పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఆగస్టు 2012, శుక్రవారం

నీకు నచ్చిందే కవిత్వం కాదు - Anil Dani


నీకు నచ్చిందే కవిత్వం కాదు చదివి నేర్చుకుని
భాషనూ పదాలను ఉపయోగించగల నేర్పు కావాలి
కవిత్వం కావాలి కవిత్వం - ఇది మామూలు మాటకాదు
"ఇదే నేను నేర్చుకున్న పాఠం కవి సంగమం కలయికలో"

సామూహిక/ సామాజిక కవిత్వమా ? వ్యక్తిగత కవిత్వమా ?? అభేదమా ???



ఒక కవిత దగ్గర విజయకుమార్‌గారి ఆలోచన విన్నాక, మళ్ళీ నేను కొన్ని విషయాలు పునరాలోచిస్తున్నాను. మనిషికి రెండు ప్రపంచాలున్నాయి. బాహ్యమూ, ఆంతరమూ. రెండింటిలోనూ సుఖదు:ఖాలున్నాయి, బోలెడంత కన్ ఫ్యూషన్ ఉంది. బోలెడు చీకటి ఉంది. బాహ్య ప్రపంచ కవిత్వాన్ని సామూహిక/ సామాజిక కవిత్వమని, అంత:ప్రపంచ కవిత్వాన్ని వ్యక్తిగత కవిత్వమనీ.. అంటున్నాము. అవగాహనా సౌలభ్యం కోసం ఇలా విడదీస్తాము కాని, సామూహిక సమస్యల వల్ల కలిగే వేదనని

ఈడూరి శ్రీనివాస్ || వేదికపై వెన్నెల కురిసింది ||



YAKhOOB అంటూ ఆహూతులనగా

మన SUBODHalu వినేందుకు

SARKAR తానే దిగిరాగా

AFSARasalu ఆడిపాడగా

యువకవులు NARASINGAలై గర్జించగా

SIVA రెడ్డొచ్చి మొదలాడె

ఆNANDAm KATTAలు తెంచుకుంది

కవిత్వం KASI తీరింది

వేదికపై వెన్నెల కురిసింది




KIRANam GALI వీచింది

ఎందRO HITulu వెంటరాగా

చిక్కటి మీగడ PERUGU

GURUSWAMula VARAలు

KRISHNAVENI జలాలు

KAPILA తీర్థాలు

BOBBY NEE నది పరవళ్ళు తొక్కింది

వేదికపై వెన్నెల కురిసింది




RISHI తత్వం కనిపించింది

CHNADRA SEKHARa వీక్షణాలతో

పంచబూతాలు MERCY చూపగా

RENUKA దేవి ఆశీర్వదించింది

అందరి JAYA ధ్వానాల మధ్య

వేదికపై వెన్నెల కురిసింది.


(15-08-2012 నాటి కవిసంగమం గురించి అందరూ తమ తమ అభిప్రాయాలను, అనుభవాలను వ్యక్తపరిచారు. నేను మాత్రం నా భావాల్ని కవిత్వ రూపంలో ప్రకటిద్దామని ఇప్పటిదాకా ఆగాను ఎందుకంటే ఈరోజు దాకా ఎవరూ కవితలు పోస్ట్ చేయొద్దు అన్నారు కాబట్టి. ఇందులో అందరి పేర్లూ ప్రస్తావించడం కష్టం కాబట్టి తమ పేరు లేదని ఎవరూ చిన్నబుచ్చుకోవద్దు. సరదాగా చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే.)

కవి సంగమం..కవులకు ..దండాలు - Ramesh Hazari


నమస్తే తెలంగాణ'పత్రిక ఢిల్లీ బ్యూరో ఇంచార్జ్ గా ..అర్జంట్ గా ..ఢిల్లీ వెళ్ళాల్సిన క్రమం లో జీవితం లో నాకు అత్యంత ఇష్టమయిన 'కవి సంగమం' ఇఫ్లు కార్యక్రమంలో పాల్గొనలేక పోయినందుకు..క్షంతవ్యుణ్ణి.

ఘనంగా జరిపినందుకు యాకుబ్ అన్న,గుడిపాటి అన్న, మరియు కవిసంగమం బాధ్యులకు,సభ్యులకు ...వేదికనిచ్చి సహకరించిన సీతారాం కు ..పాల్గొని ఈ కార్యక్రమాన్ని చారిత్రకంగా మార్చిన ప్రతి వొక కవి సంగమం..కవులకు ..దండాలు ..

ప్రత్యక్ష వ్యాఖ్యానం మరింత గొప్పగా ఉంది - Kodanda Rao


ప్రతీవాళ్ళు, వారి,వారి ఇంట్లో జరిగిన/జరుగుతున్న పెళ్ళిలాగ పాల్గోవడం అద్భుతంగా ఉంది. అందరూ కలిసి పనిచేస్తే కొండైనా పిండి అయిపోతుందని నిరూపిస్తున్నారు. చాలా గొప్పగా ఉంది. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం మరింత గొప్పగా ఉంది. జయహో!!!

సమాజంమీద ఎక్కు పెట్టిన భాణాలు - Renuka Ayola


ఈ నాటి కవి సంగమం కవిత్వానికి,కవిత్వంకావాలి కవిత్వం అన్న నినాదానికి అక్షరాల పండుగ చేసుకున్నట్లు అనిపించింది

ఎన్నో కొత్త గొంతుకల్లా అనిపిస్తూ సమాజంమీద ఎక్కు పెట్టిన భాణాలు సూటిగా ఆహుతులైన కవులను ఎంతగానో అలరించాయి

యాకూబ్ గారు కట్టా శ్రీనివాస్ గురుస్వామి కసిరాజు ,ఇలా ఎందరో రాత్రీంబవళ్ళు శ్రమించిన కల ఈ నాటి మధ్యాన్నం

కవితోత్సవ పండుగ జరుపుకుని అనందంగా మళ్ళీ మరో ఉత్సవానికి అడుగులు వెసుకుంటూ ముగింపుతో ప్రారంభం పలకబోతోందని అభినందనలు తెలుపుతున్నాను

అన్నీ చిరునవ్వులే.. అక్షరాల ఆత్మీయతలే - Jayashree Naidu


కవి సంగమం పొయెట్ మీట్ గురించి రాద్దామని మొదలు పెడదామంతే.. అన్నీ చిరునవ్వులే.. అక్షరాల ఆత్మీయతలే..

ఒక్కొక్కరి ఉపన్యాసం ఒక్కో మేధో సంపద..
మది నింపుకుని వెళ్ళినవారి అదృష్టం..
యాకుబ్ జీ ఆత్మీయ వచనాలతో పాటు కవిసంగమం లో.. లైకుల గిమ్మిక్కుల నుండి దూరం వుంచాలన్న ఆత్మీయ ఆందోళన ఒక పసి పిల్లవాడు వందకి వంద మార్కులు తెచ్చుకున్నప్పటి మురిపెం తో పాటూ.. వాడు దారి తప్పకూడదనే మమకారపు హెచ్చరిక.

ముఖ్య అతిధి శుబొధ్ శర్కార్ అద్భుతమైన ఆంగ్ల ప్రసంగం.. యూనివర్సిటీ రోజుల్ని గుర్తు తెచ్చింది.
సాహిత్యం ఎంత జీవ వంతం.. ఆత్మవంతం..

(ఇప్పటికే పన్నెండు అయ్యింది.. సమీక్ష మిగితాది.. రేపు రాస్తాను)

ఇదే రోజు - శ్రీనివాస బాలాజీ


మరిచిపోలెని మధురాతి మధురమైన రోజు.... jai Ho కవి సంగమం.

కవుల సంగమం సంద్రంలా - వర్ణలేఖ


కవుల సంగమం సంద్రంలా ఉంది నేనో ఈత నేర్చుకునే జీవిలా ఉన్నా సంతోష సంభ్రమాశ్చర్యాలతో

Strange things happened : million thanks to Kavisangamam friends - Ro Hith

Ro Hith

Strange things happened yesterday.
I am asked to read my poetry which was completely "accidental". I didn't prepare for that. I didn't even have a copy of my poetry...luckily Sky Baaba uncle had it. I must say...I breathed all the air out of my lungs once I finished reading my poetry.

I always wanted to show my poetry to K.Shiva Reddy(http://www.poetryinternationalweb.net/pi/site/poet/item/1607
4
). I used to go to many poetry meets and book exhibitions knowing that he will be going to come to those meets and exhibitions with my papers of poetry but I always hided these papers and a million words that I would like to talk with him behind my smile. And it was on yesterday that he came to me and asked me to give my poetry and phone number so that he can read them and call me.
I ate a single vada yesterday...but I didn't feel hungry. In the afternoon the conversation with Nauduri Murty uncle filled my tummy. My snack of yesterday was the talk with Vijayakumar Koduri uncle with tea. And my dinner was the chat with Mercy Margaret and other friends.
Kavi Yakoob uncle is so dear to me. I always loved him. Kranthi uncle, I didn't recognize him first and now I cannot forget him.
I tried to meet Afsar sir many times. And we met yesterday...after some months of longing. And that small chirpy talk with Arun Sagar is unforgettable.
The conversation with Subodh sir and his applause at the end made my day.

A million thanks to Kavisangamam friends who gave me wings on Independence day to fly to those distant lands of poetry.

ఏ క్షణానికాక్షణం ప్రత్యేకం - పూర్ణిమా సిరి

నిన్నటిరోజు చాలా బాగా గడిచింది...ఏక్షణానికదే ప్రత్యేకంగా..

పొద్దున్నే ఆఫీస్ కి వెళ్తూ వాసు చెప్పాడు...నాకు రావడం కుదరదేమో కానీ ప్రయత్నిస్తాను ఎలాఅయినా నువ్వు తప్పకుండా వెళ్ళు కవిసంగమం కలయికకి..మనసెరిగిన సహచర్యం కన్నా కావల్సింది ఏముంది..

సిరి స్కూల్ నుండి వస్తూ అమ్మ ఈ స్వీట్ నీకు నాన్నకు మీకు స్కూల్స్ లేవు కదా..మీకు ఎప్పుడూ పనులే కదా...సో స్వీట్ ...సిరి నువ్ నా జీవితపు సిరివి

వీలుచూసుకొని తొందరగ
ా వచ్చేసి వాసు మేము బయల్దేరి వెళ్ళాం ఇఫ్లూ లో జరిగే మీట్ కి...
వెళ్ళగానే దారిలో కలిసిన అరుణా దిలీప్,(ఈ పేర్లను విడి విడి గా రాసినా ఒక్కటిగా రాసినా ఒకే లా స్పురిస్తాయి, ద్వనిస్తాయి...వాళ్ళలానే) ప్రవీణా..(ప్రవీణా రాలేనంటే అటుగా వెళ్ళిన అరుణా దిలీప్ తీసుకొచ్చేసారు)
ప్రవీణా చాలా సంతోషంగా దగ్గరికి తీసుకుంటే చాలా హాయిగా అనిపించింది...
నిజం స్నేహానికి ఉన్న సౌరభం దేనికి ఉంటుంది చెప్పండి ..వాడని సుమం అది...

కలిసిన మరో వ్యక్తి జయా...మేము మొదటి సారి కలిసాం..చూడగానే నిన్ను హత్తుకోవాలని ఉంది సిరి అని అంటే ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను...అక్కడ నేను ఉన్నది కాసేపే అయినా చాలా మదురం ఆ క్షణాలు..

వెళ్ళిపోతుండగా జాన్ హైడ్ గారు వచ్చి...నేను జాన్ హైడ్ ని అని పరిచయం చేసుకోవడం మంచిగా అనిపించింది...

బివివి ప్రసాద్ గారు, మేము, రఘు,గురుస్వామి ,మోహన్ రుషి ,కాశి రాజు,నందు,కట్టా శ్రీనివాస్ గారు ఇలా అందరం ఒక ఫోటో ని కెమరాలో జ్ణాపకాలని మనసులోనూ బందించాం..నేను ఎక్కువ సమయం అక్కడ గడపలేకపోయాను..ఎందరినో కలవలేకపొయాను...

అరుణా దిలీప్ స్నేహితురాలు హిమ తో స్నేహపరిచయం..అక్కడి నుండి అరుణ వాళ్ళింట్లో ప్రవీణా తో కలిసి రాత్రి భోజనం...హిమ వాళ్ళ బాబు ముద్దు మాటలు..సిరి అల్లరి..అలా ఓ గంట గడిచింది నిమిషం లా..

ప్రవీణా ని పంపించి మేము చార్మినార్ కి వెళ్ళటం...వాసు మాటల అల్లరి...దిలీప్ నవ్వులు...వాసు కి అరుణ వత్తాసు పలకడం హ హ హ చాలా బాగా గడిచింది...
హ్మ్..చార్మినార్ దగ్గర రాత్రి వేళలో నడక...నాకు మళ్ళీ బాల్యాన్ని తిరిగిచ్చిందా అనిపించింది..నందు,రఘు మీరు ఉంటే బాగుండు అని గుర్తొచ్చారు రా...ఎందుకో అజితా కొల్లా కూడా గుర్తోచ్చింది ...అసలు నేను అజిత తో మాట్లాడడమే తక్కువ ..మరి ఎందుకో ఏమో గుర్తొచ్చింది..
ప్రవీణా నువ్వు ఉంటే మనం చాలా సరదాగా ఉండే వాళ్ళం అనిపించింది..

నిజంగా నిన్న ఏ క్షణానికాక్షణం ప్రత్యేకం గా గడిచింది..

Thank u dears for being with me in my life.

జీవితంలో ఒక పరిపూర్ణమైన రోజు - Yagnapal Raju


నిన్న నా జీవితంలో ఒక పరిపూర్ణమైన రోజు.... ఎంతో మంది సహచరులను కలిశాను.... ఎన్నో అనుభవాలు మూట కట్టుకున్నాను.... ఎనలేని ఆనందంతో.... ఎల్లలు దాటే పారవశ్యంతో గడిపాను.... ఇవన్నీ పంచి ఇచ్చిన కవి సంగమానికి ఎంత ఋణపడి ఉన్నానో....

ప్రయత్నం మరింత ముందుకు సాగాలి - Sailaja Mithra


నిన్నటి వాతావరణం అంతా కవిత్వం తో నిండిపోవడం చాల బావుంది. తెలియని వారినందరినీ కలిపి చేసిన ఈ సభ కొత్తదనంతో నిండి రొటీన్ కు బిన్నంగా నడిచింది. అతిదుల ప్రసంగం ఎన్నో విషయాలు తెలిపాయి. యాకుబ్ గారి ప్రయత్నం విజయవంతం అయ్యింది.పేరు పేరునా పలకరిస్తూ ఆదరించిన యాకుబ్ గారి ఆతిధ్యం ఎంతో నచ్చింది. వారి ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

కవిత్వపు పండుగ గురించి - ఉషారాణి కందాళ


నిన్నటి కవిత్వపు పండుగ గురించి.....
ఏ సగమూ సంపూర్ణం కాదు! నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. అందుకు కించిత్తు బాధ! అసలు రాగలనో లేదో అనుకున్నాను కానీ వచ్చాను, కొంత సమయం గడపగలిగాను, అందుకు చాలా సంతోషం అనిపించింది. ఎవరైన, ఎక్కడైన కష్ట పడి పనిచేస్తున్నపుడు గౌరవించలేకపోతే, అది కు సంస్కారం అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కార్యక్రమం కోసం కవి యాకూబ్ గారు చాలా శ్రమించారు. నిన్న నాకు కనిపించింది వారి శ్రమ అంద
ుకున్న సత్ఫలితం. వారి తో పాటూ మరి కొందరు నిన్న కష్టపడ్డారు. నిన్నటి విజాయనికి కారకులైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ముఖ్యంగా వచ్చిన వారికి! ఒక సభకు, సమావేశానికి నిండుదనం ఆహుతులే కదా? ఆ నిండుదనం కార్యక్రమాన్ని మరింత విజయవంతం చెసింది. అందరూ అశించినట్టు
కవిత్వం కావాలి కవిత్వం!
అది అక్షరసంకలనం లా కాక భావ సంద్రం లా ఉరకాలి.
మరి ఒక్కసారి,
శుభాభినందనలతో!

స్వరగాలోకం తిరిగినటుగా వుంది నాకైతే - బాలు వాకదాని


నిన్న స్వరగాలోకం తిరిగినటుగా వుంది నాకైతే.

కుటుంభ సబ్యులాల అందరు అప్యాయంగా పలకరిస్తుంటే
మనసు ఆనంద తాండవం చేసింది.

కృష్ణవేణి గారు కవిత్వం చదువుతుంటే పైకి నేను బిగ్గరగా నవ్వుతున్నకవిత్వంలో వున్న వాస్తవాని అర్ధం చేసుకున్న నా మనసు మాత్రం అంతకటే బిగ్గరగా వెదకు గురియినది....

అలాటి కవితలు ఎన్నో మసులోకో దూరి గిలికింతలు పేటి మెదడుకు పదును పెటింది.

కవిత్వం రాసినవారే చదువుతుంటే ఆనుభుతి చాల ఆనందంగా వుంది.

ఇంత గొప్ప అవకశం ఇచ్చినందుకు
కవి సంగమం వారికీ నా ధన్యవాదాలు _/\_

ప్రేమ తో,
మీ బాలు.

lively with the real spirit of poetic festival - Dabbikar Roop Kumar :

Dabbikar Roop Kumar :
-------------------------------
The programme was very lively and with the real spirit of poetic festival. Calmly I enjoyed the young poets enthusiasam and their attitude.

అమ్మకొడుక ఆలోచించు - కృష్ణ వేణి


అమ్మనై అడుగుతున్న
అమ్మకొడుక ఆలోచించు