పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఏప్రిల్ 2014, శనివారం

Sriramoju Haragopal కవిత

గెలుపు బాటపొంటి మైలురాళ్ళు ఎన్ని నడిసినమని తొవ్వతెలువని అడవులల్ల, వాగులల్ల నడిసిన దూరాలెంతని, ఎన్నని నా ముందర కూలిన వనాలైనా, నా వెనక పెరిగే జనాలైనా వాళ్ళు క్యూబాలోనైనా, బ్రెజిల్ లోనైనా వియత్నాంలో గాని, ఇండియాలో గాని తుపాకి దించింది లేదు, దిమాగ్ మారిందిలేదు మియన్మార్ లో గాని,దక్షిణాఫ్రికాలో గాని అమెరికాలోనైనా, యూరోపులోనైనా గొంతెత్తిన నినాదం ధ్వని, అర్థం మారలేదు సాగుతున్న పోరుబాట అలుపెరుగని బావుటా ప్రాణాలెన్నైనా పోనీ, రానీ రేపటిపొద్దు ఎంత అందమైనదో రేపంటేనే ఎంత ఆనందమైనదో వీడ్కోలు చెప్పిన చేతుల్ని మళ్ళీ చూడనేలేదు కన్నీళ్ళు పెట్టుకున్న కళ్ళను తిరిగి చూడలేదు నదులలెక్క నడిసిపోయె కాలంతో నడక మాది వారసులతో అందివచ్చె తెగువరుతువే మాది ఎన్ని కలల మేఘాల్ని పిండినా ఒక నిజం నీరు రాదు ఎన్ని దుఃఖాల వలరులు విసిరినా ఒక సంతోషం వెనక్కిరాదు ఆరని వేదనలో అంతిమగమ్యం ఒక సమసమాజం ఆగని పోరులో మంచిమనుషులలోకం ఒక్కటే నిజం ఎన్నిసార్లెండిపోయినా గరుక మొలకెత్తుతది ఎన్నిసార్లెనకబడ్డా పోరుగెలిచి తీరుతది

by Sriramoju Haragopalfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mmih7G

Posted by Katta

Avvari Nagaraju కవిత

||చేపలు|| ఎ.నాగరాజు ఆదిలో ఆమె నిడుపాటి వేలి కొసలను తునకలుగా కత్తిరించి నీటిలో వదిలినప్పుడు ఒక్కొక్కటీ ఒక్కో చిన్ని చేపగా మారి సన్నని జీరలుగా ఎరుపింకిపోతూ అల్లిబిల్లి కదలికలతో కలసి ఆడుతుండేవి నెత్తురు కలగలసిన భయంకరమైన బాధే అయినా తన దేహంలో దేహమే కదా మాలిమితో కూడిన ప్రేమ కదా ఏమి పేరు పెడదాం వీటికీ? అని ఆమె అనుకుంటుంది చుట్టూ ఇసుక తుఫానులాంటి నల్లని పరదాలు కమ్ముకొస్తున్న జాములలో తనతో తాను మాటాడుకుంటున్నంటుగా ఖండితమయి మోడువారిన చిన్ని కొమ్మల్లాంటి తన వేళ్ళను చూసుకుంటూ ఇవి భయం, పాపం, దేవుడు, శాపం, చావు - తను ఇంకెవరితోనో మరో స్త్రీతో, ఒక స్త్రీ మరొక స్త్రీ మాత్రమే చెప్పగలిగినంత లోగొంతుకతో ఒక మంంత్రోచ్చారణలా భాషిస్తూ వాటిని దోసిళ్ళలోనికెత్తుకొని తన ఉమ్మనీటిలో పొదువుకొంటుంది నెత్తుటి ప్రవాహ గతిలో ప్రాణవాయువును కొద్దికొద్దిగా తోడి ఒక్కో గుక్కా పాలులా పట్టిస్తుంది చేపలు పెరుగుతాయి పెరిగి పెరిగి పెరగడమే తమ వ్యాపకమై విలయంలాగా మరణ సదృశమైన మహా ఆక్రమణలాగా అవి పెరుగుతాయి ముందుగావాటిని ఆమె చిన్ని తొట్టిలో ఉంచుతుంది ఆ తరువాత ఒక వాగులో ఆ తరువాత నదిలో అంతకంతకూ పెరుగుతున్న ఆ చేపలు ఏ రోజుకారోజు తమ చోటు ఎక్కడాని అడుగుతూనే ఉంటాయి చివరకు ఒకింత విసుగుతో సన్నగ కంపితమవుతున్న దేహముతో ఆమె అంటుంది కదా ఇదిగో ఆకాశమయి విస్తరించి సముద్రపు లోతులుగా తొణకిసలాడే ఈ దేహపు గూడు ఇక వచ్చి చేరండి - అనాది గాధను నిదురలేపే డగ్గుత్తికతో ఒక స్త్రీ తనలాంటి మరొకరితో వెతుకులాటులో తడబడుతూ మోకరిల్లే శరణు కోరికలాగా పదే పదే భయం, పాపం, దేవుడు, శాపం, చావులను చెప్పడాన్నితొలిసారి విన్నప్పుడు నీ దేహంలో సన్నని ప్రకంపన 19-04-2014

by Avvari Nagarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkGp5n

Posted by Katta

Arun Sagar కవిత

my old poem but new dedication to paidi teresh anna i love you (written in 1999) ఎ స్ట్రీం ఆఫ్ సబ్ కాన్షస్ నెస్ నీ నడకల కింద ఏమే ఏమేమే మీటలు నాటారా ఎవరైనా కాట్ వాక్ లో వయారీ మయూరీ అడుగేశావంటే చాలు రక్తంలో అడ్రినలిన్ పరవళ్లు సొనాలీ బెంద్రేవో అనూఅగర్వాల్ వో ఓ మెరీ లాంగ్ లెగ్గెడ్ లేడీ వాకింగ్ టాల్ లెతిషియా కాస్టా ఆ సెక్సీ పౌట్ ఎవరికోసమే సుస్మితా పొంగిపొరలే అందాలెన్నో పొంగిపొరలే సౌందర్య రాశీ షారొన్ స్టోన్ పమేలా లీలా లోలా సయ్యారే లీసారే శిల్పమూ వస్తువూ కలిపి తాళం వేద్దాం రిధం డివైన్ నిజమేరా అన్నా లౌ బెగా ఐ టూ వాంటూ హావె గాళ్ ఎవిరీవేర్ అన్నియా ఎన్రీకే ఇగ్లేసియాస్ లెట్ ద రిధం టేక్ ఓవర్ బైలామోస్ శిల్పమూ వస్తువూ వళ్లంతయునూ కవిత్వ ప్రవాహము అందం చూడవయా లక్ష్మీనరసయా ప్లీజ్ ఎప్రిసియేట్ దిస్ నిర్మాణపద్ధతి సంబా సల్సా లంబాడా డర్టీ క్రేజీ కాంప్ ఫైరొకటి రాజేద్దాం అరె ఓ లాటినో ఈ రాత్రికి కొంచెం కొమ్ముబూరా ఊదు రికీ మార్టిన్! యస్ సర్ వెంగా బోయ్స్! ప్రెజెంట్ సర్ ఇదరావ్రే ఖలేద్ భయా శివమెత్తు శివమణీ సవాల్ జవాబ్ డోసెడు వివశత్వం ప్రసాదించు బిడ్డూ నీ డ్రంస్ తేరా ఫ్రెండూ శిల్పాశెట్టిని పిలిపిద్దాం యూపీ బీహార్ క్యా సారా జమానా హసీనోం కా దివానా పెరూ నుంచి కాకపోతే పోర్టోరికో నుంచి నైజీరియా టూ జాంబియా ఒక ఈజిప్టు ఒక కంజరి పాలినీసియాలో మోగిన డప్పు మెలనీసియన్ మొద్దుగొంతు మాధుర్యం ఆధునికాదిమ మూడవ ప్రపంచ సంగీత సమ్మిశ్రమధారకు వెల్కం ఇంటూ ది ఓషన్స్ ఆఫ్ ఫాంటసీ ఊర్రూతలుర్రూతలై సాగే జీవనదుల పొడవు కొలిచేందుకు ఎన్నెన్ని పద్య పాదాలయినా చాలవు ఆ కసి కాంత మేని ప్రకంపనలు కొలిస్తే రిక్టరు స్కేలు ఫెళఫెళ ఇరిగిపోద్దొరేయ్ ముగింపు- ఒక వయోలిన్ ఇంటిదగ్గర నోట్ బుక్ మర్చిపోయి వచ్చెను కాంగో డ్రమ్ములో ఎవరో ద్రాక్షసారాయి నిల్వ చేసిరి కీబోర్డును పబ్లిక్ గా ఎలుకలు కొట్టేయుచున్నవి లీడు లేదు బాసు లేదు ఒక గిటారుకు మతి భ్రమించెను గిరగిర తిప్పిపడేసే పాటలు విని దేహము వెర్రెత్తెను దావానలమయ్యెను -అరుణ్ సాగర్

by Arun Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lkS3hS

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -6 ----------------------------------------- ఒక సూఫీ సాయంత్రం - - - - - - - - - - - - - - - - - - - - - - - - - అఫ్సర్‌ ఏమైందో ఆ మాసిన టోపీ ప్యాంటు జేబుల్లోంచి కర్చీఫ్‌ ముక్క తీసి తలకు చుట్టాను జుట్టు జూలు విదిలించకూడదు సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు ఇంకా తెరుచుకోలేదు ఎదురుచూపులు అసర్‌ కోసం అజాఁ పిలుపుతో పావురాలు ఆకాశంగూటిలో రెక్కలెగరేశాయి పుట్టింటికి చేరుకున్న ఆనందం వాటికి చాన్నాళ్ళకు అసర్‌ నమాజ్‌ అయ్యింది వందేళ్ళ క్రితం కన్నుమూసి ఈ రాళ్ళల్లోంచి మళ్ళీ కళ్ళు తెరుచుకుంటున్న ఆ సూఫీ మునిని కప్పుకున్న చాదర్‌లోంచి ఆయన దేహంలోకి చూశాను నా దేహాన్నంతా వొంపి ఆయనని కళ్ళకి అద్దుకున్నాను దువా చదువుతూ మూతపడిన రెండు కళ్ళూ రెండు నీటిచుక్కలై ఆయన చాదర్‌పైన వాలాయి అవి రెండు పకక్షులై ఎటో టపటపా శబ్దం చేసుకుంటూ వెళ్ళాయి బయటికి రాలేకపోయాను ఆయనలోంచి ఒక పాతకాలపు అరబ్బీ పుస్తకం ఏ కాస్త మోటుగా తాకినా చిరిగిపోతుందేమోనన్నంత భయంగా తెరచినట్టు ఆయన జ్ఞాపకాల్లోకి మెల్లిగా వెళ్ళాను ఈ యాత్రకి అర్ధం ఏమిటి? బయటికి అడగుపెట్టానో లేదో! ఒక పకక్షుల సమూహంలో ఏదో పేలిన శబ్దం అందరూ పారిపోతున్నారు ఎవరూ కనిపించడం లేదు కత్తులు తప్ప ఏమీ వినిపించడం లేదు కొసప్రాణం అరుపులు తప్ప మళ్ళీ లోపలికి పరిగెత్తాను అక్కడా నిశ్శబ్దం ఒక పక్షి మాత్రం నెత్తుటి రెక్కతో దర్గా రాయి మీద ఏదో రాస్తోంది చాదర్‌లోకి ముక్కు దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా వుంది ఎక్కడికి వెళ్ళాలిక? నా లోపల వొక సమాధి తవ్వుకుంటున్నాను (వలి గుజరాతి స్మ ృతికి) (కవి వలి గుజరాతి దర్గాను గుజరాత్‌ జెనొసైడ్‌ సమయంలో నేలమట్టం చేశారు) (AZAAN -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baabafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8hG1F

Posted by Katta

Kapila Ramkumar కవిత

An appeal :- Please do not post any thing which is not related to Literature particularly against the rules framed in kavisangamam and kindly co-operate with us.

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mlHxLj

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-39 అమ్మా! గోమాత...! అదురుచూపులతో అటూ ఇటూ చూసుకుంటూనో స్థిమితంగా నెమరు వేసుకుంటూనో ఈ రోడ్లమీద పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ లో హాయిగా నడయాడుతుంటావు...!! ఖర్మగాలి ఏ వాహనమో నిన్ను గుద్దితే సపర్యలు చేసేవారెవరిక్కడ నీకు...? నీ యజమానికి నీ పాలు కావాలి శ్రమ కావాలి ...కాని నీ బాగు ఎందుకు..? నాకు తీర్చి బొట్లు పెడతారు పండ్లు ఫలహారాలు పెడతారు అని మాగురించి ఎక్కువ ఊహించుకుంటున్నావేమో మా ఖాతాలో పుణ్యం జమచేసుకోడానికి దోష పరిహారాలకి ఏమో చేస్తుంటాం... ఇంతకి మించి లౌక్యం చెప్పినా నీ కర్ధం కాదులే...!!! ---------------------------------------- 19-4-2014

by Murthy Kvvsfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hXNpsr

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

మువ్వలు ....................... గోడలకు అక్షరాభ్యాస కార్యక్రమం ఐదేళ్ళకోసారి ఇప్పుడంతా అంతర్జాల మహేంద్రజాలం పండితులే పలకల్ని పలుకరిస్తూ వాధూలస 19/04/14

by Rammohan Rao Thummurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i4B9jI

Posted by Katta

Satya Srinivas కవిత

అద్దాల మేడలో ఉషోదయం అద్దంలో పున్నమి చంద్రుడు ఇంట్లో సాంబ్రాణి ధూపంలా ఆరుబయట నేను కళ్ళలో అరికాళ్ళు పెట్టుకుని పడుకుంటా ---- చిట్లిన అద్దంలో ఉషోదయం దూరంగా రహదారులెంట ఇసుకలారీల్లో ఆవిరైపోతున్న తడిలా చంద్రుడు ఒక్కో చుక్కా రాల్చుకుంటూ రోడ్లకి టైర్లముద్రల ముగ్గులేస్తూ ప్రాణంలేని గాలిబుట్టల నగరాల వైపు పయనిస్తున్నాడు ఓ ప్రాణం లేని కంటిలో కనుపాపైపోడానికి --------- నేను కిటికి తెరిచినప్పుడు ఆరుబయట పచ్చటి పొదలో నల్లటి పిట్ట కంట్లొ తెల్లటి పాటలా పిల్లకి బువ్వపెడుతూ కూస్తాడు (18-4-14)

by Satya Srinivasfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jjHoCN

Posted by Katta

Subhash Koti కవిత

కవిత్వం కావాలి, కవిత్వం ********* ******** ******** అసలు కవిత్వం అంత అవసరమా ? అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. కవిత్వం రాయడమెందుకు ? చదవడమెందుకు ? అనే ప్రశ్నలు తరచుగా వినిపిస్తుంటాయి మనకు.అయితే దీనికి సమాధానం మనకు ' ఒక్తావియో పాస్ ' మాటల్లో వినండి." సామాజిక న్యాయం లేని సమాజం మంచిసమాజం కానట్లైతె, కవిత్వం లేని సమాజం కలలు లేని ,పదాలు లేని, మరీ ముఖ్యంగా మనిషికీ మనిషికీ మధ్య వంతెన లేని సమాజం.మాట్లాడగలం కాబట్టె మనం ఇతర జంతువుల కంటె భిన్నం. మరి భాష ఉత్కృష్త రూపమే కవిత్వం.ఒకవెళ సమాజం కవిత్వాన్ని నిర్మూలిస్తే, ఆ సమాజం ఆధ్యాత్మికంగా ఆత్మహత్య చేసుకుంటుంది." శ్రీ పుట్టపర్తి నాయాయణాచార్యులు ఒకానొక సాహిత్యగోష్ఠిలొ ఈ విధంగా చెప్పారు " మానవుడు ఆలోచనా శీలి, ఆలోచించటం అనేది మానవుడి స్వభావంలోనే ఇమిడి వుంది. ఆలోచన అనేది లేకుండా మానవునికి అస్తిత్వమే లేదు. ఉండదు.నిత్య ఆలోచనాశీలి అయిన మానవునికి గంభీరమైన ఆనందాన్ని, గొప్ప ఆహ్లాదాన్ని కలిగించేది కవిత్వం అవుతుంది." కాబట్టి కవిత్వం భాష యొక్క ఉత్కృష్ట రూపమే కాకుండా మానవుడికి మానసికానందాన్ని కలుగజేస్తుంది. ( మార్చి-ఎప్రిల్ ,2014 " కవితా !" బుల్లెటిన్ సౌజన్యంతో )

by Subhash Kotifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lknE3k

Posted by Katta

ShilaLolitha Poet కవిత

తెగనిముడి ________ నల్ల బుట్టనిండా చితికినశరీరాలు గోధుమ త్రాచులా ఒక దాన్నొకటి అల్లుకున్నాయి గంప కింద గిజగిజ లాడే ప్రాణి లా మృత్యువు చుట్టేసి నప్పుడల్లా దానిఆను పానూ చూద్దామనే ప్రయత్నం రుపమూ శబ్దమూ లేనిదయి కళ్ళు కాళ్ళు లేకపోయినా అమాంతంగా ఎత్తుకెళ్ళి పోయే డేగ ప్రెమలూ పిల్లలూ కుటుంబము కలలు కన్నీళ్ళు జీవితమూ కలబోసిన బతుకు కుండలో నీళ్ళోలుకుతున్న చప్పుడు తన వాళ్ళ వయిపు జీడి పాకంలా సాగే మనసు ఒక నిర్వి కల్ప నిరామయ స్థితిలో చడి చప్పుడు లేకుండా వెళ్లి పోతుంది ఇన్నాళ్ళు ప్రేమించింది శరీరాన్నా? మనసునా? మనసైతే నాతోనే నాలోనే ఉంది కదా? మరి దిగులెందుకిక! శరీరాన్నే ప్రేమించి నట్లయి తే_ బాహ్య కర్షణానాది? శరీరంతో మాట్లాడిన మనసునా మనసును చుట్టుకొన్న శరీరాన్నా? ? దేన్ని ప్రేమంటారు? అసలు పోయింది ఏమిటి? ఉన్నదేమిటి?ఉండీ లేని దేమిటి? నేనా? నువ్వా? ఇంకొకరా ?ఒకరింకొకరా? ఈ ముడి ఎంతకీ వీడడం లేదు

by ShilaLolitha Poetfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gTTswb

Posted by Katta

Harish Babu కవిత

!!మళ్ళీ అవే!!భీమ్ !! మళ్ళీ అవే గుడెక్కే మెట్ల దగ్గర బళ్ళో కూర్చొనే చోటు దగ్గర కుంటలో దోచిట్లో తీసుకొని తాగే నీళ్ళ దగ్గర ఎప్పుడో నన్ను ప్రశ్నించిన పెదాలు తూ..లంజకొడక మాలో కుర్చోక పొతే అటుపోయే కుర్చోవోచ్చుగా అంటూ పెద్దకులపోళ్ళ పెళ్ళి బంతిలో నన్ను గర్జించిన ఓ పెద్దమనిషిలాంటి ఓ ఆడపిల్ల ఇన్నేళ్ళ తరువాత ఎదురై అడుగుతుంది నువ్వు ఎవరంటు...?నీదే ఈ కులమంటూ...? ఈ ప్రశ్న విన్న ప్రతిసారీ...! కళ్ళలో నీటిసుడులు తిరుగుతున్నాయి ఓదార్చే వాళ్ళుంటే రోజంతైనా ఏడుస్తానేమో నువ్వడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక నా కులన్నాడిగి నువ్వేం చేస్తావ్ ఛీ....!నీదా కులమంటూ వాళ్ళలాగే నువ్వు ఎత్తి పోడుస్తావ్ అయిన మాకది కొత్తకాదే గురుదక్షణగా ఇచ్చిన బొటనవేలులు మీ రామాయణ.,మహాభారతాల్లో రాక్షసులుగా చెప్పుకొనే బానిసలు నీలాంటోళ్ళు దూరంగా పెట్టే నాలాంటోళ్ళు మేమంతా ఒక్కటే ఊరికి దూరంగా వేలివేయబడ్డవాళ్ళం దళితులం..,దరిద్రులం.., అంటులేకపోయిన నీలాంటోళ్ళని ముట్టుకోకుడదని మీ దేవుళ్ళ చేత శపించబడ్డ అంటరానోళ్ళం....!

by Harish Babufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhXbkd

Posted by Katta

Prasada Murthy Bandaru కవితby Prasada Murthy Bandarufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PfnPlH

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i48v2a

Posted by Katta

Kapila Ramkumar కవిత

||వడ్డేపల్లి కృష్ణ కవిత - బోర్!|| రోజూ రీజుకూ రాజకీయ వగాదానాలు వినీవిని బోర్‌ కొట్టిందేమో? ఎక్కడ బోర్ కొట్టి చూసినా గుక్కెడు నీ్ళ్ళు రావడంలేదు! నీళ్ళు కానని జనం కన్నుల కన్నీళ్ళు ఆగడంలేదు. [పేజి 141 -వడ్డేపల్లి కవితాసంకలనం)

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qYhER7

Posted by Katta

Bandla Madhava Rao కవితby Bandla Madhava Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1miYBSf

Posted by Katta

Gouri Lakshmi Alluri కవిత

/////కార్పొరేట్ పాలిటిక్స్ ///// రాజకీయ పార్టీలు లాభార్జన వ్యాపార సంస్థలు కోట్ల పెట్టుబడిదారులు ఆ సామ్రాజ్య పు సీఈఓలు వృత్తి ప్రావీణ్యాన్ని బట్టి ఉద్యోగులు కంపెనీ మారతారు గెలిచే సత్తా చూపి నాయకులు పార్టీ మారతారు సిద్ధాంతాలూ, మూల సూత్రాలూ పాత కాలం పాటలు దేశ భక్తీ, ప్రజా సేవా అరిగి విరిగిన రికార్డులు గెలుపే లక్ష్యంగా పిల్లి మొగ్గలేసే ప్రోయాక్టివ్ లీడర్లు విన్ విన్ షేర్ ల వాటాలే పార్టీల పొత్తు పొట్లాలు నిజాయితీ పరులు కండువా తీసి టీవీ చూడాల్సిందే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లు కొత్త చరిత్ర రాసుకోవాల్సిందే కుల పెద్దలైతే చాలు బడా నాయకులై పోవచ్చు కుర్రాళ్ళ తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించొచ్చు పెద్ద పెద్ద ముఠాలు పాలనాధి కారానికై బరిలో నిలుస్తాయి గెలిచాక పవర్ ప్రస్థానం లో జట్లు కడతాయి అధికారం దక్కాక ప్రత్యర్ధుల్ని జైలు కంపుతాయి చివరికి ప్రజల్ని ఫూల్స్ చేసి కేసులన్నీ నీటిబుడగ లౌతాయి మాజీ మంత్రుల అవినీతిని కొలిచే మీటర్లు లేవిక్కడ తక్కువ రీడింగ్ చూపిన వాడికి ఠక్కున వోటెయ్యడానికి పార్టీ టికెట్ల పందేరం ఒక నాటి రవికెల పండుగ చందం రెండు పార్టీల నుండీ ఒకరే నామినేషన్ - బేరం కుదిరితే సీట్ ఫైనలై జేషన్ అమ్ముడు పోయిన వార్తా పత్రికల్లో నిష్పాక్షికత నిండు సున్నా అవి పోటీ పడి ప్రజల కయోమయం మరింత పెంచునన్నా.. స్వార్ధ మూర్తుల ఎన్నికల జాతరలో వోటర్లు తప్పిపోయిన పిల్లలు ఉత్తమ నాయకులను ఎన్నటికీ ఎన్నుకోలేని అమాయకపు జీవులు

by Gouri Lakshmi Allurifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKH0Qt

Posted by Katta

Sravanthi Itharaju కవిత

విజ్గ్నులు శ్రీ పుష్యమి సాగర్ గారు చాలా విపులంగా నా పుస్తకము"మనసు తలుపు తెరిస్తే"ని ఎంతో రమయంగానూ, రమణీయంగానూ విశ్లేషించి సమీక్షించారు.శ్రీ సాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుంటున్నాను. ఈ పుస్తక సమీక్ష ద్వారా నేను సమాజానికి పలు మానసిక రుగ్మతల పట్ల కల్పించదలచిన "అవగాహనా యగ్నం" లో పాలుపంచుకున్నందులకు నేను సర్వదా కృతగ్నురాలిని...

by Sravanthi Itharajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jSLTGq

Posted by Katta

Srinivas Saahi కవిత

శ్రీనివాస్ సాహి,*తాజా వార్త...* ఎలిసిపోయిన నీ తెల్ల టోపీకి చెమట పట్టుకున్న నా ఎర్రబొట్టుకి పచ్చబొట్టసొంటి సాయితా... పెరుగుతున్న బ్రతుకు రేటులో మన విలువ ఎప్పుడూ పది పైసలు పతనమవుతుంటుంది గూడొక్కటే వేరు బ్రతుకు పోరు ఇద్దరి మధ్య బరాబరే! బ్రతుకు రోడ్డు మీద ఎన్ని గతుకులున్నా.. భాయిజాన్! మనిద్దరి జబ్బలు-జబ్బలు రాసుకునే తిరుగుతాయి అప్పుడెప్పుడో చదివిన వార్తల్లోల్లాగా మనమింకెప్పుడూ అమాయకుల్లా మిగిలిపోవద్దు అందుకే.. అక్కడ అధికారం కోసం సన్నద్ధమవుతున్న వాడి మొహం మీద నా అక్షరాలతో నిసురుతున్నా ఒక "థ్పూ..." పాత వార్తనే మళ్ళీ తాజాగా ప్రకటిస్తున్నా.. ఇక్కడ అందరి కలల ప్రపంచమొక్కటే అందరి దేశమొక్కటే "భారతీయులందరం ఒక్కటే" 19/04/2014.

by Srinivas Saahifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qXQGZV

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb ||ద గ్రేట్ స్టుపిడిటి|| నా కిప్పుడు జనం కావాలి. పల్లకీలో ఎక్కించి,.ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే బలిసిన భుజాలు లాంటి జనాలు. రెండు మెతుకులు కూడు కోసం, కుక్కల్లా కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు. పొదుగుల నుండి రక్తం పిండుతున్నా ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు. రెండు కాగితాలకు, ఓ క్వార్టర్ మందుకో తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు, నాకిప్పుడు జనం కావాలి. బీజమూ లేక, అండమూ రాక కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే నపుంసకుల్లాంటి జనాలు కావాలి. మనుషులమనే మరిచిపోయిన గార్ధబాల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే, సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు. నాకిప్పుడు జనం కావాలి. కళ్లుండి చూడని జనాలు, మెదడుండి ఆలోచించని జనాలు, కాళ్లూ చేతులూ వుండి పనిచేయని సోమరి జనాలు. బతుకంటే ఏంటో తెలియని జనాలు, బతకడం చేతకాని జనాలు, నాకిప్పుడు జనం కావాలి. నేననుకొనెట్లు మాత్రమే ఆడగల బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు. 2 ఓ ఆర్డర్ కి సప్లైయ్ చేయాలి. ఎంత మంది దొరకచ్చిక్కడ? షుమారుగా ఓ వంద కోట్లు! ---------------------------------19/4/2014

by Bhaskar Kondreddyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mgP0v8

Posted by Katta

Yasaswi Sateesh కవితby Yasaswi Sateeshfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qXO1j6

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఇసుక గడియారం ::::::::::::::::::::­::::::::::::::::::::­::: కొన్ని క్షణాలు కరిగించుకుంటాను నాలోకి గడియారం ముల్లుల్లోంచి ఆ వ్యవధి చాలనుకుంట నన్ను నేనురాసుకోడానికి సవ్యదిశలోను అపసవ్యదిశలోను సాగే నా ఆలోచనలకు చరమగీతం ఈ రాత్రి మౌనపు పరదాల మధ్యగా ఓ చీకటి సముద్రం దాని ముందు మోకాళ్ళ మీద ఓ శరీరం/మళ్ళీ నేనె దేహానికి కనబడని ఆత్మ ఆత్మకు కనబడే దేహం మధ్య ఓ అనామక రూపం నేను ఇంకొన్ని రోజులు శూన్యంలోకి నడిచేశాక సంకలనం చేయలేని నల్లపిచ్చుకలు కాలపు వరండా నిండా చిగురులు వేయని నీరుటెండలో పచ్చగా తడుస్తూ నా ముఖం(మొహం) ఆశల కాళ్ళకింద నిలబడి అన్వేషణ బారులు తీరిన ఇసుకరేణువులు ఒకదానివెంట మరోటి దివి క్షేత్రంలో నీలపు రవిని కమ్మేయడానికి ఇప్పుడు ఆ రెండు ముళ్ళు కలిసాయి నిర్మానుషంగా ఉన్న అస్తవ్యస్త కూడలిలో నన్ను ఓ చోటికి పోగేస్తూ/అచ్చు నాలానేఇంకోసారి తిలక్ బొమ్మరాజు 19.04.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hbnN5g

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతుంది--5 ________________________ఆర్క్యూబ్ బెల్లి లలిత-తలా ఒక ప్రశ్ననిచ్చి సరిగ్గా అణిచి వేత ముందే నాటమని చెప్పిన పాలపిట్ట * * * * దానికి-కూలాల్సినవేవో అవే అమ్ముల పొదలు మంచి ఇత్తనం పాట తన దౄశ్య నిఘంటువులో రెక్కలు విప్పుకోవడం తప్పు కదా ఖండ ఖండాలుగా నరికే కత్తై వేటాడుతుంది * * * * * అందుకే ఆమిప్పుడు - ప్రతి దినాన్నొక వీరోచిత చరణంగా ఆవిష్కరిస్తున్న మన గుండె గోడ మీది క్యాలెండర్ .

by Arcube Kavifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RwBaIq

Posted by Katta

Sasi Bala కవిత

ప్రతీక్ష .....................................శశిబాల (19 april 14 ) ...................................................... నీకై ఎదురుచూపులో మదిలోని ఆరాటం అలజడులు రేపుతుంటే కనురెప్పల మాటున దాగిన భావాలు వెలికిరానంటుంటే మనసు మాటుభావాలు పెదవి దాటి రానంటే నీతో గడిపిన మధుర క్షణాల్ని నెమరువేసుకుంటూ మౌనంగా వున్నా మనసులోని భావం కడలిలా హోరెత్తుతుంటే పైకి సముద్రంలా గంభీరంగా వున్నా ఎదలోతుల్లో ఎన్నెన్ని భావ పోరాటాలో రాబోయే జీవన సమరానికి శంఖం ఊదుతూ అలలై పొంగే కన్నీటిని అణచుకొంటూ ఆశల ఊపిరిపోసుకొంటూ ప్రతీక్షిస్తున్నా నీ రాకకోసం ...మన కలయికకోసం

by Sasi Balafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iyy7c9

Posted by Katta

Kapila Ramkumar కవిత

అక్షర మాంత్రికుడు Posted on: Sat 19 Apr 01:29:18.166833 2014 - మార్క్వెజ్‌ అస్తమయం మెక్సికో సిటీ : నోబెల్‌ బహుమతి గ్రహీత, విశ్వ విఖ్యాత నవలా రచయిత గాబ్రియెల్‌ గార్సియా మార్క్వెజ్‌ గురువారం ఇక్కడ తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87సం||లు. మార్క్వేజ్‌కు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. ఆయన మృతి వార్తను రాండమ్‌ హౌస్‌లో ఆయన మాజీ ఎడిటర్‌ క్రిస్టోబాల్‌ పెరా ధృవీకరించారు. ''వన్‌ హండ్రడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌'' (వందేళ్ల ఏకాంత వాసం) నవల 20వ శతాబ్దపు సాహిత్యంలో ఆయనను అగ్ర పథాన నిలబెట్టింది. 'గాబో' గా అందరికీ చిరపరిచితులైన ఆయన సాహిత్య రంగంలో చేసిన కృషికి గానూ 1982లో నోబెల్‌ బహుమతి పొందారు. ఆయన పుస్తకాలు అనేక డజన్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. తన రచనలతో డికెన్స్‌, టాల్‌స్టారు, హెమ్మింగ్‌వే, మార్క్‌ ట్వెయిన్‌ వంటి ప్రముఖ రచయితల సరసన చోటు సంపాదించుకున్న గాబ్రియెల్‌ అటు విమర్శకుల, ఇటు సామాన్య పాఠకుల మన్నన పొందారు. మాజికల్‌ రియలిజం(మార్మిక వాస్తవికత) అనే సాహిత్య శైలిలో ఆయన అద్భుతమైన ప్రతిభ కనపరిచి ప్రతీకగా నిలిచిపోయారు. అటు వాస్తవం, ఇటూ కాల్పనికత రెండూ జమిలిగా పెనవేసుకున్న అసాధారణ శైలి అది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలకే అనూహ్యమైన కాల్పనికపు హంగులు సమకూర్చడంతో అవి విలక్షణమైనవిగా రూపుదిద్దుకుంటాయి. ఆ శైలే ఆయనకు ప్రత్యేకతను సముపార్జించిపెట్టింది. ఆయన రచనల మూలాలు లాటిన్‌ అమెరికన్‌ పురాణగాధల్లోనివి. అయినా ఆయన రచనా శైలి, అందులోని విషయం అంతా కూడా సార్వజనీనంగా వుండేది. ఆయన నుంచి వెలువడే ప్రతి రచనకు కూడా మంచి విమర్శకులు, అలాగే పాఠకులు కూడా వుంటారని స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ లెటర్స్‌ ఆయనకు నోబెల్‌ పురస్కారం అందచేస్తూ ప్రశంసించింది.నోబెల్‌ బహుమతిని స్వీకరిస్తూ మాట్లాడిన గాబ్రియల్‌ ''కవులు, యాచకులు, సంగీత కళాకారులు, ప్రవక్తలు, యుద్ధ వీరులు, పనికిమాలిన వాళ్ళు ఇలా అందరూ కూడా హద్దుల్లేని ఈ వాస్తవిక ప్రపంచంలోని జీవులే. కాస్త కాల్పనికతతో, ఊహాజనిత శక్తితో మేం పనిచేస్తాం. మాకున్న కీలకమైన సమస్య ఏంటంటే, మా జీవితాలు నమ్మదగ్గవిగా మార్చుకోవడానికి సాంప్రదాయ సిద్ధమైన మార్గాలు కొరవడడం.'' అని పేర్కొన్నారు. కేవలం 18 మాసాల్లో రాసిన 'వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆప్‌ సాలిట్యూడ్‌' పుస్తకం 2కోట్ల ప్రతులకు పైగా అమ్ముడుపోయింది. స్పానిష్‌ భాషలో అత్యుత్తమ రచనగా దీన్ని చిలీ కవి పాబ్లో నెరుడా అభివర్ణించారు. మొత్తం మానవాళి అంతా చదవదగిన పుస్తకమంటూ నవలా రచయిత విలియం కెన్నడీ ప్రశంసించారు. ఈ మార్మిక వాస్తవికత రచనా తీరును తాను కనిపెట్టానంటూ గాబ్రియెల్‌ ఏనాడూ గొప్పగా చెప్పుకోలేదు. దాని తాలుకూ ఆనవాళ్ళు అంతకుముందుకూడా లాటిన్‌ అమెరికా సాహిత్య చరిత్రలో వున్నాయని, కానీ తనకు ముందు ఎవరూ కూడా దానిని ఇంత కళాత్మకంగా ఉపయోగించలేదని పేర్కొన్నారు. ఇదే ఉత్తరోత్తరా అట్లాంటిక్‌ ఇరువైపులా గల రచయితలు అంటే చిలీకి చెందిన ఇసాబెల్‌ అలెండీ, బ్రిటన్‌కు చెందిన సల్మాన్‌ రష్దీ వంటివారికి స్ఫూర్తిగా నిలిచింది. 1927 మార్చి 6వ తేదిన కరేబియన్‌ తీర ప్రాంతంలోని చిన్న పట్టణమైన అరకాటకాలో జన్మించిన మార్క్వేజ్‌ 11మంది సంతానంలో పెద్దవాడు. 1947లో విద్యార్ధిగా వుండగానే తన మొట్టమొదటి రచనను వెలువరించిన ఆయన ఇక ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.చ చిలీలో పినోచెట్‌ నిరంకుశత్వ పాలనను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. అందుకు నిరనసగా రచనలు మానేశారు. అయితే ఆ విధంగా తను పొరబాటు చేశానని తర్వాత చెప్పుకున్నారు. క్యూబా వార్తా సంస్థ ప్రెన్సా లాటినాలో కరస్పాండెంట్‌గా చేశారు. క్యూబా విప్లవ యోధుడు ఫెడల్‌ కాస్ట్రోకు అత్యంత అభిమానపాత్రుడైన మార్క్వేజ్‌ తాను ముందుగా జర్నలిస్టునని, జర్నలిస్టుగానే వుండడానికి తాను ఇష్టపడతానని చెప్పుకునేవారు. ఎందుకంటే తాను జర్నలిస్టుగా వుండకపోతే ఇన్ని పుస్తకాలు రాసివుండేవాడిని కాదని అనేవారు. తన పుస్తకాలకు సంబంధించిన సమాచారమంతా కూడా వాస్తవిక జీవితం నుండి తీసుకున్నదేనని స్పష్టం చేశారు. లింఫు గ్రంథుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన చివరలో తన సమయంలో ఎక్కువ భాగం తన జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడానికే కేటాయించారు. 1999లోనే ఆయనకు ఈ వ్యాధి వున్నట్లు నిర్ధారించారు. కాగా, 2012 జులైలో గాబ్రియెల్‌ డిమెన్షియాతో బాధపడుతున్నారని, దాంతో రచనా వ్యాసంగాన్ని నిలుపుచేశారని ఆయన సోదరుడు జైమ్‌ వెల్లడించారు. http://ift.tt/1lgQxBY

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lgQxBY

Posted by Katta

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం|| ఆమని '' ఉగాది కవితా సంపుటాన్ని ప్రముఖ కవి, నాటక రచయిత, దర్శకుడు బాణాల కృష్ణమచారి చేతుల మీదుగా ఆవిష్కరించిన పిదప సంపాదకత్వం వహించిన బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ మాట్లాడారు. . జయనామ వత్సరానికి స్వాగతం పలుకుతూ '' మన తెలుగువారికి ప్రధానమైన సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా కుటుంబ యావత్తు ఆనందంగా కోటి ఆశలతో, కొత్తపథకాల రూపకల్పనతో కొంగ్రొత్త ఆలోచనలతో నూతన నిర్ణయాలతో జరుపుకునే పర్వదినం ' ఉగాది ' కి విశిష్ట స్థానం వుంది అని '' తదనంతరం, కపిల రాంకుమార్ తన సంపాదకీయాన్ని కొనసాగిస్తూ '' మన భాషా సంస్కృతులు, మానవ సంబంధాలు ప్రస్తుతం పడమటిగాలి వడదెబ్బ కు సోలిపోకుండా, ప్రపంచం మొత్తం ఆవహించిన మత ఛాందస వాదానికి, ఉగ్రవాదానికి,ప్రపంచీకరణ ముసుగులో ముంచుకొస్తున్న గ్లోబలీకరణకి తట్టుకుని నిలబడాలనే తలంపుతోనే భావ సారూప్యం కల కవులు, కళాకారులు 1999 జనవరి 26 తేదీన ఖమ్మం పట్టణంలో సాహితీ స్రవంతిని ఒక వేదికగా ఏర్పాటుచేసుకుని గత 15 సంవత్సరాలు అనుబంధాన్ని పెంచుకుంటూ,కేవలం ఖమ్మంలో ఆవిర్భవించి నా, రాష్ట్ర షాయి సంస్థగా ఏర్పడటానికి, అంతేకాక, దాని ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం అనే సాహిత్య మాస పత్రికగా జనాదరణ పొందటానికి కొద్దో గొప్పో ఖమ్మం పాత్ర గణనీయమైనదేనని చెప్పుకునేందుకు నయంగానే గర్వపడుతున్నామని, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహిస్తూనే ఒక గుర్తింపు పొందామని, దానిని నిలబెట్టుకోవాలని, అందుకు నిబద్ధత, నిమగ్నత కలిగిన సాహితీ కార్యకర్తల కృషి అవసరం ఎంతైనావుందని, కొత్త వారిని ప్రోత్సహించటం. మెలుకువలు నేర్పటం సదస్సులు, శిక్షణాతరగతులు నిర్వహించటంలాంటి కార్యక్రమాలు చేస్తూనేవున్నామని,. ఇంకా మరిన్ని అలాంటివి కొనసాగించాలనే కృత నిశ్చయంతో వున్నామని, అందులో భాగంగానే గత సంవత్సరం జూలై నెల నుండి మూడవ ఆదివారంలో ప్రతి నెల సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తూ, దాదాపు 20 నుండి 35 మంది దాక హాజరవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక, కవిత్వ పఠనం, చర్చ, సాహిత్య ప్రసంగములు నిర్వహిస్తున్నామని, ఇది ఒక అపూర్వ ప్రయోగంగానూ, ఉపయుక్తంగానూ, వుందని తెలిపారు.ఈ సంవత్సరం సాహితీ స్రవంతి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సాహితీ సంచిక ప్రత్యేకంగా తేవాలని అనుకుంటున్నామన్నారు . ఆప్రయత్నంలో భాగంగానే ఈ జయనామ ఉగాదికి ఎంపిక చేసిన కవితలను మీ ముందుంచుతున్నానని, సలహాలు, సూచనలు కోరారు. ఇందులో సమకాలీన, సామాజిక రాజకీయ అంశాలతో పాటు పండుగ నేపథ్యాన్ని మిళితం చేసి, షడ్రుచుల సమ్మిశ్రితంగా కవితలు, పద్యాలు, గేయాలు, మీకు దర్శనమిస్తాయని, వీటిని ఒక చోటికి తేవటం సంకలనపరచడం కత్తిమీద సామైనా సాహితీ స్రవంతి కార్యకర్తల తోడ్పాటుతో ఈ చిన్న రూపం తేవడంలో యేమాత్రం సాఫల్యం చెందామో కాని, ఒక చిన్న సంతృప్తి మాత్రం కలుగుతోంది. ఆదరించి, అహ్వానించిన వెంటనే స్పందించి కవితలు పంపినవారికి, సహకరించిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుముందు కూడ ఇలానే ఇదే స్ఫూర్తితో తోడ్పడాలని వేడుకుంటూ, పేరుకే సంకలనకర్తనే కాని యిది అందరి సమిష్టి కృషి అనిమాత్రం చెప్పక తప్పదు. మరొక్కమారు అందరికి నూతన సంవత్సర అభినందనలు తెలియచేసారు.ఈ సమావేశానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి అధ్యక్షత వహించగా, సాహితీ స్రవంతి జిల్లాకార్యదర్శి రౌతు రవి, అతిథులను వేదికపకి అహ్వానించి తన నివేదిక సమర్పించచారు ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మానికి చెందిన సీనియర్ కవులను, సాహిత్యాభిమానులను సన్మానించారు. బాణాల కృష్ణమాచారి, కోటీ శశిశ్రీ, కపిల రాంకుమార్, వురిమళ్ళ సునంద, టి.ఎల్. లక్ష్మీనరసయ్య, డా. పొత్తూరి సుబ్బారావు, డా.కావూరి పాపయ్య శాస్త్రి, డా.కవితాంజనేయులు, మొదలగు వారు సన్మానంపొందిన వారిలోవున్నారు. తదుపరి కన్నెగంటి వెంకటయ్య, సునంద, కపిల రాంకుమార్, నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. ఇరవైరెండు మంది కవితలను పుస్తకరూపంలో సంకలనం కావించగా, వీరు కాక, మరో పదిహేనుమంది తమ కవితలను చదివి వినిపించారు. మాజీ మునిపల్ చైర్ పర్సన్‌ అఫ్రోజ్‌ సమీనా, సి.ఐ.టి.యు నాయకులు ఎర్రా శ్రీకాంత్, ప్రముఖ రంగస్థల కళాకారుడు అద్దంకి కృష్ణప్రసాద్, బి.వి.కె. డిప్యూటి జనరల్ మేనేజర్ కందాడై శ్రీనివాసులు మొదలగు వారు సందేశమిచ్చారు. పండుగ బలహీనతని రాజకీయ నాయకులు ఎలా అవకాశంగా తీసుకుని సామాన్యుని అవసరాలపై ఎలా వల వేస్తారో, ఆశపడి, బోర్లపడిం సామాన్యుని వేదన తన కవితలో రాంకుమార్, ఆరు ఋతువులు సమ్మేళనం ఈ ఉగాది అంటూ సునంద, మానవాళి మేలుకొరకు మరింత వెలుగులు నింపాలని ఆశతో శైలజ, ఏది ఏమైనా కోయిలా ఒట్ల పండుగని వెంటేసుకుని వొచ్చావులే అంటూ కన్నెగంటి చమత్కరించగా, కాలాన్ని నిర్వ్చిస్తూ చక్కటి చమత్కార కవిత గిరి నరసింహారావు, శిసిరంలో రాలిన పండుటాకుల్ని లెక్కిస్తూ, తొక్కేస్తూ ఋతువుల క్రమాన్ని తన కవితలో బంధించిన వనం తేజశ్రీ, ఎన్ని ఉగాదులొస్తేనేం, మనిషి మనసుని మార్చగలవా అని ప్రశ్నిస్తూ పోట్ల సుధారాణి, '' జయాలనిచ్చే ఉషోదయానికై '' అంటూ గేయ రూపంలో ఉగాదిని స్వాగతించిన సంపటం దుర్గా ప్రసాదరావు, పండుగ సంబరమొకరోజే కాని సాలు పొడుగునా వైఫల్యాలెన్నో ఇన్నేళ్ళ ఉగాదుల వెంట వస్తూనే వున్నాయంటూ చావా జయప్రద, ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుమంకున్న ఉగాదే అంటూ చతుర్తలు కూడిన కవితతో మేడగాని శేషగిరి, కలవరపడకే కోయిలా అంటూ హెచ్చరిస్తూ కంచర్ల శ్రీనివాస్, కోకొఇల స్వరాలకు బదులు కాకుర స్వరాలు.. పల్లెల్లోనూ, గల్లీల్లోనూ వినిపిస్తున్నాయంటూ కవితాంజనేయులు, స్వాగతం కవితతో బూడిద అరుణ గౌడ్, షడ్రుచులతో కృష్ణవేణి, కొత్త ఆశలతో సీతారామారావు, పాడవే కోయిలా గొంతెత్తి యుగగీతి గేయంతో రౌతురవి, జయ ఉగాది పై చక్కటి సంప్రదాయ వృత్తాలతో డా.పొత్త్రి సుబ్బారావు, డా. పాపయ్య శాస్త్రి, తాగుబోతోడి శ్రీమతి తంటాలను చమత్కారంగా పావే రావు, పండుగ హడావుడి - హాస్య రూపకాన్ని రౌతు కడలి, ఎన్నికల వేళ మతంరంగు పులుముకుని దాడిచేయబోయే వాడిని గుర్తుపట్టానంటూ బండారు రమేష్, ప్రతీ దానినీ నిశితంగా, నిజాయితీగా చూడటం నేర్చుకోవాలని కె. ఆనందాచారి, బతికేవున్నామని ఓ ఐదేళ్ళకోసారి గుర్తుచేసుకోవటమేనా - ఎన్నీకలంటే అంటూ తీవ్ర స్వరం వినిపించిన పోతగాని, పర్వదిన్నం పేరుతో నైనా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవటం యెంతో అవసరమని గజేంద్ర సైదులు. ఇచేఏ పైసలకు ఆశపడితే పడ్డావు కాని, ఓటు మాత్రం అర్హత కలిగిన వాడికే వెయ్యాలి సుమా అంటూ ఆలేటి పరంజ్యోతి కవితలు అందర్ని అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగ సంఘనాయకులు, పట్టణంలోని ప్రముఖ న్యాయవాదులు, వ్యాపారస్తులు , మహిళాసంఘ నాయకులు, ఆదివారం మీ కోసం అధ్యక్ష, కార్యదర్శులు మొదలగువారు పాల్గొన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహార వచ్చిన వారందరికి పండుగ ఆతిథ్యాన్ని అందించారు. ఎం.శేషగిరి , కన్నెగంటి వెంకటయ్య, మరియు కళానిలయం బృందం వారు తమ గీతాలాతో అలరించారు. ** --కపిల రాంకుమార్ 9849535033 (2.4.2014/19.4.2014)

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f568fG

Posted by Katta

Kapila Ramkumar కవిత

Kapila Ramkumar || Henry Wadsworth Longfellow ||A Psalm of Life || Tell me not, in mournful numbers, Life is but an empty dream! For the soul is dead that slumbers, And things are not what they seem. Life is real! Life is earnest! And the grave is not its goal; Dust thou art, to dust returnest, Was not spoken of the soul. Not enjoyment, and not sorrow, Is our destined end or way; But to act, that each to-morrow Find us farther than to-day. Art is long, and Time is fleeting, And our hearts, though stout and brave, Still, like muffled drums, are beating Funeral marches to the grave. In the world’s broad field of battle, In the bivouac of Life, Be not like dumb, driven cattle! Be a hero in the strife! Trust no Future, howe’er pleasant! Let the dead Past bury its dead! Act,— act in the living Present! Heart within, and God o’erhead! Lives of great men all remind us We can make our lives sublime, And, departing, leave behind us Footprints on the sands of time; Footprints, that perhaps another, Sailing o’er life’s solemn main, A forlorn and shipwrecked brother, Seeing, shall take heart again. Let us, then, be up and doing, With a heart for any fate; Still achieving, still pursuing, Learn to labor and to wait.

by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lguaMK

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

కవిత్వమంటే----- ********************** కవితా రాణి పాదాలకు మళ్ళీ పారాణి పూతలను పూద్దాం మళ్ళీ ఆ మహా సాధ్విని అమందానంద కందళిత హృదయారవిందనుగా తీర్చి దిద్దుదాం. కవిత్వమంటే ప్రవహించే ఓ సుమధుర జ్ఞాపకమనీ ఎప్పటికీ చెరిగిపోని పుట్ట్టుమచ్చనీ అందరికీ విదితం చేద్దాం. కవిత్వమంటే నిత్య వసంతమనే నిజాన్ని నిలువెత్తు సాక్ష్యంగా నిరూపణ చేద్దాం కవిత్వమంటే ఒక పచ్చని పైరు పంటయనీ దాని మీదనుంచి వీచే చల్లని గాలీ మెత్తని స్పర్శా కవిత్వమేనని ప్రతిపల్లెకూ పట్టణానికీ దండోరావేస్తూ చాటిద్దాం. నిబద్ధతకూ నిజాయితీకీ నిండు ప్రాణంగా నిలిచే సత్స్వరూపం కవిత్వమేనని గల్లీ గల్లెలోనూ గళమెత్తి పాడుదాం.

by Ravela Purushothama Raofrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tj6Uiv

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | ఎరోటికా | కంటికి రెండు దార్లు కనిపిస్తుంటే మనసు మూడో దారి వెతుక్కుంటుంది చూపుకి అంటని భాష ఏదో మనసుకి కి లోబడుతుంది . మొహం పొరలు విచ్చుకొని మోహం తళుక్కుమని రెటీనా రెక్కలు విరుస్తుంటే కంటి చివర మానవ సంభంధాలు గడ్డకట్టి అభావం గా ఆలొచనలోపడ్తాయి జీవితం పెద్ద సర్ప్రైజ్ ఏమి కాదు అనెక్స్పెక్టెడ్ అనురాగాల వెనక ఎక్స్పెక్టెడ్ శరీరాలే కదులుతూ ఉంటాయి పాముల్లా మెలికలు తిరుగుతూ ప్రేమవాంచల ప్రవాహంలో సుడులు గా సుఖానికి సజీవత్వనికి సంకెళ్ళు వేస్తూ భావప్రాప్తి కోసం రహస్య యుద్ధాలు చేస్తూ Humm... life is a bundle of joy with loads of mismanagement handle with care Or be bizi collecting the Shattered pieces while Yelling wildly for missing peace of soul Nishee !! 19/04/14

by బ్రెయిన్ డెడ్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hay6X4

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ | ఏదో ఒక 'గతం' ................................. నువ్వుకూడా వెళ్ళిపోయాక వొక్కడినే మిగిలాను ఈ కొసన . నిరాశ ఏం కాదు కానీ, నిరాశలాంటిదే; వెలితి బహుశా ! కొన్ని అంకెల్లా మిగిలిన ఫోన్ నంబర్ల మీద తడిమి పేరును మళ్ళీ ఒకసారి మననం చేసుకుని నిట్టూరుస్తూ నేనో అంకెలానే మారిపోయినతనాన్ని గుర్తుచేసుకుంటాను. 1 లోపలికే ప్రవహిస్తున్న ధారలా ఊరు - ఊరిలో కూలిపోయిన ఇంటి గోడమీద నేను రాసుకున్న పేర్లలోంచి సగం మాత్రమే మిగిలిన పేరును మనసులో మరొకసారి రాసుకుంటాను. చేపిన పొదుగులనుంచి నే లాగిన లేదూడల పెదవులపై అంటిన పాలనురగల్లోని మిగిలిన ఆకలిని ఇప్పుడిక్కడ నేను అనుభవిస్తుంటాను. గుంజకు కట్టేసి ఇంటిదగ్గరే వదిలిన లేగలకళ్ళలోని దు:ఖాన్ని ఈ బీడులాంటి లోకంలో ఇప్పటి కన్నీళ్ళుగా నేను మారిపోతుంటాను . 2 నాకు రాత్రే పగలు పగళ్ళు పగుళ్ళు వారే రోజుల ఆత్మకథలు. నిస్సిగ్గుగా ఊరేగే కాలంలో కాటువేసేందుకు గొంతెత్తే 'మైక్'లు. నిన్నో ప్రశ్న అడగనా - సమాధానం ఆశించకుండానే ! సమాధానాలన్నీ అంతర్ధానమైన సందర్భం నువ్వూ నేనూ ; అప్పటికప్పుడు అమరే సుఖాల కోసమే మనలోని మాటలూ,మప్పితాలు! 3 ఖాళీ ఖాళీగా మారిన వీధుల్లోంచి అటుగా ప్రయాణిస్తూ కిటికీ నొకదానిని నాలోపలికి పిలుస్తాను. నాలోకి తెరుచుకోలేక, కిటికీగానూ మిగలలేక అది అక్కడే మిగిలిపోతుంది తెరుచుకావాల్సింది నేనే నాలోకి # లేగకళ్ళ లోని దు:ఖం నా వేళ్ళచివర్లలో ! [ మార్క్వైజ్ కు నివాళిగా ] *19.4.2014,1.01am

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f3V96n

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేస్కుమార్ //5ఇంటూ సం వన్// ఏమైందంటావ్ హఠాత్తుగా వాడిప్పుడొచ్చాడు విరిగిన కాళ్ళనీ సంచీలో వేసుకొని ఎర్రని సూర్యున్ని నల్లని రంగుగా వొంటిపై అతికించుకొని తిరిగిన్నాడు ఎమయ్యాడు వాడు ఎప్పటికప్పుడు స్వీయప్రశ్నా పత్రమై నన్నునేనుగా గాల్లోకెగరేసుకున్న నాడు ఏమయ్యాడు వాడు చెట్లకువేళ్ళాడే హృదయాలు ఉదయాలనిండా పరుచుకున్న నాడు నిజాన్ని నినాదం చేసి ఓ పాతగోడపై నేను పరుచుకుంటే..... పాతబస్తీలో మొరిగే. అబద్దపు పోలీసు కుక్కై అరుస్తున్నాడు దేహాంతరపుటాలోచనలు దేశాల దూరంలో ఉండి విన్నాను విన్నానంటూ నోటి చివర కారే లాలాజలపాతమై వాడు నన్ను నిలువునా తడిపేయ జూస్తున్నాడు ఏమయ్యిందంటావ్ హఠాత్తుగా వాడికి నేనొకన్నీ నిలిచిపోతాను కొన్ని గుండెల మద్య సుదూరాలని ఓ సున్నపు గీతలా కలిపేసి శరీరాంతరాత్మల్లో విలీనమై ఒక నీలిరంగు మచ్చని ముద్రగా ఒకానొక నిరసనావాదపు పచ్చ బొట్టు గా చిత్రించి.. నేనూ అప్పుడు నిశ్క్రమిస్తాను బహుశా ఇప్పటిలానే నా వెనకే ఉంటాడు వాడు చీకటిదారుల్లో ఆరిపోయిన లాతరు బుడ్డీ చేతబట్టుకొని పాతబడ్డ చీపురు పైనెక్కి తిరిగి తిరిగీ చివరికి ఒక కరెంటు తీగపై గబ్బిలం లా తలకిందులుగా వేల్లాడుతూ నడుస్తున్న వారిని చూస్తూ...19/4/14

by Naresh Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qVztjP

Posted by Katta

Srinivas Vasudev కవిత

"మిస్టీరియస్ మరణమే కవితా వస్తువు" కవిత్వం రాయని వారికీ, కవులకీ తేడా ఏంటని అడిగితే 'కవిత్వం రాయటమే' అని మీరు నాటీగా జవాబు చెప్తారు. కానీ అదికాకుండా ఇంకా ఏవైనా కారణాలుంటాయా? ప్రలోభాలకీ, ఆకర్షణలకీ అతీతంగా ఉండగలగటమో, ఎక్కడికెళ్తే అక్కడ ఏదైనా వస్తువు దొంగతనం చెయ్యాలనో, స్వలింగ సంపర్కలుగా తయారవ్వటమో లేదంటే తరచూ ఆత్మహత్య చేసుకోవాలనే విపరీతవైఖరీ లాంటివాటికి కవులో, కవుల్లాంటివారో అతీతంతా ఉండాలా? సాధారణ వ్యక్తులు కవుల్నించీ ఏదైనా ప్రత్యేకత ఆశిస్తారా? అలాంటివేమీ ఉండాల్సిన అవసరంలేదనే అనిపిస్తుంది కొంతమంది కవుల్నీ, కవయిత్రుల జీవితాన్ని చదివితే. ఇరవై ఏళ్లకే 46 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఎలాగోలా బయటపడినా ముప్పై ఏళ్ళకి మళ్ళీ మరోసారి --జీవితంలో చివరిసారిగా-- ఆత్మహత్య చేసుకుని మరణించిన ప్రముఖ అమెరికన్ కవయిత్రి Sylvia Plath (1932–1963). Academic, Poet, Author, Editor. ఎవరూ, ఈమేనా ఇవన్నీ అని ఆశ్చర్యపోకండి. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకొన్నాళ్ళు బతికుంటే ఈ రోజు అమెరికన్ సాహిత్యంలొ మరెవ్వరీ రచనలూ చదివేవారు కాదు అంటారు. అక్టోబర్ 27, 1932 లో అమెరికాలోని మెసాచ్యుసెట్స్‌‌లో జన్మించిన సిల్వియా ప్లాత్ చిన్నప్ట్నుంచే రాసేది. ఆమె రచనలు వెనువెంటనే ప్రాచుర్యం పొంది పధ్ధెనిమిదేళ్లకే ఆమెకి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం స్కాలర్‌‌షిప్ లభించటంతో స్మిత్ కాలేజీలో విద్యాభ్యాసం కోసం వెళ్లాల్సివచ్చింది. అక్కడే ప్రముఖ ఆంగ్ల కవి Ted Hughes ని ప్రేమించి పెళ్లాడినా ఆమె వైవాహిక జీవితం పూర్తి ఒడిదుడుకులతోనే సాగి అర్ధాంతరంగానే ముగిసింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా విడాకులు తప్పలేదు. 1960 లో ఆమె తన మొదటి కవితాసంపుటి "The Colossus" ని ప్రచురించుకుంది. సిల్వియా ప్లాత్ తన సాహితీప్రస్థానంలో కేవలం ఒక్కటంటే ఒక్కటే నవల రాయటం జరిగింది "The Bell Jar" అన్న పేరుతో. ఆమెకి ఆ నవల అమితమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టింది. ఎప్పుడూ ఆత్మహత్యోన్ముఖురాలైన సిల్వియాకు భర్త టెడ్ హ్యూజస్ వివాహేతర సంబంధం ఆమెని మరోసారి కృంగదీసింది. విపరీతమైన డిప్రెషన్‌‌లో ఫిబ్రవరి 11, 1963 న ఇంట్లోని గ్యాస్ ఒవెన్ ని ఉపయోగించి మరీ హృదయవిదారక పధ్ధతిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది. **** ఆశ్చర్యంగా ఆమె భర్తే ఆమె రచనల్ని సేకరించి మరో సంపుటి " The Ariel" ని 1965 లో ప్రచురించాడు. మరణానంతరంగా 1982 లో ఆమె కవిత్వానికి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. సిల్వియా కేవలం ముప్పైఏళ్లకే తనువు చాలించినా ఆమె బ్రతికుండగానూ, మరణానంతరమూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఏకైక అమెరికన్ కవయిత్రి. చాలావరకూ ఆత్మకథ అనబడే ఆమె ఏకైక నవల "The Bell Jar" ఆమె మానసిక ఒత్తిళ్లలో రాసినదే. మరణం గురించీ, ఆత్మహత్య గురించిన ప్రస్తావన ఈమె కవితల్లో తరచుగా విన్పట్టం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఐతె కవితా వస్తువును ట్రీట్ చేసిన విధానం ఆమెని ముందువరుస కవయిత్రుల్లో నిలబెడుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరణం సిల్వియాకి ఓ స్వీయభావావరోధం (obsession). మరణాన్ని అన్ని రకాల కోణాల్లోంచి విశ్లేషించి, ధ్యానించి, పరిశీలించి మనకందిస్తుంది. బహుశా మరే ఇతర కవుల కవిత్వంలోనూ ఇంతగా ఒకే వస్తువుని ఆదరించిన దాఖలా కన్పడదు. ఆమె రాసిన కవితలన్నీ ప్రాచుర్యం పొందినవే. వాటిల్లో ఇదొకటి. ఈ కవితకి ముందు ఓ నోట్ లా ఇచ్చిన వివరణ ఆమెకి కవిత్వంపై ఉన్న మమకారాన్ని చెప్పకనే చెప్తుంది. All the Dead Dears by Sylvia Plath In the Archæological Museum in Cambridge is a stone coffin of the fourth century A.D. containing the skeletons of a woman, a mouse and a shrew. The ankle-bone of the woman has been slightly gnawed. Rigged poker -stiff on her back With a granite grin This antique museum-cased lady Lies, companioned by the gimcrack Relics of a mouse and a shrew That battened for a day on her ankle-bone. These three, unmasked now, bear Dry witness To the gross eating game We'd wink at if we didn't hear Stars grinding, crumb by crumb, Our own grist down to its bony face. How they grip us through think and thick, These barnacle dead! This lady here's no kin Of mine, yet kin she is: she'll suck Blood and whistle my narrow clean To prove it. As I think now of her hand, From the mercury-backed glass Mother, grandmother, greatgrandmother Reach hag hands to haul me in, And an image looms under the fishpond surface Where the daft father went down With orange duck-feet winnowing this hair --- All the long gone darlings: They Get back, though, soon, Soon: be it by wakes, weddings, Childbirths or a family barbecue: Any touch, taste, tang's Fit for those outlaws to ride home on, And to sanctuary: usurping the armchair Between tick And tack of the clock, until we go, Each skulled-and-crossboned Gulliver Riddled with ghosts, to lie Deadlocked with them, taking roots as cradles rock.

by Srinivas Vasudevfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hUr9PZ

Posted by Katta