పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మే 2014, గురువారం

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా.............ఈ భాష నాకొద్దు సార్.... ...................................................... . నా ఆవేదనే0టో మా అమ్మకు అర్థం కాదు మా పిల్లికి పెరట్లో చెట్టుకి మా పొలానికి అర్థం కాన్నప్పుడు ,నన్ను వాటి ము0దు పిచ్చోడిగా నిలపెట్టే భాష నాకె0దుకు అ0దులో అది నా శత్రు భాష నా చీరను నిర్థాక్షణ్యంగా నెట్టేసి స్కర్ట్ను ధరి0చేలా చేసిన భాష మా అన్నయ్యను అమెరికా ఎగిరిపోయేలా చేసిన భాష సవితి భాష పంచాయితి భాష నా సంస్కృతిని దండిగా దొబ్బి తిని బలిచిన భాష కోడి కూతను దూరం చేసిన అలారం భాష. ఉగ్గు పాలను దూరం చేసిన రెడిమెడ్ సిసా పాల భాష. ఈ 26 అక్షరాల రంగుల రంకుల రాట్నం భాష నాకె0దుకు సర్.... నా మాతృ భాష వడిలో శాశ్వత నిద్రపోతా... 08-05-2014

by Mothi Mohanarangafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m2pg3X

Posted by Katta

Vijay Kumar Svk కవిత

:)

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ispnor

Posted by Katta

Sriramoju Haragopal కవిత

వేయబోవని తలుపు తెరువేదిరా వేసిన తలపుల తలపులట్నే వున్నాయి కనురెప్పలవంతెన మీద ఎవరు నింగికి నేలకు మధ్య మసకచీకటి కప్పుకుని వొణుకుతున్న పెదవుల మీద పిలుపులెవ్వరికొరకు శ్వాసలో ఎవరి పాటలవీణాతంత్రుల మంద్రస్వరాలు ఊపిరి కొట్టుకుంటున్న పిల్లనగ్రోవి గాయాల పైన ఎవరివి వేళ్ళు నేనిక్కడే నాలోపలే టపటప రాలే కన్నీటిరాట్నమై కదలలేని బెంగ, కనపడవేమని వెతుకులాట మనసుపొరల్ని తరిగిపోసుకుంటూ నీ బొమ్మకై తండ్లాట నా చుట్టూరా నువ్వే కొండవాగువై గలగల నవ్వుతూ నన్ను చుట్టుకుని నీ వాసనలే పూలతోటలై కమ్ముకుని నాకేమీ తెలియనీయని నిశ్శబ్ద నిరీహలు పాటనై ఎగిరిపోయినంతదూరం ఎంత సంతోషం నీ రాగసూత్రాలు నన్ను తాకి వున్నంతకాలం దేహంలో దేహమై, మోహనాంతర స్నేహాంతరంగమై ఆత్మీయుడా, నన్ను ఎక్కడికీ కదలనీకు నీ ఒడిలోనికి తప్ప

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sqRiIf

Posted by Katta

Kks Kiran కవిత

బయట వర్షం పడుతోంది ఇప్పుడు, ఉదయం నుంచి ఎండ వేడి ఎక్కువగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా చల్లబడి చిరు జల్లులు పడటంతో చాలా ఆహ్లాదంగా ఉంది వాతావరణం , తీవ్రమైన ఎండ వల్ల వేడెక్కిన భూమి పొరలపై ఒక్కసారిగా వర్షపు చినుకుల తడి తగిలేసరికి వేడి నీటి ఆవిరి భూమి పొరలలోంచి పైకి వచ్చి ఒక రకమైన " మంచి సువాసన " వస్తోంది మట్టి నుంచి. అది కూడా చాలా బాగుంది. గాజు అద్దాలపైనుంచి కిందకి జారే వర్షపు నీటిని చూస్తో వేడి వేడి టీ తాగుతూ మంచి పుస్తకం చదువుకోవడమో,ఇష్టమైన పాటలు వినడమో చేస్తూ వర్షాన్ని ఆస్వాదించడం బాగుంటుంది కదూ? ఈ వర్షాన్ని చూస్తూ ఉంటే నాకిప్పుడు ఒక వర్ణన గుర్తుకొస్తోంది శ్రీ కృష్ణ దేవరాయలు రాసిన " ఆముక్త మాల్యద " నుంచి. ' గర్భిణీ స్త్రీలు ప్రసవార్ధమై పుట్టింటికి చేరుట సాంప్రదాయం కదా? దీనిని మేఘముల విషయంలో సమన్వయించినాడు రాయలు ఈవిధంగా, చూడండి ' " సూర్యుని కిరణములచే మేఘములు రూపుదాల్చును. అవి సముద్రమునకు వెళ్ళి నీటిని గ్రహించి గర్భమును దాల్చి మరలా సూర్యుని చెంతకు చేరి వర్షించును " అని రాయలు తెలుగుదేశ ఆచారములను తన వర్ణన ద్వారా చాలా చక్కగా ప్రకటించాడు కదూ? శుభసాయంత్రం. - - Kks Kiran

by Kks Kiranfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s6Z5sV

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//అవ్యక్తం// నేనంతే కదూ... నిద్దట్లో గురక మితిమీరి కలవరిస్తాను పట్టపగలు పదిమందిలో మౌనం వహిస్తాను ఉన్నట్టుండి ఒక్క ఉదుటున మనిషిని వెదుకుతున్నట్టు వెదుకుతూనే ఉంటాను ఒక్క తెల్లకాగితం దొరకని సమయాన నేనొక అసంపూర్ణ..........08.05.2014. (19.04.2014.ఒక రాత్రి 8కవితలు మొదటిది)

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SDFoys

Posted by Katta

Lingareddy Kasula కవిత

(వి వి సర్ కుక్క చనిపోయిన పోయెమ్ చూసినంక నా ఇదుపుకాయితం సంకలనం లోని పెంపుడు పిల్లి చనిపోయినప్పుడు రాసిన పోయెమ్ .మీ కోసం.....) బంధం|| డా// కాసుల లింగారెడ్డి || 08-05-2014 తిరస్కృతవో బహిష్కృతవో దారి తప్పితివో పోరి వచ్చితివో ఓ! అనూహ్య అతిథీ! ఆహ్వానించని మిత్రమా! నువ్వు మా గూటిలో చేరావు మా గుండెలో దూరావు కరెంటు మీటరు బోర్డు పిచ్చుకకు బ్రతుకిచ్చినట్టే నడింట్ల నిలుపుకున్నరు నా బిడ్డలు కౌగిట్ల పెంచుకున్నరు పాలల్లో భాగమిచ్చిండ్రు ఇంట్లో జాగిచ్చిండ్రు బంతాట నేర్పిండ్రు బతుకు తీపి చూపిండ్రు ఒకే ఒక్క రెండున్నర గంటల ఎడబాటుకు భంగపడితివో కుంగిపోతివో ఇంటి లక్ష్మణరేఖ దాటితివి రాకాసి శునకం నోటపడితివి నిన్ను పోగొట్టుకున్న నాబిడ్డ మౌనరోదన నేనెట్లా భరించను? కలలో, మెలుకువలో నువ్వు వాడి కౌగిట్లో వున్నావన్న వాడి భ్రాంతిని నేనెట్లా తొలగించను? ఇప్పటిదాకా నిన్ను అయిష్టంగానే బిడ్డల కోసమే భరించిన నా అర్ధాంగి ఇప్పటి ఈ నైరాశ్య మౌనాన్ని నేనెట్లా ఛేదించను? నా ఇంట్లో నన్ను పరాయిని చేసిన నీ గడుసుతనం నేనెట్లా మరువను? ఒక తాదాత్మ్య మౌనభాష అభావం చెందింది ఒక మమతల బంధాల వంతెన కూలిపోయింది నువ్వంటూ రాకుండా వుంటే ఎంత బాగుండేది! ఈ దుఃఖ భారాన్ని మోసే బాధన్నా తప్పేది! (ఒక పెంపుడు పిల్లి దుర్మరణం తర్వాత) 18 ఆగష్టు 2011 'నేటి నిజం' దినపత్రిక.

by Lingareddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j6LKex

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // Sleep in sleepless night …// ఎందరినో కోల్పోఇన బాధ ఎవరినో చేరుకోలేని వ్యధ ఎక్కడో రగిలిన మంట గుండెని మండించి కడుపుని రగిలించి కళ్ళలో ఎరుపు జీరలతో రక్తాన్ని పరుగులెట్టించి అక్సిపిటల్ నుండి ఫ్రాన్టల్ దాకా అదిరిపడే నాడులకు తోడై ఒక్కసారిగా పిడికిలి బిగించి కళ్ళు తెరిస్తే ఎదురుగా The alone live who live for others ఫక్కున నవ్వొస్తుంది మరింక బతకట్లేదేందని Oh stop it .. your stupid analysis .. kill your worthless brain .. can`t you see చచ్చిపొఇనా నిద్రపోలేని , బ్రతికున్నా మేల్కోలేని ప్రపంచంలో నువ్వు బ్రతికి సాధించేదేంటి చచ్చి కోల్పోయే దేంటి ….. Better continue your sleep dear…. Date:08/05/2014

by Sri Modugufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1spLjDv

Posted by Katta

Vytla Yakaiah కవిత

II ఓ మనిషి నువేక్కడా..? II యాకయ్య . వైట్ల ****************************************** ఇది రంగుల లోకం, 'పొంగు'ల మైకం, హంగుల ఆర్భాటం. అందలమెక్కి, చిందులు తొక్కే, వాతల నేతల మేతల కోతల, కూడలి కుక్కల కోలాటం. కాసుల జడిలో 'కుబుస'పు కులుకులు కాకుల కూడును, తినే ప్ర'బుద్దు'లు. పిక్కలు పెంచి, దిక్కులు కొనే యోచన నేంచే వారి పంచన చేరి, పబ్బం గడిపే నక్కల ఆరాటం. సందులో నక్కి విందును చూచే పందుల జంజాటం. ఇదేనా నువు "మనిషి''గా పుట్టి సాగించే జీవనపోరాటం. గంజిలో ఈగల మూతులు నాకే, యతుల సుతులు వల్లించే నీతులు. 'రాజు'ల రాతలు మబ్బుల రీతులు. వారి చేతి గీతలా.. మన తలరాతలు.?? కాదు .. కాదు .. కాదు ..!!! మనిషిలో 'మనిషి'ని దూరం చేసే మోహపుజూదమే "అధికారం". ఇది ఆడని బ్రతుకులు "అంధకారం" ఇది జగన్నాటకం కానే కాదు జంతువులు ఆడే బూటక నాటకం. జగమెరిగిన సత్యం, జననం మరణం. జాతుల వైరం, జంతురూపకం. అరె..ర..రే, నేను "ముస్లిం" ను... నేను "హిందు" వును.. నేను "క్రిస్టియిన్" ను.. నాది భౌద్ధం... నాది జైనం.. నే "కుక్క"ని నే ''నక్క''ని నే "యదవ"ని అంటాడే ... అరె ఏ ఒక్కడు... ఏ ఒక్కడు.. ఏ ఒక్కడు... ఏ ఒక్కడు.. నే మనిషినని అనడే..! నీ కాలే కడుపుకి కూడేట్టే ప్రకృతిదేకులము..? నీ ఎగసే గుండెకి ఆయువైన వాయువుదేమతము..? నీ మురికట్టిన పదములని ముద్దేట్టుకునే భూ'మాత''దేజాతి..? నీ 'దిక్కుమొక్కు'గా కొలిచే 'దివి'దెవర్ణం..? సచ్చి 'సమాధై'తే నువు వుండే చోటెక్కడ..? ఓ.... మనిషి.... "అసలు" నువేక్కడా..? 08/05/2014

by Vytla Yakaiahfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iugzK5

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ || కార్డియోగ్రామ్ ------------------------------ అలల మీద, అలల నురగల మీద ఇరుగ్గా ఇంకిపోతుంది ఒక్కో క్షణం. 1 బరువుగా నుదుటిమీంచి జారిన ఆలోచన కుదించుకుపోయి నిస్పృహల బోలుతనం నిండా బహుముఖాలుగా పరుచుకుంటుంది. ఆగిపోయిన శబ్దం, ఆగిపోయిన నవ్వు ఆకలిపువ్వు మీద మంచు- అప్రయత్నంగా మళ్ళీ పుడతాయి. తలుపు కళ్ళద్దాల చూపుల్లోంచి కదిలీ కదలని నీడ కాలు మాత్రం కదుపుతూ కాగితాల అంచుదాకా నడిచొస్తుంది. కొనవేలి మీద కోరికల చిట్టా గునగునా ఉరికొస్తుంది. 2 ఉదయం ఉలిక్కిపడిలేచి కళ్ళమీద చీకటిని నులుముకుంటూ కొత్త తొడుగులు తొడుక్కుని కొబ్బరిచెట్టుమీద కూచుని కోయిలై కూస్తుంది. ఒక్కో క్షణాన్ని వాలుకుర్చీమీద వాల్చుకుని అటూఇటూ ఊగుతూ అదో మాదిరిగా గాలి విసుర్లమీద ; దండెం మీద వేలాడుతున్న పంట్లాం మీద చూపుల్ని ఆరేసుకుని అర్ధాంతరంగా రాలిన చిరునవ్వుల్ని విసిరిన చేతి విసుర్లని, తడిమిన పుస్తకాల పేజీల్ని ఆప్యాయంగా తట్టిన కలల్నీ బెంచీలమీద మీద నిలబెట్టి మళ్ళీ బట్టీయం పట్టించుకుంటుంది మనసు. 3 ప్రతి నిట్టూర్పూ మనసు టి.వి .ఎంటేన్నామీద గబ్బిలంలా వేలాడుతుంది. అరచేతిలో ఆగిపోయిన అక్షరం మాత్రం కళ్ళు చికిలిస్తూ ;అపుడపుడూ కవిత్వమై జారిపోతుంటుంది. # *పాతవాచకం : ప్రవహించే జ్ఞాపకం నుంచి : 29.5.1989

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SCtqFp

Posted by Katta

Arcube Kavi కవిత

ఒక తాబేలు-కొన్ని చీమలు ____________________ఆర్క్యూబ్ సహజంగానే- చిరునవ్వుని కోల్పోనివాడు సాహసి గాక మరేమవుతడు లోకసంచారి సంపన్నుడుగా కాక మరే పేరుతో పిలువబడుతడు కలగని నిలబడ్డవాడు సముద్రంగా కాక ఇంకోల రూపాంతరం చెందడు కదా ! జ్యాలాముఖిలో పచ్చికుండ ప్రాయాలు జలపాతాఖాతాల్లో పట్టుదప్పని ప్రేమగీతాలు దోసిట- ఖండపు మంచులో అఖండంగా పూసిన పూలు అతడి డైరీ కల్లోలాలతో నిండిఉన్నా రెపరెపలాడుతుంది ఆ శబ్దహోరు విను మృత్యువుని జయించే రహస్యమేదో చెబుతుంది వీరుడి అడుగుల్ని పొదిగే అక్షరం పిట్ట ఇలా గాక మరెలా గానం చేస్తుంది అనుకున్న - పుట్టే బిడ్డ యుద్దకళల్ని నేర్చుకునే ఈ చిత్తరువును చూసి అచ్చెరువొందుతవని ఆ దృశ్యం ఈ నేల అద్దం తిరిగి తిరిగి నీ కళ్ళు ఈ చూపుడు వేలు తాబేలునే ముద్దాడుతై కొద్ది శ్రమతో ఇన్ని యోజనాల్ని ఎలా యాత్రించావో తెలుసా ఈ దారి కట్టిన చీమలు ఆ తాబేలు వర్షించిన కన్నీటి నెత్తుటి బొట్లే ఆ పిట్ట యుద్ద గానంలో నీలో తపస్సు చేస్తున్న స్వప్నం నిన్ను మెళకువలోకి ప్రత్యక్షించుకుంటుంది ఆ పిట్ట యుద్దగానం జీవన పోరాట కాంక్షని ఎంతగా మండిస్తుందో నీ చేతికందిన అమృతం నింపిన పాత్ర చెబుతుంది ఇక అడుగుల్ని సంధించు ఆనాది ఈ తోవలో నీ నడకకు అనుమతి లభించింది నీ నుండి సృజింపబడె చీమలు ఈ తొవ్వను వెలిగిస్తై

by Arcube Kavifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jD67EV

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Moments of inertia | అదృష్టాన్ని చూసుకొని అతిగా మిడిసిపడకు నేస్తమా జీవితం చిత్ర పటంలో పెయింట్ బ్రష్ నీ నియంత్రణ లో లేదేమో వెనక్కి తిరిగి నాస్టాలజీ కాంతిలో వెతికి చూడు గుర్తుకొచ్చాయా ? కుంభవృష్టి లో కాలిపోయిన రాజప్రాసాదాలు చూసిన చరిత్రలు రెప్పలు వాల్చే లోపు నక్షత్రాలు రాలిపోయిన కాలాలు ఆపిల్ కాంక్షల బ్లైండ్ నెస్ లో స్వర్గం నుండి తోయబడ్డ పెద్దరికాలు అందుకే నీదైన పాచికలు ప్రపంచానికి విసిరే ప్రతిసారి మట్టిని కూడా బంగారం చేసే ఆల్కెమిస్ట్ జీవితాలు సైతం మట్టిగా ముగిసిపోయాయని మననం చేసుకో **** స్వేచ్చలన్నీ అనైతికాలే నిన్ను నువ్వు తెలుసుకొనే ప్రక్రియలో యాంత్రిక పక్షుల్లా ఎగిరే ఆలోచనల ఆలాపనలలో ఎస్కేపిజాల పేర్లే ఆత్మ చైతన్య స్రవంతులు అందుకే ధారాపాతం గా కురసే వర్షంలో చుక్కలు లెక్కపెట్టే ఖాళీ గుండె గదులు ఎమోషనల్ భారం తో పూడుకుపోయి అసంకల్పిత ప్రతీకార చర్యకి లోనై రియాలిటీ చెక్ ల మరణం వంటరిగా తలుపు తట్టే లోపు అసంతృప్తుల మనస్సు ని అదృశ్యపు వలలు వేసి జారిపోకుండా గట్టిగా ఒడిసిపట్టుకో **** నిన్ను అమాంతం గా దొంగిలించే అయోమయ గందరగోళపు బ్యాటిల్షిప్ ఒకటి నిజాలకి అబద్దాలకి మధ్య అర్ధం కాని రిడిల్ గామార్పు చెందుతూ నీకంటి కి కనిపించని ట్విలైట్ జోన్ లో నడుస్తూ ఉంటుంది అందుకేనేమో నిశబ్దంగా పొగమంచు lలో కనబడే జింకపిల్లల భ్రమలన్ని సూర్యుడి వెలుతురు నవ్వుల్ల్లో తప్పిపోయినట్లు మెలుకువగా ఆడే ఆర్ట్ అఫ్ ఫైడింగ్ వన్ సెల్ఫ్ గేమ్ లో ఓటమెప్పుడు నీదే *** మృతదేహాల పై తాజ్మహళ్ళు వెలసే రహదారుల్లోనే కాఫిన్ కరువైన శవాలు నగ్నంగా కనిపిస్తుంటే కాగితం పులి లాంటి అదృష్టం పై ఈ మిడిసిపాటేల నేస్తం ? నిశీ !! 08/05/14

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jD67EL

Posted by Katta

Harikrishna Mamidi కవితby Harikrishna Mamidifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0AbLn

Posted by Katta

Kapila Ramkumar కవిత

||వరవర రావు||ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ||… అవి నేను వరంగల్ లో బి.ఎ. చదువుతున్న రోజులు. హనుమకొండ చౌరస్తాలో అశోకా ట్రేడర్స్ ముందరి సందులో మా కాలేజి స్నేహితుడు కిషన్ వాళ్ల పెద్దమ్మ ఇల్లు ఉండేది. నేనెక్కువగా అక్కడే గడిపేవాణ్ని. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ని. వాళ్లింట్లో ఒక కుక్కపిల్ల ఉండేది. వాడ కుక్కల్లోనే ఒక కుక్కను మచ్చిక చేసుకొని పెంచుకున్నారు. దానితో ఆడుకోవడం, దానికి బిస్కెట్లు పెట్టడం, అది మా రాక కోసం ఎదురుచూడడం. అకస్మాత్తుగా ఒకరోజు ఆ కుక్కపిల్ల చచ్చిపోయింది. అంటే దాని చావును గానీ, చనిపోయిన ఆ కుక్కపిల్లను గానీ నేను చూడలేదు. ఆరోజు, ఆ తర్వాత ఆ ఇంట్లో అది కనిపించలేదు. పెద్దమ్మ కళ్లనీళ్లు పెట్టుకొని కుక్కపిల్ల చనిపోయిందని చెప్పింది. ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ. వెలితి. చేతులు ఏదో వెతుక్కున్నట్లు. వెతుకులాట మనసుకు. ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ కవిత ఆ వేదననుంచి వచ్చింది. అప్పటికే నాకు కవిగా కొంచెం గుర్తింపు వచ్చింది. 1950లలో ‘భారతి’లో కవిత్వం అచ్చయితే కవి. ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయితే ఆధునిక కవిగా గుర్తింపు వచ్చినట్లే. రష్యా రోదసిలోకి స్పుత్నిక్ లో లైకా అనే కుక్కపిల్లను పంపించినపుడు నేను రాసిన ‘సోషలిస్టు చంద్రుడు’ (1957) ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయింది. ఆ తర్వాత ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు’, ‘శిశిరోషస్సు’. ‘హిమయవనిక’ అనే కవితలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన వచనకవిత్వ పోటీల్లో, ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో బహుమతులు వచ్చి సాహిత్య విద్యార్థులు మొదలు సి నారాయణరెడ్డి గారి దాకా అభిమానం చూరగొన్నవి. ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు. కుళ్లు నల్లదని తెలుస్తుంది నయంగదా’, ‘ఇనుని అరుణ నయనాలు’ వంటి పాఠ్యపుస్తకాల ప్రభావం ఎక్కువే ఉన్నా, ‘వానిలో ఎన్నిపాళ్లు ఎర్రదనం, ఎన్నిపాళ్లు ఉడుకుదనం ఉందో రేపు కొలుస్తాను, రేపు మంచిరోజు ఎర్రని ఎండ కాస్తుంది, రేపు వసుధైక శాంతి ఎల్లెడల నిండుతుంది’ వంటి ఆశావహ ఆత్మవిశ్వాస ప్రకటనలతో నాకు ‘ఫ్రీవర్స్ కవులలో సామాజిక ప్రగతివాద’ ప్రతినిధిగా ఒక గుర్తింపు వచ్చింది. శకటరేఫాలు మొదలు ప్రబంధ కవిత్వ భాష, వర్ణనలు, ఊహలు, ఉత్ప్రేక్షలు, ఇమేజరీ ఉన్నా ప్రగతివాద భావజాలానికి చెందిన కవిగా నాకొక ఇమేజ్ ఈ కవితలతో ఏర్పడింది. రాత్రి, మంచు వంటి సంకేతాలతో స్తబ్దతను, భయాందోళనలను, సూర్యుడు, ఉషస్సు వంటి సంకేతాలతో భవిష్యదాశావహ ఆకాంక్షను వ్యక్తం చేసే కాల్పనిక ఆశావాదం అట్లా మొదలై 1968 తర్వాత ఒక విస్పష్ట ప్రాపంచిక దృక్పథంగా స్థిరపడింది. అట్లా చూసినప్పుడు కవితాసామగ్రి, భాష, వ్యక్తీకరణలకు సంబంధించినంతవరకు ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ ఒక డిపార్చర్. ఒక ప్రయోగం. పై నాలుగు కవితల్లో ఊహ, బుద్ధి, రచనా శక్తిసామర్థ్యాల ప్రదర్శన ఉంటే ఇందులో ఫీలింగ్స్ సాధారణ వ్యక్తీకరణ ఉంటుంది. ‘నా రెక్కల్లో ఆడుకునే కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?’ మనుషులు వెళిపోతారంటే నమ్మగలను. వాళ్లకోసం, అందులోనూ మగవాళ్ల కోసం ఒక స్వర్గలోకం ఉంది. అందుకని వాళ్లు ఇహంలో అన్ని అనుబంధాలూ వదులుకొని వెళ్లగలరు. ‘కాని కుక్కపిల్ల వెళిపోవడమేమిటి?’‘అంత నమ్మకమైన జీవం ఎక్కడికని వెళ్లగలదు? ‘ఎవడో స్వార్థంకై, నేను లేనపుడు ఏమిటో దొంగిలించడానికి వస్తే మొరుగుతూ తరమడానికి వెళ్లి ఉంటుంది. ప్రలోభాలు నిండిన వాళ్లను ఆ లోకందాకా తరిమి తెలవారేవరకు తెప్పలా ఇలు వాకిట్లో వాలుతుంది.’ ‘అయినా దానికా స్వర్గంలో ఏముంది గనుక అక్కడుంటుంది? స్వర్గంలోని వర్గకలహాలు రేపు దాని కళ్లల్లో చదువుకుంటాను’. నేను సికెఎం కాలేజిలో పనిచేస్తున్నపుడు 1969లో పి జి సెంటర్ లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా ఉన్న మిత్రుడు పార్థసారథి ఈ కవితను హిందీలోకి అనువదించగా, జ్ఞానపీఠ్ సాహిత్య పత్రికలో అచ్చయింది. నండూరి రామమోహనరావుగారు ‘మహాసంకల్పం’ కవితాసంకలనం వేసినపుడు ఈ కవిత ఇవ్వమని కోరాడు. ఏ కవిత ఇవ్వాలో నేను నిర్ణయించుకోవాలి గానీ, మీరు నిర్ణయిస్తే ఎట్లా అని నిరాకరించాను. సంపాదకునికి, సాహిత్య విమర్శకునికి కవి కవితల్లో తనకు ఇష్టమైనవి ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆలస్యంగా గుర్తించి ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటూ ఉత్తరం రాసాను. అట్లని నేను 1964లో నెహ్రూ మీద రాసిందో, 65లో పాకిస్తాన్ తో యుద్ధం గురించి రాసిందో ఇపుడు ఆ భావాల ప్రచారానికి ఎవరైనా వాడుకుంటే అది మిస్చిఫ్ అవుతుంది. ఇప్పుడు అఫ్సర్ ‘సారంగ’లో నా కవితలను నేనే ఎంచుకుని పరిచయం చేయాలని కోరినపుడు నా ఇమేజ్ కు కొండగుర్తులుగా నిలిచిన కవితలు కాకుండా తాత్విక స్థాయిలో, కవి హృదయాన్ని పట్టి ఇవ్వగల కవితగా కూడ ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ నే ఎంచుకోవాలనిపించింది. - వరవరరావుhttp://ift.tt/1jhf4nC -ఏప్రిల్ 30, 2014http://magazine.saarangabooks.com/2014/05/07/

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itORgB

Posted by Katta

Thilak Bommaraju కవిత

ఈ రోజు సారంగలో నా అక్షరాలు...... తిలక్ /అవ్వ ::::::::::::::::::::­:: యాడున్నడో కొడ్కు ఈది బళ్ళ సదివిండు ఇదేశాలకు పోయిండు నా కండ్లల పానాలు పెట్కొనున్నా వాడొస్తడని సత్తు గిన్నెలల బువ్వ పెట్టిన ఈయవ్వ యాదున్నదో లేదో గంజితాపించినగాని గరీబుగా పెంచలే కూలిజేసి కాలేజిల చేర్సినా కువైట్లా ఉజ్జోగమన్నడు గల్లీలల్ల గోలీలాడేటోడు డాలర్లులెక్కేస్తున్నడు గుడ్సెల సల్ల తాగినోడు నా కుతికల సుక్క పోస్తడో లేదో అప్పుడపుడు పైసలైతే పంపిస్తడు ఎప్పుడూ నన్ను సూడనికి రాలే పదేండ్ల క్రితం వానయ్య పీనుగయ్యిండు గియ్యలా నాకు తోడులేకపాయే వాడునన్ను సూస్తడని ఒక ముద్ద పెడ్తడనుకున్న నన్నిట్ల ఒదిలిపోయిండు అయినా ఆశ సావలే నేను మాత్రం దినం దినం సస్తున్న తిలక్ బొమ్మరాజు 25.04.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8Qlox

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

Shiva Reddy Peetikalu .... Pusthaka Parichaya Sabha

by కోడూరి విజయకుమార్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iYXkOF

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//మరకమంచిదేనా//02... ఔనూ మరక మంచిదేనా... నీ చూపుడు వేలిపైన ధవళవర్ణపుగోరు హద్దునుదాటి గోధుమవర్ణపు చర్మాన్నికలుపుతూ కాశ్మీర్ లోని చొరబాటుపాకిస్థాన్ సైనికుడిలా అడ్డంగా చొచ్చుకువచ్చి తిష్ఠవేసిన ఆమరక మంచిదేనా? ఔను మరక మంచిదే ! మర్యాదరామన్నతీర్పులా విచక్షణ విజ్ఞతలను మేళవించి ప్రపంచసుందరి అంత అందమైన నిర్ణయమైతే ఆ మరక బ్యూటీస్పాట్ లా నిగనిగలాడుతూంటుంది కానీ నిన్ను ఓ విష్ణుమూర్తి అవతారంలాభావించి, ఆ చూపుడువేలితో చిద్విలాసంగా బ్రహ్మాండాన్నిశాసిస్తావ. వని, శతకోటి ఆశలతో అనంతకోటి అంచనాలతో సుదర్శన ఓటుచక్రాన్ని నీకప్పగిస్తే, ప్రలోభాల గడప తాకి కొరగాని నాలుగుపచ్చనోట్లకే కళ్ళుతేలేసి మైకం కమ్మేసి లక్ష్యాన్ని మరిచేసి బొక్క బోర్లాపడ్డావంటే నా పిచ్చిగాని, ఆ మరక మంచిదెలా అవుతుంది? ఇంతకూ ఆ మరక మంచిదా? ఆ మరక కొంపముంచేదా? 08/05/2014

by Aravinda Raidu Devinenifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m03iP7

Posted by Katta

Afsar Afsar కవిత

కవిత్వంతో కరచాలనం-6 దక్షిణ పవనం వీచెనోయీ!! పదహారేళ్ళ వయసులో అతనికి కవిత్వం బిగి కౌగిలి ఇచ్చింది. ఇప్పుడతని వయసు అరవై. జీవితంలో చాలా మజిలీలు వచ్చి వెళ్ళిపోయాయి. కొందరు దగ్గిరయ్యారు, చాలా మంది దూరమయ్యారు. కాని, కవిత్వం వొక్కటే అతని కౌగిలి వీడకుండా ఇప్పటికీ అతనితో వుంది. పదహారేళ్ళ వయసులో అమెరికన్ కవిత్వం వల్ల ప్రభావితుడై కలం పట్టాడు విజయ్ శేషాద్రి. ఆ కవిత్వం అతని మీద ఎంత గాఢమైన ముద్ర వేసిందంటే, ఇప్పటికీ ఆ పదహారు, పదిహేడేళ్ళ వయసులో చదివిన కవులూ వాళ్ళ కవిత్వాలే తనకి ప్రేరణ అంటాడు విజయ్. “ఇప్పుడు వాళ్ళల్లో చాలా మంది నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఎక్కడో వొక చోట కలుస్తూనే వుంటా. కాని, నాకు ఆ పదహారూ పదిహేళ్ళప్పటి వాళ్ళ రూపాలే ఇష్టం!” అంటాడు విజయ్ వొక చోట. అమెరికన్ కవి సమూహాలలో వొక భారతీయ స్వరం వినిపించడం అంత తేలికేమీ కాదు! ఈ మధ్య కాలంలో అమెరికన్ కవిత్వంలో ప్రవాస గొంతులు బలంగానే వినిపిస్తున్నప్పటికీ, ప్రధాన స్రవంతి అమెరికన్ కవిత్వంలో ఈ గొంతులు ఇంకా బలహీనమే! ఇక గుర్తింపు అన్నది సుదూరపు కల. అలాంటి పరిస్థితికి ఎదురీది, ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్న కవి విజయ్ శేషాద్రి. అరవై ఏళ్ల కింద బెంగళూరులో పుట్టిన విజయ్ అయిదేళ్ళ వయసు వుండగా అతని తల్లిదండ్రులు అమెరికా ప్రవాసం వచ్చారు. కాని, అమెరికా రాక ముందు గడిపిన ఆ దక్షిణ భారతీయ జీవితం ఇప్పటికీ విజయ్ కవిత్వంలో కనిపిస్తుంది. విజయ్ అంటాడు: “ఎవరూ అసలు చరిత్ర చెప్పలేరు. అసలేం జరిగిందో అసలే చెప్పలేరు. నా మటుకు నేను ఇప్పటిదాకా రాసింది ఎంత అయినా, చెప్పాల్సిన నా చరిత్ర ఇంకా మిగిలే వుంది.” విజయ్ శేషాద్రి ఇప్పటిదాకా మూడు కవిత్వ పుస్తకాలు ప్రచురించారు. మొదటి పుస్తకం wild kingdom 1996 లో, రెండోది Long Meadow 2003 లో, మూడోది 3 sections 2013 లో వచ్చాయి. ఈ మూడో పుస్తకానికే ఆయనకు పులిట్జర్ పురస్కారం దక్కింది. విజయ్ కవిత్వం కొంత తాత్వికంగా, కొంత రోజువారీ జీవితాన్ని కలుపుకొని పోయే మామూలు దృశ్యంగా కనిపిస్తుంది. అయితే, కవిత్వీకరణలో ఆ తాత్వికత కనిపించకుండా, తన ఉద్వేగాన్ని చెప్పుకుంటూ పోతాడు. ఉదాహరణకి ఈ కవిత: Dead friends coming back to life, dead family, speaking languages living and dead, their minds retentive, their five senses intact, their footprints like a butterfly’s, mercy shining from their comprehensive faces— this is one of my favorite things. I like it so much I sleep all the time. Moon by day and sun by night find me dispersed deep in the dreams where they appear. కవిత్వం ఏం చేయాలో ఇంకా మనకి తెలీదు. కాని, మనిషి జీవితంలోని irony ని, వొక షేక్స్పియర్ లాగా, వొక ఎలియట్ లాగా చెప్పగలిగే కవులు ఎప్పుడో కానీ రారు. దాదాపు అదే వొరవడిలో నిలిచే కవిత The Descent of Man. ఈ కవితలో విజయ్ అంటాడు: My failure to evolve has been causing me a lot of grief lately. I can't walk on my knuckles through the acres of shattered glass in the streets. I get lost in the arcades. My feet stink at the soirees. The hills have been bulldozed from whence cameth my help. The halfway houses where I met my kind dreaming of flickering lights in the woods are shuttered I don't know why. ప్రతి కవీ వొక కాలంలో బతుకుతూ మళ్ళీ తనదైన ఇంకో కాలంలో కూడా బతుకుతూ ఉంటాడు. అందుకే కవి జీవితం కనాకష్టం. కనిపించని శిలువలని మోస్తున్న చరిత్ర భారం. వొక అపరిచితమైన ప్రపంచం మన చుట్టూరా విచిత్రంగా కదులుతూ వుంటుంది. తన కుటుంబం గురించీ, అందులో తన స్థానాన్ని గురించి వొక చోట అంటాడు విజయ్: We were strange. We were doubly strange; strange because Indians are strange even in India, having been exiled from time and history by an overdeveloped, supersaturated civilization, and strange also because no one remotely resembling us had ever before lived where we lived. But I was the only person in my family beset and burdened by this strangeness. విజయ్ శేషాద్రి కవిత్వం వొక ప్రవాసి ఆత్మకథనం – కాకుంటే, ఈ ప్రవాసానికి భౌతికమైన ఎల్లలు లేవు.

by Afsar Afsarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uCUySW

Posted by Katta

Kapila Ramkumar కవిత

A Thing of Beauty (Endymion) A thing of beauty is a joy for ever: Its lovliness increases; it will never Pass into nothingness; but still will keep A bower quiet for us, and a sleep Full of sweet dreams, and health, and quiet breathing. Therefore, on every morrow, are we wreathing A flowery band to bind us to the earth, Spite of despondence, of the inhuman dearth Of noble natures, of the gloomy days, Of all the unhealthy and o'er-darkn'd ways Made for our searching: yes, in spite of all, Some shape of beauty moves away the pall From our dark spirits. Such the sun, the moon, Trees old and young, sprouting a shady boon For simple sheep; and such are daffodils With the green world they live in; and clear rills That for themselves a cooling covert make 'Gainst the hot season; the mid-forest brake, Rich with a sprinkling of fair musk-rose blooms: And such too is the grandeur of the dooms We have imagined for the mighty dead; An endless fountain of immortal drink, Pouring unto us from the heaven's brink. ------------------------------8.5.2014 John Keats

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1it9tFU

Posted by Katta

Abd Wahed కవిత

ఉరుములురిమి చినుకు కురిసి నేల దాహం తీర్చుస్వామీ బీటవారిన కంటి కొలను, కాస్త నీరు పంచు స్వామి రెండు రెళ్ళు నాలుగెప్పుడు అవుతాయో తెలియరాదు బుద్ధిజీవుల బుర్రలోన అజ్ఙానమె పెంచు స్వామీ అబద్దాల వెలుగులోన మెరుస్తున్న భ్రమల శిలలు నిజం చీకటైతెనేమి అందులోనె ముంచు స్వామి లోకమొక్క పల్లెటూరు మనిషి మనసు వేరు వేరు పల్లెపట్టు పిచ్చిప్రేమ మాకు ప్రసాదించు స్వామి మృత్యుఒడిన బయటకొచ్చి జీవితాన్ని బతికేస్తాం చెదిరిపోయె శ్వాసలన్ని మూట కట్టి ఉంచు స్వామి తెలివితేట సాలెగూళ్ళు అల్లుకున్న లోకంలో అమాయకపు పూలజల్లు మాపై కురిపించు స్వామి గాలివాటుకు ఎగిరిపోయే బుద్ధులన్ని, దియా చూడు నేలపైన నడకనేర్పి గాలిబుడగ దించు స్వామి

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZoAw7

Posted by Katta