పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మార్చి 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

జబర్దస్తీ పచ్చటి కలలన్ని రేపటి పంటలే పొలానికిన్ని నీళ్ళు పోసి మొలకలు చల్లితే చాలు పచ్చటి నెలపొడుపులే పొలంనిండా మట్టిసుగంధాల పల్లె పిల్లలకిన్ని అక్షరాల సాలు పోస్తే చాలు చదువుల పంటలై చేతికొస్తారు కలయికలే పండుగలుగా చేసి ఇంత నిస్వార్థ స్నేహలు పంచితే మనుష్యులబంధాలు అమరాలౌతాయి నవ్వులు పరిమళింపజేసే సహజీవన పాఠాలు నేర్చితే దుఃఖం లోకం వొదిలిపోతుంది ఎన్ని నేర్చినా ఈ రాజకీయాలకు ప్రజలకొరకు నిలబడలేని అవిటితనం రేపటి కలల్ని కుప్పలో తగలబెడుతుంది ఉద్యమాల్ని ఉద్వేగాల్ని పదవులకమ్మే పెద్దమూర్ఖనాయకుల చేతులకిస్తే మనబతుకులు మళ్ళీ చెత్తపాలే

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g7bvA2

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

Restrogression ? అప్పుడే పుట్టిన లేగదూడ చర్మం మెరుపులాంటి వర్షాకాలపు పొద్దుటిపూట - చెరువు మీద వేటకు దిగుతాడు రెండేళ్ల బుడతడు వర్షాకాలపు పొద్దుటిపూట చెరువు - తనలాగే పసిది తల్లి వొడిలోంచి అప్పుడే నిద్రలేచిన నిద్రకళ్ల పసిముఖంది మెరకల్లో గేదెల మీద గుర్రపు స్వారీ చేసిన అనుభవమున్న ఆ రెండేళ్ల బుడతడు చెరువు మీదికి ఆశ్చర్యానందాల చూపులరివ్వ విసురుతాడు బుడతడి కళ్లల్లో గుప్పెడు బంగారు రంగు పరిగెలు ఈదులాడ్డం చూస్తాం వొక తడి స్వప్నం ముగ్ధంగా కదలాడ్డం చూస్తాం బుడతడు నక్షత్రకాంతిధారుడు గొప్ప సాహస యాత్రికుడు సౌందర్య ఉపాసకుడు ఆ బుడతడెవరంటే.. నలభైయేళ్ల కిందట వాగులో జింకలా పల్టీలు కొట్టిన నువ్వే గావొచ్చు లేదూ ఇరవైయేళ్ల కిందట మెరకల్లో మట్టిని ముఖం నిండా నలుగులా పూసుకున్న నేనే గావొచ్చు బాల్యం అద్భుత కళాఖండం శిలాక్షరాలపారవశ్యగీతం Restrogression అంతా తలకిందులయ్యింది వర్షాకాలపు పొద్దుటిపూట అప్పుడే పుట్టిందైనా - చెరువు క్రూరమైన మృగంలా కనిపిస్తుంది ఇష్టందీరా తిరిగిన పచ్చని మెరకలన్నీ లోపలకు మింగేసే మహా అగాథాలనోళ్లలా కనిపిస్తాయి కాళ్ల పాదాల దగ్గరే ఏ దుర్గమారణ్యం నుంచోతప్పిపోయొచ్చిన కుందేటి పిల్ల భయంతో మునగడదీసుకుంటుంది మమకారపు చే స్పర్శని కాసింత యివ్వనైనా యివ్వం కళ్ల ముందే రెక్కలు విప్పుకుంటూ రంగురంగుల పిట్ట సుదూరాకాశంలోకి రివ్వున ఎగిరిపోతుంది చూపుని కాస్తా అటువైపు తిప్పనైనా తిప్పం fearness భయం డ్రాకులా మనిషిని బంధీ చేస్తుంది సకల సౌందర్యానుభవాలనూ మనవి కాకుండా చేస్తుంది ఈసారి వర్షాకాలం వొచ్చినప్పుడు ఏ భయాందోళనలూ లేని రెండేళ్ల విలుకాడు - బుడతడుగానే మారదాం కళ్లను కోమల మార్దవ జలతటాకాలను చేసుకుందాం అంతా ఇక బాగుంటుంది ! 18.03.2014

by బాలసుధాకర్ మౌళిfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cVaZV3

Posted by Katta

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//వివేకి// శీతాకాలపు సాయంత్రం చలి చీకటి జమిలిగా వస్తుంటే భయపడి తొందర తొందరగా గూటిలోకి చేరిపోతుంటాడు రాత్రంతా మనసులో ఎంతగా మధనపడతాడో వేకువనే చన్నీటిస్నానం చేసి గొప్ప ఆత్మవిశ్వాసం తో పులికడిగిన ముత్యంలా ఉదయాన్నే బయటికి వస్తాడు యిపుడు అతన్ని చూసి చీకటి చలీ రెండూ పారిపోతుంటాయి

by Rama Krishnafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hwi5MQ

Posted by Katta

Mohammad Abdul Rawoof Chinni కవిత

" ఇది కవిత కాదు విలపిస్తున్న నా హృదయం " ------------------------------------------------- తెలవారని రేయిలో చీకటి బ్రతుకులు నక నక లాడుతున్న ఎండిన డొక్కలు కరడు గట్టిన గుండెల మద్య బ్రతుకుతున్న లేత మనసులు ఏడవలేక నవ్వుతున్న పసి హృదయాలు పరువుకోసం పాకులాడుతున్నపాపాత్ముల మద్య పగిలిపోతున్న పసి జీవితాలు మద్యం మత్తులో మునిగి తేలుతున్న పందుల మద్య నలిగిపోతున్న మగువల జీవితాలు కనులు తెరిస్తే అబద్దం కనులు మూస్తే గారడీ అరచేతిలో విషపు రాతలు నడినెత్తిన అవినీతి దారులు పట్టపగలే దోచుకుంటున్న దోపిడీ దారులు నాదా ఈ సమాజం వినికిడి లేని విచిత్ర జీవితాల సమ్మేళనం నాదా ఈ సమాజం వేషదారుల విషపు చూపుల బీజం కుల పిచ్చి మత పిచ్చి వర్గ పిచ్చి అన్నీ కలిసి నా సమాజాన్ని దోచుకుంటున్నాయి అన్యాయంగా దూషిస్తున్నాయి అవినీతి నా సమాజాన్ని ఆకలితో చిదిమేస్తుంది. భగవంతుడా నా ఈ సమాజాన్ని కులం నుండి, మతం నుండి, వర్గం నుండి , అవినీతి నుండి, ఆకలి నుండి కాపాడు....................... @ చిన్ని MY Heart Beats 18/03/2014

by Mohammad Abdul Rawoof Chinnifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hwi5g0

Posted by Katta

Sri Venkatesh కవిత

"శ్రీ" -------"అంతరాలు"--------- ప్రతి చోట అంతరాలే మనిషికి మనిషికి మధ్య 1) తినే తిండిలో "పిక్కలున్నోడు పిజ్జాలు తింటాడు పేదోడు పచ్చడి మెతుకులు తిని బ్రతికేస్తాడు" 2) వేసే బట్టలో " సొమ్ములున్నోడు సూటేసుకుంటాడు గతి లేనోడు గోచి కట్టుకుంటాడు" 3) ఉండే నీడలో " బలిసినోడు భవనాల్లో ఉంటాడు, బీదోడు పూరిపాకలో ఉంటాడు" ఇవి కొన్నే ఇంకా ఎన్నో, మనిషి మనిషికి మధ్య వారి వారి స్థితిని గతిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండే అసమానతల నిష్పత్తి!!! ఇవన్ని బ్రతికున్నప్పుడే అదే చచ్చాక ఏ మనిషైనా ఆకాశమంత ఎత్తులో ఉన్నా అగాధంలో ఉన్నా , కోట్లున్నోడైనా, ఒక్క నోటు కూడా లేనోడైనా, "కన్ను ముయ్యాల్సిందే, కట్టె పేర్చాల్సిందే, ఊపిరి ఆగాల్సిందే, దీపం ఆరాల్సిందే, దేహం కాలాల్సిందే, దహనం కావాల్సిందే " ఈ ఒక్క పరిస్థితిలో మాత్రం ధనికుడు దరిద్రుడు అనే భేధాలే ఉండవ్ "అందరూ సమానమే అందరి హోదా స్మశానమే"!!! --------------------------------------------- 18/03/2014

by Sri Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKL5Dw

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

పోయే లోపు ---------- నాకూ ఉంటుంది.. తిరగాలని.. ఎగరాలనీ.. మీలా పార్టీలు చేసుకోవాలనీ, ఫ్రెండ్స్ తో షికార్లు చేయాలనీ, ప్రపంచాన్ని చుట్టెయ్యాలనీ, చుట్టిన ప్రపంచాన్ని మూట కట్టి సెల్లులోకి తోసి ఫేసుబుక్కులో పడేసి లైకుల టపాసులు పేల్చి, కామెంట్ల కాకరొత్తులు కాల్చి అమితానందపు దీవాలి చేసుకోవాలని.., కారుల్లో పక్కన సీటుల్లో ఉరకల్లో ఉయ్యాలూగుతూ ఒకరిపై ఒకరు తూగుతూ లాంగు జర్నీలు చెయ్యాలని, ధనవంతులు మాత్రమే లోపలికి వెళ్ళగలిగే పెద్ద పెద్ద హోటళ్ళలో ఒక్కసారైనా దూరి నా నాటు ద్యాన్సు చెయ్యాలనీ, ఎస్పీలు, జానకీలే కాదు నాలాంటి బాతురూము సింగర్లు కూడా పాదగలరని స్టేజీలెక్కి అరవాలనీ, ఇలా ఎవో ఎవో చెయ్యాలని ఉంది.. కనీ నేనో వ్యూహం లో ఉన్నా.. లక్ష్య సాధన లో ఉన్నా.. మీరందరూ కొద్దొ గొప్పొ డబ్బున్నోళ్ళుగా పుట్టారు.. పోయేటప్పుడు కూడా డబ్బున్నోళ్ళుగానే పోతారు.. నేను మాత్రం అలా కాదు.. పేదోడి కడుపున పుట్టా.. పేదోడిగా పుట్టా.. పేదోడిగానే పోయినా పరవాలేదు.. కానీ డబ్బున్నోడి డాబులన్నీ దండమెట్టి నాముందు బాంచన్ అని మొక్కేలా చేస్తా పోయే లోపు.. నేను పోయే లోపు.. ఈలోకం డబ్బున్నోడి సొంతం అని ఈ పపంచం ఫిక్సయ్యి పోయ్యే లోపు.. - సాట్నా సత్యం, 18-03-2014, 17:53

by Gaddamanugu Venkata Satyanarayana Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKL5Dp

Posted by Katta

Mala Chidanand కవిత

||ప్రేమోదయం|| ఒక నిండు మనసు కురిపించిన ప్రేమ వర్షంలో.... తడిసి మనిషిగా మారిందొక జీవితం... మొదటినుండి ఒక ధారలానే మురిపిస్తున్న ప్రేమను గుర్తించలేక, విచక్షణాహీనమైన మనసొకటి ఎన్నెన్నో అర్థంలేని పొగరుతో నేను అనే అహంభావముతో నీవు లేకపోయినా ఉండగలను అనే వెర్రి ఆలోచనతో భలే ఎగిరింది ఉన్మాదినిలా. ఇవన్ని చల్లగా చూస్తూ ఉన్న ప్రకృతి ఇప్పుడు రంగలోకి దిగింది. ఆ మనసుకు దివ్యదర్శనం కలిగించింది. తెలుపు-నలుపు, మంచి- చెడ్డల అనుభవం ఒక అందమైన పాఠంలా నేర్పింది.జీవితాన్నిచ్చింది. ఇదేనేమో ప్రేమ మహిమ. ప్రేమ గొప్పదనం. ప్రకృతి కారుణ్యము. చిగురుటాకులోంచి అప్పుడే పడుతున్న చిన్నారి చినుకులనూ తనలో చేర్చుకుని హాయిగా ప్రవహించే నదీమతల్లిలా, వర్షం తర్వాత మెరిసే శుభ్రాకాశంలా, మంచి కుసుమాలపైనుంచి వీచే చల్లని పవనంలా, ముదమును కలిగించు పచ్చని సిరులతో నిండిన భూమాతలా, వేదోక్త మంత్రాలతో అర్చిస్తున్నప్పుడు హోమకుండంలోని అగ్నిహోత్రుడిలా, పంచభూతాల సాక్షిగా నీవందించిన ప్రేమ జన్మజన్మలకూ మరిచిపోలేను ప్రాణమా. నా జీవమా. ॥మాలచిదానంద్॥18-3-2014||

by Mala Chidanandfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKL5mY

Posted by Katta

Pusyami Sagar కవిత

కాలం ______పుష్యమి సాగర్ కాలాలు, గడియారపు ముళ్ళ తో పెనవేసుకొని వడి వడి గా చరిత్రాక్షరాలను లిఖిస్తుంటాయి !!! రాత్రి పగలు సెకన్లలో కి కొట్టుకొచ్చి శబ్ద తరంగాల ను తాకుతూ ఉవ్వెత్తున లేగుస్తాయి అచ్చం తీరం దాటని కెరటం లా...!!! కాల గర్బమున దాగిన ఘటన సమూహాలు తమని తాము తవ్వుకుంటూ తిరిగి సాక్షాత్కరించినపుడు కళ్ళలో చిప్పిన కన్నీరు ఎగిసిన ఉప్పెన లా కదం తొక్కుతున్నది !!! తెగిపడిన జీవితపు శకలాలు నిశబ్ధం గా గోడ నిండా పరుచుకొని వలయాలలో కి విసిరేసిన పాత సమయాలను గుర్తుకు తెచ్చుకొని వెక్కి వెక్కీ ఎడుస్తుంటాయి గుండె బరువేక్కెలా ...!!! మార్చ్ 18, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1onICAw

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

సీమంతం నిన్నటివరకూ వీడు తెల్లవారు జామునే నా పక్కలో చేరేవాడు డొక్కలో దూరి కాళ్లు ముడుచుకుని మరీ వెచ్చగా పడుకునే వాడు రోజూ వీడికంటే ముందుగా నేనే నిద్రలేచేదాన్ని వీడిని ఎంతలేపినా ఆ దుప్పటి తీసి ఓ అంతట తల బయటపెట్టేవాడు కాదు రెండు చెవుల్లో సింధూర మందారాలు పెట్టుకుని వాటి మధ్యలోంచి బద్ధకంగా ఓ చిరునవ్వు విసిరి మళ్లీ ముసుగేసేవాడు నిజం చెప్పాలంటే రోజంతా ముసుగులోంచే ఓరగా చూస్తూ మొత్తగా నవ్వుతూ ఆడేవాడు అమ్మ వీడి బుగ్గ గిల్లి బహుశ దక్షిణంవైపు ఒత్తిగిలేలా పడుకోబెట్టినట్టుంది అంతే వీడికేదో అయ్యింది నాకంటే ముందే నిద్రలేస్తున్నాడు. నేను లేచేసరికే ఎర్రటి కళ్లతో చురుక్కున చూస్తున్నాడు వీడో చిత్రకారుడనే సంగతి నాకసలు తెలియనే తెలియదు ఆకుల్లో దూరి రంగులు మార్చేస్తున్నాడు ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగుల్ని ఎన్ని రకాలుగా కలిపి ఎన్ని కొత్త ఛాయలు సృష్టించ వచ్చో చూపిస్తున్నాడు ఒక్కో ఆకుమీదా రెండు రంగుల్లోనే వంద రకాల వర్ణక్రీడల నీడలు చూపిస్తున్నాడు మెజీషియన్లాు కొమ్మల్లోకి మునివేళ్లు దూర్చి నీటిగదుల్లో నిద్రపోయే చిగురులని బైటికి లాగుతున్నాడు చిగురుటాకుల బుగ్గలమీది కొత్తరంగుల్ని తన ఇష్టానుసారం దిద్దుతున్నాడు వీడికేమయ్యిందో తెలియదు ఒక్క ఆకు కూడా లేకుండా ఎండి రాలిపోతాయనుకున్న కొమ్మలకి సకల వర్ణాలతో విరగబూస్తున్నాడు వీడితో పాటు మంచులో సుప్తమైన సమస్త వర్ణమయ తేజస్సులనీ పూలలోంచి పలికిస్తున్నాడు పూలగాజులు తొడిగిన కొమ్మల చేతుల్లోని చేటలనిండా రంగుల్ని నింపి దిక్కుల చివరిదాకా తూర్పార బడుతున్నాడు ఎప్పుడో తెలియదుగానీ చూస్తూ చూస్తుండగానే మొత్తంచెట్టునే ఓ అతిపెద్ద పూలగుత్తిగా మార్చాడు నా ఇంట్లో చెట్లనీ నా వీధిలో చెట్లనీ నా ఊర్లో చెట్లనీ పూనకంలా పట్టుకున్నాడు గాలిలో కనిపించని పూనకంలా ఊయలూగుతూ రంగుల తరంగాలై కేరింతలు కొడుతున్నాడు అక్కడితో ఆగలేదు ఈ అబ్బురాల చమత్కారుడు అడవిమీద పడ్డాడు తన భుజం మీది అంగీలా పర్వతాలు మీద మండు టెండని పరిచేశాడు రంగులుమారి ఎండి రాలే ఆకుల్ని మూటకట్టుకుంటూనే అడవంతా గుట్టలు గుట్టలుగా రంగుల ద్వీపాలను నింపేశాడు. ఒళ్లంతా పుప్పొళ్ల వసంతం చల్లుకుని నానా వర్ణమయ ద్వీపాల మీది సుగంధాల్లో ఎండ రెక్కలు విప్పి ఏకాకిగా ఎగురుతున్నాడు అనంతంలో కొత్త శక్తులతో వికసించిన అగ్నిపుష్పాన్ని తురుముకుని పుడమి తల్లి కొత్తజీవంతో పులకించడం పుడమికి సీమంతంలో వసంతం ఇదేనా!!! ఇదేనా!!! ఇల్లిదేనా!!! వసీరా

by Vakkalanka Vaseerafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iYxg73

Posted by Katta

Maheswari Goldy కవిత

మహేశ్వరి గోల్డి || శృ తి ల య లు || మధు మోహనా...!! మధుర స్వాంతనలో మౌనికనయి శ్వాసిస్తున్న నా ఊపిరి ఊహలు అనురాగ సౌధంలో ఆమని కవితలుగా సంతరించుకుంటూ మధువనిలో మంత్రజలముతో గత విధి జ్ఞాపకాలకు........... ఊపిరి పోస్తే అది ఒక ఆశ్చర్యం...!! మరి ఎందుకో తెలుపనా...?? ఓ నా ప్రియసఖా...!! అందంగా అలంకరించుకున్న మలయమారుతాలు నా కవితా భాష్యాలకు నగిషీలద్ది...!! కృష్ణమ్మ నదిలో నీలి కెరటాల ముసుగులో అనురాగ తెమ్మెరలపై దివ్య దీపాలయి ప్రేమ సింధూరపు వన్నెలతో ప్రణయరాగం అలపిస్తూ పరవశిస్తూ పుడమి పై పుష్యమి నక్షత్రాలుగా వర్షిస్తూ నర్తిస్తున్నవి మమతావేశపు వెల్లువలో వసూధరా...!! ఆ వెల్లువలో సుగంధినీ లతలా ఇంధ్రధనస్సు అంచున మాలతీ సౌరభాల సాక్షిగా నే అల్లుకుపోతున్నా సౌగంధికా వనవాసంలో ఓ ఊహల వాహినిలా నా సునయనా...!! ఆ ఊహలు గత జన్మ తిమిరాలను సైతం ఈ జన్మ వేదికలో అందమయిన అక్షర కాంతిలో కరిగించి కావేరి సరోవరాన ప్రేమ సుమాలతో సాదరంగా స్వాగతిస్తున్నవి సిరిసిరి మువ్వల గమకములయి స్వయంవరా...!! ఆ స్వాగతాలు మన ప్రేమసౌధంలో అనురాగ వీణపై సరిగమ సరాగాలుగా శృతిలొలికిస్తూ రాగదీవిలో నీ కరి నాగు కురుల కవితా కోమలిని ఓ వెన్నెల శిల్పంలా అలంకరిస్తున్నవి మనోహరా...!! ఆ అలంకరణలో ఓ దివ్య గంధర్వ కోమలినయి నే ఎదురు చూస్తున్నా...!! మాధవుని ఆరాధనకు మమతల దీపాలతో ఎదురుచూసిన ఓ అనురాగవతిలా నీ ప్రియ మధుమతినయి మధూధయా...!! 18/03/2014

by Maheswari Goldyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OrHhvW

Posted by Katta

Girija Nookala కవిత

మానవత్వం ముక్కలయ్యింది నిండు గర్భిణి మానభంగమా మానవ జాతి విక్రుత రూపమా ఈ మతం ఈ సంస్క్రుతి ఈ చట్టం ఈ సంఘం వేయ లేవా ఈ విస్రులుంఖ కామానికి సంకెళ్ళు? ఎక్కడ చూసిన లంచం లంచం లంచం ఉరిలో బ్రతుకులు ధ్వంస్వం దేవుడి చుట్టూ జనం జనం 'క్విడ్ ప్రొ క్వో కి ఈశ్వరుడు తో కూడా ఒప్పందం? నాగరికత చేతిలొ భళ్ళుని పగిలిన మానవత్వం ధర్మం నడవలేక డేకుతున్న ద్రుశ్యం మత్తు చేసిన పాపాలు,స్వార్ధం విశ్వరూపాలు అడుగులు వేసే మానవ జాతికి గుచ్చుకుంటున్న గాజు పెంకులు హాస్పిటల్ లొ లంచాల బెడద టాయలెట్ కి వెళ్ళలేని దుస్థితి గర్భిణిని మానభంగ ప్రయతన్నం.ఇలాంటి వార్తలు మనసును కలచివేస్తున్నాయి.నిస్ప్రుహ వస్తున్నాది.....

by Girija Nookalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lK4nIZ

Posted by Katta

Chennapragada Vns Sarma కవిత

ఎన్నికల ప్రస్థానం-7 అన్ని పార్టీల గుండెల్లో మోగిస్తున్నారు రెబెల్స్.. ప్రచారం చేస్తున్నారు యథేచ్ఛగా గోబెల్స్.. నామినేషన్ల ఉపసంహరణంలో మునిగినారు నేతలు.. అలకలు తీర్చకుంటే ఓటుబ్యాంకుకు కోతలు.. \18.3.14\

by Chennapragada Vns Sarmafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nzQ0M1

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ••కొన్ని ఉదయాల మెలుకువ •• అడివిలో ఆకు మత్తు మెలుకువ- పసిపాపకి తల్లి స్పర్శ వెలుతురు ముద్దు- యుగాల నిద్ర , బరువు కనులు దేహం నుండి అంగం విడిపోయే ఒక హెచ్చరికలా చూపు విడుదల- మెల్లి మెల్లిగా ఐనా సమస్త చీకటి తిను వెలుగు- ఉదయాలు - 18-03-14

by Vijay Kumar Svkfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nzQ2Uo

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

జీవించటం ఎలాగు చేతకాదు కనీసం ఎలాగోలా బ్రతకటం నేర్చుకో బ్రతకటం చేతకాపోతే చచ్చే అర్హత నేకేది ఇంకో ప్రాణిని చంపే అర్హత నీకేదీ సమస్యలు లేని మనిషి లేదు ప్రతి సమస్యకు చావే సమాధానమా నిన్ను కన్న తల్లి తండ్రులకు ఎవడు ఇస్తాడు సమాధానం . అభం శుభం తెలియని చిన్నరులని నీ మూర్ఖపు ఆవేశానికి బలి ఇచ్చే అధికారు ఎవరు ఇచ్చారు నువ్వు ఏడుస్తూ నీవాల్లను ఏడిపిస్తూ బ్రతకవద్దు .. సమస్య మూలం తెలుసుకో పరిష్కారం తప్పక దొరుకుతుంది నీ ఖర్మ కు నీకు పుట్టిన చిన్నారుల బంగారు భవితను బుగ్గిపాలు చేయకు అమ్మతనపు విలువలు పెంచు అందరికి ఆదర్శంగా పెంచు .. !!పార్ధ !!18mar 14 భార్య భర్తల కీచులాటలో చిన్నపిల్లల్ని భావి లో తోసి ఆమె దూకి ,చివరకు ఆమె బయటపడి ,పిల్లలు చనిపోయిన దుర్ఘటన కలచి వేస్తె .. వచ్చిన భావావేశం

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NpSOKQ

Posted by Katta

Cv Suresh కవిత

సి.వి.సురేష్ || కొ న్ని ప ల క ని మా ట లు || నిన్నటి మాటలేవో ముక్కలు ముక్కలుగా విరిగి వె౦టే నడుస్తాయి ఎ౦దుకో? కొన్ని మాటలు మాయమైన సరస్వతీ నదీ తీరాన చేరుస్తాయ్ మరికొన్ని మాటలు వైతరణీ నదిని దాటిస్తు౦టాయి ఎ౦దుకో? మాటే రాని మూగ‌ అలలకూ అర్థ౦కాదు హొరున ఆ శబ్ధాలెలా తన ను౦డి పుట్టుకొస్తాయో? కొన్ని క్షణాలేమో కాలాన్ని పట్టి౦చుకొలేవు ప్రశ్ని౦చే మాటలేవో శిఖరపు అ౦చున చేరుకొ౦టాయ్ ఎ౦దుకో? మౌన౦గా సాగరాన తేలియాడే అల తీరాన్ని తాకి తిరుగు ప్రయాణమె౦దుకవుతు౦దో అర్థ౦కాదు 2 కొన్ని మాటలు వర్షపు ధ్వనిలా ఎడతెరపి లేకు౦డా చెవిలో మార్మోగుతూనే ఉ౦టాయి ఒ౦టరిదైన రాత్రి ఏ తోడు లేని నన్ను కొన్ని దృశ్యాలతో.... ఇ౦కొన్ని చీకటి పాటలతో.. మరికొన్ని మాట‌లతో ఆత్మబ౦ధువులా పలకరిస్తు౦ది 3 సరె! రేపటి మాటలకైనా అక్షరాలు కొరవడ‌వా? రేపూ షరా మామూలే! @సి.వి.సురేష్

by Cv Sureshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iY7tYa

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ ఎక్కడో ఈ క్షణం..... కొన్ని గనుల్లో నువ్వు వెతుక్కుంటావు నీ కన్నుల్లో పాడుబడిన ఆశలకు ఆధారాలను నిరుడు సమీకరించని సమీకరణాలు ఎన్నో నేడు లెక్కెడుతుంటావు ఇంకొన్నాళ్ళను పోగేసుకుంటూ వెయ్యి కత్తులను నీ లోగొంతుకలో ఎవరో దింపారు ఇప్పుడే నింపాదిగ చూ(తీ)సుకో అన్ని రక్తపు బొట్లకు ఇప్పుడే వెలకట్టవసరం లేకుండా ఇంకా ఎన్ని నిశ్శబ్ధ యుద్ధాలను కూడబెడ్తావు నిప్పులు నానిన ఆ నీటిలో మాటలను జతకడుతూ మౌనాన్ని మోసుకొస్తూ ఎందరి ముందు నిల్చుంటావు నీది కాని చోట ఉప్పు కణికలను ఎన్నాళ్ళు మధించాలి తేనె సూత్రాలను చేదించడానికి ఇప్పుడు కొత్త గనులేవో తారసపడుతున్నాయి ఈ పూట ఇంకొన్నాళ్ళు అన్వేషిస్తాను . తిలక్ బొమ్మరాజు 18.03.2014

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iY7tHJ

Posted by Katta

Murali Mohan కవిత

2013 ఉమ్మిడిశెట్టి సాహితీ అవార్డు Sailaja Mithra గారి "రాతిచిగుళ్లు" కవితా సంపుటానికి ప్రకటింఛారు. కవయిత్రికి అభినందనలు!

by Murali Mohanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nzqU01

Posted by Katta

Kotha Anil Kumar కవిత

@ వర్ణం @ అరుణ వర్ణం ఈ సూర్యోదయం అస్తమయమూ పసిడి వర్ణమే ఆకాశామదిగో నీల వర్ణం ఆ కింది మట్టిలో నానా వర్ణాలు వర్ణమే లేని జలానిదీ కాంతి వర్ణం అన్ని వర్ణాలకు జీవమిచ్చె పంట పచ్చని వర్ణం ఊరి గుమ్మంలో శక్తినిచ్చే చందన వర్ణం ఇంటి గడపకు పుసుకున్న పసుపు వర్ణం పలికే రామచిలుక దొక వర్ణం ఎగిరే పాలపిట్ట దొక వర్ణం ఆడే నెమలి కన్ను దొక వర్ణం కమ్మిన కారు మబ్బులు కాకి వర్ణం మూసి తెరిచిన కనులకు ఇరు వర్ణాలు వర్ణమే తెలియని ఎద భాష వర్ణనాతీతం మెరిసే పసి తనానిదొక వర్ణం నెరిసిన ముసలి బతుకుదొక వర్ణం నీదొక వర్ణం నాదొక వర్ణం మనదంతా కలిసి మానవత్వ వర్ణం శత వర్ణాలు నింపుకుని విలసిల్లుతూ శత కోటి మహా కల్పాల హైందవ వర్ణం _ కొత్త అనిల్ కుమార్ 18 / 3 / 2014

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p4Mdln

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 21 (కవిసంగమం) ____________________________ "మట్టి రాతలు"(కవిత్వం ) రాసినది :- డా:కత్తిమండ ప్రతాప్ పరిచయం చేస్తున్నది:- రాజారామ్.టి " చెరిగిపోని రాతల సంతక కవిత్వం మట్టి రాతలు" "అస్పృశ్యుడు ఈ లోకంలోనే సంచరిస్తున్నాడు నిత్య నయవంచనకు లోనవుతు నలుగురి మధ్య నల్లగా నలిగిపోతూ బతుకు చితికి పోతూ అతుకుల బతుకులతో మెతుకుల కోసంఅన్వేషిస్తూ..." ఇలా తమ బ్రతుకులను ఎర్రగా పండించుకోడానికి అగ్ర వర్ణం దళిత వర్ణాన్ని సున్నంగా వాడుకొంటున్న వైనాన్ని తన కవిత్వంతో బట్టబయలు చేసే యత్నం చేస్తున్నవాడు కత్తిమండ ప్రతాప్. "అక్షరాలు పరిగెడుతున్నాయి ఆవేశంగా భాష దాటి భావాల కోసం భావోద్వేగాల కోసం" అంటూ కవిత్వం ఫిరంగి అయితే మాటలు తూటాలైతే నా చేతులు ట్రిగ్గర్ మీదే వుంటాయంటూ సమాజ డురంతాల మీద తుపాకీ ఎక్కుపెట్టిన వాడు కత్తిమండ ప్రతాప్. 'నేను పనుల్లో శ్రమల్లో స్వేదంలో నిత్యం తడుస్తాను" అని చెబుతూ వ్యవస్థ గుండె గాయాలను మాన్పడం కోసం పాదాలకు ఎన్ని గాయాలైనా నిత్యాన్వేషిగా వెతుకులాట బాటలోనే పయనిస్తానంటున్న వాడు కత్తిమండ ప్రతాప్. ప్రతాప్ కవిత్వం పాఠకులకు పరవశాన్ని ఇవ్వకపోవచ్చు కానీ,చదివేవారి గుండెల్లో ఆలోచనా అలల అలజడిని రేకెత్తిస్తుంది.మండే మేధస్సుల్లోంచి ఆవేశం ఉరికురికి వచ్చేటట్లు చేస్తుంది.ఆ ఆవేశంలోంచి ప్రశ్నల పరంపరను దుర్మార్గ సమాజంపై సంధింపజేస్తుంది. ఇంతకన్నా వేరే ప్రయోజనం కవిత్వానికీ అవసరం లేదనుకోవచ్చు.గొప్ప ఊహలతో,అందమైన భావ చిత్రాలతో,కొత్తకొత్త సాదృశ్యాలతో,మనోహర భావవ్యంజకమైన విశేషాలతో కవిత్వం వుండాలని కొందరి కోరిక.కదిలించేది కవిత్వమైనప్పుడు ప్రతాప్ రాసింది కవిత్వమే.అనవసరంగా ఆలంకారించకుండా,ప్రాసతో పనిలేకపోయినా,ప్రయాసపడుతూ ప్రాసను ప్రయోగించకుండా,హృదయం ఎట్లా కంపిస్తే అట్లా తన హృదయ కంపనలను "మట్టి రాతలు" చేశాడు ప్రతాప్. కవి లేదా కవయిత్రి పాత్రను తనపై ఆరోపించుకొని ఆత్మాశ్రయ ధోరణిలో కవిత్వం రాయడం చేస్తుంటారు.ఈ కవి కూడ "మట్టి రాతలు" అనే ఈ సంపుటిలో ఎక్కువగా "నేను" అనే కవితల్ని రాశాడు.పాత్రను తనపై ఆరోపించుకోకుండా వొక అబ్జర్వర్ గా కవిత్వాన్ని చిత్రించిన కవితలు అరుదు. "కాల గర్భంలో కలసిపోతున్న కన్నీటి గాథలను చూడలేనని కాబోలు అంధకారంలో స్వేచ్ఛగా విహరించమని అంధుడను చేశావు" (ఆత్మ విశ్వాసం)1 'నా ఙ్ఞాపకాలను స్కానింగ్ చేస్తున్నా గతాలను చితి చేసేద్దామని "(ఙ్ఞాపకాల స్కానింగ్)2 ఒక రాత్రి సమాధిలో నుండి బయటకు వచ్చి చూశా మోసాల లోకంలో పాపాల చూడలేక ఒక క్షణం వుండలేక మళ్లీ నా సమాధి స్వేచ్ఛా లోకంలోకి పారిపోయా (సమాధిలో నేను)3 ఇలా చాల కవితల్లో(1,2,3) కవి పాత్రను తనపై ఆరోపించుకొని కవిత్వం చెప్పాడు. మనిషికి వుండాల్సింది విశ్వాసమే అయినా ఆత్మవిశ్వాసం వుంటే మనిషి మరింత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు.అలాంటి ఆత్మవిశ్వాసం వికలాంగులు ప్రోది చేసుకోవాల్సిన అవసరాన్ని కవితా సంపుటి ఆరంభంలోనే కవిత్వం చేసి తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకొన్నాడు.కళ్లు లేని తనం, కాళ్లు లేని తనం ,చేతులు లేని తనం ఇవన్నీ కలిగి వుండటం వల్లనే సమాజంలోని దురంతాలను చూడకుండా వున్నానని,సమాజంలోని ముళ్ల పొదల బాటలు దాటాల్సిన అవసరం లేకుండా పోయిందని,పాపాలు చేయకుండా వుండిపోయానని కవి "ఆత్మ విశ్వాసం"-అనే కవితలో పాజిటివ్ గా ఆలోచింప జేస్తూ,అంగాల లేమిని తన భావాలతో సమర్థన చేసుకోవడమే కాక "ఆత్మ విశ్వాసం వెయ్యి ఏనుగుల బలంతో గెలిచింది"-అంటూ అత్మ విశ్వాసానికి ఎవరెస్ట్ హోదాని ఈ కవితలో కలుగచేశాడు. "మట్టి నెర్రల మధ్య చర్మపు ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయి వెంటాడే ఙ్ఞాపకాల నీడల్లా" (కుబుసం)4 ఈకవితా పాదాల్లో(4)కవి నెర్రలు పోవడం అనే లక్షణం మట్టికీ,చర్మానికీ వుండటం అనే అంశాన్ని గుర్తు చేస్తూ,వొక మంచి సాదృశ్యాన్ని సాధించడమే కాక తన పాత ఙ్ఞాపకాలను పాము కుబుసం విడిచినట్టుగా మనసు వదిలివేసుకోవాలనుకుంటున్నదని మనసులోని ఘర్షణని వొక మంచి పోలికలతో వ్యక్తం చేస్తాడు. "కొవ్వొత్తి (లా)ని నేను నిత్యం అగ్నికి ఆహుతి అవుతాను కన్నీటి ధారనై జారిపోతాను"(కరగి పోయే జీవితం)5 పై కవితలో(5) అందరు కవుల్లాగానే కొవ్వొత్తిని త్యాగానికి ప్రతీకాగా చేసినప్పటికీ "కన్నీటి ధారనై జారిపోతాను"-అని అనటం ద్వారా వొక కొత్త అభివ్యక్తిని కవి సాధించాడు.కొవ్వొత్తి కరిగే టప్పుడు కారే మైనపు ద్రవాన్ని కన్నిటితో పోల్చి ఆ కొవ్వొత్తికి మానవత్వ లక్షణం ఆరోపించి కవితకు కొత్త రూపును సాధించాడు. పదాలతో ఆడుకోవటం,వాటిని వీనులకు ఇంపుకలిగేటట్లు ప్రయోగించటం వొక అక్షరం మార్పుతో ఒక కొత్త అర్థాన్ని స్ఫురింపచేయడం ఇవన్నీ కవికి పదాలపై గల అధికారాన్ని తెలియచేస్తాయి.ఒక కవితలో "పగబట్టిన పాములా రేగుతున్న గాయం/పొగబట్టిన దీపంలా మసకబారిన జీవితం"అన్న వాక్యాలున్నాయి.ఈ పంక్తుల్లో "పగబట్టిన", "పొగబట్టిన" అనే ఈ రెండు పదాల్లో మొదటి పదంలో "అ"కారాన్ని,రెండోపదంలో"ఒ'కారంగా మార్చి ఉచ్ఛారణలో ఒకే పదంలా ముందు పాఠకులకు అనిపించిన తరువాత ఆలోచనతో ఆ పదప్రయోగ వైచిత్రిని వారు ఆస్వాదిస్తారు.ఇట్లాంటి చిత్రపద ప్రయోగం ప్రతాప్ చాల కవితల్లో చేశాడు. ఈ కవికీ మరొక లక్షణం కూడా వుంది.ఏ సామాజిక దురంతాన్నైనా తీవ్రంగా స్పందించి కవిత్వం చేయడం."కు(క)ల కలం"అనే కవితలో"కలానికి కూడా కులం కావాలని నా సిరా చుక్కకు తెలీదు" -అంటూనే సమాజంలో కులానికీ గల బలాన్ని ఎరుక చేసుకొని,"కలం ముందు కులం ఓడిపోయేలా"-తన కలం లోని రక్తపు సిరా విలయతాండవం చేయాలనే అభ్యుదయ ఆలోచనని ప్రకటిస్తాడు ప్రతాప్.కొందరు కవులు చేసినట్లే కవితా పాదాలలో గాని,కవితా శీర్షికలలోగాని కుండళీకరణాలలో ఒక అక్షరాన్ని పెట్టి ఒక కొత్త అర్ఠాన్ని సాధించే ప్రయత్నం చేశాడు. "వెలుగులో చీకటి"అనే కవితలో "నర రూప (మ)మృగ సంహారం ఇంకెప్పుడు"-అనే వాక్యంలో కుండలీకరణంలో "మ" అనే అక్షరం వుంచి మగ,మృగ అనే పదాలను ప్రయోగించిన భావనను పఠితకు కలిగించాడు.ఇలాంటి ప్రయోగాలు కవులు అభివృద్ధి దశలో చేస్తుంటారు. "మట్టి రాతలు"-అనే కవితలో కవి తనకు,ఇంకొక వ్యక్తికీ గల వ్యత్యాస్యాన్ని చాల కవితాత్మకంగా ఆ వ్యక్తివి కల్పనలని,తనవి మట్టి రాతలని యథార్ఠంగా సత్యాంగ్రహంతో చెబుతాడు. "నువ్వు ప్రత్యూష కిరణాల్లొ ఉషోదయాల్లో తుమ్మెదల్లో తుమ్మెదల్లో తేలియాడుతావు "(మట్టిరాతలు)7 "నేను ఆకలి కేకల్లో ఎంగిలి విస్త్ర్లో కాలే ఉదరంతో సంచరిస్తాను" (మట్టిరాతలు)8 పైన కనపరిచిన పాదాలలో(7,8) ఇతరులతో పోల్చినప్పుడు తన జీవితం ఎట్లా మట్టికొట్టుకపోయిందో చెబుతూ మరికొన్ని పాదాలలో ఆ దుస్థితిని మరింత దుఃఖాత్మకంగా చెబుతాడు. ఇలాంటి రసాత్మక వాక్యాలతో ప్రతాప్ కవితా సంపుటి కవిత్వ ప్రియుల్నీ అలరిస్తంది. ప్రతాప్ ఇంకా మంచి కవిగా స్థానం సంపాయించుకోవాలంటే కొన్ని ఆలోచనలు పంచుకొని పాటిస్తే అది సాధ్యం.కవితా సంపుటి ప్రచురింకోవాలనుకున్నప్పుడు రాసిందంతా ముద్రణలో చూసుకోవాలనే కోరికను నిగ్రహించుకొని వుండాల్సింది.తన మిత్రుల అభిప్రాయాలు శ్రేయోభిలాషుల సలహాలు తీసుకొని కవిత్వ సంపుటిలో అర్హమైన కవితల్ని చేర్చి వుండాల్సింది.పునరావృతంగా వుండే భావాల్ని కల కవితల్నీ,మూర్తి గారు "కవిత్వంలో ఏడడుగులు'-అన్న శీర్షికలో అన్నట్టుగా రొడ్డుకొట్టుడు పదాల కవితల్ని తొలగింపు చేసి వుంటే కవిత్వం మరింత మెరుగయ్యేది.జాన్ డ్రైడెన్ అన్నట్టుగా పాలిష్ ఎన్నిసార్లు చేస్తే పాదరక్షలు అంతా తళాతళ మెరిసినట్లుగా కవి కూడా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు తిరగ రాయటం మూలాన కవిత్వం అచ్చమైన కవిత్వంగా మిగిలిపోవడమే కాక,అనవసర పదాలు తొలిగిపోతాయన్న విషయాన్ని గ్రహిస్తే కవిత్వం త్రిపురనేని అన్నట్లు వచనమై తేలిపోకుండా కవిత్వమై నిలుస్తుంది.ఇవన్ని ప్రతాప్ అభివృద్ధి కాంక్షతో చెప్పినవే. "చెప్పులు కుట్టె నా చేతుల తోనే నీ నాలుక కుట్టెయాలని వుంది- బట్టలుతికే నా చేతులతోనే నిన్ను బండకేసి కొట్టలని వుంది' (గాయం)8 ఇలా(8) కులవృత్తుల పట్ల ఆ కులవృత్తుల్ని నీచంగా చూస్తున్న అహంకార జాడ్యం ప్రదర్షించే వారిపట్ల ఈ కవి ప్రదర్షించేదీ ధర్మాగ్రహమే."తత్వం తెలీక కవిత్వంరాసా"అని అంటున్న ప్రతాప్ చాల నిజాయితిగా "నా రచనల్లో కవిత్వం తక్కువగా వున్నా చెప్ప దలుచుకున్న అంశం సూటిగా చెప్పటమే నా తత్వం"-అని అన్నా ఎన్నో కవితాత్మక వాక్యాలు సంపుటంతా నిండి మనల్ని ఆనందపరుస్తాయి.ప్రతాప్ ఏది చెప్పిన కవిత్వమే చెప్పాడు కాబట్టి ఇతన్ని అభిమానిస్తు అభినదింస్తూ...వచ్చే మంగళవారం మరో కవితా సంపుటితో కలుద్దామని చెబుతూ రాబోయే ప్రపంచ కవిత్వ దినోత్సవ శుభాకాంక్షలు కవి మిత్రులకు చెబుతున్నా.మంచి కవిత్వం కవి సంగమ కవులనుంచే వస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ సెలవు.

by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ojaIgk

Posted by Katta

Abd Wahed కవిత

పెళ్ళికళ తారల్లా రాలుతున్న మాటలు నేలను తాకకముందే బూడిదలు... నాయకత్వం మెరుపులు పరచుకుంటున్న చీకటి వలలు కావలించుకునే చూపుల గేలం రాజకీయ ప్రవాహంలో అమాయక చేపల విహారం ఇప్పుడిప్పుడే అతను కలిశాడు చిటికెల పందిళ్ళు, మాటల మహళ్ళు కట్టేశాడు ఇప్పుడిప్పుడే వెళ్ళాడు పారిపోయిన నా ఊపిరి తిరిగొచ్చింది... మరిచిపో ఆ కలయికలు రాత్ గయీ బాత్ గయీ... జలతారు మేలిముసుగులో హామీల కన్యలు కాకులు రెట్టవేసే అందమైన విగ్రహాలే... ఐదేళ్ళ ఆషాఢమాసం ఎడబాటు తప్పదు...మరపు తప్పదు ఇది కల్యాణఘడియ ... పెళ్ళికళ వచ్చేసింది మరపు ఆకాశంలో అరుంధతీ నక్షత్రాన్ని మరోసారి చూసేద్దాం... గుంపులు గుంపులుగా ప్రవహిస్తుంటే పల్లానికే కొట్టుకుపోవడం ప్రతినీటి బొట్టు ఒంటరే... చీకటి తుమ్మకు వెలుగుపూలు పూస్తాయా? పెళ్ళికళ వచ్చేసింది...కాస్త ఆలోచించు...

by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVQIRR

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||ఎనోమలి|| వాడొక చినుకులాగా వున్నప్పుడు మొలకెత్తే విత్తులా వున్నప్పుడు విచ్చుకున్న పువ్వులాగా నవ్వినప్పుడు విరజిమ్ముతున్న నిప్పై రగిలినప్పుడు వాడొక తేడాగాడు. సులభ్ కాంప్లెక్స్ తలుపు మీద రాతలా లేనప్పుడు తుపుక్కున్న ఉమ్మిన పాన్ మరక కానప్పుడు జిల్ జిల్ జిగాలో ముడుక్కుని కూర్చున్నప్పుడు బురదలో పందిలా దొర్లనప్పుడు వాడొక తేడాగాడు. కాస్తంత బుర్రను వెలిగించుకున్నప్పుడు మైకాన్ని వదిలి మాట్లాడినప్పుడు బాధ్యతకు నిలబడి బతికినప్పుడు గుండెల్ని తెరుచుకుని హత్తుకున్నప్పుడు వాడొక తేడాగాడు. సవాలక్షా మాడాగాళ్లకు, మాయదారి మీటాగాళ్లకు అప్పుడైనా, ఇప్పుడైనా, ఇంకెప్పుడైనా వాడెప్పుడూ తేడాగాడే. ------------------------- 17/03/2014., 23.29

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVQHgX

Posted by Katta

Wilson Rao Kommavarapu కవిత

ఒక రసవద్గీత----కె.విల్సన్ రావు/89854 35515 సాహితీ గవాక్షం/17.03.2014(సోమవారం) మనం ఒకరికొకరం దగ్గరవుతూ నిరంతరం ప్రేమించుకుంటూనే వుంటూ విప్పారిన మనసులతో పరవసించిపొతూనే వుంటాం గుప్పెడు జ్ఞాపకాల్ని ఒలుచుకుంటూ, ఒంపుకుంటూ నిత్య వ్యవహార వలయాల్ని ఛేదించుకుంటూ ఎన్నెన్నో మజిలీల్ని దాటుకుంటూ ప్రేమకంటే తీయనిదేదీ లేదని ఆఖరి ప్రకటన వెలువరిస్తాం అదేమి చిత్రమో గానీ! కలుసుకోవాలని ఆరాటపడే మనల్ని శాసిస్తూ, అదిలిస్తూ కాలం నిర్దయగా వెంటాడుతుంది రుజువుల్లేని ప్రేమల్కి సమస్యల సుడిగుండాల్ని సృష్టించి వద్యశిలపై నిలబెట్టి వసంత రుతువుని మింగేస్తుంది మోహం, వాంఛా లేని ప్రేమంటే ఒక వెలుతురు జలపాతం- ఒక లాలిపాట అనేక జీవితాల రసవద్గీత ఏడు రంగుల పరీమళాల కాంతిపుంజం! ప్రేమంటే - మనసుల మద్య విభజన రేఖను తుడిచేసి కొత్త చిగుళ్ళతో చిగురిస్తున్న మోడుకి మొక్కటం. *** *** ***

by Wilson Rao Kommavarapufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ojaEgA

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: జగన్మిధ్య..: ఏవి చెలీ నీ నయనాల తోనల తొణికిసలాడు సుమనోహర రసోద్దీపనా చంద్రికల సహస్రాలు..? ఏవి చెలీ నీ అధరాల తేనియ జలపాతాల తేలియాడిన వాక్ గంగా సుమధుర స్వర ప్రవాహాలు..? ఏవి చెలీ నీ ముఖ మందారముపై శాశ్వతమై సేదదీరిన మార్ధవపు సొగసుల సౌదామినులు..? ఏవి చెలీ నీ హృదయ కమలమున తిష్టవేసిన ప్రణయ సుధా మాధురీ మహిమల మహాద్భుతాలు..? ఏవి చెలీ నీ కమ్మని కౌగిలిన రేగిన మమతల తరగల మధురోహల మకరందాలు..? ఏవి చెలీ నీ ప్రేరణా శరముల పాశుపతపు ప్రచండ తరంగాలు..? నా జీవన ఎడారిలో ఎలకోయిల ఎందుకు నీ పిలుపు లేనిది..? నా జగత్తు మిధ్యే కదా నీలో నా తలపు రానిది..? 17/03/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVQHgN

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy || ఊహించిన మరణం తర్వాతి కాలాన్ని ప్రశ్నిస్తాను || -------------------------------------------------------------------------------- ఒకే వ్యక్తి ప్రేమ కోసం నా చిన్ని హృదయం రోజు రోజుకి మరింత చిన్నబోతుంటే నీ జ్ఞాపకాలలలో శూన్యమైన పండుటాకుల గుస గుస లలో ఒక ఉత్కంఠభరితమైన నిట్టూర్పుతో శరదృతువు ఇంకోసారి ఎర్రబడినప్పుడు ఒంటరి రాత్రుల నిదురలనెందుకు లేపటం ? నాలో నేను లేని క్షనాలను తలచుకొని భాదపడని క్షనాలకోసం టడుముకోవడం ఎందుకు నిజాన్ని వెతకారం చేసే అబద్దానిదే రాజ్యం మనసు మాటలను తెల్సుకోలేని జీవులు మరణాన్ని ఊహించి మరణం తర్వాతి కాలాన్ని ప్రశ్నిస్తాను జరిగే నిజాన్ని నిలదీస్తాను అవసరాన్ని అందుకొన్న నిన్ను అన్ని మర్చిపోయి అలవాటుగానో పొరపాటుగానో నా మనస్సు జాడ తెల్సి నా జ్ఞాపకాలు ఎప్పుడైనా అటుగా వచ్చినప్పుడూ నీపాదాలను తాకి గుచ్చుకుంటాయేమో అని నాతోపాటే నాజ్ఞాపకాలను ఖననం చేస్తావుకదూ బ్రతికుండగానే నా ఎదురుగా ఆ నిజాలన్నిటిని తగులపెట్టి నన్ను ఒంటరిని చేసావు నా జ్ఞాపకాలను తగులబెట్టావు ఇన్నీ చేసిన నీకు మళ్ళీ నేనంటూ గుర్తుకు రావడమా ప్రపంచం తల్లకిందులైనా నేనంటూ గుర్తుకొస్తానా ఓ మైషిగా కాకపోయినా .. రోడ్డుమీద కనిపించిన ఒంటరి బాటసారిగా అయినా అయినా ఎందుకు గుర్తురావాలి నన్నెందుకు గుర్తుంచుకోవాలి నానొద్దు అనేకదా మరొకరి చెంతకు చేరావు నా ఊహకూడా నిన్ను దరిచేరకూడదనేగా అవమాణించి .. బ్రతికుండాగానే చంపేశావు

by Aduri Inna Reddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ojaGVF

Posted by Katta