పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

Krishna Mani కవిత

నా లోని అల చేను కాడ సంపెంగ పూల అల కొమ్మ పైన పక్షి పిల్లల గోల గట్టు కింద కర్కాటాల వల మేఘాల ఓంపులో దాగిన జల ఎండిన కళ్ళలో ఒదిగిన కల కృష్ణ మణి I 05 -02 -2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kT4Ybm

Posted by Katta

Vijay Gajam కవిత

ఈ కవిత నేనూ ఇంటర్ చదివే టప్పుడూ మా ఇంగ్లీషు మాస్టారు శివారెడ్డి గారూ మీరు ఎదో ఒకటి రామన్నారు..కవిత ఎందుకు రాయకూడదూ అని రాశాను..నా తోలి కవిత.. .....భయం...(2000 మే) ఏమిటీ ఈ జీవితం ఎటు చూసిన భయం..భయం.. ప్రతీ రోజు...ప్రతి క్షణం భయంభయం... పట్టాలంటే భయం...బ్రతకాలీ...భ్రతికించాలంటే భయం.. చావాలంటే అంతకంటే భయం.. రోడ్డుమీద ప్రమాద భయం.. ఇంటికోస్తే సమస్యల భయం.. ఆఫీసులో బాసు భయం.. ఇన్ని భయాల మద్య మనిషి భయం భయంగా బ్రతుకునీడుస్తూ.. భయాన్ని భయంగా ఎదుర్కోని ప్రతీరోజూ భయంతో పోరాడుతూ దినదిన గండం నూరేళ్ల అయిశ్శులాగా బయంగా బ్రతుకు నీడుస్తాడు..

by Vijay Gajam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kT4WAi

Posted by Katta

Sriramoju Haragopal కవిత

భారమానం ఎంత భారమై పోతున్నావురా నువ్వు నా బతుకుబరువుకన్నా ఎక్కువే నీ జ్ఞాపకాలే తీయని బరువు నీతో గడిపిన కాలమెంత ఓపలేని బరువు నీకోసం ఎదురుచూపులు లెక్కించలేని రోజులంత బరువు నీ కోసమే ప్రతిక్షణం ప్రాణం నిలుపుకోవడమే బరువు నీదెంత స్వార్థం నన్ను కట్టేసుకున్నావు నీ మనసెంత కఠినం నన్ను ఒంటరిని చేసింది నిన్ను తప్ప ఎవరిని తలపోయలేనంత నిండిపోయావు నీ చూపువెలుగుకే పూసే పువ్వును చేసావు ఎందుకు ఇంత చీకట్లో వొదిలేసావు ఏం ప్రేమయిది ఉన్నదంతా ఇవ్వడం తప్ప ఏం నేర్పలేదు నా దేహంలాగా నా ప్రాణంకూడా నీ ఆకలి తీరిస్తే అదీ ఇస్తా నా మాటలు నాకే బరువైపోతున్నాయిరా నీతో మాట్లాడక నేను కార్చిన కన్నీళ్ళు నీ బరువు కన్నా బరువే 06.02.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MveQM4

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిత్వం కావాలి కవిత్వం - త్రిపురనేని శ్రీనివాస్ ........................... కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా జలజల లాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం ప్రజల మీదే రాయి ప్రజల్లోని అనాధ గాధలమీదే రాయి కవిత్వం రాయి కాగితం మీంచి కన్నులోకి వెన్నులోకి గన్నులోకి దూసుకుపోయే కవిత్వం రాయి అలా ఒక వాక్యం చదవగానే శత్రువు ఠారెత్తి పోవాలి అమాయకుడు ఆయుధమై హోరెత్తి పోవాలి కవిత్వం వేరు వచనం వేరు సాదా సీదా డీలా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు కవిత్వాన్ని వంచించకు వచనమై తేలిపోతావ్ కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా జివజివ లాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం ఫుట్ నోట్సులు ఉన్నది కవిత్వం కాదు అక్షరానికి అకష్రమే వివరణ అథోజ్ఞాపిక లెందుకు చివరాఖర్న బ్రాకెట్లు పెట్టేది కవిత్వం కాదు సానుభూతికి సహానుభూతే సహజానుభూతి కుండలీకరణా లెందుకు అక్కడి కక్కడే వాడి గుండె చీల్చి బూజు దులపాలి దబాయించాలి ధన్ మని గన్ వై పేలాలి కవిత్వమై కాచుకో అనాలి తుప్పల్ తెప్పల్ మాటల్ రాల్చి కవిత్వమని మొరాయించకు కవిత్వాన్ని వంచించకు వచనమై సోలిపోతావ్ కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా కువకువలాడే కవిత్వం కావాలి కవిత్వం జ్ఞాపకాల లోయల్ని తవ్వకు అయ్యో పాపం అనకు సాగదీసిన సానుభూతి వాక్యాలొద్దు జాలి జాలి ఏడుపుమొహం డ్రామాలొద్దు అతడి ఛాతీమెద ధాటీగా రెండు నమ్మకాల్ని రాయి ధైర్యంగా శౌర్యంగా అతడ్నొక వీరుడ్ని చెయ్ కవిత్వమై అతడికి కాపలా కాయ్ చెత్తల్ బుట్టల్ మాటల్ రాల్చి కవిత్వమని ఘీంకరించకు కవిత్వాన్ని వంచించకు వచనమై పుడతావ్ కవిత్వం కావాలి కవిత్వం అక్షరం నిండా కళకళ లాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం (First published in Andhrajyoti Daily, Feb 19, 1989; reprinted in the poetry anthology "kavitA O kavitA", Editor: Papineni Sivasankar)

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fuBZag

Posted by Katta

Sai Padma కవిత

సాయి పద్మ //చూస్తూ, వింటూ, కలుస్తూనే ఉన్న నా నువ్వు ..! ఎక్కడో చూసినట్టే ఉంది నిన్ను .. పులుసు కలయబెడుతూనో, వెల్లుల్లి సరిపోతుందో లేదో అని ఆదుర్దా పడుతూనో చిక్కగా చిక్కడిన దారపురీలుని సవరదీస్తూనో, తటాల్న విసిరే మాటల గాయాలకి మందు రాసుకుంటూనో మోకాళ్ళ నెప్పుల నిప్పుల గుండం కుంటుతూనో అరిచేతుల ఆవిరైన స్వర్గాల పెళుసులు నిమురుతూనో ఎక్కడో విన్నట్టే ఉంది నీ మాట సుళ్ళు తిరుగుతున్న సంగీతం హటాత్తుగా ఆగిన అపశ్రుతి లా అరిగిపోయిన మంగళసూత్రంలో విరిగిపోయిన లక్క శబ్దంలా జవాబు తెలిసీ మాట్లాడని భేతాళిని లా , నీ కళ్ళల్లో నీ మాట వినపడుతూనే ఉంది అత్యంత రుచికరమైన నీ అసహనపు తిరగమోత లయలా ఎక్కడో కలిసినట్టే ఉన్నాను నిన్ను వోద్దిగ్గా మడతపెట్టిన కుర్చీలో, జాగ్రత్తగా సర్దిన పేపర్ల మధ్య జయజయధ్వానాల చప్పట్ల కీర్తి వెనుక సాయంకాలపు నీరెండలో వొంటరిగా వచ్చిన పేరెంట్స్ మీటింగుల్లో , నిరామయ జంట చేతుల చప్పట్లలో నిర్లక్ష్యపు ఆహాలకు నలిగి, మూడంకె వేసిన మొహాల కన్నీటి మధ్య బితుకు బితుకు మంటూ కలిసీ కలవని పాత స్నేహితుల మాటలలో చూస్తూ, వింటూ, కలుస్తూనే ఉన్నాను నిన్ను ఇక్కడే , ఎప్పుడూ, నీ మేధో సమాధుల్లో మెదడు దాచిన మేకపు తళుకుల మధ్య నీరవమైన జీవోత్సాహపు చిరుచెమటల మెరుపుల వరుసల్లో సమాధానపడుతూ, నువ్వు నమ్మినట్టు నటిస్తున్న నీ కవితల పంక్తుల్లో ..!! --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N24owL

Posted by Katta

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || తెలియలేదు || చిరునవ్వుల పువ్వుల్ని గుండెలపై గుమ్మరించినప్పుడు తెలియలేదు చెల్లాచెదురైన ఆశలన్నీ ఒక్కటొక్కటిగా నన్ను వచ్చిచేరతాయని! పరిచయాల పరిమళాల్ని మనసుకు పూస్తున్నప్పుడు తెలియలేదు వశం తప్పిన పరవశం వొంటరినైన నన్ను వెతుక్కుంటూ రాబోతోందని! నువ్వు గుర్తుకొస్తే .. నన్ను నేను పదేపదే పోగొట్టుకుంటానని తెలియలేదేంటప్పుడు! నువ్వు గుర్తుకొస్తే ..వెళ్ళిన కాలాన్నే మళ్ళీమళ్ళీ పిలుస్తుంటానని తెలియలేదేంటప్పుడు! తెలియలేదేంటి ? ఈ చిన్నిమనసులో ప్రేమకి అంకురార్పణ అప్పుడే జరగబోతోందని! తెలియలేదేంటి ? ప్రేమభాషలో ప్రణయకావ్యానికి ముందుమాట లిఖించబడుతోందని!! >-బాణం-> 05FEB14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LykEDW

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి.సురేష్ || కా ల్చే సే మం టొ క టి…....!|| అవును ఇప్పుడు నాకు విషాదమే అవసరమైంది జడలు విప్పి నా గు౦డెలపై నర్తి౦చే పాషాణ౦ లా౦టి విషాదం అది నన్ను గుచ్చి గుచ్చి బాధపెట్టి నాకో వ్యథను మిగిల్చాలనుంది నాకు బాధే కావాల్సొచ్చి౦ది నిజ౦!! ఆమె జ్ఞాపకాలను దాచిన గుండెను కాల్చేసే మంటొకటి నాకిప్పుడు అవసరం ఆ కాలుతున్న బాధే నాకిప్పుడు కావాలి! వాస్తవ౦గా చెప్తున్నా! హృదయంలో గూడుకట్టుకొన్నఆమె రుపాన్ని పలుగుల‌తో తొలగించే నొప్పి కావాలి ఆ పలుగు చేసే గాయం కావాలి! బాహాట౦గానే చెప్తున్నా...... నా గుండెలోతుల్లో ఘనీభవించిన‌ ఆమె మధురానుభూతులను ఎగదోసి రగిలించి కరిగించే సెగ కావాలి ఆ సెగ రగిలించే వేదనే నాక్కావాలి! చెరగని వ్యధతో చెప్తున్నా..... ఆమె అంతర్ సౌందర్యాన్ని అతికించుకొన్న‌ మనసుపొరలను విడదీసి ముట్టించే నిప్పురవ్వొకటి కావాలి ఆ రవ్వ కాల్చే మంటే నాకిప్పుడు అవసరం చితికిన హృదయ౦తో వివరిస్తున్నా...... నా మనసును పదే పదే తడుముతూ ఎంత ఎండినా ఆవిరవని ఆమె జ్ఞాపకాలను నిలదీసి అంటించే అగ్గొకటి కావాలి ఇ౦కా...ఇ౦కా చెప్తున్నా..... విరబూసిన మా కలల విరితోటలను కబళించి దహించే దావానలం కావాలి 2 నిను నేను అర్థిస్తున్నా.. నను భౌతికంగా మాయంచేసే ఇంద్రజాలికుడొకడ్ని నావద్దకు ప౦పు.. నన్నో జీవశ్ఛవం చేసే నా గుండెను రాయిగ మార్చే ఓ మ౦త్రజలాన్ని నాపై చల్లు... సఖీ...చివరిగా అర్థిస్తున్నా.... నీ జ్ఞాపకాలను అ౦త౦ చేసే కనికట్టేదో నాపై ప్రయోగి౦చు. నను నేను అ౦త౦ చేసుకొనే ఓ విషా(దా)న్ని నాకు ప్రసాది౦చు....…! అవును.. ఇప్పుడు నాకొక విషాదం కావాలి నను కాల్చేసే మ౦టొకటి కావాలి...! Cv Suresh

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fuC0uS

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

य़े मेरी जहाँ.... ------------------ श्रीनिवासु गद्दापाटि -------------------- अक्सर मेरी खानों में एक दर्दभरी गीत गूँजती रहतीहै जो सदियों से..... मेरे बाप, दादा... परदादों की जीवन के साथ-साथ अब मेरी भी नींद हराम करती है जमाना बदलती है रात होती है... सुबह निकलती है फिर भी वह दर्दभरी कहानी वही जिंदगी वही माहौल ऐसा क्यों होताहै...? मेरी ही जहाँ मै गर्व के साथ कह नही सकता य़े मेरी जहाँ फिर भी य़े कैसी जहाँ..? मुझे अपनों में पराय़ा मेहसूसी.. सारे जहाँ से अच्छा.... हिंदुस्था हमारा..

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cYZ2fb

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-19 "ధనం"ని అర్ధం చేసుకోవడం ప్రారంభించినపుడు ప్రతిదీ అర్ధం కావడం మొదలుపెడుతుంది.. మనిషి ఎక్కడ ఎందుకు నటిస్తాడో దాని అవసరం ఏమిటో- ఎందుకు ప్రాణాలయినా ఫణంగాపెట్టి సంపద కొరకు పోరాడుతుంటాడో.. బాంధవ్యం- స్నేహం ప్రతి అనుబంధం వెనుకనున్న వెలుగునీడలేమిటో - వాస్తవానికి,ఊహకి ఉండే దూరమేమిటో మాయలమరాఠి ప్రాణం చిలుకలో ఉన్నట్లు మనిషి ప్రాణం ధనంలో ఎందుకున్నదో.. ప్రతిదీ..ప్రతిదీ..!!!

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fustDW

Posted by Katta

Vempalli Reddinagaraju కవిత

వేంపల్లి రెడ్డినాగరాజు !! బోన్సాయ్ బాల్యం!!06-10-13!!05-02-14!! ******************* అందని ఆకాశం అంచుకి నిచ్చెనలువేసి ఆశల సౌధాలను నిర్మించాలనుకునే క్రమంలో మీ కలల బ్యాగులు వాళ్ళ శక్తికి మించిన బరువులై వీపున భారంగా వేలాడే పుస్తకాల సంచీలవుతాయి కాలాన్ని క్యాలెండర్ మీద తేదీలు,వారాలుగా కాక ' కాంపిటీషన్ ' దృష్టితో మాత్రమే చూసే మీ చూపులకు అందమైన బాల్యం పాలుకారే చెక్కిళ్ళ పసితనంలోనే అయిష్టంగా అమ్మఒడిని వీడిన బుడిబుడి అడుగులై ' కార్పోరేట్ బడిలొ మడత నలగని ' యూనిఫాం ' లవుతాయి మీ భవిష్యత్ ఊహల్లో ఇంజనీర్లు,డాక్టర్లయినవాళ్ళు అమెరికా డాలర్ల పంట పండించే వృక్షాలయ్యేందుకు వేల డొనేషన్లు వసూలు చేసే ఖరీదైన స్కూళ్ళ నేలలో పెట్టుబడి విత్తనాలుగా నాటబడి తరగతి గదుల్లో సత్తువ లేని మొక్కలుగా అంకురించి తలలు వాల్చేస్తాయి పిండారబోసిన వెండివెన్నెల వెలుగుల్లో గోరుముద్దలు తింటూ నానమ్మ,తాతయ్యలుచెప్పే జానపద కథలను వింటూ ఆదమరిచి నిద్రించి కలల అలల్లో తేలియాడాల్సిన వాళ్ళను నాలుగు గోడలమధ్య క్లాస్ రూం బందిఖానాలో ఖైదుల్నిచేస్తాయి అభిమానంగా ఎత్తుకోవడాలు,ఆప్యాయంగా హత్తుకోవడాల్ని పలవరించే పసి హృదయాల కలల్ని కల్లలుచేస్తూ ర్యాంకులు తగ్గిపోతాయన్న హడావుడితో మీరుచేసే ఆరాటం ఏటినీటిలో స్వేచ్చగా తిరుగాడే చేపపిల్లలను గాజుపలకల మధ్య అందమైన అక్వేరియంలో బంధించి ఆహారంగా కృత్తిమ ఆక్సిజన్ అందించేట్లుచేస్తుంది పగలంతా పుస్తకాలపురుగులై అలసినవాళ్ళను ' హోంవర్క్ ' భూతం అర్ద్రరాత్రిదాకా వెన్నాడి ఆవులింతలకు సైతం దూరం చేస్తుంది పొరపాటున ప్రోగ్రెస్ కార్డ్ లో తగ్గిన మార్కులు మీ కళ్ళలో ఎరుపుజీరలై వాళ్ళపాలిట హుంకరింపులవుతాయి ఆట బొమ్మలతో ఆడుకోవాల్సిన వాళ్ళ లేబ్రాయపు చేతివేళ్ళు ' శిక్షణ ' పేరుతో పేముబెత్తం దెబ్బలతో బొబ్బలెక్కుతాయి వెన్నుసైతం ఒంగొపోతున్నా తప్పని టన్నులకొద్దీ పుస్తకాల మోతతో ఆరేడేళ్ళ పసివయస్సులోనే మూరెడు పొడవు పెన్సిళ్ళను చేతబట్టిన బాల్యం ఇస్త్రీ మడతనలగని ' నెక్ టై ' ల సాక్షిగా కుస్తీకి సిద్దమవుతోంది ' కంప్యూటర్ పై కళ్ళు '-' అమెరికావైపు కాళ్ళు ' గా సాగే మీ ధోరణి వాళ్ళను చిలుక పలుకులకు దూరం చేస్తోంది పలకా,బలపాలతో జతకట్టిన పసితనం తమకళ్ళను నల్లబల్లకు అతికించుకొని ఆప్యాయతకు దూరం అవుతోంది మమతల ఎరువుతో ఆప్యాయతల పాదుల్లో ఏపుగా పెరిగి కాపుకాయాల్సిన మెదళ్ళను మొదలంటా నరికివేసి పరచిన పచ్చనోట్ల తివాచీలపై మీరు పెంచే మరుగుజ్జు (బోన్సాయ్)వామన వృక్షాలు ఉగ్గుపాల దశలోనే బొగ్గుపులుసు వాయువుల్ని శ్వాశిస్తూ అందరికీ ఫలితమివ్వని కుండీ మొక్కలుగానే పెరుగుతాయి అందుకే అమ్మా నాన్నలూ ..... వాళ్ళను చదువు ' కొనే ' వాళ్ళుగా కాక ఎన్నటికీ మరచిపోలేని సుమధుర అనుభూతుల్ని మిగిల్చే బాల్యం అనుభవాల్ని మళ్ళీ,మళ్ళీ జీవితాంతం చదువుకునేవాళ్ళుగా ఎదగనీయండి ప్లీజ్........* (అంద్రజ్యొతి నవ్య వీక్ల్య్ 24-05-2006) (కవితావార్షిక-2006, మట్టి వాసన కవితా సంపుటి లో పునర్ముద్రితం) వేంపల్లి రెడ్డినాగరాజు 9985612167* (నేను స్వప్నించే లోకంలో జీవించే వారి కోసం)

by Vempalli Reddinagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nT6TPt

Posted by Katta

కాశి గోవిందరాజు కవిత

కాశిరాజు ||ఇంకాస్త ఎక్కువ || నువ్వంతేనా ఎప్పుడూ ఏదీ ఇనిపించదన్నట్టు కొసరు వడ్డిస్తూనే ఉంటావ్ కంచంకడుకొచ్చి ముందు పెట్టి చెంబులో నీల్లెసీ నాకేసి సూసి మెతుకు కింద పడేలోపు నా కంచంలో నువ్వడిపోతావ్ మెతుక్కి మెతుక్కుట్టి ముద్ద సేసేసి మూతి దగ్గర పెట్టుకునేలోగా మమకారం కలపడం మరిసిపోయినట్టు ఇంకేదో కూరేస్తావ్ ఇది కొంచెం, అది కొంచెం అన్నీ నింపేసి 'అన్నం ఇంకాస్త' అంటావ్ సాలమ్మా సరిపోయిందని చెయ్కడగడానికి నీలడిగితే ఇంకో ముద్ద కంచంలో పెట్టాక ఇదేంటిదన్నట్టు నేను సూశాక అయ్యో ఇంకాస్త పెట్టమన్నట్టినిపించిదని ఆకలి తెలిసిననవ్వే నవ్వుతావ్ అమ్మలంతా ఇంతేనేమోనని ఏమూల ఆకలున్న ఇట్టే కనిపెడతారని నోరుమూసుకు తింటాన్నేను కడుపు మాట బ్రేవ్ మని పేగులు సెప్పేశాక గుండెమాట కళ్ళలో నుండి కారీ తినేశావ్ కదా చేయికడుక్కో అన్నట్టు అమ్మా నువ్విచ్చిన నీట్లోకే నా కనుచుక్క జారింది . (బువ్వపెట్టే మా జీవమ్మ , నన్ను రాసేవాడిగా కన్నతల్లి శిలాలోలత , కట్టా లక్ష్మి, సిరీ , అపర్ణ, రాఖీ , పావనీ , షానాజ్,పావనీ... ఇంకా అమ్మను గుర్తుచేసిన హైదారాబాద్ అమ్మలకు కృతజ్ఞ్యతగా )

by కాశి గోవిందరాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fusvMd

Posted by Katta

గరిమెళ్ళ గమనాలు కవిత

//రాజేంద్ర ప్రసాదు // ఓ చిన్ననాటి నేస్తమా // చిన్ననాటి స్నేహానికి చెద పట్టింది పిలిచినా వినపడనంతగా చిన్ననాటి స్నేహానికి ముసురు కమ్మింది నేను కనపడనంతగా నా హృదయం తన స్నేహం కోసం ఎదురు చూస్తుంటే నా హృదయం తన స్నేహం కోసం తపన పడుతుంటే కొంటెగా వచ్చి ,నేనున్నాను అని నన్ను గిల్లి మబ్బుల మాటున చంద్రుడి లాగా పలకరిస్తూ వెళ్ళిపోతుంది ఏమి కోరాను ఓ నేస్తం - నీ నుంచి ఒక చిన్న చిరునవ్వు తప్ప ఏమి కోరాను ఓ నేస్తం - నీ నుంచి నాతో నడిచే నీ మైత్రి తప్ప ఎక్కడున్నా - నీ చిన్న చూపు చాలు నా మనసుకు జవాబు నివ్వటానికి ఎంతవాడివైనా - నా పేరు నీ నోట వింటే చాలు నా మనసు తరంగాలకు -సర్ది చెప్పుకోవటానికి ఆనాటి బండలు దగ్గర ,కబుర్లు ఏమైనవి ఆనాటి మన ఉనికిని చూసిన చెట్టూ-పుట్టా , నీరూ- గాలితో సాగించిన ఊసులు ఏమైనవి స్నేహం ఎక్కడనుంచి ,ఎటునుంచి పుట్టినా చిననాటి స్నేహమే కదా -మధురమైన స్నేహము ఒక్క క్షనమైననూ విడువక ఉంటిమి కదా ఇన్ని రోజులు ఒంటరిగా నన్ను చేసితివి నీకు గుర్తుండక పోవచ్చును ఆ రోజులు నీ జ్ఞాపకాలను మరువ వద్దంట్టున్నవి ఈ రోజులు నీ సుఖం ,సంతోషం నేను కోరుకున్నవి కాదా కొత్తగా వచ్చిన స్నేహాల చాటున నా మైత్రి నీకు కానరాకున్నదా ! ఇన్ని చెబుతున్నా ,అడుగుతున్నా నీ మౌనం గీత దాటి బయటకు రాదా ! చిన్ననాటి స్నేహమా - చేదిరిపోయావా చిన్ననాటి మిత్రమా - నీవు మారిపోయావా నీవిప్పుడు ఎలావున్నా నాకు సమ్మతమే కుచేలుడనై ఎదురుచూస్తుంటా నీ కోసం ,నీ స్నేహం కోసం నన్ను మరువకుమా - ఓ చిన్న స్నేహమా పెద్ద మనస్సుతో పలకరించు మిత్రమా పెద్ద ఆశ ఏమీ లేదు సుమీ నీ స్నేహముంటే నాకు లేనిది ఏమీ ? తేదీ : 05. 02 . 2014

by గరిమెళ్ళ గమనాలు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fustUp

Posted by Katta

Prabhakar Rudraraju కవిత

Kavithanjalulu.

by Prabhakar Rudraraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eBtgox

Posted by Katta

Nirmalarani Thota కవిత

వి 'గ తం . . ! పాదాల పారాణి ఆరక ముందే తల మీది తలంబ్రాలు జారక ముందే నేను కావాలా ? మీ అమ్మ నాన్న కావాలా ? అన్న మగడైన ప్రియుడి మొదటి మగ ప్రశ్నకు ప్రతిగా . . . కన్నవాళ్ళ మమకారపు బంధాల్ని తెంచేసి బేలగానో .. ఆశగానో అటువేపే అడుగేసి 'ఆడ' బిడ్డగా. . . స్వార్ధంతో చచ్చిపోయా . . ! కలల రాకుమారుడని ఒకనాడు మురిసి పోయిన కట్టుకున్నవాడిలో మగాడు మద్యం మత్తులో కసాయితనంతో చేయి చేసుకుంటుంటే మనసు కళ్ళు మూసుకున్న మధ్యతరగతి "ఇంట్లో సుఖం లేకపోతే ఏం చేస్తాడు పాపం ?" అనే సానుభూతి పలుకుల ములుకులతో ఆలిగా . . . ఆక్రోశంతో చచ్చిపోయా . . ! "పిల్లలు పుట్టడం లేదటగా .. పాపం .. ! ఏంటి సమస్య? " అనే పర పరామర్శల బేతాళ ప్రశ్నకి సమాధానం తెలిసీ .. చెప్పలేక గుండె కపాలం బ్రద్దలవుతుంటే . . ప్రయోగశాలల్లో పరీక్షల పేరిట వలువల విలువలు దాటి తనువుకు పడే తూట్లు, గాట్లతో ఆడదానిగా. . . సిగ్గుతో చచ్చిపోయా . . . ! కనుపాపల్లా భావి జీవితం చూపుతారని కంటికి రెప్పల్లా కాచుకుంటూ కనిపెంచిన పిల్లలు కనుల ముందే కసి పెంచే కలతల కాపురపు కాట్లకో కవ్వించే పాశ్చాత్యపు పోకడల మోజుకో పెడదోవన పడుతుంటే "ఎలా పెంచిందిరా నీ అమ్మ(నీయమ్మ) ? " అనే సగటు సమాజపు తిట్లతో అమ్మగా... అసహ్యంతో చచ్చిపోయా . . . ! ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే ప్రశంస పురాణాలకు , పుస్తకాలకూ మాత్రమే పరిమితమై నిజ జీవితంలో మగవాడి ప్రతీ తప్పుకూ ఆడదాన్నే వేలెత్తి చూపే సభ్య(మభ్య) సమాజంలో నా వాళ్ళకూ . . సంఘ జీవితపు ఉనికికీ దూరం కాకుండా ఉండడానికి చేసే విశ్వ ప్రయత్నంలో నాకు నేనే దూరమవుతూ . . మనిషిగా అనుక్షణం అత్మవంచనతో చచ్చిపోయా . . . ! జీవితం పడమటి వాకిలి చేరాక వెనక్కి తిరిగి చూస్తే . . . ఒక్క నిజం జాలిగా కనిపించి . . లీలగా గుర్తొచ్చింది . . నేను ఒక విషయం మరిచి పోయానని . . (?) అనుబంధాల కోసం పడిచస్తూనో అస్తిత్వం కోసం చచ్చినట్టు పడుంటూనో నేను " బ్రతకడం " మరచిపోయానని . . ! ? నిర్మలారాణి తోట [ తేది: 05. 02. 2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1b1GWKH

Posted by Katta

నవీన్ కుమార్ కొమ్మినేని కవిత

!!కొన్ని ప్రశ్నలు!! గతించిన కాలాన్ని సరికొత్తగా సుతిమెత్తగా స్పృశించి కళ్లనుండి జారుతున్న జ్ఞాపకాలతో కడుపు నింపుకుంటాను ఆకలంటే అర్థమేమిటి? శ్రీరంగాన్నో దేవులపల్లినో ఆత్రేయనో వేటూరినో దోసిట్లోకి ఒంపుకుని తనివితీరా తాగేస్తాను దాహమంటే ఏమిటి? ఒకక్షణం ఆకాశవీధిలో విహంగాన్నై విహరిస్తే మరుక్షణం సాగరగర్భాన చేపనై ఈతకొడతాను నా ఇల్లెక్కడున్నట్టు? ఇంకా, నేటి నేనుగా నిన్నల్లోకి పోయి నుంచుంటే నాకు నేను నవ్వులాటగా కనిపిస్తాను మధ్యలో ఏం జరిగినట్టు? ముద్దబంతి పువ్వుని మురిపెంగా చూస్తుంటే మొదటిప్రేమ గుర్తొచ్చి మనసు ముద్దముద్దవుతుంది ఆనాటి ప్రణయాలిప్పుడేమైనట్టు? -------నవీన్ కుమార్ కొమ్మినేని (06/Feb/2014)

by నవీన్ కుమార్ కొమ్మినేని



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1awTitL

Posted by Katta

Rambabu Challa కవిత

సుదీర్ఘ పయనం// Dt. 6-2-2014 ముప్పై ఎనిమిది సంవత్సరాలకు పూర్వం నువ్వెవరో.. నేనెవరో.. ఇదేరోజున భవసాగరంలో నాకు చేయందించి సుడిగుండాలు, తుపానులు, బడబాగ్నులు ఎన్నో..ఇంకెన్నో ఒడిదుడుకులు దాటుకుంటూ ఇప్పటికీ నానీడగా ఉన్ననీకు.... ఈసాగర మధనంలో.. రత్నంలాంటి కూతుర్ని, మణిపూస లాంటి కొడుకునిచ్చి వారి ఔన్నత్యానికి శ్రమించి, ప్రేమానురాగాల్ని పంచిచ్చిన నీకు.... ఈసంసార సుదీర్ఘగమనంలో పడుతూ లేస్తూ.. అపుడు పట్టుకున్న నాచిటికనవేలునలాగే వదలకుండా నాతో పయనించే నీకు.... రాజీలేని, రాజీనామా లేని, పదవీవిరమణ లేని అవిశ్రాంతమైన నీసేవలకు.... ఏమివ్వగలను??? నేనేమివ్వగలను??? నీనుదుటిపై ప్రేమానుబంధాల పెదవి స్పర్శ తప్ప.. ఆపాత మధురాల స్మృతులు తప్ప.. అన్నీ ఇచ్చిన నీకు నాదోకోరిక.... "నన్ను నీఒడిలో శాశ్వితంగా నిదురించే భాగ్యం కల్పించు" “””ఫిబ్రవరి ఆరున మాపెళ్లిరోజు సందర్భంగా నా శ్రీమతి రాజేశ్వరికి ప్రేమతో అర్పించుకున్న కవితాకుసుమం”””

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1awTfxY

Posted by Katta

Abd Wahed కవిత

కంటిలో తేమ నెపుడూ ఆరనీకూ గుండెలో పూల నెపుడూ వాడనీకూ దారిలో రాయి కాదా చివరి గమ్యం ముందుకే సాగు బాటను ఆగనీకూ గాలిలా వీచె కాలం అడ్డుకున్నా ధూళిలా పచ్చికలనూ చెదరనీకూ చూపులో రేయి పడకే వేసుకున్నా మెత్తగా సత్తువంతా కూలనీకూ కాగితం లాగె ప్రేమ త్రుళ్ళుతున్నా రాయిలా మార్చు దియా ఎగరనీకు వీణలా పాడుతున్న చెట్టుపైనా ప్రేమగా మౌనమేదీ వాలనీకూ

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1apeGRE

Posted by Katta

Kavi Yakoob కవిత

విజయనగరంనుంచి పాయల మురళీకృష్ణ అనే కవిమిత్రుడు ,ఇటీవలే తాను ప్రచురించిన కవితా సంపుటి ' అస్తిత్వం వైపు' పోష్టులో నిన్న పంపాడు. సాయంత్రం ఆ సంపుటిని చదువుతూ గడిపాను. కె.శివారెడ్డి గారు ముందుమాట రాశారు. అందులోంచి కొంతభాగం ~ ఒకానొక విషాద సమయంలో Poetry makes me you ! ................................................................... " ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతా ఉంటా ; ఎవరు కేకేసినా వెళ్ళిపోతా- ఎందుకో తెలుసా- ఒకటి : to locate a new poet, to discover new voice, fresh and vibrant voice. రెండు : ఈ సంచారాలలో నన్ను నేను కనుక్కోవడానికి, బతికించుకోవడానికి, ఎప్పటికప్పుడు కొత్తతరంతో Readjust చేసుకోవడానికి, కొత్తతరపు ప్రాణవాయువును నా గుండెలనిండా నింపుకోవడానికి, ఇదొక నిరంతరాన్వేషణ. అలా ఆకలిగొన్న కళ్ళతో ఆవురావురుమంటూ తిరుగుతున్నప్పుడు తటస్థపడ్డాడు,మురళీకృష్ణ. పాయల మురళీకృష్ణ.విజయనగరం జిలా, మెంటాడ గ్రామవాసి,ఉపాధ్యాయుడు. తనూ,నాలానే తన పిల్లల్లో,విద్యార్థుల్లో తనను డిస్కవర్ చేసుకుంటానికి ప్రయత్నిస్తూ ఎక్కడో, ఏ పత్రికలోనో కవిత అచ్చయితే - కవిమిత్రులు ,' అర్థం కాకుండా రాస్తున్నావని' అంటే, కించిత్ కలతపడి, అయోమయపడి నాకు ఫోన్ చేస్తే- నేనడిగితే తను ఆ కవిత పంపితే -చదివి Do not worry-you are on the correct line, Go ahead అని ప్రోత్సహించా. తర్వాత నేనూ ఆలోచించా తోటివారు అలా ఎందుకన్నారని. ఒక కొత్తరకమైన ఆధునిక కవిత్వ వ్యక్తీకరణ, పద్యనిర్మాణం కారణమని అన్పించింది. అది తనచూపు నుంచి- తను కవితను ఊహించే పద్ధతిలోనే ఒక కొత్తదనం ఉండటాన, భిన్నంగా ఉండటాన, తనదైన కవిత పరిభాష ,నిర్మాణం, సాధించుకునే క్రమంలో ఉన్నాడు కాబట్టి. వస్తువుని చూడటం- చూడటంలోనే వినూత్నంగా ,విశిష్టంగా ఉండటం, బొమ్మమీద బొమ్మ కూర్చడం- పదబంధాలు, వాక్యనిర్మాణాలు -ఎత్తుగడ ,నిర్మాణం, మలుపులు- వీటన్నిటిలో తనదయిన ప్రత్యేకత సాధించడానికి ప్రయత్నించే క్రమంలో - మామూలుగా ఉన్న వ్యక్తీకరణకీ, నిర్మాణానికీ భిన్నంగా ఉండటం వల్ల - తోటికవులు,పాఠకులు యిబ్బంది పడ్డారా/ పడే అవకాశం ఉందా? కవిత అచ్చవుతుంది. పఠనీయమవుతుంది. మరోసారి చదివి -కవితలోకి చొరబడే ప్రయత్నం చేయడం లేదా? బద్ధకపు పాఠకుడి ' సాధారణీకరణ' ను లెక్కలోకి తీసుకోవాలా- కొత్త కవిత్వాన్ని క్రమంగా పరిచయం చేయాలా -వద్దా? ఇలా చాలా విషయాలు ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే -పాయల మురళీకృష్ణ, పాయల మురళీకృష్ణ అయ్యాడు. ఏ కవయినా ఆ కవే కావాలి. మరొకడు కావడానికి వీల్లేదు. తనదయిన వ్యక్తీకరణ కవిత్వపు ఉనికిని తను చాటాలి. " పాయల మురళీకృష్ణ నంబర్ ~ 89652 86969

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1awOXqn

Posted by Katta

Surya Prakash Sharma Perepa కవిత

వేదాధ్యయ 05-02-2014 |మనసుకి ఎమైంది ఈవేళ| ____________________________________________ రగిలే కణికై... రిపుని హరించే అశ్వమేధ అస్రనృపుని గర్జనలేవి?? జంకులేని తురగపాద రుధిరమదేది? ఏమైంది..? రగిలించే రవికిరణం ఏమైంది? పోరాడే సంకల్పం ఏమైంది? శృతినుండే స్థైర్యానికి ఏమైంది? చెలరేగే రక్తపు సెగ ఏమైంది? మదగజములపై మృగరాజల్లే లంఘించే శౌర్యానికి ఏమయ్యింది? ఘనశత్రులనే కాలాంతకమై కబళించే కాఠిన్యత ఏమయ్యింది? ఏమైందీ నీమనసుకి ఈవేళా ఎమైంది...? ధన్‌ధనమంటూ దూసుకుపోయే ధనుంజయుని శరమేదీ కనబడదేమి? కణకణకంటూ ఖననం చేసే అగ్నిశిఖల శక్తి సాటి సాహసమేది? ఓనేస్తం! గురిచేయ్ నీశస్త్రం, నగమే శకలాలై మిగిలేలా...! గగనం అదిరేలా! సారించెయ్! వింటినున్న ప్రళయాన్నే కురిపించెయ్ రుధిరంలో రరుణాన్నే రగిలించెయ్ అమ్ములలో ఆగ్నేయమె సంధించెయ్ నిదురించే నీ ప్రమిదని మేల్కొలిపేయ్ రుద్రునివై ఫాలాక్షపు జ్వాలలనే కురిపించు... "అస్తమయం"... కాదుర ఆ సూర్యునికే "చరమాంకం". ఆశలు మోసే 'రేపటి'కది సరిపల్లవి, ఇది సత్యం. ఓటమికే కుంగితె జగమేదీ? గెలుపుకు విలువేదీ? విజయపు రుచియేదీ? గమనించు... ఓటమి నీ అతిథేనని గమనించు విజయమె అంతిమపథమని గ్రహించు అరులను దుందునుమాడే వీరునివై నిజకాలపు గమనాన్నే శ్వాసించు... ఉదయించు... తూరుపు తొలి అరుణిమవై ఉదయించు... తూరుపు తొలి అరుణిమవై ఉదయించు...

by Surya Prakash Sharma Perepa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jcrxcZ

Posted by Katta

Rvss Srinivas కవిత

|| పాదాల గుర్తుల కోసం || మరువలేకున్నాను నీమోముపై ముంగురుల సోయగానికి కెరటాలు సైతం చిన్నబోయిన విషయం నీ పాదాలు కడిగి ప్రతి కెరటం పావనమైన సంగతి. నీ కాలి మువ్వలతో తరగలకి సవ్వడి నేర్పిన దృశ్యం నీ వేళ్ళ సవరింపులకి ఫక్కుమన్న కెరటాల నురుగులని మనం విశ్రమించిన ఏకాంత తీరాలలో ప్రతి రేణువు పులకించిన మనోహర చిత్రాన్ని కలిసి నడిచిన సప్తపదుల మొత్తాన్ని సాగరుడు అలలతో నేర్పుగా దొంగిలించడం... అందుకే తీరమంతా జల్లెడ పడుతున్నా మనం కలిసినప్పుడు జాలువారిన నీ నవ్వుపూలకోసం... సంద్రంలో వల వేస్తూనే ఉన్నా ఇసుకలో కలిసి నడిచిన మన పాదాల గుర్తుల కోసం... ...@శ్రీ 06/02/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhBrdt

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

........ప్చ్ ............................................. భక్తి ఛానెళ్లయి ప్రవహిస్తున్నా భక్తులు కరువౌతున్న కాలం సంబరాలు అంబరాలనంటుతున్నా సంతోషం దిక్కులు చూస్తున్నకాలం విజ్ఞానం ఒడిలోబొంగరంలా తిరుగుతున్నా వికాసం వెలవెల బోతున్న కాలం ఉద్యమాలు ఊపిరి సలపనియ్యక పోయినా ఉద్దేశ్యాలు ఉట్టికెక్కుతున్న కాలం దృశ్య మాధ్యమాల దృక్పథాలేవైనా దుష్ట సంప్రదాయాలు దృగ్గోచరమవుతున్న కాలం నూరు దోసిళ్ళ కాసులకు మూడు దోసిళ్ళు చదువులమ్ముతున్న కాలం నాయకులు కురిపించే కారుణ్య వర్షాలకు తలమునకలై కర్షకులు తలలు వేలాడేస్తున్న కాలం డబ్బు చేరితే చాలు పబ్బాలన్నీ పబ్బులకూ క్లబ్బులకూ పరుగులు తీసే కాలం పడగొడితేనే నిలబడగలమనుకున్న పదవులు బేరసారాల పందేరాలు పెడుతున్న కాలం రాని ఉద్యోగాలు ఉత్తర దక్షిణాయనాల చుట్టు వచ్చిన ఉద్యోగాలు బాధ్యతలక్కరలేని హక్కుల చుట్టూ చక్కర్లు కొడుతున్న కాలం దబ్బూ దస్కం లేకుండా దగ్గుపడిశం తెచ్చుకున్నందుకు జబ్బు నిన్ను నడి బజార్లో నిలదీసే కాలం కుంభమేళాలు జరిగినా పుణ్య నదులకు పుష్కరాలొచ్చినా అధినాయకుల సంకల్పాలు జపిస్తూ ఆత్మగౌరవ పిండ ప్రదానాలకు అనువౌతున్న కాలం సంతోష సంతాప సందేశాలకు సొల్లు వాగుళ్ళకు సెల్లు గిల్లే మానవ సంబంధాల కాలం నిన్ను నువ్వు పాతేసుకోడానికి నిజాయితీ గొయ్యి తీసే కాలం ఏమంటే ?ష్ ! ....ఇది కలికాలం...ప్చ్....

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhBplO

Posted by Katta

Patwardhan Mv కవిత

.చంద్రముఖి:::: మొదటి సారిగా నా నీడ లాంటి ఓటమి వెంబడించడం లేదు. బతికున్నానా? ఒకేసారి నోట్లో పోసిన సముద్రమంత అమృతంలా జయం. బతికుంటానా? అప్పుడు శిఖరాన్ని చేరుకోవాలనే తపన ఎంత బాగనిపించేది! ఇప్పుడు కిందకు దూకేయనా? చెప్పాలంటే ఓటమి నా తల్ల్లి పాల నుండో,తండ్రి ఉపదేశాల నుండో నాలో ప్రవేశించి ఉంటుంది. పిలువకపోయినా తానే వచ్చి నన్నెంత బాగా చూసుకునేదని నాకు ఒక మారు పేరై ఎలా నిలిచేదని!! ఎవరున్నారు నీకని అడిగితే గెలుపు వేయి గోత్రాలు వల్లెవేసింది. చూపుడు వేలుతో నా ఓటమి నన్నే చూపింది. రమ్మన్నా రాని గెలుపు కన్నా ఓటమీ! నువ్వే ఎంతో మంచి దానివి. నువ్వు ఎల్లవేళలా నా దానివి. కానీ ప్రపంచంలో ఓటమీ ! నువ్విప్పుడు నిజంగా అనాథవి. చివరకు నన్నూ పోగొట్టుకున్నావ్. అలా చూడకు ఓటమీ నాకు తెలుసు నువ్వెప్పుడూ గెలుపు కుబుసానివే! 04-02--2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8tjMt

Posted by Katta

Pusyami Sagar కవిత

డా కాసుల లింగ రెడ్డి గారు రాసిన కవిత !!ఇడుపు కాయితం ||కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ ఉద్యమ నేపద్యం గా వచ్చిన కవితలు ఎప్పుడు స్పూర్తిని అందించేవి గానే వుంటాయి, అణచబడిన ఒక జాతి ఆత్మ ను ప్రతిబింబించేది లా సాగుతుంది లింగ రెడ్డి గారు రాసిన "ఇడుపు కాయితం ", రెండు ప్రాంతాల వారిని కళ్యాణ బందం తో ముడివేసి తన యాస ను భాష ను ....ఎలాగా అవమానం చేసారో ...., ఏమి లేని స్తితి లో తన దగ్గరకు వచ్చినపుడు ఎలా ఆదరించారో ఒక కద లా అల్లుతూ వెళ్లారు ... మొత్తం 5 యూనిట్లు గా, జరిగిన వాస్తవ పరిస్థితులను ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ....ఇక్కడ ఒక ప్రాంతాన్ని భార్య తో ను ..మరో ప్రాంతాని భర్త తో ను పోల్చారు ....ఆమె అంతరంగాన్ని ...మొదటి లైన్ లో నే ....జరిగిన చారిత్రిక తప్పిదాన్ని ...చూపుతూ ...ఇంత రాద్ధాంతానికి అతడే కారణం అంటూ విమర్శ ను ఎక్కు పెట్టిస్తారు //పుస్తెలతాడు కట్టించి//తన్నుకు చావమని.//సాపెన పెట్టిండు సచ్చినోడు. వలస వాదుల గా వచ్చినా కూడా ...అక్కున చేర్చుకొని, ఆదరించి తన ఇంటి లో ....స్థానం ఇచ్చినా తను ఏ మాత్రం అయిన గర్వం చూపించనా ...?, లేదు ...కాపలా కుక్క లా నా వెంట తిప్పుకున్నానా ??..ప్రతి దశ లో తెలంగాణా చూపించిన ఆదరణ కన్పించింది అయిన నేను అన్ని సహించాను అంటూ కొన్ని పాదా లలో అద్బుతం గా చెప్పారు గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె//కుడిదాయి కుడిపి కుతిదీర్చిన//.నిన్నేమన్న కర్రె కుక్కను చేసి//ఎంటదిప్పుకుంటినా? ఉద్యమం తీవ్ర స్థాయి లో ఉన్నపుడు సర్ది చెప్పి మరల కలిపి ఉంచే పెద్ద మనుషుల ఒప్పందాన్ని మననం చేసుకుంటూ రెండు ప్రాంతాలను కలిపి ఉంచే ఒప్పందాన్ని కాగితం పై నిలిపారు ...., కవిత మొత్తము కూడా భార్య తన స్వగతాన్ని చెప్పుకుంటూ ...ఇలా కూలిపోవాల్సిన కాపురాన్ని కాగితం పై నిలబెట్టారు ఇక్కడ ఇన్నాళ్ళు కలిపి ఉంచిన ఒప్పందం ...భార్య భర్తల మధ్య అయిన ..ప్రాంతాల మధ్య అయిన ...విశదీకరిస్తుంది .i నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి//.పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య//కాసింత సర్ది చెప్పి కాయితం మీద కాపురం నిలిపిరి. జరగబోయే అనర్ధాన్ని ముందే పసిగట్టి కలిపి ఉంచే ప్రక్రియ ని ఆనాడే వ్యతిరేకించాను ...కాని సంపదలు నీకు సందేశాలు నాకు అంటూ సర్ది చెప్పి మళ్ళా కలిపి ఉంచారు పెద్ద మనుషల మధ్య కూర్చుండ బెట్టి , నిజమే కదా... //సంపదలు నీకు//సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి//ఈ కాపురం నేనొళ్ళనంటె//కాసింత సర్ది చెప్పికాయితం మీద కాపురం నిలిపిరి. తన ప్రాంతంపు మాండలికం పట్ల జరుగుతన్న అన్యాయాన్ని, హేళన కు గురి కావటాన్ని చూసి సహించ లేక నిలదీసినట్టు గ అనిపిస్తుంది, తన భాష యొక్క సౌందర్యాన్ని వివరిస్తూ ...నన్ను కట్టుకున్నప్పుడు నా భాష ను చీదరించడం ఎందుకు, నా నుడికారాన్ని ముత్యం లాంటి యాస ...ని ఎక్కిరించటం ఎందుకు ...? సత్యమే ... మాతృ భాష అమ్మ తో సమానం అంటారు అలాంటి భాష హేళన కు గురి అవుతుంటే ఎవరికైన బాదేస్తుంది ... //కుడి ఎడమల పెయ్యినొరుసుకుంటూ//కాలపు పలుగురాళ్ళమీద పదునెక్కి పారుతున్న జీవనదులసొంటి భాష//బాగలేదని చీదరిస్తివి.// ఎగిలివారగట్ల//వరిమొవ్వలోని మంచు ముత్యమసొంటి//యాసనెక్కిరిస్తివి తన జీవన విధానం పై కధలు చెప్పి సొమ్ము చేసుకున్నావు, నా నదులను దోచి పెట్టి నీకు ఇస్తే....నీళ్ళకు బదులు కన్నీళ్ళు ఇచ్చావు ....బదులు ఇమ్మని ప్రశ్నిస్తుంది ... కట్టుబొట్టుమీద కథలల్లి..//కోట్లు కూడ పెడ్తివి. సెలిమలు దోచి//సేనెండవెడ్తె//కన్నీళ్ళు నాకాయె//నీళ్లు నీకాయె. తన ప్రాంతానికి వచ్చి ...తన భూమి ని ..తన పంట పొలాలను ఇంటి చుట్టూ సర్కార్ తుమ్మల మధ్య వంటరి ని చేసి బంది ని చేస్తివి ...రోగి లెక్క ఆయాస పడ్తున్న ... నా ఇంటి చుట్టూ మొలిచిన//ప్రైవేటు ఎస్టేట్‌ సర్కారు తుమ్మల మధ్య నేను బందీనైన//ఆస్తమా రోగి లెక్క//శ్వాసకోసం తండ్లాడుతున్న. నా చుట్టూ వున్నవి అన్ని కూడా నువ్వే లాగెసుకున్నవు ...ఒక ప్రాంతాన్ని అబివృద్ధి చేసాక కూడా నాకు హక్కు లేకుండా చేసావు ....కష్ష్ట ఫలాలను నీకు ఇచ్చి ఎముకల గూడు నీ అయ్యాను ...నేను నా ప్రాంతం అన్నప్పుడు ఆవేదన కనిపిస్తుంది ... సూర్యుడు నీవోడయ్యిండు//సుక్కలన్ని నీ కుక్కలయినవి.//బళ్ళు నీవి, గుళ్ళు నీవి మడులు నీవి, మాన్యాలు నీవి//చెమట నెత్తుర్లు ధార పోసి//మిగిలిన బొక్కల గూడును నేను. నా చేతికి ఇంటి తాళాలు ఇస్తూ కూడా నన్ను బొమ్మలా కూర్చో బెట్టి ....నా ఇంట్లో నన్ను బానిసను చేసావు కదా ...అవును ఏమో ... మల్లెసాల మీద మంచమేసి/.సాధికారంగ సకులం ముకులం పెట్టి చర్నాకోల చేతవట్టి//నా ఇంట్ల నన్ను బాంచెదాన్ని చేస్తివి. ఇంకా జరిగిన అన్యాయం చాలు ఇప్పుడు అయిన నాకు న్యాయం కావాలి .....ఇడుపు కాయితం (విడాకులు ...), పెద్ద మనుషల మధ్య ఇద్దరం విడి పోవటమే కావలిసింది అంటూ పరిష్కారాన్ని ముగింపు లో ఇచ్చి రెండు ప్రాంతాలు ...కలిసి ఉండలేము అని నిర్ణయానికి వచ్చినపుడు సోదర భావం తో విడి పోవటం మంచిది కదా ... /ఇగ ఇప్పుడైనా//పనుగట్లకీడ్చి//పంచాయితి పెట్టి//ఇడుపు కాయిదం అడుగక ఇంకేం చెయ్యాలె?// తెలంగాణా ఉద్యమం లో నుంచి పుట్టిన ఎన్నో అధ్బుతమైన కవితలలో ఇది ఒకటి అని నా అభిప్రాయం ...ఎంతో చక్కగా సరళం గా ...వివరించారు ...వారి సంకలంనం లో మరెన్నో ముత్యాలు వున్నాయి..మరొకసారి మంచి కవిత ను అందించిన లింగా రెడ్డి గారికి ధన్యవాదాలు . మరిన్ని కవితా కుసుమాలను అందించాలని కోరుతూ .. సెలవు ... ఫిబ్రవరి 5, 2014 ---- ఇడుపు కాయితం ----- పుస్తెలతాడు కట్టించి తన్నుకు చావమని సాపెన పెట్టిండు సచ్చినోడు. 1 తాటికమ్మల గుడిసన్నా లేదని రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన. కాసులు లేని కనాకష్ట కాలంల నిలువ గరిసెలిచ్చి నిలబెట్టిన. గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె కుడిదాయి కుడిపి కుతిదీర్చిన. నా రామసక్కని కుర్చీ ఇచ్చి సదువుకున్నోనివని రాజును చేసిన. నిన్నేమన్న కర్రె కుక్కను చేసి ఎంటదిప్పుకుంటినా? 2 మర్లువెళ్ళన్నా కాలేదు కాళ్ళ పారాణన్నా ఆరలేదు ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి. పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య అడ్డు తెరలెందుకంటివి సంపదలు నీకు సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి ఈ కాపురం నేనొళ్ళనంటె కూసున్న పెద్దమనుషులు కాసింత సర్ది చెప్పి కాయితం మీద కాపురం నిలిపిరి. 3 కుడి ఎడమల పెయ్యినొరుసుకుంటూ కాలపు పలుగురాళ్ళమీద పదునెక్కి పారుతున్న జీవనదులసొంటి భాష బాగలేదని చీదరిస్తివి. ఎగిలివారగట్ల వరిమొవ్వలోని మంచు ముత్యమసొంటి యాసనెక్కిరిస్తివి కట్టుబొట్టుమీద కథలల్లి కోట్లు కూడ పెడ్తివి. సెలిమలు దోచి సేనెండవెడ్తె కన్నీళ్ళు నాకాయె నీళ్లు నీకాయె. నిల్వ నీడలేదు చెయ్య కొల్వు లేదు ఉనికి ఉనుక పొట్టయితుంటే నా కుర్చి నాక్కావాలంటె ఇకమతులతోటి కాలం కమ్మలు మర్లేస్తివి. 4 నా ఇంటి చుట్టూ మొలిచిన ప్రైవేటు ఎస్టేట్‌ సర్కారు తుమ్మల మధ్య నేను బందీనైన ఆస్తమా రోగి లెక్క శ్వాసకోసం తండ్లాడుతున్న. సూర్యుడు నీవోడయ్యిండు సుక్కలన్ని నీ కుక్కలయినవి. బళ్ళు నీవి, గుళ్ళు నీవి మడులు నీవి, మాన్యాలు నీవి చెమట నెత్తుర్లు ధార పోసి మిగిలిన బొక్కల గూడును నేను. మల్లెసాల మీద మంచమేసి సాధికారంగ సకులం ముకులం పెట్టి చర్నాకోల చేతవట్టి నా ఇంట్ల నన్ను బాంచెదాన్ని చేస్తివి. 5 ఇగ ఇప్పుడైనా పనుగట్లకీడ్చి పంచాయితి పెట్టి ఇడుపు కాయిదం అడుగక ఇంకేం చెయ్యాలె? రచనా కాలం: 29 అక్టోబర్‌ 2007 'తెలంగాణ కవిత 2008' 'సూర్యుడు ఉదయిస్తాడు' సంకలనం

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kMRYUE

Posted by Katta

Kavi Yakoob కవిత

అతి త్వరలో ....!

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bsJMTG

Posted by Katta

Chi Chi కవిత

_ రా(డు)రాజు _ బతుకు బస్సొచ్చింది number లేకుండా!! అదెక్కడికి పోయిద్దో దానికి తెలీదు..నేనెక్కడికి పోవాలో నాకు తెలీదు అమ్మకోసం నాన్నoట , నాన్న కోసం అమ్మoట నాకోసం వాళ్లిద్దరంట , వాళ్ళిద్దరికోసం నేనంట మాకోసం లోకమంట , లోకం కోసం మేమంట ఆడిందే ఆటంట , పాడిందే పాటంట ఏందో!! గర్భరాజ్యంలో ప్రేమయుద్ధం జరిగి పేగుతెగూడినప్పుడు తెలీదు పుట్టుకో గెలుపని!! ఆ గెలుపు ముసుగులో బతుకు మలుపులన్నీ మేలుకొలుపుతుంటే తెలుస్తుంది ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయామని!! instructions లేకుండా entry ఇచ్చి జన్మ prevent అయ్యే chance లేక దేహచైతన్యానికి cure లేక మన బొమ్మలకి దాసోహమై , వాటి కీర్తే కర్తవ్యమై తాతాతాతాతాతాతలతనమెక్కి కూసే ప్రతొక్కరి కూతా " The king`s or queen`s speecH " అయిపోవాలని ఏకాకి వేదికెక్కి చేస్కునే rehearsals గురించి తల్చుకుంటే బిత్తల రాచరికం లేని DNA లేదన్పిస్తుంది!! ImagE is insulator తమ్మీ!! ప్రాణం నరాల్లో పొంగి ప్రవహించి పైత్యం చచ్చి కట్టె గట్లు తెగి కాలం నిలిచి మోక్షం తల నుంచి మొండెంగుండాconduct అయి earthu కి shock ఇయాలంటే స్పృహలో నీ బొమ్మ బూడిదవాల్సిందే జన్మా నువ్వే , బొమ్మా నువ్వే , బూడిదా నువ్వే అని భోధపడాల్సిందే!! Drunk & drivE చేస్తూ నడిరోడ్లోపడి చచ్చే license ఉన్న under18 పిల్లనాకొడుకులకి చెప్పలేం ఊళ్ళో ఎవడమ్మాబాబులకో మోక్షమొచ్చి , వాళ్ళ పిల్లెధవల బతుక్కి చావుని వడ్డీగా 1000cc bike రూపంలో కడుతున్నారని!! అడిగిందే చాలు కొడుకు , దేశం వాడెబ్బ సొత్తనట్టు పాడె road మీదకి తోలిదొబ్బెయటమే!! కృష్ణుడు పామ్మీద cabaret dance ఏసినట్టుoదండి మావాడు mainroad లో 8 ఏస్తుంటే!! అంట స్మశానంలో వాడి మొహం మీద నువ్వు మట్టేయకుండా చూస్కోరా ముదరష్టపు నా జజ్జనకా!! ముచ్చటెటూ మూడ్రోజులే !! మీ ముచ్చట తీరేదాకైనా తమ గెలుపుని అడ్డమైన మలుపుల్లో ఏ lorry కిందో car కిందో or జనం మిందో పడి mortuaryలో park అవకుండా చూస్కోండి!! మాతృడ్రైవోభవ..పితృడ్రైవోభవ __________________Chi Chi (4/2/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1br4SVs

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిత్వం - అభివ్యక్తి ...................... " ఉద్వేగంతో కూడిన భాషయొక్క అత్యున్నత రూపమే కవిత్వం" -Richards. "తన ఉద్వేగాలను అపూర్వ పద్ధతిలో చెప్పేందుకు కవి యత్నం సాగుతుంటుంది. నూతనంగా ఆవిష్కరించాలనుకుని అందుకు ప్రయత్నాన్ని నిరంతరం సాగించే కవులే కవిత్వంలో కొత్త నుడికారాన్ని ప్రవేశపెడతారు. కొత్తదీ, అపూర్వ మైనదని చెప్పదగిన Poetic Idioms ని సృష్టించగలిగిన కవులు మాత్రమే అభివ్యక్తిని శాసించగలుగుతారు. అభివ్యక్తికి మౌలిక ప్రేరణ కవి సంవేదనే [Sensibility]". -సీతారాం 'అదేపుట' సాహిత్యవ్యాసాలు పుస్తకం నుంచి.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iu9Diy

Posted by Katta

Sasi Bala కవిత

ప్రియ నేస్తం !!..........శశిబాల ............................................ కలలెన్నో కన్నాను కన్నీరై మిగిలాను బ్రతుకు దారి లేదనుకున్నా వేగుచుక్కవై వచ్చావు కంట నీరు తుడిచి నీవు కంటి పాపవైనావు ఏ దరినో వున్నా నేస్తమా నా మది దరి చేరావు అక్కు జేర్చి లాలన జేసి మదికి శాంతి కూర్చావు వూపిరున్నత వరకు నీ తోడు వుంటే చాలు ......4 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jc0SNx

Posted by Katta

Krishna Mani కవిత

హైకూలు రాళ్ళలో రత్నం కావ్యంలో కమనీయం నీ మోము నవ్వు ! ********** అరుణ కాంతి అడవిలో జాతర మందు పాతర ! *********** కాలే కడుపు చితికిన బతుకు బిత్తర చూపు ! *********** మకరందమా ? విషమా ?.. నీ చూపులు కానా కొంగును ? కృష్ణ మణి I 06 -02 -2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LS03v7

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || విజయాహస్కర || ప్రాగ్దిశ తీరాన ఆహస్కర శంఖారావం !! జాగృత కిరణ ఖేచరాలతో నవయానం ....! చరా చర తిమిరాజ్ఞానాన్ని దహిస్తూ కొంగ్రొత్త సందేశంతో దండెత్తి వస్తున్న ప్రచండ భానుడు ! నీ ఉషస్సుతో సమస్త విశ్వ గమనమ౦తా సత్య శాంతి మయం కావాలి ..!! 7 – 02 -14 http://ift.tt/1fwvBPE

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LS06qJ

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

//కట్టెలు కొట్టే వాడు//బూర్ల వెంకటేశ్వర్లు// అతను కట్టెలు కొట్టే వాడు అవును నిజంగానే అతడు అన్నంకోసం కట్టెలు కొట్టే వాడు ఇంట్లోని చిన్నమ్ములు కట్నం కోసం అమ్ములు అమ్మ ఆరుగజాల చీరకోసం అతడు కట్టెలు కొట్టే వాడు అతని నల్లని పొట్ట లోపలికి నోరు తెరుచుకున్న గుహలా మారుతుంటే అతడు కాళ్ళను అయస్కాంతీకరించుకొని నడుమ్ముందుకు చాపి పంజా విసురుతున్నచిరుతపులిలా గొడ్డలితో కసిగా కష్టాల కట్టెల్నికొట్టేవాడు మోపులు మోపులుగా మూపున కాయలు కాయించి కుతికెలో పిడికెడు మెతుకుల్ని గుడిసెలో మూడు వెలుగు పుల్లల్ని నిలుపుకునేవాడు ఒకప్పుడు గుట్టుగా బతకడానికి అతనికో గుట్టుండేది గుట్టకో చెట్టుండేది చట్టబద్దంగా ఇప్పుడు గుట్టలేదు చెట్టును పొట్టకోసం కూడా కొట్టరాదు ఇటున్నపుల్ల అటు పెట్టరాని వాడు అతణ్ణి కట్టెపుల్లను చేశాడు చిన్నమ్ములు చెట్టెడు కలలు ఎండుటాకులై రాలాయి అమ్ములమ్మ పాత చీర ఇపుడు మెడకు చుట్టుకుంది. పెట్టుబడి విషవృక్షం చెట్టును గుట్టను పొట్టకూటిని నమిలి మింగింది. అక్కడి సామూహిక సమాధి మీద ఇప్పుడు మూడు మందార పూలు స్మృతిచిహ్నంగా నిల్చొని మార్గ నిర్దేశం చేస్తున్న గొడ్డలి తేది: 04.02.2014

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k81BiS

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-18 జ్వాల ఎందుకని పైకే ఎగియాలి... నీరు ఎందుకని పల్లంలోకి పోవాలి... హైడ్రోజన్,హీలియం,ఆక్సిజన్ ఇంకా పరమాణువులంటూ చెబుతున్నావా మనో మిత్రమా... ప్రకృతి తన వ్యూహాన్ని ఎప్పుడో రచించిపెట్టుకున్నది..! ఒక్కొక్క పొరనే చీల్చుకుంటూ వెళుతున్నాం నువ్వు అటువైపు నుంచి నేను ఇటు వైపునుంచి ..! ---------------------------------------- 4-2-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ipu28V

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఏం రాయను . . . ? ? శతాబ్దాల నిశ్శబ్దంలో అర్ధం కాని శబ్దాలు . . గడ్డకట్టిన శైత్యంలో గోరువెచ్చని కిరణ స్పర్శ . . వారగా వేసిన తలుపు సందుల్లోంచి ఓరగా తొంగి చూస్తున్న చిలిపి చిరుగాలి . . మనసు వాకిలికి కట్టిన మౌన తెరలు భావ పవనాలకు అలవోలె కదులుతుంటే వాల్చుకున్న రెప్పల్లో అలవోకగా దోబూచులాడే ఊహ ఆగి పోయావేం . . ? వ్రాయమంటోంది . . కానీ . . ఏం రాయను ? ఎద పాత్ర పొంగి పొర్లితే జాలువారే అమృతపు సొనలైనా . . కావాలి . . గుండె గోడలు బ్రద్దలయితే జారిపడే రుధిర ధారలైనా . . కావాలి . . నా కలానికి . . ! ! సవ్వడి లేని ఎదసడిని రూపం లేని మధురోహని ఆకృతిలేని ఆలోచనా సందోహాల్ని భావంలేని స్తబ్ధ సుషుప్తతనీ చలనం లేని చూపునీ చూపు లేని చలనాల్ని శూన్యం నిండిన విశ్వాన్ని విశ్వం నిండిన అంతరంగాన్ని ప్రేమ లేని మనసునీ మనసు లేని ప్రేమనీ. . జీవం లేని జీవితాన్నీ జీవితం లేని జీవాన్ని. . శబ్దాల నిశ్శబ్దాన్ని . . నిశ్శబ్దాల శబ్దాన్ని. . సమూహాల శూన్యాన్ని. . శూన్యాల సమూహాన్ని. . అర్ధం తెలియని అక్షరాల్ని అక్షరాలు లేని అనుభూతినీ ఎలా . . ఎలా . . ఎలా కాగితం మీదికి ఒంపను? :తేది : 04.02. 2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e0M4ZK

Posted by Katta

Jagadish Yamijala కవిత

కనిపించకుండా పోయింది నా హృదయం ----------------------------------------------- నీడను నమ్మిన నీకు నిజాన్ని నమ్మే మనసు లేకుండా పోయింది మాటను ప్రేమించిన నువ్వు ముఖాన్ని చూడటంతోనే నేను నచ్చకుండా పోయాను నవ్వును ప్రేమించిన నువ్వు నవ్వు అందాన్ని ఆస్వాదించడం తెలియకుండా పోయింది ఊహల్లో ఉన్న నీకు ఆలోచించడం తెలియకుండా పోయింది విలాసాలు కావాలనుకున్న నువ్వు జీవితంలోని వర్ణాలు తెలియకుండా పోయాయి నీకు ఇవన్నీ తెలియకుండా పోవడం వల్ల నా హృదయం తెలియకుండా పోయింది నీకు -------------------------------------------------- యామిజాల జగదీశ్ 6.2.2014 ------------------------------------------------- ..

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itB6AV

Posted by Katta

Panasakarla Prakash కవిత

ఏదీకాదు...! ఇ౦దాక..... ని౦గి ప్రమిదలోని సూర్యుడు కొ౦చె౦..కొ౦చె౦గా.. కొ౦డెక్కుతున్నప్పుడు దిక్కులు చీకటినిమిషాలై మౌన౦ పాటి౦చాయి నల్లని దుప్పటి కప్పుకు‍‍౦టూ ఆకాశ౦ నిరస‌న తెలిపి౦ది లోక౦లో దు:ఖ౦ తరువాతి నిశ్శబ్ధ‍‍‍‍‍‍‍‍‍‍‍‍౦ కట్టలు తె౦చుకు‍౦ది స౦తాపసూచక౦గా శరీర౦ రెక్కల జె౦డాను అవనత౦ చేసి౦ది మరి ఇప్పుడు..... సూర్యుడు వెళ్ళిన చీకటిలోను‍‍‍‍౦చి చుక్కలు పొడుచుకొస్తున్నాయ్ మౌన౦ వీడుతున్నట్టు దిక్కులని౦డా వెన్నెల పరదాలు పరుచుకు౦టున్నాయ్ ని౦గి ప్రమిదలో ఇప్పుడు చ౦ద్రుడే సూర్యుడై ప్రకాశిస్తున్నాడు నిశ్శబ్ధ౦ ఒక దిక్కులో ధృవతారై వెలిసి అన్ని దిక్కులను ఏలుతో‍‍‍‍‍౦ది శరీర౦..కొత్త జె‍‍౦డాను ని౦గిలోకి హుషారుగా ఎగురవేస్తో౦ది ఇక్కడ.....తెలుసుకోవాల్సి౦ది ఒక్కటే.......... ఒకరు వెలిగి౦చి వెళ్ళిన దీపమెలా శాశ్వత౦కాదో ఒకరు పోయిన తరువాత వచ్చే చీకటి కూడా అలానే శాశ్వత౦ కాదు పనసకర్ల‌ 04/02/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bZlyAl

Posted by Katta

Mohan Rishi కవిత

ద్వంద్వ సమాసం - దాసరాజు రామారావు శ్రావ్యంగా వినడానికి వీనులు గావాలె అరవై ఏండ్ల కల వలపోతని వినకపోవడానికి బ్రహ్మ చెవుడు గావాలె తెరిపిలేని వీక్షణానందానికి అక్షులు గావాలె తనువుల నంటువెట్టుకుని బతుకుల బుగ్గి చేసుకున్న అమర దృశ్యరూపాలు కనబడకపోవడానికి గుడ్డి కనుగుడ్డొకటి గావాలె తెలుగు తేనియలు చప్పరించడానికి సమైక్యపు లాలాజలంలో ఈదడానికి రుచికరమైన నాలుక గావాలె ఆంబుక్క పెట్టడానికి అడ్డుకునే అడ్డగోలు మాటల కోసం మడత పడ్డ నాలుక కూడా గావాలె హాస రేఖల ప్రదర్శనకు ముఖారవిందం గావాలె ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినట్టు టీవీలో చూపినపుడు వికృత ప్రకోపాల జేవురింపు మొహం అత్యవసరంగా గావాలె విశ్వాన్ని ప్రేమించగలిగే విశాల సహృదయత గావాలె నోటికొచ్చే బుక్క నెత్తగొట్టడానికి ఎంతకైనా దిగజారే కుత్సిత మనసు గట్టిదే ఖచ్చితంగా గావాలె కుప్పమో కడపకో తప్ప తంగెళ్ళు దాటని కాళ్ళతో సీమ చెట్టుకో, కోస్తా మిర్చికో తప్ప పెట్టుపోతలు జరుపని చేతులతో వెయ్యికాలాల పెత్తనం ఎన్నికల్లేకుండా మాకే గావాలె ప్యూపాదశ నుంచీ సీతాకోకచిలుక అయ్యేవరకూ 1953 అనంగీకార కలివిడి మొదలు 2013 నిరవధిక కన్నారని ఆకాంక్ష వరకూ అడ్డుకొంటూనే వుండాలె అయితే గియితే అన్నీ అన్నీ అన్నీ వున్న హైదరబాద్ మాకే గావాలె విడిస్తే గిడిస్తే మా భీషణ ప్రతిజ్ఞలేం గాను తొడగొట్టిన పౌరుషాలేం గాను తేరగా మేసే మా నోరేం గాను అంచేతా మేమందరం గుడ్క వొదల బొమ్మాళీ నిన్నొదల…!!! (వాకిలి, ఫిబ్రవరి-2014)

by Mohan Rishi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bZlyQO

Posted by Katta

Mala Chidanand కవిత

॥హృదయ కమలం॥ మోహన రాగము మదిలో నీవేమో నా హృదయములో.. అకుంఠిత దీక్ష నా ప్రేమలో అనురాగమోలుకుతుంది నీలో.. ప్రసన్నాత్ముడు నా స్వామి అతడున్న తావే ఆనందజలధి.. లాలిత్యము అతని పలుకులో కారుణ్యము జగన్నియామకుడిది.. పద్మనాభుడు నా దేవుడు అతని పదపద్మ సేవికను నేను.. కస్తూరితిలకాంకితుడు విభుడు ఆ నామములోని గంధము నేను.. మహామహితాత్ముడతడు అతని మందహాసములో నేను. క్షీరసాగరశయనుడతడు అందులోని బిందువుని నేను. సర్వజన పరిరక్షకుడు శ్రీకృష్ణుడు అతని కృపాకటాక్షములో నేను. ॥మాలచిదానంద్॥4-2-2014||

by Mala Chidanand



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1emPBYp

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/చీకటి నా గదంతా చీకటి కమ్మేసింది నా నేస్తమై నన్ను చుట్టేసింది కళ్ళు తెరవగానే ఒక్కసారిగా వచ్చి నన్ను కౌగిలించుకుంది.. బహుశా తనను ఎవరు ఇష్టపడకపోవడంవల్లేమొ నేనంటే అంత ప్రేమ తన శరీరాన్ని నా ముందు పరిచింది నగ్నంగా నేనెం చేయలేనట్టు తన ఒళ్ళంతా తడిమి చూశాను ఎక్కడైనా వెలుగు చుక్కలు అద్దుకుందేమోనని ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంది నేను తాకిన ప్రతిసారి నేనడుగుతుంటాను తనని... నీ ఒంటి నిండా ఈ నల్ల రంగేమిటని? ఒక చిరునవ్వు(చీకట్లోనే)­ నవ్వి అంటుంది నేను మాత్రమే స్వచ్చంగా ఉండగలను ఎవరు ఆస్వాదించినా,మరెవరు అసహ్యించుకున్నా అని... అప్పటినుండి తనను నాలోకి నింపుకుంటూనే ఉన్నా ఇష్టంతో తనొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ప్రతి రాత్రి నాతో రమిస్తూనే ఉంటుంది తన నలుపు వర్ణాన్ని నా ఒంటికింత పులుముతూ ప్రతిరాత్రి తన ఒళ్ళోనే భావప్రాప్తి పొందుతుంటాయి నా చిక్కని జ్ఞాపకాలు ఇంకా నా పక్కనే తనను పరచుకొని పడుకుంది నాతోనే.... తిలక్ బొమ్మరాజు 04.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fWIcML

Posted by Katta

Sukanya Beegudem కవిత

** ఆణి ముత్యం ** మనసనే కలవమని వయసనే జత కట్టమని జ్ఞాపకమనే తలవమని బిడియమనే సిగ్గుమొగ్గేయమని నడకనే ఏడడుగులేయమని వాత్సల్యమనే కలసుండమని మమతయనే ఒడిపట్టమని ధరహాసమనే ముద్దాడమని (బిడ్డని) **** అమ్మతనమనే ఆనందాల ఊగమని ఆనందభాష్పమనే నీ బిడ్డ ఆణిముత్యమని బోసినవ్వనే కల్మషంవద్దని బుడిబుడిఅడుగనే అడుగులు తడబడవద్దని మృదు స్వర్శనే స్పృహతోయుండమని వేలిగేకనులనే కరుణగలిగియుండమని చిరుచేతిదెబ్బయనే చేయిచాచినా అంతానీవారేయని . ప్రేమపాదరసమనే అమృతః హృదయాలలో జారిపోమ్మని. !!సుకన్య!!04/02/2014.

by Sukanya Beegudem



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jazj79

Posted by Katta

Sreedhar Babu Pasunuru కవిత

"The Wolf of Wall Street" -పసునూరు శ్రీధర్ బాబు .... చెప్పకూడనివి చెప్పాలనిపిస్తుంది దాచుకోవాల్సినవి చూపించాలనిపిస్తుంది చచ్చేదాకా బతికేందుకు ఇన్నేసి రహస్యాలను కాపాడాల్సిన దౌర్భాగ్యమేమిరా దేవుడా? చీకటిలో తెరుచుకున్న రంగస్థలం మీద రహస్యాలభంజికలతో రాజుకుని మాడి మసైపోయి పొగల సెగల ఆనవాళ్ళతో లుంగలు చుట్టుకుపోతూ ఏదేదో రాసేయాలనిపిస్తుంది నెత్తుటి వెలుతురులో దుఃఖపు చీకటి అక్షరాలతో.. కోర్కెల రాత్రిలో మసిలే కన్నీటి వ్యాకరణంతో.. ఒక బ్లాక్ కామెడీ.. కరెన్సీ నోట్ల మీద కెలికేసి నలిపేసి... చెత్తబుట్టలో పారేసి- చెత్తబుట్టలు టేబుల్ కిందే ఉండవు.. లేబిల్ లేకుండా లోపల్లోపల నోరు తెరుచుకుని చూస్తూనే ఉంటయ్.. దీర్ఘాలోచనల నిట్టూర్పులను బుసకొడుతూ జుర్రుకునేందుకు- ముసలాడు మార్టిన్ స్కోర్సీస్ ఎప్పటికీ ఓ పాతికేళ్ళ తోడేలు భయపెడుతున్నాడు ముసుగులన్నీ పరపరా చింపేసి- సిగ్గుతో చచ్చిపోతున్నామిక్కడ.. వలువలన్నీ తీసేస్తుంటే.. విలువలు లేని బతుకులు తట్టుకునేదెట్లారా? టెడ్డీ బేర్ కన్ను ఆవురావురుమంటూ ప్రియురాలి రహస్సౌందర్యంలోకి చొరబడి చొంగకారుస్తుంటే.. ముక్కుపుటాలదిరేలా మాదక ద్రవ్యాన్ని మస్తిష్కంలోకి పీల్చుకున్నాక నైతికత ఒక అస్పష్ట కళాఖండం.. ఆధునిక దృశ్య కావ్యం... 'ఓహ్... ఐ జస్ట్ కేమ్.. డిడ్ యూ?' ..... (12.35 a.m. ఫిబ్రవరి 4, 2014)

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6NASF

Posted by Katta

Krishna Mani కవిత

హైకూ **** వోల్వో సుఖం జగజ్జనితం హైవే రేసు యమగండం కృష్ణ మణి I 04 -02 -2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k72ecs

Posted by Katta

వెంకట చలపతి బాబు కూరాకుల కవిత

కూరాకుల వెంకట చలపతి బాబు || ఆవే(దన)శం || అయ్యో!.. అటుచూడండి.. ముక్కు పచ్చలారని పసికందు పంచవర్షములైనా నిండని చిట్టితల్లి.. అమ్మ చేతి గోరుముద్దలతో అమ్మ నోటి లాలిపాటలతో ఆనందించి.. తన ముద్దు ముద్దు మాటలతో చిలిపి చేష్టలతో.. అందరిని పరవశింపచేస్తున్న ఆ బుజ్జి తల్లిని చూడండి.. మృత్యువుతో ఎలా పోరాడుతుందో.. ఆ మృగాడి పైశాచికానికి ఎలా తల్లడిల్లి నరకయాతన అనుభవిస్తున్నదో.. అ!.. అటు చూడండి.. ఆ దారుణం చూడండి.. చదివి ఇంటికి వెలుగులు పంచాలి అనుకున్న ఓ చెల్లి జింక పిల్లను సింహాల మంద వేటాడినట్లు తమ వాంఛను ఎంత కిరాతకంగా తీర్చుకున్నారో.. "అమ్మా! మృత్యుదేవతా.. నాకు ఈ లోకంలో ఉండాలి అని లేదు.. మూగ జీవులను భక్షిస్తూ మృగాలుగా మారి అణువణువు కామకాంక్షతో తిరుగుతున్న ఈ దౌర్భాగ్యుల మధ్య వావి వరుసా, చిన్న పెద్దా తేడా లేకుండా కోరిక తీర్చుకుంటున్న ఈ కీచకుల మధ్య నేనుండలేనమ్మ.." అంటూ అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడి మృత్యుదేవత ఒడికి చెరిన ఆ సోదరిని చూడండి.. హా!... ఏమిటి ఈ ఘాతుకం.. పసిపిల్లల అపహరణ.. పసికందుల ప్రాణం విలువ ధనమా? ఎంతటి క్రౌర్యం? ఎంతటి నీచ సంస్కృతి.. ఛీ.. ఛీ... తూ తూ... జీవితాన్ని ఎలా గడపాలో తెలియని దౌర్భాగ్యులారా.. "స్త్రీ"ని ఎలా గౌరవించాలో తెలియని అధములారా మనిషిని మనిషిగా చూడలేని ఆటవీకులారా.. అతివ కూడా మనలానే.. చీము రక్తము మాంసపు ముద్దలు కలిగిన మాములు జీవి అని గుర్తించని మూర్ఖులారా.. ఎందుకు మీకీ బ్రతుకులు..? ఎందుకు మీకీ జీవితాలు..? 04-02-2014 /** పత్రికలలో రోజు చూస్తున్న కొన్ని సంఘటననుండి ప్రేరణ పొంది రాసిన భావాక్షరాలు

by వెంకట చలపతి బాబు కూరాకుల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6W6AW

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। ఆకాశం కన్నీరు కార్చింది ।। --------------------- కళ్ళకు అదో కనికట్టుల మాయాజాలమే కనుచూపు మేర సూన్యమే అయినా అందమైన నీలి చిత్తరువే ఆ ఆకాశం. బగబగ మండే సూర్యతాపాన్ని వడకట్టి నీలి నీరెండనే జగతికి పంచేను నేల మనుగడకు గొడుగై రక్షణ ఇచ్చేను. తన బిడ్డల మేఘాల కౌగిలింతల్లో చినుకై వర్షించి అవనికి సొగసులెన్నో అందించేను. చీకటై తాను నల్లబారినా రేరాజుని నొసటన దిద్దుకుని మురిసిపోతాది. ఇంతలో ఓ ఘనుడు పుట్టాడు స్వార్ధం ,పగ కోరాడు పరిశ్రమలు ,కాలుష్యం సృష్టించాడు పంచభూతాలను శాశించాడు పచ్చని హరితవనాల్ని హరించాడు ప్లాస్టిక్ వ్యర్ధాలను పెంచాడు నీలాకాశానికి పొగబెట్టి, ఉక్కిరి బిక్కిరి చేసి, సహజ ఋతువులను మాయం చేసి మేఘమధనాలతో గాలిలోనే విన్యాసాలు గావించాడు. ఊహలకు ,మేధస్సుకి రెక్కలు తొడిగి రాకెట్లను అగ్నిగోళంలా మండిస్తూ నింగిని చీల్చి అంబరంలో సంబరమన్నాడు. నిరంతరం మండే సూర్యతాపమే బరించింది మాయ మనిషి పెడుతున్న మంటకు ఆకాశం కన్నీరు కార్చింది ! (04-02-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nMloVm

Posted by Katta

Kavi Yakoob కవిత

తెలుసా ? Six angry youngmen formed as Digambara Kavulu ( Naked Poets ) in 1965 Jwalamukhi (Telugu: జ్వాలాముఖీ) was the pen name of Veeravalli Raghavacharyulu (April 18, 1938 – December 14, 2008), who was an Indian poet, novelist, writer and political activist. Jwalamukhi won the national Sahitya Akademi Award (Hindi) for his novel Rangeya Raghava Life History. Among the other more prominent of his novels and thousands of poems were Veladina Mandaram, Hyderabad Kathalu and Votami-Tirugubatu. Jwalamukhi was a prominent member of the "Digambara Kavulu", a group of rebel poets whose views and style is recognised as a decisive break in the history of modern Telugu literature. He was also a co-founder of the Revolutionary Writers Association (Virasam) in 1970, an active member of the Organisation for People's Democratic Rights and a founder of the India-China Friendship Association. He was the Andhra Pradesh secretary and national vice president of the India-China Friendship Association until his death. He was born in the Sitarambagh section of Hyderabad. He founded Sitarambagh Residents Welfare Association and opposed Laxmi Nivas Ganeriwal.[1] After the foundation of Virasam in 1970, Jwalamukhi was arrested in 1971 for his writings along with two other Virasam members under the AP Preventive Detention Act.[4][5] One of his poems was proscribed under Section 99 of the Code of Criminal Proceedings, and all copies of the book in which it appeared were seized. "An electrifying speaker, Jwalamukhi travelled extensively and lectured across the state Andhra Pradesh and beyond for decades", according to an article in The Hindu. "He was associated with nearly every major social movement in Andhra Pradesh for well over three decades." He died at a corporate hospital at Somajiguda on December 14, 2008, from a heart attack while receiving treatment for liver cirrhosis, from which he suffered for the previous year. He was survived by his wife, Sita Devi, and sons Sampath Kumar, Sridhar and Vasu.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6NB9b

Posted by Katta

Sudarshan Punna కవిత

హైకూ/ పున్న సుదర్శన్ మూగ వెదురే శ్వాసించినప్పుడల్లా రాగఝరులే ****** నేను నీవయ్యే సంయోగ వైఫల్యంలో నీవూ నేనూగా

by Sudarshan Punna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fqAgTn

Posted by Katta

Surya Prakash Sharma Perepa కవిత

"మలినం లేని ప్రేమ" -వేదాధ్యయ [06-Feb'14] మలినం లేని ప్రేమ పొందాలనుకుంటున్నావా!! మలినం లేకుండా ప్రేమించు. ద్వేషపు మరకలు పడతాయి అనుమానపు బూడిద అంటుతుంది కాచి శుభ్రం చేసుకో సున్నితమైన ఆలోచన సబ్బుతో... పురుగులు కొరుకుదామని మాటువేస్తాయి వద్దని నచ్చజెప్పు, మందలించు ప్రేమతో... చంపుదామని చూస్తున్నావా!!? వాటి బంధువులొస్తాయి జాగ్రత్త, పగతో... ప్రేరణ లేక చిరుగులు పడతాయి. అల్లెయ్ నీ ప్రేమను మనసుపెట్టి పవిత్రమైన సమయ మగ్గాన్ని అందుకుని, మేలు జాతి సహన దారాలతో... మలినం లేకుండా చూసుకో నీ సహజ ప్రణయ వస్త్రాన్ని. మలినం లేని ప్రేమకై నీరీక్షణలో నీ పాత చర్మం రాలిపోనీ వేయి కాంతులతో కొంగ్రొత్తగా నీ ప్రేమ చర్మమై చేరేవరకు మలినంతో నిన్ను చేరిన ప్రేమ నిన్ను తాకినంతనె శుభ్రమైపోతుంది. మలినం లేకుండా ప్రేమించు నేస్తం! మలిన రహిత ప్రేమను ఆస్వాదించడానికై...

by Surya Prakash Sharma Perepa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itd0Gt

Posted by Katta

Naveen Auvusali కవిత

||అర్థం కాని రాక్ష(సరాజ్యం) ||నవీన్ అవుసలి|| ఏవేవో మౌన భావాలు ఎందుకో బలిసె దిగిన మూగ బాధలు .. సమరం చేసి సమాజాన్ని నిస్తేజం చేయమనా సంధి చేసి సత్తువల్ని నిస్సత్తువలు చేయమనా .. ఆత్మ రక్షణకై రాక్షసత్వాన్ని రేకెత్తించమనా అడుగంటిన అంతరాత్మని అంతమొందిన్చమనా .. కొమ్ములతో కుమ్మేసే క్రూరమృగాలని వేటాడమనా కోట్లతో కుమ్మక్కయ్యే కోడెనాగుల కోరలూడమనా.. అస్త్ర కైవసం చేసి అసురున్ని అడ్డంగా సంహరించమనా అస్త్ర సన్యాసం చేసి అసురిడికి ఆకలి నైవేద్యమవమనా .. గెలుపులేని ఓటమితోనే గెంతుతూపోమనా కుళ్ళు కుతంత్రాలు తాళలేక విగధజీవియై విశ్రాంతి తీసుకోమనా ...

by Naveen Auvusali



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1itd0pS

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kJE6dP

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

సంధానం *********** నిన్నటిదాకా నేను ఎదురయిన ప్రతి వాడినీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసాను. కప్పదాటు జవాబులతో కొందరు వినీ వినబడనట్లు నటిస్తూ, మరికొందరు నేనుకనబడగానే దివాంధుల్లా నటిస్తూ తడబడుతూ, దారిమర్చేవారు , ఇంకొందరు. ఎవరూ నాప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేకుండా పోయారు. అందుకేకొన్నాళ్ళు నేను ఆప్రశ్నలను వాటి మానాన వాటిని వదిలేసి మౌన్నాన్నశ్రయించాను ,మహర్షిలా. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది అందరూ నన్ను ప్రశ్నల తో మూకుమ్మడిగా అదేపనిగా, దాడి చేస్తున్నారు. భావికాలపు జీవనగతిని గూర్చి నిజం చెప్పండంటూ నిలదీసి నిలువునా వేధిస్తున్నారు. అనూహ్యమైన ప్రశ్నల జడిలో నన్ను అన్యమనస్కం గావిస్తున్నారు అమ్మయ్య ఇప్పుడు జనంలో చైతన్యం, ప్రవాహంలా ఉరకలెత్తుతున్నది అబ్బబ్బబ్బో నన్ను ఎనలేని ఆనందం ఆర్ణవమై ముంచేస్తున్నది . చిరకాలపు నా వాంచ చిత్రంగా నెరవేరుతున్నది. సమాధానాలతో సంధానమై నిలువెల్లా, పులకించి పోతున్నాను 05-02-2004 -----------------------

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWq9Ju

Posted by Katta

Kavi Yakoob కవిత

Selected readings : అతి మామూలుగా బరువూ,హంగూ, ఆర్భాటాల్లేకుండా అతి సాధారణంగా సాగిన కవిత. స్వగతంలా,తనతో తను,తనకోసం తను చెప్పుకున్నట్లుగా సాగిన కవిత. పక్కన కూచుని ముచ్చట చెబుతున్నట్లుగా ఒక రహస్యమేదో పంచుకున్నట్లుగా ఉంది కదూ ! పలమనేరు బాలాజీ | ప్రశంస ................................. నువ్వెప్పుడైనా ప్రశంసకు లోబడ్డావా? ప్రశంసతో ఒక్కరిద్దర్నయినా దగ్గరకు తీసుకున్నావా? నిద్రలేస్తావు తయారవుతావు రాత్రికి అలసటతో నిద్రతో ఖాళీగా వస్తావు ఇల్లు నిన్ను- సాయంత్రంనుండి ఉదయందాకా పూరిస్తూ వుంటుంది. ఖాళీలన్నీ పూర్తయ్యాక భుజబలాల్ని సరిచూసుకుంటూ దారుల్ని వెతుక్కుంటూ -లేదా ఒక్కో దారినే నిర్మించుకుంటూ నువ్వలా పరమోత్సహంగా నీ లోకంలోకి వెడతావ్ నీవెంట లోకం నడుస్తుందంటావు ప్రణాళికలు, యుద్ధాలు, నిర్మాణాలు చేసేవాడా - నిన్ను నిత్యం పునర్ నిర్మించే ఇంటినెప్పుడైనా ప్రశంసించావా ? [పలమనేరు బాలాజీ 'ఇద్దరి మధ్య' సంపుటి లోంచి ]

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nMcFm5

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || మూసిన కనురెప్పల వెనుక చిలిపిగ నవ్వుతూ నీవు || ------------------------------------------------------------------------------ దాచలని చూసినా దాగలేనిది మది ఊసుల ఊయలలు అనగారిన మురిపాలు అందిపుచ్చుకునే సమయం దగ్గరై మనసు గిలిగింతలు పెడుతున్నాయి... మది అళ్ళ కళ్ళోలం సాక్షిగా మదిసరాగాలు గిచ్చి గిలిగింతలు పెడుతున్నా.. మనం ఏకమై మమేకమై ఇద్దరం ఒక్కటై ఆసరాగాలు పాడుకునే వేలాయనా...? ఎవరన్నారు మన ప్రేమకు ఎటువంటి అడ్డుగోడలు ఉన్నాయని మనమధ్య ఏ విధమైన పొరపొచ్చాలు కావవి దూరంగా ఉండి దగ్గరవ్వడమే కదూ నీలోని సొగసుల సోయగాలు నాలో రేపెను వలపుల తరంగాలు మనసైన వాడిని కాబట్టేనేమో ప్రతి హృదయ స్పందన తెలుసుకున్నా తలచుకున్న క్షనానే గుండెలదరగా కవ్విస్తున్నావు మూసిన కనురెప్పల వెనుక చిలిపిగ నవ్వుతూనీవు

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N5a3lu

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిత్వమూ ,కవులు కలుసుకునే / కలిపే చోటు !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bpJgJ9

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

పిల్లారాయాష్టకము వారణాసి రామబ్రహ్మం 6-2-2014 ౧. కల్లోలిత సరసిని కనిపించదే ప్రతిబింబము నిలువదు సంక్షుభిత హృదయమున నీ మూర్తి మదినిండ నిండి నెమ్మది నిమ్ము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౨. నాసికాత్రయంబకమున నాజూకుగా మొదలై మరటాంధ్ర సీమల ఏరుల సెలయేరుల కలుపుకు నదిగ మారి భద్రగిరి రాముని పాద పద్మములకు పాద్యమై పున్నెములప్రోవై పట్టిస వీరభద్ర స్వామిని చుట్టుముట్టి అఖండ గౌతమై అన్నపూర్ణయై గోదావరి లవణాబ్ధిని కౌగలించుదరి నుంటివి ప్రసన్న వీక్షణముల ప్రపంనుని కావుము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౩. సిద్ధి బుద్ధి పతివి నీవు శ్రీవల్లి దేవసేనాపతి తమ్ముడు; మంచి బుద్ధుల సిరుల సంపత్తుల నిచ్చి బ్రోతురు మమ్ము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౪. సంసారపు బండిని లాగు మాకు బాడిబందల దారిని కాడి భారమయ్యె కలతల వడిని అలజడిని బాపుము పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౫. విలసిల్లును సదా పూవుల పిందెల కాయల నారికేళ వృక్షము కళ కళలాడును గృహములు సదా పిల్లలు పాపలు పెద్దలతో తళతళలాడును మీ మోము మామ్ము కాచుతరి భళి! భళి! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౬. భావముల వరుసయే మనసు; నిరంతర కామ భావనయే మన్మథుడు; ప్రియమెప్పుడు మదిని మెదలుటయె వలపు; తలపుల సదా మీరుండుటయే భక్తి! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౭. మీరు లేనే లేరని నాస్తికులు, అంతట మీరేనని ఆస్తికుల తగవులాటలు మొదటినుండీ శంకిసుమంతయును లేని నమ్మకము కుదుర్చుడు పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! ౮. జగమంతయును అల్లకల్లోలములు హాహాకారములగ నున్నది దేవుని పేరనే జరుగుచున్నవి దారుణములు మతముల మతులు సరిచేసి మమ్ము కాచుడు పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో! తటిల్లతా సమరుచి గాత్రి తల్లి పార్వతి అనుంగుపట్టీ! అనుగ్రహము చూపి వ్రాయించితివి నాచేత నీ అష్టకమును వ్యాసమౌని మేటి వ్రాయసకాడా! ప్రీతితో గొని దీనిని బ్రోవుము నన్ను సమస్తవిద్యా ప్రదాతా! సకల విఘ్నాన్తకా! ఈశ్వరకుమారా! ఐశ్వర్య కారకా! పిల్లారాయ ప్రభో! యానాము పుర విభో!

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kW3c9h

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిత్వం -వ్యక్తిత్వ వికాసపరిమళం !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6t3O3

Posted by Katta