పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జూన్ 2014, శనివారం

Achanta Hymavathy కవిత

చుక్కాని ------------ మహిళా నీవు మహి వలెనే ఓరిమివి. నెలతా నీవు నెమ్మది గల నేర్పరివి. ఉవిదా నీవు ఉవ్వెత్తున పొంగే ప్రేమ జలధివి. అతివా నీవు- పురుషాతిక్రమణను నియంత్రించగల- అపరాజితవు. మగువా నీవు- ముగ్ధత చాటున... దురన్యాయాలను ఎదిరించే- ధైర్యసాహసాలు శక్తిగా- పెంపొందించ గలవు. అనురాగదాయినీ... ఎవరమ్మా నీకు సాటి?! సుహృదివి నీవు, కుటుంబానికి, దేశ ఔన్నత్యానికి... చుక్కానివై-అన్నింటా... కర్తవ్య పారీణవై---- అమృత దాయినివై-- పరిఢవిల్లు మమ్మ!! ---ఆచంట హైమవతి. మార్చి-2013,జాబిలి-మాస పత్రికలో ప్రచురణ.

by Achanta Hymavathy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lvc0Fc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి