పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మే 2014, గురువారం

Murthy Kvvs కవిత

Mario Puzo మరో నవల Fools Die గూర్చి చెప్పుకుందాం రమారమి 473 పేజీల ఈ నవల గురించి ఏదోకొద్దిలో రాసెయ్యడం సమంజసం కాదేమో అనిపించింది.సరే..సాధ్యమైనంత వరకు ముఖ్య సన్నివేశాలని చెప్తూ బ్రీఫ్ గా మననం చేసుకుందాం.70 వ దశకంలో రాయబడినది ఇది.మొదలు పెట్టడమే పుస్తకాన్ని తను మాట్లాడుతున్నట్లుగా మొదలు పెడతాడు.ఒక మనిషి గురించి మీకిపుడు చెబుతాను..అతని కి స్త్రీలపై గల ప్రేమ గురించి చెబుతాను. అలా ఒక ఉరవడిలో...కొన్ని కఠిన వాస్తవాలను చెబుతాను..అంటూ రచయితే ముందు పేజీల్లో మాట్లాడుతాడు. I will make you feel the painful beauty of a child,the animal horniness of the adolescent male,the yearning suicidal moodiness of the young female. దీంట్లో ప్రేమ గురించి ఉంటుంది. అయితే ప్రేమ గురించి మాత్రమే దీనిలో చెప్పలేదు.ఇది ఒక యుద్దానికి సంబందించినది కూడా..!Let me get to work.Let me begin and let me end. అంటూ రచయిత 1 వ భాగాన్ని ముగిస్తాడు. రెండవ భాగం లో సీను డిఫరెంట్ గా మొదలవుతుంది.లాస్ వెగాస్ లోని కేసినో ల గురించి బాగా అద్యయనం చేసి రాసినట్లు అనిపిస్తుంది.మొత్తం జూద గృహాల మద్య జరుగుతుంది ..ఈ లాస్ వెగాస్ లోని ఓ ఖరీదైన హోటల్ కం కేసినో Xanaddu.దీన్ని Gronevelt నిర్వహిస్తుంటాడు.గాడ్ ఫాదర్ ముందు చూపువల్ల లాస్ వేగాస్ లో జూద గృహాలు చట్టబద్దమయ్యి బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తుంటాయి.దేశం లోని నలుమూలనుంచి,ఇతరదేశాలనుంచి బాగాడబ్బులున్నవాళ్ళు ఇక్కడికొచ్చి కేసినో ల్లో బ్లాక్ జాక్ లాంటి రకరకాల గేంబ్లింగ్స్ లో కాలక్షేపం చేస్తుంటారు. ఇక్కడే మన ప్రధాన పాత్రలు కొన్ని తారసపడతాయి. వాళ్ళెవరంటే Merlyn,Jordan,Cully ఇంకా Diane. ఈ మెర్లిన్ ఒక రచయిత.హాలివుడ్ సినిమాలకి పనిచేసి బాగాడబ్బులు ,పేరు సంపాదించాలనేది ఇతని కోరిక.జోర్డాన్ లాస్ ఏంజల్స్ నివాసి.ఇక కల్లీ Xanadu లో ఉంటూంటాడు.అలాగే Diane అనే ఈ అమ్మాయి ఆ కేసినో shill గా పనిచెస్తుంటుంది.Provocative గా డ్రెస్ వేసుకొని ఆ ఆటగాళ్ళకి పక్కన ఉంటుంది.ఒక మాటలో చెప్పాలంటే ఒక సారి వచ్చినవాణ్ణి నాలుగుసార్లు వచ్చేలా చేయడం వీళ్ళ డ్యూటి.చిప్స్ అందివ్వటం ఇంకా కొంత జాబ్ చార్ట్ ఉంటుంది లెండి. వీళ్ళంతా ఆ హోటల్ లో Baccarat టేబుల్ దగ్గర కలుస్తూ ఫ్రెండ్స్ అవుతారు.కేసినోల్లో ఆడేవారికి ప్రత్యేకంగా గదులు కూడా ఉంటాయి. హాయిగా ఆడినన్నాళ్ళు ఆడి వెళ్ళవచ్చు. వీళ్ళలో జోర్డాన్ చాలా బాగా ఆడి డబ్బులు బాగానే సంపాదిస్తుంటాడు.అయితే ఇతని భార్య కాపురం చేసిన తర్వాత 20 ఏళ్ళతరవాత ఇంకొకరిని చేసుకొని వెళ్ళిపోతుంది.వీరి ముగ్గురు ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నప్పుడు కూడా ఆమె గురించి కోపం వ్యక్తం చేయడు.ఇతనికి మళ్ళీ ముగ్గురు సంతానం కూడా..! బంధాలని గౌరవించరని అనలేను గాని అసహాయంగా బంధాలమధ్య నిలబడి అర్ధించడం వారిలో ఉండదనిపించింది.నిజం చెప్పాలంటే ఎంత గొప్ప ప్రేమ అయినా ఒక ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది దానికి....గొప్ప వేదాంతి అయినా అయి ఉండాలి లేదా అల్టిమేట్ ప్రాక్టికాలిటీ అయినా ఉండాలి.రెండు ఒక చోట అవి షేక్ హేండ్ ఇచ్చుకుంటాయి. ఆ..సరే...ఈ జోర్డన్ కేసినో లో గేంబ్లింగ్ రాత్రి పగలు ఆడి విపరీతంగా ఆడి బాగా సంపాదిస్తుంటాడు.అప్పుడు ఆ యజమాని Gronevelt కి అనుమానం వస్తుంది.వెంటనే Cully ని పిలుస్తాడు.ఏమిటి ఆ జోర్డాన్ బాగా లాభాలు తీస్తున్నాడు.అతణ్ణి ఏదో కరణం చెప్పి బయటికి పంపించే ఏర్పాటు చెయ్యి అంటాడి.ఇంతకు విష్యమేమిటంటే ఈ Cully అనేవాడు జూదగాళ్ళతో కలిసి తాను ఆడుతూనే యాజమన్యానికి Spy లా పనిచేస్తుంటాడు.అంటే బాకరెట్ టేబుళ్ళదగ్గరున్న వర్కర్స్ గాని ఇంకొకళ్ళుగాని ఏమైనా సీక్రెట్ డీలింగ్స్ చేసుకొని యాజమన్యాన్ని బురిడీ కొట్టిస్తున్నారా అని చూస్తుంటాడన్నమాట. అయితే ఉన్నట్టుండి జోర్డన్ ఆత్మహత్య చేసుకుంటాడు. తెల్లారిన తర్వాత ఈ వార్త కల్లీ ,మెర్లిన్ కి బాధగా చెబుతాడు. 'He blew his head off.He beat the house for over four hundred grand and he blew his fucking brains out.' ఆ తర్వాత కధ వచ్చేసారికి చూద్దాం.

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vaiiOF

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1otIBxu

Posted by Katta

Buchi Reddy కవిత

***** అమెరికా లో afser---kalpana గారి రాజకీయాలు *???? సారంగ -- ఈ వారం వెబ్ లో--- నగ్నముని పై --1992 లో అఫ్సెర్ గారు రాసిన ఆర్టికల్ ను ప్రచురించారు---ధాని పై నా కామెంట్ రాశాను---ధాన్ని deleate చేశారు---post comment అని పెట్టి--- వాస్తవం రాస్తే--- తీసివేయడం ఎంత వరకు సబబు--- కవి గారు--- కల్పన గారు *** నా కామెంట్ *** నగ్నముని గారు-- కవి గా-- రచయిత గా---వారి పై అభిమానం-- గౌ ర వం ఉంధీ కానీ---వారిలో మార్పు--విప్లవ కవి-- దిగంబర కవి -- గారు తనికెళ్ళ భ రీ ని గారి సన్మానం-- పారితోషకం తీసుకోవడం--- బంగారు కంకణం ధరించడం---???? రాత లు ఒకటి -- చేతలు మరొకటి --నాయకులకు -- వారికి ఉన్న తేడా ఏమిటి ??? అఫ్సెర్ గారు -- కల్పన గారు ఈధి వాస్తవం కాధా ??? సెలువివ్వండి ధయతో ఎంధుకు రాజకీయాలు ___ దేనికి ???? ---------------------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lDAr24

Posted by Katta

Subhash Koti కవిత

గజల్ ఒక అగ్ని ~~~~~~~~~~~ ఫైజ్ షేర్ లక్షణం గురించి ఒక గొప్ప షేర్ చెప్పాడు, మరణానికి నాలుగైదు రోజుల ముందు; " జలేన జగ్ మే అలావోతో షేర్ కిస్ మక్సద్ " " చలి మంట అంత కూడా లోకానికి వేడి ఇవ్వకపోతే, ఇక షేర్ వల్ల ఏమి ప్రయోజనము? " అందుకేనేమొ గజల్ ఒక అగ్ని అంటారు శేషేంద్రగారు. అంటే కవిత మనిషిలో వేడిని పుట్టించాలి.వేడి అంటే శ్రోత గుండెలో చుర్రుమనాలి.విన్న వెంటనే నోట్లో నుంచి ' వాహ్ ' అనే శబ్దం రావాలి.కావ్యం లోంచి అలంకారం తీసేస్తే నిప్పులో నుంచి ఉష్ణం తీసేసినట్లవుతుంది. ఈ అగ్నిని సృష్టించడానికి ఉర్దూ కవి జీవనాగ్నుల్లో ప్రయాణం చేసి తప్త సువర్ణం అవుతాడు. ఉదాహహరణకు చాలా ఉష్ణోగ్రత ఉన్న ఫైజ్ షేర్ మరొకటి చూడండి; " జిస్ ధజ్ సే కొయీ మక్తల్ మే గయా ఓ షాన్ సలామత్ రహతీ హై యే జాన్ తో ఆనీ జానీ హై ఇస్ జాన్ కీ తో కోయీ బాత్ నహీ- " అలంకరిచుకొని ఉరికంబం వైపు నడచిన అతని తేజస్సు, శాశ్వత శుభం కలిగి ఉంటుంది;ఈ ప్రాణమా వస్తూ, పోతూ ఉండేది,; అదంత గొప్ప విషయం కాదు..." ఈ షేర్ వీరుల ధైర్యాన్ని, వారి నిబద్ధతను మరియు ప్రాణాలను తృణప్రాయంగా భావించే త్యాగనిరతిని వర్ణించాడు కవి. అమరుడైన భగత్ సింగ్ త్యాగం సరిగ్గ ఇటువంటిదే కదా. ( ఆంధ్ర జ్యోతి సచిత్ర వారపత్రిక 1-2-85 లో ప్రచురిత గుంటూరు శేషేంద్ర గారి " గజల్ ఒక అగ్ని " సాహితీ వ్యాసం ఆధారంగా ...)

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ltN9O0

Posted by Katta

Jagadish Yamijala కవిత

నా వంక చూస్తున్నారు ----------------------------------- నా వద్ద అనేకమైన ఆశ్చర్యార్ధకాలు ఉన్నాయి మీ వద్ద అనేకమైన ప్రశ్నార్ధకాలు \ ఉన్నాయి నేను ఎగురుతున్నాను నా ఆశ్చర్యార్ధకాల వల్ల కానీ మీరు చూస్తూ నిల్చున్నారు ప్రశ్నార్ధకాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్క్రి చేస్తున్నాయి నాకున్న రెక్కల్లో ఏమున్నాయని.... - యామిజాల జగదీశ్ 15.5.2014 --------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1svR5Sq

Posted by Katta

Pulipati Guruswamy కవిత

అటు జరుగు // డా.పులిపాటి గురుస్వామి // గొప్ప ప్రారంభము అంతే గొప్ప ముగింపు నడుమ ,అద్భుతమైన కొనసాగింపు ఏ జీవితానికీ సరిపడదు ఒక రోజులో కూడా అంతే ఐతే కావచ్చు పరిమితిదేముంది...మనం గీసిన తాత్కాలికహద్దు చేయినిండా చేరిన అన్నం ముద్ద ఈ ప్రపంచానికంతా ఆసరా కడుపునిండిన సందర్భమే గొప్ప అవకాశము ,అదృష్టమైనది స్పష్టంగా చూడదగిన కళ్ళు కూడా మనకి లేవు కొన్ని జంతువుల వలె. అవికూడా కాలాంతరాన మబ్బులు కమ్మి గుండెకి పడ్డ చిల్లులా మారిపోతాయి దుఃఖపు బొట్లు విడువటం కోసం మనది కాని ప్రాంతాల్లో మన మాట వినని శరీరాల్తో ఏముందనిక్కడ ? దాచిపెట్టితిమా ఏమైనా? ఏరోజుకారోజు... దొలుపుకుంటూ,మలుపుకుంటూ తోటి మనుషుల మధ్య వినయం నటించుకుంటూ... ఓహ్.....ఇక్కడిదాకా వచ్చాక ఎవగింపు కే ఎక్కువ బలం బచ్చలాకు మీది పచ్చ పురుగులు నయం కాకపొతే మరేమిటి? ఒరేయ్ ఆనందుడా! ఉన్నట్టుగా ఉంటూ లేనట్టుగా మసలుకోవటమే జీవించడంలో నేర్పు. ..... 15-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1svR8h4

Posted by Katta

Sriarunam Rao కవిత

హర్డ్ వర్క్ :- మనం సాధించాలనుకున్న దానిని ఒకేఒక మాటలో చెపారు మన పెద్దలు, `అదే కష్టే ఫలి` అంటూ. మీ సాధన ఎంత నిజమైతే.. అంతగా ఈ మాటని నమ్మండి. కష్టాన్ని మించిన ఫలితం మరొకటి వుండదు. అయితే చాలా మంది నుండి ఈ మాటపై కొన్ని సందేహాలను నేను ఎదుర్కొనటమూ జరిగింది కూడా. "ఎంత కష్టపడినా సరైన ఫలితం రావటం లేదు. మరేవో ఫలితాన్ని శాసిస్తున్నట్లుంది. మాకు మాత్రం ఎప్పుడు ఈ కూలీ బ్రతుకే మిగులుతుంది" అంటూ పెదవి విరిచేవారు నాతో చాలామందే వున్నారు. వీరి విరుపులు ఎలా వుంటాయంటే.. ఒక్కొక్కసారి మనలో కూడా ఇది నిజమేనేమో అన్న మీమాంస మొదలవటం జరగవచ్చు. నిజానికి వీరి మనస్తత్వం ఎలా వుంటుందంటే తమకంటే ముందుగా వెళ్ళిపోతున్న వారంతా `ఏదో` అదృష్టం కలిసొచ్చినందువల్లనే అలా సాధించుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్లుంటుంది. ఇదంతా నిజమేనా? అలోచించండి, మీరు పడుతున్న కష్టం వెనుకనున్న నేపధ్యం ఏమిటి? దాని ఫలితాన్ని మీరు రీసైక్లింగ్ చేసుకుంటున్న విధానం ఏమిటి? ఈ రెండింటిపై ఒక విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం ఇప్పుడే. ప్రతీ కష్టమూ ఫలితాన్నిస్తుంది.. ఏదో ఒక రూపంలో. కాకుంటే ఆ ఫలితాన్ని వినియోగించుకోవటానికి మనం చేసుకునే విశ్లేషణే మన విజయాన్ని మనం అందుకునే మార్గం. from my book "anthar bhramanam" “శ్రీఅరుణం” 9885779207

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lD88kt

Posted by Katta

Abd Wahed కవిత



by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1otlwLh

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//మెట్టు-4//06 -------------------------------మెట్టును చూస్తుంటే అనంతశిష్యకోటిని ఉన్నతలక్ష్యాలకుచేర్చి తానుమాత్రం ఉన్నచోటున్నే నిలిచిపోయే గురువుగుర్తుకొస్తున్నాడు పార్టీజండాను-నాయకునిపదవినీ తనప్రాణప్రదంగా మోస్తోన్న ఓ సామాన్యకార్యకర్తనూ మెట్టుబింబిస్తోంది ఓమహా వంశ యశ్శస్సునూ ఓమహాయుద్ధభారాన్నీ తనభజస్కంథాలపైదాల్చిన భీష్మాచార్యుడూ, ' "అతిథిదేవోభవ"అంటూ వామనుని మూడోపాదానికి తనశిరస్సును అర్పించిన బలిచక్రవర్తీ సాక్షాత్కరిస్తున్నారు డాబుసరికీదర్పానికీ ప్రతీకయై సోమరుల మరులుదోచే లిఫ్ట్్ లప్రభావంతో తనప్రాధాన్యతపిసరంత తగ్గినట్లనిపింంచినా మెట్టునాశ్రయించేవారూ అసంఖ్యాకులే శిశువు రూపంలో ఆసుపత్రిమెట్టుతో ఇహంలోకి రావడంతో మొదలైన మానవజీవనప్రస్థానం అంతిమఘడియల్లోనిరోగిరూపంలో అదే మెట్టు ఆత్మీయస్పరశతో పరంలోకి చేరేదాకా మెట్టులేని మనుగడ ఊహించడమూ కష్టమే 15-5-2014

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lt9b3E

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

టంగ్ టింగ్... కవిత్వం లేని కవిత కరెంటు లేని వైరు దొందూ దొందే

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v8FnRL

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//కుటుంబం//09 ****************** అయ్యగారిది డబ్బుప్రపంచం అమ్మగారిది సీరియళ్ళప్రపంచం పెద్దాడిదీ బైక్ ప్రపంచం చిన్నదానిది సెల్లు ప్రపంచం ఎవరి ప్రపంచం వారిది ఎవరి వెతుకులాట ఎవరి వెతుకులాటవారిది ఎవరికెవరిపై అపేక్షలు సొంతవారిపైన ఉపేక్షలు ఏంతింటున్నారు? ఎలాచదువుతున్నారు? ఎక్కడతిరుగుతున్నారు? ఏమేం చేస్తున్నారు? తెలుసుకునే తీరిక ఏది ఆరాతీసే ఓపిక ఎక్కడిది మేమంతాకలిసి భోంచేసి ఎన్నాళ్ళయిందో?అంటూ తామెంతబిజీయో అన్నట్టు తమపనులు ఆగితే ఆకాశమే కూలి నేలపై పడుతుందేమో అన్నంత హైరానాలు ఆధునికపోకడల ముఖచిత్రచిత్రాలు ఆత్మబంధాలమధ్య పెరుతున్నఅగాధాలు బాధ్యతలు పట్టని విషాధాలు నేతిబీరలో నెయ్యిలా కుటుంబంలోనే కుటుంబ భావనలు విలుప్తమవుతూంటే ఇక వసుధైక కుటుంబభావనలు ఎలాగ సాధ్యమవుతాయి 15-5-2014 (నేడు అంతర్జాతీయ కుటుంబదినోత్సవం)సందర్భంగా శుభాకాంక్షలతో......

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liHH1P

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత



by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gqwhf6

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత



by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gqwfE5

Posted by Katta

Sriramoju Haragopal కవిత

హిఫాజత్ గ పెట్టు బిడ్డా నేను జీవిస్తున్న కాలం నాదే పరాయితనాలతో పోరాడ్డమే బతుకంతా నేను నేర్చుకున్న యుద్ధవిద్య నా ముందుతరాలవాళ్ళు నాకిచ్చిన వారసత్వం, సత్వం నా రేపటి తరాల వాళ్ళకు నేనివ్వాల్సిన వేకువ జెండా ప్రతిదినం బతుకుపోరులో అలిసిపోని గుండెలెక్క బతికించే ప్రేమలప్రవాహాలై వాళ్ళు రేయింబవళ్ళు ఒకే శ్వాసగా ఈ నేలని ఆకుపచ్చటివనం చేసి బతుకును సద్దిగట్టి ఆకళ్ళు తీర్చిన వాళ్ళు అంతులేని చిన్ననీటివూటలై, వాగులై నదులై సముద్రాలై నిరంతరం కాపలాకాచే అలలసెంట్రీలై వాళ్ళు నింగీ నేల ఆల్చిప్పల నడుమ ముత్యాలలెక్క మనల్ని తమ స్వేదబిందువులతో జీవంపోసిన వాళ్ళు వాళ్ళ నుండే కదా ఈ దేహం, వాళ్ళదే కదా ఈ దేహం వాళ్ళిచ్చిన రక్తమాంసాలు,ఆలోచనలు అమానత్ గా తరాల కందియ్యాలె కద, నేను నా మీద నుండే అవతలి ఒడ్డుకు నడువాలె లోకమంతా ఒక్కయిల్లయితే బాగుంటది లోకానికంతా ఒక్కటే దుకాణమైతే ఏం బాగుంటది లోకాన్నే అంగడిజేస్తున్నోండ్లను వూర్లనుండి తరుమాలె మనది మనం పంచుకో నేరిస్తే బయటోనికి సందుండదు దుర్మార్గమైన ప్రపంచీకరణకు మందు స్థానికీరణే సకల అస్తిత్వాలను నిలబెట్టుకుంటనె సామూహికం కావాలె సకల జీవనసంస్క్రుతులను బతికించే ఏకత్వం కావాలె వాళ్ళు మనకు బతకడం నేర్పించిండ్రు, లడాయి చేసి చావడం చూపించిండ్రు వాళ్ళు మనుషులకొరకు ఎట్లా కొట్లాడాలో చెప్పిండ్రు, పానంజేసి ప్రేమించుడు తెలుసు పానమిచ్చిబతికించుడు తెలుసు వాళ్ళెత్తిన జెండా దించేదిలేదు వాళ్ళు చూపిన గమ్యం మరిచేది లేదు పొలాలు దోచి, హలాలు దోచి, ఇలాతలంలోని హేమం దోచి మాళ్ళు కట్లి, మాయామహళ్ళు కట్టి, ఆ దేశం నుంచి ఈ దేశం దాక మనుషుల రెక్కలు దోచి, రెక్కల కష్టం దోచి, మాటలు దోచి, బాటలు దోచి ఇండ్లు దోచి, పనులు దోచి, బతికేతత్వాన్ని దోచి, మనిషి లావు దోచి ఒక్కడుగ కనపడే పెక్కురూపాల దెయ్యాల్ని కాల్చే కాలం మనదే ఒక్కడుగు కూడ వెనకకు పొయ్యేది లేదు అక్కరకొచ్చే పానం వుంటే లోకమంతా, పొయినా లోకానికంత రేపు నా తర్వాత నావోళ్ళుంటరుకద

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sQRXmx

Posted by Katta

Krishna Mani కవిత

కష్టకాలం _______________________________కృష్ణ మణి ‘’ పక్కోడి కళ్ళలో కష్టాల్ని చూసాను అవి నాకేసి నవ్వుతున్నాయి నాకున్న వాటితో పోల్చితే ఇంకా పెద్దవని అహం వాడిని ఓదార్చి ఓదార్పు పొందాను ’’ ! చిరిగిన బట్టల్లో నలిగిన మనసులు పురుగుల మందులతో పార్టి చేసుకొనే మొనగాళ్ళు పుస్తకాల చెలికాడి పిచ్చి ముదిరిన మాటలు పెంటకుప్పలపై పసికూనల కూతలు ! చిల్లర దక్కని బిచ్చగాడి బిక్క చూపులు సిగ్నల్ పడ్డా అమ్ముడుపోని జాతర పట్ట పగలైనా ఖాళి కాని ఇడ్లి గిన్నెలు స్కూల్ గేటు పక్కన ఎండిన సంత్రాలు ! ఎత్తైన భవనంపై అలసిన ఇసుక సంచులు ఫారిన్ బూట్లకు కుట్లు వెయ్యలేని సూది తిరగని చక్రం కదలని కుండలు బొగ్గుల కొలిమిలో నిండిన దుమ్ము ! కష్టానికే కడుపోస్తే పుట్టేది ఏంది ? కృష్ణ మణి I 15-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T5zoPm

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Vengeance | రేపట్నుంచి ఐదేళ్ళ పాటు శవజాగారం చేయాల్సిన సూచనలు కనిపించటం లేదా ? ఈ ఒక్క రోజు శుభ్రంగా తిని బబ్బో. పొద్దున్న కాఫీ తో ఒకసారి రాత్రి పెగ్ తో ఇంకోసారి (పెగ్ కాకపోతే నిద్రమాత్రల తో ఎహే ..యే రాయి అయితేనేమి పళ్ళు రాలగోట్టుకోవటానికి) చచ్చిపోయిన ప్రజాస్వామ్యానికి రోజు RIP చెప్పుకోవటం ఇంకా పూర్తిగా రక్తంలో ఇంకనే లేదు అపుడే ఇన్నాళ్ళు కనీసం పుస్తకాల్లో బ్రతికున్న సెక్యులరిజం కూడా అదే దారిలో చావు యాత్ర కి రెడీ అయిపోయింది చూసి ఏడు . పీలో ఇండియా పీలో . అవుర్ ఎక్బార్ ఈకలు తీసిన కోడిలా బ్రతికున్న సంతోషం లో తాగు . షైనింగ్ ఇండియా మండబెట్టిన బ్రతుకులని 10 ఏళ్ళ పాటు స్కాం పురుగులు కొట్టేసాక సగం కాలిన శవాల్లా తీన్మార్ కి రెడీ అయ్యి నయా అభివృద్ధి చిప్పలో అడుక్కుందాం రా ! అఫీషియల్ గా పక్కోడి పీకలు కోసుకుతినడానికి సిద్దపడిపో .. నచ్చకపోతే ? ఫికర్ క్యౌ ? నేతల చంకలు నాకటం అయిపోతే నీ బొచ్చెలో ఆల్రెడీ ఉన్న పసితలలు చీల్చిన స్త్రీ గర్భపు నెత్తుర్లు టేస్టిగానే ఉన్నాయి గా అపుడే రుచి మర్చిపోయావా ? ఇండో చైనా భాయి భాయి కి చికిలించిన కళ్ళ వాడు మంగళం పలికేసాక హిందూ ముస్లిం భాయి భాయి కి హ్రదయం చచ్చిన నువ్వు చావు హారతి ఇచ్చుకో . పాత పగల కత్తులు అన్ని బయటకి తీసి కుంకుమార్చనతో సిద్దం చెయ్యి వసుదైక కుటుంబం డ్రామా కి తెరదించి ,నిజరూపం వెలికి తియ్యి . నీ మతం సమ్మతం కాని ప్రతి మనిషిని అడ్డంగా నరికెయ్యి నీ సంస్కృతిలో భాగం కాని ప్రతి మనస్సు ని చంపెయ్యి . ఇన్నాళ్ళు వేసుకున్న ముకౌటా తొలగించి నీ అమానవ అవతారం కి ఇంకోక్కసారి జై కొట్టు . ఎంత కర్కశపు పనులు చేసినా ? ఎన్ని దైవాగ్రహాలు నీవిగా నాటకం ఆడినా ? అఖరికి అన్ని సమాధుల సైజులు ఆరు బై మూడేగా మరపెందుకు? నిజమే.. నీ అభివృద్ధి నీకో పాలరాయి సమాధి సాధ్యం చేస్తుందేమో ...కాని నీ మనస్సు ని తొలుస్తున్న పురుగులు సమాధిలో నీ శరీరాన్ని తొలవటం ఒక్క క్షణం అయినా ఆపగలవా? "అ నేస్తం " ! నిశీ !! 15/05 /14

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jwBpcc

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-74// ***************************** 1. గంట, ఘడియైపోద్ది అమ్మాయితో మాట్లాడుతుంటే, ఘడియ, గంటైపోద్ది ఇంటర్వ్యూలో కూర్చుంటే, కె.కె. తేడా ఎక్కడుందంటావ్? 2. పాడులోకం అనుకుంటే అంతా ఈజీనే, బాగుచేద్దాం అనుకుంటేనే... రోజు ప్లానింగైనా కష్టమే 3. "నేనేమనుకున్నానంటే" అని ఎప్పుడూ అనకు, ఎందుకనున్నావో కూడా చెప్పాల్సొస్తది. 4. మతం చెబుతోంది మనుషుల్నొదిలేసి.... అక్కడెక్కడో దేవుడున్నాడని, డబ్బులిస్తేనే కనబడతాడని. 5. చరిత్రకి జాలెక్కువేమో, అస్సలు కాదనదుగా... కధలెన్ని అల్లిచెప్పినా... 6. చాలాసార్లు...నోరు డెలివరీ చేసేలోపే, బుర్ర నాలిక్కరుచుకోమంటుంది, అందుకేనేమో థింక్ ట్వైస్ అనేది. 7. కాలం ఒక మహా ఔషధం, ఎక్కువగా వాడితే... అయిపోతుందోయ్ అదే విషం 8. బాల్యం,యవ్వనం,వృద్ధాప్యం... అన్నింటికీ ఉందోయ్ కాల పరిమితి, అజ్ఞానమ్మాత్రం ఒదిలేసావెందుకోయ్ భగవతి. 9. పక్కోడు చేసిన తప్పులైనా, అవన్నీ నీకు పాఠాలేరా నాన్నా, అంత టైంలేదు అవన్నీ ఓసారి చేద్దామన్నా 10. కష్టపడితేగానీ గెలవలేం, గెలిచాక మరింత కష్టపడతాం, అందుకు ఆనందిస్తున్నోళ్లెందరోనని ========================= తేదీ: 15.05.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sQAA5u

Posted by Katta

Appanna Naidu కవిత

మూడవ తరం విదేశ తెలుగువాడియొక్క కోరిక. కవితలో తప్పులువుంటే క్షమాపణ కోరుచున్నాను. Kuala Lumpur, Malaysia

by Appanna Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T5cGqC

Posted by Katta

Babu Koilada కవిత

కొయిలాడ బాబు //ఎక్కాల బుక్కు// అంకెలతో సావాసం చేసిన చిన్ననాటి శైశవ స్మృతులు ఒకటో ఎక్కం ప్రారంభంలోనే చెప్పాయి చిన్ని చిన్ని పాఠాలు చిత్రంగా బహుచిత్రంగా టీచరమ్మ అడుగుల చప్పుళ్ళో ఎన్ని అర్థాలో తెలియకనే తెలిసేవి గుండెలో మోగకనే మోగేవి టెన్షన్ గంటలు "టిక్ టిక్"మని వంతుల వారిగా ఒక్కొక్కరు యుద్దానికెళ్ళే మొదటి సైనికుల్లా సంఖ్యా సమరానికి సిద్దమవుతుంటే ఏదో తెలియని భావం ఎవరి తర్వాత ఎవరి వంతో అని కన్నార్పకుండా చూసే వేళ సరిగ్గా అప్పగించలేని చిట్టి నాన్నలు మండలు చూపిస్తే చాలు సుర్రున్న తగిలే స్కేలు తాపులు ఇప్పుడు తల్చుకుంటేనే ఎంత మాధుర్యాన్ని బాధగా అందిస్తున్నాయో ఈ చిన్ని గుండెకి ఏమీ తెలియని అమాయక మొహాలకు అవే లెక్కకు మించిన కష్టాలు ఒకడు గొల్లపూడి వీరాస్వామి బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే మరొకడు వెంకట్రామా అండ్ కో బుక్కే తెచ్చి చింపి చింపి చిందరవందర చేసేవాడు దాచేపల్లి...గుల్మోహర్ ... ఏవైనా అప్పటికి మాకు అవి మా లెక్కలు తేల్చే ఎక్కాల బుక్కులే 15.05.2014

by Babu Koilada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lhJ5BT

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

బంధాలు బాధ్యతలలో నిన్ను నీవే మర్చిపోయి నేను మనిషినే అన్న విషయం మరచి ఒక యంత్రం లా జీవితం సాగిస్తూ ... అందరి బాధ్యతలు నీవిగా భావించి నీ బాధ్యత నువ్వు మర్చిపోవటం న్యాయమా నేస్తమా అందరిలా పుట్టావు అందరిలా పెరిగావు అందరిలా భావావేశం వుండటం లేదు మనిషినే కాదు భావాలే లేవు అనటం తప్పేనేమో ఎ సంబంధం లేకుండా మనం ఈ ప్రపంచం లోకి రాలేదు నీవు అన్నీ మర్చి పోయినా ప్రక్రుతి నిన్ను గుర్తుపెట్టుకుంటుంది !!పార్ధ !!15/05/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RT9vBv

Posted by Katta

Rajender Kalluri కవిత

## అమర్ రహే ## ఆ క్షణాలు నన్ను చేసాయి " అమరుడు " ని మనస్సేన్దుకో మరణం వైపు మళ్లించిన ఆ క్షణాలు మల్లి తిరిగిరాను అని తెలిసి బాధపడ్డ గడియలు తెలిసో తేలికో చేసిన పొరపాటు వల్ల కళాశాలలోని పరీక్షలో ఫెలు అయ్యాను ...... అంతే ! నీ జీవితం వృధా అన్నారు కొందఱు , నీ వల్ల కాదు అన్నారు ఇంకొందరు , ఈ జన్మ వ్యర్ధం అన్నారు మరికొందరు .... మనస్సేన్దుకో నోచ్చేసుకుంది , గుండెను గుచ్చేసుకుంది . ముద్ద నోట్లో పెట్టె అమ్మ కుడా నన్ను మొద్దు అనేసింది , నన్ను రెచ్చగొట్టే నాన్న వొద్దు అనిపించింది హేళన చేసే స్నేహితులనా నేను సంపాదించుకుంది అనిపించింది వద్దని వారించుకునె ఇద్దరు ఒక మనిషిలో ఎలా ఉంటారో అప్పుడర్ధమైంది మరణం మంచిది కాదని తెలుసు , ఐనా ఆ క్షనాలేన్దుకో నన్ను చావు వెనకాల పరుగులు పెట్టిన్చాయ్ అందరు కాదని నేను వెళ్ళిపోయినా నన్నెవరు కాదనలేదు అన్న వాస్తవాన్ని మర్చిపోయినా , నాలుగు కాళ్ళు నా వెంట వచ్చి శవాన్ని కాటికి చేర్చాయి రాసిన పరీక్షలో విఫలమయ్యాను అనుకున్నా నిజానికి ......ఆ దేవుడు పెట్టిన పరీక్షకు బయపడి చచ్చిపోయి కుడా విఫలమయ్యాను నేను మరణించినా నా ప్రశ్న బ్రతికే ఉంది ..ఇంతకూ ఈ సమాజంలో “ ఓటమంటే అంత చిన్న చూపేందుకు .....గెలుపంటే అంతే మోజేందుకు ? పడి లేచే కెరటాల వల్లనె కదా ప్రపంచం మొత్తం వెలుగులతో నిండిపోతుంది ....జీవితం కుడా అంతే ! “ సాదక బాధకాలుంటేనే " మనిషి " , వాటికి బయపడి చావు అనే కౌగిలి చేరోద్దని మీ kAlluRi [ 15-05-2014 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sQaaRl

Posted by Katta

Amma Akhil కవిత

#అమ్మఅఖిల్ //నేను వెతుకుతున్నాను// మనీ కాకుండా మనుషులు శాసించే మానవ సంబంధాలను జీవితపు చివరి దశలో కడుపార తిని కనులారా నిద్రపోయే తల్లిదండ్రులను ఈ విద్యా విధానాలతో విసుగులేకుండా చదివే పిల్లలను ఉపయోగపడే విషయాల కోసం అధిక సమయం కేటాయించే యువతను విష సంస్కృతుల మోజులో పడకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే వాళ్ళను పదవి వ్యామోహం కాకుండా ప్రజాసంక్షేమం కోసం పాటుపడే నాయకులను ప్రపంచ దేశాలకు దీటుగా పనికి వచ్చే సినిమాలను తీసి ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టే డైరెక్టర్లను అన్ని క్రీడల్లోను గోల్డ్ మెడల్ సంపాదించే క్రీడాకారులను సమాజానికి కావాల్సిన కవిత్వాన్ని అందిస్తూ నిద్రపోతున్న దేశాన్ని లాగి కొట్టి లేపేలా రచనలు చేసే కవులను కవయిత్రులను భావి భారతానికి కావాల్సిన విధంగా పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అటువంటి కొంతమంది వ్యక్తులను నేను ఇప్పటికీ వెతుకుతున్నాను...! 15may14

by Amma Akhil



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNJ5ql

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/భవిష్యత్తు ఎక్కడ .................................. ............. ఈ మద్య పశుగ్రాసం షాపులకు డిమా0డ్ పెరిగి0ది మనపై ప్రేమ పెరిగి0దని జంతువులు ఎగబడుతున్నాయి పరాయి దేశంలో రహస్యంగా పె0చిన అది చికటి దాటి వెలుగును చేరే సరికి శరీరం శక్తిని కోలిపోతు0దని బుర్రలున్న జంతువులకు తెలియదు. పదవి చేపట్టి పాలను పి0డి రక్తాలను లాగి ఫ్రిజ్జులో పెట్టి ఫ్లయిట్లో పరాయి దేశం పంపి వడ్డీలకిస్తాడనే తెలివిని గొయి తిసి పాతి. దొరికి0దే మనదని దోచుకు0టే మనదా? అని దవడల్లో దాచుకొని నిలబడి నెమర వేసే ఈ జంతువులకు భవిష్యతతు ఎక్కడిది. (ఎలక్షన్స్ టైమ్లో రాసుకు0ది) 15-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QL07yu

Posted by Katta

Surya Prakash Sharma Perepa కవిత

కనులకు కనులు... \\వేదాధ్యయ\\ \\15-05-2014\\ కన్నులకు కనులు వచ్చాయి కమ్మని నిదుర దరి చేరగనే చిక్కటి నల్లటి దీపపు వెలుగులో వెచ్చవెచ్చని వేసవి వెన్నెల చల్లని తెల్లటి సూర్యుని దూది దారాలపై నన్ను లాలనగా తోసుకుపోతోంది మనసు హిమఖండంలాంటి కాంతిపుంజం వైపు మోహం నిశాకమలమై విరుస్తోంది ఆవిరి పిల్ల మబ్బు అల్లరిగా చెక్కిలి గీటిపోయింది నిదుర సముద్రం చీకటి వేడికి మేఘమై కలల వర్షమై కురుస్తోంది ఆ స్వప్న బిందువుల దారులలో మల్లె మొగ్గలై పరుగెడుతున్నాయి తెల్లటి దేవకన్యలవంటి నా జ్ఞాపకాలు విఫలమయ్యాయి... ఆ మల్లెల పరిమళాలను ఆఘ్రాణించే ప్రయత్నంలో స్వప్న వీణలన్నీ కలిపి ఉఛ్చ్వాశ నిఛ్చ్వాశ అలల ధాటికి పరిపూర్ణత పొందని శిథిల రూపాలై...

by Surya Prakash Sharma Perepa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oQVuiA

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఒక్కోసారంతే... దేహం నీరసపడ్డప్పుడే మనసు రెక్కలు తొడుక్కుంటుంది. కళ్ళు కలల్ని కసిరేసినప్పుడే కొత్తలోకం కరచాలనమడుగుతుంది. ఆశలు ఆవిరుతున్నపుడే ఎండమావుల కవాతు మొదలౌతుంది. * * * ఎందుకనో.... పదునైన కోర్కెలను సానపట్టే ఈ హృదయానికి దయే ఉండదు. నిర్దాక్షిణ్యంగా తనను తానే గాయపరచుకుంటుంది. ఉదయసంధ్యలూ ఏదో ఒక అలజడిని సాలేగూల్ళలా మస్తిష్కంలో అలికిడి లేకుండా అల్లేస్తుంది. అమాయకంగా అల్లిన గూడులోనే చిక్కుకుపోతుంది. * * * అయినా ... రగిలే కాంక్షని త్యజించాలనుకునే మనిషిలో యుగాలుగా మార్పే లేదు !! కాలం మిగిల్చిన కన్నీటి చారికలను మాన్పే లేపనమే లేదు !! 15-05-2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lzN0eZ

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@@ అపార్ట్ మెంట్లు @@ ఎప్పటికి ఏవో జ్ఞాపకాల కదలికలతో మనసంతా సందడిగా ఉంటున్దేన్దుకో సందడి అంటే సంబురం కాదు గాని ఏవో గుర్తుకొస్తుంటాయి అనవసరంగా అన్ని యాది చేసుకునే నిరంధి జీవితం కాదు .కాని ఏదో రంది మదిని కదిలించేలా చేస్తుంది ఈ దినసరి మనవ యంత్రం నడిచి నడిచి చల్లబడాలంటే తిరిగి గూడు చేరి తలుపు లేసుకోవలసిందే తప్ప .,మందలించే మనిషుండదు అవును మరి., ప్రపంచీకరణ విసర్జించిన మనుషుల పుట్టాలనే అపార్ట్ మెంట్లలో ... నిన్న మొన్నటి వరకున్న వంద వాకిల్లని ఫ్లాట్లుగా మారిపోయాయి వాకిళ్ళ పై ఉన్న పిండి ముగ్గులన్ని పెయింట్ గీతలయినాయి ఆత్మీయ మనసులన్ని అపార్ట్ మెంట్ జాలిలో వడ పోయబడ్డాయి గల్లిలన్ని మాయమై విలాసం మిగిల్చిన విల్లలినాయి ఎవరి మనసులు వారికే ఎవరి చూపులు వారికే హద్దులు నిర్దేశింపబడిన అత్మీయప్రవర్తన లోపల ప్రేమలున్నా మించకూడదు చొరవలు కరువైన కృత్రిమ జీవితాలు ఒకప్పుడు మనసుల్లోకి మనుషులు అలవోకగా చొచ్చుకేల్లెవారు ఒకరింటి గుమగుమలు దారిని చీల్చుకుని ఇంకొకరింట్లోకి వెళ్లి నిండిపోయేవి ఇప్పుడంత పెద్ద దారులు లేకున్నా ఈ స్నేహ పరిమళాలు దర్వాజాలు దాతలేవు దాటిన ... మనిషి మనిషికి కనిపించినంత సేపే చక్కగా అతికించుకున్న పలకరింపులు అందంగా అలకరించుకున్న చిరునవ్వులు ఆ గూళ్ళలో ప్రేమలు లేవని నేననను ప్రేమను పాటిస్తున్నారనేదే నా బాధ మనసుకు వేరే బాధ లేక కాదు ఈ అనుభవాల యేరు గుండెను తడి చేస్తూ వెళ్ళడమే బాధ . కుదుట పడ్డ మనసు ఇలాంటి వెతలతో మల్లి పదనౌతుంది లక్షణంగా గడిపేస్తున్న జీవితంలో నాకేం బాధ లేదు కాని లక్ష్యాన్ని నిర్దేశించుకుని బ్రతికే యంత్రాలు ప్రేమకు కొంత 'spase ' ను నిర్దేశించుకుని జీవించడమే కొంత బాధ నాకు మనిషి బ్రతికే స్థలమే తగ్గింధనుకున్న మనసు బ్రతికే స్థలమూ తగ్గింది . _ కొత్త అనిల్ కుమార్ . 15 / 5 / 2014 ( ennila muchatlu _10 lo na kavitha )

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lzMZHP

Posted by Katta

Buchi Reddy కవిత

5-14-2014 ******** phone manners--- phone వాడుక---అమెరికాలో అయినా--అమలాపురం లో అయినా *************** ఆ రోజుల్లో చేతి ఉంగరం చేతి గడియారం బంగారు పుస్తెల గొలుసు ముక్కు పోగు పట్టు చీర status symbols నేడు ఫోన్ ఆ స్థానాన్ని ఆక్రమించుకొని నిత్య అవసరం గా ఆట్టహాసా౦ గా లేటెస్ట్ ఫ్యాషన్ గా status symbol గా మారి పోయింధీ పుస్తకం హస్త భూషణం--- నాటి మాట సెల్ ఫోన్ హస్త భూషణం--- నేటి కూత ఫోన్ ల వాడుక వ్యసనం గా మారి time place situation ను ఖతార్ చేయక ఎక్క్డ పడితే అక్కడ ముచ్చట్లు--అరుపులు కేకలు-- వాధన లు-- రాగాలు???? నవరత్న కూర్మ లా రో౦డు -- మూడు భాషల్లో సంభాషణలు--- వాగుల్లు ఎక్కువ శాతం ఆ మాటల్లో అవసరం లేని ప్రాముఖ్యం కానీ సో ధీ-- సొల్లు ముచ్చట్ల తో show put up చేస్తూ గుర్తింపు కోసం పాట్లు పడుతూ--- ఆర్బా ట౦ చేస్తూ ??? అమెరికా అయినా అమలాపురం అయినా వ్యక్తుల మధ్య మాటలు సాగాలంటే తాహాత్--- డబ్బు---హోదాలుండాలి పేరుపక్కన ఏ ధో ఒక పధ వి తోక ఉంటేనే గుర్తింపు స్థాయి--- సమానత్వం---అన్ని కలిసి వస్తేనే మాటలు-- ముచ్చట్లు లేకుంటే ఆమడ దూరం లో---?? నిన్నటి ధా క hye-- bye అని మాట్లాడి నోళ్ళు మూడు రోజుల పధవులతో స్నేహ సంభంధాలను దూరం చేస్తూ--- అంతా న డ మంత్రపు సిరి ??? ప్రపంచమంతటా అంతువ్యా ధూల్లా అన్ని రకాల ఫోన్ లు వాడుకులో---ఉన్నాయి వంటీల్లో సినిమా హాల్లళ్లో రోడ్ల మిధ కార్ డ్రైవ్ చేస్తూ కూడా మాటలు-- ముచ్చట్లు ప్రమాధా ల వార్తలు తెలిసి కూడా ఆరోగ్య రీత్యా--- హానికరం అని తెలిసినా వాడుక తగ్గ లే ధు-- తగ్గ ధు- అన్నం లేకున్నా-- ఉండొచ్చు- ఫోన్ లేకుండా ??? ఈ మధ్య అసెంబ్లీ నడుస్తున్న సమయం లో కొంధరు నేతలు---ఎం .ఎల్ .ఏ లు ఫోన్ ల లో సెక్స్ వీడియో లు గాలిస్తూ---చూస్తూ కొన్ని సమయాల్లో నిధ్రపోతూ--- వీళ్ళు -- గాంధీజీ వారసులు ????? దొర లు-- అగ్ర కులాలు పాలిస్తున్న దేశం లో-- రాష్ట్రం లో ఈ దోపిడీ వ్యవస్థ లో మనిషి --తన కోసం కాకుండా ఏ ధు టి వాళ్ళు చూడాలి గుర్తింపు కలుగాలి నా తా క త్ ను చూపించుకోవాలి అధె ఆ శయం తో -- బతుకుతూ--- మార్పు రావాలి--- ఇక డబ్బు ఉన్నొళ్ళు పధవులు ఉన్నొళ్ళు మానవత్వం మ ర్చి పోతూ మానవ సంభందా ల ను-- విలువల ను దూరం చేస్తూ ధూరం పెంచుకుంటూ ఎంధుకు ఈ మార్పు ఎంధుకు ఈ అంతరాలు ??? దేనికి డబ్బు-- పధవులు శాశ్వతం కావు-- అని తెలిసి కూడా దొర లు-- అగ్రకులాలు సమానత్వం పెంచండి మనిషి ని మనిషి గా గుర్తించండి కుల గజ్జీ ని పాతర పెట్టండి పగలు--ద్వే శాలు--కక్షల కు ఫుల్ స్టాప్ పెట్టండి మనుశుల్లా బతకండి రానుంధీ ధ లీ త శకం గుర్తుంచుకుం డి జాగ్రత్త సుమా--- ******************************************** బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lpnS7T

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //రైతు// నా రైతు సంతోషంగా లేడు నాకు అన్నం పెట్టి నా కడుపు నింపే రైతు సంతోషంగా లేడు నాగలి పట్టి దుక్కి దున్ని మట్టిలో నుండి బంగారం వేలికితీసే నా రైతు సంతోషం గా లేడు, వేకువ నుండి చీకటి వరకు తన చమటను ఇంధనం లా కర్చుపెట్టే నా రైతు సంతోషంగా లేడు ఒక రైతు చనిపోతే మన కుటుంబం లో ఒకరు మరణించినట్టే అన్నపూర్ణ అని పిలిచే మన దేశం లో నా రైతు సంతోషంగా లేడు

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lpnRkn

Posted by Katta