పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, జూన్ 2014, గురువారం

Ramaswamy Nagaraju కవిత

అనువాద కవితలు : ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధ పత్రిక Dt:01.06.2014 ప్రచురణ. .... || ఋతువు ॥.... .(Season). *త్రుప్పు - త్రుప్పంటే పరిపక్వత , త్రుప్పంటే ముదురు మొక్కజొన్న, త్రుప్పంటే పతనమై పండే పంట కోత . పరపరాగ సంపర్క సమయం ఇది. పంట చేల మీది పైర గాలిలో అల్లుతున్నవి వాన కోయిలలు నృత్యాలను తూలికల బాణాల లాంటి ఎగిరే వెలుగు రేఖల వంటి జొన్న పొత్తుల కేసరాలతో. ప్రియమైనవి మాకు పిల్ల గాలులు వినిపించే పదబంధాలు , వెదురు పొదల వెండి ఆకుల్లా గుచ్చుకునే జొన్న కర్రల కరకు రాపిళ్ళ ధ్వనులు . రైతులం మేము -- కంకుల కేసరాలు కపిల వర్ణంగా మారాలని పోగేసుకున్నాం పొడుగాటి సాయం సంధ్యా నీడలను పేనుకున్నాం గడ్డితాళ్ళను తాటి నెగళ్ల పొగలతో . కాచు కున్నాం చీడ తెచ్చే మార్పు కోసం ! వేచి ఉన్నాం త్రుప్పు ఇచ్చే భరోసా కోసం! మూలం : వోలె సోయింకా ,నైజీరియన్ నోబెల్ లారియేట్. స్వేచ్చానువాదం : నాగరాజు రామస్వామి. * నైజీరియన్ 'ఒగున్' mythology లో 'rust'(త్రుప్పు) అన్నపదం పతనానంతర ప్రగతికి ప్రతీక. దీన్ని రైతు మాటగా, పంటపొలాల సందర్భం లో కూడా ప్రతిభావంతంగా ప్రయోగించాడు కవి. ---Dt:05.06.2014.

by Ramaswamy Nagarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1meVDsU

Posted by Katta

Pusyami Sagar కవిత

పాశం _____పుష్యమి సాగర్ కన్నా.... నువ్వు కాళ్ళ తో తంతు అమ్మ గర్బం నుంచి భూమికి గెంతినపుడే నేను మరల పుట్టాను ఏమో ..! నా మోము లో వెయ్యి వాల్టు బుల్బుల వెలుగులు ... నీ అల్లర్లు నన్ను నడి వీధి లో నిలబెట్టినా కూడ నాకెప్పుడు ముద్దు గానే ఉండేవి నువ్వు నడక ను ఓనమాలు గా దిద్దినపుడు చదువుల తల్లి ఉయ్యాలలో ఉగుతున్నప్పుడు నువ్వు నడిచే దారంతా మల్లెల్లు కావాలని , కోసుల దూరలైన నా కాళ్ళ లో కి నదులై ప్రవహించేవి ...!! అక్షరాలు నీలోంచి నడిచి ప్రపంచపు పటము లో గుర్తులైనపుడు , విను వీధి లో నీ పేరు నలు దిశల మొగుతున్నప్పుడు నేను విహంగాన్ని ...ఆకాశమంతా చుట్టి వచ్చాను !!!.. నా నుంచి విడిపోయి మరొకరి గుండె లో నువ్వు నివసిస్తున్నప్పుడు కూడా ప్రేమ నే తాగాను , నువ్వు పంచి ఇచ్చిన జ్ఞాపక అమృతం తో ...! నీ ప్రయాణం సాఫీ గా సాగాలని నా కల ల మేడలన్ని కూల్చేసి నీకు పునాది అయ్యాను ....!! కాని కన్నా ..!! ఎదిగి వచ్చిన నీ పెద్దరికం కంటి తుడుపు మాటల వలయం లో నేను గిల గిల కొట్టుకుంటున్నప్పుడు నువ్వే లోకమని భావించిన నాకు ఏమి కాకుండా దూరంగా నెట్టబడుతున్నాను !! రాత్రింబవళ్ళు నిద్రలని కొండ ఎక్కించి నిన్ను ఎవరికి అందనంత ఎత్తున కూర్చోబెట్టాను నీ నీడ ను కూడా నాలో కలుపుకొని కను రెప్పలు మూయక నా వీపు పై మోసాను కదా... నా మనసు లో సముద్రాన్ని ధారపోసినా కూడా, ...గుప్పెడు ప్రేమ ని బిక్షం గా వెయ్యలేకపోయావా బిడ్డ...!! నీ సుఖాల కోసం నేను రెక్కలు తెగిన పక్షి లా మారినా కూడా ఈ కన్న తండ్రి పై నీకు ప్రేమ కలగలేద కన్నయ ... నువ్వు ఆర్తి గా పిలిచే !!నాన్న !! పిలుపు కోసం ఈ కట్టే కాలే దాక ఎదురు చూస్తూనే ఉంటుంది మై సన్ ....!!! లవ్ యు .. జూన్ 05, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tLwPwA

Posted by Katta

Pratapreddy Kasula కవిత

ఉండాల్సిందే! - కాసుల ప్రతాపరెడ్డి ఒక పువ్వు నా వెంట నడుస్తుంటది కారడవిలో కారు చీకట్లో చూస్తే వికసిస్తది తాకితే తేనెలూరతది ఏమీ కోరదు ఏమీ ఇవ్వలేను కూడా చేతిలో ఫలాలు నోటికందవు మనం కననివాళ్లకూ, కన్నవాళ్లకూ పంచి పెట్టాం కదా! క్షమించు ప్రియా! మన్నించు త్యాగాన్ని మాత్రమే నేర్పినందుకు వసంతాలూ నందనవనాలూ ఇవ్వనందుకు దోసిలి పట్టాల్సి వచ్చే సరికి అలసిపోయావా? వద్దు తల్లీ! వద్దు!! కంచంలో ముద్దలు పెట్టుకునే వేళల్లో ఎవరెవరు వస్తారో, ఎంత మంది వస్తారో?! మరు జన్మ ఉన్నదో లేదో... ఆ జా సనమ్‌ మధుర్‌ చాందినీ మే హమ్‌ రా! కలిసే పోదాం!!

by Pratapreddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZ3Sj5

Posted by Katta

Arcube Kavi కవిత

వసంతాన్ని శపించుకున్న చెట్టు _________________________ఆర్క్యూబ్ ఎక్కడా నీళ్ళ సుక్క దలగక నెత్తికి చమురును నిషేదించుకున్న భాషా సౌలతి దొర్కక ఊహల హంసల రెక్కల్ని తెగ్గొట్టుకున్న కట్ల పువ్వు ఆకాశం కింద రాలిన ఈ నేల మోదుగ సిగల చెంద్రుడు చెదిరి పోయినంక అనాది ఆట పాటల్ని పాతరేసుకున్న చెమట చిందే కోండ్ర పదనకు పాకులాడుతంటే కన్న ఊరినే కాటగలుపుకున్న నువ్వెంత తపసు జెయ్యి నా కన్నీటి పాయల ఏ కగితప్పడవా కదలది ఎంత ఇకమతితో జేసినా - పడావు వడ్డ మొహంల పతంగి ఎగరది నేను- పురా మూలుగుల కంజెరను తరాల బువ్వ రాసుల కల్లాన్ని దూప దీర్చిన దొప్పను ఎర్రెర్రగ విచ్చుకుంటున్న మట్టిని దట్టించిన సోయిని నేను వసంతాన్ని శపించుకున్న చెట్టును గోగు పూత పట్టి మండుతున్న కొండను.

by Arcube Kavifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2jL0Q

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2jBqo

Posted by Katta

Si Ra కవిత

Si Ra// నిద్ర మాత్ర // 5-6-14 ఇదిగో, దీంట్లోనే ప్రపంచంలోని జోల పాటలన్నిటినీ బంధించారు. నిజం నుండి దూరంగా తీసుకెల్లిపోయే స్వప్నాలు విశ్వంలోని నిషబ్ధం , బిగ్-బేంగ్ కి ముందున్న చీకటి అంతా ఈ చిన్న బిల్లలో అనిచి పెట్టారు. ఇది తిని నీల్లు తాగు, నీ లొకం లో నల్లటి సూర్యుడు వుదయిస్తాడు, శబ్ధాలు ఒకొక్కటిగా చచ్చిపొతాయి. నీ ఒకొక్క ఇంద్రియం, ఒకొక్క దిక్కు లోకి విసరేయబడుతాయి. మెల్లగా కల్లుమూస్తావు. నీ చుట్టూ ఎన్ని మారనహోమాలు జరుగుతున్నా ఎన్ని తలలు తెగిపడుతున్నా, ఎంత రక్తం పారుతున్నా నువ్వు మాత్రం వులుకుపలుకు లెకుండా నిద్రపొతావ్. చుట్టూ యుద్దం జరుగుతున్నా, ప్రపంచమంతా నాశనం అవుతున్నా అత్యంత కిరాతకమైన ఘోరాలు జరుగుతున్నా, మానభంగాలు, హత్యలు, చిత్రహింసలు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా, ఎలాంటివాటికి చలించవు, కనీసం పట్టించుకొవు, చూస్తూ చూస్తూ నే నిద్రపోతావ్. నీకోసమే చెస్తున్నారు ఆ మాత్రని, సామ్రాజ్యవాదులు నిన్ను ఆక్రమించుకోవటానికి ఇంతకంటే గొప్పమార్గం ఉండదుగా, ఎలాగొ నీకు ఇలాంటివన్నీ పట్టవు దీన్ని మింగి, జీవచ్చవంలా చచ్చెదాక నిద్రపో.

by Si Rafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUUHse

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

!!మధ్య తరగతి జీవితం !! జీవితం అంటే ఏమిటో ఎవరిని అడగాలి కోట్ల ధనమున్నా కాస్త అయిన ప్రేమలేని జీవితాలా వున్న సంపద చాలక తోటి వాని ఎదుగుదల ఏడ్చే వారిదా నిష్ఠ దరిద్రుడను ధనం కోరుకునే బీద నా ప్రతి వాడి జీవితం లోను అసంతృప్తి ఏమి లేకపోయినా వున్నంతలో తృప్తి పడే మధ్యతరగతి మనిషి అంటే సమాజానికే లోకువ పల్లకీ ఎక్కాలని ఆశ వున్నా ఎక్కలేడు పల్లకీ మోయటానికి ముందుకు రాలేడు తనకు ఉన్నదాంట్లో సంతృప్తి పడగలడు లేని తనాన్ని ప్రేమ మాటలతో భార్యను ఒదార్చ గలడు ఎన్ని వున్నా ఏదో కావాలి అని వ్యామోహ పడే చిన్న మనసు వున్న పెద్దవాళ్ళకంటే ఎన్నో రెట్లు పెద్దవాడు మధ్యతరగతి వాడు నీ దగ్గర వున్నదాంతో తృప్తి చెందు లేనిదానికై ప్రాకులాడకు సర్దుకో అని మనసుకు సర్దిచేప్పుకోగల గొప్పవాడు మధ్యతరగతి వాడు లోపల బాధ వున్న చిరునవ్వు తో సంపూర్ణ జీవితం అనుభవించగలిగెది అతడే కదా ... !!పార్ధ !!05/6/14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kEskn4

Posted by Katta

Murali Vemuganti కవిత

మా గూనపెంకల ఇంట్లోకి మల్లె తీగ జారి వుండె వేపపూల జడేసుకుని గచ్చు మురిసిపోయేది ఎతైన అరుగులమీద పిల్లలు పుంజీతం ఆడుకునేది పందిరిగుంజలమీద గుమ్మడి ఆకులతోని దొండ పిందెలు ముచ్చట పెట్టుకుంటుండె కట్టెలపొయ్యిలనుంచి లేసినపొగ అమ్మదుఃఖంలో కలిసి జమిలిగ చూరు కింద దూరేది ఆవుల గిట్టలనుంచి రాలిన వడ్ల గింజలను ఏరుకుంట కోళ్ళమంద గుంపుగ కదిలేవి కనకాంబరం చెట్టుమీద ముద్దుగుమ్మలెక్క మంచుబిందువు తలతల లాడేది జంగిటిబడికి పోవుకుంట పశువులు దొడ్లకు తోకలతోని టాటా చెప్పి బయలుదేరేవి గూళ్ళనుండి గుడిమీదకి పిట్టలు వాలి గుసగుసలు పెట్టుకునేవి మడి బట్టలతోని బాపు పణతరం మీద పక్షిలా కూర్చుండి సుందరకాండ పారాయణం చేసేది ఆకాశంలో పొద్దుగూర్ఖా సూర్యుడు నెత్తిమీదికి చేరి గరంగరంగా మందలిస్తుండె సడకుమీద పచ్చగడ్డి మోస్తున్న కూలి అవ్వల తలపులనుండి పాట వెన్నెల మెరుపై తళుక్కుమనేది కాలం చీకటి గొంగట్లకు దూరిపొయ్యేది తాటిచాపలమీద పండుకొని చుక్కలపలకమీద అక్షరకలల్ని దిద్దుకునేది ఇప్పుడు చెత్తువోసిన ఇంట్లకు కట్లపాముకేబుల్ నల్లత్రాచునెట్ వైర్లు జంటగ దిగి నిద్రల్ని మాయం చేస్తున్నవి పందిరిగుంజలిరిగి పానం పట్నం వలసపోయింది వేముగంటి మురళీకృష్ణ

by Murali Vemugantifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jUUqWc

Posted by Katta

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -10!! !! పిచ్చి మనస్సు !! కాలం కదిలించింది కళ్ళలోని కన్నీటిని నా మది చేరిన నీ గుండె చప్పుళ్ళను గుర్తు చేస్తూ ఆశలకు అంతే లేకుండా పోయింది నువ్వు రావని తెలిసినా పిచ్చి మనస్సు ఉరకలు పెడుతుంది మది నిండ నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలను తవ్వి కళ్ళ ముందు కన్నీళ్ళుగా మార్చి గుర్తు చేస్తుంది పిచ్చి మనసు కన్నీటిలో తడిచిన అక్షరాలు కూడా నన్ను చూసి నవ్వుకుంటూ మసక బారుతున్నాయి నా ప్రేమకు ప్రేమించడమే తేలుసు నీ ప్రేమకు వంచించటమే తెలుసని నీ ప్రేమను వివరించే ఈ అక్షరాలు చెబుతున్నాయి !!అజయ్!! 05Jun14

by Ajay Pandufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5PZrR

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

చైతన్య దీప్తి ************ రావెల పురుషోత్తమ రావు గదంతా గబ్బిలాల గవులు వెలుగు కిరణం చొచ్చుకుపోయె వీలు మృగ్యం కిటకీలూ ద్వారబంధాలూ గవాక్షాలూ అన్నీ దశాబ్దాలుగా మూతబడి వున్నాయ్ ఇప్పుడు ఆగదికి ఊపిరాడడం లేదు నియమనిబంధనల పేరిట నిరామయమై నిలిచి పోయింది అది మా తతముత్తాతలనాటి నివాసం భావప్రకటనా స్వేచ్చకు బాహాటంగా పరిమితులున్న కాలం ఎక్కడివారక్కడ నినమ్రంగా జీవితాలు వెళ్ళదీసిన రోజులవి. ఇప్పటికి నాకు తెలివొచ్చింది ఒకరకంగా జ్ఞానోదయమయింది నాలో జిజ్ఞాసా మొదలయింది. అన్నిగదులకు భిన్నంగా ఆ గదొక్కటే చీకటి గుయ్యారంలాఎందుకుండాలని? అంతరంగ మధనం మొదలయింది. ఇప్పటికి నాకు తెలిసొచ్చింది ఒకరకంగా జ్ఞానోదయమయింది. వెంటనే నాలో ఒక మార్పు సంప్రదాయపు సంకెళ్ళను తెగగొట్టి భావప్రకటనా స్వేచ్చకు విలువిచ్చి గౌరవించాల న్న తపన ప్రారంభమయింది వెలుగు వెల్లువకు అడ్డుపడుతున్న అన్ని చీకటి తెరల శృంఖలాలను తెంచేసాను అన్ని అడ్డంకులకూ ఆ గదిని విముక్తనుగ చేసాను. ఇప్పుడా గదిలో వెన్నెల వరదలా ప్రవహిస్తుంది నేనెందుకు బూజు పట్టినభావాలతో కనుమరుగై పోవాలని ఆ గది వేసే ప్రశ్నలకి తగు జవాబివ్వాలని అనుకున్నాను అనుకున్నదే తడవుగా ఆచరణలోకి ఉపక్రమించాను వెల్లవేసిన గది ఇప్పుడు వెన్నెల స్రోతస్వినిలా గోచరిస్తుంది నిన్నటిదాకా చీకటికి స్థావరమైనిలిచిన గది నేడేమో చైతన్య దీప్తికి శిఖరాయమానమై గెలుస్తుంది ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^05-6-2014 *

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oYQVFY

Posted by Katta

Chi Chi కవిత

_SanE_ మానం మోడుబారిన చోట తోట మొలిచింది పూలిసరడానికి.. తను కాసిన పూలే ..తోటకైతే మొక్కలకే వేరు ప్రతి పువ్వూ !! >ఏమైంది పూలకాట్లు నేలకి గాలొస్తే మొక్కలనొదిలి తోట దాటి గాలికవే పోతుంటే ఈగలిసురుతున్నాయి పూజల్ని పూలకే పూలమీదే !! >ఐతే ఏ ఈగదేపువ్వో ఈగలన్నీ పువ్వుకే..పూలన్నీ ఈగకే తేనెలారిపోయాక పట్టంతా గాలికే !! >మానమేంటి మరి మొక్కలకీ లేదు .. తోటకీ లేదు పూలకీ లేదు.. గాలికీ లేదు ఈగకీ లేదు.. తేనెకీ లేదు > మరెక్కడుంది తోటంతా ఈగలని చోటునొదిలిన మాలిలో!!_____(5/6/14)

by Chi Chifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owXs75

Posted by Katta

Jagaddhatri Dhaathri Jagathi కవిత

జగద్ధాత్రి ||కూంబింగ్ || కూంబింగ్ ఇప్పుడు నన్ను నేనే పోల్చుకోలేక పోతున్నా ఎప్పుడూ ఇంతేనా , కాదు ఇప్పుడే ఈ మధ్యే ఒక శతాబ్దం గా , కొన్ని దశాబ్దాలుగా నన్ను నేను ఆనవాలు కట్టలేక పోతున్నా ఎందుకో మరి నేనెక్కడున్నానో కూడా చెప్పలేకపోతున్నా నవ్వుల లోకం నా చిరునామాగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఆ చిరునామా మాయామయి పోయింది ఎప్పటికీ చెరగనిదనుకున్నా చెరిగిపోయిన నా చిరునవ్వులా అనురాగం నా ఇంటి పేరు అన్నదే నాకు జ్ఞాపకం ఇప్పుడు అణు విస్ఫోటన భీకర శబ్దమే వినిపిస్తోంది ఎప్పటికీ పగలదని నే భ్రమించినా చెరిపేస్తూ భళ్లుమన్న నా హృదిలా మాటల కోటలు కాకున్నా నాది ప్రేమాన్వితంగా ఉన్న గూడు ఇప్పుడు బీటలు వారి ఆగ్రహావేశాల శిధిలమైపోయింది రూపూ , రేఖా , అందం , ఆత్మీయతా లేని ఒట్టి శకలాలు మాత్రమే కంటికి ఆనుతున్నాయి పదిలంగా ఉంటుందని నే నెప్పుడూ పాడుకునే నా పాటను అబద్ధం చేస్తూ చేతల్లోకి అనువదించే సహానుభూతి తప్ప ఇప్పుడు నన్ను మండిస్తోన్న ఈ ద్వేషాగ్ని కీల నేనెన్నడూ ఎరగనిది , ఎదురు చూడనిది మంచితనపు నా చిరునవ్వులు ఆప్యాయతా అలలతో నిండుగా అలరారిన నా చక్కని లోకం ఇప్పుడు ఎక్కడ ఉందో పట్టుకోలేకపోతున్నా రక్త బంధాలకు తలవంచి ప్రేమ బంధాలకు తల ఒగ్గి మర్యాదగా బ్రతికిన బ్రతుకు చిరునామా ఇప్పుడు గల్లంతయిపోయింది ఎవరి నడిగితే చెప్తారు నా చిరునామా వెక్కిరిస్తారు గానీ నా చిరునామా నేనే వెదుక్కోవాలి లోపలి జ్ఞాపకాల నుంచో బయటి పరిస్థితులనుంచో నా చుట్టూ ఉన్నవారి మాటలనుంచో ఎలాగోలా చిన్న వివరమైనా సంపాదిస్తే మళ్ళీ తిరిగి ఆ చోటుకే వెళ్లిపోదామని ఆశగా ఉంది , ఆబగా ఉంది అక్కడే రాసి పోవాలనుంది వీలైతే నా చిరునవ్వు సంతకం చేసిన వీలునామాని వీడ్కోలు పలుకుతూ అందరికీ వదిలి వెళ్లాలనుంది దిశా హీనతనుండి , అలౌకిక ఊర్ధ్వతలోకి నన్ను నేను పట్టుకునే గాలింపు చర్య ఇక మొదలైంది , ఈ క్షణమే. ..............................................జగద్ధాత్రి 3.25 పి ఏం 6/5/2014 గురువారం

by Jagaddhatri Dhaathri Jagathifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kx7yXs

Posted by Katta

Laxman Swamy Simhachalam కవితby Laxman Swamy Simhachalamfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kx7tmD

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| జై తెలంగాణ సిరుల గిరుల కోన || జై తెలంగాణ - సిరుల గిరులకోన - జై తెలంగాణ - నదుల నిధులసీమ వడివడిగా ఎదగాలి కలలన్ని నెరవేర - సకల జనులు మెచ్చేలా మా తెలంగాణ ! గలగల మంజీర పెన్‌గంగ ప్రాణహిత- ఇంద్రావతినాట్యాన జూరాల తుంగభద్ర కిన్నెరసాని హొయలై ఉరకెత్తే గోదారై, - పాలేరుతొ మున్నేరుగా కృష్ణవేణి పరవళ్ళై ! శాతవాహన కాకతీయ బహమనీ కుతుబ్‌షాహీ - రాజ్యమేలిన నేలరా! వీరులకు పుట్టిల్లురా! కవులకు కాణాచిరా నా తెలంగాణ - జానపద కళల నెలవురా నా తెలంగాణ నల్లమల గిరుల లోయల సహజీవనాలు - పాపికొండల రమణీయ దృశ్యాలు నల్లపసిడికి సింగరేణి నేల కొలువు - శైవ, వైష్ణవ బౌద్ధ జైనాల ఆనవాలురా! చారిత్రిక సురవరం - సదాశివ సంగీతం - అచ్చ తెలుగు పాలకురికి సోముడు హలం పట్టిన భాగవతకవి పోతన - పల్లెపదాల హనుమంతు సుద్దులు ఆడుబిడ్డల బతుకమ్మలాటతో - బంజారడప్పుల రంగేళి హోలిరా ఆదివాసీకూనలలరారు తల్లిరా - రేలపాటలతొ పులకించు నేలరా ఏ యోధుని కదిపినా చాలు - బందగీ ఐలమ్మ త్యాగాల కతలు నైజాము నెదిరించి సాగినా సమరం - ఒగ్గుకథలాగ కదలాడు కనువిందు కాలాలు గడిచినా మారని బతుకుల - నీటి మూటల గత నేత చేతలు అరువదేండ్ల పట్టుదల సాక్షిగా - రాష్ట్రమై తెలంగాణ అవతరించెరా! నీటమునిగే ఆటపాటల నేల - సంకటాల బారిపడకుండ గిరిపుత్రుల సంప్రదాయ గురుతులు - పదిలింగా నిలిచేలా పథకాల మార్పుతో పరిసరాలు పరిమళించ - కాకుల తరిమి గద్దల మేపే లోక కంటక పద్ధతులాపి పోలవరం పేర జనపదం నీటిపాలు కాకుండ - అనవతరం పచ్చదనపు పంట సిరులవాన కురిసేలా గతకాలపు నష్టాలను దోషపు చట్టాలను - సవరించుకు ముందుకు సాగేందుకు ఆశలు, తీరేలా విరామమెరుగక - అనునిత్యం పోరాడుట తెలంగాణ ఆన! అమరుల త్యాగాలు మనమున నిడుకొని - బడుగుల బతుకువీణ కొత్తరాగాలెత్త చేయి చేయి కలిపి చేవతనమూచూపి - నిర్మించుకుందాము మనదైన తెలంగాణ! 01.06.2014/5.6.2014

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mdCCqQ

Posted by Katta

Gubbala Srinivas కవిత

శ్రీనివాస్/దీపంబుడ్డి ------------- వెలుగుశత్రువును సాగనంపుతూ తననితాను వెలిగించుకుంటా ది లోకానికింత కాంతినిస్తూ దీపంబుడ్డి. తాతా,అవ్వల తోడూ నీడ చీకటి కనులకు వెలుగురేఖ ఆ చిన్ని దీపంబుడ్డి. ఎన్ని సంతోషాలను,ఎన్ని దుఖ్హాలను తనలో దాచుకుందో..! కొడిఆరని ఆ చిరుదీపం. తైలం తాగినకొద్దీ నిలువ కాగాడాలా నుంచుంది జనులకు వెలుగు దాహం నింపుతూ. నాన్న సర్కారీ కొలువు పొందటానికి అమ్మ సంసారం తీర్చి దిద్దటానికి దీపం ఋణం తీర్చుకోలేనిది. పొలమెళ్లి వడ్లబస్తాలు తెచ్చినా అలసి వాకిట్లో ఆదమరచి నిద్రించినా కలిసిపోయింది మాలో ఒకరిగా. గాలివీచి తనని ఆర్పిన ప్రతిసారీ వెలిగించే నిప్పుకత్తికి తన మెడను అందిస్తూనేవుంది. నేడు విద్యుత్ దీపాలు వెలిగి దీపాన్ని మూలన పడేసినా మౌనంగా ప్రకాశిస్తూనేవుంది మా ఇంట్లో ! (ఇప్పటికీ మా ఇంట్లో కిరసనాయిల్ దీపం వెలిగించుకుంటాం )#5-6-14#

by Gubbala Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mdCCqH

Posted by Katta

Shravan Kumar Raktani కవిత

Amara Veerula Keerthi Sthupam, Warangal

by Shravan Kumar Raktanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mdwWgu

Posted by Katta

Shravan Kumar Raktani కవిత

My 2nd poetry book "Tholi Poddu" released on 2nd June early hrs at Amara Veerula Keerthi Sthupam in Warangal in Telangana formation day Celebrations

by Shravan Kumar Raktanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mdwYF0

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

//JUDGEMENT// కులమేదని అడగడం అనాగరికం ఒకనాడు ప్రాంత మేదనడం అనివార్యం ఈనాడు దేశమంతా మనదే నన్నది పాత పాట నువ్వు పుట్టిన చోటే నీదన్నది నేటి మాట పరీక్షల పరుగులో నెగ్గి రావడం పాపమట వెనక బడిన వాడికే ట్రోఫీ న్యాయమట పాలకుల అన్యాయలకిది పరిహారమట ఇది ఒప్పందం తప్పిన పెద్దల శిక్షట ప్రైవేటు, వాణిజ్య వర్గం పరిధి కాదట రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకే భేదమట నాటి సర్కారీ కొలువుల కేటాయింపు తప్పట విద్య నేర్చిన చోటుకే వారి బదిలీ తప్పనిసరట పొరుగు రాష్ట్రం వారు సోదరులట తోటి తెలుగు వారే పగ వారట వారు స్వస్థలాలకు పొతే చాలట కన్నుకు కన్ను కొత్త రాజు తీర్పట జాతి, మత, కుల వివక్ష మొన్నటి కధ ప్రాంతీయ వివక్ష సరి కొత్త నేటి కధ

by Gouri Lakshmi Allurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oehBk0

Posted by Katta

Sky Baaba కవిత

ఈద్ కా చాంద్ - - - - - - - - చీకటి గుండం లా నువ్వు ఎదురుపడ్డప్పుడల్లా నీ కనుపాపల్లో నా ప్రతిబింబాల్ని తప్ప ఏం ఏరుకోగలిగాననీ... అంతా రంజాన్ కోసం ఎందుకు ఎదురుచూస్తారో గాని నేను మాత్రం నిన్ను చూడొచ్చనే ఆశతోనే... 'అస్సలామలైకుమ్' తో నువ్వు శిర్ ఖుర్మా అందిస్తుంటే జిగేల్ మన్న తారల మధ్య ఆ చాందే నా దిక్కు వొంగినట్లు... ఒఫ్ఫో... సంవత్సరం పొడుగూతా రంజానే అయితే ఎంత బాగుండో... ప్చ్... నిన్ను అలాయిబలాయి తీసుకునే అవకాశమన్న ఉంటే నా దిల్ అలజడిని నీ గుండెలకు చేర్చేటోన్ని గదా...!

by Sky Baabafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1odYB5h

Posted by Katta

Satya NeelaHamsa కవిత

తీరం తో సంద్రం -సంద్రం తో తీరం : ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 5-6-2014 --సత్య తీరం తో సంద్రం: ఎన్ని సార్లు నన్ను నేను నిన్నుతాకి పోయినా అసలేమీ తెలియనట్టు జరగనైనా జరగవు అలల కలల తాకిడితో నిన్ను ముంచి వేసినా బండరాతి తీరానివి కరగనైనా కరగవు ఏడిపించకు నన్ను, కదిలించకు నా కోపాన్ని నీపై కైపే నా అలలు లేదంటే ఉప్పెన రూపాన్ని సంద్రం తో తీరం : అలకల అలలై తాకితే తట్టుకుంటాను నేను. కన్నీటి ఉప్పెనై దూకితే కరిగి పోతాను ! తనివితీరా నిన్ను, తట్టుకునే తీరాన్ని. అనుక్షణం నిన్నే చూస్తూ , నీలో కరిగే భారాన్ని !! ---సత్య

by Satya NeelaHamsafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j0ex5I

Posted by Katta

Aruna Naradabhatla కవిత

నిశ్శబ్దం ______________అరుణ నారదభట్ల నేనూ ...నా ఈ చిన్ని ప్రపంచం ప్రతి క్షణం కొత్త వేకువే జీవితం! అమ్మ కడుపులో తొమ్మిది నెలలూ మౌనంగానే లోలోపల మాటాడుకున్న పరుగెత్తే రక్తమాంసాలలో కూరుకుపోయి! అమ్మను మరణశయ్యదాకా మోసుకుపోయీ ఊపిరిపోసుకున్న...ప్రపంచానికి నా కాళ్ళనూ పరిచయం చేయాలని! తన ఒడిలో పాపగా ఉన్నపుడు లాలిగా జోల పాడి ప్రేమగా అలుముకున్న స్పర్శ ఇంకా వెన్నంటి నడిపిస్తూనే ఉంది! దోసిలిలో వొంపిన కలలు కడలి ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెలు! ఇంకా గంట మోగుతునే ఉంది ఎక్కడో జారిపోయిన డాల్ ఫిన్ చేపలా...ఆశ కాంతిని ఇనుమడించుకున్న దేహం వెనుక క్రీనీడలా కాలం ఎప్పుడూ మౌనమే వెంట నడుస్తున్నదెందుకో గాలి సోకని చెట్టులా! అప్పుడప్పుడూ కొండచెరియలూ విరిగిపడతాయి... చెట్టూ ఆకులు రాల్చేస్తుంది... తెల్లని మబ్బులూ మసకబారతాయి నేనూ అంతే....చిన్నిచిన్ని చినుకులను రాలుస్తుంటాను! అందుకే....టైం మిషిన్ ఉంటే బాగుండు మళ్ళీ అమ్మవొడిలోకే వొదిగి పోయేందుకు! 5-6-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Swajw9

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS ~ "ప్రపంచీకరణ నేపధ్యంలో సంబంధాలు, ప్రేమలూ, ఆర్ధికసంబంధాలు అవుతున్న స్థితిలో మనుషులు ఏకాకులుగా మిగులుతున్న నేపధ్యంలో జీవితాన్ని గురించి పాడటం [రాయడం] ఒక ఎత్తయితే, మనుషుల్ని కలపడం మరొక ఎత్తు. సామ్రాజ్యవాది, పెట్టుబడిదారుడు మనుషుల్ని విడదీస్తారు. కవి ,కవిత్వం మనుషుల్ని కలుపుతుంది. సంగమమే ఒక పండుగ .సంపద. ఇప్పుడు కవిత్వం నలుగురిని పోగేయడం, కలపడం, కలిసి పంచుకోవడం, ఆనందించడం, కలిసి మార్చ్ చేయడం,యుద్ధాలు చేయడం ." * "- మామూలు మాట కవిత్వం ఎట్లా అవుతుంది? మామూలు వాక్యం కవితాత్మకంగా ఎలా అవుతుంది ? మామూలు మాటని ఎలా తిప్పితే ,ఎలా కదిలిస్తే, కవిత్వమౌతుందో కవికి తెలియాలి ." * = కె.శివారెడ్డి ,ప్రసాదమూర్తి ' మాట్లాడుకోవాలి' ముందుమాట నుంచి [2007]

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hcZFFN

Posted by Katta

Padma Sreeram కవిత

రుధిర జాడలు....||పద్మా శ్రీరామ్|| నన్ను నేను ఏరుకుంటూ వస్తున్నా... నువ్వు విసిరేసిన జ్ఞాపకాల్లో... ఎంత చిత్రమో కదా ... నీ పరిచయమయ్యాక రుధిరాన్ని మరిచింది నా హృదయం.. నీవు మరిచిన పెళ్లి మంత్రాలనే వల్లిస్తూ .... రుధిరాక్షరాలుగా నా ఎద సవ్వళ్ళు నన్నే పొమ్మనొచ్చుగా.... నేనున్న గుండె గొంతు కోసేకంటే....అంటూ రుధిరం సైతం భారమేట ....నువ్వు లేని గుండెకు.. అయినా సరే నిన్ను వెన్నంటే వస్తున్నా...నీ ఎడద చిందిన రుధిరాన్నై నిన్నొదిలింది నేనే కానీ.... నా ఎడద కాదని నీకెప్పటికి తెలియాలో మనసుకు దప్పికట ... ఎన్ని కన్నీళ్ళు త్రాగినా అందుకేనా నా జ్ఞాపకాలు వీడని హృదయాన్ని మోయలేక.... ఇలా విసిరేస్తూ ఎంత తేలికైపోయిందో నా ఎడద.... నిను చేరగానే విసిరేస్తున్నావ్! రోదిస్తోంది ఎద నెత్తుటి కన్నీట జ్ఞాపకాలను స్రవిస్తూ చిత్రంగా ... మనసు మండుతోంది ... సంద్రంలో సేదతీర్చాలని.... ఈ హృదయం నాకెందుకు...నీ ప్రేమలో నిండా మునిగాక నువ్వు విడిచెళ్ళిన గుండె విసిరేస్తున్నా.... నాకు మాత్రం ఎందుకని!!! నవ్వులెన్ని పారేసుకున్నానో.... నువ్వు దొరికావ్.. ప్రేమకు పూజయ్యింది.... ఎదకు నిమజ్జనం మిగిల్చి 5 June 2014

by Padma Sreeramfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p8ogMl

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-50 వచ్చే జన్మ గురించి గాని గత జన్మ గురించి గాని తెలుసుకోవాలని మనిషికి ఎంత ఆసక్తి..! అసలు ఈ జన్మ గురించి అర్ధమైతే రెండు జన్మలూ అవగతమవుతాయి.. బ్యాటరీ లైట్ ఫోకస్ లా ఎంతసేపు బయటికే కాంతిని విరజిమ్మకుండా అప్పుడప్పుడు నీలోపలికి కూడా దాన్ని ప్రసరిస్తూ ఉండు.. అన్నీ అక్కడనే ఉన్నాయి...!!! ----------------------------------------------- 05-06-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tK2bni

Posted by Katta

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (మానసిక వైద్యం) సరిగ్గా పని చేయకపోతేనే అవయవాల విలువ తెలిసేది, కాళ్లయినా కళ్ళయినా గుండెయినా లివరైనా... తలకాయ సరిగ్గా పనిచేయకపోతే ఎవ్వడూ పట్టించుకో డెందుకు!

by Ravi Rangaraofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tK2b6Z

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

ఆకాశంలో చందమామ నక్షత్రాలు కనిపించేలా మబ్బుల్ని పారదోలుతూ ఉంది 5.6.2014

by Chandrasekhar Sgdfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nhTsrN

Posted by Katta

Mahesh Kathi కవిత

http://ift.tt/TdTF51

by Mahesh Kathifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvpTnL

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

Moon is drivinh away the cloudus for the exposer of the stars

by Chandrasekhar Sgdfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UdpueZ

Posted by Katta

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ వెదురు గాయం ॥ రాశి పోసావిన్ని పూలను కానీ నా కనులకు నెత్తురంటిన జేగురు చెమ్మ తగిలి గాయం రేగుతోంది పదాల మధ్య అతకని దారమేదో తెగుతూ నిశ్శబ్దాన్ని మెత్తగా కోస్తోంది ఆకులన్నీ రాలుతున్న చప్పుళ్ళ మధ్య ఒకింత ఖాళీ ఏర్పడి గాలి ఊసులేవొ గుసగుసగా రాతి పొరలమధ్య నీ ఉలికి చెందని శిల్పమేదో ఆవిష్కృతమవుతోంది నెమ్మదిగా ఈ మట్టి వేళ్ళ మధ్య పారే నీటిని దోసిలితో పట్టి గాయపడ్డ ఈ వెదురు గొంతులో ఒంపి పాటగా సాగిపో..

by Kumar Varma K Kfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1xa8mWr

Posted by Katta

Jagadish Yamijala కవిత

మరో కప్పు టీ తాగుదాం ------------------------------- బహుదూరమే పయనించాం ఓ టీ కోసం ఈ చోటు అందుకోసమే రూపొందినట్టు నువ్వు విప్పారిన మోముతో మైమరచి టీ తాగుతున్నప్పుడు నేను నీ భుజాన పడి వ్యాపించే బంగారు ఎండను సేవిస్తున్నాను నీ చెవి రింగులలో చల్లదనాన్ని పుట్టింఛి నృత్యం చేయించే గాలిని సేవిస్తున్నాను నీ శ్వాసలో కదిలే వర్ణాలను సేవిస్తున్నాను నిన్ను స్పర్శించే వెదురు చెట్టు నీడను సేవిస్తున్నాను నీ కాళ్ళను తడి చేసే మంచుబిందువుల రసాన్ని సేవిస్తున్నాను ఆకులు రాలే కాలంలోని చందమామ మరొక టీ కప్పులా తచ్చాడుతున్నాడు ఇప్పుడు మనం తిరిగిపోలేము మరో కప్పు టీ తాగుదాం - తమిళంలో మిత్రుడు పళనిభారతి రాసిన మాటలు అనుసృజన - యామిజాల జగదీశ్ ---------------------------------- 5.6.2014 ----------------------------------

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owf8je

Posted by Katta

Si Ra కవిత

Documenting 20th century history through poetry. Here is the blog where I will be posting translations of various poets in a historical order. The first post is about Armenian Genocide. http://ift.tt/1kuB1Bs

by Si Rafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kuB1Bs

Posted by Katta