పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మే 2014, గురువారం

Abd Wahed కవిత

ఈ రోజు ఉర్దూ కవిత్వ నజరానాలో గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ చూద్దాం మొదటి షేర్ బస్ కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసాం హోనా ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సాం హోనా ప్రతి పని సులభంగా నెరవేరడం చాల కష్టం మనిషికి కూడా మానవుడిగా మారడం చాలా కష్టం చాలా సరళమైన పదాలతో గాలిబ్ చాలా లోతయిన భావాన్ని వ్యక్తం చేసిన కవిత ఇది ఇందులో ఉన్న ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. బస్కే అంటే అత్యధికంగా, చాలా ఎక్కువగా అని అర్ధం. దుష్వార్ అంటే అసాధ్యం, సాధ్యం కాని పని, చాలా కఠినమైన పని అని భావం. మయస్సర్ అంటే లభించడం, దొరకడం, ప్రాప్తం కావడం వగైరా అర్ధాలు చెప్పవచ్చు. ఆద్మీ అన్న పదం గమనించదగ్గది. ఆద్మీ అంటే మనిషి అన్నది భావం. ఆదమ్ నుంచి మానవాళి వ్యాప్తి చెందింది కాబట్టి మనిషిని ఆద్మీ అంటే ఆదమ్ సంతానం అంటారు. ఇన్సాన్ అంటే కూడా మనిషి, మానవుడు అని అర్ధం. ఇక్కడ మానవ లక్షణానికి ప్రాముఖ్యం ఉంది. ఇన్సానియత్ అంటే మానవత్వం. ఇన్సాం హోనా అంటే మానవత్వ లక్షణాలతో నిజమైన మనిషిగా మారడం. ఈ కవితలో భావాన్ని చూద్దాం. మనిషికి ఏ పనయినా చాలా కష్టంతో కాని పూర్తి కాదంటున్నాడు గాలిబ్. మనిషి ప్రతి పని చేయడానికి చాలా కష్టపడక తప్పదు. మనిషి మనిషిగా పుట్టాడు. ఉర్దూలో ఉన్న పంక్తిని గమనిస్తే, ఆదమ్ సంతానం కావడం వల్ల పుట్టుకతోనే మనిషిగా పుట్టాడు. ఇంకొక్క అడుగు ముందుకేస్తే చాలు మానవత్వ లక్షణాలున్న ఇన్సాన్ గా మారవచ్చు. కాని ఆ ఒక్క అడుగు ముందుకేయడం కూడా మనిషికి ప్రాప్తం కావడం లేదు. సాధ్యపడడం లేదు. ఒక తీవ్రమైన వ్యంగ్యం ఇందులో ఉంది. మనిషి మనిషిగా పుట్టాడు కాని, మనిషిగా మానవత్వంతో బతకడం మనిషికి సాధ్యపడడం లేదని అంటున్నాడు. ఇది నిజానికి చాలా చిన్నపనే కాని అది కూడా చాలా పనుల్లాగే సాధ్యం కావడం లేదంటున్నాడు. ఈ కవితలో గాలిబ్ ప్రయోగించిన పదాలు కూడా గమనించదగ్గవి. దుష్వార్ అన్న పదానికి పూర్తి వ్యతిరేకపదం ఆసాన్ ఉపయోగించి రెండవ పంక్తిలో ఆద్మీ అన్న పదం ఇన్సాన్ అన్న పదం ప్రాసగా వాడాడు. మొదటి పంక్తిలో రెండు పదాలు వ్యతిరేకార్థం ఉన్న పదాలు. కాని రెండవ పంక్తిలో రెండు పదాలు సాధారణంగా పర్యాయపదాలే, కాని వాటిని వ్యతిరేకార్థం కలిగిన పదాలుగా ప్రయోగించడంలో కవిత్వ నైపుణ్యం గమనించదగ్గది. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవితపై తమ అభిప్రాయం చెబుతూ మనిషికి ముఖ్యమైన లక్షణం మానవత్వం, మనిషి పుట్టుకతో మానవజన్మ ఎత్తాడు కాబట్టి ఇక మానవత్వం నిండిన మనిషిగా మారడం అతడికి చాలా సులభం. పశుపక్ష్యాదులకు ఇది సాధ్యం కాదు. కాని తనకు సులభమైన పని చేయడం కూడా మనిషికి సాధ్యం కావడం లేదు. ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమంటే, దేవుడు మనిషికి ఆలోచించే, తన ఇష్టం ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. ఇతర ప్రాణులకు అలాంటి స్వేచ్ఛ లేదు. అవి ఎలా బతకాలని దేవుడు నిర్ణయించాడో అలాగే బతుకుతాయి. అవి తమ పరిస్థితిని మార్చుకోలేవు. కాని మనిషి పరిస్థితి అది కాదు. మనిషిని దేవుడు ’’అష్రఫుల్ మఖ్లూఖ్‘‘ అంటే సమస్త ప్రాణుల్లో అత్యుత్తముడిగా పుట్టించాడు. పైగా భూమిపై సమస్తమూ మనిషి కోసమే పుట్టించాడు. ఇన్ని సదుపాయాలున్నప్పుడు మనిషి, పుట్టుకరీత్యా తనకు లభించిన ఈ సానుకూలతలను ఉపయోగించుకుని మానవత్వం ఉన్న మనిషిగా మారడం చాలా తేలిక. కాని అది కూడా అతడికి అసాధ్యం అయిపోయింది. ఈ మాట అంటూ, అసలు మనిషికి ఏ పని కూడా సులభం కాదు అంటూ మనిషి ఎలాంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడో తేల్చి చెప్పేశాడు. రెండవ కవిత గిర్యా చాహే హై ఖరాబీ మేరే కాషానే కీ దరో దీవార్ సే టప్కే హై బయాబాం హోనా నా నివాసం నాశనం కావాలన్నదే రోదనల కోరిక గోడలు, తలుపుల నుంచి కారడవి కారుతుంది చూడు ఈ కవిత భావాన్ని పరిశీలించే ముందు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. గిర్యా అంటే రోదనలు, దుఃఖం అని అర్ధం. కాషానా అంటే నివాసం, ఖరాబీ అంటే వినాశం. దర్ అంటే తలుపు. దరో దివార్ అంటే తలుపులు గోడలు అని అర్ధం. టపక్నా అంటే బొట్లు బొట్లుగా రాలడం. వర్షంలో ఇంటి పైకప్పు లీకేజి ఉంటే వర్షపు నీరు బొట్లు బొట్లుగా లోపల పడుతుంది దీని టపక్నా అంటారు. టపక్తా హై అంటే కారుతుంది అని అర్ధం. పాత ఉర్దూ వాడకంలో టప్కే హై అని కూడా ఉపయోగించేవారు. బయాబాం అంటే అడవి. బయాబాం హోనా అంటే అడవిగా మారడం (making of wilderness) అని చెప్పుకోవచ్చు. అంటే అడవిగా మారే ప్రక్రియ బొట్లు బొట్లుగా కారుతోందన్నది భావం. ఈ కవిత భావాన్ని పరిశీలిద్దాం. గాలిబ్ చాలా విషాదంలో ఉన్నాడు. రోదిస్తున్నాడు. అయితే ఈ రోదన తన ఇంటిని నాశనం చేయాలనుకుంటోందని మనకు చెబుతున్నాడు. తన ఇంటి గోడలు, తలుపుల నుంచి వర్షంలో నీరు కారుతున్నట్లు అడవి కారుతుందని చెబుతున్నాడు. ఇల్లు పాడుపడితే ఇంటిలో పిచ్చిమొక్కలు పెరిగి అడవిలా తయారవుతుంది. తన రోదన తన ఇంటి వినాశాన్ని కోరుతుందని, అందువల్ల ఇంట్లో వర్షపు నీటిలా అడవి కారుతోందని చెప్పాడు. ఈ కవితలోని పదచిత్రాలు, పోలికలు పరిశీలించదగ్గవి. రోదన వల్ల కంట నీరు వర్షిస్తుంది. ఆ రోదన అతని ఇంటి వినాశాన్ని కోరుతుంది. అందువల్ల ఆ నీరు అడవిగా ఇంటి గోడలనుంచి, తలుపుల నుంచి కారుతోంది. ఇలాంటి పోలిక బహుశా గాలిబ్ తప్ప మరెవ్వరూ చెప్పలేరు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్లో 4వ షేర్ వాయె దీవాన్గీ షౌఖ్ కీ హర్ దమ్ ముఝ్ కో ఆప్ జానా ఉధర్, ఔర్ ఆప్ హీ హైరాం హోనా అయ్యో, ప్రేమబాధ ఏం చెప్పేది ప్రతిక్షణం అటు వెళ్లడమూ, అయోమయంగా మరలడమూ ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. వాయ్ అంటే అయ్యో అని భావం. దీవాన్గీ యే షౌఖ్ అంటే ప్రేమ పిచ్చి. ప్రేమాతిశయం. హర్ దమ్ అంటే అనుక్షణం, ఈ పదానికి మరో అర్ధం ప్రతి ఊపిరిలో. ఇలాంటిదే మరో పదం ఏక్ దమ్ అంటే ఒక్కుదుటు అని అర్ధం. నిఘంటు ప్రకారం ఒక్కశ్వాసలో. దమ్ అంటే శ్వాస. హర్ దమ్ అంటే ప్రతిశ్వాసలో అని భావం. ఉధర్ అంటే ఆ వైపు. ఇక్కడ ఆమె వైపు అని భావం. హైరాం అంటే అయోమయానికి, గందరగోళానికి గురికావడం. ఈ కవిత భావాన్ని చూద్దాం. గాలిబ్ తన ప్రేమను వర్ణిస్తున్నాడు. ప్రేమలో పిచ్చివాడైపోయాడు. చివరకు తన ప్రేమపిచ్చి పట్ల తనకే అయ్యో అనిపిస్తోంది. ప్రేమపిచ్చిలో పడి అనుక్షణం ఆమె కోసం వెళుతున్నాడు. కనీసం ఒకసారి చూడాలని, అది సాధ్యం కాదని తెలిసి కూడా వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరరే ఇక్కడికి ఎందుకొచ్చాను అని అయోమయంలో పడిపోతున్నాడు. ఆమెను చూడడమైతే సాధ్యం కాదు. కాని ఏం చేస్తాడు, ప్రేమపిచ్చిలో పడ్డాడు కాబట్టి వేలసార్లు అక్కడికి వెళతాడు, మళ్ళీ నిరాశగా తిరిగివస్తాడు. ఈ కవితలో ప్రియుడి పరిస్థితిని వర్ణించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేయసిని చూడ్డానికి ఆమె వీధిలో చక్కర్లు కొట్టడం మామూలే కదా. ఒక్కోసారి అదృష్టం కలిసొస్తే కనబడుతుంది లేకపోతే లేదు. ప్రేయసిని చూడాలన్నది ఒక అందమైన కల. ఆమె కనబడదన్నది వాస్తవం. కల వాస్తవాల్లో చిక్కుకుపోయిన పరిస్థితి. ఈ నిస్సహాయ పరిస్థితి చూసి అయ్యో అనకుండా ఎవరుంటారు? గాలిబ్ కూడా అదే అంటున్నాడు. తన నిస్సహాయస్థితి పట్ల అయ్యో అనుకుంటున్నాడు. ఇది కేవలం ప్రేమపిచ్చిలో పడిన వారి పరిస్థితి మాత్రమే కాదు, ఇలాంటి పిచ్చి ఇష్టం ఎవరి పట్ల అయినా ఉండవచ్చు. అభిమాన తారలను ఒక్కసారి చూడాలని పడిగాపులు పడేవాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వారిని చూసినప్పుడు కూడా అయ్యో అనిపించే జాలి మాత్రమే కలుగుతుందన్నది ఆలోచిస్తే గాలిబ్ కవితలో ఉన్న లోతు అర్ధమవుతుంది. గాలిబ్ ఇక్కడ తన ప్రేమపిచ్చిని గొప్పగా వర్ణించుకోవడం లేదు. ఈ పిచ్చి విషయంలో తనపై తానే జాలి పడుతున్నాడు. ఈ కవితలో గాలిబ్ వాడిన ’’హర్ దమ్‘‘ అన్న పదం గమనించదగ్గది. సాధారణంగా ఈ పదానికి అర్ధం అనుక్షణం. కాని దమ్ అంటే శ్వాస అని అర్ధం. హర్ దమ్ అంటే ప్రతిశ్వాస అని అర్ధం. ఇక్కడ ప్రతి శ్వాస అన్న భావం తీసుకుంటే, ఈ కవిత ఇష్క్ హకీకీ కవిత. ఉర్దూలో ప్రేమ అనేది రెండు తరగతులుగా విభజించవచ్చు. ఇష్క్ మజాజీ అంటే ప్రాపంచిక ప్రేమ. అంటే ఒక ప్రేయసి ఒక ప్రియుడికి మధ్య ఉండే ప్రేమ. ఇప్పటి వరకు ఈ కవితకు మనం అలాంటి కోణంలోనే భావం తెలుసుకున్నాం. కాని ఇష్క్ హకీకీ అంటే దైవం పట్ల ప్రేమ. అంటే నిజమైన ప్రేమ. ఇదే సూఫీతత్వం. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవితలో లోతయిన సూఫీతత్వం ఉందన్నారు. ప్రతిశ్వాస తీసుకుంటున్నప్పుడు నిత్యుడు, సృష్టికర్త అయిన దైవం వైపునకు పరుగెత్తి వెళుతున్నాడు. కాని దైవాన్ని చూడడం సాధ్యం కాదని తెలిసి అయోమయంగా వెనక్కి మళ్ళుతున్నాడు. దైవాన్ని చూడాలన్న కోరికతో వెళ్ళడాన్ని ఉచ్ఛాస్వగాను, చూడలేక నిస్సహాయంగా మరలడాన్ని నిశ్వాసగాను వర్ణించాడు. ఈ కల వాస్తవాల మధ్యనే బతుకుతున్నాడు. తీసుకున్న ఊపిరి పైకి పోతే మనిషి ఇహలోకాన్ని చాలిస్తాడు. ఆ తర్వాత దేవుడి ముందు జవాబు చెప్పుకునే పరలోకంలోకి ప్రవేశిస్తాడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 5వ షేర్ జల్వా అజ్ బస్కే తఖాజాయె నిగా కర్తా హూం జోహరె ఆయినా భీ, చాహే హై మజగాం హోనా ఆమె అద్భుత రూపం అందరి దృష్టికి కేంద్రం అద్దంపై గీతలు కూడా కనురెప్పలై ఆమెను చూస్తున్నాయి ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. జల్వా అంటే వైభవం. అజ్ బస్కే అంటే అత్యధికంగా అని అర్ధం. తఖాజా అంటే డిమాండ్ అని అర్ధం. తఖాజాయే నిగా అంటే దృష్టి పడాలని డిమాండ్ చేయడం. జోహరె ఆయినా అంటే అద్దంపై ఉన్న గీతలు (scratches). పాతకాలంలో అద్దాలను చేత్తో పాలిష్ చేసేవారు. అందువల్ల అద్దంపై కొన్ని గీతలు ఉండేవి. అద్దాలు గాజుతో కాకుండా లోహంతో కూడా చేసేవారు. మజ్ గాం అంటే కనురెప్పకు ఉండే వెంట్రుకలు, రోమాలు ఇంగ్లీషులో eyelashes. ఈ కవితకు భావం చూద్దాం. గాలిబ్ ప్రేయసి సౌందర్యం వైభవోపేతమైంది. అందరి చూపులను తనవైపు తిప్పుకునే సౌందర్యం ఆమె స్వంతం. మరో విధంగా చెప్పాలంటే ఆమె సౌందర్యం అందరి చూపులను తనవైపు చూడాలని ఆదేశిస్తుంది. ఆ ఆదేశాన్ని అద్దంలోని గీతలు కూడా మన్నిస్తున్నాయి. అద్దానికి ఉన్న గీతలు కూడా eyelashes గా మారి ఆమెను చూస్తున్నాయి. ఈ కవితలో గాలిబ్ అద్దానికి కూడా ప్రాణం పోశాడు. ఆమె తన్ను తాను చూసుకోడానికి అద్దం వద్దకు వెళ్ళింది. కాని ఆమె సౌందర్యం అసాధారణమైనది. అందరి చూపులు తనవైపు తిప్పుకునే ఆ సౌందర్యం అద్దాన్ని కూడా తనవైపు చూసేలా చేసింది. అద్దం కూడా ఆమెను కళ్ళార్పకుండా చూస్తుంటే, అద్దంపై ఉన్న గీతలు కనురెప్పలపై రోమాలుగా మారిపోయాయి. ప్రేయసి సౌందర్యాన్ని ఇలా వర్ణించిన కవి మరొకరు ఎవరైనా ఉన్నారా? తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 6వ షేర్ ఇష్రతె ఖతల్ గయే అహ్లే తమన్నా మత్ పూచ్ ఈదె నజ్జారా హై, షంషీర్ కా ఉర్యాం హోనా వధ్యస్థలిలో ప్రియుడి సంతోషం గురించి అడక్కు నగ్నకరవాలం, పండుగ నాటి నెలవంకే అవుతుంది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఇష్రత్ అంటే సంతోషం, ఉత్సాహం వగైరా అర్ధాలున్నాయి. ఖతల్ గాహ్ అంటే వధ్యస్థలి. హతమయ్యే చోటు. అహ్లె తమన్నా అంటే ప్రేమించిన వారు. ఈద్ అంటే సంతోష సమయం. పండుగ. నజ్జారా అంటే దృశ్యం. షంషీర్ అంటే కరవాలం. ఉర్యాం అంటే నగ్నంగా అని అర్ధం. షంషీర్ కా ఉర్యాం హోనా అంటే ఒర నుంచి బయటకు దూసిన కరవాలం. నగ్నకరవాలం. ఈ కవితలో గాలిబ్ ఒక దృశ్యాన్ని వర్ణించాడు. ప్రేమపిచ్చిలో మునిగిపోయిన వారు చివరకు తమ ప్రేయసిని ఒక్కసారి చూడడానికి వధ్యస్థలికి కూడా చేరుకున్నారు. అంటే తమ ప్రాణాలు పోగొట్టుకునే ప్రదేశానికి కూడా వచ్చేశారు. అక్కడ చావు సమీపంలో, వధ్యస్థలిలో వారి సంతోషం గురించి అడగొద్దు, వారు చాలా ఉత్సాహంగా ఉన్నారంటున్నాడు. ఆమె చేతిలో హతమైన ఫర్వాలేదు, ఎందుకంటే అప్పుడు ఆమెను చాలా దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి. ఆమె ఖడ్గాన్ని ఒర నుంచి పైకి లాగినప్పుడు వారికి ఆ కరవాలం పండుగ రోజున నెలవంకను చూసినంత సంతోషాన్నిస్తుంది. (రమజాన్ పండుగ నెలవంకను చూసిన తర్వాత ఉపవాసాలు విరమించి చేసుకుంటారు. నెలవంకను చూడడం అనేది మర్నాడు పండుగ ఉందన్న సంకేతం. కాబట్టి చాలా సంతోషకరమైన దృశ్యం). వధ్యాస్థలిలో ప్రియుడి సంతోషం ఎలా ఉంటుందో నన్నడక్కండి అంటున్నాడు గాలిబ్. అంటే అంత అతిశయించిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి. ఆమె చేతి కరవాలం వంపు పండుగ నెలవంకలా వారికి ఆనందాన్నిస్తుంది. చివరి శ్వాస వదిలే ముందు అతి దగ్గరగా చూసే అవకాశం వారికి లభించిందన్న సంతోషం పట్టశక్యం కానంత ఉంటుందంటున్నాడు. ఉర్దూ కవిత్వంలో ప్రతీకల వైవిధ్యం, కొన్ని అతిశయోక్తుల ప్రయోగం తెలుగులో కాస్త కొత్తగా ఉండవచ్చు. ఉర్దూ కవిత్వంలో ప్రతీకలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రేయసిని ఖాతిల్ (హంతకి) అని వర్ణించడం చాలా సాధారణం. ప్రేయసి కనుబొమలను కరవాలంగా పోల్చడమూ కనబడుతుంది. ఎందుకంటే వాటి పదునైన సౌందర్యం ప్రియుడి గుండెను ముక్కలు చేస్తుంది కాబట్టి. ప్రేయసి చూపులను చురకత్తులతో పోల్చడమూ సాధారణంగా కనిపిస్తుంది. గాలిబ్ ప్రత్యేకత ఏమంటే, కవితలో సూచనామాత్రంగా పదాలు ప్రయోగించడం వల్ల పాఠకులు తమ ఊహాశక్తికి పదును పెట్టి అక్కడ దృశ్యాన్ని అర్ధం చేసుకుంటారు. ఎవరి ఊహ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతగా దృశ్యం విస్తరిస్తుంది. గాలిబ్ పై కవితలో నగ్నకరవాలం పండుగ నెలవంకలా ఆనందాన్నిస్తుందని మాత్రమే చెప్పాడు. ఇక్కడ నగ్నకరవాలం అనేది ఆమె కనుబొమలకు అన్వయిస్తే, ఆమెను కలిసిన స్థలమే వధ్యస్ధలిగా మారిపోయింది. ఎందుకంటే అందమైన ఆ కనుబొమలు నగ్నకరవాలాలకు తక్కువ కాదు, అవి ప్రియుడి గుండెను ముక్కలుగా ఛేదిస్తున్నాయి. కాని వాటి మెరుపులు (అంటే కనుబొమల కదలికలు) చూస్తుంటే పండుగ నెలవంకను చూసినంత ఆనందంగా అనిపిస్తుంది. ఈ కవితలో గాలిబ్ ప్రేమికులను ఆశావాదుల సమూహంగా కూడా పిలిచాడు. అహ్లె తమన్నా అంటే ఈ అర్ధం కూడా చెప్పుకోవచ్చు. ఈ కవితలో చాలా అర్ధచ్ఛాయలున్నాయి. ఇక్కడ ఈ సమూహం ప్రేమికులదే కాదు, ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వారి సమూహం కూడా కావచ్చు. దేశం కోసం, జాతి కోసం నడుంకట్టిన వ్యక్తుల సమూహం కావచ్చు. ఇలాంటి వారికి తమ లక్ష్యమే అత్యంత ప్రియమైనది. ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి ఏమైనా చేస్తారు. దేశాన్ని కాపాడే సైనికులకు దేశరక్షణే అత్యంత ప్రియమైనది. ఆ లక్ష్యం కోసం యుద్ధరంగంలో నగ్నకరవాలాన్ని చూసి భయపడడు, పండుగ నెలవంకను చూసినంతగా సంతోషిస్తాడు. గాలిబ్ ఉపయోగించిన వథ్యాస్థలి అన్న పదం చాలా సందర్భాలకు అన్వయించే పదం. ప్రేమికుడికి ప్రేయసిని కలుసుకున్న ప్రదేశమే వథ్యాస్థలి అయితే, సైనికుడికి అత్యంత ప్రియతమమైన దేశరక్షణకు యుద్ధరంగమే వథ్యాస్థలి. అలాగే నిరుపేదలను ఆదుకునే లక్ష్యాన్నే ప్రేమించిన వారికి బీదసాదల కోసం పాటుపడడంలో ఎదురయ్యే కష్టనష్టాల నగ్నకరవాలం పండుగ నెలవంకే అవుతుంది. ఒక విస్తృతస్థాయి వివరణకు అవకాశమున్న కవిత ఇది. గజల్ ప్రత్యేకత ఇదే. ప్రతి రెండు పంక్తుల షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది. గజల్ లోని మిగిలిన షేర్లతో దానికి ప్రత్యక్ష సంబంధం ఒక్కోసారి ఉండకపోవచ్చు. అంతర్లీనంగా ఒక భావం అన్ని షేర్లను పూలదండలో దారంలా దాగుంటుంది. ఇది ఈరోజు గాలిబానా వచ్చే శుక్రవారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOtAV2

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/నీటి స్పటికం _______________________ చెమ్మ ఇంకిన కిరణాలు పొద్దూకులా ఇంటి ముందు పడుంటాయి వాటినెవరో ఇక్కడ పారబోసినట్టు పచ్చి గుర్తులు కిటికీలోంచి నా కళ్ళు వాటిని ప్రతిరోజూ కడుగుతుంటాయి మబ్బుపట్టకుండా అవి తడుస్తూనో నన్ను తడుపుతూనో ఉంటాయి రాత్రి మిగిలిన సగం విరిగిన కలలా నన్ను నడిపించే కాళ్ళలా నాతోనే ఇప్పుడు కొన్ని ఆకులు మళ్ళా రాలాలి వాటి కోసం పనిమాలా పిట్టగోడపై చెకోరపక్షిలా ఎటు ఎగరాలో తెలియని క్షణం కొంత ఎర్రమట్టిని అరచేతుల్లో పొదువుకొని ఆకాశపు మొదళ్ళలో అంటుకడుతుండే ఆనవాళ్ళు భూమిపై కూర్చున్న సముద్రమొకటి లేచి వెళ్ళినప్పుడు అవే చేతులు కొత్త ప్రతిబింబంలా హత్తుకుంటాను కనిపించని అస్పష్టతను వెంటతెచ్చుకొనే మొసళ్ళు ఈ బంధాలు గాలివేర్లలా తిలక్ బొమ్మరాజు ......29/05/14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivFxty

Posted by Katta

బాలసుధాకర్ మౌళి కవిత

ప్రకటన పాము బుసకొట్టదు కాటేయదు మెత్తగా సుతారంగా మునివేళ్లతో వొళ్లంతా రాస్తున్నట్టు - ఆలోచనల పుట్టలోకి చొరబడుతుంది అణువణువునూ ఆవరిస్తూ మండీ వేసుకుని కూర్చుంటుంది అది అప్పుడప్పుడూ తల పైకెత్తి చుట్టూరా చూస్తుంది నిద్రలో కళ్ల ముందుకొచ్చి తైతిక్కలాడుతుంది ఊపిరికొసల్ని ముడేసి వొళ్లంతా పాకుతుంది వొదలదు - యింటిలోకీ వొస్తుంది భార్యామణుల ఊహల్లోకి మరీ మరీ వొస్తుంది దాన్ని చూసి పిల్లలంతా మారాం చేస్తారు దాని మీదికెక్కాల్సిన బదులు దాన్నే మీదికెక్కించుకోవాలని మహా ఉబలాటం పడతారు ప్రకటన పాము ఎవ్వరినీ వొదలదు - కొద్ది రోజుల్లోనే వచ్చిన పని అయిందనుకున్నాక మరో పుట్టని వెతుక్కుంటుంది మాయలమారి 'ప్రకటన పాము' - ఆలోచనల పుట్టలోనివే 'తెలివిడిచీమల'న్నీ వొక్కటై చుట్టూరా దడి కట్టి దాడిచేస్తే అంత బడాయి పామూ చచ్చి ఊరుకుంటుంది ! * నేనిప్పుడు ప్రకటన పాముకు పాడె కట్టాలి నువ్వో చెయ్యేస్తావా.... ? రచనా కాలం :29 మే 2014 -------------------------------- 29.05.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lU1bsx

Posted by Katta

Pusyami Sagar కవిత

ప్రయాణం _________పుష్యమి సాగర్ ఒక సాయంత్రం కరువుఅయిన శాంతి కోసమో ఏమో , సమాంతర పట్టాల నుంచి ముందుకు ఉరుకుతూ దూకుతున్న రైలు పెట్టె లో నన్ను నేను ఓ మూల గా కుక్కుకొని కూర్చున్నాను ... ఉపిరి ని కాస్త వదిలి నలు దిక్కులా చూసాను గాలిని మింగి కాస్త సేద తీరుదామని నన్ను అమాంతంగా కబళించిన బడుగు జీవులు కళ్ళలో దైన్యం , .ఒంటి కాలు పై తపస్సు ఓటేసిన పాపానికి ఫలితం కాబోలు ...!!! యాతనల వంతెనల నుంచి వడి వడి గా అడుగులేస్తూ ...ఒక్కరికి తీరిక లేదు... అప్పుడు అప్పుడు సజీవ బతుకు చిత్రాలు రంగులేసుకుంటూ మొహం పై చల్లి వెళ్తున్నాయి మలి దశ లో కొడుకు లు ఉమ్మేసిన తండ్రి నడుము వంగి అడుక్కుంటూ త్వరగా మరణపు అంచులను తాకాలని తహ తహ పడుతున్నాడు ...!! మరో గుడ్డి తమ్ముడు పెదాలపై కనిపించని దేవుడి ని తలచుకుంటూ పొట్ట నింపుకునే ప్రయత్నం లో సూటి పోటీ బాణాలు తుడిచేసుకుంటూ అంగీ లో వేసుకుంటున్న దృశ్యాలు !!!! ఇక చాలీ చాలని దుస్తులతో తమ శరీరాన్నే కాదు మనసు ని కప్పుకోలేక ఆకలి తో ఆక్రమించే పులుల మధ్య లో ఆడతనం బేల గా గుక్కపట్టి ఏడుస్తుంది ...!!! ఇలా చిద్రమైన బతుకుల నుంచి పయనిస్తూనే ఉన్నదీ .. తన గమ్యం ఎక్కడో తెలియని ఓ రైలు ...! మే 29, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKq8tL

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఎం. శేషగిరి || మా గుడిసెలకు నీరంటుకుంది|| మా గుడిసెలకు నిప్పంటుకోవడం పాత మాట! ఇప్పుడు నీరంటుకోవటం కొతామాట!! చెట్టుకు చెదలుబట్టడం చూసాము నీరుబట్టడం చూడబోతున్నాము నిప్పంటుకుంటే నీరార్పేది నీరే అంటుకోబోతోంది ఏం చేయాలి? ప్రకృతి సునామీలు కనబోతున్నాము! మ సహజ సుందరమైన జీవితాన్ని లేవదీసి కృత్రిమ జీవితంలో కుదిస్తారట పోలవరం కొందరి జీవితాలకు పూలవరమే కావచ్చు.... మా గిరిజన బతుకులకది పెనుభారం! మా అడవి సంపదను బేరీజువేసే మాయా తులభారం! ఆహా! ఎంత ప్రకృతి సౌందర్యం అని పొగిడినోళ్ళే దానిని వికృతం చేయచూస్తున్నారు పాపికొండలను సహితం ముంచే పాపానికి ఒడిగట్టారు మా పేరంటాల పల్లిని అడుగంటా ముంచేయజీస్తున్నారు వరాలిచ్చే వరద గోదావరిని చించి మా బ్రతుకులకు పరదాకుడతారట! అనాదిగా శోభిస్తున్న మా గిరిజన సంస్కృతి పునాదిని దెబ్బదీసి సమాధిగట్ట జూస్తున్నరు! అమ్మో! మీరు మామూలు వాళ్ళుకాదు అందమైన మా గుట్టలనే గుటక వేయాలనుకుంటున్నరు మా అమాయక గిరిజన కాకులని గొట్టి మీ బహుళజాతి గద్దలకు వేయనెంచారు! తరితరాల మా స్మృతి చిహ్నాలను చెరిపేసి మీరుగట్టే ప్రాజెక్టులు మీకో మాకో మృతి చిహ్నాలవుతాయి జాగ్రత్త! ** జీవన్మరణం - పోలవరం గిరిఘోష (కవితలు, కథల సంకలనం - సాహితీ స్రవంతి ఖమ్మం ప్రథమ ముద్రణ ఫిబ్రవరి 2006-- ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి ఆధ్వర్యాన ఇరవైమంది కవులూ, రచయితలు, పోలవరం వల్ల మునిగే ప్రాంతాలయిన కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం,వి.ఆర్.పురం చింతూరు మండలాల గ్రామాలు పర్యటించి అక్కడి గిరిజనుల, గిరిజనేతరుల మనోభావాలను, అవేశాలను, ఉద్వేగాలను తెలుసుకున్నారు. కవిత్వానికి మౌలికంగా చైతన్యం కావాలి. కథకు జీవితపు వివిధ కోణాలను చూడగల అంతర్‌దృష్టీ అవసరం. కవిత్వానికి కావల్సినంత చైతన్యాన్ని, కథా రచనకు కావలసినంత జీవిత విభిన్న చిత్రాలను వారినుండి పొంది తెలుసుకున్నది వారి లయబద్ధ మాటల్లోని స్పష్టత, ధిక్కారం, ధైర్యసాహసాలు, మానవీయ ప్రాధేయతలు కదిలించాయి కాబట్టే ఈ సంకలనం వాటికి ప్రతిబింబం. *** 28.5.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pnxma8

Posted by Katta

Sanjeev Goud కవిత

SANJEEVEEYAM/ జీవన సంధ్య లో !!/1-1-2001 జ్జ్ఞాపకాలు వెంటాడి వేటాడి మనసు వికలం చేస్తాయి !! అనుభవాలు ఎప్పటికప్పుడు మనిషిని పదిలం చేస్తాయి !! గతం అనుక్షణం గుండెలో గణ గణ గంటలు మ్రోగిస్తే ప్రస్తుతం అది అప్రస్తుతమని వర్తమానం పరుగు పెట్టిస్తుంది !!! నిన్నటి మోహాల దాహం ఈ నాడు వెగటుగా ఔతుంది !! కుతిగా తాగిన పాయసం అతిగా మారి ఆయాసమౌతుంది !! వెలుగని వేకువని మేల్కున్నది చీకటి నిద్ర లోకి జారుకుంటది !! తీరా అన్ని అవగతమయ్యే సరికి తీరానికి పడవ చేరుకుంటది !! @@@@@@

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNWdkv

Posted by Katta

Sanjeev Goud కవిత

http://ift.tt/1muU7Ep

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1muU7Ep

Posted by Katta

సత్యవతి కొండవీటి కవిత

భక్తి, పూజ... దూరం దూరం ప్రేమ,స్నేహం...పారవశ్యపు పాలపుంతల్లో కి పయనం * పవిత్రత...అంటరానితనానికి రాచబాట అంటుకోవడం...విశాలత్వానికి పూలబాట * దేవతల్ని చేసేస్తే...ఓ పనై పోతుంది మనుషుల్లా చూస్తే మానవత్వం పరిమళిస్తుంది.

by సత్యవతి కొండవీటి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNQhI4

Posted by Katta

Nishi Srinivas కవిత

*** घर का आंगन *** ——————————निशीगंधा घर का आंगन महकाया था आज के दिन तु आया था । खिला था हर बूटा... हर पत्ता मुसकाया था । तेरा प्यार एक बादल था... पूरब पश्चिम छाया था । घोर अंधियारो मे तूने आशा दिप जलाया था । सारे जग को छोडा तो... एक तुझे अपनाया था । ( Nishigandha ) (29-05-14)

by Nishi Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wqDOzn

Posted by Katta

Uday Kiran Gupta కవిత

నేను తన గొంతుతో నా భాదని పంచుకుంటే...!! తను నా మనసుతో తన ప్రేమని పంచుకుంది...!! Uday Kiran Gupta

by Uday Kiran Gupta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iuQ2xi

Posted by Katta

Madhan Kumar Saggam కవిత



by Madhan Kumar Saggam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1owS47A

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

పోల'వరమా' ? శాపమా ? మూడవ పంట కోసమని ముంచగ నెంచిరి ప్రక్క రాష్ట్రమం దేడు విశాల మండలము, లెంత విషాదము ! ఆంధ్ర నాయకుల్ గూడెపు టాదివాసులట గుండెలు బాదుకొనంగ కానరో ? ఏడుపు కళ్ళనీళ్ళపయి ఎత్తుగ 'డ్యామ'ట ! సిగ్గు చేటయో ! - డా. ఆచార్య ఫణీంద్ర 29/05/2014

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oMSSTl

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె •• వెలుగొక నిద్ర గుర్తు •• నేలపై బంగారు పూత సాయంత్రం- పసుపుకొమ్మ సూరీడు- రాత్రికి చివరి చూపు వెలుగది-

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNfkei

Posted by Katta

Trinadh Meegada కవిత

//సుందర స్వప్నం// పక్క పై వాలిన పడతి పరువపు బిగువులుతో ఎదో వెలితి తీరం నుండి విన్నప్రియుని వేణుగానం కలల అలలపై చేసే పడవ పయనం తరచి మురిసి వగచిన వయ్యారం అలకన కులుకుతో బుగ్గన దాచిన సింధూరం తీయని బడలిక భారము తీరిన తరుణం ప్రణయ ప్రేమా పరిణయ పరిస్వంగనం మేనే చేనై పండిన రస మధురిమ ఫలం కనుల వెనుకే దాచిన సుందర స్వప్నం ……………………………. మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RE2wM1

Posted by Katta

Krishna Mani కవిత

దాహం _________________కృష్ణ మణి కదలిపోరా చెదిరిపోరా మసలిపోరా ఆ కంటినీరులో కొట్టుకుపోరా ! ఒంగిన నడుములు తిరిగిన చేతులు కాళ్ళు మరగుజ్జుల ఆటలో మూటగట్టిన ఒళ్ళు పసి ఆటలు మానిన అమాయక చూపులు ముసలి వారైన పెళ్ళికాని కొడుకులు ! తల్లికావలిసిన పడతి చంటి పిల్లోలె పాకుడు గుండె రాయిగా చావని తనాన బతుకులేని సాకుడు ! కడుపుతీపి మధురం అది చెరగని సత్యం కన్నవారే ముసలితనాన ముడ్డికడికే దుఃఖము ఎవడన్నం గుంజారో ఈ నరకంలో పడ్డారు ఏ పాపం చేసారో ఈ గడ్డపై పుట్టారు మానవత్వం లేని రాజకీయ కొజ్జాల కోలాటంలో కృశించిన తనవులు విషనాగుల ఎంగిలి నీళ్ళే గతని తెలిసినా తప్పని దాహపు కడుపులు ! కృష్ణ మణి I 29-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pmiWai

Posted by Katta

Pulipati Guruswamy కవిత

2002 లో రాసిన ఒక పద్యం.పాత పుస్తకాల మధ్య నుండి తేలింది . బతుకుమచ్చ // డా .పులిపాటి గురుస్వామి // ఈ రహదారుల మధ్య ఖైదు చేయబడ్డ ఒంటరి వనవాసి నేనే దారులు తెరుచుకునే మంత్రం మరిచిపోయిన బానిసను వెన్నెల్ని తీసుకొని వెలుతురు ఎటు వెళ్ళిందో ... బహుశా నేనే నా బానిస హస్తాల నుండి విముక్తి కలిగించానేమో! నా గుహ లోకి రంజింప వచ్చిన పిచ్చుకను నిలుపలేని బలహీనత కూడా ఒక శాపన కొన్ని జ్ఞాపకాలు తప్ప మరేమీ లేదు. తోతాపురి కండరాల ప్రశ్నలకు జవాబు లేదు అనేక వలయాల నడుమ చతికిల బడ్డ శ్వాస కు దుఃఖం తప్ప మరో తోడు లేదు దైవత్వం కోసం కాదు కాని మనిషిగా మసలుకునే లోపల ఏదీ కాకుండా పోయిన వెలివేయ బడ్డ ఆత్మవికలున్ని ఈ రక్త మానస గాయమిక పూయదు. ..... 29-5-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pme45c

Posted by Katta

Sanjeev Goud కవిత

AHAM TVAM/ Sanjeev / 28-5-2014 నన్ను నన్ను గా చూస్తె నాకొరిగేదేమిటి బొంగు!! నాలో ఓ ఇంద్రున్నో చంద్రున్నో చూస్తెనే అది హంగు!!! మనసులో నువ్ ఎలా అన్కుంటే నాకేంటి నష్టం?? నల్గురిలో నన్నే గొప్పనకుంటే నాకెంతో కష్టం !!! నేనేసే జోకులకి నవ్వేవారంటే నాకు చానా ఇష్టం!! నా మీదెవడైనా జోకేసినా వీప్పగలడం చాలా స్పష్టం !!! నన్ను గోప్పోడిగా గుర్తించి కీర్తించే వాళ్ళంతా నిర్మొహమాటంగా నాలాగే గొప్పోళ్ళని నేనంటా !!!!

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pzXbBh

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-48 కళ్ళ ఎదుటే అను నిత్యం అనేక చావులు సంభవిస్తున్నా నీవు తొణకవు,బెణకవు కాని నీ నుంచి వచ్చిన ఒక జీవి కన్ను మూస్తే మటుకు ప్రపంచమే నీకు విషాదమవుతుంది కదూ... ఎందుకని...అది నీది కనకనా...? నీది అనుకున్నది ,నీది కాదని తెలియజెప్పడానికే ప్రకృతి నిరంతరం అనేక మార్గాల్లో తన పనిని తాను చేసుకుంటూ అలా...!!! --------------------------------------- 29-5-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nEG9Cy

Posted by Katta

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (ఎండుటాకులకు కృతజ్ఞత) పాము కదిలి పోతుంటే గలగలా శబ్దం చేస్తూ ఎండుటాకులు హెచ్చరిస్తున్నాయి, పక్కనున్న మొక్కల మీది పువ్వులు ఎన్ని అనుభూతి కవితలు రాసుకున్నా నడక లెదుర్కొనే ప్రమాదాల్ని పసిగట్టి కూడా ప్రకృతిలోకి ముడుచుకుపోయే ప్రయత్నం... పచ్చి గడ్డి కోసం కక్కుర్తి పడి దారి తప్పిన గేదెలు, గేదెలు కాసే మురికి తలకాయలు అరణ్యంలో తమ దారి వెతుకులాట... మంత్రం వేసే పాముల నరసయ్యల సిద్ధాంతులు ఇంకా మైదానాల్లో బుసలుకొడుతూనే... చీకటి ఆసుపత్రుల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు దారి తెలిసే తప్పిపోయాయి... ఎన్నికలు గడిచిపోయాయి హమ్మయ్య! మొత్తానికి గేదెలు, కాపలావాళ్ళు తెల్లారేసరికి గూడెం చేరుకున్నారని అద్భుత మైన విజయ వార్త, ఎండుటాకులకు కృతజ్ఞత.

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kMM6fE

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత / అమాయకురాలు నువ్వు మరొక ప్రేమను పొందావు అది నాకు తెలుసు మరొకరెవరో ఆరాధిస్తారు నిన్ను అచ్చం నాలాగే నా బంగారమా.. అనే నే తియ్యటి మాటలను తలుచుకుంటూ నిన్ను నీ ఆత్మను అర్ధం చేసుకున్నాననుకుంటుంది అచ్చం నా వలెనే పాపం అమాయకురాలు అతి సామాన్యంగా నువ్వు మరొక హృదయాన్ని భగ్నపరుస్తావు నాకు తెలుసది అప్పుడు నేను ఏమి చేయ లెని అసహాయురాలిని నేను ప్రయత్నించినా ఆమె అపార్ధం చేసుకుంటుంది నన్ను తరిమేస్తుంది కూదా అమాయకురాలు నావలెనే అతిత్వరలో నువ్వు ఆమెను కూడా వదిలేస్తావు అది నకు తెలుసు ఆమె ఎప్పటికీ తెలుసుకోలెని సత్యం నీ నిష్క్రమణకు కారణం ఆమె దుఖిస్తింది ఆశ్చర్యంతో ఈఅమి జరిగిందో తెలియక అప్పుడామె ప్రారంభిస్తుంది ఈ గీతాన్ని ఆలాపించడం అమాయకురాలు నాలాగే //////// మాయాయాంజెలేన ఆంగ్లకవిత "పూర్ గర్ల్" కు స్వేచ్చానువాదం జ్వలిత 2009లొ సూర్య దిన పత్రికలొ ప్రచురించ బడింది 29/05/2014, 8.10ఉదయం

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tRXVEk

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వ ............... సంధ్య కొద్ది పాటి విశ్రామమయితేనేం ఇరుపక్షాల రాత్రీ పగళ్లను నెగ్గుతూ .............................................. వాధూలస 28/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rivP7e

Posted by Katta

Rajender Kalluri కవిత

## దేవుడా... ## దేవుడంటే భక్తి కాదు ఓ నమ్మకం ! దేవుడంటే మతం కాదు ఓ తత్వం ! దేవుడంటే వెలుగు కాదు కనిపించని ఓ చీకటి ! దేవుడంటే రాయి కాదు చరిత్రలో చెరగని ఓ ముద్ర ! దేవుడంటే ఓ ప్రార్దన కాదు మనం అడిగే అభ్యర్ధన ! దేవుడంటే బోదించేవాడు కాదు చెడును చేదించేవాడు కుడా ! దేవుడంటే గుడిలో ఉండేవాడే కాదు నీ యెదలో ఉండేవాడు కుడా ! వరాలిస్తాడో లేదో తెలియని ఓ నమ్మకానికి గుడి కట్టి పుజిస్తున్నాం ..... జన్మనిచ్చి నీకోసం అన్ని చేస్తూ ఆరాట పడే " అమ్మ- నాన్న" లను ఎందుకు మర్చిపోతున్నావు మిత్రమా ?? kAlluRi [ 29 - 05 - 14 ]

by Rajender Kalluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rivOQK

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

నేను వేకువ జామున్నే తనహృదయంలో ముళ్ళను దాచుకొని రోడ్డుమీద నడుస్తున్న ఎర్రరోజామొగ్గని చూశాను

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TVFQJa

Posted by Katta

Afsar Afsar కవిత

http://ift.tt/1hzBBI9

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzBBI9

Posted by Katta

Uday Kiran Gupta కవిత

తడసిన కళ్ళు, అలసిన మనస్సుతో నే ప్రవచించు పవిత్ర వేదం ఈ నా "వేదన"...!! Uday Kiran Gupta

by Uday Kiran Gupta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hexwi8

Posted by Katta

Uday Kiran Gupta కవిత

తడిసిన కళ్ళు దాటి తడిమిన వేళ్ళని తాకి జాలువారిన కన్నీరు చెప్పలేదా నా మనసు పడిన వేదన గురించి...!! Uday Kiran Gupta

by Uday Kiran Gupta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oKYhdD

Posted by Katta

Abd Wahed కవిత

ఒంటరి చూపుల దారాలకు గాలిపటాల్లా సూర్యచంద్రులు. తెగితే చిత్తుకాగితాలే చీకటిపగళ్ళ చిక్కుముడులే ఆరిపోయిన మనసులా దారి మునగదీసుకు నిద్రపోతుంది బాధలు నడిచే బాటేది? విషాదాల పూలవనానికి సాగునీరు కరువు కాదు కంటిలో మంచుపొర మెరుస్తూనే ఉంటుంది రాళ్ళవాన కూడా కురవడం లేదే! ఉన్మాదపు హోరు పుట్టల్లోకి మళ్ళిందా? ప్రేయసి పెదవిలాంటి మెత్తనైన మట్టిరోడ్డు ఎక్కడికి పోయింది? చిరుగాలి పైటలా ఒక్కసారి స్పర్శిస్తే చాలు.. దౌర్జన్యాలు లెక్కపెట్టడం ఎందుకులే కన్నీళ్ళు లెక్కలేనన్ని ఉన్నాయి... హంతకుడిని చూసి భయపడేదేముంది కట్టిపారేసి లొంగదీయడానికి కాళ్ళు చేతులు మిగలకుండా చూసుకుందాం... మెడలు తెగిన పూలు రాలిపోతే పోనీ... నేల సువాసనతో పరిమళిస్తుంది... చీకటి విత్తనాలు చల్లిందెవరైనా మొలకెత్తక మానవు కదా అంధకారం మర్రిలా జడలు విరబోసుకుంది సూర్యచంద్రుల దారాలు తెగేలా లాగిందెవరు? బైరాగి జుట్టులా, ఫకీరు గెడ్డంలా చిక్కుపడిన చీకటి పగళ్ళను సంస్కరించే దువ్వెన ఎక్కడుంది? ఒంటరి గడ్డిపోచ గాలికి కొట్టుకుపోనీ ఎక్కడో ఒకచోట తోడు దొరక్కపోదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TUAhL2

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

Remembering Maya Angelou WOMAN WORK (Poem ) I've got the children to tend The clothes to mend The floor to mop The food to shop Then the chicken to fry The baby to dry I got company to feed The garden to weed I've got shirts to press The tots to dress The can to be cut I gotta clean up this hut Then see about the sick And the cotton to pick. Shine on me, sunshine Rain on me, rain Fall softly, dewdrops And cool my brow again. Storm, blow me from here With your fiercest wind Let me float across the sky 'Til I can rest again. Fall gently, snowflakes Cover me with white Cold icy kisses and Let me rest tonight. Sun, rain, curving sky Mountain, oceans, leaf and stone Star shine, moon glow You're all that I can call my own.

by కోడూరి విజయకుమార్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TUAi1A

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

అడవి తల్లి ఆవేదన ~~~~~~~~~~~~~~~ అందాల కల్పవల్లిన ి ఆనందాల హరివిల్లును భూమాత వొడిలో విరిసిన తరులతల పచ్చని బంగారాన్ని... పక్షుల కిలకిల రావాలతో పండువెన్నెల వెలుగులతో అందాలన్నీ ఒలకబోసిన వయ్యారాల సింగారాన్ని గోదారి జలధార మధువు తాగి గుట్టలపై విరిసిన గుబురువనాన్ని రామయ్య అడుగులలో పూసిన రమణీయ పుష్పవనాన్ని సీతమ్మ పాదాల పారాణి తాకి మధుర ఫలాలనిచ్చే వృక్షజాలాన్ని జంతువుల వలపు కుటీరాన్ని విహంగాల విహార కేంద్రాన్ని ఆదివాసులకు ఆత్మబంధువును గూడెపుజనుల గుండె గొంతుకను అలాంటి నన్ను రక్షస రాజకీయ క్రీడలో స్వార్థం మీరిన కాంక్షతో అమానుషంగా అమానవీయంగా చెరబడుతున్నారు తరాల సంపద తరలించే ఏర్పాట్లు కుటిల మానవుడి కుయుక్తులు విషపుకోరల వింత నాటకాలు ఆర్డినెన్సుల ఉరితాళ్ళు అడవిని ముంచి ఆత్మను చంపి ఆదివాసుల్ని తరిమి తరిమి కొడతారు గూడెపు వాసుల గొంతుల్లొ గునపాలు దించుతారు విహంగాల ముక్కుల్ని తూములుగా చేస్తారు! వేలవేల ఏళ్ళ ప్రాచీన వృక్షలాన్ని కాలువలుగా కడతారు!! ధరిత్రిని సస్యశ్యామలం చేస్తారట!!? కొందరి వరాల కోసం పోల'వనాన్ని' పోలవరంగా ముంపులో ముంచుతారట అపురూప సంపదను అసంఖ్యాక జీవరాశిని అమాయకపు ఆదివాసులను శాపగ్రస్తం చేస్తారా?

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCwHj6

Posted by Katta