పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మే 2014, మంగళవారం

Kanneganti Venkatiah కవిత

ఈ శకం నాది ....6.5.14. నువ్వు ఆ ప్రశ్న అడగకుండా వుంటే ఎంత బాగుండేది!? నా పాట సెలయేటి వూటన్నావు మురిసి పోయి మందర పర్వతమెక్కాను నా మాట అమృతపు కలశమన్నావు ఎగిరి గంతేసి చంద్రమండలం మీద గుడారమేశాను నా కర స్పర్శ సుమ దళాల సుకుమారమన్నావు ప్రాణ వాయువుకే చెమటలు పట్టేలా ఉబ్బితబ్బిబ్బయ్యాను అంతలోనే వుత్సాహాన్ని గుటకేస్తూ మీరేంటని అంటూనే నాభుజం మీద వెతుక్కుంటున్నావు అర్థం కాక అయోమయాకాశంలో ప్రశ్న మెడకాయ వొడిసిపట్టే ప్రయత్నంలో నేనుంటే అదికాదు నేనంటున్నది ? మేరేవుట్లని నంగి నంగి సొంగకార్చావు ఇంత ఎదిగిన నేను నీకు జవాబు చెప్పలేక పాతాళానికి పడిపోతానా!? ఈ శకం నాది నేనో త్రివిక్రమ స్వరూప మానవుణ్ణి ఏదో వొకరోజు నువ్వు మూర్చపోకతప్పదు1 భయపడకు! మానవతా తీర్థం నా మదినిండావుందిలే !.!

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RoGexK

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ ||రాలిపోయే కాలం|| ======================== సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో కుచించే మనసులాగ లోతుల్లో దొరికే గులకరాళ్ళు ఆకారాలై మనిషి కళాఖండాలును మైమరపిస్తూ ఏడుపిస్తున్నాయి తడిచే నేల నెలవంకను తనలో దాచుకుంది ముద్దాడే చందమామ సిగ్గులొలికింది గోరు ముద్దలు తినిపించే చిన్నారిని మైమరపించి! రాలిపోయే కాలం వెక్కిరిస్తుంది కాలం చెల్లిన పువ్వులాగా! వర్తమానంలో మళ్లీ స్వగతాలై గతాలును చితి చేస్తున్నాయి మాటలన్నీ చేతలైతే నడిచే దారి బీటలు తీస్తుంది దారిలో ఎన్నో టచ్మీనాట్ మొక్కలు సిగ్గుగా కళ్ళు మూసుకుంటూ తల వంచుకుంటున్నాయి కాలాలు మారి గాయాలవుతున్నాయి నడిచే కాలం భవిష్యత్తునే శాసిస్తుంది ప్రశ్నించే సమాజం ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది ఆవేశం కట్టలు తెంచుకుంటుంది భానుడు విసిరే అగ్గి రవ్వలా- హెచ్చరించే స్వరం దుఖ సాగరమై కెరటాలను ఉసిగొల్పుతుంది ఎగిసి పడే అలలకు ఉలుకెక్కువే ఆశ పడే కలలకు కులుకెక్కువే పడిలేచే కెరటం తడి లేపే స్వరమై ఒడ్డును చుంబిస్తుంది తాటాకు చప్పుళ్ళు బెదిరిస్తున్నాయి ఎముకల గూళ్ళు వణుకుతున్నాయి కుందేళ్ళు పరిగెడుతున్నాయి స్వార్ధానికి వందేళ్లై ! భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ సిద్ధాంతం ఆపిల్ పండునే ప్రశ్నిస్తే గతి తర్కిక భౌతిక వాదం నాస్తికంగా నిలిచింది నిజమై నిస్తేజంగా! ============ మే 06/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qb4ljz

Posted by Katta

Krishna Mani కవిత

చూస్తున్నా ___________________కృష్ణ మణి నన్ను కాల్చి నన్ను కొట్టి నన్ను ఒంచి ఒక ఆకారాన్ని ఇచ్చి నన్ను మనిషికి మిత్రున్ని చేసిన చేతులకు వందనాలు ! బతుకు నడకలో మనిషికి తోడునై నేలకు గాట్లు పెట్టె నాగలి మొననై కలుపులేరే కల్వారనై పంట కోసే కొడవలినై యంత్రమై నాగరికతలో భాగమై మనిషి ద్వారా ఎంతో ఎదిగాను కాని , మనిషి అనాగరిక లక్షణాలను మాత్రం వదలలేదు అందుకే మల్లి కణకణ మణి నిప్పుల కొలిమిలో దాగి కూర్చున్న కమ్మరి మనసున కసిని చూస్తున్న లోకం తీరులో చీకటి బేతాలలను చూస్తున్న ! బీదల బిక్కుల బాదల కేకలు వింటున్నా కన్నవారినే కడతేర్చే కసాయి పాపాత్ముల చూస్తున్న బేలపై అడివి మృగాల ఆకలి చూస్తున్న తెల్ల బట్టల్లో మెరిసే నల్లని మనసుల్ని చూస్తున్న ఆన్యాయాన్ని ఆటగా చూసే వెకిలి నవ్వుల నోళ్లను చూస్తున్నా ! నీచుల తలలు నారికే గండ్ర గొడ్డలిగా మారాలని చూస్తున్న చేతినేత్తి నన్ను పట్టే మనిషి కోసం ఎదురు చూస్తున్నా ! కృష్ణ మణి I 06-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1on0MC4

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి మనస్సు నాలో ఒక రెక్క తెగిపోయింది ఒక కాలు విరిగిపోయింది ఒక కన్ను ఊడిపోయింది ఇక నేను ఎగరలేను అయినా పరవాలేదు; నేను చేరవలసిన గమ్యాన్ని ఆ ఒక్క కన్నుతోనే చూస్తాను నా గుండె దగ్గరకి చేరుస్తాను! ఎందుకంటే; నేనిప్పుడు దేహాన్ని కాదు భయం లేని మనస్సుని! 06May2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fQ5Uix

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

పునఃస్మరణ ^^^^^^^^^^^^^^^^^^^^^^^ రావెల పురుషోత్తమ రావు ఎప్పుడు దాని వైపు దృష్టిని సారించినా అది ఎంతో ఉన్నతాసనంగానే నాకు అవగతమౌతుంది అతితి అభాయాగతులను సముచితంగా ఆదరించే గృహష్తు గానే నాకు అనవరతం గోచరిస్తుంది. తన రెండు చేతులను బార్లా సాచి వారినాహ్వానించే గృహస్థులాగా సౌహార్దాన్నీ సౌజన్యన్యాన్నీ కలబోసిన వ్యక్తిగా నా చెవులకు ధ్వనిస్తుంది. ఆదరాభిమానాలను అందించడంలో తనకెప్పరూ సాటిరారన్నట్లు ప్రవర్తిస్తున్నట్లుంటుంది. భోజనానంతరం భుక్తాయాసం తీర్చుకునే పట్టెమంచంలా దర్శనమిస్తుంది. హంసతూలికా తల్పంలా శయన శుఖాన్నందిస్తుంది. అది ఎందుకో చాలామందికి బద్ధకమ్నేర్పే యంత్రంలా సాక్షాత్కరిస్తుంది. అయినా నాకు మత్రం అది స్నేహశీలిగా ప్రవచనాలు పలికే హితైషిగానే నన్ను నడిపిస్తూ అత్యంత ఆదరాభిమానాలను చూరగొన్న పడకకుర్చీ నీకు శతాధిక అభిందనపూర్వక కృతజ్ఞతలు. [నరసరావుపేట చెక్క కుర్చ్చీలను మనోపధంలో స్మరించుకుంటూ]--6-may -14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QapY2G

Posted by Katta

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట -11 __________________ ఆర్క్యూబ్ కొక్కు కొరికే పల్లకు చెద చీల్చే పల్లకు నాశనగాలం నమిలే పల్లకు మేడి పల్లు విసిరే పల్లు పల్లు పావురాలు 'టెక్' నిగ్గా పన్నిన వలలో విలవిలలాడుతున్నై రేషన్లకొద్దీ లేజర్ ట్రీట్ మెంట్లు డ్వాక్రా లల్ల బ్రషింగ్ క్యాంపులు ఓటు ఓటు కొక స్మూత్ టూత్ పిక్ పలాన సిం కార్డ్ వారి ఆఫర్ సూపర్ స్కేలింగ్ స్కీం ఎత్తుపల్ల వాళ్ళకు క్లిప్సు కానుక బోసినోళ్ళకు బంపర్ మిక్సీ వ్రుద్దులకు కట్టుడు పల్ల పెట్టుడు పథకం బోరు తేలు కొనన వరాల కలషం సంక్షేమ కొరల్లో నవ్వుల పౌంటేన్ కబంద హస్తాల్లో పావురాల గుట్ట ఆవిదంగా ముందుకు పోవుడు పంచె గట్టె పల్లికిలిచ్చుడు చర్చ బర్రె పండ్ల మీదకి పోతది మియ్యంటె మియ్యని అసెంబ్లీ నిండా మియ్యావ్ మియ్యవ్ పార్లమెంట్ ల లోనూ ఇదే సొల్యూషన్ అట్టిగ పల్లు నూరుడు వంతుల వారిగ నాలిక కరుసుకునుడు పంటి తుడుపుల బల్ల సరసుడు ఇంకింత గొతెండేందుకే లాలా జలయజ్ఞం వంతపాడుతూ తాయిలాల పత్రికా కథనం పీఠికల నిండా లుకలుకలాడే పురుగులే పురుగులకు చిక్కి దేశపు పల్లు రాలగొట్టుకునుడు అంతా పాయలు పయలుగా వేరుచేసి పంటి నరాన్ని ఒడుపుగా తొక్కిపెట్టే లోపాయకారి ఒప్పందం పంటి నాడిని ఒడిసిపట్టడెవడు ( ఇంకా ఉంది ) * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rYYgSM

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

సంబంధం లేని వ్యక్తులు కలవరు అనుబంధం వున్న వారిని వదలరు ఈ బాంధవ్యాలను మరువలేము మరి రోజు కలవలేము అన్న భావన భరించలేము క్రొత్త క్రొత్త భావాలు మరి ఎలా కనుగొనగలం కవిత లేని సమూహం ఎలా చూడగలం మనుషులతో పరిచయం లేకున్నా మన మనసులు పరిచయం అయ్యాయి మనసులో భావమే కద మన కవిత అయినా బాగుండాలి మన అందరి భవిత !!పార్ధ !!06may14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o2qTAN

Posted by Katta

Sriramoju Haragopal కవిత

గోస గొప్ప మనసు ఎక్కడో తప్పిపోయింది మనసును వెతుక్కునే మనసులేదు మనసు కూడా పరాయిదైపోయినంక దేని మీదా మనసుండదాయె, నివ్వద్దె మాట్లాడుకుందామని కలుసుకునే రోజులేయి కలుసుకుని కరువుదీర మాట్లాడిందెపుడని వరదకు వొరుసుకపోయిన పంటపొలంలెక్క అన్ని కొట్టుకుపోయి యాది గూడ మిగలనియ్యలె దూపకు దోసిలి పట్టి తాగిన బొక్కెన నీళ్ళు కీసల పైసల పెట్టిన సీసాలనీళ్ళొకటేనా మనసు తండ్లాడతలేదా వూర్లు బోర్లబడ్డయి మనుషులు గొంగళ్ళతోని గాదు గోడలతోని తిరుగుతుండ్రు కడుపుకింత అన్నం చాలనుకునే లోకంగాదు వొడిపిలి పోసి వొడ్లు దొబ్బే వొయ్యారిభామలైండ్రు లక్షలమందున్నాఎవలికివాళ్ళే పట్నంల ఎందుకు ఇరుకిరుకైపోయిండ్రు మనుషులు ఎవరిని చూసినా పైసలపోకడే కనపడ్తది ఎవరి గుండెచప్పుడైనా రూపాయల్లెక్క గల్లుగల్లుమంటది ఓ మంచి లేదు, ఓ నెనరులేదు అంతా దోపిడే కొనుడు అమ్ముడే కాని ఏమమ్మినమని సోయిలేదు ఉగ్గుగిన్నె నుంచి పాడెకట్టెల దాకా అన్ని మందియె ఇల్లు, వాకిలి,చెలక, పొలం, చెట్టు చేమా గొడ్డు గోదా బట్టబాత, బువ్వ, నీళ్ళు మిగిలిన ఆఖరికి ఈ శెత్త గూడ అంగట్ల బెట్టినంక మనసేడుంటది, చచ్చిపోయుంటది మనుషులు పిడాత చచ్చిపోయే రోజులొచ్చినయి ఇంకేం చూసుడు లడాయి చేసి తెచ్చుకోవాలె మనసు

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uuWzk3

Posted by Katta

Liki Likitha కవిత



by Liki Likitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sg3mfz

Posted by Katta

Arun Nallella కవిత

వెసవిలొ మా ఉరు ఏటీ పక్కన భావికింద పచ్చపూల పుచ్హకాయలు దొంగిలించిన దోసకయలు ఈసుక థిన్నెల మీద కత్తిన పిత్చుక గుఊల్ల ఆతలు ఏలా మరవగలను పొద్దంత ఏతిలొన పరక పిల్లలతొతి ఆది చికతైతె ఆరు బయత వరసాగ్గ పక్కలు పరుచుకొని వెసవి వెన్నల వెలుగులొ నింగిలొని చుక్కలన్ని లెక్కవెసిన ఆ బల్యం ఎలా మరవగలను ఉరు పక్కన ఏరు ఉంది ఏతి పక్కన అదవి ఉంతె అదవిలొని సుగంధన్ని ఏతి గాలి మొసుకొస్థె ఆసుగనందపు పరిమలాలకు నిద్రలొనికి జారుకున్న కాసెపతికె చితపతచినుకులవాన మఘత నిద్రని చెరిపివెసిన ఆ బల్యన్ని ఎలా మరవగలను అరుణ్

by Arun Nallella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1imQSeA

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

సుందర సుకుమార కవితా సౌరభాల తరంగం అద్బుత వర్ణనా సహిత ఆనంద తాండవం ప్రతి యద లో వికశించును ఆనంద పరవశం ప్రతి చిత్రం కవిత కలిగించును కవికి వవశం తరలి వచ్చెను కదా ఆంధ్రావని ఆమూలాగ్రం పరికించెను కదా కర్నాటక రాష్ట్రం కరిగిపోయెను ఎల్లలు కెనడా వరకు ఆసాంతం ఎదురుచూసే కవి ఉత్సుకతతో ప్రతి ఉదయం పులకరించెను పార్ధుని హృదయం ఉత్తుంగ తరంగం గా ఎదిగి దేశ ఎల్లలు దాటి ప్రతి ఎదను తాకి విశ్రాంతి కోరుకుంటోంది కృష్ణా తరంగం మరువలేదు అమిర్నేని వారి సహకారం గమనిస్తూనే వున్నది సత్యశ్రీ వీక్షణం కోరుకుంటోంది ప్రతి కవి ఆశీస్సులు అనుక్షణం !!పార్ధ !!06may 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1imQRY8

Posted by Katta

Murthy Kvvs కవిత

స్పోకెన్ ఇంగ్లీష్ గూర్చి కొన్ని భావనలు (రెండవ భాగం) గతం లో ఎక్కడాపాను...ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడటానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు,,ఓ వైపు తిట్టుకుంటూనే అనికదూ.!భారతదేశం లో మన ఒక్క రాష్ట్రమనే కాదు.....ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారని అనిపిస్తుంది ఆంగ్లం విషయంలో...!నరనరాల్లో అలా జీర్ణించుకుపోయింది.దాన్ని తీసివేయడం అంత సులువు కాదు.ఇంగ్లీష్ వచ్చినవారికి అన్ని విషయాల్లో ఎక్క్వ జ్ఞానం ఉంటుదని,వారు ఒక ప్రత్యేక తరగతికి చెందినవారని ఇలా కొన్ని ఆధునిక మూఢభావాలు లోలోపల పేరుకుపోయాయి.అయితే దానికి కారణాలు లేకపోలేదు. బ్రిటిష్ వారు మనల్ని పాలించడం వల్ల అది పాలకుల భాషగా మనదేశంలో గౌరవం పొందింది.కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో తిరిగినపుడు కూడా గమనించాను.ఎంతవాళ్ళకి "హిందీ" లో రాజ్య వ్యవహారాలు నడిచినా ..ఇంగ్లీష్ విషయం లో వాళ్ళకి తెలియకుండానే ఒక గౌరవాన్ని ఇస్తారు.దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఓసారి ఉత్తరాఖండ్ లో ఋషికేష్ పక్కన ఒక ఊరికెళ్ళాను.చాలామంది టూరిస్టులు భోజనాలు కానిస్తున్నారు.నా కప్పట్లో వచ్చిన స్పోకెన్ హింది స్వల్పం. సరే...పనులు నడుస్తాయి అది వేరే విషయం.నాకొచ్చిన బ్రోకెన్ హిందీ లోనే ఆర్డర్ ఇచ్చాను.ఎందుకనో దక్షిణాది వాళ్ళంటే ఉత్తరాది వాళ్ళకి కొంత చిన్న చూపే.వాళ్ళ రంగుని చూసో,వేషధారణ చూసో,మనవాళ్ళు కూడ ఇక్కడ దబాయించి మాట్లాడినట్లు అక్కడ మాట్లాడరు.తెలివిలో గాని,బురిడీ కొట్టించడం లో గాని మన ముందు వాళ్ళు ఎందుకూ పనికిరారు.కొద్ది అనుభవం లో అది తెలిసిపోతుంది.ఇక తమిళ,మళయాళీల గారడీల ముందు చెప్పాలంటే దిగదుడుపే.అయితే ఒకటి వాళ్ళ తో వచ్చిన సమస్య ఏమిటంటే ఉద్రేకస్వభావులు. ఆ..వచ్చేద్దాం వెనక్కి...హోటల్ లోకి వెళ్ళి సౌత్ ఇండియన్ తాలీ కి ఆర్డర్ ఇచ్చానుగదా.ఎంతకీ రాదు...ఓసారి ఓనర్ కి కూడా చెప్పిచూశా..!లాభం లేదు.అక్కడ మన తెలుగు నడవదు.మన హిందీ అంతంత మాత్రం.ఏదో బ్రోకెన్ హిందీ లో ఓ పరాయి రాష్ట్రం వ్యక్తి చెప్పాడుకదా అని అతని భావమేమో.నాకు కాలింది.ఇక లాభం లేదనుకొని అనుకున్నది అనుకున్నట్లుగా నా భావావేశాన్ని మొత్తం పది నిమిషాలు పాటు ఇంగ్లీష్ లో నాన్ స్టాప్ గా దంచికొట్టాను.మీరు నమ్మరు...ఒక్కసారిగా అతను నిర్ఘాంతపోయినంత స్థాయిలో ఇదైపోయి నా దగ్గరకి వచ్చి మరీ సర్వర్ చేత వడ్డింపజేసి ..మళ్ళి నేను వస్తున్నప్పుడు కూడా "టాటా" చెప్పి మరీ వీడ్కోలు చెప్పాడు. భారతదేశమా... నువ్వు ఇంతే మారవు..ఎక్కడైనా ఒక్కటే " అనిపించింది. ఈ వెయిటేజీ ఇంగ్లీష్ కి అడుగడుగునా మనకి దేశంలో కనిపిస్తుంది.అలా జీర్ణించుకుపోయిందంతే..!అందుకే ఇంగ్లీష్ గడ గడా మాట్లాడాలని చాలామందికి తాపత్రయం.ఓ రకంగా మంచి వ్యసనమే ఇది.వ్యసనం అని ఎందుకు అంటున్నానంటే ఆ రేంజ్ లో passion ఉన్నవారు ఆ భాషని నోటితో ఇట్టే అందిపుచ్చుకుంటారు. -- తప్పో,ఒప్పో మాట్లాడుతూనే ఉండాలి.దాంతో పాటుగా చదవటం,వినడం శ్రద్దగా చేస్తుండాలి.ఒక నెల ప్రయత్నిస్తే వస్తుందా ..రెండు నెలలు ప్రయత్నిస్తే వస్తుందా అనుకొని caliculation వేసుకునేవాళ్ళకి ఎప్పటికి రాదు.దాని పై ఒక ప్రేమ తో సాధన చేస్తే దానిలోని తీపిదనం తెలుస్తుంది తప్ప లెక్కల మాదిరిగా చేస్తే పని కాదు. --ఒక్కొక్క word ని కాకుండా word-cluster ల లో మాట్లాడటాడానికి నోటికి శిక్షణ నివ్వాలి అని చెప్పుకున్నాం గదా గతంలో..! ఉదా: నిన్న temple ని visit చేశారా..? అని కాకుండా Have you visited temple yesterday అని ఒకే stroke లో వచ్చేలా ప్రాక్టీస్ చేయండి.ఇది ఒక ఉదాహరణగా చెప్పాను. ఇలాంటివి మీరు ఎన్నైనా సేకరించుకొని సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తుండాలి.ఇలాంటివి అన్ని ఎక్కడ దొరుకుతాయి మాకు అని మీరు అడగవచ్చు.ఆ..అక్కడికే వస్తున్నా..ఇది అర్ధం అర్ధం చేస్కుంటే మీకు చాలా అవగతమైనట్లే..! మీరు మొదట్లో క్లిష్టమైన classics ని చదవటానికి ప్రయత్నించవద్దు.అంటే షేక్స్ పియర్ లాంటి ఉద్ధండుల రచనల్ని చదవవద్దు. -- సంభాషణలు ఉండే ఇంగ్లీష్ ఫిక్షన్ ని చదివితే చాలా మంచిది.News paper ని చదవవద్దని చెప్పను గాని దాని లక్ష్యం వేరు.మీరు composition రాయడానికో ఇంకా ఏదైనా written work చేయడానికో అది మీకు ఉపయోగపడుతుంది తప్ప ఇంగ్లీష్ దైనందిన చర్య లో భాగంగా ఎలా మాట్లాడాలో నేర్పదు.ఎంత natural గా effort less గా మాట్లాడితే అంత fluency పెరుగుతున్నట్లు లెక్క. --నా మటుకు నన్ను చెప్పమంటే Sidney sheldon రాసిన ఫిక్షన్ చదవమని చెప్తాను.దాని వల్ల కధా విషయం తెలియడం ఓ ఎత్తైతే మరో వైపు ఆ నవల ల్లోని పాత్రలు మాట్లాడే సంభాషణలు ..వర్ణనలు మీ మెదడు లో అప్రయత్నంగా రిజిస్టెర్ అవుతాయి.ఉదాహరణకి Sidney sheldon రాసిన MORNING,NOON& NIGHT అనే నవల్లో 293 వ పేజిలో గల కొన్ని సంభాషణలు మీ కోసం ఇక్కడ ఇస్తాను.ఓ స్త్రీ,ఓ పురుషుని మధ్య జరిగే సన్నివేశమిది. "Wait a minute...!We really have to talk.." "My bus is leaving" " There will be anoher bus " " My suitcase is on it" Steve turned to a porter."This woman is about to have a baby.Get her suitcase out of there ..!quick..!" Julia puzzled. "Do you know what you're doing" "No" Steve said. ఎంత సింపుల్ గా,హాయిగా,భావయుక్తంగా,ఉన్నయో చూడండి ఈ సంభాషణలు.దీనిలో అర్ధం కాకపోవడానికి ఏముంది..మీకు already ఇంగ్లీష్ వచ్చు.కాని fluency కోసమే గదా మీప్రయత్నం.బాగా గమనించండి...ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మాత్రమే చదివే వాళ్ళు మాట్లాడే భాషని మీరు బాగా గమనించండి...చాలా కృతకంగా...dry గా ఉంటుంది వారి శైలి.అది రాయడానికి బావుంటుంది..మాట్లాడం లో ఏదో ఆత్మ మిస్ అయినట్లుగ ఉంటుంది. నేను నా అనుభవం లోనుంచి చెప్పే ఏకైక తిరుగులేని పట్టు ఏమిటంటే ఇంగ్లీష్ ఫిక్షన్ మాత్రమే దీనికి సహకరిస్తుంది.మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు...ప్రయిత్నించండి..మీకు నేను చెప్పని చాలా ఇతర విషయాలు కూడా పట్టుబడతాయి.ఇప్పుడు ఎందుకు చెప్పానో అప్పుడుగాని అర్ధం అవదు. ఎవరైనా మీతో జోక్ చేస్తేనో ..ఇంకోటి చేస్తేనో ఇప్పుడైతే మీరేమంటారు. Don't be jovial అనో ఇంకోకటో ఒక stock లో ఉన్నవి మాత్రమే అంటున్నారా..Hey..stop fooling around here అనో stop kidding అనో ఇట్లా దైనందిన చర్యల్లో వాడుకలో ఉండే పదగుచ్చాలు అలవోకగా వచ్చేస్తాయి.ఏదైనా ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది..?మీరు ఇప్పటిదాకా ఎన్నో విధాలా ప్రయిత్నించిఉండవచ్చు... చివరిగా నా ఈ విధానాన్ని చూసి,పనికిరాకపోతే చెప్పండి. ---K V V S Murthy

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rYpYz5

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఎందుకంటే, నేను ఆడదాన్ని ||మూలం : షహనాజ్‌ బేగం || అనువాదం : ఆర్‌.శాంతసుందరి నాకు మాట్లాడే హక్కు లేదు ఏదైనా చెప్పాలనుకున్నా వినటానికెవరికీ ఇష్టముండదు ఎందుకంటే, నేనొక ఆడదాన్ని! ఆడదాన్ని కావటం చేత కిటికీలోంచి తొంగిచూడటం తప్పు గలగలా నవ్వటం అపరాధం గుమ్మం దాటీ బైటికెళ్ళి స్వచ్ఛమైన గాలి పీల్చటం నిషిద్ధం! నేను దేనినీ ప్రశ్నించకూడదు తండ్రి ఆస్తిలో హక్కు అడక్కూడదు నేను పుట్టి పెరిగిన ఇంటిని ఇది ‘నా ఇల్లు’ అని అనకూడదు అసలు తలెత్తి మాట్లాడితేనే తప్పు ఎందుకంటే, నేను ఆడదాన్ని! నా కోసం ఉన్నాయి గోడలు,. గుమ్మం, పరదాలూ, అధిగమించకూడని ఆంక్షల అదృశ్య సంకెళ్ళు - మగవాడికి మాట్లాడే హక్కుంది స్వేచ్ఛగా ఎక్కడికైన వెళ్ళే హక్కుంది నవ్వటానికీ, పాడటానికీ, సంతోషం ప్రకటించటానికీ కావల్సినంత స్వేచ్ఛ ఉంది ---------------------------------->6.5.2014 స్త్రీవాద పత్రిక భూమిక May 2014 issue

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iY7B7Z

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

INVITATION TO SHIVA REDDY PEETIKALU

by కోడూరి విజయకుమార్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kGxyui

Posted by Katta

Sree Kavita కవిత

||శుభసూచకాలు|| శ్రీ కవిత @ 06.05.2014 గగగన కుసుమ వయారియది నీ వదనం ఎదో మరిచీ మరువని వలపు కొమ్మల్లో దాగిన కోయిల పిలుపులా మది వూహల్లో పరిమళించిన సంపంగిలా కళకళలాడే నా వూహా సౌంధర్య రాశి ఊర్వశి వంటి నీతో చెలిమి నాకెంతో కలిమి మేనకలా మెరిసే నీ అందం కలిగించెను నాకెంతో మనో ఉల్లాసం చెలిమితో కలగలిపి అందంగాచిరుమందహాసంతో చిద్విలాసంలా ప్రతిబింబించే ముఖారవిందం కలిగించును నా మదిలో పులకింతల గమకం నీ హృదయం కోరాలనీ నా వూపిరి సాగాలనీ నీ మనసంతా నేనై నిండాలనీ నా కలలు పండాలనీ పరిపరి విధాల తలచి వలచాను నీ మమతల బంధాలతో ఈ ప్రపంచాన్నీ మరిచాను నీ పలుకుల మాధుర్యంలో ఇహలోకంలో మునిగి నిన్నే నా దేవిగా తలచి ప్రతి నిత్యం ఆరాధిస్తున్నాను పెద్దగా నిన్ను ఏది కోరను నా పేద మనసుతో నీ పెదవుల చాటున దాగిన ఆ "చిరునవ్వు" తప్ప అందమైన ఆ చిరునవ్వులు మన నిష్కల్మష మైన ప్రేమకు అంకురాలు వలపుల బంధానికి శుభసూచకాలు

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kGxw5C

Posted by Katta

కాశి రాజు కవిత

||మందార పువ్వు || కురిసిన వానంతా దూళి ప్రాణాలు తీసేసినట్టు ఇంతిలా తడిపి చంపడం బాగుంది. ఇష్టం తెలపక పోయినా ఏడుస్తుంటే, నచ్చావని చెప్పబుద్దై మౌనంగా ఉన్న మూలాన, అప్పుడప్పుడూ తడవడం అలవాటయ్యింది నాకు నవ్వుతూంది, ఏడుస్తుంది సరే! ఏదన్నా చెప్పాల్సొస్తే అమ్మలాగే అచ్చం అమ్మలాగే చెంగుచివర్లు మెలితిప్పి తలదించుకుంది. నాన్నా కాస్త లేటైనా నాకూ ఓ మందారపువ్వు తెచ్చివ్వు.

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iSVQWl

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //గుండె// జేబు మీద చెయ్యి వేస్తే తగిలే నోట్ల కట్ట గురించి కాదు ఆలోచించాల్సింది ఆ జేబు వెనుకల ఉన్న గుండె గురించి ఆలోచించాలి,అందులో దాగున్న బాధని చూడాలి,కుదిరితే అ బాధ ని తీసియాలి,నవ్వు ని అందించాలి ఎ ముసలి ప్రాణంఅయిన ఇంతకన్నా ఏమి కోరుకుదు,ఎందుకంటే ఒక్కప్పుడు మన కంటి నుండి నీరు కారితే,వాల మనస్సులో రక్తం చిందేది కనుక బిడ్డ లు రోడ్ నా పడేసి వెళిపోయిన ఒక ముసలాయిన చూసి రాసిన ఈ కవిత నాలాంటి యువకులకు మేలుకొలుపు కావలని ఆసిస్తూ ...........

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kGxxGM

Posted by Katta

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || నీ గుడిలో .... దేవతను కావాలని || నీవు కళ్ళు మూసుకుంటే ఆ కలలో కనిపించే ముఖాన్ని కావాలని ఏ రాత్తిరైనా నీవు సేద దీరే కోరుకునే వెచ్చదనం స్పర్శను కావాలని నీ ఊహల్లో పరవశాన్ని జగదేకసుందరిని ఒక అద్భుత సౌందర్యాన్ని కావాలని కలకు వాస్తవం కు మధ్య అన్నీ నేనే అయ్యుండాలని .... నీ జీవితం లో నీవు ఎల్లప్పుడూ నాకోసమే తపించాలని నన్నే నీవు శ్వాసిస్తుండాలని నా భావనలతో నీ మది మొత్తం నిండిపోయి అన్నింటిలోనూ నీవు నన్నే చూస్తూ నీ ప్రతి కలలోనూ నేనే అయి నేను నిన్ను చూస్తు పరామర్శిస్తున్నట్లు నా సాన్నిహిత్యమే నీ పారవశ్యం అవుతూ ఇక్కడ, నా మనసంతా నీవై నీండిపోయిన విధంగా నీ కనుచూపును కావాలని .... కోరుకుంటున్నాను లోతుగా నీవు నీ ఆత్మలోకి చూసుకునే చూపును కావాలని నీ ప్రపంచమంతా నేనే అయినట్లు పరిపూర్ణతను నీవు నా కలయిక ద్వారా .... నీవు ఎంతగానో కోరుకునే పరవశం ఒక ఘాడమైన ముద్దును నేను కావాలని నీ ప్రతి కోరిక పరిణామం సమాధానం నీవు కోరుకునే అమరత్వం నేను కావాలని ఎవరూ ఎన్నడూ చూడని ఊహకందని అద్భుతం, ఆసక్తిని నేను అని .... నీకు అనిపించాలని నేను నిన్ను కోరుకుంటున్నంత ఘాడం గా నన్ను దూరంగా వెళ్ళనీయని భావన నీలో ప్రబలి నీ గుండె లోతుల్లో నీవు ప్రతిష్టించుకునుండాల్సిన నీ దేవతనై ఉండాలని నీ పరిసరాలు .... వీచే గాలీ, పారే నీరూ, రగిలే అగ్ని, ఆ ఆకాశం, ఈ భూమి అన్నీ నేనై నిండిపోవాలని .... నీ జీవితం లో 06MAY2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q9LKUX

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ------నోట్లు -వోట్లు కట్టలు.. కట్టలు.. నోట్లకట్టలు లొట్టలు.. లొట్టలు .. ప్రజలు లొట్టలు. తప్పెను.. తప్పెను.. దారితప్పెను వచ్చెను..వచ్చెను.. పల్లెపల్లెకు వచ్చెను. చుట్టెను..చుట్టెను.. చుట్టమై వచ్చి ఇళ్లన్నీ చుట్టెను. పెట్టెను..పెట్టెను.. ప్రతి మనిషినీ ప్రలోబపెట్టెను. దాటెను..దాటెను.. అధికారుల్ని మాయచేసి సరిహద్దులు దాటెను. ముంచెను..ముంచెను.. మూర్ఖ మనుషులను ఐదేళ్ళు ముంచెను. వేసెను..వేసెను.. దురాశ వోటరుకు శిక్షలు వేసెను ! (మీ ఆత్మ ప్రభోదం మేరకు వోటెయ్యండి )

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1seWijk

Posted by Katta

Niharika Laxmi కవిత

{ మేనత్త } మనసెరిగిన ఓ అత్త మా మేనత్త ! నీ ఇంటి ముంగిళ్లలో కూర్చొని ముచ్చటిస్తాను ఎన్నో ఊసులు ! ఊ .. కొడుతూ వింటావు అత్త అలుపెరుగక ! మా మామ ముచ్చట్లు అడిగితే చిరునవ్వులే చిందిస్తావు ! చేతి గాజులే తొడుగుతావు ఈ మేనకోడలికి ప్రేమతో ........గడసరి అత్తవైనా నీకు సొగసరి కోడలినే ............... ! ............................ నిహారిక (06-05-2014)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rXRgWh

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

తూర్పుదిశ పక్షులగొంతులతో తన బాధను వ్యక్తం చేస్తూ ఒక ఉదయాన్ని కంటూ ఉంది

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fOz6qj

Posted by Katta

Arun Nallella కవిత

కాదేది కవితకనర్హం ? ముందున్న వారి ముచ్చట్లు వెనకున్న వారి వెక్కిరింతలు పక్కనున్న వారి పలకరింతలు ఇవన్నీ కవితా గానాలే , మన మనసులోని భావాలకు దర్పణాలే .

by Arun Nallella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rXPp3C

Posted by Katta

Arun Nallella కవిత

kahdedhi kavithakanarham mundhunna vari muchtlu venakunna vari vekkirinthalu pakkanunna vari palakarinthalu evanni kavthaaa ganaale mana mansuloni bhavaalaku dharpanalae..............!

by Arun Nallella



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kFUFoH

Posted by Katta

Gudipati Palapitta కవిత

Pl.read and share your opinion with firends

by Gudipati Palapitta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kFUHwZ

Posted by Katta

Mani Vadlamani కవిత

నా కవిత "ఒక స్వప్నం వచ్చింది," May , 2014 విహంగ మహిళా పత్రిక లో ప్రచురితం మణి వడ్లమాని ఆ రాత్రి ఆరుబయట పుచ్చపువ్వు లాంటి వెన్నెలలో చుక్కల పందిరి కింద ఆదమరచి నిదురపోయాను. ఆ కమ్మటి నిద్రలో ఒక తీయని స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో, ఎవరో మెత్తని గొంతుతో “ఓయి! లేవోయి,ఈ మొద్దు నిదుర వదిలి రావోయి! నీకు ఒక సుందర స్వప్న లోకం చూపిస్తాను” అంటూ నన్ను తట్టి లేపుతున్నారు. ఆ స్పర్శ మెత్తగా పువ్వులా వుంది, ఆమె నా చేయి పట్టుకొని తన వెంట తీసుకొని వెళుతోంది ఆమె ఒక వెన్నెల ముద్ద ! ఒక ప్రణయ స్వరూపిణి ! ఒక మధు స్వప్నం! జలతారు మేలిముసుగు లోంచి ఆమె మోము చంద్రబింబంతో పోటిపడుతోంది. మాట్లాడితే ఎక్కడ కరిగిపోతుందో మౌనంగా ఆమె వెంటే వెళుతున్నాను. “అదిగో చూడు అతనిని మీ లోకం వాడే అమృతం తాగి అమరుడయ్యాడు! కవిత్వం రాస్తాడుట, అతని అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలుట” అతనిని చూపిస్తూ మురిపంగా అంది వెన్నెల బొమ్మ. అక్కడే ఆగిన నా దగ్గరగా వచ్చి, చేయి పట్టుకొని ఘల్లుఘల్లుమంటున్న తన పద మంజీరాల ధ్వని తో వడి వడిగా నడుస్తూ “ఇదిగో! ఇటు చూడు !ఇతగాడిని ! మాట లాడడు ! కాని తన ఊర్వశి గురుంచి భావ కవిత్వం అందంగా రాస్తాడు!ఆ ప్రేయసి తలపే అతనికి ఏదో అపూర్వ మధుర రక్తి ని స్ఫురింస్తుందిట! ఎంత చక్కటి ప్రేమికుడో కదా! ఈ భావ కవి “ అని అతనిని చూస్తూ పరవశంగా అంది వెన్నల బొమ్మ! “ఓయి!ఇంకా ఇక్కడే నుంచొని వున్నావా? పదపద అంటూ,అదిగో ఆ పక్కన చూడు అక్కడ!, విరిసిన మల్లెల మధ్య కూర్చొని “మల్లెపూలు,తెల్లని మల్లెపూలు! విచ్చిన మల్లెపూలు!అబ్బ! ఈ పరిమళం నాకిచ్చే సందేశం ఎలా తెలుపనూ?”అంటూ పెరిగిన గుబురు గడ్డంతో అచలంగా వున్న అతను ఒక మహా ద్రష్ట ! తను చెయ్యాలనుకున్న పని చేసేసి మీ లోకాన్ని వెలివేసి ,ఇక్కడ ఈ అందమైన సుందర స్వప్న లోకం లో ఎంతో ఆనందంగా వున్నాడు ,” అని ఉద్వేగంగా ఆ వెన్నెల బొమ్మ ఇంకా ఏదో చెపుతుంటే , ఆశ్చర్యంగా ఆమెని అడిగాను “అసలు ఎవరు నీవు ? ఊర్వశి వా? శశిరేఖ వా? లేక అంబరాన వున్న అప్సర వా? ఎందుకు వీళ్ళందరనీ చూపిస్తున్నావు నాకు ?” వెంటనే చెంగునలేచి ఒయ్యారంగా పరుగులుతీస్తూ “ఓయి! ఎవరనుకున్నావు నన్ను? గుర్తుపట్టలేదా ?ఎప్పుడూ నా ధ్యాసే కదా నీకు”, అని అంటూ వెన్నెలబొమ్మ, వెన్నలా కరిగిపోయింది “అయ్యో! వెన్నెల బొమ్మా ఆగు!ఆగు ! నన్ను వదిలి వెళ్ళకు” అంటూ దుఃఖిస్తున్న నాకు హటాత్తుగా మెలుకువ వచ్చింది కల కరిగింది ! కళ్ళు తెరిచి చూసాను ఎవరూ కనిపించలేదు అప్పుడు అది స్వప్నం అని గ్రహించి ఒక్కసారి ఆ అందమైన స్వప్నాన్ని గుర్తు చేసుకొన్నాను. సత్య శివ సుందర త్రికం తత్వం తెలియచెప్పింది, ఆమె ఎవరో కాదు నా కవిత, నా ఊహసుందరి, నా కలల యామిని! - మణి వడ్లమాని ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

by Mani Vadlamani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iSpniM

Posted by Katta

Saidulu Inala కవిత

// సైదులు ఐనాల // నేను-మా ఇంటెనక చెట్టు సాయంత్రమైతేచాలు ఎంత సొగసరి నాట్యగత్తెవుతుందో.... మా ఇంటెనకచెట్టు జడలువిప్పుకొని మురిపించే హొయలతో నావైపే చూస్తూ అది దానివైపే చూస్తూ నేను ప్రతిరోజూ కొత్తగా... జోకొట్టే అమ్మచేయిలా అప్పుడప్పుడూ నను తాకే దాని మునివేళ్ళు ప్రయాణపు అలసటమరిచి హాయిగా అమ్మ ఒడిలో సేదతీరుతున్నట్టు అతిశీతలత నాలోకిదూరి చేస్తున్న గిలిగింతలు మత్తుగా కనురెప్పల్ని పట్టివేసింది నల్లని ఊపిరేదో ననువిడిచి తెల్లని దూదిపింజలా...అలా..అలా.... ఆవిరైపోవడంలోని రహస్యాల్ని నాచెవిలో చెప్పి మహా ౠషిలా అది ..... పలకపై అక్షరాలుదిద్దే బాలుడిలా నేను.... మెడకుచుట్టుకొని ఇంకెంతసేపూ బయటుంటావ్ మాచిన్నదాని గద్దింపుకు చూద్దునుగదా నా చుట్టూ -28.4.14

by Saidulu Inala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1serC1B

Posted by Katta

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు! "పద పంజరం" తొలి ప్రేమ మనసుకు తొలి చినుకు భూమికి తొలివలపుమంట చేతిలో గోరింట పంట మరపురానివి మార్చలేనివి తొలి ప్రేమ మనసును చిగురిస్తుంది తొలి తొలకరులకు అవని పులకిస్తుంది ప్రేమ వర్షంలో వలపు మొలకెత్తుతుంది వర్షపు చినుకులకు విత్తనం చివురిస్తుంది కానీ... పెరిగిన విత్తనపు మొలక చెట్టై తన ఆశ్రితులకు నీడనిస్తుంది మరి వలపుల మొలక ప్రేమతో శ్రద్ధతో పంచుకుంటే పెంచుకుంటే మధుర ఫలాలనుఇరువురకీ అందిస్తుంది లేకున్న మాడి మసై తీరని దుఖాన్ని ఎడబాటునూ కలుగ జేస్తుంది కనుకనే ఒ మానసరాజహంసా! వినుమా! నీవు నరులను కాదు పురుషోత్తముని ప్రేమించుమా.. మల్లెలాగా, మొల్లలాగా.. విరిసిన కుసుమంలాగా..తులసీదళం లాగా హరిచందనం లాగా..పచ్చకర్పూరం లాగా మధురమైన హరి సంకీర్తనంలాగా వాకిట వెలిగే చిరునేతి దివ్వెలాగా ఏడేడుకొండలెక్కి నడచివచ్చే సామాన్య భక్తునిలాగా ఎర్రని తిరునామం లాగా తెల్లని కడిగిన మంచి ముత్యంలాగా పూసిన పునుగు గిన్నె కస్తూరిలాగా పరిమళించుమా పరవశించుమా.. నిముసమైన స్వామిని ఎడబాయక తరియించి తరింపజేయుమా ఇహపరముల ఈ ఆత్మ పరమాత్మను జేరగా ఆథ్యాత్మిక ఆకసంలో హాయిగా విహరించి శ్రీవారి పదపంజరముల తిరముగ వశియింపగా...

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mwY3ch

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె.//గుప్పెడు మల్లెలు-73// ********************* 1. నిన్న భూతం,రేపు అనుమానం, నేడొక్కటే నిజం, అందుకే... అది కాలం అందించిన "వర్తమానం" 2. అందరికీ తెల్సిందే జీవితం చిన్నదని, అయినా వీళ్ల దుంపతెగ, తొంగి చూడ్డమెందుకో పక్కోడి జీవితంలోకి 3. అడిగింది లేదని చెప్పకుండా, ఉన్నదేదో తెచ్చేసే హోటల్ సర్వర్లా, అదృష్టం బహుచిత్రం సుమీ 4. బాల్యంతోనే బతుకు ముగిసిపోద్ది, మిగిలిందంతా చావే, కప్పెట్టడమో,తగలెట్టడమో లేట్... అంతే 5. ఇప్పటి బిజీలైఫ్ 120లో పరిగెడుతోంది, చమురుకోసం చూసి 40లోకి తెచ్చామో, చెమట చమురుతో నడపాల్సొస్తోంది. 6. ప్రతీ కుక్కకి ఓ రోజుందట, ఆ రోజు ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలీలా... పాపం. 7. పిల్లల బతుకుల కోసం, బిల్డింగులు కడుతున్నారు, చెట్లునరికి సమాధులూ కడుతున్నారు. 8. "బాలు" మైకు బదులు బ్యాటు పట్టుకుంటే, ఆయనా తిట్టుకునేవాడు నీలాగే, అందరూ ప్రతిభున్నోళ్లే... ఎక్కడుందో తెలీదంతే 9. పుస్తకాల్లో ఆరోగ్యం చదవకు, అచ్చుతప్పు పడిందో... అనుమానంతోనే పోతావ్. 10. చాతీ సంకోచ,వ్యాకోచాలు పీల్చే దమ్ము మీదే, జీవితంలో చీకటి,వెలుగులు కె.కె. నువ్వు చూపించే ధైర్యమ్మీదే ===================== Date: 05.05.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iWM7Zd

Posted by Katta

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి -27 (కవి సంగమం) పరిచయమవుతున్న కవిత్వ సంపుటి :- " లోపలి స్వరం " కవిత్వ సంపుటి రాసిన కవయిత్రి :- "రేణుక అయోల " సంపుటిని పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి " "చూసిన దాన్నో,చదివినదాన్నో,విన్నదాన్నో 'లోపలిస్వరం"తోకవిత్వం చేసింది రేణుక అయోల నే" "The day I burn" ఆరోజు పదే పదే వెంటాడుతోంది " ఆనందమో,సందేహమో మెదడుని మొద్దుబారుస్తుంది విన్నదే విని,వినీ వినీ పక్షవాతం వచ్చినవాళ్ళలా సొఫాలకి అతుక్కుపోయాక- ఆ కరెంట్ వాడికే మనమీద దయ కలుగుతుంది ఆగిపోయిన టి.వి ముందు నుంచి లేచిన మనం చెర నుంచి విడిపించుకున్న ఖైదీలం.. మన కోసమే మనం కొంత మిగుల్చుకున్న జీవితాలం" ఆ రోజు నిజంగా విన్నదే విని వినీ,చూసిందే చూసి చూసీ సోఫాలో పక్షవాతం వచ్చినవాడిలా అతుక్కూపోయి,ఇది తప్ప మరేదీలేదా? నాకోసం నేను కేటాయించుకొనే జీవితకాలం లేదా?-అని కాలి కాలీ,మరగి మరగి కరగిపోయిన రోజు కరెంట్ పోయి ఆగిపోయిన టి.వి ముందు నుంచి లేచి చెర నుండి బయటికొచ్చి స్వేఛ్చ పొందిన ఖైదీలా హాయిని పొందిన నాకు వినబడిన "లోపలి స్వరం"లోంచి వినబడిన మాటలు ఇవి. రేణుక అయోల గారి వాక్యాలివి. ఆవిడది విద్వత్కవి కుటుంబం.ఆమె ముత్తాత శ్రీ కావ్యకంఠ గణపతిమహాముని. కవిత్వపు జిలుగులు తెలిసిన కవితా హృదయం గల కవయిత్రి.ఒఠ్ఠి హృదయం గలిగిన కవయిత్రే కాదు గట్టి కవిత్వం రాయగలిగిన నేర్పరి ఈమె.ఆమె ఏ చూసిందో,ఏం వినిందో, ఏం చదివిందో వాటిని తన హృదయం ఎట్లా కంపిస్తే అట్లా, జీవితంలోని అతి సాధారణ అనుభవాల్ని సైతం అతి చిన్న వాక్యాలతో,అత్యంత ప్రతిభావంతంగా కవిత్వం చేసిన కవయిత్రి ఎవరంటే రేణుక అయోల గారు. "కాటుక లాంటి అడవి నన్నెవరు చూడరనుకుంది కారు మబ్బులు కమ్ముకొని గాలి అందించిన చినుకు వరదలో అడవి సేద తీరుతోంది"- అడవి తీసుకొనే విశ్రాంతిని ఇంత అందంగా ఎవరు చిత్రించగలరు? "చిన్న విత్తు తనకు తానే భూమిలో ఒదిగి కాలాని నమస్కరిస్తూ లేత చిగుళ్ళతో గున గున ఎదిగి పలరిస్తుంది" విత్తనం అంకురించడం కాలానికీ నమస్కరించడంగా ఎవరూ ఊహించగలరు? "నాగలి పట్టిన చేతులు ఎడ్ల బండిని అదలించిన చేతులు ధాన్యం,కొట్లో నింపిన చేతులు పట్టె మంచం,తెల్లటి బొంత కాళ్ళ దగ్గర రాగి చెంబు తాతయ్య వెంటాడే ఙ్ఞాపకంలా ఉండేవారు" ఇలా తాతయ్య రూపాన్ని మనస్సులో ముద్రించుకపోయేటట్లు రూపవర్ణన చేసిందెవరు? "జనం మధ్యలో మనం,జనంలో ఒకరైన మనం మనకే మనమే అపరిచుతులం పరిచయాల్లేని ముఖాల మధ్య మన ముఖమే మనకి అపరిచితం" సమూహంలో ఒంటరైన మనిషి, తనను తానే గుర్తుపట్టలేని,తన అస్తిత్వాన్ని తానే తెలుసుకోలేని మనిషిని గూర్చి ఇంత తాత్వికంగా చెప్పిందెవరు? అడవి విశ్రాంతిని అందంగా చిత్రించింది,విత్తనం మొలకెత్తే దృశ్యాన్ని కాలానికీ నమస్కరించడంగా ఊహించింది,తాతయ్య ఙ్ఞాపకాలతో ఆయన రూప చిత్రణను కళ్లముందు నిలబెట్టింది,ప్రజా సమూహంలో ఒంటరి అయిన మానవుని అస్తిత్వం ఆ మానవుడే గుర్తు పట్టలేనంత మారిన వైనాన్ని తన "లోపలి స్వరం"తో చెప్పింది రేణుక అయోల గారే. చిన్నప్పటి నేస్తం ఇంట్లోంచి గుర్తు తెలీకుండా వెళ్ళిపోవడమో,సహాధ్యాయి అకస్మాత్తుగా తిరిగిరాని లోకాలకీ చేరుకోవడమో, ఏదో ఒక వ్యసనపు మత్తులో అయినవార్ని,వున్న వూర్ని వీడి వెళ్ళిన వ్యక్తి ఙ్ఞప్తికి రావడమో,శిథిలమైన వూరి ఆనవాళ్ళు కళ్ళ ముందు నిలబడటమో,ఇంట్లోని పాత ఫోటొ గతించిన గుర్తులను తిరిగి తీసుక వచ్చి వొక దుఃఖపు వ్యధను కలిగించడమో,జీవితంలో ఎన్ని మాధుర్యపు అనుభూతులున్నా ఏదో తెలియని ఒంటరితనపు స్పర్శని అనుభవించడమో,చిన్ని పాపల ముద్దు మాటల మోహాంలో మునిగిపోవడమో,వూర్లోని చెరువు అద్దంలో ముఖాన్ని సరిదిద్దుకోవడమో ఎపుడైనా ఎవరికి వారు తమలోకి తొంగిచూసుకోవడమో,ఏదో ఒక రోజు వేసవి సాయంకాలం వర్షానికి తడవడమో,మన మతం కాని వారితో వున్న స్నేహాన్ని బేరీజు వేసుకోడమో,అభివృద్ది పేరిట జరిగే రోడ్డు మార్పుల్లో రూపు కోల్పోయిన చెట్లను చూసి వేదన పొందడమో,ఇంట్లో వున్న పాత సామానును చూచిపారేద్దామా?వుంచుకుందామా?అనేసంశయానికిగురికావడములాంటిఅనుభవాలు,అనుభూతులు అందరి జీవితాల్లోను వుంటాయి.అయితే వీటన్నిటిని కొందరు ఙ్ఞాపకాల బీరువాలో భంద్రంగా దాచుకొంటారు.కొందరు విస్మృతపథంలో వదిలేస్తారు.ఒకరో ఇద్దరో వాటిని మెరిసే అక్షరాలు చేసి నెమలీకలా బతుకు పుస్తకంలో దాచి పదే పదే చూసుకొంటుంటారు. నేటి కాలంలో జీవితం నదిలా సంక్లిష్టాల,సంక్షోభాల,సుఖదుఃఖాల దరులను ఒరుసుకొంటు ప్రవహిస్తున్నది.అట్లా ప్రవహించే మానవ జీవితపు నదిని ప్రభావితం చేసే పైన చెప్పిన అత్యంత సూక్ష్మాతిసూక్ష్మ అనుభూతులు,రోజువారి అనుభవాలు కొందర్ని తీవ్రంగా స్పందింపచేసి అడ్భుత కవిత్వాన్ని రాయిస్తాయి.తన జీవిత నది యానంలో ఎదురైన అనేకానేక అనుభవాల అనుభూతుల స్పందనల్ని, రేణుకసాగేయేరులా,ఊగే సెలయేరులా,నడిచే నదిలా అందంగా,సాంద్రంగా,గంభీరంగా చిక్కటి అక్షరాలు చేసి వాటిని కవిత్వపు దారాలతోఅల్లింది.ఆగిపోని కవిత్వం చేసి తేమ లేని జీవితాల్లో కవిత్వంగా నాటింది. అందుకే "జీవితాన్ని కవితగా మార్చడంలో నేర్పరి రేణుక అయోల"-అని ప్రముఖ కవి, విమర్శకుడు వాడ్రేవు చిన వీరభద్రుడు గారు అనగలిగారు. మనుషుల్లో కవులు విభిన్నంగా వుంటారేమోనని కొందరు భావిస్తుంటారు.అయితే కవులు కూడా మానవులే.ఈ కవయిత్రి తన తాతయ్య మాటల్లో కవుల గూర్చి"లోకం చుట్టూ దారాలల్లుకుంటూ సాలెగూడులో ఈగల్లా చిక్కుకుంటారు"-అంటూ వారి కవిత్వ దాహం పుస్తకాల దొంతరల్లో తీరు తుందని చెబుతారు.కవిత్వం మనిషిని మనిషిలా నిలబెడుతుంది,బ్రతికిస్తుంది అనే ఒక భావనను ఈ కవయిత్రి తన "కవిలోకం" అనే కవితలో బలంగా వ్యక్తంచేస్తుంది.అందుకే"ఎండిపోయిన పూల గింజలను ఏరుకొని కవిత్వాన్ని పూయిస్తారు"-అని అనగలిగింది.పాతిన గింజ అంకురించి కొత్త మొక్కనెట్లా యిస్తుందో అట్లాగే కవులు వారు రాసిన కవిత్వంఏ కాలందైనా చరిత్రను చెబుతూ జీవితంపై మనకు నమ్మకం కల్గిస్తారని ఈవిడ విశ్వాసం.దీన్ని కవిత్వమంతా ఒక అంతర్లీన అంతస్సూత్రంగా నిర్మిస్తూ జీవన సారాంశాన్ని కవిత్వం చేసింది. కవయిత్రి రేణుక గారు తనతో పాటు చదివిన ఉష లేదని తెలిశాక రాసిన 'గాయం"అనే స్మృతి కవిత నిజంగా ఆవిడ మదిలో రేగిన గాయపు బాధంతా ఏకీకృత అక్షరంగా మారితే ఎలావుంటుందో అలా పాఠకుల్ని దుఃఖప్రవాహంలోకి లాక్కెలుతుంది.అందుకే రేణుక తన జీవిత అనుభవాన్ని మన అనుభవంగా మార్చి తన దిశగా ఆలోచింపచేస్తుంది. "గాయం మానిపోతూ పొరలు కట్టుకుంటూ ఆనవాళ్ళను మిగులిస్తుంది ఏ గాలి ఙ్ఞాపకానికో మళ్ళీ చెలరేగుతుంది నిప్పు రవ్వ వచ్చిపడ్డట్లు గాయం రేగుతుంది పొరలు విప్పుకొని నిద్ర జడలు విదుల్చుకొని నాట్యం చేస్తుంది" ఈ వాక్యాల్లోని భావ చిత్రం రేగిన గాయపు తీవ్రతని గుర్తుకు తెస్తుంది. పాత గాయం అయినచోటే మళ్లీ గాయం కావడం సహజాతి సహజంగా జరుగుతుంటుంది.ఆ గాయాన్ని మాననీయవు.ఇదే అంశాన్నీ ఈ కవితలో "పాతవి కొత్తవి కలసి కలకలం రేపుతాయి/ గాయాన్ని మాననీయకుండా ఎక్కడెక్కడివో గుర్తుకొస్తుంటాయి"అని అంటూ ఈ గాయం నెత్తురు చిమ్మకుండా లావాలా ఉడుకుతూ కాల్చేస్తుందనే ఊహను చేసి..ఆ మరణపు గాయం మనసులేని శరీరం మీద మాయని మచ్చలా మిగిలిపోతుంది అనిచెప్పడం అంటే చెదిరిపోని గుర్తు అని కవయిత్రి గొప్ప పోలికలతో ఒక స్మృతిని మనముందు నిలుపుతుంది. మాములుగా ఎవరైన కీర్తిని గడించాలని విపరీతంగా ప్రయత్నం చేస్తంటారు.ఆ కీర్తిని పొందడానికీ ప్రాణాల్నిసైతం ధారపోసిన వాళ్ళని చరిత్రలో చూడొచ్చు. చాల చిత్రంగా రేణుక గారు ఆ కీర్తి అనేది పతనానికీ సంకేతం అని తీర్మానిస్తుంది.ఈ మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.కానీ ఈవిడ తన భావనని ఎంతో సమర్థవంతంగా తార్కింగా నిరుపిస్తుంది ఈ కింది పంక్తుల్లో. "కొందరిని కీర్తి బంగారు కీరిటమై అందరిలోంచి ఒక్కడిగా నిలబెట్టి అందరినుండి అపరిచితుడిగా లాక్కెళుతుంది అసూయ డేగలా వెన్నాడితే కీర్తి రాయిలా బరువై శత్రువులా మారుతుంది మళ్ళీ నీలో నువ్వు నీ కోసం వెదుక్కునే దాక కీర్తి వెంటాడుతూనే నిన్ను సంహరిస్తుంది" కీర్తి దాహం ఆత్మ విశ్వాసపు సంకేతంగా నిలిచే బదులు అది పతనానికి ఎట్లా గుర్తయ్యిందో ఈ కవయిత్రి స్పష్టంగా చెబుతుతుంది. ఎవర్నైనా చూసినప్పుడు ఏదోఒక భావం కలగడం అందరి అనుభవం.తాను చూసిన దాని వల్ల తాను పొందినానుభవాన్ని కవిత్వం చేయడం అందరు కవులు చేస్తారు.కానీ ఈ కవయిత్రి తన అన్నయ్య తన తాతగారి పాత ఫోటొ చూసినప్పుడు అతనిలో కలిగిన భావాల్ని కవిత్వం చేసిన విధం మాత్రం స్వంయంగా అనుభవించిన అబ్బురంగా అనిపిస్తుంది.ఇట్లాంటి పరమనోభావ గ్రహణ విద్య ఈ కవయిత్రికేట్లా తెలిసిందా అనుకున్నా. "తాత పోలిక నాదంటారు నాగలి పట్టి సరదాగా దున్ని అరచేతులు చాచి చూపించాను "భడవా"నాలాగే దున్నావురా-అనే తాతయ్య గొంతు ఎప్పుడు ఈ ఇంటి గడపలో కాలుపెట్టినా ఎడ్లబండి చప్పుడు వినిపిస్తుంది "వీడిదంతా నా పోలికే"గుండెలకి హత్తుకున్న చిత్రం కళ్ళముందుంటుంది పాత గడియారం కింద తాత ఫోటొ ఒకరోజు ఖాళీగా కనిపించింది నా చేతిలో నా బుజ్జిగాడి నవ్వులో "భడవ" ఇక్కడున్నానురా అంటూ-" ముగింపు కూడా మనలోని ఒక నమ్మకాన్ని బలపరుస్తూ ఊహించని విధంగా చేసింది. పాత్రలో,సీసాలో ఖాళీగా వుంటాయి.మాటలు ఎట్లా ఖాళీ గా వుంటాయి."నుదుటి మీదకి జరుగుతున్న తెల్ల వెంట్రుకలు,వణుకుతున్న చేతులు ,పట్టుకోసం చేతి కర్ర ఇంకా మిగిలివున్న ఊపిరితో వున్న రంగసాని ఖాళీ ముఖం చూశాక రాసిన"ఖాళీ మాటలు" " తెగిన మువ్వలొ కూడా నాట్యపు తిరస్కారం ఉంది"-అనే వాక్యం ఈ కవితకీ ప్రాణాధార వాక్యం.ఇట్లా కొన్ని మాటల్లోనే ఒక గొప్ప ఊహని చేసే ఆలోచనని పాఠకులకీ కలిగిస్తుంది. "తేట నీటి చెరువులా అంతరంగం ఆలోచనల చేప పిల్లలు లేవు మనసు తొలిచే వింత జంతువులు లేవు వృక్షాలై పెరిగిన అసూయలు లేవు పేరు రూపం లేని ఉత్త బొమ్మలా తేలియాడుతున్నాను మాయమైన రూపం కోసం వెదుకుతూ" ఎవరికి వారు తమ అంతరంగంలోకి తొంగిచూసుకుంటే ఎట్లా వుంటుందో పై పంక్తులు చెబుతాయి.ప్రతి పంక్తిలో ఒక పోలికను చెబుతూ చెరువును అద్దంగా చేసి రాసిన కవిత "నీటి బొమ్మ"-అనేది. వొక అందమైన భావాన్ని అక్షరాల్లోకి మార్చే మంత్రజాలం కూడా రేణుక గారికి తెలుసు. "వాన వెలిసిన రాత్రి ఆకాశంలో తారలు ఒక్కోక్కటి నడుచుకొంటూ నీలి తెర మీద చమ్కీల్లా వేలాడుతుంటాయి సందడి చేసి వెళ్ళిపోయిన వానకి గుర్తులు ఇంటి చూరుల్లో రాలుతున్న నీటి బుడగలు" వాన వెలిసిన తరువాతటి దృశ్యాన్ని ఇట్లా ఊహ చేయటం ఈమెకే చేతనయ్యిందేమో! "వెళ్ళిపోయిన వ్యక్తి ఙ్ఞాపకాలు/కళ్ళల్లో మిగిలిపోతాయి/మాటిమాటికి రెప్పలను ఒరుసుకొని/పారే కన్నీటి తడితో/వర్షం వెలిసిన ఆకాశంలా వాళ్ళంతా మిగిలిపోతారు"-ఇట్లాంటి దుఃఖపు తడి నిండిన వాక్యాలు ఈ కవయిత్రి చేతిలో పడి మనకీ మరింత విషాదాన్ని పంచుతాయి. అదేమి చిత్రమో గానీ ఎందరు కవులు అమ్మను గురించి రాసినా ఇంకా రాయాల్సిందేదోవుంది అని అనిపిస్తుంది నాకు.అందర్ని వదిలివెళ్ళిపోయిన అమ్మ జీవిత ఙ్ఞాపకాలలోని విషాదాన్ని "పల్లకీలో పెళ్ళికూతురు"అనే కవితలో చిత్రిస్తే,చౌరాస్తాలో సిగ్నల్ లైట్ల దగ్గర ఒకచిన్న పిల్లాడిని ఎత్తుకొని అడుక్కొంటున్న అమ్మాయిలో అమ్మ తనాన్ని"వాడితో నా ప్రయాణం"అనే కవితలో చిత్రించింది ఈ కవయిత్రి రేణుక గారు. అమ్మను ఖననమో,దహనమో చేయాడానికీ ముందు ఆమె చేతులకున్న గాజులు,కాళ్ళకున్న కడియాలను పంచుకొన్న తరువాత 'పాత సామానుల కొట్టులోకి వెళ్ళిపోయిన సందూకపెట్టె గురించి,అందులో అమ్మ దాచుకొన్న అపురూప గుర్తులను నెమరేసుకొంటూ,ఏనాడు పేరు పెట్టి పిలువని నాన్న కారణంగా తన పేరేమిటో మరచిపోయిన అమ్మను మనసులోకి తెచ్చుకొంటూ,కూరలో ఉప్పు ఎక్కువైతే పళ్ళెం ముఖాన విసిరికొట్టిన అభిమానాలు ఆప్యాయతలు పంచి ఇవ్వడమే తెలిసిన అమ్మలో తనను చూసుకున్న స్త్రీ మనో భావాల్ని గొప్పగా ఈ కవయిత్రీ ఆవిష్కరించింది. "భుజం మీద ముడితో జోలెలా అనిపించే మెత్తటి చీర ముక్క ఊయలని ఆమె జోలె అంటుంది నేను వాడిని మోస్తూ నాలోకి ఒదగనిస్తూ వాడి అనుభవాలకీ మూగపల్లకీనవుతాను" ఇలా ఆరంభమయ్యే ఈ కవితలో నాలుగు రోడ్ల కూడలిలో తన చంకనో వీపునో పిల్లాడిని మోస్తూ అడుక్కొంటున్న అమ్మాయిలో అమ్మ తనాన్ని ఈ కవయిత్రి రూపు కట్టించింది. "ఊయలగా నేను జోరుగా ఊగి- వాడి దుఃఖాన్ని చెరిపే కొమ్మ మీద పిట్ట కోసం ఎదురుచూస్తాను వాడికి కావలసింది అమ్మ అమ్మకి కావలి ఆకలి తీర్చే ఆదాయం జీవితం ట్రాఫిక్ సిగ్న్ల్ దగ్గర ఆగిపోయింది" ఈ మాటలు మనలి కూడా అక్కడే ఆపేస్తాయి.వొక అద్భుతశిల్పంతో ఈ రెండు కవితలే ఇంకా చాల కవితలు రేణుక అయోల గారిని ఒక మంచి కవయిత్రిగా నిలబెడతాయి పాఠకుల ఎదుట. "నన్ను నువ్వు తెలుసుకోవాలంటే యుగాలతో సంభాషణ జరపాలి"-అని అనటంలో కాలాన్ని స్ఫురింపచేస్తూ,నీటి జల్లులస్పర్శ,తడిపూల వర్షం,పిట్టల సయ్యాట లాంటివాక్యాలతో గుండె గుడిలో గిలిగింతలు పెడుతూ, "నది నా ఆత్మ,నది నా బాల్యం "అంటూనదిని అమ్మలా పలకరిస్తూ,ప్రతి కవితలో ఒక అనుభవ ధూళిని పంచుతూ,కెమెరాకందని జీవితం,కాగితాల కందనిఅనుభవన్నీ కవిత్వమంతా పరచిన కవయిత్రి రేణుక అయోల అంటున్నా నేను.రాయవల్సిన వాక్యాలు ఇంకా ఎన్నో వున్నా" రాత్రి ఆకాశంలో అప్పుడే పుట్టిన నెలవంక దాని పక్కనే మినుమినుకుమంటున్న నక్షత్రం"ఇక చాలని అంటున్నాయి కాబట్టి...ఒక మంచి కవితా సంపుటిని అందించిన కవయిత్రికి మనఃస్పూర్తిగా అభినందనలు అందజేస్తు..వచ్చే మంగళవారం మరొక కవితా సంపుటితో కలుద్దాం.అంతవరకు మిత్రులు ఈ కవిత సంపుటి పఠనంలో వుంటారని ఆశిస్తాను.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mwhIVD

Posted by Katta

Chi Chi కవిత

_అడ్డం_ ఎగరేసుకెల్లే కోరికేదైనా తీరుతూ ఉండాల్సిందే తీరినా!! ఎన్నిసార్లు పుట్టినా చాలనంతుంటే ఒక్కసారైనా చావబుద్ధి కాదు మరి!! వస్తూ పట్టుకొచ్చిందేం లేదు..పోతూ తీసుకెళ్ళేదేం లేదు అవి రెండూ తెలిసొచ్చేవి కావుగా అయినా.. తెలియనివెవరిక్కావాలి!! చూడకుండా పొందే సుఖాలేవైనా ఒకటే చూస్తేనే మారేది ఏ సుఖమైనా మార్పులెన్నో!! నగ్నాలనే చూడు..అంతా నగ్నమే నగ్నమైన వస్త్రంలో నగ్నంగా దేహం!! కళ్ళలో శూన్యం నిండితే సర్వమొక దేహమే మేరల్లేని జాడతో!! పుండువో పండువో రుచి మరిగేస్తావ్..హా ఎన్ని నొప్పులో!! భరించినట్టుంటే నొప్పి..వరించినట్టుంటే సుఖం వరించడానికే భరిస్తుంటావ్ ధు:ఖాన్ని సహిస్తూ.. పుచ్చులేరినట్టు అందర్నేరేస్తూ అందరి పుచ్చుల్లో నువ్వూ పుచ్చుంటావ్ రహస్యం కూడా నగ్నమే..చెప్పవంతే చెప్పి చూడు అవతలోల్లకి కాల్చితే అదొక సుఖం!! ఆహుతవ్వడానికి అందరూ అడ్డమే అవకాశం తమదయ్యేదాకా!! ఆనందం అడ్డమోస్తేనే ఎవరైనా ఆగేది..ఆరిపోకుండా తీర్చేస్కో!! పోతూ నీతో రానివన్నీ నీకు నువ్వడ్డం కాకుండా!!____________(6/5/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fKsj0r

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

నీ సమస్యలని ఎదుటివాళ్ళతో పంచుకోకు.. వాళ్ళిచ్చే ఓదార్పులో రిలాక్స్ ఐపోకు.. దాచెయ్ దాచెయ్ సోదరా నీ సమస్యల్ని నీ గుండెల్లోకి తోసెయ్.. పరిష్కారం అనే వెలుగు నీ అనంత విశ్వానికి తాకేదాకా కాలనీ, రేగనీ ఆ జ్వాలనీ నువ్వు బూడిద ఐపోతావని భయపడకు.. నిన్ను చూస్తూ ఉండిపోయినా ఈ జనాలే రేపు నీ బూడిదని విబూదిగా రాసుకుంటారు.. - సత్యం జి, 06-05-2014, 01:06

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Su2FTF

Posted by Katta