పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మే 2014, సోమవారం

Prasad PV కవిత

|| నాన్నతనం || నా చిట్టితల్లి పాదాలు నా గుండెలపై అడుగులు వేస్తున్నప్పుడు నాన్న నా హ్రుదయాన్ని తడిమిన జ్ఞాపకం నా మనసును తాకింది.. తను అల్లరి చేస్తూ నా బుగ్గపైన ముద్దెట్టినపుడు నాన్న ఆత్మీయ స్పర్శ నా చెక్కిలిని నిమిరింది.. నిద్దరొచ్చి నన్ను హత్తుకుని పడుకుంటే నాన్న ఎదపై సేద తీరిన నా బాల్యం గుర్తొచ్చింది.. తడబడుతున్న చిట్టితల్లి అడుగులకు ఆసరాగా చేయి పట్టుకుని నడిపిస్తుంటే నాన్న చేతివేళ్ళ కమ్మదనం కనిపించింది.. నాన్న తనం నేనుతనం ఒక్కటేనేమో ! || ప్రసాద్ పి.వి.|| 12-05-2014

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jk7C6j

Posted by Katta

Venu Madhav కవిత

వేణు // ముసుగు// వేదనంత వేకువజమున వరకు గుండెల్లో దాచుకొని ఉదయాన్నే లేచి చిరునవ్వు అనే ముసుగు నీ మొహానికి వేసుకొని అందరిలో నవ్వుతూ తిరుగుతూ సంతోషాని అందిస్తూ అసలు కష్టం అనే పదం నేను ఇంతవరకు వినలేదు అన్నట్లు నటిస్తూ చీకటి పడగానే ఇంటికి చేరి అ నవ్వు అన్న ముసుగు ని తేసేసి అప్పటిదాకా ఆగి ఉన్న కన్నిలు ఒక్కసారిగా చంపాలను తాకితే ఏడంచేతి వేలుతో తుడుస్తూ కుడివైపుకు తిరిగి నా మనస్సు తో రేపటి రోజు బాగుంటుంది అని అబద్ధం చెప్పి నిద్రపుచ్చుతాను 12may2014

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jaKehp

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//ఆస్టిరాయిడ్//07 ఆస్టిరాయిడ్ మహాగడుగ్గాయి అస్థిరతకుచిరునామా అడ్డంగాప్రయాణం దూకుడే ప్రమాణం గమ్యం తెలియదు ఆది మధ్యా తెలియదు నిబంధనాలు గడ్డిపోచలే సహననిగ్రహాలు తనదృష్టిలోచాతకానివి పద్దతులేమో పాతచింతకాయ పచ్చళ్ళు ఎవ్వరికీభయపడని ప్రపంచం తన పేరువింటే చాలు హడల్ అందుకే అన్నారు మూర్ఖుడు ప్రపంచానికిరాజని ఇంకా అన్నారు దేన్నిఅడ్డంగా వాడేవాడు దాంతోనే పతనమవుతాడని 12-5-2014

by Aravinda Raidu Devineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nAmmpw

Posted by Katta

Ghouse Basha కవిత

Hi my dear frnds

by Ghouse Basha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lohgcE

Posted by Katta

Amar Pasha కవిత

నివేదన యెందుకో మా మీద ఇంత కోపం యెందుకో మా మీద ఇంత కక్ష కాళ్ళ దగ్గర పడున్నా కాదు పొమ్మంటోంది కనికరంలేని కాలం చేతులు జోడించి వేడుకున్నా విననట్టే తన దారిన తను వెల్లిపోతోంది కాలం యే జన్మలో పాపమో ఇలా వెంటాడుతోంది విష పామై కాటేస్తోంది కాలమా కాస్త కనికరించు ఈ వొంటరి జీవితాలకు ఈ వొంటరి దేహాలకు ఒక దారి చూపించు......!!! అమర్ పాష

by Amar Pasha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1geiSH1

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//శల్య సారధ్యం// సముద్రతీరం పైపెచ్చు గాలిలో తేమ ఉదయాన్నెప్పుడో రాసుకున్న టాల్కం పౌడర్ ఎంతసేపుంటుంది ఉత్తుత్తి కబుర్లకి ఉత్తరప్రత్యుత్తరాలెందుకు? రాసుకున్న రంగులకి మెరుగులెందుకు? కానీయ్ ఎంతకాలం బెదిరిస్తావ్! చచ్చిపోవాలని ఉందని వెన్నరాస్తావ్! ఆఖరి మాటకి కారణం ఒకటుండాలి సమస్యకి పరిష్కారమూ ఉండే తీరాలి తిట్టుకున్నా సరే నవ్వక నేనేమంటాను మగాణ్ణి చెప్పుకోలేన్నప్పుడు మన్నించి ఒక పని చేయి ఎవరికీ చెప్పకు......12.05.2014 (19.04.2014. ఒక రాత్రి 8కవితలు నాలుగోది)

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1skLlL2

Posted by Katta

Rama Chandra Soma కవిత



by Rama Chandra Soma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gdZLNo

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Trance | ఒకోసారి ..... ....ఉహు చాలా సార్లు నేనొక బందింపబడ్డ గదిగా మారిపోతాను వెంటాడే జ్ఞాపకాలు , ఆలోచనలు ,వాదనల కి దూరంగా నాలో విరిగి పడ్డ ముక్కలన్ని వాటి వాటి స్లాట్ లలో కుదురుగా సర్దుకుంటూ మరో పరుగు పందెం కి మనస్సు రెడీ అవ్వకుండా అసాధ్యపు పగ్గాలు బిగిస్తూ ** వారగా ఒక మూlల ఇంకా పూర్తిగా మూసుకోని కిటికీ నాలో నేనున్న సంతృప్తికి పడ్డ రంధ్రం లా అపుడపుడు వీచే గాలి కి రక రకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ కొన్ని వెలుతురు చారికలు నా చెంపల మీద రాలుస్తూ కొంత దుమ్ము ని నా మొహం మీద విదిలిస్తూ తట్టుకోలేక దాన్ని కూడా మూసేయాలన్న బలమయిన కోరిక వెర్రి గా గొంతుకలో అణచుకోలేని కేకలా అసహనంగా వినిపిస్తూ ** కొన్నిసార్లు లోపలి జారి పడే వెలుతురు కణాల ని తదేకంగా చూస్తూ శ్రద్ధగా చాల శ్రద్ధగా ధ్యానమో పరధ్యానమో ఒడిసిపట్టుకోలేని వివశత్వమో ఆవహిసున్నట్లు కాంతి రేఖల్లో కనిపించని నిజాలని అన్వేషించే ప్రక్రియ లో తేలకుండా మునిగిపోతూ ** ఇంకొన్ని సార్లు అపుడే వచ్చి వాలిన పిట్టల రెక్కల చప్పుడు పక్కనే పేలే బాణాసంచా లా బిగ్గరగా చెవిలో గుసగుసలాడుతుంటే బెదిరిపోతూ ఉలిక్కి పడుతూ ** అపుడపుడు రాలిపడే కొన్ని చినుకులు వాంఛల వేడి మీద ఇగిరిపోయిన పొగమంచుల్లా ఆవిరి అయిపోతూ హృదయాన్ని తాకని తడిలా ** విభ్రాంతిగా అనుభూతులని జీవించాలా ? జీవితమే పెద్ద అనుభూతా ? రౌండ్ అప్ చేసే కన్ఫ్యూజన్ లో అనుభూతులు నిస్సారమై అనుభవాలే జీవితం గా మిగిలిపోతాయా ? ** ఎదో మండుతున్న వాసన తల లో మాంసం ముద్ద పూర్తిగా ఉడుకుతున్న వేడి కళ్ళ లోంచి వెచ్చగా కారిపోతూ ఊరటగా !@$... !@# ...!@#$ కొన్ని ఆశుద్ధపు మాటలు పెదవులను స్పర్శిస్తూ ఉపిరితిత్తులకి కొంచం ఊపిరి పోస్తూ , గుండె లో ఖాళీలకు జరిమానా వేస్తూ మెదడులో గుచ్చుకున్న ముల్లు నుండి నెమ్మదిగా తేరుకుంటూ ** టైం ఎంత ? స్వేచ్చని రెండు చెవుల మధ్య నిశ్శబ్దపు శూన్యంలో బందీని చేస్తూ సరిహద్దుల కంచెలలో కి చేరిపోయే సమయం అయిందా ? నిర్లిప్తం గా రేసు లో రెక్కలు లేకుండానే అడుగుపెడుతూ హద్దులు లేని బయటప్రపంచంలోకి తలుపులు తీసే సమయం అపుడే వచ్చేసిందా ? అపుడేనా ? కిటికీ ఇంకా పూర్తిగా మూయనే లేదే? ఇంతలో తలుపులు తెరవాలా ? ఎగ్జిస్టేన్స్ బాధల అసంతృప్తి మెట్లు ఎక్కడం ఇక్కడ నుండే మొదలైపోయాయా ? ** నయా డ్రామా రక్తి కట్టించడానికి తలుపులు తెరుచుకుంటున్నాయి నెమ్మదిగా Its play time dude , Don’t forget to wear u r smile . నిశీ !! 12_05_14 .

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1skdXnU

Posted by Katta

Mani Vadlamani కవిత

నా కవిత ,మనసు పొరలలో నిన్నటి (11.05.2014) ఆంధ్రప్రభ.కాం లో ప్రచురిచతం మణి వడ్లమాని మనసు పొరలలో నన్ను ఒంటరిని చేసి నువ్వు అనంతదిగంతాలలో కలిసి పోయినా నీ జ్ఞాపకాల పరిమళాల గుబాళింపు నన్ను చుట్టుకునే వుంది సన్నజాజి పందిరి పక్కనే అల్లుకున్న జూకా మల్లి, ఆ పక్కనే వున్న రాధ మనోహరాలు, నీలి గోరింటలు చిరుగాలికి అటూ ఇటూ ఊగుతూ వుంటే.. ఎప్పుడూ మల్లెలు, మందారాలేనా? మేము అందగత్తెలమే అంటూ కినుకగా చూస్తున్న కనకాంబరాలు, చంద్రకాంతాల మధ్య సిగ్గుల మొగ్గలా ముడుచుకున్న నీ ముగ్ధ మనోహర రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే వుంది. చిలకాకు పచ్చ పట్టు పరికిణి, జాగెట్టు మీద ఎఱ్ఱటి వోణితో అచ్చు చిలకలా ఉన్నావని అంటే కిలకిలా నవ్విన ఆనాటి నీ అందమైన నవ్వు మనోహరమైన ఆ జ్ఞాపకం నా హృదయపీఠంలో ముద్రించుకుపోయాయి ఆ నాడు చెప్పుకున్న మాటలు, చేసుకొన్న బాసలు ఈ నాటికి నా మది గదులలో నిండే వున్నాయి ఆ నాడు నువ్వు పాడిన పాట వింటూ ప్రపంచాన్నే మరచిపోయిన నాకు, ఇప్పటికి ఆ పాట నా గుండె చప్పుడుతో కలసి వినిపిస్తూనే వుంది. ఓ సహచరీ! మనం కలసి చేసిన ఈ జీవన ప్రయాణంలో,నీవే నేనై, నేనే నువ్వు అయి జీవించాము, నా తుదిశ్వాస విడిచే వరకు, నీ రూపం ఎప్పటికీ కళ్ళముందు కదలాడుతూనే వుంటుంది నీ జ్ఞాపకాల సుగంధ పరిమళం నా మనసు పొరలలో నిలిచే వుంటుంది!!

by Mani Vadlamani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nDWztX

Posted by Katta

Kapila Ramkumar కవిత

కవి స్వరం: స్వాతీ శ్రీపాద కవిత Posted by: Pratap Published: Monday, May 12, 2014, 9:00 [IST] ఒక సాంద్రమైన కవితను చదివిన అనుభూతిని స్వాతీ శ్రీపాద కలిగించారు. కవితలో ఏ వాక్యానికి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడమా, కవితను మొత్తాన్ని చదివి ఏకంగా సారాన్ని గ్రహించడమా అనే అనుమానం ఈ కవిత చదివిత తర్వాత కలుగుతుంది. స్వాతీ శ్రీపాద కవితలో సాంద్రమైన జీవన తాత్వికత దర్శనమిస్తుంది. అయితే, కవితలో దిగులు ఛాయలు లేకపోవడం ఓ గొప్ప అనుభూతి. జీవితంలో ముందుకో వెనక్కో నడుస్తున్నట్లు అనుకుంటూ ఉంటాం. జీవితంలో వెనక్కీ నడవడానికి కొలమానాలు ఏమిటి, ముందుకు సాగడానికి ప్రమాణాలు ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. మొదటి స్టాంజా జీవన పయనం గురించి చెబుతుంది. అందులో అవగాహన లేని ప్రయాణం గురించి కవి మాట్లాడుతారు. బహుశా, అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం, వ్యవధి ఇవ్వని బాల్యమూ యవ్వనమూ కావచ్చు. రెండో స్టాంజాలో జీవితం నిస్తేజంగా కనిపించిందని, రంగూరుచీ లేదని కవయిత్రి చెబుతారు. అంతేకాదు, జీవితానికి అర్థమేమిటనే మీమాంస కూడా ప్రారంభమైంది. ఆ మీమాంసలో "లోలోపల నాకు నేనే ఒక ఆవిష్కరిచని ప్రపంచాన్నై" అని అంటారు. జీవితానికి అర్థమేమిటి, ఈ ప్రయాణానికి అర్థం ఏమిటి అంటే ఏమీ మిగలలేదనే భావన కలిగి ఉంటుంది. కవి స్వరం: స్వాతీ శ్రీపాద కవిత మొదటి స్టాంజాలో రెండో స్టాంజాలోకి ప్రయాణం చేయడానికి అనువైన కొన్ని వాక్యాలు ఉన్నాయి. పరవశానికి, ఆనందానికి, భావోద్వేగానికి సంబంధించిన ప్రతీకలను అందులో వాడుతూనే వాడిపోయిన కసరు క్షణాలు, కుప్పకూలిన భావాలను అంటూ అర్థసహితమని భావించే స్పందనలను చేర్చారు. ఆ తర్వాత అది రెండో స్టాంజాలో మరింత సాంద్రతను సంతరించుకుంది. అలా కవిత ఒక ప్రారంభం నుంచి ముగింపునకు వచ్చింది. అయితే, దాంతో అగిపోతే కవిత అసంబద్ధమైన, అర్థరహితమైన జీవన యానాన్ని చెప్పి ఉండేది. కానీ, మూడో స్టాంజా వచ్చేసరికి దాన్ని తాత్వీకరించారు స్వాతీ శ్రీపాద. ఉలిపిరి సిల్కు దారపు వంతెన మీదనే జీవనయానం సాగింది. చివరికి ప్రయాణం ఎక్కడికి దాకా చేశామంటే ఉన్న చోటే ఉన్నామనే గ్రహింపు వచ్చింది. "వెనక్కు నడచినా, ముందుకు కదిలినా/ దూరం ఒక్కటే అయినప్పుడు ఎలా నడిచి వెళ్లాలో/ చివరి అడుగు వరకు" అంటూ సంశయాన్ని ప్రకటించారు. కానీ, జీవిత పరమార్థాన్ని నిర్దిష్టంగా, నిర్దుష్టంగానే వెల్లడించారు. జీవితంలో ముందుకో, వెనక్కో కదులుతున్నామనేది భ్రమ మాత్రమే అని చెప్పారు. కదులుతున్నామని అనుకుంటాం గానీ ఉన్నచోటనే ఉంటామనే జీవిత తాత్వికను వెల్లడించారు. జీవితంలో అనుభవించేవి, అనుభవించామని అనుకునేవి - సంపాదించామని అనుకునేవి, కోల్పోయామని వేదన పడేవి అన్నీ భ్రమ, జీవితం మాత్రమే సత్యమని స్వాతీ శ్రీపాద చెప్పారనిపించింది. మొత్తం మీద, జీవన సారాన్ని ఉన్నదీ, లేదూ - లేదూ ఉందీ అనే తాత్వికతతో కవిత వెల్లడించింది. - కాసుల ప్రతాపరెడ్డి శీర్షిక లేదు 1 ఎలా నడిచి వచ్చానో మరి నన్ను నేను చిటికెన వేలట్టుకు నడిపించుకుంటూ దుఃఖాలు వడబోస్తున్న చీకటి కనుపాపల మినుకు మినుకు వెలుగుల్లో తడబాటు అలలై చుట్టేసే తమకాలను వదిలించుకు సైకత స్వప్నాల హోరు గాలిలో తమాయించుకుంటూ ఎలా నడిచి వచ్చానో మరి ! కరిగి కరిగి నీరై ప్రవహిస్తూ, నిలువరించుకుంటూ రెపరెపల మధ్య పూరెక్కల పరవశాల పులకరింతల మధ్య కంటి రెప్పలకింద వికసించకుండానే వాడిపోయిన కసరు క్షణాలూ లోలోపల పొరల మధ్య అలసి అలసి కుప్ప కూలిన భావాలను పేర్చుకుంటూ, ఓదార్చుకుంటూ, సవరించుకుంటూ మైనపు ముద్దలా మరుగుతూ , చల్లారుతూ కాస్త కాస్త కాలం నీడల్లోకి నిశ్సబ్దంగా అదృశ్యమవుతూ ఎంత మిగిలి వచ్చానో ....... 2. ఇప్పుడిక రంగూ రుచీ వాసనా కోల్పోయి నిస్తేజంగా గుడ్లప్పగించి చూస్తున్న శీతాకాలపు సాయంసంధ్య నై ఉపరితలం పొడుగునా మౌనం గాజు అద్దాలు పరచుకు పలకరి౦తల వెచ్చని వెలుగు కిరణాలు వెనక్కి తిప్పి కొడుతూ లోలోపల నాకు నేనే ఒక ఆవిష్కరి౦చని ప్రపంచాన్నై'' ౩. ఈ కొనకూ ఆ కోనకూ ఆద్యంతాలకు ముడివేసిన ఉలిపిరి సిల్కు దారపు వంతెన మీద వెనక్కు తిరిగి చూసుకుంటే నడిచొచ్చిన అడుగులకూ ముందు నడవవలసిన దూరానికీ ఒకటే కొలమానం వెనక్కు నడిచినా ,ముందుకు కదిలినా దూరం ఒకటే అయినప్పుడు ఎలా నడిచి వెళ్ళాలో చివరి అడుగు వరకూ -స్వాతి శ్రీపాద మే 5, 2014 Read more at: http://ift.tt/1jQOvW5

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQOvW5

Posted by Katta

Harikrishna Mamidi కవిత

/// మామిడి హరికృష్ణ /// అమ్మ ఒక Extension భూమిలో విత్తనం పగిలింది మొక్కని తన దూతగా నేల పైకి పంపింది మబ్బు కరిగింది వర్షాన్ని తన ప్రతినిధిగా నిలిపింది చితి పైకి కట్టె చేరింది మంటని తన సందేశంగా చూపింది అమ్మ పోయింది నన్ను తన కొనసాగింపుగా మిగిల్చింది ....

by Harikrishna Mamidi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nywgI9

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | నువ్వు నేనవుతూ ......................................... చెప్పాలనుకుంటాను నా మాటగా పక్కనుంచి మరెవరో అదే చెప్తుంటారు, తమ మాటగా * ఆమె గుర్తొస్తుంది నడుస్తున్న దారిలో తీరా ఇంటిగుమ్మం ముందు ఆమె ఎదురుచూస్తుంది, ఉత్తరంలా * చివరిసారి కన్నీళ్లు పెట్టబోతాను తీరా బుగ్గమీద వర్షం చినుకు, ఆమె స్పర్శలా * పువ్వుకోసం చేయి చాస్తాను నాలోపలి తీగలేవో బంధిస్తాయి, కనిపించని పరిమళంలా * నడుస్తూ నడుస్తూ ఆగిపోతాను వెనక ఎవరో పిలుస్తున్నట్టు తీరా చూస్తే ఎవరూ లేని చీకటితీరం * గాలినై ఆకాశాన్ని గాలిస్తూ పోతాను ఇంతేసి ముఖంతో భూమి నాకోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. # *పాతవాచకం | ప్రవహించే జ్ఞాపకం | 19.9.1991

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iF5jL4

Posted by Katta

Rajender Kalluri కవిత

పల్లె యెడ వోయింది చిన్నమ్మా ? పట్నం పై మోజుతో పారిపోతుంది బిడ్డా...... బావులేడ ఉన్నాయ్ చిన్నమ్మా ? బతుకు గగనమై ఎల్లింది బిడ్డా....... బర్లు గానోస్తలేవెం చిన్నమ్మా ? మా బాధలను అర్ధం జేస్కొని బజార్ల అమ్ముడైపోయినయి బిడ్డా..... బాదలేడున్నయ్ చిన్నమ్మా ? అవి బయటికి కాన్ రావ్ బిడ్డా .... !! kAlluRi

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sjo3Fs

Posted by Katta

Kavi Yakoob కవిత

http://ift.tt/1gcR4mh

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gcR1XV

Posted by Katta

Pratapreddy Kasula కవిత

ఈ వారం కవిస్వరం, కవిసంగమం కవి http://ift.tt/1jQOvW5

by Pratapreddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQOvW5

Posted by Katta

Panasakarla Prakash కవిత

నీకేది కావాలి ఎక్కడికయ్యా పరుగు ఎక్కడో ఒకచోట ఆగిపోయేదేకదా ఎ౦దుకయ్యా అ౦త స్వార్ధ౦ ఏదో ఒకరోజు ఆరిపొయ్యేదేకదా ఏమిటయ్యా నీ దు:ఖ౦ కురిసిన మేఘమై తేలిపోయేదేకదా ఎక్కడయ్యా నీ గమ్య౦ అ౦దరూ వెళ్ళే చోటికే కదా కళ్ళు తెరిచి చూస్తే చీకటిలోనే అసలు సిసలు ప్రప౦చ౦ కళ్ళు మూసుకుపోయినోళ్ళకి పాప౦.. వెలుతురే అ౦దమైన జీవిత౦...! పనసకర్ల‌ 12/05/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQOvW0

Posted by Katta

Jagadish Yamijala కవిత

అన్వేషణలో కొట్టుమిట్టాడుతున్నా ----------------------------- మౌనం ఎన్నో అర్ధాలను అరటి పండు ఒలిచినంత తేలికగా నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది హెచ్చరికా చేస్తోంది అయినా ఆ అర్దాలన్నింటినీ పెడచెవిన పెట్టి మాటల్ని కుప్పలు తెప్పలుగా కుమ్మరించి ఏరికోరి సమస్యలు సృష్టించుకుని నజ్జుగుజ్జయి పోవడం సర్వసాధారణమైపోయింది అప్పుడు ఎంత గుంజుకున్నా మౌనం అక్కున చేర్చుకుని ఓదార్చడం మాని మరింత మౌనంగా నన్ను చూసి నవ్వడం భరించలేకపోతున్నాను మౌనమూ మాటలూ నడుమ నేనెంత కాలం నన్ను నేను నడిపించుకోవాలో తెలియడం లేదు మౌనమాటల కలయికలో నన్ను నేను మమేకం చేసుకోవడానికి అన్వేషిస్తున్నాను అదేపనిగా ఆ ఘడియల కోసం చూస్తున్నాను నిద్ర లేని రాత్రులే నా తపనకు సాక్ష్యం - యామిజాల జగదీశ్ 12.5.2014 ------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sjdH8u

Posted by Katta

Krishna Mani కవిత

మానవ కాకి ________________________కృష్ణ మణి మానవ వికృత విలయాన్ని చూసి లయకారకుడే లబలబమన్నాడు సిగ్గులేని మానవకాకి శృంగారానికి వరస ఏదైతేనేమన్నాడు వయసేదైతేనేమన్నాడు పసి ఆకులను చిదిమేసిన చచ్చువెదవ ! కనికరంలేని కసాయికేది దొరికిన వదలడు పాపం కళ్ళులేని కత్తికేమి తెలుస్తుంది కోసేది పీకని శవాల దిబ్బల ధర్మాసుపత్రి డబ్బులు రాలందే చచ్చిన మనోడు బయటకు రాడు దాపులేని బతుకుకు రోడ్డే దిక్కైతే లారీ టైరు కింద ఇస్త్రీ ! ఆకలికడుపున ఆపద్బందువని కొట్టిన జేజేలు ఓటువేసేటప్పుడు గుర్తుకొచ్చేది వెయ్యినోటు సారసీస మనోడు ఏమిచేయ్యకపోయినా సరే పక్కకులంవాడు రావొద్దు గద్దెనెక్కిన గలీజోడు దిగేదాకా పందికొక్కు మానవత్వం మరచిన మనిషి మరుభూమిలో పురుగు ! కుళ్ళిన లోకంలో కురువని విషం ఎక్కడా ? కృష్ణ మణి I 12-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oH8IhO

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా..........తరలి0చండి..... .................................................... తరలి0చండి స్వార్ధం ని0డిన మనిషిని గి0జగా మార్చి సారవంతమైన నేలలో నాటి స్వార్ధరాహిత్యం కొరకు. తరలి0చండి డబ్బుతొ ని0డిన మెదళ్ళను కాటికాపరి గూటికి కాలి బూడిదై కొత్త మెదళ్ళు చిగరి0చుటకై. తరలి0చండి నెరవేరని కలలను కనే కళ్ళను చికటిలోకి సహజత్వమె0టో తెలుపుటకై. తరలి0చండి 120 కోట్ల దేశాన్ని గంగా స్నానమాడి జలసి పేద ధన కమ్ జాదా వ్యత్యాస పొరపాట్ల జబ్బు మైలను పోగొట్టడానికి 12-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1okn4Y6

Posted by Katta

Uday Dalith కవిత

అజ్ఞాని నువ్వు తాగుబోతువో లేక లేక పుట్టిన ఫిలాసఫర్ వో నువ్వు తాగుబోతువే అయితే తప్ప తాగిపోతోంది నీ అహాన్ని నువ్వు ఫిలాసఫర్ అయితే నీ మొత్తుకోలు నీ స్వార్ధానికి నీ వేదాంతం ఎండమావుల ఎడారులు దాటి అథోఃపాతాలాన చేరి నీ కాలి కిందే విలవిలలాడి కొట్టుకు చస్తుంది నీ తాగుడు విశ్వ జ్ఞానాన్ని ప్రకటించి బోధి వృక్షాన వికటించి నీ శ్మశానానికి నెత్తురు కక్కుకు పోతోంది ఇపుడే వీలుంటే మేలు చేయక కీడు తలచక నీ ఒంటరి కలల్లోకి ఒద్దికగా జారుకో రేపే ఉషోదయాలు అవి నీ మత్తు కళ్లను అవిటి కలలను తప్పక భస్మం చేస్తాయి నీ పిరికి చేష్ఠలు పిల్లి కూతలు ఈ నిర్జనులకు అవసరమే నేడే నీ స్వార్ధ అశ్రువులకు వారి నివాళి ఉదయ్ 12.05.14

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbEUu9

Posted by Katta

Abd Wahed కవిత

(నా మిత్రుడు రాసిన కవిత ఇది. తాను సంకోచిస్తుంటే తనకు బదులు నేనే పోస్టు చేశాను. పేరు చెప్పలేను. అజ్ఙాత కవి...) కవీ, కళాకారుడా నువ్వు రాసిందే రాత నువ్వు గీసిందే గీత నువ్వాడిందే ఆట, పాడిందే పాట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కానియ్ కానియ్ ఇంతకూ నీ ఏడుపేంది మమ్ముల నవ్వియ్యాలనేనా కానియ్ కానియ్ కవీ, కళాకారుడా అయిందా , అయితే పో ఇగ ఏందీ పోవా... ఏం గావాలె నీకు పైసలా... ఒద్దా ? తిండా? బట్టలా?...అవీ ఒద్దా? కవీ, కళాకారుడా ఏం గావాలె మరి నీకు? నువ్వే ఇస్తవా ? ఏందది? అంత కొశ్శెగ ఉన్నది..అంత మెరుస్తున్నది? ఆలోచనా? చైతన్యమా? ఏందది? బతుకా...బతుకు మీద ఆశనా... కవీ, కళాకారుడా ఏందది? ఇచ్చినవు గద ఇగ వో పోవా...మా మెదళ్లు కదిలిచ్చినవు గద నువ్వు కదులిగ ... ఏం చూస్తున్నవు మా గుండెల్ల...ఏమున్నది? శూన్యమే గద ... నీ మొహంల కనపడ్తనే ఉన్నది... నిర్వికారం...ఒక్క దేవునికే సాధ్యమది... కవీ, కళాకారుడా...నువ్వు దేవునివా?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oG7MKA

Posted by Katta

Abd Wahed కవిత

(నా మిత్రుడు రాసిన కవిత ఇది. ప్రథమ ప్రయత్నం కాబట్టి కొంచెం వెనుకాడుతుంటే తనకు బదులు నేనే పోస్టు చేశాను. పేరు చెప్పలేను. అజ్ఙాత కవి...) కవీ, కళాకారుడా నువ్వు రాసిందే రాత నువ్వు గీసిందే గీత నువ్వాడిందే ఆట, పాడిందే పాట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కానియ్ కానియ్ ఇంతకూ నీ ఏడుపేంది మమ్ముల నవ్వియ్యాలనేనా కానియ్ కానియ్ కవీ, కళాకారుడా అయిందా , అయితే పో ఇగ ఏందీ పోవా... ఏం గావాలె నీకు పైసలా... ఒద్దా ? తిండా? బట్టలా?...అవీ ఒద్దా? కవీ, కళాకారుడా ఏం గావాలె మరి నీకు? నువ్వే ఇస్తవా ? ఏందది? అంత కొశ్శెగ ఉన్నది..అంత మెరుస్తున్నది? ఆలోచనా? చైతన్యమా? ఏందది? బతుకా...బతుకు మీద ఆశనా... కవీ, కళాకారుడా ఏందది? ఇచ్చినవు గద ఇగ వో పోవా...మా మెదళ్లు కదిలిచ్చినవు గద నువ్వు కదులిగ ... ఏం చూస్తున్నవు మా గుండెల్ల...ఏమున్నది? శూన్యమే గద ... నీ మొహంల కనపడ్తనే ఉన్నది... నిర్వికారం...ఒక్క దేవునికే సాధ్యమది... కవీ, కళాకారుడా...నువ్వు దేవునివా?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qx0hJT

Posted by Katta

Abd Wahed కవిత

(నా మిత్రుడు రాసిన కవిత ఇది. తనకు బదులు నేనే పోస్టు చేశాను. పేరు చెప్పలేను. అజ్ఙాత కవి...) కవీ, కళాకారుడా నువ్వు రాసిందే రాత నువ్వు గీసిందే గీత నువ్వాడిందే ఆట, పాడిందే పాట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కానియ్ కానియ్ ఇంతకూ నీ ఏడుపేంది మమ్ముల నవ్వియ్యాలనేనా కానియ్ కానియ్ కవీ, కళాకారుడా అయిందా , అయితే పో ఇగ ఏందీ పోవా... ఏం గావాలె నీకు పైసలా... ఒద్దా ? తిండా? బట్టలా?...అవీ ఒద్దా? కవీ, కళాకారుడా ఏం గావాలె మరి నీకు? నువ్వే ఇస్తవా ? ఏందది? అంత కొశ్శెగ ఉన్నది..అంత మెరుస్తున్నది? ఆలోచనా? చైతన్యమా? ఏందది? బతుకా...బతుకు మీద ఆశనా... కవీ, కళాకారుడా ఏందది? ఇచ్చినవు గద ఇగ వో పోవా...మా మెదళ్లు కదిలిచ్చినవు గద నువ్వు కదులిగ ... ఏం చూస్తున్నవు మా గుండెల్ల...ఏమున్నది? శూన్యమే గద ... నీ మొహంల కనపడ్తనే ఉన్నది... నిర్వికారం...ఒక్క దేవునికే సాధ్యమది... కవీ, కళాకారుడా...నువ్వు దేవునివా?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Qx0hJN

Posted by Katta

Girija Nookala కవిత

అమ్మ జాతిని అమరం చేసే అమ్మ తన కడుపులో స్రుష్టి చేసే అపర భహ్మ తన కళ్ళతో లోకాన్ని చూపే దిక్సూచి తన కలలకి ఆకారం ఇచ్చే మహా శిల్పి సమాజానికి సంస్కారం నేర్పే సంఘ మిత్ర అపురూప రత్నాలని అందించే దివ్య గని అమ్మల ఙ్ణానం భూమాతకే వరం ప్రతి విజయం అమ్మ శ్రమ ధనం అమ్మ ప్రేమ లో అపశ్రుతులు అనాధలు స్వార్ధ విష బిందువులు భ్రూణ హత్యలు చల్లని చూపులలో కర్కసం అసహజం అందమైన ప్రక్రుతిలో భిభత్శం భయకరం అమ్మలు అమ్మల కన్న అమ్మలు కావాలి చెట్టు నుండి హాయిగా రాలే పండు టాకులు పరుగులు ఉరకల జీవతాన్ని కాసేపు ఆపి చూడు నీ పలకరింపుకోసం పడిగాపులు పడే రెండు ప్రియమైన కళ్ళు

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ljAdx2

Posted by Katta