పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

తాలు-పొల్లు ఈ మేఘం కురవకపోవచ్చు కురిసినా కన్నీళ్ళే కావొచ్చు వానను ఆశిస్తే తుఫాను రావొచ్చు వరదలే పారొచ్చు వూరువాడలన్ని మన కలలతో సహా కొట్టుకపోవొచ్చు వొట్టిపోయిన పొలాలు కట్టెబారిన అడవులు వెట్టితప్పని వూళ్ళే మిగలొచ్చు మళ్ళీ మనం యుద్ధాల్లోనే మొలకెత్తొచ్చు అడిగేదెవర్ని ఇచ్చేదెవరు? ఆకాశమ్మీద దాచుకున్న అటుకులు ఆకలిబువ్వై తీరేనా దుఃఖం అలుకుబోనం ఎవరెత్తుతరు ఎల్లప్పుడు శాంతికొరకు ఆయుధాలే ఎత్తాల్నా ఒల్లని మనుషుల జాతి ఒకటుంటదా బతుకమ్మ వొల్లె కట్టుకుని ఉయ్యాల పాడుతదా చెల్లని పైసలాయెగదా లెక్కంతా మొసమర్లని యాస్టకొచ్చింది మల్లా మోసం గొంగడి కప్పుకుని కూసుంది కడ్పల ఎట్ల ఈ గోస తీరిపొయ్యేది ఎన్నడు కన్నకష్టం వొడిసేది? వాకిట్లున్నం లోపలికా, బయటికా? చంపుడు పందెం ఎవరిది? పంటగడులెవరికి? 11.02.14

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXZ7QK

Posted by Katta

Pusyami Sagar కవిత

షంషాద్ గారు రాసిన కవిత !!తప్పిపోయిన మా పల్లె ||కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ బాల్యం ఎవరికి అయిన కూడా మధుర స్మృతే, కాలం తో పాటే మారిపోయిన కాదు కాదు నయా నాగరికత పల్లె ను ఎలా కబ్జా కాబడ్డాయి కళ్ళకు కట్టినట్టు సున్నితం గా సాగుతుంది ...ఈ కవిత లో ని కొన్ని పదాలు పల్లెలలో ...ని ఆటలు ...బహుశ ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కాని రెండు తరాలు వెనక్కి వెళ్తే వాటి లో ని మాధుర్యాని తెలుసు కోవచ్చు .... జ్ఞాపకాల దొంతరను మననం చేసుకుంటూ...ఎక్కడికి వెళ్ళాయి ప్రశ్న, ఎంత దూరం వెళ్ళినా కూడా వెంటాడే చిన్నతనపు అందమయిన బాల్యం మనల్ని తీసుకువెళ్తాయి ...వేరే లోకం లో కి ... ఇక్కడ కవయిత్రి గారు తను తిరిగిన అందమైన పల్లె ఎలా మాయమైనధి ...నాగరికత పల్లెను వాటి లో వున్న సాంప్రదాయ ఆటలను ఎలా చెరిపి ముందు కు వెళ్ళింది అన్న బాద ను వ్యక్తం చేసారు .. కవిత లో ని వస్తువు అంతా కూడా ఇంటి చుట్టూ నే తిరుగుతుంది బాల్యం లో ఇంటి వసారా లో ఆడిన ఆటలు ఎక్కడ అంటూ , మరల అలనాటి మధుర ఘట్టాలను గుర్తు చేసుకుంటారు కుప్పలుగా పోసి ఆడిన చింతగింజలాటలో//లెక్కలేసుకున్న కట్టలు గుర్రాలు ఏనుగులు వెతుక్కుంటున్న వరండాలు పాడి పంటలు కూడా వట్టి పోయి పల్లె నుంచి పట్నం బాట పట్టాయి నాగరికత మోజు లో ...అవును వున్న వాటిని అమ్మేసుకొని వెళ్తే మిగిలేది ఖాళి నే కదా... అంబా అనే పిలుపు వినపడక ///చావిట్లొ గుంజకి కట్టిన తాడు గింజుకుంటుంది. రెండు దృశ్యాలని చూడవచ్చు ..ఒక వైపు పల్లె లో ని జీవనాన్ని నాగరికత ఎలా మార్చేసింది ...దానికింద నలిగిన ఆటలు ఎలా మరుగున పడిపోయాయి కరగని నేలా బండలాటలో //కదిలిపోయిన తిరిగిరాని కాలం అమ్మమ్మతోపాటే పడేసిన ట్రంక్ పెట్టెలో//ఏడుస్తూ వెళ్ళిన పచ్చీసు పట్టా ప్రపంచీకరణ చిదిమేసిన సృజనను గుర్తు తెచ్చుకొని అయ్యో అనకుండా ఉండలేము ..కదా, .అలాగే ఇంటి వరండా లో ఆడుకునే అష్టా చెమ్మ ని పంటల తో పోల్చి చెప్పడం చాల బాగుంది .అలాంటి అష్టా చెమ్మ ని ఏ పాడు పురుగు తినెసినధొ కదా ... ఏ బార్బి బూచి ఎత్తుకెళ్ళిందో //అందమైన నా తాటాకుబొమ్మకి దిష్టి తగిలి//అష్టా చెమ్మలాటలో పంటలకి ఏ చీడపురుగు పట్టిందో ఏమో ... తమ సంస్కృతి లో భాగం అయిన మట్టితనపు అనుభవాలను తలచుకుంటూ ..., సాంప్రదాయ ఆటల స్థానే ..బుల్లి తెరల హోరు లో తమ ఆటలు కు కాలం చెల్లింది, నిజమే ఈ రోజు లో పురాతనానికి చెందినది అని వారు చూపిస్తేనే మనం తెలుసు కునే స్థాయీ లో ..వున్నాం.. ఉత్తుత్తి అన్నంపప్పులుడకేసిన //మట్టిగురుగుల్నికరిగించిన చీమ కళ్ళ ప్లాస్టిక్ గిన్నెలు రిమొట్ కంట్రోల్ బొమ్మలకింద //ముక్కలైన నా చిన్ని చెక్కపీటలు తమ ఇంటి లో గడిపిన తిరిగిరాని బాల్యాన్ని అక్కడ పంచుకున్న జ్ఞాపకాలని ..విచ్చిన్నమువుతున్న పల్లె సంస్కృతి ని ఎంతో బాగా చెప్పారు ...ముగింప లో ... పడాపడేసిన ఇంటికి //నన్నెందుకువంటరిగా వేల్లాడదీయ్యడమని వెర్రిగా నవ్వుకుంటున్న తాళం కప్ప// ఎక్కడని వెతకను తప్పిపోయిన మా పల్లెని //తిరిగిరాని నా బాల్యాన్ని// శంషాద్ గారు లోగడ ఎన్నో మంచి సామాజిక అంశం గల కవితలను అందించారు ..ప్రధానం గా భావోద్వేగాలను పలికించే తీరు గొప్ప గా కనిపించాయి ...మన సంప్రదాయానికి విలువ నిచ్చే స్ఫూర్తి ని నింపుతూ ముందుకు సాగుతున్నారు ...వారు మరిన్ని మంచి కవితలు రాసి అలరించాలని కోరుతూ ..మరొకసారి అబినందనలతో ... సెలవు .. తప్పిపోయిన మా పల్లె ===== కుప్పలుగా పోసి ఆడిన చింతగింజలాటలో లెక్కలేసుకున్న కట్టలు గుర్రాలు ఏనుగులు ఎక్కడికి పారిపోయాయొనని వెతుక్కుంటున్న వరండాలు అంబా అనే పిలుపు వినపడక చావిట్లొ గుంజకి కట్టిన తాడు గింజుకుంటుంది కరగని నేలా బండలాటలో కదిలిపోయిన తిరిగిరాని కాలం అమ్మమ్మతోపాటే పడేసిన ట్రంక్ పెట్టెలో ఏడుస్తూ వెళ్ళిన పచ్చీసు పట్టా ఏ బార్బి బూచి ఎత్తుకెళ్ళిందో అందమైన నా తాటాకుబొమ్మకి దిష్టి తగిలి అష్టా చెమ్మలాటలో పంటలకి ఏ చీడపురుగు పట్టిందో ఏమొ ఉత్తుత్తి అన్నంపప్పులుడకేసిన మట్టిగురుగుల్నికరిగించిన చీమ కళ్ళ ప్లాస్టిక్ గిన్నెలు రిమొట్ కంట్రోల్ బొమ్మలకింద ముక్కలైన నా చిన్ని చెక్కపీటలు అడ్డుకునెవారు లేక చెదలు కి స్వేచ్చని పరిచిన గోడలు పడాపడేసిన ఇంటికి నన్నెందుకువంటరిగా వేల్లాడదీయ్యడమని వెర్రిగా నవ్వుకుంటున్న తాళం కప్ప ఎక్కడని వెతకను తప్పిపోయిన మా పల్లెని తిరిగిరాని నా బాల్యాన్ని షంషాద్ 2/10/2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iXZ7jM

Posted by Katta

Katta Srinivas కవిత

http://ift.tt/1bS5Omb లోకి మన గ్రూపు లో పోస్టవుతున్న రోజు వారీ కవితలను పంపితే వాటి సంఖ్య ఇలా వుంది చూడండి. పాతిక నుంచి అరవై వరకూ అంటే రోజూ కనీసం ఒక కొత్త కవితా సంపుటి అందుతున్నంత సంఖ్య రాశిపరంగా మనం చాలా కవిత్వాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడ పోస్టు కావడానికంటే ముందు వేరే ఏ అడ్డుగోడలూ లేవు. సెలక్షన్లూ, సజెషన్లూ లేవు కవికి కవే సర్వస్వం తనే ప్రూఫ్ రీడర్, తనే సెలెక్టర్, తనే ఎడిటర్ చివరికి తనే పబ్లిషర్ స్వేచ్చగా కవిత్వాన్ని వ్యక్తం చేసేందుకు ఇది అత్యున్నతమైన స్తితి. కానీ మరీ హడావిడిగా రాసి ప..డే..య..టం.. లా కాకుండా కొంచెం అక్షరదోషాలను సమరించుకుంటూ చిలకరించే ముందు చిలుకుతూ పలకరించి వేడితో మరింత సాంద్రికరించి మన నుంచి ఈ సబ్జెక్ట్ పై ఇవ్వగల అత్యుత్తమ అవుట్ పుట్ అనుకునేలాంటి దాన్ని చెక్కి సానబట్టి పోస్టు చేసేంత సమయం తీసుకోగలిగితే వాసిలోనూ మరింత ముందుకు వెళతాం. పాఠకులుగా మన పాత్ర చేసేప్పుడు రోజుకి ఇలా రెండుమూడు డజన్ల కవితలు అన్నీ మనసు పెట్టి చూడలేకపోవచ్చు. చూసిన వాటిపై నిర్మాణాత్మకమైన రెండు ముక్కలు చెపుతూ వచ్చినా అవి కవి పదునెక్కేందుకు దోహదం చేస్తాయి. కవిత్వపు సామర్ద్యానికి లైకుల సంఖ్య, కామెంటు డబ్బాల సంఖ్యలను కొలమానాలుగా తీసుకోవలసిన అవసరం లేదు. పైలింకులోని మన బ్లాగులో కవితలు పోస్టు అవుతున్నాయి. ( ఆటో ప్లగ్ ఇన్ పనిచేసినంత కాలం టెస్ట్ కోసం) అక్కడ కవుల పేర్ల వారీగా కూడా కవితలను వెతక వచ్చు కవిత క్రింద కవిసంగమం లో కవిత వున్న చోటుకు లింకు కూడా వుంది. కాబట్టి కవితను బ్లాగులో బ్యాక్ అప్ గా భావించి, కామెంటుకు గ్రూపునే వాడుకోవచ్చు అందుకే చోటు ఆదాకూడా అయ్యేలా అక్కడ లైన్ స్పేస్ లేని ఫీడ్ మాత్రమే చేరుతోంది. మరింత మంచి కవిత్వాన్ని అందిస్తూ,రుచిచూస్తూ మన నినాదాన్ని నిజం చేద్దాం జ...య...హో.. కవిత్వం

by Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lvYBuZ

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

సంక్షిప్తంగా *********** రావెల పురుషోత్తమరావు వాగ్దానాలకూ ఓ రోజు నందించిన ప్రపంచానికి అభినందనలు ------------------------- ఇచ్చిన వాగ్దానాలను మరచిననేతలకు కొరడా దెబ్బలివ్వని లోకం పైనే నా కోపం. ---------------------- పున్నామ నరకానికి తల్లిదండ్రులను పంపుతున్న కొడుకులందరికీ కోటానుకోట్ల దండనలు --------------------- అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ అమ్మాయిలను నయవంచనజేసే యువతరమంతటికీ ససల కాగే నూనెలో తైలాభిషేకాలు ------------------------------------- 11-2-2014

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bS5Om1

Posted by Katta

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || బ్రేక్ ద రూల్స్ బ్రేక్ ద వాల్స్ సమాజమో, జ్ఞానమో మనకి తెలియకుండానే మనతో సంప్రదించకుండానే లక్ష్మణరేఖలా ఒక డబ్బా గీసేస్తుంది. నత్తగుల్ల కర్పరంలా తాబేటి డిప్పలా అదే నీకు రక్షణ కవచమని నమ్మిస్తుంది. కవాతు తిరిగే తరాల గ్రంధాల సైనికుల చేతుల్లోని మాటల ఈటెలు సూటిగా తగలకుండా తనే రక్షిస్తానంటుంది. డబ్బాబ్రతుకులో డాబుపై డబ్బారాయుళ్ళెందరో ఇప్పటికే బాగా దంచేసిన ఊకని పోగేసి బాగా నలుగెడుతుంటుంది. అలవాటు పడ్డ శరీరానికి ఉక్కపోతలోనే చాలాసార్లు వెచ్చదనపు హాయి దొరుకుతుంటుంది. కానీ ఒక్కోసారి ఉక్కిబిక్కిరై ఊపిరాడనప్పుడు మాత్రం దిక్కు తోచక ఏ డ్చే బదులు సాంత్వన మాటలకై వగచే బదులు ఎదురు చూపులతో ఎండిపోయే బదులు తప్పదు ఆ డబ్బాలను సైతం బద్దలుకొట్టాలి. పెట్టుడు పెట్టెలకు బయట (out of the box) ఆలోచించాలి. కట్టడాలనో, కట్టుబాట్ల నయినా నెట్టుకు వచ్చేయాలి. తప్పదు ఊపిరాగి పెట్టె కాఫిన్ కాకముందే మర్యాదపు ముద్రని మర్యాదగానైనా చెరిపేసుకోవాలి. తప్పదు నడవటం అవసరమైనప్పుడు పాదం కదపటం. పలుకే ఆధారమైనప్పుడు నోరు విప్పటం తప్పదు, తప్పదు త ప్ప దం టే తప్పదు ► http://ift.tt/1emRuP9 ◄ Kavi Yakoob చెల్లెలి ఫోన్ కవితకు స్పందనగా ☼ 05-02-2014 నాటి వచనం

by Katta Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1emRuP9

Posted by Katta

Prabhakara Chary Anumula కవిత

నువ్వూ..నేనూ....తేడా... నువ్వో...!తాజ్ మహల్ వి ...! కదలవు...మెదలవు... మరి నేనో...!? గడ్డి పూవును...!? చిన్న అలజడికే తల ఉపుతాను...తనువర్పిస్తాను...తన్మయత్వం పొందుతాను.

by Prabhakara Chary Anumulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m2GJLQ

Posted by Katta

Bhaskar Palamuru కవిత

పూల చాదర్ ! ఈర్ష్యా విద్వేషాలతో రగిలి పోతున్న వేళ ఈ నగరం ప్రేమను పంచింది వేలాది ప్రజల గుండెల్లో రాగాలను అద్దింది ఇది నగరమా లేక మానవ సమూహమా కానే కాదు ప్రేమికుల ఆత్మల సంగమానికి ప్రతిరూపం .. భాగ్యనగరం రక్తపు చుక్కలు నేలపై రాలినా తనలోనే ఇముడ్చుకుంది ఘనమైన చరిత్ర ఈ మట్టి స్వంతం మోసం చేసినా.. కుట్రలు పన్నినా ప్రపంచపు వాకిట నిటారుగా నిలబడ్డది కోట్లాది ప్రజలకు బతుకునిచ్చింది .. భరోసా కల్పించింది అవసరమైతే బందూకు బలాన్ని నేర్పింది తరాలు గడిచినా ఇంకా ఈ భూమి ప్రేమికుల స్వర్గంగా మారింది భాగ్ మతి ప్రేమకు ప్రతిరూపంగా నేటికీ పాఠంగా నిలిచే ఉంది ఏ దారుల .. రహదారుల వెంట నడిచినా పాట్రిక్ ప్రేమ పూల చాదర్ లా వెంటాడుతోంది!

by Bhaskar Palamurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m2B3BC

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఒక్కడినే ఒక్కడినే ఉన్నాను కానీ ఒంటరిగా లేను చుట్టూ ప్రపంచం తను మాట్లాడకపోతేనేం నేను పలకరిస్తున్నాగా ఐనా నాలో ఆయనెవరో పెద్దాయన కూర్చొని నాతోమాట్లాడుతున్నాడుగా నాలోనుండి ఆత్మీయభావాలు బయటకొచ్చి నన్ను ఆలింగన చేసుకుంటున్నాయిగా ఒక పెద్ద సమూహం మధ్యలో నేనొక చిన్న మనిషిని కానీ నాలో గొప్ప ప్రవాహం నేను ఒక్కడినే కానీ ఎంతమంది నాలో అందుకే ఒంటరితనానికి ఎంత భయం నా దరి చేరడానికి! 08.02.2014@8.54AM

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ems6ZE

Posted by Katta

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || కలం కదులుతూ || మౌనాక్షరాలు కొన్ని ఆమె కలం నుండి దొర్లి తెల్లకాగితాన్ని పరామర్శిస్తున్నప్పుడు స్వార్ధపరుడ్ని లా .... నేను ఆమె తొలి పాటకుడ్ని కావాలనుకుంటుంటాను. ఆ పదాలు భావనలపై సర్వ హక్కులూ నావే అన్నట్లు నా ప్రియ భావనలు, నా అంచనాలు నా తీపి భ్రమలకు లొంగి .... ఆమె నా గురించే రాసిన పోస్టింగ్ అనుకుంటాను. ఆమె కలంలోంచి కాగితం పైకి ప్రవహించే సిరా నా ఆత్మకు జీవితం లా, ఆ జీవితానికి శ్వాస లా అనుకున్నట్లు, ఎంతో సున్నితంగా పరిశీలిస్తుంటాను. ప్రత్యక్షంగా కానీ పరొక్షంగా కానీ నా ప్రస్తావన ఎక్కడైనా ఉండుండొచ్చెమో అని. ఆ అక్షరాలు కదులుతున్నట్లు కాగితం మించి లేచి ఎగిరొచ్చి నన్ను పలుకరిస్తున్నట్లు ప్రతి పదాన్నీ ఎదలో పొదువుకుంటాను. ఎప్పుడైనా అక్షరాలలో .... ఆమె, కుశల పరామర్శలు చదువుతున్నప్పుడు ఆమె వ్యక్తిత్వానికీ, కళాతత్వానికీ ఎదురుపడే ఆ గౌరవప్రద ప్రశంసలు ఒక చక్కని అనుభూతిని కలిగిస్తాయి.. అందుకే, ఆమె భావనలను అక్షీకరించే ఆ సిరా అంటే నాకు అంత ప్రేమ నా ఆలోచనలపై ఆధిపత్యంతో పాటు అంతర్గత సమాధిస్థితిని నాలో సృష్టించి నన్ను నియంత్రణ చేసే ఆ స్థితి నాకు యిష్టం .... ఎంతో ఉన్నతం, లోతైన ఆ ప్రశంసాత్మక ఆవేశం ఇష్టం. నాకు తెలుసు. సులభంగా చెప్పగలను. ఆమె చేతి ఆయుధం కలం అని. ఆ కలం విసిరిన అక్షరాల కుట్రకు నేను లొంగిపోయానని చెబితే అది దారుణమే అవుతుంది.. నిజం మాత్రం ఆమె ఆలొచనలకు నేను ఆకర్షితుడ్నయ్యాను. ఆమె ఆలోచనలు నా మది లో నిండిపోయి మైలురాళ్ళు పరిపూర్ణ చిత్రాలు గా మారి దిసా నిర్దేశం చేస్తుంటాయి .... నాకు, నా జీవన రహదారినిండా అమర్చబడి. ఆమె, ఒక కథ లేక కవిత లేక నవల రాస్తున్నప్పుడు, ఒక తియ్యని సంగీతం లా నా తెలివి ని విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లు, ఆ సీరా అభిజ్ఞాత్మకంగా కదిలినట్లు రా, రమ్మంటూ ఆ పదాలు ఎంతో మంచివి లా .... ప్రేమ గా బుజ్జగిస్తున్నట్లు, నా ఎద లోకి దూరి ఆ సిరా ఎండిపోయినప్పుడు మాత్రం ఒక అందమైన కళ గా మారిపోతుంటాయి. ఆమెకు నాకూ మాత్రమే అర్ధం తెలిసే రూపావిష్కరణలు గా మారి. 11 FEB 14

by Chandrasekhar Vemulapallyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bRv1wV

Posted by Katta

Prasada Murthy Bandaru కవితby Prasada Murthy Bandarufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQp2d0

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి విభజన మా గుండెల్లో పెరిగిన మా దేహాలు మా ప్రేమతో పెంచిన మా ఆత్మలు నేడు తమ గుణగణనలతో మమ్మల్ని తూకం వేసి చెరిసగమూ పంచుకున్నాయ్ ఇప్పుడు ఇద్దరమూ వేరువేరుగా ఉంటూనే ఒకరి బాధ ఒకరం పంచుకుంటూ ఒకరి కన్నీళ్ళు ఒకరం తుడుచుకుంటూ ఒకే జీవితాన్ని సాగిస్తున్నాం నిద్రాహారాలు మాని ఒకేసారి మృత్యువు ఒడిలోకి చేరాలని కోరుకుంటున్నాం జీవితాలు వేరైనా హృదయం ఒక్కటే గదా మమ్మల్ని వేరుచేయడం అంత సులభమా ఆ భగవంతుడే ఒక పుణ్యాత్ముడి వలె వచ్చి మమ్మల్ని తన గుడిలోకి ఛేర్చాడు అక్కడ ఆయన పాదాల వద్ద రెండు పువ్వుల వలె మేము పరమాణువుని వేరుచేసినంత తేలికా అసలు ద్రవ్యరాసే లేని దైవికమైన మా ప్రేమని వేరు చేయడం! 11FEB2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bInsp6

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-24 ఏ అపరాత్రి పూటో కళ్ళు తెరిచి పైకి చూస్తానా.. ఆకాశం అంతా చెల్లాచెదరైన నక్షత్రాలు మౌనంగా తమలో తాము మాట్లాడుకుంటూ సేదతీరుతున్నట్టు... ప్రతి తార ఒక సూర్యుడే కదా..! ఎటువైపు చూస్తే అటువైపు ఎంతమంది సూర్యులు ..? ఇంత వ్యవస్థ ఎవరికోసం..? ఎవరు ఎవరి కోసం పన్నిన రహస్య వ్యూహమిది...?! --------------------------------- 11-2-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h7zlN0

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే||భార్య|| ముంగిట భార్యను చూస్తూ, రేపటికోసం తనకు ఏమి కావాలో అనే ఆలోచనే గాని, తన కళ్ళలోకి చూస్తూ ఆ క్షణం ఏమి కావాలో ఆలోచన లేదు/రాదు. దౌర్భాగ్యం..... ఆనాటి నీవే ఈనాటి నీవు అని నీ భార్య నీతో చెప్పకపోవడం!! నువ్వు "నువ్వే" అని విని ఎన్నేళ్ళయిందో గుర్తుందా.... అదే అదే మాస్టారు ఏదైనా ఓ క్షణపు "గుర్తు" ఉందా అని ఓ ప్రశ్న? ఆర్కే||భార్య||20140211

by Rajkumar Bungafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iWmfPC

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ ఆకుపచ్చని హృదయం॥ మల్లెల పరిమళం లాంటి ఓ చిలిపి జ్ఞాపకాన్ని ఏ చల్లని క్షణం, చిరుగాలిలా మోసుకొచ్చిందో, పుడమిన పరుచుకుని ఉన్న మన్నుని తట్టి లేపే పిల్ల తెమ్మెరలా మానుపడుతున్న గాయాన్ని ఏ వర్తమానం వచ్చి కదిపి రేపిందో అది పున్నమి వెన్నెలో, చిక్కని చీకటో తెల్లని తుషారమో, వెచ్చని వెలుగు కెరటమో ప్రకృతి మార్చుకునే ఏ రంగురంగుల వస్త్రమో గానీ ఆ చూపుల ప్రవాహంలో పడి మనసులోకి కొట్టుకొచ్చిందేమో లేకపోతే మెరిసే నక్షత్రాల్నీ, విరిసే వసంతాల్నీ చెట్లు రాల్చే శిశిరాశ్రువుల్నీ, చినుకులై రోదించే చిట పట మేఘాల్నీ,గింజల్లా ఏరుకొచ్చి ఏ పరిచయపు పక్షి రాజం తన గుండెల్లోకి విసిరిందో గానీ ఆ హృదయం లోపల ఓ సరి కొత్త భావమేదో విత్తుకుంది విత్తుకుని ఊరుకుందా..... అనుభవాల్లోంచీ, పుస్తకాల్లోంచీ వెలుగు రేఖల్ని లాక్కుని పెనవేసుకుంది దుఃఖ పీడితుల కన్నీటినీ, ఊహించని సుఖంలోంచి పుట్టిన ఆనంద భాష్పాల్నీ అరువడిగి ఆత్రంగా పీల్చుకుంది గురువుల సూచనల్నీ,నేస్తాల ప్రశంసల్నీ, ఎరువుగా మార్చుకుంది అన్నిటినీ రంగరించి తనని తానే మధించుకుని అక్షరామృతాన్ని పత్ర హరితం లా సృష్టించుకుంది చివరికి చిన్ని మొక్కలా చిగురులు తొడిగి ఎందరో సహృదయుల ఆసరాతో మహా వృక్షమల్లే ఎదిగి హృద్యమైన కవితలెన్నో పుష్పించింది , అపూర్వమైన కావ్యాలెన్నో ఫలించింది ఎందరెందరో సాహితీ పిపాసుల ఆకలిదప్పికలు తీర్చే కల్ప వృక్షమైంది మరెన్నో చిరు మొక్కల కోసం అనుభవ పాఠాల్ని రాల్చి ఆదర్శ ప్రాయమైంది మామూలు మట్టి మనసే మరి చిన్ని చిన్ని స్పందనల్ని ఒడిసిపట్టి మహోన్నతమైన రూపాన వృక్షించి అద్భుతమైన కవి హృదయమైంది 11. 02. 2014

by Bhavani Phanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1elHSnJ

Posted by Katta

Nirmalarani Thota కవిత

తిలా పాపం ... తలా పిడికెడు . . ! ! బ్రతకడానికి అవకాశాలు కల్పించక ఆత్మ హత్య మహా పాపమని చట్టాలు చేసే చట్టుబండల ప్రభుత్వం . . ! బ్రతుకు మీద విరక్తి కలిగేలా ఆస్తులు, మెటీరియలిస్టిక్ విజయాల కొలమానాల్లో ఆత్మాభిమానాన్ని కొల్లగొట్టే సమాజం...! బ్రతకాలనిపించడానికి గుప్పెడు ప్రేమను, కాసింత మనోస్తైర్యాన్నిచ్చి , ఆసరాగా మేమున్నామనే ధైర్యాన్ని అందించలేని కుటుంబం . . ! ఉద్యోగాల వేటకు ఆయుధాల్ని చెక్కటమే పరమావధిగా కాసుల బాటలే కాని బ్రతుకు పాఠాలు నేర్పని కళాశాలలు . . .! చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కన్ను మూసాక కన్నీటి వీడ్కోళ్ళు ఆయుష్షు తీరాక అశ్రు నివాళులు శ్వాస ఆగాక సంతాప సభలూ. . ! రాలు తున్న ఒక్క విరినైనా దోసిట పట్ట లేమా .. ? ఒక్క సారి నీ చుట్టూ నిశితంగా చూడు . . . నీ నేస్తాన్నో , సహచరినో సహోదరున్నో, సహోద్యోగినో నిను కన్న వారినో, నువ్వు కన్న వారినో . . గల గలా మాట్లాడే వాడు మూగబోయాడా? చలాకీగా తిరిగే వాడు స్తభ్ధమై పోయాడా? చలోక్తులు విసిరేవాడు వేదాంతాలు వల్లిస్తున్నాడా? పనిమంతుడు పరధ్యానంలో పడ్డాడా? సమూహాల్లో ఒంటరిగా ఉంటున్నాడా? ఒంటరిగా శూన్యం లోకి చూస్తున్నాడా? ప్రసన్నంగా ఉండేవాడు అసహనంగా అరుస్తున్నాడా? కళ్ళల్లో, నవ్వుల్లో జీవం లేదా? నైరాశ్యపు మహమ్మారి కమ్మేస్తుందో . . మాయదారి మృత్యు హేల ముంచుకొస్తుందో . . పరికించి చూడు. . . మామూలు ప్రవర్తనకి ఏ మాత్రం తేడా కనపడినా విస్మరించకు . . ఒక్క సారి భుజం మీద చేయి వేసి ఆత్మీయంగా పలకరించు . . . సంఘర్షణ ఎందుకని సావధానంగా ప్రశ్నించు. . . గడ్డ కట్టిన దైన్యాన్ని దయతో తట్టు కన్నీరై కరిగితే కరుణతో గుండెలకు హత్తుకొని ఓదార్చు...! సమస్యకు పరిష్కారం చూప లేకున్నా చెదిరిన మనసుకు స్వాంతన ఇవ్వు . . అలసిన బ్రతుకుకు ఆసరా ఇవ్వు . . జీవించడానికి అర్ధాన్ని జీవితానికి సార్ధకతనీ కలిగించుకోగలిగే తరుణోపాయాన్ని బ్రహ్మోపదేశంలా గావించు. . తొలి పొద్దులోనే మంచు బిందువుల్లా ఆవిరై పోతున్న మరిన్ని ప్రత్యూషల్నో, ఉదయ కిరణాల్నో సజీవంగా ఉంచడానికి స్వాంతనోక్తుల సంజీవిని హృదయం చేతుల్లొ ఎత్తుకు తిరుగుదాం . . ! నుదుటి రాత రాసిన విధాత కన్నా పురుడు పోసిన కన్న తల్లి కన్నా పునర్జన్మ ఇవ్వగలిగిన వారు మహనీయులు . . ! ! "చెలిమియె కరువై వలపే అరుదై చెదిరిన హృదయము శిలయై పోగా నీ వ్యధ తెలిసి నీడగ నిలిచీ . . . చీకటి మూసిన ఏకాంతంలో నేనున్నానని నిండుగ పలికే వారు నిజంగా ధన్య జీవులు. . ! నిర్మలారాణి తోట [ తేది: 11. 02. 2014 ]

by Nirmalarani Thotafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMFIn5

Posted by Katta

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు-5!! !! గుర్తొస్తున్నావు !! గుర్తొస్తున్నానంటూ పదే పదే మాట్లాడి గుచ్చుతున్నావు నీ లోని ఆంతర్యం ఏమిటో? నాకు అర్దం కాదు నీ చెలిమిలో ఎన్ని క్షణాలు మాట్లాడినా కాలం విలువ మరిచినా ఆ క్షణాలన్నీ గతానికే అంకితం చేసావు గతాన్ని గుర్తు చేస్తున్నావు తీయని మాటలతో భాదతో ముగిస్తావు దానిలోనే ఆనందిస్తున్నావు నా కోసం అన్నీ విడిచాను అంటావు ఒక్క విషయంలో మాత్రం విడవనంటావు నాది అనుమానం అంటావు అవమానిస్తావు ఎందుకు ఇలా? ఇదేనా ప్రేమంటే ? ఎన్నో అభిరుచులను దూరం చేసుకున్నా నీ కోసం నీ అభిప్రాయం తప్పు అంటే ఓప్పుకోనంటావు ప్రేమ విఫలమైతుందని తెలిసి కూడా వదలనంటావు ప్రేమను ప్రేమించే నువ్వేనా ఇలా చేసేది మారవా ప్రియా నా కోసం నా ప్రేమ కోసం పదే పదే గుర్తొస్తున్నావు. !! అజయ్ !! !! 11FEB14 !!

by Ajay Pandufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK4PGq

Posted by Katta

Kavi Yakoob కవిత

అజంతా పద్యాలు వ్యాసాలు » సెప్టెంబర్ 1999రచన : వెల్చేరు నారాయణరావు [ ప్రస్తుతం University of Wisconsin, Madison లో కృష్ణదేవరాయ Special Chair Professor గా ఉంటున్న శ్రీ వెల్చేరు నారాయణ రావు గారు తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో కొత్త మార్గాల్ని ప్రవేశపెట్టి ప్రపంచ సాహితీ విమర్శనా రంగంలో తెలుగు భాషకి కూడ ఒక ఉన్నత స్థానాన్ని కలిగించారు. ఈయన Ph.D. thesis "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు కవితా విమర్శ రంగంలో ఒక విప్లవం తెచ్చిపెట్టింది. శివ కవుల కవిత్వమూ, దానికీ అప్పటి సంఘజీవితానికీ ఉన్న సంబంధమూ వివరిస్తూ " Siva's Warriors", చాటు పద్యాల గురించిన ఒక వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ "A Poem at the Right Moment" మొదలైన గ్రంథాలే కాకుండా ఎన్నో వ్యాసాలు, కాళహస్తీశ్వర మహాత్మ్యం లాటి వాటికి అనువాదాలు రాశారు. సాహిత్యం, సంఘం మీద దాని ప్రభావం గురించి మౌలికమైన పరిశోధనలు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ] * * అజంతా రాసింది తక్కువ. అయినా ఆయనకి తెలుగు కవిత్వంలో వున్న పేరు తక్కువది కాదు. అజంతాని తెలిసున్న వాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేవి రెండు వచన పద్యాలు: “చెట్లు కూలుతున్న దృశ్యం,” “ఎక్కడా ఎవరూ లేరు.” ఈ రెండూ అబ్బూరి ఛాయాదేవి సంకలనం చేసిన కవితల్లో వచ్చాయి. రెండూ గొప్ప పద్యాలు. రెండే రెండు వచన పద్యాలతో ఆధునిక తెలుగు వచన కవిత్వంలో అందరికీ జ్ఞాపకముండే చోటు సంపాదించుకున్న అజంతా, ఆ తరువాత (బహుశా అంతకు ముందు కూడా) రాసిన వచన పద్యాలు ఉన్నాయి. ఎన్నో లేవు కాని, ఉన్న వాటిలో ఆయన స్వయంగా ఎంచి బయట పెట్టదలుచుకున్నవి “స్వప్న లిపి” అనే పేరుతో వచ్చిన పుస్తకంలో వున్నాయి. మాటకున్న తూకం, చప్పుడూ, వచన పద్యంలో పంక్తి నడవవలసిన తీరూ అజంతాకు తెలిసున్నంతగా తెలిసున్న వచన కవులు ఎంతోమంది లేరు. పద్యం లోంచీ, గేయం లోంచీ వచన పద్యం అప్పుడే బయట పడుతున్న తొలి దశలో రాసిన అజంతా వచన పద్యం ఆ తరువాత ఇన్నేళ్ళుగా అనేక కవుల చేతిలో ఆ ప్రక్రియ సాపు దేరిన తరువాత కూడా, చాలా తక్కువ మంది మాత్రమే అందుకోగల శిల్ప శిఖరంగా నిలిచిపోయింది. అజంతా వచన పద్యపు పంక్తులు పొడుగ్గా వుంటాయి. అయినా ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోతాయి. పద్యంలో మాటల కన్నా మించిన అర్థాన్ని మాటల కలయికల అవరణంలో కల్పిస్తాయి. పంక్తికీ పంక్తికీ మధ్య వున్న జాగాలు పద్యం చుట్టూ నిశ్చితమైన వాతావరణాన్ని నిర్మిస్తాయి. ఆ వాతావరణం, అస్తమిస్తున్న సూర్యుడున్న ఆకాశం కింద దారి లేని ఎడారి జాగా లాగా, కంటికి తాను కనిపిస్తూ అందులో మరేదీ కనిపించని చీకటిలో ఒళ్ళంతటికీ తగిలే గాలిలాగా పాఠకుడి మనస్సు చుట్టూ ఆవరించుకుంటుంది. అజంతా మాటలు మన ఇంద్రియాల గ్రహణశక్తికి వుండే పరిమితుల్ని అంతకు ముందు మనం వున్నాయని ఎరగని ప్రదేశాల వరకూ పొడిగిస్తాయి. ఈ పని ఆ మాటలకి అంతకు ముందు లోకంలో వున్న అర్థాలని వాడుకునే చేస్తాయి. మాటకి వున్న నిశ్చితమైన అర్థాన్ని ఒప్పుకుని మాటల్ని ఒకదాని పక్క ఒకటి పేర్చడంలో వున్న పద్ధతులకి లోబడి వుంటూ కూడా, ఆ మాటల అర్థ ప్రదేశాల్ని అంతకు ముందు ఎవరూ ఎరగనంతవరకూ పొడిగిస్తాడు అజంతా. ఈ పని తను చేస్తున్నానని ఎరిగున్నాడేమో కాని ఎవరికీ చెప్పలేదు “రోడ్లకు నమస్కారం” రాసే దాక. అక్షర హింస కవిత్వం కాదు కనుక అక్షర హర్మ్యాలలో ఉన్మత్తుని ఖడ్గ విన్యాసాలు ఆత్మహత్యా సదృశం కనుక ప్రచ్ఛన్న రాక్షసులకు దూరంగా రోడ్లమీద నడుస్తూనే నేను కవిత్వం సృష్టిస్తాను అంతకు ముందు ఎవరూ ఎరుగని అనుభవాలు కవికీ కలుగుతాయి, పిచ్చివాడికీ కలుగుతాయి. ఎటొచ్చీ పిచ్చివాడి అనుభవాలు ఇంకొకళ్ళకి అందవు. అతను మాటల్ని తన అదుపులో పెట్టుకుని వాటి ద్వారా ఆ అనుభవాలు మనకు అందివ్వలేడు. వాడు చేసేది అక్షర ప్రయోగం కాదు, అక్షర హింస. కాని కవిత్వానికి అక్షరాలే ప్రాణం. పిచ్చివాడు తను మాటలతో కట్టిన ఇంట్లో కత్తి పిచ్చి పిచ్చిగా తిప్పి చివరకు తననే పొడుచుకుంటాడు. ఇలాంటి (పిచ్చి) రాక్షసులకి (వాళ్ళు కవుల్లా కనిపించొచ్చు ఒక్కొక్కప్పుడు అందుకే ప్రచ్ఛన్నులు) దూరంగా వుంటాడు కవి. రోడ్లు ఇంకెవరో వేసినవి. భాషకి వ్యాకరణం లాంటివి. వాటి మీద నడుస్తూనే, అంటే వాటిని ఉపయోగించుకుంటూనే కవిత్వం సృష్టిస్తాడు అజంతా. అజంతా రచనలు తిరిగి మరో మాటల్లో తాత్పర్యార్థాన్ని చెప్పడానికి వీలయేవి కావు. మంచి కవిత్వానికి ఇదొక లక్షణం అని అధునికులంటారు. ఆ మాట అన్ని కవిత్వాలకు వర్తించదు. తాత్పర్యార్థాలు చెప్పడానికి వీలిచ్చే మంచి కవిత్వం వుంది. అయితే అది అజంతా కవిత్వం లాంటి మంచి కవిత్వం కాదు. ఆధునిక నాగరికతలో వ్యక్తి చైతన్యం సాంప్రదాయిక సమాజంలో లాగా సమిష్టి తోటీ, ప్రకృతి తోటీ సమస్థితిలో వుండదు. ప్రకృతి పగిలిపోయి, సమాజపు సమిష్టి స్థితి చెదిరిపోయిన ఈ ఆధునిక స్థితిలో ఒంటరి వ్యక్తి దారిలేని చోట దారి వెతుక్కుంటాడు. గాలి లేని చోట ఊపిరి కోసం తపన పడుతుంటాడు. ఈ స్థితిని కవిత్వంగా పునఃప్రవచించి వ్యక్తం చేయ్యడం ఈ స్థితి పై విజయం సాధించడానికి మనిషికి దొరికిన ఒక మార్గం. ఈ మార్గం అజంతాది. అంతర్ముఖత్వం దీనికి తప్పని సరి. కాని కవిత్వం కాబట్టి ఇది ఆ అనుభవాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఇంద్రియ స్పృహ (సెన్సిబిలిటీ)ని నిశితపరచే భాష ద్వారా అందరిలోనూ తమ అంతరంగాలను జాగృతం చేస్తుంది. అంతరంగమొక్కటే వస్తు ప్రపంచమయి, మాటలొక్కటే కావ్య వ్యక్తీకరణ సాధనాలయిన కవిత్వంలో కవికి నేర్పు చాలా కావాలి. మాటలు ఎప్పటికప్పుడు పాతబడిపోతుంటాయి. స్పృహలు ఎప్పటికప్పుడు మొద్దుబారిపోతుంటాయి. ఏ మాటా రెండు మార్లు వాడడానికి వీలు లేదు. లోకం తననించి తీసేసుకుని పది చోట్ల వాడేసిన మాట మైలపడిపోతుంది. తనే ఒకసారి వాడిన మాట రెండోసారికి మాసిపోయినట్టుంటుంది. ఎప్పటికప్పుడు మాటల్ని శుభ్రం చేసుకోవాలి. అర్థాల బలహీనత నుంచి అక్షరాలను కాపాడాలి. ఈ పనిలో కవికి ప్రతిసారి భాష పాడైపోయినట్టు, కవిత్వం కల్మషమయి పోయినట్లు కనిపిస్తుంది. కవి తన అక్షరాలను తానే శంకిస్తాడు. తన వాక్యాలను తానే అనుమానంగా చూస్తాడు. ఆధునిక కవిత్వంలో ఇది కాలుష్య యుగం అని ప్రకటించాడు అజంతా, ముప్ఫై ఏళ్ళ క్రితం ఒకసారి. సాహిత్యంలో సాహిత్యేతర విషయాలు కలిసిపోయాయని నొచ్చుకున్నాడు. సిద్ధాంతాలు, విశ్వాసాలు కవిత్వంలో వుండకూడదన్నాడు. అంతేకాదు అనుకరణం కూడా కాలుష్యానికి దారి తీస్తుందన్నాడు. ఇది అజంతా చేసిన ప్రత్యేకమైన కవితా సిద్ధాంతం కాదు. మాటలూ, మనస్సులో పుట్టిన కదలికలూ మాత్రమే కవితా సంపద అయిన పరిస్థితిలో అనివార్యంగా ఏర్పడే కవిత్వ సిద్ధాంతం ఇదే. అజంతా రాసిన పద్యాలన్నిటిలోనూ కనిపించే బొమ్మ మృత్యువుది. ఆ మృత్యువు అనేక రకాలు: భాషా మృత్యువు, భావాల హత్య, మనుష్యుల మరణం, చివరికి తన సొంత చావు. ఎవడో హఠాత్తుగా ఘోర ప్రమాదంలో చిక్కుకుంటాడనుకో చుట్టూ పోగైన జనం ఒక్క దఫా నా ముఖం వైపు చూస్తారు ఇదేం విచిత్రం వీడు వాడు ఒకే పోలిక అని ఆశ్చర్యపోతారు అందాకా ఎందుకు, రోడ్డు మీద నా మృత కళేబరాలని నేనే లక్ష సార్లు చూశాను నమ్ముతావో నమ్మవో గాని తమ్ముడూ నిజం చెప్తున్నాను ఈ నగరంలో అడుగు పెట్టిన రోజున పట్టపగలు నక్షత్రాలు చూశాను. ఈ మృత్యువు ప్రపంచం అంతటా వ్యాపించి వున్నది. ఆధునిక నాగరికతలో వ్యాప్తమై వున్న ఈ మృత్యు లక్షణం భాషకి కూడా వర్తిస్తుంది. మిత్రుడా నేరం చేశాను అదృశ్య ప్రాకారాల వెనుక రహస్యోద్యాన వనంలో వికసించిన చిత్రాక్షరాలను చీకటి నఖాగ్రాలతో చిత్రవధ చేశాను … మిత్రుడా నేరం చేశాను. ఈ బొమ్మలు అజంతా పద్యాల నిండా వుంటాయి. ఈ “భీభత్సంలో,” “నిశ్శబ్దంలో,” “ఆకలి రుద్రభూమిలో,” “జీవన సౌందర్యాన్ని ఎలా చూడగల” నని ప్రశ్నించుకున్న మానవుడు శాశ్వతంగా నిస్సహాయుడు, నిరంతరం పరాజితుడు. ఇన్ని పరాజయాల, సమాధానం లేని ప్రశ్నల సమ్మర్ద వాతావరణాన్ని సృష్టించినా, అజంతా కవిత్వం భాషని బతికిస్తుంది, భావాల మనఃప్రపంచాలని చైతన్యవంతం చేస్తుంది. అందుకే ఏ నిరాశని, వైకల్యాన్ని పాఠకుడి అంతరంగంలో ప్రతిసృష్టించిందో, వాటి మీద పాఠకుడికి ఒక సృష్టికర్త కుండే స్వాధీనమూ, సౌలభ్యమూ సంపాదించి పెడుతుంది. నిరాశ కవిత్వం అయితే లోకంలో నిరాశలా, మనిషిని కుంగదీయదు. మనిషిని ఆ నిరాశకి యజమానిని చేస్తుంది. భావ కవిత్వపు రోజులలో మనకొక అపసిద్ధాంతం వొచ్చింది. కవికి ఇన్స్పిరేషన్‌, అంటే భావావేశం, అవసరమనీ, అదే కవిత్వానికి ప్రాణమని. ఈ వరసలోనే కవిత్వం హృదయ ప్రధానం అనీ, శాస్త్రం బుద్ధి ప్రధానమనీ ఒక చెక్కపడి అభిప్రాయం ఏర్పడింది. ఈ అభిప్రాయాలు ఇప్పటికీ మన సాహిత్య విమర్శలో మిగిలి వున్నాయి. నిశితమైన బుద్ధితో, నిశితమైన ఇంద్రియాల ద్వారా గ్రహించిన ప్రాపంచిక తత్వ్తాన్ని శబ్దాల సత్తువని జాగ్రత్తగా కలిపి నిపుణంగా నిర్మించిన భౌతిక సౌధం కవిత్వం. ఇలాంటి కవిత్వం మట్టి లోంచి వస్తుంది; చర్మం లోంచి వస్తుంది; తన చుట్టూ వున్న ప్రపంచంలో నిండా మునిగి వుండడం వల్లనే వొస్తుంది. ఈ సంగతి శ్రీశ్రీ కి తెలుసు. శ్రీశ్రీకి తెలుసునని అజంతాకి తెలుసు. భావకవులు, ముఖ్యంగా వాళ్ళలో చిన్నవాళ్ళు అతిలోక సౌందర్యాల అబద్ధాల వెనుకాతల తమను తాము మోసం చేసుకుంటున్న రోజుల్లోనే అజంతా ఇలాంటి కవిత్వం రాశాడు. అందుకే కవిత్వంలో కన్నీళ్ళలో తత్వ్తం వుండదు. చేతగాని సొంత బాధ వుండదు. ఒక్క “పరిత్యాగి పరివేదన” లోనే అజంతా మధ్య తరగతి వ్యక్తి సొంత బాధని జాలిగా వినిపించాడు. బహుశా ఇప్పుడు గుర్తుకు రాదు నీకు క్రమ్ముకు వస్తున్న చీకట్లో కన్నీళ్ళు రాల్చుతూ చెప్పారు నువ్వే మా కష్టాలకు వంతెన అన్నారు అదే నిన్ను చూడడం ఆఖరు రోజు నాకు వాళ్ళ ఆశని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసాను వాళ్ళని అక్షరాల కన్నీరుగా మార్చేసాను. ఇలాంటి జాలి అజంతా పద్యాల్లో మరెక్కడా కనిపించదు. అజంతా పద్యాలలో తరువాత వ్యక్తమయేవి వ్యక్తిగతమైన కన్నీటి మాటలు కావు. నిరంతర ఆత్మహననం లోంచి వచ్చిన, నిత్య పరిశ్రమ వల్ల ఉద్భవించిన పదునైన నిర్మాణాలు. తెలుగులో చాలా మంది కవులు పద్యానికి ఏదో ఒక అర్థ సూత్రాన్ని వాడుకుని, ఆ దారం మీద మాటలు పేరుస్తారు. అజంతా పద్యాలలో పంక్తికీ పంక్తికీ మధ్యనున్న జాగాలో ఇలాంటి క్రమానుగత అర్థసూత్రం వుండదు. ఏ మాటకామాట కట్టే బొమ్మల్ని ముద్దుగా కలిపి వాటి సమ్మేళనాల సమ్మర్దం ప్రదర్శించే ప్రపంచమే అజంతా పద్యం. ఈ ప్రపంచానికి నేపథ్యంగా పద్యపు పంక్తుల లయ విన్యాసాలు నిశ్శబ్ద కాసారంలో రాయి వేసినప్పుడు వచ్చే అల తరువాత అలలాగా కదులుతాయి. అజంతా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. తన కవిత్వాన్ని తానే నిరాకరించి, తన పద్యాలు తానే అసహ్యించుకుని తనకు నచ్చని వాటిని వొదిలేసే ధీరత వున్నవాడు అజంతా. కవి అనే మాటను కూడా తనకు వాడవద్దనేవాడు; అంతగా తన కవిత్వంలో తనను ముంచేసుకున్నాడు. అజంతా మన అంతరంగాలను సృష్టించిన చాలా కొద్ది మంది కవుల్లో ఒకడు. మనం ఎన్నిసార్లు చదివినా అతని పద్యాలు ఒరలోంచి తీసిన బాకు మొనలాగా, సర్పం విడిచిన కుబుసం పొరలాగా పదునుగా, స్వచ్ఛంగా వుంటాయి. [Courtesy : eemata.com]

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK4PpU

Posted by Katta

Lugendra Pillai కవిత

కరణం లుగేంద్ర పిళ్ళై // ఎదను గెలవాలి// ఎన్నో వందల సార్లు చెప్పివుంటాను ప్రతీదీ శల్యపరీక్ష చేయెద్దని కాని భూతద్దం పట్టుకొని చూస్తుంటావ్ ఎన్నో వేల సార్లు తెలిపివుంటాను మసిపట్టని హృదయాలపై మరకలు చల్లొద్దని కాని ఎప్పుడూ బురదజల్లుతూనే వుంటావ్ లోతులకెళ్ళి అన్నీ చూడాలంటావ్ నిన్ను మాత్రం తరచి చూసుకోవు ప్రతీదీ పట్టి పట్టి పరీక్షిస్తావ్ నీ వెనుక చెదలు పడుతున్నదని తెలియకున్నావ్ నవ్వుతూ కనిపించమంటే నీ హోదాకు తక్కువంటావ్ నలుగురితో మాటలాడమంటే నామోషి అంటుంటావ్ అందలంలో వున్నప్పుడు పొడి పొడిగా మాటలాడి నీ పనులు చేసుకోవచ్చు భయపడుతూ అందరూ వుంటే భలేగా వుండొచ్చు ఒక్కరూ నీ ఛాయలకు రాని రోజు రాబోతోంది చెడును కాదు వెతుకు మనిషిలోని మంచిని హుకరింపు కాదు పలకరింపు తో జయించి మనిషిలోని ఎదని నీ చుట్టూ విరబూసిన జన సంద్రం నీ వెనుక నడిచేందుకు ఓ సైన్యం సిద్దమౌతుంది.. 11/2/2014

by Lugendra Pillaifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h75rIH

Posted by Katta

Krishna Mani కవిత

పానుపు ******** నాకున్నదొక్కటి నేనున్నదొక్కటి ! అగజూసి ఇగజూసి కండ్లుగాయలు కాయంగ సలిరాతిరి నాతోడు అతుకులబొంతె ! కడుపున కాళ్జేతులువెట్టి పంతి నేను కుక్కపిల్లోలె నడియాల సందమయ్య సూడగ రోడ్డుపానుపే ఈ దినం దిన దినం ఆయే ! కృష్ణ మణి I 11-02-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVl1nJ

Posted by Katta

Lingareddy Kasula కవిత

తెలంగాణా ఏర్పాటు కోసం పార్లమెంటు లో పెట్టనున్న బిల్లు లో పోలవరం కు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఆదివాసీల పాలిట శాపంగా మారనుంది. అందుకు విరసం ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహిస్తోంది .ఆ సందర్భంగా .. పోలవరం పోరుదారి||డా// కాసుల లింగా రెడ్డి || 11-02-20214 పల్లవి: కడుపుచేత పట్టుకోని మూటముల్లె సర్దుకోని ఏదారి నేను పోదునో మాయమ్మలార బతుకు- గోదారి పాలాయెనో మాయన్నలార చరణం1: చెట్టుగొట్టి మొట్టుదీసి- కంపగొట్టి కాలవెట్టి కండగరగ ఎముకలరగ- రక్తమోడ్చి చెమటదీసి పోడుగొట్టి సాగుచేస్తిమో మాయమ్మలార బతుకుపంట పోగుచేస్తిమో మాయన్నలార చరణం2: తాతతండ్రుల సాలువట్టి-ఊరువాడ దోస్తిగట్టి కష్టసుఖం పంచుకోని-కలిఅంబలి కలిసితాగి కాలమెల్లదీయవడ్తిమో మాయమ్మలార అడవితల్లి ఆదరించెనా మాయన్నలార చరణం3: ఉరుములేని పిడుగులాగ-పగబట్టిన పాములాగ భూమిజాగవదలాలని- పోలవరం కడతామని మా మెడలమీద కత్తివెట్టిరా మాయమ్మలార జలయజ్ఞం పేరుచెప్పిరా మాయన్నలార చరణం4: ఇరుగబూసిన వెన్నెల్లో- రేల ఆటపాటల్లో పాపికొండల పాయల్లో- గోదావరి పరుగుల్లో గంతులేసె జింకలతో- నెమలి కూత ఆటలతో అడవితల్లి అందాలు- ఆదివాసి బంధాలు బతుకుబాట పాపవట్టిరా మాయమ్మలార పేగుబంధం తెంచవట్టిరా మా యన్నలార చరణం5: ఆశచచ్చినోడెవ్వడు- చేవలేని వాడెవ్వడు మధ్యయుగం నీతులను- ఏలే బలవంతులను తరిమి తరిమికొట్టుదామురో మాయమ్మలార యద్ధం మొదలెట్టుదామురో మాయన్నలార చరణం6: ఆశయాల వెలుగులల్ల- మన అమరుల దారులల్ల చేయిచేయి పట్టుకోని- బడితకట్టెలందుకోని పోరుబాట నడుద్దామురో మాయమ్మలార పోలవరంనాపుదామురో మాయన్నలార 'నమస్తె తెలంగాణ' దినపత్రికలో 16 నవంబర్‌ 2011

by Lingareddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1el07JZ

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిసంగమం యూట్యూబ్ చానెల్ ~ http://ift.tt/1m0rmDN

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rmDN

Posted by Katta

Kavi Yakoob కవితby Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kJE6dP

Posted by Katta

Shamshad Mohammed కవిత

తప్పిపోయిన మా పల్లె కుప్పలుగా పోసి ఆడిన చింతగింజలాటలో లెక్కలేసుకున్న కట్టలు గుర్రాలు ఏనుగులు ఎక్కడికి పారిపోయాయొనని వెతుక్కుంటున్న వరండాలు అంబా అనే పిలుపు వినపడక చావిట్లొ గుంజకి కట్టిన తాడు గింజుకుంటుంది కరగని నేలా బండలాటలో కదిలిపోయిన తిరిగిరాని కాలం అమ్మమ్మతోపాటే పడేసిన ట్రంక్ పెట్టెలో ఏడుస్తూ వెళ్ళిన పచ్చీసు పట్టా ఏ బార్బి బూచి ఎత్తుకెళ్ళిందో అందమైన నా తాటాకుబొమ్మకి దిష్టి తగిలి అష్టా చెమ్మలాటలో పంటలకి ఏ చీడపురుగు పట్టిందో ఏమొ ఉత్తుత్తి అన్నంపప్పులుడకేసిన మట్టిగురుగుల్నికరిగించిన చీమ కళ్ళ ప్లాస్టిక్ గిన్నెలు రిమొట్ కంట్రోల్ బొమ్మలకింద ముక్కలైన నా చిన్ని చెక్కపీటలు అడ్డుకునెవారు లేక చెదలు కి స్వేచ్చని పరిచిన గోడలు పడాపడేసిన ఇంటికి నన్నెందుకువంటరిగా వేల్లాడదీయ్యడమని వెర్రిగా నవ్వుకుంటున్న తాళం కప్ప ఎక్కడని వెతకను తప్పిపోయిన మా పల్లెని తిరిగిరాని నా బాల్యాన్ని షంషాద్ 2/10/2014

by Shamshad Mohammedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kxxwtj

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//ఆఖరి ఘట్టం// శిధిలమవుతున్న కణం ఒకొక్కటీ ఎల్లలు మూసేస్తున్న కుడ్యానికి పునాది కఠిన శిలలు వికృతంగా నవ్వేకొద్దీ అవయవాలన్నిటిదీ తలోదారి.. విస్తరించిన రాజ్యంలో యువరాజు పట్టభిషేకం తరువాత వృద్ద మహారాజు ఓ అలంకారం. రాజమాతదో ఏలుబడి యువరాజుదో పలుకుబడి పరిపాలనకు ఎకాఎకీ పోటా పోటీ సి0హాసనం రాచకురుపైనా సౌఖ్యమే భాద్యతలు అరక్షణమైనా బరువే... ఈ వయసుకు వైద్యం వలదనో చావు వరకూ తప్పదనో మాటలు వింటూ చీకటిలో గబ్బిలంలా ఎగిరి ఎరగని ఆకాశం అందాకా విజయం వరించిన మేనుపై వింతగా తెల్లని వస్త్రం కప్పబడుతుంది. ఓ ప్రయాణం ఇలా ముగిసిందనుకునే లోపు మిగిలిన మజిలీలు తారసపడ్డాయ్ కొన్ని గోడలు, కొన్ని గుండెలు వికారాలకి ముందు శ్రీకారం కొనుక్కొని చరిత్ర రాసే పనిలో పడ్డాయ్..........10.02.2014.

by Nvmvarma Kalidindifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h6EBk6

Posted by Katta

Tarun Chakravarthy కవిత

తరుణ్ చక్రవర్తి ॥ సుషుప్తాత్మలు ... ॥ నాకొక టివి ఉన్నది క్రికెట్ మ్యాచ్ వస్తున్నది అడ్వర్ టైజు మెంటు చూస్తే చాలు లోకంలోని వృద్ధి అంతా తెలిసిపోతూనే ఉన్నది పేపర్లు , చానళ్ళు రిపోర్టర్లు, మేధావులు నాయకులు, అధికారులు ... ఎవ్వరికీ అందకుండ మానవాభివృద్ధి జరిగి జరిగి పోతున్నది ఎవరిమట్టుకు వారికి ప్రపంచమంతా బాగానే ఉన్నది నాకు మాత్రం గుండె లోతుల్లో ఎక్కడో మండుతున్నట్టనిపిస్తున్నది.. .. నీడలే సోకనట్టి సంపూర్ణపు వెలుగొకటి అందరు చేతులు వేసిన అబివృద్ధి సౌధమొకటి ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే సాధ్యమనే అనిపిస్తున్నది.. .. అందరినీ కలుపుకుని వెళదామని ప్రయత్నిస్తే తక్కెడలో కప్పలన్ని దుమికి దుమికి పోతున్నవి .. .. అందరూ బురదలోకి రాళ్ళు కొడుతూ ఉన్నప్పుడు బురద చిట్లుతున్న వైపు నా వీపే ఉన్నట్టనిపిస్తున్నది .. .. జాగృదావస్థా .. కాదు కాదు స్వప్నావస్థా ... అసలే కాదు మానవ చైతన్యపు ఆత్మ సుషుప్తావస్థ లోకి జారి జారి పొతున్నది.. ..

by Tarun Chakravarthyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h6Cb4R

Posted by Katta

Meher కవిత

బడుగు భాస్కర్ జోగేష్ | హంటర్‌ రోడ్‌లో ఒంటరిగా… చీకటి కాటుక పూసిన నింగి నేత్రపు నిరంతరాయ నిరీక్షణ నడిరేయి నల్లని రహదారిపై నల్లగ మెరిసే మాయాముద్రలు నిదరోయే నల్లతుమ్మ చెట్టు చెంతకు చేరి నిను మరి మరి మేల్కొల్పుకునే నీ నేను గగనం శిరసును మెరిసే తారకల తన్మయ కాంతుల్లో అలనాటి నీ అడుగుల సవ్వడికై ఆరాధనాధారిత అన్వేషణలు నీవు నడిచిన మార్గాన నిలిచి నిను తలపోస్తోన్న సమయాలు నీవెన్నెడో పయనించి పరిచిన నీ మృదు పాద ముద్రలు ప్రోదిచేసుకు పొదువు కోవాలన్న ఆరాట ఆరోహణా గరిష్టతలు నీవు నడయాడిన నడకలపై నా కనుల కాళ్లెంత కలియ తిరిగినా కానరావు తెగిపడే మానస తంత్రుల అనుదిన విలాప శృతులు నీకెన్నటికీ వినిపించవు నా హృదయాంతరంగములో విస్తరిస్తోన్న రహదారిలోకి నీవెన్నటికీ రాలేవు నీకై వాడిపోని కాలాతీత వీక్షణతో నీవొదిలి వెళ్లిన దారి దరిన నీ దరి చేరలేని నేను ఒంటరిగా. . . ఒంటరిగా. . . 10-02-2014 http://ift.tt/1ekrdAV

by Meherfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ekrdAV

Posted by Katta

Kancharla Srinivas కవిత

నీళ్లలో ముంచేస్తుంటే నీ అరుపేం వినపిస్తుంది నిలువెల్లా ఏడుస్తున్నా ఆ..కన్నీరేం కనిపిస్తుంది.. వంధ్య శిలపై భవితలు బలి సమాదిపై పునాదులే ఇవి అడవి బిడ్డల కన్నీటితొ ఏ బతుకులు మొలిస్తారో.. ఏ మెతుకులు పండిస్తారో.. వెలుగిస్తుందని వెలిగిస్తే దీపం వేదనలే రగిలిస్తోంది నిప్పును ఆర్పే నీరే పెను ఉప్పెన జ్వాలవుతొంది ఈ అభినవ ఖాండవ దహనం అడవికళ్ళలో ఆకుపచ్చ దుఖం.. సంస్కృతి విధ్వంసం సంప్రదాయ వినాశం చేసే ఈ శాపాన్ని పోల వరం అంటే పాపం..

by Kancharla Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bkO2tO

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

శుభోదయం కమలంలా కనిపించావేమో_చంద్రుడే నీచెంతకొచ్చాడు ..@శర్మ \11.2.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iUDSiN

Posted by Katta

Sasi Sri కవిత

రాళ్ళబండి శశిశ్రీ // ఫోర్త్ డైమెన్షన్ // అక్షాంశాలు, రేఖాంశాలు సమాంతరంగానే ఉన్నాయి. నీ ఉనికిని ఉజ్జాయింపుగా చెప్పడానికి, కాలం కచ్చితంగా నడుస్తుందనడానికి. మారను అంటే వచ్చే నష్టమేమీ లేదు, నీ వ్యక్తిత్వ కొలమానంలో ఫోర్త్ డైమెన్షన్ మిస్సవడం తప్ప. భూమి గుండ్రంగా ఉందనేది సత్యం, కానీ మూడొందల అరవై డిగ్రీలు తిరిగేలోపే, జీవిత ప్రకంపనలు భూమి పొరల్లో మరుగున పడిపోతున్నాయి. ఫలితాన్ని నిర్ధారించడానికి, మరికొన్ని నిర్వచనాలు వ్యక్తీకరించడానికి ఎవ్వరం మిగలం. అన్ని ప్రశ్నల్నీ ఇక్కడే వదిలేసి నిశ్శేషమైపోతున్నాం. 11. 2. 2014

by Sasi Srifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NwHUnD

Posted by Katta

Mohan Rishi కవిత

మోహన్ రుషి // ఎందుకో తెలీదు..! // బాధ ఉండదని కాదు కానీ, కన్నీళ్ళలోకి ట్రాన్స్ ఫర్ కాదు. వేదన కమ్ముకుంటుంది నిజమే, వెక్కి వెక్కి ఏడవడం కుదరదు. హృదయం ముక్కలవడం తెలుస్తున్నా, విషాద వదనం వీలవదు. కొన్ని చెప్పలేం... కొన్ని ప్రకటించలేం... వర్షించే మేఘం ఆఖరి నిముషంలో పునరాలోచనలో పడడం అవని మీది ప్రేమలేమిగా అభాండం వెయ్యలేం! **** అభియోగాలన్నింటికీ ఆన్సర్ ఇవ్వలేను... అటో, ఇటో నిలబడ్డమే జీవితమని అంటే తీర్మానానికి మద్దతుగా తీన్ మార్ వెయ్యలేను! ప్రేమ లేదని కాదు కానీ, తేపకొకసారి తేమను నిరూపించడం నావల్ల కాదు! 6. 6. 2012 ("జీరో డిగ్రీ" నుండి)

by Mohan Rishifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iUvZtC

Posted by Katta

Sateesh Namavarapu కవిత

***ఒక్కోసారి..జీవితం..!!*** చిత్రంగా కనిపిస్తుంది, విచిత్రంగా వినిపిస్తుంది! చిత్రంగా తోస్తుంది, చీత్కారంగా కోస్తుంది.! హద్దులుగా కనిపిస్తుంది, అన్ని ఎల్లలు దాటేస్తుంది.! అసహజంగా కనిపిస్తుంది, అసహనంగా మారుస్తుంది.! ఏమరుపాటుగా ఉన్నామనిపిస్తుంది, తెలియకుండానే ఏమారుస్తుంది.! కలల వర్షమై కురుస్తుంది, కల్లలై, కన్నీరై ప్రవహిస్తుంది.! విడ్డూరంగా కనిపిస్తుంది, వైఢూర్యంగా ప్రభవిస్తుంది.! ఎంతో వింతగా కనిపిస్తుంది, అంతలో చింతల పంజా విసురుతుంది.! మనకే సొంతం అనిపిస్తుంది, మనని మనకు కాకుండా చేస్తుంది.! వండిన పదార్ధమైనా, ఉన్నదేదైనా, భావం కలిపితే..నైవేద్యమవుతుంది.! ఉన్నవన్నీ పోయిన నాడు, మిగిలి ఉన్నదేదో..సత్యమవుతుంది..!!..11FEB2014

by Sateesh Namavarapufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NwHVIk

Posted by Katta

Uday Kumar Alajangi కవిత

అలజంగి ఉదయ్ కుమార్ // ప్రతి క్షణం చస్తూ జీవించు...// ప్రేమించే పని చేయలంటే గట్స్ ఉండాలిరా అబ్బాయి! మనం చేసే పని మనకు నచ్చిందే అయితే మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేదే అయితే ఆ కిక్కే వేరురా అబ్బాయి! సమయం ఎప్పుడైపోతుందో తెలీదు శరీరానికి అలసట అంటే తెలీదు సృజనాత్మకతయే ఆలంబనగా రోజూ చేసే పని లో ప్రయోగాలు చేస్తూ పరిపూర్ణత్వం వైపు నడుస్తుంటాం. ఎవ్వడేమంటున్నాడో ఎవడు పలకరిస్తున్నాడో ఎవడు పరిహసిస్తున్నాడో ఎవడు కలహిస్తున్నాడో ఎవడు కలహిస్తున్నాడో ఎవడు కవ్విస్తున్నాడో ఎవడు కలవర పెడుతున్నాడొ ఆలోచించడానికే సమయం దొరకదు చేసే పనిలో నిరంతరం ఓ మునిలా ఓ ధ్యానిలా ప్రాపంచిక లోకంతో లాభనష్టాల బేరీజుతో ఏ లెక్క లేదన్నట్టు మునిగిపోవడమే చేతికి వచ్చే సంపాదన కన్నా గుండె లో నిండే సంతృప్తి యావత్ లోకాన్నే నీ కాళ్ళకింద దాసోహం చేస్తుంది కాని అది అంత సుళువు కాదురా చిన్నా ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు ఎవరి సహాయాలు ఉండవు ఎవరి సూచనలు ఉండవు లోకం నిన్ను గుర్తించేంత వరకు నీ ఆకలి, నీ అవసరాలు నిరంతరం నీకు గుర్తు చేస్తూనే ఉంటాయి ఎవడు మనల్ని తక్కువగ చూస్తున్నాడో అనే ఆత్మన్యూన్యత అసలు నిదురే పోనియ్యదు ఎవడిని కలిసినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా అవహేళనా జ్వాలలు గుచ్చుకుంటూనే ఉంటాయి నమ్ముకున్నవారికి బరువు అవుతున్నామేమో అన్న వ్యథ నిలువెల్లా కాలుస్తునే ఉంటుంది ఎదురు చూసే క్షణం నీదైనంతవరకు కలలు సాకరమై ఎదురుగా నిలిచేంతవరకు జీవితంతో ఫొరాడే ఓపిక, ఓరిమి నీ ఆయుధాలుగా మలుచుకునే నైపుణ్యం ఉంటేనే నీవు ప్రేమించే పని జీవితాంతం చేయడానికి సిద్ధపడు లేదా మనసు చంపుకొని నాలుగు రాళ్ళు సంపాదించేందుకు దొరికిన పని చేస్తూ ప్రతి క్షణం చస్తూ జీవించు...

by Uday Kumar Alajangifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lsrV5v

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||ఇదెలా,. ఇదెలాగో., ఇలా|| చివరి చినుకులు రాల్చుకుంటూ, మధ్యంతరంగా వర్షం వెళ్లిపోవచ్చు. దాహాలను పూర్తిగా తీర్చుకోనీకుండా. ఒక నిండైన నదీ ప్రవాహం, ఒకానొక సమయాన కాస్తంత నిప్పుల సెగకే, పూర్తిగా ఇంకి పోనూ వచ్చు మళ్లీమళ్లీ తడులు దరిచేరకుండా. ఎరుకతో కూడిన ఆనందాల అన్వేషణలో ఉన్నట్టుండి, విరగకాసే వృక్షమొకటి అర్థాంతరంగా నేల వడిలోకి కూరుకుపోనూ వచ్చు. వెలుగులు చీకట్లలో దాక్కోనూ వచ్చు, జీవితం ఏకాంతాన్ని హత్తుకోనూ వచ్చు. ప్రేమలు ప్రకటించబడని చోట్ల, విత్తనం మొలకలెత్తనని భీష్మించనూ వచ్చు. ఆకాశం ఉరమవచ్చు, మెరుపుల అందాలు అద్దకోనూ వచ్చు. ఉషః, సంధ్యా కాంతులతో మెరిసిపోనూ వచ్చు. అనుదినము అలుపెరగని కొత్త కవిత్వమై అలరించనూ వచ్చు. ఇదెలా, ఇదెలాగో ఇలా,.. మాయామవడం, మూసుకుపోవడం, వీడ్కోలు చెప్పడం,. సాధ్యమా, మరి నీకు ఆకాశమా? ---------------------------------------11/2/2014

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g0SyNg

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :-~ 17 సంపుటి పేరు:- "మరువం" రాసిన కవయిత్రి:-" మరువం ఉష' పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి "ఆమె కవిత్వ పరిమళం నిజంగా మరువమే !" "నిన్న వాన వెలిసి పోయిందనే బెంగ,నేడు వాన కురుస్తుందని కలత,మదికి ఇదో సరదా-ఎండ బాధ వద్దనో,చలి బారిన పడననో ఒక దాని వెంట ఒకటి యోచనా సుడులు వృథా అలజడులు"-అని ఒక జీవన శకలాన్ని చిత్రిక పట్టిన కవయిత్రి ఉష."పగలు రేయి పునరావృతాలు,ఋతువుల రాకపోకలుమారే వర్ణాలు,నడుమ చీకు చింతల నిత్య జీవిత పారాయణాలు"-కాల స్వభావంతో జీవితాన్ని ముడివెట్టిన కవయిత్రి ఉష గారు.'నీవు కేంద్ర బిందువు నన్నావు,నీ చుట్టూ ఓ అనంత వృత్తం నను గీసుక రమ్మన్నావు,ఇక్కడే నేను కొత్త పాఠం నీకు చెబుతున్నాను,వింటావా?"-అని విధాతకే పాఠం చెప్ప ప్రయత్నిస్తున్న కవయిత్రి ఉష గారు. తనలో తానొక ప్రకృతి పరవశత్వపు పరిధి గీసుకొని,తాను పొందిఉందిన ఆ వివశత్వపు అనుభూతిని పాఠకుల హౄదిలోకి వొంపగల అభివ్యక్తి ఈ కవయిత్రిలో అగుపిస్తుంది.అపార భావుకత,అందుకు తగ్గ పద సంపద ఈవిడలో వుంది.కాల్పనిక,భావ కవితా దోరణుల మిళితం ఈమె కవిత్వం. ఈ కవయిత్రి తన కవితా ఖండికలకు వుంచే శీర్షికలు కొన్ని ఎంతో భావుకతను అద్దుకొని పాఠకున్ని తన వైపుకు తిప్పుకొంటాయి."వలపుల వాన చినుకు","మంచు పూల పేరంటం","ఈ సిగ లెక్కెక్కడ తప్పిండొచ్చబ్బా!",-ఇలాంటి పద్యాల శీర్షికలు ఎన్నో ఉష గారి పద్యం పదునున్కు కొలమానాలుగా నిలుస్తాయి.వర్షం అందర్ని అలరించినా కొందరే దాన్ని కవిత్వం చేయగలుగుతారు.వేరు వేరు కవులు తీసుకుండే వస్తువు ఒకటే అయినా వారి మార్గాల భేదాలను బట్టి వేరు వేరు కవితలు తయారవుతాయి.వాన చినుక్కీ,నేల మంటికీ వుండే వొక చిక్కని బంధాన్ని మరువం ఉష గారు క్లిష్టత లేని పదాల ప్రయోగంతో వొక అసాధరణ వూహను నిర్మించారు."మా వూరి మబ్బుకి మమతలెక్కువనుకుంటా"-అని మొదలయ్యే ఈ కవితలో మేఘాన్ని కరి మబ్బుగా చెప్పటం సాధరణమే అయినా వెను వెంటనే "కరి వేరు మొగ్గలా మెరిసి అని అనటంలోనే వొక వైచిత్రినీ కవయిత్రి మెరిపిస్తుంది."ఉన్నది వూరుకోకుండా మెరుపు లేఖలు రువ్వే ఆ మబ్బు ఉరిమురిమి తుళ్ళిపడేలా తుంటరి పనులు చేస్తుందని"-ఉన్న రంగులు చాలక వింత వన్నెలతో వరుసలు కడుతుందని ఈ కవయిత్రి మబ్బుకి మానుష్త్వ రూప ఆరోపణ చేస్తుంది.ఇలా కవిత్వం చేయటం కృష్ణ శాస్త్రి లాంటి పూర్వ కవుల పఠనం వల్లా లాభించే విద్య అని తెలుస్తుంది. ఈ కవయిత్రి రాసిన వాక్యాలు సాధారణంగా సాదా సీదాగా కనిపిస్తాయి కాని లోతుగా ఆలోచిస్తే ఈన్ కవయిత్రి ఒక గాఢమైన,లోతైనా భావాన్ని నిగూఢంగా వ్యక్తం చేస్తాయి."కన్నె తూరుపు వెచ్చందనాల కావిళ్ళు గడప గడపకు పంచి, పడమర కాంత కౌగిళ్ళలోకి పరుగులు తీసి సూరీడు"- అని కవయిత్రి అనే ఈ వాక్యాల్లో సూర్యోదయాన్ని,సూర్యాస్తమయాన్ని కవయిత్రి ఆవిష్కరించినట్లు అర్థం చేసుకోవచ్చు ఈ కవిత్వ పంక్తులు సాధారణ వాక్యాల్ల అనిపిస్తాయి ఆని తూర్పు అనే కన్య వెచ్చని కావిళ్ళని వూర్లోని ప్రతివారికి అందిచ్చి పడమటి దిక్కు అనే వనిత కవ్వింత కౌగిళ్ళలోకి పరుగులతో చేరుకున్నాడు సూర్యుడు అనే వొక అద్భుత డృశ్యాన్ని కవిత్వహృదయంతో కవిహృదయం అనే ఖండికలో దృశ్యం చేస్తుంది.రేయింబవళ్ళలో రేయి వర్ణన ఎక్కువ సందర్భాల్లో కవయిత్రి చేయడం ప్రకృతిలో రాత్రి కి గల ప్రత్యేకతమో ననిఅనిపిస్తుంది.గోగణాలు ఇళ్ళకు చేరుకొనే సమయాల్ని,ఎగిరి ఎగిరి అలసిన రెక్కలతో గూటికి చేరుకొనే సాయం వేళల్నీ కవయిత్రి పేర్కొంటూ అవి అమ్మవొడికి ఆనవాళ్ళై నిత్యజీవన రేయింబవళ్ళుగా చివరికి జంటహృదయాల తుంటరి సరాగాలై పరశింప చేస్తాయని కవయిత్రి వూహనిమరింత పరిమళభరితం చేస్తుంది. "అసంపూర్తి కల అర్థరాత్రి గాలివానలా నిదురలేపి మరీ కలవర పెడుతుంది"-అని అంటున్న ఉష గారు నిరీక్షణల్నీ తెలవారి రాలిపడిన పారిజాతాల్లా,నిట్టూర్పుల్ని దిగుడుబావి పాకుడు మెట్లలా పోలుస్తూ అర్ధాకలితో నలుగుతున్న అనాథ శిశువుని,పాల బువ్వ తెలియని పసికందైనవాన్ని"ఇరువురూ ముక్తసరి మురిపాల ఆత్మవంచకులు"-అనుభూతికి తలవొగ్గిన కారణంగా ముగ్గులేస్తున్నప్పుడూ లెక్క తప్పిన చుక్కల్లా వొక అసంబద్ద కలయికలా రూపు దిద్దుకొన్నారని ఈవిడ ఎంతో లోతైన భావాన్ని మాములు వాక్యాల్లా చెప్పి,తన నేర్పుని ప్రదర్శించింది.ఈ ప్రపంచంలో ఏ వ్యవస్త వున్నా కవులకు వస్తువు కొఱత వుండనే వుండదు అది మనుషులతోనే వుంటుంది కాబట్టి.అనాది కాలం నుంచి కవుల అనుభూతిలో అభివ్యక్తమయ్యే వస్తువు ప్రేమే.స్త్రీ పురుష సంబంధాలు వున్నంత కాలం ప్రేమకు సంబంధించిన సాహిత్యం వుండక మానదు.అభ్యుదయ,విప్లవ కవులని అనుకున్న వాళ్ళు కూడా కొండకచో ప్రేమను అద్భుతంగా చెప్పారు.అట్లాంటి కవిత్వాలు పఠితల ఆదరణను పొందాయి. ఈ కవయిత్రి కూడా కాల్పనిక,భావ కవిత్వ ధోరణిలో కవిత్వ నిర్మాణం చేయటం మూలానేమో ప్రేమను కవిత్వం చేసింది."నీవు పరచిన అంప శయ్య మీద నేను/నీ ఙ్ఞాపకాల బాణపు గాయాలతో ఎంతకూ రాని సంక్రమణానినికై/ఇన్ని యుగాల ఎదురు చూపులో"-ఇలాంటి కవిత్వపు శకలాలు "ప్రేమ సహస్ర నామాలతో" అలరిస్తాయి ఈ సంపుటిలో. కవయిత్రి ఉష గారు సహజ ప్రియాలైనా ప్రాకృతిక అంశాలను కవిత్వంగా మార్చటమే కాదు స్త్రీ సహజ ఇష్టాలైనా ముగ్గులు,పువ్వులు,గోరింటా మున్నగు వాటిని తన ప్రతిభా పరుసవేదితో పసిడి పాదాల పరిమళ మరువపు కవిత్వం చేయటమే కాదు వాటిలో వొకానొక కూడా దుఃఖాన్ని పోస్తుంది.ముగ్గు పిండి అమ్మే స్త్రీని వెన్నెల వేకువలు తెలియని వెఱ్ఱిదానిలా,రేయింబవళ్ళు రాజుకున్న ఆకలి మంటగా నిలబెడుతుంది."నా చేతి చిత్రాలు మా ముంగిలి వైనాలు/పూల గొబ్బిళ్ళ అలరారు రంగవల్లులు/వారందరికీ తెగ మురిపాలు/మరి నీవి కాదా సగపాలు"-అంటూ ముగ్గు పిండి అమ్మిన ఆవిడకు కూడా ఆ రంగవల్లులు తెచ్చే శోభలో,ఇచ్చే ఆనందంలో సగభాగం చెందుతుందని అనటం చిత్రంగా అనిపించినా న్యాయసమ్మతమేననే భావనని కవయిత్రి కలిగిస్తుంది. భావ చిత్రాలను రూపు కట్టించటంలో ఈమెకి మంచి నేర్పు వుంది.అతి తక్కువ పదాల పేర్పుతో చాల ఆశ్చర్యాన్ని కలిగించే నైపుణ్య నిరూపణ చేస్తుంది."చేపల చెఱువు మీద నాచు/అచ్చంగా పంట పైరు పచ్చ"ఊహించుకోవాల్సిందే. జీవితాన్వేషణ చేయటం, ఆ అన్వేషణ నుండి ప్రకృతి శక్తుల ద్వారా పాఠాలు నేర్చుకోవటం కొందరు కవులు చేస్తుంటారు.ఈ అంశం కూడా ఉష గారిలో పుష్కలంగా వుంది.ఈ లక్షణాన్ని "బహుదూరపు బాటసారి'-అనే కవితలో పొందుపరిచింది."ఈ తరుణాన వెను తిరిగి చూస్తే వేవేల క్రోసుల నా జీవిత బాట"అని మొదలయ్యే కవితలో"అచటచట బాట ప్రక్కగా నా లక్ష్యసిద్దిని నిలిపిన గిరులు/నిరాశలో కృంగిన లోయలు,వెలికి తెచ్చిన ఆశయాల నిచ్చెనలు'ఇలా సాగిన కవితలో ప్రకృతి వొక వికాస పాఠమైన వైనాన్ని కవయిత్రి విపులీకరించటమే కాదు "నా త్రోవ తుది వరకు అలుపెరుగని"అన్వేషణ స్ఫురింపచేస్తుంది. ఈ కవయిత్రి భావన శక్తి కూడా అపారమని చెప్పకుండా వుండలేనితనం సంపుటి చదివింతరువాత ఆవరించింది."గోడ మీది నీడలు"-అనే కవితలో 'దృశ్యానికీ,అదృశ్యానికీనడుమ విన్యాసం.../సర్పంలా సాగిన నీడ/గోడ మూలలో పడగ విప్పింది/చీకటికీ దీపానికి మధ్య సమరం/ నీడ రూపు మార్చింది/నేల బారున తాబేలు ఈ మారు/మోడో అడుగుకీ కృంగి/దేహపు అరలోకీ మటు మాయం"-ఈ మాటల్లో దృశ్యానికీ,అదృశ్యానికీ మధ్య గల తేడాను నీడల్నీ సారూప్యం చేసి వొక అసాధరణ వూహను నిర్మించింది ఈవిడ. కాలాన్ని తవ్వితే కలల ఇందనం వూరుతుందనికలలు రావటం వల్లనే రాత్రులు కరగిపోతున్నాయని కలని కొనటానికి నిద్రని ఖర్చు చేయాలనే వూహించని భావ ప్రవాహాల్నీ మన ముందు ప్రవహింప చేస్తుంది. కలం నింపిన కల్లం-అనే ఖండికలో చెలిమిని మానవ జీవిత మాగాణిలోని పైరు పంటలతో ఉపమిస్తూ పల్లె సౌభాగ్య చిత్రాన్ని గీసి "సారం తరగని మాగాణి సంక్రాంతి మన చెలిమి"-అని అంటుంది ఈమే."దృశ్యం కరిగేలోపు ఙ్ఞాపకాల సంకెల్లతో బిగించి కట్టి పడేసేది కన్ను'.ఆ కన్ను ను కవిత్వం చేసిన ఖండిక అనుభూతి వులితో చెక్కిన నిర్మాణ శిల్పంతో మనల్ని కట్టి పడేస్తుంది."నేల చీకాకు పడేంత వాన"-అనే ఒక్క పాదమే వర్ష భీభత్స దృశ్యాన్ని చిత్రిక పడుతుంది.మనుషుల మధ్య మమతలన్ని ఇగిరిపోతున్న సందర్భాన్ని "గోడ గుండె పగిలింది "-అనే కవితలో నిరూపిస్తుంది. ఆవిడ రాసిన"అరచేతి గీత నిలువున చీల్చితే/నుదుటి రాత మారుననే పేరాశ"-లాంటి వాక్యాలు సమాజ మూఢనమ్మకాల్ని చీలుస్తాయి.ఆకాశంలోని వాతావరణాన్ని ఎంత సౌందర్యంగా వర్ణిస్తుందో చూడండి."మంచుపూలపేరంటం"-అనే కవితలో.కిందున్న నేల రాణికేనా ఇన్ని సంబరాలు అని ఆకాశరాజు ఈర్ష్య పడ్డాడని చెబుతూ" మబ్బు ముగ్గులేసి/మంచు పూలు చల్లి/చుక్కల గొబ్బిళ్లు పెట్టి'-సంక్రాంతి పర్వ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది."గంప అక్కడుంటే గుప్పేడేనా నాకు మల్లె మొగ్గలు"-అని ఆరంభమయ్యే కవిత"ఈ సిగ లెక్కెక్కడ తప్పుతుందబ్బా"-అనే కవితలో గడిచిపోయిన పోల్చుకొంటూ తన జడ తో పెనవేసుకొన్నా ఆత్మీయబంధాన్ని నెమరు వేసుకొంటూ,"దాని జడ జానెడు/నాది బారెడు"అంటూ తన జడ నిండు గోదారేనని ఉపమించుకొంటూ,విరజాజి కుదురు కూడా తన జడ ముందు తలవంచక తప్పదని కవయిత్రి వొక పురా స్మృతి లోకి తీసికెళుతుంది.జడ స్త్రీ సహజ సౌందర్య వస్తువే అయినా ఈ కవితలో ఉషగారు అంత అందంగా చెప్పి తన ప్రత్యెకతను చాటుకొన్నారు. పిచ్చుక పైన రాసిన కవిత వొక అద్భుత కవిత ఖండిక.అరుణగారు పిచ్చుకను :పిట్టా నువ్వు ఈ లోకంలో పట్టవు"అని అంటే మరువం ఉష 'మళ్ళి ఇంత కాలానికీ ఈచలి దేశంలో ఆకురాలు కాలంలో భలేగా కనిపించావే"-అని మురిసిపోతుంది."నువ్వొక్కతివే వచ్చావేమోనని పలకరిస్తే"అని పిచ్చుకతో చేసే సంభాషణ పఠితల హృదిలోకి గుచ్చుకొని ఙ్ఞాపకాల సలపరం రేపుతుంది. ఈ 'మరువం'-సంపుటిలో కొన్ని కవితలు హృది తడిపేవి కాకపోయిన "తూర్పార బోసిన గింజలు" కొన్ని చదువరులకు గొప్ప అనుభూతిని మిగిలిస్తాయి. వలపు వాన చినుకును మంచు పూల పేరటం కు పిలిచి గాలి లేఖ రాసి రమ్మని,జీవితం సౌందర్య రాహిత్యం కాదని చెబుతూ ఈ జాడలు తన కవితలో వున్నాయంటున్న కవయిత్రి ఉష గారు. ఒడి ఇచ్చిన అమ్మ వెళ్ళిపోయినా,బొడ్డు కోసిన బాపనమ్మ అటే మళ్ళినా,అడుగులకు చేయూత నిచ్చినతాతయ్య,బువ్వ పెట్టిన అమ్మమ్మ..ఇలా అందరు వెళ్ళిపోయారని తన ఙ్ఞాపకాలని మన ఙ్ఞాపకాలుగా మార్చింది.అంటే తన అనుభూతుల్ని పాఠకుల అనుభూతులుగా చేయ గలిగిందంటే ఆమె మంచి కవయిత్రి అని నేను అనటం.అందుకు ఆమెను అభినంద్స్తున్నా.ఈమె కవిత్వాన్ని కపిల రామ్ కుమార్ గారు మరువం దవనం అని వ్యాఖ్యానిస్తే ఆవిడ మరువం,దవనం వాసనలు ఒకచోట పొసగవనే ఉద్దేశ్యంతోనేమో మరువం ఒక్కటే చాలు అన్నట్లు ఙ్ఞాపకం.ఈవిడను కోరుతున్నా మరువం తో పాటి దవనం కూడా కవిత్వం చేసీ కవిత్వ కాంత జడలో వొక అలంకారం చేయమని.మరో మంగళ వారం మరో మంచి కవితా సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g0Qd59

Posted by Katta

మరువం ఉష కవిత

మరువం ఉష | హోరు --------------------- స్థల కాలాల్లో దూరంగానైనా సమాంతర ప్రపంచమేదో ఉండే ఉంటుంది. అద్దంలో చందమామతో ఆగని రాముడు, మేఘాల పీచుమిఠాయి కావాలని మారాములు చేస్తుంటే, శాస్త్రజ్ఞుడొకడు శుక్రగ్రహపు ధూళిని నిశితంగా పరికిస్తున్నాడు. చందమామ విచ్చి నవ్విన క్షణాల్లో మరెక్కడో పగటినిద్ర మనసు పలక మీద తీరని కలని తిరిగి దిద్దుకుంటుంది. ఇరుకు నగరాల్లో చినుకుల నేల సాంగత్యం లేని ఒంటరివాన విసుగ్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లోకి ఇంకిపోతుంటే ఆవలి పక్కన కొండ అంచున నది, ఎగువ ప్రవాహమై శిఖరాన్ని చేరలేక, విరహాన ఆవిరై, చినుకై సాయుజ్యం పొందుతుంది. సృష్ట్యాది నుంచి రాధాకృష్ణుల రసవంత గాథ అనురాగ జలధి. నల్లకలువ కళ్ళలో చెంగల్వమాల మెరుపు. ఇదిగో ఓ జంట హృదయాల వేణుగానం — ఆమె పీల్చిన గాలి కణం ఊపిరితిత్తులలో రసాయనిక చర్య పొంది మళ్ళీ ఎప్పటికో మరలా అతని ఊపిరితిత్తుల్లో జొరబడే క్షణాలుంటాయా? ఉంటే, అవి అతనికి తెలుస్తాయా? అతను చూసిన నక్షత్రాన్నే, అతను చూసిన క్షణంలోనే, ఆమె చూస్తుందా? అలా జరిగితే దానికి మినుకుమినుకుల్లో ఏమన్నా ద్యుతి పెరుగుతుందా? ప్రేమ బారిన పడ్డవాళ్లింతే. ఆమె కౌగిట ఆతని గుస గుస "విశ్వమొకటి వుధ్భవించిన క్షణాన మనతో ప్రచోదితమవుతున్నాయనుకున్న మానవ లక్షణాలు.... అనురాగం, విరహం వంటి వున్నతానందాలను ప్రేరేపించగల భావ పరంపర మొదలయ్యాయి, ఆ భావాలతోటే నీ వునికీ ఆరంభమయ్యిందేమో అందుకే ఆది నుంచి నువ్వు నాకు ఎరుకే. నన్ను నాకు మిగలనీయని ఈ అనుభూతికి పదే పదే కారణమయ్యే నువ్వు నా జీవితానికి వరం" – రాధామాధవీయం. అక్కడో తరం క్రౌంచ వారసత్వ శాపభారాన్ని వేదనతో మోస్తుంది. సమకూరని మిథున భాగ్యం అందని ద్రాక్షలా ఊరిస్తుంటే అర్థవృత్తంలా అంతా బయటికికనపడిపోతూ, తమని తాము కప్పుకోలేక, విప్పుకోలేక, కాపు లేని అనాథ గాయంలా ముసిరే ఈగల బారిన పడుతుంది. నిన్నటి మొన్నటి చిన్నతనాల కుట్టిన పున్నాగ పూల జడల వాసన ఇంకా పూర్తి గా మనసు లో నిండనే లేదు, విరబుసే కాలాలకు కాలాతీతమయ్యిందని కబురొచ్చింది. నిరుడు కురిసిన కన్నీటి సముద్రాల ఉప్పెన పోటు ఉధృతి ఇంకా తగ్గనే లేదు, మేట వేసిన దిగులు దిబ్బల మధ్య గా రాత్రి కురిసిన వెన్నెల మరక మెరుస్తూ గూడు నుంచి జారిన చిన్నారి చిలుక కళ్ళలో మెరుపులు నింపుతోంది. ఆనంద విషాద రహిత స్వర్గ సీమల్లో అప్సర కాంతలు నాట్యమాడుతున్నారు. 'ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో నిదురించు జహాపనా. నిదురించు జహాపనా.. ' — ఈ కల్పనలకు, యమున రాగాలకు అసలు అర్ధం తెలిపే బేగం యే గానాలు ఆలపించిందో? వైభవాల నడుమ అపూర్వ ఆదరణ పొందిందో,ఆదరణలోనే రగిలే నిరాశల చెరసాలలో మునిగిందో. స్వయంప్రకాశకమైన మణిపూస నవ్వుతో వెలిగిందో, ప్రాణం లేని రాళ్ళ మధ్య ఒక పాషాణమై తళ తళ లు మెరిపించిందో. ఏమో ఆమె మనస్సులో ఎన్ని అగ్ని పర్వతాలే రగిలేయో, అందమే ఆలంబనగా అదే జీవనాధారంగా ఆనందపడుతూ బతికేసిందో. వాకిట ముగ్గుతో ఇంటి శోభని వెళ్ళడించే గృహమొకటి ఊసుల పూసల పల్లకిలో మమతని మోస్తూ ఉంది. ఆలుమగలు — మగని బుగ్గన మిగిలిన తన కుంకుమ గురుతు చూసి ఫక్కున నవ్వుతూ మల్లియకి అసూయ పుట్టించే మగువకి ఆతని మనసే ధామం. ఆ క్షణమే శాశ్వతం. జ్ఞాపకార్దదశ అక్కడ జనించదు. ఈ హోరు ఏమిటి. ఈ అంతర్ముఖ బాహ్యస్పృహల ఆర్బాటం – దర్శనాల ఆరాటాల కలబోత ఎందుకు. ప్రాణం లేని ఈ అక్షరాలని మమకారం తో స్వీకరించే ఓ మనసు కోసమేనా? ఊహాప్రపంచాలు రూపమియ్యమని మూగగా అడుగుతున్నాయి. నిజానికి ఇది సంబరమేమో. సంతృప్తనిశ్వాసల్ని విడువగల అవలోకన భాష్యమేమో. తీక్షణమైన హోరు — కావాలి, దహించాలి. అనుభూతి రవ్వల గనిగా బతుకు మారాలి. 02/11/2014

by మరువం ఉషfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lsnpUs

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్||నువ్వు మళ్ళీ -------------------- కొన్ని సంభాషణల వల్లో మరిన్ని సందిగ్దాల వల్లో నిన్ను నువ్వు కొత్తగా రాసుకోడానికి యత్నిస్తుంటావు చూడు... అప్పుడే రాలిపడుతున్న పక్షి రెక్కల్లాగా బొడ్డుతాడుతో కుస్తీ పడుతూ గర్భాశయంలో అప్పటిదాకా పాతుకుపోయిన తనని తాను లోకానికి పరిచయం చేసుకునే మాంసపు ముద్దలా నువ్వుహించుకున్నపుడు నిన్ను మరచి నీది కాని స్తన్యంలోకి ఆబగా చొచ్చుకుంటూ వడగళ్ళ దాహార్థిని మునివేళ్ళ సందుల్లో బందిస్తూ పసిపిచ్చుక తపన అప్పుడనుకుంటావు నీకునువ్వుగా ఏదో సాదించావులే ఈ వెదవ జీవితాన ఎందరో మనసులకు అంత్యక్రియలు జరిపినతరువాత చినుకుల్ని లెక్కెడుతూ మబ్బుల్ని తోసేస్తూ దొరికిన కూసింత స్థలంలోనే ఆరడుగుల స్వార్థ పీలికలను ఒక్కొక్కటిగా నీలోకి చేర్చుకుంటూ ఒదిగిపోతావు మళ్ళీ నీలోకి నిన్ను దాచేస్తూ.... తిలక్ బొమ్మరాజు 10.02.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZegGO

Posted by Katta

Ramabrahmam Varanasi కవిత

పోషకుడు వారణాసి రామబ్రహ్మం 11-2-2014 "నా వేదన, నా శోధన నా మేధ, నా వ్యథ; వీటన్నిటి ఫలితం నా కవిత్వం ఇదంతా నీకే అంకితం; నువ్వు ఎలా అణగ ద్రొక్కబడుతున్నావో ఈ (అ) సభ్య సమాజానికి చెప్పి దాన్ని నిద్ర లేపడమే నా జీవిత లక్ష్యం" అని రాతలు రాస్తూ జీవిస్తున్నారు ఎందరో! అవార్డులు అందుకుంటున్నారు కొందరు "నా శక్తి, నా యుక్తి నా శ్రమ, ఆంతా నీవే నా లక్ష్యం నీ సేవే అందుకే నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను" అంటూ నా ఓట్లు పట్టి పదవులు పట్టేస్తున్నారు ఎందరో "మహానుభావులు" నా జీవితాన్ని బొమ్మ వేసి తానూ జీవిస్తున్నాడు అభినవ చిత్రకారుడు నా బాధల్ని "నటించే" నటుల్ని నా దౌర్భాగ్యాన్ని చిత్రీకరించే దర్శకులని ఆకాశానికి ఎత్తి హారతి పడుతోంది ఈ సమాజం నా బాధల్ని, కష్టాలని, కన్నీళ్ళని మాత్రం ఎవరూ పట్టించుకోరు పంచుకోరు, పోగొట్టరు, తుడువరు; ఏం చేసికోను ఈ రచనలు ఇంకా వినలేను ఈ ప్రసంగాలు ఎవరికోసం ఈ చిత్రాలు బాగున్నాయి నాగరీకుల చిత్రాలు ఇంతే జీవితం చీకటి మయం లేదు నాకు ఆనందపు ఉషోదయం అయినా నాకు ఎంతో సంతృప్తి నా బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎందరినో పోషిస్తున్నాయి రాళ్ళ లాంటి వాళ్ళ జీవితాలను రమ్య శిల్పాలుగా మలిచే ఉలిని నేను

by Ramabrahmam Varanasifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NvSX0r

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //కొన్ని// కొన్ని సార్లు అంతేనేమో అలా కాలాలు నడకల్నాపి నిశ్శబ్దంగా తమలో తాము మాట్లాడుకుంటూ ఒంటరిగా కూర్చుంటాయ్ బహుశా వెలుగుతోనూ విసుగెత్తుతుందేమో అప్పుడప్పుడప్పుడూ ఆకాశమొకటి ఖాలీగా సూర్య రహితమై అనంతానంతపు స్వచ్చమైన చీకటిని పూసుకుంటుంది ఏమొ మరి పూల పరదాల వెనుక బహిరంగ రహస్యమై వేళ్ళాడే చరిత్రలుండొచ్చు ప్రకాశించే నకిలీ వెలుగుల వెనుక అనాసక్తపు అస్తిత్వాలుండొచ్చు అంతేనేమొ కొన్నిసార్లందుకే ఆగిపొయిన దారులూ ప్రయాణాల కొనసాగింపుకి కారణమౌతుంటాయ్... 11/02/14

by Naresh Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bGgqkO

Posted by Katta