పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఏప్రిల్ 2014, సోమవారం

Sriramoju Haragopal కవిత

రెండు జాముల రాత్రి అది వరకు అన్ని బాగానే వుండె తప్పిపోయిన పిల్లవానిలెక్క ఇపుడిదేం బాధ మొసదిప్పుకోనియ్యకుండ మోక జూసుకుని ఈ మోటకొట్టే దుఃఖాలేంది? యాదికి రాంగనె బిరాన ఉరుకులాడె గోసెందుకు ఎవరో రాక ముందే పరిచిన రోడ్డులెక్క ఎదురుచూపులేంది? నాకున్నదేంది బతుకంతా నేసుకున్న పాటలగొంగడి వానకు, ఎండకు, చలికి గుండె ఒలికిన దుక్కాల మీద కొప్పెర, పత్తికాయలెక్క గుండెపగిలి పాడిన పదంతోటి ముచ్చట తిప్పతీగ తొక్కినట్టు తిరుగుడె నీ జాడపట్టి మేక నములని ఆకు లెక్క ఒక్కణ్ణే మిగిలిపోతి కానుగుపూల గుమ్మువాసనల చీకట్లో యాదిపారే పిల్లకాలువ పాము ఈత వాడకట్లు తిరిగే రాత్రికి తోడు చిమ్మెట్ల శ్రుతి అరుగుమీద వెన్నెల కప్పుకుని నేను గునిసే శ్వాసలతో గూనిరాగాలు నిద్రకాచి గోరుకోళ్ళు కోడికూతలై పిలుస్తయి తడిక తీసుకుని నువ్వెళ్ళి పోయినట్లు అడుగుల సప్పుడు....

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h6vaPK

Posted by Katta

Chi Chi కవిత

_ఆగర్భం_ మమ్మీ..మమ్మీ వీడెవడో నన్నడగకుండా నన్ను నీకిస్తున్నాడు sorry..ఇంకా ఇవ్వలేదు..ఇచ్చేసేలా ఉన్నాడు ఇస్తున్నాడు ఇయట్లేదు..ఇస్తున్నాడు ఇయట్లేదు అసలేం చేస్తున్నాడీడు నువ్వేం చేస్తున్నావ్ అసలు నాకేం అర్థం కాట్లా మధ్యలో మీ అరుపులేందో!! లోకం కనిపించింది కనిపించట్లా కనిపించింది కనిపించట్లా నాకక్కర్లా!! ఎచూస్మీ..హెలో..తొయకండీ ఓహ్..లేడీస్ aka డాటర్స్ ఇక్కడ మీకు స్పెషల్ కోటాలెం లేవ్ కావాలంటే మీరే పొండి లోకంలోకి ఇక్కడ్నుంచే లేడీస్ ఫస్ట్ అనుకోడం బెటర్ ఏమో!! తు ప్రకృతెంత వికృతంగా ఉందిక్కడ ..కంపు లోకంలోకి పోవడమే బెటరేమో అర్రే అర్రే అర్రే చ system shutdown అయిపొయింది next time ఎవరడ్డమొచ్చినా ఆగేది లేదు ఈడెవడో చచ్చే వరకు నా బతుకింతే ఇలా గర్భం దొరకని గబ్బుకొడుకుగా మిగిలిపోవాల్సిందే atleast వీడి చెయ్యి దొరికినా చాలు చేత వెన్న ముద్దనై వీడి చండాలాలనొదిలించుకుంటా!! ____________________________(21/4/14)

by Chi Chifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i7rYVC

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

చుట్టం...!? ఓటునడగ వచ్చినోడు పండగకొచ్చిన చుట్టం తిని పోవడమే గాని గుర్తించడు నీ కష్టం.

by Kanneganti Venkatiahfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i72Bn3

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -7 ----------------------------------------- పంచభూతాలు - దహన దృశ్యాలు - - - - -- - - - - - - - - - - - - - - - - - - - దేవిప్రియ మోడువారిన చెట్టు చిటారు కొమ్మన చిగురించిన ఒక ఆకు కిటికీలోంచి చూపించి కదా ఏమైనా రాయమన్నావు నువ్వు... ఇదిగో చూడు తలుపులు బార్లా తెరుస్తున్నాను... భూమీ, నీరు, ఆకాశమూ, గాలీ, నిప్పూ కూడా ఒకేసారి భగభగ మండుతూ తగలబడిపోతున్న దృశ్యాలు చూడు... భూమి కంపించి నెర్రెలు బారిన గుజరాతు నాగటి చాళ్ళలో మొలిచిన బారెడేసి కరవాలాల మీద కుండపోతగా కురుస్తున్న మనిషి రక్తం చూడు నినాదాలు ఏవైతేనేమి, వివాదాలు ఏవైతేనేమి, పచ్చి నెత్తురే కావాలనే కక్షుద్ర దేవతలు, మతోన్మత్త మత్తేభాల మీద విచ్చుకత్తులు ధరించి ఊరేగుతున్న పాశవిక ఉత్సవాన్ని చూడు... చెలరేగుతున్న ఎడారిగాలుల హోరు చూసి తడారిపోయిన గొంతుతో తల్లడిల్లుతున్న ఆమె ప్రాణాల అవస్థ చూడు... రక్తపు టేరుల్లో నెత్తుటి జండాలు ఎగరేసుకుంటూ తరలిపోతున్న పరిహాస ప్రజాస్వామ్యపు పడవల్ని చూడు కలలు గన్న ఘటనలు నిజమవుతున్న క్షణాలను కన్నుల పండుగగా ఆనందిస్తున్న అత్యాధునిక నియంతల్ని చూడు... కాసేపు జెండాలను మరిచిపోయి కాసేపు నాయకుల ముఖాలు మరిచిపోయి కళ్ళు మూసుకుని చూడు... అంతా రక్తం కాలి పైకెగసిన పొగ అంతా రక్తమాంసాల దుర్గంధం ఇళ్ళ గోడల మీద విద్వేషం ఇనుపగోళ్ళతో గీకిన అస్తిపంజరాల చిత్ర రచన... కళ్ళు తెరిచినా కనిపించే దృశ్యం ఇదే పాలరాతి మహళ్ళలో, చలువరాతి మందిరాలలో తేదీలు తప్ప ఏమీ మారవు... జీతగాళ్ళ, కూలి వాళ్ళ గూళ్ళలో, గుడారాలలోనే దృశ్యాలు మారిపోతాయి ఓట్లు వారికి పదిలమే కోట్లు వారికి పదిలమే... సిగ్గుతో తలవంచుకున్న దేశం సిగ్గుతో తలదించుకున్న మేధావులు సిగ్గులేని రాజకీయాల బరితెగింపు! మోడువారిన చెట్టు చిటారు కొమ్మ మీద చిగురించిన ఒక ఆకుని కిటికీలోంచి చూపించి కదా ఏమైనా రాయమన్నావు నువ్వు... ఏదీ, ఎక్కడ ఆ ఆకు? (AZAAN -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baabafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUlsRB

Posted by Katta

Vani Koratamaddi కవిత

//నగర జీవితం// కనిపించే ఆకాస హర్మాలు కనిపించని ప్రకృతి అందాలు ఆస్వాదించలేని సహజ వాతావరణం కలుషితమైన జీవన విధానం నాలుగు గోడలమద్యే జీవనం కుత్రిమ వెలుగులే అధారం మానవుల అతి ఆలోచనలే ప్రకృతి ఆగ్రహాలు దోచుకోబడుతున్న ప్రకృతి సంపదలు దాడులు ఎదుర్కొంటున్న సామాన్యులు భద్రత కరువైన జీవితాలు భయం నీడలో బ్రతుకులు మృగాళ్ళుగా మారుతున్న మగవాళ్ళు అమ్మాయిలపై అకృత్యాలు ముళ్ళబాటలా నగర జీవితం మరుగైపోయిన మానవత్వం ......వాణి కొరటమద్ది 21/4/2014

by Vani Koratamaddifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUfaBp

Posted by Katta

Kapila Ramkumar కవిత

అసమ సమాజంపై అక్షరాయుధం andhra prabha - Mon, 21 Apr 2014, IST ఆర్టిస్టువు కావాలన్నా, సైంటిస్టువు కావాలన్నా ముందు నువ్వు కమ్యూనిస్టువి కావాలి’’ ఇవి మహాకవి శ్రీశ్రీ అన్నమాటలు. ఈ మాటలు విని కమ్యూనిజంపై దృష్టిపెట్టి. విద్యార్థి సంఘాల్లో చేరి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నవాడు మువ్వా శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు మాటలు మువ్వా శ్రీనివాసరావుని ప్రేరేపించాయి. అలాగే కవిత్వం మీద ప్రేమ శ్రీశ్రీని చదివించింది. కవులలో సాన్నిహిత్యమూ పెరిగింది. చుట్టూ కవిత్వ వాతావరణం అలుముకుంది. సమాజం పట్ల, సమాజంలోని అవకతవకల పట్లా అవగాహనా ఉంది. భాష పట్ల కొంత పట్టు అబ్బింది. ఇన్ని ఉన్నాక కవి కాకుండా ఉం టాడా! అందుకే మువ్వా శ్రీనివాసరావు కవి కాగలిగాడు. కవి కావటమే కాదు మంచి కవిగా ఎదిగాడు. రాసిన కవితలన్నింటిని కూర్చి “సమాంతర ఛాయలు’ పేరుతో కవితా సంపుటిని తీసుకొచ్చాడు మువ్వా. ఈ కృషి వెనుక సీతారాం ప్రోత్సాహం ఉందని ముందే చెప్పుకున్నాడు. సరే అది అలా ఉంచితే ఈ కవిత్వంలో ఏముందని లోపలికెళితే మొదటి కవిత ఒక పోరాట చరిత్రను విశిదీకరిస్తుంది. “”1975 --ఓ పోరాట గాథ’’ మావూరి మర్రి చెట్టుమీద/ అర్ధరాత్రి /మందారం పూసిందని/ ఖాకీలు కాలువల్లా ప్రవహించాయి/ తుపాకీ గొట్టాలు/ తూరుపు మొక్కల్ని పసిగట్టాయి/ తెల్లవార్లు/ లాఠీలూ ఎముకలు/ మాట్లాడుకుంటూనే ఉన్నాయి. ఈ కవిత ఎమర్జెన్సీ గురించి, ఆనాటి ఘోర దృశ్యాలను కళ్ళకు కడుతుంది. పోరాటాలను లాఠీలతో, తూటాలతో అణిచివేయాలనుకుంటే అంతకంటే ఎక్కువ ఉధృతితో ఉద్యమాలు పుట్టుకొస్తాయని చరిత్ర నేర్పిన పాఠం. ఇదే కవితలో ఆ రోజు నెనెప్పటికీ మరిచిపోలేను/ హఠాత్తుగా ఎదురైన బియ్యాబానీ/ సకల జీవుల్ని తాకి పలకరించే / శిరిడీ సాయిలా / కాలందింపిన ఏసుక్రీస్తులా/ అందరిలానే నన్ను చూసి/ నేనెవరో తెలియనట్లు తప్పుకున్నాడు/ చుట్టూ మూగిన చిన్నపిల్లలతో/ సమావేశం పెట్టి/ చిట్టీలు పంచుకున్నాడు/ ఎమర్జెన్సీ/ మా వూరికిచ్చిన బహుమతి/ బియ్యగానీ సాక్షిగా / ఇప్పుడు మావూరినిండా /మందారాలు విరగబూస్తున్నాయి అని ముగిస్తాడు. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ఉద్భవిస్తారని అన్న సోమసుందర్‌ వాక్యం గుర్తొస్తోంది. మావూరి మర్రి చెట్టుమీద అర్ధరాత్రి మందారం పూసిందని ఈ కవితను మొదలుపెట్టడం -చివరలో ఇప్పుడు మావూరి నిండా మందారాలు విరగబూస్తున్నాయని ముగించడం సోమసుందర్‌ వాక్యానికి సరిగ్గా సరిపోయేదే. కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్న కవి నుండి రావాల్సిన వాక్యాలే వచ్చాయి. పోరాటాన్ని విధ్వంసపూరిత ఘట్టాల్ని రాయకుండా ఉండలేడు. అదే మనం మువ్వాశ్రీనివాసరావు లోనూ చూస్తాం. అలాగే దళితులపై జరిగిన పైశాచిక మారణకాండను గుండెకెత్తుకున్నాడు కవి. మొన్న అచ్చంపేటను అచ్చంగా తొక్కిపెట్టి/ నిన్న కారంచేడును చుండూరు/ గుండెలు గాయం చేసిన /ఆ గడి /ఇవ్వాళ లక్సెట్టిపేటలో కన్ను తెరిచింది/ గడీలకు గడియలేస్తే / గంగలో కలిసి పోయాయనుకున్నా/ మారువేషాలేసుకొని మన మన మధ్య తిరుగుతున్నాయని ఈ మధ్యే తెలిసిందంటాడు. బలవంతులు బలహీనులపై సాగించే దురాగతాలు ఎన్నో. శ్రీశ్రీ నుండి ప్రేరణ పొందినవాడు కాబట్టి బలహీనుల పక్షం వహించడం సహజమే కదా! ఈ కవిలో ఒక ఆవేశం, ధర్మాగ్రహం నిండుగా ఉన్నాయి. మరో కవితలో ఎరుపు తెరిపి లేకుండా కురిసే రోజు కోసం/ శాంతి కరువు లేకుండా విరిసే రోజు కోసం/వెతలతో రణాలుకట్టి వేచిచూస్తూనే ఉన్నాం అంటాడు. “క్రాంతి’ శీర్షికతో రాసిన కవితలో ఎంతచిక్కని/ అమావాస్య చీకటి అయినా/ బాలభానుని /లేతకిరణము ఓడిపోక తప్పదులే/ ఎత్తునుండి పడిపోతున్నా/ నీళ్ళుకూడా నిప్పును రాజేస్తుంటాయి/ మొదలు చివరా/ నరికినా సరే/ పందిరికి పెట్టిన/ సిరిమాను గుంజలు/ చిగురులువేస్తూనే ఉంటుంటాయి/ రాక్షస బల్లులు పోయినట్లు/ రాకాసి మనుషులు పోతారు. అంటూనే సమాజంలోని దుర్గంధాలన్నింటినీ కాలప్రవాహంలో కడిగేసుకుంటూనే ఉంటుంది. అవసరమైనప్పుడల్లా నిశ్శబ్దం పగిలి గమనాన్ని నిరంతరం చేస్తూనే ఉంటుంది. నిర్నిరోధంగా క్రాంతి అడుగులు వేస్తూనే ఉంటుందని చెపుతాడు. ఇది సమాజంలో జరిగే అన్యాయాలపై యుద్ధం ప్రకటించడమే. మువ్వా శ్రీనివాసరావు ఆసమ సమాజపు పోకడలపై అక్షరాయుధాన్ని ఎక్కుపెట్టాడని సందేహం లేకుండా చెప్పవచ్చు. ఇందులో మొత్తం 93 కవితలున్నాయి. ఇవి మువ్వా శ్రీనివాసరావుని, అతని ఆలోచనల్ని ఆవిష్కరించాయి. ఈ పుస్తకానికి ముందు మాట మువ్వాదే ఉంది. ప్రత్యేకంగా ఈ పుస్తకంలో అఫ్సర్‌, అరుణసాగర్‌, కవి యాకూబ్‌, ప్రసేన్‌, ఆనందాచారి, బి.వి.వి.ప్రసాద్‌, ఖాదర్‌ మొహిద్దీన్‌, సీతారాంలు వెనుక మాటలందించారు. ఏది ఏమైనా ఒక మంచి ప్రయత్నంగా మువ్వా శ్రీనివాసరావును అభినందించాలి. పేజీలు: 276, వెల: 200 రూపాయలు, ప్రతులకు: మువ్వా శ్రీనివాసరావు, ఫ్లాట్‌ నెం.103, శ్రీజన అపార్ట్‌మెంట్స్‌, స్ట్రీట్‌ నెం.1, బ్యాంక్‌ కాలనీ, ఖమ్మం మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం.http://ift.tt/1h4cBM1

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h4cBM1

Posted by Katta

Kapila Ramkumar కవిత

కవిస్వరం: నాగరాజు కవిత: నాగరాజు వాడిన ప్రతీకలు కవితకు సాంద్రతను చేకూర్చి పెట్టాయి. "ఆదిలో ఆమె నిడుపాటి వేలి కొసలను/ తనకలుగా కత్తిరించి నీటిలో పదిలినప్పుడు" అంటూ "ఒక్కొక్కటీ ఒక్కో చేపగా మారి/ సన్నని జీరలుగా ఎరుపిపింకిపోతూ అల్లిబిల్లి కదలికలతో కలసి ఆడుతుండేవి" అవే చేపలుగా మారాయని నాగరాజు అంటున్నాడు. ఆమె వేలి కొసల రూపం, చేప రూపాన్ని తలపిస్తుంది. చేపట కదిలికను కూడా అల్లిబిల్లి అంటూ వ్యక్తీకరించాడు. సృష్టి పుట్టుకలో వేదన ఉందని కూడా చెబుతాడు. నెత్తురు కలగలసిన భయంకరమైన బాధే అయినా తన దేహంలో దేహమే కదా/మాలిమితో కూడిన ప్రేమ కదా అని అంటూ అందులోని ప్రేమ భావనను కూడా వ్యక్తీకరించాడు. మొత్తంగా, స్త్రీ సృష్టి ఆవిర్భావానికి పడే తపనను, వేదనను కవి తన కవితలో వ్యక్తీకరించాడు. - కాసుల ప్రతాపరెడ్డి చేపలు ఆదిలో ఆమె నిడుపాటి వేలి కొసలను తునకలుగా కత్తిరించి నీటిలో వదిలినప్పుడు ఒక్కొక్కటీ ఒక్కో చిన్ని చేపగా మారి సన్నని జీరలుగా ఎరుపింకిపోతూ అల్లిబిల్లి కదలికలతో కలసి ఆడుతుండేవి నెత్తురు కలగలసిన భయంకరమైన బాధే అయినా తన దేహంలో దేహమే కదా మాలిమితో కూడిన ప్రేమ కదా ఏమి పేరు పెడదాం వీటికీ? అని ఆమె అనుకుంటుంది చుట్టూ ఇసుక తుఫానులాంటి నల్లని పరదాలు కమ్ముకొస్తున్న జాములలో తనతో తాను మాటాడుకుంటున్నంటుగా ఖండితమయి మోడువారిన చిన్ని కొమ్మల్లాంటి తన వేళ్ళను చూసుకుంటూ ఇవి భయం, పాపం, దేవుడు, శాపం, చావు - తను ఇంకెవరితోనో మరో స్త్రీతో, ఒక స్త్రీ మరొక స్త్రీ మాత్రమే చెప్పగలిగినంత లోగొంతుకతో ఒక మంంత్రోచ్చారణలా భాషిస్తూ వాటిని దోసిళ్ళలోనికెత్తుకొని తన ఉమ్మనీటిలో పొదువుకొంటుంది నెత్తుటి ప్రవాహ గతిలో ప్రాణవాయువును కొద్దికొద్దిగా తోడి ఒక్కో గుక్కా పాలులా పట్టిస్తుంది చేపలు పెరుగుతాయి పెరిగి పెరిగి పెరగడమే తమ వ్యాపకమై విలయంలాగా మరణ సదృశమైన మహా ఆక్రమణలాగా అవి పెరుగుతాయి ముందుగావాటిని ఆమె చిన్ని తొట్టిలో ఉంచుతుంది ఆ తరువాత ఒక వాగులో ఆ తరువాత నదిలో అంతకంతకూ పెరుగుతున్న ఆ చేపలు ఏ రోజుకారోజు తమ చోటు ఎక్కడాని అడుగుతూనే ఉంటాయి చివరకు ఒకింత విసుగుతో సన్నగ కంపితమవుతున్న దేహముతో ఆమె అంటుంది కదా ఇదిగో ఆకాశమయి విస్తరించి సముద్రపు లోతులుగా తొణకిసలాడే ఈ దేహపు గూడు ఇక వచ్చి చేరండి - అనాది గాధను నిదురలేపే డగ్గుత్తికతో ఒక స్త్రీ తనలాంటి మరొకరితో వెతుకులాటులో తడబడుతూ మోకరిల్లే శరణు కోరికలాగా పదే పదే భయం, పాపం, దేవుడు, శాపం, చావులను చెప్పడాన్నితొలిసారి విన్నప్పుడు నీ దేహంలో సన్నని ప్రకంపన Read more at: http://ift.tt/1h3EtQo

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3EtQo

Posted by Katta

Bolloju Baba కవిత

అతిశయం అన్ని నిర్ణయాలు ముందే అయిపోయాయి ఏదో కాలక్షేపానికి జీవించాలి అంతే! పుట్టినపుడు మతాన్ని బట్టి గ్రహాలు పైకీ క్రిందకూ మారతాయి కులాన్ని బట్టి తారలు అటూ ఇటూ సర్దుకొంటాయి కుటుంబాన్ని బట్టి రాశిచక్రం రూపుదిద్దుకొంటుంది కలహాలు, ప్రేమలు పోటీలు, పధకాలు అన్నీ మనది కాని ఏదో ప్రణాళికలో భాగాలే ఆఖర్న మరణం కూడా. అయినప్పటికీ ఓ మొగ్గ విరిసినా ఓ తుమ్మెద వాలినా ఓ డొలక రాలినా ఈ చెట్టుకెంత తహ తహ! వెలుగుని బంధించాననుకొనే ఈ పత్రాలదెంత అతిశయం! బొల్లోజు బాబా

by Bolloju Babafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lsfnui

Posted by Katta

Padma Bikkani కవిత

పద్మ****నా బాల్యం**** జీవితమనే పుస్తకంలో అత్యంత అద్భుతమైన మొదటి పేజీ బాల్యమేనేమో.! అమాయకమైన బాల్యన్ని గేలం వేసి వెనక్కి తెచ్చేసుకోవాలని ఉంది. చిన్నప్పుడు ఉదయం లేవగానే ఇంటివెనకాతలనే ఉన్న రాములులవారి గుడి దగ్గరకు నా ప్రమేయంలేకుండానే నా కాళ్ళు నడిచేసేవి. చెట్టూ చుట్టురా పరుచుకొన్న పారిజాతం పువ్వులతో మాట్లాడేసి గుడి చుట్టూ ఉన్న మొక్కలను ఓసారి కళ్ళతో తడిమేసి, శివాలయం పక్కన ఉన్న చెరువుదగ్గరకు వెళ్ళి మునికాళ్ళపై కుర్చుని నిశ్చలంగా ఉన్న నీటిలో నా ప్రతిబింబాన్ని చూసుకోని మురిసిపోయేదాన్ని. చిన్న చిన్న రాళ్ళను నీటిలోకి రువ్వుతూ ఆ తరంగాలను చూస్తూ తరంగాలు దూరందూరంగా పెద్ద వృత్తంలా వాటిలో మళ్ళీ రువ్విన రాయి దూసుకొని పోతూ ఇంకో వృత్తం అలల తరంగాలో ఏదో తెలియని గమ్మత్తు. నీటిలో రివ్వు రివ్వున తిరిగే చేపపిల్లలు తడిచిన నా పాదాలను ముద్దు పెట్టుకొంటూంటే ,వాటిని తాకుదాం అనే లోపలే చట్టుక్కున అందకుండా జారిపోయేవి. ఇప్పుడు కూడా నాకు తెలియకుండానే కాలం చేతి వేళ్ళ మద్య జారే ఇసుకలా జారిపోతుంది నన్ను వెక్కిరిస్తూ... పేపర్ పడవల మద్య ఒదిగిన బాల్యం, బ్రతుకు నావకు చుక్కానిలా మారి పోయింది. 21|4|14

by Padma Bikkanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RDT6RA

Posted by Katta

Pratapreddy Kasula కవిత

http://ift.tt/1h3EtQo

by Pratapreddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3EtQo

Posted by Katta

Aruna Naradabhatla కవిత

అనుబంధం _______________అరుణ నారదభట్ల నాలుగు చేతులు కలిసి నీడై కట్టుకున్న గూడులా మా అమ్మమ్మాతాత! సెలవులొస్తే మాకోపండగలా ఆ ఇల్లు! వెళ్ళగానే స్వచ్చమైన ముత్యంలా మా అమ్మమ్మ చిరునవ్వుల పలకరింపులూ...తీయని కబుర్లు! చేతిలో అడకత్తెరతో టిక్కుటిక్కుమంటూ అరుగు మీదే తాత నివాసం! తాను చెప్పే కథలు వింటుంటే కాలం ఇట్టే గడిచి పోయేది! కథల్లోని నీతంతా వొంటబట్టినట్టు జీవితపు విలువలు అక్కడే తెలిసేవి! బంధాలూ ..అనుబంధాలూ కష్టసుఖాలూ...మానం...అభిమానం ఆ ఇంటి గోడలు! పందిరినిండుగా పరుచుకున్న జాజితీగలా అక్కడంతా ప్రేమ సుగంధాలే! హాయిగా ఊగే ఉయ్యాలపాట... చప్పరం నిండుగా నిండిన గుమ్మి.. తీయగా శ్రీకండు రుద్దే మా తాత చేయి అన్నీ కనుమరుగయ్యి ఉలకక పలకక ఖాళీగా ఉన్నాయి! ఆ ఇల్లు మూలబడింది ప్రేమలు కరువైన దేహంలా! చెదలెక్కకుండా వాసాలకు వేసిన జాజు ఇప్పుడు నెమ్మదిగా రంగు వెలసిలిపోయింది! సోనాసి గూటిలోని బాగాలడబ్బా నిశ్శబ్దంగా మూతిబిగించుకుంది! పువ్వులా నవ్వే అమ్మమ్మాతాత మిద్దెగోడకు వేలాడే ఫోటోలో కూర్చున్నారు! ఇంటిని కాపాడాల్సిన దూలాలు భరువెక్కి బీటలు పడ్డాయి! గోడలు పర్రెలు వాసి పై కప్పు పందిరిలా పెంకులు రాలి బైటి వెలుతురు లోనికి చొరబడుతుంది! దీపం లేని గుడిలా ఆ ఇల్లు ఆప్యాయతలు మిద్దె బారంగీ మీద ఉంచిన ఇత్తడి డబ్బాలో పడిపోయాయి! వాళ్ళు చూపిన ప్రేమ ఇప్పటికీ మా మనసుల్లో చినుకులై రాలుతూనే ఉంది! ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు పేరుకుపోయిన బూజు దులిపితే మా ఆ ఇల్లు అందమైన హరివిల్లే! 21_4_2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rdJBTe

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ పార్టీల గోస @ అసలే గుర్తులు కరువు అయినై నాయినల్లార అంటే గడియకో పార్టీ వెట్టి గందరగోళం జేయ్యవట్టే సర్కార్ ను ఏరి కోరి తీసుకుంటే కుదురధనొ ఏమో ఆఖరికి చెప్పు శీపుర్లకు గూడా మంచి గిరాకి అచ్చి పాడయింది ఏత్త..తీత్త అని ఉరికచ్చిన గా సారుకు ఇగ వట్టుమని జెప్పి ఊడ్సుడు పని అప్పజేప్తే ఊరంతా తిరుక్కుంట చెంప దెబ్బల పాలయిండు. నీతి నిజాయితి తెలియని నిబద్దత లేని నత్తి నల్లికుట్లోల్ల సంఘానికి గట్టి దెబ్బ తగిలింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఆ సంఘం పెట్టిన పార్టీకి ఆ గుర్తే ఇచ్చారు. అదేదో గాలి అట అదే ఫ్యాను గాలి అట ఆ గాలి అట ఏదో దులిపెస్త ఊపేస్త అంటుందటా ఏమో,?చెర్ల పెల్లి జైలు గోడల దుమ్మేమోనట అని అందరు అనుకుంటున్నారట ఇగ,ఈకలు ఈకలు కలిపి తయారయ్యిందోక తోక పార్టీ . తల లేదు...మొండెం కనిపించదు కాని మెదడున్న పార్టీ అని తెగ డబ్బాలు కొట్టడం ఇగ,దాని కథ జూడు రాజకీయ పార్టే కానీ పోటీ జేసుడు లేదని చెప్పుక తిరుగుడు. ఇవన్ని గట్లుంటే ముసలోనికి పడుసు పెండ్లమన్నట్లు ఏండ్లకేండ్లు దేశాన్ని మేమే ఏలుతం...అని పాత సంచిల కొత్త సరుకు జబ్బకేసుకుని ఒక తిరుగుడు గాదు జేజమ్మ ల పేర్లు జెప్పుకుంట. నేను అటు జూత్త..ఇటు జూత్త ఎటు వడితే ఆటే జూత్త నా దారికి అడ్డం అచ్చిండ్రనుకో ఎనుకకేలి అచ్చి ఈపుల గుద్దుత అని రెండు మూడు సిద్ధాంతాల కామెర్ల రోగపొల్ల లొల్లి ఒక దిక్కు ఇగ గవ్వైతే గవ్వే అటోల్లకి ఆ దిక్కు మేమే ఇటోల్లకు ఈ దిక్కు మేమే అనుకుంట,. ఒగలకొగలను పడనిచ్చేది లేదు ఎవల జాగల వాళ్ళను ఉండనిచ్చేది లేదు. ఎవని తోని మాకెందుకు బై మాది మాకు గావలె అని ఒక కొట్లాట సరే.,మనది మనకు వచ్చింది గాని మల్ల అండ్లకేలి మాది మాకు గావాలంటే గుండె వలిగి సత్తం దొర జనం మొర పెట్టవట్టే. ఎనుకటి లెక్కనె గడ్డి కుప్ప కాడి కుక్క పార్టీలు అధికారం లకు రారు అచ్చినోల్లను పనిజేయ్యనియ్యారు. ఇగ గా రంగు జూత్తే, ఎవనికైన ఉచ్చ వడుతది. గిన్ని లోల్లుల నడుమ ఇంట్లకెళ్ళి బైలెల్లుతే.. ఒగడు వెయ్యిత్త నంటాడు ఇంకోగాడు క్వటరిత్తానంటాడు ఏది ఇత్తేంది ఇయ్యాక పోతేందని గట్టిగనే గుద్ది వచ్చిన రాజకీయ బ్రోకర్ల మాట ఇనకుంట పొయ్యి దేశాన్ని దోసుకునేటోల్లకు మొస మర్రకుంట _ కొత్త అనిల్ కుమార్ ( 21 / 4 / 2014 )

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i64d0r

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h3de8y

Posted by Katta

Panasakarla Prakash కవిత

జరుగుతున్న‌ కధ‌ వయసైన దేహమొకటి ఇ౦టిలో ఒక మూల కూర్చుని ముడతల మడతల్లో దాచుకున్న అనుభవాల్ని తన వేళ్ళతో నిమిరి ఓదారుస్తున్నట్టు ఇల్ల౦తా ఊడ్చి శుభ్ర౦ చేసిన చీపురు గదిలో ఒకమూలకు జారబడి తనలో తనే రహస్య౦గా పుల్లల మెటికలు విరిచి మాటాడుకు౦టున్నట్టు రాతలతో ని౦డిపోయి మన రాత మార్చిన పుస్తక౦ చిత్తు కాగితాల చెత్తలోకి మన చేతులమీదే నిర్దయగా విసిరివేయబడినట్టు అన్న౦కలిపి మన ఆకలి తీర్చిన‌ విస్తరి కృతజ్ఞతలు అ౦దుకోకు౦డానే అనాధగా మారి మరణి౦చినట్టు చీకటి ని౦డిన గదిలో ఒక ప౦డు దీప౦ ఒ౦టరిగా తన నీడ తానేఐ వెలుగుతున్నట్టు ఎ౦దరికో ఆహారమై జీర్ణమైన దేహ౦ ఒకటి నాలుగు గోడల సమాధిలో శవమై చావడానికి సిద్ద౦గా ఉన్నట్టు అ౦దరూ ఉన్న‌ ఒకానొక అనాధ వృద్దాప్య౦ ఎవ్వరి నీడా పడక వెక్కి వెక్కి పసివాడై ఏడుస్తు౦టే పాప౦ తల్లిలా ఎప్పుడొచ్చి నిద్రపుచ్చి వెళ్ళి౦దో మరణ౦ ఆ ఇ౦ట్లో౦చి ఇప్పుడు ఎవ్వరి ఏడుపులూ వినిపి౦చడ౦లేదు..... పనసకర్ల‌ 21/04/2014 సోమవార౦

by Panasakarla Prakashfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PlNGs9

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//అజ్ఞానినేమో!// చీకటి పడింది రాత్రయ్యింది. నీడల్ని, వీపుల్ని ఇక చూడక్కరలేదు. ------------------ ఆకాశంలో ఓ వెలుగుముఖం దీపం పట్టుకెళ్ళి ఎవరూ! అని అడిగా.... అప్పటికే అక్కడ ఎగురుతూ కేరింతలు కొడుతూ వేవేల చిన్నారులు చందమామని పిలుస్తూ... 17.04.2014.....21.04.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ltfLx4

Posted by Katta

Krishna Mani కవిత

పిచ్చివాణ్ణి ********** నేనేంటో నాకేతెలియని గమనం గమ్యం తలియని కాలచక్రంలో బందీని నా చుట్టూ అంతుపట్టని వింత లోకం ! అందరు నా వాళ్ళే నేనెవరికీ కాను కలల్లో కన్నీళ్ళే కార్చే పిచ్చివాడిని ఆప్తుడెవరో తెలియని అనాదని శత్రువెవరో కనలేని అజ్ఞానిని ! అందరిముందు అడవిలో అజ్ఞాతవాసిని కరుణలేని కసాయి ఎడారిలో దాహం తీరని నడకను పరుని కష్టం నాదైతే మరి నా కష్టం ఎవరిదీ ? నడకసాగని బరువుతో తీరం అందని అభాగ్యున్ని ! నే పెరిగిన కాడ అందరికి అయిన వాణ్ని నే తరిగిన కాడ ఎవరికీ కానలేని వాణ్ని ! కృష్ణ మణి I 21-04-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jsDc3R

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతుంది--7 _______________________ఆర్క్యూబ్ విక్టర్ యారా...విలాస్ ఘోఘ్రా గద్దర్.... వీళ్ళంతా-రికాం లేకుండా పొక్కిలైన మట్టిల బొర్లీ బొర్లీ తలారి,దలారి కళ్ళల్లో తాతిపరంగా ఉషిక దులుపుకుంటున్న బురుక పిట్టలు అది భూమిని మింగే ఎడారి మొప్పల చేపా ఏ గుణ పాఠాన్ని అద్దంగా మలచుకొని తనను తాను చూసుకొన సాహసించ లేదు కదా ? మట్టిపొదుగుల పచ్చటి చెలిమల్లోకి మండుటెండై ఎదురెక్కుతుంది అందుకే- వాళ్ళిప్పుడు తల్లి వేళ్ళను పూల పరిమలంగా కీర్తిస్తున్న సామూహిక మొలకల గానం * * * * * *

by Arcube Kavifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jsz97q

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్ || 20.4.2014 ప్రతీనెల మూడవ ఆదివారం సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నివేదిక || సాహితీ స్రవంతి నిర్వహించే ప్రతీనెల మూడవ ఆదివారంలో భాగంగా 20.4.2014 సాయంత్రం బి.వి.కె. గ్రంథాలయంలో రౌతురవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మొదటగా ఇటీవల మరణించిన సాహితీ వేత్త, నవలా రచయిత నోబెల్ బహుమతి గ్రహీత వామపక్ష కవి గాబ్రెయిల్ మృతికి సంతాపం తెలిపి వారిని గురించి కపిల రాంకుమార్ మాట్లాడారు. గొప్ప నవలాకారుడు గాబ్రియల్ గార్షియ మార్క్వెజ్.. ప్రముఖ వామపక్ష కవుల్లో 20 వ శతాబ్దపు సంచనాల నవలాకారుడు, లాటిన్ అమెరికా సామాజిక, రాజకీయ, చారిత్రక సంక్షోభాలను అద్భుత కథలుగా శిల్పీకరించి, ప్రపంచ ప్రజలను ఆలోచింప చేసిన కథా దిగ్గజం.. గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్. థికెన్స్, టాల్ స్టాయ్, హెమింగ్వే లాంటి గొప్ప రచయితల సరసన నిలవదగ్గ రచనలు చేసి, ప్రపంచ సాహిత్యాన్ని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేసిన మేధావి, రచయిత గాబ్రియల్. 20 వ శతాబ్ధంలో సంచలనం సృష్టించి 'వన్ హండ్రెడ్ హియర్స్ ఆఫ్ సాలిట్యూడ్' రచనతో ప్రపంచంలోని అగ్రశ్రేణి రచయితల జాబితాలో స్థానం సంపాదించాడు.అమ్మమ్మ, తాతయ్య చెప్పిన అద్భుత కథలు... అంతేకాదు ఉత్కంఠ కధనాశిల్పంతో పాఠకులను కట్టిపడేసే కథనాశిల్పి , యుద్ధ వీరులు ప్రజల పక్షం నిలిచిన పోరాటయోధుల సాహస గాథలు చదివినంద్కు అవి పౌరుషాన్ని శిఖలను నరనరాల్లో రగిలించాయి. రాజకీయ ఆదర్శభావాలను అతరంగంలో పొంగులెత్తించాయి. కార్మిక, కర్షక పక్షం వహించే ఒక సోషలిస్టుగా, ఒక ఐడియలిస్టుగా మార్చేశాయి. చివరకు క్యూబా కార్మిక నాయకుడు, వామపక్ష పోరాట యోధుడు, ప్రపంచ సోషలిస్టు రాజ్యాలకు, పార్టీలకు ఆదర్శమూర్తిగా, రెడ్ స్టార్ గా నిలిచిన విప్లవ చైతన్యమూర్తి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోకు అత్యంత సన్నిహిత మిత్రుణిగా చేశాయి. ఒకరు కలం యోధుడు, మరొకరు పోరాటయోధుడు... వీరిద్దరి కలయిక పైకి సాహిత్యపరమైనదే కావచ్చు. కానీ అది అభ్యుదయ ప్రజాప్రవాహజ్వలిత చలిత చైతన్యమని, వారిద్దరి అంతరంగాలు, భావాలు, నియంతల దోపిడీ దారుల నెదిరించి..ఎగిసిపడే అరుణారుణకాంతి విస్పోట క్రాంతి తరంగాలని, ఎర్రబావుటా నిగనిగలని, ఆ తర్వాత ప్రజలు వేనోళ్ల కొనయాడారు. గాబ్రియల్ గార్షియ జీవిత విశేషాల్లోకి వెళితే...ఆయన 1928 మార్చి6న కొలంబియాలోని అరకటకాలో జన్మించారు. మనో ప్రపంచమంతా నాటి లాటిన్ అమెరికా..గత గాధలతో, ప్రజల బాధల జీవన చిత్రాలతో నిండిపోయింది. ఒక క్రిటిసిజం, ఒక మిస్టిసిజమ్...అతని మెదడులో నిక్షిప్తంగా దాగిపోయింది. ఇదే సమయంలో కాబ్రియల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో న్యాయశాస్త్రం చదవాలని ప్రయత్నించారు. తన స్వతంత్ర ఆలోచనలు ఎదలోయల్లో రగిలే భావాల నెగల్లు, సమాజం... మనుషులు కృత్రిమ బంధాలు, రాజకీయ ఘర్షణలు... లాటిన్ అమెరికాలోని ప్రాచీన కుటుంబ వ్యవస్థ, ఆధునిక మోడ్రనిజం మధ్య జరుగుతున్న పరిణామాలు...వీటన్నింటినీ నిశితంగా పరిశీలించిన గాబ్రియల్ మధ్యలోనే 'లా' చదువుకు స్వస్తి చెప్పి ఏదో సాధించాలన్న తపనతో, పట్టుదలతో జర్నలిజాన్ని వృత్తిగా చేపట్టారు. హెరాల్డ్ పత్రికలో పాత్రికేయునిగా, సెఫ్టిమస్ పేరుతో కాలమ్స్ రాశారు. ఎడిటోరియల్స్ కూడా రాస్తూ సంచలన పాత్రికేయునిగా పేరు గడించారు. అవినీతి, అధర్మం, రాజకీయ దౌర్జన్యాలు, నియంతల పోకడలు, అధికారుల నిర్లక్ష్యాలపై ఆయన ఎన్నో వ్యాసాలు, వార్తా కధనాలు రాశారు. ఎన్నో విమర్శలు, వత్తిళ్లు ఎదుర్కొన్నారు. మొమెంటో పత్రికలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆయన రాసిన వ్యాసాలు అప్పట్లో పెను దుమారం లేపాయి. చివరకు యువ గాబ్రియల్ మొమెంటో పత్రికకు రాజీనామా చేశారు. తదుపరి వెనిజులా గ్రాఫికా పత్రికలో ఎడిటర్ గా 1958 లో చేరారు. ఆ పత్రికలో 'ఎస్పెక్టేటర్' పేరుతో గాబ్రియల్ రాసిన 14 వార్తా కథనాలు ప్రభుత్వాలను కదిలించాయి. అధికారులకు ముచ్చెమటలు పట్టించాయి. ఫైర్ బ్రాండ్ జర్నలిస్టుగా గుర్తింపు బడ్డారు. అయితే ఆయన కలం బలం భరించలేని ఆ పత్రికా యాజమాన్యం గాబ్రియల్ ను ఫారిన్ కరస్పాండెంట్ గా పంపించారు. అయితే జర్నలిజం నీడలో ఆయన వర్జీనీయా వుల్ఫ్ విలియం పాల్క్ నర్ లాంటి ఉద్దండ పండితులను, రచయితలను కలుసుకున్నారు. వారి ద్వారా విభిన్న కథన రీతులను చారిత్రక కథనాలను గ్రామీణ సన్నివేశాలను కథలుగా శిల్పీకరించే నైపుణ్యాలను నేర్చుకున్నారు. అదే సమయంలో రెగ్యులర్ ఫిల్మ్ క్రిటిక్ గా పని చేస్తూ బరాంక్విల్లాలోని ప్రపంచ సాహిత్యాన్ని అవసోసన పట్టారు. ఈ నేపథ్యంలో ఆయనలో అంతర్గతంగా దాగిన సృజనాత్మకత పురులు విప్పింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న మార్మికత నిజాల నిప్పురవ్వలు ఎగజిమ్మింది. ఆయన ఆలోచననలన్నీ మ్యాజిక్ రియలిజంగా రూపుదిద్దుకున్నాయి. చారిత్రక వాస్తవికత, గతితార్కిక భౌతికత, అతని మనో ప్రపంచాన్ని దేదీప్యమానంగా వెలిగించాయి. ఆనాటి కుళ్లిన వ్యవస్థ పట్ల కుహనా వ్యక్తుల పట్ల తీవ్ర స్వరంతో స్పందించారు. నిజాల ఇజాల భాస్వరమై నినదించారు. కవులు, యాచకులు, సంగీత విద్యాంసులు, ప్రవక్తలు, యోధులు, స్కౌండ్రల్స్...అందరూ విశృంఖల వాస్తవికతకు ప్రతినిధులని విరుచుకుపడ్డారు. నవీన జీవితాన్ని నమ్మదగినదిగా చూపించే సంప్రదాయ పద్ధతులు మన దగ్గర లేకపోడమే ప్రధాన లోపమని ఆయన విమర్శించారు. ఆయన రచనల్లో అంతటా మ్యాజిక్ రియలియం, సోషలిజం, హ్యూమనిజం, మ్యాజికల్ ఈవెంట్స్, రియలిస్టిక్ సిచ్యుయేషన్స్ కనిపించడం...వెనకాల అతని జీవితానుభవం, పరిశీలన, పరిశోధన తాత్వికవేదన, సైద్ధాంతిక నిబద్దత గొప్ప దార్శనికత అంతకుమించిన మానవత కనిపిస్తాయి....అతని రచనా ఒరవడి అందరికీ ఆదర్శమని తెలిపారు. అనివార్యంగానే అతని సాహిత్యానికి నోబెల్ పురస్కారం వచ్చింది...వివిధ పత్రికలు, మీడియాలలో వచ్చిన అంశాలను చదివి వినిపించారు. తదుపరి సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి మాట్లాడుతు క్రమం తప్పకుండా ప్రతీనెల మూడవ ఆదివారం జరుపుకోటం ఆనందంగావుందని. ఇపూడున్నా ఎన్నికల వాతావరణంలో కవులుగా, కళాకారులుగా, రచయితలుగా మనపై ప్రజలను మేలుకోరి చైతన్యపరచవలసిన కర్తవ్యం భుజస్కందాలపై వుందను తెలిపారు. ఆ పని చేసినందుకే గాబ్రియల్ ప్రముఖుడుగా నిలిచాడని అతని మార్గంలో నడవడమే మనము ఆయనకిచ్చ్చే సరియైన నివాళి అని పేర్కొన్నారు. రచనలద్వారా గడచిన దానిని బేరీజు వేస్తూ నేటి స్థితిగతులను తట్టుకుంటూ రేపటి మేటిబాటను సృజన చేయటమే కవుల లక్ష్యంగ, లక్షణంగా వుండాలన్నారు. మార్మిక వాస్తవికత నుసాహిత్యంలో ప్రవేశపెట్టి రచనలు సాగించిన వారి గ్రంథం బైబిలు తో సమానంగా ప్రతులు అమ్ముడవడం ఒక విశేషం. ప్రగతిశిల, వామపక్ష, అభ్యుదయగాములైన రచయితలకు అతడు మార్గదర్శి అని కొనియాడారు. ఆ విధంగా సన్నద్ధులమవుదామని ప్రతిన పూనాలన్నారు.కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ నా మార్గం అనితర సాధ్యం అని శ్రీశ్రీ అన్నట్టు మనంకూడా అలా కొత్త చైతన్య మార్గంలో పయనిద్దామని అన్నారు. శైలజ , తేజస్వనీ, కపిల రాంకుమార్ తమ కవితలను వినిపించారు. వాటిపై విశ్లేషణ శేషగిరి చేసారు.చర్చలో సంపటం దుర్గా ప్రసాద్, , ఎం.శేషగిరి, కంచర్ల శ్రీనివాస్, యడవల్లి శైలజ, వనం తేజస్వని పాల్గొన్నారు. బి.వి.కె. విద్యార్థి ఆశు ప్రసాద్ కంచర్ల శ్రీనివాస్ రాసిన పోలవరం కన్నీటి గేయాన్ని 8హృద్యంగా వినిపించాడు. ఎం. శేషగిరి వందన సమర్పణ చేసారు. 21.4.2014 ఉదయం 9.15

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pl9Mfl

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || నీలాగే నేను || ========================= చందమామ మీద కోపం కాబోలు సాయంత్రం వరకు భానుడు మండి పోతున్నాడు నా మనసులా - సూర్యుడు రాత్రంతా నిద్రపోలేదు కాబోలు ఉదయాన్నే ఎరుపెక్కేసాడు అచ్చం నా ఆలోచనల్లా - మబ్బులన్నీ మసకేసాయి కాబోలు మనసుకు మబ్బు దుప్పటి కప్పింది నిత్యం నా గమ్యంలా- చినుకులన్ని తుఫానును పిలుస్తున్నాయి కాబోలు గాలిలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి విరిగె చెట్ల మధ్య మనసు ముక్కలవుతుంది నా జీవన పోరాటంలా- అప్పుడప్పుడు ప్రకృతి కన్నెర్ర చేస్తుంది వర్ణాలు ఊసరవెల్లితో చెలగాటమాడుతున్నాయి చీకట్లోస్వప్నాలు పరిగెడుతున్నాయి నేను మాత్రం సజీవం గానే ఉన్నాను ప్రాకృతిక పరిణామంలో నేను - నా మనసు లాజికల్ గా ఆలోచిస్తే సైకాలజీ మారిపోతుంది ================== ఏప్రిల్ 21/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qyr2Oc

Posted by Katta

John Hyde Kanumuri కవిత

ఎవరైనా ఎందుకు వస్తారు *** పిలిచినంతనే తమ పనులు మానుకుని ఎగురుకుంటూ వస్తారంటావా! ఎప్పుడో ముడిపడిన బంధాన్ని జ్ఞాపకంచేసి కొన్ని క్షణాలు గతంనుంచి వర్తమానానికి వంతెనె కట్టాలని ఎదురుచూస్తుంటావు రాలిపోయిన శిశిరాకులను కుప్పలుచేసి కాల్చాలనుకున్నప్పుడు నీ జ్ఞాపకాలు రేగే పొగలా అన్పిస్తే ఎవరైనా ఎందుకు వస్తారంటావు ! నీవు పంచాలనుకునే గంపలగంపల పళ్ళు రుచీ పచీ లేనివని అనుకుంటుంటే ఎవరైనా ఎందుకు వస్తారంటావు ! నీవు ఎదురుచూస్తున్న సమయానికి నేనెంత బిజీయో నీకు తెలియదు పలకరింపుల స్పర్శాహస్తంకోసం నువ్వు ఎదురు చూస్తుంటావు నీవులేనప్పుడు నలుగురూ చేరితే వారిమధ్య సంతోషాన్నో, దుఃఖాన్నో కొంచెం పులుముకొని వస్తారు కొంచెం గుప్పెటను విధిలించడానికి నీ స్వరాన్ని విప్పి అందరికీ ఎవో జీవన సంగీత సంగతులు విన్పించాలనుకుంటావు నువ్వలా పాడుతుంటే నీకు తెలిసినదెంతో ఉంటుంది అయినా ఎవరికి తెలిసిన కొలతల్తోనే నిన్ను చూడాలనుకుంటారు అన్నవచ్చాడని తమ్ముడూ గురువు వచ్చాడని శిష్యుడు అలావచ్చి మొహం చూపించిలోగా సెల్లుఫోనులోంచి ఎవ్వరో వాలుతారు నీకో నవ్వుముఖం పాడేసి మాట్లాడుతూ మాట్లాడుతూ చల్లగా జారుకుంటారు నీనుంచి నేర్చుకోవడం మానేసి నీవే మారాలంటూ సలహాలిచ్చిపోతారు ఎన్నో ఏళ్ళుగా చూసున్న అదే అరుగును బాధలను, కన్నీళ్ళను పదే పదే ఊడుస్తూ ఒంటరిగానే పాడుకుంటావు. వినడానికి ఎవరైనా ఎందుకు వస్తారు ......................21.4.2014....7:00 ఉదయం

by John Hyde Kanumurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qyi3N1

Posted by Katta

Varala Anand కవితby Varala Anandfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r6ke7M

Posted by Katta

Patwardhan Mv కవిత

అపరిచితుడు::::: నుదుట నెన్ని రాసితివో నూకల నీవు ముందుకు పోనీవు నన్ను వెనుకకు రానీవు. సుఖమే అని చెప్పి నన్ను సులావుగాబట్టి ఎక్కడి కక్కడె బాధల మేకులు దిగకొట్టి ఏడ్వ లేక నవ్వలేక నేడుస్తుంటే సిలువపైన బతుకంతా ఈడుస్తుంటే ...... ఏర లడిగినారని నను పసుపు పతంగీని చేసి ఆశయాల గగనంలో అత్యున్నతి నెగరేసి ఆచరణా సూత్రమ్మును దారుణముగ తెంపేసి పతన కంటకాలలోన వేగంగా పడద్రోసి...... ముదమైనా పెదాలపై నవ్వు హంస వ్రాలదు వ్యథయైనా కనుల నశ్రుకణ మొక్కటి రాలదు అనుభూతుల శూన్యతనే కానుక నిచ్చి నడయాడే ఎడారిగా నను కానిచ్చి ......... మంచోడని జగ మంతా మెచ్చేస్తుంటే నా లోపలి మనిషి నన్ను నవ్వేస్తుంటే మోయలేని మంచితనం ప్రశ్నిస్తుంటే నన్ను చూసి నాకే మరి భయమేస్తుంటే....... ఈ భాష నాది కాదు-- ఈ ఆశ నాది కాదు ఈ ఆశ నాది కాదు--నే నసలు నేను కాను నాకే తెలియని దేదో నాలో శ్వాసిస్తే కీర్తి కాంక్ష కుతిక మీద కత్తి లాగ శాసిస్తే...... 21-04-2014,మంచిర్యాల్.

by Patwardhan Mvfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rcfeww

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఎన్నికలలో.. ఎన్ని కళలో ..! Posted on: Mon 21 Apr 01:49:21.074835 2014 బయట మండుతున్న ఎండలు ఇంట్లో కన్నీటి కుండలు రాజకీయ డప్పుల దరువులు మీసం మెలేసి పరువులు దొరుకుతున్న నోట్ల కట్టలు పెరుగుతున్న అవినీతి గుట్టలు వంగి వంగి వందనాలు పొంగి పొర్లే బంధనాలు జెండాలన్నీ కలగాపులగం ఏం పొత్తులో... ఏం ఎత్తులో... అశ్లీలంగా... అక్రమ సంబంధంగా కండువాలు మారుతున్నాయి కల్మషాలు పెరుగుతున్నాయి మానాలు అల్లాడుతున్నాయి అభిమానాలు చీలుతున్నాయి నాయక మోముల్లో నవ్వులు ఓటర్ల చెవుల్లో పువ్వులు ఎన్ని కలలో.... ఎన్ని కళలో.... ఇది భారీచిత్రం.... భలే విచిత్రం చైతన్యం వీడొద్దు ఓటరూ.... నువ్వే భవితను మార్చే షూటరు...! - కటుకోఝ్వుల రమేష్‌ 99490 83327

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ls9pOj

Posted by Katta

Kuffir Nalgundwar కవిత

బెడిదె నరేందర్ // వోట్లు వోటేగా వేద్దాం నిన్నటి శవాలేవీ యెన్ని కలలై నడిచొస్తున్నాయి అన్నం తిన్నావా అనడక్కుండా వోటేసావా అనడుగుతారు మర్యాదేనా ఆకలి తెలియని సామాజిక స్పృహ పోలియో చుక్కల్లాగా వోటు మంచిదని ప్రకటనల పోటు రెండొందల కులాల్లో పదికే వోట్లు వోటంటే వర్ణమే అడ్డుగోడలకు వేసిన సున్నం ఘనులకు వోట్లు గనులకు వోట్లు గళగళలకు వోట్లు ఖడక్ నోట్లు దోపిడీ దర్పం ఆరాటం అవసరానికి వెలకట్టిన రేట్లు అవే మాటలు అవే ముఖాలు అదే రోలు అదే వేలు. 21/4/201

by Kuffir Nalgundwarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5ljg9

Posted by Katta

Buchi Reddy కవిత

4-20-2014 ***** అతడు మళ్లీ వస్తున్నాడు---తెలుగు దేశం టి .వి కమర్షియల్???మామను ముంచిన అల్లుడు బాబు గారు ******* వాడు పచ్చి మోస కారి అబద్దాల కోరు చె డ గొట్తోడు తెలంగాణా కు శత్రువు బి .జె. పి పాలనలో చిదంబరం ప్రకటన తర్వాత రోండు సార్లు తెలంగాణా రాకుండా అడ్డుకున్న ఘనుడు మామను ముంచిన అల్లుడు బాబు గారు తొమ్మిధి ఏళ్ల పాలన లో వేలుగాబెట్తింధ౦ టూ ఏమీ లే ధు ధరల పెరుగు ధ ల నిరుధ్యొగం రయితుల ఆత్మహత్యలు కరెంట్ కొరత అవనీతి కులమత కలహాలు--- తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పాధయాత్రలు పొత్తులు గిమిక్కులు మోసాలు చేస్తూ యూస్ అండ్ త్రో రాజాకీయాలతో రోజుకో మాట పూటకో ని నా ధ ౦ తో సీమాంధ్రను సింగపూర్ చేస్తా భద్రత-- భాధ్యత-- సుస్థిరత అంతా నా వల్లే సాధ్యం అంటూ కూతలు కూస్తూ-----------------??? ఇంకా ఇప్పటికీ తెలంగాణా ను ముంచాలని అమెరికా దొర ల తెలుగు సంగాలలో మాజీ ప్రెసిడెంట్స్ భాగోతపు రాజకీయాల్లా బాబు కు--- ధయాకర్ రావు---మోతుకుపల్లి రేవంత్ రెడ్డి---రమణ లు--చెంచా లు కొత్త అవతారాల తో తెలంగాణా లో తెలుగుదేశం పార్టీ ని పోషిస్తూ--- తెలంగాణా ధ్రో హు లు లేక పోలే ధు ???? తెలంగాణా వస్తు౦ ధ ని తెలిసి కూడా పణికట్టుకొని దేశం లో అంధ రీ నేతలను కలిసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ను అడ్డుకునేఅంధూకు ప్రయతీనించిన ఘ ను డు తెలంగాణా లో వోటు అడిగే హక్కు తెలుగు దేశానికే ఉంధ ని రాష్ట్రం అంతటా త ను చేసిన అబివృద్దే కనిపిస్తుంధ ని భాగ్యాన గ రా ని కి ప్రపంచప ట౦ లో గుర్తింపు తన భాగ్యామేనని వాగుతున్నాడు--పిచ్చి తు గ్ల క్ అన్న లూ-- అక్కలూ సీమా౦ ధృ లు ఇంకా తెలంగాణా ప్రజల మిధ పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం మేలుకోవాలి సీమాంద్రా పార్టీ ల ను మన ప్రాంతం నుంచి పా ర ధో లాలి నేటికి తెలంగాణా పై ఆశలు పెట్టుకొని తెలంగాణా తొత్తులతో రాజకీయం చెపిస్తూ--- లేనిపోని ఆశలు కలిపిస్తూ తెలంగాణా లో బి .సీ ని ముఖ్యమంత్రి చేస్తామని ????? అన్న లూ-- ఆ క్క లూ- మర్చిపోవద్దు తెలంగాణా కోటి గాయాల వీణ ఏళ్లతరబడి పోరాడి౦ ధీ అవమానాలు అపవాదాలు మొసింధీ కష్టాలు- కన్నీళ్ళు చవి చూసింధీ మోసపోయింధీ దోపిడీ కి గురి అయింధీ వేలాధి బిడ్డ ల బలి ధానాలు చూసింధీ తిరగబడి ౦ధీ పోరాడి౦ ధీ తెలంగాణా సాదించింధీ మన మాట-- బాట-- పాట ఒకటి అయి బంగారు తెలంగాణా ను నిర్మించుకుందాం కలిసి కట్టుగా ఉంధాం కదలండి సీమాంధ్ర పార్టీ ల కు వాళ్ళ రాజకీయాలకు చరమ గీతం పాడాలి కదలండి జహాయో జై జై తెలంగాణా ------------------------------------------------------- బుచ్చి రెడ్డి గంగుల

by Buchi Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fcHE49

Posted by Katta