పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ గారు రాసిన కవిత ||//నాలోనే!!కవిత్వ విశ్లేషణ ప్రస్తుతం జరుగతున్న వాస్తవాలను కవితా వస్తువు గా అది కూడా సామాజిక అంశం తో ముడిపడి ఉండటం అనేది కవి లో ని సామాజిక బాధ్యత ని తెలియచేస్తుంది...చిన్న చిన్న పంక్తులలో అర్థవంతం గా చెప్పటం బాగుంది, తను చూసిన నిజాలు, అక్షరం లో చెప్పే ప్రయత్నం చేస్సారు ! రియల్ ఎస్టేట్ మాయ ఎంతగా పాకి పొయింది అంటే..నాలుగు గింజలు ఇచ్చే పంట ని కూడా కాలనీ లు గా మార్చి పడేసింది ...!!! ఉన్న పొలం అమ్మినపుడు నాగరికత మరింత ముందుకే మరి ...అందుకే ఈ రోజుల్లో ఊర్లు కూడా పట్టణాన్ని తలపిస్తుంది ...మరి అలాంటి రియల్ ఎస్టేట్ ఊళ్ళకి ఊళ్ళే మాయం చేసి మన ఉనికి ని ఉన్నపళంగా తుడిచి వేస్తే ...ఆవేదన కలుగుతుంది కదా... చేను కాలనీగా మారి// ఊరు పట్టణం వేషం కట్టింది...>!!! ఘోరమైన రెండు నిజాలు, అలా అనటం కన్నా మానవ తప్పిదం అనొచ్చు ..మొదటిధీ ఏమో పశు సంపద ఓట్టి పోయినపుడు వ్యధ శాలకు (కబెళ) కు పంపడం ..., రెండోది మానవుడు తన ఇష్టానుసారం గా పర్యావరణాన్ని పాడు చేసి తనే కాకుండా జంతు జాలాన్ని కూడా బలి పెడుతున్నాడు ..ప్లాస్టిక్ వ్యర్దాలతో .., మొత్తానికి రెండు కారణాలతో పశు సంపదని నాశనం చేసుకుంటున్నాం ...ఆలోచింప తగినదే .. ఆవు// అల్ కబీర్ చేరి// పొట్టలోని//ప్లాస్టిక్ పుట్ట బయటపెట్టింది ప్రంపంచం కుగ్రామం అయినపుడు ...వసుదైక కుటుంబపు భావన లు మనలో కలిగినపుడు ..నిజానికి అంతా ఒకటే అన్న భావన వచ్చి కలిసి పోవాలి చిత్రం గా ...ఎవరికి వారే యమునా తీరే అన్న చందం గా తయారు అయ్యింది , అలాగే పవిత్రమైన ప్రేమ ఇప్పుడు పార్కుల లో పొదలలో రొద చేస్తూ ..అందమైన భావన కి తూట్లు పొడిచేలా నేటి కాలపు ప్రేమ తగలడింది అని నిరసన ని తెలియచేస్తారు .. ప్రపంచం//వసుధైక కుటుంబంగా మారి//పక్కింటి//తలుపు మూసుకుంది పార్కు పొదలో దూరి//అవయవాలలో//నగ్నంగా తనని చూసుకుంటోంది నేను అన్న భావన నుంచి మనం లో కి ఎప్పుడు రాగలం ..., మనసు మనుషుల తో యుద్ధం చేస్తూ ...దూరంగా పారిపోతే బాగుండు అని తలపోస్తుంది ...నేను లో నుంచి మనం గా మారినపుడే అందరు కలిసి ఉండగలం ...ఒక ఆశ పెనవేసుకుంటుంది నిజంగా ఇది జరిగితే ఎంత బాగుండు ... మనసు//మనుషులతో పోరి జనారణ్యంలో//అడివిని వెదుక్కోంటొంది నేను/నాలోనే ఏమారి//నీలో మార్పు కోసం కలగంటోంది. NVM వర్మ గారి కవితల్లో సున్నితత్వం, హాస్యం, వ్యంగం కనిపిస్తూ వుంటుంది ..ఈ మధ్య లో సామాజిక అంశాల పై వారు తీసుకుంటున్న వస్తువు వైవిధ్యం గా ఉంటుంది, మనిషి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూనే...వ్యక్తి పరివర్తనలో ...మార్పు రావాల్సిన ఆవశ్యకత ను తెలియచెప్తారు, చిన్న కవిత అయిన కుడా పలు సమస్య ల ను బహు చక్కగా కళ్ళకు కట్టేలా చూపించిన వర్మ గారు అబినందనీయులు ...వారు మరిన్ని సామాజిక అంశాల తో ముందుకు రావాలని కోరుతూ .. సెలవు .. పుష్యమి సాగర్.. ---- కె.ఎన్.వి.ఎం.వర్మ//నాలోనే// చేను కాలనీగా మారి ఊరు పట్టణం వేషం కట్టింది ఆవు అల్ కబీర్ చేరి పొట్టలోని ప్లాస్టిక్ పుట్ట బయటపెట్టింది ప్రపంచం వసుధైక కుటుంబంగా మారి పక్కింటి తలుపు మూసుకుంది ప్రేమ పార్కు పొదలో దూరి అవయవాలలో నగ్నంగా తనని చూసుకుంటోంది మనసు మనుషులతో పోరి జనారణ్యంలో అడివిని వెదుక్కోంటొంది నేను నాలోనే ఏమారి నీలో మార్పు కోసం కలగంటోంది.. == ఏప్రిల్ 16, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qEYYpB

Posted by Katta

Venkatesh Manchala కవిత

అమ్మ అన్నది ఎంత కమ్మని పదం విశ్వ జీవుల ఏకపద వేదం!

by Venkatesh Manchalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qEJeCV

Posted by Katta

Soma Sekhar Reddy కవితby Soma Sekhar Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iTFZ4q

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb || జర్నీ|| ఒక సుదూర ప్రయాణం, ఎడతెగని ప్రణయం ఇది. సాగుతూనే వుందిది, కీకారణ్యపు చిక్కులతో, ప్రయాసభరిత మార్గాలలో. అనేకానేక అవాంతరాలను అధిగమించి కఠిన శిలా పరివేష్ఠిత పర్వత శ్రేణులను అధిరోహించి మాత్రమే ఆ స్వామిని సమీపించినట్లు అవును, ఈ యాత్ర సంక్లిష్టమైనదే. అవధులు లేని అంతరాళాలలో, అదృశ్య తీరాలకు,వొంటరి లోకాలకు ఓ దారి తప్పిన శకలం, నిర్జర నిశీధీ రోదసీలలో, అనంతానంత దూరాలకు సాగినట్లు అవును, ఈ యాత్ర సుధీర్ఘమైనదే. తల్లి గర్భంలోకి, ప్రవేశించక పూర్వం బయటి ప్రపంచాలలో హాయిగా, ఆనందంగా విహరించడం కాదు కదా ఇది. -------june 2012---------------15/4/14

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iTFYO5

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

'లావణ్య' రాసిన మరో కవిత కోయిలమ్మా ! --------------- ఏదీ వొక్కసారి నీ గళం విప్పి గొంతెత్తి నవజీవనానికి బాటలు వేసే పాటలు పాడరాదూ... బహుశా నీ పాటలు యిక్కడ మూగబోవొచ్చు పదాలు విషపులోకంలో నిద్రపోనూవొచ్చు వజ్రవైఢూర్యాల కన్నా విలువైనది నీ గొంతు గంభీరంగా గొంతెత్తి మళ్లీ మళ్లీ పాడు - ఆకాశం ఉలిక్కిపడి మేఘాలు కదిలి అమృత వర్షంలో మేల్కోవాలి .. కదా ఓ కోయిలమ్మా ! ---------- 15.04.2014

by బాలసుధాకర్ మౌళిfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eE0C9a

Posted by Katta

Sky Baaba కవితby Sky Baabafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eDR2TJ

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eDR2Df

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతది__1 -------------------------ఆర్క్యూబ్ కాను సిద్దూలు...ఖుదీరాం బోస్ బిర్సా ముండా...కొమురం భీం వీళ్ళంతా- హరితపుష్పం రక్షక పత్రాలు. అది..మట్టిని సైసది పరిమళం మట్టి ఆత్మ కదా ! రక్త రహిత ఆలోచనలో అడవి ఆరాటాలను ఆగం చేయడమే దాని లోకం అందుకే ..వాళ్ళిప్పుడు రక్త మాంసాలున్న కవాతు పుష్ప ఆకర్షణ పత్రాలు * * * * * * *

by Arcube Kavifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1etwqxd

Posted by Katta

Radha Rao కవిత

మొండి గోడలు గా మారనున్న ఈ దేశం ! నా దేశం ! అమెరికా కుట్రలో కుంగి పోతున్నామేమో ! అనిపిస్తుంది అలాగే ఉంది ! మూర్ఖాన్ని మూర్ఖత్వంతో ఆహ్వానిస్తే ! అందుకే ముషారఫ్ ని అండంపెట్టు కుని ఆఫ్గన్ లో మిగిలిన మొండి గోడలే తార్కాణం..! ఇరాన్, ఇరాక్ విథ్వంశం కూడా అలాంటి దే !!! "మొండి" మూర్ఖత్వం ఓట్లతో చైనా కు ఉన్న సరిహద్దు సమస్య వారికి ఆయుధంగా మారుతుంది ! భారత్, చైనా యుధ్ధానికి మన మూర్ఖత్వం వారికి ఆయుధంగా మారుతుంది ? ఇరు దేశాల ఎదుగుదల వారికి కంటసంగా మారి కత్తులు నూరు తోంది. ఇదే జరిగితే ? ఇక ఈ మన దేశంలో మొండి గోడలేగా మిగిలేది ?

by Radha Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l1fzjS

Posted by Katta

Chinni Krishna కవితby Chinni Krishnafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJvLCK

Posted by Katta

Vijay Lenka కవిత

I stand facing soul mirror That’s the biggest horror Beauty is there but the beast is more Need somebody to love from core The heart said I am within you You are not a beast but my beat Say ye(s) to me for an eternal treat (Inspired by the story of beauty and beast)

by Vijay Lenkafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hH97AK

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || రెండు మనసులు || నాలుగు గోడలు మద్య ఏముంటుంది రెండు శరీరాలు మద్య నలుగుతున్న మనసులు తప్ప తడిచిన దిండులో ఆరని చెమ్మ కప్పుకున్న దుప్పటిలో ఊపిరాడని నిజాలు ముద్దాడుతున్న పెదాలు మద్య ఎండిపోయిన ప్రేమ రెండు పూల వంటి దేహాల లోపల మనసు మొగ్గలు ******* విలువలును తాళికి ఉరేసి చచ్చిన స్వేఛ్చ సాక్ష్యంగా నల్లటి రాత్రిలో అక్కడ జరిగేది ఒకరిపై ఒకరి అత్యాచారం ఈ రెండు మనసులూ రెండు నిజాలు ఒకే అబద్దపు ముసుగులో కాపురముంటున్నాయి ఎన్నో గడపలు దాటి చూడు వేరుగా విసిరేయబడ్డ మనసులు తప్పక కనిపిస్తాయి ష్ .. ఎవ్వరికీ చెప్పకు అది ఆ రెండు మనసుల దాంపత్య రహస్యం మీ చాంద్ || 15.04.2014 ||

by Chand Usmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qCZd4v

Posted by Katta

Nirmalarani Thota కవిత

కరుణై కురుస్తావని ఆశల లోగిలిలో పరితపిస్తే కాంతి పుంజమై వచ్చి కనులు మిరుమిట్లుగొలిపి కనుమరుగయ్యావ్ ! * * * నింగికెగరేస్తే నే చుక్కనయ్యానని మురిసిపోయా మరునిమిషంలో తెలిసింది నేల రాలే నీటి చుక్కనని ! * * * ఒకటే జ్వరం.. పనిమనిషిని మందు తీసుకు రమ్మంటే అది నిన్ను తీసుకువచ్చింది.. దాని ఋణమెలా తీర్చుకోను? * * * అమితమైన ఆనందంలోను, అంతులేని దుఖ్ఖంలోనూ జారే కన్నీరు పిలవకనే పలికే నా ప్రియ నేస్తాలు ! * * * యవ్వనం తొలిరోజుల్లో అనిపించేది మనసుంటే చాలని నీవు దూరమయ్యాక తెలిసింది మరపుంటే చాలని ! * * * మహా సంద్రంలో మంచి నీటికై తపించే దాహర్తిని నేను గుండెలవిసినా గుర్తుపట్టని బాటసారివి నువ్వు ! * * * నన్ను చూసి ప్రపంచం నవ్వుతోంది ఎలా బ్రతకాలో తెలియదని నేనూ ప్రపంచాన్ని చూసి నవ్వుతున్నా ఎందుకు బతుకుతున్నారో తెలియక ! నిర్మలారాణి తోట [ తేది: 15-04-2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJaMzW

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

పురా.. .. _________________________ 1 ఆకాశాన్ని మోస్తున్నట్టు రెండుచేతులెత్తినిల్చున్న వెన్నలపులుముకున్న సున్నపుచెట్టు మా పెద్ద మసీదు మాఊరు చెవులు రిక్కరించివినే ప్రభాతప్రదోషకాలల అజా సంగీతం వీథివీథినా శుక్రవారం నాడు ఓ పవిత్ర సందర్భాన్ని మోసుకొచ్చె పూలపల్లకి పుట్టుకనించీ మాఊరు ఎదుగుదలను కండ్లల్లవెట్టి చూసుకున్న కన్నతల్లి 2 ఇప్పుడు ఆకాశం కప్పుకున్న వెన్నెలచుట్టూ మూడురూపాల్లో నేను ఆక్రమించిన వెలుగునించి పెనుగులాడుతున్న చీకటిలా పోతపోసుకుని రంగులద్దుకున్న మూడుతరాలు బ్యూటీపార్లలయిన మంగలిషాపులు డ్రైక్లీనర్లైన ఇస్త్రీ దుకాన్లు ముత్తూట్ ఫైనాన్సుల్లో కుదువవడ్డ బంగారం దుకాన్లు చెదిరిపోయిన ఊరిపాటకు దహనంలో మిగిలిన ఆనవాళ్లలా 3 తోటచుట్టూపరుగెత్తిన చిట్టిపాదాలు ఏ పందెంలోనొ శిథిలమైనడుస్తున్నాయి చెర్వుని కళ్ళల్ల నింపుకున్నట్టు బిడ్డకోసం చేతులెత్తి నమాజ్ చేస్తున్న అమ్మీజాన్ లా ఇప్పుడు పెద్ద మసీదు..

by ఎం.నారాయణ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qCOO8P

Posted by Katta

Aruna Naradabhatla కవిత

చార్ పత్తర్ __________అరుణ నారదభట్ల నాలుగు డబ్బాల్లో నాలుగు ఎజెండాలు గెంతడం అలవాటైన "ప్రాణం"! అడుగులకు అస్తిత్వాన్నిస్తే ఓకే జామపండు తిన్న చిలకలా పలికేదంతా తీయగా ఆ గది మాటే! సోప్ పేపరులా పట్టిన జిడ్డు వదిలేదాకా నీటుగ వడుకొని చింతామణి ఎక్కువున్న సబ్బుబిళ్ళను నిలబెట్టి యూస్ అండ్ త్రో బాటిల్ లా ఖాళీగా నిన్ను పడేసినప్పుడే అసలైన చార్ పత్తర్ ఆట మొదలయ్యేది! పక్క డబ్బాలోకి దూకగానే ఇంద్రజాలం ఆరంభం! అప్పటివరకూ తిన్న పండ్ల బలం పేకముక్కల్లా రాలిన ఆశల గురుతుల గాబరాలో చిలక గొంతు గబ్బిలంలా ఫుట్ బాల్ ఆడుతుంది! పాతాళభైరవుడి కథలోని మాంత్రికుడి చేతిలోని మాయా జాలం ఇప్పుడు రాజకీయమై రెంకలేస్తోంది! మ్యాజిక్ చేసే వారిచేతిలోని మాయలకర్రకు కోడిగుడ్డు పిల్లవుతుందేమోనని భ్రమపడేలోపే పాపం ఆంలేటుగా వేడి పెనమై నిప్పులు కురిపిస్తుంది! రేసుగుర్రం ఎక్కి దూసుకుపోవాలనుకున్న ఆశ మధ్యలోనే జారిపడి ఆసుపత్రిపాలయింది! నిన్నటివరకూ గులాబీ పాట నేడు మువ్వన్నెల జెండా బాట అక్కడా అడుగులు గట్టిపడకుంటే రేపు మరో పక్క గది ఖాళీగానే ఉంది... గెంతడం ఎలాగూ తెలిసిన విద్యే కానీ గాయపడకుండా గమ్యం చేరినప్పుడే ఉనికి తెలిసేది....నిలకడని తేలేది! సోప్ పేపర్ కంటే సబ్బు బిళ్ళే రాజకీయానికి అవసరం బరువు ఉంటేనే కదా బాగా అరగదీసేది 15-4-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eIMeqx

Posted by Katta

Narsimha Reddy Tagirancha కవిత

రక్తాన్నీ దోసుకుంటున్న దో(మ)పిడీ దొంగలు ... కునుకు పట్టక గుయ్యారాలతో సంటిపోరలు... కూనిరాగాల నుడుగులందుకున్న ధోతితాతలు.... సర్కారుల మన్ను వోస్తున్న సామాన్యులు మోటు మాటల మంట వెడ్తున్న మహిళా మణులు... ................ ................ .................. ఏందో ఏమో ఈ కరెంటు కష్టాలు ...!

by Narsimha Reddy Tagiranchafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGCEdO

Posted by Katta

Nishi Srinivas కవిత

"ఐ లవ్యూ డియర్" -------------------------------- నిషిగంధ ఏయ్... రెండ్రోజుల్నుంచి ఆఫీసుకి సెలవు కదా... నీవెలా గడిపావో నాకు తెలీదు కాని నేను మాత్రం ప్రతిక్షణం నీతోనే గడిపాను. ఆఫీసులో నీతో మాట్లాడాలంటే సమయం సంధర్భం చూసుకోవాలి కాని, నా ఆలోచనల్లో నీతో మాట్లాడడానికి ఎప్పుడు... ఎక్కడ అన్నదానితో నాకు పనిలేదు. నీ అనుమతి అంతకన్నా అవసరంలేదు. అందుకే నీ సమక్షాన్ని నెనెంత ఇష్టపడతానో... నీవు లేని క్షణాల్ని కూడా నేనంతే ఇష్టపడతాను "ఐ లవ్యూ డియర్" 15-04-2014

by Nishi Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t3o5oe

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jGHEO4

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQQkhz

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // మెరుపులు // జీవం నింపుతావు ….. మళ్ళీ మళ్ళీ పుట్టినంతగా …. మళ్ళీ పిచ్చిగా బతికేంతగా దాచుకోవాలనుకున్న తెలుపు నీలాల జ్ఞాపకాలను తొంగిచూస్తూ ఇంకోరొజు ఇంకోమాట ఇంకోపాట ను చిక్కగావల్లె వేస్తా కొన్ని మిణుగురులు చేర్చే మాధుర్యంతో చేతివేళ్ళ కోసలని స్పృశించి అద్భుతమైనదేదో దొరికించుకుంటా అమావాస్య ముచ్చట్లు ,దేవి నవరాత్రులు పన్నీరుఅత్తరు జల్లుల ప్రశంసలు అప్రయత్న పూర్వకంగా సాక్షాత్కారిస్తాయ్ బెంగను తీర్చి వెన్నెల కురిపించే సూర్యుడా ఇక దరికి దారిని చేసేదేలా…? Date:15/04/2014

by Sri Modugufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1es5YUK

Posted by Katta

Krishna Mani కవిత

సుక్క బొట్టు ************* మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! పగిలిన నెర్రలమీద పొక్కిలి పెంకలాయే ఎదురుసూపుల కండ్లళ్ళ నెత్తురు జీరలాయే చెట్లకొమ్మల ఆకలికి ఆకుల అరుపులాయే పసి నవ్వులు మానిన లోకం ముసలిదాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! అడవి జాతర మాని బొందలల్ల నీటిపోరులాయే వలసజీవులకు దిక్కుతోయక పీనుగుల పీకుడాయే సుక్క నీళ్ళకు గద్ద సూపుకు ఎండమావుల నవ్వులాయే బలిసిన దున్నల డొక్కల బొక్కలు బయటికాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! అడవిరాజుల బలముదిగి జింకపిల్లల చెలిమిలాయే నల్లతాసుకు తోవ్వదక్కక కన్నపిల్లలె ఆకలాయే అడుగుజరగని మొసలి కాళ్ళకు గట్టిబురద అడ్డమాయే ఎండగొడుగున గడ్డి ఏర్లకు దూపదీరక తిప్పలాయే మొగులు మీద మన్నువడ ఒక బొట్టునన్న ఇడువదాయే ! కృష్ణ మణి I 15-04-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1es5YUI

Posted by Katta

Sriramoju Haragopal కవిత

కొరగాని గవ్వలు ఎన్ని వన్నెల జెండాలతో ఎందరు దేశం మీద పడి జన్నెకిడిసిన ఆంబోతుల్లా జనాల పానాలు తోడుతున్నరు వీళ్ళ మేనిఫెస్టోలు ప్రజల బతుకు ఏమన్నమార్చేవా? వీళ్ళ అబద్ధాల సభలు ఎవరి ఆకలి ఏమన్న తీర్చేవా? లూఠీకోర్లు,జూటాకోర్లు, బటాచోర్లు, హవాలాగాళ్ళు ఎవరికి వోటెయ్యాలె ఎవరికి అధికారమియ్యాలె ఏండ్లు గడిచినా ప్రజల కడగండ్లు తీరనేలేదు ఎవడు గెలిచినా ప్రజల దినగండాలు తప్పలేదు ప్రజాస్వామ్యపాలన ఎప్పుడవతరిస్తుంది ప్రజల చేతికి అధికారం ఎన్నడన్నా వొస్తుంది ఉద్యమాలు మారె రాజకీయప్రాయోజిత సీరియళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడె ఉల్ఫాగాళ్ళ కోటగుళ్ళు ఒక్కొక్కడు ప్రజలకలల హంతకుడు దొంగనోట్ల దొంగవోట్ల రాజకీయ జూదగాడు వూర్లకూర్లు దోచి పట్నాలకు పాకినోల్లు వూర్లకూర్లు రియల్ ఎస్టేట్ల కింద అమ్మినోల్లు చెరువులు, కుంటలు, కాల్వలు, స్మశానాలు మింగినోల్లు గల్లి నుంచి ఢిల్లీ దాకా కాంట్రాక్టులు దొబ్బినోళ్ళు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే సిద్ధాంతాల మాయగాళ్ళు జేబుల నుంచి మాయపాములు తేళ్ళు రూపాయలకట్టలు తీసే గావుల కింది పందికొక్కులకు పంటభూములిడువాల్నా నోట్లకో లిక్కరుకో కుప్పలేసిన కులాల, మతాల బిర్యానీలకో అమ్ముకునే వోట్లంగడి ఎవనికి కావాలె ఎన్నికలొచ్చి ఇదివరకేంజేసినయని, ఇపుడేంజేస్తయని? ప్రజల చేతికి రాజ్యం వొచ్చేదాకా దొంగ ఎన్నికలని తన్ని తగులబెట్టు

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p5cV2K

Posted by Katta

Sasi Bala కవిత

'' మమతల లోగిలి '' ........శశిబాల --------------------------------------------- (కృష్ణా తరంగాలు లో నన్ను విజేతగా నిల్పిన నా కవిత ) అనుబంధాలు ఆత్మీయతలు ... దేవుడు వే( చే )సిన మమతల మణి హారాలు ఏవీ... ఎక్కడివీ ...ఏమై పోయాయి ఆ ఆప్యాయతానుబందాలు ? ఎప్పుడు వుంటామో తెలియదు ...ఎప్పుడు పోతామో తెలియదు బుద్బుదమైన ఈ చిన్ని జీవితాన పొంగించుకోవలసిన మధుర ప్రేమలు పండుగంటే తెలియని ....వెన్నెలంటే చిత్రమని తలచే బూటకపు బ్రతుకులు అతికించిన చిరునవ్వులు ..పనికి రాని ప్లాస్టిక్ బంధాలు అన్నదమ్ముల ప్రేమ ...ఆలు బిడ్డల మమత .. తల్లిదండ్రుల కరుణ ...బంధుమిత్రుల స్మరణ ... ఏ లోటూ లేని అనురాగాల కోవెలలు .. అనుబంధాల మల్లెల పొదరిళ్ళు ... ఇదే గదా భారతీయత ..ఇదే కదా సౌశీల్యత ... వసుధైక కుటుంబానికి .ఇదే కదా ముచ్చటైన ప్రతీక ఏమిస్తే కలుగుతుంది మహి (ది )లో ఇంతటి అనుభూతి ఏమిస్తే ఏర్పడుతుంది ఋణానుబంధాల వారధి (15 ఏప్రిల్ 14 )

by Sasi Balafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hGcTdH

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నీతో నేను ---------------------------- కొన్నిసార్లుపాత సంభాషణలనే కొత్తగామట్లాడుకుంటాం నువ్వూ నేనూ ఎలా కలిశామోతెలియకుండానే ఎన్ని సాయంత్రాలు ఒంటరి సముద్రతీరమంతా అడుగులువేశామో నీ అరచేతుల్లో అల్లుకున్న పచ్చని కాంతి మరోసారి అలుగుతోది ఆ అందంచూడలేక పక్కపక్కగాఎన్ని ఏకాంతరాత్రులో నీజ్ఞాపకాల్లోఅల్లుకున్నానో నిక్షేపాలుగా మిగిలినవి ప్రతిరోజు తవ్వుకుంటూ మళ్ళా పూడ్చుకుంటూ నూతనంగా పుట్టేశకలాలు నీ పేరును పదేపదే పలికే రెండుపెదవులు ఎప్పటికి కలవకుండా విశాల కవాటాలనడుమ కొన్నివిశ్వాసాలను మూటగడుతూ నీకై నిరీక్షిస్తూ ఇంకొన్ని కొత్తసంభాషణలుప్రారంభం తిలక్ బొమ్మరాజు 15.04.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gyNi4k

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 24 (కవి సంగమం) " నివురు" (కవిత్వ సంపుటి) "కొండేపూడి నిర్మల "---సంపుటి రాసిన కవయిత్రి సంపుటిని పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి" "నిగూఢ కోణాలని "నివురు"లో నిక్షిప్తం చేసిన కవయిత్రి కొండేపూడి నిర్మల” "కదిలే నీళ్ళ మీద కదలకుండా కూచుని చేపల కోసం వల విసిరాడా కుర్రాడు."కదలని గట్టు మీద కుదురుగా కూచోలేక పద్యం కోసం "వలవిసిరింది కవయిత్రి.పద్యం ముందు పడుతుందా?చేప ముందు పడుతుందా?-అని ఎదురుచూసిన కవయిత్రి "కవ్వించీ కవ్వించీ అంత పెద్ద సూర్యబింబం ఆ కుర్రాడి వల్లోనే పడటం 'కోరిక మీరా నాలుగు నల్ల మబ్బులు" వాడి వల్లోనే వాలడం చూసిన ఆవిడ"నా కాగితం మీద ఒక పాదముద్రా లేదు"-అని దిగాలు పడుతుంది.ఇలా దిగాలు పడుతున్న కవయిత్రి ఎవరో కాదు "తన కవిత్వ పాదముద్రలతో కుటుంబం,రాజ్యం,చరిత్ర అనేక విధాలుగా స్త్రీలను "ఎమోషనల్ బ్లాక్ మెయిల్"చేసి అణివేస్తూ,ఆ అణిచివేత ప్రయత్నాలనే ఆత్మీయ సంబంధాలుగా భ్రమ పెడుతున్న వాటిని బద్దలు కొట్టే బాధ్యతను" చాలా కాలం నుంచి మోస్తున్న కవయిత్రి కొండేపూడి నిర్మల గారే. "చేప అయినా పద్యం అయినా"-అనే పద్యంలో"కోరిక అంటూ వుంటే లీనం కావాలి చేపకైనా,పద్యానికైనా"-అని కొండేపూడి నిర్మల గారు అంటారు.ఈ కవయిత్రి కవిత్వం లోని నిగూఢ కోణాలు దృశ్యం కావాలంటే ఆవిడ కవిత్వంలో కోరికవుండి లీనమైతేనే అది సాధ్యమవుతుంది.స్త్రీలకు సంబంధించిన కవిత్వాన్ని,స్త్రీలకే సంబంధమైవున్న అంశాలని స్త్రీలే మాట్లాడితే హృదయపు లోతుల్లోంచి వినిపించబడుతుంది.కానీ స్త్రీ స్వరంతో మగ కవులు,పురుష స్వరంతో కవయిత్రులు రాయడం వల్లా కలిగే ప్రయోజనం తక్కువ అని చే.రా గారు అంటారు."నివురు" అనే శీర్షికతో ఈ సంపుటిలో ఏ కవితా లేదు.అయితే దుఃఖపు నివురు కప్పిన "నిప్పు"అనే కవితను నిర్మల గారు పురుష స్వరంతో పురుషుని కోణంలోంచి రాసినట్లు అనిపిస్తుంది.మరణించిన తండ్రి శవంతో "కొడుకులున్నదే తల కొరివి పెట్టడానికంటే / నీ అయిదో కూతురిగానే పుట్టే వాన్ని కదా నాన్న /మగవాడు కన్నీటిని అనుభవించడానిక్కూడా అర్హుడు కాడా?"-అని ప్రశ్నించుకొంటాడు. ఈ వాక్యాలు చదివింతరువాత స్త్రీల దుఃఖపు,కన్నిటిని,వాటి వెనుకగలకారణపు కుట్రల్నీ సహానుభూతితో మగవాళ్ళు వ్యక్తీకరించవచ్చు కదా అని ఈ సంపుటిని పరిచయం చేస్తున్నా.అయితే కవయిత్రి ఉద్దేశ్యం ఏడ్చే మగవాళ్ళను ఆడవాళ్లలాగా ఏడుస్తావెందుకు?"-అని పోల్చడాన్ని నిరసించడానికి పైన పేర్కొన్న వాక్యాలను చెప్పారేమో? జెండర్,మాతృత్వం,పితృస్వామ్యం,లైంగికత అనే ఈ ప్రధానసమస్యల చుట్టూ అల్లుకొన్న సూక్ష్మాతిసూక్ష్మ అంశాల్ని సైతం తమ కవిత్వంలో అనుసంధానిస్తూ,వాటిని తార్కింగా చిత్రిస్తూ స్త్రీ వాద కవిత్వం ఎదుగుతూ వొచ్చింది.అలా ఎదుగుతు వచ్చిన క్రమంలో స్త్రీ వాద కవిత్వం స్త్రీ ఎదుగుతున్నంత మేరా స్త్రీని మనిషిగా గుర్తించాలనే ధోరణిని బలంగా సమాజంలో వ్యాపింపచేసింది.ఆ సందర్భంలో స్త్రీవాద కవిత్వ నదికి ఇరువైపులా రెండు దరుల్లా నిలిచి ఆ నది ప్రవాహవేగాన్ని మరింత ఉధృతం చేసింది ఇద్దరు నిర్మలలు.ఒకరు కొండేపూడి నిర్మల,మరొకరు ఘంటశాల నిర్మల.కాని చాల కాలం క్రితమే ఘంటశాల నిర్మల రాయడం ఆపేసినట్టున్నారు. కొండెపూడి నిర్మల గారు మాత్రం తన కవిత్వంలో ఎన్నో నిగూఢకోణాల్ని నిక్షిప్తం చేస్తూ,ఎందరికీ కష్టం అనిపించినా నమ్మిన మంచిని పచ్చి నిజాల్ని తెల్పే తత్వంతో,మనసులో ముసురులా పట్టి వుండే కవిత్వాన్ని కొనసాగిస్తూవొస్తున్నారు."సంధిగ్ధ సంద్య"లో కవిత్వం ఆరంభించిన నిర్మల గారు "నడిచే గాయాలు" ఏవో మనకు చెబుతూ,ఆ గాయాల సలపరం ఏమిటో తెలియచేస్తూ, బాధలు పడి నిందలు పొందిన స్త్రీ అనే "బాధాశప్త నది"యొక్క లోతుల్లోని దుఃఖపు రహస్యాల్ని విప్పిస్ఫురింప చేస్తూ, వస్తువుల్నే రక్తమాంసాలున్న ,రాగద్వేషాలున్న ఆత్మీయమనుషులుగా మభ్యపెట్టుకొనే లక్షణాన్ని నేర్పుతున్న బహుళ జాతి సంస్థలు చేస్తున్న మోసాల్ని,కుట్రల్ని "మల్టి నేషనల్ ముద్దు"గా తెలియచెప్పిన కవయిత్రి కొండేపూడి నిర్మల గారు. తెల్ల తోలు వుండటమే నిజమైన అందం అనే అబద్దాన్ని నమ్మి ఆ "అబద్దం" కోసం యుధ్దాలు చేస్తున్న నల్ల అబ్బాయిలు ,తెల్ల అబ్బాయిల మూర్ఖత్వాన్ని,గాజు రాయి మీద అరిగిపోతున్న అమ్మాయిల జీవిత వెన్నెముకల్ని కృంగదీసిన గాలికెగిరే పిట్ట ఈక లాంటి అందానికి కొలబద్ద అనుకున్న అమెరికా పంపిన "అబధ్దం"ను తన కవిత్వపు నిగూడతతో మెరిపించిన కవయిత్రి కొండేపూడి నిర్మల గారే.("అబధ్దం")1 ఇరవయ్యారు అక్షరాల శకలాలతో,మోసకారి అక్షరాలతో సంతకం చేయించుకొని తల్లికి రావాల్సిన వితంతు పెన్షన్ ను తనపేర రాయించుకొన్న క్రౌర్యపు కొడుకు కుట్రను,అందుకు కారణమైన పరాయి భాష దాపరికపు మోసాన్ని,కొడుకుల కపటత్వానికి తోడైన నెల తక్కువ భాషని ,మగవాడే కాదు పరాయిదైన భాష కూడా స్త్రీలను దగా చేస్తుందన్న నిజాన్ని తన కవిత్వంతో నిరూపించిన కవయిత్రి నిర్మలగారు. (వివర్ణ మాల)2 కళ్ళున్నందుకు సాక్ష్యంగా కన్నీళ్లను మూట కట్టి గుజరాత్ లో గాయపడిన శిబిరాల శిథిలాల కన్నీటి వాసనని తన కవిత్వంతో మనకు చూపునిస్తున్న రెండు కళ్ళలో వొక నిశ్చల చిత్రం చేసి మన ముందు నిలబెట్టిన కవయిత్రి నిర్మల గారు.("కట్టె-కొట్టె-కాల్చె")3 స్టెరిలైజ్ చేయని సూది మందు కారణంగా పులకరింతల మధ్య ఆటోలో ప్రయాణం చేస్తున్న అమ్మా నాన్నల మధ్య వారిలో వారికే వొకరిమీద వొకరికి అనుమానం కలుగచేసే ఆ యిద్దరి ప్రపంచాల గాలి బుడగను పేల్చి వేసే ఎయిడ్స్ వైరస్ అంటి పుట్టిన పాప విషాదాన్ని కరుణరసాత్మక కవిత్వమ్ చేసిన కవయిత్రి కొండేపూడి నిర్మల గారు.(సూదిపోటు న్యాయం)4 ఇట్లా ఎన్నో కవితలు నిర్మల గారి దార్శనిక శక్తిని,నిర్మాణ వైచిత్రిని,శిల్ప నైపుణ్యాన్ని మనం లీనం అయితే మన ముందు పరుస్తాయి. నిర్మల గారు కవిత్వం రాయడానికి ఏ మాత్రం ఇబ్బంది పడరు.తపన మాత్రం పడతారు.మాములు మాటల్నే కవిత్వం లో పొదుగుతూ,మనసును కట్టి పడేసే భావసంచయాన్ని కవిత్వం చేస్తూ పాఠకుల్నీ తన కవిత్వం ముందు నిలిపేస్తారు. "గ్లోబులో ఏ మూలనుంచో తీగ లాగుతావు/డొంకలా కదిలి పోతాను/అమ్మా...!నేను ఎలావున్నావు"-ఈ వాక్యాలు " చాడీలు" అనే కవిత లోనివి.మాములు మాటల్నే పొదుగుతూ రాసిన కవిత ఇది.ఇందులో మాటల్ని"మెత్తని నీళ్ల చప్పుడితో పోల్చింది.అలా పోల్చడంలోనే కవయిత్రి ప్రతిభ పాఠకుల దృష్టిలో పడటానికీ అవకాశం వుంటుంది.ఇలా ఎందుకు పోల్చిందంటే 'ఆ మాటలు చిట్టి చేప పిల్లల్లా గది నిండా ప్రవహించినపుడు గది అక్వేరియమ్ అవుతుందని వొక దృశ్యం రూపు కట్టడానికే. ఆ అక్వేరియమ్ లో రకరకాల చేప పిల్లలు వున్నట్టు రకరకాల భావాలు అమ్మ మదిలో పేరుకొని"నిన్న పొడిగా వున్న మనసు గది తన పిల్లలు పల్కరించినపుడు తడిగా ఎందుకయ్యిందో పోల్చుకోలేని దిగులుతో తల్లడిల్లిన అమ్మ మనసు లోని తడిని కవయిత్రి గొప్పగా మన హృదిలో కల్గిస్తారు.ఎక్కడో గ్లోబులో అంటే ఖండఖండాంతారాలలో అని.తీగ లాగడం అనే జాతీయాన్ని ప్రయోగించి ఆధునిక సమాచార వ్యవస్తని స్ఫురణకీ తెచ్చారు.ప్రయోగించే ప్రతి పదానికీ ఒక సార్థకతను ఈ కవయిత్రి అభిలషించడం సంపుటిలో చాల చోట్ల గమనించవచ్చు. ఈ సంపుటిలో కవయిత్రి శిల్పనైపుణ్యాన్ని ,చేప్పే తీరుని అత్యంతంగా పఠితలచే ఆకర్షించబడే కవితలు అనేకం కనిపిస్తాయి.నన్ను నిలబెట్టి ఆద్యంతం నన్ను నీరు నీరు చేసిన కవితలు "ప్రేమ మాధుర్యం",వాన -బురద",.....రిస్క్ తీసుకొంటాను" అనేవి. కవయిత్రి అనితర సాధ్యమైన శైలి ,ఆ శైలికనుగుణంగా వొక వ్యూహాత్మక నిర్మాణ చాతుర్యం,ప్రతిభా మూలకమైనా పదప్రయోగ సాఫల్యం ఇవన్ని ఈ రచయిత్రి చాల కవితల్లో ప్రదర్షిస్తుంది. "సాయంత్రం ఆరు గంటలు.... బ్రెయిలి క్లాస్ కి ఆట విడుపు గంట మోగింది చైతన్యపురి చౌరాస్తా నుంచి ముగ్గురబ్బాయిలు దూసుకొచ్చిన బస్ కింద పడబోయి నిలదొక్కుకున్నారు "కళ్లు నెత్తికెక్కాయా?"డ్రైవర్ అడిగాడు(1) వాళ్ళు మాట్లాడ లేదు ఒకరి చేతులుమరొకరు పట్టుకొని రోడ్డు దాటారు ఇ-సేవ సెంటర్ కివతల మలుపు మీద నించున్న అమ్మాయిలకి ప్రాణం వచ్చింది గల్లీ రౌడిచూపుల్ని విదిలించుకొని ఒక్కసారిగా ముందుకొచ్చారు. 'శాజహానా ఎక్కడున్నావు?(2) స్వప్నా నే వచ్చాను చూశావా!(3) ఎస్తర్ ఇవాళా వచ్చిందాండీ?(4) ఎవరీ ప్రపంచాన్ని వాళ్లు పేరు పెట్టి పిలిచారు వారం రోజుల పాటు ఉగ్గబట్టుకున్న ఏకాంత దుఃఖం అబ్బాయిల మాటల్లో బట్వాడ అవుతుంది. అమ్మాయిలు మాట్లడలేదు. షాజహానా పక్కకొచ్చి ఒక అబ్బాయి చేతిలో మధుర గీతం రాస్తోంది స్వప్న అలిగినట్టు నుంచొని అబ్బాయి పెదాల మీదున్న మాటల్ని అల్లుకొని మెడలో వేసుకొంది ఎస్తర్ నవ్వుకొంటూ ముందుకొచ్చి అబ్బాయి చెవిలో ఏవో కొన్ని అక్షరాలు ఉఛ్ఛరిస్తోంది ఇక్కడ నిజంగానే ప్రేమ గుడ్డిది ప్రేమ మూగది ప్రేమ చెవిటిది" ఇలా సాగి పోతుంది. కవిత.ఇందులో ఏం వుంది అనుకోవచ్చు.కవయిత్రి ఎంత శిల్ప నైపుణ్యంతో కవిత్వాన్ని నిర్మించిందో పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ కవితలో చెప్పబడిన ముగ్గురు అబ్బాయిలు కంటిచూపులేని వారేనన్న విషయాన్ని "బ్రెయిలీ క్లాస్ కీ ఆటవిడుపు గంట మోగింది"అన్న వాక్యం ద్వారా,"కళ్ళు నెత్తికెక్కాయా?"-అన్న డ్రైవర్ అడగటం ద్వారాను మనకు తెలుస్తుంది.ఆ ముగ్గురిలో ఒకరు "షాజహానా ఎక్కడున్నావు?"-అని అంటాడు.ఈ మాట అన్నది కంటిచూపు లేని అబ్బాయే.షాజహానా కూడా కంటి చూపు లేని అమ్మాయి.కాబట్టే అతడు ఆమే మాట ద్వార ఆమె ఎక్కడుందో తెలుసుకున్నాడు ఆ అబ్బాయి అని కవయిత్రి మనకు ఊహనిస్తంది.రెండో అబ్బాయి "స్వప్న నే వచ్చాను చూశావా?"అంటాడు.ఈ అబ్బాయికీ కంటి చూపు లేదు.కానీ ఆ స్వప్నకీ కంటి చూపు వుంది. కానీ మాటలు రావు.అందుకే ఆ అబ్బాయితో "చూశావా"అని అనిపిస్తుంది.ఆ అమ్మాయిఅబ్బాయి పెదాల మీదున్న మాటల్ని అల్లుకొని మెడలో వేసుకున్నట్టు రాయడం.మూడో అబ్బాయి కూడా అంధుడే.అందుకే అతడు తన మాట వినలేని తన ప్రియురాలి గూర్చీ తన మాట వినగలిగే ఆమే స్నేహితురాళ్ళతో"ఎస్తర్ ఇవ్వాళ వచ్చిందాండీ"-అని అడుగుతాడు."ఏవో కొన్ని అక్షరాలు అతని చెవిలో ఉచ్చరించిందని కవయిత్రి రాస్తుంది. ఈ కవితలో కవయిత్రి చూపించిన నేర్పు,చేసిన అద్భుతం ఏమిటంటే పద చిత్రాల చిత్రణలో ఈ కవితలో చెప్పబడ్డ అబ్బాయిల,అమ్మాయిల శారీరక వైకల్యాన్ని తాను వాచ్యం చేయకుండానే ఎంతో శిల్ప నైపుణ్యంతో "ప్రేమ గుడ్డిది"అని అనటం ద్వార షాజహాన కంటి చూపు లేనిదని,"ప్రేమ మూగది"-అని చెప్పడం ద్వారా స్వప్న మాటలు రానిదని,"ప్రేమ చెవిటిది"అని పేర్కొనడం ద్వారా "ఎస్తర్" వినికిడి తనం లేనిదనే విషయాల్నీ కవయిత్రి నిర్మల చెప్పి తన శిల్ప చాతుర్యాన్ని చాటుకొంది. ఆ మూడు జంటల శ్రవణ,గాత్ర,నేత్ర అవధానాలతో చైతన్యపురి ప్రేమపురి అయ్యిందని ఒక చమత్కారాన్ని కూడా నిర్మల చేసింది."దశాబ్దాలుగా కలసి కాపురం చేస్తున్న వాళ్లు అపరిచితుల్లా మిగిలిపో విషాదంలో ఒకరినొకరు చూసుకోలేని మాట్లాడుకోలేని చీకటిలో వున్న ఆ ఆరుగురు ఆ చీకటిని ప్రేమ మాధ్యమంలో వెలిగించుకొన్నారన్న అనుభవాన్ని ఎట్లా దృశ్యం చేసిందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. నిర్మల గారు నైర్మల్యానికీ ప్రతీకగా వానను,అలుముకొన్న అనుమానానికీ ప్రతీకగా బురదను తీసుకొని ఎవరో తెలియని మగవాడి స్కూటర్ లో తెలియని రోడ్ల మీద అనివార్య స్థితిలో వెనుక సీట్లో కూర్చొని ప్రాయణిస్తున్నప్పుడు,రోడ్డు మీద నడుస్తున్న వాళ్లే కాదు చెట్టు,పిట్టలు,గుట్టలు చివరికీ అతనిలో అతనే ఏమీఅనుకోకుండా తమ ఇద్దరి మధ్య చేతి సంచినీ చైనా గోడలా వుంచుకొన్న వొక స్త్రీ మనోభావాలను తన కలాన్ని కెమెరాలా చేసి దృశ్యీకరించింది.తాను ఊహించిన దానికన్నా భిన్నంగా జరిగే సరికీ "ఛేదించాల్సిన దుర్మార్గం"ఎవరిలో వుందో తెలియని స్త్రీ తల్లడిల్లిపోయే సంఘర్షణని "కొత్త బ్యాటరీ వేసి "మరీ చూపిస్తుంది. నన్ను నా ఆలోచనలనూ లొంగదీసుకొని తనలోకి వొంపుకున్న కవిత ఈ సంపుటిలో "...రిస్క్ తీసుకుంటాను" అనే కవిత. "మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను"-అన్న పాదాలతో ఈ కవిత మొదలై మనం ఊహించని అర్థాంతర ముగింపుతో త్రాగుబోతు భర్త,"ఇంట్లో ఈ సంత నా కొద్దు"అనుకుండే భార్య మధ్య నిత్యం నిరంతరం జరిగే ఒక జీవన విషాద భీభత్స సమవాకార సారంశా దృశ్యాన్ని నిలబెట్టి మరి చూపిస్తుంది.ఈ సమస్యతో నిత్యసంఘర్షణాత్మక జీవితాన్ని గడిపే దంపతుల జీవితాల్లోని నిష్టుర సత్యాన్ని నిలువునా మండించిన ఈ కవిత 'నాలుగు పెగ్గులు"గా రాయబడింది. మొదటి పెగ్గులో వున్నప్పుడు ఆ భర్త "అన్నట్టూ నీకొత్త చెప్పులు ఇంకా కరుస్తున్నాయా"-అన్న ప్రశ్నా వాక్యమే రెండో పెగ్గులో,మూడో పెగ్గులో ,నాలుగో పెగ్గులో కూడా చాల కీలక వాక్యమై కవితను సజీవం చేస్తుంది.గోడ మీద తెగ కావలించుకొని దిగిన హానిమూన్ పోటో మొదటి పెగ్గులో విస్తు పోవడం ,రెండో పెగ్గులో భయంతో గోడని కరుచుకోవడం, నాలుగో పెగ్గులో "తటాల్నా విడిపోయి ఇంకెవరితోనో లేచి పోవడం"-అని రాయడంలో ఈ కవయిత్రి ఆ భార్య ఎంతటి వేదనని ప్రతి రోజు పొందుతుమ్దో ద్వనింప చేస్తుంది.కవి లేక కవయిత్రి అనన్య శిల్పం ఇట్లాంటి అంశాలతోనే మెరిసిపోయేది.కనువిప్పు లాంటి ఈ కవిత ఇందులో లోతైనా భావాలు ఎన్నో వున్నాయి."ఇద్దరి మీద వొకే బ్రాండ్ సిగరెట్ పొగ గొడుగు పట్టి వుంది"అనా పాదాలు కవయిత్రి భావన శక్తికి గొడుగు పట్టేవిగా నిలుస్తాయి. "...రిస్క్ తీసుకుంటాను "అనే కవితలో శూన్యంలోకి చీర్స్ కొట్టి గ్లాస్ ఖాళీ చేసే దృశ్యాలు పిల్లల కళ్లబడకుండా ఆవిడ పడే పాట్లు,తాగుడు కారణంగా ఏ తప్పు చేయని ఆ యిద్దరి అమ్మా నాన్నలు శీలాలు కోల్పోవడం,మొదటి పెగ్గులో అన్న వాక్యాన్నే అన్ని పెగ్గుల్లో రెచ్చగొట్టేటట్టుగా వాడటం,చివరకూ ఆ తాగుడు భూతం బయటకొచ్చి తుములోకి వెళ్లిపోవడం ఇలాంటి అంశాలు వాస్తవికంగా చెప్పబడ్డాయి.అయితే ఈ కవితలో అతడు తాగేది జానీ వాకర్ అని రాసింది.అది ఖరీదైన విదేశీ మద్యం.ఆ మద్యం వాడేది అరిస్ట్రొక్రాట్సె. మద్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువ ఈ కవయిత్రి భావించిన సంఘటనలు జరిగుతాయేమో?.ఏమయిన ఒక అద్భుత శిల్ప రహస్య మర్మఙ్ఞి ఈ కవయిత్రి. త్రాగడం కన్నా పేకాట మహా వ్యసనం.పేకాటలో వుండే రాజుల్నీ నాలుగు అగ్ర రాజ్యాలతో పోలుస్తూ ఆ అగ్ర రాజ్యాల పొటీలో నలిగిపోతున్న వలస కూలీల జీవిత విషాదాన్ని ,సామ్రాజ్యవాదుల అధికార వాంఛను వ్యతిరేకిస్తూ,"గోరీలుగా మారుతున్న ఇళ్ళ మధ్య పిల్లల్నీ కావిటేసుకొని పారిపోతూ శాపాలు పెట్టిన దుఃఖాన్ని ఈవిడ "కొత్త గోరీలు-పాత దుఃఖాలు"-అనే కవితలో చిత్రించి అగ్ర రాజ్యం చేసిన యుధ్దాన్ని గుర్తుచేస్తుంది. బాగా యిష్టంతో సెటైర్స్ రాసే ఈ కవయిత్రి ఆవ్యంగ్య శిల్పాన్ని సైతం కవితల్లో సమర్థవంతంగా ప్రయోగించింది.బంగారమంటే స్త్రీలకే కాదు ఈ మధ్య పురుషుల్లో మోజు పెరిగిపోయింది."చేతి వేళ్లపై గజ్జి కురుపుల్లా అదృష్టపు వుంగారాలు"అనే మాట ద్వార పురుషుల్లో బంగారం పై వున్న ఎడతెగని మోజుని సెటైరికల్ గా వ్యాఖ్యానిస్తుంది.మైదాస్ రాజు కథ అందరికీ తెలుసు.దేన్ని తాకినా అది బంగారం కావాలనే విపరీతపు కోరికను వరంగా పొంది ,చివరకూ తాను పొందిన ఆ వరం తన జీవితానికీ ఎంత దుఃఖ హేతువు అయ్యిందో "కంచు మోగినట్టు కాకి రెట్ట మోగును"అనే కవితలో కవయిత్రి వ్యంగ్యంగా రూపు కట్టిస్తుంది.ఎక్కడ చూచిన బంగారు కట్లపాములా కాటు వేయడానికీ నడ్డి విప్పి నాట్యం చేసే దృశ్యాల్నీ "కంచు కంటే కనకం కర్ణకఠోరంగా మోగుతుంది"అన్న మాటల ద్వారా అభివ్యక్తం చేస్తుంది ఈ కవయిత్రి."అత్తింటి ఆరళ్ళ నుంచి రక్షించుకునేందుకు /బంగారాన్ని బుల్లెట్ ప్రూఫ్ లా వాడుతున్నారని ఈవిడ ఒక కోణంలో సమర్థించిన "మానవ స్పర్శ లేని లోహ ప్రేమ/గుడారంలో తలదూర్చిన ఒంటెలా మన జీవితాల్నీ"-తొక్కేసిన వాస్తవాన్ని నిర్మొహమాటంగా చెబుతుంది."ప్రపంచానికొచ్చిన ఈ పచ్చలోహపు జబ్బు ఏ పసర్లకు తగ్గుతుందో" తెలీదంటూ ఎవర్నీ చూసిన ఇంత బంగారం ముద్ద కాకి రెట్టలా కంట్లో పడుతోందని ఒక జుగుప్సను వ్యక్తం చేస్తుంది మనిషిని శాసించే మనిషి సృష్టంచుకొన్న బంగారం పై. స్త్రీల దేహాన్ని ఆభరణాలు ఆక్రమించుకోవడం కూడా పురుష స్వామ్య వ్యవస్థ లోలోపల చేసిన కుట్రనే అని స్త్రీ వాదుల భావన.స్త్రీ దేహాన్ని నగల మోజుకు గురి చేసి వార్ని తమకు బానిసల చేసుకోవడమ్ జరిగిందని కొందరి ఆలోచన."లావణ్యాన్ని పనికి రాని లోహంతో ఎందుకు బంధిస్తావురా చాతనైతే కౌగిలిలో బంధించు"-అని అంటున్న కవయిత్రి నిజాయితీగా,ప్రేమగా కౌగిలి సుఖం కన్నా బంగారు ఆభరణాలు ఇచ్చే కృత్రిమ సౌందర్యం తక్కువేనన్న భావాన్ని "కొక్కేం తీస్తావా?"అనే కవితలో స్పష్టం చేస్తుంది.మనసులో ఇరుక్కున్న భావాలు బయటికీ తేవాటానికీ ఎవరైనా కొక్కేం తీయాల్సిందే. ఒక తాత్విక చింతనను మేళవించి నిర్మించిన కవితలా అనిపించేది "చిలుక ఎగిరిపోదు" అనేది.కొందరు కవులూ కొంత కాలం తరువాత కవిత్వం రాయడం ఆపేస్తుంటారు.అంత మాత్రానా వారిలో కవిత్వపు జల ఇంకిపోయిందని కాదు.భావాల చెలిమ ఎండిపోయిందని కాదు.కాలంతో పాటు కలసి నడువలేని వారు కొంతకాలానికీ ఆగిపోయినా వారిలో కవిత్వపు చిలుక ఎగిరిపోదనే శాశ్వత సత్య భావనను కవయిత్రి నిర్మల జ్వాజల్యమానం చేసింది తన ఊహతో.చిలుక కవిత్వ సృజనకు ప్రతీక.ఎప్పుడన్నా కవిత్వం రాయడం ఆపేసినప్పుడు "కనిపించిన వాళ్లంతా అడుగుతున్నారు చిలుక ఎగిరి పోయిందా? కొందరిది ఆందోళన కొందరిది ఓదార్పు కొందరిది కేవలం ఆరా" అని నిర్మల గారు అంటూ "ఇద్దరం ఒకే వసంతంలో పుట్టాం/మా తోట కొచ్చి నన్ను పేరు పెట్టి పిలిస్తే తనే ముందు పలుకుతుంది"అని కవికీ కవిత్వానికీ గల బందాన్ని అందంగా చెప్పింది.ఇలా చెప్పడంలో కవి బతికుండగానే కవిత్వపు చిలుక ఎక్కడికీ పోదని నిజమైన కవులు ప్రకృతిలాంటి వాళ్ళని,ఋతువుకీ ఋతువుకీ మధ్య తమను పోలిన మొక్కలు మొలిచాయో చూసుకొని గర్వపడతాయని ,ఒక తరమ్ నుంచి మరొక తరానికీ కవిత్వ వారసత్వం అందుతుందని కవయిత్రి చెప్పటం లో దార్శనికత గోచరిస్తుంది. ఈ సంపుటిలో పాఠకుడి కంటి చూపు నుంచి జారిపోని కవిత"దొంగాడు-నాంతాడు".భర్త చనిపోయిన యిల్లాలి మెడలోని నాను తాడు పోయిన సందర్భాన్ని నిర్మల కవిత్వం చేసిన తీరు,ఆవిడ వాడిన మెటఫర్ లూ,పద చిత్రాలు,నిర్మించిన వాక్యాలు,ప్రారంభించిన పద్దతి ఇవన్నీ ఆమె ప్రతిభను అద్దంలా మనకు చూపేవే."పారేసుకున్న నాను తాడంటే ఏమిటీ?ఆఫ్ట్రాల్ ఒక లోహపు తీగ /నాను తాడంటే ఏముంది నెల్లాళ్ళ మటన్ బిర్యాని"కాదు అమ్మకీ నాను తాడంటే....నాన్నతో ప్రారంభించిన యిష్టపూర్వక జీవన ప్రయాణానికి సందర్భ సహిత వ్యాఖ్యలాంటిది"అని అంటున్న కవయిత్రి చెబుతూ నానుతాడు పోగొట్టుకున్న స్త్రీ దుఃఖానికీ కారణమయిన పురుషుని మోసాన్ని బట్టబయలు చేసిన కవిత ఇది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని మదురిమను,సహజీవన సౌందర్యంలోని గొప్పదనాన్ని "మనుషులు అన్నం తినడం లేదు"అని ఈ కవయిత్రి"కూర గిన్నెలో హత్య/సాంబారు గిన్నెలో జుగుప్స/పచ్చ్డిలో భీభత్సం" అంటూ విఛ్చిన్న కౌటుంబికతను గుర్తుకు తెస్తున్నది.అకారణంగా ఆత్మహత్యలు చేసుకొంటున్న అత్మస్ఠైర్యం లేని అమ్మాయిల,అబ్బాయిల జీవితాలలోని శూన్యతను ,మాధ్యమాలు,పుక్కిటి పురాణాలు,చాతకాని అమ్మా నాన్నల పెంపకం వీటన్నిటిని నిర్మల నిలువునా చేరేసి రాసిన కవితే "అందమైన ఆత్మహత్య". కేవలం స్త్రీలే ఎయిడ్స్ కీ కారణం అనే తప్పుడు అభిప్రాయాన్ని ఖండించడానికీ వ్యంగ్యంగా రాసిన కవితే "పులి రాణికి ఎయిడ్స్ రాదా?" అనేది. స్త్రీల జీవితాలలోని గడ్డ కట్టిన విషాదాన్ని "బద్దలయిన గాజులకీ పూసలకీ నా గుండె కంటే ఎక్కువ ముక్కలవ్వడం చాతకాదు" -అన్న పంక్తిలో ఆవిష్కరించింది. ఈ ఒక్క పద్యపాదం చాలు నిర్మల గారు ఎంతటి దుఃఖపు తడితో రాస్తుందో చెప్పడానికి. కవి కష్టసుఖాలలో సంబంధం లేని కవిత్వం కవి ఆత్మలో అను సంధానం కాని కవిత్వం కవిత్వమే కాదు" -అన్న వాక్యాలను నమ్ముతూ...ఇంకా రాయాలని వున్నా స్థలాభావం చేత నిలివేస్తున్నా.నేను చాల యిష్టంగా అభిమానించే కవయిత్రి కొండేపూడి నిర్మల గారికీ అనంతపురంలో ఉమ్మడి సెట్టి సాహిత్యపురస్కారం "నివురు"కు డా:రాధేయ గారు యిచ్చిన సందర్భంలో ఈ సంపుటిని కవి సంగమ మిత్రులకోసం పరిచయం చేశాను.ఆ ఉత్తమ కవయిత్రికీ మరో మారు అభినందనలు తెలుపుతూ...మంగళ వారం మరో సంపుటితో కలుసుకొందాం.

by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eHBFUU

Posted by Katta

Swatee Sripada కవిత

దిద్దు బాటు ఏమూలో ఒద్దికగా చేతులుకట్టుకు నిలుచున్న బాల్యం అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తూనే ఉంటుంది అప్పటిదాకా ఓనమాలు దిద్దుకున్న వేలికొసల చివర విశ్వస్వరూపం వేయిపడగల్తో బుసలుకొడుతుంది. ఏమీ తెలియని మసక చీకటి అమాయకత్వం నుండి అన్నీ తెలుసనుకునే అగాధంలోకి నిట్టనిలువునా దూకేసినపుడు అనంత సుదేర్ఘ ప్రయాణానికి దారీతెన్నూ లేకుండా అంధకారం వేల రూపాల్లో నోళ్ళు తెరిచి కబళిస్తూనే పోతుంది గంటలూ రోజులూ సంవత్సరాలూ చీకటిని మేసి చీకటిని స్వప్ని౦చాక చుట్టూ చీకట్ల స్వర్గాలు నిర్మించుకు చీకట్లే వెలుగు వాకలనే విభ్రమంలో సంచరించే వేళ ఏమూలో బీటలు వారిన స్వార్ధం సందుల గుండా చొచ్చ్సుకువచ్చే ఒక చిన్న పరిశీలనా వెలుగు రేఖ చూస్తూండగానే మండే సూర్యబిమ్బమై మనసును నిలదీస్తుంది. అది మొదలు చుట్టూ రోజుకో జ్వలించే ఖగోళ సృష్టి ఇప్పుడనిపిస్తుంది అమాయకత్వంనిమ్చి వెనక్కు వెనక్కు వెళ్లి ఎన్ని మైళ్ళ అస్థిరత్వాన్ని కొలిచి వచ్చామో కదా మిగిలిన లిప్తలు ఎన్ని అడుగు నడిపిస్తాయో మరి Like · · Promote · Share

by Swatee Sripadafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kqQhND

Posted by Katta

Saidulu Inala కవిత

// ఐనాల // జై స్వీరో 1 ఇప్పుడునేను పిచ్చుకగూళ్ళ ఆణల్లో గడ్డిపూస ఆదారాన్ని మాఇంటిగుమ్మం ముందు కట్టే పాలకంకిని గిజిగాని అరుపును కోకిలమ్మ పాటను చిలకమ్మ మాటను 2 ఇప్పుడు నేను వైవిద్యంగా మాట్లాడగల్ను వైవిద్యాన్ని కాపాడనూగలను ప్రక్రుతిపరవశించే పదికోట్ల ప్రాణకోటి చిరునామాను 3 అవును నేనిప్పుడు నేచర్ క్లబ్ మెంబర్ని నిరంతర ప్రవాహిని నిండైన మనసున్నోన్ని ప్రక్రుతిపై ప్రేమపొందినోన్ని

by Saidulu Inalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPMq8L

Posted by Katta

Kamal Lakshman కవిత

మా ఆసరా చిత్ర సౌరభాలు లో బహుమతి పొందిన ణా కవిత నేటి న్యాదేవత దీన పరిస్థితి........... నాడు న్యాయం నాలుగు కాళ్లమీద నడిచినప్పుడు న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టుకున్నా చేతిలోని ఖడ్గం ఝళిపించకపోయినా తరాజులో అందరికీ న్యాయం కనిపించేది నేడు అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతున్నా లెక్కలేని కుంభ కోణాల కుంభ కర్ణుల ధాటికి పట్టపగలు వరుసబెట్టి కుత్తుకలు తెగుతున్నా అబలల అరుపులు,ఆక్రందనలు వినిపిస్తున్నా అమాయకులు మౌనంగా సమిధలౌతున్నా పాపం న్యాయ దేవత కళ్ళున్నఅంధురాలై మొద్దు బారిన తన ఖడ్గంతో చేష్టలుడిగి నేలచూస్తోంది న్యాయం చెప్పలేక తనలో తానే మౌనంగా రోదిస్తోంది కమల్ 14.04.14

by Kamal Lakshmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qBc2MH

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

దిదృక్ష రావెలపురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ కవిత్వమంటే కవితలూ కవులేకాదు ఒకానొక రకంగా ఒక సమాజపు వాస్తవిక జీవిత చిత్రం. మున్ముందుకు జనావళిని న్యాయమార్గంలో నడిపించేలా సారధ్యం వహించగల సమ్మోహన గీతం. పదికాలపాటు జాతిని ప్రబోధింపజేయగల జీవనదీ ప్రవాహపు వారసత్వం కవిత్వం గుండె గొంతుకలోంచి కదలాడే కవోష్ణ రుధిర ధారామృతం కవిత్వం. కేవలం అక్షర సేద్యమే కాదు నిరక్షర కుక్షులను సైతం నిత్యనూతనంగా స్పందించేలా చేసే ఒక మందస్మితమౌ చివురుజొంపాల తలలనాడింపజేయగల పైరగాలికాదా కవిత్వం. హాయినివ్వడమే కవిత్వ హేతువకాదు ఆనందోపదేశాలు రెండూ జమిళిగా పరుగెత్తించగల జవనాశ్వం సుమా! కవిత్వం. పేదవాడి పూరిగుడిసెలో సైతం నవ్వుల దీపం వెలిగించే సత్తా గలిగిన చిరుజ్యోతి కవిత్వం. బీదవారి సౌఖ్యాన్ని భవిష్యత్తును జలగలా పీల్చేసే ధనస్యామ్యానికి ఎదురునిలబడే సమరసిoహం. అశ్లీల భావస్ఫోరకమైన చూపులు విసిరే మృగాలకు తన జూలు విదిల్చి బోనులోకి నెట్టించగల రక్షణ సైన్యం కవిత్వం. కవిత్వపు ప్రయోజనాన్ని అవహేళన గావించకు!! అగ్నిని జల్లినా మంచుజడులను పంచినా ఆనందం ఆరోగ్యకరమైన సమాజం దాని హేతువవి విశ్వసించి ముందుకు సాగు. మరోజన్మలోనయినా కవిగా పుట్టి ఈజాతికి సజావుగా సకాలంలో రుణం తీర్చుకోవాలని కాక్షించు. ఆ ఆమృత ఘడియలకోసం అనునిత్యం ఆకాక్షించు *******************************************************

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kTNTSc

Posted by Katta