పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఏప్రిల్ 2014, మంగళవారం

Patwardhan Mv కవిత

బోల్ లఖన్ జీ బోల్!!! :::::::::: ఊర్మిళా !ఒక్కసారి మరిది గారితో మనసు విప్పి మాట్లాడాలమ్మా అలాగే !ఆత్మేశ్వరులవారే సమయానికి స్వయంగా విచ్చేస్తున్నారక్కా! మరి నీవేమీ అనుకోవద్దు సుమా! అక్కా!అనుకోడానికి మనం తప్ప ఇంకా మనకేం మిగిలున్నాయని? రావోయీ మరిదీ! బాగున్నావా? బాగానే ఉన్నావు లే-రాచసుఖాల్లో మరింత రంగుతేలి అలా చూపులతో పాతాళాన్ని తవ్వకపోతే ఇప్పుడైనా ఒక్కసారి తలెత్తి నా కేసి చూడరాదా? అక్కా! నీకు తెలియనిదా ఆయనకు ఆడవారంటే గౌరవమూ-అంతకు మించిన సిగ్గూ అని! ఔన్లే! మరిది గారి సిగ్గు సింగారమంతా శూర్పణఖ నాడే తెలిసింది కానీ చెల్లెలా!ఒక్కటడుగుతాను-మీ ఆయన చెప్తాడేమో కనుక్కో. ఆనాడు నా అదృష్టం నూపురాల్లో రవళించకుంటేనూ..... అదిప్పుడెందుకక్కా?! అయిపోయిన కథ కదా! కాదు మరిది గారు మరి తమ మాతాశ్రీని కూడా చూడరా చెల్లీ?? అదేం ప్రశ్నక్కా? ఇది నా బాధమ్మా! నేనమ్మను కాననే కదా........ 08-04-2014,మంచిర్యాల్.

by Patwardhan Mvfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itjdSb

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || ప్రేమ బందీ || ====================== మనిద్దరి మధ్య రాత్రిని ఒడేసి పట్టేసి కట్టేయ్యాలని ఉంది లేకుంటే మళ్ళా తెల్లారిపోతుంది ఇద్దరం జాబిలీలో దాక్కుని మబ్బులు కప్పేసుకోవాలని ఉంది లేకుంటే భళ్ళున తెల్లారిపోతుంది ఆకాశంలో నక్షత్రాలన్నింటిని దడిగా చేసి మధ్యలో ఇద్దరం ఒక్కటవ్వాలని ఉంది ఎవ్వరికి కనిపించకుండా మనిద్దరం సముద్ర కెరటాలలో దాగి సుడులు తిరిగి కొట్టుకోవాలని ఉంది ఒడ్డుకు వస్తూ పోతూ... ఇసుక లోతుల్లో గులక రాళ్ళుగా ఒదిగి పోవాలని ఉంది నీటి పొరల మధ్య తేలియాడుతూ... చెట్టు పై మొక్కనై పరాన్న జీవిలా పెనవేసుకుని అల్లెసుకోవాలని ఉంది ఇద్దరం పచ్చగా! నిత్యం నీ ప్రేమ కౌగిలిలో బందీ అవుతూ ప్రేమ దొంగ గా మారి నీ మదిని దోచుకోవాలని ప్రేమ చెరశాల కట్టేసుకోవాలని ఉంది (S*A* R *A *D*A *G*A ) ==================== ఏప్రిల్ 08/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2ByXG

Posted by Katta

Viswanath Goud కవిత

విశ్వ మాలికలు 1.దేహానిది కోరికల దాహం.! తాగేకొద్ది తడారిపోతూనే ఉంటుంది.!! 2.నామనసు మేనానే... నీ తలపులు మోసినంత కాలం.! 3.అచ్చతెలుగు చలనచిత్రాల్లో అష్టవంకరలు పోతూ తెలుగుభాష..! నయమనిపించేలా ఆంగ్లానువాదచిత్రాలు... ఆమోదయోగ్యమైన భాష వాడుతూ.!! 4.అందని ద్రాక్షవే.! కలలో మురిపిస్తూ....ఇలలో మరిపిస్తూ.!! 5.వలపన్నుతోంది నిద్ర.! కళ్ళలో సంచరించే కలలను పట్టుకోవాలని.!! 6.ఎంత దోపిడి..... కష్టం చేతులదైతే..! అలసిపోయి సుఖనిద్రను అనుభవించేదేమో కళ్ళు.!! 7.నీతో జీవించాలనే నా ఆశల కెరటం..! నువ్వు చేరువయిన రోజు తాకుతుందది ఆనందపుతీరం.!! 8.గుండె గూటి చుట్టూ జ్ఞాపకాలు..! మండేవి కొన్నయితే....చల్లార్చేవి మరికొన్ని..!! 9.నీ జ్ఞాపకాలు 'చల్లకుండ'.! నా గుండె తడారినప్పుడల్లాఆశల నీరు పోస్తూ.!! 10.మోతాదుకి మించి కృత్రిమ ఎరువులంటి కపటప్రేమలు.! మనసు చేలల్లో మానవత్వం పండకుండా బీడుచేస్తూ.!! 11.నీదే పెత్తనం.! నామనసునెపుడో నీ దాసిగా చేశా..!! 12.ఇద్దరిదీ ఏకగ్రీవ ఎన్నికే.! పగటి నియోజకవర్గంలో సూరీడు...రాత్రినియోజకవర్గంలో చంద్రుడు.!! 13.గజినీ మహ్మద్ నీ తలపులు.! ఎంత తరిమికొట్టినా దండయాత్ర ఆపవు.!! 14.ఎన్నికలకు సర్వం సిద్ధం.! హామీల ఉచ్చు బిగిస్తూ..ఓటర్లను వేటాడటానికి తయారవుతూ.! 15.పగటి విషయంలో గొడవపడ్డ జంట.! అలిగి కంటినొదిలి కనుమరుగవుతూ కల.!! 16.జ్వలిస్తూ మది గుండంలోని జ్ఞాపకాల కణకణాలు.! కలకలం రేపుతూ బూడిదవుతున్న ఆశల ఆనవాళ్ళు.!! 17.కూరకి పనికిరాని పుట్టగొడుగులు.! రొజుకొకటి పుట్టుకొస్తున్నఈపార్టీలు.!! 18.భేతాళ ప్రశ్నవే నువ్వు.! కోపంగా మాట్లాడినా అలుగుతావు... అనునయించబోతే ఇంకా అలుగుతావు.!! 19.బండను పగిలితేనే ఇళ్ళు కట్టడానికి రాయి దొరికేది.! గుండెను రాయి చేసుకుంటేనే దుఃఖసాగరం నుండి ఒడ్డుచేరేది.!! 20.నాజీవితం ఖరీదు.! నీ మనసు.!! 21.కరుడుగట్టిన కళ్ళు.! తను 'కన్న'కలలను తానే హతమారుస్తూ.!! విశ్వనాథ్ 08APR14

by Viswanath Goudfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2BvLE

Posted by Katta

Sahir Bharathi కవిత

Narayanan Krishnan అతను రగిలే ఆకలికి సహవాసగాడు .... అతను తీరని ధప్పికకు జలపాతము .... అతను అనాధలకు కనిపించే దేవదూత .... అతను మానవత్వానికే నిదర్శనము..... మనిషిని మనిషిగా చూసే నిజమయిన మానవుడు..... సేవకు హద్దులు లేవని తెలిపినందుకు I salute you Sir.........sahir bharati. http://ift.tt/PMk4VM

by Sahir Bharathifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PMk4VM

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

ఘంటసాల నిర్మల " జుగల్ బందీ " ఒక విలక్షణమైన కవిత. భార్యాభర్తల అన్యోన్య దాంపత్య సమాగంలో చివరాఖరికి స్త్రీ ఆనందానుభూతికన్నా ఓటమి, ఒంటరితనమే జీవనానుభవ పరాకాష్టగా పొందిందని వర్ణించింది కవయిత్రి . స్త్రీవాద ధోరణితో రాసినా, ఒక గాఢతను సంతరించుకుంది ఈ కవిత. మరొక్కమారు ... ఆస్వాదిద్దాం ...... 8-4-2014.

by దాసరాజు రామారావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PMk206

Posted by Katta

Jagadish Yamijala కవిత

కలిశామంటే కలిశాం కానీ... ------------------------- అనుకోని విధంగా పేస్ బుక్కుతో నాకు ఏర్పడిన పరిచయమే అనూతో.... చాటింగులు సెల్ సంభాషణలు ఎస్ ఎం ఎస్ లు దీర్ఘకాలం సాగాయి అనూని చూడాలని నేనూ కుదరదని అనూ సవాళ్ళకు సవాళ్ళు వేసుకున్నాం చివరికి చాలాకాలానికి కలిశాము అనూ, నిన్ను చూడనివ్వక అడ్డుగోడవుతోంది నా కన్నీటి ధార, పట్టరాని ఆనందం ఉన్నట్టుండి ఆ కన్నీటి ధార మధ్య నువ్వు కనిపించావు నువ్వు నా కన్నీళ్లను తుడుస్తున్నావు వేళ్ళకు అంటిన తడిని దీర్ఘంగా లోతు మనసుతో చూసావు అనుకోని మౌనం మనల్ని గతంలోకి తీసుకుపోతోంది అప్పటి వరకు నమోదైన దృశ్యాలు మనసు చుట్టూ తిరుగుతున్నాయి పరస్పరం చెప్పుకోవలసిన మాటలు మరచిపోయి ఒకరికొకరం చూసుకున్నాం మనకోసమైన ప్రపంచం ఈ క్షణాన మన మధ్య ఉంది దీనిని జాగర్త చేస్తాను ఎటూ తరలిపోకుండా అప్పుడప్పుడూ మన మధ్య గొడవల వల్ల అనుభవించిన బాధలకు ఈ క్షణ లోకం ఓదార్పు ఔషదం కావచ్చు ధైర్యంగా ఉందాం మనకైన మంచి జీవితాలకోసం నమస్కరిద్దాం తీరా అప్పటి వరకు నేను మూసిన కళ్ళతో తెరచిన మనసుతో చూస్తే ఇప్పటివరకు చూసినదంతా ఒట్టి కలే ..? మనం ఒకరినొకరం చూసుకోలేదు నువ్వనుకున్నదే నిజమైంది చివరిదాకా చూసుకోకుండానే మిగిలిపోయాం నువ్వు నువ్వుగా, నేను నేనుగా - యామిజాల జగదీశ్

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2nD3O

Posted by Katta

Ramesh Ragula కవితby Ramesh Ragulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PLZKnD

Posted by Katta

Kamal Lakshman కవిత

భరతమాత ముద్దు బిడ్డ అమ్మెవరో ...నాన్నేవరో .? వారెలా ఉంటారో ....... ఎందుకు జన్మనిచ్చారో... ఎందుకు విసిరేసారో..... నేచేసిన పాపమెంటో.... అసలు నేనెవరో...??? నాకే తెలియదు.... అనుదినం వీధి కుక్కల కాట్లాటలో తినోదిలేసిన ఎంగిలి మెతుకులకై ఆవురావురనే నా ఈ బతుకు పోరాటం ఎన్నాళ్ళో...ఎన్నెళ్ళో... అయినా నేను భరత మాత ముద్దుబిడ్డనట....! ఈ దేశం గర్వించే రేపటి పౌరుణ్ణట...! ఈ సమాజానికసలే కనబడనట....! కమల్ (8 april 14)

by Kamal Lakshmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hXqtb9

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

Blog: కొత్త పాళీ Post: TTV - Duet - Ghantasala Nirmala Link: http://ift.tt/1kfCZ9l

by దాసరాజు రామారావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfCZ9l

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

\\బ్లెయిర్ ఇక లేడు\\ కారు రేడియో స్పీకర్ ఆ రోజు నా చెంపమీద ఛెళ్ళున చరిచింది. బ్లెయిర్ ఇక లేడు. మా నగరపు మహాకవి ఇక లేడు. మైకు ముందు గొంతు విప్పితే ఎలుగెత్తిన శాక్సొఫోన్‌లా ధ్వనించే బ్లెయిర్ ఇక లేడు. కడలి తరగలా, ఝంఝామరుతంలా మహోత్సాహంతో మహాశక్తితో సంచలించే బ్లెయిర్ ఇక లేడు. రోడ్డు పక్కన ఒక ఖాళీ పార్కింగ్ లాట్‌లోకి కారుని ఆపి అలా కూర్చుండి పోయాను. రేడియో ఆపేశాను. చుట్టూ నిశ్శబ్దం. నిశ్శబ్దమే మిగిలింది. బ్లెయిర్ ఇక లేడు మరి. బ్లెయిర్ అనే ఒక్క పేరుతో ప్రఖ్యాతుడైన డెట్రాయిట్ ముద్దు బిడ్డ, డేవిడ్ బ్లెయిర్, విశేషణాలకి అతీతుడు. ముద్రల చట్రాల్లో ఒదగనివాడు. కవి, గాయకుడు, కళాకారుడు, సంగీతదర్శకుడు, శిక్షణ ఇచ్చే గురువు, ఉద్యమనాయకుడు, ఇంకా ఫలానా అని పేరు పెట్టలేని ఎన్నో కార్యకలాపాల్లో మునిగితేలేవాడు. అన్నిటినీ మించి గొప్ప మనిషి. తోటి మానవుల్ని నిర్ద్వంద్వంగా ప్రేమించ గలిగిన మానవత్వం ఉన్న మనిషి. బ్లెయిర్ 1967 లో న్యూజెర్సీ రాష్ట్రంలో పుట్టాడు. కానీ డెట్రాయిట్‌ని తన నివాసం చేసుకుని ఈ నగరంతో మమేకమయ్యాడు. తన కార్యకలాపాలకోసం అమెరికా దేశమంతా, ప్రపంచమంతా తరచూ పర్యటిస్తూ ఉన్నా, అతని గుండె చప్పుడు మాత్రం డెట్రాయిట్‌నే పలవరించి కలవరించింది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఎన్నో రికార్డులు రిలీజ్ చేశాడు. తన పాటలు తనే రాసుకునేవాడు. అతని పాటలకి లెక్క లేనన్ని ఎవార్డులు పొందాడు. కానీ ఏనాడూ ఎవార్డులకోసం అతను పనిచెయ్యలేదు. ఎన్నో ప్రక్రియల్లో నిష్ణాతుడైనా, ఎప్పటికప్పుడు ఆ క్షణాన చేస్తున్న పనిలోనే సర్వశక్తులూ కేంద్రీకరించి పూర్తిగా దానిలోనే లీనమై ఆ పనిని అత్యంత ప్రతిభావంతంగా పూర్తిచెయ్యడం బ్లెయిర్‌కి మజ్జాగతమైన లక్షణం. కవిత్వంలోనూ అనేక ఎవార్డులు గెలిచాడు. 2010లో ప్రతిష్ఠాత్మకమైన కెలలో ఫెలోషిప్‌కి ఎంపికయ్యాడు. అతను కవిత్వాన్ని పైకి చదవడానికి బాగా ఇష్టపడేవాడు. అనేక సార్లు Poetry Slam అనే కవితాపఠన పోటీలో విజేతగా నిలిచాడు. అతని కవిత్వం కూడా బాలడ్ అనే ప్రక్రియలో, గేయాలకి దగ్గరగా ఉంటూ వచ్చింది. పైకి చదవడానికి, ప్రదర్శించడానికి అనువుగా ఉంటుంది. బ్లెయిర్‌ది కొద్దిగా జీరతో కూడిన బలమైన గొంతు, స్పష్టమైన ఉచ్చారణ. పైగా భావస్ఫోరకంగా కవిత చదవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అందుకని అతనే ఆ కవిత్వాన్ని చదివి వినిపించినప్పుడు గొప్ప శక్తితో శ్రోతలని కుదిపేస్తుంది. రెండు సార్లు ప్రత్య్క్షంలో అతను కవిత్వం చదవడం విన్నాను. గొప్ప అనుభూతికి లోనైనాను. ఒకసారి అతను డెట్రాయిట్ గురించి రాసిన కవిత While I was away చదివినప్పుడు నా పక్కన కూర్చున్నామె వెక్కి వెక్కి ఏడవసాగింది. "మీరు బానే ఉన్నారా?" అని ప్రశ్నించాను. ఆ కన్నీళ్ళలోనుంచే చిన్న నవ్వు నవ్వి, It is so beautiful అన్నారామె. నాకు ఎప్పుడో పదేళ్ళ కిందట ఒక సాయంత్రం పూట హైదరాబాదులో ఒక మేడ పై అంతస్తులో డాబా పైన ఆరుబయట కూర్చుని గోరేటి వెంకన్న పాట విన్న అనుభూతి గుర్తొచ్చింది. బ్లెయిర్ చాలా ప్రతిభావంతుడైన అధ్యాపకుడు కూడా. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది - ఏదైనా పని చెయ్యడం బాగా తెలిసిన వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఆ పని ఎలా చెయ్యాలో ఇతరులకి నేర్పే అధ్యాపకులవుతారు అని. కానీ ఏదైనా కళారూపాన్ని నేర్చుకోవడానికో నేర్పడానికో ప్రయత్నించిన ఎవరికైనా ఇది నిజంకాదని అనుభవం చెబుతుంది. ఎంతో గొప్ప కళాకారులైనా అందరూ గురువులు కాలేరు. ప్రతిభావంతులైన గురువులు చాలా కొద్దిమందే ఉంటారు. బ్లెయిర్ అట్లాంటి అధ్యాపకుడు. ఏదో ఒక బడికో, సంస్థకో అంకితం కాలేదు. అంకితం కావడమంటే కట్టుబడి ఉండడం, పరిధులకి లొంగి పోవడం - అది అతని స్వభావానికే విరుద్ధం. ప్రాథమిక పాఠశాలల దగ్గర్నించీ మహా విశ్వవిద్యాలయాల దాకా, చర్చిలలో, కమ్యూనిటీ కేంద్రాలలో, సమ్మర్ కేంపులలో - ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడ ప్రత్యక్షం. ఎదురుగా ఉన్నది పదిమందైనా, వందమందైనా బ్లెయిర్ బోధనలో పెల్లుబికే శక్తితరంగం ఒకటే. నేర్పేది ఒకే ఒక్క పాట అయినా, లేక ఒక సెమెస్టర్ అంతా బోధన చెయ్యబోతున్నా ఆ బోధనకి అతని కమిట్‌మెంట్ ఒకటే. అసలే మనుషుల్ని బాగా ఆకట్టుకునే వ్యక్తిత్వం. అందులోనూ పిల్లల్ని బాగా ప్రేమించే వాడు. ఏ వయసు పిల్లల్తో అయినా చాలా సులభంగా కబుర్లు కలిపేసి, కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ అభిమానం చూరగొనేవాడు. నగరంలోని ఒక పేద పేటలో ఒక చర్చి నిర్వహిస్తున్న సమ్మర్ కేంప్‌లో ఈ వేసవి ఒక మగపిల్లల బృందానికి పాడడం నేర్పుతూ ఉన్నాడు. అతను వాళ్ళకి పరిచయం చేసి నేర్పుతున్న పాట పూర్తికాక ముందే అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. బ్లెయిర్ సంస్మరణ సభలో ఆ పిల్లల బృందం అతనికి నివాళిగా ఆ అసంపూర్తి పాటనే పాడారు - అద్భుతంగా. ఒక బ్లెయిర్, ఒక బాలగోపాల్ - ఇలాంటి వ్యక్తుల్ని మరణం గెలిచిందంటే నమ్మడం కష్టం. ఎందుకంటే వాళ్ళలో ఎప్పటికప్పుడు పెల్లుబుకుతూ ఉన్న జీవశక్తి అంత గొప్పది. వాళ్ళ జీవితాన్ని, ఆ జీవితంలో గొప్పదనాన్ని తల్చుకుని ఉత్తేజితులమవుతూ మనకి చేతనైన పద్ధతిలో, చేతనైన మేరకి వాళ్ళని అనుసరించడమే మనమివ్వగలిగిన నివాళి. తాజాకలం: బ్లెయిర్ కవిత చదువుతున్న దృశ్యాన్ని ఈ కింది యూట్యూబు లంకెలో చూడవచ్చు. http://ift.tt/1oEeftf POSTED BY NARAYANASWAMY S. 8-4-2014. :

by దాసరాజు రామారావుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oEeftf

Posted by Katta

కాశి రాజు కవిత

||మీసాల రొయ్య || దిగబడిన అడుగుజాడల్లో చేరిన మురికి నీళ్లన్నీ వాడిమీదకి నేనూ నామీదకాడు తన్నుకుని సేసిన తానాలు అమ్మ అరుపుల్ని అందుకోలేవు ఇంకెంత సేపన్న కవురు ఎవరో ఒకరు తెత్తేనేగాని అమ్మ పిలిస్తుందని గాని , గుడికెల్లాలనిగాని గురుతురాదు. ఈతరాకున్న ములగననే దైరం ఇత్తన్నకొద్దీ ఎన్నోసార్లు దూకాను , లోతు నానది ఆటనాది. ఎక్కువసేపు రొంపసేత్తాది ఎక్కేయ్ గట్టు అనేవాడు తూము అరుగుల రాళ్ళ బొక్కల్లో రొయ్యపిల్లలు పట్టుకుని ఆడించిన నాన ఎందుకో ఎదగడం ఆపేసాక . మరి నేనూ రాములోరి కల్లేనం కదా తానం చేసి గుడికెలతుంటే మీసాల రొయ్యల దువ్వుకున్నాను . నానా మీసాల మీద సెయ్యేతే నిన్ను ముట్టినట్టే . నీతో మళ్ళీ మళ్ళీ ఆడినట్టే రాములోరిమీదొట్టు ఎదగడం రాలేదని ఎవరు నీతో సెప్తారు.

by కాశి రాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ipsWr6

Posted by Katta

RajendraKumar Devarapalli కవిత

బావికి వెళ్ళే దారి చాలా కష్టమైనది, నా నీటిపాత్రను నింపేదెలా? నీటిని నింపేందుకు నేను వెళ్ళినప్పుడు తొందరలో,నా నీటిపాత్రను పగులగొట్టాను, ఓ నిజమ్ ఖుస్రో నీకు తన నిండుజీవితం ఇచ్చాడు. దయచేసి నీవు నా మేలిముసుగుపై శ్రద్ధ వహించగలవా? బావికి వెళ్ళే దారి చాలా కష్టమైనది, మూలం:అమీర్ ఖుస్రో ఆంగ్లానువాదం:షఫినిన్ ఆలీ ఆంధ్రానువాదం;రాజేంద్రకుమార్ దేవరపల్లి ఏప్రియల్,8,2014

by RajendraKumar Devarapallifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1isHF63

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ipbWS5

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

అక్షరం రావెలపురుషోత్తమరావు ---------------------------------- అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడ్డ అయోమయాన్ని కాదుసుమా అనవరతం జనజీవనంతో పెనవేసుకుపోయి పీడిస్తున్న ఆకలిని. అక్షరాలా అమృతోపమైన మృత్యుంజయ రూపాన్ని 08-04-14

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ipbUJV

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/అపసవ్యం సీసపు కెరటాలు గాజు తీరమంతా కొవ్వుతుల రాత్రిలో కొన్ని వెన్నెల కుట్లు ఆకాశపు తెర నిండా గాలి పొట్లాలు మనసు మైదానాన ముఖాన అద్దుకున్న నవ్వులు తేనె చీకట్లలో వెండి మిణుగురులు నా దోసిళ్ళలో ఒలికిన పచ్చని కాంతులు మనసు ప్రక్షాళణ కోసం కొన్ని స్వప్నాల జననం మరికొన్ని సత్యాల మరణం కొత్త పునాదులు లేని పేక నిర్మాణాల సంద్రం మధుశాలల్లో బిక్కచచ్చిన ప్రాణాలు పాత్రలు ఇంకేదాకా సంపూర్ణంగా అసంపూర్ణాలు మదిసమాదుల కింద తిలక్ బొమ్మరాజు 01.04.14 08.04.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1edszo9

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

ఒక సందర్బం రెండు కవితలు రెండూ పొస్ట్ చేస్తున్నాను...పెద్దలు ,గురువులు, మిత్రులు తప్పని సరిగా చదివి మీ మీ సూచనలు సలహాలు ఇవ్వగలరు.. కె.ఎన్.వి.ఎం.వర్మ//ఇంటి ముందు// పొద్దున్నే చూస్తే, లోడర్ ఒకటి నాలుగో ఐదో ట్రాక్టర్లు ఇరవై అడుగుల ఇసుక గుట్ట పది అడుగుల ఇసుక గుట్ట ఆరు గుడిసెలు అందరూ హడావుడి పడుతుండగా ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ట్రాక్టరు లోంచి క్లబ్ సాంగు ఇంట్లోకి దుమ్ము వస్తోందని తపులేసేసాను రాత్రి ఫొను వచ్చిందని బయటకు వెళ్ళి మాట్లాడుతుంటే గుడిసెలని చెప్పలేను కానీ వాటి మద్య ఓ గుంపు వచ్చీ పోయే వాహనాల మద్య వినపడలేదు కానీ మధ్య మధ్య ఓ చెమట రాగం చూచాయిగా చప్పట్లు మాత్రం బిగ్గరగా.... హలో హలో తర్వాత మాట్లాడుకుందాం వీళ్ళకి ప్రతీరాత్రీ కవిసంగమమేనంట రాసిందెవరో పాడిందెవరో ముక్యం కాదట పాడుకుంటూనే నిద్రపోతారంట....31.03.2014. ........................................................................... కె.ఎన్.వి.ఎం.వర్మ//సౌందర్యం// లేచిన వెంటనే అలవాటు ప్రకారం కొబ్బరి చెట్టు చుద్దామని వరండాలోకి వెళ్ళాను... చూపులు నేల మళ్ళగానే తాటాకులు, బరకాలు కప్పిన నాలుగైదు ఆవాసాలు ముక్కులదరగొడుతూ పాచి పెంట చుట్ట వాసన అంతస్తులతో పోటీ పడుతున్న ఇసుక గుట్టని ఎత్తి పోస్తూ ఒక లోడరు అరడజను పైగా ట్రాక్టర్లు ఒకటే గోల దుమ్మూధూళి ఇంట్లోకి వస్తుందని తలుపు ఏసేసాను ఎప్పుడీ రోడ్డు పూర్తవుతుందో...ఎంటో... అర్ధరాత్రి ఫొన్ సిగ్నల్ కోసం ఆరుబయటకు వస్తే అడపా దడపా వస్తూ పోతూ ఒకటో రెండో వాహనాలు ఇంటిముందు క్యాంపు లోంచి ఓ ఇంపైన చెమట రాగం కాసేపు; రంగసాకి రంగసాకి బోనా బోనాంకో ఇంతంట్లో ఎంకి వంటి పిల్ల లేదోయి ఎంకినా వంకింక రాదోయి మద్యమద్యలో కేరింతలు చప్పట్లు సెల్ కట్టేసి పడక కుర్చీ వేసుకొని వింటున్నా ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు తెల్లారి లేచి చూస్తే నా ముందొక శ్రమ సౌందర్య వాటిక లేచిన వెంటనే కొబ్బరిచెట్టు చూసే పనిలేదు కొన్నాళ్ళు....08.04.2014. (నిన్న రాత్రి ఆ క్యాంపు కాళీ చేసారు)

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ioXjxS

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి రామాయణం ఒక లక్ష్యం ఋషిపుంగవ సంరక్షణం ఒక విధేయత గురు ఆజ్న పాలనం ఒక బాణం సమస్త అస్త్రాలని మించిన శస్త్రం ఒక వీరోచితం శివధనుస్సుని ఎత్తడం ఒక ధర్మం పితృవాక్యపరిపాలనం ఒక హృదయం కైకేయిని సైతం ప్రేమించడం ఒక మహత్వం అరణ్యవాసం ఒక సాధారణత పర్ణశాలో నివాసం ఒక ఆదర్శం ఏకపత్నీవ్రతం ఒక ఆత్మీయత సుగ్రీవునితో స్నేహం ఒక వ్యక్తిత్వం హనుమంతునికి దైవం ఒక న్యాయం వాలిని చంపడం ఒక దుఖం సీతాపహరణం ఒక ప్రేమ భార్యావిరహం ఒక అవకాశం రావణునికి రాయబారం ఒక యుద్దం రావణసంహారం ఒక పరిపాలన శ్రీరామరాజ్యం ఒక త్యాగం సీతాపరిత్యాగం రాముని జీవితం ఒక మహా జీవనకావ్యం అదే రామాయణం జీవనోపాఖ్యానం ఈ రోజు శ్రీరామనవమి కనుక; కనులారా చూద్దాం సీతారాములపరిణయం నేర్చుకుందాం అలవరచుకుందాం రాముని మార్గంలో నడవడం 08Apr2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ioiYGK

Posted by Katta

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు స్రవంతి ఐతరాజు 8.4.14 "కల్యాణం కమనీయం" ప్రతి తల్లీ కౌసల్యే.. ప్రతి వూరూ అయోధ్యయే! ప్రతి గడపా మిథిలా నగరియే.. ప్రతి పడుచూ రామునికై వేచే పడతి సీతమ్మయే.. ఏ శుభ ఘడియలకై ప్రకృతి కన్య వేచి చూస్తుందో అవి రానే వచ్చాయి.. శ్రీ రాముని వరునిగా తెచ్చాయి సుందర ఉద్యనాలన్నీ మిథిలా నగర అంతఃపుర స్థలాలయ్యాయి ప్రతి తీగె సీతమ్మ ఒంపుసొంపులద్దుకున్నాయి ప్రతి పందిరీ రామయ్య మగసిరుల మరిగాయి ప్రకృతి అంతా శ్రీ సీతారామమయంగా మారింది! అడుగడుగో ఆ ఆజానుబాహుడు.. అరవిందదళాయతాక్షుడు శ్రీరాముడు. మన్మధుడు మాటేసిన మగసిరితో.. ధనుర్భాణాలు చేతబూని సీతను వెదకుచున్నాడు తాకిన కందే నెమ్మోవితో సిగ్గుసింగారించిన విశాల నేత్రి సీత క్రీగంట చూస్తోంది రఘువీరుని చూపుల తూపుల శరములు ఇరువురి హృదయాలను తాకి మన్మధయుద్ధం ఆరంభించగా ఫెళఫెళ విరిచెను శివధనువును రాముడు వరుడై కళ కళ సీతా వధువు మోము చంద్రబింబమై కనులతో పిలిచె రాఘవుడూ తమకమున చేరె వైదేహి ఇనకులుడు తాను సూర్యుడు కాగా భూమిజయై సీత తనననుసరింప చూసినవారికి జన్మతరింపగ తలచినవారికి వలపు జనింపగ వూరూరా సీతారామ కల్యాణం కలిల్గించు సకల జనులకు నిత్య కల్యాణం పచ్చతోరణం!!!

by Sravanthi Itharajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g0xg3d

Posted by Katta

Satya NeelaHamsa కవిత

సమాలోచన ^^^^^^^^^^^^ -సత్య వాగే నీ వెధవ వాగుడు వింపించాలనే నీ పిచ్చి, నీ ఒంటరితనానికి పరాకాష్ఠ! నీకింకా అర్థం కావట్లేదా? జనాలు పూసుకుంటున్న జండూ బాం తక్కువుందనా? నీ బాధలు కూడా జనాలపై జోరుగా రుద్దు తున్నావు? అంగట్లో ఆత్మాభిమానాలు తక్కువున్నాయనా ? నీ అస్తిత్వాన్ని కూడా అందరికీ గుర్తుచేస్తూ తిరుగుతున్నావు! సహజంగా సరళంగా , సమాలోచన చేసుకోలేని సమాదిలో గడపలేని , నీ సాధుత్వం దేనికని? ఉషోదయాన్ని శీతలఝరాన్ని పరిమళపవన్నాన్ని మర్చిపోయావా ? లేక నువ్వే, గుర్తుచేసుకోవా ? మును ముందుకు సాగిపోయే వాడివి నీవని మరిచిపోయవా? దారిలో కలిసేవారు దరిని చేర్చేవారు వేర్వేరని గుర్తుచేయాలా? అవలోకనం విమర్శ ఉద్ధరణ పదాలు ఆత్మకంటించాలంటే కరడుగట్టిన కరగని అహం అహరహం అడ్డోస్తుందా ? మౌనమిచ్చిన ముత్యాల్ని మాటల మూటళ్లో కట్టి మందిలోజేరి "మంచిగా" అమ్ముతున్నావా ? మధువు దోచి మూటకట్టే తుమ్మెదలాగా సహజంగా బతికి నీపనేదో నువ్‌చేసుక్కొని చావరాదా? లేక చావడంకూడా రాదా? అందరూ వెతికేలా నీ అడుగుజాడలొదలాలని ఆర్భాటంతో అంతుచిక్కని నీ ఆత్రుత దేనికని? స్నేహంగా ఉంటావో, స్నేహంగా కనిపిస్తావో! నీ చిరునవ్వు ముసుగుని ఎవరికి చూపిస్తావో!! నీవు లేని దారుల్లో నిన్నునీవు వెతుకుతున్నావ్! శృతిలేని నీసంగతుల మధ్య సంగీతం రావట్లేదా? జరిగేదిదే, ఎందుకు బెట్టుకు పోతావు ? జనాలతో పెట్టుకోకు కొట్టుకు పోతావు ? -సత్య

by Satya NeelaHamsafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1enNwqP

Posted by Katta

Kapila Ramkumar కవిత

poem by '' Hazel Connelly '' || Canvas || Before my eyes brilliant colour, perfection Dancing gracefully in every direction, The world of trees, the art of nature Are simple reasons for a painter. The power mother nature can release Could make a painting, a masterpiece A gallery of natures finest hues, Enough to stir the most reluctant muse. Should mother nature tutor me in art My tree would show a living beating heart, And should I save one single living tree My canvas would inspire the world to see. Red, orange, yellow, green and brown Colours of beauty my brush would put down Bright and vibrant Maple Red and Golden Oak Living, breathing felt with every brush stroke.. 8.4.2014 ....12.. Noon

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PX1nyq

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iruvWO

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

జాబిలీ నీవు పొన్నలు పొగడలు పూయిస్తావు భగ్నమనస్కుల్లో అగ్ని సెగలు రగిలిస్తావు ప్రేమికుల మద్య రహస్యంగా రాయబారాలు నడిపిస్తావు మరొకసారి ఆకాశంలో స్రవించె గాయంలా కనిపిస్తావు ఉమిత్ కిరణ్ ముదిగొండ

by ఉమిత్ కిరణ్ ముదిగొండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2z5sT

Posted by Katta

Kamal Lakshman కవిత

ముఖ పుస్తక మిత్రలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు... మీ కమల్

by Kamal Lakshmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kEpawU

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

“ఏక పద్య రామాయణం”. “యాగ ఫలంబుగా జననమంది, మహాస్త్ర కళా విదుండునై, యాగము గావగా జని, శివాంకిత చాపము ద్రుంచి, జానకిన్ తా గొని పత్నిగా, పిదప – తండ్రి వచః పరిపాలనన్ వనం బేగి, దశాననున్ దునిమి, ఏలికయౌ రఘురాము మ్రొక్కెదన్!” అందరికీ “శ్రీ రామ నవమి” పర్వదిన శుభాకాంక్షలు!

by DrAcharya Phaneendrafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgWz27

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 24 (కవి సంగమం) ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ "రసాత్మకం,కళాత్మకం భాస్కర్ కొండ్రెడ్డి కవిత్వాత్మక వాక్యం" ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ కవిత్వ సంపుటి పేరు :- "వాక్యం " (An expression of thought ) ######################################### సంపుటి రాసిన కవి పేరు:- "భాస్కర్ కొండ్రెడ్డి " **************************** సంపుటిని పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి ____________________________________________________________________ "వాక్యం " కవిత్వ సంపుటి నన్ను చేరుకోగానే అనుకోకుండా ఆఖరి పుటలోకి నా చూపు వెళ్ళిపోయింది.నా కన్ను అలాగే పుట చివరంటా సాగింది.గాలి వేదన,శిలల దుఃఖం,ఆకాశ రోదన ఎవరైనా విన్నారా,అనుభవించారా,కలగన్నారా అనే ప్రశ్నలు సంధించిన కవిత "విలోమగీతం"-నన్ను నా ఆలోచనను విలోమం చేసేసింది.కవి పై ప్రశ్నలను కవిత్వం చేసిన వైనం సాధారణంగా భాస్కర్ పాటించే టెక్నిక్ కి భిన్నంగా వుంది వొకింత తాత్విక వూహలోకి మనల్ని తీసుకెలుతుంది. "గాలికెదురుగా ఎగిరే/పక్షుల ఆ రెండు రెక్కలు గాలి గుండెను చీల్చినప్పుడు/గాయపడిన గాలి వేదన విన్నావా,నువ్వెప్పుడైనా? వట్టిపోయిన ఏటిలోన/నీటి ధారల జాడ కోసం ఎదురుచూసి,ఎదురుచూసి/ఎండిపోయిన శిలల దుఃఖం అనుభవించావా ఎప్పుడైనా? నింగినొదిలి,నేలరాలి/చిధ్రమైన మేఘ్హమాలిక చావు కష్టం కళ్ళార చూసి/అంతులేని ఆకాశ రోదన ఛాయనైనా, కలగన్నావా? గాలి,నీరు,ఆకాశం ఈ మూడు పంచభూతాల్లో ముఖ్యమైన మూడంశాలు.ఈ మూడు అప్రాణులే.అయినా ఇవి ఈ ప్రపంచ గమనానికీ కీలకమైన అంశాలు. సున్నితమైన పక్షి రెక్కలు గాలిని కోస్తూ ఎగిరేటప్పుడు గాలి పడే వేదన సున్నిత మనస్కుడైన మనిషికీ,నీటికోసం ఎదురు చూసే కఠినశిలలు ప్రేమతడి కోసం నిరీక్షించే మనిషికి,నింగి నుండి నేల రాలిన ఆకాశం అన్ని కోల్పోయాననుకున్నా మనిషికీ ప్రతీకలుగా చేసి అప్రాణులైన గాలి,నీరు,ఆకాశంలకూ మానవ దుఃఖ ఆరోపణ చేసి ఒక గొప్ప శిల్పాన్ని సాధించాడు. "చెట్టు,చేమ,గాలి,ధూళి నింగి,నేలా,నీరు,నిప్పు వాగు,వంక,ఎండిన డొంక ఇవే కాదోయ్!పర్యావరణమంటే" పర్యావరణమంటే నువ్వు,నేను కూడా-అని ఒక ఉద్బోధ మనకు "కన్ఫ్యూజన్"లేకుండా,పర్యావరణ "సారాంశం"ను "బాధ భాష"తో చెప్పిన కవి భాస్కర్ కొండ్రెడ్డి. "స్వప్న లోకపు స్వేచ్ఛా యానం యథార్థ జగత్తు దుఃఖపు గానం కొట్టుకొచ్చిన సృజనాత్మక రాతలు ఎత్తుగడలలా ఎత్తులలోన కూరుకు పోయిన అసలు రహస్యం, ధగధగ మెరసే కవుల్స్ తలలకూ వెనకవున్న సొట్టలు తెలుసా? నీకేమయినా." ఇలా కవిత్వం కాని కవిత్వం రాస్తున్న వాళ్ళని నిర్మొహమాటంగా ప్రశ్నించిన కవి భాస్కర్ కొండ్రెడ్డి.కుహనా కవిత్వాన్ని కవులను నిలదీసినిగ్గుదేల్చే కవిత్వం రాస్తున్న కవి భాస్కర్ కొండ్రెడ్డి " ఏ ఏ రసాయనాలు కలసి నిర్మిస్తాయో వాక్యాలను, ఏ అచేతన చర్యా ఫలమై, వాక్యం నను హత్తుకొందో ఏ అనుభూతులు వాక్యమై ప్రతిఫలిస్తాయో ఏ అదృశ్యాలను వీక్షించి అంతర్నేత్రాలు, సిధ్ధపరుస్తాయో నా వాక్యాలను" "వాక్యం రసాత్మకమ్ కవిత్వమ్"-అన్నాడు జగన్నాథుడు.రసాత్మక వాక్యాల నిర్మాణానికీ ఏ రసాయానాలు అవసరమో తిలక్ "నవత-కవిత లో చెబుతూ "కవిత్వం ఒక ఆల్కెమీ,దాని రహస్యం కవికే తెలుసు'అని అంటాడు."నా వాక్యం నాది కాదు"-అని భాస్కర్ కొండ్రెడ్డి వినయంతో అంటున్నా ఈ కవికీ కూడా కవిత్వ అల్కెమీ తెలుసు అనే నా మాటను "వాక్యం" కవిత్వ సంపుటి నిజం చేస్తున్నది."లోతుల్లోకి పయనిస్తున్నప్పుడు /ప్రతిది సంతోషాన్నివ్వలేదు,/దుఃఖాని హేతువై మిగల లేదు"అనే ఈకవి మాటల్ని అర్థంచేసుకోగలిగితే కవి కవిత్వ తాత్వికతలోకీ మనం సులభంగా చేరుకోగలం. "జలకాలాటల మునకల్లో నీకు కనిపించే నీరు వేరు. దాహాన్ని తీర్చేటప్పుడు ఆ అమృతజల తీరు వేరు. ముంచేస్తున్నప్పుడు మృత్యువై ఆ అలల లయల రీతీ వేరు “ వస్తువు వొకటే అయిన ఆ క్షణంలో దాని పరిస్థితి వొక్కో సందర్భంలో వొక్కోలా వ్యహరించే అవకాశం వుందని,మనిషి కూడా ఆయా సందర్భాల్లో ఆయా రీతిగా వ్యవహరిస్తాడు అని చెప్పడానికి కవి నీటిని సాదృశ్యం చేస్తూ పరొక్షంగా మనిషి స్వభావాన్నీ వ్యాఖ్య్యనిస్తాడు 'సందర్భం"-అనే కవితలో.ఇట్లా ఒక దాన్ని సాక్షాత్కరింపచేయాడానికి మరో దాని స్వభావాన్ని కవిత్వం చేయడం భాస్కర్ కొండ్రెడ్డి లో కనిపిస్తుంది.ఇదొక శిల్ప రహస్యం.అందుకే ఈ కవికీ కవిత్వ ఆల్కేమీ తెలుసు అని నేనంటున్నది. మనిషి మరణిస్తాడు.మరణించిన పిదప అతన్నో,ఆమెనో పాంచభౌతికం చేస్తారు.అది సహజంగా జరిగే ప్రక్రియ.నేల తల్లిని చీల్చుకోని వచ్చిన ధాన్యపుగింజ తనరూపును మార్చుకొని మనకు ఆహారంగా మారిపోతుంది.అట్లా మారిపోయే ప్రక్రియకు ఈ కవి కొత్త అర్థాన్ని చెబుతూ,అందులోని మర్మాన్ని విప్పుతూ 'త్యాగం "అనే కవిత రాశాడు. "తన దేహాన్ని కోల్పోతూ/నీకు నైవేద్యమైపోయింది కదూ1 ఆ చిన్ని ధాన్యపుగింజ. నవ్వుకుంటున్నావా,పిచ్చివాడా! ఆ బలి దానం వెనుక అసలు కథ తెలియని వెర్రివాడా! తనలాంటి వేలాది బిడ్డల కోసం/తన నేల తల్లి కోసం బలమైన నిన్ను ,సారంగా ఆ మట్టిలో కలపడం కోసం" ఆ దాన్యపు గింజ మనకు ఆహారం కావడం వెనుక వుండే రహస్యం రాబోయే తరం కోసం అని అనటంలో ఎంతటి ఆశాభావాన్ని ప్రకటించాడో అర్థం చేసుకోవచ్చు. శరీరంలో ప్రతి భాగం సమర్థవంతంగా పనిచేస్తేనే మనిషి జీవితం సజవుగా నడుస్తుంది.అట్లాగే మనిషి హృదయంలోని అనుభూతులు,భావాలు స్పష్టమైన ఆకృతితో ఒక రూపు దిద్దుకోవాలంటే అక్షరాలు, పదాలు,వాక్యాలు సహకరించాలి.ఇందులో ఏ ఒక్కటి సహకరించలేదంటూనే కవి "సమ్మె"అనే మంచి కవిత రాశాడు."ఎదుగుడు"-అనే కవితలో మనిషి ఎదుగుడుకు అవసరమైన వాటిని ప్రస్తావిస్తాడు.మార్మికత కూడా ఈకవి కవిత్వంలో ఒక ఆకర్షణీయ అంశం. "కొద్ది విరామం తరువాత,సంరంభాన్ని పక్కకు నెట్టి/నేనిలా మొదలు పెడతాను నిద్ర పోనివ్వని రాత్రులింకా,/పూర్తి ఙ్ఞాపకాలుగా మిగలక ముందే మరవక ముందే మళ్లీ మళ్ళి ఇలాగే అర్థం కాకుండా మిగుల్తున్నందుకు"- ఇలా కవి మార్మికంగా సరే ఇలా మొదలెడదాం అని అంటాడు.తన నిగూఢతని అద్భుతంగా ఒక మర్మత్వంతో వ్యక్తికరించే చాతుర్యం భాస్కర్ కొండ్రెడ్డి లో ఈ వాక్యం ను పరిశీలిస్తే తెలియక మానదు. అద్వైతం ఒక వైదాంతిక సిద్ధాంతం.దాన్ని కూడా కవిత్వ పరిధిలో నిర్వచిస్తూ,అంతా ఏ మాత్రం కలసి వుండే అవకాశం లేనప్పుడు,క్రిక్కిరిసి పోయినప్పుడు,ఏమి లేని చోటు కోసం మానవుని అన్వేషణ,తపన ఆరంభమవుతుందనే సత్యాన్ని చెబుతూ "నిబ్బరమైన సావులాగా/బతుకంటే భావ ప్రాప్తిలాగుండాలోయ్/క్షణకాలమే కదా! ఆ అద్యైతం."-అని అద్వైతం కాలం స్ఖలన సుఖం లా క్షణభంగురమే అన్న ఆలోచనను పఠితలకిస్తాడు. "వెత "-అనే కవితలో లిబరలైజేషన్,ప్రవయిటేజేషన్,గ్లోబలైజేషన్ అనే వాటి కత్తి వాదరకు బలయిపోయిన వాళ్లలో రైతులు మొదటి వరుసలోని వాళ్లు.వాళ్ళ స్వరంలో నాలుగే నాలుగు వాక్యాలలో వాళ్ల వేదనాత్మక దుఃఖాన్ని సమర్థంగా చేప్పి ఆ రైతుల చావులకీ వొక వైవిధ్యంతో తక్కువ పదాలతో అత్యద్భుతంగా అభివ్యక్తం చేస్తాడు. 'కళ్లంలో ధాన్యం గింజ,కళ్ళలో సుడి తిరిగింది నే నాటిన బి.టి మొక్కే,పిడి బాకై పొడిచేస్తుంది నే చల్లిన పురుగుల మందే, నాపాలిట విషమయ్యింది నే మోసిన ఎరువుల బస్తా నా శవానికి పక్కయ్యింది" ఇంత విషాదాన్ని ఈకవి ఎట్లా చేప్పాడో ఆలోచిస్తే రైతుల ఆత్మ హత్యల కారణాల స్పష్టికరణను ఎవరైన గుర్తిస్తారు. ఈ కవికీ కవిత్వం అంటే ఎంతో యిష్టం.అందుకే ఈ సంపుటిలో అవసరం లేకపోయిన కవిత్వ ప్రస్తావన చేస్తూ మంచి కవిత్వానికీ నిర్వచనం చెబుతూ,"ఓ.సి కవిత్వం","ఙ్ఞానిజం","సత్యావస్థ","1ంం%కవి",ఏ డిక్లరేషన్ ఆఫ్ పొయెట్,"నిస్తేజం" మున్నగు కవితల్లో కవి తనదైన ఆలోచనను కవిత్వం గురించి చెబుతునే వచ్చాడు."ఎండిపోయిన కన్నీటి చారలు తప్ప దగ్ధమైన కలల బూడిద తప్ప"ఏమి మిగిలిలేవు ఇక్కడ అని"శూన్యం"గా భావించే ఈ కవి ,'నీకెందుకోయి,అకవిత్వం వదులుకోలేవటోయ్, నీవా పైత్యం"-అని కవిత్వం కాని దాన్ని నిరసించే కవి,"ఏది గమ్యం?ఏది సత్యం?/మిత్రమా! నాకేది మార్గం"-అంటూ సంశయంలో పడ్డ కవి,'అనంతవిశ్వం పద్మవ్యూహం/విఙ్ఞానమొక తీరని దాహం'గా భావించే కవి ఎవరంటే భాస్కర్ కొండ్రెడ్డినే. "రోబొ కింగ్"-అనే కవితలో "ఆధునిక భారత దేశ అత్యున్నత ఆవిష్కరణవని మానవ రోబో వని నిష్క్రియాపరుడైనా ప్రస్తుత భారత ప్రధానిని సైతం వ్యంగ్యంగా వ్యాఖ్యానించే సాహసాన్ని ఈ కవి ప్రదర్షించి ప్రజల వైపు నిలబడతాడు.ఈ కవికీ కవులపైనే కాదు తన పైన తానే సెటైర్ వేసుకోగల నిబ్బరం కూడావుంది."ఖాలీగా వున్నావు కదా!/అరకానీ ఖర్చు లేకుండా కవిత్వం రాసుకొమ్మన్నాడు./పాతికవేలెట్టి, పుస్తకం అచ్చొత్తేదాక/పొగడ్తలకు పొమ్గిన, పిచ్చి మనసు ఊరడిల్లలేదు'.-ఇలా పుస్తకం వేసింతరువాత కవులు పడే బాధని చమత్కరించాడు. నిజంగా ఈ కవి ముఖస్తుతి ని ముఖసుత్తి అని రాశాడేమోనని అనుకొంటున్నాను.అన్నింటికి మించిన మత్తు నిచ్చేది ముఖస్తుతేనని,దీని నుంచి బయటపడెసే డీ-అడిక్షన్ సెంటర్ లేదని కవి మానవ బలహీనతని అద్భుతంగా ఆవిష్కరించాడు. "మూడు సందిగ్ధాలు"-అనే కవిత జీవితం,కవిత్వం, మృత్యువు ఈ మూడు మనకెప్పటికీ ప్రశ్నార్థకమై మిగిలే మూడు సంధిగ్ధాలు అనే తాత్విక భావాన్ని చెబుతూ,మరణానికి కారణాన్ని మృత్యువే సృష్టిస్తుందని,కవిత్వమే మనల్ని పావుగా వాడు కొంటుందని,ఎలాగో ఒకలాగు బ్రతికిన అది జీవితంలో మనంగుర్తించలేనిదని ఈ కవి ఊహ చేసిన తీరు నా అన్ని సందేహాలను తునా తునకలు చేశేసింది. ఒకే తలుపుకీ చెరొపక్క గడియలు పెట్టుకొని కలసి జీవిస్తున్న మనుషుల మనస్తత్వాన్ని ,వారిలో వుండే ద్యైధీ వైరుధ్యాన్ని "బంధం"-అనే కవితలో కవి చిత్రించిన వైనం కవికి గల మనస్తత్వ పరిశిలన ను తెలియచేస్తున్నది."నేను చెప్పింది నీకు అర్థం కాదో/అర్థం కానట్టు నటిస్తావో/నాకెప్పటికి అర్థం కాదు./మాట్లాడుకుంటునే వుంటాం,తిట్టుకుంటు వుంటాం/మనమెప్పుడూ/అద్భుతంగా కలసి జీవిస్తునే వుంటాం కదా!" దరిద్రాన్ని,దైవత్వాన్ని,సంపదల్నీ,సైతానుల్నీ, విషాదాన్ని,విస్మయాన్ని,కమ్మని కలల్నీ,కల్లోలాల్నీ,కాలకూట విషాన్ని,కేరింతల్నీ ఒకే చోట కలి కుట్టిన వాడు భాస్కర్ కొండ్రెడ్డి. శిథిల శరీరాన్ని, సౌందార్యాన్ని, కాల బిలాల్ని,కరిగే జీవాన్ని,విద్వేషాన్ని,విఙ్ఞానాన్ని,సృష్టి రహస్యాల్నీ,వినాశానాన్ని,విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని,శతృత్వాన్ని ఒకే వరుసలో కలిపి నాటేసే కవి భాస్కర్ కొండ్రెడ్డి. కన్నిటిని,కవిత్వాన్ని ,రక్తమోడుతున్న దేహాన్ని ఒకే కొయ్యకు వేలాడదీయాలనుకున్న కవి భాస్కర్ కొండ్రెడ్డి జీవిత గతి తార్కిక క్రమాన్ని కవిత్వం చేసిన ఈ కవి "కవిత్వం గురించి తనకేమి తెలియదని,రాయడం తనకెప్పుడు చేత కాదని అన్నా అదంతా వినమ్రతతో అన్నదే కానీ,"వాక్యం"-ఆయన మాత్రమే రాయ గల కవిత్వమని నేనుఅంటున్నా.వొక విన్నూతన దోరణిలో కొన్ని కవితలున్నా అవి ఈ సంపుటికీ ఒక అలంకారమేనని చెబుతున్నా.సంపుటిని కూడా వొక కొత్త ఒరవడిలో తాను ఎవరికైతే సంపుటి ఇవ్వాలనుకున్నాడో వారి ఛాయ చిత్రాన్ని సంపుటి వెనుక అట్ట పై ముద్రించి యివ్వటం ఎంతో శ్రమ.అట్లాంటి శ్రమ తీసుకున్న ఈ కవిని అభినందిస్తూ...వచ్చే మంగళ వారం మరో సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QYjsx6

Posted by Katta

Santosh Kumar K కవిత

||ఆవులింత|| ఓ ఆవులింత! నీ ఉనికి కాసింత వయసు గోరంత నీ రాకతో ఒళ్ళంతా అదేంటో కమ్మని కవ్వింత నీ విలువ కొలవలేనంత నిద్రాదేవతకి నువ్వెంతంటే అంత ఆమె కటాక్షానికై జనమంతా జాగారాలు చేస్తున్నా రాత్రంతా కరగదే నీ మనసు రవ్వంత నువ్వు లేని లోకమొక వింత చూడటమాపి చేరొచ్చుగా చెంత నీ తోడు నాకొక తుళ్ళింత ఈదేస్తా అలవోకగా జగమంతా నువ్వుంటే చాలే ఓ ఆవులింత!! #సంతోషహేలి 08APR14

by Santosh Kumar Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1emzjdM

Posted by Katta

Ramakrishna Kalvakunta కవిత

MY FRIEND-- ----------------{dear freinds ,this is my english poem...plz give ur valuable suggestions...dr.Ramakrishna kalvakunta}----------------------- All the greatest moments have a modest beginnings, Our friendship too just like that ; A good friend is a god-gift, you're one such All days are memorable in your company Time passes by unnoticeably- My heart longs for you in your absence; Yet I'm glad.. For,seperation strengthens all deepest bonds I know not what to call it ? Nor to define it- Affection,intimacy, or Friendship ? What word else is there ? In expressible are my thoughts And inexplicable too.... Life is dreary and unendurable without "YOU" Like a shadow, I would fain to follow you Till that "ETERNAL SLEEP' separates us. I can hold my heart up As a looking-glass for u To be hold your self. Natural and everlasting are my "Feelings"... Though others may take them wrongly. I care not for them MY HEART IS PURE AS NATURE TO YOU LOVINGLY.. I OFFER........... @dr.Ramakrishna kalvakunta Like · · Promote · Share

by Ramakrishna Kalvakuntafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fXF2us

Posted by Katta