పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మే 2014, మంగళవారం

Pusyami Sagar కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె రాసిన కవిత !!ఖాళీ భూమి!!//కవిత్వ విశ్లేషణ// _______పుష్యమి సాగర్. ప్రపంచం కుగ్రామం అంటాము కదా మరి ఇంత పెద్ద విశాల భూమి లో చుట్టూ మనుషులు ఉన్న కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉన్నప్పుడు !మనిషి ! సామాజిక జీవి అన్న దానికి అర్థం లేకుండా పోతుంది ఏమో...!!! S.v.k గారు తీసుకున్న వస్తువు కూడా మనిషి కి మనిషి కి పెరిగి పోయిన దూరాన్ని కొలిచే ప్రయత్నం చేసారు లా ఉన్నదీ ...ఓ చోట ఇలా అంటారు ...!!! ఒంటరి //యెవరికివారు; //గింజలు బుక్కు //సమయమే //ఉమ్మడి జాగ్రత్త గా గమనించండి ...ఆధునిక నాగరికత అని మనం మురిసిపోతున్నాం మనుషులు కలిసారు కాని, మనసు లు కలిసాయా ???? ఒకే కుటుంబం లో ఉన్న కూడా ఎవరికి వారే ...బువ్వ తినే ఆ రెండు క్షణాలు తప్ప , మనం ఎపుడైనా కలుసుకున్నామా !! మనిషి ని ముఖ్యం గా రెండు విషయాలు బాధిస్తాయి ....ఘటన జరిగినపుడు పుట్టిన వేదన .....మరి గడిచిన గతాన్ని తవ్వుకుంటూ కన్నీళ్లను కార్చినపుడు, నిజంగా మన చేతుల్లో గతాన్ని చెరిపి వెయ్యగల పరికరం ఏమన్నా ఉంటె బాగుండు కదా.... "కొన్ని తవ్వకాల అనంతరం //వెలువడు //జ్ఞాపకం పై పడు కన్నీరు బిందువులు-" ఇప్పుడున్న ప్రపంచం లో సర్వం స్వార్థం అయినపుడు, సమూహాలకు సమాధి కట్టేశారు ..... కేవలం ఇక్కడ మనిషి కి మరో మనిషి కి బందం ఏమన్నా ఉంది అంటే కేవలం పరిచయమే.... //మనిషి మనిషీ పరిచయం అంతే యిప్పుడు-// యెవరివ్వారివే మూకుమ్మడి //సంతలో //బేరాలు- పై వాక్యం లో చూడండి ...మనిషి తన కు కావలసిన వ్యక్తిగత అవసరం చూసుకుంటున్నాడు తప్ప పక్కనోడి గురించి పట్టించుకోవటం లేదు ఎవరికి వారె ...సంత లో ...బేరాలు లాగానే ...!!! మరి ముందుగా చెప్పుకునట్టు గా మనుషులలో పెరిగిపోయన స్వార్ధం వలన ఎవరి ప్రయోజనం వారే చూసుకోవాలి , ఈ కవి నిజంగా ప్రపంచం లో నిజమైన నికార్సనైన మనుషుల కోసం ..మనుసుల కోసం వెతుకుతున్నాడు ...మార్మికత పూర్తిగా నిండిన ఈ రచన లో కొన్ని బావ చిత్రాలను మనమే ఉహించుకొని ఆకళింపు చేసుకుంటే కవి చెప్పదలచుకున్న భావం చక్కగా అవగతం అవుతుంది ...మనుషుల్లో పెరిగిపోతున్న ఏకాంత , ఒంటరి సమూహాలను తరమి కొట్టి ..మనుషులు గా మసిలే రోజు కోసం ఎదురు చూడటం బాగుంది ... కవిత ను ఇంకాస్త సరళం గా రాసి ఉంటె పాఠకుడు ఏ స్థాయి వాడు అయిన త్వరగా ఆకళింపు చేసుకొనుటకు వీలు గా ఉంటుంది ..SVK గారు మంచి expression ఉన్న రచన ను అందించారు..కాస్త సమాజ పరంగా కూడా వారి కలాన్ని మరలించితే బాగుంటుంది ...ధన్యవాదాలు ... సెలవు .. •• ఖాళీ భూమి •• దేహంపై పురాతన మనిషి పచ్చబొట్టు- కాలంపై సందేహం మరక గుర్తు- ••• కొన్ని తవ్వకాల అనంతరం వెలువడు జ్ఞాపకం పై పడు కన్నీరు బిందువులు- కోల్పోవుతనం శ్వాస- "చట్లు సమస్తం నరకబడు కల బాధ చేయదు-" ఒంటరి యెవరికివారు; గింజలు బుక్కు సమయమే ఉమ్మడి చర్య- మాయలు చేయు యుగం సమాధి- మనిషి మనిషీ పరిచయం అంతే యిప్పుడు- ••• యెవరివ్వారివే మూకుమ్మడి సంతలో బేరాలు- 05/21/2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gj3Dfy

Posted by Katta

Kalyani Gauri Kasibhatla కవితby Kalyani Gauri Kasibhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gLwb1Y

Posted by Katta

Venu Madhav కవిత

వేణు //విజయం // మనస్సు రాసుకున్న ఉత్తరాలలో అందమైన ఉత్తరం కోసం వెతక సాగేను కానీ ప్రతి ఉత్తరం కన్నీటితో తడిసిపోయి ఒంటరితనంతో నలిగిపాయింది ఓదార్చే చెయ్ కోసం అనుక్షణం ఎదురుచూసిన, లాభం లేదు అనుకోని చివరికి నాకు నేనే ఓదార్పుగా మరి ముందుఅడుగు వేసాను చీకటి నీ చీల్చి వొచ్చే వెలుగు ఆలస్యం అవుతుంది అని తెలిసి నా మనసులోనే జీవితం ఒక వరం అని అనుకోని నా ప్రయాణం కొనసాగించాను,ఇంకా ఓడిపోతా అన్న భయం లేదు ఎందుకంటే విజయం నాదే అన్న విశ్వాసం నా దేగ్గిరే ఉంది కనుక 20may2014

by Venu Madhavfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lL69ZY

Posted by Katta

Renuka Ayola కవిత

రేణుక అయోల //అలుపెరుగని కొత్త నేస్తం // బాల్కనీలోకి రాగానే పలకరించే నా నేస్తం ముదురు జేగురు రంగుని కలుపుకుని నలుపునీడలో కరిగిపోతూ ఆకుపచ్చని ఆకులులేని నేస్తం కింద పరుచుకున్న లేత గడ్డికి నీడ విసనకర్రని వీచుతుంది అలుపెరుగని నేస్తం పిచుకల కుటుంబంతో హాడవిడిగా వుంటుంది ఆకులేని కొమ్మలని వంచుతాయి ఏరి ఏరి పట్టుకెళ్తాయి నిద్ర పోతూ కలవరిస్తూ ఊగీ ఊగీ గాలినందిస్తుంది నిన్న రాత్రీ చీకటిలో కురిసిన వానకి తనువంతా అప్పగించి నీటిని దులుపుకుని పట్టుకెళ్ళే ఆకులనందించింది పిచుకలకి మళ్లి ఈరోజు పొద్దున్నే తెల్లనిపూలని తలనిండా పూయించుకుని నునులేత కొమ్మల చేతులతో సవరించు కుంటూ నిద్రలేపింది నా నేస్తానికి నేస్తాలు కుటుంబ సభ్యులు పిచుకలు తెల్లని పూలని మెత్తని దిళ్ళుగా ఎత్తుకెళుతున్నాయి ఈ నేస్తం ఇక్కడిదా ?అనుకుంటాను ఎక్కడవున్న నువ్వు నా దోస్తువే అంది నీటిచినుకులు రాల్చుతూ తెల్లనిపూల కొమ్మల గోడుగులోకి రమ్మని పిలుస్తూ ....

by Renuka Ayolafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qSrNSR

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మనం కళ్ళతో చూసేది అంతా నిజం కాక పోవచ్చు మనం చెవులతో విన్నది అంతా నిజం కాకపోవచ్చు కానీ నీ మనసు నీకు చెప్పేది నిజం దాని మాట విను అన్ని బంధాలు ఆర్ధిక సంబంధాలే అన్నాడు మహాకవి ఎవరు దేనికి సిద్దపడ్డా రెండింటి కోసమే కదా ఆర్ధికంగా అధికారం , అందాల అతివ కోసం ... ప్చ్ సహనం వుండటం మంచిదే జీవితాన్ని సమర్పించు కునేలా కాదు !!పార్ధ !!20/5/14

by Pardhasaradhi Vutukurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gL5DOp

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||మీమాంసికత|| అవిభాజ్యపు రాశి రహస్యం ప్రాకృతికవాదాల ప్రాయాశ్చితం తేల్చిపారేసావా, ఓ సోక్రటీసా లోకపు వెర్రిలో ఇంత విషాన్ని కలిపి. బొటను వేలిని పైకెత్తి సమర్థిస్తావో క్రిందికి చూపి కూలదోస్తావో అరచి చెప్పవోయ్ అరిస్టాటిల్, దేహపు అఖండతత్వం. చార్వాకుల చైతన్యపు గర్వం ద్విసత్తాల జ్ఞానపు గీతం ద్వైధీభావ ఏకత్వాలు కన్ఫ్యూషియస్ ఇక కాలరాసెయ్. పావలోవ్ కుక్క ఎంగిలి, ప్రవర్తనల బెల్లపు అంబలి, చొంగలు కార్చి నాకుదాం పద . ఫ్రాయిడ్ చెప్పే పిచ్చిపురాణం, మింగుడు పడని కాంప్లెక్సుల కల్చర్, పూసుకు ఏడుద్దాం, తెములు మరి. ద్వంద్వతార్కిక దుఃఖపు గమనం, ఎగబీలిస్తూ హెడోనిజం మత్తు కనుల మూసుకుని ముందుకు నడిచి రిఫరెండంతో రద్దే చేద్దాం. పొడుచుకొచ్చిన పరిహాసపు పొట్ట పెరిగిపోయిన ముక్కు వెంట్రుక ముఖమ్మీది గతుకుల చర్మం అర తెలుపుతో నవ్వే కేశం తాత్వికతలు నెమరేస్తూ, చస్తూ. మృషానైతికతల మృష్టాన్నం మెక్కి, నిదురిద్దాం పదవోయ్,.ముసుగు కప్పుకొని. ---------------------mar 2014--------------20/5/2014

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZxEAI

Posted by Katta

Panasakarla Prakash కవిత

"ఎడబాటు" ఎ౦త ఆశ్చర్య౦ నువ్వొక స్వప్నానివి కావడ౦ నేనొక గతాన్ని కావడ౦ ఎ౦త దురదృష్ట౦ నేనొక చీకటి కావడ౦ నువ్వొక ప్రమిదవి కావడ౦ ఎ౦త విచిత్ర౦ నేనొక ఎ౦డని కావడ౦ నీవొక నీడవి కావడ౦ ఒకప్పటి మన౦ ఇక ఎప్పటికీ ఒక్కటి కాలే౦ నా జీవిత౦లో అత్య౦త దురదృష్టకరమైన‌ స౦ఘటన‌ బతికు౦డగానే నువ్వు నా..... జ్ఞాపకానివి కావడ౦ పనసకర్ల 20/05/2014

by Panasakarla Prakashfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gL2Cxu

Posted by Katta

Pratapreddy Kasula కవిత

ఏమైనా.. - కాసుల ప్రతాపరెడ్డి తల్లి శాపం తగుల్తనే ఉంటది రేగు కంప గుండెన చీరుతనే ఉంటది బొంగరం గిర్రున తిరుగుతూ బుర్రను తొలుస్తనే ఉంటది మంది మందలకు దూరంగా చీకటి గుహలూ మారు మూలలూ మహానుభావులు, మహా పురుషులు లేని చోట్లు దేవులాడుతుంటా ఉద్యమాలు, పోరాటాలు పసిపోరగాల్లై కాళ్లకు చుట్టుకుంటూ ఉంటయి రోడ్డు మీదికి రావడం తప్పదు సమూహంగానే కనిపిస్తుంటం మనిషికీ మనిషికీ మధ్య గుండెలు అతుక్కోవు ఎవరి ఎజెండాలు వారికుంటయి మనసు లోలోతుల్లో అహం బుసలు కొడుతూ ఉంటది పండుగలూ పబ్బాలు వస్తుంటయి, పోతుంటయి దేహం మీది నుంచి రుతువులు జారి పోతుంటయి అత్మ వికసిస్తనే ఉంటది కాలం తెర మీద నా పాద ముద్రలు పడుతయి

by Pratapreddy Kasulafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZtOrc

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి టమాటో రైతు అది రైతు తన గుండెలో పండించిన రక్తం అది వెల కట్టలేని ఫలసాయం ఆ రక్తానికి చాలా గిరాకీ ఉంది దాని ధర బజారులో లీటరు పదిహేను రూపాయలు ఉంది కానీ అతని రక్తానికి లీటరుకి మూడు రూపాయలు మాత్రమే లభిస్తుంది మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని దళారీలు లాభంలా దోచుకుంటున్నారు రైతు పంటని అమ్మలేక భోరుమని విలపిస్తున్నాడు వినియోగదారుడు కొనలేక చస్తున్నాడు దళారీలు పండగ చేసుకుంటున్నారు రైతు తను పెట్టిన పెట్టుబడి కూడా రాక తన పశువులకు మేతా కొనలేక తను పండించిన రక్తపు పంటని చివరకి పశువులకి మేతగా వేస్తూ తను మాత్రం పస్తులుంటున్నాడు ఇదేమీ పట్టని సంఘాలు, ప్రభుత్వాలు తమ మాటల మంత్రాలతో తమ రాజకీయ వ్యాపారాన్ని మాత్రం కొనసాగిస్తూ రైతుల గుండెల్ని త్రొక్కుకుంటూ తమ భవిష్యత్తుని ఆర్జించుకుంటూ అభివృద్ధిలోకి పరుగెడుతూనే ఉన్నాయి రైతు కుటుంబాల ఆర్తనాదాల మధ్య; ఈ దేశంలో రైతు ఒక బానిస అతని శ్రమకి కిట్టుబాటు ఉండదు కానీ అతన్ని దోచుకునే వాడు మాత్రం మహా రాజు! ఈ వ్యవసాయ దేశంలో వ్యవసాయం ఒక శాపం; అంతే! ఓ అన్నదాతా! నువ్వు ఏడవకు నువ్వు ఏడిస్తే ఈ దేశానికి అరిష్టం నువ్వు నవ్వుతూనే ఉండు నువ్వు త్రుళ్లుతూనే ఉండు లేకుంటే ఈ దేశం కుళ్లిపోతుంది! 20May2014

by R K Chowdary Jastifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1teX4Nw

Posted by Katta

Rajender Kalluri కవిత

## సిరివెన్నెల ## అర్ద శతాబ్దపు అగ్న్యానాన్నే స్వతంత్రమందామా ఆర్త నినాధపు అరాచాకాన్నే స్వరాజ్యమందామా ? " అంటూ ... నాలో ఉన్న లోలో మనిశిని నిద్ర లేపాడు ... " నిందించకు ఎవరిని , నిలదీయి నీ అంతరాత్మని " అంటూ ఓ ప్రశ్నని సందించాడు .... సాహిత్యం అనే తూటాలతో నిరంతరం నన్ను ఆలోచించేలా చేసాడు ... ఆ మాటల త్తాత్పర్యాన్ని నిజ జీవితంలో కళ్ళారా చూస్తూ నిర్గాంత పోయేలా చేసాడు ... మనిషి అనే అహంకారాన్ని నాలో నుంచి వేలివేసాడు .... నిరంతరం నువ్వు శ్రమించినా " ఎప్పటికి నువ్వు విద్యార్థి " వె అంటాడు నీకు నువ్వు బ్రతికితే ... ఎందుకా జన్మ అంటాడు ? నా వాళ్ళు అనుకునే నీ వాళ్ళ కోసం కాకుండా .... అందరి కోసం బ్రతడం నేర్చుకొమంటాడు బ్రతకాలంటే డబ్బు మాత్రమే కాదు ...నిజాయితి అనే అస్త్రాన్ని ధరించి ధైర్యాన్ని పిడికిలో దాచుకుని ముందుకి వెళ్ళమంటాడు .... నువ్ సరిగ్గే నడిచే దారిలో ... తప్పు అనిపిస్తే చెప్పుతో కొట్టేలా చెప్పమంటాడు , వాడు చేసేది తప్పు అని .. " నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోనే కడుగు ఈ సమాజ జివత్సవాన్న్ని ...." అంటూ ఉంటాడు ! చదవాలనుకుంటే ఆయన ఓ నిగంటువు అవుతాడు చదివి చెప్తే పిల్లలకు చందమామ పాటం అవుతాడు ఓపికంటూ లేని వెర్రి జనాల బుర్ర్రాల్లో ఓ ప్రశ్నగా మారతాడు .... నా లాంటి యువకుల్లో నైనా కనీసం తన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుదేమోనని నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాడు .... ఆయనే " సిరివెన్నెల సీతరామ శాస్త్రి " గారు ( A Living Legend ) Many more happy returns of the day sir :-) kAlluRi [ 20 -5 -14 ]

by Rajender Kallurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jz5Vbd

Posted by Katta

Kapila Ramkumar కవిత

గమనిక : - కవిత్వానికి సంబంధించని పోస్టింగులు వెంటనే తొలగించబడతాయి.

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQjjCa

Posted by Katta

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు//నానీలు//12 ************************ రాజీనామా చేసిన మంత్రిలా పడమటి కొండల్లో సూర్యుడు *** సూర్యుణ్ణి వెనకేస్తూ భూమి తూర్పుకు ఆయువును తగ్గస్తూ వయస్సు ముందుకు *** అదిగో గుండెలు మండిపోతున్నాయ్ కన్నీటి ఫైరింజన్ వస్తుంది ఇక *** కళ్ళల్లో ఎండాకాలం,వానాకాలమూ ఒకచో నిప్పులు మరొకచో కన్నీరూ *** మాస్టారు మాట ఉదయకిరణం చల్లగాతాకినా చురుక్కుమంటుంది *** 20-5-2014

by Aravinda Raidu Devinenifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tef0ba

Posted by Katta

Sreekanth Yadav Talasani కవిత

http://ift.tt/1nbb4Zy

by Sreekanth Yadav Talasanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nbb4Zy

Posted by Katta

Aruna Naradabhatla కవిత

విలువలు _________అరుణ నారదభట్ల పరుగుపందెం కొద్దిగా పుంజుకుంది... కాళ్ళూ నావే...చేతులూ నావే! కాలం కళ్ళు తెరిపించిన చరిత్రా నాదే! నేనో మూలబడిన పుస్తకాన్ని... పేజీలనిండా బోలెడన్ని కలలు! సద్దిమూట నుండి విప్పిన ఎర్రని పచ్చడిమెతుకునూ... రంగూ...రుచీ తో పాటూ నోరూరించే అందచందాల సుగంధాలూ నావే! విజ్ఞాన సర్వస్వంలా ఇంటితోటకే పూలై పూసాను ఇంతకాలంగా! "పరిమళాలను పీల్చేసుకొని నాలుగు గోడలకే అంకితం చేసే ఈ సంసృతికి ఇప్పుడు నేనో దూరపు బంధువును!" "నా సేవలకు విలువ కట్టని ఈ లోకానికి నేనిప్పుడో చక్కని జవాబుదారిని!" "లోకం ఉనికిని చాటుతున్న మాతృత్వానికి విలువ లేనప్పుడే మానవధర్మం అంతరించింది!" "ఉదయాన్నే టీ కప్పునుండీ కళ్ళకు నిద్దుర కమ్మే వరకూ... నీకూ నీ బీజాలకు క్రీనీడనైనా నా ఉనికిని ఒక్కసారైనా గమనించని సమాజానికి ఇప్పుడు నేనో కొత్త పోటీని!" "కళ్ళాపు చల్లిన వాకిలిలో ముగ్గుగా ముడుచుకొని మల్లెపూవులా ఉండాలనుకున్న... నీ అడుగుజాడనై!" "అనుక్షణం అణచివేసిన ఆరాటాలు పెద్దమూటై గుట్టగా మారుతున్నాయి!" "మళ్ళీ పూర్వపు వాసనలు"!!! "ముక్కంటి తెలివిగా బంధించాననుకొన్నాడు... ఇప్పుడు మూడు కళ్ళూ మూడు ప్రళయాలై అన్ని రంగాలనూ దట్టంగా ఆలింగనం చేసుకుంటున్నాయి!" "నరాల్లో పరుగెత్తిన రక్తం ఒక్కసారిగా ఉవ్వెత్తున పారుతుంది!" "పొలం నాటువేసే పడతినుండి దేశాన్నేలే నేత దాకా.... మళ్ళీ అంతా నేనై ఆవహిస్తున్నా!" "ఆడది...అబల...స్వాతంత్రమా.. అని నవ్విన నోళ్ళు ఇప్పటికే గుక్కపట్టుకొని ఏడ్వడం ప్రారంభించాయి!" "విలువలను వెదుక్కుంటూ వెళ్ళే ప్రయాణంలో ప్రస్తుతం నువ్వో పాత్రవు మాత్రమే అయ్యావు!" "కేవలం ఆర్థిక స్వాతంత్రనికే" దాసోహమైన పురుష ప్రపంచానికి ఇప్పుడు నేనో గట్టి పోటీని! "అన్ని కార్యాలనూ అవలీలగా చక్కదిద్దే భారతనారీని!" "ఇప్పుడు ఆకాశమూ నాదే... అంతుచిక్కని అద్భుతమూ నేనే!" "ప్రకృతిని చదవడానికి ఇకపై ఎన్ని జన్మలు ఎత్తాలో నీ ఉనికి మళ్ళీ పూవులా పరిమళించాలంటే!" 20-5-2014

by Aruna Naradabhatlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkZmro

Posted by Katta

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || ఒక మధ్యాహ్నం, ఆమె || 1 నా గదిగోడలూ, వెలుపలి చెట్లూ వాటిమీద వాలుతున్న మధ్యాహ్నపు ఎండా మనుషుల భయాలూ, అవి సృష్టించే అడవినీడల్లాంటి ఊహలూ, వ్యూహాలూ యధావిధిగా భద్రంగా ఉన్నాయని నమ్ముతున్నవేళ ఆమె ఫోన్ చేసింది 2 'మీ కవిత్వం చదివాను మీ ఊహలన్నీ ఇంతకుముందే ఊహించాననిపిస్తోంది నేను గతంలో ఉన్నానా, మీరు భవిష్యత్తులో ఉన్నారా ' అని అడిగింది నాకూ అర్థంకాని సమాధానమొకటి చెప్పి నన్నొక నైరూప్యకవితలోకి నడిపిస్తున్న ఆమె మాటల్ని వింటున్నాను ఏ కొండమీది బౌద్ధాలయంలోనో ఖణాలున మ్రోగిన గంటారావం ప్రశాంతసమయంలోకి ప్రశాంతంగా కరిగిపోతున్నట్టు స్వచ్ఛ శ్రావ్య కంఠస్వరంనుండి వికసించిన మాటలు నాలో కరిగిపోతున్నాయి 3 'నేను ఉదయం నిద్రలేస్తానా నాలోంచి ఎందరెందరో వెళ్ళిపోతుంటారు, ఏవో చెట్లూ, జంతువులూ కూడా అన్నీ వెళ్ళిపోయాక నేను లేస్తాను ఎప్పుడూ నాతో మొక్కలూ, చీమలూ, గోడలూ ఏమో చెబుతుంటాయి' నా వెలుపలి, లోపలి ప్రపంచాలని చెరిపేస్తూ నాకు తాజా చూపునీ, ఊహనీ ప్రసాదిస్తూ ఆమె చెబుతూవుంది 4 'కొన్నాళ్ళు ఎక్కడికో వెళ్లిపోయాను, గదిలో పెట్టి తాళం వేసారు కొన్నాళ్ళు పిచ్చి అన్నారు కొందరు, కొందరు సైన్సు అంటున్నారు నాకేమీ అర్థం కావటం లేదు, చెప్పండి నాకు పిచ్చివుందా ' ఇంత నిసర్గమైన మాటలు విని ఎన్నాళ్ళయింది ఇంత నిర్మలమైన, దయ పుట్టించే కంఠం విని ఎన్ని రుతువులు గడిచాయి అనాది అమాయక బాల్యపురాశి నుండి నా వంతు నేను పంచుకొని అనుభవించిన తొలిరోజుల్లోని నా కంఠమూ, అమాయకత్వమూ ఆమె మాటల్లో చూసుకొంటున్నాను 5 ‘లేదమ్మా, నువు ఆరోగ్యంగా ఉన్నావు నీ ఊహలు, నీ వాస్తవానికన్నా శక్తివంతంగా ఉండటం మినహా నువు చాలా బాగున్నావు ' 6 ఎక్కడి ఆమె, ఎక్కడి నేను, ఏ జన్మాంతరాలలోని దయగల బంధం ఏ తల్లీబిడ్డల బంధం, ఏ తండ్రీకూతుళ్ళ బంధం ఇవాళ మా మధ్య మేలుకొంది ఇంకా ఏమో విన్నాను, ఏమో చెప్పాను 'భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా ' నా చివరిమాటతో మా సంభాషణ ముగిసింది భగవంతుడు లేకున్నా ఆ దయనిండిన క్షణాలనుండి పుట్టే వుంటాడు ఆమెని చల్లగా చూస్తాడు 7 భద్రమైన భయాలతో బ్రతుకుతున్న నా ప్రపంచం మంచిదా భయమెరుగని అమాయకత్వం నిండిన ఆమె ప్రపంచం మంచిదా నా గదివెలుపల గోడలమీదా, చెట్లమీదా వాలుతున్న మధ్యాహ్నపు ఎండ నా జీవితాన్ని కాసేపు వెలిగించి మరికొన్ని నీడల్ని మిగుల్చుతూ మాయమవుతోంది http://ift.tt/1h2X6AP 20.5.14

by Bvv Prasadfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2X6AP

Posted by Katta

Uday Dalith కవిత

#ప్రశాంత సంజ్ఞ# ప్రేమ నువ్వు విశ్వ వ్యాపిత సుగంధానివే మా మనసుల్లోని మైలను సూర్యరశ్మి కంటే ప్రజ్వలమైన ప్రజ్ఞోదయంలో సమూలంగా తుడిచివేసావు ఇప్పుడు అతి స్వచ్ఛత పొందిన హృదయాలు మావి కలయికలోనే వీడలేక ఒక్కటై భీకరమైన పొంగుతున్న జలపాతాలు యివి ఉరిమే మేఘాలను సైతం వణికిపోతూ ఎదిరించి జంటగా పూచిన సౌరభాలు ఇవి మానవతారాహిత్య విలువలకు అతీతమై స్వర్గ సుఖాల శోభలకు విముక్తి తామై ప్రపంచ జాడ్యాలను లోకాలకు విసిరివేసి స్వేచ్ఛగా ప్రేమ పతాకాన్ని ఎగురవేసిన హృదయాలు మావి ఉదయ్ 20.05.14

by Uday Dalithfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQSV0r

Posted by Katta

Sreekanth Yadav Talasani కవిత

http://ift.tt/1lXETcn

by Sreekanth Yadav Talasanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lXETcn

Posted by Katta

Arun Nallella కవిత

కవిత నా మన్స్సున గతం కదలాడినపుడు నా కలమున అక్షరాలు నట్యం చెసినపుడు కాగితం అనే వెధికపై వటిని నర్తింపజెస్తాను నా ఉహల తోటలో విరబూసిన పుష్పాలన్ని గ్రంధాలు తిరగెస్తే రాధు కవిత్వం పురానాలు చదివితే రాదు కవిత్వం మనస్సులో ఎక్కడో గతం కదలాడినపుడు మదిలొ అక్షరాలు నాట్యం చెసినపుడు ఆ గ్నాపకాల దొంథరని కూర్చినపుడే కవితా మాలిక ఉద్భవిస్తుంది ... 20.05.2014 అరుణ్

by Arun Nallellafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQH0jc

Posted by Katta

Rajender Kalluri కవిత

## యలమందా ## మందెంట పోతుండే యలమందా వీడు ఎవ్వారి కొడుకమ్మ యలమందా బతుకు బాట వట్టె యలమందా బండెడు బాధ్యతేందో నెత్తిన ఈనికి ఎలమందా గొర్ల గాయ పాయ యలమందా గొర్ల తోడా సంటిపిల్లడాయే ఓ యలమందా మాట నోట రాదూ యలమందా మంది కంట్ల కానారాడు యలమందా బిడ్డను చూడపోతే యలమందా కంట్ల నీరు గారవట్టే యలమందా !! kAlluRi [20 - 05 - 14 ]

by Rajender Kallurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j4xZ0o

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

ఆటా సావనీర్ -2014 లో ప్రచురణకు ఎంపికైన కవితలు. కవులందరికి అభినందనలు. కవిత్వం: 1. దుబ్బ కాళ్ళు – అన్నవరం దేవేందర్ 2. మనిషి అరణ్యం – బాల సుధాకర్ మౌళి 3. ఒకే మెలకువ – బి వి వి ప్రసాద్ 4. ఒక్క రోజైనా – దర్భశయనం శ్రీనివాసాచార్య 5. అమ్మ సంతకం – దాసరాజు రామారావు 6. ఎకోన్ముఖం – విన్నకోట రవిశంకర్ 7. జననం - గరిమెళ్ళ నాగేశ్వరరావు 8. సీతకుంట – మామిడి హరికృష్ణ 9. అమ్మకానికి బాల్యం - కె.వరలక్ష్మి 10. కవి గొంతు విందామని - కే శివారెడ్డి 11. లెక్కలు – దేవీప్రియ 12. లేపనం – బండ్ల మాధవరావు 13. తామరాకుపై నీటిబొట్టు – మానస చామర్తి 14. సముద్రాంబర – మెర్సీ 15. నాలాగే నువ్వూ – మొహన తులసి 16. శైశవగీతి – మౌనశ్రి మల్లిక్ 17. నాతో నడిచిన ఉదయం – శిఖా ఆకాష్ 18. డిల్లీలో వర్షం – డా. ఎన్. గోపి 19. వలసపక్షి – నిషిగంధ 20. మూసిన తల(లు)పుల వెనుక – పద్మా శ్రీరాం 21. మౌనశిఖరాలెదురైనప్పుడు – పాయల మురళీకృష్ణ 22. పరిమళ భరిత కాంతి దీపం – పెరుగు రామకృష్ణ 23. కొందరుంటారు… ప్రసూనా రవీంద్రన్ 24. తెలుపు కోరిక - డా.పులిపాటి గురుస్వామి 25. వేలి ముద్ర – రామా చంద్రమౌళి 26. నైపుణ్యం – ర్యాలి ప్రసాద్ 27. పచ్చని తోరణాల పందిరి ! - సిరికి స్వామినాయుడు 28. ఆకుపచ్చని సముద్రం – కందుకూరి శ్రీరాములు 29. కాలమైపోయింది – నారాయణస్వామి వెంకటయోగి 30. వీడ్కోలు వేళ – స్వాతీ కుమారి బండ్లమూడి 31. సెల్ఫీ – తైదల అంజయ్య 32. స్ప్రింగ్ ఫెస్ట్ - వైదేహి శశిధర్ 33. వాళ్ళు ముగ్గురు – శిఖామణి 34. వెలలేని చూపులు – విమల 35. ఒలికిన పద్యం - యాకూబ్

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lIlCtz

Posted by Katta

Krishna Mani కవిత

పటేలా ! _________________________కృష్ణ మణి మొగులుమీదినుండి దిగొచ్చిన సందమామలెక్కున్నవు పటేలా ఈ తెల్ల బట్టలల్ల ఏడ లేడు నీయసొంటి దొర నడుస్తే పెద్దేనుగులు పందికోక్కోలె ఉరుకుతయి సందులెంట బాంచెన్ దొర నీ కాళ్ళు మొక్కుత ! మాలెసపొద్దుకు ముందే మీ గడీల తల దించెటోళ్ళం పటేలా మాతోలు పీకి చెప్పులు కుట్టిస్తం దొర శేరు గుంజాలకు గులాంలము పటేలా పేరుకు మల్లయ్యను మీకాడ మాదిగి మల్లిగాన్ని దొర ! కడుపుకి కష్టం దప్ప ఇంకేమిలే మాదొర మీ సుఖాలను జూసుడే మా సుఖం పటేలా ! దేవునివి పటేలా నీ బండి సప్పుడికి చెప్పులిడిషి నెత్తి ఒంచుతం పటేలా ! నీకన్ను బడితే పక్క పాన్పులే దొర కన్నేర్రజేస్తే కాటికే పోతం పటేలా ఒగనికష్టం ఇంకోగరం సేప్పుకుబతుకుతున్నం దొర పగాని ముచ్చటలేని పసిపోరాలం పటేలా ! పాట పాడి ఆటలాడుతాం దొర సగంల నువ్వొస్తే అలసిన పానాన మల్ల మొదలైతాది పటేలా నువ్వు జెప్పిందే ఏదం నువ్వు అన్నదే నాయం దొర లోకం ఎరుగని ఎడ్డి గోర్రెలం పటేలా ! అని పల్వరించే మా తాత నిద్రమత్తుల మరువని మచ్చలు యాదికొచ్చి కుములుతున్నడు ఆ రోజుల్ల నేనుంటే తేజాబ్ కత్తినైతుంటి ! కృష్ణ మణి I 20-05-2014

by Krishna Manifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1naH1RJ

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || గ్రీష్మం || గమనిస్తూనే ఉంటారు అప్పుడు కొమ్మల నుండి ఆకులు రాలడాన్ని ఎవరూ వీటిని పట్టించుకోరు కనీసం చేతులలోకి తీసుకొని ముద్దాడరు వాటి లోపలి పొరల్లోనికి తొంగి చూడరు దాచబడిన పచ్చదనాన్ని పులుముకోరు గాలికి ఎగురుతున్న ఎండుటాకులు ఏదో చెబుతుంటే ఆగి వినరు ******* ఎన్నో సంవత్సరాలు పెంచి ఉంటావు పచ్చని ఆశలనో, నవ్వులనో నీ కొమ్మలకు ఇకపై ఎలా నవ్వాలో నేర్పకుండానే రాలిపోతుంటే చూస్తూ చిగురించడం నీకు అలవాటైపోయింది కదూ ******* వసంతానికి గ్రీష్మానికి నడుమ ప్రపంచం ఏదో రహస్యంగా దాచి పెడుతుంది చాంద్ || 20.05.2014 ||

by Chand Usmanfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kjUFyi

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ సిరుల వెన్నెల కురిసే వేళ॥ ఆయన హృదయం సాహిత్యపు స్వర్గానికి స్వాగతించే సిరుల సింహ ద్వారం ఆయన వ్రాసే ప్రతి గీతం పరవళ్ళు తొక్కే అమృత నదాల తీయని ప్రవాహం ఆయన పద విన్యాసం భరత వేదమున నిరతం నర్తించే నాట్య మయూరం ఆయన కవిత్వం తెలిమంచులా కరిగించే సూర్యభగవానుని వెచ్చని చరణ కిరణం ఆయన కవనం విరించి కలంనించి జారిపడే ఓంకార నాదపు స్వర మాధుర్యం ఆయన అక్షరం మనోవనాల్లోకి వసంతాన్నితరలించే పచ్చని ప్రకృతి పారవశ్యం ఆయన ఆవేశం అర్ధ శతాబ్దపు అజ్ఞానంపై ఎక్కుపెట్టిన ఆశయాల అగ్ని బాణం ఆయన మనోసౌందర్యం శత దళాల వికసించే సుందర సుమఫల సువర్ణ కమలం ఆయన వివేకం జగమంత కుటుంబాన ఏకాకి జీవితం గడపగల నేర్పరితనం ఆయన వైరాగ్యం సంసార సాగరాన సంగమించే సన్యాసపు శూన్యం ఆయన భక్తి తత్వం సంగీత సాహిత్య సమలంకృతమైన స్వర పదార్చనం ఆయన నైరాశ్యం కన్నులనే వెలివేసి కరిగిపోయే కలల కన్నీటి విహారం ఆయన ప్రేమభావం నిశీధిలో ఉషోదయాన్ని చూపగల సిరి వెన్నెల సుసామ్రాజ్యం ......... అక్షయ పాత్రలా అనంతమైన భావాల్ని అలవోకగా అక్షరాలతో వడ్డించే ఓ అసామాన్య ప్రజ్ఞా శాలీ ... మీ కీర్తి కిరణాలు వేల వేల వసంతాలు వన్నెతరగని వైభవాన వెలుగొందాలి మీ కవన వనాలు సుమబాలల కిలకిల రవాలతో కలకాలం విరబూయాలి మీ వంటిలో ఆయురారోగ్యాలు,మీ ఇంటిలో అష్టైశ్వర్యాలు పసిపాపలై పదికాలాలు పరవశాన పారాడాలి ఇదే మీ ఏకలవ్య శిష్యుల ఏకైక ఆకాంక్ష !!!!! సిరివెన్నెల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో -భవానీ ఫణి 20. 05. 2014

by Bhavani Phanifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kjUFy8

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్..>>>>>>>> ||తిరోగమనం || ================================= జ్ఞాపకాలు ఒక్కోసారి గునపాలై గుచ్చుకుంటున్నాయి గుండె పొరల్లో దాచుకున్న ఆశల దొంతరలు ఒక్కొక్కటి తరిగిపోతున్నాయి కాలం కంగారై పరిగెడుతోంది ఎడారి స్వప్నం కళ్ళముందే కదలాడుతుంది కాలే కడుపులు దహించుకుపోతున్నాయి ఎప్పుడో గుచ్చుకున్న ముళ్ళు ఇప్పుడు ధనుర్వాతమయ్యింది పాదాలు రక్తం చిందుతూనే ఉన్నాయి కులమే క్యాన్సరై వెక్కిరించింది కులచికిత్స లేని పల్లెలు మూగబోతున్నాయి మట్టివాసన మాత్రం ముక్కుపుటల్ని కట్టిపడేస్తుంది అంకురాలు కేళీలవుతున్నాయి ఎక్కడో సముద్రంలో జరిగే తరంగాలు విని కుక్కలు అరుస్తున్నాయి శకునమనుకునే సాహిత్యం క్షుద్రమై శనిలా దాపురించింది కులరాజ్యం రేబిస్ లా ఆజ్యం పోస్తుంది తామరాకు మీద నీటి బిందువు జీవితమై తొణికిసలాడుతుంది ఎటూ దిక్సూచి లేని గమనం, పయనాన్ని ప్రశ్నిస్తుంది కాల గమనం లో మార్పులు శస్త్ర చికిత్స కోసం అన్వేషి స్తున్నాయి నల్ల రేగడి బీటలు తీసింది ఎదురు చూస్తున్న కళ్ళల్లో దైన్యం అధైర్యమై పరుగులు తీసింది నాడులు కొట్టుకుంటున్నాయి నరాలు ఒకే రక్తాన్ని ప్రవహిస్తున్నాయి తరాలు మారటం లేదు అంతరాల మధ్య ఆగిపోతున్నాయి భూమి గుండ్రం గా ఉందన్న గెలీలియా ఆపిల్ ద్వారా గురుత్వాకర్షణ కనిపెట్టిన న్యూటన్ జీవపరినమ క్రమాన్ని చెప్పిన డార్విన్ మళ్ళా పుట్టరేమి ? అవున్లే ! ఇప్పుడు కూడా ఖగోళాన్ని ముహూర్తాలతో తాకట్టు పెట్టేసారు భూములకు కూడా రెక్కలు కట్టేశారు అప్పుడు వానర పరిణామం నరుడైతే ఇప్పుడు నరుడే వానరం గా మారుతున్నాడు తిరోగమనం లో తస్మాత్ జాగ్రత్త ! =================== మే 20/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQcQwn

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: తస్మాత్ జాగ్రత..జాగ్రత..: సెక్యులర్ మతానికి కొత్త దేవుడోచ్చెను..! రజాకర్ల రక్తానికి కొత్త వన్నే తెచ్చెను..!! సెక్యులర్ పైత్యం తెరాస నశాలమునకెక్కెను..! ఓటర్ల ఆశలను పాతాళమున కుక్కెను..!! గ్రేటరు హైదరబాదే అసలయిన లక్ష్యం..! పవరు దక్కుతుందంటే పందిని నంద్యనుట కద చోద్యం..!! అన్యుల మతముల దిట్టిన అసదొద్దీను అసలయిన సెక్యులర్..! క.చ.రా. ఈ కథలను మనం విని బ్రతుకీడ్చుట ఇంకా పెక్యూలియర్..!! హతవిధి ఓ ఓటరు ఏమిటి నీ స్తితి..! వేసావా ఓటును అసలు నీకున్నదా మతి..!! సెక్యులర్ భూతం చూస్తే మళ్ళీ కమ్ముకుంటున్నది..! ఏదయినా మన మంచికే ఇక చుసుకుందాం పద లెమ్మన్నది..!! 20/05/2014

by Kontham Venkateshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mQcQfZ

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||దాపరికపు జాడ|| అక్కడే ఆగావేం ...... చూడు చూడు నీ నీడఎలా మెట్లెక్కి పోతుందో గమ్మత్తేమిటంటే నీ పాదాలకే వేలాడి వేలాడి ...చివరికి ఉరి తీసుకొంటుంది నిజం చెప్పనా .... పాపం సూర్యుడు వెలుగు కుంచెలతో .....నీ బొమ్మ గీసి గీసి అలసిపోతాడు నీవేమో .....నీ వెలుగును నీడ బుజాలకెత్తి మలిగి పోతావు వెలుగు,నీడల,యుద్దం లో ...అడుగు జాడలవై మిగిలిపోతావు

by Kranthi Srinivasa Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jP9sMN

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వ """""""""" కులాగ్ని ఎప్పుడూ మండుతూ ఉండేలా ఎగదోస్తూ వాళ్లోసారి వీళ్లోసారి """""""""""""""""""""""""""" వాధూలస 20/5/14

by Rammohan Rao Thummurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p7wunn

Posted by Katta

Rajaram Thumucharla కవిత

కవి సంగమం చదివిన కవిత్వ సంపుటి :- 29 కవిత్వ సంపుటి పేరు " సూర్యోదయానంతరం "(కవిత్వం ) సంపుటి రాసిన కవి "డాక్టర్: ఎస్.షమీ ఉల్లా " పరిచయం చేస్తున్నాది " రాజారామ్.టి "సముద్రపు గొంతులో జల తంత్రుల ధ్వని ష మీఉల్లా కవిత్వం "గుర్తుకు రావట్లేదా నే నెవరో నీకు?"- గట్టిగా దబాయించి …………………………… ప్రశ్నించిన మరుక్షణం ( వెంటాడనిదే ) గుర్తుకు......వచ్చే కవి నాకు షమీఉల్లానే. తమ ఇంట్లో మాట్లాడే భాష ఉర్దూ అయినా తాము నిలబడ్డ నేల భాషలో సజీవ కవిత్వం రాస్తున్న అఫ్సర్, యాకూబ్ ల తరువాత స్కైబాబ ,అన్వర్ ,బా రహంతుల్లా , మహజబీన్ , షాజహానా మున్నగు కవుల వరుసలో నిలువదగ్గ మంచి కవి ష మీఉల్లా. అణగారిన గొంతుకల పట్ల ఆర్తిని ,ముక్కలవుతున్న మానవ సంబంధాల పట్ల నిరసనని, జీవితాన్ని శాసిస్తున్న వ్యాపారధోరణుల పట్ల తిరుగుబాటుని షమీఉల్లా తన కవిత్వంలో పలికిస్తాడు కాబట్టే నేను ఇష్టపడతాను.అంతేకాదు ఏ కవి సమ్మేళనంలోనయిన తనదయిన గొంతుతో ఎలాంటి పేపర్ లేకుండా ఏ మాత్రం తడబడకుండా కవితను చదువుతూ శ్రోతల హృదిలోపలి గోడల్ని తాకుతాడు. "రెండు సంధ్యల మధ్య" గుండెలోని "ఆరని తడి"తో పసి "పాప" "మనసుతనం"తో "నిర్భయంగా" "రహస్తంత్రి " ని మీటుతూ "సూర్యోదయానంతరం " "అంతంతోనే మొదలవుతుంది " అనే "ఒక వెంటాడే విశ్వాసం " తో "తంగేడు పూల చెట్టు " లాంటి " పచ్చని "అతడి పాట" లోని "అత్తరు వాసన "వంటి కవిత్వాన్ని "తుమ్మముళ్ళు" లాంటి "ఒకానొక సందర్భం "వెంటాడనిదే " హృది "గది లోపల" నుండి కవిత్వం విరజిమ్మని అద్భుత కవి ష మీఉల్లా. పాట తూటలాంటిది. తూటా శరీరాన్ని చిధ్రం చేస్తే పాట హృదయపులోతుల్లోకి దూసుకపోయి బ్రతుకు చిత్రన్ని గీయడమో,ఘనీభవించిన దుఃఖాన్ని కలిగించడమో,సంతోషపు దీపకళికను వెలిగించడమో చేస్తుంది.పాట పాదానికీ గజ్జెకట్టిన గద్దర్ పాట షమీఉల్లా హృదయాన్ని జ్వాలా వలయంగా చుట్టుముట్టి మంటయి ప్రజ్వరిల్లి అతన్నొక సంక్షుభిత సాగరం చేసింది.ఆ వయసులో అతడి పాటకు పూర్తిగా లీనం కాని వాళ్ళు ఎవరైనా వుంటారా?.ఈ కవి గుండెతీగలను గద్దర్ పాట లాగి లాగి వదిలింది.ఆ గుండె తీగల ప్రకంపనమే ఈ సంపుటిలో " అతడి పాట "-అనే కవిత. ఒక పాట విన్నప్పుడు కలిగిన అనుభూతులను పట్టుకొని కవిత్వంలో నిలిపిన కవుల వరుసలో షమీఉల్లా కూడా చేరుతాడు. సైగల్ పాట కెరలించిన అనుభూతిని భావ గాఢతతో అఫ్సర్ కవిత్వం చేస్తే షమీఉల్లా గద్దర్ పాట తాకిడి తనలో రేపిన ప్రభంజనాన్ని చైతన్య సాంద్రతతో దుఃఖపు తడిని అద్ది కవిత్వం చేశాడు. "చెబితే నమ్మవు. కానీ!లీలగా మొదలయిన పాట జ్వాలా వలయాలుగా రగుల్కోవడం ప్రారంభమైంది. (అతడి పాట ) ఇలా ప్రారంభమయ్యే ఈకవితలో "అతడి పాట " మునుపెన్నప్పుడూ లేనంతగా కవిలో ఒక అలజడిని లేవనెత్తి "పాట నిండా ఘనీభవించిన దుఃఖమే" పొర్లిపోయే సన్నివేశాలని,"కొడిగట్టిన దుఃఖాల దైన్యాలు గుండెలో మేకులై దిగబడే" సందర్భాలని దర్శింప చేసి కవి ఆనందాన్ని కొల్ల గొట్టిందట. "మంటయి ప్రజ్వరిల్లిన పాటనిండా బ్రతుకును కాటేసిన గాట్లు కన్పించాయి. పాటలో వీరుల్ని సంకెళ్ళు కరచిన వైనం చూశాను. తెగ్గోయబడ్డ తలలు విరగొట్టబడ్డ మోకాళ్ళు దీప కలికలై పాటలో లయిస్తుంటే కొడిగట్టిన దుఃఖాల దైన్యాలు గుండెలో మేకులై దిగబడుతున్నాయి" అంటూ షమీఉల్లా అతడి పాట గీసిన దుఃఖ దృశ్యాన్ని అక్షరాలుగా మార్చాడు. "ఈదురు గాలి తాకిడికీ కిటికి రెక్కలు కొట్టుకున్నట్లు"-అని అనటంలో కవిలో రేగిన అలజడిని స్ఫురింపచేస్తాడు ఈ కవి.అతడి పాటలో కవి తనను తాను వడబోసుకొని తనవీతీరా జీవితాన్ని దర్శించినక్షణం మనకు ద్యోతకమవుతుంది కవితని పరిపూర్ణంగా అర్థంచేసుకుంటే. గద్దర్ పాట కవిలో రేపిన విషాదభరిత విప్లవచైతన్యాన్ని వ్యక్తీకరించిన కవిత ఇది. ఏ కార్యనికైనా ఒక కారణం వుంటుందనిచాలమందినమ్మకం.ఈకవికూడాఒకపాపపక్షిలాగిరికీలుకొట్టడానికీ,ఏటినురగస్వఛ్చంగావుండటానికీ,నవ్వుల రూపంలో పువ్వులు పూచే లక్షణమేదో వుండటానికీ,ఆకులా గలా గల నవ్వటానికీ ఏదో కారణం వుంటుందని వెదుకాలాటను "పాప "అనే కవితలో చేశాడు.ఈ వెదుకులాట ఈ సంపుటిలో చాల చోట్ల మనం గుర్తించవచ్చు మరో రూపంలో. 'బార్లా తెరిచేందుకు కిటికీలున్నట్లు తలుపులు వున్నాయ్ ఏం ప్రయోజనం?! పోల్చుకోలేనంత అస్తవ్యస్తంగా దుమ్మురేగి ధూళి పట్టిన సొఫాలు,కుర్చీలు గోడల మీద వచ్చీ రాని అక్షరాలు కన్పించీ కన్పించని సుద్దముక్కల గీతలు దండెంమ్మీద అడ్డ దిడ్డంగా వేసిన పాత గుడ్డలు సంచరించేందుకు వీలు కానంత చిందర వందరగా చించి పడేసిన కాగితం ముక్కలు పరదాల అంచుల మీద టి.వి స్టాండ్ మీద వేలాడుతున్న బూజు తెరలు చీపురు కట్టతో విదిల్చేందుకు వీల్లేనంతా దట్టంగా బాత్రూమ్ మూలల్లో పేరుకుపోయిన మట్టి దిబ్బలు నిండా చీకటి ముక్కు పుటాలదిరిపోయేలా కమురు కంపు"( గది లోపల ) ఇదంతా గదిలోపల కానే కాదు. కవే” గదికీ.. నాకూ పెద్ద తేడా లేదు”- అని చెబుతున్నాడు. ఇలా అని కవి తన నిజాయితికీ అద్దంలా ఈ కవితని నిలుపగలిగాడు.హిపొక్రసీ పేరుకొన్న లోకంలో కనీసం కవుల్లోనైన నిజాయితినీ కోరుకోవటంలో తప్పు లేదనుకొంటాను. గది లోపల అపరిశుభ్రతకు, అంతరంగంలోని అపరిశుభ్రతకు తేడా లేదని చెప్పడానికీ గదిని అంతరంగానికీ ప్రతీక చేశాడు షమీఉల్లా.తనలోకి తాను తొంగిచూసుకొనే ధైర్యం,నిజాయితీ ఈ కవికీ ఉంది కాబట్టే అలా తొంగిచూసుకున్నప్పుడు అంతరంగం గదిలా వీలుకానంత చిందర వందరగా వుందని ,అనవసరమైన వస్తువుల్లా అనవసర ఆలోచనలూ,తొలగించాల్సిన బూజులా మదిలోని భావనలు వున్నాయని షమీఉల్లా చెబుతాడు." లోనికెల్దామంటే గదియెప్పుడు శుభ్రపడ్తుందో నా కయితే తెలియదు"-అనే సందేహాన్ని వెలిబుచ్చుతూ "ఒక ఎదురుచూపు ఒక ఆశ "-అనే ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేశాడు." గాలి,వెల్తురు సోకకపోతే ఏ గదియైనా ఇలాగే వుంటుందేమో?"-అని అనటంలో గాలి కున్న వీచే లక్షణం వుండటం వల్లా చింతన వీయబడాలని, వెల్తురుకు ప్రసరించే గుణం వుండటం కారణంగా ఙ్ఞానం విస్తరించాలని అలా జరిగినప్పుడే గదిలా అమ్తరంగం శుభ్రపడుతుందని కవి ఆలోచన.ఇట్లా ఎవరికీ వారు తమ అంతరంగంలోని అపరిశుభ్రతను తొలగించుకోగలిగితే లోకమంతా ప్రశాంతంగా వుండదా? అని అనిపిస్తుంది నాకు. "సమావేశం పూర్తయ్యేసరికి ఆ ప్రాంతమంతా కోలాహలమౌతుంది. ఒకర్నొకరు కాగడగా మండించుకుని విడిపోతారు ఎవరికీ వారు... విశ్వాసాల గుర్రాలెక్కి" ఎవర్ని గురించి రాశాడో ఈ వాక్యాలు సులభంగా పాఠకులు పట్టేయగలరు."సమావేశం"-అనే కవితలోని వాక్యాలివి.పీడిత,తాడిత జనాల విముక్తి కోసం పోరాడే యోధుల సమావేశాలు ఎలా వుంటాయో వారి సమావేశంలో పాల్గొన్న ఈ కవి తన అనుభూతిని ఇలా అభివ్యక్తంచేస్తాడు. "చుట్టూరా చూపుల ఫిరంగుల్ని సిధ్దం చేసి ఒక్కొక్కరే లేచి మాట్లాడుతుంటారు. ఆ మాటలకి ఉవ్వెత్తున ఎగిసిపడ్తూ.. తక్కినవారు పాశుపతాస్త్రాలు ధరించిన యోధులవుతుంటారు" "డేగ చూపుల్ని సారించి /తుపాకులు, లాఠీలు,ఇనుప టోపీలు.../గూఢాచారుల్లా వెంటాడటం వారికి తెలుసు"-అని అంటూనే వారు ఎంత అప్రమత్తతో వుంటారో కూడా ఈ కవితలో నిక్షిప్తం చేస్తాడు. "వారి నరనరాల్లో కలకలం రణతూర్యమై ప్రతిధ్వనిస్తుంటుంది వారి మాటల డెక్కల కింద మానసికోల్లాసం ముక్కలయినప్పుడల్లా నేను విస్మయానికి లోనవుతుంటాను." అనే షమీఉల్లా అట్లాంటి సమావేశాల్లో తన నిజానుభూతిని చాలా కళాత్మకంగా కవిత్వం చేశాడు ఎలాంటి భయోద్విగ్నతకు గురికాకుండా. "మృణ్మయ పాత్రల్లా ఎన్నిమార్లు ముక్కలయ్యానో ఫెళ్ళున! అనుభవాలకేం కొరత లేదు"-అని అంటున్న ఈ కవి"ఒకానొక సందర్భం"లో "పల్లవించిన ప్రతి ఆకూ ఆగమనానికీ ఆహ్వానమని భ్రమపడి" "మాటలు చాలు మనిషిని చంపడానికి ఈటెలా" అనే సత్యాన్ని కలలకు నిప్పంటుకున్నాక గుర్తిస్తాడు.తడిసి ముద్దయి పోవడానికీ ఒక స్వప్నాన్ని కొంచెం సత్యాన్ని మిగుల్చుకోలేకపోయానని తల్లడిల్లి పోతాడు.ఒక మార్మికతను ఈ కవితలో నింపి షమీఉల్లా రాశాడేమోననిపించింది నాకు. "వాళ్ళలో ఏ ఒక్కరైనా నా భుజమ్మీద చెయ్యి వేసి వీపు నిమరకపోతే నాలో అన్ని వైపులూ మూసుకపోయేవి ఒక పరివ్రాజకుణ్నై అంధకారంలో కల్సిపోయేవాణ్ని తలా ఒక చెయ్యి వేసి చేర్చక పోతే కదన కుతుహలమై కవాతు చేయకపోయే వాన్ని." ఇలా ఈ కవి తనని క్షిపణిగా మలిచిన వాళ్ళని,తనని శత్రుదుర్భేద్యమయిన కత్తుల కవచంగా తీర్చిదిద్దిన వార్ని,తనని ఓ మంటగా పోగేసిన వాళ్ళనీ తలచుకొని కృతఙ్ఞతని వారి పట్ల ప్రకటిస్తాడు.వారెవరో కాదు తాను ఎవరి సమావేశం పాల్గొన్నాడో వారే. మనుషులు చాల రకాలు.వాళ్ళల్లో మాటలతో బ్రతికే వారు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారో "కొందరు అంతే "-అనే కవితలో వైవిధ్యంగా చెబుతాడు ఈ కవి.మూడు క్షణాలని అరువు తెచ్చుకొని ఆరు క్షణాలు చేసి బ్రతికే వారు,రకరకాల రంగులద్ది సిధ్దాంతలను రాధ్దాంతాలు చేసి బ్రతికే వాళ్ళు,ఏ రోజైనా,ఏవేళయిన మినహాయింపులు లేకుండా కేవలం కాసిన్ని మాటలతో బ్రతికే వాళ్లు ఇలా ఎందరో మనకు తెలిసినా మనం గుర్తించలేని వాళ్ళని తాను గుర్తించి మన ముందు నిలబెడతాడు. "అబద్దమనుకుంటావేమో! అద్దమ్ముందు నిలబడి ప్రయత్నించి చూడు ఎవరు ఎవరో తేలిపోతుంది."-అని అనే షమీఉల్లా "ఎదురుగా నిలబడి అద్దంలో చూసుకోడానికి సంశయిస్తుంటాను ప్రతి రోజూ నన్ను నేను"-అని నిక్కచ్చిగా "అద్దం "అనే కవితలో మనిషిలోని ద్వైధి భావాన్ని చిత్రించడమే కాకుండా "అచ్చు నన్ను పోలిన రూపాల్లో నాగులు,మిన్నాగులు గుమ్పులు గుంపులుగా కనిపించి నాకేసి చూస్తూ నాలుక చాస్తూ బుసలు కొడతాయంటా"డు.అలా అనడంలో మనిషి మానసిక వికృత తత్వాన్నీ ఒక ప్రతీకాత్మకతో స్ఫురించేశాడు. ముఖ్యంగా రాయలసీమలో అందులోను అనంతపురంలోని కవికీ నిత్య దృశ్యాలే సాయుధ ముఠాల చెసే దాడులు ప్రత్యర్థులపైన."మా ఊరి రహదారి "-అనే కవితలో ఈకవి "పగో,కోపమో, మచ్చుకత్తితోనో,వేటకొడవలి తోనో,ముఖాన్ని చెక్కి జనం గుర్తించకుండా పొదల్లో పారవేసిన దేహం"దుర్వాసనతో ఊరి రహదారి పక్కన ఎదురుకావడాన్ని,చెరచబడ్డ శీలం అవమానంతో తలెత్తుకోలేక ఆకుచాటున కన్నీళ్ళు రాల్చే దృశ్యాన్ని ఒకటేమిటి సర్వ ప్రలోభాలకు పరీవాహక ప్రాంతమైన ఊరి రహదారిని మర్చిపోలేక విషాద సమవాకార ప్రతీకగా చేసినా,"రాగాలు కూర్చిన గంటల శబ్దాలు/రహదారికీ సన్నాయి సరాగాలయ్యేవి."-లాంటి వాక్యాలతో మోహనంగా కూడా మారుస్తాడు.ఇది షమీ శిల్ప కూర్పులో ప్రడర్శించే నేర్పే.అందుకే షమీ నాకిష్టమైన కవి మా అనంతపురంలో. "పరారీ"-అనే కవిత కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో రాసిందే. అత్తరు వాసన ముస్లిమ్ ల జీవితాల్తో ఎంత ముడిపడివుందో ,అది వారసత్వపు ఆస్తిలా చావులోనూ,పుట్టుకలోనూ పరిమళమై వారిలో భాగంగా ఎట్లా అంటిపెట్టుకుందో, అలుముకపోయిందో మైనారిటి కవి షమీఉల్లా "అత్తరు వాసన "లో ఒక లాంతరు పట్టి చూపిస్తాడు. "నా వొంటి మీది అత్తరు వాసనంటేనే కుళ్ళిన దుర్గంధం కమ్ముకొస్తుందని కదా..నువ్వంటావు. డోకొచ్చినట్లుగా తల్లడిల్లిపోతావు. తిండానికి లేకపోయినా "అత్తరుకేం తక్కువలేదు నవాబు గారికి" అనే కదా! నా గుమ్మానికి కట్టిన నీ పరిహాసపు పరదాలు" అంటూ తమ సంస్కృతిని ఈసడించుకొని గేళి చేసేవారితో "మా గుండెల్లో గూడు కట్టుకున్న చీకటి విషాదాన్ని చూశావా ఎన్నడైనా"-అని ప్రశ్నిస్తాడు చిరు కత్తిలాంటి మాటలతో.మైనారిటీల జీవితాల్లోని దుర్భరత్వాన్ని "జీవన్మరణ సందిగ్ధరేఖల మధ్య బందీయై ఎప్పటికప్పుడు ఆఖరి క్షణంగా బతుకీడుస్తున్న వాళ్ళలో కుళ్ళిన వాసన కాకుండా మంచి వాసన ఎలా వస్తంది" అనే బాకు లాంటి సమాధానం చెప్పి ఆలోచింపచేస్తాడు. "అత్తరు.. అంతుదొరకని కూడలి దాని వెనకున్న నీలిరాగం చిమ్మ చీకట్లాంటి కన్నిటీ తెర నింగికెగిసి అది నేల కొరిగిన కెరటాల కలవరింత" ఒక నిర్వేదనతో గుండే నిఘంటువు మాత్రమే చెప్పగలిగిన అర్థాన్ని ఇచ్చాడు అత్తరుకీ షమీఉల్లా. ఏ మాత్రం కవిత్వపు అలికిడైనా ఉలిక్కిపడ్తున్నారు. ద్రవంగా మారినట్లు కంటికొలకుల్లో నీరైనిలబడుతున్నారు నవ్వించినా మాటల్లో దించినా..క్షణమే! చూస్తుండగనే కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు"- షమీఉల్లా కవిత్వపు పలకరింపుతో ఇక్కడ శ్రోతలు,పాఠకులు."చావుతో కొంతమంది చస్తున్నారు చావుతో కొంతమంది బ్రతుకుతున్నారు" అనే ఒక సార్వకాలిక సత్యాన్ని చెబుతున్న ఓ షమీ "నువ్వేం మాట్లడక పోయిన ఏకాంతంలో నిన్ను నేను పలకరిస్తాను"-అని చెబుతూ ముగిస్తున్నాను. భద్రమైన జీవితం ఏర్పడితే కొందరు కవులు నాలాగా కవిత్వం రాయడం మానేస్తువుంటారు.అట్లా మారకుండా ఎప్పట్లానే కవిత్వంలో ప్రవహించమని షమీకీ అడిగాడు కాబట్టి సలహా యిస్తున్నా. వచ్చే వారం మరో సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharlafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPZxQQ

Posted by Katta

Padma Rani కవిత

చిగురువేయడమెలా? గుండెగదిలో బంధించి తలుపు మూసి తాళంవేసి గొళ్ళెం వేయ మరచినంతనే చెప్పలేనని చల్లగా జారుకుని జీవించేస్తే ఎదను కోసిన కసాయిని ఏమనుకోవాలి? సాగరమంత స్వార్థంలేని ప్రేమనే పంచినా నీటిబిందువంత నిర్మల ప్రేమనీయనన్నా అనురాగ ఆస్తుల వీలునామా అందచేస్తే కాణీకి కుదవు పెడతానంటే ఏమైపోవాలి? అనురాగపందిరిని చిక్కుల వలగా చూసి మెరిసేదంతా బంగారమని బంధాన్నివీడి బరువు భాధ్యతలు తీర్చుకునే బంధమైతే వేరులేని కాడను ఎలా చిగురింపజేయాలి? 20-5-2014

by Padma Ranifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tbswMI

Posted by Katta