పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, ఆగస్టు 2012, శుక్రవారం

ట్‌రైటర్స్‌ ||స్కైబాబ||


నువ్వూ నేనూ కలిసే
భూమి కోసం పోరాడుతున్న
వీరుల కోసం విప్లవగానం చేశాం -
నువ్వూ నేనూ కలిసే
కశ్మీర్‌, పాలస్తీనా, ఇరాక్‌
పోరాటాలను సమర్థించాం ..
చర్చలు.. సభలు.. ఉపన్యాసాలూ...
ఉద్యమ ఆవేశాల్తో ఊగిపొయ్యేవాళ్లం -
ఒకానొక సమయం ఇలా వచ్చింది
ముక్క దగ్గరా మగువ దగ్గరా
మనిషి మనస్తత్వం తెలుస్తుందంటారు..
నువ్వు ఆక్రమించిన నా నేల
ఉద్యమించేసరికి నీ నైజమూ బైటపడిపోయింది!
1
ఏకైక రక్తసంబంధాన్ని ఏడేడు సముద్రాలు దాటనిచ్చినవాడా!
అమ్మగల్లాడిన మా మట్టిమీది ప్రేమను అపహాస్యం చేస్తున్నావా?
మెత్తని నీ మాటకు మురిసిపోయేవాణ్ణి
అది చాకూ అని తేలి విస్తుపోతున్నాను
నీ ఆలింగనంలో గుండెలు విచ్చుకునేవి
ఇప్పుడు బ్రహ్మజెముళ్లు గుచ్చుకుంటున్నాయి
2
ఈ నేలే నిన్ను కవిని చేసిందంటావ్‌
ఇవాళ ఈ నేలే తన విముక్తికోసం పెనుగులాడుతుంటే
ట్రైటర్స్‌లో ఒకడివయ్యావ్‌
కుడి ఎడమల తలలూపేవాళ్ళే
ఎవడి ముందు వాడి పద్యం పాడతావ్‌
తడబడుతున్న నీ పదమే
నీ కలాన్ని నిలదీస్తుంది
3
ఏ నేల నిన్ను తన జవసత్వాల నిచ్చి
పెంచి పెద్ద చేసిందో
ఆ నేలనే తన్నేసి
పరాయి దేశం ఎగిరిపోగలిగిన గద్దా..
నీకు మా మాతృప్రేమ తండ్లాట
ఎలా సమజైతది?
4
ఒక అస్తిత్వం గురించి మాట్లాడుతూనే
మరొక అస్తిత్వాన్ని కాదనడం ఏమనిపించుకుంటుంది?!
మైనారిటీ అస్తిత్వ దీర్ఘ కావ్యమైనవాడా..
స్త్రీవాదపు రెమ్మలై రెపరెపలాడినవారలారా..
సోదర అస్తిత్వాని కొచ్చేసరికి
ఇంగితం ఆవిరైపోయిందా.. కపాలం డొల్లగా మారిందా..
*
కవి అన్నవారికి కన్నెలా మలుగుతుంది..
ఆమ్‌ ఆద్మీ రోడ్ల మీదికొచ్చి నినదిస్తుంటే
రక్తం ఉరకలెత్తకుండా ఎలా ఉంటుంది..
ఇన్నాళ్లూ విప్లవాల వేషాలేసీ
ఉద్యమాల శిగాలూగీ
ఇవాళ ముడుచుకుపోయారేం..
మిమ్మల్ని ఇన్నాళ్లూ గౌరవించినందుకు
మాకే తలవంపులుగా ఉంది-
సిగ్గూ శరం ఉన్నోళ్ళయితే
ఇన్నాళ్లూ రాసిన ఆ కలంతోనే పొడుచుకోండి
అట్లన్నా కవిత్వం పునీతమవుతుంది!

మెర్సి మార్గరెట్ ll నాలో నాకై ఆకలి ll


ఆకలి
తిమ్మిరెక్కిన వేళ్ళకి
హృదయాన్ని అర్ధం చేసుకొని
కాగితంపై సిరా పారని పూసుకొని
కలమై నృత్యం చేస్తూ
ఏదో రాయాలని

ఆకలి
రక్తాన్ని మరిగించుకునే గుండెకి
ప్రతీ స్పందనని
రక్తంలోని అరుణ వర్ణంలో ముంచి
గుండె చప్పుళ్ల నాదంలో
హరివిల్లు లాంటి భావావేశాలన్నింటితో
రక్త వర్ణమయ్యే వరకు
రమించాలని

ఆకలి
కోరికల సంద్రమైన మనసుకి
త్సునామిలా చెలరేగుతున్న ఊసులకి
ఆటు పోటుల మధ్య ఆవిరవుతూ
స్వేదంలో కలిసి బయటికెగిసినా
తనువంతా మేఘంలా మార్చుకుని
మళ్ళీ తిరిగి నింపుకోవాలని

ఆకలి
ఎదురు చూస్తున్న కళ్ళకి
తనువంతా వసంతమై పులకరిస్తూ
లేలేత చిగురుల ఆలాపనలో
మొగ్గలా మ్రోవిలా
ప్రేమగా మారి తను ఇటు నడిచి వస్తే
జన్మ జన్మల తృప్తి పొందేలా
కళ్ళ నిండా తినేయాలని

ఆకలి
నాలో నాకై
నన్ను నేను
పరిస్థితుల దాహం తీర్చడానికి
తోడేసుకుంటూ
నేనైన ఎండిన చెలమలో
తిరిగి
ఉపద్రవమై ఉద్యమమై
పొరలు పొరలుగా ఉషస్సునై
ఉదయిస్తూ
నన్నే పోగుచేసుకోవాలని
నాలో నేను
ఎందరెందరో అయి
అనేకమై అనంతమై
విశ్వజనీనమవ్వాలని
................( 30/8/2012 )

జాన్ హైడ్ కనుమూరి ||ప్రేమొక స్పర్శ||అంతగా ... అలా ప్రేమించకు

ఏముంది నాదగ్గర నీకివ్వడాన్కిస్థిరనివాసమేదీలేక

వీధుల్లో తిరుగుతున్నవాణ్ణిదేహాన్కి వస్త్రాన్ని కప్పాలనుకోకు

చలిగాలులు నిన్ను గుర్తించక వణికిస్తాయిఅప్పుడప్పుడూ

వర్షించే మేఘం క్రింద అలా తడవనీ నన్నుమేఘాల్ని కళ్ళల్లో ఆహ్వానించకు

ఉనికిని కోల్పోయి ఉప్పదనాన్నిస్తాయి

నేనివ్వగలిగిందొక్కటే

చల్లగానో, మెత్తగానో, వెచ్చగానో ఓ స్పర్శ

* * *

తహతహలాడే దేహాత్మల కోసం

తలుపులు తడుతుంటే అలిగావో! ఆదమరిచావో!ఎంతకీ తెరవని తలుపువద్ద

నా ఉచ్చ్శాస నిశ్చ్వాసాల శబ్దం వినబడుతుందా!!

..........................28.8.2012

సిద్దెంకి // బతుకు పాఠం '//
"హొం వర్కు ఎందుకు చెయ్యలేదు?"
"కాపి లేద్సార్"
"ఏంపేరు"
"పవీన్"
"తెచ్చుకొపోయినవ్"
"మా నాయిన తేడు సార్"
"మీ నాయిన ఏంపనిచేస్తడు"
"బుగ్గలు అమ్ముతడు"
"మీ అమ్మ ఏం చేస్తది"
"ఎంట్రుకల బ్యారం"
"మరెఠ్ల సదువుతవురా"
"ఇపుడేడు"
"ఎక్కద మీ యిల్లు"
"చెట్టు కిందా
"ఆ.."
"కరంటి వున్నదా"
"గుడిసె మీదికేలి పోతది"
"బట్టలు"
"పాతయి అడుక్కొచ్చుకుమటం"
"తిండెట్ల"
దొరికితె తింతం,ఉపాసముంటం"
"......."బతుకు పాఠం
"హొం వర్కు ఎందుకు చెయ్యలేదు?"
"కాపి లేద్సార్"
"ఏంపేరు"
"పవీన్"
"తెచ్చుకొపోయినవ్"
"మా నాయిన తేడు సార్"
"మీ నాయిన ఏంపనిచేస్తడు"
"బుగ్గలు అమ్ముతడు"
"మీ అమ్మ ఏం చేస్తది"
"ఎంట్రుకల బ్యారం"
"మరెఠ్ల సదువుతవురా"
"ఇపుడేడు"
"ఎక్కద మీ యిల్లు"
"చెట్టు కిందా
"ఆ.."
"కరంటి వున్నదా"
"గుడిసె మీదికేలి పోతది"
"బట్టలు"
"పాతయి అడుక్కొచ్చుకుమటం"
"తిండెట్ల"
దొరికితె తింతం,ఉపాసముంటం"
"......."
******
"తిట్టినాసరే, కొట్టినా సరే"
ఇజ్జత్ దీయకుంద్రి సార్"
"అయ్యో బిడ్డలారా!"
ఒకప్పుడు మీలాంటి నేను
ఇప్పుడు బతుకు పాఠాన్ని నేర్పుతున్న...."
******
"తిట్టినాసరే, కొట్టినా సరే"
ఇజ్జత్ దీయకుంద్రి సార్"
"అయ్యో బిడ్డలారా!"
ఒకప్పుడు మీలాంటి నేను
ఇప్పుడు బతుకు పాఠాన్ని నేర్పుతున్న...."" బతుకు పాఠం"
"హొం వర్కు ఎందుకు చెయ్యలేదు?"
"కాపి లేద్సార్"
"ఏంపేరు"
"పవీన్"
"తెచ్చుకొపోయినవ్"
"మా నాయిన తేడు సార్"
"మీ నాయిన ఏంపనిచేస్తడు"
"బుగ్గలు అమ్ముతడు"
"మీ అమ్మ ఏం చేస్తది"
"ఎంట్రుకల బ్యారం"
"మరెఠ్ల సదువుతవురా"
"ఇపుడేడు"
"ఎక్కద మీ యిల్లు"
"చెట్టు కిందా
"ఆ.."
"కరంటి వున్నదా"
"గుడిసె మీదికేలి పోతది"
"బట్టలు"
"పాతయి అడుక్కొచ్చుకుంటం"
"తిండెట్ల"
దొరికితె తింటం,ఉపాసముంటం"
"......."
******
"తిట్టినాసరే, కొట్టినా సరే"
ఇజ్జత్ దీయకుంద్రి సార్"
"అయ్యో బిడ్డలారా!"
ఒకప్పుడు మీలాంటి నేను
ఇప్పుడు బతుకు పాఠాన్ని నేర్పుతున్న...."

రాళ్ళబండి కవితా ప్రసాద్ కవిత


ఆ అమావాస్య రాత్రి ఇద్దరమే చీకట్లో ఎడం ఎడం గా నడుస్తున్నాం.
అప్పుడప్పుడు నీ నవ్వు చంద్రుడి లా వెలుగుతోంది.
ఇద్దరం మెత్తటి చీకటి తివాచీల మీద నడుస్తున్నాం.
మన మధ్య మౌనం లో బోలెడు సంభాషణలు.
ఇద్దరి మధ్య కిక్కిరిసి పోతున్న ఊహల సమూహాలు.
ఒక మహా జ్ఞాపకం మన లోకి ప్రవేశిస్తున్న నిశ్శబ్దం.

వెలుతురు లోకి శరీరాలు వొచ్చేశాయి .చెరో దారి .
ఇప్పుడు నీనవ్వు ఆకాశం లో సూర్యుడు..

మనిద్దరం ఒకే జ్ఞాపకానికి వేలాడే రెండు శరీరాలం.

ఐనా విడదీసే వెలుతురు కన్నా ,
కలిపి ఉంచే చీకటి మిన్న కదూ!

నందకిషోర్||ఖబడ్దార్||


అన్నా! మాఫ్జెయ్.
నువ్వు సదివినంత మేం సదవలే.
నీకెర్కినంత మాకెర్కలె.

ఇగ్రహాలిరగ్గొడ్తం
అద్దాల్ పగలగొడ్తం
బస్సుల్ తగలబెడ్తం
నీ బాంచన్..

ఎంతజేసి గద్దె మీద
యేడిబుట్టకపోతే
బతుకుల్ భి అంటుబెట్టుకుంటం!
బాధల్ని తల్సుకుంటనె సస్తం!

ఎంత దుక్కం మా జిందగీల..
ఇంట్ల కూసుండి లైవ్ సూసెటోల్లం కాదైతిమి.
కెమెరాల మొకంబెట్టి తీసెటోళ్ళం కాదైతిమి.
సచ్చేందుకన్న భయపడే
లౌక్యం అసలేలేని దునియా..

ఉద్యమం జిందాబాద్ అనాల్నాయె.
ఉపాసం దీక్షల పండాల్నాయె.
ఎవ్వడో ఒకడొచ్చి యేల్బెట్టిపోతె
లాఠీని,తూటాని సూడాల్నాయె.

ఉరికిచ్చి కొడతాంటె ఉర్కాల్నాయె
రకతంగార్తుంటె అరవాల్నాయె
ఎందుక్కొడ్తండ్రో ఏమన్న ఒక ముక్క
సదువులో ఎక్కడా రాయకపాయె.

బాంచెత్!
మనసులిర్గితె పట్టనోళ్ళకి భి
ఇగ్రహమిర్గితే
నిగ్రహం దెంకపోతది.

గుండెల్పగిలితే సూడని సంత
అద్దాల్ పగిల్తే
యుద్దాల్జేస్తది.

బాంచెత్!
బస్సు విల్వలేదు మా బతుకులకి.
దేహాలకన్నా లోహాలె నయం.
తగలబడ్డంకన్న-
నష్టమెంతో జెప్తరు!

అన్నా! ఏం జేస్తం మేం?
ఊపిరుండి మొసతీయనోళ్ళం.
ఒక్కరోజుల్నే ఫలితం రాదని తెల్సీ
కొట్లాడి కొట్లాడి అలసిపోతం.

అన్నా! ఏం జేస్తం మేం?
ఉన్నొక్క ఆశా వదల్నోళ్ళం.
ఉబుసుపోకెవడన్న అవసరమెలేదంటే
చెప్పుల్ని మెడకేసి చెప్పేశి వొస్తం.

అన్నా!ఏం జేస్తం మేం?
ఉద్యమాన్ని ప్రాణమనుకున్నోల్లం.
ఉత్తుత్తిగ అని ఎవడన్న అంటే
ఉరుక్కుంటబోయి రైళ్ళకు గుద్దుకుంటం.

అన్నా! ఏం జేస్తం మేం?
ఊరు సస్తాందని తెల్సినోళ్ళం.
ఊర్కెనే పోరగాండ్లు అరుస్తుండ్రంటే
ఉరికొయ్యలమీద పాటలై యేలాడ్తం.

అన్నా!నీ లెక్కల్ మాక్ తెల్వయ్.
గాంధీతోటే భగత్‌సింగ్‌ని సదివినం.
నక్సలైట్లు గిదేపనిచేస్తే
ఏమంకితం జేసినవో అడగం.

అన్నా!నీ లెక్కల్ మాక్‌దెల్వయ్.
నీ దోస్తొకడు సస్తే గోదార్ని లంజన్నవ్.
అది మా అమ్మ.
బలిదానమయ్యెటోళ్ళు మా తమ్ముండ్లనుకున్నం.
వందలమందిసస్తే కోపమెంతొస్తదో
నీకసలే తెలవదని అనుకోలేం..

అన్నా!బరాబర్ ప్రజాధనమే..
కాదన!
ఏడ్వందల ఎనభైని ఎంతబెట్టి గుణిస్తవో చెప్పు.
మిగిలిన పైసల్
మా రక్తమమ్మి తెచ్చిస్తం.

అన్నా! మళ్ళొకసారిజెప్తున్న..
కత్తుల మీద కవాతుజేస్తున్నోళ్ళం.
ఖబడ్దార్..!
విధ్యార్ధులం-
విషపు గొంతుకల్ని తొక్కనీకి
ఏ సదువు అక్కర్లేనోళ్ళం.

అన్నా!నీకిష్టమొచ్చింది రాస్కో.
మమ్మల్ని మాత్రం బద్నాంజెయ్యకు.
బస్సంటే మాకు ఇష్టమే..
సచ్చిన మా తమ్ముడంటే శానా!

కాంటేకార్ శ్రీకాంత్ !!నేనేంటి?!!


నేనేంటి
నాకేంటి
ఈ సమాజం గురించి స్పందించడమేంటి
నాలో ఇన్ని భావ తరంగాలా?
ఆలోచనా సుడులూ.. ఆవేదన తడులా?
ఎవరికోసం.. ఎందుకోసం

పారిపోతాను
నన్నెవరు పట్టించుకోవద్దు
తప్పించుకుపోతాను
నా గురించి ఏమీ మాట్లాడవద్దు
సమూహంలో ఒంటిరి నేను
ఒంటిరిగా సాగే సమూహాన్ని నేను
నాదొక ప్రపంచం
ఎవరి గురించి పట్టదు
ఏ ఆలోచనలూ రావు
జఢంగా, మూఢంగా ఉంటాను
మౌనం నాకిష్టం
కదలకుండానే ప్రవహించాలనుకుంటాను
మాట్లాడకుండానే గడిచిపోవాలనుకుంటాను
ఎవరికీ తెలియకుండానే నిష్ర్కమించాలనుకుంటాను
నాకు ఏమీ వద్దు
వెంట తీసుకుపోవాలని లేదు
వదలివెళ్లడానికి కూడా లేదు
నేను.. అంతే
అసలే ఇరుకు ప్రపంచంలో
నాది మహా ఇరుకు జీవితం
అందులోనే మరింతగా కుంచించుకుపోతాను
ఏ స్పందనలు లేకుండా నా మానాన నేనుండిపోతాను
బయట సాగుతున్న కోలాహలం
బయట రేగుతున్న కల్లోలం
నాకు సంబంధం లేనిది
నన్ను అంటరానిది
అన్నింటినీ పరిత్యజించి దూరమయ్యాను

ఇరుకు గుడారంలాంటి నా ప్రపంచంలో
ఎప్పుడో కొన్ని చక్షువులు మొలుస్తాయి
అందులోంచి బయటి ప్రపంచాన్ని చూస్తాను
చుట్టుపక్కలంతా సంక్షుభితమే
మునిగిపోతున్న ప్రపంచం
ఎటూ చూసినా దుర్గంధం

కనురెప్పాలు వాలుతాయి..
దూరదూరాన ఆశా తరంగాలు
ఎర్రని వెలుగు కాంతులు
కొన్ని పచ్చని బయళ్లు
జంటగా ఎగిరే గువ్వలు
అక్కడో అందమైన ప్రపంచమున్నట్టు కనిపిస్తుంది
దరి చేరేందుకు తపిస్తాను
నా ఇరుకు ప్రపంచాన్ని మోసుకొని
ముక్కుతూ..ములుగుతూ అక్కడికి వెళతాను
ఈ ప్రపంచమే తప్ప మరేమీ కనిపించదు
అంతటా మనుషులు.. అవే కష్టాలు
అంతటా సామాన్యులు.. అవే కన్నీళ్లు
అంతటా అన్యాయలు.. అవే మౌనాలు

మళ్లీ నేను స్పందించడం మానేస్తాను
మౌనంగా.. జఢంగా మారిపోతాను
కదలిక నాకిష్టం
పారే నదిలా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలనుకుంటా
కానీ మెసిలే కొద్దీ, రగిలే కొద్దీ
బురదలో కూరుకుపోతుంటే..
అందుకే మొండిగా, మొద్దుగా, మొరటుగా
నేను.. నేను.. నేనుగా మారిపోతాను
నాదసలే ఇరుకు జీవితం

http://naachittiprapancham.blogspot.in/2012/08/blog-post_9007.html

పీచు శ్రీనివాస్ రెడ్డి !! ఉగ్రవాదం ఉరుముతోంది !!


అప్పుడెప్పుడో అవని పుట్టకముందు
అగ్నిగుండం ఒకటి బ్రద్దలయ్యి
జీవానికి విత్తనాలు చల్లింది

ఎందుకు మోలిచిందో
ఎలా మొలిచిందో ఓ మొక్క
మహావ్రుక్షమయ్యింది
ఊపిరిని శాసిస్తోంది

అది నలు దిక్కులను తాకిన నీడ

నల్లగా నవ్వుతుంది
ఎర్రగా పాడుతుంది
ఆకాశం విరిగి పడేట్లు అరుస్తుంది

వినాడానికి భయం వేసే చప్పుడు
చెవులను కొరుకుతుంది
చాలాకాలం నుండి

అదొక ఉగ్ర నేత్రం
అంతమే దాని అంతిమ వాదం

ఆ నోటికి
ఎన్ని నాలుకలో
దాహం ఇంకా తీరినట్లు లేదు

బలి అవుతున్నవి మాత్రం మూగ జీవాలు కాదు
ఆలోచనల అల్లికలతో
ఆశల పల్లకిలో
ఎంతో కొంత ప్రేమను
ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ
కన్నీళ్లను తుడుచుకుంటూ
కలలను బ్రతికించుకుంటూ
కాలంతో కాపురం చేసుకుంటున్న
మామూలు జీవన చిత్రాలు .

వాడొక ఉగ్ర నేత్రం
అంతమే వాడి అంతిమ వాదం
పుట్టినప్పటి నుండి మెలకువతోనే
వాడు ఏ తల్లి జోల పాటను విననివాడు
ప్రపంచాన్ని జో కొడదామనుకుంటున్నాడు
జీవాన్ని మృత్యువుకు విత్తనంగా చేసుకుంటూ

నేనున్నాననే
మనం నిలబెట్టిన నీడ కూడా
ఎంగిలికే అలవాటు పడింది

ఉగ్రవాదం ఉరుముతుంటే
ఉనికే ప్రశ్నార్థకం అవుతుంటే
గురి చూసి కొడదాం ' మన ' ఆయుధంతో

30-08-2012

బాలు || ఏం చెప్పాలి!||


అమ్మా నాన్న కష్టం
ఒక్కొక్క చెమట చుక్క రాల్చి
కూడ పెట్టిన డబ్బుతో
పై చదువులకు పట్టణం
పంపితే...

ఈ చదువులు
నేర్పేదేమిటో
నాకు తెలియటం లేదు
చదువు అయినాక
ఉద్యోగం వేట ప్రారంబిస్తే....

చదివిన చదువుకు
చేయలిసిన పనికి
ఇచ్చే జీతానికి
చేయించుకునే పనికి
ఏదోలా ఏడుదామంటే...

పొనీ..ఉద్యోగం
ఇస్తాడా..!
లేదు
ఏదో కోర్సు
పేరు చెప్పి
బాగా డిమాండుంది
ఒంట పట్టించుకురా అంటాడు

ఆ కోర్సు
ఈ కోర్సు
అని
అన్ని కోర్సులు
తలకు పట్టిస్తే...

కామ్ స్కిల్ల్స్
మెరగు చేయమని
ఆంగ్లములో
నాలుగు చివట్లతో
సన్మానిస్తాడు

అతి కష్టం మీద
మెరుగులు దిద్దు కొంటె
అనుభవము వుంటే మేలు
కొత్తవారికి అవకాశాలు తక్కువేనంటు
సగౌరవంగా సాగానంప్పుతాడు

ఏమి చదువులు ఇవి!
వెనక్కు తిరిగితే
ఇరవైకి పైబడి
వెక్కిరిస్తున వయస్సు

నాన్నా బ్యాంకులో
డబ్బు వేయమని
అడిగే దైర్యం లేదు
నాన్న నాకోసం
బాకీకి వెనుకాడడు

ఆకలి బాద చంపుకోలేక
కాలి డొక్కను
నెలకు అంచి
బోర్ల పడుకుంటే
నెల తల్లి సముదాయించింది

ఇంటికి పోవాలి అంటే భయం
అవమానాల హారాలతో
మాటల గునపాలతో
సిద్దంగా వుంటారు
అమ్మలక్కలు

అటు పక్కన నుంచో
ఇటు పక్కన నుంచో
వదినగారు అంటూ
చెక్కర కోసం వచ్చి
చక్కర్లు తిరిగేల మాట్లాడుతుంది
ఓ ఆవిడా..

నా దారిద్ర్యాన్ని
దండోరా వేస్తూ
నాలుగు
వీదులకు
చేరవేస్తుంది
ఇంకో ఆవిడా..

కమ్మగా నిద్రపోయి ఎన్ని రోజులు అయిందో..?
ఎన్ని బాధలు ఉన్నా..
రాత్రికి అమ్మ
అన్నం ముద్దలు కలిపి
నోట్లో పెడుతూ
ఏరా అయ్యా..
సరిగా తినడం లేదా!
సగం సిక్కిపోయినావు
అంటూ అడుగుతుంటే....
ఏం చెప్పాలి..!

బాలు*29-08-2012*

ఈడూరి శ్రీనివాస్ ||అంకురం||


గాఢాంధకారంలో జగత్తు
గాఢ నిద్రలో నేను
ఇంతలో ఏదో అలజడి
ఒక స్త్రీ మూర్తి రోదన
నేను ఏదో ద్రవంలో
తేలుతున్న భావన
నెమ్మదిగా కిందికి జారుతున్నా
అలా మొద్లైంది
నా తొలి ప్రయాణం
అంతలోనే ఏదొ అడ్డంకి
స్త్రీ మూర్తి ఊపిరి బిగించింది
నన్ను ఏదో శక్తి బయటికి నెట్టింది
నాకు భయంతో ఏడుపొచ్చింది
అక్కడున్న అందరికీ నవ్వొచ్చింది
మగ బిడ్డ అన్న మాట వినిపించింది
సరిగ్గా అప్పుడే....అంకురించింది
పురుషాహంకారం!!!

30/8/2012

ఆమె - 2 // ప్రవీణ కొల్లి //


ఊరికే జలపాతం ఆ కొలువులో
పారే సెలయేరు తన లోగిలిలో
సూరీడుతో సావాసం
కాలంతో సహవాసం
పరుగు పరుగుల ఆరాటం
అలుపెరగని అస్తిత్వపు ఆశయం ఆమెది ...

కంటతడిని గుండె అడుగున
గుండె వ్యధను మునిపంటి అంచున దాచేసి,
కన్నుల్లో స్తైర్యం
చేతల్లో విశ్వాసం
చెరగని చిరునవ్వు శక్తిగా
అహంకారానికి ఎదురు నిలిచి
మగువగా తనను తాను ఎక్కుపెట్టి
ఉద్యోగం, వ్యాపారం అది ఇది అన్నింటా
ఎదిగి ఎదిగి ఒదిగి ఒదిగిన నిరంతర శ్రామికరాలు ఆమె....

సాయం మాత్రమే నాది
బాధ్యత నీదే సుమా!
ఇదిగిదిగో తరతరాల ఇల్లాలి నియమాలు
సౌక్యపు పరిధి దాటితే
ఎత్తి పొడుపులు గునపాలు
మేడిపండు తెలియకనా?
ద్వందవైకరి మారునా?
ఆత్మీయత భాద్యతల నడుమ నలిగిన హృదయపు నిబ్బరం ఆ దొరసానిది..

ఆమెదంతా
బయట ఎదిగే పోరాటం
ఇంట ఒదిగే ఆరాటం
వెరసి, సరితూకపు తూనిక ఆమె.....

30/8/2012

మోహన్ రుషి // బ్రూటస్ నే! //


నమ్ముతాననే చెప్పింది కానీ
మాటలో బలం లేదని తెలుస్తూనే ఉంది!

నాతోనే ఉంటానని చెప్పింది కానీ
ఉండకపోవడానికి సంబంధించిన స్థిరచిత్తమే ప్రస్ఫుటించింది!

ఇంకెవరూ లేరనే చెప్పింది కానీ
నేను చేసిన మానని గాయాల ప్రస్తావనే కనిపించింది!

తనని నేను భరించలేననే చెప్పింది కానీ
బండలతో సహజీవనం సాధ్యం కాదనే వినిపించింది!

కూలిన రాజ్యాలను పునర్ నిర్మించొచ్చేమో కానీ
చెదిరిన ఆ పిచ్చుక గూడును
ఏ గడ్డిపోచలతోనూ తిరిగి కట్టలేనని
చెద పట్టిన మనసుకు తెలుస్తూనే ఉంది!

30/8/12

కిరణ్ గాలి || Casanova ||


నేనెప్పుడూ
ప్రేమించలేదు
ప్రేమించబడనూ లేదు

నాకోసం ఎక్కడా ఒక్క వెచ్చటి కన్నీటిచుక్క నేలరాలిన దాఖలాలు లేవు
ఏ అందమైన మునివేళ్ళూ తమ డైరీలో నన్ను ఆజన్మ ఖైదుగ బంధించలేదు
ఏ మూసిన కనురెప్పలు తమ మనఃఫలకంపై నన్ను మురిపెంగా ముద్రించుకోలేదు
ఏ ఆలింగనము దేహన్నిదాటి నన్ను తమ ఆత్మతో స్పృశించిన స్మృతి లేదు

నేనెప్పుడూ ఎవరి ఊహల రాకకై కలలపట్టాలను కాలంపై పరచలేదు
ఎవరి అమోదంకోసం చిక్కటిరక్తాన్ని చిందించిన చారిత్రక ఘట్టాలు లేవు
ఎవరి స్మృతులను రాజేసి నిశీధిలో నిద్రలేనిరాత్రినై చలికాచుకున్న గుర్తులేదు
ఎవరి నిర్దాక్షిణ్య నిష్క్రమణ...ఘడియైనా నా గడియారపు బాహువులను ఆపలేదు

***

అవును నిజం..నేనెప్పుడూ ప్రేమించలేదు..ప్రేమించబడనూలేదు..
అలాగని ప్రేమంటే నాకెటువంటి అపనమ్మకమూ అనంగీకారము లేదు

ప్రయత్నించాను అదేపనిగా ఒక "నిన్ను", మరొక "తనను", మరెన్నొ "తనువులను"
వాంచించాను అతిపవిత్రంగా మనసుని, ఆత్మని....ఏ శరతులులేని శరీరాన్ని

***

వెన్నెల్లో తడుస్తూ మెత్తటిఇసుక పాదాలకు జతనైనప్పుడుకూడా
నా చూపు దిగులుమేఘాలనడుమ మౌనంగా దుఃఖించే చంద్రునిపైనే

అలలుఅలలుగా ముద్దులు పెదవులతీరంపై ఎగిసిపడుతున్నా
నా చూపు ఎందుకో సుదూరాన దారితప్పిన ఒంటరిఓడపైనే

కారులో కోరికల గేర్లుమారి లిబిడోమీటర్ గిర్రున తిరుగుతున్నప్పుడు కూడ
నా చూపు రేర్ వ్యు మిర్రర్లో రొప్పుతూ వెంటాడుతున్న జ్ఞాపకాల జాగిలాలమీదే

పబ్బులో పావురాయిరెక్కలు నన్ను గూడులోకిరమ్మని గోముగా గుంజుతున్నా
నా చూపు లేత పిడికిటిలో చలనము, రంగు లేని రబ్బరు బూర మీదే

ప్రేమని వ్యక్తీకరించడానికి స్పర్శ అవసరం
ప్రేమని అనుభూతించడానికి కూడా అదే మార్గం
కాని కేవలం స్పర్శకోసమె అయితే
ప్రేమనే అందవికారమైనముసుగు తొడగనవసరంలేదుకదా?

***

ఒక స్నేహం, ఒక స్వాంతన, ఒక సాంగత్యం, ఒక సంగమం
ఎవరి కారణాలు, వారి కుండవచ్చు.
ఎవరి నిర్వచనాలు వారు ఇచ్చుకొవచ్చు
దాహమెదైతెనేమి ఎలగోల దప్పిక తీరాలిగా

కోరుకున్న వారినెవరిని కాదనలేదు
అందుకోగలిగినంతా అందించాను
ఒకరి తర్వాత ఒకరిని, ఒకరు కుదరక పోతె మరొకరిని
ప్రేమించె గలిగే లౌక్యం లోక జ్ఞానం లేని వాడిని

నేనిక్కడే ఈ తనువుల తపొవనంలొ
నా దేహపు గుంజను పాతి నా చుట్టూ నేనే
వలయమై నిరంతరంగా పరిభ్రమిస్తున్నా
ఏ పువ్వో వచ్చి నాపై శాశ్వతంగా వాలక పోతుందా అని

***

మోహాల వేటలో,
నిస్సుగ్గు నగ్నత లాంటి చిటికెడు ప్రేమ కొసం
అనేకానెక శరీరాలను అన్వ్యేశిస్తూ
కాలి పోయి రాలి పోయిన
నా యవ్వనానికి అంకితమిస్తూ
...ఒకానొక కాసనొవాను

***

నువ్వు ప్రేమించావా? సులువైన ప్రశ్న
నిన్ను ఎవరైన నిజంగా ప్రేమించారా? నీకెప్పటికి జవాబు దొరకదు

సులువైన ప్రశ్నకి కూడ నీ దగ్గర సమాధానం లేనప్పుడు
"తొలిసారివై" ఏ దేహాన్ని తాకకు

Date: 30.08.2012

మనోజ్ఞ || గులాబీలు ||


ఒకే తోట గులాబీలవి..

కొన్ని కోవెలలో స్వామి అర్చనకు.
కొన్ని వెలయాలితో చీకట్ల సరసాలకు..
కొన్ని పాడె మీద పార్ధివ అంతిమయాత్రకు.

*ప్రసాదం శిరసా గృహ్ణామి*
అంటూ..
కళ్ళకద్దుకుని జడలో పెట్టుకున్నవి కొన్ని.

* ఐ లవ్ యూ *
అంటూ..
ప్రేయసి కళ్ళల్లోకి చూస్తూ ఇస్తున్నవి కొన్ని..

*ఏయి !! నిన్నసలూ *
అంటూ...
మీదపడ్డ కామదాహాలకు
పక్కమీద నలిగిపోయినవి కొన్ని..

రాజకీయ నాయకుల
నాటకాల చేష్టలకు
అతిశయంబైనవి కొన్ని..

అంతిమ యాత్రలో
పార్థివం నుంచి క్రింద పడిపోతూ,
చక్రాల కింద నలిగిపోతున్నవి కొన్ని..

""ఇంద, అర్చన చేసిన పుష్పమిది. జడలో పెట్టుకో""..

"ఛీ.. అది ముట్టుకోకు! శవం మీద నుంచి పడింది! "..

" ఇది నా మనసనుకో. నీకు అర్పిస్తున్నాను ప్రియా"

"అబ్బా... నలిగిపోయింది. అసహ్యం" !!

పాపం!!!
ఒకే తోట గులాబీలవి !!!!

28.08.2012

యజ్ఞపాల్ రాజు II సంయుక్తాక్షరం II


అదొక సంయుక్తాక్షరం
ముగురమ్మల మూలపుటమ్మలా
మూడింటి సంగమం
మూర్తీభవించిన
మాతృత్వం
పోతపోసిన
సౌందర్యం
అలవిగాని
మార్దవం
ఇదీ అని చెప్పలేని
అద్భుతతత్వం
ప్రకృతి మొత్తాన్నీ
తనలో నింపుకున్న
అర్థం
ప్రేమకు మరో రూపం
శక్తిని పోలిన అస్థిత్వం
చిరు అక్షరం
భావం అద్భుతం
రాసేముందు
రచయిత సందేహిస్తాడు
ఊహించేముందు
కవి ఆలోచిస్తాడు
గీసేముందు
చిత్రకారుడు
ఒక్క క్షణం ఆగుతాడు
మలచేముందు
శిల్పి తనను తాను
తరచి చూసుకుంటాడు
ఆ అక్షరంలోని ఆంతర్యాన్ని,
అంతరార్థాన్ని
సంపూర్ణంగా అందుకోగలమా అని
ఆ అక్షరం
"స్త్రీ"

30/8/2012

క్రాంతి శ్రీనివాసరావు || నేనూ...అతనావిడ నీడా.....||


నేనింకా నిద్రను వ్రేలడుతూ వుండగానే
కిరణాలు తలుపు కొట్టిన శబ్దం
కిటికీ సందుల్లోంచి
తోసుకొనివచ్చింది

తలుపులు తెరచి సూర్యుణ్ణి
పలకరిద్దామనుకొనేలోపే

వాళ్ళావిడ నాలోంచి దూసుకొని
నావేషం వేసుకొని ఇంట్లో కొచ్చేసింది

పెద్దముత్తయుదువ ముఖం చూసి
శకునం బావుందనుకొన్నాను

వరండాలో తీరిగ్గా చదువుతున్నగాలిని
న్యూస్ పేపరు అడిగితీసుకొని

కాఫీరాగం తీయాలని గొంతుసవరించుకొంటున్న
పాల ప్యాకెట్టు తెచ్చుకొని

కప్పు. కాఫీ చాయాదేవికి ఇచ్చి
కబుర్లు చెప్ప చెప్పమన్నాను

ఆయనకెవరడ్డమొచ్చినా
నే నొస్తూనేవుంటాను

పారదర్శకత నీలో లేనప్పుడు
పరవసించే రంగులెన్ని తొడుక్కొన్నా
నల్లని నీడై నిను వెంబడిస్తాను
నిజాయుతీ జాడలు నీలో లేవని
నీ అంతరంగం నే వెళ్ళడిస్తాను

వాడికిరణాలతోఆయన పొడుస్తున్నప్పుడు
నీడ నయనాలతో నేను కాపాడుతుంటాను
అని చెబుతుండగానే
తెనెపీక కుడుస్తూ వస్తున్న మనవడు
తననీడను తనతో రావద్దని మారాంచేస్తున్నాడు

కర్లపాలెం హనుమంత రావు॥ (ఇం)ప్యూర్లీ పాలిటిక్స్!॥


1
బొగ్గు మంటతో
కాగ్ తోంది
దేశం
2
బొగ్గు ఇనుము బాక్షైట్
రత్న గర్భ నాదేశం
గర్భాదానమే అక్రమంగా జరిగిపొయింది
3
2-జీ ఒక 'వేలం' వెర్రి
'బొగ్గు' ఆ వేలం కూడా లేని వెర్రి
4
గోద్రా
నరేంద్రుడి
'మోడీ'
5
బొమ్మ న్యాయం
బొరుసు అన్యాయం
రెండూ బొరుసులే ఉన్న నాణెం-రాజకీయం
6
అన్నా రాజకీయ పార్టీ
హస్తానికి రిపార్టీ
9
నల్లధనం-
ఏ కనిపించని నాలుగో సింహం
నోట్లో!
10
మంత్రివర్యా... తిన్నంగుండు
తప్పుతుంది
తిరుపతి గుండు!
11
రైతు దేశానికి వెన్నెముక…
సరే!
వెన్నెముక లేని పాలనా మనది!
12
నెలలు నిండకమునుపే
బడికడుపు నుండి బయటకొచ్చేస్తున్నారు
ప్రీమెచ్యూర్ డ్ బేబీస్!
13
ఓబులాపురం గనుల కేసు-
గాలితో చేసే యుద్ధం కాదు గదా
చివరికి!
14
జెడి కాల్ లిస్ట్ కేసులో
తత్కాల్ బుక్ చేసుకున్నాడు
వెంకట రెడ్డి!
16
వాన కావాలా!
వరుణయాగం ఎందుకు
ఉప్పల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడించు!
17
విద్యుత్
రిలయన్స్ గాలికి పెట్టిన దీపం!
18
కరువు వలన భక్తుల రాక తగ్గింది
వర్షాల కోసం దేవుడూ
ప్రార్థిస్తున్నాడు!
19
తివిరి
ఇసుమునా
'తైలంబు' తీయవచ్చు!


30-08-2012

భాస్కర్ II యోధులు II


"..చావు
సహజమైన
చోట
బతకడం నిత్యం
యుద్ధమైన
చోట
సమస్యలు వేధిస్తున్న
చోట
గుండెల్లో చూపులు
గునపాలుగా మారి
శూలాలై పొడుస్తున్న
సమయంలో ..
అంతా నా వాళ్ళుగా
అనుకున్న చోట
లోకం ..సమాజం
ఏకమై
వెంటాడుతున్న క్షణంలో
అలుపెరుగక
పోరాటం చేసే వాళ్ళకు
అన్నిటిని..అందరిని
వదిలేసి ఉద్యమించే
వాళ్ళే యోధులుగా
మిగిలి పోతారు ..
అలలు వస్తాయని
సముద్రం వెనక్కి
వెళుతుందా
తుపాను వస్తుందని
వర్షం ఆగిపోతుందా
కానే కాదు ..ఎదురొడ్డి
నిలిచే వాళ్ళను
గెలుపు వరిస్తుంది
వెన్ను చూపని
వాళ్ళను
విజయం ముంగిట
వాలి పోతుంది
సవాళ్ళను చూసి
జడుసుకునే వాళ్ళు
ఎన్నటికి ..ఎప్పటికి
గమ్యాన్ని చేరుకోలేరు
తెగువ చూపిన వాళ్ళే
యోదులవుతారు ..
వాళ్ళే విజేతలుగా
నిలుస్తారు .."
తేది : ౩౦.08 .12

డా.పులిపాటి గురుస్వామి || బై బై చెప్పే చేతులు ||


నిన్ను చూడటానికి వచ్చానా !
నా కళ్ళ భాషను
హత్తుకోకుండానే ఆనందం ప్రకటిస్తావ్

ఈ ఒక్క క్షణమే
మనసు మీదుగా
అన్ని మూసిన కిటికీలను తెరవలేక

నువ్వూ నేను చీకటికి తెలియం
చీకటైన నువ్వు తెలుసు స్పష్టంగానే

బేరలు చేడిపేస్తే మనం దగ్గరే
నీ చుట్టూ ఎన్నున్నాయో
నా చుట్టూ ఎన్నున్నాయో
ఎప్పుడు లెక్క కట్టాలె

దూరం నుండే చేతులూపుకుంటూ
గుండెను బలవంతంగా
జోకొట్టుకుంటున్నాం.

30, ఆగస్టు 2012, గురువారం

బాలు|| పాడు వాన ||


ఆరుబయట బల్కాన్ని
కుర్చీలో నేను
జోరున వర్షం
ఎదురుగా వేప చెట్టు
ఇంద్రధనస్సు మద్య
ఒక్కొక చినుకు
చెట్టుపై పడుతుంది
చిర్రుజల్లు తుంపర్లు
నా మోము మీద పడుతున్నాయి

హఠాత్తుగా ఒక మెరుపు
ఆకాశంలో కాదు
మా ఎద్దురుగా ఉన్న డాబామీద
గులాబి రంగు పంజాబీ డ్రెస్లో
రెండు చెత్తులు గాలిలోకి తిప్పుతూ
మొహాన్ని ఆకాశం వైపు పెట్టి
ఒక్కొక చినుకును ఆస్వాదిస్తున్నది

నా కళ్ళు రెప్పవేయటం మరచి
ఒక వింత చూస్తున్నట్లు
చూస్తున్నాయి....
చరడంతా పెద్దవి చేసుకొని

ఆ లేత గులాబీ డ్రెస్
పసుపు పచ్చని
తన శరీరానికి
బిగుతుగా అతుకుపోయి
తెగ సంబరపడుతుంది

నువ్వే కాదు
మేము అస్వాదిస్తున్నాము
తన అందాన్ని అని
వాన చినికులు చెప్పుకుంటున్నాయి

ఆ ఆనందాల భామ
అందచందాలు
ఓ పది నిమషాలు
చుసానోలేదో

పాడు వాన
నా మీద కక్ష కట్టి
ఆగిపోయింది
తను వెళ్ళిపోయింది

నేను మాత్రం
మళ్ళి ఎప్పుడు!
వర్షం పడుతుందా
అని చూస్తున్న
తన రాక కోసం...

బాలు*28-082012*

నరేష్ కుమార్ // చేతబడి //

ఇపుడు
మేమేం చేయగలం..!?
ఆత్మగౌరవానికి
చితిని సిద్దం
చేయటం తప్ప

మేం మహా మాంత్రికులం
అన్న పచ్చబొట్టు
నుదుటిపై
దిద్దించుకున్నాక
మరిక మేమేం చేయగలం...!?

మంత్రగాళ్ళనీ....,
రాక్షసులనీ...
శరీరాలను వేలాడేసుకునే
శిలువలని
మోసుకుంటూ
పరిగెత్తుతూనే ఉన్నాం.....

ఐనా...!
క్షణంలో
ప్రాణం తీసె
మనిషిపేరు వింటే...
ఇపుడు
కాష్మోరా
వణికి పోతున్నాడు.....,
తననెక్కడ
డ్రైనేజి గుంటలో
పూడ్చేస్తారో నని
పాతాల కుట్టి
పారిపోయాడు....
తందూరి పొయ్యి ని
చూసిన
ఆరథ్యుంగ
ఒళ్ళు చల్లబడింది...

ఇప్పుడు
క్షుద్ర గణాలకు
ఇల్లేది...?
స్మశానాలన్నీ
కబ్జా చేసారుగా..!

మా వెంట్రుకలూ, గోళ్ళూ...
కత్తిరించుకొని
మా మీద
మేమే
చేతబడి
చేసుకోవాలిప్పుడు.
(mantragaadanea anumanam toa gramam nundi tarimi kotti bhumini laageasukunte paripoai vachi granit minelo kulee gaa maarina oka orissa girijanunni vinnaka) 29/08/12

నగరంలో పద్యం మరణిస్తుంది //కోడూరి విజయకుమార్ //


శిరసు చుట్టూ ప్రదక్షిణలు చేసే
రంగురంగుల సీతాకోకలు కొన్ని
సీతాకోకల చుట్టూ అల్లుకునే
కొన్ని అక్షరాలు...

పద్యం ప్రాణం పోసుకొంటోన్న అలికిడి
చెవుల్లోంచి గుండెలోకీ, శిరసులోకీ దూసుకొచ్చి
సీతాకోకల్ని చెదరగొట్టే
గడియారం అలారం మోత
ప్రాణం పోసుకొంటోన్న పద్యం కంపిస్త్తుంది

కాసేపు దినపత్రికలు మోసుకొచ్చిన లోకాల్లోకి....
పాలితుల దయనీయ వెతలనార్పే
చల్లని మాటలు ప్రవహించాల్సిన పవిత్ర ప్రాంగణం
ఒకరి బాగోతాల లెక్కల్ని మరొకరు విప్పుకున్న
రాబందుల రాకాసి శబ్దాల నిలయమైన విషాదం
గుక్కెడు నీళ్ళివ్వని మహానగరాన్ని శపించి
మృత్యుబిలంలోకి జారిన ఒక పేదలబస్తీ
నాగరిక జీవనశైలి మొహాన్ని వెక్కిరిస్తూ
పట్టపగలు పగలబడి నవ్విన యాసిడ్‌ బాటిల్‌
లేచి నిలబడి పద్యాన్ని అందుకోవాలని చూస్తాను
ఆఫీసుటైము కాలరు పట్టుకుని ఆపేస్తుంది

మహానగర రహదారుల మీద పరుగులు
నగర జీవితాన్ని కమ్మేసిన పరుగుకు ప్రతీకలు
పరుగుల మీద బ్రేక్‌ వేసే ట్రాఫిక్‌ రెడ్‌లైట్‌
కరెన్సీ కట్టల్ని మింగి పుట్టిన లగ్జరీకారు
రొట్టెముక్క కోసం చేయిసాచే పసిపాప
పద్యం కోపంతో వూగిపోతుంది
పరుగుల్ని గుర్తుచేస్తూ వెలిగే పచ్చలైటు
పద్యం మీద నీళ్ళు గుమ్మరిస్తుంది

దైనందిన నగరజీవిత పరుగుల నడుమ
పద్యం అప్పుడప్పుడూ నాకై చేతులు చాపుతుంది
అందుకోలేని అశక్తత యేదో వెనక్కి లాగుతుంది

రాత్రి పక్కమీద అలసటగా వాలే దేహం
ఉదయపు సీతాకోకల కోసం వెదుకుతుంది
లోపలెక్కడో యేదో కుళ్ళిన వాసన
పద్యం మరణించి వుంటుంది...
ఇక రాత్రంతా శవ జాగరణ....

నీ ||మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!! ||


మా ఊరంటే బస్సే గుర్తొస్తుంది..!

చదువుకోటానికి నానా అగచాట్లు పడేప్పుడు

ఫ్రీ-పాసులిచ్చి పదికిలోమీటర్లు పట్టుకెళ్ళి,
అక్షరాలు నేర్పిన "అదే"గుర్తొస్తుంది.

ఊటుకూరు పొలంలో కోటేరుని,
కొణిజర్లలో స్మసానం లో తగలబడుతున్న శవాన్ని..
ఒళ్ళోకూర్చోబెట్టుకుని కళ్ళారా చూపిచ్చిన బస్సు గుర్తొస్తుంది.!
కిటికీకి గడ్డం ఆనిచ్చిన చిన్నతనం,
సీటెనుక పదేళ్ళప్పుడు రాసిన కవిత్వం గుర్తొస్తుంది.!

బస్సంటే నన్ను చంకనెత్తుకున్న్న అవ్వ,
బస్సంటే నావరకు గోరుముద్దలు తినిపించిన అమ్మ!

మా ఊరి మోటుజనపు నేలవిమానం బస్సు

ఎవడో చుట్టంగాడి పెళ్ళికి అందరూ..
చిన్నకార్లలొ,మోటారుసైకిల్లలో వస్తే..
మా గరీబు నాన్న ఎక్కించిన ఎర్రబస్సు గొప్పగా గుర్తొస్తంది !

ఎదో పనిమీదెళ్తే..
దిల్-సుఖ్-నగర్ రోడ్డుమీద మా బస్సు కనిపిస్తే
ఎదురెళ్ళి ముఖం మీద ముద్దుపెట్టుకోబుద్దయ్యేది,
ఒక పాత స్నేహితుణ్ణి చూసినట్టో..
ఏదో విషాదం గుండె అడుగునుంచి కారుతున్నట్టొ వుండేది!

* * *
ఎవడో చదువుకున్నోడట బస్సుని రాళ్ళతో బద్దలు కొడుతున్నాడు!
కసాయిలా కిరసనాయులు పోసి కాల్చేస్తునాడు!
ఎవడొ.. దయామయి బస్సుని ధ్వంసం చేస్తున్నాడు!

ఇప్పుడెందుకో బస్సుకి గొంతుంటే బాగుండనిపిస్తుంది నాకు!

మావూరి మట్టిరోడ్డుమీద బస్సుపోతున్నట్లు
నా ముఖం మీద కన్నీళ్ళు పోతున్నాయి

తగలబడుతున్న బస్సుల మధ్య కూలబడి
విజ్ఞానులనే అజ్ఞానుల ఉన్మాదాన్ని వార్తలు చేసుకుంటున్నా..,

అయినా సరె..
కారుతున్న నా కన్నీళ్ళని సీసాలో పట్టుంచా..
తిలక్ ఓసారి ఇలావచ్చి తగలబడుతున్న బస్సుమీద పోసెళ్ళు..

ఇంతకుముండె..
మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!

*29.8.2012 

  భమిడిపాటి // బికారి బ్రతుకు //


  వేకువ దుప్పటిని దులిపేస్తూ
  అప్పుడే రేగుతున్న దుమ్మును
  రోడ్డున పోయే జనాల తిట్లను
  గాలి పాటలా వింటూ మొదలైంది ....

  మా దారి తెన్నులు లేని
  యాచక దారి
  సొంత పేరున్నా చెప్పుకోలేని
  అందరికి తెలిసిన ఈ బికారి !

  ఎవరి కన్న బిడ్డలమో ?
  తెలియని అమ్మని
  తెలిసి ఎంతో మంది అమ్మలాంటి అమ్మలని
  ధర్మం చేయండంటూ ఛీ కొట్టినా వెంటపడుతూ ...

  ఒక్కోసారి సిగ్గేస్తుంది
  ఏ ఇంటి గడప తొక్కాలో తెలీని మా స్థితిని
  ఇలాంటి జీవితాన్నిచ్చిన ఆ దేవుణ్ణి
  దయలేని ఆ పైవోడి విదిరాతని !

  మాకు మేమే అయ్యేమా !
  ఎవరి ఆవేశపు ఆనందానికి రోడ్డున పడ్డామా
  మా ఆవేశాన్ని అణుచుకోలేక
  మా వారసులకి కూడా ఈ వారసత్వాన్ని కట్టబెడుతున్నామా !

  మాలో ఎవరిని తట్టినా
  గతంలేని తన జ్ఞాపకానికి మాలో మేమే సాక్షులమంటారు
  ఆకలి మంటల కేకల చల్లార్చటానికి
  చిల్లర డబ్బుల చప్పుళ్ళకి అలవాటుపడ్డం అని వెర్రిగా నవ్వుతారు ......

  రానే వచ్చిన రాత్రికి
  దొరికిన జాగాపై మాటేసి
  చీకటి దుప్పటి కప్పేసి
  రాత్రి చుక్కలకి రాజులం మేమే అంటూ ..మురిసిపోతూ ..కలలో మైమరచిపోతూ ..
  .29-08-12

  మామిడి హరికృష్ణ || గుప్పిట్లో ఆకాశం.. ||

  వేకువ వెలుగులు ముగ్గులల్లడానికి ముందే
  రాత్రి మేఘాలు విచ్చిన్నమవడానికి ముందే
  నిద్రానిద్ర, కల-మెలకువల ఊగిసలాట సమయాన
  ప్రేమైక వాణివై 'సెల్' లో ఆహ్వాన గీతాన్ని పాడుతావు

  తొలి ఉదయ వేళనే ఆహ్లాదంగా పలకరించి
  స్వర్గాన్ని నా ఎదుట పునర్ప్రతిష్ట చేస్తావు

  స్వప్నాస్వప్న జగత్తులోకి చేయిపట్టి తీసుకెళుతూ
  అనురాగ కౌగిలిలో వివశున్ని చేస్తావు..

  ఇక,
  స్వర్గాన్ని చేతితో, కళ్ళతో, నాలుకతో, పెదాలతో
  తడుముతూ,చూస్తూ,స్పృశిస్తూ, చుంబిస్తూ
  ఆకాశాన్ని గుప్పిట్లోకి ఒడిసి పట్టి
  సముద్రాన్ని పుక్కిట్లోకి బిగియ పట్టి
  వ్యోమ కాలాల వెంట యెగిరి వెళుతూ
  Time- Spaceల భౌతిక పరిమితులను అధిగమించి
  పారభౌతిక-పాంచ భౌతిక అవతారాన్ని ఎత్తుతాను..

  బింబ ప్రతిబింబాల దోబూచులాటలు
  దేహ కోణాల కంపన-ప్రకంపనల-ప్రచోదనాల శ్వాసలు
  శరీర మంతనాలు-మనో మధనాల అద్వైతంలో
  స్వర్గ ఫలాల తేనియలని
  చప్పరిస్తూ, జుర్రుకుంటూ, గ్రోలుకుంటూ ...
  అర మోడ్పు కన్నుల మాయాలోకంలో విహరిస్తూ..
  అర్దాతీత మూలుగుల స్వర ప్రపంచంలో తేలియాడుతూ..
  దాన్నే కొనసాగిస్తూ...
  29 August,2012

  క్రాంతి శ్రీనివాసరావు || చిదంబర రహశ్యం ||


  సంపదకు శాశ్వత చిరునామలేక సంచరిస్తున్నప్పుడు
  ప్రపంచమంతా ఒకే వూరవుతున్నప్పుడు
  దరిద్రమంతా మన పంచనే ఎందుకుంది ?
  ఈఆర్ధిక వంచన అర్దం అయ్యేదెప్పుడో ?

  వస్తువులను చేసేది మనం
  తరువాత కొని వాడేది మనం
  మద్యలో వాడాదుకొనేది ఏందో
  పప్పు మనది పొట్టు వాడిది
  వూదుకు తింటున్నాం చెరిసగం

  ఆదుకోవాల్సిన పాలకపక్షం
  కనిపించని బానిస సంకెళ్ళు రంకెలు వేస్తుంటే
  అంకెల గారడీలు చేసి చంకలు గుద్దుకొంటున్నారు
  ఫలితం లేని పంచవర్ష ప్రణాలికలతో
  పంక్ష్య భక్ష్యాలు వడ్డిస్తామని వగ్ధానాలను వర్షిస్తూనేవున్నాయు

  ఒకప్పుడు రైళ్ళలో తరిలేది సంపద
  ఇప్పుడెందుకో ఈమైళ్ళకే తరుగుతుంది
  అరవైఏళ్ళ స్వతంత్రభారతంలో
  ప్రపంచ ధనవంతుల లిస్టులోకి ఒకరిద్దరు వెళ్ళీతే
  పాతిక శాతం ఆదాయం డెబ్బైకుటుంబాల చెతుల్లో పెట్టి
  డెబ్బైశాతం జనాన్ని దారిద్యంలో చుట్టేశాం
  రోజుకు పాతికరూపాయలొస్తే చాలు
  పరమాన్నం తినొచ్చని పావర్టీ లైను పైకి నెట్టేశాం
  పేదరికం తగ్గిందని లెక్కలు కట్టేశాం

  ఎన్నికలొచ్చిన రోజు
  వందో వెయ్యో ఇందా అంటే
  మందో మాకో వుంది అంటే

  అందలం అందుబాటులోకొస్తుంటే
  అతిపెద్ద ప్రజస్వామ్యాదేశం లో
  ఎప్పుడూ వారసులే సారధులవుతున్నారు
  ఒహో ప్రజాస్వామ్యమా
  రాహు(ల్)కాలమొచ్చిందినీకు
  మరో స్వాతంత్ర్య పోరాటం జరగాలిప్పుడు

  శ్రీ || సామాన్యులమంటే మనం ||

  సామాన్యులమంటే మనం
  ప్రజలే ప్రభువులన్న
  ఒకే అబద్దాన్ని
  పదే పదే నమ్మించే
  అ/ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు కాదు

  సామాన్యులమంటే మనం
  ఇంటి మీద హెలిపాడ్
  పెళ్ళానికి చార్టర్డ్ ఫ్లైట్
  ఒక్క మాట తో
  స్టాక్ మార్కెట్ హాం ఫట్.
  త్రీ పీస్ సూట్లేసుకుని
  సంపద పై స్వారీ చేస్తూ
  తమ ప్రగతే దేశ ప్రగతని
  నమ్మబలికే వ్యాపారవేత్తలు కాదు

  సామాన్యులమంటే మనం
  ప్రభువుల పాపాల్ని తమ విఙానం తో
  రాజ్యాంగ లొసుగుల్లో పాతిపెట్టి
  అవినీతి మూటల మేడల్లో
  హాయిగా వుండే బ్యూరొక్రాట్లు కాదు

  సామాన్యులమంటే మనం
  హీరొయిన్ల లిప్ స్టిక్ ధరల్ని
  హీరోల చీకటి రహస్యాల్ని
  ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల్తో
  అబద్దపు వార్తల్ని అందం గా
  అందించే వాళ్ళు కాదు

  సామాన్యులమంటే మనం
  30 సెకన్ల ప్రకటన తో
  తమ విలువైన కాలాన్ని
  సెకన్ల కి కోట్ల చొప్పున
  అమ్ముకునే సెలబ్రిటిలు కాదు

  సామాన్యులమంటే మనం
  పడవల్లాంటి కార్లేసుకొచ్చి
  సూపర్ మార్కెట్ తోపుడుబండి నిండా
  సరదా కోసం షాపింగ్ చేసె వాళ్ళు కాదు

  సామాన్యులమంటే మనం
  ఒకటో తారీఖొస్తుందంటే ఒణికిపోయే వాళ్ళం
  ఉల్లిపాయ,టమాటా, నిత్యావసరం ఏదైనా
  రేటు పెరిగిందంటే
  బడ్జెట్ సవరణల్తో కుస్తీ పట్టేవాళ్ళం.
  కందిపప్పు పండక్కే వండుకునే వాళ్ళం
  గుక్కెడు నీళ్ల కోసం
  కుళాయి దగ్గర కుస్తీ పట్టే వాళ్ళం
  రేషన్ షాప్ క్యూ లో సహనాన్ని పరీక్షించుకునే వాళ్ళం
  వాన కోసం ఎదురుచూసేవాళ్ళం
  మట్టి వాసన పీల్చే వాళ్ళం
  అనుక్షణం పోరాడే వాళ్ళం..ఆశాజీవులం
  --శ్రీ

  (పొట్టకూటి కోసం కవిత్వాన్ని ఫుట్పాత్ మీద అమ్ముకునే ఒక ఐరిష్ కవి కవిత ని ఫ్రీ గా చదివి అనుసరిస్తూ..,అనుకరిస్తూ..
  మన్నించాలి నాకు అతని కవితే కాదు కనీసం పేరు కుడా గుర్తు లేదు )

  శ్రీకాంత్ కాంటేకార్ || మానవత్వం ఖాయిల పడ్డ కార్ఖానా ||

  మానవత్వమే ఓ ఖాయిల పడ్డ కార్ఖానా
  ఇంకా మనిషికి విలువ ఏ పాటి?
  కల్లోల జీవన సాగరంలో అనునిత్యం
  ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సామాన్యుడిని చూసి చలించదేవరు?
  నీతి బాట వీడక
  కత్తుల వంతెనపై పడుతూ లేస్తూ
  నెత్తురోడుతూ
  గాయాలను ఓర్చుకుంటూ
  బతుకు బండి లాగుతున్న ఒంటరిజీవి గుర్తున్నాడా?
  తడారిపోయిన నీ హృదయ చలిమెల్లో
  రెండు కన్నీటిబొట్లయినా అతడి కోసం మిగిలివున్నాయా?
  నయా అభివృద్ధి ముసుగులో
  రంగురంగుల విద్యుత్ వెలుగులో
  సంపన్నవర్గాలను, విజేతలను మాత్రమే
  కీర్తిస్తున్న నీలో ఇంకా అతడి గురించి భావాలు ఊరుతున్నయా?
  అతడి జీవితం సంఘర్షణభరితం
  తప్పు చేసే అవకాశం ఉన్నా
  గీత దాటే గుండె ధైర్యం లేదు
  బహుశా అమ్మ చెప్పిన నీతికథాసారం
  చెవుల్లో మారుమోగుతున్నదేమో
  పాపపు కూడుతో పైకి రాలేవన్న
  బడిపంతుల పాఠాలు గుర్తుకొచ్చెనేమో!
  పాపభీతి.. పైవాడు గమనిస్తున్నాడన్న భయం వెంటాడుతుందేమో!
  (అందుకోసమే సామాన్యుడిగా మిగిలాడనుకుంటే
  ఈ సమాజంలో మంచితనపు చివరిజ్యోతి కూడా ఆరినట్టే
  అంతటా అన్యాయం అంధకారమే)

  అటు చూడు చెడి బతికిన వాడి వైభవం
  వాడి చుట్టూ చేరిన భజనమేళా సందోహం
  వాడు ఎందరికి చెరుపు చేశాడో ఎవడికి పట్టింది
  ఎన్ని అడ్డదారులు తొక్కి పైకి వచ్చాడో
  ఎవడు అడుగుతాడు
  ఎవడికి మాత్రం అంత ధైర్యం తీరిక ఉన్నాయి కనుక

  వాడు విజయం సాధించాడా లేదా? అన్నదే కావాలి
  ఎంతమంది నోళ్లు కొట్టి
  ఎందరి జీవితాలను బలిపెట్టి
  ఎన్ని గుడిసెలకు అగ్గిపెట్టి
  తన మహాసౌధాలను నిర్మించుకున్నాడో
  ఎవడు మాత్రం శోధించి కనుక్కోగలడు

  ఎందరి వెన్నెముకలు విరిచి
  ఎంతమంది ఆశలను చిదిమేసి
  తన విజయానికి మెట్లుగా మార్చుకున్నాడో
  నువ్వేమైనా ఎరుగుదవా

  మృగరూపం దాచేసి
  సాధు తోలు కప్పుకొని
  చెబుతున్న నీతి మాటలకు
  మైమరచిపోతున్న మానవుడా
  రాజకీయమే రాచబాటగా
  అధికారమే ఆలంబనగా
  నిర్మించిన మహా సామ్రాజ్యాల కింద
  ఎన్ని జీవితాలు విధ్వంసమయ్యాయో
  ఎన్ని బతుకులు బలిపీఠం ఎక్కాయో

  నీకూ నాకూ మాత్రం ఎందుకు పట్టింపు
  నువ్వు నేను బాగానే ఉన్నాం
  తగలబడుతున్న సమాజం
  మన గుడిసెల దాకా రాలేదు కదా
  మన కాలి కింద నేల కదిలిపోవడం లేదు కదా
  అభివృద్ధి పేరిట జరుగుతున్న జీవన విధ్వంసం
  నువ్వూ నేనూ రుచి చూడలేదు కదా
  అందుకే స్పందించొద్దు
  నరనరాలలో ఉడుకు నెత్తురు మరగకూడదు
  పక్కవాడి అన్యాయంపై మన రోమాలు నిక్కబొడుచుకోవద్దు
  అయినా నాకెందుకొచ్చిన గొడవ
  పక్కవాడి గుడిసెగా తగలబడుతోంది
  రేపొద్దున నీ పక్కవాడు కూడా ఇలాగే అనుకుంటాడు
  కాంటేకార్ శ్రీకాంత్

  29, ఆగస్టు 2012, బుధవారం

  కట్టా శ్రీనివాస్ || హరియాలీ సలాం ||

  నీవోక పచ్చని చెట్టయిన రోజు
  పిట్టలు అవే వచ్చివాలితే.
  పుట్టింటి బిడ్డల స్పర్శకు పులకింతలతో పరవశించావు.

  నీపై పువ్వులు విరబూసి నవ్వినపుడు
  మధుపాలు ఆశగా మదువుని గ్రోలి గోలచేస్తే.
  మనువళ్ల అల్లరికి ముద్దోచ్చి మురిసిపోయావు.

  తొలిపిందెల రుచి చూస్తూ
  కసరుగాయల పసచాలక కసిరింతలు కావలించుకుంటే.
  కడుపున పుట్టిన వాళ్ల తప్పును వెనకేసుకొచ్చేతల్లిలా నిలబడ్డావు.

  ఒక్కోపండూ తయారై తలలూపుతుంటే.
  అదేమిటో రాళ్లిలా వచ్చిపడుతున్నాయి.
  గాయం బాధకన్నా రాలే పండ్లను చూస్తే
  నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.

  నీవోక పచ్చని చెట్టువు కాబట్టే
  నీలో పచ్చదనం వుండబట్టే
  ప్రపంచం నీవైపు చూస్తోంది
  మంచో చెడో మాట్లాడుతోంది.

  *28-08-2012
  http://antharlochana.blogspot.in/2012/08/blog-post_28.html

  ఎ.నాగరాజు || చంద్రునికొక పూల తావి ||


  ఆ పాపకు తన స్నేహితురాలెవరో
  ఒక రహస్య సందేశాన్నందించినట్టుగా
  మిన్నల్ అంటే చందమామ మరియూ పువ్వు అని రాసి అతి జాగ్రత్తగా మడత పెట్టి నెమలి కన్నును ఉంచే చోట కాగితం పుటలలో దాచి ఇచ్చింది.

  బడి భారాన్ని భుజాల నుండి పక్కకు నెట్టి
  కాసేపు టీవీ చానెళ్ళను టకటకా తిప్పేసి
  ఏదో గుర్తుకు వొచ్చిన దానిలాగా తనకు ఆ రోజుటికి వీడ్కోలుగా అందిన ఆ చీటీని ఆత్రంగా బయటకు తీసి
  పసి బిడ్డలకు మాత్రమే చేతనయిన ఇంకా వొక పద్ధతికంటూ అలవాటు పడని అక్షరాల పేర్పును కాసేపు తదేకంగా తల పంకించి చదువుకొని
  ఆ పాప తిరుగు జవాబుగా ఏదో రాయడం మొదలు పెట్టింది.

  కొన్ని స్థితులలో చాపల్యం మాదిరిగా
  ఒక్కొక్క పూవునూ జాగ్రతగా ఎంచి ఏరి తీసినట్టుగా పిల్లలకు పేర్లు పెట్టగలం గానీ
  అ ఆపురూపమైనదేదో సదా తలదాల్చలేని శాపగ్రస్తులం కదా మనం
  ఊహకు ఆవల నిలుచున్న బంధీలం కదా మనం
  గీతల నడుమ వొదిగి తల వొంచి అనేకసార్లు గిడస బారిన గూనితో వొదిగిన అక్షరాలుగా పలకరించుకునే మనుషులం కదా మనం

  బహుశా తన లేత వేళ్ళతో
  తన స్నేహితురాలిలాగే ఇంకా వొదిగీ వొదగని అక్షర పంక్తుల పేర్పుతో తిరిగి ఆ పాప ఇచ్చే జవాబును మనం వొక నాటికైనా ఊహించగలమా
  కనీసం ఊహగానైనా

  28ఆగష్టు2012

  పీచు శ్రీనివాస్ రెడ్డి !! చరిత్ర వాన్ని మరిచిపోయింది !!


  అనాది నుండి
  'నాది' అని ఏదీ లేని పేదవాడు
  చరిత్ర పుస్తకం వదిలి
  ఎప్పుడో పారిపోయాడు.

  అయిన వాని కథ
  రాతి పలకలపై నిలిచి శాసించింది
  కడవాని వ్యధ
  కడలి తీరంలో ఇసుక తెన్నులపై రోదించింది

  చెమటోడ్చిన బ్రతుకుల రాతలన్నీ
  సంద్రంలో కలిసాయి
  ఎన్ని బ్రతుకులో ...
  నీళ్లన్నీ ఉప్పగా .

  అక్షర రాశికి వాసి పూసి
  నిజానికి మసి పూసి
  రాసిన రాతల్లో
  పేదోడి కన్నీటి ధారలకన్న
  పెద్దోడి కిరీటాల ధగ ధగలే ఎక్కువ

  ఆ చరిత్ర
  వరహాలు ముద్దాడిన అక్షరాల సమూహం కావచ్చు
  రసిక సిఖామనుల రాజభోగాలను నెత్తిన ఎత్తుకొని
  దరిద్రుడి దిన చర్యను వెక్కిరించాయి

  మబ్బును చేరిన నీరు కొత్తగా కురిసినా
  గతమంతా మరిచినా
  గాలికి తెలుసు సంగతులన్నీ
  గురుతుకొచ్చినప్పుడల్లా అరుస్తుంది

  ఆ సాక్షినే వెంటబెట్టుకొని నిలదీద్దాం
  నఖిలీ నవ్వులు నవ్వుతున్న' అక్షర గణాన్ని'
  నింగిలో తారలని తుంచి
  ప్రియురాలి సిగ లో పెట్టిన
  వర్ణనా పైత్యాన్ని

  28-08-2012

  పద్మజా రాచమల్లు కవిత


  తను తనలా లేడు
  తన మనసులో నేను లేను!!

  అయినా..
  నా మీద ఎంత ప్రేమా!!
  నా కళ్ళు నగ్నంగా ఉన్నాయి అని
  తన మాటల తూటాలతో
  కన్నీటి తెర కప్పుతాడు

  జయశ్రీ నాయుడు //నిరంతర చెలిమి//


  డైరీ లో పేజీలు తిప్పి చూసుకుంటే
  నాలో నడిచి వచ్చిన అనుభవాలు
  ఎన్నో మనసుల పాత్ర వుంది
  అనుభవాల ఉలి దెబ్బలున్నాయి..
  ఎన్నొ హృదయాల ఓదార్పు వుంది!
  ఈత నేర్పిన కాల ప్రవాహం వుంది

  నమ్మకం అపనమ్మకాల పగుళ్ళలొ
  ఇరుక్కున్న విశ్వాసపు పందిరికి
  ఆత్మని పూయించాలని ఒక్కో
  కొమ్మకూ కాలపు చిగురు అతికిస్తూ
  ఆలోచనల వర్షం కురిపిస్తూ
  ఆకాశంలా సాక్షీ భూత స్థితికి
  ఒక్కో మెట్టూ లెక్కిస్తూ నేను

  అంతరంగం అన్నిటికన్నా లోతైన పసిఫిక్
  ముందువెనుక వూగిసలాటల చేపలు
  తలపులై మింగేసే అజ్ఞాన తిమింగలాలు
  గమ్యాలుగా బయలుదేరిన చిట్టి పడవలూ
  ఎంత కొలాహల హాలాహల సముద్రమిది

  లయం కావాలి
  ఆలయం కావాలి
  భావనలన్నీ లయించే తీరం లో
  ఇసుకరేణువులూ కానని సముద్రం అవ్వాలి

  చుక్కల వెలుగు పోగు చేసి
  పాలపుంతే కళ్ళు చేసుకుని
  విప్పార్చి చూస్తున్నా
  అఖండంగా వెలుగుతున్నావు
  నావెలుగూ నీ పులుగే కదా

  ప్రయాణం ఆగదు జీవన వినోదం మారదు
  మోద ఖేదాలు గుండె చప్పుళ్ళే
  ఆశల అలలు దాటిన సముద్రం
  కన్నీళ్ళు లేని కళ్ళు మెరిసే ప్రయాణం
  నేనే నా నౌక - విశ్వాసమే నా తెరచాప
  నన్ను నేను సిద్ధపరుచుకుంటున్నా
  నీతో నిరంతర చెలిమికి అవకాశంగా మలుచుకుంటున్నా!

  28-08-2012

  కర్లపాలెం హనుమంత రావు॥భావ శకలాలు-౩॥
  1

  వాత కోత మూత

  మూడు ముక్కల్లో

  కరెంటు కత

  2

  మృగం

  మనిషి గతమే నా..!

  అంతరంగం కూడా

  3

  అసాంజే

  అందరిలో ఉంటాడు

  అతగాడి పేరు

  అంతరాత్మ

  4

  అంగారకమూ ధరకు అందింది

  బంగారం ధరే

  అందకుండా ఉంది

  5

  స్వర్గానికి సగం దారి

  వరదగుడి

  మిగతా సగం

  గుండెగుడి

  6

  There is not an object

  which do not have some purpose

  నెల న్యూస్ పేపర్స్

  నెలాఖరు కాపర్స్

  7

  లోకం ఒక త్రివేణీసంగమం

  కొందరు గంగ యమున వాహినులు

  కొందరు కనిపించకుండా పారే సరస్వతులు

  8

  మంచి చేసి పోతే

  నీ తలవెంట్రుక్కూ విలువుంటుంది

  చెడ్డ చేసి పోతే

  నీకు తలవెంట్రుకంత విలువుంటుంది

  9

  పనితనం-వెనక కళాయిది

  పేరు షోకు-ముందు అద్దానికి

  -లోకం

  10

  గీత

  దాటి – సీత

  దాటక -విజేత

  11

  ఆకాశం ఏడ్చి

  భూమిగుండెబరువు దించింది

  12

  కలిస్తేనే అర్థం

  అక్షరాలకైనా

  హస్తాలకైనా

  13

  కోరి పుట్టలేదు మనిషి

  ఐనా

  కోరికల పుట్ట.
  ఆగష్టు 28, 2012

  కెక్యూబ్ వర్మ ॥మట్టి తత్వం...॥


  రా...
  నడుస్తూ గుండె తలుపులు తెరుస్తూ
  మనుషుల మధ్యకు రా...

  మట్టి వాసనను ముక్కు పుటాలనిండా పీల్చు
  నీ ఆదిమతనం బయల్పడుతుంది...

  మట్టి చేతిని ఆత్మీయంగా తాకి చూడు
  నీ రాతితనం బద్ధలవుతుంది....

  భుజం భుజం కలిపి భారాన్ని పంచుకో
  నవమాసాల బరువు గుర్తుకొస్తుంది...

  గొంతు విప్పి బిగ్గరగా మాట కలుపు
  హృదయాంతరాళంలోని గాయం సలుపుతుంది...

  మట్టి మనుషులతో నడయాడు
  ఒంటరితనపు ఎడారి దూరమై నది నీ కాళ్ళను స్పృశిస్తుంది...

  రంగులన్నీ పారబోసి మట్టి తనాన్ని అద్దుకో
  మనిషితనం వెలుగు నింపుతుంది...

  దేహమంతా చేయి చేసి చాపు
  కోట్ల చేతులు మనిషితనాన్ని నిద్దురలేపుతాయి....
  ( 28-08-2012)

  జాన్ హైడ్ కనుమూరి ||ఇంటికొచ్చాక - పలకరింపుల పర్వం||

  ఆసుపత
  ్రిలో రానివ్వలేదని
  ఆత్రంగా పలకరింపుకోసం
  రెక్కలు కట్టుకుని వాలినట్టు కొన్ని అనుబంధాలు

  కొన్ని పెదాలు
  ఇష్టంగానో అయిష్టంగానో పలకరిస్తాయి

  దేహంతోనో, ఆత్మతోనో
  స్నేహించిన పెదాలు
  రెప్పలమధ్య ఒలకనివ్వని బిందువుల్తో స్పృశిస్తారు
  ఆ స్పర్శ ఎంత ఊతమిస్తాయో ఏ పదాల్తో తెలపాలి
  గుండెలోకి గుటకవేయడం తప్ప

  దూరాలనుంచి రాలేక
  ఆత్రాన్ని అణుచుకోలేక
  గద్గద స్వరాలై
  సెల్‌పోనుల్లో దుఃఖాన్ని కుమ్మరిస్తాయి

  * * *

  ఎక్కడో ఎప్పుడో గూడుకట్టుకున్న అనుబంధం
  పలకరింపై కప్పేయాలని ఎదురుచూస్తుంటాను
  వచ్చినవాళ్ళే మనవాళ్ళు
  రానివాళ్ళకోసం ఆ దుఃఖపొర ఎందుకని
  ఆరోప్రాణం హెచ్చరిస్తూవుంటుంది
  ఒక్కోసారి ఆ దుఃఖపొర
  దిగులు కంబళ్ళై కప్పేసి
  ఇంకా అనారోగ్యంలోకి నెట్టేస్తుంది

  * * *

  జాగ్రత్తల ఆంక్షలు మొదలౌతాయి
  చదవొద్దని
  ఎక్కువ మాట్లాడొద్దని
  ఎక్కువ నిద్రపొమ్మని
  సమయానికి తినమని
  సమయానికి మందులేసుకొమ్మని

  * * *

  ఇక దేహానికి మరోరకమైన పరీక్ష
  అప్పటివరకు నరాల్లోకి చేరిన మందుల ప్రభావం
  సమతుల్యానికి అడుగులేస్తుంటాయి
  దేహం విశ్రాంతికి కోరుకుంటుంది

  ఆనారోగ్యపు ప్రారంభ మూలాలకోసం చర్చమొదలౌతుంది
  తాగునీరో, తిన్న ఆహారమో
  వేసుకున్న మందులో
  అనారోగ్యన్ని ఆలస్యంగా గుర్తించకపోవడమో
  ఇదిమిత్తంగా నిర్ణయించలేక చర్చముగుస్తుంది

  * * *

  ఆర్థిక వనరులకోసం
  ఎవరి తలుపో తట్టాలని చూస్తుంటాను
  తవని తలుపులవైపు చూపులుచరిస్తాయి

  ఎవ్వరోవచ్చి భుజంతట్టి జేబునింపాక
  దేవుడు తనదైన ద్వారాలు తెరుస్తాడని
  ఎవరినైనా పంపుతాడని గుర్తుకొస్తుంది
  ఆ అశ్చర్యాన్ని నెమరేస్తుంటే
  దేహానికి కొత్త రెక్కలొస్తాయి

  ***

  నీవాక్యము నన్ను బ్రతికించి యున్నది
  నా బాధలలో నెమ్మది కలిగించుచున్నది


  14.8.2012

  28, ఆగస్టు 2012, మంగళవారం

  కాశి రాజు || నాన్నన్న దేవుడు నాతో చెప్పాడు ||

  అమ్మతనం నిండిన
  అనంత విశ్వంలోనుండి
  అరచేతుళ్ళోకి జారినపుడు
  మొదటి ముద్దు అమ్మిచ్చిందట
  దాంతో ఒక్కసారి ఉలిక్కిపడి
  విశ్వాన్నే జయించిన వీరుడిలా
  కనిపించానట నేను

  రెండో ముద్దు నాన్నెడితే
  నాలుకతీసి ఎక్కిరించానట
  కితకితలు పుట్టికాబోలు
  అదీ నాన్నే చెప్పాడు

  ఈ భూమ్మీద మొదటాకలి తీర్చిన
  అమ్మతనాన్ని
  చిత్రించాడట మానాన్న
  ఆమె చనుబాలు నా నోటికందిస్తూ
  ఒళ్ళో ఉన్న నా బుగ్గమీద
  ప్రేమచుక్కలు రెండు కురిపించిదట
  వాటిని
  మా నాన్న
  తన ముక్కుతో తుడిచాడట తెలుసా!....?
  నాతో చెబుతూ చెమ్మవుతున్నాడిప్పుడు.

  "పెరిగి
  పెద్దైనా
  పేగుబందం తెగదులేరా"

  ఆకలినీదైనా
  అలమటింపు తనది
  అందుకే
  ఆమె
  అమ్మైందిరా

  కడుపులో ఉన్నప్పుడేననుకున్నావా?
  పేగుతెంచుకుని పుట్టేసాక్కూడా
  నీకాకలైతే తనకెలా తెలుస్తుంది చెప్పు?
  ఇంకా ఆ లంకె ఏమిటో?
  ఎక్కడుందో?
  ఎవడు దాన్ని సృష్టించాడో తెలుసా?

  అని అడిగాడు
  తెలీదన్నట్టు చూసాన్నేను

  దగ్గరకు పిలిచి
  చెవిలో నోరెట్టిమరీ నాన్నన్న దేవుడు నాతో చెప్పాడు
  "నేనెనని"

  *28-08-2012

  క్రాంతి శ్రీనివాసరావు || ఆకలి....కొలత ||

  ఆకు..పప్పు నెయ్యూ అన్నీ
  మనసులోనే వేసుకొనేవాళ్ళం
  అమ్మ చక్కలిగిలి పెడితేనవ్వుకొనే వాళ్ళం

  గంజీ గటకే తప్ప
  వేడి వేడి ఇడ్లీ ఉప్మా ఎరగనివాళ్ళం
  చద్దన్నమే రోజూ పలహారం
  గొడ్డుకారమే మాకు గొప్ప విటమిన్లు

  ఏరుకొన్నవో ఏవరో పారేసుకొన్నవో
  పుచ్చువో పచ్చివో తప్పితే
  ఫలాల జాడ పలువరుసలు ఎరుగవు
  రుచి మరచిన నాలుక కసలేతెలియదు
  మెలితిప్పే ఆకలిమంటలు
  మలిపేందుకు నీళ్ళూదొరకవు

  ఎ బి సి డి అక్షరాలు మా తెలివికి తెలియదు
  ఎ బి సి డి విటమిన్ల్లు మాతనువుకుతెలియదు

  నెత్తురూ చాలినంత వుండదు
  వున్నదాంట్లో కుడా వుండాల్సినవి
  ఎక్కువో తక్కువో వుంటాయు

  సరిపోనూ అనే పదం
  మాజీవితాల్లోంచి
  చెరిపేసుకొని చాలాకాలమయ్యుంది

  ఇరవైఏళ్ళకే మాకు అరవైఏళ్ళువస్తాయు
  వయసుతోపాటు వైరాగ్యమూ వస్తుంది

  ఆకాశం నెత్తిమీద కూలిపడుతూనే వుంటుంది
  కాళ్ళ కింద భూమి బద్దలై పాతాళంలో
  తూలి పడిపోతూనే వుంటాం

  వైరస్ లన్నింటికీ వాసయోగ్యమై
  శిధిల శిలాజాల్లా సంచరిస్తూనే వుంటాం

  మిగతా జంతువులకు మల్లే
  సహజాత సంతోషాలూ దొరకవు
  సహజ మరణాలు ప్రాప్తించవు

  ఒక్కోఅవయవం కూలి
  అణువణువూ చీలి
  తనువంతా తగలడి
  చితిని చేరకముందే
  మా కపాలం పగిలిన శబ్దం
  మేమే వింటూ

  ఊహల కందని వేదన
  ఊదర పెడుతూ వుంటే
  ఊపిరి వదులుతు వున్నాం

  ఆకలి చావులు కావట మావి
  అసలవి లేనే లేవట
  మరు జన్మంటూ వుంటే మళ్ళీ మనిషిగ పుట్టాలని లేదు

  *28-08-2012

  నందకిషోర్||పునర్విమర్శ అభ్యాసం-1||

  గద్దలు ఆకాశం తమదంటూ
  చక్కర్లుకొడ్తాయ్.
  పాములు పుట్టల్లోంచి,గుట్టల్లోంచి
  పైకిపాకుతాయ్.

  నిజాయితీలేని ఆసరా ఏదో
  మినుక్కుమనే గాలిలో మెరుస్తుంటుంది.
  సంజాయిషీ కోరని అభిమానమంతా
  చురుక్కుమనే నీడలో తడుస్తుంటుంది.

  శిశిరాన్ని గెలిచిన పిచ్చిలో,వెర్రిలో
  చెట్టుకి ఏమి పట్టకపోవచ్చు.
  వసంతం చూడని కోయిలలగొంతులో
  రాగం ఏది పుట్టకపోవచ్చు.

  వాలే పక్షులకి ఏ చెట్టైనా ఒకటే-
  గూడు కడ్తే గుండె పగిలిపోతుంది.
  గాలివానొకటి గట్టిగా వీస్తే
  నిజం నిక్కచ్చిగా తెలిసిపోతుంది.

  ఏదైతేనేం?
  ఋతువొకటి మారింది.
  ప్రకృతికి,నీకు
  పనికొస్తుంది.

  ఎలాగైతేనేం?
  ఋజువేదో దొరికింది.
  వాగుకో,వలసకో
  పొమ్మంటోంది.

  విషాదాన్ని మింగి మూగబోయిన నీకు
  పగిలిన కన్నుల్తో ప్రాణంపోయిన నీకు
  మరో అకాలాన్ని కలవలేని నీకు
  మరో ప్రపంచాన్ని చూడలేని నీకు

  సాయం సాయంత్రమై కరిగేపూట
  ఎందుకొచ్చిన వేదాంతం బుల్‌బుల్?
  నిజం.. నీకెవరూ లేరు!
  నీ రెక్క నువ్వే కట్టుకోవాలె.
  నీలాగే నువ్వు ఎగిరిపోవాలె.

  ఏం జరిగిందో,ఏం మారిందో ఆలోచిస్తూ,
  ఎటెల్లావో,ఎలా చిక్కుబడ్డావో పరిశోధిస్తూ,
  ఏం దాచావో,ఏం కోల్పోయావో లెక్కలువేస్తూ,
  ఎక్కడికి పోవాలో,ఎలా తెంపుకోవాలో పత్రంరాస్తూ,

  కాలం నిర్దయగా వెక్కిరించేవేళ
  ఎవరిచ్చిన ఏకాంతం బుల్‌బుల్?
  నిజం..నీకెవరు లేరు!
  నీ గింజ నువ్వే సంపాయించాలె.
  నీ బతుకు నువ్వే బతికిసూపాలె.

  Date 28.08.12

  నరేష్ కుమార్ //ఒక తిరోగమణం//

  గుప్పెడు చీకటి
  మొహంపై చల్లుకొని
  పరిస్కందున్నై
  విభ్రమం తో
  పరిభ్రమిస్తున్నా...

  ప్రభవానల ప్రకాశం నుండి
  పారిపోతున్నా...
  నా లోకి నేనే

  దవళ కాళ యుగళ
  దళాల నడుమ
  నిర్విరామ
  నిర్నిద్రా గమనం
  నన్ను నేను
  వెతుక్కోవటానికే...

  శరాఘాత
  గాయాలు నిండిన
  హయాల ద్వయారూడుడినై
  విఫల విహ్వల
  అస్త్రాలతో
  మనో వల్మీకపు
  కుడ్యాల పై
  నన్నునేను
  ప్రతిష్టించుకుంటూ
  నిమిషాల నివహాళ్ళొంచి,
  ఆవర్తపు ఆవాసాల
  మధ్యనుంచి
  పంచముడై, వంచనుడై
  పరాజిత
  చరిత్ర పుటల్లో
  నా చరిత్రను
  పునర్లిఖిస్తూ
  పునర్జన్మిస్తూ...

  అనంతానంత
  దిగంతపు మేఖలలో
  ప్రతిధ్వనిస్తూ,
  పరిక్రమిస్తూ..
  మౌనం చెక్కిలిపై
  హస్తపురేఖలు
  చిత్రిస్తూ....
  నన్నునేనే
  ఒక
  ప్రస్తానపు ధునిలో
  పారేసుకుంటూ
  పరీవ్రుతున్నై
  పరిగెడుతున్నా....
  నాలోకి నేనే.....

   28.08.2012

  శిలాలోలిత॥దుఃఖపు రజను॥

  లోపలిమనసులోని
  పెనుకేకలు - ఎంత పెనుగులాడినా వినిపించవు.
  గుండెలు పగిలిపోతున్నా
  దుఃఖపురజను నుసి కనిపించదు.

  నిశ్శబ్దపు సొరంగంలో
  ఎంతకీ తేలని శబ్దపుతట్టు
  ఒక్క కన్నీటిబిందువునూ సృష్టించదు.

  అంతా మామూలే-
  గబుక్కున మబ్బుదుమికినట్టు ముఖం
  ఉదాసీనపు ముకుళిత కుసుమంలా మారిపోతుంది.

  విచ్హుకోబొయిన రేకులు
  మాటల వాడికి విలవిల్లాడతాయి.
  నవ్వబోతున్న పరిమళం
  ఏ సువాసనని ఇవ్వదు.

  అరచేతిలో నెత్తురోడుతున్న మనసు పుష్పం=
  ఎన్నిసార్లు కడిగినా,తుడిచినా కన్నీళ్ళే!

  ప్రేమమట్టిని తొలుచుకుని
  బతుకుమొక్కపై మొలిచిన నెత్తుటిమొగ్గ- మనసు!
  కొత్తజన్మతో కన్రెప్పలు తెరిచిన కుసుమానికి
  క్షణక్షణం కంటకాల సయ్యాటలే!

  అదేమిటోగాని

  మంచుకన్నా స్వచ్హం.స్ఫటికమైన మోహం
  అనంతమైన అనురాగం
  లోలోపలి మనసులో నీకై, నీకొరకై...!

  *28-08-2012

  వర్ణలేఖ ||అంతులేని ప్రశ్నలు ||

  ఎదగాలని ఉవ్వెత్తున
  ఎగసినప్పుడల్లా

  నీవు నను నిలువరిస్తూ
  నాతోనే ఉంటావు పంచభూతాల్లా....

  నీవులేంది నిలువలేను
  నీవుంటే ఎదగలేను

  గాలిలా వచ్చి
  నా గమ్యాన్ని మారుస్తావు

  వానవై తాకి
  నా కలలను కరిగించేస్తావు

  అగ్నివై నాలోని
  ఆశలు ఆవిరి చేస్తావు

  ఆకాశంలా మారి
  నను చిన్నదాన్ని చేస్తావు

  ఎంతకి నేనొదగకపోతే

  భూమివై నను
  నీలో కప్పెట్టేస్తావు

  *** *** *** ***

  ఎదగమనేదీ నీవే
  ఎదురు నిలిచేదీ నీవే

  వేటాడ నేర్పుతన్నవు
  నన్నే వేటాడుతున్నవు

  విమర్శ పేరుజెప్పి
  విదిలించి కొడతావు

  సలహాల పేరుజెప్పి
  సచ్చుపడవేస్తావు

  పాలుబోస్తె పంతవు
  లేదంటె కాటేస్తవు

  నేనెట్ట ఆడేది
  నేనెట్ట పాడేది

  నేనెట్ట ఎదిగేది
  నిన్నెట్ట గెలిచేది

  28-8-2012

  సురేష్ వంగూరీ || మీడియాజాలం ||

  మనసుని శాటిలైట్ ఛానళ్లుగా విడగొట్టి
  కుహనా విలువల రిమోట్ కంట్రోల్తో
  మనల్ని మనమే మార్చి మార్చి
  మోసం చేసుకుంటూ ఉంటాం

  జీవితం డైలీ సీరియల్‌లా
  అరాచకంగా సాగుతుంటే
  అర్ధాంతరంగా ఒక కమర్షియల్ బ్రేక్...
  అనుకోకుండా అందులో మనమే ఉంటాం

  మనం పంటి నొప్పితో బాధపడుతూ
  డెంటిస్ట్‌ను సంప్రదించకుండా
  చిత్రంగా సినిమా కెళతాం
  సినిమాలో కొందరు రౌడీలు
  హీరోయిన్ని బలవంతం చేస్తుంటారు
  ఉన్నట్టుండి పంటి నొప్పి తాళ లేక
  ఆ... అని అరుస్తాం
  మన మీద జాలి పడిన హీరోయిన్
  అత్యాచారాన్ని వాయిదా వేసుకుని
  తెర చీల్చుకుని మన ముందుకొస్తుంది
  ఉచితంగా ఒక ఉప్పు సలహా ఇస్తుంది

  ఏమీ జరుగుతుందో మనకర్ధమయ్యే లోపే
  ఆమె తిరిగి తెర మీద కనిపిస్తుంది
  రౌడీలకు స్వచ్చందంగా సహకరిస్తూ
  తన అత్యాచారం సీను కంటిన్యూ చేసుకుంటూ
  అచ్చం మన సంకీర్ణ ప్రభుత్వంలా

  ఇప్పుడు
  శీలం కాపాడుకోవటం కన్నా
  పంటి నొప్పికి కారణాలూ పరిష్కారాలూ
  తెలియచెప్పటం అత్యంత అవసరం

  ఇక్కడ
  అమ్మకమే జీవితం
  ప్రభుత్వాలు వాణిజ్యం చేస్తున్నాయో
  వాణిజ్యాలు ప్రభుత్వం చేస్తున్నాయో మనకు పట్టదు
  ఇంకా ప్రాధమిక హక్కులే అనుభవానికి రాని మనం
  బంగారపు హక్కుల గురించి పోరాడుతుంటాం

  చూడటానికీ మోసపోవటానికీ
  అలవాటైన జీవితంలో
  కరెంటుపోయిన ఒక రోజు
  ఏదోటి చూడకుండా ఉండలేని మనం
  విధిలేక మనసుల్లోకి చూసుకుంటాం
  మెల్లగా మల్టీ మోసాల మీడియాజాలం అర్ధమవుతూంటే
  ఏడ్వడానికి కూడా సిగ్గేస్తుంది

  సరిగ్గా అప్పుడే
  నీ మీద నుంచి అడ్డంగా ఒక మెరుపు వెళుతుంది
  సత్యం సాక్షాత్కరిస్తుంది
  అవాక్కయ్యారా అని ప్రశ్నిస్తుంది

  28. 8. 2012

  వంశీ // మదర్ లాండ్ //

  మన డబ్బుతో
  మన్తో పన్జేయిస్తూ
  మనకే జీతాలిచ్చే ప్రజాస్వామ్యంలో,

  సుబ్రహ్మణ్యస్వాములూ
  తెహల్కా డాట్ కాములూ గడ్డి తినుంటే,
  "రాజా"వారీపాటికి సాంబారిడ్లీ తిని, మెరీనాలో
  భావకవితల్రాద్దురు కనిమొళిని కని,
  దేశభద్రత మట్టికొట్టుకుపోయేది..

  జర్నలిజం మొఫసిల్ వార్తలూ
  బొడ్డుసుందర్ల ఉవాఛలేరాస్తే,
  న్యాయం గనుల"గాల్లో" కలిసి
  సచివులు కాక్ టెయిల్
  ఉతార్ పెగ్గులేద్దురు బెల్ట్ షాపుల్లో..

  హయ్యర్ హైరార్కీ కి మేళ్ళు,
  జనాలకి రాళ్ళు మిగిలి,
  పళ్ళెప్పుడో ఊడి,నిజాల్నమిలీ నమిలీ,
  తలొకటే ఖాలీ, పగిలేందుకు..

  యువరాజేడి కనపడ్డూ
  కోచింగా సార్వత్రికెన్నకల్లో ప్రధానిగా,
  ఉద్యమాలేవి వినపడవూ
  మళ్ళీ వ్యూహాత్మక మౌనమా,

  B.P.L కింద
  కాందిశీకుల ద్విధావిఛ్చిత్తి,
  I.P.L మీద పెద్దతలల
  కరెన్సీ చెయిన్ రియాక్షన్..
  ఛ, దరిద్రగొట్టు దేశం,

  -"పట్టుకోండ్రా వాణ్ణి,
  ఇన్సల్టింగ్ ది నేషన్ ఇన్ పబ్లిక్,
  కాగ్నైజబుల్ అఫెన్స్,
  వారంట్ భీ అవసరం లేదు,
  నూకండి బొక్కలో"

  నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ,
  నా ఇల్లు అందులో ఒక కమ్మని ప్రదేశమూ....

  date 27.08.12

  భమిడిపాటి //నాలో మార్పు //......

  అమ్మ చెప్పింది
  పెద్దదానివయ్యవ్
  హద్దుల్లో ఉండమని
  వంచినతల ఎత్తోద్దని ....

  నిన్ననే
  పసిడి ప్రాయాన్ని పలకిరిస్తూ
  కొత్తగా వచ్చిన
  నాకే అర్థం కాని చిన్న మార్పు !

  ఎందుకో
  పదహారు ప్రాయాన్ని పలకరిస్తూ
  ఆశగా చూసే కళ్ళు
  అర్థం కాని ఎన్నో ప్రశ్నల ముళ్ళు

  పొరపాటున కూడా పట్టించుకోని
  పక్కింటి అంకుల్
  కొత్తగా ప్రేమ ఒలకబోస్తో
  ఏదైనా కావాలంటే మొహమాట పడద్దని మరీచెపుతూ

  ఎప్పుడూ నడిచే సందు మొగలో
  చూసే వింత చూపులు
  వెక్కిరించే కొత్త సైగలు
  వినీ వినపడనట్టు ఏవో కొత్త మాటలు

  ఎప్పుడో ఒక్కసారి గుర్తొచ్చినప్పుడు
  హోం వర్క్ తప్పుల్ని
  బెత్తంతో చేతిమీద దిద్దే మాస్టారు
  తప్పుల సాకుతూ ఒంటి మీద చేతితో పెట్టె కితకితలు

  అమ్మ పక్కలో దూరి
  చిన్నప్పుడు వినే కధల్లో
  పెద్ద దానివైతే కొత్త ప్రపంచాన్ని చూస్తావ్
  స్వేచ్చగా జీవిస్తావ్ ...!

  అంటే ఏదో అనుకున్నా !
  ఎంతో ఆశ మనసులో దాచుకున్నా
  కాని వింత ప్రపంచాన్ని చూస్తున్నా
  నాలో మార్పుకి నేనే నాలోనే కుచించుకు పోతున్నా

  26-08-12

  రాళ్లబండి కవితా ప్రసాద్ || నేలకు చేరని నీడలు !|

  వీధి లో నడిచే ప్రతిమనిషి వెనకా రెండు నీడలు
  ఒకే దారిలో వేర్వేరు అడుగులు
  వెలుతురును బట్టి నీడలు,
  అడుగులను బట్టి నడకలు ,
  మారుతూ ఉంటాయ్.

  దారి ఒకటే,
  గమ్యాలు వేరు!
  నడక ఒకటే,
  ముందుకూ , వెనకకూ, ఒకేసారి!

  చీకటి లో
  నడిచేటప్పుడు కూడా,
  తమ నీడల్ని ఈడ్చుకు పోతున్నారు!
  కదల కుండా కూర్చుని కూడా
  పరుగేడుతుంటారు
  ఒకరికొకరు దీకోట్టుకోకుండా
  తేనెటీగల్లా తుట్టె కేసి
  ఎగురుతుంటారు!
  ఏపువ్వును ఎవరు దోచుకున్నారో!
  ఏమనిషిని ఎవరుకుట్టి వచ్చారో!
  మర్చి పోతుంటారు!

  వీధి లో ఎగిరే ప్రతిమనిషి వెనకా
  నేల మీద పడని వేల నీడలు!

  27-08-2012

  వర్ణలేఖ || స్పందన ||


  నిన్నెప్పుడూ
  మనసులో నుండి
  తోసేస్తూ నేను
  నన్నేప్పుడూ
  నీలొనే
  భద్రపర్చుకుంటూ నీవు

  ఎప్పుడూ నేనేనా
  నీవెప్పుడూ చెప్పవా
  అనే నీ బుంగమూతి
  నే స్పందించనని
  నీవలిగితే
  నే నవ్వినపుడు

  ఈ స్పందనే
  నాక్కావాలని
  సంతోషపడతావు
  నాకో చంటిపిల్లాడు
  దొరికాడని
  నేనింకా నవ్వుకోవడం
  నీవేమో ముత్యాలేరుకోవడం

  27-8-2012

  చింతం ప్రవీణ్||కన్నీళ్ళు||

  నాకెందుకో ఏడ్పురాదు
  లోలోపల వేదనతో
  హృదయం పగిలి ముక్కలౌతున్నా
  పైకి మాత్రం ఒక్క చుక్క కన్నీరు ఉబికిరాదు
  అప్పుడప్పుదు అనిపిస్తుంటుంది
  నేను బండబారానా అని

  కొందరేమో అశ్చర్యంగా
  క్షణాల్లో కన్నీళ్ళ కొలనౌతారు
  చూస్తుండగానే

  నాకేమో ఏడ్పురాదు

  అలా రోడ్డుమీద ఓ అడుగు వేస్తానో లేదో_
  కకావికలమౌతాను
  మెదడులో అలోచనకాలోచనాలు
  ఉక్కిరిబిక్కిరి చేస్తాయ్

  ఒక్కో దృశ్యం
  గుండెను నిమిషానికి వెయ్యిసార్లు కంపితం చేస్తుంది

  ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పాపను చంకనెత్తుకున్న బిచ్చగత్తె
  బస్టాండు రైల్వేస్టేషన్లలో కరగడానికి సిద్దంగా ఉన్న యవ్వనవతి
  స్వేదం కురుస్తున్నా బతుకురిక్షాబండిని లాగుతున్న వృద్దుడు
  వివర్ణ ప్రతిబింబాలై విచలిత బతుకులను భుజాలపై మోస్తున్న బాటసారి

  బతుకు సుడిగుండంలో జీవితాన్ని కోల్పోతున్న వీళ్ళందరు
  గుండెను నిమిషానికి వెయ్యిముక్కలు చేస్తారు
  కుండపోత వరదలా ముంచెత్తి గుండెరేవును గండి కొడ్తారు

  ఐనా
  పైకి మాత్రం ఒక్క చుక్క కన్నీరు ఉబికిరాదు...

  అలా సమాజ మరుభూమిలో
  ఎవరైనా బతుకుపందానికి ముగింపు పలికితే... వెళ్తానా

  సానుభూతి చూపిస్తు కొందరు
  తెచ్చిపెట్టుకున్న కన్నిళ్ళతో ఇంకొందరు
  కుండపొత వర్షంలో నన్ను బందీని చేస్తారు
  దింపుడు కల్లంలో ప్రాణం దొరకని చోట
  అక్కడ నేను దొరికిపోతాను

  ఒక్క చుక్క కన్నీరు రాదు!
  వీడు బండబారాడని కొందరంటారు
  కృత్రిమ కన్నీళ్ళకు విలువనిచ్చేవాళ్ళు

  నేనంటాను
  కన్నీళ్ళు
  అనివార్యమైన సానుభూతికి నజరానాలు కాకుడదని

  ఐనా
  మన కన్నీళ్ళలో హృదయం లేనపుడు
  మన కన్నీళ్ళు
  మన హృదయం
  మనం
  నమ్మకం కోల్పోతాం ఎప్పటికైనా_

  26.08.2012

  శ్రీకాంత్|| పరదాలు||

  ఎర్రటి మట్టి మాలలలోంచి
  ఎగురుతోంది గాలి, రాణులు
  స్నానమాడిన కొలను వద్ద

  తెల్లటి బాతులు నడిచిన
  ఆ దారులలోనే ఉన్నాయి
  ఇప్పటికీ పచ్చని ఆకులు

  రాత్రి బావిలో తొణికిసలాడే
  నిండు చంద్రుడు, వానలో
  తడిచి వణికిన తల్పం ఇదే

  తడి పాదాలతో నీకు పైగా
  నడిచి వెళ్ళిన రాణీవాసపు
  రహస్య స్త్రీలు రారిక నీవైపు

  పరదాలు దాచుంచిన
  ఆ మందిరాలలోంచి
  స్మృతి చరిత్రలలోంచి.
  ----------------------
  27.08.2012

  భవాని ఫణి ||ఆసరా ||

  ప్రాణం పరుచుకుని
  దేహం దర్పంగా నిలుస్తుంది
  మౌనం పరుచుకుని
  నయనం కథలెన్నో చెబుతుంది
  ప్రాయం పరుచుకుని
  యవ్వనం నిండుగా నవ్వుతుంది
  మేఘం పరుచుకుని
  వర్షం వెల్లువలా కురుస్తుంది
  భావం పరుచుకుని
  భాష కవిత్వాన్ని స్రవిస్తుంది
  నీ ప్రేమని పరుచుకుని
  నేను పసిపాపలా నిదురిస్తాను

  27/08/2012

  Mercy Margaret ||జీవితం ఒక చక్కటి కాఫీ లాంటిదే||

  నిమిషాలన్నీ
  కాఫీ చుక్కలుగా
  కాలాన్ని కాఫీ చేసుకుని తాగెయ్

  ఒక్క కప్పు కాఫీ రుచిగా
  ఉండడం కోసం
  జీవితాన్నిమరిగించే
  పిచ్చి వారిలో నువ్వూ
  ఒక దానివేగా

  వేడి వేడి పొగల్లో తన
  జ్ఞాపకాలతో నింపుకున్న శ్వాస
  ఆవిరై పోనివ్వక
  తన మాటలన్నీ
  చెక్కర గుళికలుగా చేసుకో
  ఆ పోగానంతా పీల్చేసుకొని
  గుండెల్లో నింపుకో

  అక్కడే తను ఘనీభవించి పోయేలా
  ఆ ఆవిరులకు
  నీ తలపుల వెచ్చని కౌగిలి
  జోడి చెయ్

  చూడు అప్పుడు జీవితం
  ఒక చక్కటి కాఫీ లాంటిదే కదా !

  27/8/2012

  స్కైబాబ || సహచరం ||  కొత్తగానో ఒంటిగానో
  బయలెల్తే
  ఎక్కడ విడిది చేస్తే
  అదే ఇల్లు
  ఎటు ప్రయాణిస్తుంటే
  అటే గమ్యం

  గాడిని తప్పుకొని
  గడులు గిరులు దాటుకెళ్తుంటే
  అదో ఖుషీ
  అసలు 'గోల్' అనే ఒకదాన్ని
  నాశనం చేస్తే
  అంతా మైదానమేరా బై !

  *
  దేహ ఖండా లేకమైంతర్వాత
  అగ్గి పుట్టడమే కాదు
  ఘనీభవించడమూ ఉంటుంది

  జీవితం
  సహచరమనే పరచేతిలో
  పగ్గమై నలిగిపోతుంది

  ఒకరి ఆధీనంలోకి
  హద్దులోకి నడవడం
  నాలో నదులు నదులుగా
  ప్రవహిస్తున్న చైతన్యాన్ని
  ఉప్పు సముద్రంలో కలపడమే !

  వద్దు
  ఈ గుంజలొద్దు గుంజాటనలొద్దు
  ఈ పలుపుతాళ్లొద్దు గుదిబండలొద్దు
  బందీ కావడం నా చేత కాదు
  చేతన కాదు

  మనుషుల్ని తడుముతూ
  వాళ్ల పరవళ్లనూ
  కన్నీళ్లనూ
  తోడ్కొని
  పాయలు పాయలుగా విడిపోతా...

  27-08-2012

  మోహన్ రుషి ||ఒకరోజున..!||

  కడుజాగ్రత్తగా ఉంటాననీ
  అపురూపంగా చూసుకుంటాననీ
  అపార్థం చేసుకోననీ
  అనర్థాలకు కారణం కాబోననీ చెప్పాను!

  కేవలం వినడం చేస్తాననీ
  చూపుని నిశితం చేసుకుంటాననీ
  కరుణతో మెలగుతాననీ
  కళ్ళల్లో తడిని కాపాడుకుంటాననీ చెప్పాను!

  శుభ్రమైన మనసుతో చరిస్తాననీ
  చిరుదుఖ్ఖానికైనా చలిస్తాననీ
  బలమైన కాంక్షతో కౌగిలించుకుంటాననీ
  బంధానికి అంతులేని అనురాగం అద్దుతాననీ చెప్పాను!

  కిటికీలు తెరిచి ఉంచుతాననీ
  గదులన్నీ ఖాళీగానే అట్టిపెడ్తాననీ
  వెలుతురును నిలుపుకుంటాననీ
  వెన్నెలనే కురిపిస్తాననీ చెప్పాను!

  చేతిలో చెయ్యి వేసి
  తన ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తానని
  జీవితంతో చెప్పాన్నేను!

  27-08-2012

  ఈడూరి శ్రీనివాస్ ||ఒకప్పుడు||

  ఒకప్పుడు భూమ్మీద మనుషులుండేవారట
  మంచితనం, మర్యాద పంచుతుండేవారట.

  ఏవైపు చూసినా పచ్చదనం వుండేదట
  నదీ పరివాహకాల్లో నాగరికత విరిసేదట.

  ఏనోటి మాట విన్నా మనసు పులకరించేదట
  ఏఇంటి తలుపు తట్టినా ఆప్యాయత పలకరించేదట.

  శ్రమైక జీవన సౌందర్యం అనుభవించేవారట
  చెరపకురా చెడేవు అని చెప్పుకునేవారట.

  ఆ రోజులు పోయాయి, అవతారాలు మారాయి
  విలువలు తరిగాయి, స్వార్ధాలు పెరిగాయి

  నేడు భూమ్మీద వున్న జనం మనుషులు కానేకారు
  యాంత్రికంగా బతుకు లాగే మరమనుషులు వీరు

  జురాసిక్కు పార్కులో స్పీలుబర్గు చూపించినట్లు
  రాక్షస బల్లుల్లా మనుషులు మళ్ళీ పుడతారట

  అమ్మ నన్ను ఈరోజు జూకి తీసుకెడుతోంది
  మనుషుల్ని చూపిస్తా రారమ్మని అంటోంది

  అంతరించిపోతున్న మనిషి జాతీ వందనం
  ఫ్యూచర్లో ఎక్కడో మళ్ళీ కలుద్దాం మనమందరం!!!!

  27/8/12

  క్రాంతి శ్రీనివాసరావు || నిజం భాష||

  నిన్నటి రక్తపాతం
  ఆవిరయ్యుందనుకొనేలోపే...

  నిప్పుల వడగళ్ళ వానై
  మళ్ళీ కురుస్తోంది

  నిన్నటి ఆర్తనాదాలు
  ఆగిపోయాయనుకొనేంతలోపే

  గుండెలు పగులుతున్న చప్పుళ్ళు
  మళ్ళీ మొదలవుతున్నాయు

  నిన్నటి కన్నీటితో
  సేదతీరకముందే

  సన్నటి ధార మళ్ళీ
  ప్రవహించాల్సివస్తూనేవుంది

  నిన్నటి ఆకటి తడీ ఆరలేదు
  రేపటి చీకటీ తొలగేట్లులేదు

  వాడలు వూళ్ళయ్యేదెన్నడో
  బళ్ళు ఓడలయ్యేదెన్నడో
  రాకాసి రాబందులూ వాళ్ళే
  విషసర్పాలూ వాళ్ళే
  మేం మాత్రం ఎప్పుడూ కోడిపిల్లలమే

  పుట్టకముందే ఒకటి
  పుట్టాక మరొకటీ చంపుకుతింటున్నాయు

  ఒక్క ఘోష బుసకొట్టినా
  సహించలేరు
  మాలోంచి ఒక్క కిరణం వెలిగినా
  మలిపేదాకా నిద్దుర పోరు
  అయునాసరే
  నిన్నటి ఆకులు రాలకా తప్పదు
  రేపటి కోసం
  కొత్తచిగుళ్ళు తొడగకా తప్పదు

  అనాదిగా అడుగునే వున్నా
  సరికొత్త సమసమాజానికి పునాదిరాళ్ళం
  మేమే అవుతాం

  *27-08-2012

  కర్లపాలెం హనుమంత రావు॥వెతుకులాట॥

  పుప్పొళ్ళకోసం తూనీగల వెతుకులాట

  తల్లి కాబొయే పిట్ట చాటుకు

  పుల్లా పుడకా కోసం మగపిట్ట వెంపర్లాట

  కంటికి కనిపించవు గానీ

  చీమా దోమా నక్కా కుక్కా

  జీవించినంత కాలం గింజా బొంజా బొక్కా తొక్కా వెతుకులాటలోనే బతికివుండేది.

  అది పురుగూ పుట్రా కత

  అన్నీ అమర్చి పెట్టి పుట్టించిన మనిషి కతో!

  పాలబుగ్గల కోసం తల్లి రొమ్ముల మీద పసివేళ్లతో శిశువు తడుములాటతో మొదలు వెతుకులాట కత…

  అమ్మ వంటింట్లో ఏ పోపు గిన్నెలెనకాల మిఠాయి దాచిపెట్టుంచిందో

  నాయిన ఏ అంగీజేబులొ ఖర్చులకోసం చిల్లర పైసలు మిగిల్చుకున్నాడో…వెతుకులాట!

  పిల్లతనం ముదిరితే పిల్ల నీలికళ్ళ వాలుచూపుల కోసం పిల్లడి వెతుకులాట

  పిల్లడి చొంగ కళ్ళ వెచ్చ్దదలనం కోసం పిల్లదాని దొంగ వెతుకులాట

  అదో దోరవయసు వేట

  చిటికెనేలు పట్టుకుని వెనకెనెకే నడుచుకునే చిట్టి పాపాయి

  చటుక్కున మాయమైపోతే చెట్టూ పుట్టా పట్టుకుని వెతుకులాట

  ఎటూ తప్పదు కదా వెతుకులాట కన్నపాశానికి…చదువులకోసం..చక్కని సంబంధాలకోసం!

  మనుషుల కోసం సరే

  కలిసే మనసుల కోసం..మాటల కోసం…!

  మూటల కోసం…మూటలు దాచే చోటుల కోసం

  అంతరాత్మల బరువులను కూసింత సేపు నెత్తిమీద మోసే హెర్క్యులిస్ ల కోసం

  వెతుకులాటో!

  డబ్బూ దస్కం పేరూ ప్రతిష్ట వంశం గౌరవం మానం మర్యాదా చిలక ప్రాణంలోదాచి సప్తసముద్రాలకావల ఏ మర్రితొర్రలో దాచుంచాలోననీ వెతుకులాటే!

  మనం నాటిన విత్తు మహావృక్షంగా విస్తరిస్తే మహదానందమే గాని

  అరబ్బు ఒంటె మాదిరి గుడారంలో ముడుచుకునేందుక్కూడా మూడడుగుల జాగా కోసం ముదిమితనంలోవెతుకులాటంటే!

  తప్పదా చివరిదాకా మనిషికి ఈ వెదుకులాట!

  పోతాం గనక తెలీదు కానీ

  అస్తికలు కాశీలో కలిపి రావడానికి బయలుదేరే ముందే

  కన్నబిడ్డలు రాయని వీలునామాలో తమ వాటా ఎక్కడుందో వెతుక్కుంటారు.

  కానీ…

  పుప్పొళ్ళకోసమే తూనీగల వెతుకులాట

  తల్లి కాబొయే పిట్ట చాటుకోసమే

  పుల్లా పుడకకు మగపిట్ట వెంపర్లాట

  మనిషి కంటికి కనిపించని

  చీమా దోమా నక్కా కుక్కా

  జీవించినంత కాలం గింజా బొంజా బొక్కా తొక్కా వెతుకులాటలోనే బతికివుండేది.

  వెతుకులాటలోనే వాటి బతుకు పండేది.

  అన్నీ అమర్చి పెట్టి పుట్టించిన మనిషి వెతుకులాట కతే

  నవ్వులాటగా ఉంది మరి!

  *27-08-2012

  కవితాచక్ర ||నీ ఇష్టం..||


  ఉరకలేసే యెద గోదావరి
  పరవళ్ళు తొక్కుతూ
  ఆనకట్ట వేయలేని నా
  పట్టు తప్పి,
  నీ దారి మళ్లితే...
  తలమునకలవుతావో..
  తరలించుకుంటావో
  నీ ఇష్టం!!

  మౌన భాష పలికే కళ్ళు
  భావపు లోగిళ్ళై
  నా మనసు దాటి,
  నీ చెలిమి ముందు
  మరో భాష్యమై నిలిస్తే...
  మనసారా ఆహ్వానిస్తావో
  ఆస్వాదిస్తావో
  నీ ఇష్టం!!

  తీయని తలపుల కలవరం
  వలపు వర్షమై
  నా హ్రుది మిన్ను నుండి
  నీ యెడద నేల పై
  యెడతెరిపి లేకుండా కురిస్తే...
  తనువారా తడుస్తావో..
  మురుస్తావో
  నీ ఇష్టం!!

  ఏకాంత ఊహా సౌధపు
  సౌందర్య దీపాల కాంతి
  అడ్డు పెట్టలేని నా
  చేయి దాటి దేదీప్యమై
  నీ చెంత వెలిగితే...
  వెలుతురవుతావో..
  వెలితినే పారద్రోలుతావో
  నీ ఇష్టం!!

  27.08.2012

  కాశి రాజు || కవికోసం ||

  ఒరేయ్ కవీ
  మనకి కవిత్వం తలకెక్కిందంటే
  ఒప్పుకుంటావా?

  ఎండని ఎన్నెలన్నా
  ఏడుగుర్రాలోడీ ఎటకారమన్నా
  మనకే సెల్లింది

  చిక్కటి సీకట్లో
  ఆమెతో ఆడుకోడమే కాదు
  అతన్నీ ఆటపట్టిస్తాం
  ఈది సివర ఊసులాడ్డాలు
  మనుసుల్ని మెలికలుతిప్పేసి
  మనుసుల్ని పిప్పిసేసి పిండేయడాలే కాదు
  ఫిరంగులు పేల్చేయడం కూడా తెలుసు మనకు

  అలాగే
  అప్పుడప్పుడూ
  ఆరోగ్గమైన
  అబద్దాలల్లుతాము

  నిజాల్ని
  నిజంగా
  నిక్కార్సుగా
  నిలదీసేవాళ్ళేవారు సెప్పు ?

  ఎవరో కసిర్తే
  మనమో రాయిసుర్తాం
  కాపోతే
  అదీ కవిత్వంలాగుంటాది
  అందుకే
  మనమే తోపిక్కడ

  ఐతే మాత్రం?

  కవిత్వాన్ని
  కుంచాలు
  కుంచాలుగా
  కుమ్మరించక్కర్లేదట

  కావాల్సినోళ్ళకి
  కావాల్సినంత
  కవిత్వం
  కావాలట
  కవిత్వంలాగ 

  (*27-08-2012)

  కిరణ్ గాలి ||అక్షరాన్ని నమ్ము||

  కవీ
  అక్షారాన్ని నమ్ము
  నీ లోలోపల రాజుకునే అగ్గిని నమ్ము

  అవహేలనపహాస్యాలను,
  అర్ధంగికార అభినందనలను
  అద్రుశ్య అపనమ్మకాలను కాదు

  అమ్మ తోడు!
  అరవాక్యం అర్ద్రంగా రాయలేని
  అంతర్జాతీయ కవులున్నారు

  వాళ్ళ అంతరాత్మలకీ తెలుసు
  వాళ్ళ అంతరంతరాలలో
  ఎంత లోతుందో,
  ఎంత చెమ్ముందొ,
  ఎంత చేవుందో

  అందుకే
  అక్షారాన్ని నమ్ము
  నీ లోలోపల రాజుకునే అగ్గిని నమ్ము

  ***

  విమర్శుకుల సంగతా?

  విశ్లేషకుల ముసుగులో విదూషకులు వాళ్ళు
  బంటుని రాజంటారు రాణిని దాసంటారు
  యోధానుయోధుడికి మాత్రం కత్తితిప్పడం రాదంటారు
  వారు ఔనంటె దాసి రాణవుతుంది
  వారిని కాదంటె రాజు బంటవుతాడు

  వారి "స్వ అర్ధాన్ని" నిమరక పోతె
  మొగ్గను తుదిమెస్తారు, పువ్వును చిదిమెస్తారు
  మొక్కను పీకెస్తారు, చెట్టును నరికెస్తారు

  అందుకే
  అక్షారాన్ని నమ్ము
  ఎ ఆయుధాలు కొనగోటిని తాకలేని మహ వృక్షమవ్వు

  ***

  ప్రసిద్ధ కవి సంగతా?

  ఆయన నిలువెత్తు అహం కూల బడ్డ కలం...
  తరం మారినా తీరు మారని జడం
  పేరు చూసి మోసపోయి అద్భుతమనుకోకు
  తూకమేసి తూచి మరీ వారి విలువను కట్టు

  వారి వంధిమాగధులు అంతే!

  వారి సాలె గూడులో ఈగలు వారి నీడలొ ఛాయలు
  కవిగారు ఏం రాసినా, ఎలా రాసినా వాహ్ అంటారు వహ్వ అంటారు
  వారు కనికరించి వీడి బుజం తట్టి బాగా రాసావ్! నా లాగ రాసావ్ అన్నారా
  వీడిక పుస్తకం అచ్చెసుకుంటాడు ముందు మాట రాయించు కుంటాడు.

  ***

  ప్రచురణకర్త సంగతంటావా?

  భవదీయులకే మరి బట్రాజులు వీళ్ళు
  అతిరధమహారధులకే వీరి అథిధి సత్కారాలు
  వీళ్ళు కొట్టని చప్పట్లకు నీ కవిత ఓడి పోదు
  వీళ్ళు ముడిచె నొసళ్ళకు నీ కలం చిట్లి పోదు

  ***

  నిరుత్సాహ పడకు...

  నిప్పులు వంటికి రాసుకొని అగ్గిలోకి దూకు
  కణకణ మండే అక్షరాలు దోసిటిలో పట్టు

  ఆ అక్షరమే నిన్ను
  నిర్మిస్తుంది
  ఆ అక్షరమే నిన్ను
  నిర్వచిస్తుంది
  ఆ అక్షరమే నిన్ను
  నిర్భయిస్తుంది

  నీ అక్షరం నిజమైతే నిఖిలమై నిలుస్తుంది
  నీ అక్షరం నిజాయితి నిండు మనసులు గెలుస్తుంది
  నీ అక్షరం ఆర్ద్రత వేయి గుండెలు తడుపుతుంది
  నీ అక్షరం ఆవేశం ఆరిన ఆశయాలను వెలిగిస్తుంది

  అందుకే
  అక్షారాన్ని నమ్ము
  నీ లోలోపల కుసుమించే పువ్వుని నమ్ము

  *27-08-2012

  27, ఆగస్టు 2012, సోమవారం

  వాసుదేవ్ ॥ మధుపములు॥

  నా నిశ్శబ్దం కరిగిపోతూనె ఉంది, నెమ్మదిగా
  నా గతాన్ని భుజాలపై వేసుకుని మరీ వింటున్నా
  కాలం విడిచిన కుబుసంపైనుండీ...
  ఆ గతకాలపు చరిత్ర చెప్పిన కథలనుండీనూ...
  సూర్యాస్తమయపు చారికలన్నీ
  నా ఇంటిగుమ్మం ముందు ఓ కథని అల్లుతూనే ఉన్నాయి
  నా కథలూ, నీ కథలూనూ
  ఆ సాయంత్రపు వీచికలు నైట్ క్వీన్ పువ్వుల పరిమళంతోడుగా
  నామొహాన కొడుతూ ఎన్ని కబుర్లు చెప్పాయని
  నా వయిలెన్ని తోడుతీసుకొచ్చాయి
  సంగీతాన్నీ, పరిమళాన్నీ మేళవిస్తూ
  నా పక్కనుండేం లేదు- ఓ ఖాళీ నిట్టుర్పు తప్ప!

  వారెవరో నా మనసు గర్భగుడిలో కొచ్చేశారు
  ఇంధ్రధనుస్సు ఎనిమిదో రంగుచీర కట్టుకునిమరీ,,,
  నా ఆలోచనలన బరువులన్నీ వారే మోస్తూ
  ఆమె అక్కడుండాలెమో మరి!

  నా మధురోహలన్నీ నన్ను ఓదారుస్తుంటాయి
  వర్షంలాగా, మేఘాల్లాగా
  గతాన్నీ కాల్చీ, వర్తమానాన్నీ ఓదార్చుకుంటూ.....
  నేటి పింగాణి గిన్నెలో బతికేస్తూంటూ ఉంటా
  నేను వాటికెంతకావాలో వాటికీ
  నేనంతే కావాలనుకుంటా.....
  ఈ జ్ణాపకాల మల్లే!
  ఏదీ కొత్తకాదు, ఏదీ పాతకాదు
  అన్నీ కావాలి..ఈ బతుక్కి
  ఇలా బతకడానికి


  * (24.August.2012)

  - శ్రీకాంత్ ||కవిత గురించి ఒక అ/కవిత||

  కవిత ఎలా రాయాలో చెప్పు అని
  ఆ నూనుగు మీసాల యువకుడు రాత్రంతా రాత్రిని అడిగాడు

  నీటిలోని ముఖాన్ని
  అరచేతుల్లోకి తోడుకుని, అద్దంలోకి విసిరివేసావా ఎన్నడైనా
  ముఖంలోని అద్దాన్ని
  అదిరే పెదవులతో అందుకుని, పరికించావా ఎన్నడైనా? నేను అన్నాను.

  ప్రతీకలు ఎలా, పదాలు ఎలా
  పోలికలని పోలికలతో పోల్చడం ఎలా? అని నెత్తురు నిప్పులు ఎగిసే శరీరంతో

  అమాయకంగా మళ్ళా ఆ కుర్రవాడే అడిగాడు
  తన ఎదురుగా కూర్చున్న ప్రేయసిని మాటలతో మాత్రమే తాకే ఆ కుర్రవాడు

  మధుపాత్ర ముందు మాటలు వొద్దు
  తలలో తురిమే పూలను, పోట్లాలలోనే దాచేయవద్దు: చెప్పాలనుకున్నదేదో చెప్పు
  అడగాలనుకున్నదేదో అడుగు: కోరుకోవటం పాపమేదీ కాదు ఇక్కడ
  పరమ పవిత్రమైన పుణ్యమేదీ లేదిక్కడ. చూసావా నువ్వు, విన్నావా నువ్వు
  తను వొదిలిన నిట్టూర్పు నీ చుట్టూతా ఎగిరే చప్పుడు? అడిగాను నేను, అడగక-

  కవిత ఎలా రాయాలో చెప్పు, కవిత ఎలా రాయకూడదో చెప్పు
  అని పాపం పిల్లవాడు, అరచేతుల్లో ముఖాన్ని దాచుకునే ఆ

  నూనుగు మీసాల కుర్రవాడు రాత్రంతా ఆ రాత్రినే అడిగాడు, తన ముందు
  తన ముందే కూర్చున్న ఆ నీలి కళ్ళ యువతిని వొదిలి:

  ఏడవటం వచ్చా నీకు? కన్నీళ్ళని వడగట్టడం వచ్చా నీకు? నీలోని ఇంకొకరిని
  కలుసుకోవడం వచ్చా నీకు? ఆ ఇంకొకరిలోని నిన్ను పసిగట్టడం వచ్చా నీకు?
  నీకు నువ్వు చచ్చిపోవడం తెలుసా నీకు? తిరిగి ఇద్దరై ముగ్గురై నలుగురిలోకి
  జన్మించి అందరినుంచీ బహిష్కరింపబడటం తెలుసా నీకు?

  ఇవేమీ అడగలేదు నేను అతడిని, అతడి రాత్రిని, రాత్రిగా మారిన తననీ, ఆ తనువునీ-

  అడగలేక, చెప్పలేక ఇక నేను కాంతిని వీడి, రాత్రిని తాగి
  నా దుస్తులని నేను మూటకట్టుకుని అక్కడే
  ఆ శిధిలాలలోకే మళ్ళా వెళ్ళిపోయాను ఎప్పటిలానే ఇలా గొణుక్కుంటూ:

  ఎవరు చెప్తారు నీకు, నువ్వే ఒక కవితవని, తనే ఒక కవిత అని
  ఇంతకు మించి ఇక్కడ మరేమీ లేదని, మరేమీ దొరకదనీ?-

  *24-08-2012

  కాశిరాజు || నాన్న తనంతో కాసేపు||

  ఏరా సిన్నోడా
  ఎప్పుడూ ఏదో అలోసిత్తావేట్రా?
  నీ వొయసులో నేనెంత సురుగ్గా వుండేవోన్నో తెలుసా?
  నీకు నా కదసెప్తానిను

  నువ్వు యినే వుంటావ్
  సరిగ్గా పదేల్లప్పుడే పెల్లిసేసార్నాకు
  అప్పుడికి మీయమ్మేమో సీముడుముక్కేసుకుని
  ఎర్రబొందులాగూతో
  సరిగ్గా ఆ ఈది గుమ్మం మీదే కుచ్చూనుండేది

  రాయే అని పిలిత్తే వచ్చేదీకాదు
  ఆ గుమ్మం మెట్టుదిగేదీ కాదు
  సేన్నాళ్ళు గడిసిపోయిందలాగే
  ఆ తర్వాత తెలివొచ్చి,తెలిసొచ్చేసరికి

  బల్లో ఒకడు
  గుమ్మంలో ఒకడు
  ఉయ్యాళ్ళో ఒకడు
  తయారయ్యారు మీరు

  సంసారాన్ని ఈదటం గురించి మాబాబు నాసొవ్లో ఓమంత్రమేసాడు
  అంతే

  ముగ్గుబండేసుకుని బయల్దేరాను
  సరిగ్గా సీకటడే సరికి
  నలభైయూళ్ళు సుట్టొచ్చేవోన్ని

  కాతపొద్దోతే సాలు
  సుర్రుమనేది మీయమ్మ
  రేవవతల రాజుగారింట్లో
  పనికోసమెల్లేది
  నాకంటే కాతముందే ఇంటికొచ్చేసేది
  మీయమ్మకు కొడుకులేమైపోతారో అన్న కంగారుతోపాటు
  కటికపేదరికం కూడా కుదురుండనిచ్చేదికాదు

  ఎప్పుడూ ఏదోపనే
  ఎన్నిపనులు సేసెదనుకున్నావ్?
  మీకందరికీ అన్నమెట్టి
  మిమ్మల్ల్ని బొజ్జోబెట్టి
  ఆ తరవాత నాకూ అమ్మయ్యేది,అన్నమెట్టేది

  ఇలాంటివెన్నోరా
  ఎన్నని సెప్పను
  ఎలగోలాగ
  ఇదిగో ఇంతదాకా బతికేసాం

  జీవితమంటే ఇంతే్నని సెప్పుకునే
  ఎంతో పెద్దదిరా
  నీకు మెల్లిగా అర్దమౌతాదిలే
  నీజీవితంలో కూడా ఇలాగే
  పేనమున్న పదాలెన్నోఉంటాయ్
  ఆటినన్నింటినీ కలిపితే నీకు నచ్చిన కవిత్వంలా ఉంటాది నీ జీవితం

  అర్దమౌతుందా?

  *24-08-2012

  రావి రంగారావు || రాజుగారి తెలివి||

  ఎప్పటినుంచో
  తన మంత్రులు
  దేవతా వస్త్రాలతో ఊరేగుతున్నారని
  పసిపిల్లల పరిశోధనల వల్ల
  ఈ మధ్యనే తెలిసిందట...

  మంత్రుల ఒంటి మీద మచ్చలూ పుచ్చులూ ...
  సూక్ష్మజీవులు వైరసులూ...
  ఇన్నాళ్ళు ఎవరికీ కనబడ వనుకున్నాడట...
  అసలు రహస్యాలు, అంగ రహస్యాలు బయటపడుతున్నందుకు
  రాజుగా ఇపుడు తాను సిగ్గుపడుతున్నాడట...

  మంత్రులకు మరీ ఒంటి మీద
  ఓ నూలుపో గయినా లేకుంటే బాగోదని కొత్తగా తెలిసిందట...
  అందుకే ఓ న్యాయసహాయం గోచీ
  ఉచితంగా అందిస్తున్నాడట...

  పాపం రాజుకు తన సంగతి తెలిసే దెప్పుడో-
  తానింకా దేవతా వస్త్రాలు ధరించే తిరుగుతున్నా నని...

  *24-08-2012

  అరుణాంక్.ఎలుకటూరి || మూలవాసుని గోస ||

  నేను ఈ దేశ మూలవాసున్ని
  అయిన
  మూడున్నర సహస్రాబ్దలుగా
  వెలి వాడలే నా చిరునామా

  చదువుకుంటే జ్ఞానవంతున్ని అయితానని
  చదువు నిరాకరింపబడ్డ వాణ్ణి
  చదువు అనే మాట ఉచ్చరించినందుకు
  నాలుక తెగ్గోయబడ్డ వాణ్ని
  వేదాల్లోంచి నాలుగు మాటలు విన్నందుకు
  చెవుల్లో సీసం పోయబడ్డ వాణ్ణి

  నా అడుగు పడ్డ నెల మైల పడుతుందని
  మూతికి ముంత ముడ్డికి చీపురు
  కాలికి తాటాకు చెప్పులు కట్టబడ్డవాన్ని
  ఆర్యుల ఆధిపత్యానికి బలైన
  సత్యకామ జాబలిని
  తల నరకబడ్డ శంబుకుడుని
  క్షత్రియ కుట్రకు
  వేలు నరకబడ్డ ఏకలవ్యుణ్ణి నేనే

  మనువు ఆని సంతతి గాల్ల రచనల్లో
  వేశ్య పుత్రునిగా అభివర్నించబడ్డ వాణ్ణి
  సురులు సృష్టించిన పంచమున్ని
  ప్రజా రక్షకులైన నా మూలవాసులపై పడ్డ రాక్షస ముద్రను
  చెరిపివెయ్య పోరుజేస్తున్న వాణ్ని
  మూలవాసులు ఏలిన
  గణ రాజ్యాల స్థాపనకు పరితపిస్తున్న వాణ్ని
  అశోకవనాన్ని కాంక్షిస్తున్న అసురుణ్ణి

  నాగేటి సాలల్లో విత్తులను
  నెత్తురుతో మొలకేత్తించిన వాణ్ని
  స్వతంత్ర భారతావనిలో అస్వతంత్రున్ని
  ప్రజాస్వామ్యంలో నాకంటూ చోటు లేనివాణ్ణి
  దొంగ లం..కొడుకులు మసులుతున్న ఈ లోకంలో
  నిరంతరం చస్తూ బతుకుతున్న వాణ్ని
  అగ్రకుల దాష్టికానికి అనునిత్యం ఆహుతవుతున్న వాణ్ని

  చిందిన నెత్తురు సిరాగా
  రక్తారుణ రచనలు చేస్తున్న వాణ్ని
  తెగిన బొటన వేలే కలంగా
  నెత్తుటి కవిత్వం రాస్తున్న వాణ్ని
  నేను అమరున్ని, అజరామరుణ్ణి

  నేను చుండురుని, కారంచేడుని, వేంపేటని
  మర్మాంగాలు చిద్రం చేయబడ్డ ఖైర్లంజిని
  శ్రీకా"కుల" రక్కసికి నెత్తుటి రంగెసుకొని
  నెత్తుటిపేటగా మారిన లక్ష్మిపేటను

  మనువాదంతో మదమెక్కిన ఒక్కొక్కడు
  నన్ను కాల్చి బూడిద చేస్తున్న
  బూడిదలోంచి నూత్న యవ్వనంతో
  నింగికెగిరే ఫీనిక్స్ ను

  *24-08-2012

  యజ్ఞపాల్ రాజు IIఎంత కష్టపడతాడోII

  ఎంత కష్టపడతాడో కవి
  భావాల గర్భాల్ని మోస్తూ
  పండంటి కవితలను కనడానికి
  మనసును మెలిపెడతాడు
  హృదయాన్ని రాయి చేసుకుంటాడు
  ఒక్కోసారి చెప్పలేనంత
  మృదువుగా మార్చేసుకుంటాడు
  ఆవేదనలను ఆనందాల్ని
  కష్టాల్ని సుఖాల్ని
  ఆకలిని ఆహారాన్ని
  దిగంబరత్వాన్ని అంబర శ్రేణిని
  మంచిని చెడుని
  నవ్వును ఏడుపును
  ఆత్మను దేహాన్ని
  పంచభూతాలను
  అరిషడ్వర్గాలను
  శృంగార హాస్య కరుణ
  వీర రౌద్ర భీభత్స
  భయానక అద్భుత శాంతములనే
  నవ రసాలను
  అష్టవిధ శృంగార నాయికల
  హావభావాలను
  తన కలంలో నింపేసుకుంటాడు
  ఆ కాలాన్ని కాగితం పై
  గురి పెట్టి
  సిరా శరాలను వెల్లువెత్తిస్తాడు
  అన్నీ తనలోకి లాగేసుకునే
  బ్లాక్ హోల్ లా
  కనిపించే ప్రపంచంతో పాటు
  కళ్ళకు కనిపించని
  ఊహాలోకాల సమస్త అనుభూతులనూ
  తనలోకి ఇముడ్చుకుంటాడు
  అంతు చిక్కని డార్క్ మాటర్ లా ఉంటాడు
  సూపర్ నోవాలా
  ఒక్కసారిగా వెలుగులను
  వెలువరిస్తాడు
  ఎంత కష్టపడతాడో కవి
  భావాల గర్భాల్ని మోస్తూ
  పండంటి కవితలను కనడానికి

  *24-08-2012

  శైలజామిత్ర : ''నన్ను నన్నుగా..!''

  ఎప్పుడో గాయపరిచి
  సరాసరి గుండెలోకే దూసుకుపోయిన బాణం
  ఇప్పటికి జ్ఞాపకాల
  ముందు వరసలో ఉంది.
  మానవీయ ప్రదర్శన అక్కడే!
  నా గుర్తుగా ఉండనీయండి !

  గాజు చెట్లతో నిండిన మానవారణ్యంలో
  శరీరం ఒక వెదురు బద్ద లా ఉంది
  అజ్ఞానం మనిషిని శిల గానో, చీకటి గానో మార్చితే
  అప్పటికప్పుడు ఆయుధంలా మారింది
  అనుమానపు నీడలు అక్కడే!
  నా రూపం అక్కడే పాతేయ్యండి!

  మనసులో ఎప్పటికీ ఒక
  మరువలేని కల!
  అంతా అలంకృతమే!
  పుట్టుకతో రెక్కలు మొలిచినట్లు
  మరణం మొక్కై నిలిచినట్లు..
  గేటు ముందు బిక్షువు నిలబడేది అక్కడే!
  నా మాటగా అతనికి నీడనివ్వండి!

  అడుగు అడుగుకు వాడిపోయే మస్తకం
  అద్వాన్నంగా నలిగిపోయే హృదయం
  గతంలో మతంతో రాలేదు
  జీవన్నాటకంలో ఒక పాత్రతో వచ్చింది
  ఓట్లు కోరే ముఖ యంత్ర స్థానం అక్కడే!
  నన్ను నన్నుగానే బతకనీయండి..!.

  *24-08-2012

  అవ్వారి నాగరాజు || ‎ఎక్కడైనా||

  అక్షరాలు కొన్ని

  వేలికొసలు తెగి నెత్తురు గోరింటలో స్నానమాడే
  మేలిమి ముత్యాలని పిలుస్తాను

  పదాలు కొన్ని

  రోదించడానికి కూడా అశక్తుడవై నిస్సహాయంగా నిలబడిన వేళలలో
  నీ ముఖం మీద రాలి పడే వాన చినుకులంటాను

  వాక్యాలు కొన్ని

  పెగలని గొంతుకతో డగ్గుత్తిక కత్తి కొనయై
  నాభికొసల వరకూ దిగి ప్రాణం ఆర్చుకపోతూ
  ఒక కొస దాకా నిన్ను రాసుకుంటూ పోయే పేర్పులా తలపోస్తాను

  కవితలు కొన్ని

  చెంపలపై
  ఇక్కడ ఇంకిన చారికలకు
  మరెక్కడో టీకా తాత్పర్యాలు రాసే
  విశ్వ వ్యాకరణమని భావిస్తాను

  *24 ఆగస్టు2012

  కవితాచక్ర//తరచి చూస్తే..

  నిశ్చల హ్రుదిలో
  రేగిన అలజడిని
  తట్టి చూస్తే..
  ఉవ్వెత్తున ఎగిసిపడే
  జ్ఞాపకపు అల!

  నిశ్శబ్దపు మదిలో
  దాగిన కలవరాన్ని
  కదిపి చూస్తే...
  ఝూంకరిస్తూ నినదించే.
  కోటి భావాల మెళ!

  నిర్నిద్ర కంటిలో
  కదలాడిన ఆర్తిని
  అల్లార్చి చూస్తే...
  కరుగుతూ జారిపోయే
  కన్నీటి కల!

  నిట్టూర్పు శ్వాసలో
  వదిలిన వెచ్చదనాన్ని
  తాకి చూస్తే...
  వగరుస్తూ విడిచిపోయే
  నైరాశ్యపు హేల!!

  *24.8.2012

  సురేష్ వంగూరీ || అలక

  1
  ప్రశ్నలు నూరుతూ నువ్వు
  సంజాయిషీ ముఖంతో నేను

  2
  అలగాలని అలుగుతావో
  సరదాకని అలుగుతావో
  బుజ్జగింపు నెపంతో
  నేను చనువుగా మెలగాలని అలుగుతావో
  ఎప్పటికీ అర్ధం కాదు

  3
  అలగటంలో ఏముందో తెలీదు కానీ
  అనునయించడంలో అదో ఆనందముంది
  బతిమిలాడటంలోనే మన బంధం బలోపేతమవుతున్నది

  4
  నీ అలక
  నాపైన నీకున్న అధికారానికి ప్రతీక

  5
  కలిసిన ప్రతి సారీ
  ఏదో విధంగా అలుగుతూ నీవు
  అదే ఛాన్సుగా ప్రేమిస్తూ నేను

  *24-8-2012

  బాలు||కసరుకాయ||

  నా గుండెలోతులో నువ్వు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే
  నీ భాద చూడలేక ఇలా అక్షరాలను పదాలరూపంలో పెర్చుతున్నాను
  నీ పేరు కవిత్వమా!
  నాకు అయతే తెలియటంలేదు
  కోందరు కవిత్వం అంటున్నారు
  ఇంకోందరు వచనం అంటున్నారు
  మరికోందరు కసరుకాయ అంటున్నారు

  నిన్ను ప్రతిసారి పండుగానే మార్చాలనుకుంటా
  కాని వడ గాలి రుపంలోనో
  జడి వాన రుపంలోనో
  చీడ పురుగు రుపంలోనో
  కొంటెపిల్లగాడి చేతి రాయి రూపంలోనో
  వచ్చి నిన్ను కసరుకాయగా రాలిస్తే

  తప్పు నాదే నిన్ను సంరక్షించుకోకపోవటం
  కాని నాకు అనుభవం లేదే
  ఇప్పుడిపుడే పంట వేయటం నేర్చుకుంటున్నాను

  ఒకటి మాత్రం నిజం
  నిన్ను కసరుకాయగా చుస్తే
  అన్ని గుండెల కంటే
  నా గుండెనే ఎక్కువ వెదకు గురి అవుతుంది
  దానికి కారణం నేను కాబటి.

  *24-08-2012

  వ్యవసాయం కోసం వ్యవసాయం చెయ్యోద్దు పంటను కూడా దృష్టిలోపెట్టుకోవాలని మనవి


  మిత్రులారా,
  నాకు మన కవిసంగమంలో పోస్టుచేసిన కవితలు చదువుతుంటే ఈ క్రింది అభిప్రాయం కలిగింది. అది మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఇది ఎవ్వరినీ కించపరచడానికో, నిందించడానికో వ్రాస్తున్నది కాదు. ఇది పదిమంది చర్చిస్తే, కవిసంగమంలో సామాజిక బాధ్యతగల కవులుగా, మీరు దిశానిర్దేశనం చేసుకుందికీ, వీలయితే ఒక Manifesto తయారుచేసుకుని తదనుగుణంగా వ్రాయడానికీ ఉపకరిస్తుందన్న నమ్మకంతో మీముందు ఉంచుతున్నాను.

  పాశ్చాత్యదేశాల్లో, ముఖ్యంగా యూరోపులో ఈ క్రిందచెప్పబోయే ఉద్యమాలన్నీ కవిత్వంలోనూ, కళలలోనూ వచ్చి సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు రావడనికి దోహదపడ్డాయి. వాటి ఛాయలు ఇంకా తెలుగు సాహిత్యంలో ఉండడం హర్షించదగినవే అయినా, మనదేశకాలపరిస్థితులకు అనుగుణంగా కవిత్వంలో కూడా మార్పులు రావలసి ఉంది. వస్తాయి కూడా. అయితే ఆ మార్పులు కాకతాళీయంగా రావడం కంటే, కవులు ప్రయత్నపూర్వకంగా తీసుకురావడం, వాళ్ళ పరిణతినీ, భావ సారూప్యతనీ సూచిస్తుంది... కనీసం ఈ ఉద్యమం విషయంలో.

  కొందరు ఇంకా రొమాంటిసిస్టులు (Romanticists). అంటే, వాళ్ళు అనుభూతి కంటే కల్పనకి ప్రాధాన్యతకి ఇస్తారు. రొమాంటిస్టులు అన్న మాట ఆ నిర్ణీతార్థంలోనే వాడుతున్నాను. లేకపోతే రొమాంటిసిస్టులకి అన్యాయం చేసినట్టే. ఎందుకంటే నిజానికి వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ "ప్రజలభాషలో, ప్రజలదగ్గరికి, ఏ అలంకారాలూ (అంటే ఉపమలూ, ఉత్ప్రేక్షలూ) లేకుండా చెబుతూ, అంతవరకు కావ్యగౌరవం దక్కని అన్ని విషయాలూ, వస్తువులూ, వ్యక్తులమీదా కవిత్వం" చెబుతామని తీర్మానం చేసుకుని వ్రాసిన వాళ్ళు. (శ్రీ శ్రీ చెప్పిన కుక్కపిల్లా సబ్బుబిళ్ళా అగ్గిపుల్లా అక్షరాలా అదే). కొందరు Naturalistలు లేదా Realistలు. వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ... ఒక matter-of -fact గా చిత్రించడానికి ప్రయత్నిస్తారు. అందులో కల్పనలూ అలంకారాలూ ఉంటాయి కాని, అవి ప్రథాన విషాయనికి అనుబంధంగా ఉంటాయి తప్ప మీద చెప్పిన వాళ్ళలా వస్తువుని మింగేసి సౌందర్యంగా కవిత్వం ఉండదు. ఇంకొందరు impressionistలు అంటే వాళ్ళు చేతలను గాని, వస్తువునిగాని వర్ణించడం, దానిలోతులలోకి వెళ్లడం కంటే, చెప్పదలుచుకున్న సందర్భంతో వాటికిగల అనుబంధాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ, మనసుమీద ఆ చర్యగాని, ఆ వస్తువుగాని గాఢమైన ముద్ర వేసేలా చూస్తారు. చాలా మంది Expressionistలు. వీళ్ళు పైనచెప్పినవాళ్లందరికీ భిన్నంగా పాఠకులని రంజింపజెయ్యడం కంటే, కవిగా తమ పరిశీలనలను ఒక రన్నింగ్ కామెంటరీలా ఇస్తారు. వీళ్లు వస్తువులకి లోతైన వివరణలు వర్ణనలూ ఇవ్వడానికి బదులు చెబుతున్న సందర్భంలో వాటి ప్రతిపత్తి (perception)నిమాత్రమే మనముందు ఉంచుతారు. ఇవిగాక మన కవిత్వ ఉద్యమాల ఛాయలూ... దిగంబర, స్త్రీవాద, దళితవాద ఛాయలన్నీ ఉన్నాయి. ఇంత విస్తృతమైన వస్తువైవిధ్యం ఆరోగ్యకరమైన పరిణామమే. అయితే, శివారెడ్డి అమ్మగురించి చెబుతూ, ""నేను అమ్మను కాలేను, ఎందుకంటే నాకు అమ్మతనం అంటే తెలీదు కనుక" అని ప్రారంభించి, "కలం పట్టినతర్వాతనైనా నేను కవిని కాకపోతే ఎలా?" అని ముగించినట్టు, కవులు జీవితాంతం కవిత్వం రాయడానికి నిశ్చయించుకుని ఈ  వ్యవసాయం లోకి దిగేరుగనుక, వ్యవసాయం నుండివచ్చే పంటనుకూడ దృష్టిలోపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. మన అస్థిత్వవాదాలు, అఫ్సర్ చెప్పినట్టు మన ఉనికిని ఎలా చాటుతున్నాయో, మనకవిత్వం మనలోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఒక అస్థిత్వంగా ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. ఈ దిశలో కవులు సమాజంలోని రుగ్మతలకు తమదైన, ఒక ఆచరణత్మకమైన, ప్రజలకు దగ్గరగా ఉండగల ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి కావలసిన తాత్త్విక చింతననూ, అభిప్రాయవ్యక్తీకరణను ప్రోత్సహించి, ఒక ఆరోగ్యకరమైన చర్చకి తెరతీస్తారని మనసారా కోరుకుంటున్నాను.

  కవిసంగమం గ్రూపు చర్చను అప్ టూ డేట్ చూడాలన్నా పాల్గొనాలన్నా ఈ లింకు నుండి చూడండి 
  http://www.facebook.com/groups/kavisangamam/permalink/437898332929591/   • Chittibabu Padavala Except the bit about "unitiy in diversity," I completely agree with my Guruvugaaru Murthy gaaru.


   • Vijayakumar Koduri 
    ‎"ఈ దిశలో కవులు సమాజంలోని రుగ్మతలకు తమదైన, ఒక ఆచరణత్మకమైన, ప్రజలకు దగ్గరగా ఉండగల ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి కావలసిన తాత్త్విక చింతననూ, అభిప్రాయవ్యక్తీకరణను ప్రోత్సహించి, ఒక ఆరోగ్యకరమైన చర్చకి తెరతీస్తారని మనసారా కోరుకుంటున్నాను" Nauduri

    .....మూర్తి గారూ....దరి దాపు, ఇలాంటి చర్చ ను ఆశించే, ఇంతకు ముందు కవి సంగమం లో ఆలూరు శ్రీకాంత్ కవిత దగ్గర కొన్ని కామెంట్లు పోస్ట్ చేసాను....వీలయితే చూడండి....'కవి సంగమం గ్రూప్ సెర్చ్' లో ఆలూరు శ్రీకాంత్ పేరు టైపు చేస్తే ఆ పోయెం దొరుకుతుందనుకుంటా...   • John Hyde Kanumuri నాకున్న కొన్ని సందేహాలు ఈ పోస్టుద్వారా నివృత్తి అయ్యాయి. ధన్యవాదాలు సార్   • Ro Hith 
    Nauduri~ Very nice to see something very intellectual in Kavisangamam. I think Kavisangamam really needs that. But in every stage, there are Naturalists, Expressionists, Romanticists and everyone. I am just wondering if Imagism is not the 
    biggest moment in telugu literature...as Imagism is the biggest moment in the scene of Western poetry. In poetry, there is a twist for every ten years from 19th century. The Romanticism is the theory of early 19th century...and its always interesting to notice how Romanticism overlapped with Imagism. My point is, there was and is always the moment...but you cannot classify it into a Particular thing.And yes...it is so interesting to see how Surrealism mingled with Beat poetry. And how Beat poetry blended with poetry of a person like Bukowski(One should notice that Bukowski is not well educated and he didnt read much beat poetry)

    Thanks for your enjoyable and intellectual note...I believe...that is really really essential for Kavisangamam. :)   • Sky Baaba చాలా బాగా చెప్పారు మూర్తి సర్!
    ''కవిసంగమంలో సామాజిక బాధ్యతగల కవులుగా, దిశానిర్దేశనం చేసుకుందికీ'' ఇకనైనా కవిసంగమం కవులంతా ప్రయత్నించవలసిన అవసరముందని నేను కూడా బలంగా ఫీలవుతున్నాను..   • Kapila Ramkumar I agree with the conclusion statement, stressing to rise/raise your voices   • Katta Srinivas ‘‘ ప్రాక్టీసులు ఇక చాలు పూర్తయ్యాయు.
    ఇక ఫెర్మర్మేన్సులు మొదలెట్టమన్నారా ’’సార్.
    అవును బాణం వేయటం వచ్చిందని భలేగా వుందనీ చప్పట్లువింటూ వస్తున్నాం.
    లక్ష్యం దిశగా ఎక్కుపెడితేకానీ సార్తకత రాదు.
    సైద్దాంతికంగా మీరన్నదానిలో విభేదించడానికేమీలేదు. ఒ

    కటి, రెండు చోట్ల అదనపు వివరణలు కోరటం తప్ప..
    మీరన్న దిశగా నడిచేందుకు
    ప్రాక్లికల్ యక్షన్ ప్లాన్ కూడా సూచిస్తే బావుంటుంది. ఏంచే్ద్దాం ఎలా చేద్దాం.??
    మంచి టైంలో మంచి సూచన చేసారు సార్..
    ఉరకలెత్తుతున్న ప్రవాహాన్ని వరదకాలవగానే మిగలనీకుండా, సాగుదిశగా