పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఏప్రిల్ 2014, మంగళవారం

Poornima Siri కవిత

పూర్ణిమా సిరి II వలయ గమనం II నడుస్తున్న దారిలో నక్షత్రాలను జల్లి ఎవరోవచ్చి నెలవంకగా ముస్తాబు చేయరని అప్పుడప్పుడు మీమాంసల మనోగతం నుండి మరో అడుగు ముందుకు వేస్తాం కాల పదకేళిలో పద్దతిగా కూసింత పరిణితితో సాఫల్యాలతో పాటు సంకెళ్ళనీ గుర్తించ సాహసిస్తాం తెరిచిన తాళంచెవి మరో తాళాన్నికూడా బిగిస్తుందని అర్థంచేసుకోలేక మరో తాళంచెవికై పరుగుతీస్తాం ఎప్పటికప్పుడు వృత్తపరిధి పెరుగుతుందనుకుంటామే కాని వృత్తానికావల మరో వృత్తాన్ని గీస్తున్నామని స్పురణకురాదు ఇంతకుముందు ఎన్ని గొంతుకలలో మన స్వరం కలిసి నినదించిందో ఎన్ని నిశ్శబ్ద ఖేదాలకు మౌన ఆమోదం తెలిపామో సుగంధం వెదజల్లిన పువ్వు కన్నా గుచ్చిన ముల్లు చిందించిన రుధిరం తో జీవితపు అసలు రంగు తెలిసొచ్చినా మళ్ళీ మళ్ళీ కేవలం పువ్వులనే మోహిస్తాం బలిపీఠంపై జీవితమో జీవితమే ఒక బలిపీఠమో తేల్చుకునే ప్రయాసలో మనని ఎంతోకొంత నిక్కచ్చిగా తెలుసుకుంటాం అసాధారణంగా ఆలోచిస్తూనే సాధారణ వలయాల్లో భ్రమించే అతిసాధారణ ఉనికి మనదని ఎంత చెప్పినా,ఎన్ని తెలిసినా నమ్మలేకపోతాం,ఒప్పుకోలేకపోతాం ఇంకా దేనికోసమో ఎదురుచూస్తూ మననుండి మనని తరిమేస్తాం 22.4.14

by Poornima Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jFaJb0

Posted by Katta

Rama Krishna Perugu కవిత

Haiku ధాత్రి దినం ప్లాస్టిక్ గింజల్లో ప్రపంచం అనుసృజన ;పెరుగు సృజన ;లేరోయ్ గార్మన్

by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f1xc4N

Posted by Katta

Sriramoju Haragopal కవిత

జిందగీ దేనెవాలే... నడుస్తున్నపుడు నా పాదాలను మోస్తున్నదెవరు నా నడకకు బాటలు తీస్తున్నదెవరు మేఘాల రుమాళ్ళు చుట్టి ఆకాశాన్నితోడు పయనం కట్టించి మెరుపుల ఇష్టసఖులను తోడుపంపి నాకన్నా ముందే దారిలో ఆశల చెలిమెలు నింపి చెట్లకు ప్రియమోహనాల సద్దులు కట్టి తానే దారంతా పూలదువ్వెనలెగురేస్తూ వాన చినుకులదుప్పటి కొప్పెర పెడుతున్నదెవరు అనంతమైన అనురాగాల రుతువేదికల చలివేంద్రాలు పెట్టి అలిసిపోని ఇష్టాల గాలికుచ్చుల వీవెనలు కట్టి పాదాలకింద చల్లటి మమతల కొండవాగుల్ని పరిచి గుండెగొడుగు పట్టిన చెట్లబాటలో తొవ్వలు తొక్కించి మజిలి మజిలీకి పాటలసత్రాలు కట్టించినదెవరు నువ్వేనని నాకు తెలుసు వెనక్కి తిరిగి నిన్ను చూడకుండా నా చూపుల నెత్తుకపోతున్నారెవరో నా మనసును చీల్చుకపోతున్నారెవరో సాగనంపిన నువ్వే ఎదురొచ్చేవేళకు నా వూపిరులాపివుంచు కాటుక కరిగి జారిన కళ్ళల్లో నిలిపివుంచిన కొత్త కన్నీటి ముత్యాలమాల నీకే ఇవ్వాలని నా మనసుకు నేను మాటిచ్చా

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1flct6R

Posted by Katta

రంజిత్ రెడ్డి కర్ర కవిత

http://ift.tt/1jEI1qP Like this page...

by రంజిత్ రెడ్డి కర్ర



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jEI1qP

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత - 8 ----------------------------------------- త్రి'శూల' నొప్పి - - - - - - - - - - - - - - - - - - - - - - డా.దిలావర్‌ శవాల గుట్టలను పెళ్ళగించి సొంతగడ్డ మీదే మా పరాయితనం మూలాలను శోధిస్తూ కొత్తగా చరిత్రీకరిస్తున్నది త్రిశూలం! భారత శూన్యమాన కాలంలో యిప్పుడు త్రిశూలమే గడియారం ముల్లు! లలిత లతా గర్భంలోంచి రేకులు విప్పుకునే పువ్వు నాజూకు పుటకలోని మాధుర్యం ఒక అబ్బా అమ్మలకు పుట్టని పిశాచాలకేం తెలుస్తుంది? ఓ తల్లి కడుపులోని మబ్బుల పొత్తిళ్ళు చీల్చి నెత్తుటి నెలవంకలో దిగబడి మంటల్లోకి ఎగరేసి నరకడం త్రిశూలానికి తప్ప మనిషై పుట్టిన వాడికి చాతనయ్యే పనేనా? సర్వసంగ పరిత్యాగినని చెప్పుకునే ఉత్త ఇనప దిగంబరత్వానికి సిగ్గంటే ఏమిటో ఎవరు నేర్పారు? అమ్మకళ్ల ముందే ఓ బిడ్డ సిగ్గును వలువలు వలువలుగా వొలుస్తుంటే చితికిన మాంసం ముద్దయి ప్రాణాలు ఒంటినిండా కప్పుకున్న భయ విహ్వల శరీరాన్ని ఒక కామ కేంద్రంగా మాత్రమే చూస్తూ ఛిద్రమైన దేహంలోని ప్రాణాలను కూడా పొరలు పొరలుగా ఊడ బెరకడం త్రిశూలానికి తప్ప- సాధ్యమయ్యే పనేనా? ఈ కామ సముద్ర కెరటాల తాకిడికి బతుకు తీరంలో భయం భయంగా తలెత్తి చూస్తున్న ఎన్ని లేత గుజ్జన గూళ్ళు శిథిలమయ్యాయి? యిన్ని చేసి; ఎటైనా వెళ్ళేందుకు దేనికైనా ఓ ముఖమంటూ ఉండాలి కదా! త్రిశూలానికి ముఖమే లేదు చీలిన నాలుకలు తప్ప ! ఓ నాల్కతో 'విదేశాలకు ఏ మాస్కు పెట్టుకొని వెళ్ళాలి' అంటుంది మరో నాల్కతో కాషాయం రంగులేని ఓట్లతో పనిలేదంటుంది మరో నాల్కతో సబర్మతి రైలు యాత్రే మీ పరలోక యాత్రకు టిక్కెట్టు అంటుంది మెజారిటీ కాకులతో సక్రమంగా మెలగకుంటే ఒంటరి కోకిల కంఠం మీద ఖడ్గమై వ్రేళ్ళాడుతానంటుంది.. గాండ్రించే గాడ్సేలు రక్త వర్ఱంతో చిత్రిస్తున్న రామరాజ్యం నమూనాను దేశమంతా విస్తరించడానికి లైసెన్స్‌ దొరికినట్టేనని న్యూసెన్సు కూతలు కూస్తున్నది ఈ త్రి'శూల' నొప్పికి మందు కనుక్కోకపోతే వంద కోట్ల బిడ్డల కన్న తల్లి కూడా 'ఆత్మ' స్రావమై, అమ్మతనం కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లక తప్పదు (AZAAN -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hcRIyg

Posted by Katta

Padma Arpita కవిత

చేజారిన పసితనానికీ పరిపక్వానికీ నడుమ ప్రేమబీజమేసి అంకురించని అనురాగానికి పరిపూర్ణత్వం జోడించి వికసించని పువ్వులోని పుప్పొడంతా మాయంచేసి ఫలం అందించలేదంటూ నిందలుమోపడం ఎందుకో! అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి స్వయంవరానికి రానన్న వరునికి వలపుపీఠమిచ్చి కళ్యాణ తోరణం అనుకుని తమలపాకుల పందిరల్లి బంధమేదో బహుగట్టిది అంటూ విందులు ఎందుకో! పతనమైన పరిచయంలో నుండి పుట్టిన భావాన్ని గొంతు నులిమేసి రాగం రంజింపజేసిందంటే నమ్మి కాలిన కాలితో వెర్రిగెంతులేస్తూ చేసిన తాండవాన్ని మెచ్చి చప్పట్లు కొట్టారంటూ తెగసంబరం ఎందుకో! అవనికీ అంబరానికీ నడుమ అంచనాల్లేని నిచ్చెనేసి చలనంలేని చెలిమిలో చంచలమైన నెచ్చెలిని గాంచి మెండైన మైత్రినందీయలేని అల్పాయుష్షుపై బాసచేసి దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో! 22nd April 2014

by Padma Arpita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ic8EXs

Posted by Katta

Kapila Ramkumar కవిత

http://ift.tt/1reQbed

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1reQbed

Posted by Katta

Kapila Ramkumar కవిత

రేపు ప్రపంచ పుస్తక దినోత్సవం 23.4.2014 ‘‘ఈ మధ్య ఏ పుస్తకం చదివారు వదినా?’’ అనే మాట వినక ఎంతకాలమైంది...తనలో తాను అనుకుంది రజనీబాయి. పుస్తకాలు విపరీతంగా చదివే బంగారు కాలం ఒకటి ఉండేది. తాము చదవడమే కాదు పక్కింటి వాళ్లతో కూడా చదివించేవారు. వినోద మాధ్యమాల దెబ్బతో - ‘‘ఈ మధ్య ఏ సీరియల్ చూశావు’’ అనే మాట తప్ప వేరే మాట వినిపించని పరిస్థ్థితిలో పుస్తకపఠనం అనే మంచి అలవాటును తిరిగి కొనసాగించడానికి నడుం బిగించింది కేరళలోని కోజిక్కోడ్‌కు చెందిన రజనీ. చేతి నిండా, బ్యాగు నిండా పుస్తకాలు సర్దుకొని వారంలో ఆరురోజులు ఊరూరూ తిరుగుతుంది. రోజూ పాతిక ఇళ్లకు తక్కువ కాకుండా వెళుతుంది. తన చేతుల్లో ఉన్న పుస్తకాల గురించి చెబుతుంది. కొందరు వారానికి రెండు, కొందరు మూడు పుస్తకాలు తీసుకుంటారు. రజనీని ‘మొబైల్ లైబ్రేరియన్’ అని కూడా పిలుస్తుంటారు. ఆమె దగ్గర ఉన్న పుస్తకాలలో కాలక్షేప సాహిత్యంతో పాటు, సామాజికస్పృహతో కూడిన సాహిత్యపుస్తకాలు కూడా ఉంటాయి. పాఠకుల అభిరుచికి తగ్గ పుస్తకాలను అద్దెకిస్తుంటుంది. పుస్తకాల అద్దె నెలకు 20 రూపాయలు. పుస్తకాల అద్దె ద్వారా నెలకు రూ. 1200 గడిస్తుందామె. ‘‘నాకు వచ్చే ఆదాయం తక్కువ కావచ్చు. తృప్తి మాత్రం చాలా ఎక్కువ’’ అంటుంది రజని చిరునవ్వుతో. అవును కదా! http://ift.tt/1hc6BAM

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hc6BAM

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/రెండు కళ్ళ గుఢారాలు ::::::::::::::::::::::::::::::::: మనసు పక్షుల రెక్కల్లాగా చేసే చప్పుళ్ళు నువ్వు వింటునప్పుడు తేలిక సంద్రంలా భారమైన కళ్ళ అలలు గాలి కొండలు అక్కడక్కడా దొర్లుతూ కనిపించే పత్తి వలయాలు లోనెక్కడో నీళ్ళు తోడే శబ్దం వినగా మిగిలేవి గుండే బావుటాల్లో కొత్త చెలమలు పక్షులు పూలు మరికొన్ని అల్లికలు ప్రకృతి వొడిలో శిధిలాకాశంలో మెదిలే నక్షత్రాలు నగ్నంగా నవ్వుతూ కాసిని కన్నీళ్ళను పద్దాకా పారబోస్తూ వడగళ్ళు కిటికికి ఆవల చిన్న ప్రపంచం చీమకళ్ళలాగా చూపులు మళ్ళీ ఒకసారి నవ్వాలి తడిసిన మేఘంలా దేహ పాదుల్లో చేతివేళ్ళను కడుక్కుంటూ నేను ఖాళీ గడియారంలా తిరుగుతూ ఇంకొన్ని ఆశలు పాత జీవితమే మళ్ళా కొత్తగా తిలక్ బొమ్మరాజు 12.04.14 22.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hkz1Ex

Posted by Katta

Chi Chi కవిత

ఇళ్ళన్నీ అసెంబ్లీలయిపోతున్నాయి పాంప్లెట్లతో ఎన్నికలకాల సమావేశాలంటే ఏమో అనుకున్నా ఇంటికి పదిమంది mlaలున్న feeling తు తేరి!! bathroom లో కూడా fan ఉంది నా fb i.d లా అయిపొయింది ఎన్నికల నాడి_ (22/4/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f08O3u

Posted by Katta

Pulipati Guruswamy కవిత

4 // డా.పులిపాటి గురుస్వామి // సంపదలు సమకూర్చని సత్యం స్వచ్ఛంగా నీ నీడ కిందికి చేరినపుడు ఎవరమో తెలియని చోటు నుండి ప్రయాణం మధ్య లో అలసట ఆవిరౌతుంది కొద్దిసేపు లయకు కాంతి అద్దుకుంటుంది మౌనం మెల్లమెల్లగా గుసగుసపెడుతుంది పెచ్చులుగా రాలిపోయే బంధాల నడుమ వేదనకి చలిచలి పరిమళం కలుస్తుంది వెన్నువెంట సన్నని సౌందర్యపు పిలకలు లేస్తాయి .....మనసు ఓ అద్భుత మర్మాంగం ..... .....

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f08NMY

Posted by Katta

Garige Rajesh కవిత

అమ్మ ఒడికోసం.. అక్షరాలకు అందనంత ఆవేదన ఉన్నప్పుడు కళ్ళలో కన్నీరు తప్ప గుండెల్లో కవిత్వమెలా పుడుతుంది ఎంత ఏడ్చిన తరగని శోకమున్నప్పుడు తోడుగా ఏకాంతం తప్ప పెదాలపై చిరునవ్వెలా అందుతుంది రాత్రంతా కలలు రంపాలై నా మనుసును కోస్తున్నప్పుడు అంతులేని అంధకారం తప్ప దారంత వెలుగు ఎలా నిలుస్తుంది పుట్టినప్పుడు బంధుత్వాలేమ్ తెలియవు ఇప్పుడు గుండెల్లో నిలిచిపోయిన అనుబంధాలు తప్ప ప్రేమ పంచె అనురాగాలేం లెవ్వు నేను పోరాడుతున్న ప్రతిసారి కన్నీరు నన్ను గెలుస్తూనే ఉంది కొత్తగా చిగురిసున్న ప్రతిసారి నిరాశ నన్ను లొంగదీసుకుంటూనే ఉంది ఎప్పటికప్పుడు సంతోషపు రంగువేసుకుంటున్న దుఖపు వర్షానికి వెలిసిపోతూనే ఉంది విశాలమైన సంద్రంలో మిక్కిలి అలలుండడం సహజమే కాని ఈ చిన్ని మనుసులో అంతులేని బాధల అలలు ఎందుకని? తప్పటడుగులు వేస్తూ పడి దెబ్బతగిలి ఏడుస్తున్న నన్ను ఎత్తుకొని ముద్దాడుతుందని ఎదురుచూసాను ఆకలై గుక్కపెట్టి విలపిస్తున్న నా నోటికి వెన్నముద్దై అందుతుందని ఆశపడ్డాను నిద్రలేక రోదిస్తున్న నన్ను ఒడిలోకి చేర్చుకొని జోలపాట పాడుతుందని అనుకున్నాను పదం మాత్రమే మిగిల్చి పలకరింపు లేక నా ప్రాణంగా మారిపోయింది అనురాగాన్ని అంధకారంగా మార్చి ఆయువై నాలో చేరిపోయింది అమ్మ పదం అంటరానిదిగా చేసి అలజడిని జీవితాంతం అందించి వెళ్ళిపోయింది నేనిప్పుడు అమ్మ ఒడికోసం వేచిచూస్తున్న పసి హృదయాన్ని అమ్మ అలింగనం కోసం ఆరాటపడుతున్న కుమిలిపోతున్న కొడుకుని గాయాల గనిని ఏకాంతపు మదిని..

by Garige Rajesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fjVIZG

Posted by Katta

ShilaLolitha Poet కవిత

కాంతి + కాంతి = చీకటి. -------------------------------- ఆమె ఒక కాంతి అతడు ఒక కాంతి కాంతి తరంగ శృంగం కాంతితరంగ ద్రోణితో కలగలిస్తే చీకటి చారిక ఈ భూప్రపంచంలో కౌటుంబిక నిలయాల్లో కాంతి వలయాల ఆ వర్తనాల్లో అతడు ఆమెల కాంతి ప్రయాణాల్లో ఇంకెన్నాల్లీ చీకటి దారులు పెద్ద కాంతులు చిన్న కాంతులుండవు ఆ ధిపత్యాల అహంకారాల విభజన రేఖలుండవు. లేని రేఖలతో ఉన్నట్లు ఊహించే కుట్రలే- అతడు ఆమెలు సమాన కాంతులే అహాలు మరిస్తే వెలుగు పుంజాలే బ్రతుకంతా వెన్నెల పుప్పోడులే. అతడు శృంగమ్ స్థాయిననుకొని ఆమెను ద్రోణి స్థాయిలోకి నెట్టివేస్తే- అతడే కాదు సమాజమూ చీకటి మొహాన్ని తోడుక్కోవాల్సివచ్చింది. మనసులు కలవాల్సిన చోట కలవకపోతే మానవత్వపు పరిమళాలు మలినమైతే మనిషితనానికి వీడ్కోలు చెబితే ఆర్ధిక సంబంధాలే జీవితాన్ని నిర్దేశిస్తే ఆమె కూడా సాటి మనిషేనన్న ఇంగితం కొరవడితే కాంతి+ కాంతి= చీకటే.

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rdcwc4

Posted by Katta

Shobha Raju కవిత

|| శోభ || గతం పొలమారినప్పుడు...!!! || ఒంటరి ఆకాశంలో చీకటినిండిన మబ్బుతునకనై ఓసారి ఆశల వాకిట వేలాడుతూ వేకువ తెచ్చే వెల్తురు పిట్టనై మరోసారి ఎదలో జ్ఞాపకాల కల్లాపిజల్లి కిలాకిలా నవ్వుల ముగ్గులెడుతూ ఇంకోసారి దిగులు కొండలు గాలి బుడగలై పగిలినప్పుడు మంచు గొడుగులు కన్నీరై కురిసినప్పుడు నేను నానీడా తోడుగా ఒంటరిగా.. ఏకాంతంగా చాలాసార్లు............. !!! ( http://ift.tt/1jAXZ59 )

by Shobha Raju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jAXZ59

Posted by Katta

కంచర్ల సుబ్బానాయుడు కవిత

// కులం - హాలాహలం // జంతు జాలాలకు లేదు కులం పశుపక్ష్యాదులకు లేదు కులం పంచభూతాలకు లేదు కులం మనుషులకెందుకు ఈ కుల హాలాహలం? ఆకలికి లేదు ఆహారానికి లేదు అది తిని బతికే నీ కెందుకు కులం? కులం కులం అంటుంటే.. మన ప్రగతే విఫలం దారితప్పి దాహమేస్తే అపుడుండదు కులం? కడుపునిండా తాగును ఆ జలం.. ఆపదలో ఆదుకొనే వాడు చూడడు ఏ కులం దాహం తీరిందా సాగిస్తావు మళ్ళీ జులుం ఈనాడు కులం కొందరికి బలం దానివల్ల పొందిన ఫలం మింగక తప్పదు ఏనాటికైనా హాలా హలం మనిషి మహోజ్జ్వల భవితకు అడ్డుగోడ కులం సమసమాజ శ్రేయస్సుకు అవరోధం కులం కులాల కుంపటి ఆర్పిన నాడు సాధించగలం సమానత్వ అమృతఫలం అందరం కలిసుంటే పురోభివృద్ధి సాధ్యం అది దేశ భవితకు ఎంతో బలం. :putnam: కంచర్ల

by కంచర్ల సుబ్బానాయుడు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ju5U36

Posted by Katta

Bala Kishan కవిత

http://ift.tt/NIpCQg

by Bala Kishan



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ha8u0R

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h9Hi2s

Posted by Katta

Varala Anand కవిత



by Varala Anand



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lxpTjM

Posted by Katta

Vijay Lenka కవిత

విజయ్ లెంక ||నా ఎదయె పొద రిళ్లై|| నా ఎదయె పొద రిళ్లై నా మమతె మకరన్దమై పూచిన పూలకి నా వ్యధలే ముళ్లై ముట్టుకుంటావా నేస్తం నన్ను నన్నుగా హత్తుకుంటావా నేస్తం

by Vijay Lenka



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tvkDTp

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతుంది-8 ______________________ఆర్క్యూబ్ బినాయక్ సేన్- సిక్కైన కేరింతల లోలకాన్ని తన నీడన స్యస్థత పర్చే ధన్వంతరీ వృక్ష శాఖ అదుత్త -పిరిగ్గొడ్డు గాయపడ్డ ప్రశ్న కారు మేఘమై వర్షిస్తుందనే కదా వేరుపురుగై ఆకుపచ్చ దీపాల చమురును పీల్చేస్తున్నది అందుకే అతనిప్పుడు నోబెల్ ఒడినెక్కి అమౄతాన్ని తాగి ఇసురుకపోతున్న సందేశం * * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ia3awq

Posted by Katta

Krishna Veni కవిత

కృష్ణవేణి || అల్లరి ----------------- వర్షిస్తున్నా... నే..నీవైన కలవరింతై! పుష్పిస్తున్నా... నీ పెదవులపై విరబూసే, చిరునవ్వుల పుష్పానై! నిదురిస్తున్నా.. నిన్నటినీ కలనై! ఉదయిస్తున్నా... రేపటి నీ అస్తమించని సంతోషాన్నై! ఊరిస్తున్నా... కలనై! కలవరమై! కనులెదుటే మధువనినై! వెంబడిస్తున్నా... అనుక్షణం నిన్ను, ఆవహించే పరిమళాన్నై! మురిపిస్తున్నా... నీ చూపులుతాకగానే, అదృశ్యమయే మాయనై మాయావినై, నిను ఎప్పటికప్పుడు చిత్తు చేసే, అందమైన అల్లరినై! 22.4.14

by Krishna Veni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lyUstX

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

....॥ ఓదార్పు ॥... దశాబ్దాలుగా చెక్కుకుంటున్నాను వ్యక్తిత్వాన్ని అయినా అసంపూర్ణంగానే వుంది విగ్రహం ! మైళ్లు మైళ్లు నడుస్తున్నాను ఇంకా అగమ్యం గానే వుంది గమ్యం! ఎన్ని ఎత్తులకు ఎగబ్రాకినా అందకుండానే వుంది శిఖరం ! "అమరిన శిల్పం,అందిన ఎత్తులు అభినందనీయాలే " అంటున్నవి అనుసరిస్తున్న నా అడుగు జాడలు. "ప్రయత్నం ,ప్రతిఫలనం పర్యాయాలే " అనునయిస్తున్నవి నన్ను నా నీడలు! Dt.21.04.2014

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8ZDNa

Posted by Katta

Pusyami Sagar కవిత

నాలో నీవు _______ పుష్యమి సాగర్ ... నీ తలపు ప్రతి క్షణం నన్ను తాకుతున్నది అచ్చం సముద్రపు అల లాగానే ..!!!! నేను నిద్ర పోలేను నీవు నాలో ఉత్తేజమై ఉప్పొంగినపుడు !! నీతో కలిపిన రెండు మాటలు పుస్తకమై కూర్చొంది !!. నీ తో నడిచిన అడుగులు జ్ఞాపకాలు గా కళ్ళలో నిద్రిస్తున్నాయి !!! నువ్వు లేని నిన్న లో నేను లేను ... నువ్వు ఉన్న నేడు లో ప్రేమ లేదు .... రేపు రావని తలిస్తే ... తనువు ...మనువు ... రెండు ...కొండెక్కుతాయి !!. నీ సాక్షి గా .....!!!! ఏప్రిల్ 22, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jyWd4w

Posted by Katta

Rajaram Thumucharla కవిత

"కవి సంగమం " చదివిన కవిత్వ సఫుటి :- 25 కవిత్వ సంపుటి పేరు :- " జీరో డిగ్రీ " సంపుటి రాసిన కవి పేరు :- " మోహన్ రుషీ " సంపుటిని పరిచయం చేస్తున్నది :- " రాజారామ్.టి " "మానవ జీవిత సజీవ స్పందనల సంఘర్షణల సమాహారం "జీరో డిగ్రీ ' అతనే వొక మోహనం.అతడొక కవి.అప్పుడప్పుడు అతనొక ఋషి.ఋషైన వాడే కవి అవుతాడని అప్పకవి లాంటి వాళ్ల నమ్మకం.కవైన వాడు సజీవ స్పందనలు కల మనిషవుతాడని నా నమ్మకం .ఆ మనిషి మాత్రం ఏదో ఒక సందర్భంలో రుషీ అవుతాడు.ఆ రుషీ జీవితపు జీరో డిగ్రీ కీ సజీవ స్పందనలనద్ది ఆ జీరో డిగ్రీ స్థాయిని కొలిచే కొలమానంగా తన కవిత్వాన్ని మార్చాడు.జీవించడం గొప్ప కాదు.జీవిస్తున్నామన్న స్పృహ కలిగి వుండటమే వొక గొప్ప లక్షణం.ఇట్లాంటి గొప్ప లక్షణాన్ని "జీరో డిగ్రీ 'లో వొంపి నింపి జీవిత స్పర్శను దాని కద్ది నిరుత్తర అద్భుత వాక్యాల భావాలను మ్రోయించిన మోహన వంశి ఈ కవి. నిలువెల్లా గాయాలైన ఆ వెదురు వేణువును 'నిన్నెందుకు ఆ మోహనుడు నిరంతరం ధరించి వుంటానికి యిష్టపడతాడని" అడిగినప్పుడు ఆవేణువు అడిగినవారితో "తనలోని ఏమీ లేని తనమే ఆ మోహనుడు యిష్టపడ్డానికి కారణమని అంటుంది.ఈమోహన్లో కూడావేణువులోనిశూన్యం,బోలుతనం,నిర్మలత్వం కనిపిస్తాయి.అ.సు.రా గారన్నట్లూ దేన్నీ ప్రతిపాదించని,దేన్ని సిధ్దాంతీకరించని ఒకానొక సున్నితత్వంతో మోహన్ రుషీ కవిత్వం వుండటమే పాఠకులకు పెదాలు వూదే వాయువుతో మధురంగా మ్రోగే వంశీ గానంగా వినిపించడానికీ కారణం. జీవన కాంక్షను తెలిపే అరుపే ఈ కవిత్వం. "ఎంతో మంచి శూన్యం, జీవితం"అన్నా,"రంగు,రుచి,వాసన లేని స్నేహం...ఇరువయ్యొకటవ జీవిత సత్యం"అన్నా అందుక్కారణం నగరజీవిత సంక్లిష్టాన్ని,మధ్యతరగతి జీవిత విషాదాన్నిమోహన్ రుషీ వొకే వేణువు పై ఒకేమారు పలికించటమే."ఇదొక ఆట.మనిషి కోసం మనిషి వెతుకులాట.వేదనే మనపాట"అనే మోహన్ రుషి కీ కవిత్వాన్ని తాత్వికం చేయటం,జీవితం ఏమైనా చేసినట్టు ఈకవిఆతాత్వికమైనజీవితానికి నిర్ధుష్టమైనఒకసత్యంలేదని,అదిమనమీదవుమ్మేసుకొనేందుకేననిచెప్పితేలికచేయటంకూడాతెలుసు."శ్రుతిని,లయను ఒకటి చేసి ..."అంటే కవిత్వాన్ని,జీవితాన్ని,జీవితాన్ని తాత్వికతను ఒకటి చేసి చెప్పటం ఈ కావ్య రహస్యం. "బాధ ఉండదని కాదు కానీ కన్నీళ్ళలోకి ట్రాన్స్ ఫర్ కాదు వేదన కమ్ముకుంటున్నది నిజమే వెక్కి వెక్కి ఏడవటం కుదరదు" బాధ,దుఃఖం,వేదన,విషాదం ఇవన్నీ వొక్కటే కావొచ్చు.కానీ మోహన్ రుషీ బాధనీ కన్నీళ్ళల్లో బదిలీ చేయలేనని అన్నా,వెక్కి వెక్కి ఏడవటం కుదరదని అన్నా,అతను మాత్రం వొక నిశ్శబ్ద దుఃఖాన్ని తన కవిత్వమంతా పరిచాడు.పట్నం జీవితం మీద జుగుప్స,ఎంత జుగుప్స అంటే పట్నం ముఖమ్మీద కాండ్రించ్చి ఊంచేంత జుగుప్స.దారం తెగిన గాలి పటం లా ,గాల్లోకి ఇడిసిన బెలూన్ లా నడుస్తా, ఉరుక్త మిర్యాలగూడెం లో పడిన కవిమోహన్ రుషి.జీవితం గొప్ప దనం కూడా ఈ కవికి తెలుసు.అడుగు పెట్టొద్దన్న చోటునే అల్లుకునేటట్లు చేసే జీవితానికీ లొంగిపోయిన వాడే ఈ కవి కూడాను.అది జీవితపు గొప్పదనం.మాట్లాడ వీల్లేకుండా,వ్యాపకాల వ్యాపారంలో ఇల్లు ఇరుకైన మానవ సంబంధాల మధ్య దగ్గరితనం దూరమై అగాధంలా అలుముకొనే నగర జీవితంలోకి తిరిగి తిరిగి అక్కడికే జారుకొనే అథితిలా ఆగడం,ముసాఫిర్ లా సాగడం చేస్తొన్న ఈ కవికీ వూరికెల్లి పట్నమొచ్చిన కాన్నుంచి దేనిమీద నెనరు లేకుండా అయ్యిందంటున్నా, ఫుట్ పాత్ మీది పుస్తకాలకోసం ఆరాటపడటం, అరుదైన సాహిత్యం కోసం ఆబగా అన్వేషించడమే ఆయన్నొక మంచి కవిని చేసింది. "బండ్లన్నీ ఆగినపుడు అతని జీవితపు బండి వేగం పుంజుకొంటుంది. సర్వ కిటికీ సమానత్వం పాటిస్తూ మూసివున్న,తెరచిన బండి అద్దాల్లోకి దీనంగా చూస్తుంటాడు ఏ మూలో దాక్కున్న జీవత్వాన్ని అంతే కూడదీసుకొని అరచేతిలోకి తెచ్చుకొంటాడు చేతిలో "టప్" మన్న చప్పుడు వినగానే ఆశగా తడుముకుంటాడు" ఇవి మోహన్ రుషీ రాసిన "జీరో డిగ్రీ"లోని "సిగ్నల్ లైట్ సాక్షిగా"-అనే కవితలోని పాదాలు కొన్ని. నగరపు నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ లైట్ పడినప్పుడు చేయిసాచి అడుక్కుండే వొక అంధభిక్షువు గురించి రాసినది."చేతిలో "టప్" మన్న చప్పుడు వినగానే ఆశగా తడుము కుంటాడు"అనే వాక్యం ఆ చేయిసాచి యాచించేవాడు అంధభిక్షకుడు-అని ధృవికరిస్తుంది."వాహనాల సందుల్లో అతను ప్రవహించినంత సులభంగా అతని జీవితం ప్రవహించదు"అనే పంక్తుల్ల వల్లా అతడి జీవితం పేదరికపు ఇరుకులో ఇరుక్కున్నదనే స్పృహను కవి మనకు ఇస్తాడు. "అతని నోరెప్పుడూ మళ్ళీ మళ్ళీ పాడిన పాటవుతుంది...జీవితం మాత్రం ముళ్ళతో కూడిన తోటవుతుంది'-అనే మాటల్లోని "మళ్ళీ మళ్ళీ అతడు పాడిన పాట"వొక సైగల్ పాటలానో,లత గాత్రంలానో ఎక్కడో దూర తీరాల్నుంచి వచ్చి సరాసరి గుండె తలుపుల్నీ మృదువుగా పదునుగా ఎవరి హృదుల్నీ స్పృశించలేదు.అందుక్కారణాన్ని "శబ్ద కాలుష్యం ఎక్కువ కదా!ఎవరికీ ఏదీ వినిపించదు! కళ్ళు నోట్ల కట్టలతో కప్పివేయబడ్డాయి కదా!"అని కవి చెప్పి పరోక్షంగా లోకపు గుడ్డిదనం,చెవిటిదనాల్నీ దర్శింపచేస్తాడు."రోడ్లు విశాలం పేరిట అతని పరుపు ఇరుకై పోయింది"అన్న ఈ వాక్యాల్లో కవి నగరంలో అభివృద్ది పేరిట జరిగిన విషాద భీభత్సాన్ని,కనీసం వసతి చూపలేకపోయారు సరే కనీసం రాత్రిపూట ఫుట్ పాత్ లపై కూడా నిద్ర పోనివ్వని దుర్మార్గం ఏ రూపు దాల్చిందో స్పురింపచేస్తాడు మోహన్ రుషీ. "నిద్రలో కూడా శబ్దంఐనపుడల్లా ఆ చేతికి ఒక్కసారి మెలుకువస్తుంది ప్రాణమంతా చేతిలోకి ప్రవేశించి అలా అలా వూగుతూ గాలిలో వదిలిన దీపమవుతుంది" కవి ఈ పాదాల్లో ఆ యాచక వ్యక్తిలో నిత్యం వున్న అలవాటు నిద్రలో కూడా అతనిలో కలసి మమేకమైపోయిన అంశాన్ని చెప్పడమే కాక,"గాలిలో దీపం" అనే మాటతో జరుగబోయే సంఘటననను పఠిత ఊహలొకి ప్రవేశపెడతాడు.అతని చేతికీ గాలిలో దీపానికీ పోలిక చేయడం వల్లా మోహన్ రుషీ కవితకు ఊహించే ముగింపు ఇచ్చినా ఆ ముగింపు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. "నా కన్నీటి చుక్క పడి ఆ దీపం ఆరిపోయినట్లు వచ్చిన కల నన్ను ఉలిక్కిపడేటట్లు చేసింది- చౌరాస్తా వద్దకు పరిగెత్తాను... అప్పుడే కదుల్తున్న మున్సిపాలిటీ ట్రక్కు లోంచి ఒక చెయ్యి మాత్రం కనిపించింది అతనంటే అతని చెయ్యే కదా? చేతికి గాక అతనికంటూ ఒక అస్తిత్వమెక్కడిది?" ఈ కవితా శకలాలలో కవి చేసే కొత్త పోలికలు, వాటి కొత్త దనం మనల్ని దుఃఖ సముద్రంలోకీ నావలై తీసుకపోతాయి.రూపంలేనిభావాలకు,రూపంవున్నాసాదృశ్యాలనుపట్టుకొనిముడిపెడతాడు.అనుభవించాల్సిన దుఃఖాన్ని రూపు కట్టించడానికి పోలికల్ని ఎన్నుకోవడంలోనే ఇతని నేర్పు కనిపిస్తుంది."అప్పుడే కదుల్తున్న మున్సిపాలిటీ ట్రక్కు లోంచి ఒక చేయి మాత్రం కనిపించింది"-ఈ పంక్తుల్లో "చేయి" రూపం వున్నట్టున్నా పూర్తి రూపం లేనిదే.కంటికి ఒక రూపాన్ని ఇవ్వలేనిదే."అతనంటే అతని చెయ్యే కదా?చేతికీ గాక అతని కంటూ వొక అస్తిత్వమెక్కడిది"-ఈ ఒక్క మాటల్లో మొత్తం యాచకున్ని రూపు కట్టించాడు రుషీ.ఆ యాచకుని జీవితంలో జరిగిన విషాదాన్ని మన చేత గుర్తింప చేస్తాడు.ఆ వ్యక్తి ఆత్మ ఘోష వినిపింప చేస్తాడు మనతో.రూపం లేని భావాలకురూపంవున్నసాదృశ్యాలను వాడి కవిత్వాన్ని నిర్మించడంలో రుషి నేర్పుని మెచ్చుకోకుండావుండలేను. ఆ దుఃఖపు జీరను గుర్తించకుండా వుండలేము. "అతని నోరెప్పూడు మళ్ళీ మళ్ళీ పాడిన పాట"అనే వాక్యం మనసుకు గాఢంగా పట్టి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి వొక పద్యాన్ని గుర్తుకుతెచ్చింది.ఆ పద్యం ఇది.రుషి వాక్యగాఢత చెప్పడానికే ఈ పద్యం ఉదాహరించడం. అంధ భిక్షుకుడొకడు దయంబునుండి సందె దాక యాతాయాత జన సమూహ సంకులంబైన వీధీ విటంకమందు కంఠమేక తారకు శృతి గలిపి పాడు చుండు,గొంతెత్తి చెమ్మట లూడ్చుకొనుచు" "వాళ్ళుబంగారంమనంఇనుము"అనిమోహన్రుషీఒకసందర్భంలోఅన్నా,అమ్మ,అక్కా,చెల్లెలు,భార్య,కూతురు,పనిమనిషి,కూరగాయలమ్మే ఆవిడ ఒకరేమిటీ,స్త్రీ అయిన ప్రతి వ్యక్తీ,శక్తి ఈయన అభిప్రాయంలోబంగారమే.ఇకఇనుముఎవరోప్రత్యేకించిచెప్పాల్సినాఅవసరంలేదేమో?.ఇన్నేళ్లుగా,ఇన్నాళ్లుగా కవిత్వం జీవితంలో ఓ భాగమనుకొంటూ,దొరికిన,అందిన,కొనుక్కున్న ఎన్నో కవితా సంపుటాలు చదివిననాకు,స్త్రీలపట్లఇంతఅనురాగాన్ని,ఇంతఆప్యాయతని,ఇంతఅపేక్షని,ఇంతఅనుబంధాన్నీ,ఇంతటి కృతఙ్ఞతనీ తన స్వరంలో రాసిన కవి,సహానుభూతినిప్రదర్శించినమగకవినినేనుఎరుగను.సహానుభూతే కాదు తన అభిజాత్యాన్ని,అహంకారాన్ని తనలోంచితరిమికొట్టాలనే స్థితిని కల్పించుకొని,తన లోని చెత్తనంతా బయట పారవేసుకొన్న వైనాన్ని పేర్కొంటూ,వారికై శ్రమణుల దుఃఖమై సంచలించి హృదయం పగిలేలా ఏడ్వగలిగిన కవిగా మోహన్ రుషీ ఈ సంపుటిలో అగుపిస్తాడు. జీవితంలో సూర్యోదయ,సూర్యాస్తమయాలు చూసే అవకాశం లేకుండా,ఇంట్లోనే నిరంతరం తామొక పని ముట్టై ఇంట్లోనే పనై వొక యంత్రం మాదిరి శ్రమించే అమ్మ అంట్లూ తోముతూ,బట్టలు ఉతుకుతూ,తానొక యంత్రంలా పరుగులూ తీస్తూ,జీవిత వేగాన్ని తమకు అందించిన అమ్మ ఋణం తీర్చుకోవడానికీ ఏం చేసిన తక్కువేనని ఈ కవి భావించి "పాత యంత్రం"-అనే కవిత రాశాడు.అమ్మ ఋణం తీర్చుకోవడానికీ బట్టలన్నీ తమ వీపుల మీద వుతికిన ఆశిక్ష చాలదని,ఆమే తోమే గిన్నెలన్ని తమ చర్మం పెట్టి తోమిన పటిన అహంకారపు చీడ వదలదని పై కవితలో కవి చెబుతాడు."నీ పాద ధూళి సోకైన మా పుట్టుకకో సార్థకత లభిస్తుంది"అని అనటంలో మోహన్ రుషీ అభిప్రాయం వ్యక్తమవుతుంది.తంగేడు పూల గోపి చిత్రదీపాల గోపి"భ్రష్టుడా!అమ్మ ఋణం తీరదు/అమ్మకు అమ్మవై పుడితే తప్ప'అని అంటాడు.మోహన్ రుషీ ఇంకా గాఢంగా 'కళ్ళు మూసుకునయిన కసిగా మమ్మల్ని భూమిలోకి తొక్కేయరాదూ?/నీ పాద ధూళి సోకి మా పుట్టుకకో సార్థకత లభిస్తుంది"-అని అనగలిగాడు.ఈ కవికీ అమ్మల పట్ల గల గౌరవం ఎలాంటిదో ఈ ఒక్క కవిత వల్లే తెలుసుకోవచ్చు. క్షణం క్షణం చస్తూ బతుకుతూ వుండే వాళ్ళు భర్తల సేవల్లో అంతరిస్తున్న భార్యలు అనే సత్యాన్ని గ్రహించిన కవి ఈ మోహన్ రుషీ.భర్తల అహం,సేవలందించిన భార్య పట్ల కృతఙ్ణత లేనితనం,కనీసం సానుభూతి కూడా ప్రకటించలేని కృతఘ్నత భావం,కరగని ఉడకని హృదయ కాఠిన్యం, వీటన్నిటనీ "భరత వాక్యం'అనే కవితలో పేగులు చుట్టుకపోయే బాధతో గుండెలవిసేలా ముగింపు వొక్కటే మిగిలిన వాక్యాలతో గునపాలై లేవాలి అని ఈ కవి వేదనతో ప్రభోధిస్తాడు."ఏ అమ్మైతేంది?/పండ్గకీ పట్నంకెల్లి కొడ్కులకీ బిడ్డలకీ/అట్ల సంబూరంగా అవుపడ్తది గానీ../బత్కుపటార్లబడిపచ్చెల్ పచ్చలై/ఆమే శాన్నాల్ల కిందనే సచ్చిపోయిన దుఃఖాన్ని "లెక్కలేదు పత్రం లేదు"-అనే కవితలో ఏ సెన్సస్ లెక్కల్లో పత్తాలేని కొడూలున్నా లేని తల్లి జీవితాన్ని ఈ కవి స్పృశించాడు.కచ్చతోటి కావాలని వదిలేసిన జీవితాన్ని తెచ్చి యిచ్చిన కరుత్తమ్మ చెమ్మిన్ నవల లోని పాత్రే కాదు.ఆమే నిజమైన పాత్రే.లేకుంటే కవి "ఆమే వస్తదనే ఇప్పటి దాంక ఆగిన.../లేకపోతే ఈడ నాకేం పని "అని అనలేడు.ఒక కరుత్తమ్మ కోసం!ఇయ్యాల గాకపోతే రేపైనా రాకపోద్దా అని ఆశ!'పడే నిరీక్షణ ఈ కవిది.అమ్మల తరువాత అమ్మలై మనల్నీ పిల్లల్లా కాచుకోడానికీ అవతరించిన అక్కలు చెల్లేల్లు గురించి "వాళ్ళు బంగారం,మనం ఇనుము!"-అనే కవిత ఈ కవిరాశాడు."వాళ్ళ పిల్లల అల్లర్లతో మనల్నీ సంబర పర్చేందుకూ/మనని వెనకేసుకరావటానికి మొగుళ్లతోనూ గొడవపడేందుకూ/నిజమైన ప్రేమతో సిగ్గు పడేలా చేసేందుకూ/అసలైన నవ్వుల్తో ఆందోళనల్నీ తరిమి కొట్టెందుకూ"-అక్కా చేల్లెల్లు వున్నారన్న ఒక అనుబంధతాత్మక పాదాలను ఈ కవి రాసి ఏదో తెలియనీ అక్కాచెల్లెల్ల ఉనికినిలోని మాధుర్యాన్ని సార్థకమయ్యేలా రాశాడు. అమ్మతో ఒక ఆదివారం మధ్యాహ్నం ఈ కవి అమ్మ కళ్లు చెప్పే నిజం ఎవరూ ఎక్కడా శాశ్వతంగా వుండబోరన్న నిజం గ్రహించీ తనలోని చెత్తనంతా బయట పారబోసే యత్నమంటే స్త్రీల పట్ల ఇంకా ఏదైనా చెత్త అభిప్రాయం వుంటే దాన్ని తొలగించుకొనే యత్నం చేశాననే భావనను "ఒక ఆదివారం మధ్యాహ్నం"-అనే కవితలో చూచాయగా చెబుతాడు.అల్కాపురి వీధుల్లో ఆకు కూరలు అమ్మే ఆవిడ కవిని గెలిపిస్తూ,తన ఉదారత్వంతో ఓడిస్తూ,మాట్లాడిన వైనం కవి అలాంటి వాళ్ళ పట్ల గల ఉన్నతాభిప్రాయాలను "విజేతలు వాళ్ళు!'అనే కవిత పేర్కొటుంది.కరివేపాకు విలువ చేయని జీవితం తల్లీ అనటంలో కవికీ స్త్రీల పట్లగల గౌరవం కొండలా ఒకమూల అతనిలో ఒదిగి కూర్చున్నదని తెలుస్తుంది.నువ్వే ప్రపంచంగా ,నీ కడుపులో ఇంత సల్ల నింపడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా వుమ్డేది అమ్మే.అట్లాంటి అమ్మను ఈ కవి "లేని వాళ్ల కోసం ఉండేవాళ్లు"-అని సంభావిస్తాడు.దుఃఖపు వానలో మన కోసం నిరంతరం తడిసేది అమ్మేనన్న ఒక గొప్ప భావాన్ని ఈ కవి మనకు అందిస్తాడు.తనని సరిగా చూడని తాగుబోతు భర్త దవఖానలో పడ్డప్పుడు "ఎవని పాపాన వాడె పోతాడక్కా దవాఖానల పడ్డప్పుడు మనమైతే మందులిచ్చ్రావాలే గదా!అని అనుకుండే గొప్ప మానవతావాదులైన స్త్రీలు గుంతల్లో ఆటో కిందా మీదా అయినప్పుడు కూడా కోపంలోను నోరు జారకుండా "రోడ్డు సల్ల గుండా"-అని అనుకుండే పాటలను మించిన వాళ్లు అయిన స్త్రీ మూర్తుల గురించి ఎంత గుండె తడితో ఈ కవి రాశాడో ఈ సంపుటి చదివితే అర్థం అవుతుంది. "అమ్మల కన్నీళ్లు అబద్దం కాదు!"-అని అంటున్న మోహన్ రుషీ "వాళ్ళ గురించి వాల్ళ్ళు అడిగే పాపాన వాల్లేన్నడు పోరు వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖం అందుకు ఆనవాలు"-అని తన "జీరో డిగ్రీ"ని ఆడవాళ్ళ కన్నీళ్లకు ఆనవాలు చేశాడు.వర్షిస్తున్న అశ్రుధారలైన అమ్మలనంతా ఒకవైపు నిలబెట్టి వారికీ అండగా కవిత్వాన్ని నిర్మించాడు.ఇలా ఈ కవి స్త్రీల పట్ల గల తన నిశ్చితాభిప్రాయాల్నీ నిష్కర్షగా వెల్లడించాడు. "అనాదీ నుంచీ ఆడదానికి ముదనష్టపు మగవాడు వేస్తున్న శిలువను తప్ప ఇస్తున్న శిలుం పట్టిన్న జీవితం తప్ప - ఏమైనా ఇచ్చానా నేను నిజంగా" శతాబ్దాలుగా ఏడ్చినా తరిగిపోని దుఃఖం తప్ప,మాటల మంటలు,వ్యధ పెంచే వ్యంగ్యాస్త్రాలు తప్ప ఎమీ ఇవ్వలేదనే ఈ కవి మాటలు నిజాయితీగా అంటున్నవి.అమ్మ,అక్క,చెల్లి,భార్య,ఇలా స్త్రీల దుఃఖాన్నీ తన దుఃఖంగా మార్చి కవిత్వం చేసి మన చూపు కొక్కేనీకీ స్త్రీ నిజ చిత్తరువుని తగిలిస్తాడు. మానవశరీరంలో ఈ రోజుల్లో అది ఓ భాగం,అది వాడని మనిషి నేడు లేడన్నది పచ్చినిజం.అదొక వాణిజ్య ప్రపంచ చిద్విలాసం.మాటల్నీ అంగట్లో పెట్టి అమ్మే వొక వ్యాపారం అదే మొబైల్ ఫోన్ వ్యవహారం. "మోగాలన్న మోజు లేదు/మోగనందుకు కోపం లేదు మొబైల్ ఫోన్ మీద నాకు మోహమెన్నడు లేదు/కానీ మరీ నాలుగు రోజులా?" అని అంటున్న ఈ కవి మిస్డ్ కాల్స్ లేకపోడం తో గాభర నంది ,అవుట్ గోయింగ్ కాల్స్ పోకపోవడంతో కుదుటపడ్డానని అంటాడు.వ్యాపార సూత్రం అర్థమయ్యిందని అని చెప్పే ఈ కవి మొబైల్ చేతుల్లో మనిషి వున్నాడు కానీ మనిషి చేతుల్లో మొబైల్ లేదు అనే వాస్తవికతను గుర్తించితెప్పరిల్లుతాడు. ప్రేమలేదనికాదు/తేప కొక సారి తేమను నిరుపించడం నా వల్ల కాదు"అని ఈ కవి అన్నా కూడా అనేక సందర్భాల్లో తన ప్రేమ తడిని,దుఃఖ తీవ్రతను తీన్ మార్ వేసీ చూపుతాడు."ఇప్పుడొక నొస్టాల్జియా మిగిలింది కేవలం రావణ కాష్టపు రాత్రులు"అని "జానే కహఁ గయే వో దిన్'-అని నిట్టూర్పు విడుస్తాడు.'పరుచుకున్న వెన్నెలలు,ప్రాణవాయువులా"అ రాత్రీ నీ పాట ఎందుకు వచ్చింది?అని ప్రశ్నిస్తున్న మోహన్ రుషీ సుతి మెత్తగా,సున్నితంగా ఆమె అరచేతులతో తన హృదయాన్ని నిమిరిన ఆమె పాట తీయదనాన్ని,మాటలతోచెప్పలేనిదేదో,సంభాషణలో సాధ్యం కాని దేదో ప్రసారం ఆపాటలో అవుతున్నదని చెబుతూ ఆమెతో కవి నువ్వు కాక నాకెవరున్నారని నేను మళ్ళి మళ్ళి గుర్తు చేసుకోవడానికీ-అని అంటాడు-ఇట్లాంటి ఎంతో అందమైన భావనలు కూడా నగరజీవన సంక్లిష్టతలోని జీవనంలో జీరో డిగ్రీ పైన ఈ కవి చిత్రించాడు.లేచి లేవగానే రాత్రి బతికిన దారుల్లో వెతుక్కుంటూ వెళ్ళే శతాబ్దాలుగా మోస్తున్న దీనపు మొహాల్నీ సైతం ఈ కవి జీరోడిగ్రీ కింద చిత్రిస్తాడు. వొక నిర్లిప్త తాత్వికతను మనకంతకు మనమేఅల్లుకొనిచెప్పుకోడానికీఏమీలేనితనాన్నీ,మాట్లాడుకోవడానికీ కూడా ఏమీ లేని శూన్యాన్నీ,అస్పష్ట మైన అలజడిని అనువదించుకోలేని భాషలో జీవించడాన్ని ఈ కవి పేర్కొంటూ.మనిషి ఈ పరిస్థితులకు తక్షణ సమాధానంగా జీవితానికీ పెద్దగా అర్థం లేదని చెప్పుకోవడాన్ని "లోపలి బాల్కని"లో నైశిత్యంతో విమర్శకు పెడతాడు ఈ కవి.కొంత మంది గుర్తొచ్చి వొణికిన ఈ కవి బయలుదేరుటకుసిధ్దంగావున్నరైలునుపోలికచేసి"జీవితంకదిలిపోతుంది"అనిఅంటూదీపస్తంభంలాంటిసత్యాన్నినిలుపుతాడు."నిజమై,నిప్పై,ఉరుమై,చెలిమై,పిలుపై,వలపై,గెలుపై,మలుపై ఎదురైన కొంద్రు వ్యక్తుల్నీ చిటికెన వేలితో శిలువను ఎత్తే వాళ్ళుగా,చిరునవ్వుల్తో చీకట్లను తరిమి తరిమి కొట్టే వాళ్ళుగా,సమయాలకు సౌరాభాన్ని అద్దే వాళ్ళుగా,సంభాషణను సమ్మోహితం చేసేవాళ్లుగా,పరిచయాన్ని ప్రపంచం చేసే వాళ్ళుగా,సామీప్యాన్నీ సందర్భంగా మలిచే వాళ్ళుగా,జీవితాన్ని ఉత్సవం చేసే వాళ్ళుగా ఎంతో గొప్పగా దర్శించి ,వెళ్ళరు వాళ్ళు తిరుగు టపాలో"-అని అట్లాంటి వాళ్లనీ శాశ్వతుల్నీ చేస్తాడు మోహన్ రుషి. "నీకు ఓకేనా?ఒక మొల నీ నడి నెత్తిన పెట్టి సుత్తితో ఫట్ మని ఒకటే దెబ్బ వేస్తాను"-అంటూ ప్రారంభమయ్యే "మరణ జన్మ సంయోగ క్రియ"అనే కవిత అధివాస్తవిక కనిపిస్తుంది.లోకంలోని సంక్లిష్టతల్ని సుత్తి దెబ్బ,హ్యాక్సా బ్లేడ్ కోత లాంటి పదప్రయోగాలతో స్పురింప చేస్తూ,"ఈ మాత్రం ఓర్చుకోలేని వాడివి నువ్వు ఈ లోకం మనిషివేనా?అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తాడు."చచ్చే లోపు చాల సార్లూ నిశ్శబ్దపు చావులకు గురవుతుండటమే జీవితం"లాంటి అధ్భుత నిరుత్తర వాక్యాలు జీ రో డిగ్రీ లో పుష్కలంగా కనిపిస్తాయి."బస్...ఇత్నాసా ఖ్వాబ్ హై","దిల్సుఖ్ నగర్ చౌరస్తా"లాంటి చైతన్య స్రవంతి కవితలు కవి వ్యక్తిత్వాన్ని ,అంటే ఉదాసీనత్వాన్ని , సమాజ దుఃఖం కవి వ్యైక్తిక దుఃఖంగా మారడాన్ని, జీ రో డిగ్ర్రీ వద్ద వుండే శీతలస్పర్శ లాంటి నగరజీవితం ఆదుఃఖాన్ని గడ్డకట్టించిన వైనాన్ని పరిచయం చేస్తాయి.పరిణితి చెందిన రూప శిల్పాల మిళితం ఈ సంపుటిలో పఠితలు చూడొచ్చు. ఈ కవిత్వాన్ని చదివితే 'జీవించడం ఎప్పుడో మానేసిన మనిషి కనీసం బతకనైనా బతుకుతాడు"అనిపించింది నాకు.బంధం గంధం పూసుకతిరుగలేనని అని అనే ఈ కవిని మరిన్ని కవితలు రాయమని కోరుతున్నాను. చేతిలో చెయ్యి వేసి తన ప్రాణానికీ నా ప్రాణం అడ్డువేస్తానని జీవితంతో చెప్పాన్నేను" అంటూ జీవితానికీ భరోసా యిస్తున్న మోహన్ రుషీ ఒక్క నిట్టూర్పు లాగా,ఒక మాట్లడని కన్నీటి చుక్కలా,ఒక తీవ్రమైన కోరికలా దిక్కుల సందుల్లో కలసి ప్రతిధ్వనించే కవి అని చెబుతూ ఒక ఉత్తమ కవిత సంపుటి అందించినందుకు అభినందిస్తున్నాను.కవి సంగమ మిత్రులు ఇట్లాంటి కవిత్వాన్ని చదివి వాళ్ళ కవిత్వనిర్మాణ నైపుణ్యాన్ని మరింత ఇనుమడించుకోవాలని కోరుతున్నా.అ.సు.రా గారు, పున్నా గారు,శివాజీ గారు రాసిన అంశాలతో మరిగి మరిగి మౌనమే ఇక మంచిదని తెలుసుకున్నాను.మళ్ళీ మంగళవారం మరో కవితా సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i9y3B6

Posted by Katta