పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, మే 2014, శనివారం

Venu Madhav కవిత

వేణు // రాబందు// అమ్మ స్కూల్ కి వెళ్తున్న అని ఒక చిన్నారి నాన్న సాయంత్రం తొందరగా వోచెయ్ ఆడుకుందాం అని ఒక చంటిది ఎమండి మీకోసం ఎదురుచూస్త ఉంటా త్వరగా రండి అని ఒక భార్య నీకోసం ఇష్టమైన పాయసం చేస్తా అని ఒక తల్లి,కానీ వాలు ఎవరు తిరిగిరాలేదు వాళ్ళకోసం ఎదురుచూసిన కన్నులు కన్నీటి గీతాని పాడుకున్నాయి ఒక మతం పిచ్చి పట్టుకున్న కుక్క బాంబు పెట్టి అందర్నీ చంపేసింది అంతులేని వేదనని పండగ కానుకగా అందించింది, ఇంతచేసి సాధించింది ఏంటి,ఆకలి వేసిన నాకు నలుగు మంసపుముద్దలు అందించారు అదేగా మీరు సాదించిన స్వేచ్ఛ ,ఒక రాబందు అడిగిన ఈ ప్రేశ్నకు ఎవరు సమాధానం చెబుతారు హైదరాబాద్ మసీద్ లో బాంబు పేలి రేపటితో ఏడు ఏళ్ళు అయిన సందర్భంగా 17may2014

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nUuUYi

Posted by Katta

Srinivasa Bharadwaj Kishore కవిత

ఇదిఏల స్వామి? రచన - కిభశ్రీ స్వేచ్ఛావృత్త౦ ౼ ఖ౦డనడక కనిపి౦చు ఈజగము సృష్టిచేసిన నీవు కనిపి౦చుచు౦టివని మాఊహల౦దునే కనులకి౦పగు మానవాకృతులసృష్టి౦చు జనులచూచుచునీవునవ్వుచు౦టివ స్వామి? తలక్రి౦దులౌచువెతికేమ౦తనీకొరకు తెలుసుకొమేలప్రతిఅణువునీవు౦టివని నిలువు౦డ మా అ౦తర౦గమ౦దున నీవు వెలుపల౦తయుశోధ వ్యర్థముగదా స్వామి? కనకు౦టె దైవత్వమునుసాటి మానవున కనెదమేవిధిని ప్రత్యక్ష్యమైననునీవు వినలేకపోతె మానవుల ఆక్ర౦దనలు వినగలమె నీవరములనుదీవెనలస్వామి? తెలుసుకొ౦టిమి విశ్వమ౦చె౦త దూరమో తెలయకు౦డెను మనసులోతునేము౦డెనో తెలుసుననుకు౦టాము గ్రహములప్రభావములు తెలుసుకోమేలనో మనమ౦దు భావములు?

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gcHmA8

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//పరిహేళి//10 ****************************** ఐదేళ్ళకోసారి ప్రజాక్షేత్రానికి దగ్గరగా జరిగే రాజకీయగ్రహాల పరిభ్రమణకేళి పరిహేళి పరిపూర్ణమయింది ఓట్లపండగ ముగిసింది ఓఘట్టం గడిచింది సందిగ్ధం తొలగింది ప్రజామోదరాజవీథుల్లోంచి ఠీవిగా నడచిపోయే మారాజులెవరో తేలింది ఇక ఐదేళ్ళపాటు ప్రజలకు దూరంగా ఒక్కోసారి ప్రజాస్వామ్యవ్యవస్థక భారంగా పరిణమించే అపహేళి దశ రానున్నది అప్పుడు నాయకులు పదవులచుట్టూ, పైరవీల చుట్టూ ప్రజలు నాయకులచుట్టూ భ్రమలచుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటారు 17/5/2014 ి

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RK6jrx

Posted by Katta

Lingareddy Kasula కవిత

(Ruler Sadiq కోరిక మేరకు ) పోలవరం పోరుదారి||డా// కాసుల లింగారెడ్డి || పల్లవి: కడుపుచేత పట్టుకోని మూటముల్లె సర్దుకోని ఏదారి నేను పోదునో మాయమ్మలార బతుకు- గోదారి పాలాయెనో మాయన్నలార చరణం1: చెట్టుగొట్టి మొట్టుదీసి- కంపగొట్టి కాలవెట్టి కండగరగ ఎముకలరగ- రక్తమోడ్చి చెమటదీసి పోడుగొట్టి సాగుచేస్తిమో మాయమ్మలార బతుకుపంట పోగుచేస్తిమో మాయన్నలార చరణం2: తాతతండ్రుల సాలువట్టి-ఊరువాడ దోస్తిగట్టి కష్టసుఖం పంచుకోని-కలిఅంబలి కలిసితాగి కాలమెల్లదీయవడ్తిమో మాయమ్మలార అడవితల్లి ఆదరించెనా మాయన్నలార చరణం3: ఉరుములేని పిడుగులాగ-పగబట్టిన పాములాగ భూమిజాగవదలాలని- పోలవరం కడతామని మా మెడలమీద కత్తివెట్టిరా మాయమ్మలార జలయజ్ఞం పేరుచెప్పిరా మాయన్నలార చరణం4: ఇరుగబూసిన వెన్నెల్లో- రేల ఆటపాటల్లో పాపికొండల పాయల్లో- గోదావరి పరుగుల్లో గంతులేసె జింకలతో- నెమలి కూత ఆటలతో అడవితల్లి అందాలు- ఆదివాసి బంధాలు బతుకుబాట పాపవట్టిరా మాయమ్మలార పేగుబంధం తెంచవట్టిరా మా యన్నలార చరణం5: ఆశచచ్చినోడెవ్వడు- చేవలేని వాడెవ్వడు మధ్యయుగం నీతులను- ఏలే బలవంతులను తరిమి తరిమికొట్టుదామురో మాయమ్మలార యద్ధం మొదలెట్టుదామురో మాయన్నలార చరణం6: ఆశయాల వెలుగులల్ల- మన అమరుల దారులల్ల చేయిచేయి పట్టుకోని- బడితకట్టెలందుకోని పోరుబాట నడుద్దామురో మాయమ్మలార పోలవరంనాపుదామురో మాయన్నలార 'నమస్తె తెలంగాణ' దినపత్రికలో 16 నవంబర్‌ 2011

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t0YvPy

Posted by Katta

Girija Nookala కవిత

మోడీ విజయం నిలువెత్తు అభిమాన కెరటం నిలెబెట్టింది ఆశల ప్రభంజనం ఆగాధంలో పడిపోయిన ప్రజల సంతోషం తెచ్చి ఇస్తుందనే నమ్మకం కదలి వచ్చింది వోటరు దండు కలుగులోనికి తరిమింది అవినీతి సర్పాన్ని నమ్మి ఇచ్చిన రాజ దండం మళ్ళీ అవ్వకూడదు ప్రజలకే దండనం. వాడు కాకపోతె వీడు కాకపోతే వీడు కుడా వాడు కాకూడదు ఆశల పల్లకి ఉరేగింది చాలు మడులు మాణిక్యాలు మీరేఉంచుకోండి సామాణ్యుడికి కాసింత ఆత్మాభిమానం మూడు ముద్దల కూడు కాళ్ళు చాపుకునే గూడు చాలు

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joNt51

Posted by Katta

Sriarunam Rao కవిత

నువ్వంటే...??? అప్పుడెప్పుడో.. నన్ను తిట్టుకొంటూ తిరిగి చుడకుండా వెళ్ళిపోయిందన్న కసితో... ఎప్పటికప్పుడూ.. నన్ను తట్టిలేపుతూ కళ్ళుతెరిస్తే కరిగిపోయే అద్భుతాంలా మారినా.. గుండెలముందు బంధించుకోవాలని నాకెందుకు అనిపించలేదు? నా ఈసడింపునీ తన కన్నులతో పొదవిపట్టుకొని ఆశ చావని అడుగులతో దూరమవుతున్న ఆ పాదాల పగుళ్ళనే చూస్తూ.., కలుక్కున జారిపోతున్న కన్నీళ్ళని కనికరించలేని రాతి హృదయాన్ని.. నేనెందుకు గుర్తించలేదు? గుండేలేని తోటలో మెదడుని పాతేసి అంబరం ఎత్తున బలిసిన అహం వృక్షాల నీడతో ఏ ప్రణవానికి హారతి పడతాను? ప్రణయం పిలిస్తే పలకదు, అదే పిలిచిందా.. మనమెంత? ఈ రెండింటిమధ్యనా నేను సాధించే..మనఃసాక్షే.. నువ్వవుతావని ఇప్పుడే తెలుస్తుంది. నా "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు" కవితాసంపుటి నుండి... శ్రీఅరుణం 9885779207 విశాఖపట్నం-530001

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joNplP

Posted by Katta

సత్యవతి కొండవీటి కవిత

కనబడని ఎజండా బయటకుచూస్తే మెరుస్తూ మండుతున్న ఎండ కానీ...లోపలంతా ముసురు పట్టినట్టుంది చిన్న చిరుగాలి తగిలినా కళ్ళు వర్షించేట్టున్నాయ్ దృశ్యం వెంట దృశ్యం కళ్ళను కబ్జా చేస్తున్న ఫీలింగ్ కొన్ని రంగులు...మరికొన్ని పదాలు గుండెని చీలుస్తున్నంత కరకుగా అనిపిస్తున్నాయ్ నా అక్షరాలను నా వెనక నించి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది నా దుస్తుల్ని ఎవరో జల్లెడ పడుతున్నత్తుగా ఉంది నా అలోచనల్ని ఎవరికో తాకట్టు పెడుతున్నట్టుగా అనిపిస్తోంది ఉండుండి నా స్వప్నం ఉలికి ఉలికి పడుతోంది కోట్ల మంది సంబరాలు ఎన్ని లక్షల గొంతుల్ని నొక్కేసాయో భయం నీడన ఎన్ని గుండెలు గడ గడ లాడుతున్నాయో కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్న కార్పొరేట్ మీడియా కటిక చీకటి కోణాలను ఎందుకు చూపిస్తుంది ??? రాజకీయం,మతమౌడ్యం,మీడియా చింత్రంగా నా కళ్ళకి ఒకేలా అనిపిస్తున్నాయి కార్పొరేట్ ప్రపంచం చుట్టూ కేంద్రీకృతమవ్వబోతున్న పాలన ఇప్పటికే అంచుల్లో మునివేళ్ళ మీద నిలబడిన బడుగు జనం అతి త్వరలో ఈ కార్పోరేట్ల ధనదాహానికి సమిధలు కాబోతున్నారు కోట్ళాది రూపాయల్ని ఊరికే ఖర్చుపెట్టారా మరిన్ని కోట్లు దండుకోవడానికే కదా లాభాల వేటలో రాజకీయాన్ని నడిపించిన ధనస్వాముల కళ్ళకి కనిపించేవి కాసులే... అవ్వా పచ్చీ లాగా మోసుకొచ్చి అధికారం లో కూర్చోబెట్టడం వెనక కనబడని ఎజండా...నా కంటి మీదికి కునుకు రానీయకుండా చేస్తోంది.

by సత్యవతి కొండవీటి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kb5AKB

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

శిబి శిల ................... ఊరికి పడమట అలసిన సూర్యుణ్ణి తన వెనకనున్న పడమటింటిలో పరుండబెట్టేందుకు కూచున్న రాళ్లరాసి గుట్టమ్మ పెరిగే తరిగే చంద్రుణ్ణి రోజూ సిగలో తురుముకున్నందుకేమో చందమామ గుట్టయ్యింది మా సోపాల ముంగట నిలవడి సూసినప్పుడల్లా నాకది శిలా పుష్పాలతో పేర్చిన పెద్దబతుకమ్మలా అన్పించేది సాయంత్రం ఈద్ గాహ్ ఎక్కి అటువైపు చూస్తే సూర్యశిరోమణి ధరించిన మహారాణి లా కన్పించేది బాపు పంపిస్తే తిర్మలయ్యగారింటికి వెళ్ళినప్పుడో షేర్ఖాన్ బాయికి మంచినీళ్లకు పోయినప్పుడో సూరమ్మ బాయికి స్నానానికి వెళ్ళినప్పుడో కన్నుల్లోనే వెలిగిపోయేది ఆ పడమటి గుట్ట మొన్న దాని పక్కపొంటి పోయినప్పుడు శతృవును చుట్టుముట్టిన యుద్ధ సైనికుల్లా మరముక్కు ల ఇనుపకొంగలు శవాన్ని పీక్కు తింటున్న రాబందుల్లా రాకాసి కోరల రంపపుచక్రాల యంత్రభూతాలు గుట్టుగా ఉన్న గుట్టను బట్టలూడదీసినట్లు కత్తితో కడుపులో పొడిస్తే పేగులన్నీ బయట పడ్డట్టు అందమైన చందమామగుట్ట ఆసిడు పోసినా ముఖంలా అందవిహీనవిదారక దృశ్యం నా వూరు అందాన్ని చెరిపేసుకుని ప్రపంచదేశాల భవంతుల అందాల్ని ఇనుమడింపజేయడానికి తరలి వెళ్తున్న నా ఎలగందుల శిలారత్నమా మున్నీట మునిగిన వూరోళ్ల నాదుకోవడానికి నడుం కట్టిన గ్రానైటు గండశిలా రాజమా! నిన్ను శిబి చక్రవర్తికి తమ్ముణివనిగాదు అన్నవన్నా తక్కువే !!!!.................... వాధూలస 17/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mDQIFA

Posted by Katta

Mercy Suresh Jajjara కవిత

|మేఘా రూఢుఢ రమ్ము| Mercy Margaret ------------------------------------ చీకటి ముంచుకొస్తుంది భయం తరుముకొస్తుంది ఈ దేశం నాదికాదని నా అస్థిత్వం కోసం చేస్తున్న యుద్దాన్ని గేలిచేస్తూ వెక్కిలిగా నవ్వుతుంది ఓట్లకోసం సెక్యులర్ ముసుగు తొడిగిందేమో అక్కడక్కడ చినిగిన ముసుగులోంచి నా వాళ్లను నిలువునా కాల్చిన దృశ్యాలు కత్తిపోట్లతో నిట్టనిలువునా చీల్చిన రక్తపు చారలు కనిపిస్తున్నా అమాయకత్వాన్ని కొని, ముఖానికి అంటించుకుంటున్న దాన్ని నమ్మిన నా తోటి గొర్రెలకు రాబందదని ఎలా చెప్పాలి నా గొంతుకు వోట్ల కోసం చేసిన తోడేల్ల గాయాలు సమూహంగా నన్ను అంతం చేయాలని వారు అరిచే అరుపుల్లో నేను మీ మట్టి వాన్నే నా ఉనికి ఈ నేలదే మీరంతా నా మనుషులే అన్న నా గొంతెందుకో వారికి వినబడదే?? చీకటి ముంచుకొస్తుంది భయం తరుముకొస్తుంది ఈ దేశం నాది కూడా అని అరిచే కొన్ని శరీరాలు తగలబడుతూ రక్తం చిందించనీ విత్తనాల్లా మారుతున్న వారి తెగువ వెనక విస్తారంగా ఎదిగే పంటను త్వరలోనే చూస్తారు చీకటిని చీలుస్తూ మధ్యాకాశంలోకి కొదమసింహం తిరిగిరాబోతుంది ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.!!!! -------------------------- ( 17/5/2014)-----------------

by Mercy Suresh Jajjara



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n6TTE0

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nTI4EZ

Posted by Katta

Sasi Bala కవిత

గడ్డిపువ్వు ఆర్తనాదం ..................శశిబాల ------------------------------------------------- గల గల పారే నీ జీవన స్రవంతి అలలపై తేలియాడిన గడ్డి పువ్వును నది వురవడికి కొట్టుకు పోతున్న నన్ను నీ చేతిలోకి తీసుకొని ...ఆప్యాయంగా స్పృశించావు .. ప్రేమ మీరా తడిమి నీ ఆలంబనను వ్యక్తపరిచావు లేని పరిమళాన్ని అద్ది ..కొత్త ఆశలు సృష్టించావు అలసిన మనసుతో నీ దరి చేరి సేదదీరాను తడిసిన నా రెక్కలు ఆర్చుకున్నాను కానీ ..... రెక్కలు ఆరగానే చిరుగాలికి ఎగిరిపోయాను నీకు దూరమయ్యాను . తిరిగి నిన్నందుకొనే క్షణం కోసం ఎగురుతున్నాను అవిశ్రాంతం గా గాలిలో తేలుతూ అలా ......అలా .............అలా 17 MAY 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sCZDXD

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

పువ్వులెందుకు పూస్తాయంటే సువాసనల్ని వెదజల్లడానికి మనల్ని ముగ్ధుల్నిచేయడానికి మన మనసుల్ని దోచుకోడానికి

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n36E6R

Posted by Katta

Jagadish Yamijala కవిత

1 నేనో బింబాన్ని... -------------------------- ఉండేందుకు మనసు లేదు ఎగిరేందుకు రెక్కలు లేవు మంచుబిందువులలో ప్రతిబింబించే సీతాకోకచిలుక బింబాన్ని నేను ------------------------------ 2 ఇంతకూ నువ్వెవరివి? ------------------------------ చెన్నైలో ఈ రోజు నీ వాతావరణం .... చలి పుట్టించే ఆకులలో వర్షం అల్లిన పాట పక్షుల రెక్కలతో షికార్లు చేస్తున్నాయి వర్షానికి నువ్వు ఇచ్చిన ముద్దులు అపూర్వా..... ఇంతకూ నువ్వు వర్షానికి అమ్మవా ? బిడ్డవా ? --------------------------- ఈ రెండు కవితలూ తమిళ కవి పళని భారతి రాసినవి అనుసృజన యామిజాల జగదీశ్ 17.5.14 ---------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Td4tAN

Posted by Katta

Rajender Kalluri కవిత

## అహం ## ఎప్పుడు మాట్లాడని ఒక స్నేహితుడు ఒక్కసారిగా మాట్లాడేసరికి అడగాలనుకున్న ప్రశ్న అడిగేసాడు మరో స్నేహితుడు , ఏంటి ఎప్పుడు లేనిదీ ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావ్ ? నేను నీ శత్రువు ని కదా ? అన్నాడు ఇన్నాళ్ళు నీ అహంకారం మాత్రమే నాకు శత్రువు , నువ్వు కాదు ఇప్పుడు అది కనిపించట్లెదు , నువ్వు తప్ప !! kAlluRi [ 17/05/2014 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mCNzpu

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/సహజంగా ....................................... ఫెస్ ప్యాక్ ఫెసియల్స్ చెయి0చుకొని బయిటికొచ్చి0ది కాదు. యోగిలా సన్యాసిలా.... ఫైవ్ స్టార్ హోటల్స్ లోని బిరియాని కాదు మట్టి కు0డలో వండిన గట్కలా.... మణులు మాణిక్యాలు ధరి0చి0ది కాదు పొలంలో పాట పాడుతు నాటు వేసే పల్లె పడుచులా... అలంకారులు కలిగిన థార్ రోడ్ లా కాదు మట్టి పరిమళాలాలు వెదజల్లుతు0ది నా కవిత. 17-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mCCnt0

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/వెండి పురుగులు రాత్రిని వెలుగులతో పూడ్చడానికి కొన్ని మిణుగురులు స్వేచ్ఛా ప్రతీకలుగా నీటిపై తేలియాడే గాలి బుడగలు కొత్తదనానికి ఊతమిస్తూ సహజంలో అసహజంగా కూరుకుపోయే కృత్రిమ నవ్వులు కొన్ని క్షణాలు నీవనుకొని బ్రతికేయచ్చు నరాల్లో ఎండిన నెత్తురు కరుగుతున్నపుడు నీ జ్ఞాపకాలు నీకు తోడుగా మిగిలినవి కాసిని వాన చినుకులుగా తోడుకుంటూ పశ్చిమాన అస్తమించే స్వర్ణకమలంలా ఆలోచనలు మాటి మాటికి తొలుస్తూంటే కంట బూజు చెలమలు తెరలు తెరలుగా అల్లిన కన్నీటి కళేభరాలు తిలక్ బొమ్మరాజు 16.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jE3Yob

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || కాదనవు కదూ || పిల్లా!! ఆ రోజు వస్తే నేను, నీవద్ద సెలవు తీసుకునే రోజు నిజంగా నీవు .... విలపించవు కదూ ఆ రోజు వస్తే నేను, అలసి ఆకశ్మికంగా మరణించిన రోజు నిజంగా .... నా కోసం పిల్లా! ఆ రోజు వస్తే నేను, నీతో చెప్పేసిన రోజు నిన్ను నేను అపరిమితంగా ప్రేమిస్తున్నా అని తొలి పరిచయం నాడే నిజంగా .... నీవు నన్ను నవ్వుకోవా!? పిల్లా! ఆ రోజొస్తుందా? కాలం దానంతట అది కదులుతూ ఈ సమాజం కోసం, నా కోసం .... నీవు సుఖ సంతోషాలను కోరుకుని నవ్వుతూ వీడ్కోలు చెప్పే రోజు పిల్లా! ఎందుకో అనిపిస్తుంది నీవు, నేను ప్రేమించడం కన్నా మించి నీవు ప్రేమించే అతని కోసం అతని జీవితం లోకి లక్ష్మివై వెళ్ళాలని .... ఎంతో బాగుంటుందని పిల్లా! తెలుసు! కోరికలు తీరవని నేను, నీకు ఏమీ కానని నీ కలలోకి రాలేనని తెలుసు అయినా, నిన్ను కల కనగలను. కాదనవు కదూ! 17 MAY 2014

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jnlHWv

Posted by Katta