పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

Srinivasu Gaddapati కవిత

వచ్చేటి తెలంగాణ వందనాలమ్మా...... -------------------------------- // శ్రీనివాసుగద్దపాటి// ***************************************************** 1 రోణికార్తె ఎండ రోళ్ళు పక్కునబగిలి అర్వయేండ్ల పీడ అంతమైన పొద్దు పడావుబడ్డ లడాయి గడ్డన పోరుబిడ్డలఆశ పొద్దుపొడుపై వచ్చేటి తెలంగాణ వందనాలమ్మా...... 2 వలసబోయినపల్లె వొట్టిబోయినగొడ్డు నెర్రెవారిన బతుకు నోటికందని మెతుకు పిడికిలెత్తిన బిడ్డ దిక్కుతోచని తల్లి దినమొక్క గండమై ఎదురుచూస్తున్నది వచ్చేటి తెలంగాణ వందనాలమ్మా......... 3 వస్తున్నవో..... ఏమితెస్తున్నవో గాని...... పానంగ నీకొరకు పబ్బతిబట్టిన సేత ఏమి పండిస్తవో..... ఏకాయ బెడ్తవో...... పాలుబోసిన నీవె నీలుదాపిననీవె వచ్చేటి తెలంగాణ వందనాలమ్మా.... 4 నూటొక్కదేవుండ్ల ఎయినూరు యాగాలు లచ్చ కుంకుమ పూజ కోటి ఆశలతోని నాలుగుకోట్లజనము గుబులు గుండెలతోని ఎదురు చూస్తున్నది ఎట్లెట్ల వొస్తవో..... ఏమేమి దెస్తవో... వచ్చేటి తెలంగాణ వందనాలమ్మా.... 26.05.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1omhIMb

Posted by Katta

Pratapreddy Kasula కవిత

పూర్తిగా పర్సనల్‌ - కాసుల ప్రతాపరెడ్డి చిన్నోడు అమ్మ పెట్టిన ముద్దును నా చెంపలపై అద్దుతాడు నాయినమ్మ కొప్పును, రైకను పెన్సిల్‌తో రూపు కడతాడు పెద్దోడు, నిజానికి చిన్నోడు అచ్చం అమ్మలెక్కనే మనసంతా దాచి మమతను కోరుతాడు ఆమె కూడా అంతే దగ్గరికొస్తే విసిరికొడుతుంది విసిరి కొడితే దరి చేరుతుంది ముగ్గులేసినా, మాల కట్టినా నాకోసమేనే తల్లీ! ఎవరో, ఎవరెవరో, మరెవరో వస్తుంటారు, పోతుంటారు ఏదేదో అంటుంటారు ఏదీ యాదికుండది విన్నట్టూ, విననట్టూ.... పోతుంటాం, వస్తుంటాం మాటలు కూడా అడుతుంటాం ఏదీ ఉండదు, ఏదీ మనసుకంటదు మనసొక్కటే, మమత ఒక్కటే మళ్లీ మళ్లీ మొదటికొస్తది చెంపలపైనో, పెదవులపైనో ముద్దొక్కటే మిగులుతది నెత్తి కురులను నిమురుతూ చేయొక్కటే కదులుతూ ఉంటది గుండెలు రెండూ దేహం మీద తచ్చాడుతూ ఉంటయి లోకమంతా నిదురోయి నేనొక్కన్నే మేల్కొని ఉంటా రాలిపోయిన పసితనమేదో తిరిగి ఆవహిస్తూ వుంటుంది

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kEJpwK

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

రైల్లో 3 గొంతును వేణువుగా చేసుకున్నాడు గొంతువేణువులోనే సప్తస్వరాల్ని మించిన విన్నూత్న రాగాన్నేదో పలుకుతున్నాడు మాటలకు అందనిది - జీవన విషాదం నుంచొచ్చి దుఃఖం వాసన వేస్తున్న రాగం బహుశా అలానే వుంటుంది కాబోలు అతను నిజంగా యోధుడు - రైల్లో అస్తవ్యస్తంగా పడివున్న దేశపటాన్ని కలిపి కుడుతున్నాడు అందర్నీ ఏకత్రాటిపై నిలబెడుతున్నాడు కళ్లు లేకపోయినా అతని బతుకుదారికీ గొంతే కన్ను రోజూ సూర్యుడతని ముందు ఓడిపోతూనే వున్నాడు ఉదయం తరగలు తరగలుగా పోటెత్తుతున్న ఉత్సాహం గుర్రం మీద కనిపిస్తాడు సాయంత్రమూ అదే గుర్రంపై అదే తీరుగా కనిపిస్తాడు ఆ స్వరచక్రవర్తి - వొక రోజును వొక రాగంగా తీర్చిదిద్దుతున్నాడు ! రచనా కాలం : 26 మే 2014 --------------------------------- 26.05.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfLzkx

Posted by Katta

Kamal Lakshman కవిత

తెలియక చేసిన పొరపాటు... నా జీవితం లో తెలిసి తెలియక చేసిన ఒక తప్పుకు కాదు.. కాదు .. ఒక్క పొరపాటుకు అదీ నా ప్రమేయం లేని గ్రహపాటుకు ... ఎటూ తేల్చుకోలేని ఏమీ పాలుపోలేని మానసిక పరిపక్వత పూర్తిగా సంతరించుకొని నిస్సహాయ స్థితిలో తీసుకున్న నా నిర్ణయం అడుగడుగునా ... ప్రతి క్షణం.. అనుక్షణం.. ఇంత చిత్రవధకు గురిచేస్తుందని ఊహించకపోతిని పండంటి జీవితం ఇలా..... అడవిగాచిన వెన్నెలలా మోడు వారిన మానులా గమ్యం లేని గాలిపటంలా కన్నీటి ధారలుగా అశ్రు నయనాలతో ఇలా ఎంత కాలమో ఇంకెంత కాలమో ఏమో ...ఏమో...ఏమో... కమల్ 26.05.2014

by Kamal Lakshman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfLAFh

Posted by Katta

Adi Narayana కవిత

మీ కవిత చాలా బాగుంది గురువు గారు......

by Adi Narayana



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1npilT2

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

మనం !! నీకు నేనే.. నాకు నువ్వే... సర్వస్వమనుకుంటూ నిన్ను నేను...నన్ను నువ్వు... సంపాదించుకున్నాం !! ఒకరిలో రాలిన ఇంకొకరిని ఒకరినొకరం ఏరుకుంటూ ఒకరిలో ఒకరం మోకరిల్లి...ఒకరింకొకరుగా మారిపోయాం !! నీలోంచి నేను...నాలోంచి నువ్వు ...సమస్తం చేజిక్కించుకుని ఒకరికి ఎలియకుండా ఒకరం ఎవరికివారమే ఖర్చైపోయాం !! ఒక్కరమే అనంతాన్ని నింపుకొని ఇద్దరిగా అంకురించినట్లు నీవు నేనై...నేను నువ్వై... శూన్యమై మిగిలిపోయాం !! 26/05/2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfbFUR

Posted by Katta

Rajaram Thumucharla కవిత

తిలక్ లభ్య రచనల సంకలనం పై చంద్రశేఖ్ర శాస్త్రి (చం.) సింగమనేని ,రాధేయ, ప్రేంచంద్,రాజారామ్ అనంతపురం లో ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న దృశ్యం

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mfbDMF

Posted by Katta

Rajaram Thumucharla కవిత

తిలక్ లభ్య రచనల సంకలనం పై సింగమనేని ,రాధేయ, ప్రేంచంద్,రాజారామ్ అనంతపురం లో ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్న దృశ్యం

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SEQByx

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-45 నోరు తిరగక సంస్కృతాన్ని మట్టిబుర్రకి వంటబట్టక ఇంగ్లీష్ ని ద్వేషించినపుడు నాకదొక తృప్తి కలిగేది.. నా మాతృభాషకి పట్టువస్త్రాల్ని సమర్పిస్తున్న అనుభూతి కలిగేది.... ప్రతి భాష లోను తనదైన జీవమున్నది విఫలమైన క్షణం లోనే అసహనం హద్దుమీరుతుంది.. నాకది తెలిసేసరికి నాలాంటివారు నా పక్కన చాలామంది ఉన్నట్లు అర్ధమయింది...! ----------------------------------------- 26-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ozApcZ

Posted by Katta

Prasada Murthy Bandaru కవిత



by Prasada Murthy Bandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pamKvo

Posted by Katta

Mukharjee Madivada కవిత

నీ నిజాయితీకి నెత్తుటి మరకలున్నా, నీ కీర్తనతో నా రక్తం మరగదెందుకు? విజయోన్మాదంతో నువ్వు వికటాట్టహాసం చేస్తుంటే, నీవెవరో మరువని నా మనసు గొంతెత్తి అరవదెందుకు? ధనమరిగిన పొట్టలూ, ధనమెరిగిన మెదళ్ళూ, ధనం మరిగిన నీ మిత్రులూ నీ చేత కవిత్వాలు చదివిస్తుంటే, నా హృదయ కుడ్యాలు పగలవెందుకు? నీ కక్ష్యలు వీక్షిస్తూ, నీ భక్షణ కాంక్షిస్తూ, నీ శిష్యులు కక్షలలో నీ చుట్టూ పరిభ్రమిస్తుంటే, నా చక్షువుల నిప్పులు రాలవెందుకు? బహుశా మనిషిగా, నే చనిపోయి చాలా రోజులయిఉండవచ్చు! బానిసగా నే మిగిలిపోవడం చాలా నిజమయి ఉండవచ్చు! కానీ, ఒక్కటే సందేహం! నీ అబద్దాల సంద్రంలో ఒక భయానక నిజం దాగుందేమో? నీ అవినీతి రక్తం నా గుండెలో కూడా ప్రవహిస్తుందేమో? నా మీద తొలిసారి నాకే అసహ్యం! నీ విలువల్లేని అభివ్రుద్ధి కోసం అర్రులు నేనూ చాస్తున్నానేమో? "ఒక మందమతి"

by Mukharjee Madivada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S8lKdf

Posted by Katta

Trinadh Meegada కవిత

|| రెచ్చగొడితే తప్పా చిచ్చుపెట్టదు అరచేతిలో ఇమిడినా అవనినంతటినీ బుగ్గి చేసే శక్తి కలది మండి పొతూ దీపానికి వెలుగిస్తుంది మొండి చేస్తే బూడిద నిస్తూ బతుకులో చీకటి తెస్తుంది వెలుగు రేఖల గుత్తి ఇరువైపులా పదునున్న కత్తి ఖర్మ కాండలకు సంపత్తి అగ్గి పుల్లతో పంచభూతాల్లో కలసిపోతుంది ఈ తిత్తి కాదు కవితకనర్హమని కవితల్లో కొలువైన దీని నిష్పత్తి|| ……………………..మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pacR0G

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

కూనిరాగం అనే పదం అసలు తెలుగులో లేదు.. అసలు పలకాల్సింది "కూన రాగం" అని.. కూన అంటే పిల్ల, చిన్న అనే అర్ధాలు వస్తాయి.. కూన రాగం అనే పదం ప్రాచుర్యం లోకి రావటానికి గల కారణం "పెద్దగా కాకుండా చిన్నగా ఆలపిస్తున్న రాగం" అని చెప్పవలిసిన సంధర్భం ఏర్పడటమే.. ఇక్కడ కూన రాగం అంటే "సన్నని రాగం" , "చిన్న రాగం" అనే అర్ధాలలో ప్రయోగిస్తాం.. అలాగే కూన అనే పదాన్ని "పసి కూన" అంటూ మన పిల్ల గురించి చెప్పేటప్పుడో, మన పెంపుడు జంతువుల పిల్లల గురించి చెప్పేటప్పుడో వాడతాం.. కాబట్టి కూన ని కూని అని ఖూని చేయటం ఆపేద్దాం..! (ఇది కేవలం సమాచారం కోసం చెప్పిందే తప్ప ఎవరినీ కించపరచటానికి చెప్పింది కాదు) ఆధారం: సినారే. - తెలుగు కవి సత్యం జి, 26-05-2014, 14:47

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pa2GJr

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mrdY8Y

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

తెలుగు తెగులు 01/-సత్యం జి-/ --------------------------- ఒరెయ్ తెలుగోడా నీ పరభాషా వ్యామోహం తగలడ ఎందిరా నీ రగడ? తుత్తర భాషలతో ఐపోకు గడబిడ కనీసం మనస్పూర్తిగా తిట్తలేవు కదరా ఆ భషల్లో చడామడా.. ఇంకెందుకురా ఆ భాషలు మన తెలుగుండగా నీ ఫ్యాషన్లు తగలడ.. ఇకనైనా వాటెంత పరుగులిడ క కన్నమూర్తి కమ్మగా నేర్పిన అమ్మ భాష చెరకుగడ ంత తీపిని ఆస్వాదించి నీ మనవడి కి తెలుగంటే తెలీదనే తెగులు రాకుండా చూడు మడుగులో పడకుండా.. 'మన ' భాష కనుమరుగవకుండా..! -సత్యం జి, 26-05-2014, 14:33

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jTOdj0

Posted by Katta

Radha Rao కవిత

మనసు పరి పరి విధములుగ పరుగులు తీయుచన్నది ! సంగీతం అనర్గళముగ, మధురముగ పాడవలెనని ! పరుగులు పెట్టి ప్రపంచం చుట్టి రావలెనని ! కవిత లల్లి, రచనలు చేసి మనసు రజింప చేయవలెనని ! రాజకీయమున చేరి ప్రజల పక్షమున ప్రశ్నించ వలెనని ! పలుగు తీసి పచ్చని పొలములుగ మార్చవలెనని ! ఇలా ఒకటి కాదు, రెండు కాదు అన్నింటా, అన్నివేళల అదంటూ, ఇదంటూ ఒటికాదు, రెండు కాదు ఏదైనా, ఎప్పుడైనా జనం మెచ్చే, జనం కోసం ఈ జీవితం చివరి కొన ఊపిరి ఉన్నంతవరకు తపనతో ప్రజలకోసం పజలచెంతే ఊడిగంచేస్తూ ఈ నాజీవితం వందేళ్ళూ సాగాలని !!!

by Radha Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TMiaa8

Posted by Katta

Nishi Srinivas కవిత

*** तेरा साथ ***. ----------------------------- Nishi Gandha चलते चलते मैने एक सपना देखा ये ना सोचा बिछड के तुझसे जिना होगा चाहा था तेरे धडकन मे समाजाऊ... तेरे आगोश मे दुनिया के दर्द भूलजाऊ... तेरे गहरी खामोश आखो मे जिन्दगी की उदासिया डुबाजाऊ.. येना सोचा... जिन्दगी के इस सफर मे एक तेरी याद बहोत है .... पल दो पल का साथ तेरा गम भूलाने को बहोत है... मूमकिन है पाके तुझे खोना होगा येना सोचा बिछड के तुझसे जिना होगा... -Nishi Gandha 26-05-2014

by Nishi Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pqWPNo

Posted by Katta

బహుదూరపు బాటసారి కవిత

కవి మిత్రులందరికీ అభివందనం ...

by బహుదూరపు బాటసారి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TMi9TA

Posted by Katta

Nishi Srinivas కవిత

*** तेरा साथ *** ----------------------------------- Nishi Gandha चलते चलते... मैने एक सपना देखा ये ना सोचा बिछड के तुझसे जिना होगा चाहा था तेरे धडकन मे समाजाऊ... तेरे आगोश मे दुनिया के दर्द भूलजाऊ... तेरे गहरी खामोश आखो मे जिन्दगी की उदासिया डुबाजाऊ.. येना सोचा... जिन्दगी के इस सफर मे एक तेरी याद बहोत है .... पल दो पल का साथ तेरा गम भूलाने को बहोत है... मूमकिन है पाके तुझे खोना होगा येना सोचा बिछड के तुझसे जिना होगा ! - Nishi Gandha 26-05-2014

by Nishi Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nnYwvl

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tcrpKS

Posted by Katta

Saatyaki Gunturu కవిత

Warm Regards http://ift.tt/1djEEll

by Saatyaki Gunturu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mqKgB6

Posted by Katta

Sreedhar Babu Pasunuru కవిత



by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mqB67z

Posted by Katta

Sanjeev Goud కవిత

Sanjeev naneelu/ sanjeevgoud నా కలల సౌధం నా ఆశల స్వర్గం కాదెన్నడు కామితుల పరం !! అన్యులకు అస్మదీయులకు అసలే కాదు వశం!! ఎందుకంటె అది నాకు మాత్రమే స్వంతం!! పరులకైన పరమేష్టి కైనా కానే కాదది దృగ్గోచరం !!! కలలకలిమి కలిగి ఉంటే కరగనిదా మిసిమి లోగిలి!! కలలుకనని నిదురలేమి తొ భారమవదా బతుకు వాకిలి !? -- SANJEEV G KASARAPU

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TM1nUE

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1p9AO8u

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p9AO8u

Posted by Katta

Sanjeev Goud కవిత

SANJEEVANAANEELU/sanjeevgoud మరో ప్రపంచపు రూపకల్పనకై మహాప్రస్థానంచేస్తున్నయోధుల్ని వాళ్ళ త్యాగం వాళ్ళ యాగం గుర్తించక వారి చావుకి వాళ్ళనోదిలేసిన ఈ లోకంలో ఎన్నికల గందరగోళపు గల్లిల అంగట్లో పదవులపందేరపు లోల్లిగాల్ల సందట్లో రాజకీయ ఉద్యమాటికలో ఓటి పాత్ర ఓలే రాజనేతిరాక్షసక్రీడలో క్షీణభాగమై పోయి ఉద్విగ్నత ఉగ్రమయ్యొ ఉద్రేకమే ఎక్కువయ్యో ఉరుకుతుంది ఎందుకోసమో ఎరుగని ఉడుకు నెత్తురు వయసుఉరవడి లో ఆత్మ బలిదానం చేసుకున్నదొకడైతే అతడి సమాధిపై హక్కుల బేరమింకొకడిది !! బిడ్డ శవాన్నితాకలేని తలితండ్రుల శోకానికి బడాదొరల స్లోగన్తో అమరుడని బిరుదొకటి !! అందుకే చిన్నా ! అనుభవంతో చెబుతున్నా !! నీవెంతమాత్రమూ కపటోద్యమాలకు కవచమై ఉండకు !! నీ కన్నవారి కలలకి ఆశలకి నిప్పుల కుంపటి వై మండకు !! నీ కన్నవారికి నిన్ను నమ్ముకున్న వారికీ ఊతమవ్వు !! నీ ఉన్నఊరుకి నిన్ను కోరుకున్నవారికి చేయుతనివ్వు !!! నిజమైన నీ సమర స్పూర్తికి నీవే సమర్థ నాయకుడివి !! నిక్కమయిన నీ మనో ప్రపంచానికి నీవోకడే పాలకుడివి !!!

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Rrs66A

Posted by Katta

Sanjeev Goud కవిత

మరో ప్రపంచపు రూపకల్పనకై మహాప్రస్థానంచేస్తున్న యోధుల్ని వాళ్ళ త్యాగం వాళ్ళ యాగం గుర్తించక వారి చావుకి వాళ్ళనోదిలేసిన ఈ లోకంలో ఎన్నికల గందరగోళపు గల్లిల అంగట్లో పదవులపందేరపు లోల్లిగాల్ల సందట్లో రాజకీయ ఉద్యమాటికలో ఓటి పాత్ర ఓలే రాజనేతిరాక్షసక్రీడలో క్షీణభాగమై పోయి ఉద్విగ్నత ఉగ్రమయ్యొ ఉద్రేకమే ఎక్కువయ్యో ఉరుకుతుంది ఎందుకోసమో ఎరుగని ఉడుకు నెత్తురు వయసుఉరవడి లో ఆత్మ బలిదానం చేసుకున్నదొకడైతే అతడి సమాధిపై హక్కుల బేరమింకొకడిది !! బిడ్డ శవాన్నితాకలేని తలితండ్రుల శోకానికి బడాదొరల స్లోగన్తో అమరుడని బిరుదొకటి !! అందుకే చిన్నా ! అనుభవంతో చెబుతున్నా !! నీవెంతమాత్రమూ కపటోద్యమాలకు కవచమై ఉండకు !! నీ కన్నవారి కలలకి ఆశలకి నిప్పుల కుంపటి వై మండకు !! నీ కన్నవారికి నిన్ను నమ్ముకున్న వారికీ ఊతమవ్వు !! నీ ఉన్నఊరుకి నిన్ను కోరుకున్నవారికి చేయుతనివ్వు !!! నిజమైన నీ సమర స్పూర్తికి నీవే సమర్థ నాయకుడివి !! నిక్కమయిన నీ మనో ప్రపంచానికి నీవోకడే పాలకుడివి !!!

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Rrs5jc

Posted by Katta

నరసింహ శర్మ మంత్రాల కవిత

Guadarrama Guadarrama, is it you, old friend, mountains white and gray that I used to see painted against the blue those afternoons of the old days in Madrid? Up your deep ravines and past your bristling peaks a thousand Guadarramas and a thousand suns come riding with me, riding to your heart. Antonio Machado ఓ గాలికొండా ! నీలాంబర తెరపై చిత్రించిన లేతముదురు హరితవర్ణిత పర్వతశ్రేణి పార్శాలలో తరచుగా నేను దర్శించే చిర పరిచిత మిత్రుడా ఓ గాలికొండా! ఇది నీవేనా ! ఆనాటి అరకులోయ నీరెండ సాయంసంధ్యలు లోతైన ఇరుకు పర్వతపు నేర్రెలూ చేరనలవికాని ఉత్తుంగ శిఖరాలు ......రండి నాతో కల్సి విహరించండి ఆ వేనవేల అరకులోయ అందాలలోకి ఆ వేనవేల సూర్యకాంతిపుంజాలతోటి మీ హృదయాంతర ఆహ్లద శీమలోనికి ----నరశింహ శర్మ మంత్రాల మాడ్రిడ్ పట్టణ శివారులోని పర్వతశ్రేణిలో గౌడర్రమా ఓ పెద్ద శిఖరం. దానినే మన అరకులోయ వద్దగల గాలికొండతో సరిపోలుస్తూ చేసిన అనువాదం.

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p9zbri

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/చండాలిక రాజ్యం వీరస్వర్గాన్ని విశ్వసించని రావణ సంతతి నేను నా నీడలు నేలను తాకవు నా దు:ఖనది నిద్రపోదు దారాలు మెడల్లో కట్టబడి కొందరు నడుముకు చుట్టుకొని మరికొందరు వేపుల మీదుగా చుట్టుకొని ఇంకొందరు పవిత్ర సమూహాలయి సంచరిస్తూన్నారు నూలుపోగులు ఏ మూల చుట్టబడినా బడుగు బహుజన బాహుభలులు కుబుసాలను వదిలించుకోవాలిప్పుడు కోరకుండా లభించిన చ్నద్రహాసం బలి కోరుతూ తలపై వేలాడుతూన్నది పడగలిప్పిన వర్ణసర్పాలు శ్రీరంగ నీతుల ధర్మాని భోదిస్తూనే ఉన్నాయి స్పృహను చైతన్యంగా మార్చగల చాతుర్యం ఒక ఔషధం పొదల మధ్య వధించబడుతున్న జంబుకుమారులు కాంక్రీటారణ్యంలో వేటాడబడుతున్న తారకా సమూహాలు లోహపు తెరల మాటునసమ్హరించ బడుతున్న శంబూకులు ఏక మంత్రోచ్ఛారణతో అజగస్తనాలు కుట్రను గుర్తించాలి రుషుల మూలాలు నదుల మూలాలు లభ్యమే అనాదిగా స్త్రీసమ్హార మూలాలే అలభ్యం సంతృప్త స్థానాల అధికారాన్ని దొరకనివ్వనిది దు:ఖనాడులను పసిగట్టిన హరిశ్చంద్రం పవిత్ర పట్టెడను పట్టిబిగించిన పాతివ్రత్యం పుట్టబోయె ముసలాలను మనువు కాతాలో వేసే బానిసత్వం వీరులయిన వారి పార్దివదేహాలూ గౌరవయోగ్యాలే జీవితాంతం ధీరవనితలకు వీరమాతలకు అవమానాల ఆభారాణాలే లభ్యం సకల యుగాల యగ్నవల్కులందరూ మారు మనువులకై కాత్యాయనులను అన్వేషిస్తారు మోదుగుపూవనాలు బహువిధ పవనాలను కూడి ధర్మరాజు రథాలయి గులాబీ ఏకవీరులతో ఏకమవుతున్నాయి జేగురు రంగు బాసలతో జీబురుగడ్డపు నల్లని ముసుగు శ్వేతవస్త్రాల వెనుక వున్న నెత్తురు మరకలు రేపటి చరిత్రకు పునాదులు అధికారపు కత్తిపదునున్నవాడు ఏరంగునయినా ఏమారుస్తాడు అణిచివేతల రాజ్యం పై కత్తిగట్టే వాడికి ఏ రంగూ అవసరం లేదు పైడికోటల్లో పసిడిబొమ్మలను ఎండ కన్నెరుగని వెండికాంతలను పక్కకు నెట్టి కాలచక్రంలో కణకణమండే కాష్టం నుండి లేచి నిషిద్ద మర్మాలెరిగిన చండాలిక రాజ్యమేలాలి ......... జ్వలిథ/ చండాలిక రాజ్యం/ 25-05-2014(ఉదయం 5.50)

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r7QBXh

Posted by Katta

Rajender Kalluri కవిత

## నా భాష - నా ఇష్టం ## Sraight గా మాట్లాడితే , హే నువ్వు ఆంధ్రానా అంటారు గట్ల గాదు పోరి అంటే .... ఎంటా లాంగ్వేజ్ అంటాండ్రు మా బాషను మాట్లాడనియ్యకపాయే , మా పొరలు , పోరగాండ్లు మా యాసను , బాషను మర్చిపోయే ! దీంతల్లి...గెట్ల మాట్లాడినా గసంత గుస్సా జేస్తాండ్రు నోరు పెద్దగుందంటరు , ఊకె మొత్తుకోకంటారు గింతకి నాక్ దేల్వకడుగుతా ...... ఆడు తెలంగానంటడో , ఈడు ఆంధ్రానే అంటాడో , మీరు-మీరు తన్నుకొండి , గుద్దుకొండిబై నడిమిట్లా నా బాషెం జేసింది? " సిన్మా లల్ల , పైసల కోసం , గా తుగ్గ్లగ్ గాన్ మాదిరి వాడుకుంటున్నరు " గీ దిమాక్ లేని పబ్బ్లిక్ గిట్ట కిలకిల నవ్వేస్తుండ్రు ! మా బాశంటే అట్టి రౌడి యిజమేనా ? మా బాశాలున్నన్ని కథలు , పద్యాలు మీ ఒద్దనున్నయానల్ల ? మా ప్రాంతంలున్నంత మంది రచయితలు , ఒగ్గు కళాకారులు మీకాడున్నరా ? మాకాడున్నన్ని కళలు మీకాడున్నయా ? " గది మా బాష - గట్లనే ఉంటది మా యాస " జర్రంత కిందికి మీదికైతే...లే.. కొడకా .....గట్టిగ ఈల గోడితెలే ,మీ ఉళ్ళ గూసున్న మీ అవ్వకినపడాలే మా గొంతు తస్మాత్ జాగ్రత్త --- జరకంత గుర్తున్చుకొండ్రి ... మా సాహిత్యం మాకున్నదని ! మా బాషకంటూ ఓ నేపద్యం ఉన్నదని గింతకు గీ లోల్లంత మీకెందుకు జెప్పిన్నో సమజైందా...? పక్క ఉళ్ళ నాక్ పెండ్లి సూపులని వోతే ... గా పెండ్లి పిల్లకు నేను మాట్లడతాంది నచ్చతలేదట , కయ్యుమని అరవకు పొరగా అన్నది....రయ్యుమని మా ఇంట్ల వడ్డ గాన్నుంచి జార్కొనచ్చి . ఇంకేవల్తో జెప్పుకోవాలే నాకష్టాలు గందుకే మీకు జెప్తున్న ఇంటే యినుండ్రి లేదంటే గాలికోద్లేయండి !! ఇట్లు సిద్దయ్యా ( సిరిసిల్ల ) Written by " kAlluRi " [ 26 - 05 - 2014 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RreR66

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/యువత నేలపై ను0చి నూకలు ఏరుకు0టున్నా మట్టిలో ను0చి బయిటికొచ్చి పందిరి ఎక్కుతున్నా ఒక్కో రాయిని ఏరుకొని పేర్చుకొని గోడగా తయారవుతున్నా నరాలను మెల్లగా ఇచ్చుకు0టుకున్నా లోపల రక్తం బలాన్ని పు0జుకు0టున్నా పరిగెత్తమంటే ఎలా యుద్దానికి దిగమంటే ఎలా పులులను బోనులో బంది0చి జి0కలు విహరి0చేనా పిల్లులను బొక్కలో తోసి ఎలుకలు ఇల్లంతా తిరిగేనా ఆధిపత్యం ఆధిగా వస్తు0టే ఇష్టానుసారంగా ఎదగడానికి చోటెక్కడా చెప్పి0దే చెయలనే తల్లీ దండ్రుల ప్రేమ నచ్చి0దే చెయమనే స్నేహితుల ఇష్టం నీ స్థాయిలోనే ప్రయత్ని0చమనే ధనాపత్యం ఆధిపత్యల ఈర్ష పెరగడాల మధ్య పె0చడాల మధ్య వత్తి ఎముకలు ఇరగదీస్తు0టే వీల్ చెయిర్ ఎక్కకా ఏమవుతు0ది యువత. 26-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r7yeBI

Posted by Katta

Kapila Ramkumar కవిత

చుండూరు తీర్పునకు నిరసనగా కవితా సంకలనం Posted on: Sun 25 May 22:49:21.62343 2014 1991 ఆగష్టు 6వ తేదీన గుంటూరు జిల్లా చుండూరు దళితవాడపై వందలాది మంది భూస్వాములు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేసి 8 మందిని దారుణంగా హత్య చేశారు. అందులో ఇద్దరిని పరమ కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి గోనెసంచుల్లో కుక్కి తుంగభద్ర కాలువలో విసిరివేశారు. దశాబ్దాల తరబడి విచారణ జరిగిన ఈ కేసులో ప్రత్యేక కోర్టు 21 మందికి యావజ్జీవ శిక్ష, 53 మందికి జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవని, ముద్దాయిలందరూ నిర్దోషులని తీర్పు ఇచ్చింది. అందరూ నిర్దోషులైతే హంతకులు ఎవరు? చుండూరు తీర్పుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసనోద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో దళిత రచయితల వేదిక చుండూరు తీర్పుకు నిరసనగా వెలువరించబోయే కవితా సంకలనం కోసం కవితలను ఆహ్వానిస్తున్నాం. కవితలను జూన్‌ 20లోపు లాడె ధనంజయ, బి-4-122, బి.కె. ఎన్‌క్లేవ్‌, మియాపూర్‌ - 500 050, సెల్‌ : 9618241994 చిరునామాకు పంపాలి. - లాడె ధనంజయ

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mcAAbA

Posted by Katta

Kapila Ramkumar కవిత

తస్మాత్‌ జాగ్రత్త Posted on: Sun 25 May 22:52:03.703351 2014 ఒక అప్రకటిత నిషేధాజ్ఞ ఇక ఎప్పుడూ నీ కనురెప్పల నీడ కింద నీడలా మెదులుతుంది అదృశ్య ఆంక్షల ఇనప వలల విసురు శబ్దాలు ఎప్పుడూ నీ దేహం లోలోపలి చెవుల్లో అలజడి సృష్టిస్తాయి నీ అక్షరాల మీద నీ కలమే నిఘా కన్ను వేస్తుంది కాళ్ళూ చేతులూ కళ్ళూ చెవులూ కనపడని తాళాలు మోసుకుంటూ కదులుతాయి అంతా ఎప్పట్లానే ఉంటుంది కానీ స్వేచ్ఛగా నీ గుండె ఊపిరి పీల్చుకునేప్పుడు మాత్రమే శ్వాసనాళంలో ఓ చూపుడు వేలు అడ్డు తగులుతుంది నీతికీ అవినీతికీ కొత్త నిర్వచనాల నిఘంటువుల తయారీ మొదలవుతుంది ఇక అంతా మోరల్‌ పోలీసింగ్‌! పద్మవ్యూహాల కత్తుల పంజరాలే! గుండెల మీద చెగువేరా బొమ్మలతో చేతుల్లో కమలాలతో రోడ్లూ గేట్లూ కూడా మన పబ్లిక్‌ పార్కుల్ని హెచ్చరిస్తూ పహారా కాస్తాయి! వేలాడదీయండి.. మీ కలలకైనా.. కనుచూపులు ముడిపడే మునిమాపులకైనా తూర్పును చెక్కే వెలుగు ఉలులకైనా రాత్రిని పాడే అక్షరాల అలలకైనా ఎక్కడైనా సరే వేలాడాల్సింది మేడిన్‌ ఇండియా శిలాఫలకాలు మాత్రమే! ఇక భయం కూడా ఒకానొక అవ్యక్త సుషుప్త నిశీధి నిశ్శబ్దంలో భయం భయంగా ముడుచుకుపోవాల్సిందే! ఉన్నట్టుండి నీలో దేశభక్తి లబ్‌ డబ్‌ శబ్దాలు కనపడని నియంత్రణ రేఖల దగ్గర నెత్తురు కక్కుకుంటాయి వస్త్రాలనే కాదు, చర్మాలను చీల్చి కూడా నీలో లౌకికత్వానికి డిఎన్‌ఏ పరీక్షలు సాగుతాయి నీ చుట్టూ నీ ఆలోచనల కంచె నీ చేతే వేయించి చేను మేసిన నేరారోపణ నీమీదే మోపి నిన్ను చూసి నువ్వే నవ్వుకునే ఏడ్చుకునే నీ నుంచి నువ్వే పారిపోయే పరిస్థితులు కల్పించి నీ పక్కనుంచే ఓ గాలి దెయ్యం కదిలిపోతుంది వాసన..వాసన.. పురా సంస్కృతి సురావాసన రెచ్చిపోతే మధువు చచ్చిపోతే విషం మిత్రులారా!.. ఇక జాగ్రత్త ఇక్కడ దేశం ఉంది దేశమంటే మనుషులు కాదోరు మతమోరు! - ప్రసాదమూర్తి 8498004488 http://ift.tt/1mcAAbx

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mcAAbx

Posted by Katta

Kapila Ramkumar కవిత

చలాన్ని ఎందుకు చదవాలి? Posted on: Sun 25 May 23:03:59.586358 2014 ప్రపంచంలోని ఏ రచయితనైనా ఆయన జన్మించిన వందేళ్ల తర్వాత కూడా ఎందుకు చదువుతాం? ఎంత పాతవైైనా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తాయి కనుక. ఆయన చెప్పిన నిజాలను ఇప్పటికీ ఆచరించడానికి మనం ధైర్యం చేయలేం కనుక. ఎంతో ఆధునికులం అనుకునే మనం ఎంత సనాతనులమో ఆయన పుస్తకాలే చెప్తాయి కనుక. మనం నేటికీ చలం పుస్తకాలు చదవడానికీ, మరో వందేళ్ల వరకూ చదవుతూ ఉండడానికి ఓ కారణం ఉంది. జీవితానికీ, సాహిత్యానికీ మధ్య సరిహద్దును చెరిపేసిన సరికొత్త సాహిత్య సృష్టికర్త చలం. సాహిత్యపరంగా చూస్తే చలం రచనల్లో కచ్చితత్వం, నిర్ద్వంద్వత ధ్వనిస్తాయి. చలం స్త్రీల కోసం, స్త్రీ స్వేచ్ఛ కోసం, స్త్రీ క్షేమం కోసం రాశారనడంలో ఎవరికీ అభిప్రాయ భేదం ఉండదు. చలం రాసిన రోజుల్లో స్త్రీలు కూడా తమ గురించి తాము ఆలోచించుకునేవారు కారు. తమకు స్వేచ్ఛ కావాలని కోరుకునేవారూ కారు. తమది నికృష్టమైన జీవితమని భావించేవారు కూడా కారు. ఒకవేళ భావించినా, అది చాలా సహజమనే అనుకునేవారు. దానికి తోడు వీటన్నింటినీ బలపరిచే కర్మ సిద్ధాంతం ఉండనే ఉంది. తాము బాగుపడాలనీ, అది సాధ్యమేననీ స్త్రీలకు తెలియని రోజుల్లో చలం కలం చేతబట్టారు. ఆ కాలంలో చలం వంటి పురోగామి, ధైర్యశాలి, దార్శనికుడు ఈ సమాజానికీ అవసరమే. ఈనాటి స్త్రీలలో చాలామందికి తమ వాస్తవ స్థితి తెలుసు. వారి ఆలోచన పదునెక్కింది కూడా. అవకాశాలు రెట్టింపూ అయ్యాయి. సైద్ధాంతికంగానైనా, ప్రభుత్వ శాసనాల్లోనైనా, పురుషులతో 'సమానత్వం' కాకపోయినా స్థానం లభించింది. తమకు కావలసినది చెప్పగల ధైర్యం వచ్చింది. తమకూ ఏదో కావాలన్న తపనా పెరిగింది. మరి ఇప్పుడు ఏ ప్రయోజనం ఆశించి, చలాన్ని చదవాలి? ఇప్పుడు శత వసంతాలు దాటినందుకా? సదస్సులు జరుపుకుంటున్నందుకా? కానే కాదు. చలం నేటి సమాజానికీ ఎందుకు అవసరమో ఆలోచించాలి. అప్పటికీ, ఇప్పటికీ స్త్రీల బాహ్య జీవితంలో కొన్ని మంచి మార్పులే వచ్చాయి. అలాగే స్త్రీలకు 'విద్య, ఉద్యోగం, ప్రేమ వివాహం, కుల, మతాంతరం వివాహం, పునర్వివాహం, విడాకులు' మామూలైపోతున్న రోజులు. కానీ ఇవన్నీ పైపైన కనిపించే పరిహారాలే. మౌలికంగా స్త్రీ పట్ల సామాజిక దృక్పథం, పురుషుడి దృష్టి అంతగా మారలేదు. ఉదాహరణకు నేటికీ 'శీలం' అంటే లైంగికపరమైనదిగానే, అదీ ఒక్క స్త్రీకే వర్తింపజేస్తున్నారు. శీలం అంటే పరిపూర్ణ వ్యక్తిత్వమని అనుకోవడం లేదు. అందుకే ఆమె మాత్రమే దాన్ని కోల్పోతుందని అనుకుంటున్నారు. తద్వారా స్త్రీ పతనమైపోతుంది. తనకు లేనిదాన్ని ఎవరూ కోల్పోరు. కనుక పురుషుడికి 'శీలం' పోయే బాధే లేదు. అందుకని అతను ఎప్పుడూ పవిత్రుడే. చలం పవిత్రతకి ఇచ్చిన వివరణ వేరు. 'నిర్మలత్వం అంటే ఎటువంటిదో, దాన్ని కాపాడుకోవడమెట్లానో స్త్రీ తనకు తానే నిర్ణయించుకోవాలి. అటువంటి సర్వోన్నతమైన తన పవిత్రతని, మృధు మధురమైన తన శరీరాన్ని, యోగ్యతని, గూఢత్వాన్ని, అర్హుడు కాని భర్తకైనా సరే ఇవ్వని ధైర్యాన్నీ, అభిమానాన్నీ అభ్యసించడం స్త్రీ విధి (స్త్రీ-పే:38)'. ఈనాడు దేశాలేలుతున్న స్త్రీలు కూడా చేయలేకపోతున్న పని ఇది. 'స్త్రీకి అందరి పట్ల తాను జరుపుకోవలసిన విధులు ఉన్నాయి. తన పట్ల తాను జరుపుకోవలసిన విధులు మాత్రం లేవు' అన్న చలం మాటలు మరో వందేళ్ల వరకూ మన దేశంలో సగం పైగా స్త్రీ జనాభాకు వర్తిస్తూనే ఉంటాయి. తన శరీరాన్నీ, తన మనసునీ పట్టించుకోవడం స్త్రీ నేర్చుకోనంత కాలం చలం అవసరం ఉంటూనే ఉంటుంది. ఆనాటికీ నేటికీ మార్పు వచ్చినా ఏమాత్రం మారని వ్యవస్థ వివాహం. అయితే అసలు మార్పు లేదని కాదు. ఐదురోజుల పెళ్లిళ్ల స్థానే గంట పెళ్లిళ్లు, రిజిష్టర్‌, స్టేజి పెళ్లిళ్లు వచ్చి ఉండొచ్చు. వజ్రాల కమ్మల లాంఛనాలు పోయి, ఫ్రిజ్‌లూ, టీవీలూ, స్కూటర్లు, కార్లు వచ్చి ఉండొచ్చు. రూపాల్లో, పద్ధతుల్లో మాత్రమే తేడా. వ్యవస్థాగతమైన ద్వంద్వ ప్రమాణాలూ, హిపోక్రసీలు యథాతదంగా ఉన్నాయి. చలం అన్నట్టు 'మతమూ, మూర్ఖమూ, నీతి, అనుమానమూ, నిర్బంధమూ వీటివల్ల ఏర్పడ్డది ఈ వివాహం బంధం (స్త్రీ-పేజీ 92)' వివాహబంధం శాశ్వతం కావటానికి అవసరమైన మూడుముళ్లు, సప్తపది, పసుపు కుంకుమలు, మల్లెపూలు, తెల్లచీరా కావు. ప్రేమ, విశ్వాసం, నిజాయితీ, లోకజ్ఞానం, సత్యం అని ఏనాడో చెప్పాడు చలం. ఈనాటికీ మన పుస్తకాలలో, సినిమాలలో 'నేను ప్రేమించే నా భర్తను నాకు దూరం చేయకు' అన్న డైలాగ్‌ ఉండదు. 'నా పసుపు కుంకుమలు కాపాడు' అనే ఉంటుంది. అంటే భర్తపోయాక అవి ఉంటే అతను ఉన్నా, పోయినా ఒకటేనన్న భావన అందులో ధ్వనిస్తుంది. అయితే ఇవి సాంస్కృతిక చిహ్నాలు మాత్రమే, అవి సూచించే వ్యక్తి పాత్రుడా, కాదా అన్న వివేచన లేనప్పుడు వాటిక్కూడా విలువ ఉండదనేది నేటి విద్యాధికురాలైన స్త్రీ కూడా తెలుసుకోలేనప్పుడు, చలం అవసరం ఉన్నట్లేగా? చలం సమకాలీనులైన భావకవులంతా తమ ఊహా ప్రియుల్ని ఆరాధిస్తే, ఒక్క చలం మాత్రం యావత్తు స్త్రీ లోకాన్నే ఆరాధించాడు, గౌరవించాడు. చలం స్త్రీ వ్యక్తిత్వాన్ని అర్థంచేసుకున్నవాడు. అదే సందర్భంలో చలం మీదున్న అభియోగాల్లో ఒకటి అతను స్త్రీ లైంగిక స్వేచ్ఛను ప్రచారం చేశాడని, ఆ రకమైన జీవితం గడిపిన ఆయన స్త్రీ పాత్రలేవీ సుఖపడలేదు గనుక, ఆయన సిద్ధాంతమూ విఫలమైందన్నారు. అయితే చలం స్త్రీ లైంగిక స్వేచ్ఛ గురించి నొక్కి చెప్పటానికి ఒక కారణం ఉంది. సమాజంలోని ద్వంద్వ ప్రవృత్తినీ, దుర్నీతినీ ఆ సామాజిక నియమాలతోనే తిప్పికొట్టాలనుకోవడమే. అంతేకాని విశృంఖల శృంగారం స్త్రీలకు ఆనందాన్ని ఇస్తుందని కాదు. ఒక సమాజం స్త్రీని భోగ వస్తువుగా చూస్తున్నప్పుడు, స్త్రీని శీలం పేరిట కట్టడి చేస్తున్నప్పుడు, వారిపై లైంగిక అత్యాచారాన్ని చట్టబద్ధం చేస్తున్నప్పుడు, ఆ సామాజిక పరిభాషలోనే సమాధానం చెప్పాలని చలంకు అనిపించి ఉంటుంది. అందుకే, అన్ని స్వేచ్ఛలకంటే ముందు 'లైంగిక స్వేచ్ఛ'నే ఆయన ప్రచారం చేశారు. పతనమౌతుందో, ప్రతిష్ట పెంచుకుంటుందో నిర్ణయించుకునే స్వేచ్ఛ స్త్రీకి ఉండాలన్నదే ఆయన చెప్పేది. స్త్రీని ఆమెకు ఇష్టం వచ్చినట్లు బతకనివ్వాలి. అంతేగానీ సామాజిక కట్టుబాట్లతో పవిత్రంగా ఉండటం నిజమైన పవిత్రత కాదు. 'వ్యభిచారం చేయటానికి కానీ, మానటానికి గానీ స్వేచ్ఛ ఉన్నప్పుడు పతివ్రతో, దుర్మార్గురాలో కావటానికి వీలుంది. కానీ, అసలు దుర్మార్గం చేయడానికి వీలు లేనపుడు పవిత్రులేమిటి? (స్త్రీ-పేజీ 50)''. ఇందులో తిరుగులేని తర్కం ఉంది. ఆనాటి సమాజంలో స్త్రీ బలహీనురాలే, కాబట్టే పురుషుడికి ఆమె అంటే చులకన భావం సహజంగా ఉండేది. తను యజమానినీ, ఆమె బానిస అనీ అతను, ఆమె కూడా నమ్మేవారు. నేటి స్త్రీ సామాజికంగా ఉన్నత హోదాలో, ఆర్థికస్థితిలో ఉండటం పురుషుడికి ఓ సవాలే. అయితే తరతరాలుగా జీర్ణించుకుపోయిన ఈ చులకన భావనతోనే ఆమెపై పెత్తనం చెలాయించడానికి పురుషుడు కొత్త రీతుల్ని అన్వేషిస్తున్నాడు. నేటి స్త్రీ స్వేచ్ఛా, సమానత్వాల కోసం పోరాడడమేమోకానీ, తిండికీ, బట్టకి, కనీస సౌకర్యాలకీ స్వశక్తిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది అభ్యంతరకరమేమీ కాదు కానీ, అలా జీవిస్తూనే పురుషుడి అధాకారానికి లోబడి ఉండాల్సి రావడం నేటి స్త్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. చలం అన్నట్లు 'స్త్రీకి కావాల్సింది సంపూర్ణాధికారం'. దీనికోసం తిరగబడ్డమే ప్రధానమైన మార్గం' అంటాడు చలం. ఈ శక్తినీ, స్ఫూర్తినీ నేటికీ అందిస్తున్నాడు చలం. వ్యక్తిని సమాజం కంటే ఉన్నతుడిగా భావించే చలం తాత్విక దృక్పథంలో కొన్ని లోపాలుంటే ఉండొచ్చు. కానీ స్త్రీ ఆనందం కోసం ఆయన పడ్డ ఆరాటం, ఎన్నో ఆటుపోట్లను అద్భుతమైన సెన్సాఫ్‌ హ్యూమర్‌తో అతను తట్టుకున్న వైనం, ఏనాటికైనా స్త్రీలకూ, పురుషులకూ కూడా ఆదర్శప్రాయమైనవే. 'తెల్లారి లేస్తే పిడకలు, మళ్లు, అలుకలు, ఇవన్నీ ఒదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం, ఉత్సాహం స్త్రీకి ఎప్పుడు కలుగుతుంది?' అని 1952లో ప్రశ్నించిన చలం నేటి స్త్రీ-పురుషులను చూసి, ఈ అర్థంలేని హైరానాను, అంతులేని వైషమ్యాలను చూసి మరో 'స్త్రీ' రాసేవాడేమో! మరో చలం పుట్టే వరకూ ఈ చలాన్ని చదువుతూ, అతని రచనల గురించి ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త ఆలోచనలను జీవితంలో సమన్వయించుకుంటూ ముందుకు సాగాల్సిందే! - శాంతి శ్రీ 98663 71283 http://ift.tt/1mcAxN9

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mcAxN9

Posted by Katta

Rajeswararao Konda కవిత

ఆ ఎదురు చూపులే నన్ను నిత్యం బందీని చేస్తున్నాయ్.. @ రాజేష్ @ 26/5/14

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h35Tbu

Posted by Katta

Abd Wahed కవిత

ఎండ ఎండుటాకులా రాలుతోంది మిట్టమధ్యాహ్నం రోడ్డును కావలించుకున్న తారులా కాంక్రీటు అడవిని హత్తుకుంది వెలిసిపోయిన మనిషిరంగులా మిగిలింది నగరం ఎండమావి కాదు...కాదు... దూరాన.. నేలను ముద్దాడే ఆకాశం వైపు దుమ్ము దుస్తులు తొడుక్కున్న బాధలు అలలు అలలుగా కదులుతున్నాయి కాల్చే ఎండలో కరుగుతున్నాయి పొగమంచులా ఏ.సీ.రూములకు చల్లదనం ఇస్తున్నాయి... కాంక్రీటు అరణ్యం వెలిగిపోతోంది వెలుగు వానలో తడిసిపోతోంది కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి తోటి మనిషి కనబడని వెలుగు... మనిషి మనిషికి మధ్య ఎడబాటు గోడలా వెలుగు తెరలు... ఆవిరైపోయిన కంటితేమ నిస్త్రాణగా చల్లని చీకటి కావాలంటోంది... ఇక ఆలోచించడానికేముంది? అంతా వెలుగుమయమే కదా... నీడను కూడా తరిమేసిన వెలుగు... భరించరాని ఉక్కపోతలో చెమటలా ఆత్మను కమ్ముకుంది ఒంటరితనం. కాస్త కళ్ళు విప్పి మనసారా మనిషిని చూడాలి నల్లసుందరి, చీకటికన్య, రాత్రి ప్రేయసి చిరునవ్వు కురవాలి. ఇంత వెలుగు భరించలేం.. మిట్టమధ్యాహ్నం ఎండలో ఎండమావుల్లా ఎంతకాలం?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owSGYb

Posted by Katta