పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మార్చి 2014, శనివారం

Naresh Kumar కవిత

నరేష్కుమార్ \\పురాతన ప్రయాణం\\ దేహాత్మల్లోంచి విడివడి వొడివాడి చిక్కిపోయిన మనసుతో చలిస్తూ చరిస్తోన్న రైలు నన్ను మోసుకుంటూ.... కదుల్తోంటాను నేనూ చలించని పాదపు ప్రయాణంలో చరిస్తూ... కొన్ని చెట్లనూ కొన్ని ద్రృశ్యాలనూ వొరుసుకుంటూ వెల్తోన్న రైలు వొకానొక సరస్సుపక్కగా వెల్తూ తనని తాను చూస్కుంటుంది నీటి అద్దంలో అచ్చం. నాలా ఉంటుంది రైలు ఓపెన్ సెసేం మంత్రం గుర్తున్నా తెరువబ్డ్డ ద్వారం దారివ్వదు... మళ్ళీ మళ్ళీ కొన్ని దృశ్యాలు కిటికీలోంచి తిరిగి తిరిగి చూస్తూంటాయ్ రైలొక నదిని దాటుతూన్నప్పుడు కొన్ని నాణేలకు బదులుగా రెండు నిర్వేదపు నిట్టూర్పులని తీసుకుంటుంది... ఒక్కోక్కసారి ప్రయాణం ఓ అర్థరాత్రిని చీల్చుతున్నప్పుడు స్వప్నస్ఖలనం లా జారి ముందు రాలిపడతాడొకడు దారివ్వలేని తెరుచుకున్న ద్వారం దగ్గిర అగ్గిపెట్టె రెండు మనసులనీ వెలిగించాక అతనడుగుతాడు.. "ఎక్కడిదాకా...?" సిగరెట్టు ఙ్ఞాపకాన్ని కొనవేలితో విదిలిస్తూ.. "బయల్దేరిన చోటికె !" బదులిస్తాన్నేను 01/02/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pKJxN3

Posted by Katta

Sriramoju Haragopal కవిత

ఇవాళ సాయంత్రం ఆబిడ్స్ బంగారువాకిలిలో ‘ఆకుతోట’- వాసుదేవ్ శ్రీనివాస్ కవితాసంకలనం ఆవిష్కరణ సభ జరిగింది. వేదికమీద యాకూబ్ , నారాయణశర్మ, అరుణ్ సాగర్, హెచ్చార్కె వాసుదేవులున్నరు. పుస్తకం గురించి అందరు బాగా మాట్లాడారు. నారాయణశర్మ సమీక్షా ప్రసంగం హైలైట్. వానమబ్బులు పట్టిన మొగులు, చల్లగాలికి బరువెక్కి, రాలిపోతున్న ఆకులపాటల మధ్య, ఆత్మీయుల మధ్య సభ తడి తడిగా గడిచింది. కొన్ని ముచ్చట్ల ఫోటోలుః

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hOEqWr

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

good night all of you...

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d77VDb

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

William Hazlitt... man is the only animal that laughs and weeps, for he is the only animal that is struck with the difference between what things are and what they ought to be....... Umith Kiran mudhigonda...,

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eLUVzl

Posted by Katta

Shivaramakrishna Penna కవిత

ధనిక వర్ణం, అగ్రకులమూ..... ధనిక వర్ణం, అగ్ర కులమూ కలుసుకున్నాయి ! ఉపకులములోనూ వర్గముందని తెలుసుకున్నాయి ! నిలువు, అడ్డము బొట్లు ఎన్నడు కలిసి తినలేవు ! వసుధ ఏక కుటుంబమంటూ దోచుకున్నాయి ! స్వధర్మాలను, ఇతరులకు బోధించు వేదాలే, డాలర్ల వేటకు, అప్రాచ్య విద్యలు నేర్చుకున్నాయి ! దళితులెందరొ వేరు మతముల బాట పట్టగనే, 'దళిత గోవింద' మని తలుపులు తెరుచుకున్నాయి ! ఏకలవ్యుడు బాణ మొక్కటి ఎక్కుపెట్టగనే, 'గీత' చాటున వేయి పడగలు దాచుకున్నాయి ! చెవిలోన ఊదే మంత్రమే, ఫోన్ ట్యూనాయే, ఏ దిక్కు తోచక, శ్రుతులు నాలుక కరుచుకున్నాయి ! దళిత, బహుజన ముళ్ళ మకుటం వెలుగు చూడగనే, అగ్రవర్ణపు తోకలన్నీ ముడుచుకున్నాయి ! మీరు పాదము నుంచి ఎందుకు పుట్ట లేదంటే, విప్రనాగుల పడగలన్నీ జడుసుకున్నాయి ! ******************** "శిశిర వల్లకి" (2012) గజళ్ళ సంపుటి నుంచి......

by Shivaramakrishna Penna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eLx5DF

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఆనందం అంటే . . . ? ? ? తెరిచిన కనురెప్పల సోకిన తొలి ఉషా కిరణపు పలకరింత . . .! బీడు బారిన యెదపై కురిసిన తొలకరి జల్లు పులకరింత. . . ! తనువెల్లా పులకలు రేపే పిల్ల తెమ్మెర గిలిగింత. . ! వణికించే చలి రాతిరి వెచ్చని దుప్పటి కౌగిలింత. . ! మాయలెరుగని బోసినవ్వుల పసిపాపల కేరింత . . ! కన్నుల నిండే వెండి వెన్నెల . . మిన్నున మెరిసే చుక్కల మాల . . మరులు గొలిపే చిరుగాలి ఊయల . . మనసు నింపే రాగాల కోయిల. . ఏ మెటీరియలిస్టిక్ విజయం ఎల్ల కాలం ఆనందాన్నివ్వదు. . . ఒక లక్ష ... మరో లక్ష . . ఉద్యోగం . . ప్రమోషన్ . . పెళ్ళి . . పిల్లలు . . ఇల్లు . . ఒక విజయం . . మరో పెద్ద విజయం . . పొద్దున లేస్తే సవాలక్ష ఆశలు ఆనందాన్ని హత్య చేయడానికి . . అనంతంగా ఈ లోకంలో . . ?! ఒక అద్భుతమైన విజయం దాన్ని నిలుపుకునే ప్రయత్నంలోనో మరో పెద్ద విజయం సాధించే తాపత్రయంలోనో ఆవిరై పోతుంది . . ! మనిషి పోయిన బాధ కూడా మరుసటి నెలకో యేడాదికో మరుగున పడుతుంది . . ! శాశ్వతమైన ఆనందాలూ. . . బాధలేవీ . . సృష్టిలో లేవు. . ఈ క్షణమే నిజం . . ! ఒక మంచి పాట వినడంలో హాయి ఒక చినుకు స్పర్షలో హాయి ఒక పూవు పరిమళంలో హాయి ఒక పుస్తకం చదవడంలో హాయి . . ఒక మిత్రున్ని వాటేసుకోవడంలో హాయి . . అమ్మ కళ్ళలో తృప్తిని చూసే హాయి . . నిమిష మాత్రం హాయినిచ్చే చిన్న చిన్న ఆనందాలే నీవి . . ! ఇచ్చి పుచ్చుకునే చిన్ని చిన్ని ఆనందాలే అనుబంధాలు . . ! జీవితానికి పరాకాష్ట "ఆనందం" అయినపుడు ఆనందానికి పరాకాష్ట "ఆత్మీయత" పంచడమే . . ! సుడిగాలికి వంగి లేచే రెల్లు గడ్డిలా . . కష్టాలకి కుంగిపోక విజయాలకు పొంగిపోక ప్రతీ క్షణాన్ని మనసులోకి ఆహ్వానిస్తూ ఆస్వాదించడమే నిజమైన ఆనందం . . ! కనుమరుగై పోయిన "నిన్న" ని మోస్తూ . . కనిపించని "రేపు" లోకి తొంగి చూస్తూ . . కనుల ముందున్న "నేటి" ని కరిగించకు నేస్తం . . ! నిర్మలారాణి తోట [ తేది: 01.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eLrZrc

Posted by Katta

Chilakapati Rajasheker కవిత

--- చిరాశ // ఆడపిల్ల // ******************************************** కూతురు పుడితే నీ మీద అనురాగ౦ తీరని అమ్మ మళ్ళీ పుట్టి౦దని ఆన౦ది౦చక, ఆడపిల్లని ఏడుస్తావే౦?! అష్టలక్ష్ములను, అన్నపూర్ణను ఆరాధి౦చే నువ్వు ఆడపిల్లని మాత్ర౦ ఈసడిస్తావే౦?! పుత్రుడివల్ల పున్నామ నరక౦ తప్పుతు౦దనుకు౦టావే గాని సాల౦కృతకన్యాదాన ఫలముతో స్వర్గాన్ని పొ౦దాలనుకోవే౦?! కన్నవారిని,ఉన్నఊరిని వదిలి నీ వ౦శవృద్ధికి జీవిత భాగస్వామిగా తానొస్తే, వరకట్నమిచ్చి, వా౦చలుతీర్చుతూ దాస్యము చేసే య౦త్ర౦లా చూస్తావే౦?! ********************************************* --- {01/03/2014}

by Chilakapati Rajasheker



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fyef2Z

Posted by Katta

Panasakarla Prakash కవిత

రైల్వే స్టేషన్ రోజూ కొ౦తసేపు రైల్వే స్టేషనుకి వెళ్ళి కూర్చోవడమ౦టే నాకు చాలా ఇష్ట౦ అప్పుడెప్పుడో ఒకసారి ఊరెళ్దామని స్టేషనుకొచ్చి ఆఫీసును౦చి ఫోనొచ్చి౦దని బ౦డెక్కకు౦డానే వెనక్కి తిరిగెళ్ళిన అనుభవమే ఈ స౦ఘటనకు మూల౦ వచ్చీ పోయే రైళ్ళను చూస్తు౦టే.. ఊళ్ళో ఉన్న మా ఇ౦టికి వచ్చీ పోయే చుట్టాలు గుర్తుకొచ్చారు బ౦డికదులుతున్నా కిటికీలదగ్గరే నిలబడి వీడ్కోలు చెబుతున్నవారిని చూస్తు౦టే నేను మొదటిసారి ఊరును వదిలి వస్తున్నప్పుడు నన్ను వదలలేక హత్తుకున్న నా ఊరి స్నేహితులు జ్ఞాపకమొచ్చారు తన వొడిలో పిల్లను కూర్ఛోబెట్టుకుని కొసరి కొసరి తినిపిస్తున్న తల్లిలో మా అమ్మ.... పిల్లాడి పాదాలు క౦దకు౦డా భుజాలమీదకి ఎక్కి౦చుకుని రైలుపెట్టెలో సీటుకోస౦ వెతుకుతున్న ఆయనలో మా నాన్న కనబడతారు ఇక కిక్కిరిసిన జనరల్ క౦పార్ట్ మె౦ట్ ను చూడగానే ఊళ్ళో పెళ్ళి౦టి హడావుడి గుర్తొస్తు౦‍ది ఫ్లాట్ ఫా౦మీద కూర్చుని అటూ ఇటూ వెళ్ళేవారిని చూస్తు౦టే మా ఊళ్ళో ఇ౦టి అరుగుమీద కూర్చుని వీధిలో వెళ్ళేవారిని గమనిస్తున్నట్టే అనిపిస్తు౦ది ముసలివాళ్ళు రైలెక్కుతూ కనిపి౦చినప్పుడు పిల్లలు లేని మా వూరి అవ్వ తాతలు గుర్తొచ్చారు.. ని౦డిన పెట్టెలు భార౦గా కదులుతు౦టే పుట్టిని౦టి ఆవరణలో ని౦డు చూలాలైన ఆడబడుచు కదులుతున్నట్టనిపి౦చి౦ది అన్నిటికీ మి౦చి మా ఊరి ను౦చి వచ్చిన ఆ రైలు మా ఊరి మనుషులతో పాటూ మా ఊరి మట్టినీ మా ఊరి గాలినీ తనతో మోసుకొచ్చి౦ది.. బ౦డి ఫ్లాట్ ఫా౦ మీదకి వచ్చి నా కళ్ళము౦దు నెమ్మదిగా ఆగినప్పుడు మా ఊరిని చూస్తున్న అనుభూతికి లోనై నా కళ్ళల్లో నీళ్ళు.... కదిలేటప్పుడు ఒకసారి అలా బ౦డిని చేతితో తాకుతూ నిలబడతాను.. కలవని పట్టాలను ఆసరాగా చేసుకుని అ౦దరినీ కలుపుకు౦టూకదిలే మా ఊరు రైలుకి రోజులాగే ఈ రోజుకూడా వీడ్కోలు చెబుతాను రైలు వెళ్ళగానే పట్టాలపై మళ్ళీ వెన్నెల‌ నీడ పరుచుకు౦టు౦ది.. పనసకర్ల‌ 1/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBTPeH

Posted by Katta

Santosh Kumar K కవిత

||నీ స్నేహం|| శీర్షిక: ఒక యువకుని మదిని తట్టిలేపిన సౌందర్యాన్ని ఇలా వర్ణిస్తూ ఆ సుందర స్నేహన్ని కోరుకుంటూ ఇలా అంటున్నాడు... తేనె గానాల కోయిల పిలిచిందో వసంత రాగాల గాలి వీచిందో సెలయేరు సప్తస్వరాలు పాడుతుందో ఏమైందో తెలియని ఆనందల కచేరీలో ఈ లోకమంతా ఎందుకో కొత్తగా ఉంది.. సరదాల సందడులు పిలుపుచెసాయా అన్నట్టు ఎదలో ఉల్లాసం ఉప్పొంగి ఉరకలేస్తుంది... ముందెపుడు లేని ముచ్చట్లన్నీ నింగినంతా నిండి ఉన్న నీలంలా నా చుట్టూ చేరి తెగ కబుర్లుచెప్తున్నాయి... కారణాలు ఏంటని ఆరా తీస్తే.. ఉత్సాహం రెట్టింపు అయినట్టు, కోరికలు తీరే కాలమొచ్చినట్టు, కలలు నెరవేరే వేకువ పిలిచినట్టు, ఆహ్లాదాల అంబారీలో ఊరేగినట్టు.. ఉత్సాహాల తీరంలో నేనుండగా కోరికల కలల అలలు పోటీపడుతూ కాలం కన్నా వేగంగ ఎగసిపడి ఆహ్లాదంతో నన్ను హత్తుకుంటున్నాయి... అదే అదే చెప్తున్నా... ఎందుకంటే... ముగ్ద మనోహరమైన ఓ మగువా లలిత లావణ్యమైన నీ మనసుతో కోమలమైన నీ చేతి స్పర్శతో నను తాకితే తరించనా తక్షణం.. అయినా ఓ సోయగాల సొగసరి, సోకుల బందీఖానావి.. మన్మథుని ఊహాచిత్రానివి నువ్వు... ఏమని వర్ణించగలను నీ నవ్వు... నా కళ్ళలో తొలిసారిగా నీ ముఖారవిందం వికసించింది.. నా చూపులకు తొలిసారిగా నీ గులాబీ చెక్కిల్లు పరిచయమయ్యాయి.. నా చెవులకు చిలిపిగా నీ పలుకులు సరిగమలను ఆలపించాయి.. నా ఊహలకు ఊపిరినిస్తూ నీ జాలువారే కురులు సయ్యాటలాడాయి.. నా మురిసిన ఆలోచనలో నీ మెరిసిన దరహాసం నాట్యమాడింది... ఆ తరుణంలో.. వెలకట్టలేని నీ పరిచయంలో అనువనువునా తోడు నీడగా నేనుంటా.. పున్నమి రాతిరి వెలుగులా మారి నా మదినిండా నిన్నే నింపుకుంటా.. నీ సమయంలో క్షణ కాలాన్నిస్తే చాలు అందులో నా జీవితాన్ని మలుచుకుంటా.. నా ప్రేమ దివిసీమలో నీరాకతో ప్రణయ ప్రయాణానికి తొలి అడుగులువేసి నా సంతోషానికి ఒంటరి చిరునామాగా నువ్వుండాలనే కాంక్షతో కోరుకుంటున్నా నీ బంధం.. నీ స్నేహం... #సంతోషహేలి #Sanoetics 01MAR2014

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBTRmM

Posted by Katta

Bhavani Phani కవిత

(మా అబ్బాయి సాకేత్ వ్రాసిన కవిత. గ్రూప్ లో జాయిన్ కావడానికి తన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యబడని కారణంగా నేనే పోస్ట్ చేస్తున్నాను . దయచేసి చదివి మీ ఆశీర్వాదాలు , సలహాలు , సూచనలు తెలుపగలరు . ) Valluri Saketh ॥ A message from history॥ It all started on a moonless windy night, when the king took his place and sat upright. A meeting was arranged which was clandestine, a meeting that would change the world with time. The results of the meeting were drastic, a war was declared. It was an errant decision,so barbaric, that even the soldiers were aghast. The kingdom upon which the war was declared, was equally strong and agile, all the other kingdoms' invasions on it had been futile. But the adamant king wouldn't bulge, he wouldn't change his orders, so the army started to mobilize and the horses were fed with fodder. The day of battle finally arrived, the battleground and its vicinity was green. Two strong armies stood facing each other, to fight a battle in which only the strongest would win... The war-horn was blown and the swords clashed, in matter of days there was no battle ground, all one could see was pool of blood and hear wailing sound. Few who survived that brutal battle, left that place forever, Resolved not to return again, and never to battle..never ever. This is not a folklore neither fairy tale nor a story, this is taken from future, a future where people reckon it as their history..... 01. 03. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kk86PV

Posted by Katta

Sri Venkatesh కవిత

***నిశ్శబ్ధం*** నాలుగు గోడల పంజరంలో రంగు కోల్పోయిన రాచిలకను నేను ఎటు వైపుకు చూసిన శూన్యమే పలకరిస్తుంటే ఆ శూన్యంలోనే ఒక చీకటి ఆకారాన్ని సృష్టించుకుని ఆ చీకటితోనే చెలిమి చేస్తూ నిరాశ ఆటలను ఆడుతూ నిస్పృహ సేద్యాన్ని సేవిస్తూ ఎటువైపు అడుగులేసినా తిరిగి మొదలుపెట్టిన చోటుకే వస్తుంటే నా నడక కూడ నా నుంచి దూరమై ఒక మూలకి నన్ను విసిరేస్తే కదలిక లేక కూలబడ్డ నేను కాపాడమంటూ కదిలించమంటూ సాయం కోసం స్వరపేటిక అరిగేలా అర్ధిస్తుంటే మళ్ళీ ఆ చీకటి ఆకారమే నేనిక్కడున్నానంటూ పంజరానికి అటు మూలగా నిలుచుని రా..రా..అంటూ తన చేతిని అందిస్తూంటే అరికాలి నడకను మోకాళ్ళకు నేర్పించి ఆ ముళ్ళ మన్నుపై పాకుతూ పాకుతూ అటువైపుకు వెళ్ళగా, వికృత నవ్వుతో మళ్ళీ ఆ ఆకారమే నా నుండి దూరంగా ఎగిరిపోతూ నా ఊహల సౌధపు పునాది రాళ్ళను ద్వంసం చేస్తూ మరొక చీకటి మందిరానికి నా సమాధితో పునాది లేపుతుంది ఈ నిశ్శబ్ధం..... "01-03-2014"

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jI8xku

Posted by Katta

Kapila Ramkumar కవిత

ఆలూరి బైరాగి గీతానికి శ్రీ శ్రీ ఆంగ్లానువాదం చదివి నోటిమాట లేకుండా మ్రాన్పడిపోయా! "నాకు కొంచెం నమ్మకమివ్వు" - ఆలూరి బైరాగి గీతానికి శ్రీ శ్రీ ఆంగ్లానువాదం (ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక 1979) అనువాదం చదివి, గగుర్పాటు చెంది, అలా నోటిమాట లేకుండా మ్రాన్పడిపోయా! బైరాగి ఒకందుకు కారుణజన్ముడైతే, ఈయన ఇంకొకందుకు కారణజన్ముడని - ఈ మనిషి నిజంగా కారణజన్ముడే అని మరోసారి - మరోసారి తెలుసుకున్నా.... Grant me a grain of faith And I'll pulverize the hills And throw out the tomato sun and the pancake moon And make a clean sweep of the sky I'll crush the universe in my arms And wipe out the destiny of destitute man With a single stroke of my pen And neck out injustice and iniquity from the mighty mansion of life And a lot more I'll do But grant me a grain of faith Then I'll challenge Time Balance myself, head downwards on the pin-point of Siva's trident And make every home a flower garden and the heavenly park an orchard of ambrosial fruits I'll scare the crows away with my toy gun And fill up the wells with the world's rubbish and dig up new water tanks Beneath the canopy of the sky I'll set up new drinking places with thirst quenching mirages of my invention When the tavern of the world is over crowded I'll build another by its side Tearing the indigo coloured cloth of the sky I'll stich shirts for all the bare backed poor I'll do anything anything Only do grant me a grain of faith For the faithless being is an empty cigarette tin The faithless heart is an empty box of matches The faithless life is burnt out cigarette ash One may have everything everything but life is nothing without faith So grant me faith faith faith faith http://ift.tt/1d5V6c6

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d5V6c6

Posted by Katta

Pusyami Sagar కవిత

చికిత్స _________పుష్యమి సాగర్ తెలియని కణం ఏదో దేహ సామ్రాజ్యాన్ని గెలిచే ప్రయత్నం లో నలు దశలా విస్తిరించిన తలలను ఎక్కడికక్కడ తెగనరికినా మరల పుట్టే బీజాక్షరుడు లా తమ ఆనవాళ్ళను నాటుతున్నప్పుడు వంట్లో భయం నరాల్లోనుంచి మెదడు లో కి సర్రున్నా పాకి చీకటి గదులలో విహరిస్తున్న కల ల ను కళ్ళ కించ కప్పేసి ..కూల్చేస్తున్నప్పుడు ఇహ లోకపు శస్త్ర చికిత్స లలో ముద్ద ముద్ద గా చెల్లా చెదురు అయిన కణాల్ని విసిరేస్తూ ... మడతలు పడ్డ చర్మాన్ని కుడుతూ మట్టి లో కొట్టుకు పోయిన జీవిత ఆశ ని బిందువులు గా వంటికి అద్దుకుంటున్నాను రేపటికి ఉదయానికి దారులు వేసుకుంటూ!!!! మార్చ్ 1, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pIxzDx

Posted by Katta

Kavi Yakoob కవిత

ని . రం . త . రం . కవిత్వం .. కవిత్వo.. కవిత్వం..!

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxPR7K

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS : విధ్వంసం || ఆలూరి బైరాగి ................................ ఏడ్చేవాళ్ళను పూడ్చేయండీ! నవ్వే లతలను త్రవ్వేయండీ! వాక్కుల్లో విషధారలు దృక్కుల్లో రాక్షసికోరలు చూపించే వాళ్ళేరండీ! పిరికివాళ్ళను నరికేయండీ! మెత్తటి మనసులు కొరికేయండీ! ఎముకలపై ఎముకలు మ్రోగించండీ! మృతశిశువుల హస్తాస్థులతో ఊదండోయ్‌! పిల్లనగ్రోవులు ఆర్పేయండా సూర్యచంద్రులను చమురులేని దీపాలను చీకటిలో ముంచేయండా నీడల పాపాలను. సుఖరోగ జీర్ణమైన ఆకాశపు ముఖంపైన కప్పండొక నల్లని దుప్పటి, నరభక్షక నిశాచర ప్రీతికి అర్పించండొక దివాంధగీతిక స్నేహపు సౌహార్ద్రంతో మెత్తటి వెచ్చదనంతో ఆడుకొన్న రోజులు గడిచాయి మన ప్రకాశ గీతాలే మనలను దారితెలీని చీకటిలో విడిచాయి ఇప్పుడు నిరాశ జీవితనిశిలో మండించండోయ్‌ ద్వేషపు మంటలు పండించండోయ్‌! రక్తపు పంటలు పాతేయండోయ్‌! గతాన్ని తగలేస్తిరి ప్రస్తుతాన్ని ప్రపంచపు మహా స్మశానంలో చెయ్యండోయ్‌ శవసాధన శక్తికి ఆరాధన సహించకండోయ్‌! అత్యాచారం గుచ్చండోయ్‌ పుర్రెలహారం! చెయ్యండోయ్‌ నగ్నవిహారం! వినాశ సుందరరూపం వీక్షించిన వాడెవడూ వికాసజడస్తూపం రక్షింప బూనడెవడూ జుగుప్స మన ఆదర్శం ప్రేయసి మన విధ్వంసం.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dLR1H9

Posted by Katta

Kavi Yakoob కవిత

ప్రత్యామ్నాయ తెలుగు కవిత్వం * Published: Thursday, November 9, 2006, ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వానిదే పేచేయి. కవికి దక్కిన గౌరవం వచన రచయితలకు దక్కడం లేదు. ఈ కవిత్వంలో కూడా ఉద్యమ కవిత్వానికి, ఉద్యమ కవులకు పెద్ద పీట వేస్తున్నారు. ఉద్యమేతర కవిత్వాన్ని విమర్శకులు (పాఠకులు కాదు) పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆధునిక సాహిత్యంలో మొదటి నుంచి ఉద్యమ కవిత్వానికి ప్రత్యామ్నాయ కవిత్వ పాయ వుంటూ వస్తోంది. ఇది బలంగా కూడా వుంటోంది. దీన్ని ప్రజా వ్యతిరేక సాహిత్యంగా కొట్టి వేస్తూ వస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడని సాహిత్యంగా దానికి ముద్ర వేస్తున్నారు. 'కేవల కవిత్వం' పేరు పెట్టి దాన్ని తృణీకరిస్తున్నారు. ఆలూరి బైరాగి 'నూతిలో గొంతుకలు', 'ఆగమగీతి' వంటి కవితా సంకలనాలు వెలువరించారు. ఆయన కవిత్వం బలమైంది. శిల్పరీత్యా, వ్యక్తీకరణ రీత్యా బైరాగి కవిత్వం పాఠకుల హృదయాలను కదిలించేది. అలాగే, బాలగంగాధర్‌ తిలక్‌ 'అమృత కురిసిన రాత్రి' కవితాసంపుటి గురించి చెప్పనే అవసరం లేదు. దాన్ని ఆదరించని సాహిత్యాభిమాని వుండడు. ఆయన భావాల్లోని బలం అది. బైరాగి అనంతమైన విషాదాన్ని తన కవిత్వంలో పలికిస్తే, విషాదాన్ని, ప్రేమను పంచే దయాపారావతాలు తిలక్‌ కవితలు. తిలక్‌ కవితలు పక్షులై మన గుండెల మీద వాలుతాయి. ఆ తర్వాత ఇస్మాయిల్‌, మో ఆధునిక కవిత్వాన్ని ముందుకు నడిపించారు. ప్రకృతి సంబంధమై ప్రతీకలతో సున్నితమైన భావాలను పలికించే ఇస్మాయిల్‌ కవిత్వం మనస్సుకు హాయిని, ఆనందాన్ని ఇస్తాయి. ఇక 'మో' వినిర్మాణ వాది. వాక్య నిర్మాణాన్ని దెబ్బ తీయడం ద్వారా సమాజ నిర్మాణాన్ని బద్దలు కొట్టే కవిత్వం వేగుంట మోహన్‌ ప్రసాద్‌ (మో)ది. అజంతా గురించి చెప్పాల్సిన పని లేదు. అజంతా కవిత్వం తెలుగు సాహిత్యంలో ఒక మైలు రాయి వంటిది. మానవ జీవితంలో చెట్లు కూలుతున్న దృశ్యాలను కవిత్వీకరించాడాయన. ఈ వరుసలో ఆ తర్వాత సిద్ధార్థ, సీతారాం వచ్చారు. సిద్ధార్థ కవిత్వం సాంద్రతతో కూడి వుంటుంది. సీతారాం 'మో' వినిర్మాణవాదాన్ని ముందుకు నడిపిస్తున్న కవి. 'మో' కవిత్వంలోని ఒక కోణం సిద్ధార్థ అయితే, మరో కోణం సీతారాం. అయితే, ఇటీవల సిద్ధార్థ తెలంగాణ కవిత్వం రాస్తుంటే, సీతారాం బిసి కవిత్వం వైపు చూపు పెట్టాడు. ఇటీవల ఇటువంటి కవిత్వ ఉధృతి పెరిగింది. ఇదంతా ప్రజా వ్యతిరేక, ప్రయోజన రహిత కవిత్వమనేది కొందరి వాదన. వర్గవాదాన్ని నమ్మి, అందుకు అనుగుణంగా రాస్తే మాత్రమే ప్రజా కవిత్వమని వీరి అభిప్రాయం. సమస్య ఏదైనా వచ్చిందంటే కవి కొంపలు కూలుతున్న దాని గురించి కవిత్వం రాయకపోతే తప్పు ఇక్కడ. అలాంటి కవిత్వమే చెలామణిలోకి వస్తోంది. ఏ కవిత్వానికి పాఠకులున్నారు, దేనికి లేరు అనే విషయం గురించి ఇక్కడ ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. ఉద్యమేతర సాహిత్యం కూడా పాఠకుల సంస్కారాన్ని పెంచడానికి పనికి వస్తుందనే నిజాన్ని వీరు అంగీకరించరు. నిజానికి, సాహిత్యం చేయాల్సిన పని పాఠకుల్లో సంస్కారాన్ని పెంచి, మనిషితనాన్ని నిలబెట్టడమే. మనిషి అయింతర్వాతే అందరి కోసం కర్తవ్య దీక్షకు పూనుకుంటారు ఎవరైనా. ఈ విషయాన్ని అంగీకరిస్తే ప్రత్యామ్నాయ కవిత్వాన్ని తక్కువ చేసి చూసే పద్ధతి పోతుంది. అది పోవాలి కూడా. Read more at: http://ift.tt/1fxM9uR

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxM9uR

Posted by Katta

Katta Srinivas కవిత



by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMx7Pd

Posted by Katta

Chiranjeevi Annapureddy కవిత

ఒదులొ,బిరో నాకు సరిపోని చెప్పులు ఏవో వేసుకొని నడుస్తునట్టు ఉంది "జీవితం" .

by Chiranjeevi Annapureddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kjxHsf

Posted by Katta

Kavi Yakoob కవిత

కవిత్వీకరణ మరికొన్ని సంగతులు మే 2001 » వ్యాసాలు రచన : విన్నకోట రవిశంకర్ కవిత్వం భాషకు, భావనకు ఉన్న పరుధుల్ని విస్తరింపజేస్తుంది. పదాల ఎంపిక, కూర్పు, కొత్త పదబంధాల సృష్టి వంటి సాధనాల ద్వారా ఇది సాధ్య పడుతుంది. ఇవేకాకుండా ఒక సన్నివేశాన్ని, తద్వారా కలిగిన అనుభూతిని వ్యక్తపరచటానికి పదచిత్రాలు లేదా ప్రతీకలను ఆధునిక కవులు విరివిగా వాడుకున్నారు. దీనిలో భాగంగా పోలికలు చెప్పటం, ఒక అనుభవానికి సంబంధించిన అతి సున్నితమైన వివరణ నివ్వటం, మానవీకరణ ఇలా రకరకాల ప్రక్రియలను వారు ఉపయోగించారు. పోలిక చాలా సామాన్యమైన ప్రక్రియ. మంచి పోలికలు కవి ఊహాశక్తికి గీటురాళ్ళుగా పనికివస్తాయి. రెండు వస్తువుల మధ్య యితరులకు స్ఫురించని సామ్యాన్ని చూడటంలోనే కవి ప్రతిభ దాగి ఉంటుంది. పోలికల గురించి చెప్పాలంటే, బహుళ పంచమినాటి చంద్రుడు ఆకాశంలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలా ఉన్నాడని శ్రీ శ్రీ చెప్పినదాని దగ్గర్నించి, బావి భూమి బుగ్గపై ముడుచుకున్న నవ్వుసొట్టలా ఉందని ఇస్మాయిల్‌చెప్పిన దాకా అనేక ఉదాహరణలు తీసుకోచచ్చు. సమకాలీన కవులలో, కొంత అసాధారణమైన, అరుదైన ప్రతీకలు తీసుకోవటం మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు, శివారెడ్డి “నిశ్శబ్దంగానే” అనే పద్యంలో వాడిన పోలికలు చూడండి “నేను నిశ్శబ్దంగానే వెళ్ళిపోతాను నిరుడుకమ్మిన మబ్బులా ………… అద్దం మీంచి జారుతున్న నీటిబొట్టులా స్నానంచేస్తూ గోడకంటించిన బొట్టులా” అలాగే వేగుంట మోహనప్రసాద్‌(మో) “శిలవర్ణాల్లో శిల్పం” అనే పద్యం లో చెప్పిన ఒక విచిత్రమైన పోలిక ” మిట్ట మధ్యాహ్నం పొట్టమీద పెట్టుకున్న పుచ్చకాయ బుజ్జిపాపాయి” రావి శాస్త్రి వంటి రచయితల కధల్లో కూడా చాలా ప్రతిభావంతమైన పోలికలు కనిపిస్తాయి. పోలిక చెప్పే పనిని ఆయన కొన్ని సమయాల్లో చెప్పే విషయానికి పరిపుష్టిని కలిగించటానికుపయోగించినా, మరి కొన్నిసార్లు కేవలం ఉపమించటంలో ఉండే ఆనందం కోసం చేసారనిపిస్తుంది. ఎక్కడో ఒక కధలో ఆయన మగవాడి చూచుకాలు కుంకుమ భరిణె మూతల్లా ఉన్నాయని రాసారు! రెండు వస్తువులను పోల్చటం కంటె, రెండు అనుభవాలను పోల్చటం ఇప్పటి కవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వస్తువులకు సంబంధించిన పోలికల కంటె వీటిని చదివినప్పుడు కలిగే అనుభూతి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రయోగాల్లో అతి సున్నితమైన, విలక్షణమైన అనుభవాలను కవులు స్పృశించారు. “ఆ చెట్టు నీడన కూచుంటే అప్పుడే అల్లిన పచ్చి కొబ్బరాకు చాపమీద నగ్నంగా పడుకున్నట్టుంటుంది. తెగిన గాయం మీద గోర్వెచ్చని నీళ్ళు పడ్డట్టు అది ఖేదమో, మోదమో తేల్చుకోలేనట్టుంటుంది.” (బాధల చెట్టు శిఖామణి) ఇందులో వాడిన రెండు ప్రతీకలు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పాఠకునికి అందజేస్తాయి. పద చిత్రంపై చేసిన ప్రయోగాల్లో, ఒక పదచిత్రాన్ని పొడిగించటం అనేది కూడా ఒకటి. ఇది రెండు రకాలుగా చెయ్యవచ్చు. ఒకే పోలికను రెండు వేరు వేరు వస్తువులకు ఆపాదించటం లేదా ఒకే వస్తువుకు రెండు దగ్గర సంబంధం ఉన్న పోలికలు వాడటం. ఉదాహరణకు, ఇస్మాయిల్‌ “బావి” అనే పద్యంలో నుంచి ఈ క్రింది వాక్యాలు తీసుకొందాం “నీడల వీసన కర్ర విప్పి ఎండలో సేదతీరుస్తుంది చెట్టు; నీడల మడత విసన కర్ర బావి వాడుకొమ్మంటుంది చేదతో విప్పి.” ఇందులో చెట్టు, బావి రెండింటిని విసనకర్రతో పోల్చటం వల్ల, ఒకటి తెరుచుకొని ఉంటే, మరొకటి మూసుకొని ఉందని చెప్పటం వల్ల ఒక గొప్ప అందం వచ్చింది. రెండవ ఉదాహరణగా, వై.ముకుందరామారావు కవిత “సాయం సంధ్య” లో వయసు పైబడుతున్న యిద్దరు దంపతులమధ్య పెరిగిన దూరాన్ని గురించి రాసిన ఈ వాక్యాలు తీసుకోవచ్చు. ” ఆకర్షణై కొన్నాళ్ళు పిల్లల వారధితో ఇంకొన్నాళ్ళు తెలియనే లేదు. ఎంత తొందరగా కరిగిపోయిందో వారధి కూడా! వీలున్నపుడెపుడో ఇరువైపులా చేరుతూ పడవలైపోయిన పిల్లలు” పిల్లల్ని మొదట వంతెనతోనూ, తరువాత పడవలతోనూ పోల్చటం, పడవకు వంతెనకు ఉన్న అనులోమ సంబంధం ఇక్కడ ఎంతో మంచి ప్రభావం కలిగించాయి. రెండు ఒడ్డుల్ని కలపటమనే సామాన్య లక్షణంతో బాటు వంతెనకు పడవకు ఉన్న అనేక భేదాలు ఈ పదచిత్రంలో పలు లోతుల్ని చూడటానికి వీలు కల్పిస్తాయి. ఒక పదచిత్రాన్ని ఇంత బాగా పొడిగించటం అన్ని వేళలా సాధ్య పడే విషయం కాదు. కొన్నిసార్లు ఒక పదచిత్రంలో ప్రత్యక్షమైన పోలిక ఏదీ ఉండనఖ్ఖర్లేదు. ఒక దృశ్యాన్ని తలపింపజేసే సున్నితమైన వివరణ, చిత్రమైన ఊహ లేదా మానవీకరణ వంటి వాటితో కూడా బలమైన పదచిత్రాలు నిర్మించవచ్చు. “మీసాలు దువ్వుతుంది బొద్దింక ” (సాలీడు యదుకుల భూషణ్‌) “మౌంట్‌ఎవరెస్ట్‌మీద పతాకాలు నవ్వి నవ్వి అలసిపోతాయి” (పిదప యదుకుల భూషణ్‌) “పావురాలు జలజలా దారికడ్డు తప్పుకుంటాయి” (మధ్యాహ్న సముద్ర పాఠం శ్రీధర్‌బాబు) హైకూలలో కూడా సాధారణంగా ఒక దృశ్యావిష్కరణ ఉంటుందేగాని, ప్రత్యక్షమైన పోలిక చెప్పబడదు. శ్రీధర్‌బాబుదే ఒక హైకూ చూడండి “సరుగుడు చెట్ల మధ్య నుంచి సముద్రం మనల్ని ఎగిరెగిరి చూస్తోంది.” ఇందులో సముద్రానికి ఎంతో అర్థవంతమైన మానవీకరణ కల్పించబడింది. కొన్ని సందర్భాల్లో సత్యం కూడా కవితాత్మకంగా ఉంటుందనటంలో సందేహం లేదు. “ప్రపంచమొక పద్మ వ్యూహం కవిత్వమొక తీరని దాహం” వంటి వాక్యాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో చెప్పిన విషయం మనందరం అంగీకరించేదే. అన్నివేళలా సత్యం ఇంత సూటిగా ఉండక పోవచ్చు. ఒక సత్యం కవి తన వ్యక్తిగత దృక్పధం మీద ఆధారపడి చేసిన ప్రకటనలా అనిపించినా కూడ, దానిని ప్రకటించటంలో అతడు ప్రదర్శించిన నేర్పువల్ల దానికొక ఒప్పుదల, కవితాత్మకత చేకూరతాయి. శ్రీధర్‌బాబు రాసిన ఈ వాక్యాలు చూడండి : “కన్నీటి కశ్మలంలో చిగురిస్తాయి జీవన సౌరభాలు దారి తప్పిన పాట కన్నా గొప్ప కవిత్వం లేదు.” (పాత సంగతులు) “నన్ను నేను పట్టుకోలేనప్పుడే నేను జీవిస్తాను” ( వేడన్‌తాంగల్‌) అలాగే, “మోనా ఐ లీవ్‌యూ” అనే పద్యంలో మో ఇలా రాసారు “కావాలని వెళ్ళిపోయిన వాడు ప్రవక్త అవుతాడు. ఉండాలని ఉన్నవాడు మనిషవుతాడు. ……… ఆ వెళ్ళిపోయిన వాడు బాగుపడిందీ లేదు ఇక్కడున్నవాడు చెడిపోయిందీ లేదు” పదచిత్రాల వాడకంలో గుర్తించవలసిన ముఖ్య విషయం ఒకటుంది. అదేమిటంటే, కొన్ని పదచిత్రాల ద్వారా ఒక అనుభూతిని రూపుకడుతున్నప్పుడు, ఆ పదచిత్రాల మధ్య ఒక హార్మనీని సాధించటం ఎంతైనా అవసరం. అలాగే, పదచిత్రాలను పొదుపుగా వాడటం ముఖ్యం. ఎన్ని ఎక్కువ పదచిత్రాలు వాడితే అంత ఎక్కువ ప్రభావం కలుగుతుందనుకోవటం పొరపాటు. కవిత్వంలో economy of words లాగే economy of images కి కూడా ప్రాధాన్యత ఉంది. పరిమితమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రతీకలను మాత్రమే ఎన్నుకొని, పాఠకునికి అనుభూతిని అందజేయగలగాలి. ఒక్క ప్రతీక ఎక్కువైనా, లేదా మిగతా వాటితో సరిపోకపోయినా, పద్యం దెబ్బతిని, పాఠకునిలో ఆశించిన ప్రతిస్పందన కలిగించలేకపోతుంది. కవితానిర్మాణంలో ఒక కవిత ఎలా ప్రారంభమవుతుందనే విషయానికి చాలా ప్రాధాన్యత ఉంది. నా ఉద్దేశ్యంలో begin at the beginning అనే సూత్రం కవిత్వానికి వర్తించదు. కవిత ఎప్పుడూ ఒక సంభాషణ మధ్యలో మొదలై, పాఠకుణ్ణి అందులోకి తీసుకుపోవాలని నేననుకొంటాను. మొదటి వాక్యం ప్రామిసింగ్‌గా ఉండాలి.అంతేకాని, “ఏం చెప్పను నేస్తం”, “ఏదో రాయాలని ఉంది” వంటి విసుగుపుట్టించే వాక్యాలతో మొదలైతే, ఆ కవిత ఎక్కువదూరం తీసుకెళ్ళలేదు. కొన్ని పద్యాలలో మొత్తం పద్యానికి సంబంధించిన థీమ్‌మొదటి ఒకటి రెండు వాక్యాలలోనే ప్రకటింపబడటం మనం చూడవచ్చు. పద్యంలో ఏమి చెప్పబడుతుందనేదానికి సంబంధించిన క్లూ మొదట్లోనే మనకు దొరికిపోతుంది. పద్యం లాజికల్‌గా అక్కడే మొదలై, ముందుకు విస్తరించినట్టుగా మనకు స్పష్టం గా తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు, శివారెడ్డి పద్యాలలో ఈ ప్రారంభ వాక్యాలు చూడండి “ఇంతా చేస్తే అయ్యింది పదకొండే” ( ఇంతా చేస్తే) “ఎదురు చూడటం మృత్యువు” (ఎదురు చూడటం) “నాలోని గోడ కూల్తుంది” (గోడ) ఈ రకమైన ప్రారంభాలను మో రాసిన ” నిరీహ ” అనే కవిత ప్రారంభంతో పోల్చి చూస్తే, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కవిత “అలాఅని పెద్ద బాధా ఉండదు” అని మొదలౌతుంది. ఇందులో కవి ఏమిచెప్పబోతున్నాడన్నదాన్ని గురించిన స్పష్టమైన క్లూ లేదు. కాని, ఏం చెప్తాడో చూడాలన్న ఉత్సుకతను మాత్రం ఈ వాక్యం కలిగిస్తుంది. మొదటిరకం ప్రారంభంలో ఏమి చెప్పబోతున్నాడనేది మనకవగతమైపోవటంచేత, ఎలా చెప్తాడో చూడాలన్న ఆసక్తి మాత్రం ఉంటుంది. ఐతే ఈ రెండిటిలోనూ, మొదటివాక్యం కవితకు మొదలు మాత్రమే. అందులోని ప్రధాన వాక్యాలు, ముఖ్యమైన ప్రతీకలు ముందు ముందు రావచ్చు. కాని, కొన్ని కవితలలో అతి ముఖ్యమైన ప్రతీక కవిత మొదట్లోనే ఎదురుకావటం మనం గమనించ వచ్చు. కన్నెగంటి చంద్రశేఖర్‌ వసంతం గురించి రాసిన కవిత “మంచు మళ్ళీ ఏడు రంగులుగా విడిపోతుంది “అని మొదలౌతుంది. అలాగే, నా పుస్తకంలో “మోళీ ” అన్న కవిత “నీ క్షణికానందాన్ని ఆమె తొమ్మిది నెలలు మోసింది”అని మొదలౌతుంది. ఇవి ఆయా కవితలలో ప్రధానమైన ప్రతీకలు. ఇలా ప్రారంభించటంలో ఒక ఇబ్బంది కూడా ఉంది. తారస్థాయిలో పాట మొదలుపెట్టినట్టు,ఆ తరువాతి భాగం నిర్వహించటం కొంత కష్టమౌతుంది. ఇక పోతే, ముగింపు కూడా కవితా నిర్మాణంలో ముఖ్యమే. వాహనంలాగా కవితను కూడా , మొదలుపెట్టి నడపటమే కాకుండా, ఎక్కడ ఎలా ఆపాలో తెలిసి ఉండటం చాలా అవసరం. కాని, కవిత ముగింపు గురించి చర్చించటం, మొదలు గురించి చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే, ముగింపులో అనేకమంది అనేక పద్ధతులు పాటిస్తారు. కొందరు ముగింపులో పద్యాన్ని sum up చేస్తారు. మరికొందరు ముగింపు కవితకు పధ నిర్దేశం చేస్తుందని భావిస్తారు. ఇంకొందరు కవిత మొత్తం ఎలా నడిచినా, ముగింపులో తమ రాజకీయ నిబద్ధతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. తాత్వికంగా కవితకు ముగింపంటూ ఉండదని, కవి తన పద్యాన్ని ఎక్కడో ఒకచోట ఒదిలిపెట్టటం మాత్రమే చేస్తాడని కొందరు భావిస్తారు. అసలు, ఒక కవి తన జీవితంలో ఒకే పద్యం రాస్తాడని, వివిధ సమయాల్లో రాసేవి దానిలో భాగాలు మాత్రమేనని ఒక కవిగారు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల ధోరణులిందులో ఉన్నాయి. ఐతే, నా ఉద్దేశ్యంలో, ఒక కవితకు ముగింఫు ఎంత సమగ్రంగా ఉంటుందనేది, తీసుకున్న వస్తువుని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, ఒక పాప ఆటపాటల గురించి రాసిన కవితను, ఆ పాప నిదురపోయే దృశ్యంతో ముగిస్తే, అది ఎంతో సమంజసంగా ఉంటుంది. ఏదియేమైనా, కవిత్వంలో క్లుప్తత చాలా ముఖ్యం కాబట్టి, అవసరాన్ని మించి కవితను పొడిగించకుండా జాగ్రత్త పడితే సరిపోతుందనుకుంటాను. ఇంకొక విషయం. ఇతర భాషలు కొన్నిటిలో ఉన్నట్టు, ముగింపులో surprise లేదా కొసమెరుపు వంటివి తెలుగు కవితలలో ఎక్కువగా కనిపించవు. ఈ కవితలలో వ్యక్తీకరణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. కవితలో మొదటి వాక్యం దగ్గర్నించి ఇది మనకు తెలుస్తూనే ఉంటుంది. దానికోసం చివరిదాకా ఆగవలసిన పనిలేదు. ఎక్కడైనా ఒకటి రెండు వ్యంగ్య కవితలలో కొసమెరుపు కనిపిస్తే కనిపించవచ్చు. శ్రీ శ్రీ లిమరుక్కులు, సిరిసిరిమువ్వ పద్యాలలో ఉదాహరణలు దొరుకుతాయి. కవిత మొదలుకి, ముగింపుకి మధ్య ఒక సామ్యం సాధించటం కూడా ఒక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మొదలుపెట్టిన వాక్యాలతోనే కవిత ముగించటం ద్వారా గాని, లేదా మొదటి వాక్యానికి కాంట్రాష్టుగా ముగింపు వాక్యాలు తీర్చిదిద్దటం ద్వారా గాని ఇది సాధ్యపడుతుంది. చివరగా, సింటాక్సు గురించి క్లుప్తంగా ముచ్చటిస్తాను. వచన కవిత్వంలో వివిధ కవులు పాటించిన లయ, పాద విభజన, వాక్య నిర్మాణం మొదలైన వాటిగురించి విస్తృతంగా పరిశోధించవచ్చు. గతంలో ఒకసారి “వచన కవిత్వ లక్షణాన్వేషణ పునరవలోకనం ” అనే వ్యాసంలో చేరా వచన కవిత్వంలో సింటాక్సు, భాషా వ్యూహాలు మొదలైన వాటి గురించి చాలా ఉపయుక్తమైన , ఆసక్తికరమైన విశేషాలు రాసారు. ఇకపోతే, ప్రత్యేకంగా ప్రాస గురించి చెప్పుకోవాలంటే, ప్రారంభంలో కొందరికి అంత్య ప్రాసమీద మోజు ఉండవచ్చుగాని, మన భాషలో ఎందుకనో అది అంతగా నప్పదు. దానికంటె, అక్షర మైత్రి తెలుగుకు సహజంగా ఉంటుంది. ఇస్మాయిల్‌ వంటివారు కొందరు రెండో అక్షరం ప్రాసను చాలా వరకు పాటించారు. ఐతే, ఈ ప్రాస చాలా సున్నితంగా , కనిపించీ కనిపించనట్టుగా ఊంటుంది; రెండు వరుస పాదాలకంటె మించదు. దీనివలన, సన్నని బంగారు గొలుసు తగిలించినలాంటి అందమేదో పద్యానికి చేకూరుతుంది. ఇటీవల యదుకుల భూషణ్‌పద్యాలలో కూడా ఇటువంటి ప్రాసను వాడటం గమనించాను. “రంభలతో నిండి ఉన్న ముంబయికో నమస్కారం”. (ముంబయి) “పటాటోపంలేని పొటాటో రైతులు” (van gough) ఈయనైతే,కొన్నిచోట్ల నాలుగు పాదాల ప్రాసను పాటించారు. “నగలా అమరింది పొగమంచు తెర నగరంలో ఏముంది తగరం ఎర” (ముంబయి) చిత్రమైన అనుప్రాసలు పాటించటం, అనుప్రాసవల్ల స్ఫురించే పదచిత్రాలు కూర్చటం ఇటీవల మో రాసిన కొన్ని పద్యాలలో గమనించాను. “ఎక్కడా ఎవరికీ ఎవరమూ దొరకము ఎడారిలో ఎవడి ఒంటె సంచీ వాడిదే ఒంటెలు మాత్రం ఒంటేలు కలగలిసి పోసుకుంటై” (అన్వేషణ) “ఆ కష్టమేదో నీ ఒక్క కాష్టానికే వొచ్చినట్టు ” (జ్ఞాపిక) ప్రాస విషయంలో వచన కవులు నిర్దిష్టమైన నియమమేదీ పాటించాల్సిన పనిలేదు. తమ ప్రకటనలో వెసులుబాటు ఉన్నప్పుడు వీటిని పాటించి లేనప్పుడు పరిహరించవచ్చు. ఐతే, అక్షర మైత్రి, పదాల అందం, నిర్దిష్టత గురించిన పూర్తి అవగాహన ఉండటం ఎంతైనా ఉపకరిస్తుంది. ఈ వ్యాసంలో పేర్కొన్న విషయాలన్నిటిని నేను చాలా క్లుప్తంగా ప్రస్తావించాను. వీటి గురించి ఇంకా విస్తారంగాను, లోతుగాను చర్చించటానికి అవకాశంఉంది. ఏది ఏమైనా, నేనిదివరకే పేర్కొన్నట్టు, వచన కవిత్వ రచనలో వచ్చిన అనేక ధోరణులను ఎప్పటికప్పుడు కొత్తగా అంచనా వెయ్యటం, వివిధ కోణాలలో విశ్లేషించటం పాఠకులకే కాకుండా, కవులకి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఉదహరించి పద్యాలు ఈ క్రింది పుస్తకాలనుంచి తీసుకోబడ్డయి శ్రీ శ్రీ మహా ప్రస్థానం ఇస్మాయిల్‌ మృత్యు వృక్షం శివారెడ్డి వర్షం వర్షం వేగుంట మోహనప్రసాద్‌ చితి చింత, సాంధ్య భాష శిఖామణి మువ్వల చేతి కర్ర వై.ముకుందరామారావు మరో మజిలీకి ముందు పసునూరు శ్రీధర్‌బాబు అనేకవచనం తమ్మినేని యదుకుల భూషణ్‌ నిశ్శబ్దంలో నీ నవ్వులు విన్నకోట రవిశంకర్‌ కుండీలో మర్రి చెట్టు http://ift.tt/1chIfWv

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1chIhNZ

Posted by Katta

Kavi Yakoob కవిత

గత కొన్నాళ్లుగా ఎంతోమంది యువకవులకు 'కవిసంగమం' వేదికగా కావడం,తద్వారా తమనుతాము explore చేసుకోవడం; పోయెట్రీ ఫెస్టివల్ లలో పాల్గొనడం ,ఆ తర్వాత ప్రముఖ సీనియర్ కవులతో కలుస్తూ , interact అవుతుండటం -ఇవన్నీకవులకు, కవిత్వానికి ఒక వాతావరణం కల్పించినట్లైంది. ఇవాళ e-పత్రికల్లో కనిపిస్తున్న ,లేదా విశ్లేషించబడుతున్న కవులు 'కవిసంగమం' కవిత్వగ్రూప్ ద్వారా పాఠకులకు చేరువైనందుకు, విమర్శకుల, e-పత్రికల దృష్టిని ఆకట్టుకుంటున్నందుకు సంతోషం. - ఇంకా ఇంకా కవిత్వసృజన జరగాలి. - విస్తృతంగా కొత్త కవులను ప్రోత్సహించే పని నిరాఘాటంగా సాగాలి. - కొత్తగా రాస్తున్నకవుల కవిత్వాన్ని కవితా ప్రమాణాలతో తూచగలిగిన కవితవిమర్శ కావాలి. - దానిని సరియైన రీతిలో స్వీకరించగలిగే పరిణతిని ,మునుముందుకు సాగాలనుకునే కవి స్వంతం చేసుకోవాలి. - కేవలం పొగడ్తలకు ,లైకులకు, మాత్రమె లొంగిపోయే తీరును మార్చుకోవాలి.కవిత్వంపై విమర్శను,సూచనలను స్వీకరించగలిగే స్థితికి కవి చేరుకోవాలి. జయహో కవిత్వం !!!

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i11wO5

Posted by Katta

Sasi Bala కవిత

రాలిపోయే హరిత పత్రమా .........శశిబాల ....................................................................... నీపై పెంచుకున్న ఆశలతో పచ్చగా కళకళలాడే నాకు నీ ప్రేమ మాధురి మురిపాలు పంచావు నా జీవితాన్ని తులసి మాలగ చేసి నీ మేడలో వేశాను నా జ్ఞాపకాల పుస్తకంలో ప్రతి పేజీ నీతో నేను పంచుకున్న తీపి అనుభవాల్ని చెబుతుంది ప్రతి రోజూ ఆ మధుర స్మృతులను స్మరిస్తూ మళ్ళీ వచ్చే ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ నా జీవితం లో వసంతం రావాలని తిరిగి నీ చేతిలో ప్రేమ ''చిగురునవ్వాలని '' వేయి కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా చిగురాశాతో రాలిపోతున్నా.....1 feb 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJwhPN

Posted by Katta

Vennela Siri కవిత

vennela siri *DREAM* 1/03/2014. One fine night in imagination of my Sweet Love... Sleeping with my pillow tightly hugged... Going deeper within the darkness entering the loneliness of clouds into the heaven or near to it.... Higher and still higher... Thy eyes looking for someonelse again and again.... Stars of heaven shining so brightly.... In the air Thy voice is loud singing hymns.... As night is bare... Lonely cloud heaven overflows... The pleasant showers of melody... Soothing soul in secret hour with music as sweet as love.. Which overflows from my bower... Looking before and after, with some pain in my heart... In the glitterings of stars Thy found him... Said him, where have you been so long... MY LOVE where have you been all the time... In this sweet memories with my hands am trying to touch cheeks of my Love.... Hearing the ticking of clock... Slowly opened my eyes... Only darkness remains.... Hahahaha.... It was my dream of imagination took me to heaven in search of My LOVE.... Very Sweet.

by Vennela Siri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i0SMYu

Posted by Katta

Sri Venkatesh కవిత

****హృదయం**** ఎన్ని భావపు వర్ణాలో హృదయపు రాట్నంలో చేసే ప్రయాణం సుధీర్ఘమైనా అతి చేరువలో ఉన్నా గమ్యపు ఒడిలో సేద తీరే సమయాన పలుకరించే సంతోషపు వర్ణం.... దక్కాల్సిన ఫలితం దురదృష్టపు వాకిట్లో పీఠమేసుకుని కూర్చుని దీనంగా బిచ్చమెత్తుతున్న కృషిని చూసి నవ్వుతున్నప్పుడు ఆవరించే అసహనపు వర్ణం..... కనుల లోగిలి వీడలేని కన్నీళ్ళు అప్పుడప్పుడైనా మెరుద్దామనుకున్న హాసపు నీడను తరిమి తరిమి కొడుతుంటే అధరోష్టపు ఆలింగనం మధ్యలో నలిగిపోతున్న మునిపండ్లు బాహ్య ప్రపంచాన్ని చూడలేక అవస్థ పడుతున్నప్పుడు దరికి చేరే దుఖ్ఖపు వర్ణం.... చిమ్మ చీకటిన, కంటికి ప్రకాశాన్ని పంచే ప్రక్రియలో తన ఒంటికి మంట పెట్టుకుని తను కాలిపోతూ అజ్ఞాతంలో కాంతిని ప్రజ్వలింప చేస్తూ కర్తవ్యంలో ఆరిపోతున్న మైనపు ప్రాణంపై గాలి చూపించే జాలి వర్ణం....... సూర్యుని తాపానికి నీరసించిపోతున్న ధరణిమాత తన గురించి మరచి మరి మానవాళి కాళ్ళకు ఊతమిస్తూ వేడిమి తగ్గే సమయానికి కాసింత సేద తీరుతుంటే అటుగా వెళుతున్న వెన్నెలమ్మ మబ్బుల సాయంతో మంచు కురిపిస్తుంటే వెలిసిన మంచితనపు మమకారపు వర్ణం..... అన్నింటా మంచిని చూపి చెడు ఆలోచనను చుట్టుపక్కల రాకుండా చేసి ఆగిపోతున్న గుండెలో కూడ తిరిగి కదలిక రప్పించి కఠినమైన హృదయంలో కూడ కనికారాన్ని కల్పించి అంధకారపు ఆలోచనలలో వెలుగు కిరణాలను నింపి ఈ లోకాన్నే ముందుకు నడిపిస్తున్న అతి ముఖ్యమైన ప్రియమైన ప్రేమ వర్ణం..... ****ఎన్నెన్నో వర్ణాలు మన హౄదయాలలో అన్నిట్లా అందాలు ఈ ప్రపంచంలో**** శ్రీ----1-03-2014

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pHuZ0w

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

// టాక్ టైం // కాల్ లో ముళ్ళుంటాయి ఒకోసారి గుచ్చుకుని గుండెల్ని సలుపుతాయి మాటలే కదా అనుకుంటామా మంటలు పుట్టిస్తాయవి కారు చౌకే కదా అని రింగ్ చేశావా ? అధిక ప్రసంగాలకి ఆహుతవుతావు అప్పుడప్పుడూ కాల్స్ మైండ్ ని బ్లాస్ట్ చేస్తాయి మొబైల్ నుంచి మిస్సైల్స్ దూసుకొస్తాయి కొందరు మాట్లాడాక సైకియాట్రిస్ట్ ను కలవాలి కొన్ని ఫోన్లు పెట్టాక నిష్టూరాలు వెంటాడతాయి మిస్ డ్ కాల్స్ మోసానికి బలికాకు నీ చేత్తో నిన్నే చరిచే చమక్కులవి వాగుడు విద్యుత్తై ప్రవహిస్తే నీ మాట నీకే షాక్ కొట్టి కాల్చొచ్చు టైం పాస్ కని గాల్లోకి గాసిప్ లొదలకు టైం బాంబులై నిన్నే గోల్ చేస్తాయవి విలువైన పలుకులు వ్యక్తిత్వపు మెరుపులు వ్యర్ధపు మాటలు నీ రూపుకు చెరుపులు

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJm31G

Posted by Katta

Shamshad Mohammed కవిత

నీడ ఒంటరి నడకల్లో నా తొడైన నీడలొ కొత్తగా నీ రూపం కనిపిస్తుందిప్పుడు చివరి గమ్యం చేరేదాకా అలసట లేని అడుగులేస్తానిక మౌనం మాత్రమే మాట్లాడే నా స్నేహం లోకి నీ స్వరం తోడైంది కరువు రాదింక కబుర్లకి నిద్ర లేని రాత్రి లేదిక నాకు ఆశల పూలతో దోసిలి నింపిన నువ్వే నా కలల ప్రపంచం ఎండుతున్న నా గుండె చెరువును నింపావు కురుస్తూ కాటుక దిద్ది కట్ట వేస్తాను పొంగి పోకుండా అందని చంద్రుడ్ని ఆకాశపుటరచేతిలో గోరింటతో అద్దుకొని పండిన వెన్నెల్ని చూసి మురిసిపోతూ పారేసుకున్న పసి మనసు షంషాద్ 2/28/2014

by Shamshad Mohammed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bTSVtW

Posted by Katta

Kapila Ramkumar కవిత

Meraj Fathima \\ఆరోజు వస్తుంది\\ గుడిసె కూలిపోయింది చట్టాల పరిదిలో, బ్రతుకు కొట్టుకు పోతుంది కష్టాల వరదలో, కాపురం తరువు కిందికి మారింది, కాచుకున్న గంజి కుక్కల పాలైంది. సగం చీర చంటిదానికి ఉయ్యాలైంది, చిరుగుల సగం సిగ్గును దాచలేకుంది, తిన్న ఒక్కముద్డా ఆకలిని ఆర్పనన్నది, ఉన్న ఒక్క దుప్పటీ చలిని ఆపలేనన్నది, అంటుకునే రోగాలకు అంతమే లేకుంది, అందనంత ఎత్తులో ఆరోగ్యం శ్రీ కారం చుట్టింది, గుడ్డిదీపం చమురులేక కొండెక్కింది, దుడ్డు బియ్యానికి కార్డ్ కరువయ్యింది, చంటోడికి చదువంటే బయంగానే ఉంది, అయినా వెళ్తాడు, మద్యాన్న బువ్వ ఇంకా ఉంది. కాలం మార్పును తెస్తుంది జనజీవనం మార్పు కోరుకుంటుంది, యువత తమ దారి మార్చుకుంటుంది. కాయం కత్తుల కంబళి కప్పుకుంటుంది, కాలం నిప్పుల కుంపటి నెత్తికెత్తు కుంటుంది, కలాన్నీ, మడాన్నీ, వెనక్కి తిప్పవద్దన్నది, కులాన్నీ, మతాన్నీ ఎంచి చూపొద్దన్నది . వేయి గొడ్లు మింగిన రాబందును వేటాడి బంధిస్తుంది, పట్టుకొని పొట్ట కోసి నీళ్ళు రాని పంపుకింద కడుక్కొమంటుంది. పొట్ట నింపుకోవడాని పనికొచ్చే పట్టా వస్తుంది, చట్ట సభలలో బూతుబోమ్మలకు బట్టలేసే రోజు వస్తుంది. అంగళ్ళలో రత్నాలు అమ్మేరోజు రాకున్నా.., అందరూ కడుపునిండా అన్నం తినే రోజు వస్తుంది తప్పకుండా వస్తుంది.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJm0TM

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || కనబడుటలేదు || వాడిని గుర్తుపట్టావా..? ఒక మూగ గొంతుక చిల్లు పడి కారుతున్న చోట గాయం మీద గాయం తొడుక్కొని నగ్నంగా తిరిగేది వాడే నీ నుండి నాలోనికి నా నుండి నీలోనికి పయనిస్తూ వాడు ఎప్పటికీ ఎవ్వరికీ బందీ కాడు వాడు నిండైన వాడు రంగు లేని వాడు ఒంటినిండా రంగుల్ని పులుముకొని అద్దంలా తిరుగుతూ ఇది నువ్వేనా అని ఒక రంగు అంటిస్తూ అడుగుతాడు ఏమీ తెలియనప్పుడు,నిజంగా బ్రతికినప్పుడు కల్మషం లేని బోసినవ్వులో వికసించేది వాడే అప్పుడప్పుడూ ఆమె చేతితో తాకేది ఒడిలో జోకొడుతూ నిదురపుచ్చేదీ ఎండిన కడుపుతోనో, ఖాళీ గిన్నెతోనో చెత్తకుప్పలో అమ్మను వెతుకుతూనో ఒంటరి జీవితాన్ని కనుల నుండి కారుస్తూనో ముడతలు పడిన దేహాన్ని కప్పుకొనో... ఇలా ప్రపంచాన్ని వాడిలో దాచుకొన్నది వాడే వాడు ఎప్పటికీ దొరకడు నువ్వే వాడికి దొరకాలి అప్పుడేగా నువ్వు పూర్తయ్యేది మీ చాంద్ || 01.03.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4E2Dm

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

వాకిలి లో నా కవిత వచ్చిందోచ్.....

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4B2af

Posted by Katta

R K Chowdary Jasti కవిత

The Gap There The palace of sky But here is The hut in the dust There The smell of perfume But here is The odour of sweat There The pool on the roof But here is The empty pot in kitchen There The bellies are distending But here are The tummies are burning There The juice of Joy But here are The tears of cry There The night with rain But here is The life with pain There The pleasure of life But here is The sorrow of death There The desire of living But here is The despair of dying How typical and peculiar Is the life! And how wide Is the dissimilarity of fate! © R K Chowdary 27FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ocXdg5

Posted by Katta

Sravanthi Itharaju కవిత

My Dear Freinds! Iam Happy to say..that my newly released book on family therapy..MANASU TALUPU TERISTE...is now placed in TOP 10 BOOKS of Kinige.com..pl..read n make ur valuable comments..pl..log on to www.kinige .com!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NeCT2K

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//నేను మాత్రం ఇద్దరినీ169-175// 169. ప్రజలకి సామాజిక న్యాయం చేస్తానన్నది నేనే కులం ఓట్లు చూపి సియం పదవి కోరుతున్నది నేనే ప్రజల నమ్మకాన్నీ పార్టీనీ అమ్ముకున్న వ్యాపారి ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ....25.02.2014. 170. అమ్మనీ ఆడపడుచునీ గౌరవించింది నేనే ఆలికేమీ తెలియదని అవమానించిది నేనే అంతిమంగా ఒంటరయ్యేది అంధసంసారి ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ. 171. సాగినంత కాలం ఏలుబడిలో నేనే సాగక పంతాలు ఆడిపోసుకునేదీ నేనే సాగరానికైనా తప్పనిది ఆట పోటు ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ. 172. అనుక్షణం తత్వచింతనలో నేనే అప్పుడప్పుడూ అందరినీ విమరిస్తూ నేనే అంతరాన్ని పలక అర్హుడు కవి ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ. 173. ఏర్పడ్డ తెలంగాణ నేనే విడగొట్టబడ్ద ఆంధ్రప్రదేశ్ నేనే మూడుప్రాంతాల దోచుకోబడ్డ బడుగుజీవి ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ. 174. ఎగువ ప్రాంతాలకు చుక్క దక్కని గోదారి నేనే దిగువ ప్రాంతాలను ముంచే వరద గోదారి నేనే అంతిమంగా ఆలింగనం చేసుకునే సముద్రుడు ఒక్కడే నేను మాత్రం ఇద్దరినీ. 175. కాలంతో పోటీ అంటూ శపధాలు చేసి నేనే శుభమహూర్తం కోసం కాలయాపన చేస్తూ నేనే మంచి పనికి మహూర్తం తక్షణం ఒక్కటే నేను మాత్రం ఇద్దరినీ....01.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJ39YO

Posted by Katta

Kavi Yakoob కవిత

పోయెట్రీ బుక్స్: వేగుంట మోహనప్రసాద్ కవితాసంపుటి 'సాంధ్యభాష' .

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxnx5a

Posted by Katta

Sravanthi Itharaju కవిత

స్రవంతి ఐతరజు "సౌగంధిక జాజరలు" "మాధవా.. మధుసూధనా..." నీ పేరులోనిదా ఆ మాధుర్యం.. నేను పిలచుటవలన కలిగినదా? మాధవా..మధుసూధనా..కృష్ణా..మురారీ! నేను నీ రాధను కాలేను సత్యగా మాత్రమే ఉండగలను.. నను నీ పెదవి చివరన మురళిగా మలచవా మురళిపై పలుకని రాగాలు పలికించవా.. విరహిని నైన నాకు నీ ముగ్ధమోహన రూపాన్ని చూపించవా నా కటిని నీ కరబంధనం గావించవా.. పొగడపూ పొదల తిరిగి తిరిగీ నీ పద్మపాదాలు కెంగరించినవేమో ఇదుగో నా యెద పద్మం..పవ్వళించరావా..పదుమనాభా! పసిడికాంతుల చిమ్ము నీ కెమ్మోవి నా హృదయకెందామరల విహరించు భ్రమరిగా మార్చవా.. నీ వొడి ప్రేమ కడలి తరంగాల శృంగార తానాలు చేయించరావా.. చిటపటల రుసరుసల అలసి సొలసిన వేళ నీ ధృడ హృదయ సీమల నను సామ్రాజ్గ్నిని చేయవా.. హరే శ్రీ హరీ! గోవిందా గోకులానందా..

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NeweWj

Posted by Katta

Kancharla Srinivas కవిత

అస్తవ్యస్థ వ్యవస్థ సుప్త చేతనావస్త.. ఓటేసినోళ్ళను వదిలేసి ఎన్నుకున్నోళ్ళ వెన్నులో పొడిచే వ్యక్తుల నిర్ణయాలు వ్యవస్థకు సంకెళ్ళు.. పదవి వైదొలిగితే పాలనా వైఫల్యం ప్రజాస్వామ్యం మూల్యం.......

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NeweFR

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఫ్రేమ --------------------­-------- నేను నీలో కరగడం నేనంటూ లేకుండా నీవు నాలో మిళితమవడం నువ్వంటూ మిగలకుండా ఇసుకరేణువుల కలయికలాగా రెండు పాల పిట్టలు రమించినంత స్వచ్చంగా నేను నీలో అంతమవుతూ ప్రతిక్షణం నీవు నాలో పాతుకుపోతూ అనుక్షణం చెట్టు మొదలులాగా రెండు శరీరాలు ఒకే ఆత్మగా పరివర్తన చెందడం ఒకేలా అంటుకట్టడం కనుల కొమ్మల్లో ఒకే బాధ,ఒకే సంతోషం కాసిని చిరునవ్వులు నీటిలాగా మనసులు కురిసే పొగమంచంత తేలిగా కలిసిపోవడం కొన్ని నిరీక్షణలు కొన్ని నిర్వేధాలు మరిన్ని ఆలోచనలు ఇంకొన్ని జ్ఞాపకాలు ప్రతీ దినం సమర్పణం నిరంతరం నీరాజనం ఒకరికై ఒకరు. తిలక్ బొమ్మరాజు 28.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ocNHJO

Posted by Katta

Kavitha Prasad Rallabandi కవిత

లక్ష పద్యార్చనం ......................... డా. రాళ్ళబండి కవితాప్రసాద్ ......................... ప్రియమైన స్నేహితులారా ! ధన్యవాదాలు !! లక్ష పద్యర్చనం కు అద్భుత స్పందన ! అభినందించినవారు ఇప్పటిదాకా అన్ని గ్రూపు లలో కలసి 500 కు పైన! కేవలం24 గంటలలో ...... ప్రశ్నల సంఖ్య 48 . పూరణలు ప్రారంభిస్తున్నాను! ప్రతి రోజు ఉదయం నా గ్రంధ ముఖి స్నేహితులకు సమర్పించుకుంటాను ....! ప్రశ్నల సంఖ్యా పెరగాలి ! రోజుకు కనీసం 100 ప్రశ్నలు రాక పొతే 1000 రోజులలో 1,00,000 పద్యాలు పూర్తి కావేమో !? రేపటినుంచి పూరణలు.!! మీ రాళ్ళబండి కవితా ప్రసాద్ kavithaprasadrv@yahoo.com

by Kavitha Prasad Rallabandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://yahoo.com/

Posted by Katta

Aduri Inna Reddy కవిత

Aduri Inna Reddy ||మనసు కాగితం లో తగలబడిన అక్షరాల సాక్షిగా || -------------------------------------------------------------------- రాత్రివేళ లోకం అనే చీకటనే దుప్పటి కిందా, కళ్ల వెనకా చిక్కనై మిగిలిపోయిన గతం వెక్కిరిస్తుంది కరుడు గట్టిన నిజం నైజం మార్చుకుంది వాస్తవం గాఢత కోల్పోయి నల్లటి అక్షరాలుగా మారాయి “కాలిన మనసు కాగితం లో తగలబడిన అక్షరాల సాక్షిగా ” నా మది లోపల? నువ్వు-నేను అన్న నిజం అబద్దమైంది అని నిన్నడీగితే ఏం చెబుతావు? నిజాన్ని కాదనగలవా అబద్దాన్ని ఇప్పుకుంటావా అక్షరాలు కూడదీసుకొని రాసే కవిత్వంలో? దుఃఖదాయకమైన జీవితంలోకి కూరుక పోవడానికి కారణం నీవు చేసీన మోసమే కాదా...? ఇప్పతి నాజీవిత గమనానికి కారనం నీవుకాదా నన్ను ఏమార్చింది నీవుకాదా ...? నా ఎదనిండా ఖాళీ.. భర్తీ చేయలేని శూన్యం.. నా ప్రశాంతతను ఎవరు భగ్నం చేస్తారు? నాలో నేను ఎంత వెతికినా కానరని నాలోకి నేణు తొంగిచూడాలనుకుంటా మనసులో ఆశచావక నీలోకి తొంగి చుస్తే నీ మనసులో ఎప్పుడూ ఎవరో ఒకరు తచ్చాడుతూనే ఉంటారు నీలో నీవు చూడగల లోతెంత? నిన్ను నువ్వు వెతుక్కుంటూ నిన్ను నీవు చూసుకున్నావా నిజాణ్ని అన్వేషించావా అదే చేస్తే నీలో నిజాయితి చచ్చిపోయేది కాదు

by Aduri Inna Reddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4afe5

Posted by Katta

Kapila Ramkumar కవిత

Kapila Ramkumar ||The Pangs That Guard The Gates Of Joy||Christopher John Brennan|| THE PANGS that guard the gates of joy, the naked sword that will be kist, how distant seem’d they to the boy, white flashes in the rosy mist! Ah, not where tender play was screen’d in the light heart of leafy mirth of that obdurate might we ween’d that shakes the sure repose of earth. And sudden, ’twixt a sun and sun, the veil of dreaming is withdrawn: lo, our disrupt dominion and mountains solemn in the dawn; hard paths that chase the dayspring’s white, and glooms that hold the nether heat: oh, strange the world upheaved from night, oh, dread the life before our feet! Christopher John Brennan

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ey8Ayz

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | గోదారమ్మ పరవళ్ళు, కృష్ణమ్మ ఉరవళ్ళు అచ్చంగ నావేనమ్మా! --------------------------------------------------------------------------- గోదారమ్మా! మరుమల్లె తోట మారాము చేయక మారాకు వేసినట్లు, ఏడాదికోమారు ఎర్రెర్రని కొత్తనీరు గట్లుతెంపుకుని తోడిపోస్తావు. ఆనకట్ట కట్టినా, కాలువలుగా నిను చీల్చినా ఆగిందా నీ వేగం? చెలిమిచేయ నీకెవరు సాటి, కనుకే సాగరసంగమం నీ అమరగానం! గౌతమి నీలో లీనం, తన తోటి నెచ్చెలులకీ అదే వేదం. కలిమిలొసగ సరిలేరు నీకు, అందుకే అనుపమానం నీ అనురాగం. నదీనదాల్లో జాతివజ్రం నీవు, పైరుపచ్చల పరువానివి నీవు. చిట్టడవుల విడిదిచేయ వెనుదీయవు, కొండాకోనల పరుగిడ అలుపెరగవు. మునిమాపుల మౌనికవైనా, వేకువవేళల మేలుకొలుపులు పాడినా, నీకే కాదా తగును, నీ వొడిన మునక నా బ్రతుకు నోచిన భాగ్యమమ్మా. కృష్ణమ్మా! అలలతో అల్లికలల్లి ఆకాశానికి అందివ్వాలనేనా ఆ ఆత్రం? ఆవేశం అనంతమై సాగే నీ పయనం అంబుధిరాజ అంతఃపురానికా. మరి ఉండుండి వచ్చేటి ఆ మేఘరాజు పరుగు నీ ఒడిని చేరటానికేమో! భాష్యం లేని నీ గీతాలకి వాద్యాలు ఆ దేవదుంధుబులా? మెరుపునురుగుల ఆణిముత్యాలు అంచలంచలుగా ధరపై ఒలికిస్తూ ఏమా పరుగు, ఎందుకా బిరబిరలు, ఏమిటా మేనివిరుపులు? అస్థిరవై, అంచలంచల అనీషవై దరిలేని తీరాలకడుగులేస్తూ, ఏ అదృశ్యప్రియునితోనో గుసగుసల గుంభన నవ్వు లొలికిస్తూ ఉరవడిలోనూ తడబడుతూ ఏ ఓడిని చేరేవు, ఒక్కసారి గుట్టువిప్పమ్మా. నిన్నే అనుసరించే నాకు నావాడి జాడ ముందుగా నువ్వే చెప్పమ్మా! చిన్న మాట: (రచనాకాలం 1982-86)పుట్టింది గోదావరి ఒడిలోనైనా పెరిగింది ఎక్కువగా కృష్ణ నీరు తాగే. ఉద్యోగరీత్యా నాగార్జున సాగర్, ధవళేశ్వరం, భీమవరం, అనంతపురం మొదలుకుని యడ్లపాడు, చీమకుర్తి వంటి చిన్న ప్రాంతాల్లో కూడా నివసించి, నదీ పరివాహిక ప్రాంతాల్లోను, నీటికోసం అంగలార్చే జనాల్లోనూ మసలే వైవిధ్యభరిత జీవితాన్ని రుచి చూపిన నాన్నగారికి కృతజ్ఞతలతో... ఈ చిరు కవిత. 28/02/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MC9bDX

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ** కొన్ని కబుర్లు, అంతే** ఊపిరాడక గుప్పెట్లో ప్రపంచం- * కొమ్మలపై వాన- వర్షం దాహం, ఆకు ఆరాటం- ** కొత్త కోరిక మేఘం అంచులో మెరిసీ, చివుక్కుమను ప్రాణం- *** గుండె చుట్టూ సముద్రం గోడలు- **** చిల్లు పడీ జ్ఞాపకం బొట్టు బొట్టుగా, ఖాళీ కుండలా తెలియనితనం- ***** కొన్ని కబుర్లు, అంతే వినక తప్పదు వింతైనా- 01/03/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ocgVsj

Posted by Katta

Padma Rani కవిత

!!గురిచూసి!! వాస్తవాల్లోకి వంగిచూసి వంకర్లు వెతికేసి వివేకిననుకుంటూ తలెగరేసి తర్కించడం... ఆటవిడుపులైన అనుబంధాలు ముడివేసి సాఫీగా సాగమంటే సాగేనా సహజీవనం... నేలతాకేలా గాలిపటాన్ని క్రిందికి వ్రేలాడదీసి ఉన్నతమైన ఆశలంటే అంటేనా అవి ఆకాశం... ఎత్తుమడాల చెప్పులతో దర్పంగా అడుగులేసి హుందా అనుకోవడం ఎంత వరకు సమంజసం... చిన్నిగడ్డిపోచలంటి ధ్యేయాలని తాడుగా పెనవేసి పైకి ఎగబ్రాకితే ఎన్నడూ కావు కన్నకలలు కైవశం... ధృఢనిశ్చయానికి ధైర్యాన్ని జతచేసి ధ్యేయాన్ని చూసి గురిపెట్టి శ్రమని సూటిగా సంధించడమే విజయసాధనం.. 01-3-2014

by Padma Rani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d2ItP0

Posted by Katta

Vakkalanka Vaseera కవిత

హృద‌యం రాత్రి మెత్త‌ని చేతులు చాచి ఈ పిల్ల‌ని ప్రేమ‌గా నిమురుతుంది మొత్త‌టి మ‌బ్బుల బొంత‌లు ప‌రిచి గుప్పెడు న‌క్ష‌త్రాల్ని చుట్టూ చ‌ల్లి ఏకంగా ఓ చంద‌మామ‌నే దిండు ప‌క్క‌న పెట్టినా ఈ పిల్ల‌మాత్రం నోరు వెళ్ల‌బెట్టుకుని క‌ళ్లూ చెవులూ అప్ప‌గించి పిట్ట‌ల‌తో ఎక్క‌డికి వెళ్లిపోయిందో అక్క‌డే సంచ‌రిస్తోంది ఇంకా ఈలోకానికి రాకుండా ఇక్క‌డ దేన్నీ చూడా కుండా బ‌హుశ ఎక్క‌డో ఇంకేదో చూస్తోంది తాను ఎవ‌రి చేతుల్లో నిద్ర‌పోతున్న‌దీ తెలియ‌ని మ‌రోలోకం అర‌చేతుల మీద ఆడుకుంటోంది త‌ల‌నిండా పూల‌తో నిశి నిద్ర‌పోయే లోకం అది ప‌గ‌ళ్లు రెక్క‌లు విప్పి అక్క‌డినుంచే వ‌చ్చే లోకం అది రాత్రీప‌గ‌లూ రెండూ లేని చ‌ల్ల‌ని కాంతి ప‌రిమ‌ళాల వెచ్చ‌ని లోకం కాలం రెక్క‌లు విప్పి గ్ర‌హ‌గోళాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసి-- అదే కాలం తిరిగి రెక్క‌లు ముడుచుకుని త‌న గూటిలో నిద్ర‌పోయే..లోకం ఆలోకంలో సంచ‌రిస్తూ ఈలోకంలో మాత్రం రెప్ప‌లు తెరిచి నిద్ర‌పోతోంది స‌ర‌స్సులో స‌ద్దుమ‌ణిగి పోయిన ఒండ్రు మ‌ట్టి బుర‌ద‌లోంచి త‌ల్లిక‌డుపులోంచి తండ్రి నాభిలోంచి ప్ర‌యాణించి- నీటిలోంచి త‌ల‌బ‌య‌ట పెట్టి ప్ర‌పంచాన్ని చూస్తుంది ప‌క్షుల‌తో క‌లిసి కేరింత‌లు కొట్టి తూనీగ‌ల రెక్క‌ల మీది సంగీతాన్ని ముని వేళ్ల‌తో మీటి నాద సౌంద‌ర్యానికి అశ్చ‌ర్య‌పోయి ..ఆనందించి చివ‌రికి నెమ్మ‌దిగా అన్నిరేకులూ నేత్రాలై విచ్చుకున్నాకా ఈలోకంలో రెప్ప‌లు తెరిచి నిద్ర‌పోతూ ఇంకో లోకంలో సంచ‌రిస్తోంది అగ్ని స‌ర‌స్సులో విక‌సించిన‌ రెక్క‌లు లేని కాళ్లు లేని నిశ్చ‌ల హృద‌య క‌మ‌లం ------------వ‌సీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewAQkZ

Posted by Katta