పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, జూన్ 2014, బుధవారం

Girija Nookala కవిత

ఎల్ నినొ వేగం వేగం సౌఖ్యం,సౌఖ్యం కాలం తోనే పరుగు పందెం భూమి మీద చక్రం తిప్పాం ఇక అంతరీక్ష పయనం వంట నేర్చిన మొదలు పొగలు నాంది నుండి నేటి వరుకు శెగలు రగిలె కాలుష్య కుంపటి గోళం మీద రక్షణ కవచం పొరలకు సైతం పొడిచెను తూట్లు పర్యవసానం,పర్యావర్ణం,పసికట్టని తెలివి మంచు కొండలు ఆవిరి చేసి భూమిని భగభగ చేసిన వైనం భూమి,నీరు,ఆకాశం జలం అంతా స్వయం క్రుత కాలుష్య మయం ఉన్నది ఒకటే జీవిత నావ ఉన్నది ఒకటే భూగోళ వాసం కాలుష్య కొలిమిలో,రగల్చిన నిప్పులో సుఖాసనం వేయాలనే ఓ మనిషీ నువ్వు యోగివా?మూర్ఖ భోగివా? 18/6/2014

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lzQErO

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //అనేకాంతం// ఎక్కడ బయల్దేరావో అక్కడికే చేరుకునే భూమ్మీద ఎంత దూరం వెల్లగలం నువ్వైనా,నేనైనా, మనం కనే ఒక కలైనా గరిమ నాభి చూట్టూ. వలయాలు గా చుట్టుకునే కాలమైనా... మనచేతినుంచి జారిపడిపోయిన ఒకానొక యవ్వనపు చిరునవ్వు ఏ పుస్తకపు పుటలమధ్యనో గులాబీ రేకలా దాచిపెట్టబడే ఉండవచ్చు వేరెవరో తమ మొహం పై అతికించుకొని నిన్నూ స్వప్నించవచ్చు అనుకుంటూ ఒక్కడిగా ఉంటూనే అనేకులు గా మారిపోతూంటాం మెల్ల మెల్లగా పక్కకు ప్రవహిస్తూ మనిషులనుంచి కాస్త దూరం జరుగుతానా పరుగెత్తుకు వచ్చి నాలోకి లోలోపలికి దూకి మునుగీత వేస్తాడొకడు అట్టడుగుకి జారిపోయిన గుండెని స్పృశించి కాస్త రక్తాన్ని నింపుతాడు నిశ్శబ్ద ఉద్యానవనపు బెంచీ లానో ఒంటరి రైల్వే ఫ్లాట్ఫారమ్మీది సిమెంటు చెప్టాలానో కూర్చున్న నన్ను అచ్చంగా నాలానేఉన్న మరొకడు నిలువెల్లా కావలించుకొని వాడి కళ్ళలోంచి వొలికే కాస్త నిద్రని నాకూ పంచుతాడు..... ఊక్కొక్క అడుగుగా ప్రయాణాలని పేర్చుకుంటూ సమూహాలుగా సాగుతూ వెలుతున్న వాళ్ళు తమ స్వరాల దీపాలని మార్మిక గీతాలుగా గాలితెమ్మెరలకు వేళ్ళాడదీసి నిన్నూ నన్నూ తమ సంతకాలుగా మరికొందరి హృదయాలపై ముద్రించి వెళ్ళిపొయారు... ఇంక ఒంటరిగా ఎలా ఉండగలం నువ్వైనా నేనైనా మనం ఉండగా ఆ మందిరపు మూడవ మెట్టు మీది బిచ్చగాడైనా.. 18/06/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pieTe2

Posted by Katta

Panasakarla Prakash కవిత

"కొన్ని అబద్ధాలు‍‍‍‍‍‍ ఒక నిజ౦" గాలి కల్తీ అయ్యాకా.... శ్వాస అబద్ధ౦.. నేల కల్తీ అయ్యాకా... నడక అబద్ధ౦.. ఆహార౦ కల్తీ అయ్యాకా.. ఆహార్య౦ అబద్ధ౦.. ప్రకృతి కల్తీ అయ్యాకా... ప్రప౦చ౦ అబద్ధ౦ ఆన౦ద౦ కల్తీ అయ్యాకా.. అ౦ద౦ అబద్ధ౦.. మానవత్వ౦ కల్తీ అయ్యాకా... మనిషి అబద్ధ౦... నిత్య౦ అబద్ధాల మీదే.. జీవిత౦ పరుగు... పరుగు పతన౦ వైపే... గమ్య౦ అబద్ధ౦.. పనసకర్ల‌ 18/06/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pi7fQV

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

విరుపు __________________________ నీ కాళ్లక్కడే ఉంటాయి నువ్వుమాత్రం కళ్లతో సూర్యుని పైకి ఉమ్మేయి నువ్వేదో బురదలో పొర్లావని జనం వాళ్లను వాళ్లువిడిచిరారు నిద్రను నటించవచ్చు నిప్పులా మెరవనూ వచ్చు నిన్నునువ్వు దాటుకుని అలా నటించలేవు నాకు తెలుసే పంచుతున్నానని చెప్పే బూంది పొట్లంకోసం నువ్వెతుక్కో బతుక్కి అర్థంకోసం నేను నాలోకంలోంచి మాట్లాడతా

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lDKdOy

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // (స)జీవ నది....// ఒక నిశబ్దం ప్రవహిస్తూనే ఉంటుంది ఆ నదిలో రంగులు మార్చే వానతో నిండుతూనే ఉంటుంది కొన్ని సార్లు నిండుకున్నా ఆనవాళ్ళు ఎర్రటి చారికలై కనిపిస్తాయి దానికి సముద్రం తో పనిలేదు నిండుకుండలా జీవాన్ని నింపుతూ వెచ్చగా పారుతూనే ఉంటుంది నువ్వు దాటి వెళ్ళు నీ పడవతో దానికి తెలిసిందల్లా ప్రవహించడమే నెమ్మదిగా ,దూకుడుగా, భారంగా, బింకంగా , గుట్టుగా, స్తబ్దంగా ….. ఇక నేను చూస్తూ ఉంటా అది ఎప్పుడైనా గుండెలు పగిలేలా ప్రవహిస్తదేమో అని…. Date: 18/06/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oGiWmz

Posted by Katta

Abd Wahed కవిత

మీర్ తకీ మీర్ రాసిన ’’అష్క్ ఆంఖోం మేం కబ్ నహీ అతా... లహూ అతా హై జబ్ నహీ అతా‘‘ గజల్ ను ఆధారంగా చేసుకుని రాసింది. ఇది అనువాదమూ కాదు, అనుసృజనా కాదు. కన్నీళ్ళకు కంటిలోన కరువన్నది లేనె లేదు వాటిలోన మననెత్తుటి జాడన్నది లేనెలేదు తెలివి నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు ఏనాడూ అందుకనే గుండెగదిలొ వెలుగన్నది లేనెలేదు మనసుతోటి జ్ఙాపకాల ముచ్చట్లే బాగు బాగు వాస్తవాల ఎండల్లో నీడన్నది లేనెలేదు హృదయానికి ఆశలన్ని వీడ్కోలును చెప్పాయా కనుపాపల ఎడారిలో తేమన్నది లేనె లేదు ప్రేమంటే ధైర్యానికి మారుపేరు తెలుసుగాని ఒక్కసారి నోరిప్పే తెగువన్నది లేనెలేదు చూపుల్లో నాటుకున్న పలుకులెన్ని ఉన్నాయో పెదాలపై ఒక్కమాట మొలకన్నది లేనెలేదు దూరాలను దియా మనం గౌరవంగ చూడాలీ సభ్యతయే లేకుంటే ప్రేమన్నది లేనె లేదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdtsyS

Posted by Katta

Abd Wahed కవిత

మీర్ తకీ మీర్ రాసిన ’’అష్క్ ఆంఖోం మేం కబ్ నహీ అతా... లహూ అతా హై జబ్ నహీ అతా‘‘ గజల్ ను ఆధారంగా చేసుకుని రాసింది. ఇది అనువాదమూ కాదు, అనుసృజనా కాదు. కన్నీళ్ళకు కంటిలోన కరువన్నది లేనె లేదు వాటిలోన మననెత్తుటి జాడన్నది లేనెలేదు తెలివి నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు ఏనాడూ అందుకనే గుండెగదిలొ వెలుగన్నది లేనెలేదు మనసుతోటి జ్ఙాపకాల ముచ్చట్లే బాగు బాగు వాస్తవాల ఎండల్లో నీడన్నది లేనెలేదు హృదయానికి ఆశలన్ని వీడ్కోలును చెప్పాయా కనుపాపల ఎడారిలో తేమన్నది లేనె లేదు ప్రేమంటే ధైర్యానికి మారుపేరు తెలుసుగాని ఒక్కసారి నోరిప్పే తెగువన్నది లేనెలేదు చూపుల్లో నాటుకున్న పలుకులెన్ని ఉన్నాయో పెదాలపై ఒక్కమాట మొలకన్నది లేనెలేదు దూరాలను దియా మనం గౌరవంగ చూడాలీ సభ్యతయే లేకుంటే ప్రేమన్నది లేనె లేదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdtsiq

Posted by Katta

Sidhartha Dornadula కవిత



by Sidhartha Dornadula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lUMSIi

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pfTFeR

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

అనింద్యాష్టకం రావెల పురుషోత్తమ రావు ************************************************************** అమ్మలంతా అప్పుడు మంచిపనే చేసినట్లనిపిస్తుందిప్పుడు నాన్నల మాటలను ఎగర్తించి మరీ మమ్మల్ను కన్నది. అందుకే అందరం ఇలా పతాక శీర్షికలలో నిలిచేలా ప్రతిభను కనబరిచి అమ్మల ఋణం తీర్చుకున్నాం. పోటీ పరీక్షల్లో నెగ్గి కొందరం అఖిల భారతంలో ఖ్యాతినార్జిస్తే మరికొందరం మంచు మల నధిరోహించి మన ద్జేశ పతాకను శిఖరాగ్రంపై రెపరెపలాడేలా నిరంతర కృషితో నెగ్గుకొచ్చి దేదీప్యమానంగా వెలిగాం. ప్రతిభకు లింగబేధమంటూ ఉండదని ప్రత్యేకంగా నిరూపించాం. అమ్మలూ ఇకనైనా ఆడపిల్లలని వినగానే భ్రూణ హత్యలకు పాల్పడకండి. కొడుకులతోపోటీ గా ప్రతిభా వ్యుత్పత్తులతో నెగ్గు కొస్తున్నాం . ఆడపిల్లలంటే ఐశ్వర్యంతో కూడిన యశోమూర్తులైన సిరిసంపదలని మరీ రుజువు చేస్తున్నాం గమనించండి మాగమ్యానికి అడ్డుగా నిలువకండి. అమ్మలూ నాన్నలూ అదే పదివేలని గ్రహించండి. మమ్మల్ను యశొ మూర్తులుగా శతమానం భవతీ అని మనః పూర్వకంగా ఆశీర్వదించండి.!!! ***********************************************************************************

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ikRRT8

Posted by Katta

Ramesh Ragula కవిత



by Ramesh Ragula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oFDqff

Posted by Katta

Tirunagari Laxmana Swamy కవిత

మన మిచ్చిన చిన్నదైనా జీవితాంతం గుర్తుంటుంది ఇతరు లిచ్చినది ఘనమైనా మనసునుండి పోతుంది

by Tirunagari Laxmana Swamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lyUmSz

Posted by Katta

Kurella Swamy కవిత

కూరెళ్ళ స్వామి // సాయంత్రపు ఉదయం // నేనస్తమిస్తూ ఉంటాను నన్ను నేను ఉదయించుకునేందుకు వర్షాకాలం మబ్బుల వెనక కనిపించకుండా పారిపోయి పశ్చిమాన వాలిపోయిన సూర్యునిలా నా జీవిత ప్రయాణంలో నేను అదృశ్యమయ్యి మరెవరి ప్రయాణాన్నో కొనసాగిస్తూ ప్రియురాలి/ప్రియుని కి రాసిన ప్రేమలేఖకు ప్రేమలేక తను ఇవ్వని సమాధానాన్ని, మౌనాన్ని అంగీకారమనుకొని భ్రమల్లో తెలియాడి నిజం తెలిశాక రాలిన కన్నీటి చుక్కలా ప్రేమించడానికి, ప్రేమపొందడానికి మధ్యన ఉన్న సన్నని గీతను గుర్తించకుండా "అస్తమించడమే ఉంది ఇందులో మరి ఉదయించడమేది ?" అని అడుగుతావేమో మిగిలిన కొన్ని క్షణాలు హక్కుల కోసం కొట్లాడి అలసి పగిలిన ఏవో కొన్ని హృదయాలు సలిపే పోరాటంలో నా వంతుగా భాగమవుతాను ఇంకేమైనా ఒకటీ అరా క్షణం కొసరుగా దొరికితే నన్ను నన్నుగా గుర్తించేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ప్రచారం చేస్తూ వాటి సాధనోధ్యమంలో భాగస్వామినవుతాను నన్ను నేను మోసం చేసుకుంటూ ఉంటాను ఇతరులను మోసం చేయలేక నేనెవరని పదే పదే నీవూ , నేను వేసిన ప్రశ్నలకు సమాధానాల శోధనలో జరిగిన ఒక్కో ఘట్టం ఒక జ్ఞాపకమై వెంట వస్తుంటే నిన్నూ , జ్ఞాపకాలను మర్చిపోయినట్టు నటిస్తూ పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచం నా సొంతమై నేనేదో ఒక రాజ్యానికి నిరంకుశ ప్రభువునయ్యాననే భ్రమలో అధికారపు అహంకారం లో మమకారాలను మర్చిపోయి ప్రజను కూడా నేనే అనే సంగతిని మర్చిపోయి "నిన్ను నీవు పోగడుకుంటూ అధికార దాహాన్ని తీర్చుకుంటూ ఇతరులపై ప్రేమను ఒలకబోస్తున్నట్టు నటిస్తున్నావేం తమాషాగా ఉందా ? " అని కోప్పడతావేమో ఇంత సువిశాల ప్రపంచంలో ఇతరులెవరు ? అందరూ నేనే అంతటా నేనే నీవూ, నేను అందరం నేనే నన్ను నేను మోసం చేసుకోలేకే నన్ను నేను మోసం చేసుకుంటున్నానన్నమాట నన్ను నేను హత్యించుకుంటాను బానిస సంకెళ్ళతో మనిషిగా పుట్టడం నేరమని తెలిశాక సృష్టిధర్మం అనే ఒక పదబంధాన్ని సృష్టించుకుని పైవారికి కిందివారు బానిసలనే ఒక స్మృతిని రాసుకుని సృష్టిలోని ప్రతి సౌందర్యాన్ని నా బానిసత్వంతోనే స్పృశించుకుంటూ వేల సంవత్సరాల చరిత్రను మాటల్లో చెప్పలేని అణచివేతను ఇంకా మోస్తున్నందుకు ఇంకా సంకెళ్ళను తెంపుకోనందుకు మనిషితనాన్ని బ్రతికించట్లేనందుకు "మరణిస్తావు, చంపుకుంటావు సరే ఆత్మహత్య మహా పాతకం తెలుసా ? నువ్వు సభ్యసమాజం ముందు దోషిగా నిలబడాలి ఎరుకేనా ? " అని ఎదురు ప్రశ్నిస్తావేమో నేనంటే శరీరమనే ఎందుకనుకుంటున్నావ్ ? ప్రాణాన్ని తీస్తేనే పాపం ,శిక్ష నేనంటే నా అహం నా బానిసత్వం నా అజ్ఞానం నాలోని అవివేకం........ - Kurella Swamy (18/06/2014)

by Kurella Swamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lTWi73

Posted by Katta

Arcube Kavi కవిత

యాత్ర ___________________ఆర్క్యూబ్ మొన్న నీ కళ్ళల్లో నువ్వొక దుక్కం నిన్న నీ కళ్ళల్లో మా కన్నీళ్ళు ఇవ్వాల్టి నీ కళ్ళల్లో ఎంతో దయ ఇది నిజం మొన్న మనం కలిసామా అప్పుడు- అన్ని దారులు మూసుకుపోయినై అన్నవు నిన్న ఇట్లనే కలిసినమా అప్పుడు- "ఒక నిర్మాణం -తలమునకలైన ఎంతో మంది "ని చూసానని చెప్పినవు ఇవ్వాల- నీ చేతులు ఎంత సౌందర్యంగా మెరుస్తున్నయో .. నా కళ్ళు చెప్తున్నయి పద పద- నువ్వటు నేనిటు మన కలల్ని ఆ చివరా వెలిగించాలి

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r6CkpP

Posted by Katta

Si Ra కవిత

Si Ra// ఫోన్ కాల్ // 18-6-14 ఎలా ఉన్నావ్? నేనా, నాకేం, బాగనే ఉన్నా. నన్ను గుర్తుపట్టవ్ అనుకున్నా మన ఇద్దరి మధ్యలో ఎన్నో దూరాలు వొచ్చి అగాధాల విత్తనాలు నాటాయి గా. అది కాదు కానీ, ఈ మధ్య వర్షాలు కురవట్లేదు ఏంటి? కొంచమన్నా తడిస్తే బాధలు కరిగిపోతాయని ఆకాషాన్ని చూస్తూ రోజులు రోజులు గడిపేస్తున్నా. అవును పక్షులన్నీ ఎక్కడికి వెల్లిపోయాయ్, మనల్నందరినీ నిర్మానుషంలో వదిలిపెట్టి, నీకేమన్న చెప్పాయా? మర్చిపొయా, నిశబ్ధం నన్ను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు ఈ మధ్య, ఆలోచనలు నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉన్నాయ్, అదేంటో, ఎక్కడో నా గదిలోనేను కూర్చొని ఉన్నా, సముద్రపు ఘోష వినిపిస్తోంది. చాలా భారంగా కదులుతోంది సమయం ఇంటి వెనకాల నాటిన పూలచెట్టు, తన పూలనన్నిటినీ రాల్చేసి ఇంక నాకు ఈ లోకంతో సంబంధం లేదు, ఇంక ఏ పువ్వునీ నా పై మొలచనివ్వనూ అని, మొండి చేస్తోంది. అయినా నాకు ఏదో ఒకటి ఎప్పుడూ ఉంటుంది లే నువ్వు ఫోన్ చేసిన సమయంలో కుడా, ఈ బాధల గురించి ఎందుకు, వేరే విషయాల గురించి మాట్లడదాం. అవునూ, ఈ మధ్య బాగ కలలు కంటున్నావ్ అంట గా నువ్వు, కిటికీ పక్కన కూర్చొని కవిత్వం రాస్తున్నావ్ అంట, ఇంకా, సాయంత్రాలు ఒంటరిగా సూర్యుడు అస్థమించే చోటుకు నడుచుకుంటూ వెల్లిపోతున్నావ్ అంట, బాగా నవ్వుతున్నావ్ అంట, అప్పుడప్పుడు తెలియకుండానే ఏడుస్తున్నావ్ అంట, నీలోనువ్వే మాట్లాడుకుంటూ ఉంటావ్ అంట, వర్షాకాలంలో, రాత్రులు ఒంటరిగా కూర్చొని వర్షాన్ని వింటూ ఉంటావ్ అంట, నాకు అన్నీ తెలుసు నీగురించి, నీ వైపు నుండి వస్తున్న గాలులు, నీ గురించి రహస్యాలు నాకు ఎప్పుడూ చెప్తుంటాయి. సరెలే, ఇంక సెలవు, నేను వెల్లాలి నీ సమయాన్ని నేను వృధా చెయ్యలేను వాస్తవంలో కలుసుకున్నప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం.

by Si Ra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ST1sUX

Posted by Katta

Satish Chandar కవిత

http://ift.tt/1ijV5q0

by Satish Chandar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ijV5q0

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి విముక్తి ఆ జ్ఞాపకాల్ని పారబోసిందీ నేనే... ఆ స్వప్నాల్ని పోగుచేసిందీ నేనే.... ఇప్పుడు నేను జీవితం అంచుపై నిలబడి ఉన్నాను స్వప్నావస్థలో లోయలోకి పడిపోయే స్థితిలో పడితే ఇక పైకి లేవలేని పరిస్థితిలో నేను! అయితే నాకు తెలియకుండా నాలో దాగి ఉన్న ఆచరణీయ జ్ఞాపకాలు నా అంతరంగంలో పక్షుల్లా విహరిస్తూ నన్ను విడిపిస్తూ... వాటి రెక్కల విన్యాసం నన్ను మురిపిస్తుంటే వాటి గమనశక్తి నా హృదయంలోకి ప్రవహిస్తూ ఉంటే..... నన్ను తమ సంకెళ్లలో బంధించిన స్వప్నాల నుండి నన్ను విముక్తిడిని చేస్తుంటే..... వాస్తవంలో కళ్ళు తెరుస్తూ జీవితాన్ని కళ్ళల్లో పెట్టుకుని మరణాన్ని చేతితో పట్టుకుని భవిష్యత్తులోకి పయనిస్తూ నేను! 18జూన్2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5ZwEI

Posted by Katta

Jagadish Yamijala కవిత

నమ్మకం… డియర్… మొన్నామధ్య మనం కలుసుకున్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. వాటిలో కొన్నింటితో మనం ఒకరికొకరం వాదించుకున్నాం. ఒక నిర్ణయానికి రాలేకపోయాం. నమ్మకం విషయానికి వస్తాను…. మా అబ్బాయో అమ్మాయో మంచి వాళ్ళే అని మనం నమ్మితే ఏ విధమైన గొడవా ఉండదు. అలాకాకుండా అబ్బాయో అమ్మాయో చెడుగా ఉన్నారేమో …ఎవరు చెప్పగలరు….ఒకవేళ నిజంగానే చెడు సహవాసాలు చెడు తిరుగుళ్ళు ఉంటే వాటి ఫలితాలను వాళ్ళు అనుభవించేతీరుతారు. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. భార్య ఉత్తమురాలు…ధర్మపత్ని …అని నమ్మితే నీ వరకు నీకు ప్రేమ జీవితం సుఖమయమే. అలా కాకుండా ఆమెది తప్పుడు నడవడిక అయితే అందుకు తగు శిక్ష తానే అనుభవిస్తుంది. ఇందులో సందేహం లేదు. పనిమనిషినీ నమ్మేతీరాలి. ఒకవేళ ఆ నమ్మకానికి ద్రోహం చేస్తే అతనిని తప్పించాలి. అందుకోసం ఎవరినిపడితే వారిని అపనమ్మకంతో చూస్తే జీవితం తెల్లారినట్టే. నమ్మకంతో మనమనుకున్న గుడికో లేక పవిత్ర స్థలానికో వెళ్ళాలి. నమ్మిన వాళ్ళు చెడింది లేదు అనే నానుడిని గుర్తుంచుకో. వాస్కోడాగామా నమ్మకం కొత్త ప్రాంతాన్ని కనిపెట్టింది. కొలంబస్ నమ్మకం అతని మాతృ దేశానికి ఒక కొత్త ప్రాంతాన్ని ఇచ్చింది. ఆయుధాలు లేని చర్చిల్ నమ్మకం రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ కి విజయాన్ని అందించింది. సముద్రంలో మునిగిపోయి కొన్ని రోజులపాటు ఒక వ్యక్తి ఈదుతూ చివరికి ఒక నౌక సహాయంతో ఒడ్డుకు చేరేడన్న వార్త ఓ పత్రికలో చదివాను. నమ్మకమనేది లేకుండా ఉంటే అతను ఎప్పుడో శవమై పోయేవాడు. ప్రహ్లాదుడి నమ్మకం అతనికి దేవుడిని చూపెట్టింది. కృష్ణుడి నమ్మకం భారత యుద్ధంలో విజయాన్ని అందించింది. ఒక మనిషి చదువుతో మాత్రమే ఎదిగిపోలేడు. నమ్మకం కూడా తోడవ్వాలి. నాకు వ్యక్తిగతంగా తెలియదు కానీ ఒక మహాకవిని చూసాను. ఆయన ఒక చోట రాసుకున్నారిలా…. “అప్పుడు నాకు పదునాలుగేళ్ళు. కవితలు రాయాలని కొండంత ఆశ. ఒక రోజు తెల్లవారుజామున నిద్ర లేచి నాలుగు వాక్యాలు రాసాను…వీణానాదం ఇంకా వెలుగెక్కకముందే వినిపించింది….గానామృతం వినసొంపు….నిద్రలోనుంచి ఎగిరి గంతేసాను…. పక్క మీద నుంచే సేవించాను అమృతం…” ఈ నాలుగు మాటలు రాసిన తర్వాత ఇంకా ఏం రాయాలో తెలియలేదు. పదిహేడో ఏట ఒక కవితను పూర్తిగా రాసాను. ఆ వయస్సులో ఒక పత్రికలో పనిచేసాను. ” ఒక మిత్రుడు ఎంత డబ్బైనా ఒకడికిచ్చి దాచమంటాడు….అది అతని నమ్మకం….అతను దానిని జాగర్త చేస్తాడని మిత్రుడి నమ్మకం. నమ్మకద్రోహం చేసే వ్యక్తి కచ్చితంగా పెను శిక్షే పొందుతాడు. ఇందులో అనుమానం లేదు. కొందరు కొందరి దగ్గర మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఆ డబ్బును సక్రమంగా ఖర్చు చెయ్యరు. అది వాళ్ళు చేసిన ద్రోహానికి దండన. దేశాన్ని నమ్ము….దైవాన్ని నమ్ము….ప్రపంచం నిన్ను కొనియాడుతుంది. “ఫలానాది నేను చెయ్యగలను…నాకది సాధ్యమే….అని నమ్ము…కచ్చితంగా నువ్వనుకున్నది జరుగుతుంది” మనోధైర్యం, వైరాగ్యం నమ్మకానికి బిడ్డలు. ఒక రంగంలో స్థిర చిత్తంతో ఉండి అంకితభావంతో నమ్మకంతో శ్రమిస్తే కృషిచేస్తే నీకక్కడ అనుకున్న స్థాయికి పేరూ ప్రఖ్యాతులూ లభిస్తాయి. సముద్రాన్ని దాటడానికి పడవ ఇచ్చింది ఎవడో…ఆ పడవతో మరో తీరం చేరగలనని మరొకడి నమ్మకం…. వీటిలో ఉన్నతమైనది దైవ నమ్మకం. దైవనమ్మకం ప్రశాంతత ఇస్తుంది. న్యాయంగా నడవనిస్తుంది. వైద్యుడిపై నమ్మకం ఉంచితే మందుల అవసరం లేకుండానే సగం జబ్బు నయమవుతుంది… నమ్మకం కలిగిన వ్యక్తే వేదాంతి అయ్యాడు. శాస్త్రవేత్త అయ్యాడు. నమ్మకం లేని వ్యక్తికి సుఖం అంతంత మాత్రమే… ఆయుష్షు తక్కువే…. నీటిని పాలు అని నమ్మితే అది పాలే. వేపాకు తీపే అని నమ్మితే అది తీయగానే ఉంటుంది. నమ్మకానికి ఎంతో అవసరమైనది మనసు. అది ఎక్కడో లేదు. మనదగ్గరే ఉంది….అందుకోసం నువ్వు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర లేదు….. ఏమంటావు మిత్రమా…మరీ ఎక్కవ చెప్పానంటావా…సరేలే ఇక్కడితో ఈ ఉత్తరం చాలిస్తున్నా…. ఇది చదివి నువ్వు నన్ను కలుస్తావనే నమ్మకంతో నీ జగదీశ్ యామిజాల 18.6.2014

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5ZtJh

Posted by Katta

Ravi Indra కవిత



by Ravi Indra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5UgkA

Posted by Katta

Maheswari Goldy కవిత

మహేశ్వరి గోల్డి || మౌ న యు ద్ధం || చెకుముకి చెకుందపు రేణువులను రాలుపూలతో కప్పడమూ !! సముద్రాన్ని సమాధి చేసి రత్నాలను ఒడిసి పట్టడమూ !! అను సాధనలో ఎర్రటి తివాచి పై బాసింపట్టు వేసుకుని యజ్ణం చేస్తూ అలసి అలసి నిట్టూర్చిన కలల కూర్పుల కాంక్షల అచేతనా స్థితిని నీవెపుడయినా గమనించావా ...?? కాలంతో పోరాడే ఓ మహాకలానికై చేస్తున్న కాంతియజ్ణంలో తిమిరపు చక్రవాకాల ఉనికిని అంటిపెట్టుకుని పరిభ్రమిస్తున్న పచ్చి ఊహలు బహుశా వాటిని దర్శించాలి అనుకోవడంలేదేమో !! తరచి తరచి అంధుకే చెపుతున్నా .....!! కాలపు అలల అలికిడిలో ఏ వసంతమో మౌనంగా నీ దరి చేర్చిన మట్టిలో మాణిక్యాల విలువను కూడా తరచూ గ్రహిస్తూ ఉండాలని ----- లేదంటే కలానికి - కాలానికి ప్రతినిత్యమూ మౌనయుద్ధమే ....... @ మహేశ్వరి గోల్డి 18/06/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pf6dDj

Posted by Katta

Sharada Sivapurapu కవిత

కవిత sometimes entertain చెయ్యాలంటే , సరదాగా రాశిన కవిత. Just for the sake of entertainment:entertainment:entertainment. వంటింట్లో వండిన కవిత // శారద శివపురపు ఆలోచనలన్నీ పాదరసంలా శుభ్రంగా కడిగి కష్టాల అనుభవాలను కషాయంలా వడగట్టీ ఊహల సరుకులకు కా స్తంతుప్పూ కారం పట్టీంచి కొ త్త కొ త్త భావాల మసాలాలు గట్టిగా దట్టీంచి కళ్ళనీరు కారుతున్నా, గూఢార్ధపు ఉల్లిపొరలూడదీసి ఉప్పునీటితో సహా నవరసాల రంగులనీ రంగరించి చక్కటి, చిక్కటి వంటకం, నిష్టగా, చెయ్యాలని తపనపడి, ఏరిపారే స్తారని తెలిసినా, కర్వేపాకులాంటి నిజాల్ని వేసి, కొన్నబద్ధంలాంటి కొ త్తిమీర అలంకరణలు కూడా చేసి, అరోగ్యానికి చేటయి నైటమనే నూనె తిన్నగా పోసేసి, ఆర్భాటపు మలా య్తో ఆకర్షణీయంగా అలంకరి స్తే, కుతకుతా ఉడుకుతూన్న వంటకం చూసి కొందరిలా అన్నారండీ.... ఎబ్బే....ఇదేం వంటకం? లొల్లాయి పదాల డొల్ల శబ్దమొ స్తోందే? ఎంత సేపూ మనసుని మండించే ర క్తాక్షరాల రంగులేనా కా స్త నైవేద్యానికి పనికొచ్చే కాషాయం రంగే మైనా వేస్తావా? నచ్చో, నచ్చకో, ఇప్పటికే చాల తినేసాను, ఖాళీ లేదు, ఆకలి వేసి, వేసి ఇప్పుడు, చచ్చిపోయంది ఇప్పుడు తినలేను, సారీ, శ్రీ శ్రీ బ్రాండ్ ఆల్కహాలు, రాగా తాగా, ఇలాంటివేమెక్కుతాయీ? ఎప్పుడూ నిజాలు, నిప్పులూ అంటూ ఎర్రెర్రగా కాల్చటమేనా, దోరప్రేమకి, శృంగారాన్ని జతచేసి మృదువుగా వేయించటంలేదా? వంటకమొకటే చాలా? అది enjoyచెయ్యాలంటే ambience ఏదీ? వెన్నెల, వెన్నెల్లో ఆడుకునే వెన్నముద్దల్లాంటి అమ్మాయిలూ కావాలోయ్ ఇలా, చెప్పాలంటే, ఇంకా చాలా చాలా అన్నారు సుమండీ.! ఇదండీ, కాగితాల పళ్ళెంలో నే కుమ్మరించిన అక్షరాల సమాహారం ఆరగించి చె ప్తారా....? తినిడానికెలాఉందో, ఎందుకంటే అధ్బుతహ: అని తింటేనేగా మరిన్ని వండటానికి ప్రోత్సాహం? అలా అని ఏ దైనా, తక్కువ, ఎక్కువ లైతే చెప్పడం మానకండేం. 18/06/2014

by Sharada Sivapurapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pHLBHj

Posted by Katta

Nanda Kishore కవిత

అనుకోకుండా 32 పడిలేచిన కెరటం పాదాల్ని కడుగుతుంది. హోరెత్తిన కెరటం చేతుల్ని కలుపుతుంది. సముద్రం పిలుస్తుంది. వెన్నెలస్నేహితా! నిజం. సముద్రం పిలిచినట్టు ఎవ్వరూ పిలవరు. సముద్రం మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడరు.సముద్రపు హోరు అనంతం. వెన్నెలస్నేహితా! ఉన్నంతసేపు ఊపిరి నిలవదు. అయినా సరే. అక్కడే ఉంటాం.అలల్ని తడుపుకుంటూ అక్కడక్కడే సంచరిస్తాం. అక్కడే- భూమికి చివర నిలుచుని, తడితాకని కన్నులకింద ఆకాశాన్ని అదిమిపెడతాం. వెన్నెలస్నేహితా! ఆడుగులు చెరిగిపోతాయ్. ఆడుకున్న పిల్లలందరూ ఒక్కో దిక్కుకి చెదిరిపోతారు. ఇసుక మెరవదు. సూర్యుడు నవ్వీ నవ్వీ అలసిపోతాడు. ఒకానొక కల్లోలం తర్వాత- జంటగా కూర్చున్న మనుషులందరూ ఒకరిలోకి ఒకరు తప్పిపోయినా- సముద్రం తప్పిపోదు. సముద్రం సమస్తమై మనల్ని తప్పిపోనివ్వదు. వెన్నెలస్నేహితా! తీరం దాటి వెళ్ళిపోతాం. సుదూరతీరంలో దాహంతీరే చోటు ఒకటి తప్పక ఉంటదనే పిచ్చి నమ్మకంతో- ఎంతదూరమైనా కదిలిపోతాం. వెన్నెలస్నేహితా! అలలు చెలరేగడం ఆగదు. ఎంత వేడుకున్నా, సముద్రపుగాలి మన ఊపిరిలోచేరి కొట్లాడటం ఆపదు. 18-06-14

by Nanda Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1neDEmU

Posted by Katta

Maddali Srinivas కవిత

కధ కంచికి//శ్రీనివాస్//18/6/2014 ---------------------------------------------------------- తిరిగొచ్చిన కధలన్నీ రచ్చబండ మీద వాలిన పావురాలకి గింజలయ్యాయి అచ్చొత్తించుకోని యెగిరొచ్చిన కధలన్నీ సభల్లో విహరించే పెద్ద గద్దలకి పిడికెడు మెతుకులయ్యాయి పాత సారా కొత్త సీసా లోకి గమ్మత్తుగా నిండిపోయింది పెద్ద బేధమేమీ లేదు వోడినా,గెలిచినా, అన్ని కధలూ యెక్కడెక్కడ శాఖా సంక్రమణం చేసినా, చివరికి చేరాల్సింది కంచికే వాల్మీకి రాస్తే గొప్పేముంది? బోయ భీమన్న రాస్తే తక్కువేముంది? అన్ని కధల్లోనూ అంతే మంచే గెలుస్తుంది చెడు చెడిపోతుంది మనిషి బ్రతుకు కధలో అదే జరిగితే వింతేముంది? అందులో కధేముంది? అందుకే నాయనా! తిరిగొచ్చిన నీ కధలను చించెయ్యకు అందులో కొన్ని ఆస్కార్ కొట్టే సినిమాలు కావచ్చు లేదా నోబుల్ కొట్టేసే సాహిత్యం కావచ్చు కనీసం మామూలు మనిషి గుండెల్లో చెమ్మనూరించే కన్నీటి చెలమ కావచ్చు!

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSzqEV

Posted by Katta

Bandla Madhava Rao కవిత

మీడియా చేస్తున్న దుర్మార్గాల్ని తప్పకుండా ఖండించాల్సిందే. అందులో ఉపయోగించే భాష, ప్రతిబింబంచే సంస్కృతి వీటన్నింటి గురించి నా మటుకు నాకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. నిజానికి తెలుగు వాళ్లు చేసే భాషా పరిరక్షణ ఉద్యమాలన్నీ కేవలం టివి చానళ్ల కార్యాలయాలముందు చేయాలనేది నా వాదన. పానుగంటి వారి సాక్షి వ్యాసాలలోని వ్యంగ్యం తన రూపాన్ని పోగొట్టుకొని కించపరచడమో అవమానించడమో వ్యంగ్యమై పోయింది ఇవాళ. ఇందుకు ప్రసార మాధ్యమాల వారు ఎవరూ మినహాయింపు కాదు.పత్రికా స్వేచ్చ దుర్వినియోగమవుతుందనడం లో ఎటువంటి సందేహం లేదు. అయితే అదే సమయం లో ప్రభుత్వాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిమీద చట్టపరమైన లేదా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించాలి గాని నిషేధం ఎంతమాత్రం సబబు కాదు. మీడియా మీద నేను రాసిన కవిత ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైనది ఇక్కడ మళ్లి పోష్ట్ చేస్తున్నాను. నా దేశపు నాలుగో స్తంభం గుండె చేతబట్టుకొని అత్యంత ఉత్కంఠతో ప్రాణాలుగ్గబట్టుకొని ఒకానొక అంతర్యుద్ధాన్ని కళ్లారా వీక్షిస్తున్నాను * * * * వ్యాఖ్యలొద్దు ఊహాగానాలూ వద్దు మాటల్ని నిలువునా చీల్చి చెప్పే వాటి వెనుక మర్మాల్ని ఎవరూ బట్ట బయలు చెయ్యనవసరం లేదు వక్రోక్తులూ వ్యంగ్యోక్తులూ అలంకారాలేమో కాని నీకు నా జీవితమే వ్యంగ్యమైపోయింది సమాజం మెరుగవ్వడం కోసం నువ్వు కూల్చే వాస్తవాల గోడల మధ్య నిప్పులాంటి నిజాల్ని కాల్చి బూడిద మిగులుస్తున్నావు ప్రతి క్షణం దమ్ము తోనో ధైర్యం తోనో అందించే సమాచారం లో నిజం పాలెంత చీకటంటే నల్లగా మాత్రమే ఉంటుందని తెలుసు చీకటికి రంగులు పులుముతున్న దృశ్యాన్ని చూస్తున్నాను సరిహద్దుల కటూ యిటు నిరంతర సంఘర్షణ తెరమీది నాటకానికి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఇంట్లో రంగుల డబ్బాలో జరిగే మాటల యుద్ధాన్ని మోస్తున్నవాడ్ని ఎప్పటికీ హంసను కాలేను * * * * నా దేశపు నాలుగో స్తంభానికిప్పుడు చీడ పట్టింది మాటలే మాటల్ని హత్య చేస్తున్న వేళ మాట సూటిదనాన్ని కోల్పోయింది ముఖానికేసుకొన్న రంగుల్లో మాటలు దాక్కుంటున్నాయి అసలు మాట అక్కడ ఉండగానే మాటల నీడలు ఎల్లలు దాటుతున్నాయి తెర మీద చేసుకొనే ఉత్తుత్తి యుద్ధాలకు బలవుతున్న వాడ్ని నిర్మించబడుతున్న నిజాల మధ్య ప్రాణ విలువ వార్త కంటే తక్కువై పోయింది నీ రేటింగ్ సూచికి వేళాడుతూ నేను పోగొట్టుకొన్న ప్రాణం నీకొక రోజు పతాక శీర్షిక రేపటికది పకోడి పొట్లం నాకిప్పుడు నిజం కావాలి సూటిగా చెప్పే మాట కావాలి మాట వలన లోకం వర్ధిల్లాలి * * * *

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSznJb

Posted by Katta

Yessaar Katta కవిత

సురెక || తెలుగు గజల్ -16 ... బాసలెన్నో చేసివున్నా చేష్టలుడిగిన నేతలే ..లెస్సపలికీ ఎందుకో గోసలెన్నో మోసుకున్నా కథమారని రాతలే ..ఇచ్ఛవిరిగీ ఎందుకో .. ఎలుగుఏనుగు పునుగుపులులు కానలో ఎన్నున్నా ఎదురు తిరగని మేకపిల్లలె........అమ్మబలికీ ఎందుకో. .. వివాదాలను త్రొక్కిపెట్టి తోడునీడగ వుందునంటూ వీపు వెనక గోయిత్రవ్వుడు ... నమ్మగొలిపీ ఎందుకో. .. పల్లెసీమలో కూడివున్న మైదానాలు ముందరున్నా చెట్టు మీదనే పిల్లలాటలు....... కొమ్మవిడిచీ ఎందుకో. .. కష్టకాలమున దంటనేనని విషాదాలు చేరుతుంటే ఉడాయింపుల దారిచూపులే....జబ్బచరిచీ ఎందుకో. .. తప్పుతోవన సాగుతుంటే తప్పవెపుడూ తిప్పలంటూ తమకు మాత్రం అడ్డదారులే....... చెవ్వుకొరికీ ఎందుకో. .. ఒకరికొకరు తోడువుంటే ఒదలుగొనవా మమతలంటూ సుధకు ఆశల చూపులెన్నో........నవ్వువిరిసీ ఎందుకో. .. (తెలుగు గజల్ -16 ** 18/06/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kMDDVC

Posted by Katta

Trinadh Meegada కవిత

మా ఆసరా గ్రూప్లో ఉత్తమ కవితగా యెంపికైన నా కవిత ||పుడమితల్లి మాతృత్వం|| ప్రకృతి వడిలో అందరం పసిపాపలమే డిల్లీకి రాజులమైనా తల్లికి కొడుకులమే అవని తల్లికి అందరం బిడ్డలమే పుడమితల్లి గిరుల నుండి జాలువారిన పాల జలపాతాలు పురిటి తల్లి వదిలిన తెల్లని మురిపాలు వంటివి తల్లి స్తానువుల కమ్మదనం పసితనం కెరుక .. అవనితల్లి జలపాత అమృత ధారలు జీవకోటికెరుక అమ్మతనంతో స్త్రీ సంపూర్ణత్వ సమృద్ది సాధిస్తే తీయని జలపాత ధారలుతో ప్రాణం పోసిన పుడమితల్లి మాతృత్వపు మధురిమలతో సమసిపోకుండా నిరంతరం ఎగసిపడుతూ మురిసిపోతుంది. ..............................మీగడ త్రినాధ రావు

by Trinadh Meegada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kMDykP

Posted by Katta

Rajeswararao Konda కవిత

నాది నాది అనుకున్నది నీదు కాదురా..!! కాదు కాదు అనుకున్నదే నీ వశమగును నేస్తమా..!

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1neo2zH

Posted by Katta

Ravinder Vilasagaram కవిత

నిన్నటి దాకా చెమట ధారలు నేడేమో మేఘామృత ధారలు ! 18.6.2014

by Ravinder Vilasagaram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDTVZe

Posted by Katta

Rajeswararao Konda కవిత

నీవిలా ఎదురొచ్చినప్పుడల్లా... నా కాళ్లు తడబడుతునే ఉన్నాయ్..//18.6.14//@ రాజేష్ @

by Rajeswararao Konda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vOY4JA

Posted by Katta

Rasoolkhan Poet కవిత

ప్రజా సాహితి లో నా కవిత "మట్టి చేతులు"

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vOY1xB

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | ఒక వెచ్చని ఉదయం | చేదు కాఫీలో చక్కెర గుళికలా కొన్ని అత్మీయ పలకరింపులు చమక్కుమంటూ బ్రతకమంటాయి ఒక్క లిప్తపాటు మబ్బు పట్టిన మనసుల్లో వెన్నెల జల్లు కురుస్తుంది మోహమో ప్రేమో ఆవేశపు మధురిమో తృప్తిగా హృదయం ఒక నిట్టూర్పు వదులుతుంది చాలుతుందో చాలనుకుంటామో చాహత్ బంధనాల్లో మురిసిపోతామో ఏమయినా ఏదేమయినా జీవితపు గుటకలు గొంతుకి అడ్డం పడూతూ అయినా దిగుతూనే ఉంటాయి నిశీ!! 18/06/14.

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iFIQyH

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

బ్రతుకు పోరాటం లో లేదు లింగ భేదం ఆకలి కేకలకు లేదు ఆడ మగ తేడా కష్టం వస్తే ఎవరు రారు మనకు తోడూ నీ కాయ కష్టం గుండె ధైర్యం నీకు తోడూ మగవాడు పని చేయ లేకుంటే ఆగదు లోకం కుటుంబ పోషణ కోసం నేనున్నాను అంటుంది మహిళా లోకం అన్ని రంగాలలో పోటీ పడి పనిచేసి ఆత్మ గౌరవం కాపాడుకునే మహిళామతల్లులకు జగతి ఇస్తుంది సదా జేజేలు ఆడది అంటే ఆట బొమ్మ అనుకునే వాళ్లకి నీలాంటి వాళ్ళ నీడ సోకినా వుండదు ఉనికి తప్పు లేని పని ఏది చేసినా తప్పులేదు రూపాయి కోసం ఎవెధవను చేయి చాచ అవసరం లేదు !!పార్ధ !!18/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iFISqu

Posted by Katta

Kapila Ramkumar కవిత

కీ||శే|| రావెళ్ళ వెంకటరామారావు || సుస్వాగతం || @@ నాలుగు శతాబ్దాలనుండి నవాబులు సైతానులు తెలంగాణ జనరక్తం - జలగలవలె పీల్చినారు పరదాస్యపు పంకిలాన వడి కుళ్ళిన నాలో గల శక్తులన్ని నశియింపగ - జడమతినై మిగిలినాను భారత స్వాతంత్ర్య సమర భానూదయ సుప్రభాత శంఖధ్వానం నాలో - చైతన్యం పూరించెను స్తంభించిన నా నాడుల జవసత్వం పొంగిపొరలి విశాలంధ్ర విజయోత్సవ - విమలగీతులాలపించె నిన్ను నన్ను వేరుచేసి నిలుచుండిన నిరంకుశులు ప్రజావిప్లవాగ్నిముందు - పరాజయం పొందినారు ఈ నాటికి మన కోరిక లీడేరెను రండు రండు ధరాధిపుల సమాధిపై జరామరణరహితమైన జనరాజ్యం స్థాపించే కృషిలో మీ చేయూతను అందించగవలెను లెండు అన్నా సుస్వాగ్తమిదె అందుకొండు అందుకొండు! ________________________________________________________________________ @@(తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట విజయ గీతం - జీవన రాగం సంకలనం 1960 శార్వరి- ఛైత్రమాసం '' నుండి సేకరించినది) _________________________________________________________________________ 18.6.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iFISqk

Posted by Katta

Aruna Naradabhatla కవిత

రైతన్నా...జెరాగే ____________అరుణ నారదభట్ల ఇప్పుడిప్పుడే కదా మొలకెత్తుతున్నది ఈ చిన్ని పిట్ట! గాయాలతో కొట్టుకుపోయిన మట్టి రెక్కలు ఇప్పుడే తొడిగింది! మూకుమ్మడి బ్రతుకులను కొమ్మలు తొడగని లేతకాండం మీద తోసేస్తే ఎట్లా! పుట్టినప్పటినుండీ చేసిన రుణం తీర్చమనడం ఎంతటి భారం! నోరెండుకుపోయిన మట్టిని సంస్కరించాలా... నీకూ ఓ ముద్ద పెట్టాలా... అక్షరాలకు ఊతమివ్వాలా... నిరుద్యోగిని నీడకు చేర్చాలా.. కాలువగట్లు...ఆకాశానికి నిచ్చెనలూ... అన్నీ అనుభవం లేకున్నా సవరించాలా.... కుటుంబ భారం ఒకటే సారి నెత్తినపడింది! తెగిన తీగలకు కరెంటునివ్వాలా... చేదుతున్న బొగ్గుకు ఊపిరి పోయాలా... గొంతెత్తి పలికిన పాటలకు నా అడుగులనూ...తోడిచ్చినడవాలా... అరె.. కొంచం ఆగు... అరిచీ ...అరిచీ.... గిప్పుడే గెలిచింది! కొద్దిగ శక్తి రానీ! ఉన్నదంతా ఒక్కసారే మీదికి తోయకు! మోసేటోడికి తెలుసు కావడి బరువు! ఉన్నం గదా...అన్ని జూస్తం అన్యాయం జెయ్యం అట్లని...అతీ జెయ్యం! ఎంతియ్యాన్నో అంతిస్తం... రైతన్నా...జెర ఆగే... పుట్టినకాడ్నించి ఇయ్యమంటే ఎట్టనే! నన్ను గుడ జూడూ ఎనక బస్తల ఎంతున్నదో జూడనీ కొద్దిగ నా గోనసంచి గుడ నిండద్దా...!! 18-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U92cXt

Posted by Katta

Prasad Atluri కవిత

ప్రసాద్ అట్లూరి || తింగరబుచ్చి || (మణిమాలిక గ్రూప్ లో నేను 'తింగరబుచ్చి' పై రాసిన ద్విపాద మాలికల సమాహారం సరదాగా ...) నువ్వంటే ఇష్టమన్నా.. ఏమి అర్ధమైచచ్చిందో ! నువ్వులడబ్బా నేలకేసి కొట్టింది ... తింగరబుచ్చి!! పోన్లేమని పెళ్ళిచేసుకుంటే 'మొదటి తారీక్కే మొగుడి'వంటుదే... తింగరబుచ్చి !! అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతోంది.. 'బంగారానివిగా' అన్నానని కాబోలు .. తింగరబుచ్చి !! నీ గుండెలో చోటు ఇస్తావా" అంటే "ఎన్ని గజాలని" ఎగతాళి చేస్తుందే... తింగరబుచ్చి!! నేనంటే లెక్కలేదా అంటే ! నేను లెక్కల్లో వీకంటు తిప్పుకుంటూ పోతుందేమిటి ..తింగరబుచ్చి పొరపాటున నా మనసు వెన్నలాంటిదన్నా! వెన్నప్పాలు చేసివ్వమని.మారాంచేస్తోంది ...తింగరబుచ్చి !! మూడోనెలని మామిడి కాయలు తెచ్చిస్తే పులుపుచాల్లేదని పక్కింటి చింతచెట్టెక్కింది..తింగరబుచ్చి !! సరే పొన్లేమని పొలానికి పిలిస్తే వడ్లకంకుల్ని తెంపుకుని వళ్ళోదాచుకుంటుందే.. తింగరబుచ్చి!! ప్రేమిస్తావా అనడిగితే ! అధారుకార్డ్ ఉందాని అడుగుతుందేంటి ...తింగరబుచ్చి !! ఏడిపించొద్దన్నా ...ఏమర్ధమయిందో తింగరబుచ్చికి ! కనబటటం మానేసి నా మనసుని ఏడిపిస్తోంది ఇప్పుడు !! ఎటో వెళ్ళిపోయింది మనసు.. అని పాడుకుంటుంటే వచ్చాక కబురంపించు అంటూ పోయిందేంటి.. తింగరబుచ్చి !! చిన్నప్పటి మాస్టారుని భోజనానికి పిలుస్తోందట రాత్రికి అదేపనిగా గోడకుర్చీ సాధన చేస్తోంది...తింగరబుచ్చి !! దస్తావేజులతో వచ్చింది తింగరబుచ్చి ‘నా మనసుపై హక్కులన్నీ నీకే రాసిచ్చేస్తా’ అన్నానని!! 18JUN14

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SSkta7

Posted by Katta

Kapila Ramkumar కవిత

** డా||కె.హరీష్‌ ||గుండె గూటి సొద || పాటంటే గుండెగూటిని సునితంగా తాకే నిశ్శబ్ద తరంగం కలల అలలన విరిసిన స్వర నిర్ఝరి మానస వీణన ఆర్ణవమైన అక్షరం పిరి విప్పి విరిసిన కాంతి పుంజం అనంతానంతరం నుంచి నేలన పడ్డ తొలకరి చినుకు మనిషి అంతరంగాన వెలసి మెరిసిన ఇంద్ర ధనుస్సు ఒక దరహాస వీచిక ఆరని ఆశ నింగిని చూపించే వెన్నుల సిరి సిరి వెన్నెల అందీఅందని జలపాతపు చిందు లయ కలమెలిగిన శృతి రేపటి లోకావలోకానికి రాచ బాట కల్లోల కడలిని మరిపించే ఘర్షణ నిండు హాలాహలాన లిప్తమాత్రపుటమృత ఝరి కారు చీకటిన వినిపించే వేదనాదం మనిషి గుండెన గలగలలాడె అగ్ని శిఖ ఆనందహేల మనిషికి ప్రకృతి ప్రసాదితమైన సుంద పరినిర్వాణం ఈ గుండె గూటి సొద ! ________________ కీ.శే.హరీష్‌ స్మృతి సంచిక నుండి వారి కవిత. ________________2007 సెప్టెంబర్ ** (18.6.2014)

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDzonB

Posted by Katta

Divya Kiran Takshikasri కవిత

ఏడు వసంతాల ఈ కాలం నీ కలయిక తో నాకు ఏడు క్షణాల సమానం! ఈ నా నిలకడకు, నా సంతోషానికి, నా విజయాలకి, నీవు కారణం అనే ప్రత్యేక ప్రవచనం అనవసరం! నేను తప్పు చేయబోతే నా మనసు వెనకే నన్ను తడుతూ ఆ మైకం నుండి మేల్కొలుపుతావు! నేను తప్పటడుగులు వేస్తే నా కంటి చూపువై నువ్వు సన్మార్గం చూపుతావు! "నేను" అనే అక్షరం లో నువ్వు చేరి నాకు అర్థం చేకూర్చావు ఈ పుట్టిన రోజు నీకు ప్రత్యేకం! మొన్నటి వరకు నువ్వు ఒక్కదానివే! తరువాత ప్రేమ లో ఇద్దరం! పెళ్ళితో మనం ఒక్కటిగా మరాము! ఇప్పుడు మనం ముగ్గురం! మళ్ళి జన్మకు కూడా నికు నేనే ఉండాలని, మనం ఇలా ఒక్కటవాలని కోరుకుంటూ...... నాతో ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని......... నవ్వుతూ నన్ను నడిపిస్తూ హాయిగా ఉండాలని.... మన పాప తరపున, నా తరపున నీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు "బుజ్జి" నీ దివ్యకిరణ్ In our journey these 7 years, I’m feeling like 7 seconds…… Behind my stability, my happiness & my victories you are the backend, no need to specify it….. If I’m on fault you awoke my heart into right…. If I’m on wrong way, you shown the path with my eyes…….. “I” became a meaningful “we” with you…… This is a special birthday to you my dear…. In past you just one, then we both in love, After that we became one in marriage, now we are three…… I heart fully wishing for next life also my heart will be yours……… You should celebrate many more birthdays with me and direct me with your cheerful smiles……… On behalf of our daughter and from me the cheering wishes……. Many more happy returns of the day BUJJI Yours DivyaKiran

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDzmw6

Posted by Katta

Babu Koilada కవిత

బాబు //స్వప్న విహారం// మరో నూతనలోకపు ద్వారాలు తెరుచుకోగానే నిద్రామూర్తి సంకెళ్లతో బంధించేస్తాడు మెదడులో కణాలు దిక్కులను వెతుక్కుంటూ వాయువేగంతో పయనిస్తుంటే మనిషి మైకం కమ్మిన లోగిళ్ళలో తనకు తోచిన భావాలేవో అలవోకగా రాసుకుపొతూనే ఉంటాడు వింత వింత కథనాలు, విచిత్ర అనుభవాలు వాస్తవాన్ని ఎదిరించే సంఘటనలు అసాధ్యాలను సుసాధ్యం చేసే లాజిక్ లేని లెక్కలతో విహారం చేస్తూ, ఆత్మపరిశీలన చేసుకుంటూ తెలివిగా తనకు తెలియకుండానే పాలపుంతల ఆవాసాల నడుమ దృశ్యదర్బారులో దిగ్గజాలతో దోస్తీ కడుతూ వినూత్న భావోద్వేగాల కలయికతో మసకేసిన తెరపై తానే కథానాయకుడై ఊహలను కవ్విస్తూ, సత్యాన్వేషణ చేస్తున్న సంచారిలా ఆలోచనాలోచనల సవ్వడితో లయబద్దంగా తన అంతరంగానికి పట్టాభిషేకం చేసే వేళ ఆ రేయికి ఆ స్వప్నరేఖలే సర్వస్వం వాస్తవిక జీవితంతో పనేముంది? 18.06.2014

by Babu Koilada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1niT6zM

Posted by Katta

Chinni Krishna కవిత



by Chinni Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iiSxIB

Posted by Katta

Annavaram Devender కవిత

తొవ్వ .......................అన్నవరం దేవేందర్ కరీంనగర్ జిల్లా వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర ...... కరీంనగర్ కు వెయ్యేండ్ల సాహిత్య చరిత్ర ఉన్నది .ఆ మాటకు వస్తే అన్ని జిల్లాలకు ఉంటది .కాని కరీంనగర్ చరిత్ర గ్రంధస్తం చేయబడ్డది .డాక్టర్ మలయశ్రీ 'కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర (క్రీ .శ 950-1995) పిహెచ్డి గ్రంధం 1997లోనే వెలువరించారు .ఇది తెలుగు సాహిత్య చరిత్రలో తల మాణికం. ఇందులో అనేక సాహిత్య విషయాలు ఉన్నాయి .తొలి తెలుగు కంద పద్యం పుట్టింది కురిక్యాల బొమ్మలమ్మ గుట్ట మీదనే .ఈ పద్యాన్ని జిన్నవల్లభుడు రాసిండు .జినవల్లభుడు కన్నడ ఆది కవి పంపని సోదరుడు క్రి .శ 946 లో ఈ శాసనం వేయబడ్డది .ఆ తరువాత మాడిక సింగన్న ,వేలగందల కందన ,నారాయ చ్రికొండ ధర్మన లు ఈ జిల్లలో కవులు గా ప్రసిద్ది చెందారని ఈ గ్రంధం లో ఉన్నది..తొలి కవయత్రి కోడిమ్యలకు చెందినా ఆనంద మాంబ.ఈమె 1934 లో 'సతీలలామ ' అనే కావ్యాన్ని వెలువరించారు 1901-1950 మద్యలో సిరిషేనహళ్ కృష్ణమాచార్యులు ,నేమలికొండ పింగళి లింబాద్రి రెడ్డి ,గుండరేద్దిపల్లె అనంత్వరపు సిద్దప్ప .రామసిహ్మకవి వి .కేశవరావు లు ప్రసిద్దులని మలయశ్రీ పేర్కొన్నారు 1934 దీపావళి ప్రత్యేక సంచిక గా వెలువడ్డ 'గోలకొండ' కవుల సంచికలో 354 మంది కవుల వివరాలు ఉంటె అందులో 40 మంది కరీంనగర్ వారే నని మలయశ్రీ పరిశోధన లో తెలిపారు .ఇలా ఈ పరిశోధన గ్రంధం లో చాల విషయాలు ఉన్నాయి .ఇందులో 700 మంది రచయితల పరిచయం ఉన్నది .వెయ్యి సంవత్సరాల అపురూప చరిత్ర రూపొందించిన మలయశ్రీ బహు అభినందనీయుడు .ఇంకా ఈ గ్రంధంలో కొన్ని ఆయా రచయితల ఫోటోలు సుత ఉనాయి .జిల్లా పేరు మీద ఇలాంటి చరిత్ర రావడం కరీంనగర్ ప్రథమం . అయితే ఈ గ్రంధాలు ఇప్పుడు లభ్యత లేకపోవచ్చు ఎందుకంటే పదిహేడేళ్ళ కింద వెలువడ్డ పుస్తకం ఇది .ఈ కాలం వాళ్లకు తెలువాలిసిన పుస్తకమని రాస్తున్న .(మలయశ్రీ గారు కరీంనగర్ లోనే ఉంటారు మాట్లడలనిపిస్తే సెల్ ....9866546220....)

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iiOE6y

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

ఎన్ అర్ ఐ విద్యాసంస్థలంటే అమెరికా టైప్ అనుకొన్నా ఇండియా పందుల దొడ్లకన్నా అధ్వాన్నం అని అనుకోలేదు 18.6.2014

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pHchrM

Posted by Katta

Pulikonda Subbachary A Poet కవిత

చెలికత్తెలు ఒకటే తలుపులు తడుతున్నారు ఎవరూ తలుపులు తీయడమేలేదు ఆ గదిలో ఊర్మిళాదేవి నిద్రపోతూ ఉంది పై కవిత ఇటీవలే కవిజాలం అనే గ్రూపులో వచ్చింది. దీన్ని రాసింది నా మిత్రుడు ఆచార్య ఎస్జీడీ చంద్రశేఖర్. ఈ ముఖ పుస్తకం కూడలిని నిర్వహించేది కూడా చంద్రశేఖరే... పై కవిత చాలా బాగుంది. ఐదు పంక్తులున్నాయి. అంటే ఆయిదు పాదాలు ఇందులో ఎంతటి క్లుప్తి ఉందంటే ఇందులో ఇందులో ఏ అక్షరం తీసివేసినా కవిత చెడి పోతుంది. వ్యాకర్తలు సూత్రాలు రాసేటప్పుడు ఇలాంటి క్లుప్తత అవసరం. మన తెలుగు కవులు చాలామంది ఇలాంటి క్లుప్తత సాధించడం దగ్గరే విఫలం అవుతారు. కారణం కవితని రాసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోరు. అదేదో భవ్యకవితావేశంలో వచ్చింది. దీన్ని మార్చి చాలా మంది ఇలా చిన్న చిన్న కవితలు రాస్తున్నారు. ఇంత జిగిని వారు సాధించలేకపోతున్నారు. ఇక పై కవితలోని విషయానికి వస్తే ఇక్కడ కవి చాలా లోతైన భావాన్ని దాచాడు. ఊర్మిళా దేవిని ప్రస్తావించి పురాణ వాతావరణాన్ని సంపూర్ణంగా తెచ్చాడు. ఈ ఒక్క పేరు ఒక పెద్ద చిత్రాన్ని ఒక పెద్ద ఘటనని పాఠకువని మనస్సులో తెచ్చి పెడుతుంది. కాని ఇక్కడ కవి ఉద్దేశించేది ఊర్మిళా దేవిని గురించి రాయాలని కాదు రామాయణం గురించి చెప్పాలని కాదు. ఒక సుప్త చేతనావస్థలో ఉన్న వ్యక్తిని గురించి. సుప్త చేతనావస్థలోని భావాన్ని గురించి. ఇక్కడ ఈ కవితని దేనికైనా అన్వయించి అ్థం చెప్పవచ్చు. వ్యక్తులు, సంస్థలు, దేశాలు, సంస్కృతులు, నిద్రావస్థలో, సుప్త చేతనా వ్యవస్థలో ఉండవచ్చు. పాఠకుడి మనస్సు తనకు దగ్గరగా అనుభవంలో ఉన్న ఇటువంటి విషయంపైకి మళ్ళుతుంది. కవితలోతైన విషయం దగ్గరికి లాక్కుపోతుంది. దీనికున్న శక్తి ఇది. ఊర్మిళాదేవి నిద్ర అనే చాలా ప్రసిద్ధమైన జానపదగేయం ఉంది. జానపద సంస్కృతిలో కూడా ఊర్మిళాదేవి చాలా పాపులర్. ఆధునిక కవితలో పురాణ ప్రతీకల్ని వాతావరణాన్ని కల్పించి దాని ద్వారా ఆధునిక జీవితాన్ని వ్యాఖ్యానించడం మనకు చాలా కాలం నుండే ఉంది. దీన్ని చంద్రశేఖర్ అతి క్లుప్త స్థితిలో చంద్రశేఖర్ సాధించారు. మంచి కవిత యువకవులకు స్పూర్తి నిచ్చే నిర్మాణం ఉంది. అభినందనలు. పులికొండ సుబ్బాచారి.

by Pulikonda Subbachary A Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ndxaVc

Posted by Katta

Chandra Shekhar Vemulapally కవిత

వెములచంద్ర || భయం తో ....? || పొరపాటులే అన్నీ తొందరపాటులే మళ్ళీ మళ్ళీ సలహాలు వినీ వినీ పారిపోవాలని మళ్ళీ మళ్ళీ అబౌతికం ముక్తిపదం లోకి .... నానుంచి నేను అతి పెద్ద సంసారంలో అతి కొద్ది అవకాశం .... జీవితం మార్గాలన్నీ మూసుకుపోయి శబ్దరహిత శున్య ఆలోచనలకు దూరంగా పారిపోవాలని .... వాస్తవానికి దూరం గా ఒక కొత్త ప్రాణం మళ్ళీ పుట్టేందుకు మరణించి కొత్త దిశ గమ్యం వైపు పయనించేందుకు ఒక ఆత్మ .... మరో కొత్త నేను లా పుట్టి, ఎదిగి, పండి క్రుళ్ళిపోవాలని నుదుట రాయబడి రోగాలు రొష్టులకు భారినపడి నేరస్తుడిలా పరుగులుతీసి జీవబంధాల నుంచి విముక్తుడయ్యేందుకు ఎన్ని రాత్రిళ్ళు గడిచిపోయాయో నిశ్శబ్దం మాత్రం సమసిపోలేదు అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే గొడలులా అడ్డొస్తూ .... గమ్యం దిశలో వాస్తవికతకు ఎదురుపడలేక 19JUN2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U8j1BC

Posted by Katta

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ //గాలి చూపులు// మొన్నటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో నేను ఎండా కాలపు తీవ్రతను వర్ణిస్తూ రాసిన కవిత ప్రచురితమైంది. చుట్టూ పిల్ల సూర్యుళ్లు తలపైని చిల్లుల రేకులకప్పు ప్రసరించే కిరణబింబాలు కిటికీలోంచి దూసుకొచ్చే వడగాలులు ఒంటిమీద వేడివేడి కుబుసాలు వదులుతూ చరచరా పాకిపోతాయి నాలుగ్గోడలూ.. ఆ పైన రేకుల్లోంచి పొడుచుకొచ్చే అదృశ్య అగ్నిహస్తాలు ఎంతని మేగినా పొక్కిలౌతున్న నేలన నల్లినిజేసి నలిపేస్తాయి చెమటా.. దగడుదగడు పొగలూ కక్కుతూ శరీరమంతా ఒక ఆవిరియంత్రమౌతుంది విసుగు విసుగు విసుగు మనోవాక్కాయ కర్మలన్నిట్లో వెయ్యి రేకులుగ విప్పారిన విసుగు బయటికి చూస్తే వెండి తాపడం చేసినట్లు కండ్లు బైర్లుకమ్మే ఎండ నెత్తులు విరబోసుకున్న అగ్నిస్తంభాలు పక్కన నిప్పుటేరులో అడపాదడపా కొట్టుకుపోతున్న జీవాలు అంతటా ఒకటే తపన ఒక చల్లని మబ్బుతునక రెప్పలపై వాలాలని సమస్తంగా విస్తరించిన తీవ్రమైన ఆశ గదిలో ఎదురుగా టేబుల్ పై కుదురుగా కూచున్న మూడు రెక్కల ముద్దుపక్షి ఎప్పుడో తెగిన ప్రాణ ప్రవాహం తరలి వచ్చిన పరవశంతో తల అటూఇటూ తిప్పుతూ గాలిచూపులు చూస్తుంది చెమర్చిన చర్మానికి చల్లని మంత్రగంధం అలదినట్లు విసుగు మటుమాయమౌతుంది 18/6/2014

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lQB75E

Posted by Katta

కోడూరి విజయకుమార్ కవిత

వర్కింగ్ ఉమన్ // దర్భశయనం శ్రీనివాసాచార్య కవిత // ఇల్లూ ఆఫీసూ నడుమ ప్రయాణం ఆమె ఏ ఒక చివర చేరినా మరో చివరకు ప్రయాణం మొదలు మనసులోనే పాదం నడక మొదలయే ముందే రోజూ యిలా - ఎపుడూ ఒక పరుగు మనసుకూ తనువుకూ - ఇంట్లో లేచింది మొదలు ఆఫీసు ఆరంభ సమయం ముల్లులా గుచ్చుకుంటుంది క్షణం సేపూ నిలవనీక - ఎపుడూ ఒక ఒత్తిడి దారి చివర్లోనూ దారి లోనూ - ఇంట్లో పిల్లల నిరీక్షణ ఆఫీసు గడియారంలో ముళ్ళను నెడుతూ వుంటుంది ఆమెను మనసుతో కూర్చోనీక - అక్కడి పనులూ ఇక్కడి పనులూ ఆమెలో ఖాళీ లేదు ఆమెకై ! గాయాలన్నీ బయల్పడవు కొన్ని ఆమెలోనే నిల్చిపోతాయి భావాలన్నీ మాటలు కావు కొన్ని ఆమెలోనే కరిగి పోతాయి బాధ్యతా అవసరమూ నడుమ అవిశ్రాంత కెరటం ఆమె - - రచనా కాలం 23 ఏప్రిల్ 1994 ('ముఖాముఖం ' సంకలనం )

by కోడూరి విజయకుమార్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qpwWRc

Posted by Katta