినా, నేను లెగిసినా కనపడే నీమొకమే మా తూరుపుదిక్కు . నువ్వు మెడ తడుముకున్నాక కల్లద్దుకున్న పసుబ్బొందు నానతో ఏమ్మాటాడుద్ది? నవ్వే నిన్ను చూసి మానాన ఒయ్యారంగా తెంపిన వొంగపువ్వు నీ సిగనున్నాక అమ్మా అందమంటే నీదే కదూ ! 10/04/2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dHB8Vq

Posted by Katta

Prasada Murthy Bandaru కవిత



by Prasada Murthy Bandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9MJ1j

Posted by Katta

Varala Anand కవిత



by Varala Anand



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ejEFpK

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

స్వర్ణపతకమన్న స్వర్ణకారు డెవండొ వెలయజేయు పసిడి బిళ్ళ కాదు - కార్యదీక్ష, చెమట, గట్టి సంకల్పమున్ కలసి పోరి, పొందు 'గెలుపు గుర్తు' !

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k9ve1c

Posted by Katta

Pusyami Sagar కవిత

!!ప్రస్థానం !! _____ పుష్యమి సాగర్ అక్కడి వీధులన్నీ నే నడచిన అడుగుల శబ్దాన్ని కలుపుకొని కంకర రోడ్డుకింద పదిలంగా జారవిడిచిన గుర్తులను దాచేసుకుంటున్నాయి ..!!!! ప్రతి జ్ఞాపకం ఓ మొలకెత్తి న విత్తనం పువ్వులై నవ్వులై పెదాలపై అప్పుడు అప్పుడు పూస్తూ వుంటుంది ..!!! చిన్ననాటి చెలికాడు తో పంచుకున్న అరుగులు, బామ్మా పెట్టిన మరమరాలు జేబుల్లో పోసుకొని టైరు తో ఆడుకున్న సమయాలు గడియారం లో ముల్లై తిరుగుతూ తిరుగుతూ కళ్ళ లో నిలిచి పోతాయి చిన్నప్పటి పుస్తకాలను తాకినప్పుడల్లా !!!! నా మస్తిష్కం బాల్యం నుంచి కౌమారం లో కి సీతాకోక చిలుక లా ఎగిరొచ్చి హార్మోన్ల సన్నాయి ల కి లయబద్దం గా కొట్టుకొని అందమైన ఉహ దగ్గర అతుక్కుపోతుంది !!!!... ఉదర పోషణ కై ఎక్కని గడప ...దిగని గడప లా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినపుడు భుజం తట్టి ముందుకు నడిపించే ప్రియ స్నేహితులు ఉత్తరాలలో .... ఆత్మీయ పలకరింపులు...!!! ఎంత ఎత్తుకి ఎదిగినా మూలాలను మరువని నా చిట్టి గుండె ప్రస్థానపు గమనాన్ని పరికించి ప్రతి క్షణం కొట్టుకుంటుంది ఆగే వరకు వీడిపోను అని ..!!!! మార్చ్ 10, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gdpDWG

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N0fCRi

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ అనాథ ॥ వాడి అమ్మా నాన్నలకి అందరికంటే ముందే ఆహ్వానమొచ్చింది ఆ దేవుడి దగ్గర్నుంచి సరదాకి నేలమీదకి విహార యాత్ర కొచ్చిన అల్లల్లోంచి తప్పిపోయి ఇసుక రేణువుల్లో చిక్కుకుపోయిన నీటి తుంపరలా వాడు మాత్రం ఈ భూమ్మీద ఒంటరిగా మిగిలిపోయాడు వాడి దేహమంతా దుఃఖమే కన్నీరు ఎక్కడ తుడుచుకుంటే అక్కడనించి ఇంకొంచెం అంటుకుంటోంది కనురెప్పలు కత్తిరించుకున్నా వెలుగు చుక్క కనబడనంత గా వాడి లోకమంతా చీకటే కిక్కిరిసిపొయిన జనం మధ్య నిలబడినా వాడి కడుపంతా ఖాళీతనమే వాడి చూపుల దారిలో చేరి వాడి దరికి చేరే కంటిపాపే లేక వాడి చుట్టూ ఎప్పుడూ ఒంటరితనమే వాడి నవ్వుల పువ్వుల్లో చిమ్మే మకరందం రుచి ఏ తేనెటీగకూ నచ్చడం లేదు వాడి బంగారు బాల్యం బయటపడే మార్గం లేక మట్టి పొరల మధ్యే సమాధి కాబడింది ఎవరు చేసినా చెయ్యకపోయినా ఆకలి మాత్రం అనునిత్యం వాడితో స్నేహం చేస్తూనే ఉంటుంది ఎవరొచ్చినా రాకపోయినా నిద్రా నీరసం వాడి కోసం వచ్చి కాసేపు కలల కబుర్లు చెప్పి వెళతాయి వాడి చుట్టూ వాడిలాగే ఎన్నో ముఖాలు వాడికి కనిపిస్తాయి కానీ వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ లాగే ఉన్న తన ముఖం తాలుకూ గుర్తింపే ఎప్పుడూ ఎందుకు కనబడదో మాత్రం వాడికి అస్సలు అర్ధం కాదు పోస్ట్ చేసిన తేది 10. 03. 2014 ( మార్చ్ నెల ఈమాట మాగజైన్ లో ప్రచురితమైన నా కవిత వాళ్ళు కొద్దిగా మార్పులు చేసారు http://ift.tt/1h5RQg5)

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h5RQg5

Posted by Katta

Kapila Ramkumar కవిత

Fallen For want of bread to eat and clothes to wear — Because work failed and streets were deep in snow, And this meant food and fire — she fell so low, Sinning for dear life's sake, in sheer despair. Or, because life was else so bald and bare, The natural woman in her craved to know The warmth of passion — as pale buds to blow And feel the noonday sun and fertile air. And who condemns? She who, for vulgar gain And in cold blood, and not for love or need, Has sold her body to more vile disgrace — The prosperous matron, with her comely face — Wife by the law, but prostitute in deed, In whose gross wedlock womanhood is slain. Ada Cambridge

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PixYiD

Posted by Katta

Sri Venkatesh కవిత

---మరణం--- మరణం ఒక గమ్యం చేరితే నిద్రలో దొరికే సుఖం శాశ్వతం మరణం ఒక జననం జన్మించాక మళ్ళీ మన గమ్యం మరణం మరణం ఒక సైన్యం ఒకరికి మాత్రమే కట్టుబడి పని చేసే సైన్యం మరణం ఒక ప్రపంచం కనురెప్పల ఎడబాటులో కనపడని కనురెప్పల స్థిర కలయికలో దాగలేని ఒక అద్భుత ప్రపంచం మరణం ఒక మన్మధయాగం కాలే కట్టె రగిలే శరీరపు రాసక్రీడలో బూడిదను జన్మింపజేసే ఒక మన్మధయాగం మరణం ఒక బంధం మనతో పాటే పుట్టి మనతో పాటే చచ్చే విడిచి వెళ్ళని విడదియ్య సాధ్యం కాని మర్మబంధం మరణం ఒక అదృష్టం మనిషిని చంపి అబద్ధపు కళ్ళతో నిజాన్ని చూసే లోకానికి దూరంగా బ్రతికిపోగలిగేలా చేసే అదృష్టం...... "శ్రీ" 10/03/2014

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ObRwDY

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

ప్రేమసేద్యం చేస్తున్నా_నీ కలలపంట పండిద్దామని ..@శర్మ \10.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ej5sm8

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiN4cP

Posted by Katta

Vani Koratamaddi కవిత

స్వప్నం జ్ఞాపకాల బాష్పాలు అక్షరాలై వర్షిస్తాయి మనసుకైన గాయాలు గేయాలై మిగిలాయి ఒడిపోయిన కన్నీటి కధకు సాక్ష్యాలై నిలిచాయి స్వప్నంలో నీరూపం సాక్ష్యాత్కరిస్తుంది సరదాగామాట్లాడి సంగతులెన్నో చెపుతుంది నమ్మలేకపోతాను నీవులేని నిజాన్ని తెల్లార కుండావుంటే బావుండను కుంటాను భళ్ళుతెల్లారేసరికి గుండెగుభేలు మన్నది గతం నన్ను వెక్కిరించిది గాయం గుర్తు చేసింది తలగడపై తడి గుర్తులు కన్నీటికి ఋజువులుగా మిగిలివున్నా నేను.... బాష్పాలు రచిస్తూ..... వాణికొరటమద్ది 10/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiLnvW

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఇంకొన్ని ----------------- కొన్ని క్షణాలు కొన్ని గంటలు కొన్ని పగళ్ళు కొన్ని రాత్రులు నిర్వచించలేని అనుభవాలను మిగులుస్తాయి మళ్ళా ఇప్పుడు వాటిని వెనక్కి తోడుకుంటూ నూనే పాదాలతో ఒకసారి నడవాలి నాకు నేనుగా దారపు పోగుల్లా సాలేగూడులో అల్లుకున్న మరికొన్ని జ్ఞాపకాలు ఈరోజిక ముఖం కడుక్కోవాలి కొంచం కొత్తగా కొన్ని భావోద్వేగాలతో రమిస్తూ నిన్ను మళ్ళీ కంటున్నాను నాలో నిశబ్దంగా వేదంలా తోస్తావు కొన్ని క్షణాల్లో నాగురించి అన్నీ తెలిసినట్టు ప్రతి నీ పేజీలో నా పేరును వెతుక్కుంటాను నువ్వు లేనప్పుడల్లా ఇప్పుడు మళ్ళా కళ్ళలో ఇంకిపోయిన భీడు బావులేవొ మొలకెత్తుతున్నాయి చాలా కాలం తరువాత కొత్త ఆశలకు పునాది. తిలక్ బొమ్మరాజు 10.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8Tz7h

Posted by Katta

Sasi Bala కవిత

అందరికీ స్ఫూర్తి దాత ..కరుణారస హృదయ నేత మా అమ్మ '' థెరిస్సా''.............శశిబాల ................................................................................................................................................................................................................................... అనాథలకు ప్రియ మాత ...మా అమ్మ '' థెరిస్సా'' HIV/AIDS,కుష్టు రోగులెందరినో ఆదరించి అనునయించి అక్కున జేర్చిన వనిత ''నిర్మల హృదయం''లో నిరుపేదల నాదరించి ఆశ్రయమిచ్చిన అమృత హృదయ '' థెరిస్సా'' అల్బెనియాలో పుట్టి కూడ భారతగడ్డనె తన భూమిగ ఎంచి సేవలందించిన మహా మాత '' థెరిస్సా'' ప్రపంచాన పలు పలు దేశముల తన ఆశ్రమ ఆశ్రయముల జనులకు అండగ నిలిచిన దేవి అన్నార్తుల పాల అన్నపూరణి మా అమ్మ '' థెరిస్సా'' పవిత్ర ''saint hood''ను పొందిన పరమ పావనీ , ప్రపంచ ప్రఖ్యాత ''నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మా అమ్మ '' థెరిస్సా'' మా అమ్మకు లేరు సాటి ఇలలో ఇంకెవ్వరూ ...... దైవానికి మారు పేరు ,మానవతకు మరో రూపు మా అమ్మ '' థెరిస్సా'' ఎందరికో మార్గ దాత మా అమ్మ '' థెరిస్సా'' ........................................10 march 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8TAYE

Posted by Katta

Panasakarla Prakash కవిత

ప్రేమలేఖ‌ ప్రియా....లేఖ అ౦ది౦ది నీ హృదయపు కాగిత౦మీద నా రూపును చిత్రి౦చిన౦త‌ మృదువుగా వు౦ది నీ...ప్రేమలేఖ‌ ఇక్కడ నేను క్షేమ౦.. అక్కడ నువ్వూ........? అ౦టూ అర్ధోక్తిలో ఆపేసిన ఆ ప౦క్తి చదువగానే కళ్ళల్లో౦చి ఉబికివచ్చిన నీళ్ళు.... అక్కడే ఆవిరైపోయాయి నేను లేని జీవిత౦ నిస్సారమైపోయి౦దని రాసావు.. పిచ్చిదానా......! ని౦గి కురవకపోవచ్చు నేల తడవకపోవచ్చు....ఐనా ని౦గి నీడ నేలపైనే ఎప్పుడూ.... నేల చూపు ని౦గివైపే ఎప్పుడూ అదేగా ప్రేమ౦టే............ మనల్ని విడదీసి౦దెవరని అడిగావు..! ఎవరో తేలిగ్గా విడదీయగలిగేదైతే మనది ప్రేమ బ౦ధ౦ ఎ౦దుకవుతు౦ది చెప్పు...? తనువులు కలవడానికైతే దగ్గరగా ఉ౦డాలేమో... మనసులు దగ్గరైనాక‌ మనలను ఎవరు ఎ౦త దూర౦ తీసుకుపోయినా ఏ౦ లాభ౦ ...చెప్పు? నీవు౦డేది నీదగ్గరా కాదు నేను౦డేది నాదగ్గరా కాదు చూడాలని ఉ౦దన్నావ్ స్వప్న‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍౦లో కలుసుకు౦దా‍‍‍‍‍౦... మాట్లాడాలని ఉ౦దన్నావ్ మౌన౦లో చేరిపోదా౦... ఇక ఉ౦టాను అన్నావ్... నీ లేఖని గు౦డెలకు హత్తుకున్నాను... నువ్వున్నది.......అక్కడేగా.. పనసకర్ల‌ 10/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nbaZoi

Posted by Katta

Humorist N Humanist Varchaswi కవిత

వర్చస్వి// స్టోళ్ళు // - - - - - - - - ఎక్కడినుంచో దొర్లి పడుతోందో వెకిలి గొంతు! కొత్తగా ‘స్టోళ్ళ’ పై రాళ్ళుగా విరుచుకుపడుతున్న తంతు!! స్టోళ్ళో, పరదాలో, ముసుగులో – ఎందుకా పళ్ళికిలింపు? కన్నే కొట్టాడో, కాంతల బ్రతుకుల్లో మన్నే కొట్టాడో కళ్ళలో కామపు తేళ్లేసుకుని వాంఛా కొండి తో కుట్టాడో! తన ముఖం వాడికి చూపించదలచలేదు!అంతే!! ఎక్కడిదా వెకిలి గొంతు? మట్టిగొట్టుకున్న మగతనాలు పడతుల మొఖాన యాసిడ్లు కొడుతుంటే పూడుకుపోయిన గొంతేనా అది! తనమానాన తాను పోతున్న మానిని శీలం పై ఓ పైశాచికత్వం మానభంగం గావించినపుడెక్కడ మూసుకు పోయిన గొంతేనా అది! తనువుని కామగ్నికి బూడిద చేసుకునికూడా పేరు బయట పెట్టుకోలేక గుట్టుగా ‘నిర్భయం’టూ చట్టపు నామాన్ని తొడుక్కుని తృప్తి పడ్డందుకా ఆ వెకిలితనం! ఆ వెకిలి నవ్వుల మదపు తోడేళ్ళ కళ్ళు తప్పించడం కోసమేగా ఆ ‘ స్టోళ్ళు’! అవి - మృగత్వపు మసి మరకలని మరిచిపోవాలనుకుంటున్న తెరలు! దౌర్జన్యం చేసిన దౌర్భాగ్యపు ముఖాలమీద ఉమ్ము కూడా వేయడం ఎందుకులెమ్మంటూ నోటికి అడ్డంగా కప్పుకుంటున్న క్షమాతెమ్మెరలు!! ఎవరికళ్ళో అక్కడ మొసళ్ళ పద్యాల్ని కార్చేస్తున్నాయి? మర్యాదల పద్యాల పొరల్ని పైకి ‘పరదాలా’ పెట్టుకుని లోలోన మనసుతో అడిగించింది చెమికీచీర కిందికి దించమనే కదూ! నీదైన రసానుభూతి నీకు కలిగితే మైకపు మద్యాన్ని పద్యాల చీరలుగా చుట్టి సింగారించేది నువ్వే! మోడర్నిటీ పరదాల ర్యాంపుల మీద సొంపుల్ని వొంపి పజ్యాల దండేల మీద అర్ధ నగ్నంగా ఆరేసేదీ నువ్వే! మనసు రంజిల్లితే చెలియ మనసు పిచ్చి కోమలం! వాడి ఆగడాల్ని గుంజీలు తియిస్తే అది కేవలం పిచ్చి కమలం!! ఎందుకా వెకిలివేషం? జబ్బలు విరగకాచేలా చూపించే వాడి బ్లేజరు విహారాలు మరొకప్పుడు జుబ్బా తొడిగిన వాడి కంత్రీ సాయంత్రాలు వెంట్రుకలాటి వాణ్ణి విశేషంగా చూపించే బెర్ముడా తొడుగులు వాడికైతే వాడికి నచ్చిన వేషం! వీళ్ళేస్తే వాడికి నచ్చని పిచ్చి వేషం!! అసలు చీరో, చెంగో, పమిటో, పరదానో, ముసుగో, స్టోలో- అహోరాత్రాలూ వాటి స్టాటిస్టిక్కులతో ఏం పని? సరిగా సూటిగా చూడు! స్త్రీ-లో నీకో వంపుతీరిన సకార దేహం, పైన తలకట్టు కప్పిన గుడి దీర్ఘపు ముసుగూ కనిపిస్తే, నాకు మాత్రం ..... ఆ క్రిందే - ద్వంద్వ నైజాల్ని చీల్చే చుర కత్తీ, విశ్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నింపుకున్న క్రావడి దొన్నె కనిపిస్తుంది //2.03.14// (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా.......)

by Humorist N Humanist Varchaswi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZ3s1W

Posted by Katta

Chakra Pani Yadav కవిత

"బానిసత్వం" రోగికి రక్తహీనత కాంగ్రేష్ కు నాయకత్వ కొరత రెండింటికీ పరాయి రక్తమే పరాయి రక్తం వంట పట్టించారు మనల్ని దాసోహ పర్చారు పరాయి రక్తనికి మనం బానిసత్వమే రోగి స్వస్తత ఇటలీ రిపబ్లిక్ డే - తెలంగాణ అందుకు తార్కాణం 10/3/2014

by Chakra Pani Yadav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZ3p6g

Posted by Katta

సత్యవతి కొండవీటి కవిత

అలజడులు...నా అంతరంగపు ఆనవాళ్ళు నిన్నటి జ్ఞాపకాలు రేపటి భయాలు ప్రస్తుతాన్ని ఆస్వాదించనీయవు నిన్న ఎటు పోయిందో తెలియదు రేపు వస్తుందో రాదో అస్సలు తెలియదు మన ముందున్నది ఈ రోజే రేపు ఉన్నదిలే....ఏమో!! ఒక్కో సారి ఆ రేపు రాకపోవచ్చు కూడా మధురమైన జ్ఞాపకాల మధుభాండం ఈ గుండె... ఏ క్షణమైనా భళ్ళున పగిలిపోవచ్చు జీవితానికి అర్ధం బతకడం కాదు అర్ధవంతంగా అందరి కోసం జీవించడం

by సత్యవతి కొండవీటి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fZ3rLq

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||వైరం|| 1 తెలియని దాన్ని గురించి తెలుసుకుందామనుకుంటాను. తెలసుకునే కొద్ది, నెట్టబడుతున్నాను మరింత తెలియనితనంలోకి. 2 ఎక్కడెక్కడ మనం, మనకి కొత్తగా పరిచయమవుతామో, అప్పుడప్పుడల్లాప్రవహిస్తుంటుంది కాస్తంత ప్రేమో, మరికొంత కోపమో, చెప్పలేనంత విషాదమో ఎప్పుడన్నా, ఓ చిన్న సంతోషమో! 3 ఇలాంటి ఓ చోట్లల్లో అలాంటి ఓ సమయాలల్లో సౌకర్యవంతమైన ఓ ప్రణాళిక కావాలి. నీకు బాధుండకూడదు, నాకు కూడదు. పని మాత్రం అలా జరిగిపోవాలి. బుర్రలమీదొట్టు, ఒప్పుకో మరి. ఓ సంధి సయొద్ద రాయబారానికి. ప్చ్, నాకు తెలుసిక, ఘర్షణే అనునిత్యం. 4 మనం నిజంగా ఏ మనిషిని మార్చలేం కనీసం మనల్నికూడా. ఒక్కోక్క దుఃఖవాహిక గుండా పయనిస్తున్నప్పుడెప్పుడన్నా శుభ్రపరచబడతాం, ఓ నాలుగు అశ్రువులచేత. అది కూడా చాలాసార్లు మనకే తెలియనంత సహజంగా. 5 నన్ను నేను ప్రేమగా హత్తుకోవడానికి, నాలోకి నేను ప్రవహించడానికి, బహుశా, ఈ జీవితం అంగీకరించదేమో! ఎదురుచూడాలి, మరోప్రయత్నానికి. (కినిగే పత్రికలో ప్రచురితం)---10/3/2014

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fh8Q5t

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | చీకిపోయిన చినుకులు ------------------------------------- వానతెరల్లో మసక చూపుకి ఉన్నపాటుగా ఉలికిపాటు- పిచ్చుకొకటి విగతజీవియై పడి ఉందక్కడ, వెల్లకిలా ఆకాశాన్ని నోరు వదిలిచూస్తూ. చితికిన వంటిమీద కదిలివెళ్ళిన చక్రాల గుర్తు, విహ్వలతతో కుప్పకూలినట్లు నానిన ఆకొకటి తోడుగా... నిన్న రెక్కలెగరేసి వెక్కిరించినదీ పిట్ట కాదు కదా? మనసంగీకరించట్లేదు, ఓ స్వేచ్ఛ మలిగిపోయిందంటే. రావికొమ్మ రాసుకున్న గోడ పగుళ్ళువారినట్టు, ఈ క్షణపు నిట్టూర్పుకు గతపు మచ్చ మీద పెచ్చురేగింది. గదిలో నలుగురు ఆకతాయిలు- గోడహద్దుల వెంట తరిమి తరిమి, గొళ్ళెపు మోతతో రెక్క విరిగేలా ఎగిరిస్తూ, పసితనపు పిచ్చి పూనకంలా, పిచ్చుక పాలిట శాపంలా. గది వెలుపల నా బిక్కమొహానికి, నా వెర్రికేకలకి గోనె సంచీలో బిగించి కట్టిన పిట్ట స్పర్శ బదులు ఇచ్చింది. “పలుకదిక, ఆటకట్టిక” అరుపుల కేళిలో అదిరిపడ్డ నా గుండె. పెరట్లో గుట్టుగా కప్పెట్టిన గుప్పిళ్ళలో మట్టి వాసన మిగిలే ఉందేమో, ఇప్పటికీ అమ్మమ్మ ఇంటి దూలాల్లో పిచ్చుక కేక ధ్వనిస్తుందేమో. అటక మీద చింకిపాతలు హరికెను లాంతరు మసి తుడిచినట్లు, చీకిపోయిన శోకపు చినుకులు ఆదరాబాదరా బతుకుల బురదని కడుగుతుంటాయి. కంటి ఎదుటి దైన్యాన్ని తప్పుకుపోతున్నందుకు కసురుతుంటాయి... 09/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gcEq4a

Posted by Katta

Chythenya Shenkar కవిత

రాజనీతి! || చైతన్య --------------- రాజు గెల్చాడు! కానీ, సైనికులే చచ్చారు... ప్రపంచ పటంలో దేశం... ఇండో-ఇటాలియన్ వంటకంలా ఉంది! ఓటు -> నోటు పొట్లంలో మందు కంపు కొడుతుంది! ఓట్లకోసం కోట్లిస్తున్నారని... బట్టలూడదీసుకు చూస్తున్న ఓటర్లు! ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చింది! బ్రతికే ఉందని నమ్మించే ప్రయాసే నేతల్ది.. నాతో ఎందరొస్తారు! ప్రజాస్వామ్యం శవయాత్రనాపేందుకు... రైతు కళ్ళలో... కన్నీటి కలుపు తీసేదెవ్వరో! పొలాల్లో రైతా..!? ఉన్నాడుగా... "నేతలు" పొలాల్నే శ్మశానాలుగా మార్చారంతే పాపం అమాయక ఓటరీడు... ఇండియాలో తప్ప ఇంకెక్కడా బ్రతకలేడు! రాజీ పడలేని.. సిగ్గులేని ప్రయాణం..రాజకీయం! ఓటును బ్రతికిస్తూ... నిన్ను నువ్వు చంపుకుంటూ.."మద్యే"మార్గం! లంచాల మంచం పై... చెరచబడ్డ ప్రజాస్వామ్యం నా దేశం!!!!!! CM ఐదు వేళ్ళూ లోనికి.. ఎన్నో ఆకలి కడుపులు కాటికి! తెల్ల దొరలే నయం! పేదలకు ఇంకా రాని స్వాతంత్ర్యం! ప్రజాస్వామ్యం గట్టిగుంటే అవినీతినేత చెంప చెళ్ళుమనదెందుకో! పోరాటం ఆగలేదు! అపుడు- తెల్లవాళ్ళతో..ఇపుడు దగుల్బాజీలతో.. 10/03/2014

by Chythenya Shenkar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oD77rv

Posted by Katta