పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Rajarshi Rajasekhar Reddy కవితby Rajarshi Rajasekhar Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eNit6D

Posted by Katta

Rajarshi Rajasekhar Reddy కవితby Rajarshi Rajasekhar Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oNuK3A

Posted by Katta

Buchi Reddy కవిత

2-18-14 **** తెలంగాణా బిల్లు కు లోక సభ ఆమోధం---అమ్మయ్య తెలంగాణా వచ్చింధీ--జయ హో జై జై తెలంగాణా *************** తెలంగాణా బిల్లు కు లోక సభ ఆమోధం అమ్మయ్య తెలంగాణా వచ్చింధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింధీ బి .జె .పి---- సహకరించింధీ 60 ఏళ్ల పోరాటం ఎన్ని ఉధ్యమాలు ఎన్ని ఆత్మ బలి ధానాలు ఎన్ని పోరాటాలు ఎన్ని త్యాగాలు ఎట్టా కెలకు తెలంగాణా కు స్వాతంత్రం వచ్చింధీ తెలంగాణా కు విముక్తి లభించింధీ ఈ రోజు తెలంగాణా అంతటా తెలంగాణా ప్రజలు అన్ని జిల్లాల్లో-- అన్ని గ్రామాల్లో ప్రజలు సం బు రాలు జర్పు కుంటున్నారు బతకమ్మ -- బతకమ్మ ఊయ్యాలో తెలంగాణా వచ్చింధీ ఊయ్యాలో అంటూ నేడే-- తెలంగాణా కు దీపావళి= ధ స రా-- ఉగా ధీ-- సంక్రాతి--- పెప్ప ర్ స్ప్రే ల తో డబ్బుతో కపట నాటకాల తో లేనిపోని కూతల తో ఎన్ని రకాల మోసా లు తలపెట్టినా పూటకో మాట సాటు కొ ముచ్చ ట నే టూ కొ ముచ్చ ట--- ఎన్ని లేని పోనీ పొత్తులు పెట్టుకున్నా--- మాట తప్పినా బాబు గారు క్రమ శిక్షణ లేని కిరణ్ గారు--- అన్ని అడ్డంకులు అధిగమించి ప్రజా సామ్యం విజయం సాధించింధీ తెలంగాణా వచ్చింధీ జయ శంకర్ జి--- జనార్ధ న్ జి కాళోజీ గారు--- మీ కలళూ నిజం అయ్యాయి మీ కృషి ప లించింధీ మీ బాట--- మీ మాట--- నెగ్గింధీ దీవించండి నాలుగున్న ర కోట్ల తెలంగాణా జనాన్ని అమరవీరులారా మీ త్యాగ పాలం--ఈ జై తెలంగాణా జయ హో-- జై జై తెలంగాణా సీమాంధ్ర అన్నలు---అక్కలూ ప్రాంతాలుగా విడిపొయినా కలిసి ఉంధాం కలిసి బ్రతుకుధా౦ అప్పుడు-- ఇప్పుడు-- ఎప్పుడూ మేము కోరే ధీ కోరు కునేధీ-- అధె విడిపో ధా౦ కలిసి ఉంధాం కోర్ట్‌లు వద్దు కేసులు వద్దు లోల్ళులు వద్దు తగల బెట్టాడాలు-- ధర్నాలు వద్దు 29 వ రాష్ట్రం గా తెలంగాణా వచ్చింధీ-- ఏర్పడి తీరుతుంధీ రండి కలిసి బ్రతుకుధా౦--- కధలండి జహాయో--జై జై తెలంగాణా -------------------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e4pCzi

Posted by Katta

Rasoolkhan Poet కవిత

* సృష్టికర్త * ప్రపంచానికి రంగులద్దిన వాడిని ప్రకృతిలో వెతుకుతున్నావ్ నీ సేవకై వచ్చిన వాటికే నువ్వు సేవకుడివయ్యావ్ అన్నిటికై ఆరాటం ఏమిలేని ఒంటరితనం సూర్యుడిలో అగ్నిని చూస్తూ కాంతిని మరిచావ్ కోకిలలో నలుపును చూస్తూ కిలకిల రాగం మరిచావ్ కన్నీటి చుక్కలను చూస్తూ ఆనంద బాష్పాలను మరిచావ్ చీకటిని చూస్తూ వెన్నెలను మరిచావ్ నీవు చూసేదంతా నిజంకాదు నీవు చూడనిది అబద్దం కాదు కలల ప్రపంచం నుండి కనురెప్పలు దాటిచూడు నిజం నీడలా నీవెంటే ఉంటుంది. పి రసూల్ ఖాన్ 18-2-2014

by Rasoolkhan Poetfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e4pCiT

Posted by Katta

Balla Saraswathi కవిత

తెలంగాణ విజయధుంధుంభి ఇంతటి ధుఖం.ఎంత పోరాటం ఎందరి తల్లుల ఆవేదన,ఎన్ని అగ్ని గుండాలు.ఎన్ని తుఫానులు, ఎన్ని కత్తుల బోనుల నుండి బయట పడింది నా తెలంగాణ ఇది ఆవెదనా ఆనందమా నా కన్నుల నుండి వేడి ముత్యాలు ఆనంత భాష్పాల ఆవెదన ఝరుల ఇన్నాల్లు హృదయం దాగి దాగి ఆగలేఖ జలపాతాల మాట రాక మనసు మూగ పోయి ఏది చెప్పలేని.చెప్పుకోలేని అవినాభావ ఆత్మీయ సంఘర్షణ బానిసత్వ సంకెళ్ళను బాపుకొన్న ఈ తరునంలో కలా,నిజమా అనే భ్రాంతి తోలగి అమరులకి నివాళులు అర్పించి త్యాగధనుల అమ్మలకు,నా తల్లి తెలంగాణ కు ఆనందాపురూప అభినందన వందనాలు జై జై తెలంగాణ

by Balla Saraswathifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKtfQg

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై ఆకాశమంత ఎత్తార్చినాను - నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి పద్యాలు గొంతెత్తి పాడినాను - నే దాశరథి కవి నిప్పు లురుము గంట మొడుపులన్ కొన్నింటి బడసినాను - నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై పద్య ప్రసూనాల పంచినాను - ఐదు కోట్లాంధ్ర ప్రాంతీయు లందరికిని మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి, మూడునర కోట్ల తెలగాణ ముక్తి నొంద పాడినాను తెలంగాణ భాగ్య గీతి!

by DrAcharya Phaneendrafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j8hyTu

Posted by Katta

Sriarunam Rao కవిత

జాతి విడిపోయినా... భాష చీలిపోయినా... ప్రాంతం రెండుముక్కలైపోయినా...భావం మారదు. బ్రతుకు నీచమైన... నడక వక్రమైనా... నమ్మకం చనిపోయినా...వాస్తవం వదిలిపెట్టదు. పదవి నిలుపుకోవటానికి పక్కలెయ్యక్కరలేదు రాజకీయమంటే రంకు సంతకాదు, నమ్మిన ప్రతివారినీ వంచించిన ఈ గమనం.... కుష్టివ్యాదిని మించిన నికృష్టపుగమకం. కలిసుండటం...విడిపోవటం...మనందరి హక్కు. కానీ జరగాల్సిన సహజాన్ని ఇలాంటిస్థాయికి దిగజార్చిన విషయాన్ని భారతీయులుగా మనం మర్చిపోవద్దు, గద్దెనెక్కించిన ప్రజలతోనే ఇలాంటి వికృతక్రీడ నడిపినవారిని వదలొద్దు, సమైక్యమైనా,విభజనైనా ప్రజలందరిదీ ఒకేజాతి. దాని వక్రీభవనం వల్లనే రెండువైపులా ఎన్నోలేతజీవితాలు బలైపోయాయి. ఈ పాపం ఎవరిదో...వారి గదుల్లో రేపటినుండి ఆ ఆత్మలు సంచరిస్తాయి. ఆకాంక్షను తీర్చటానికి అడ్డగోలుపనులు చేస్తున్నవారినే గమనిస్తుండండి. లేకుంటే...మన నమ్మకాలను దోచుకునే దొంగనాకొడుకులకు మన భవిష్యత్తు అమ్ముడైపోతుంది. శ్రీఅరుణం

by Sriarunam Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h16pBQ

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి త్రిశంకుస్వర్గం ఒక నిరంతర జీవనస్రవంతిలో ఒక హృదయప్రజ్వలిత క్రాంతిలో ఎన్నో సుందరమైన స్వప్నాలతో ఎన్నో పరిశ్రమిత శ్రామిక శ్రమ బిందువులతో ఎన్నో కన్నీటి ఆనందసింధువులతో భవిష్యత్విస్కృత కాంతిలో నిర్మితమైన ఆకాశమది విభిన్నహృదయమాత్రికలు ఒకటితో ఒకటి మమేకమై ఒకే దృక్కోణంగా ఏర్పడి ఎన్నో యుగాల క్రితం ఈ జాతి కోసం ఒక భూతల స్వర్గంగా ఆవిష్కరింపబడిన బృందావనమది కానీ ఇప్పుడు ఆ ఆకాశం కుప్ప కూలిపోతోంది కాలాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న చేతులు చేస్తున్న ఈ అక్రమయుద్దంలో ఇప్పుడు జీవితాలు కూలిపోతున్నాయ్ వర్తమానపు నేత్రాలు ఆవిశ్రాంతంగా వర్షిస్తున్నాయ్ గుండె ఎడారిగా మారిపోతోంది ఎడారిగా మారబోయే ప్రకృతిని తలుచుకుంటూ పుడమితల్లి ఆత్మ అంతులేని ఆవేదనతో అలసిపోతోంది నేలతల్లి ఆక్రందన గానీ ఆకాశపు ప్రతిస్పందన గానీ భావితరాల గోడు గానీ సత్యం యొక్క వాక్కు గానీ ధర్మం యొక్క పిలుపు గానీ వినిపించుకునేది ఎవరు? వారంతా వారికి వారు నిర్మించుకుంటున్న ప్రపంచాల కోసం తమతమ వ్యాజ్యాలతో తమతమ వ్యూహాలతో జీవితం అంచులు దాటి లోయలోకి జారుతున్న వారే! ఆ లోయలోనే తమ ప్రపంచాన్ని సృష్టించుకుని అందులోనే, ఆ చీకటిలోనే ఒక భూతం వరంగా ఇచ్చే ఆ పాతాళంలోనే స్వర్గాన్ని నిర్మించుకొని నివసించాలనుకునే వారే! 18FEB2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jNO5Bd

Posted by Katta

తెలుగు రచన కవిత

బ్రతుకుట కొరకు చచ్చిన వాళ్ళూ అయ్యో పాపం పోయారాళ్ళు చచ్చేటందుకు బ్రతికే వీళ్ళు దెయ్యాలండోయ్ దెయ్యాలీళ్ళు !! భారం కాదా బ్రతుకన్ జూడు భయాలమధ్య బ్రతుకున్ జూడు భరిచలేని బాధల మధ్య జీవం లేకే జీవించంగా,జీవించేటి మనిషిన్నేను మనిషిన్నేను, మనిషిన్నేను శవాలమధ్య శవంబు నేను. ఆశలకెరటం అంతే నేను అర్ధం కాని సవాలు నేను !! ............య.వెంకటరమణ

by తెలుగు రచనfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1clFO2P

Posted by Katta

తెలుగు రచన కవిత

గణతంత్రానికి గుబులట్టించే_ఘనులున్నారది నాదేశం. అందరుకలిసి అమ్ముకుపోయే-అవకాశాలే ఉపలబ్ధం. చెప్పఁబోతే హెచ్చులుబోలెడు,గుక్కుడుగంజే ఇరకాటం చట్టాలైతే కట్టలు కట్టలు, నిప్పులుచెరిగే దౌర్జన్యం. అప్పులపాలై చచ్చేవరకు న్యాయంచిక్కని దౌర్భాగ్యం. అన్నపూర్ణమరి నాదేశం,ఆకలి చావుల సామ్రాజ్యం అన్నదాతకే అయ్యోపాపం!ఆఖరికారికి విష ప్రాప్తం. గణతంత్రానికి గుబులట్టించే ఘనులున్నారది నాదేశం!! ...............య.వెంకటరమణ .....

by తెలుగు రచనfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1clFO2E

Posted by Katta

తెలుగు రచన కవిత

ఓడిపోయి గెలవటమే జీవితం గెలిచి ఓడిపోవటమది తధ్యము మరణానికి పెట్టలేని ముహూర్తం జననానికి ఎందుకంట ? విచిత్రం! సుఖదుఃఖపు అదినేతది కన్నీరని తెలిసికూడ వెతకటం-గెలుపుకొరకు ఆరాటం. గెలుపులాట పందెంలో చివరికోడిపోవటం. ఇదేకదా జీవితం , చివరికిలా మిగలటం . పది పదుల యానంలో పదికాలాలుండేవి పదిలమైన గురుతులే-పదిలమైన గురుతులే. ఓటమికీ గెలుపునకూ ఒకే ఒక్కమైలురాయి తలకాడది స్థంభించగ తోడురాని ఖలనమిదీ నాది నీదదేదిలేదు, నీది కూడ నీకులేదు. సాధించది సాధ్యమైతే - శాశ్వతమది సాత్వికమే సాధించది సాధ్యమైతే - శాశ్వతమది సాత్వికమే !! ..........య.వెంకటరమణ

by తెలుగు రచనfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gecIS4

Posted by Katta

తెలుగు రచన కవిత

ఎంతవాన కురిసినా ఇంకిపోవు నేలిది. గింత ఎండపాటుకే ఆవిరవ్వు నీరిది. క్షణంకూడ నిలుపలేని నిశ్వాసదినీఊపిరి. నత్యమైన నీతినిడిచి నేలకొరకుతగవులాడ, నిమితమైనమనుజునకు చెల్లదోయినిక్కముగా. నెలవుగాని వాటికొరకు నిలువనింత వెచ్చించి, నేలకొరుగ నెలవుకాదు.నిస్పృహలే మిగులునీకు నిట్టూర్పే కడకు నీకు నా తెలుగు మిత్రమా !! ............................... య.వెంకటరమణ

by తెలుగు రచనfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dHpsm4

Posted by Katta

Rajkumar Bunga కవిత

పంచేంద్రియాలు పవిత్రమే అని సంభరపడ్డా, తొంగి చూసుకుంటే "హృదయం" వ్యభిచరిస్తుంది.... హృదయ వ్యభిచారానికి గొల్లుమన్నాయి, అపవిత్రత ఊసెత్తని పంచేద్రియాలు!! ...||ఆర్కే||

by Rajkumar Bungafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cUSNFp

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

భేద నీతి వారణాసి రామబ్రహ్మం 18-2-2014 1905 మత ప్రాతిపదికన కర్జను బెంగాలును విభజింప పూన గర్జించాము నరసింహాలమై తిలక్ అరబిందో మొదలగు వారి నాయకత్వమున హిండులవులము ముస్లిములము అందరు భారతీయులము తోక ముడిచినది తెల్ల ప్రభుత్వము 1947 అఖండ భారతదేశమును అటులనే విడచుటకు మనస్కరించక తెల్లదొరలు వేసిన ఎత్తుకు చిత్తై తెల్లమొహాలేసిన నాయకులు ఒప్పుకొనిరి మతప్రాతిపదికన దేశ విభజనకు; ఉన్మాదము ఊపిరిగా ఊచకోత చేయూతగా నరమేధ నరమేధం నవ్యవాదముగ కట్టించితిమి నెత్తుటి కాల్వల ఎర్రబరిచితిమి అన్ని నదుల నాయకత్వ లోపం మనలోని ప్రకోపం కల్లిగించెను దారుణ శోకం 1990 ఇంతటి గాయం మాను పట్టక ముందే బీటలు తీసిరి మన మనసుల కులములు మతములు భాషలు ప్రాంతములు గునపములుగ పదవీ వ్యామోహమున మన నల్లదొరలు; మన స్వార్థ నాయకుల కుల, మత, భాషా, ప్రాంతీయ భేద నీతికి వశులమై మనము ఆడుచున్నాము కీలుబొమ్మలమై మరచితిమి ఐక్యత శాంతి సమత సుఖము సఖ్యత ప్రతి ఊరు ఖండ ఖండములైనది ప్రతి హృదయం ముక్క ముక్కలైనది 2014 ప్రతి రాష్ట్రము సంకుచిత నాయకుల కుటిల భేద నీతికి అల్లల్లాడుచున్నది అయోమయ విభజనలకు ఆలవాలమగుచున్నది ప్రతి క్షణము భయభ్రాంతులమగుచు తీసికొనుచున్నాము ప్రాణ మానముల పశు ఆవేశముల; అందరూ శత్రువులే ఏది మనది? ఏది పరాయిది? తెలియక; స్వదేశం లోనే విదేశీయులమగుచున్నాము ఇంతలో ఎంత మార్

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gzCy5m

Posted by Katta

Siva Prasad కవిత

RIP seemandhra politicians and leaders! :( ప్రజలలో ఆలోచనా బీజాలను నాటి వారిలో సంస్కారాన్ని సృష్టించనప్పుడు మనో వికాసాన్ని కల్గించి వాళ్ళని చైతన్యవంతులుగా చేయలేనప్పుడు న్యాయం,థర్మం నిలిపేందుకు అక్రమాలను ఎదుర్కోనెందుకు అవినీతిని రూపుమాపెందుకు ప్రజలు సమస్యలతో రణం సాగించేందుకు సంసిద్దులను కావించలేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా పెంపొందించి విఙ్ఞానంతో నీవు వివేకంగా నడుచుకొనేందుకు తోడ్పడనప్పుడు సమాజం పట్ల నీ బాధ్యతలను గుర్తుచేసి క్రియాశీల దృక్పథాన్ని యేర్పరచనప్పుడు ఓ! నాయకుడా కుక్కలు చింపిన విస్తరి కంటే దరిద్రమైన నీ ఈ జీవితం ఎందుకు???

by Siva Prasadfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fdfTv2

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఎస్ ఎస్ కె - ఆర్కే||మతం - మార్గం|| మనిషి దేవుణ్ణి వెతికితే అది ఓ మతము దేవుడు మనిషిని వెతికితే అది ఓ మార్గము మనిషి మతాన్ని స్థాపించగలడు గాని,మార్గాన్ని కాదు, ఎందుకంటే దేవుడు మాత్రమే నిజమైన మార్గాన్ని చూపగలడు. మార్గం చూపడమంటే, చూపుడు వేలితో దులుపేసుకోవడం కాదు, తన గాయాలలోకి నిన్ను నీ వ్రేలును స్వాగతించడం మార్గం చూపడమంటే, దారిమధ్యలో నిన్ను వదిలిపోవడం కాదు, దారిపొడుగునా నీకోసం తన రక్తపు జ్ఞాపకాలు కార్చడం మార్గం చూపడమంటే, మార్గమని మార్గాన్ని దూరం నుండి చూపడం కాదు, నాగటితో దున్నబడిన తన వీపుపై నిన్ను మోసుకొంటూ మోక్షానికి చేర్చడం....అదే నిజమైన మార్గం!! మార్గం చూపడమంటే, తానే ఆ మార్గం అని నీకోసం మరణించడం ---|| ఎస్ ఎస్ కె - ఆర్కే||20140218

by Rajkumar Bungafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cUIm4C

Posted by Katta

Sukanya Beegudem కవిత

***జోహార్ అమరవీరులకు*** విసిగి వేసారిన దశాబ్దాల నిజ పోరాటం... రక్త కన్నీరు తుడవ ఆగనన్న విభజన .... తెలంగాణమై ప్రకాశించి ఆర్తిగొన్న ..తెలంగాణా బిద్దలకై అమరవీరుల ఆత్మల శాంతికి బీడు భూముల రైతన్నల భుక్తికి వసల బిడ్డల స్వరాష్ట్ర నౌకరికి ఇకనైనా .. ఫ్లోరోసిస్ మహమ్మారి తొలగు నల్లగొండిలకు .. చేట్లకేసుకొని, పురుగుమందులు మింగి కిరోసిన్లతో తగలబడ్డ అమరవీరుల తల్లుల కడుపుకోతకు ప్రతిఫలం ... కోటి రతనాల వీణ తెలంగాణా యెవ్వడెన్ని నాటకాలాడిన ... తెలంగాణా విధ్యార్ది తోడగోట్టిన అంతిమ శ్వాసరా తెలంగాణా విభజన అమర త్యాగధనుల సొత్తురా ... సుకన్య 18/02/2014.

by Sukanya Beegudemfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jAHneA

Posted by Katta

Abd Wahed కవిత

(ఈ మధ్య సూఫీతత్వం కాస్త ఎక్కువగా వంటబట్టింది. ఈ గజల్ చూసి మీరే నిర్ణయించండి.) నన్ను నేను కలుసుకునే రోజుందని నాకు తెలుసు నా లెక్కలు చూసుకునే రోజుందని నాకు తెలుసు చలువరాతి గుండెల్లో నీడలాగ ప్రవహించే నెత్తుటిలో మండుటెండ వేడుందని నాకుతెలుసు పాతబడిన రాత్రిపగలు ఇన్నేళ్ళూ చూస్తున్నా కనురెప్పల ఉదయాలే కొత్తవనీ నాకు తెలుసు సుడిగాలులు ఎన్నెన్నో గుడారాలు వేస్తున్నా కనుపాపలు ఆరిపోని దీపాలని నాకు తెలుసు పగటివెలుగు దుప్పటిలో నిశ్చింతల నిద్రకన్నా చీకటిలో నిర్భీతే గొప్పదనీ నాకు తెలుసు నా నీడకు నా కధలను నేనెన్నో చెబుతున్నా నా తప్పుల జాబితాలు దాగవనీ నాకు తెలుసు చెట్టు నుంచి ఆకు రాలి నేలమీద పడిపోతే భూకంపం తప్పకుండ వస్తుందని నాకు తెలుసు

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gzdxqL

Posted by Katta

Sriramoju Haragopal కవిత

మన తెలంగాణా జైజైజై జైజైజై జైజైజై నా తెలంగానమా తెలంగాణా ప్రజాకోటి విజయ వీరగానమా నా తెలంగానమా ప్రజా విజయగానమా ఇన్నియేండ్ల దుఃఖం ఇపుడె చెరవీడెనని ఎందరు అమరుల కలలు ఈనాడే పండెనని చేయెత్తి జైకొట్టరా ఆకాశం ప్రతిధ్వనించి ప్రతిగుండెలో తెలంగాణ రాష్ట్రగీతి పాడగా దేశానా తెలుగుభాష పుట్టిన నేలిదే దేశానా తొలిమానవులకు నెలవిదే ఆదిమకాలం నుండి ఆధునికం దాకా ప్రపంచాన తెలంగాణా పోరు పురిటిగడ్డరా బూడిదకప్పితె నిప్పు వేడి ఆరిపోదు అడ్డంకులెన్నైనా అదిగమించుడే జయం జయం జయం మనదే మనదే మన తెలంగాణాదే 18.02.2014 3.గం.21ని

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N5mlK6

Posted by Katta

Boorla Venkateshwarlu కవిత

జయించెరా తెలంగాణ ఫలించెరా తెలంగాణ తరతరాల ఉత్తేజం నరనరాన చైతన్యం వెల్లువెత్తి పెల్లుబికి గజ్జెకట్టి గళమెత్తి ఆత్మగౌరవ పోరు జయించెరా తెలంగాణ ఫలించెరా తెలంగాణ జై తెలంగాణ హోరు వీథులన్ని మార్మోగ సభలన్నీ దద్దరిల్ల జయించెరా తెలంగాణ ఫలించెరా తెలంగాణ అమరుల నెత్తుర్లు పారి యువకుల ఉసుర్లు రాలి ఆశల నిప్పులు రగిలి శ్వాసల డప్పులు మోగి జయించెరా తెలంగాణ ఫలించెరా తెలంగాణ గొంతులన్ని ఏకమయ్యి గోసలన్ని మమేక మయ్యి జయించెరా తెలంగాణ ఫలించెరా తెలంగాణ

by Boorla Venkateshwarlufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQL2s0

Posted by Katta

Jabeen Unissa కవిత

ఒంటరి రోజా (పాట) ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరిదానివా(2) ముల్లె సాస్వత నేస్తమా, పచ్చని ఆకే అందమా, చల్లటి నీరే స్వాసనా, ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరి దానివా ప్రేమకు గుర్తువు నువ్వెగా, పెల్లికి మాలవు నువ్వెగా, స్నేహానికి గుర్తువు నువ్వెగా, ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరి దానివా(2) మనసుకు తోడంటూ లేదా, మమతలు పంచేవారెవరో కంటికి ఎదురే కాలేదా, ప్రేమకు దారే కనపడదా నిన్నే చేరక తికమకనా, ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరిదానివా ముల్లె సాస్వత నేస్తమా, పచ్చని ఆకే అందమా, చల్లటి నీరే స్వాసనా, ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరిదానివా(2)

by Jabeen Unissafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nJsUNL

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || నిన్నే పిలుస్తున్నారు 1 ఎవరో నీ సహాయం కోరుతున్నారు ఎక్కడో అగాధపు అంచుల్లో కష్టాల సుడిగుండాల అల్లకల్లోలంలో ప్రశాంతతకు మొహంవాచి, నిరంతరంకారే రక్తపు ఛారికలనడకల్లో ఎవరో నీ సహాయం కోరుతున్నారు. నీవు బెసకకుండా రోజువారీ తాటిపై నడుస్తూనే వున్నావు. 2 ఎవరో నీకోసం చేయి చాచారు. దారపు తీగంత బలంతోనైనా పైకి లాగుతావని కనీసపు ఔదార్యపు చూపుతో ధైర్యమైనా నింపుతావని వడలి పోయే ఆశకు ఆఖరిచుక్కగా కన్నీరైనా పోస్తావని ఎవరో నీకోసం చేయి చాస్తున్నారు. నీవసలే తలచుట్టూ అరికంట్లం కట్టావు. 3 ఎవరో నీవైపే చూస్తున్నారు రెప్పవాల్చకుండా, దృష్టిమరల్చకుండా నీ నిర్ణయమే తమ తరువాతి జీవితానకి భరోసా అన్నట్లు ఒక్కో క్షణం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. అవును ఎవరో నీవైపే చూస్తున్నారు నీవెప్పటిలా అలవోకగా రోడ్డుపక్క ఖాళీడబ్బాలను తన్నుకుంటూ ఈలవేస్తూ కాలక్షేపం చేస్తున్నావు. 4 ఎవరో నీకై ఆక్రోశిస్తున్నారు ప్రమాదపు ఒడిలో రక్తం కార్చుకుంటూ కనీస ప్రథమచికిత్స చేస్తావేమోనని గొంతుఎండిపోయేలా కేకలేసి పిలుస్తున్నారు. ఒక్కో రక్తపు బొట్టూ ఒడిసి పట్టే ఓపిక లేక మరో చేయి సాయం కోసం నిను చూస్తూ దీనంగా పెడబొబ్బలు పెడుతున్నారు. ఎవరో నీకోసమే ఆక్రోశిస్తున్నారు. నీవసలే కొత్త హెడ్ సెట్ పాటల ఆల్బంలో మునిగి లేవకున్నావు 5 నీ బలం నీకేం తెలియదంటూ నాది ఒక్క నట్టు వదులైతే యంత్రానికేమంటూ వదులు వదులు మాటల్ని విదుల్చుకుంటూ వెళ్తున్నావు. పూర్ణసత్యమేదో ఎరగనే లేదంటూ తెలియని తనాన్ని గర్వంగా నెమరేసుకునేందుకు డబ్బాలూ, డప్పులూ బాది బాది అలసావు. ... వాడక్కడ నీకోసం అరుస్తునే వున్నాడు 6 అంతు చిక్కని చిక్కుముళ్ళని తలచుట్టూ కంపలా అల్లుకుని మసక చేతుల్తో కళ్ళ అద్దాల్ని పదే పదే తడుచుకుంటావు అసలే మంచు పొరల మధ్యన దీపాన్ని ఆపేసి పాదం కదపకుండానే పాటలందుకున్నావు. వాడొక్కడే ఒక్క అడుగు దూరంలో వగచి వగచి చూస్తున్నాడు. 7 ఎవరో నీ సహాయం కోరుతున్నారు. ఎవరో నీ వైపే చూస్తున్నారు. ఎవరో ఆక్రందన చేస్తున్నారు. ఎవరో ఆక్రోశంతో నీ వైపే చేయి చాస్తున్నారు. ఎవరో ... ఎవరో ..... ఎవరో 8 బ హు శా అది నీవాళ్లే కావచ్చు బహుశా అది నీ రక్తపు వారసత్వ బంధమే కావచ్చు బహుశా బహుశా అదసలు మరోలాంటి నీ మరో రూపమే కావచ్చు బహుశా అచ్చంగా నీవేనూ కావచ్చు. 9 అయినా పర్వాలేదు నీరోజుని నువ్వు నీలాగే గడిపేస్తుంటావు. ► 18-02-2014 ► http://ift.tt/N5eQ5L

by Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N5eQ5L

Posted by Katta

Telugu Chandrudu కవిత

తెలుగు వాడు తెలుగంటే కాదు రెండున్నర జిల్లాల యాస తెలుగంటే కాదు రెండు కులాల వారి ఆధిపత్యం తెలుగంటే .. పదిహేను కోట్ల నాలుకలు తెలుగంటే ముప్పై ఆరు రకాల యాసలు తెలుగంటే యాభై రెండు మాండలికాలు తెలుగంటే కోటి సూర్యుల వెలుగు. తెలుగు వాడంటే ! తరతరాలుగా నలిగిపోయిన వాడు యుగయుగాలుగా అణచ బడ్డ వాడు తెలుగు వాడంటే స్వతంత్ర దేశంలో భావ స్వేచ్ఛ లేని వాడు స్వరాష్ట్రం లో పరాయి వాడు తెలుగు వాడంటే వెలుతురు ఎరుగని చీకటిలో వేకువకై ఎదురు చూసేవాడు తెలుగు వాడంటే తనపై తాను యుద్ధం చేస్తూ పక్క వాడిపై గెలువాలనుకునే వాడు తెలుగు వాడంటే శాశ్వత అభివృద్ధి ప్రణాళిక వదిలి తాత్కాలిక ప్రయోజనాలకై తపన పడే వాడు తెలుగు వాడంటే ఆత్మహత్య చేసుకునే మానసిక దౌర్భల్యాన్ని అమర వీరత్వం గా భావించే వాడు తెలుగు వాడంటే అన్ని ఊళ్లనీ ఎండబెట్టి ఓకే నగరాన్ని అభివృద్ది చేసుకునే వాడు తెలుగు వాడంటే ఆలోచనతో నిర్ణయించుకోలేక ఆవేశంతో అలజడి రేపే వాడు తెలుగు వాడంటే దొంగల చేతికి తాళమిచ్చి ఉద్యమ ఫలాన్ని దోపిడీదారులకిచ్చే వాడు తెలుగు వాడంటే క్రైస్తవానికి మారినా కుల గజ్జి వదిలించుకోని వాడు. - -గుణ చందు సారంగం (సింగపూర్)

by Telugu Chandrudufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQcXIM

Posted by Katta

Telugu Chandrudu కవిత

తెలుగు నాడి దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే రాష్ట్రాలు రెండైనా తెలుగు ఒక్కటే బంధాలు వేరైనా భాష ఒక్కటే మతాలు వేరైనా మనుషులొక్కటే కులాలు వేరైనా కలిమి ఒక్కటే కలసివుంటూ కొట్టుకు చచ్చే కన్న విడిపోయి పరస్పర సహకారంతో బ్రతకడం మిన్న తెలుగు వారందరూ ఒకే రాష్ట్రం లో వుండడం కన్న తెలుగు జాతి మొత్తం ఐకమత్యంగా వుండడం మిన్న ఒకే రాష్ట్రాన్ని రెండుగా విభజించి అధికారాన్ని జిల్లాలవారీగా వికేంద్రీకరించి ఆంధ్ర నగరాలను ఆర్ధిక కేంద్రాలుగా మలిచి కొందరిని మాత్రమే కాక అందరిని అభివృద్ది పరిచి ప్రజలందరూ పట్టు విడుపుల ధోరణితో లాభ నష్టాలను ఇచ్చి పుచ్చుకుని సామరస్యంతో విడిపోయి సమాన అవకాశాలు ఏర్పరచుకొని అసమాన్య ప్రఙ్ఞావంతులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ... -గుణ చందు సారంగం (సింగపూర్) జై తెలంగాణా - జై ఆంధ్ర సీమ

by Telugu Chandrudufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kQcRRm

Posted by Katta

కాశి గోవిందరాజు కవిత

Dedicated to అంబటి సురేందర్రాజు Battula Srinivasa Reddy, Krishna Ashok కాశి రాజు ||వెరీ లాంగ్|| 1 నానబెట్టిన మట్టినుంచీ , ఎల్లేసిన గోడవరకూ అంతా రాయబడాలి పుల్ల ఎగదోసి కళ్ళు తుడుచుకునే అమ్మలున్నాక అన్నం తినకున్నా కడుపునిండుద్ది అలాంటపుడే దు:ఖమే జీవితమని జీర్ణించుకోవాలి 2 చచ్చిబతికామని చెప్పుకున్నాక మనమేం గొప్పకాదు జిల్లేడు పువ్వుకీ రెండు జననమరణాలు పువ్వులాగ పగిలాక్కూడా, కాయలా పేలాలి దూదిపువ్వంత తేలికై విత్తనాల్ని మోసుకెల్లాలి మొలవాల్సిన చోట జారిపడి మొక్కలాగే బతకాలని మొక్క మొదల మట్టికప్పి మాటాడుతున్న నాన్నలున్నాక మొక్కలకి ప్రాణముందని కొత్తగా మళ్ళీ చదువుకోవాలి 3 సదివాక రాస్తాం గనకనే పరిచయంలేని ఊళ్ళో చిల్లరకొట్టోడి చేతిలోనుంచి, బెల్లం కట్టిచ్చిన కాగితంమ్మీద ఏడిపించే వాక్యం లాగ కొత్త పుట్టక పుడతాం 4 ఎవడో ఒకడు ఏడ్చి ముక్కునుంచి మానవత్వం కారాక మనలాగే కళ్ళు తుడుచుకుంటాడు వాడి గుండెని గుల్ల చేసినదాన్ని మనమెందుకు తవ్వితీసాం కూలిన పాతిల్లుగోడకి మొలిచిన పచ్చనినాచు పూసుకున్నాక మట్టే మన గోడు, మట్టే మన గోడ 5 ఏడుద్దాం దు:ఖాన్ని రాస్తే వెరీలాంగ్ అన్నిటికీ కారణమైన ఆడదాన్ని గుర్తిస్తే చచ్చేదాకా వాసనపోనీ పురిటిమంచంమ్మీద మళ్ళీ మళ్ళీ పుడతాం మనం (ఆడదంటే చెబుతుండే అంబటి సురేందర్రాజు మాటలకి , రాయడం ఆపొద్దని చెప్పే కృష్ణ అశోక్ బొమ్మలకి , అపుడపుడూ కాస్త చెమ్మయ్యే బత్తుల శ్రీనివాస్ రెడ్డి కళ్ళకీ ) 18/02/2014

by కాశి గోవిందరాజుfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fcKXLB

Posted by Katta

Krishna Mani కవిత

తెలుగుకు మరో కూన *************** ఆగిన కాలానా ఆకసమె తెగిపడి అగ్గి వానలే కురువగ కనికల నడుమ ఎదిగిన గర్భాన లోకమంతా ఎదురుసుడా ధరణి ఓరిమిబట్టి పురిటిబాదలనోర్చి మునిగిన చోటే పుట్టుకొచ్చింది మర్రికొమ్మ తెలుగుకు మరో కూనా నా తెలంగాణా కృష్ణ మణి I 18-02-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cTQa6R

Posted by Katta

Venugopal Rao కవిత

జీవితం వ్యాపారమైంది బతుకు ఒప్పందాలమయమైంది సేకరించిన గేదె పాలను మనిషి భరించలేని మంచులో పాలను పొడిగా మార్చి రంగుల డబ్బాలో నింపి అమ్మ పాల కన్నా మంచివంటూ ఊదరగొట్టే ప్రచారం అన్నం పప్పు అందులో నెయ్యి మెత్తగా చేసి అమ్మ పెట్టె ముద్ధలకన్నా సెరిలాక్ ను పోషించమంటున్నారు చారడేసి కళ్ళు వంకీల కురులు తేనెలూరే పెదాలు బరువైన పాలిండ్లు సొగసు చూడతరమా అనిపించే నా చెలి సౌందర్యానికి నల్లరంగుందని తెల్లతోలు కోసం ఫెయిర్ అండ్ లౌవ్లీ పూయమంది జాత్యహంకార వాణిజ్యం నిరంతరం నా మదిలో నిలిచినా నెచ్చెలికి ఎవరో రాసిన భావుకత కింద నా సొంత సంతకం చేసి ప్రేమను చెప్పమంది ఆర్చిస్ కార్డ్ లోకానికి బువ్వ పెట్టె సాగును కూడా వదల్లేదు కదా ఈ పాడు వ్యాపారం ఎద్దు పేడ ను ఎరువుగా చేసి దుక్కి దున్నిన నా రైతు గుండెను గోదావరి డి.ఏ.పి పొల్లు చేసింది పండిన పంటలో వచ్చే ఏడు కోసం దాచుకొనే విత్తులే లేకుండా పోయింది బి.టి విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతు పై పోలీసు కాల్పులైంది వ్యాపారం కన్న బిడ్డలను అందలం ఎక్కించాలనే కోర్కె కాన్వెంట్ చదువుల ఫీజుల బరువైంది ఇంటి ముందు చలువ పందిళ్ళు పోయి బిడ్డల పెళ్లి ఫంక్షన్ హాల్ వ్యాపారమైంది కొడుకు పెళ్లై ఏడాది తిరక్కముందే మనవడిని ఎత్తుకోవాలన్న తాత ఆశ ప్రైవేటు దవాఖానాలో కడుపు కోతలైనాయి నాకిప్పుడు నా చిన్నతనం గుర్తుకొస్తుంది పొలం పనికెళ్ళి అలిసి వచ్చిన మా అమ్మ మూడేళ్ళు వచ్చిన నా చిన్న చెల్లికి చనుబాలివ్వటం నాకింకా గుర్తు ఉంది బిడ్డలు బలంగా ఉండాలని అమ్మ పెట్టిన వెన్న ముద్దా ముద్ద పప్పు నేనింకా మర్చిపోలేదు చీకటి పడితే పిల్లలకు దోమలు కుట్టొద్దని ఒదేనిలో, హిట్టో, గుడ్ నైటో అప్పుడెక్కడివి పొడుగు చేతుల నాన్న పాత చొక్కా వేసుకుంటి మంచం చుట్టూ అమ్మ దోమ తెర కట్టేది అప్పుడు ఉన్నదంతా అనుభంధం ఆప్యాతే కదా డంకేల్ ముచ్చట్లు ప్రపంచ బ్యాంక్ ఒప్పందాలేం లేవు అవే కదా మన బతుకులు ఇలా వ్యాపారం చేసింది

by Venugopal Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e2PWK2

Posted by Katta

Vani Koratamaddi కవిత

అంతరంగము నీవులేని ప్రపంచం నిర్లిప్తంగా జీవితం అంతరంగ ఆలోచనలు అధిగమించలేకున్నా జ్ఞాపకాలు గునపాలై గుండెల్లో గుచ్చుకుంటూ నీవులేని నిజాన్ని గుర్తుచేస్తుంటాయి కన్నీరు కుంభవృష్టై కనుమరుగైన నువ్వు కన్నీటిలో కనిపిస్తావు పశ్చాత్తాపంతో,సంకోచంతో సమజం ముందుకు రాలేక న్యాయం నాకేం చేశావని ప్రశ్నిస్తున్న నీ రూపానికి కన్నిటిని సాక్ష్యంగా చూపిస్తుంటాను ఏడుపు.. ఎక్కిళ్ళుగా మారి.. గాయాల మనసు.. గేయాలు రచిస్తూ.. నిశ్శబ్దం గా... స్పర్శకు అందని నీ రూపాన్ని.. స్మ్రుతి చేస్తూ.. అంతరంగాన్ని ఆవిష్కరిస్తాను vani, 18/2/2014

by Vani Koratamaddifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fcsFtL

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||తొక్కలు || కాలం గడిచిపోయింది, జీవితం కేవలం జ్ఞాపకమైంది. కవిత్వం ప్రవాహమైంది. నేనేమో అనుకున్నాను కాని, కవిత్వం ప్రవాహమైంది. జీవితాన్నే లాక్కేల్లేంత, ఉదృతమైన వరవడైంది. జీవితమే లేకుండా చేసే రేవుకెరటమైంది. చావే లేని బతుకై, అక్షరమై వెలగుతుంది. -------------18/2/2014.

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dFOoKI

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // సంపూర్తి చిత్రం ... // ఒక సంఘర్షణ ఇతిమిద్ధంగా తేలని ఫలితాలు చేసేది ఒకటే ప్రయాణం కలవని మార్గాలలో వెనుతిరిగి చూడాలన్న తాపత్రయం అణుచుకుంటూ ఎవరినుంచో తొంగి చూస్తూ అనుకుంటారిలా కాలం కలిసి వస్తే తిరిగిరామా అని కాని తెలియని దల్లా వాళ్ళకి కాలం కలిసిరావడం ,తీరాలు చేరువవ్వడం దూరం నుంచి చూసే భూమ్యాకాశలల్లే ఊరించడమేనని.... కలఇకలో ఉన్న అందాన్ని ఆనందాన్ని ఒక్క ఆలోచనలో మోహించి అనుభవించి అనుకుంటారిలా ఎవరికీ అంతుచిక్కని అపురూపసంగమమని ,ఒక అవ్యక్తమని కానీ తెలియనిదల్లా వాళ్ళకి అవ్యక్తాలు ఎప్పటికీ వ్యక్తం కాలేవని అభ్యంగనం ఎప్పటికీ అంక్షా పూరితమే అని... ఒకరినొకరు గుప్తంగా వింటూ అనుకుంటారిలా ఎవరిని ఎవరూ చదవలేరని కాని తెలియని దల్లా వాళ్ళకి వారిద్దరూ ఒక స్వేచ్చాయుత సంపూర్తి చిత్రమని … Date: 17/02/2014

by Sri Modugufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nIOMsR

Posted by Katta

Ram Paladhi కవిత

LUNCH WITH GOD! (Must Read This) A little boy wanted to meet God! He packed his suitcase with two sets of his dress and some packets of cakes! He started his journey, he walked a long distance and found a park! He was feeling tired, so, he decided to sit in the park and take some refreshment! He opened a packet of cake to eat! He noticed an old woman sitting nearby, sad with hunger, so he offered her a piece of cake! She gratefully accepted it with a wide look and smiled at him! Her smile was so pretty that the boy longed to see it again! After sometime he offered her another piece of cake! Again, she accepted it and smiled at him! The boy was delighted! They sat there all afternoon eating and smiling, but never said a word! While it grew dark, the boy was frightened and he got up to leave but before he had gone more than a few steps, he ran back and gave the woman a hug and she kissed him with her prettiest smile! Back home, when the boy knocked the door, his mother was surprised by the look of joy on his face! She asked him, "What did you do today that makes you look so happy?" He replied, "I had lunch with God!" Before his mother could respond, he added, "You know what? She's got the most beautiful smile I've ever seen in my life!" Meanwhile, the old woman, also radiant with joy, returned to her home! Her son was stunned by the look of peace on her face and asked, "Mom, what did you do today that made you so happy?" She replied, "I ate cakes in the park with God!" Before her son responded, she added, "You know, he's much younger than I expected!" Too often we underestimate the power of; a touch, a smile, a kind word, a listening ear, an honest compliment, or the smallest act of caring, all of which have the potential to turn a life around! Remember, nobody knows how God will look like! People come into our lives for a reason, for a season or for a lifetime! Accept all of them equally.. .. .. .. .. ..LET THEM SEE GOD IN YOU! Ur's Ram.

by Ram Paladhifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oKaekn

Posted by Katta

Indira Bhyri కవిత

ఇందిర అమానుషం నీకేందమ్మా మారాజువు 'కొడుకులగన్న కోట'వని నలుగురూ ఎకసెక్కాలాడినపుడు లోలోపల ఎంత ఉప్పొంగిపోయావో కుడిచెయ్యీ ఎడమచెయ్యీ అనకుండా అందరి ముడ్లూ మూతులు కడిగి అడ్డమైన చాకిరంతా ఆనందంగా చెయ్యలేదా ఏడేడు ఇళ్లల్లో పిల్లిలా తిప్పి కళ్లలో వత్తులేసుకుని పూచికపుల్లా దాచిపెట్టి తినీతినక కూడబెట్టి ఇల్లుకట్టి పిల్లల్ని నీ వీపుకు కట్టుకోలేదా అంతా ఒక రేవుకొచ్చేదాకా కునుకైనా తీశావా పిల్లలకై బ్రతకాలంటూ జీవితాన్ని ప్రేమించావే ఇళ్లూ వాకిళ్లు పంచుకుని ఇప్పుడు నిన్నేపంచనుంచాలో తోచక ఎటూతేల్లుకోలేక కొడుకులంతా కొట్టుకుచస్తున్నారే నువ్వేమైనా ఆస్తివా పాస్తివా ఆబగా పంచుకోడానికి ! ఆరుబయట అరుగుమీద బండరాయి గుండెలపై బుక్కెడు బువ్వకోసం నీ గాజుకళ్ల ఎదురుచూపు చావుకు చేరువైన చేతులు వాలుతున్న ఈగల్ని తోలలేక వేలాడబడ్డాయి నీచేతుల్లో ఏముందింక కనకమ్మత్తా !! (2009) 18/2/2014

by Indira Bhyrifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N4in4n

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/what if i say.... ---------------------------- నేను ఇసుకనై నేల మీద పరుచుకున్నపుడు నువ్వు నాపై నడుస్తూ ఉంటావు నీ మెత్తని పాదాల కింద అలుముకున్న నా మనసు నీ నుదుటిపైనుండి జాలువారే శ్వేదానికి స్నేహితుడిలా నేను ఎప్పుడన్నా ఎదురొస్తుంటే తలదించుకుని ఉండిపోయె ఒక ఆత్మ ఇక్కడ నిలుచుంది నిన్నుగా పొదువుకొందామని నన్ను నీకు చూపిద్దమని చాలాసార్లు ప్రయత్నించాను కాని నువ్వొచ్చేసరికి ఎందుకో దాచేస్తాను లోనకు ముడుచుకుపోతూ రూపమో అపురుపమో విరిగిన ఊహలను ఎన్నిసార్లు అతికించుకోను ఇంకా నువ్వు కనపడనప్పుడల్లా నీ చూపుల చిరునగవును కళ్ళతోనే ముద్దాడాను కొన్నిసార్లు ఊపిరాడకుండాను నీకు తెలియకుండాను నేను మాత్రమే కురూపిని మనసు కాదు. తిలక్ బొమ్మరాజు 18.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cSGSYH

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

బ్రాహ్మణులు - బ్రాహ్మణ మతము వారణాసి రామబ్రహ్మం 18-2-2014 భారత దేశంలో ప్రస్తుతమున్న అన్ని కష్టములకు, కలవరములకు, విచక్షణలకు బ్రాహ్మణులను, బ్రాహ్మణ మతాన్ని నిందించడము ఒక పరిపాటి అయిపోయింది. ఇందులోని నిజానిజములు తర్కించవలసినవి. ఎవరికీ ఆ ఓపిక లేదు; అంతటి మానసిక స్తోమత, బుద్ధికుశలత్వము గుండుసున్న. అయినా తెల్లారింది మొదలు ప్రొద్దుగూకె వరకు బ్రాహ్మణులను బ్రాహ్మణ మతాన్ని తిడుతూ, భారత దేశపు అన్ని క్రూరత్వాలకు, కఠినత్వాలకు బ్రాహ్మణులనే బాధ్యులను చేసి వారిని అనరాని మాటలు అనడము, వారి పట్ల అనాగరికముగా ప్రవర్తించడము దక్షణాదిన ఒక వ్యతిర్రెక ఉద్యమము మొదలై ఓట్ల బంకలా తయారై , వ్యాపారములా నడుస్తోంది. ఉత్తరాదికీ అది పాకింది. భారత దేశములో ఎప్పుడూ engineering and technology బ్రాహ్మణుల చేతిలో లేవు. ఇవి రకరకాల కులముల వారికి అప్పగించబడ్డాయి. ఒక కులము ఒక సాంకేతిక జ్ఞానానికి ప్రతీక. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క Profession. ఎవరు అప్పగించారు? ఎవరు ఇవన్నీ నిర్దేశించారు? అందరూ కలిసి నిర్ణయించుకున్నారా? ఎవరికీ ఏమీ తెలియదు. బ్రాహ్మణులని మాత్రము అన్ని అనర్ధాలకు బాధ్యులను చేయడము ఓక మేధావితనముగా విరాజిల్లుతోంది. Engineering and technology అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు జీవికకు, ధనము సంపాదించి బ్రతుకు నడుపుకోవదానికి వీలు కలిగిస్తుంది. అలా జీవికకు ధనము తెచ్చే Engineering and technology బ్రాహ్మణుల చేతిలో లేనప్పుడు బ్రాహ్మణులు మిగతా వారిని ఎలా నిలువరించారు? ఎలా దోచుకున్నారు? What Brahmins deprived others of? And there were no government jobs till the British started ruling. బ్రాహ్మణులు భారతజాతికి చేసిన ఉపకారాన్ని స్మరించే వాళ్ళే లేరు. ఆధ్యాత్మిక జ్ఞానము, లలిత కళలు, వైద్యము, గణితము, సాహిత్యము, ఒక రమ్యమైన సృష్టి; ప్రపంచమంతా ఈ సృష్టికి ముగ్ధయై భారతదేశాన్ని మెచ్చుకుంటూంటే, కుహనా మేధావులు మాత్రము బ్రాహ్మణులను, బ్రాహ్మణ మతాన్ని మన అన్ని ఇక్కట్లకు బాధ్యులని చేసి నిరసిస్తున్నారు; అనాగరిక భాషలో నిందిస్తున్నారు. అలా నిందించడము ఒక సరదా (fashion) అయింది. ప్రపంచములో మరెక్కడా బ్రాహ్మణ మతము లేదు. కాని అక్కడా భారత దేశములో ఉన్న అన్ని కష్టములు, కలవరములు, విచక్షణలు ఉన్నాయి. అన్ని రకాల అనర్దాలు అక్కడా చోటు చేసికుంటున్నాయి. అక్కడి అనర్ధాలకు ఎవరు కారణము? సంస్కృతీ, సంప్రదాయము ఏ సంఘములోనైనా మార్పుకి లోనవుతాయి. ఇది అన్ని సంఘాలకు, దేశాలకు వర్తిస్తుంది. దీన్ని అందరు "మేధావులు" గమనిస్తే సరియైన దోవని నడిచి ప్రస్తుత ఇబ్బందులని అధిగమించవచ్చు. లేనిచో బ్రాహ్మణులను, బ్రాహ్మణ మతాన్ని అన్ని అనర్ధాలకు బాధ్యులని చేస్తూ, "మేధావులుగా" చెలామణీ ఆవుతూ, అసలు అందర్నీ బాధిస్తున్న సమస్యలను అలాగే ఉంచేసి, వదిలేసి, రోగము ఒకటి అయితే మందు మరొకటి వేసి సంఘ అనారోగ్యాన్ని పెంచుతూ డాక్టర్లని తప్పు పడుతూ, నిందిస్తూ సంఘాన్ని, దేశాన్ని తప్పుదారి పట్టిస్తూ ఎన్నడూ రోగనివారణ జరగకుండా ఆపేస్తూనూ ఉండవచ్చు. ఒక వర్గమే అన్ని అనర్ధాలకు కారణము అనే అబద్ధపు ప్రచారము, ప్రకటనలు ఆగిపోతే వర్గభెదము లేకుండా మనందర్నీ ఇబ్బంది పెడుతున్న మిగతా ముఖ్య అంశాలపై దృష్టి సారించవచ్చు. We also can find solutions and implement them. మనందరికీ తాగడానికి మంచి నీరు లోటుగా ఉంది. పాలన దరిద్రముగా ఉంది. విద్యుత్ శక్తి లోటు, ఇతర అవసరాలు, చదువు, వైద్యము అందటము లెదు. ఎంతో ఖరీదు అయిపోయాయి. ద్రవ్యోల్బణము, ధరల ఉత్తర దిశా గమనము, పాలనలో, వ్యాపారములలో, పరిశ్రమలను నడపడములో, ఉద్యొగస్థులలొ, నాయకులలో, corporate bigwigs లో అవినీతి; మనందర్నీ సమానముగా పట్టి పీడిస్తున్నాయి. వీటికి అన్నిటికీ ఎవరు కారణము? బ్రాహ్మణులు, బ్రాహ్మణ మతము కాదు కదా!! నిదురలోంచి మేలుకుని పూర్తి మెలకువలో దేశాన్ని, సంఘాన్ని సరియైన మార్గములో పెట్టుకోవడము మనందరి కర్తవ్యము. బ్రాహ్మణులను, బ్రాహ్మణ మతాన్ని నిందించుకుంటూ పోవడము "మేధావితనము" అవుతుందేమో తప్ప మనకష్టాలకు, జీవితములోని వడి దుడుకులకు పరిష్కారము మాత్రము కాదు. Let wisdom dawn on us.

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jylEnA

Posted by Katta

Kavitha Prasad Rallabandi కవిత

మూలం: 'ఎర్లీ' by మార్క్ నెపో ( reduced to joy ) స్వేచ్చానువాదం : డా .రాళ్ళబండి కవితాప్రసాద్ ........ ....... ........ ....... ఎందుకో తెలీదు గాని ఇవ్వాళ దిగులు తో నిద్రలేచాను . బహుశా పోగొట్టుకున్నదేదో గుండె మీద అటు ఇటు తారాడుతోంది , తొలిపొద్దు మీద కాకి ఎగిరిన నీడ లా .... ఇప్పుడు ఆకలేస్తుంది ! ఒక్కోసారి విషాదాన్ని తప్పించుకోడానికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కళ్ళతో పుస్తకాలని , జ్ఞాపకాలతో గతాన్ని , ఏవో అంచనాలతో అనిశ్చితిని , తినాలనిపిస్తుంది! ఒక్కోసారి దేశాల పటాలని గీసుకుని తినాలని పిస్తుంది! నిజానికి ఇదంతా వొట్టి కాలక్షేపానికే ! నేను ప్రేమించిన మనుషులెవరూ కనపడడం లేదు. కొందరు తప్పుకుని పొయ్యారు . ఇంకొందరు వాళ్ళ దిగుళ్ళ తో నన్ను తినడం మొదలెట్టారు ! ఐనా , మనం ఎవరిని వదిలేసినా , మనల్ని ఎవరు వొదిలేసినా, మన హృదయం మాత్రం మనల్ని వదలదుగా ! అందుకే, దాని నీడ లోనే దిగులుపడదాం ........!!! (18th feb 2014 at 4 am)

by Kavitha Prasad Rallabandifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bGs2ty

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 18 (కవి సంగమం) "గుర్తు కొచ్చిన గత స్మృతుల కవిత్వ చిత్రం ఒక సంచలిత రాగం" కవిత్వసంపుటి పేరు :- "ఒక సంచలిత రాగం" సంపుటి రాసిన కవి పేరు :-"సాహిత్య ప్రకాశ్" పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి "ఒక ఆత్మసాక్షాత్కార దృశ్యం కోసం' "ఆకు పచ్చని ఙ్ఞాపకం" కోసం "ఒక సంచలిత రాగం" కోసం ఒక "జీవన పరిమళం"కోసం "అక్షర తపస్వి"అయి "ఒక తడి గీతం"రాయాడానికీ"తల్లీ నిన్ను తలంచి"అని ప్రార్థిస్తూ "అంతర్వేదన" పొందుతూ" జలజ్వాల"ను "ఆపాదమస్తకం"ఆవాహన చేసుకొంటూ "ఐక్యరాగం" కోసం "వెలుగుస్తంభం"మీద నిలిచి "నెత్తుటి గాయాలు"కావు కావాల్సింది అని "సలామ్" చెబుతూ కలం పట్టిన కవే సాహిత్య ప్రకాశ్. ప్రాచీన స్మృతులూచే చప్పుళ్ళను రికార్డ్ చేశాడు కవి సాహిత్యప్రకాష్ ఈ సంపుటిలో. "మిత్రమా! నా చుట్టూ వేన వేల స్నేహ పూలు పలకరిస్తూ పరిమళిస్తున్నా నీ స్నిగ్ధ సౌరభానికి సరితూగలేవు నీ ఙ్ఞాపకాల చిత్తడిలో ఏకాకి గుండె చప్పుడులో మౌన సముద్రమై"-పోతున్నాని చివరి చూపైన దక్కనివ్వకుండా అల్లా పిలుపు అందుకొని హడావిడిగా వెళ్ళిపోయిన మిత్రుని కోసం తన దుఃఖాన్ని కవిత్వంగా మార్చినవాడు సాహిత్య ప్రకాష్. "విషాదకరమైన విషయం ఏంటంటే భగవంతుడు నా బాల్య పుస్తకం లోని చివరి పేజీని చించేశాడు నేను తొందరగా పెద్ద వాడినై పోయాను"-అంటూ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకొని దాన్ని పద్యంగా చేసిన వాడు సాహిత్య ప్రకాష్. 'అమ్మా నువ్విప్పుడు లేక పోయినా నీ చీరల్తో నీ చేతుల్తో నువ్వే స్వయంగా కుట్టిన బొంత!నీ రూపంలో ఓ ఆకుపచ్చని ఙ్ఞాపకమయింది అనుభూతుల పాలపుంతయ్యింది -అంటూ అమ్మ తీయని ఙ్ఞాపకాలను కవిత్వంగా నిర్మించినవాడు సాహిత్య ప్రకాష్ "ఒక సంచలిత రాగం"-అనే ఈ సంపుటిలో కవి సాహిత్యప్రకాష్ స్వీకరించిన కాన్వాస్ చాల విస్తృతంగా కనిపిస్తుంది.ఇందులో వున్న వస్తువైవిధ్యం కవికి గల భిన్న వస్తుస్వీకరణ కాంక్షను,ఆ వస్తువును కవిత్వం చేయడంలో గల ఇచ్ఛను చెప్పకనే చెబుతుంది.స్నేహితుని ఙ్ఞాపకాల చిత్తడిలో చెమ్మగిల్లినతనాన్ని,అమ్మ,నాన్నల ఆకుపచ్చతలపుల ఆనవాళ్ల సుడిలో తిరుగుతున్న వైనాన్ని,బాల్యం తనకు అందించిన తీపితీపి గుర్తులను వస్తువులుగా తీసుకొని మనసు కదిలించే కవిత్వం చేశారు.అంతేకాదు ప్రపంచీకరణ ప్రఛండ మారుతానికీ కొట్టుకపోతున్న క్షురక,రజక కులవృత్తుల శైథిల్యాన్ని,మాటిమాటికీ మోసపోతున్న మగువల జీవితాన్ని,నెత్తుటి గాయాలతో మరిగిపోతూ మానాన్ని అమ్ముకొనే వృత్తిలో వున్న మైనపు బొమ్మల బ్రతుకుల్ని ,మద్యపానం,మాదక ద్రవ్యాల సేవనం మున్నగు వ్యసనాల వలలో ఇరుక్కుపోతున్న యువత బాధ్యతారహిత్యాన్ని వేదనా తడితో కవిత్వపు దృశ్యం చేశాడు.ఇంతే కాదు ప్రియురాలి ప్రేమకు సుప్రభాతం పాడే క్షణాన్ని,పల్లే పరిమళాన్ని,చింత చెట్టు ఆప్యాయతను,తెల్లారింది మొదలు ఊరిఊరికి ప్రయణికుల్ని చేరవేసే బస్ ని,ఆ బస్ ని నడిపే డ్రైవర్ ని ,అపరాధిని చేయకండి అని ప్రార్థించే వైరస్ క్రిమిని సైతం ఈ కవి తన కవిత్వపు నగలో పొదుగుతాడు. జన్మించిన వారు మరణించక తప్పదు.అయితే వారు అర్థాంతరంగా ఎవరికైనా దుఃఖం వస్తుంది.అర్థాంతరంగా మరణించిన వారు మనకు కావలసినవారయితే మరింత దుఃఖం కలుగుతుంది.అట్లా మరణించినవారు మన అభివృద్ధిని కోరుకుండే వాళ్ళు అవసరమైనప్పుడు అన్నీ తామై ఆదుకుండేవాళ్ళు అయితే అశ్రువులు రెప్పల గూర్ఖాలను తప్పించుకొని చరాచరా చెక్కిల్ల మీదికొస్తాయి.అపరిమిత వేదనను కల్గిస్తాయి."ఓ జబ్ యాద్ ఆయే"-అనే కవితలో కవి తన బంగారు భవిష్యత్తు కోసం అందమైన కలల్ని కలవరించే మిత్రుడు ఇస్మాయిల్ అర్థాంతరంగా మరణిస్తే తనకు కల్గిన దుఃఖాన్నికవి కవిత్వం చేశాడు.తన ఆత్మ దీపం ఇలా వెలుగుతుందంటే కారణం అతని ఙ్ఞాపకాలతో కట్టుకొన్న పాలరాతి ప్రహారి చలువేనని కవి చెప్పిన విధం మనల్ని కవి పొందిన దుఃఖపు దారిలోనే నడిపిస్తుంది. "ఇలా అయిపోయింది"-అనే కవితలో "నా జీవితపు డైరీలో దాచుకున్న /నెమలీక లాంటి బాల్యం గురించి/అది అందించిన అనేకానేక స్మృతుల గురించి ఏమని చెప్పను"అని అంటూ గత ఙ్ఞాపకాలను నెమరువేసుకొంటూ,దేవుడు బాల్యపుస్తకంలోని చివరి పేజిలను చింపేయడంవల్లా బాల్యం కోల్పోయానని కవి విచారం వ్యక్తం చేస్తాడు."కవిత్వమొక తీరని దాహం"-అన్నాడు మహాకవి శ్రీ.శ్రీ.ఈ కవి కూడా ఎన్ని నీళ్ళు తాగిన/ఇంకా దాహం వేస్తునే వుంటుంది/ఎన్ని కవితలు రాశినా/ఇంకా ఇంకా రాయాలనిపిస్తునే వుంటుంది"-అంటూ కవిత్వంపట్ల తన ఎడతెగని దాహాన్ని స్ఫురింపచేస్తూ కవైనా వాడు ఈ అనుభూతిని పొందుతాడంటాడు. ప్రపంచీకరణ భూతం క్షురకవృత్తిలో తనజీవితాన్ని అనందంగా గడుపుతున్న వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టిపడేసీ కాంక్రీటు సముద్రంలో కార్మికున్ని చేసిన విషాదాన్ని గొప్ప శిల్పంతో ఆవిష్కరించాడు. ఈ కవిత్వ నిర్మాణంలో క్షురకవృత్తిని చేసే వ్యక్తి వృత్తినైపుణ్యాన్ని,అతని రూపాన్ని మనసులో ముద్రించుకుండేటట్లు"మగ సిరికి ప్రతీకలా మొనదేలిన మీసకట్టును మణికట్టు మంత్రంతో తను కత్తిరిస్తే ఊరినిండా ఎన్.టి.అర్,ఏ.ఎన్.ఆర్ లు ప్రత్యక్షమయ్యేవాళ్ళు.-అని రూపు కట్టించాడు.తాళి కట్టించుకునే వధువు తలవంచి కూర్చున్నట్టు అందరు అతడి ముందు మోకరిల్లాల్సిందేనని కవి కులవృత్తి విశిష్టతను ఈ "శిథిలమైనపొది"-అనే కవిత ద్వార తెలియచేస్తాడు.మనిషి వేసుకున్న బట్టల మురికిని వొదల కొట్టె రజక వృత్తిని చేసే వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు 'బండని నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న జీవితాల్లో వెట్టిచాకి రేవులే తప్ప వెతలు తీరే దారి'-లేదా అని కవి సమాజాన్ని నిలదీస్తాడు.వారి పట్ల సమాజదృష్టి మారకుంటే సమాజం గజ్జి కుక్కలా మారుతుందని కవి తన అలోచనా దృక్పథాన్ని చక్కని అభివ్యక్తితో వ్యక్తపరిచాడు. సాహిత్య ప్రకాష్ మంచి కథారచయిత.ఇటీవల అవార్డ్ కూడా ఆయన కథలకొచ్చింది.కథకుడు కావడం వల్లనేమో కొన్ని కవితల్లో కథాకథన శిల్పం తొంగి చూస్తుంది."రవి కిరణం పుడమిని తాకక ముందే పల్లె విడిచి మాసిన బట్టల మూట ఆమె నెత్తి మీద మొలుస్తుంది"-అని ఆరంభమయ్యే రజక కులవృత్తి గొప్పదనాన్ని చెప్పె "ఒక చాకి రేవు పాట"-కవికున్న కథాకథన చాతుర్యాన్ని కూడా అవగతం చేస్తుంది. ఈ కవికి నాన్నంటే వొక వెలుగు స్తంభం-.అమ్మంటే వొక ఆకు పచ్చని ఙ్ఞాపకం-.వొక మాతృహరితం.-"తల్లి నిన్నుదలంచి"అనే వొక ప్ర్రార్థన.ఒక ఆత్మ సాక్షత్కారదృశ్యం.-తల్లీదండ్రుల గురించి ఈ కవి ఆరు కవితలకు పైగా వొకే సంపుటిలో రాసి తనకు వారిపట్ల గల ప్రేమను చాటుకొన్నాడు.” "పేదరికపు పెంకుటింట్లో/గుడ్డి దీపంకింద పాఠం చదువుతూవుంటే తనొచ్చి వెలుగు స్తంభమయ్యేవాడు"-అంటూ ఈకవి తండ్రిని ఎంతో గొప్పగా కవిత్వం చేసి ఋణం తీర్చుకున్నాడేమో నని నాకనిపించింది."నా కోసం కొండంత చేసిన నాన్న గారి ఋణం కొంతలో కొంతయిన తీర్చుకుందామంటే ..దేవుడు నన్ను ఋణగ్రస్తున్ని చేసి నాన్నగారిని ఆయన దగ్గరకు తీసుకెళ్ళాడు"-అని అంటూ ప్రకాష్ తండ్రి పట్ల బాధ్యత లేని వారికి గుర్తు చేస్తాడు వారి బాధ్యత గురించి. అమ్మ గురంచి రాసిన "ఆకుపచ్చని ఙ్ఞాపకం" అనే ఖండిక కథనాత్మక శిల్పానికీ మంచి ఉదాహరణ.అమ్మ లేకపోయినా ఆమె తన చీరల్తో కుట్టిన బొంత తనకు అనుభూతుల పాలపుంతయ్యిందని ప్రకాష్ అంటాడు."ఆమెను దుఃఖ నదిని చేయకండి/బతికుండాగానే బతుకమ్మ లాంటి అమ్మ మనస్సును తూటాల్లాంటి మాటలతో తూట్లు పొడవకండి-అని మాతృహరితం కోల్పోయిన మాన వృక్షాలకు గుర్తు చేస్తాడు ఈ కవితలో.ఈ కవితలు ఇట్లాంటి అంశంపై రాసిన రావులపల్లి సునీత,నిర్మల కొండేపూడి గార్ల కవిత్వాలను గుర్తుకు తెస్తాయి. ఈ కవికీ ఏ వస్తువును తీసుకొన్న దానికి కవితా పరిమళం అద్ది రాయటమ్ బాగా తెలుసునేమో?అందుకే "పేదరికం అంటే/ఆకలి కేకల వ్యథాతప్త దృశ్యం కాదు/అతుకుల బతుకుల వైచిత్రి కాదు/పేదరికం ఒక దీప ఖడ్గం/ఆప్యాయత స్వర్గం/మమతల దుర్గం'-అంటూ పేదరికం దుఃఖ కారణం కానే కాదు వొక కొత్త వూహను నిర్మించాడు.ఈ సమ్పుటిలోని 'పరిహాస రేఖ'అనే కవిత ఆసాంతం కవిత్వాన్నే కుమ్మరిస్తుంది."మనసు తునాతునకలైన చోట అశ్రునది శబ్దంలో ప్రవహిస్తునేవుంటుంది"ఇలా ప్రతి పంక్తిలో కవిత్వ గంధం విరజిమ్మబడింది.పురా స్మృతుల స్మరణ అనే వొక లక్షణం వొక సాంప్రదాయంగా మారి అనేక కవులు ఆమార్గంలో నడిచేటట్లు చేసింది.ఇందుకు ప్రకాష్ మినహాయింపు కాదు.ఆయన కూడా ఎక్కువగా గడచిపోయిన లేదా గతించిన పురా స్మృతులను తెచ్చుకొంటూ మంచి కవిత్వం రాశారు. 'ఆ" చింత"నలో నా స్వాంతన"-అనే కవిత ఇందుకు ఒక నిదర్శనం."మా ఊరిలోకి అడుగు పెట్టగానే నెంబయ్య చింత మాను కళ్లప్పగించి చూస్తుంది"అని మొదలయ్యే ఈ కవితలో ఆ చింత గురించిన గతించిన ఙ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ..తన నాన్న తలపుల్ని కూడా చేస్తాడు."దాన్ని చూస్తే మా నాన్న లక్ష్మణదాసు కర్రపట్టుకొని పాఠం చెప్పినట్లుంది"అనిగుర్తుకు తెచ్చుకొంటాడు.ఈ కవి చాల కవితల్లో ప్రాచీన స్మృతులూచే చప్పుడు లను వినిపిస్తాడు. యువతలోని వ్యసనాలను నిరశిస్తూ"కొన్ని ఆక్రందనలు..ఒకనినాదం"అనే కవితను,పచ్చ్డి మెతుకుల్ని పరమాన్నంగా తలంచే పేదవాల్ల జీవితాల్నీ "శిథిలచిత్రం"అనే కవితలో వేశ్యావృత్తినిని జీవనాధారంగా చేసుకున్న వాళ్ళ గురించి" నెత్తుటి గాయాలు"అనే కవితలో ,"వాడెవడో వస్తాడు/నా మీదకు రాళ్ళు విసురుతాడు/వీడెవడో వొస్తాడు/ఎగిరెగిరి ఎద మీద తంతాడు"-అంటూ ఆర్.టి.సి. బస్ అంతర్వేదననుఈకవిచిత్రించాడు.పిట్ట,గుట్ట,ఇసుక,సముద్రం లాంటివాటిని కూడా కవిత్వం చేసి పర్యావరణ స్పృహ పెంచే సందేశాలు ఇచ్చాడు. ఇంత మంచి కవిత్వాన్ని అందించిన సాహిత్య ప్రకాష్ ని మెచ్చి పరిచయం చేయటంతో నా బాడ్యత ముగిసిపోలేదు.చెప్పాల్సినా కొన్ని మాటలు చెప్పకపోతే ఆయన అభివృద్ధిని నిరోధించిన వాన్నీ కాదలుచుకోలేదు కాబట్టి కొన్ని మాటలు నొప్పిని కలిగించేవయిన చెప్పక తప్పదు.తొలి దశలో ఎమ్త చేయి తిరిగిన కవైన తన పూర్వ కవులనో,తన కాలపు కవులనో అనుసరించక తప్పదు.అయితే కాల క్రమేణా తనదైన సొంత గొంతుక ఏర్పరుచుకుంటాడు.అలా ఏర్పరుచుకోగలిగే కవే కాలంతో కలసి నడుస్తాడు నిలుస్తాడు.తిలక్,ఆశారాజు ప్రభావాలనుంచి ఈ కవి బయటపడి తనదైన సొంత గొంతుకను ఏర్పపరుచుకొని మరికొన్ని మంచి సంపుటాలు తేవాలని ఆశిస్తాను.కవిత్వం నిర్మించేటప్పుడు పద ప్రయోగ ఔచిత్యం కూడా కవిత్వాన్ని మరింత పదునెక్కిస్తుంది.పద ప్రయోగ ఔచిత్యం కూడా వొక శిల్ప రహస్యమే."ఇలా అయి పోయింది"అనే కవితలో "నా జీవిత డైరీలో దాచుకొన్న నెమలీక"-అనే ప్రయోగం చేశాడు కవి.అయితే నెమలీకను దాచుకొనేది ఆ వయసులో డరీలో కాదు.నెమలీకను బాల్యంలో దాచుకొనేది అచ్చు వాచకంలో లేద నోటె బుక్ లో.కవి అలా ప్రయోగించటం తప్పేమి కాకపోవచ్చు.కాని ఔచిత్యవంతంగా కవిత్వం వుంటే కవి మరింత పాఠకుల హృదిలో నిలిచిపోతాడు. "నా జీవిత పతాకాన్ని ఎగరేసిన జెండా కర్రా"-అనే కవిత నన్ను బాల్యం లోకి తీసుకెళ్ళి "సైకిల్ చక్రానికీ తాడుతో గట్టిగా లాగి బిగించి కట్టిన డబ్బా" చేసే ధ్వని లో పుల్లైస్ అమ్మే దృశ్యం కళ్ల ముందు ఘనీభవించి నిప్పుల కుంపటై మండే ఎండాకాలం లో పుల్ల ఐస్ తింటున్న అనుభూతిని మిగిల్చింది.రైతుని గురించి కూడా ఈకవి మంచి కవితలు రాశాడు. "కవిత్వం నా శ్వాస క్రియ ఆకుపచ్చని ఙ్ఞాపకాల కిరణజన్య సంయోగక్రియ కవిత్వమంటే నా హృదయంలోంచి అక్షారాలుగా ప్రవహించే ప్రేమ వాహిని మధుర భావాల అమృతమయి ఊటబావి"-అని అనుకొంటున్న సాహిత్య ప్రకాష్ కి అభినందనలు అందిస్తూ కవి సంగమ కవులకు ఈ పరిచయం చదివి నాకు, కవికీ సూచనలు తెలియచేస్తారని ఆశిస్తూ వచ్చే మంగళవారం మరో కవిత్వ సంపుటితో కల

by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1faUeUi

Posted by Katta

Gangadhar Veerla కవిత

ఆకాశంలో చుక్కల్నిలెక్కపెట్టాలనే ఉంది ................... ఆకాశంలో.. కనిపించే చుక్కల్ని లెక్కపెట్టాలనే ఉంది ఇంకా లెక్కలేయాలనే ఉంది ఓపిక నశించేవరకు.. లెక్కలేయాలనే ఉంది.. అక్కడ కొన్ని చుక్కలు అవినీతి అంచును అంటుకున్నాయి మరికొన్ని.. స్వార్ధంతో ఎక్కడికో ఎగిరిపోతున్నాయ్ ఇంకొన్ని.. అవేం పట్టనట్టు నిశాకళ్ళతో.. పరేషాన్ చేస్తున్నాయ్ ఏమని నిలదీస్తే? ..... అసూయ ద్వేషం కలుషితం కల్మషం వాటన్నిటినీ పక్కనపెడితేగానీ నీలెక్కల్లోకిరానని మొరాయిస్తున్నాయ్ .. ఇప్పటికీ ఆకాశంలో చుక్కల్నిలెక్కపెట్టాలనే ఉంది చచ్చేలోపుగా ఏదో ఒక లెక్క వేయాలనే ఉంది ... గంగాధర్ వీర్ల- 17 ఫిబ్రవరి

by Gangadhar Veerlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1faUdQf

Posted by Katta