పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మే 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

కొండవీటి సత్యవతి గారు రాసిన కవిత //తల్లుల రోజట....అహా ఆహా హా//కవిత్వ విశ్లేషణ _______పుష్యమి సాగర్... తర తరాల పోరాట ఫలితం గా స్వాతంత్ర్యం తెచ్చుకొని స్వేచ్చ ని అనుభవిస్తున్న కూడా ఇంకా మన మనసు బానిస భావజాలాన్ని వదిలించు కోలేక పోతుంది, మనది కాని నాగరికత ని, అలవాటు లేని దినాలని నెత్తి కి ఎక్కించుకొని చిందులు వేస్తున్నాము ....ప్రపంచం కుగ్రామం గా మారినపుడు అందులో ప్రతి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం బాగానే ఉంది , కాని ఒక జన్మనిచ్చిన మాత కి ప్రత్యెక రోజు అని పెట్టి పూజించడం, ఎంత వరకు సబబు ...పురాతన కాలం నుంచి అమ్మ ను కోలుస్తునే ఉన్నాం మరి ఇవ్వాళ ప్రత్యేకం గా ఒక రోజు పెట్టాల్సిన అవసరం ఏమిటి ...?...ఇదే విషయాన్ని సత్యవతి గారు తమ రచన లో నిరసిస్తూనే సగటు గృహిణి గా ఎన్ని విధులను ఎన్ని రకాలు గా నిర్వహిస్తున్నదో చెప్పే ప్రయత్నం చేసారు .. ఎంచుకున్న కవితా వస్తువు సమకాలపు అసమానత కు , దోచుకోబడుతున్న శ్రమ విలువ ని ఎండ గడుతున్నారు. మొత్తం కవిత లో మూడు అంశాలను వెలికి తీస్తాను ....ముందు గా అమ్మ ని ఎలా చూస్తున్నాము, మనకు తెలిసిన అర్థం లో , కాని వాస్తవం గా అమ్మ స్థానం ఏమిటి, ....రెండవది శ్రమ దోపిడీ ...గృహస్తాశ్రమం లో భార్య ..మాత పాత్ర ఎనలేనిది, అలాంటి అమ్మ ను నేడు మనం వస్తువు గా యంత్రం గా మార్చేసాము ..మూడవది ...అందరికి అన్ని ఇచ్చి తానూ మాత్రం ఏమి ఆశించకుండా విశ్వజనీనమైన ప్రేమ ని పంచె అమృతం లాంటిది .. అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని //పగలు రేయి తేడా తెలియని//పనుల వలయంలో //అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్ ... పై వాక్యాలలో ఒక బానిస భావజాలానికి ప్రతిక లా గా నే కనిపిస్తుంది ...కాని అమ్మ ప్రేమ .వాటిని అధిగమించి తన వాళ్ళ కోసం కరిగి పోతుంది మరి .. లోక సహజం అయిన ఒక వాస్తవం ఏంటి అంటే...ముందు తన గురించి కాకుండా బిడ్డ ల ఆకలి ని తీర్చాలని చూస్తుంది ఏ ప్రాణి అయిన సరే , అమ్మ ప్రేమ కి నిదర్శనం అందరి కడుపులూ నింపే అక్షయ పాత్ర //తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు కొడుకులకు కూతుళ్ళ కు ఆత్మీయత ని కలిపి తినిపిస్తుంది తన కడుపు కట్టుకొని మరి పిల్ల ల లకి లోటు రానీయకుండా చేస్తుంది ... అమ్మతనపు ఆత్మీయతని//అన్నంలో కలిపి తినిపిస్తుంది... బార్య లని హింస పెట్టె భర్తల ఆగడాలను మౌనం గా భరిస్తూ , పంటి బిగువున అన్ని భరిస్తూ ...సహనానికి నిలువెత్తు రూపం లా నిలుస్తుంది ...తమ బిడ్డలకు ఎలాంటి కీడు జరగకుండా పొదివి పట్టుకొని జాగ్రత్త గా కాపు కాస్తుంది .. కట్టుకున్న వాడు అహరహం//నరనరాన్ని నలుచుకుతింటున్నా//చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది తన గుండెల్లో గునపాలు దిగుతున్నా //పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది/// దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి/అమ్మని దేవతని చేసిన చోటనే అడుక్కుంటున్న ఈ అమ్మలెవరో మరి సూటిగా సమాజానికి ప్రశ్న నాగరికత ని నెత్తికి ఎక్కించుకున్న ఆధునికత, అడుక్కుంటున్న అమ్మలను దేవత అనరు ఎందుకు మరి ....? వృద్ధాప్య కేంద్రాల్లో శూన్యంలోకి చూస్తూ కుమిలిపోయే అమ్మలందరూ దేవతలు కాదా!!! ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర... రోడ్ల కూడళ్ళ దగ్గర అత్యంత దీనంగా అడుక్కుంటున్న ఈ గాజు కళ్ళ అమ్మలందరూ దేవతలేనంటారా??? ఇప్పటివరకు అమ్మ గొప్పతనాన్ని వివరించి దేవత అంటున్నారు ...అమ్మ లు కేవలం సోకాల్డ్ లేదు ధనిక స్వామ్యం లో ఉన్న స్త్రీలే నా ...., మరి జీవితాన్ని దార పోసి మలి దశ లో కొడుకల చేత గెంటి వెయ్యబడ్డ ముసలి తల్లి దేవత కాదా....అలాగే ప్రతి రోజు కనిపించే ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర దీనం గా అడుక్కునే తల్లులు కూడా దేవత నే ..నా ...కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలకు మనం జవాబు చెప్పాలి ...అమ్మ పేరు న ఒక రోజు ని జరిపి అన్నం పెట్టడం కాదు ...మన ఉన్నతి కి తను కరిగి పోయే అమ్మ కి గుప్పెడు అన్నం ప్రతి రోజు పెట్టండి అంటూ మనసు ద్రవించేలా రాసారు సత్యవతి గారు ... మంచి వస్తువు ని ఎంచుకొని సరళం గా రాసి సమాజపు పోకడల ను మార్చాల్సిన అవసరం ఉంది అని నమ్మి చక్కని రచన ను మనకు అందించారు ..వారు మరిన్ని మంచి రచనలు చెయ్యాలని ఆసిస్తూ ... పుష్యమి సాగర్... (తల్లుల రోజట....అహా ఆహా హా...) .=== అమ్మంటే దేవతని అమ్మంటే అనురాగ మూర్తని అమ్మంటే ఆది శక్తని ఇంకా ఇంకా ఎన్నో బిరుదులు అమ్మ గోరు ముద్దలు తినకుండా అమ్మ లాలి పాట వినకుండా ఎవరైనా పెరుగుతారా అమ్మ గుర్తొస్తే..... గోరు ముద్దలేనా గుర్తొచ్చేది లాలి పాటలేనా గుర్తొచ్చేది అమ్మ ఒక చాకిరీ యంత్రమని అమ్మ ఒక నిశ్శబ్ద గీతమని అమ్మ ఒక సంక్షుభిత రూపమని పగలు రేయి తేడా తెలియని పనుల వలయంలో అమ్మొక తిరగలి, అమ్మొక చీపురు అమ్మొక చేట, అమ్మొక గాస్ స్టవ్ అందరి కడుపులూ నింపే అక్షయ పాత్ర తన కడుపు వేపు కన్నెత్తి కూడా చూసుకోదు కలో గంజో ఆమె కడుపు లోకి కన్న వాళ్ళ కట్టు కున్నవాళ్ళ కలల సాకారమే ఆమె నిరంతర కృషి అమ్మతనపు ఆత్మీయతని అన్నంలో కలిపి తినిపిస్తుంది కట్టుకున్న వాడు అహరహం నరనరాన్ని నలుచుకుతింటున్నా చిరు నవ్వుని పెదాలకి అతికించుకుంటుంది తన గుండెల్లో గునపాలు దిగుతున్నా పంటి బిగువున బాధని ఓర్చుకుంటుంది పిల్లల కోడిలా బిడ్డల్ని గుండెల్లో దాచుకుంటుంది ఇంత చేసి............... రెక్కలొచ్చిన పిల్లలు తలో దిక్కూ ఎగిరిపోతే గుండె చెరువై కూలబడుతుంది అమ్మంటే దేవతని అన్నదెవరురా/సిగ్గుపడాలి మనం ఆ మాట అన్నందుకు దుఖపడాలి మనం నగ్న సత్యాలు చూసి/అమ్మని దేవతని చేసిన చోటనే అడుక్కుంటున్న ఈ అమ్మలెవరో మరి వృద్ధాప్య కేంద్రాల్లో శూన్యంలోకి చూస్తూ కుమిలిపోయే అమ్మలందరూ దేవతలు కాదా!!! అమ్మ మనిషి, అమ్మకి అన్నం కావాలి అమ్మకి ప్రేమ కావాలి అమ్మకి మందులు కావాలి అమ్మకి బట్టలు కావాలి అమ్మకి అన్నీ కావాలి అమ్మంటే దేవతని ఒట్టి మాటలొద్దు గోరు ముద్దలు తినిపించిన అమ్మకి గుప్పెడు అన్నం పెట్టండి చాలు

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joRh0d

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-43 పిట్టలు నిద్రలేచేవేళ చూస్తుంటాను.. అలారం పెట్టి ఎవరో లేపినట్లు కిచకిచలాడుకుంటూ పొద్దుటే లేచిపోతాయి..! అప్పటికి సూర్యుడు కూడా సరిగా నిద్రలేవడు.. గూళ్ళలోనుంచి జట్లు జట్లుగా గాలి తరంగాలలో ఈదుకుంటూ అలా వెళ్ళిపోతుంటాయి.. మళ్ళీ సూర్యుడు సాయంవేళ దిగుతుండగా గూళ్ళలో దీపాలు వెలిగించడానికా అన్నట్లు వెనుదిరిగి వస్తూనే ఉంటాయి.. ఒక వేళ ఏ పిట్ట అయినా ఆ రాత్రికి రాలేదో, ఇక ఎన్నటికీ రానట్లేనని అర్ధం.. గూటిలోని దానిపిల్ల రేపు తన రెక్కల కష్టంతో ఎగరవలసిందే లేదా తన చావు తాను చావవలసిందే...! ------------------------------------------ (13-5-2013)

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RMO8S8

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-43 పిట్టలు నిద్రలేచేవేళ చూస్తుంటాను.. అలారం పెట్టి ఎవరో లేపినట్లు కిచకిచలాడుకుంటూ పొద్దుటే లేచిపోతాయి..! అప్పటికి సూర్యుడు కూడా సరిగా నిద్రలేవడు.. గూళ్ళలోనుంచి జట్లు జట్లుగా గాలి తరంగాలలో ఈదుకుంటూ అలా వెళ్ళిపోతుంటాయి.. మళ్ళీ సూర్యుడు సాయంవేళ దిగుతుండగా గూళ్ళలో దీపాలు వెలిగించడానికా అన్నట్లు వెనుదిరిగి వస్తూనే ఉంటాయి.. ఒక వేళ ఏ పిట్ట అయినా ఆ రాత్రికి రాలేదో, ఇక ఎన్నటికీ రానట్లేనని అర్ధం.. గూటిలోని దానిపిల్ల రేపు తన రెక్కల కష్టంతో ఎగరవలసిందే లేదా తన చావు తాను చావవలసిందే...! ------------------------------------------ (13-5-2013)

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RMO5WE

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఒంటరి ఇద్దరూ ప్రేమించుకున్నారు ఒకరితో ఒకరు జీవితం పంచుకున్నారు కొంత కాలం హాయిగా జీవించారు ఆ తర్వాత ఒకరినొకరు ద్వేషించుకున్నారు ఇప్పుడు ఇద్దరూ విడిపోయి ఎవరిదారి వారు చూసుకున్నారు వారు వాడుకుని వదిలేసిన ప్రేమ మాత్రం ఒంటరిగా ఉండిపోయింది 13May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jXyBsY

Posted by Katta

Bandla Madhava Rao కవిత



by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lijbwA

Posted by Katta

Sriramoju Haragopal కవిత

అడివమ్మ అడివి అమాయిక అడిగిందల్ల ఇచ్చే వొడిసిపోనితనం తనది నరుక్కున్నోనికి నరుక్కున్నంత తిన్నోడికి తిన్నంత దాచుకున్నోళ్ళకు దాచుకున్నంత కాలం ఏదడిగినా ఇచ్చే పిచ్చిప్రేమలతల్లి అడివి వెన్నెలల ఏరువాక అడివి, పాటల పూలపిల్లనగొయ్యి అడివి కొండవాగుల తాంబురా అడివి,మట్టిపిట్టల ఆకాశం అడివి మంచిమనసున్న మనుష్యుల ఏకైక జనభూమి అడివి నిరంతర కాలచక్రసభల సత్యాన్వేషణ తత్వగీతి అడివి మౌనంతో ప్రపంచాన్ని ఆవిష్కరించింది అడివే మనిషికి మానాభిమానాలను నిరపేక్షతో అందించింది అడివే మైదానాలు సోయితప్పినపుడు మైకం వొదిలించే పచ్చిపసరు అడివే నేల విడిచి సాము చేసే పాముల రాజ్యాన్ని పుట్టలో తొక్కేది అడివే కట్టలుపోసి జనాల్ని ముంచే నోట్లకట్టల ఆనకొండల్ని చంపే చీమలకోన అడివి నమ్మడమంటే ఎంత మహనీయమైందో అడివొక్కటే చెబుతుంది కడుపులో దాచుకుని రేపటిపొద్దుకు కంటిరెప్పైన కాపలా సెంట్రీ అడివి చిల్లం కల్లమైన ఆత్మీయతలకు తొవ్వజూపే తోడునీడ అడివే గడ్డిపరకలనుంచి అనంతఖనిజాల దాకా స్వచ్ఛసహజమైన గిరిజనాల నుండి జనతననిజాల దాకా ఒక్క అడివేరా అమ్మపాలంత తీయగా అందిస్తది ఆకలైతే అన్నంపెడ్తది, యుద్ధమంటే ఆయుధమైతది

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SXGGo7

Posted by Katta

Nirmalarani Thota కవిత

అనాదిగా ఆకాశం ఒంటరిది ముసిరి కురిసి కనుమరుగయ్యే కరిమబ్బులు మెరిసి మురిసి మాయమయ్యే తారకలు ! తరతరాలుగా తీరం ఒంటరిది పలకరించి మరలి పోయే తరగల నురగలు పులకరించి తరలిపోయే పాదచారులు ! యుగ యుగాలుగా భూమాత ఒంటరిది నింగినంటే పర్వతాల్ని సమస్త జీవకోటినీ మోస్తూ భడబాగ్నుల్నీ సునామీల్ని సహిస్తూ ! భూమ్యాకాశాలకు ప్రత్యామ్నాయాలు లేవు బంధు మిత్రులూ లేరు చీమల బారుల్లా సెకనుకు నలుగురు పుట్టుకొస్తున్నా మనిషెందుకు ఒంటరివాడయ్యాడో.. తెల్లారితే దిగిపోయే మత్తు ఏ బాధా తీర్చదని తెలిసినా పొద్దుగూకిందంటే బార్లకు లాక్కుపోయే బరువైన కాళ్ళు సీ రియల్ అని తమను తాము సమాధానపరుచుకోలేక పొద్దంతా సీరియళ్ళకు అతుక్కు పోయే అబద్దపు కళ్ళు ఎత్తుపల్లాల్ని తడుముకుంటూ ఎదిగిన శరీరాలు భుజాల్ని వెతుక్కుంటూ వెన్నుపూస వంగిన మనసులు ! ఒంటరిగా పుట్టి ఒంటరిగా పోయే వెధవ ప్రాణానికి నడిమధ్యలో ఎన్ని వెతుకులాటలో మనిషైనందుకా... మనసున్నందుకా? నిర్మలా రాణి తోట తేది: 13-05-2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gjkgZ5

Posted by Katta

Niharika Laxmi కవిత

{ దాంపత్యపు ముందడుగు } భర్త ...పెళ్లి పుస్తకపు మొదటి పేజీలో 7అడుగులలో మొదటి అడుగుతానై తన అడుగుజాడలో నడవమంటాడు ఎందుకో తెలుసా ............... ? జీవితపు ముళ్లబాటలో తాను ముందడుగు వేసి భార్యకు పూల బాటని పరచడానికే .......... ! ఇదే దాంపత్య మైత్రి ............! ....................... నిహారిక(13-05-2014)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gjkiA2

Posted by Katta

Yasaswi Sateesh కవిత

Selective poem for reading.. L.S. Rokade, ||To be or Not to be born|| ||ఈ నేలపై నే జన్మించాలా! || } ( Published by YasaswiSateesh ) ఆమ్మా నాకు గుర్తే .. నీ మాటలు.. నా ప్రసవానికి నీ వేదన నా ప్రయాణం లో నీ ప్రయాస చాలా పెద్దదనీ, కాలం కరగని నెప్పులకు కారణం నా ఈ సందిగ్ధతే.. ఈ నేలపై నే జన్మించాలా! అన్ని దారులూ దిఙ్మండలాన్ని ఛేదించినా నేను దారి లేక ఉండిపోయా నీలో నువ్ ప్రసవార్ధి వై పడుకున్నప్పుడు చూపులు ఆకాశానికి గుచ్చివున్నాయని మూసుకుంటున్న కనులు తెరుచుకున్న పెదవులతో ఆకాశమే నాకు ఆధారం అన్నాయని!! తరాల పేదరికం కప్పుకుని నువ్వు తల కింద తరగని అవసరాల దిండు రాత్రినిద్రలో పగలు పనుల్లో మెలికలు తిరిగే జీవితం ఖాళీ పిడికిళ్ళ తో గుండెలు కప్పుకుని నువ్వు చెప్పాలనుకున్న మాటలు ప్రతి మనిషి ప్రకృతి పురుష సంగమ సృష్టి అని ఈ దారిని మార్చజాలని దైన్యులమనీ నీ చుట్టూ తిరిగి తిరిగి నువ్ కనుగొనలేదా భూమి గుండ్రమనీ. ఆమ్మా ఇది నీ నేలే. నదులు ఒరుసుకు పారే గట్లతో అంచులు దాటే సెలయేర్లతో ఈ నేలే నిన్ను దోసెడు నీటి కోసం రక్తాన్ని చిందిస్తూ పోరాటం చేయించింది! ఈ మహానాగరికతంటే నాకొక చీత్కారం నువ్ పుట్టినందుకే ఈ నేల నీదా..! మనదా!! నీకు పుట్టినందుకు నాదవుతుందా!! నా నేల ఇదే అని నే పాటలు పాడాలా.. ప్రేమించాలా!! మన్నించమ్మా.. నిజం చెప్పనా సంశయంలో ఉన్నా ఈ నేలపై నే జన్మించాలా! (translated on..2.10.2012) =13.5.2014=

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oookt4

Posted by Katta

Subhash Koti కవిత

ఒక దొహా ( కవి పేరు తెలీదు ) " ప్రీతం తేరీ యాద్ మే రగే భయా సబ్ తార్ రోమ రోమ సుర్ దేత్ హై లేకర్ నాం తెహార్ " ఓ ప్రియతమా ! నీ స్మరణలో నరాలన్నీ తంత్రులై పోయాయి రోమ రోమమూ నీ నామమే జపిస్తున్నది ( గుంటూరు శేషేంద్ర గారి అనువాదమిది.)

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mRoTMr

Posted by Katta

Subhash Koti కవిత

మరొక దొహా ( కవి పేరు తెలీదు ) " ఆజా ప్యారే నయన్ మే ఫంక్ ఢాస్ తొ హెలూ నా మై దేఖూ ఔరన్ కో, నా తోహే దేఖన దూ " రా ప్రియా నిన్ను నా కనురెప్పల్లో మూసి వెయ్యనీ నేను ఇతరుల్ని చూడలేకపోవాలి,నువ్వూ ఇతరుల్ని చూడలేకపోవాలి. ( అనువాదము: గుంటూరు శేషేంద్ర కవి )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1giPbVl

Posted by Katta

Yasaswi Sateesh కవిత

Yasaswi ||She is my mother|| I was a just-born and she was Twenty-Five, Though we were we, we were one. I would cry out in Latin and she would respond in Greek, I would learn nothing but she never got tired to teach. I was surrounded by monsters eager to pull my cheek, but they would vanish the moment I was wet and weep. She would come running and hold me in her arms, as if I had won the contest of the charms. Now I was able to walk and chew, and hey, I was two. I and she could now understand each other, I was her everything and she needed no other. I would try to walk and fall down, But knowing she was with me, The fear of getting hurt was now gone. We still could not converse that effectively, But she would understand my needs so easily. I could now roam about free, because now I have turned three. I was ready to join a new world, my academic life was now gonna mould. She would dress me as best as a prince, but when I would come back, she would need at least an hour to rinse. I was now able to talk, I was a ferry and she was my dock. I still remember the child, whose shirt I had tore, Hey buddy, I have turned four. I now came home a little late, Nevertheless finding her waiting at the gate. She would hug me and carry me in her arms, it felt like flying through the farms. We now did the homework together, I would spoil the home and she used to work. Years passed and now I was fifteen, and with each year I would forget to lean. I wouldn't care for what she said, because now I had become mean. She would ask me to study for a good future, but I was busy in a different culture. Now I had many shes in my life, I dreamed of having one of them as my wife. I changed a lot which she did not teach, She would try to hug me but I was out of reach. She still waited for me at the gate, but I would look at her with utmost hate. She would be awake till late in the night, because I wasn't home, I was in a fight. She had so much to scold, but she never did say, hoping to find me better the next day. Time went on and now I am grown, lost in the world of my own. I and she, between us have a river, I have left her for my career. When I was young, for me, she sacrificed her ambitions, but I don't care, I now have my own mission. I am not with her now, I am in a different city, she is so old now but I don't even pity. She needs me now but I am nowhere to find, in the race for appraisal, I have become blind. In a few years from now, I will be two, there will be in my life someone new. Then I'll forget even to bother, I am her son and she is my Mother. ( can anybody tell who has written this poem!) =13.5.2014=

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jnnmph

Posted by Katta

Srinivasa Balaji కవిత

శ్రీనివాస బాలాజీ || మథర్స్ డే || క్షమించమ్మ మము క్షమించు ఎంతెదిగిన అమ్మనెరుగని పసి పిల్లలం క్షమించమ్మ మము క్షమించు. ఓ రూపం కడుపులో పడ్డయాల నుంచి కాళ్లతో తన్నిన, కమ్మని స్పర్శనుకుంటివి. నవమాసాలు మోసి, నరకయాతనబడి జన్మనిస్తివి. అల్లరి, అలక,అరుపు, ఏడుపులన్నింటిని ఓర్చుకుంటివి. ఉలిక్కిపడి మెము నిద్రలెస్తే, నీ కంట కునుకు పడితే ఒట్టు. గొరు ముద్దలు తినిపించాలని అబద్దాలాడిన అమ్మవైతివి. ఎవరిజోడు వారికొచ్చి,పిల్లలై, ఎవరి గూటికి వాళ్లుబోతె సల్లగుండండని ఆశీర్వదిస్థివి. కష్టమోచ్చిన, నష్టమోచ్చిన ఎక్కరాని మెట్లేక్కితివి, తొక్కలేని గుమ్మాలు తొక్కితివి ఎండకెండి, వానాకు తడిసి కాయ,కష్టం నువ్వు జేసిన, నీడకైతే మము చేర్చితివి మంచి బుద్దులు మాకు నేర్పే సద్వులేన్నో నేర్పిస్తివి అమ్మనే సద్వనోల్లు, ఏం నేర్పలేవని ఋజువైతుంది ఇప్పుడిప్పుడే చిన్నప్పుడు ఆట్టేర్రి, వయస్సుకోస్తే అదోలోకం పెళ్ళాం వచ్చి పిల్లలోస్తే నీ ఊసే గుర్తురాదయె డబ్బుపిచ్చి, సంసార బందిఖానలో మేము పడ్తే వెలివేతకు నువ్వు గురైతివి. ఎంతమంది ఉంటేనేమి నీవంతు పనిమాత్రం ఎప్పుడు ఏదురు సూడవట్టే, కనీసం ఓ చెయేసి అసారైన దఖాలలు లేనేలేవు, అక్కున చెర్చుకున్న ఆనవాలు అస్సలు కానరావు గాని మధర్స్ డే జర్పుకోంటున్నాం నువ్వెరుగని ఈ అడవిలో క్షమించమ్మ మము క్షమించు ఎంతెదిగిన అమ్మనెరుగని పసి పిల్లలం 12.05.2014

by Srinivasa Balaji



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1giwQYv

Posted by Katta

Uday Dalith కవిత

నిట్టూర్పు నీ అభిప్రాయాలు మార్చుకు తిరిగావా లోకం తన ఆడంబరాలకు కాలం తన కవ్వింపులకు నిన్ను ఆహ్వానించకపోగా తన సౌఖ్యాల నుండి నిన్ను అంటరానివాడిగా వెలివేస్తుంది నువ్వు గీసుకున్న లక్ష్మణరేఖ నువ్వు దాటలేక వృత్తంలో పంజరమై చావలేక నటిస్తూ భరిస్తూ వీలుంటే పరిహసిస్తూ నవ్వుతూ మానవత్వాన్ని ప్రదర్శిస్తావు గర్జంచే మేఘాలంటే నీకు అసహ్యం చీకట్లో గుసగుసలంటే పరమ చిరాకు ఎంతో సుకుమారంగా పెంచుకున్న తోట నుండి కిరాతకంగా పువ్వుల్ని కోసేస్తావు రక్తమంటే నీ దేహంలో ప్రవహించే ప్రాణమంటే నమ్మవు భేదాలన్నీ నువ్వు పెట్టుకుని సమాజాన్ని నిందిస్తావు సంకెళ్లు ఖైధీలకు వేస్తారని భ్రమించావు సిరి సంపదలు జన్మ హక్కులనే వెలకట్టావ్ సాయం సంధ్యకు సాగరానికి నడిచి వెళ్లే దారి ఒకటే నీది అలలపై వీరంగం చేసే చూపులే నీవి యిసుకలో గూడు కట్టి కెరటాలకు అది కూలిపోతుంటే నువ్వు విడిచే నిట్టూర్పే హాయి కల్మషం లేని ఒక హృదయం అలలపై లోకాన్ని మరచి ఆడుకుంటోంది చూడు అది నీదే ఉదయ్ 13.05.14

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lrMfo9

Posted by Katta

ShilaLolitha Poet కవిత

శిలాలోలిత | రోబోట్ ......................... ప్రాణమున్న రోబోట్లం మనం. మనకై మనం నవ్వం, మాట్లాడం, కలిసిరాం. యంత్రాలమై, మరమంత్రాలమై శవాలమీంచి, సమాదులమీంచి, సహృదయులమీంచి శతకోటి అన్యాయాల మీంచి నడిచి వెళ్లిపోతుంటాం. మననుంచి ఎప్పుడో జారిపడిపోయిన పాదరసపు బొట్టు మన మనసు. ఎప్పుడు ఎక్కడ ఎలా జారిందో తెలీదు. ఇకనైనా స్పృహలోకి వచ్చి ఆ పాదరసాన్ని పున:ప్రతిష్ట చేస్తే మనుషులుగా బతకొచ్చు కొనఊపిరి నిత్య శ్వాసగా మిగలొచ్చు.

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l7ENNk

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || వెంటాడే జ్ఞాపకాలు|| =========================== జ్ఞాపకాల దొంతరలో చెదిరిపోయిన కాగితం నల్లటి విష అక్షరాలను చిందిస్తూ పడగ విప్పి పాముల కాటేస్తుంది ఎక్కడో దాగిన ఆనవాళ్ళు అప్పుడప్పుడు బయలు పడుతున్నాయి క్యాస్ట్ ని క్యాష్ చేసుకునే కాగితాలన్నీ దొంతరలయ్యాయి వెక్కిరింతల నడుమ ఎన్నో దేహాలు నలిగి పోతున్నాయి చితి మంటల దగ్గర కూడా కులమే అగ్గై వెక్కిరిస్తుంది మసిబారిన హృదయాలు కాలంలో కాలిపోతున్నాయి చాకలి రేవులు, మాల పల్లెల్లు, మాదిగ పేటలు,పాకీ వీధులు నీ నోటినుండి ఉబికే నామకరణాలై వెక్కిరిస్తున్నాయి అహంకారపు జాడ్యం వెర్రి తలలు వేస్తుంది సాహిత్యం లో కూడా కుల పిలుపులు మలుపులై వెంటాడి వేదిస్తున్నాయి నాలుక విసిరే కుల పదాలు తుమ్మ ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి వాడల్లో ఇంకా అంటరానితనపు ఛాయలు చాప కింద నీరులా సాగుతున్నాయి తుంపర్ల మధ్య తడిచే హృదయాలు నలిగిపోతున్నాయి జ్ఞాపకాలు కాల గర్భంలో కలిసిపోతున్నాయి మట్టిలో కలిసిన దేహాలు మాత్రం చక్కగా నిద్రపోతున్నాయి చితి మంటల్లో కాలుతున్న శరీరాలు నవ్వుకుంటున్నాయి మారని రణాలు చూసి మరో లోకంలో స్వేఛ్చ కోసం మట్టి వాసన వెతుక్కుంటూ ... చీకటి లోకం అమవాస్యై కమ్ముకుంటుంది ========================= మే 13/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHNX0j

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిసంగమం - నిరంతర కవితోత్సవం ! .............................................. మిత్రులారా ! ఆశ్చర్యంగా ఉంటుంది ఇంతమంది కవుల్ని,ఇన్ని కవితల్ని ఇలా 'కవిసంగమం' వేదిక మీద చూస్తున్నప్పుడు. ! చాలా కష్టపడి,శ్రమించి రెండున్నర ఏళ్ళ క్రితం- తెలుగులో కవిత్వం లేదు అంటున్న మాటల్ని వినీ వినీ విసిగిపోయి - ఉన్నారు,అద్భుతమైన కవిత్వం తెలుగులో ఉంది, అని నిరూపించడానికి - కవిసంగమం ప్రారంభించాం. ఇవాళ -కవిత్వం లేదు-అనడానికి ఎవరూ సాహసించరు. ఫేస్ బుక్ లో ఈ వేదిక ప్రారంభించడానికి ముందు ఇలా కవిత్వం రాసుకోవడానికి వేదికలు ఉన్నా, అవి ఉన్నాయని సాహిత్యకారులకి తెలియదు. 'కవిసంగమం' మాత్రం ఇటు ఫేస్ బుక్ లోనూ, అటు నెలనెలా కవిత్వ సభలతోనూ ,పోయెట్రీ ఫెస్టివల్స్ తోనూ ఉనికిని చాటుకుంటూ, విస్తృతంగా కవిత్వం గురించిన ఆసక్తిని కల్గించిందనడం అందరూ ఇవాళ ఆమోదించే విషయం. కొత్తగా రాస్తున్నవారు ప్రసిద్ధులైన కవులను కలుసుకునే అవకాశం కలిగింది.వారితో ముచ్చటించే సందర్భాల్ని సృష్టించింది. నిరంతరం రాసేందుకు వీలుగా,ప్రేరణ పొందేందుకు వీలుగా కవిత్వ వాతావరణాన్ని సృష్టించింది. మిగతా ఫేస్ బుక్ గ్రూప్ ల్లా కలుసుకునే 'గ్రూప్ మీట్స్'అనే దశనుంచి కవిత్వ చర్చోపచర్చల సందర్భంగా ఆ కలయికల్ని మలిచింది. 'కవిసంగమం'లో రాస్తున్న కవులవైపుకు ఆసక్తిగా అందరూ చూచేటట్లు,వారి కవితలవైపు దృష్టి మరల్చేటట్లు కవితల విశ్లేషణలతో,సందర్భాలతో ఉత్సాహపరిచింది. కవిత్వం అంటే ఒకానొక సీరియస్ అంశమనీ, కవిత రాయడం అంటే 'అంతరాంతర జ్యోతిస్సీమల్ని'బహిర్గతం చేసే సాధన అని తెలుసుకున్నవారు ఇన్నాళ్ళ ఈ కవిత్వ వాతావరణంలో మెరుగుపడ్డారు, కవిత్వంలో తమదైన ముద్రను కనబరుస్తున్నారు. ఇవాళ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.జయహో ! రాసిన ప్రతి కవితా గొప్పది కానట్లే, రాస్తున్న ప్రతివారూ కవిత్వమే రాస్తున్నారని చెప్పలేం. కానీ రాయగా రాయగా 'కవిత్వ దివ్యరూప సాక్షాత్కారం' ఎప్పుడో ఒకప్పుడు అవుతుందని మాత్రం నమ్ముతూ రాసుకుంటూ సాగడమే చేయాల్సిన పని. అలా రాస్తూ వినమ్రంగా కవిత్వ మెళుకువల్ని ఆకళింపు చేసుకుంటూ ;చదువుతూ; రాస్తూ తుడిపేస్తూ ఎవరైతే కవిత్వం కోసం తపిస్తారో వాళ్ళు మాత్రమే మిగులుతారు, వారి కవిత్వమే నిలుస్తుంది. "చాలా రోజులనుంచి రాస్తున్నమండీ 'అని దబాయించేవారికి ఒకటే సమాధానం -ఎప్పుడొచ్చామన్నది కాదు,ఎలా రాస్తున్నామన్నది ముఖ్యం. కవిత్వం పాఠకుడిని హత్తుకుందా ,లేదా ముఖ్యం. లైను కింద లైను గా అక్షరాలు రాసుకుంటూ పొతే అది కవిత అయిపోదు. అందులో ఆత్మను కవిత్వ నైపుణ్యంతో ఆవిష్కరించావా ,లేదా ? అన్నదే ముఖ్యం". "ఫేస్ బుక్ లో గ్రూపులు కొన్నాళ్ళ తర్వాత చప్పబడి పోతాయి'' అని ఆమధ్య ఒక మిత్రుడు మాటల సందర్భంలో అన్నాడు. కానీ,సంతోషించే విషయం ఏమిటంటే , 1.రోజురోజుకీ 'కవిసంగమం'లో Join request లు పెరుగుతూ ఉండటం. కొత్తగా వస్తున్నవాళ్ళలో మెరుగైన కవిత్వ సృజన చేస్తున్నవాళ్లు కన్పిస్తుండటం. 2.ఇదొక పోయెట్రీ హబ్ లాగా మిగతా సాహిత్య పత్రికలకు, e పత్రికలకు ఉపయోగపడుతుండటం. 3. కవిత్వరంగంలోకి వస్తున్నవారికి సంతోషించదగ్గ ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తూ ఉండటం. కవిత్వంలో ఉత్సాహం నింపుతున్న ఇటువంటి కవిసంగమం నిలబడాలి. నిలబడాలంటే నిత్యమూ కవిత్వరచన, అభిప్రాయాలు -కవిసంగమంలో కన్పించాలి. కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించాలి.* నచ్చిన కవితలపై వివరణాత్మకమైన కామెంట్లు రాయడానికి ప్రయత్నించండి. నిరంతరం కవిత్వం..కవిత్వం ..కవిత్వం ! జయహో కవిత్వం !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyd7Iu

Posted by Katta

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ ll కాగితప్పడవలు ll గులాబీ పూరిక్కలు సుతిమెత్తగా పరిచిన కాగితప్పడవలు వాటిలో చిన్నారి మురిపాన్ని ముద్దుగా మూటగట్టి పంపుతున్నట్లు జోరుగా వానకురిసిన రోజుల్లో వీధుల్లో నీటి కాలువల వెంట పోటీపడి ప్రవహించిన బాల్యచాపల్యం మళ్ళీ పురివిప్పుకున్నట్లు ఇప్పుడూ అంతే ఉత్సాహంతో ఊహా కౌశలంతో భావాల్ని పరిచిన వాక్యవిన్యాసపు కవితలనూ "కవిసంగమ" ప్రవాహంలో వదులుతూ.. కాకపోతే ఇప్పుడు కవితలు ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోతుంటే పిసరంత దిగులు * * * కాస్తా కామెంట్లతో లంగరు వేయరూ ప్లీజ్! 13/5/2014

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyd7Io

Posted by Katta

Arun Nallella కవిత

ప్రక్రుతి-గురువు ఒక పువ్వు వికశిస్తు చెపుతుంది జీవించె ఒక్కరోజైన గౌరవంగ జీవించమని ఒక పండుటాకు రాలిపోతు చెపుతుంది అప్పటికైన రాలిపోకతప్పదని ఒక మెఘం వర్షిస్తు చెపుతుంది తనలాగె చెడుని గ్రహించి మంచిని పంచమని ఒక సెలయేరు ప్రవహిస్తు చెపుతుంది తనలాగె పరిగెత్తమని పదిమందిని బ్రతికించమని అరుణ్ 13.05.2014

by Arun Nallella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyd7rU

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//సరే...కానీ// గొడుగు పట్టడమే జీవితమంటావా ఏకాలనికా గొడుగు నిజమంటావా.. పత్రహరితం పల్లవించి చిత్తడి నేల చివురుపట్టిన కురిసిన వర్షంలో మేను తడవక కాలు మెదపక నిఖార్సు ఏసంకాలం ఒయాసిస్సులు వెక్కిరించినప్పుడు మాడు పగిలిన రోజుల్లో దాహం తీరక నీడ దొరకక గొడుగు పట్టాలంటావా... సరే కానీ బయటకు వెళ్ళి నన్ను తెరిచేముందు చిరుగుల్ని కాస్త కుట్టవూ....13.05.2014. (19.04.2014 ఒకరాత్రి 8కవితలు ఐదోది)

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghuHw5

Posted by Katta

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -8!! !!ఎలా మరువగలను ప్రియా....!! కరిగిన కాలం కళ్ళముందే తారసపడుతున్నది నీ జ్ఞాపకాల రూపంలో మదిదోచిన మువ్వల సవ్వడి మరువ గలనా విరబూసిన వెన్నెల లాంటి నీ నవ్వులను మళ్ళీ చూడగలనా గల గలా పారే సెలయేరులా ప్రవహించే నీ మాటలను వినగలనా అవన్నీ నా కళ్ళముందే కదలాడుతున్నాయి ఆ కాలం కన్నులలో కలయతిరుగుతున్నది. నువ్వు నా తోడుగా లేకున్నా నీ జ్ఞాపకాలు నాతోనే సహవాసం చేస్తున్నాయి. నేను నిన్ను ఎలా మరువగలను ప్రియా.... !!అజయ్!! 13MAY14

by Ajay Pandu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghuHfF

Posted by Katta

Satish Namba కవిత

సతీష్ నంబా // 12-05-2014 నాకు జన్మనిచావు నా తల్లితండ్రివి కాదు నాకు తోడుగా ఉన్నావు తోబుట్టువు కాదు కలిసి ఉంటునావు చుట్టానివి కూడా కాదు అనీ వేళలా తోడుగా ఉంటావు స్నేహితుడివి కాదు సంతోషంలో దుఖంలో చేయూత నీచవు అన్నదమ్ముడివి కాదు నా పేరును నీ పేరుగా అనుకుంటావు నా ఇంటిపేరు నీది కనేకాదే అలసటలో సేదతిరుస్తావు ఆకలిలో అమృతం ఇస్తావు ఆనందం అందిస్తావు బాధను పంచుకుంటావు నామనస్సు నిదీ అంటావు నీ మనస్సులో నేను ఉన్ననాటావు నా ప్రశ్నకు నివు జవాబు అవుతావు నా ఆలోచనకు రూపంగా మరుతావు నా ఉన్నతికి సోపానం నివవుతావు నా జీవితానికి అర్ధం పరమార్ధం నివే నాటావు ఇంతకి నివు ఎవరు అని అడిగితె చిలిపిగా సిగ్గుతో ఛి పో అంటావు అప్పుడే కదా నీ నుదిటిపై ముద్దు పెట్టి ఇమే కదా నా అర్ధగిని అని గర్వంగా మనస్సులో ఆనందిస్తా నిన్ను నా గుండెలో దాచ్చుకుంటా .........

by Satish Namba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jmn024

Posted by Katta

Krishna Mani కవిత

బతుకు గంప ___________________కృష్ణ మణి గడ్డిపోసలమీద నీటి చుక్కలోలె బతుకుగంపనెత్తిన చమట చుక్కలు సదువుసంధ్యల్లేవు కాలరెగరెయ్య కన్నకష్టమే నడుపు నెత్తుటి యంత్రాలను ! పోదుగల్ల లేవంగ బొగ్గునోటికివెట్టి నాలికపాసును గుంజి గంజిమెతుకుల తోడ సద్దిసంకకుబెట్టి తోవ్వనడువును సూడు పంటకాలువలెంట ! కాడికి ఎడ్లను గట్టి నాగలిని జతకుబెట్టి సూరుడెలిగిపొంగ ఒంటి పాటలకూత నీల్లుతాగిన మొక్క పానమైనా సూపు అలసిన పెయ్యికి చెట్టు నీడ దాపు ! పెడ్లాం మురిసేను నిండిన బిడ్డల పొట్టలు ప్రేమఒలికినకాడ చెమట నవ్వే గడప నిండినగాని కడుపు ఎండిన మాటే కష్టమమ్ముడుగాక రొట్టేమీది కారమే ! కృష్ణ మణి I 13-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SVTETj

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/చీకటి వాసన ఇంకొన్నాళ్ళు ఆగాలేమో కొత్త రెక్కలు విచ్చుకోవడానికి అన్నం మెతుకులు చేతులకంటనే లేదు అప్పుడే ఆకలిసముద్రాన్ని దాటేస్తే ఎలా చీకటి తైలం ఇంకిపోయిన నేలంతా రాత్రి వాసనను కప్పుకొని బయటకొచ్చింది చేతుల్లోకి కాసింత శూన్యాన్ని తోడుకుని ముఖాన్ని చదును చేసుకుంటూ ఇంకో క్షణం మట్టి గొంతులో కుక్కబడిన వేర్ల చిరునామాలన్నీ ఆకులతో కుప్పపోసాక లోన మిగిలిన ఓకింత ఖాళీ నవ సమాధుల నిర్మాణం జరుగుతూనే ఉంది ఎక్కడోచోట ప్రతి రోజు పాత శాసనాలను కొత్తగా లిఖిస్తూనే ఉన్నా మరో రెండు శరీరాలు కోరికల ముసుగులో మరణించాక ఇంకో ఆకలి పుడుతూ వెంట తేలేని లిప్తపాటు కాలాన్ని నీతిప్రమణాలతో కొలుస్తూ డోలాయనం ఇప్పుడిక ఎగరొచ్చు సరిహద్దులు దాటి తిలక్ బొమ్మరాజు 12.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCxbqU

Posted by Katta

Rajender Kalluri కవిత

ఆడేవాడు మనిషి ఆడించేవాడే దేవుడు బజించేవాడంటే తనకిష్టం , నటించేవాడంటే కొద్దిగా కష్టం అతిగా నవ్వితే అసుహ్యిస్తాడు , ఏడిస్తే ఒక్కోసారి కోపిస్తాడు ఎందుకు పనికిరావా అని రెచ్చగొడతాడు ... ఎత్తుకో బారం అంటాడు ...ఎదురుకో నీ గమ్యం అంటాడు ప్రశ్నను సంధిస్తాడు....... పరీక్షను విదిస్తాడు సహనం నీకుంటే..... సమస్య చిన్నదే అంటాడు ఎత్తులను చూపిస్తాడు ... మనిషి వేసే జిత్తులను పసిగడతాడు నిజానికి తలరాతను తాను రాయడు , రాసుకొనె అవకాశం కల్పిస్తాడు ఆడుకునెంతసేపు ఆడుకుంటాడు ఆటలో పావుని చేస్తాడు .... ఓడిపోతే గేలి( హేళన ) చేస్తాడు నచ్చితే ఆటను రక్తి కట్టిస్తాడు .....నచ్చకపోతే పరదా (ఆట) కట్టేస్తాడు ఆడుకోవడం అయన ధర్మం ........ఆడటం మన ధర్మం ఆయన దర్శకుడు ......చుట్టూ ఉండేవాడు వీక్షకుడు పచ్చిగా నిజం తెల్సినా ..... అమాయకంగా దేవుడుని అడగటం మన అలవాటు !! kAlluRi

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCm2Xi

Posted by Katta

Jagadish Yamijala కవిత

భ్రమ ------------------ పసితనంలో చందమామ బహు దూరాన ఉంటాడు కానీ నేను నడుస్తున్నప్పుడల్లా నాతో నడచి వస్తున్నట్టు మనసు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతుంటుంది ఇప్పుడు నువ్వు బహు దూరాన ఉండి నాకు అందని బంధమే.... అయినా నీతో కలిసి మమేకమై అనుక్షణం నేను ఆనందంతో జీవిస్తున్నట్టు భ్రమిస్తున్నాను ఇది ఎంత కాలమో తెలియడం లేదు - యామిజాల జగదీశ్ 13.5.2014 -------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mjTf7G

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా................దులుపును కాల చలనం... ............................................................ చాలని కోరికలు ఉన్నవి సరిపోక.... చావక ము0దే శవం కంపు----- బ్రతుకు కోసం పరుగులు పోసిపోసి..... ముడతలు పడుతున్న మానవ శక్తి----- సహజ ఎదుగుదలను పక్కకు నెట్టి.... లాగిలాగి పొడుగైపోవాలనే ప్రయత్నం------- అడుగులకందని వాటి కోసం పంగను చాపి... కొనితెచ్చుకునే అవిటి తనం------- మనిషికి పట్టిని ఈ దుమ్ము దులుపును కాల చలనం. 13-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sn2xzA

Posted by Katta

Rajaram Thumucharla కవిత

"కవి సంగమం " చదివిన కవిత్వ సంపుటి :- 28 పరిచయం చేస్తున్న కవిత్వ సంపుటి " సమాంతర ఛాయలు " (కవిత్వం) కవిత్వ సంపుటి రాసిన కవి "మువ్వ శ్రీనివాస రావు " (క్రాంతి శ్రీనివాస్ ) పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి "కవిత్వమంటే సూర్యుడూ చంద్రుడూ కాదు నేలతల్లి చూపుడు వేలి కదలిక కవిత్వమంటే భావనల సౌరభంలో తడిసిన అక్షరచలనాలు మాటల భ్రమణాలు కవిత్వమంటే నిరంతరం పారేది అనుక్షణం మారేది - (భ్రమణ చలనం) “ఇదే కవిత్వమన్నోళ్ళుఇలానే ఉంటుందన్నోళ్ళు" కవులు అనేకులు విమర్శకులు ఎందరో మనకు తారసపడే వుంటారు.కానీ ఖమ్మం కవి మువ్వా శ్రీనివాసరావు మాత్రం భావాలు కురిపించి తనకు తోచినట్టు రాసే కవినని " భ్రమణచలనం" అనే కవితలో చెప్పుకొన్న అతను ఎంత మంచి కవో అఫ్సర్, అరుణ్ సాగర్,యాకుబ్,ఖాదర్ మొహిద్దిన్, ప్రసేన్ ,కె.ఆనందాచారి,బి.వి.వి.ప్రసాద్, సీతారామ్ గార్లు రాసిన మాటలే చెబుతాయి.ఖమ్మం గుర్తు రాగానే పైనపేర్కొన్నవారేకాదు గాలికట్ట విద్యసాగర్,ఈ క్రాంతి శ్రేనివాస్ కూడా ఙ్ఞాపకానికొస్తాడు నాకు. ఎందుకంటే శ్రీశ్రీ ని నాకన్న ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి. "చరిత్ర అయినా,కొందరు మనుషులయినా,కొన్ని సంఘటనలయినా రూపం మార్చుకుంటాయి" కవిత్వంగా మారి బాహ్య స్వగతం అవుతాయంటాడు అఫ్సర్ క్రాంతి కవిత్వ రహస్యాన్ని విప్పుతూ. "ఈ కవిత్వాన్ని ఎవో కొన్ని రెఫరెన్స్ లతో తూచి కొలచి ఒక చట్రంలో ఒదిగించి విశ్లేషించలేనంటూ సాటి కవి అరుణ్ సాగార్ క్రాంతి శ్రీనివాస్ గారి వాక్యాలు "మంచి మాగాణిలో చేసిన అక్షర సేద్యంలో పుట్టాయి"అని వ్యాఖ్యానించాడు."మరణానికీ జీవితానికీ నడుమ తెరల కదలికలోంచి తొంగి చూచే దృశ్యాదృశ్యాల శ్వాస తెలిసిన సమాంతర ఛాయా గ్రాహకుడని" యాకూబ్ కితబునిచ్చాడు. అంతర్ముఖ వ్యాకూల కవిత్వంగా ప్రసేన్ భావిస్తే కె.ఆనందాచారి గారు "ఎంతో వస్తు విస్తృతితో,కవిత్వం కావాలన్న దాహంతో,కలలు కనే మనసుతో అధర్మంపై,అన్యాయలపై అసమ సమాజ దుష్టత్వంపై కవితా యుధ్ధ సైనికునిలా"రాశాడని క్రాంతి శ్రీనివాస్ ని గురించి అన్నాడు."జీవితంలో కవిత్వాన్ని పసిగట్టడంలోనూ,కవితలో సునాయసంగా జీవితాన్ని నింపడంలోనూ కవి నేర్పు కనిపిస్తుందని"బి.వి.వి ప్రసాద్ గారంటే ఖాదర్ మొహియుద్దిన్ "ఖండఖండాలుగా విభజితమయిన జీవన మహాసమరం తాలూకు ఒక మహవృత్తాంతం "-క్రాతి శ్రీనివాస్ కవిత్వం అని అన్నారు.చివరగా సీతారామ్ "ఇతను ముట్టించిన కవిత్వ దీపం ముందు కూర్చోండి " . అని " సమాంతర ఛాయలు" కవైన శ్రీనివాస్ కవిత్వాన్ని గూర్చి అంటాడు. ఈ ఒక్క మాటతో శ్రీనివాస్ కవిత్వం దీపంలా ఎన్నెన్ని అర్థకిరణాలని వెదజల్లుతుందో సీతారామ్ స్ఫురింపచేస్తాడు. ఇందరు ఈ సంపుటిని విశ్లేషించాక మళ్ళి నేనెందుకు రాయడమా? అన్న ఆలోచన ఇన్ని రోజులు ఈ సంపుటిపైన రాయనీయలేదు. కానీ...ఆతరువాత అనిపించింది కవిత్వమనేది అందరు చదువరులకు వొకే రకం అనుభవాన్నివ్వదు అని.ఆ చదువరుల జీవితానుభవం కానీ, కావ్య పఠానుభవం కానీ కవిత్వాన్ని అర్థం చేసుకుండే తీరును ప్రభావితం చేస్తాయనిపించింది.పైగా స్వానుభూతుల నేపథ్యంలో వొక్కో పాఠకుడు వొక్కో కవితను వొక్కో రకంగా అర్థం చేసుకుంటాడేమో?. అందువల్లా నాకు అర్థమయ్యే పరిమితిలో రాయోచ్చు కదా అని అనుకున్నా. " సమాంతర ఛాయలు" చదవడం మొదలెట్టగానే అది "మానవ జీవితానుభవాల పొరలను కెరలించిన కవిత్వంగా అనిపించింది. ఈ కవిత్వ కాంత కాలి 'మువ్వ'ల శబ్దం చిత్రంగా వినిపించి చదివించి మైమరిపించింది. "ఖమ్మం" ఎందుకంత ఎర్రగయ్యిందో,మందార పూలమయ్యిందో క్రాంతి శ్రీనివాస్ భావన నిజమో వూహనో ఊహించలేను కానీ ఈ ఆలోచన మాత్రం గొప్పగా అనిపించింది "1975...పోరాటగాథ " కవిత చదివితే.ఈ 1975 కాలాన్ని చీకటి రోజులు గా చరిత్ర గుర్తించింది." ఏందిరా?"-అని అన్న వ్యక్తిని "ఇందిర"అని అన్నాడని ఖాకీలు నిర్భంధించిన రోజులవి. బియాబానీ -అనే సామాన్య ముస్లిమ్ కుటుంబానికీ చెందిన యువకుని చుట్టూ తిరుగుతూ, ఆ చీకటి రోజుల్లో కాలువలా ప్రవహించిన రాజ్యహింసను,కరకు ఖాకీల దుర్మార్గపు దౌష్ట్యాలను ఈ కవిత గుర్తుకు తెస్తుంది. "మా వూరి మర్రి చెట్టు మీద అర్థరాత్రి మందారం పూసిందని ఖాకీలు కాలువల్లా ప్రవహించాయి తుపాకీ గొట్టాలు తూరుపు మొక్కలను పసిగట్టాయి తెల్లవార్లూ లాఠీలు ఎముకలూ మాట్లాడుకొంటూనే వున్నాయి" తూర్పున ఉదయించేది సూర్యుడే.ఉదయించే సూర్యుడు ఎర్రగా వుండి తిరుగుబాటు సంకేతమవుతాడని కవి మన ఊహకు వదిలేస్తూ ,తూర్పు మొక్కలు అని అనటంలో ఇంకా యవ్వనంలో అడుగుపెట్టని వాళ్ళనే స్పృహని అందిస్తాడు ఈ వాక్యాలా ద్వారా."లాఠీలు ఎముకలు మాట్లాడుకుంటునే వున్నాయి"-అని అనటం వలన ఆరోజుల్లో పోలీసులు ఎంతటి ఘాతుకాలకు పూనుకున్నారో కవి సూచిస్తాడు."మర్రిచెట్టు మీద మందారం పూసిందనే" ప్రతీకాత్మక వాక్యంతో ఊర్లోని పిల్లలో కూడా ఆ పరిస్థితులకు ఎదురుతిరిగే తత్వం ఏర్పడిందనే భావనను ఈ కవి అందిస్తాడు వూరిని ప్రతీకగా చేసి. సగం వూరు నిద్రపోకుండా ఆ పైశాచిక భాషని అనువదిస్తూనే వుంది తల్లి పేగును మాత్రం తప్పుడు తర్జుమాలతో వోదారుస్తూనే వుంది' ఊర్లోని ప్రజలు ఎమర్జన్సీ కారణంగా ప్రజలు నిద్రని కూడ కోల్పోయారని చెప్పడమే కాదు కొందరు ముఖ్యంగా పాలకవర్గాలు ఆ అత్యవసరస్థితిని బలపరుస్తు తప్పుడు సంకేతాలను ప్రజలకీ అందించారనే అంశాన్ని ఈ కవి పై మాటల్లో పేర్కొంటాడు.బియ్యాబానీని క్రాంతి శ్రీనివాస్ సకల జీవులను ప్రేమతో తాకి పలకరించే శిర్డి సాయితో, కాలం దింపిన మేకులతో వున్న ఏసుక్రీస్తుతో ఉపమిస్తాడు.అప్పటి కాలంలో సామాన్యుడైన బియ్యాబానీ వొక అసామాన్యుడిగా చిత్రీకరించబడిన చారిత్రికతను అర్థం చేసుకోవచ్చు."మా వూరికిచ్చిన బహుమతి/బియ్యాబానీ సాక్షిగా/ఇప్పుడు మా వూరినిండా/మందారాలు విరబూస్తున్నాయి'-అని ఈ కవి పోలీసు పాలనలో నలుదిక్కుల పారిన నెత్తుటి కాలువల" ప్రవాహపు ఘాతుకాల వల్లా పెరిగిన ఎరుపును దాని వ్యాప్తి కారణాలను సహేతుకంగా పేర్కొని ఆ ప్రాంత చరిత్రను పరోక్షంగా నమోదు చేశాడు ఈ కవి. చరిత్రతో పాటూ,అప్పటి సామాజిక స్థితిని, రాజ్యహింసను ఒక చారిత్రక అవగాహనతో రికార్డ్ చేసే గొప్ప శిల్పంతో ఆ చీకటి రోజుల భీభత్స సమవాకార దృశ్యాన్ని దృశ్యమానం చేస్తూ ఈ కవి "1975...ఓ పోరాట గాథ" అనే ఈ కవితను రాశాడు. "మహా నగరమంటే బజార్లని ముట్టుకోకుండా లోతయిన లోయలుగా తవ్వుకోవడమేనట" అని చెప్పే ఈ కవి ఇతరకవుల వలె మహానగర జీవితలాలలోని ఛిధ్రతని ,భీభత్స విధ్వంసతని,రొదల్ని మాత్రమే చెప్పకుండా ఈ "మహానగరం" అనే కవితలో మహానగరాల రూపంలోని డొల్లతనాన్ని,"జన సముద్రంలో మంచితనం కోసం వెతుకులాటే"నని ఆ మంచితనం ఏమాత్రం కన్పించదని ,మహానగరం మానవ బతుకుల్ని బహు చౌకగా అమ్ముకొనే తిర్ణాలా అని పేర్కొంటాడు.మహానగరం మనని మనం కొనుక్కుంటే తప్ప మిగలకుండా చేసే ఆర్థిక సూత్రాన్ని కూడా ఈ కవి ధ్వనింపచేస్తాడు.నగరం మహానగరంగా రూపొందే క్రమంలో ఆ నగరం చుట్టు వుండే ఊర్లు నగరంలో కలసిపోతాయి.ఆ అంశాన్ని ఈ కవి "ఉసిళ్ళలా ఊళ్ళన్నీ అక్కడే వాలిపోతున్నాయి"-అనిచెబుతూ నగరాల వెలుగుల భ్రమలో గ్రామాలు ఎలా మాయమవుతున్నాయో స్పష్టం చేస్తాడు."ఉసుళ్ళు" అనేవి వర్షం పడి వెలిసిన తరువాతా పుట్టుకొచ్చే చిన్న కీటకాలు.దీపపు కాంతులకు భ్రమసి ఆ దీపపు చుట్టు తిరుగుతూ జీవితాన్ని చాలిస్తాయి.వీటిని కవితలో పోలిక చేసి ఒక గొప్ప ఊహను పాఠకులకు అందించి వారి అవగాహనను విస్తృతం చేస్తాడు. "ఆరుబయట నులక మంచం మీద ఆరబోసుకున్న నేను బిగదీసిన కాళ్ళ కట్టపై గాలి కెరటాలలో తేలియాడుతూ విశాల విశ్వం నే వీక్షిస్తున్నపుడు శాంతి దీపమేదో లోపల వెలిగి ఆలోచనలన్నీ ఆవిరై ఒకప్పుడు పల్లె ఒడిలో నేను వెన్నెల నీడల్లో మైమరచి విశ్రాంతి పొదేవాన్ని" అంటున్న ఈ కవి " ఇన్ సోమ్నియా"(నిద్ర లేమి)కి కారణమేమిటి?.అందుకు కారణం కూడా కవి క్రాంతి శ్రీనివాస్ "రేపటి జీవిత పరుగు కోసం/మూసిన రెప్పల వెనక రిహార్సల్ వేసుకొంటూ కరువైపోయిన నిద్ర కోసం నిద్రలో కలల కోసం మందులతో కలబడుతున్నాను."అని చెబుతాడు.నిద్రలేమికీ అదొక్కటే కారణంగా చెప్పడు."ఆత్రపు ఆదుర్దా తరంగాలను అదే పనిగా వినిపిస్తున్న కరెంట్ విసనకర్ర","మధ్య మద్యలో కరెంట్ కోతలు కరివటం" కారణాలుగా చెబుతాడు.నిద్ర లేని రాని తనాన్ని ఎంత అద్భుతమైన పోలికతో సాదృశ్యం చేస్తాడంటే "అమ్మ కోళ్ళను గంప కింద కప్పెట్టినట్టు రాత్రి ఒక్కొ శబ్దాన్నీ పట్టుకొని దాచేస్తు పోతుందని".ఒక సాంద్రమైన అనుభూతిని భావ చిత్రాల పదచిత్రాలతో కలిగిస్తాడు. ఫ్యాన్ ను కరెంట్ విసన కర్ర అని అనటం వైచిత్రిగా తోస్తుంది. "24 ఇంటు 7 చిరుత పులి కళ్ళతో చెలరేగుతునే ఇంటింటికీ నిజాన్ని చెప్పాల్సిన" ఫోర్త్ ఎస్టేట్ గా నిలబడాల్సిన పాత్రికేయుడు "లేపాక్షి ఆలయంలో వ్రేలాడేస్తంభమై ఊరేగుతున్నాడు"అని ఈ కవి వ్యాఖ్యానిస్తూ.."గ్రద్ద కళ్ళెట్టుకొని" అతడు చేయాల్సింది చేయక చూడాల్సింది చూడక తెలియజేయాల్సింది తెలియజేయక వున్నాడనే భావాన్ని "దారితప్పిన కన్ను"-అనే కవితలో నిర్మొహమాటంగా చెబుతాడు.జీవితం "అంతా లెక్కే"అని కవి "లెక్కలు రాని మనిషి రెక్కలు తెగిన పక్షి ఒక్కటే"అంటూ ఒక జీవన సత్యాన్ని ఇలా కవిత్వం చేస్తాడు క్రాంతి శ్రీనివాస్. "సంక్లిష్ట జీవిత గణిత శాస్త్రంలో సమాధానాలు దొరికే దాకా ఎవరి సిద్ధాంతం వారు ప్రకటిస్తూ పోతూనే వున్నారు వేల కొట్టివేతల మధ్య నుండి సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తూనే వున్నారు" ఇలా కొన్ని కవితల్లో ఈ కవి తాత్విక భావనల చర్చను లేవదీస్తాడు. "దేహ మాళిగలు"అనే కవిత ఇందుకు ఉదాహరణ. మధ్య తరగతి ప్రజల జీవితాల్లోని కుహన ఆడంబర డాంభికత్వాన్ని,పరువును ప్రాణం కన్నా మిన్నగా చూసుకుండే తత్వాన్ని, రెండు విసురాళ్ల మధ్య పెసర గింజల్లా పగిలి నలిగే వనాన్ని"మధ్య తరగతి ఇప్పుడు మిధ్యా తరగతి మధ్య తరగతిగా మార్పు చెందుతోది "అంటూ ఎప్పుడూ/ఒక సంఘర్షణ ఒక సంక్షోభం" ఆ ప్రజల జీవితంలో ఒక భాగంగా నిలిచివుంటుందనే భావనను ఈ కవి వ్యక్తం చేస్తాడు.ఈ సంపుటిలో వున్న అనేక మంచి కవితల్లో "నేల దీపం "కూడా ఒకటి.కుల వృత్తుల పతనం గ్రామాల్లో జరిగిన వైనం,ఆ వృత్తుల్ని కాపాడుకోవడం కోసం ఏంచేస్తే సమంజసమో ఈ కవి తన తండ్రి చేసిన పనితో కవితను ముగిస్తాడు.మంగలి నారాయణ,చాకలి లక్ష్మయ్య,కుమ్మరి వెంకయ్య లేకుండా పెళ్లెట్లా చెయ్యాలని? సంశయపడే నాన వార్ని పిలిచి చుట్టాలని పక్కన పెట్టి చుట్టలు వాళ్ళ్తో కలసి కాల్చుకొంటూ పల్లెను మళ్ళి పెండ్లి పందిట్లో బతికించాడని-ఈ కవి మనసు తడి అయ్యేలా రాశాడు."పొదిలో పదిలంగా వుండాల్సిన బతుకు"ఛిద్రం కావడాని కారణం మంగల నారాయణ అన్నట్టు రాసిన వాక్యాలు ఇవి.వోడిపోయిన కోడి పుంజుల పాపం ఉత్తినే పోద్దా బాబు"-అని.ఈ మాటల్లో కర్మ సిద్దాంతపు వాసనలు కనిపించినా కవి అలా వారి బ్రతుకులు మారటానికీ గల కారణాలను సరిగ్గానే అంచనా వేశాడు.కుమ్మరి వెంకయ్య నవ్వుని "ఘట వాయిద్యం"తో ఉపమించడం లాంటి శిల్ప రహస్యాల్ని ఎంతో నేర్పుతో ఈ కవి పట్టుకొన్నట్టు గుర్తించవచ్చు. జీవితం జారిపోకుండా,జావగారిపోకుండా వుండేందుకు మహ నటుడిగా మారిపోయే మానవ బలహీనతల్నీ కూడా ఈ కవి నిజాయితితో చిత్రించాడు. "క్షమించకు తల్లీ కనీస అర్హతలేని కుహనా ప్రజాస్వామ్యాన్ని క్షమించకు తల్లీ పేట్రేగిన మూర్ఖపు మగ స్వామ్యాన్ని" అంటున్న ఈ కవి స్త్రీవాదం పట్ల సహానుభూతిని అనేక కవితల్లో బలపరుస్తాడు."హక్కుల్లో సగభాగం వస్తుందో రాదో/ఆకాశంలో సగం కాస్తా పాతికయ్యింది" అంటూ గర్భస్థ పరీక్షలతో పుట్టక ముందే మరణం పాలవుతున్న ఫిమేల్ ఫీటస్ ల దుస్థితిని కన్నీటితో "ఉమ్మ నీటి కన్నీరు'-అనే కవితను ఈ కవి చిత్రించాడు. మానవజీవితం నేడు "కరప్టెడ్ సాఫ్ట్ వేర్ "అయ్యిందని అందుకే హార్డ్ వేర్ లోకి కొత్త సాఫ్ట్ వేర్ అయిన ఎక్కించాలి లేదా సిస్టమ్ ను ఫార్మట్ చేయాలి అని ఈ కవి కంఫూటర్ పారి భాషిక పదజాలంతో ఒక కవిత రాసి తన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.ఇట్లా ఇంకా కొందరు కవులు కూడా రాసినట్టు ఙ్ఞాపకం. ఇంతకు ముందే చెప్పాను ఈ కవి స్త్రీ స్వామ్యాన్ని ఆహ్వానించేవాడని,నిజాయితిగా దేన్నయినా ఒప్పుకోగలడని."నేను నేను గానే వున్నప్పుడు/ఆమె నాలా మారి/ఆమె ఆమెగానే వుండాలనుకొన్నప్పుడు నన్నామెగా మార్చుతుంది"-అని తన జీవిత భాగ స్వామి గొప్ప తన్నాన్ని అంగీకరిస్తూ..'ప్రేమాన్నం పళ్ళెంలో పెట్టడమే గాక తనను "అప్ డేట్"కూడా చేస్తుందని చెప్పి ఆవిడపై తనకు గల ప్రేమను ,కృతఙ్ఞతను కవితా బద్దం చేశాడు.ఇలా పిల్లల పెంపకం ,వారి చదువులు ఎన్నేన్నొ అంశాలను వివిద కోణాల్లో ఈ క్రాంతి కాంతివంతం చేశాడు.మాములుగా పరువు ఆట్మహత్యలు జరుగుతాయి.కానీ దొర సానమ్మ పోరగాన్ని తగులుకొంటే దొర పరువు కోసం పోరగాన్ని హత్య చేసిన దృష్టాంతాన్ని "పరువు హత్య"అనే కవితగా చేసి "తుపుక్కున ఉమ్మే" ఛీత్కారాన్ని దొరల పట్ల కలిగిస్తాడు శ్రీనివాస్. "బిల్లులో పదో పాతికో రావాల్సివస్తే/వదిలేసి యాభై రూపాయలు ఖరీదు చేసే కృతఙ్ఞత కోసం/బేరర్ మొహం వెదుకులాడే పగిలిన పోయిన మన మొహాల గురించి చెబుతూ"విజయం వెనుకాల/పరుగెత్తడం మానుకోలేం/విజయమ్పై స్వారీ చేయడానికీ సాహసం చేయలేం" -అని జంకు లేకుండా చెప్పగలిగాడు ఈ కవి. ఈ సంపుటిలో ఒక లాంతర్ వెలుతురులా మెరిసిపోయే కవిత "దయ్యాల మాణిక్యమ్మ"."ఎదుళ్ళ చెరువు వాయలో కొరివి దయ్యమొకటి/లాంతర్లు పట్టుకు తిరుతోందట"-అని ప్రారంభమయ్యే ఈ కవిత "ఎవరో లాంతరుతో నడిచిపోయిన చప్పుడు/ధ్యైర్యాన్ని వంపిపోయిన చప్పుడు"-అనే వాక్యంతొ ముగుస్తుంది.లాంతరుతోనే ఆరంభం,ముగింపు ఈ కవిత ప్రత్యేకత. మాణిక్యమ్మ ధైర్యం,కుటుంబం పట్ల గల బాధ్యత,కష్టించి పనిచేసే తత్వం అన్ని ఈ కవితలో కవి రూపు కట్టించటమే కాదు అట్లాంటి స్త్రీల పట్ల సమాజంలో వున్న భావనను కవితలో నేర్పునంతా ప్రయోగించి చిత్రించినట్లు అనిపిస్తుంది.మహిళా సాధికారిక చిహ్నం ఆమె. "చేతిలో పసిది చంకలో చంటోడు కడుపులో ఇంకో కాయ" పై పాదాలు చదువుతుంటే శ్రీశ్రీ" భిక్షువర్షీయసీ" గుర్తుకు రావట్లేదా? ఈ మాటను ఎందుకు అంటున్నానంటే శ్రీ శ్రీ ని ఈ శ్రీనివాస్ అనుకరించాడని కాదు శ్రీ శ్రీ ని ఎంతగా యిష్టపడ్డాడో చెప్పడానికి.వయసు ముడతల మీద భయాన్ని వాలనీయనీ దైర్యపు నీడలా" ప్రతి స్త్రీకీ ఒక ఆదర్శంలా మాణిక్యమ్మ ఆవిష్కరించబడింది. అక్షర కుసుమాలను,మాట మాలలు చేసీ,అప్పుడప్పుడు కవితా పంక్తులు పేర్చుకొంటూ,కవిత్వ దాహం తీర్చుకొంటూ,భావాల్ని భాస్వరంలా మండిస్తూ,అవసరమైనప్పుడు అక్షర ఫిరంగులను మ్రోగిస్తూ..మువ్వ (మువ్వా శ్రీనివాసరావు) తన మ్రోతలో క్షతగాత్రలోకాన్ని ప్రతిధ్వనించిందని చెబుతున్నా.అప్పుడెప్పుడో పుస్తక ప్రకటనలో 'అందమైన క్యాలికో బైండ్"లాంటి మాటల్ని చేర్చేవారు.కానీ ఇప్పుడు ఆ ప్రస్తావనే కనిపించదు.మువ్వా శ్రీనివాస్ తన కవిత్వ సంపుటిని ఎంతో అందంగా చూడగానే చదవాలనే ఒక కాంక్ష కలిగే విధంగా తీర్చిదిద్దాడు.ఈ సంపుటి నాలుగు కాలాల పాటు చెదిరిపోకుండా వుండటమే కాదు ఇందులోని కవిత్వం కూడా చిరకాలం చెదరని ఙ్ఞాపకమై నిలుస్తుందని మిత్రులకీ చెబుతూ..".సమాంతర ఛాయలు"-చదివి మీ కవిత్వ నిర్మాణ నేర్పుని మరింత పెంచుకోగరని ఆశిస్తాను.వచ్చే మంగళ వారం మరో సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QBV6Iy

Posted by Katta

Abd Wahed కవిత



by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iGFdaC

Posted by Katta

Murthy Kvvs కవిత

Mario Puzo గాడ్ ఫాదర్ నవల లోని ఇంకా కొన్ని సన్నివేశాలు..! ఇదివరకు ఓ పోస్టులో Sicilian నవల గూర్చి చెప్పుకున్నాం కదా.తరవాత దానిలో ఇంకో నవల గూర్చి చెప్పుకుందాం. అయితే ఫుజొ కొన్ని ఇటాలియన్ మూలం లోనుంచి వచ్చిన పదాలనే ఇంగ్లీష్ రచన లోను వాడతాడు.ఎందుకంటే ఈ ఆర్గనైజెడ్ నేరవ్యవస్థ ని అమెరికాకి పరిచయం చేసింది సిసిలియన్ లే గదా..!అసలు God Father రాయాలనే ఆలోచన రావడం చాలా విన్నూత్నమైనది అప్పటికి.ఎందుకంటే ఆ కధ అంతా అమెరికా లో నే జరుగుతున్నా లీడ్ పాత్రల మూలాలన్నీ ఇటలీ పరిసరాలవే..! 1901 నాటికి డాన్ తండ్రి Antonia Andolini ని సిసిలీ లో చంపివేయడం తో తన సొంత ఊరునుంచి ఓ ఓడలో పారిపోయి అమెరికా చేరతాడు.అప్పటికతను ఇంచు మించు యవ్వనదశలో ఉంటాడు.అక్కడ మురికి వాడలో ఉన్న సిసిలియన్ లు కొందరు పరిచయం అవుతారు. వాళ్ళే CLEMENZO,SAL FESSIO వీళ్ళతో కలిసి బతుకు తెరువు కోసం చిన్న స్మగ్లింగ్ పనులు చేస్తుంటాడు.అయితే ఒక మనిషి ప్రయాణం విధి ఎలా నిర్ణయిస్తుందో చూడండి. అక్కడ ఆ మురికి వాడలో ఓ వీధి రౌడి ఉంటాడు..ప్రతి ఒక్కరు వాడికి విధిగా తాము సంపాదించినదానిలో కొంత ఇవ్వాలిసిందే.వీళ ముగ్గురుని బెదిరించి 700 డాలర్లని డిమాండ్ చేస్తాడు.అతగాడిని నేను ఒప్పిస్తానులే అని చెప్పి డాన్ ఆ రౌడి ని కలిసి కొంత డబ్బు ఇస్తాడు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అతడిని మర్డర్ చేస్తాడు.దానితో ఆ లొకాలిటీ లోని వ్యాపారస్తులు ,మిగతా జనాలు అతనికి గౌరవం ఇవ్వడం మొదలెడతారు.మనిషి పోకడ గురించి మంచి మాటలుంటాయిక్కడ.ఎవరైతే తమను భయపెట్టగలరో ప్రజలు వారినే గౌరవిస్తారు అనేది అర్ధం అవుతుందతనికి. ఇక మామూళ్ళు ఇతనికి ఇవ్వడం మొదలెడతారు. ఇక్కడ అతని ముందు చూపు శ్లాఘించవలసినదే.ఈ విధంగా ఎంతో కాలం సాగదు.కనుక చట్టబద్దమైన వ్యాపారాలలో ఉంటూనే ...మనం ఇతరుల వ్యాపారాలని కాపాడినందుకు,వాళ్ళ గొడవలు సర్దుబాటు చేసినందుకు ధనాన్ని వసూలుచేయాలి.ఆ రకంగా సమాజం లో మంచి పేరు తెచ్చుకొంటూనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని నిర్ణయించుకుని దాన్ని అమలుచేస్తాడు.ముందు ఆలివ్ ఆయిల్ బిజ్ఞెస్ లో సంపాదించిన తరవాత Gambling,Bootlegging లాంటి వ్యాపారాల వేపు దృష్టి సారిస్తాడు. అప్పటికి అవి చట్టబద్దమైన వ్యాపారాలు కావు...కాని కాలక్రమం లో అవుతాయని ,ఆ విధంగా ప్రభుత్వాన్ని మలచవచ్చని చెబుతాడు.పెళ్ళి చేస్కుని పిల్లల్ని కనడం,ఇతర పోటీదారులతో పోరాటాలు ,క్రమేపి వ్యాపార సామ్రాజ్యాన్ని తన స్నేహితులతో బంధువులతో విస్తరించడం ఇవన్నీ రకరకాల కధనాలతో ఇతర నవల ల్లో కూడా సాగుతాయి. తన పేరుని డాన్ విటో కార్లియాన్ గా మార్చుకుంటాడు.నిజానికి అతని సర్ నేం Andolini కాని తాను జన్మించిన కార్లియాన్ గ్రామం తనకి ఎప్పటికి గుర్తుండాలని తన ఇంటి పేరుని అలా మార్చుకుంటాడు. అప్పట్లోనే డాన్ పాత్ర అంటుంది మిగతా వాళ్ళతో..ఇలా విడిపోయి బిజినెస్ చేసినందువల్ల ఏం లాభం ఉంటుంది..మొనోపలి తీసుకురావాలి ఏ రంగం లోనైన అని.దాన్ని అమెరికన్ ధనవంతులు కాలక్రమం లో ఆచరణలో పెట్టారు కూడా..! గాడ్ ఫాదర్ బాగా ధనవంతుడైన తరువాత అనాధ పిల్లల్ని చేరదీసి చదివించడం..వారికి న్యాయశాఖ లో,పోలీస్ శాఖలో ..ఇలా అనేక శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాడు.దీని వెనుక కూడా దీర్ఘ ప్రణాళిక ఉంటుంది అతనికి....ఆ పిల్లలు జీవితాంతం అతనికి..అతని పిల్లలకి ...వ్యాపారాలకి కృతజ్ఞతతో ఉండాలనేది అతని ప్రణాళిక.ఆ విధంగా చారిటీ ని కూడా అతను దూరదృష్టితో చేస్తుంటాడు. నవల మొదట్లో Mario Puzo ఒక మాటని ఉటంకిస్తాడు."Behind every great fortune, there is a crime అని..! Qualified Man అనే పదం నవల లో వస్తుంది ...దానికి అర్ధం ఏమంటే ఒక మనిషిని చంపడం లో ప్రవీణుడు అని.ఇది సిసిలియన్ ప్రయోగమే.Consigliere అనే పదం కూడా ప్రత్యేకమైనది.బాస్ కి కుడి భుజం లాంటి వాడు అని.జడ్జ్ లతోను,మినిస్టర్ల తోను,అలాగే ఇతర ముఖ్య విషయాల్లో డాన్ తరపున సంప్రదింపులు చేస్తుంటాడు.ఒక ప్రణాళిక రూపొందించి డాన్ చెప్పడం తో ఇతను తగు వ్యవహారాలతో రంగం లోకి దిగిపోతాడు.Tom Hagen డాన్ కి ఈ విధంగా ఉంటాడు దీనిలో. Lupera అంటే ఆయుధం.Omerta అంటే రహస్యంగా వ్యవహరించే ఓ విధానం.ఇలా ఇవన్నీ సిసిలీ మూలాల లోవే.ఇవన్నీ తరచూ నవల్లో తగులుతుంటాయి.యవ్వనవంతునిగా ఒంటరిగా అమెరికా లో దిగి అక్కడే వివాహమాడి ,పిల్లల్ని ఇంకా మనవళ్ళని పొంది...వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రకరకాల దశలుగా సాగే డాన్ జీవితాన్ని Eloborate గా వివరిస్తాయి.Fools die నవల్లో లో కూడా ఈ పాత్ర బాగ ఉంటుంది.సరే..అదెప్పుడైనా చెప్పుకుందాం...! --KVVS MURTHY

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jTfAba

Posted by Katta