పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఏప్రిల్ 2014, గురువారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || వికృతం || ====================== మసిపూసిన మనసు ముందు దేహం నివురు గప్పుకుంది ఛాయలన్ని చారల్లా కనిపిస్తున్నాయి మాట్లాడే గొంతు జీరబోతుంటే గుండె లోతుల్లో దాచుకున్న దొంతరల అంతరాలు కన్నీటి ఛారలై వెక్కిరిస్తున్నాయి అద్దం మసకబారింది ప్రతిబింబం మబ్బయ్యింది మబ్బుల్లో ఎన్నో చాయలు మసకగా కనిపిస్తున్నాయి అచ్చం నా మనసులాగా ! హృదయశబ్దం నిశ్శబ్దంగా వినిపిస్తుంది మబ్బుల్ని చీల్చుకుని వచ్చిన చంద్రుడులా కాంతి చిమ్మిన రూపాలన్నీ నేడు వికృతాలై ప్రకృతి తో సహవాసం చేస్తున్నాయి రెడీమేడ్ కాలంలో జీవపరిణామక్రమాలు డార్విన్నే ప్రశ్నిస్తున్నాయి ప్రశ్నించే సమయం సమాధానంలో సమాధిగా మారి సమాజాన్నే ఎదురిస్తున్నాయి మనసంతా అమావాస్య జాబిలిగా గాధలన్నింటిని చీకటి చేస్తుంది కనురెప్పల్లో దాగిన కొత్తరంగులు మాత్రం నిత్యం గేలి చేస్తున్నాయి జీవితమే రంగుల మ(మా)యం కదా ! ====================== ఏప్రిల్ 17/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1maiJWA

Posted by Katta

Sriramoju Haragopal కవిత

పేరు మరిచిపోయి.. కష్టమే నిన్ను అర్థం చేసుకునుడు వాగర్థాలు వేరుపడ్డప్పుడు భాష వుండదాయె నన్ను గుర్తుపట్టలేనంత కంటిపూలు పూసినపుడు నువ్వయినా ఏంచేస్తవులే ప్రతిరాత్రిని జల్లెడాడిస్తే చుక్కలే పున్నమి నెలకొక్కసారే పగలయినా రాత్రయినా ఏసిలో కన్నీళ్ళు ఆరయి వగపయినా వలపయినా ఇష్టమైన మనిషి కొరకేకదా మారిపోయే రుతువులు మనిషికి సంతోషాల్ని రిజర్వ్ చేస్తాయా దారినపోయే నేస్తాలు మనవనుకుంటే దుఃఖాలు మత్తడి దూకుతయిర మాటలందరు మాట్లాడుతరు నరందాయె నాలుక అన్ని యాదికి పెట్టుకుని బతికిందెవరు? చల్నేదో బాలకిషన్ అంతా గింతే నువ్వటు నేనిటు నడుమ తొవ్వ పడిగిప్పిన తాసులెక్క భ్రమలు కాకపోతే వూకనే ఎవరెందుకు యాదికిజేస్తరు తండ్లాట కాకపోతే యాదికొచ్చినపుడల్లా మనసెందుకు పచ్చిగయితది ఎర్రటెండల్ల గూడ ఎండనివాగులు కండ్లేనాయె మాటలంటంగని గుండెపుండు మానదు అంత్రాల మీద అంత్రాలు కడుతం గని ఆయింత మనుషులే లేకపోతే ఏం జేసుకుంటం అలసటలేకుంట ఏరుకుంటపోతం గని ఎవలు మిగులుతరని ఆశుండాలె గని ఏన్నో ఆగకపోతే ఆగం కద గరిసెలు నిండాలంటె పొలమే పండాలె ఖాయిషి తీరాలంటె మనసు పచ్చగుండాలె నుమాయిష్ కాదు బతుకుడు సమాజ్దారిగ కాలం గడుపుడు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPzKVE

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి అక్షరశోకం అక్షరాల తోటలోని అక్షరాలని త్రెంపుతూ వాటిని గ్రుచ్చుతూ కుట్టుతూ గజమాలగా చేసుకుని నా మెడలో వేసుకుని లోకమంతా ఊరేగుతున్నానేమిటి నేను విచిత్రంగా! ఐనా నేను తోటమాలిని కదా అక్షరాలకి అక్షరాలని పూయించి అక్షరాలతదక్షరాలతద్భావము పలికించి ప్రకృతి అంతఃప్రకృతిని కదిలించి అక్షరవనాన్ని మురిపించి అక్షరపరిమళం లోకమంతా వ్యాపించేలా చేయడం కదా నా కర్తవ్యం....... మరి నేనేమిటి? అక్షరాలని త్రెంపుతూ ప్రోగుచేస్తూ వాటిని నా మనోవైకల్యంతో దుఖపెడుతూ నేను ఉల్లసిస్తూ ఉరకలు వేస్తూ నన్ను నేను ఉచ్చరించుకుంటూ అక్షరరధంలో ఊరేగుతున్నా....... ఒక అగమ్యపు యాత్రికుడిలా! 17Apr2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hYLzRT

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-7/ Dt. 17-4-2014 ఎక్కడో చిరుజల్లు పడితే ఇక్కడెందుకు గొడుగు పడతావు ఎక్కడో పారేటి నీటికి ఇక్కడెందుకు చాల్లు కడతావు గాయమొకరికి వైద్యమొకరికి రోగమెప్పుడు కుదుట పడును మనసుకే అవినీతి కుడితే మనిషికెందుకు మందు పడతావు సొమ్ము ఒకడిది షొకు ఒకడిది దేశమెప్పుడు బాగుపడును పొరుగునే పూరిళ్ళు ఉన్నా పరులకెందుకు మేడ కడతావు బాధలొకరివి భాగ్యమొకరిది సమత మమతలు ఎక్కడున్నవి ఆకలంటూ ఆర్తినొందే వారికెందుకు కడుపు కొడతావు కలం ఒకరిది కవిత ఒకరిది మొసమైనా ఓయి "చల్లా" కీర్తికోసం ఎన్ని జిత్తులో తెలిసి ఎందుకు బాధపడతావు

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPnpz9

Posted by Katta

Jagadish Yamijala కవిత

అక్కడ డూపులే ఉండాలి ------------------------------- ఇక్కడ నటులు రాజకీయవాదులుగా ఉన్నారు రాజకీయవాదులు నటులుగా ఉన్నారు . ఇద్దరూ యుద్ధం చేసే సన్నివేశాలలో మాత్రం "డూప్" ల పైనే ఆధారపడుతుంటారు - తమిళ మూలం పళనిభారతి తెలుగులో అనుసృజన యామిజాల జగదీశ్ ----------------------------------------------- 17.4.2014 ---------------------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1isKSF9

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

ఆ వెన్నెల...(గజల్) ఆ వెన్నెల వెలుగును చూసి ఎంతగా మురిసిపోతిని..!? ఈ వన్నెల తెలుగును చూసి అంతగా మురిసిపోతిని..!! //ఆ వెన్నెల// తెలుగు చంద్రకళలను సాంతం పరభాషా రాహువు పట్టి నమిలి మింగె తీరును చూసి ఎంతగా కుమిలి పోతిని. //ఆ వెన్నెల// సహజ తెలుగు వెన్నెల ముందు కృత్రిమ వెలుగులు నిలబడవని గ్రహించని ద్రోహుల చూసి ఎంతగా రగిలి పోతిని. //ఆ వెన్నెల// తెలుగు జాబిలమ్మకు భయపడి పరభాషాచీకటి తొలిగి రాబోయే జిలుగును చూసి ఎంతగా ఆశపడితిని. //ఆ వెన్నెల// తెలుగు సూర్యపుత్రుల కాంతి తెలుగు చందమామ సజీవం కన్నెగంటి కన్నుల చూసి ఎంతగా హర్షించితిని. //ఆ వెన్నెల// 17.4.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hYck97

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతుంది--3 _____________________ఆర్క్యూబ్ స్పార్టకస్-తన రక్తంతో నేలను ఆకాశంగా చేసి బానిసను సూర్యుడిగా నిలబెట్టిన మిణుగురు పురుగు దానికి ఎండ పొడ పడది రుచిమొగ్గల అవశేష దేహంతో బతుకీడుస్తున్నది కదా కాటుక పోగై ఒక్కొక్కర్ని ఎడబాపి పొతంబెడుతుంది అందుకే అతనిప్పుడు చౌరాస్తాలో చూపుడు వేలై పుష్పిస్తున్న దీప స్థంబం * * * * * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPebTC

Posted by Katta

Harika Haari కవిత

ఇన్ని రోజులు నీకై నేను చేసిన నిరీక్షణ, ఒక్కసారిగా నువ్వు కనపడగానే కనుమరుగై పోయింది...!! నీ చూపుల తాకిడితో నాలో ఉన్న విరహం, ఒక్క ఉదుటన ఎగిరిపోయింది..!! నువ్వు నా సమక్షానికి చేరిన మరుక్షణం , నాలో నీకై పడిన ఆవేదన వాయువులో కలిసిపోయింది...!! నీ కౌగిట నేను బందీ అయిన నిమిషం, నీకై నేను కార్చిన కన్నీరే ఆనంద బాష్పమై నా చెంపను తడిమింది... !! నువ్వు నేను ఒక్కటైన వేళ , నీ ఊపిరే నా ఆయువుగా మారింది ,నీ రూపాన్నే నా ప్రాణంగా మలచింది ...!! అందుకే ..! నువ్వు లేని నా మనసులో నాకైనా చోటు లేదు ...! నువ్వు లేని ఈ లోకంలో (నాకంటూ) బ్రతకాలన్న ఆశ లేదు...!! - హారిక / 17/04/2014

by Harika Haari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hPe8ah

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-38 నీ అంతర్ ప్రపంచం లో సమస్త రహస్య అనుభవాలను పంచుకునే ఒక రూపం నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది... అక్కడ నీకు నిత్య యవ్వనమే అలుపు లేని స్వైర కల్పనలే కల నెరవేరకపోవడం కూడ ఒక్కోసారి వరమే...! ---------------------------------- 17-4-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eVWDPT

Posted by Katta

Sri Venkatesh కవిత

కోల్పోయాను నన్ను నేను, నువ్వు లేని నాలో నేను లేను.... ఆత్మనైతే కాదు కాని, బ్రతికి మాత్రం లేను!!!! బ్రతికి మాత్రం లేను కాని, ఈ లోకంలోనే ఉన్నాను!!! గుప్పెడు మనసే కాని ఎంత మొండితనం, నిన్ను మర్చిపోవడం ససేమిరా అంటుంది!!!! ప్రేమ లేఖలు లేవు చూసుకుందామన్నా, అగ్గి కి ఆహుతై కాలిపోతున్నాయ్!!!! నీ జ్ఞాపకాలు లేవు జ్ఞప్తికి తెచ్చుకుందామన్నా, ఇవి నావి అని తీసుకెలిపోయావుగా!!!! విరహ వేదన కాదు నాది, స్పందన కోల్పోయిన మనసు మనోవేదన!!!! ఎంత ఆపుదామనుకున్న ఆయువు ఆగడంలేదే, ఇక ఆపెయ్ అని అన్న గుండె తాళం ఆగట్లేదే!!!! నా తప్పు కాదు సుమీ నేను ఇంకా బ్రతికి ఉండడం, నా కట్టె కాలే వేళ నా మనసున ఉన్న నీకు మంట తగిలి భాధ కలుగుతుందేమోననిచిన్న భయం అంతే...... Date :- 17/04/2014

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qO3kL9

Posted by Katta

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (పాడు పడిన కారు) ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నో ఏళ్ల నుండి ఓ కారు పడివుంది అలాగే కదలకుండా... నడిపే డ్రైవరు నిర్వాకంవల్ల... దర్జాగా కూర్చొని శాసించే శక్తుల వల్ల... చిన్ని చిన్ని మరమ్మతులు వస్తే పట్టించుకోకపోవటంతో, ప్రయివేటు కారు మోజు పెరగటంతో... పడివుంది నిశ్చలంగా కారు తుప్పు పట్టిన నల్లని ఎముకల గూడులా... పనికిరాని దని పారేయరు, పాత ఇనప సామాను కొట్టుకు పడేయరు, పడివుంది ఆ కారు శవం- పైవాళ్ళెవరో వస్తే నిజాయితీకి ఆధారం ఆ కారట! పొద్దున్నే కళ్ళు తెరవగానే ప్రాంగణంలోని చెట్లు, మొక్కలు కారును చూసి కాసేపు రొజూ ఏడ్చి మళ్ళీ మామూలు పనుల్లో మునిగిపోతాయి, కారు శవాన్ని కన్నెత్తి కూడా చూడకుండా ప్రయివేటు ఏసి కారులో వచ్చే అయ్యగారి కోసం ఎంత కాలం గడుస్తున్నా ఎదురుచూస్తుంటాయి వెచ్చని సంపదలు... ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో పడివున్న ఆ కారును చూసినపుడల్లా నాకు గుర్తుకొచ్చేది మన దేశం, మన దేశంలో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం. 17-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qNOCUs

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి|| సింధూరం|| తల్లి గర్భంలో తనయులు ఇద్దరు ఇద్దరివీ వేరు- వేరు మతాలు ‘ప్రసవానంతరం జీవితం ఉంటుందా! ’అడిగిందొకప్రాణం ‘నమ్ముతున్నా.. అది అందుకోవడానికే సిధ్ధమౌతుతున్నా’ వచ్చింది సమాధానం.. అదీ ఒకజీవితమేనా! అందుకుంది మాటని.. "ఏమో! అక్కడేదో ఉంది ఇక్కడికన్నా భిన్నంగా.. ఎక్కువ వెలుతురుంటుందట.. కాళ్ళతో నడిచి నోటితో తినగలం మనం.. " మళ్ళా సమాధానం "నడకా!.. వల్లకాని పని.. తిండా..! బొడ్డుతాడే.. పోషించు.. పుట్టాక ఈ జీవితాన్ని వదిలేయాలి మనం పుట్టినోళ్ళెవరూ మళ్ళా తిరిగిరాలేదు.. పుట్టడమంటేనే జీవితానికి అంతం ఆ వెలుగుల చీకటి కాటికి పంపి మళ్ళా ఇక్కడికే తెస్తుంది మనల్ని.. మొన్నెప్పుడో బొడ్డుతాడు చెప్పిందిలే" "..ఏమోలే.. నీ మాటలు కనీసం అమ్మనైనా చూడగలం బయట తలపెడితే.. తనూజులను బాగా చూసుకోవడంలో తల్లి తరువాతే ఎవరైనానట.. తెలుసా!" "అమ్మను నమ్ముతున్నావా!.. నీ చుట్టూ ఉన్నది అమ్మకాదా అమ్మంటే ఉమ్మనీరు.. ఆమె కనిపించడం లేదు కాబట్టి ఆమె లేనట్టే.. అమ్మ అనేది దేవుడిలానే ఒక భావన అంతే.. " ప్రపంచం 'మాయిపొర'లో ఇరుక్కున్న సహోదరుడితో అనునయంగా ఇలా అన్నాడు అన్న. "ఇప్పుడైనా.. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆమెను వినగలం.. అనుభూతి పొందగలం. ఈ గర్భానికి అవతల ఒక వాస్తవం ఉందని నమ్ముతాను పుట్టాక అమ్మ ఒక వాస్తవం.. ఆమె ప్రేమ ఒక వాస్తవం విడిగా జీవించడం ఒక వాస్తవం కష్టం, నష్టం, ఇష్టం.. ఇవన్నీ వాస్తవాలే అవుతాయప్పుడు అప్పటి కన్నా ఇప్పుడే బాగుందని చీకటిలో అనుకోవద్దు. చూడని వెలుగులోకాన్ని కాదనవద్దు ఒక జీవితకాలపు ప్రయాణం చెయ్యాలి మనమిద్దరం తట్టుకోలేక రోదిస్తాం.. అయినా సరే వెలుగు చూడాలి.. విడివిడిగా మరణిస్తాం.. అయినా సరే .. ముందో-వెనకో కలిసి నడవాలి ..పద" మంటూ బయల్దేరిందా సమాధానం ఆ తల్లి.. కర్మభూమి ఆ తొలిబిడ్డ సింధూరం ==17.4.2014==

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hOtw70

Posted by Katta

Sri Gajula కవిత

దొరల గడీల ద్వారాలు // గాజుల శ్రీధర్// 9849719609 దొరల గడీల ద్వారాలు తెరుచుకుంటున్నాయి ద్వారపాలకులారా బహుపరాక్! బహుపరాక్! అంగరక్షకులారా జయహో! జయహో! “ప్రగతి కాముకులారా” కరస్పర్శల తన్మయత్వంలో మునిగి తేలుదాం రండి! 1 రాజుగారి అంబారీ ఊరేగింపు సంబురాలకు ముసుగులు వీడి దిగంబరులమై దిసమొలల్తో పునీతులమవుదాం రండి! ఉరకలెత్తిన ఉస్మానియా నెత్తుటి ఆకాంక్షలకు సకలజనుల ఆత్మగౌరవ స్వప్నాలకు సూసైడ్ నోట్ సిద్దం చేద్దాం మంట రగిల్చిన మానుకోటకు సమాధి కడదాం "ఉధ్యమ ప్రారంభకుడను నేనే విజయాన్ని భుజానికెత్తుకుని ,పూలగుత్తి చేతబూని పోరాట ముగింపు గీతాన్ని ఆలపించిందీ నేనే " ‘అధినేత’ డిక్లరేషన్ కు తబ్బిబ్బై నాగేటి సాల్లల్లో నాటిన విత్తులు మొలకెత్తకుండా పిడికెడు విషం చల్లుదాం రియల్ /రీల్/కార్పోరేట్ /మైనింగ్ మాఫియాల మాయాజాలపు వలస పాలన కొనసాగింపుకు ముసుగులు వేద్దాం స్వయం పాలన నినాదం గొంతు చుట్టూ అనకొండాల పట్టుతో ఊపిరినీ నలిపేద్దాం ఐలమ్మ తల్లికి తరతరాల తల్లుల దుఃఖాన్ని కానుకగా ఇద్దాం నాయకమన్యుల వాగ్ధాటికి ముగ్ధులమై సమ్మోహనా శక్తికి సాగిలపడి సాష్టాంగ ప్రణామాలు చేద్దాం మన కలల నెలవంకల్ని గడీల వారసత్వపు గుంజలకు కట్టివేద్దాం పిడికిళ్ళు జతకట్టకుండా వేళ్ళ మధ్యనే బ్రహ్మ జెముడు ముళ్ళను నాటుదాం 2 దళిత/బి.సి ముఖ్యమంత్రి మైనారిటి దిప్యూటి సి.ఎం నవ/సామాజిక/బంగారు తెలంగాణ ఏదైనా ఏలిన వారి పాదాల చెంత పదిలం రాజ్యాధికారం ప్రజలదే అఖిలపక్ష శిఖరాగ్ర కూటమిలో కుదిరిన ఒప్పందం సకల జనులారా విస్తర్లు పట్టుకుని సహా పంక్తికి పయనం కట్టండి పెట్టుబడి ప్రాకారాల కాపలా పత్రికల ముఖాలపై అభినందనల అక్షరాలు చల్లి పరవశించి పోదాం 3 ఆధిపత్య మిన్నాగు పార్టీల/ కూటముల గేట్ల ముందర కుబుసం విడిచి వేయి తలలతో బుసకొడుతున్నది దొరల గడీల ద్వారాలు తెరుచుకుంటున్నాయి పదం పాటై గజ్జె కట్టాలే పల్లె బొడ్రాయికాడ పిడికిళ్ళు మొలవాలె గోలుకొండ కోట ముందు పీరీలు బోనమెత్తాలె దొరల గడీలల్ల దళితవాడలు వెలిసి నవతెలంగాణకు నాంది పలకాలె సబ్బండ జాతుల సింగిడి జనతెలంగాణకు జైకొట్టి కదలాలె పొడిచిన తొలిపొద్దు సముద్రానికి పురుడు పోసింది చిరు అలల కెరటాలకు స్వాగతం పలుకుదాం రండీ..... 31/03/2014

by Sri Gajula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j4YlRi

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -4 ----------------------------------------- నరహంతక వైరస్‌ - - - - - - - - - ఇషాక్‌ మహ్మద్‌ సోకిన వ్యక్తినే బలి కోరేది ఎయిడ్స్‌ ఎయిడ్స్‌ కన్నా ప్రమాదకరమైన ఓ వైరస్‌ను ఇప్పుడు నిరంతర రక్తదాహంతో లేపారు రాజకీయపు కుతంత్ర నాయకులు గుప్పిన భావ కాలుష్యంలోంచి పుట్టిన వైరస్‌ ఇది ఈ వైరస్‌ సోకిన కళ్ళకు ఎదురు పడ్డది పరమతస్తుడైతే చాలు పరమ శత్రువైపోతాడు నిన్నటి వరకు భాయీ భాయీ అన్నా చేయి చేయి కలుపుకు తిరిగినా ఆ భాయినే కబళించే వైరస్‌ ఇది ఈ వైరస్‌ సోకిన మనుషుల నుండి మానవత్వం నెట్టి వేయబడుతుంది అమానుషం ఆవాసమొస్తుంది ఈ రోగం సోకిన వ్యక్తి నడిచే నరహంతక యంత్రం (AZAAN -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m9agmm

Posted by Katta

Harika Haari కవిత

హారిక / ప్రేమ ఊసులు 17/04/14 ఆశల పందిరి అల్లుతున్నా , అందమైన నీ ప్రేమ ఊసులతో...! మనసు పొదరింటిలో దాచి ఉంచుతున్నా మదురమైన నీ ప్రేమ మాధుర్యాన్ని ...! పెదవులపై పదిలపరచుతున్నా , పరిమళించేటి మన ప్రణయ గాధను...! హృదయమందిరంలో కొలువుంచుతున్నా , నా హృదయాంతరంగాన్ని మీటేటి నీ అందమైన ప్రతిరూపాన్ని..! కనుల కొలనులో వికసిస్తున్నా , కనుమరుగవని నీ కన్నుల కాంతి రేఖనై ... మన ఇద్దరి కలయికకై వేచి చూస్తున్నా కోటి కాంతుల ఉషోదయాన్నై ...! - హారిక

by Harika Haari



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1laoq2R

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qN7a7k

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/The Banyan తనను మళ్ళా ఈరోజు కలిశాను చాన్నాళ్ళ తరువాత ఏం మారలేదు అవేకళ్ళు అలానే చెక్కిళ్ళు కొంత పచ్చదనం అక్కడక్కడా ముఖాన గాలికళ్ళజోడు చేతులకు ఒడిలిన గాజులూ ఇంతకుముందు రివ్వున తిరుగుతుండేది అటూ ఇటూ ఊరంతా తనను చూపిస్తూ అంతావచ్చి తన వాకిట్లోనే పొద్దూకులా /ఇప్పుడు వయసయిపోయాక ఒక్కళ్ళు పట్టించుకొనేవాళ్ళు లేరు మునుపు యవ్వన్నాన్ని తనువంతా పోసుకునేది ప్రతి వసంతానికీ /ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా తనువు దోచుకున్నాక మిగిలిన గాయాలను తడుముకోవడంలోనే జీవితం అంతమయ్యింది ఓనాడు లేపనమైన తను నేడు తన దేహం పైన నివురుగప్పిన పుళ్ళకి అరువడుగుతోంది ప్రతిఅంగాన్ని పంచుకున్నవాళ్ళే ప్రాణాలనుపోసినోళ్ళు లేరు /కొందరికి ఇల్లయింది మరికొందరికి ముడిసరుకయింది అయినాతీరని దాహంతో ఇంకా వేరుచేస్తూనే ఇకఇప్పుడేం చేస్తుంది మోడుబారిపోయాక రాని వసంతం కోసం ఎదురు చూడడం తప్ప తిలక్ బొమ్మరాజు 10.04.14 17.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l5zYJ2

Posted by Katta

Srinivasa Balaji కవిత

శ్రీనివాస బాలాజీ ॥ విస్పోటనం - 1 ॥ నీ చల్లని చూపే సర్వరోగ నివారిణి నీకు మరో రూపమే ఈ పంచభుతాలు, నీ ప్రేమకు కొలమానాలు లేవ్, నీ ప్రేమే నా సమస్తం నిన్ను తలచుకోగానే ప్రతి కణాన ప్రకంపనలు. చిన్నప్పుడు, కాళ్లకు నడవడం, ఉరకడం తెలుసని గుర్తొస్తది నువ్వు ఎదురవ్వగానే, చేతులు చిన్నవై పోతాయి నిన్ను కౌగిలించుకోవాలని చూస్తే, యుద్దరంగాన సైనికుడిలా, పరుగు పందెంన పోటిదారుడిలా, ఆకలితో ఉన్న పులిలా, ఒక్కసారిగా ఊపిరిబిగబట్టి రెండు చెతులు చాచి "అమ్మా" అని బిగ్గరగా అరుస్తూవొచ్చి గట్టిగా వాటెసుకోవడమే తెలుసు. పనిలో పడి నువ్వు ఎక్కడ యమారుస్తావోనని అల్లరి పనులు , అకాతాయి తనం బయటికొస్తవి, నీ చేతి దెబ్బలు తినాలని. బురద గుంటలు, మట్టి మరకలు మంచి దొస్తులైతవి, అవియూ నిన్ను నన్ను దగ్గర చేసెవే కదా. తోబుట్టువులే బద్ద శత్రువుల్లా కనిపిస్తారు అప్పుడప్పుడు నిన్ను నన్ను వేరు చేస్తే అక్క, తమ్ములతో పాటు నేను ఉన్ననని గుర్తుచేసే తల్లో పెలైతె నా పాణ స్నేహితులే, అవి అయ్యే కిటుకు తెలిస్తె అన్నం పెట్టి పొసించే వాణ్ణి నాకు నీ ఒళ్లో తలపెట్టి పడుకోనే అవకాశం వచ్చెదప్పుడే. ఓ రాత్రిలో సరిగ్గా సదువమని నాన్న మోట్టికాయలు వేస్తుంటే పడుకో ఇక, ఈ యాల వానికేం తలిగినవ్ అనగానే ఎంతో ఊరటదొరికెది. ఎక్కడున్న, ఎంత పనిలో ఉన్న, నీ పట్ల ఉన్నభావాలన్నీ ఇలా విస్పోటనం చెందుతూనే ఉంటాయి. 16.04.2014

by Srinivasa Balaji



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l5wVRa

Posted by Katta

Rajeswararao Konda కవిత

నమస్తే.. నేస్తమా..! @ రాజేష్ @ 17-04-14 నామినేషన్లతో నేతల హడవుడి ఊరంతా చేస్తున్నారు సందడి..! పార్టీ 'బి ' ఫారం అందుకున్న అభ్యర్ధులు ఓటు కోసం చేస్తున్నారు అభ్యర్ధనలు..! గేలిచేందుకు గల్లీ గల్లీ తిరుగుతూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు దండాలతో..! ఎవరి వాగ్దానాలు ఎలా ఉన్నా హామీల హంగులతో అల్లుకుపోతున్నారు నేస్తమా..!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hNYpbA

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//అమ్మ ప్రసాదం// పంట పండితే ఏట మొక్కుకొని చిన్నప్పుడే కొనుకొచ్చాను.. "ఉ" అనగానే ఒక్కవేటు వెనక్కిచూడకుండా వచ్చేసాను. ఊరంతా వచ్చారు భొజనానికి అమ్మవారి ప్రసాదం అద్బుతమైన రుచి అన్నారు బరకం మీద బాసీపట్టు వేసుకొని నేనూ ఓ ముక్క నోట్లో పెట్టుకున్నాను రుచి ప్రేమగా ఉంది; కళ్లలో నీరు ఎడమ చేతి గుప్పెటలోకి ఎప్పుడొచ్చిందో తెలీదు పచ్చగడ్డి ----------------------- పొట్టేలు ఒకటి గుడి వెనుక నుంచి పారిపోతోంది వెనకాలే యజమాని అరుస్తూ...పరిగెడుతూ...17.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j4kuhw

Posted by Katta

Kamal Lakshman కవిత

మా ఆసరా చిత్ర సౌరభాలు లో విజేత గా నిలిపిన నా కవిత.... మరపురాని చిటపట చినుకులు........... నా అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టిన తొలినాడు జిల్లా స్థాయిలో పరుగు పందెంలో ప్రధమురాలినైన నాడు పదవ తరగతి ప్రధమ శ్రేణి లో నిలిచిన తొలి బాలికనైన నాడు మా ఊర్లో పట్టభద్రురాలిగా తొలి మహిళనైన ఆనాడు నా ఉద్యోగంలో తొలి సంపాదన నార్జించిన నాడు ప్రేమ పెళ్లి ముత్యాల పందిరిలో వైభవంగా జరిగిన నాడు ఖండాంతరాలు దాటి ప్రశంసలతో వేదికనెక్కిన ఆనాడు మాతృదేశం లో తిరిగి ఆనందం తొ అడుగిడిన ఈ రోజు నా తలిదండ్రులు మిక్కిలి మురిసి ముద్దులిచ్చిన ఈ రోజు మరిచిపోలేని మధురమైన నా ప్రతి జీవన మజిలీలో కురిసిన ప్రతి చినుకూ నాతో పెనవేసుకున్నసంభ్రంబమే ఆనందోత్సాహాల నాట్య మయూర రసకేళీ విలాసమే కమల్ 17.04.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j3C6va

Posted by Katta

Gundampati Vijaya Saradhi కవిత

విజయ సారధి / / కాలం // కాలాన్ని కత్తిరిద్దామని సూర్యున్ని కత్తెర అడిగితే సవ్వి ఇలా అన్నాడు. "కాలం కత్తెర కు అందని ఓ అపురూపమైన వస్త్రం. అది నీ జీవితం పై కప్పుకొన్న ప్పు డు చిల్లులు పడకుండా జాగ్రత్త పడు..లేదంటే వృద్ధాప్యం అనే చలి కాలం లోని వణుకు భరించలేవు" అని. 17-4-2014.

by Gundampati Vijaya Saradhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j3C7PH

Posted by Katta

Phanindrarao Konakalla కవిత

ఫణీంద్ర// ఉదయం.. కవి హృదయం //17.04.2014 నడుస్తున్నా.. పొద్దుపొడవని ఉదయాన, ఊహలు నిండిన హృదయంతో, ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ, నన్ను నేను మరచి.. నడుస్తున్నా! మంచువానలో స్నానమాడి, తడిచెదరని ఒంటిపై, అక్కడక్కడా నీటిముత్యాలద్దుకొని, చెమ్మ వాసనలని అందిస్తూ, కనులవిందు చేస్తోంది..దారికి ఇరువైపులా.. ఒత్తుగా పెరిగిన పచ్చిక. పచ్చ చీరపై తెల్లటి చుక్కలద్దినట్ల్లు, చిన్ని చిన్ని గడ్డిపూలు, చిరుగాలికి తలలూపుతూ.. చిత్రంగాకదులుతున్నాయి! ఈ అందాలని,మరింత అందంగా చూపగల మంచి ఛాయాగ్రాహకుడిని కాకపోతినే! ఎత్తుగా దట్టంగా పెరిగిన చెట్లు..చిక్కగా అల్లుకున్న పొదలు, పొదలపై అటూ ఇటూ చిందులువేస్తున్న పక్షుల కుహు కుహులు.. ప్రతి కుహు కుహులోనూ పలుకు తోందో రాగం మరి ఈరాగాల పరవశంలో ప్రతిస్పందించి, సుమధుర రాగాలు సృస్టించడానికి నేనో సంగీత సామ్రాట్టుని కాకపోతినే! దూరాన ఎత్తయిన కొండలు.. కొండలమీంచి దుముకుతున్న జలపాతాలు పొగమంచు పరదాలమాటున దూరంగా విసిరేసినట్లు, అక్కడక్కడా రెల్లిపొదరిళ్ళు చూడటానికి మనోహర దృశ్యకావ్యం! ఈ ప్రకృతి అందాలను చిత్రించగల ప్రతిభే ఉంటే అదో కళాఖండం కాదా మరి? అయ్యో అంత ప్రతిభగల చిత్రకారుణ్ణి కాకపోతినే! నడుస్తున్నా.. ప్రతి ఉదయం నడుస్తూనే వున్నా.. చూస్తున్నా.. ప్రతి రోజూ చూస్తూనేవున్నా.. ఈ ప్రకృతి సౌందర్యాలు! ఈ అందాలని అనుభవిస్తూ..చిత్రమైన భావోద్వేగంతో.. ఈ అనుభూతులను కవితాక్షర ముత్యాలుగా పేర్చి, ఓ కవితకి రూపమిచ్చి,ఆనందించే.. ఓ చిన్ని కవిని మాత్రమే ! .......17.04.2014

by Phanindrarao Konakalla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qM9yew

Posted by Katta

John Hyde Kanumuri కవిత

రాత్రంతా వర్షం కురుస్తోంది ||John Hyde Kanumuri || వేకువనే తనువంతా అరగదీస్తూ వాకిలిని ఊడ్చిన చీపురును ఎవరు పలకరిస్తారిప్పుడు ఏదోమూల అలా స్తబ్దుగావుంది బురదనిండిన వాకిలిని చూసావా పాదానికి అంటకుండా అక్కడక్కడా వేసిన రాళ్ళపైనుండి అంగలువేస్తూ నడవడం గమనించావా! పొటమరించిన అంకురాలతో నునులేతపచ్చరంగు అలుముకొని శింగారించుకుని నారుమడులు, నాట్ల మధ్య ఆరేసిన పొలాల కలనేత ఊరు బురదవీధుల్లో నడిచెళ్ళిన పశువులమధ్య గిట్టలగుర్తులతో ఆవేదో, గేదేదో, ఎద్దేదో ఎటుగా వెళ్లిందో పసిగట్టడం నేర్చావా! పశువులను తోసుకుంటూ నీరునిండిన గుంతలను దాటుతూ సన్నగా కురిసే చినుకులకు పలక నెత్తినపెట్టి పరుగెట్టి బడి గిలకబావిని చేదుకున్న నీళ్ళో కడుకున్న కాళ్ళో గమనించావా! ఈ రాత్రంతా వర్షం కురియాలి గుమ్మపాల నురగలతో స్వచ్చతనేదోవెతుక్కుంటూ వాకిట నిలబడి నీకోసం పడవలను వదులుతాను! .......original......23.7.2013

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1meOawt

Posted by Katta

Chi Chi కవిత

_ బూతు _ ఒళ్లనుకోడం తెలుసుకానీ ఒంట్లో ఉన్నవన్నీ తెలుసా అంటే గుక్కలతో మింగిన బుక్కులన్నీకక్కునే నకాలజ్ఞానులం!! ఇంకా ఉంది..ఇంకా ఉంది ప్రకృతికి ప్రపంచం తెలీదు పాపం పురుషుడు పుస్తకమయ్యే వరకు!! రారా నా పురుషా.. నువ్వు కొడుకెట్టయితావ్ పుస్తకం లేకుండా మాటలేకుంటే అమ్మెవరు అబ్బెవరు.. పురుషార్థం పుణ్యమయితే మల్ల పాపమేంది??మనిషార్థమా!! స్త్రీ అంట తు.. నీ దాంట్లో దాన్ని పెట్టా సన్నీలియోన్ కి శ్రీ కృష్ణుడికి తేడా లేదని తెలుసుకో పుస్తకం లేకుండా!! సత్యానికి సంస్కారమో హింస అందుకే ఆత్మగౌరవం అడుక్కుంటుంది మర్యాదని అసలా మర్యాద కోరే మదమే ఆత్మ,ఆత్మగౌరవం పుస్తకంలో పుట్టడానికి కారణం మర్యాదకి మదమెక్కువ..తీస్కున్నoతిచ్చుకోలేదు అందుకే పుట్టాయి మర్యాదస్తుల మౌనంలో బూతులు పుస్తకంలో!! పిసుకు పెట్టు తీ..పిసుకు పెట్టు తీ.. అయిపొయింది కథ మల్ల ఈ గబ్బు కథల కోసం పేటెంట్లు , పెంట్ హౌసులు , పోర్న్ సైట్లు.. రాసేటోళ్ళ అంగాలను చదివేటోళ్ళ నోట్లో పెడితే పుట్టే పుస్తకాలాడుoటయో బూతు ప్రకృతి సహజం.. అది లేకుండా బతకలేం అనేవాళ్ళ కోసం.. ఇంకా ఉంది..ఇంకా ఉంది నేరం సహజం శిక్షా సహజం..రెండూ ఆగవ్ మరణం మౌలికం , బతుకు తాత్కాలికం అరచేతిలో ప్రపంచం , మానమో మోసం కోపమొచ్చినోళ్ళు మింగేయండి..లేదంటే కొంప కైలాసమైపోద్ది ఎందుకంటే ఇదంతా కొంపల్లో కుంపట్ల గురించే బూతు లేని భాషలు , ఇళ్ళు , ఊళ్లు ..... లోకం లేదు చూడాలనుకుంటే ప్రతి మాటలో నీతి బూతు రెండూ కనిపిస్తాయేమో మాటకి ,దానర్థానికి సంబంధం లేకుండా!!___________(17/4/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tbZDAU

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

మౌన భంగం ----------------- రావెల పురుషోత్తమరావు మనసు పరి పరి విధాలా పరుగెడుతుంది దరిజేర్చుకుని ఓదార్చే మనుషుల్లేక గుండె గుప్పిట్లోకి జారి గోడాడుతూ ఘోషిస్తుంది తన అనే వాళ్ళు దొరక్క. మనసు మందిరంలా పవిత్రంగా ఉంచుకునే వాళ్ళతోనూ గుండెను గూడులా గుదిగుచ్చుకునేవాళ్ళతోనూ సమస్యలు తలెత్తవు. స్వార్ధం సంకుచితత్వం నింపుకునే మనీషుల అంతరంగాలనూ అన్వేషించాలన్న తపన బయలుదేరినప్పుడే తకరారు తన్నుకుంటూ బయటకొచ్చేది. గోముఖవ్యాఘ్రాల్లాగా కొందరు గోప్యంగా ముసుగులేసుకుని తిరుగుతారు. పయోముఖ విషకుంభాల్లా మరికొందరు జలదంబోధి పరీత భూ వలయాన్నంతటినీ జల్లెడపడుతున్నట్లు నటిస్తూ నయవంచన గావిస్తారు. చీకటిపడకుండానే వీళ్ళ ముఖాలు చిరుదివ్వెలను సైతం చిదిమేయాలనే యత్నిస్తూ ఉంటాయి. మానినీ మానభంగాలను మాయోపాయంతో జరిపేస్తూ ఉంటారు. సూర్యుడస్తమించకుండానేకొందరు శూన్య దృక్కులను వెంటేసుకుని అంగనల అంగాగసౌందర్యాన్ని అంగళ్ళలో అమ్మజూపుతూ సంచరిస్తూ ఉంటారు. దినకరుడు సైతం వీళ్ళ చర్యలతో దిగ్భ్రాంతి పడుతూ దిగ్గున చిరాకు పడుతుంటాడు. మనిషికీ మనసుకూ బేధాలున్నప్పుడే వాళ్ళలో దానవత్వం దయలేకుండా ప్రవర్తిస్తుంది. గుండెకూ గుణానికీ లింకు కుదరనప్పుడే గుహల్లో క్రూర మృగం లా కుటిలత్వంతో నర్తిస్తుంటుంది. అన్నింటినీ ఒకేగాటన కట్టేయలేని జగత్తు మౌనాన్ని మింగిన పాములా మూగయై రోదిస్తుంది. బెల్లంకొట్టిన రాయిలా జడరూపమై ఘనీభవించి స్థాణువై మిగిలిపోతుంది.17-4-14 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ X

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qLEcVg

Posted by Katta

Afsar Afsar కవిత

కవిత్వంతో కరచాలనం-4 “వజీర్ రహ్మాన్ గారిని ఇవాళ ఎవరూ ఎక్కువ తలచుకుంటున్నట్లు లేరు, మళ్ళీ ఆ కవిత్వం చర్చల్లోకి వస్తే బావుండును!” అని ఈ మధ్య మైథిలి అబ్బరాజు గారు అన్న మాటలు వజీర్ రహమాన్ గురించి మళ్ళీ ఆలోచించేట్టు చేశాయి. వేరే సందర్భంలో రాసిన వ్యాసంలోంచి కొంత భాగం ఇక్కడి కవిమిత్రులతో పంచుకుంటున్నాను, కవిసంగమం మిత్రులకి చాలా మందికి వజీర్ కవిత్వం కొత్త అనే ఉద్దేశంతో, ఆయనతో ‘కరచాలనం’ చేయించాలన్న కోరికతో..... * * * పుస్తకాలుంటాయి. అందులో అక్షరాలూ వుంటాయి. ఉత్తరాలుంటాయి, అందులో పలకరింతలూ వుంటాయి. కానీ, వొక వ్యక్తి పరిచయం అంతటితోనే ఆగిపోదు. అప్పటి దాకా ఆ అక్షరాల్లోంచీ, ఆ పలకరింతల్లోంచీ చూసిన వ్యక్తిని కలవాలని కూడా అనిపిస్తుంది. అప్పటిదాకా కలిసి పంచుకున్న పరోక్ష అనుభవాల సందోహంలోంచి వొక ప్రత్యక్ష బంధం భిన్నమయిన అనుభవంగా మారుతుంది. దాన్ని స్నేహమో, ఆత్మీయతో, ఆత్మ బంధుత్వమో అనుకోవచ్చు. కానీ, అంతగా కలవాలని కోరుకున్న ఆ వ్యక్తిని మనం ఎప్పుడూ చూడనే లేదనుకోండి, అప్పుడెలా వుంటుంది? వజీర్ రహమాన్ గారిని తలచుకున్నప్పుడల్లా నన్ను ఈ దిగులు ఆవరిస్తుంది. ఆయన కన్ను మూసే సమయానికి (1983) నేనింకా కవిగా సరిగా కన్ను తెరవలేదు. కానీ, కవిత్వం చదవడం, దాన్నే మననం చేసుకుంటూ గడపడం అప్పటికే చాలా ఇష్టమయిన వ్యాపకంగా మారింది. వజీర్ కి కవిత్వం అంటే ప్రాణమే కానీ, అంత కంటే ఎక్కువగా స్నేహితులంటే ప్రాణం. వాళ్ళతో గడపడం, వాళ్ళకి ఉత్తరాలు రాయడం ఆయనకి ఇష్టమయిన వ్యాపకంగా వుండేదట. ఫోటోగ్రఫీ ఇష్టం. అన్నిటికంటే ఎక్కువగా ఆయనకి కాలేజీలో లెక్చరర్ గా పని చేయాలన్న కోరిక వుండేదట. కానీ, జీవితం వొక్కో సారి ఎంత అన్యాయంగా వుంటుందంటే, ఆ వొక్క పని తప్పా, ఉపాధి కోసం ఆయన ఇతర అన్ని టెక్నికల్ పనులూ చేయాల్సి వచ్చింది. “ఎచటికి పోతావీ రాత్రి?” 1963లో అచ్చయ్యే నాటికి ఆయనకి 29 యేళ్ళు. అప్పటికింకా ఆయన ఉద్యోగన్వేషణ కూడా పూర్తి కాలేదు. జీవితాన్ని వొక అందమయిన కళగా పూజించాలనుకున్న ఈ స్వాప్నికుడు వొక స్థిరత్వం లేక, వొక కుదురు చిక్కక సతమతమయిపోతూనే బతికాడు. ఆయనకి దక్కిన వొకే వొక్క అపురూపమయిన స్వప్నసంపద చంపక- చలం గారి కూతురు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వజీర్ గానీ, చంపక గారు గానీ, చాలా అరుదుగా ఇల్లు వదిలి ఇంకో చోటికి వెళ్ళే వారు. ఇస్మాయిల్ గారింటికి కూడా పెద్దగా రాకపోకలు వుండేవి కావు. చలం అనే మహాచెట్టు కింద వొదిగిపోయిన తరవాత వజీర్ కి ఇంకే లోకమూ అక్కరలేకపోయింది. వజీర్ ఇలా చెప్పుకున్నాడు 1963లోనే: అవును, నా కవిత్వ సాధనలో చరణ చరణమూ అతని ప్రభావం, పర్యవేక్షణా. నా జీవితంలో నిమిష నిమిషమూ అతని రక్షణ హస్తం, ప్రోత్సాహం నాకు. అతనిచ్చిన బలంతోనే చూపిన అతని తోవ వెంటనే ఈ నడక నాకీ నాడు – మధురానంద కవితాకాశంలోనూ దుర్గమ జీవన కీకారణ్యంలోనూ. చలం చాలా మందిని ప్రభావితం చేసిన గొప్ప శక్తి. అనుమానమే లేదు. కానీ, వజీర్ దగ్గిరకి వచ్చేసరికి చలమే ఈశ్వరుడు. ఇలా ఆలోచించడం సరికాదని నాకూ తెలుసు కానీ, వొక దశలో చలం నీడ వదులుకొని వుంటే, వజీర్ ఇంకో దారి పక్కన ఇంకో పూల చెట్టుగా అందంగా నిలబడి వుండే వాడేమో! చలం వొడిలో అతనొక మొక్కగా మాత్రమే మిగిలిపోయాడేమో! కానీ, ఇది జీవితం కదా! అలా అనుకోనిస్తుందా జీవితం?! ఎవరి దిగుళ్లు, ఎవరి సంతోషాలు ఎలా వుండాలో వాళ్ళకే తెలిసినంతగా మనకి తెలియదుగా! అంత మహావృక్షం నీడలో కూడా వజీర్ 1963 కవిత్వం నించి 1983 నాటి “సాహసి”దాకా వొక అందమయిన continuity ని సాధించాడు. వజీర్ కవిత్వం మీద పరిశోధన చేసిన నా తమ్ముడు ఇక్బాల్ చంద్ మొన్న అంటున్నాడు: “నా దృష్టిలో జీవితాన్ని కవిత్వంలోకి కుదించడం కంటే కవిత్వంగా జీవించడం బాగుంటుంది. వజీర్ అలా కవిత్వంగా జీవించారు. అలా జీవించడం ద్వారా కవులు షరా మామూలుగా బతికే మోసపూరిత జీవనాన్ని ఆయన తిరస్కరించాడు. అందుకే, చివరి వాక్యం దాకా వజీర్ లో ఆ తీవ్రత, ఆ జీవన లాలస!” కవిత్వం విలువ ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ కవిత్వ పంక్తులు కొన్ని సీదా మన జీవితాల్లోకి దారి వెతుక్కున్నప్పుడు – అంటే – ఆ వాక్యాలు మననం చేసుకునే సందర్భాలు మన జీవితాల్లో దొరికి, వాటిని మనం తిరిగి చదువుకున్నప్పుడు! అంటే, అనుభవమే కవిత్వానికి ‘కోటబిలిటీ’ ఇచ్చినప్పుడు! వొక గాఢమయిన అనుభవం తట్టి పలకరించినప్పుడల్లా ఆ వాక్యాలు మనల్ని ముసురుకుంటాయి. వజీర్ కవిత్వంలో అలాంటి కోటబిలిటీకి కరువు లేదు. ఆయన్ని తలచుకున్నప్పుడల్లా అతనే రాసుకున్న వొక పంక్తి నాకు భలే గుర్తొస్తుంది: ఇదేం లేదనుకో మర్చిపో నేనేం కాదనుకో రాలేదనుకో – అని వారిస్తావు కాని, నువ్వు లేని నన్ను వూహించడమే భరింపరాని బాధయి నేనెట్లా మరవగలను? నీ ఆలోచనే చాలు, నా నరాలు తిరగబడి బాధతో పదునెక్కి ప్రేమతో, మోహంతో మధుర జ్నాపకాలతో రౌద్ర సముద్రుడి వలె విలవిలలాడిపోతాను. వొక్కో సారి మనకి బాగా ఇష్టమయిన కవి హటాత్ నిష్క్రమణ అనిపించేది అదే కదా! వొక్కటే వూరడింపు ఏమిటంటే ఆ అక్షరాలు మిగిలి వుంటాయి వెచ్చగా!

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tbsYvq

Posted by Katta

Naresh Kumar కవిత

నరేష్కుమార్ //ప్రేలాపన// ఎలా చెప్పమంటావ్ నేనిపుడు అనంత కృష్ణానంత శర్వనినని స్నేహితా...! నిజమే పగిలిన కాలంలోంచి జారిపడ్డ క్షణాలని మళ్ళీ కోశాగారానికెత్తలేను కాలి రాలిన ధూపపు ధూమాన్ని మళ్ళీ మునుపటిలా మూటకట్టలేనుకదా అందుకే రాలిపడని మాటలనీ కూలిపడ్డ కోటగోడలనీ మళ్ళీ నిర్మించలేను నేను వెలివేసిన వెలుగును దాటి ఈ శాశ్వత చీకటి నుండి బయల్వెడలని తామసి తనయున్నయాక ఇంకెందుకు..!? నీ అశాశ్వత వెలుగు కిరణాల మూటలు నాకు నేనిపుడో కాలిపోయిన దేహాన్ని కావొచ్చు వెలుగుని భహిష్కరించిన దేశాన్ని కావొచ్చు కానీ....... ఇప్పుడు నేనో నిజాన్ని అబద్దపు వెలుగు రేకలకావలి నిశ్శబ్దపు కృష్ణ వర్ణపు రాతిరిని ఊహించకెపుడూ ఇకనా జ్వాజ్వల మానపు రక్త జ్వలనా కాంతులని కుహూరుత శీకరాల రవాలని వెలిగి వెలిగీ ఆరిపోయిన చితిని. 17/4/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eShnbp

Posted by Katta

Patwardhan Mv కవిత

మిత్రులారా!! కవిసంగమం ఒక అద్భుతమైన వేదిక.దయచేసి దీనిని మత సాహిత్యానికి వాడుకోవద్దు.వాడుకోవాల్సిన పరిస్థితే కనుక వస్తే నాణేనికి రెండువైపులా రాస్తే బాగుంటుంది.దీనిలో మనం కవులమే తప్ప పరమత///కుల నిందాకారులం కాదు.కారాదు. ఒక సంఘటనను ఒక సంఘటనగానే చూడండి.జెనరలైజ్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి.గోద్రా సంఘటన సబర్మతికి ప్రతిచర్య అనే వారూ ఉంటారు. దుర్మార్గం ,కుట్ర కూహకం మతంలో ఉండదు.మనుషుల్లో ఉంటుందని మనకు తెలియంది కాదు.ఏ మతం చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? ఏది లోపరహిత మతం??? హిందూ మతంలో భయంకర కుల వివక్షత,ముస్లీం మతంలో ఇతర మతస్తుల మీద దౌర్జన్యాలూ,కళా,సాంస్కృతిక విధ్వంసం,క్రైస్తవంలో మనుషుల ఆర్థిక బల హీనతలను ఆధారంగా తీసుకొని మత మార్పిడులను ప్రోత్సహించడం---ఇవి కొన్నే.. మనకు మతాన్ని మించిన ఎన్నో భయంకర సమస్యలున్నాయి.వాటి మీద దృష్టిపెడదాం. లౌకిక అన్న పదానికి నిజమైన అర్థంలో వ్యవహరిద్దాం.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j1L7DB

Posted by Katta