పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఏప్రిల్ 2014, గురువారం

Sriramoju Haragopal కవిత

నీలిమేఘాలలో... మొగులు నా ప్రణయ కిరీటం భూమి నా ప్రేమసింహాసనం నదులు నా కన్నీటికొలనులే సముద్రం నా దుఃఖం విడిది కొండలు నా బాధలతలగడలు చెట్లు నా వియోగగీతికల వీవెనలు అడవులు నా పచ్చని నిరీక్షణలపాట నువ్వు నన్ను విడిచిపోతావెక్కడికని నువ్వు నాలోని ప్రాణశ్వాసవు మొగులు నా ప్రణయ కిరీటం భూమి నా ప్రేమసింహాసనం నీ జ్ఞాపకాలను మాయం చేసే ఏదైనా నదినీటిలో నన్ను పారేసి పో ఒక్కటి మిగిలినా పాటరెక్కల మీద ఎగిరి వచ్చేస్తా ఒక్కబొట్టు కన్నీరున్నా వాననై తడిపేస్తా నిన్ను నన్ను పారెయ్ పారెయ్ ఒక్క రుతువు చూసినా నా కళ్ళు రెప్పలతో నీ దివ్య రూపాల్ని దిద్దుతాయి ఒక్క పూవు పూసినా నా స్పర్శలు గాలితెప్పలతో నీ వాసనలు వీస్తాయి నన్ను పారెయ్ పారెయ్ మొగులు నా ప్రణయ కిరీటం భూమి నా ప్రేమసింహాసనం నా దుఃఖశ్వాసల్ని ఎరుగనంత ఎదిగిపో ఒక్కతడినుసి నిన్ను తగిలినా నేను జలపాతమై పోతా నాకు నీ గర్వమొక్కటి మిగిలినా సర్వంసహా చక్రవర్తినౌతా నన్ను పారెయ్ పారెయ్ నిను రాసిన నా అక్షరాలు నాలుగు ఈ ప్రపంచానికి నా వీలునామా, ఎవరు చదువకముందే చెరిపెయ్ ఎవరి పెదవులకు అంటినా వంశీమోహనమౌతా నన్ను పారెయ్ పారెయ్ మొగులు నా ప్రణయ కిరీటం భూమి నా ప్రేమసింహాసనం

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tHmZih

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

శ్వాస పీల్చితే జననం .... శ్వాస ఆగితే మరణం నిన్నటి దాక వున్న మన ఉనికి మరుక్షణం లో శూన్యం నిన్నటి గలగలా మాటలు నిశ్శబ్దపు గీతాలు ఏమై పోతున్నాం ఎక్కడికి పోతున్నాం ఎక్కడి దాకా వెళతాం తిరిగి ఎప్పుడు వస్తాం ఇప్పటి దాకా నాది .. నా తరువాత ఎవరిదో నిద్ర పొతే లేస్తున్నాం కదా ... మరి ఇప్పుడు ఎందుకు లేవలెం నడుస్తున్నది మనం కాదా మనమే అయితే ఇక్కడే వున్నాం కదా నిన్న నవ్వులు నవ్విన మనిషి తరువాత ఎక్కడికి పోతున్నాడు చిత్రం కదా దానిపేరు మరణం ... మనం వుంటే అడివుండదు అదివుంటే మనం ఉండము కదా .... ఎప్పటికీ విచిత్రమే !!పార్ధ !!24apr 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rpN8QC

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ఓయ్ మామా... | విష్వక్సేనుడు వినోద్ అట్టా చుట్టేయమాకు మొద్దు మామ నాకెట్టో అయిపోతోంది వద్దు మామ కోరికంత అణచుకోరా కొంటె మామ కాలుజారితే కష్టమంట మొండి మామ మీద మీద పడతావు మోటు మామ నెమ్మదైతే రేయంతా స్వీటు మామ ముద్దులంటికి పద్దురాస్తే ఎట్ట మామ సరసంలో లెక్కలేంటి మట్టి మామ వద్దంటే కావాలని ముద్దపప్పు మామా హద్దుదాటితే లొంగిపోనా చురకత్తి మామా 24 - 04 - 2014

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1idkxvl

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: ప్రణయదాహం..: ఆవేదనా సముద్రపు అవధులెక్కడ.. నిలువునా దహిస్తున్న నిప్పుకు విరుగుడెక్కడ.. బాధాతప్త హృదయపు ఘోష యెక్కడ.. నిట్టూర్పుల గాఢత నిండిన శ్వాస యెక్కడ.. ఏదేదో వ్రాయాలని.. దావాలనపు ఎడద పరచాలని.. ఏదేదో వ్రాయాలని.. ఎదన రేగు సునామీ ప్రళయాన్ని సమ్హరించాలని.. ఏదేదో వ్రాయాలని.. విధాత వ్రాతను తిరుగబెట్టాలని.. ఏదేదో వ్రాయాలని.. అల్లకల్లోల ఆలోచనా కెరటాలను తీరం చేర్చాలని.. ఏదేదో వ్రాయాలని.. అక్షర తపస్సునావహించి మమతల నందనవనిని వెలయించాలని.. ఏదేదో వ్రాయాలని.. ఎంత వారించి చూసినా..ఇలాగే వ్రాయాలనీ.. ఇలాగే వ్రాయడం మందే లేని రోగం..!! అది అంతే లేని తీయని ప్రణయ దాహం..!! 24/04/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1idkxvb

Posted by Katta

Jayashree Naidu కవిత

జయశ్రీనాయుడు || అనామికలు 1 || తెలిసిన తనం వెనుకే తెలియని చీకటి వెలిగించే కొద్దీ కరిగిపోతుంది తెలిసేలోపునే మరో ఉదయం చీకట్లను తుడిచె తలపులకి మనసు స్పంజికి మెరుపు తళుకుల చెక్కిలి చెమ్మ సంధి కుదిరిందా సాయంత్రపు నీడల్లే ఆ శాంతి అశాశ్వతమే ధృవపు మంచల్లే చుట్టుకునే గుండె ఘోష మొలకెత్తే ఆశకి చీడలా అంటక ముందే కొన్ని వెలుగుల్ని దాచుకుంటాను 24-04-2014

by Jayashree Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QBvRGQ

Posted by Katta

Sreedhar Babu Pasunuru కవిత

"మళ్ళీ మరొక్కసారి ప్రేమ గురించి..." -- పసునూరు శ్రీధర్ బాబు మరొక్కసారి ప్రేమ గురించి మళ్ళీ మళ్ళీ మరొక్కసారి వెళ్ళిపోయిన ప్రేమ గురించి రాలిన పూవు మట్టిలో కలిసిపోతుంది వాలిన చూపు ఎక్కడో నాటుకుపోతుంది కురిసిన వర్షం వంకలో వాగులో చివరకు సముద్రంలో కలిసిపోతుంది తడిసిన దేహం చివరి నిట్టూర్పు దాకా వణుకుతూనే ఉంటుంది పొద్దుటి వెలుగు మీదకు చీకటి తరుముకొస్తుంది చీకటి పంచిన కలలను ఏ వెలుగు తుడిచేయగలుగుతుంది? శిశిరానికి కానుకైన మొదటి హరిత పత్రం వసంతాన్ని స్మరిస్తుందా.. స్వప్నిస్తుందా? నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరే మధ్యలో ఈ కాలం గొడవేమిటి నేనెప్పుడో నీదారి నీదే నాదారి నాదే అని చెప్పింతర్వాత! గుండ్రని భూమికి ధిశలేమిటి? ఎటు వెళ్ళినా నేను ముందుకే వెళ్తాను- నా జీవితాన్ని నేను ఇటు నుంచి అటూ అటు నుంచి ఇటూ జీవిస్తాను ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తానో లేక ఎక్కడికైనా పోతానో? ఏమైతేనేం? నేను నా కాలం నా ప్రాణం నా ప్రయాణం ఒక్కటే అయినప్పుడు! ఏమైపోతేనేం? నేను నా గానం నా గాయం నా జ్ఞాపకం వెన్నంటే వస్తున్నప్పుడు! అందుకే మరొక్కసారి ప్రేమ గురించి ప్రతిక్షణాన్ని ప్రతీక్షణంతో వెలిగించి వెళ్ళిపోయిన ప్రేమ గురించి వెళ్ళిపోయిన ప్రేమ వెంటే వెళ్ళిపోయిన నాగురించి శిలువ మీద క్రీస్తులా కాగితాల మీద అక్షరాలుగా వేలాడే క్షణాల గురించి మళ్ళీ మరొక్కసారి నావెంటే వెళ్ళిపోయిన ప్రేమ గురించి...! *** (24 ఏప్రిల్ 2014)

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nJimzZ

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతుంది(ఆఖరి భాగం) ____________________________ఆర్క్యూబ్ ఇటు -యుద్దగానం వెదురు కొమ్మల కళ్ళల్లో మరుగుతున్న రక్త కాసారం జార్ఖండ్ వికాస్ మోర్చా_హర్మద్ వాహిని సాల్వా జుడుం -గ్రీన్ హంట్ స్వీయ రాచరిక తల్ఫాల మీద వేదాంత జిందాల్ ల సారాన్ని అధికారికంగా వ్యసన పర్చుకున్నాక నిండా పక్షవాతంతో అటు -అది దానికి మట్టి మల్లెలు వెన్నెలా పడవు కదా చెట్టు మీది పండు వంటి కథనీ కవిత్వాన్నీ నిషేధిస్తుంది మరి అందుకే-ఈ యుద్ద గానం రగిలి పోతున్న నిర్వాసితుని స్వప్నమై విల్లంబు మీదుగా గురి కుదురుతున్నది ఒకానొక పురాతన ఆగ్గిరవ్వల కాలం రాజ్యం సామ్రాజ్యవాద పాదం కింద నలిగిన పువ్వు సాపెనను ప్రపంచమంతా వినిపిస్తున్నది " నీ మీద కలెబడేటోనిదే చరిత్ర నువ్వు పొట్టనబెట్టుకున్నోనిదే ఈ రక్త కణం ఓ రాజ్యమా...... నీతో ఇంకెప్పటికీ శాంతి చర్చలద్దు ఈ యుద్దం కొనసాగాల్సిందే ..... * * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRfFMb

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-40 మానవజీవిత పరమార్ధమేమిటని ప్రపంచం కళ్ళుతెరవని నాడు చింతన చేసింది ఇచటనే...! ఎందుకో పుట్టామో,పెరుగుతున్నామో తెలియని లక్ష్యహీనులై బ్రతుకునీడ్చే జీవులూ ఇచటనే...! స్త్రీని శక్తిస్వరూపిణిగా కొలిచేది ఇచటనే...! ఆడశిశువుల్ని చిద్రం చేసే సంస్కృతి ఇచటనే...! "సర్వేషాం మంగళం భవతు " అనేది ఇచటనే...! మనిషిని చూడగానే వీని కులం ఏమయి ఉండవచ్చునని యోచించేదీ ఇచటనే...! పెద్దలని గౌరవించమనేది ఇచటనే..! వృద్ధ బిక్షువులు ఏ చెట్టుకిందనో జంతువుల వలె మరణించేది ఇచటనే...! --------------------------------------- 24-4-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nJ14TF

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // (అ)నిర్లిప్తం…// ప్రపంచంలో నువ్వో సగం నేనో సగం అద్భుతలేమి జరగవు,ఆశించేదేది దక్కదు అక్రమమము అంటూ ఏమీలేదు, సక్రమము అసలేలేదు స్వార్ధం లేదు, త్యాగం లేదు పతనమేయ్యేదిలేదు, ఉద్ధరించుకోనేది ఏమీలేదు ఉన్నది ఒక్కటే రక్తంలో ఎరుపు గాలిలో స్వేచ్చ కళ్ళలో పచ్చదనం పండిచుకుందాం తిరుబాట్ల విత్తులు జల్లి బ్రతికించుకుందాం మానవత్వం మనే జీవం పోసి .. ఐనా ఇది నిజం ప్రపంచంలో నువ్వోసగం నేనోసగం మరి మళ్ళీ మళ్ళీ చచ్చిపోదాం మనుషులమై పుట్టడానికి Date:24/04/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nIYpcq

Posted by Katta

Nvn Chary కవిత



by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iQRnls

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత - 9 ----------------------------------------- మనకు సిగ్గులేదు - - - - - - - - - - - - - - ఆశారాజు రెండు కళ్ళుపోయి అంతా స్పష్టంగా కనబడుతోంది అంజనం వేస్తే అరచేతిలో హన్మంతుడు కనపించినంత స్పష్టంగా మాయల ఫకీరు గుహలో మంత్ర దర్పణం చూపించే రాజకోట రహస్యమంత స్పష్టంగా కళ్ళుపోయింతర్వాత ఇంత నిజం బయటపడుతోంది ఓ తల్లి దాహానికి నీళ్ళడిగితే నోట్లో పెట్రోలు పోసి నిప్పంటించటం అతి సమీపంగానే కనబడుతుంది అమాయక స్త్రీలను చెరిచి ముక్కలు ముక్కలుగా కోసింది రక్తమంత నిజంగానే కనబడుతోంది కత్తితో గర్భిణి కడుపు చీరి గాల్లో పిండాన్ని ఎగరేసింది కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది యాసిడ్‌ చల్లిన శవాలు మనవే బూడిదయిన గృహాలు మనవే నమస్కరించండి శవాలకు నమస్కరించండి బూడిదకు నమస్కరించండి పాదుకల్ని తలమీద మోసుకెళ్తూ కళ్ళల్లో కుంకుమా పసుపూ చల్లినపుడే ఈ దేశం గుడ్డిదయ్యింది మనకు సిగ్గులేదు మనుషుల్ని చంపే రథయాత్రలు తిలకిస్తున్నందుకు నిజంగా షెరం లేదు మిత్రుని గాయం స్పష్టంగా కనబడుతోంది నా గాయాన్ని, మిత్రుడు దీనంగా చూస్తున్నాడు ఇద్దరి మధ్యన పావురాలు ఎగురుతున్న శబ్దం బస్సు టైమవుతోంది మళ్ళీ రెండు చాయ్‌లు తెప్పించుకున్నాం (మిత్రుడు కమల్‌ కామి తో నేను, నాతో కమల్‌ కామి పంచుకున్న బాధ) (అముద్రిత దీర్ఘకవిత 'రంగేలికిటికి' లోంచి) (GUJARAT GAAYAM -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tGxgeo

Posted by Katta

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ దుఃఖం ॥ దుఃఖమే ఎందుకు ఇంతగా ఆకర్షిస్తుంది ఒక్క నన్నేనా.... అందరినీ అంతేనా? ఎంత గొప్ప సంతోషమైనా దోసిళ్ళ నిండుగా నిండిన నీటిలా ఎండిన గుండెల దాకా చేరలేక ఏ భావమూ చిగురింపజేయలేదు అదే దుఃఖమైతే హృదయంలో మొలకెత్తి కనుపాపల దాకా ఎదిగి కన్నీరై కురిసిపోగలదు అందాల్సినవన్నీ అడగకుండానే అందేస్తే అడగాలనే కోరిక అలా మిగిలిపోయి అందినదాని విలువ తెలియనివ్వక అసంతృప్తి లోతుల్లోకి తొక్కేస్తుంది అదే అందనంత దూరాన నిలబడి ఆహ్వానించే చిన్నిపాటి కామన అయినా నారింజ రంగు నక్షత్రంలా మిణుకు మిణుకుమని మెరుస్తూ ఆకాశానికి నిచ్చెనలు వేయిస్తుంది ఒక గొప్ప విజయం ఇంకాస్త ఎత్తుకు ఎగబాకమని ఆదేశిస్తుంది తీరా అత్యున్నత శిఖరం అధిరోహించాక ఇంకేం చెయ్యాలో చెప్పక ఒంటరిగా వదిలేస్తుంది అదే అపజయమైతే అలవి కాని బాధని తోడు తీసుకొస్తుంది చేరలేక పోయిన లక్ష్యాన్ని చేరుకోమంటూ సరి కొత్త బాటల్ని సృష్టిస్తూనే ఉంటుంది ఒకసారి దుఃఖం లో ఉన్న ఆనందపు రుచి మరిగాక దుఃఖమే లేని ఆనందాన్ని అనుభవించడం కొంచెం కష్టమే !!! 24. 04. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pt3dHF

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

కళ్ళు మూసి తెరిచే లోగా పెద్దవాళ్ళం అయ్యాం సరిపోని చొక్కాలో వున్నట్లు నవ్వలేని గంభీరత నటన ఇష్టం లేని పెద్దరికం విచిత్రం కదా మనం మనలా వుండాలి అంటే సమాజం ఊరుకోదు చిన్న నాటి అరె ఒరే పలకరింపులు వుండవు కాగితం పడవలు వర్షం లో ఆటలు గాలి పటాలు , గోలి కాయలు స్వార్ధం తెలియని రోజులు మనసార నవ్వుకుంటూ స్నేహం కోసం పరితపించే రోజులు మన కోసం నేస్తం దెబ్బలు తింటే వాడి కోసం పుస్తకాలు రాసే రోజులు ఎలా మర్చి పోగలం వస్తాయా మళ్ళీ అలాంటి రోజులు అమ్మ ఆప్యాయత పిలుపు నాన్న అంటే భయం ప్రతి సన్నివేశం పులకితం చేస్తుంది మనసుని సుబ్బిగాడు సుబ్బారావు , అప్పి గాడు అప్పారావు గారు జిడ్డు గాడు జగన్నాధం సుత్తిగాడు చలపతి రావు చిన్నప్పుడు పిలుచుకునే ఆపెరులో అమాయకత నిండుదనం దగ్గర తనం నేను కనపడదే ... ఓహో నేను పెద్దవాడిని అయ్యాను .. ప్చ్ !!పార్ధ !!24apr 14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoo5Kr

Posted by Katta

Mothi Mohanaranga కవిత

ఆసన్నమై0ది....../////......మోతి మోహనరంగా ఉడికి0చిన కొద్ది పదార్థం మందమవుతు0ది నల్లగా మాడిపోయి చివరిగా సర్వకు బొక్క పడుతు0ది. ఓపిక ఇలా0టిదే గేద పాలిస్తు0ది చెట్టుపళ్ళిస్తు0ది శ్రీశ్రీ ఆవేశమిస్తాడు చలం శృ0గారమిస్తాడు ఇవ్వన్ని పక్కన పెట్టు నువ్వేమిస్తావు తొమ్మిది నెలలు ని0డాక కడుపు ఖాళ్ళి అవ్వాలసి0దే ప్రతీ కాయ పాకానికి రావలసి0దే నీ వాగ్థానాలకు వాగుళ్ళకు సాక్షిని నేనే అప్పుడన్నావు...... నీ చె0ప ఇటివ్వు చెప్పు ఆగనంటు0ది. బొక్కనేసి తోడుకున్న మా సొమ్ముతో సిరితిళ్ళు తిని పెరిన నీ కొవ్వు కరగాసిన సమయం ఆసన్నమై0ది.......మోతి మోహనరంగా

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mHThrz

Posted by Katta

Aruna Naradabhatla కవిత

స్త్రీత్వం _______అరుణ నారదభట్ల ఆడతనమంటే ... ముడుచుకొని కూర్చోవడం కాదు! కేవలం నగలూ...బట్టలూ కాదు! అలక ఆర్భాటం అంతకన్నా కాదు! మగాడిని వయ్యారంగా ఆకట్టుకోవడం అస్సలే కాదు! ముసిముసి నవ్వులతో ముగ్ధులను చేయడమూ కాదు! రెచ్చగొట్టే మాటలతో కుటుంబాలను కూల్చడమూ కాదు! అన్యూన్యతలను దెబ్బతీయడమూ కాదు! భార్యంటే బంధాలను తోసిపుచ్చడం కాదు! తనవారికే పెద్దపీట వేయడమూ కాదు! ఆడదంటే అణచివేతకు గురవడమూ కాదు! సహనం కోల్పోయి హత్యలూ ... ఆత్మహత్యలు చేయడమూ కాదు! ఆడతనమంటే అవసరాలకు వాడుకోవడమూ కాదు! ఆటబొమ్మలు అంతకంటే కాదు! ఓర్పు వహించడము చేతకాని తనమూ కాదు! బంధాలకు విలువనిచ్చే మంచితనం! సృష్టిని నడిపే అమ్మతనం ఆడతనం! చిన్నపాటి ప్రేమకు దాసోహమయ్యే మరువం లాంటి మగువతనం! ఆడతనమంటే ఆత్మవిస్వాసం! అవగాహన....అణకువతో కూడిన ఆలోచన! ఓర్పు ...సహనంతో పాటుగా అవసరమొస్తే తెగింపు! ధైర్యంతో కూడిన నమ్మకం! అనిర్వచనీయమైన ప్రేమ తత్వం! తోడినకొద్దీ ఉబికే నీటి చెలిమెలా సహనం త్యాగం...ఆలోచనా విచక్షణ తొందరపాటుకు తావివ్వని ముందుచూపు ఆడతనం! ఒక్క శారీరక బలం తక్కువైనా మానసిక బలం చాలా ఎక్కువ!

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8KZFS

Posted by Katta

Mothi Mohanaranga కవిత

కవిత...////.....మోతి మోహనరంగా శూన్యంగా ఇప్పడె0టనే సందేహంతో ఏదో కిరణం గాలి కెరటం.... తన్నుకొస్తు0ది కవిత్వం భూత భవిష్యత్తులు కాకు0డా వర్తమానాన్ని వర్ణ చిత్రాలుగా... నగ్నంగా విప్పుకోని కూర్చు0టు0ది నిజం ఇదని న్యాయ్యాన్ని కాపాడే ఉగ్రవాదిలా మొహనికి గుడ్డకట్టుకొని బుజానికి గన్ను తగిలి0చుకొని.

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l6nGxm

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || ఖాళీ పాత్ర || ఇందులో ఏమీ లేదు అంతా నీలో పోయబడింది అప్పుడు తెలియదు నన్నైనా మిగుల్చుకోవాలని మైకమో, మోసమో నన్నిచ్చి నిన్ను తీసుకోలేక పోయా ఇప్పుడిది నిండుగా శూన్యాన్ని మోస్తున్న పాత్ర ******* ఎమీలేనితనం భరించలేక కన్నీటితో నింపుకుంటున్నా తప్పదు .. మరలా నింపబడి ఎవరో ఒకరి దోసిళ్ళలో పోయడం నిజమే.. ఖాళీ పాత్రలా ఉండటం మనసున్నంతకాలం కుదరదు మరి మీ చాంద్ || 22.04.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gTi44O

Posted by Katta

Uday Dalith కవిత

చుండూరు దళిత స్వరం కులం లేదు కులం లేదు అని నువ్వంటుంటే ఈ చుండూరు ఎక్కడిది ఈమారణహోమం ఎప్పటిది కులం హలాహలం అంటాడు ఇంకొకడు అంతేలే అది నిన్ను కాదుగా మింగింది దళితుడైన నన్నేగా మింగింది మనుషులంతా ఒకటేగా ఆపు నీ నీతి వాక్యాలు ఒక్కటైతే ఒకే రక్తమైతే మా రక్తాలు చిందుతున్నాయి మీ రక్తాలు నరుకుతున్నాయి చేతగాని నీతులెన్నో చెప్పరాని ధర్మాలెన్నో కళ్ళ ముందు మృగాలన్నీ కసితీరా వేటాడుతుంటే కళ్ళ ముందు సాక్ష్యాలెన్నో తల్లకిందులవుతుంటే నీ సమానత్వ బోధలు నీ మనుధర్మ వాక్కులు వీలుంటే పోరాడు కులతత్వాన్ని చెండాడు మీ మసి పూసే మాటలన్నీ మీ ముద్దు ముద్దు రాతలన్నీ కులం విడిచిపెట్టుకొమ్మని మమ్మల్ని బానిసలై చావండని అంతేకానీ సమానత్వం మీ ఆశయమూ కాదు మానవత్వం మీ మతమూ కాదు మీ మర్యాదలు మీ మేధస్సులు మీ అంతస్తులు అహంకారాలు అలంకారాలు అన్నీ కులమైతే కంటికి రెప్పలా మిము కాపాడుతుంటే కులం పోవాలని మీరు చెప్పే నీతులు మాయమాటలు మమ్మల్నీ మా పోరాటాన్నీ మా ఆత్మగౌరవాన్నీ అంతం చేయాలని మాకు తెలుసులే

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hnBCBX

Posted by Katta

Pulipati Guruswamy కవిత

అదనపు వ్యధ // డా.పులిపాటి గురుస్వామి // పోతూ పోతూ మరిచేపోతాం చేతనైనది కూడ చేత చిక్కించుకునే ధ్యాసే వెలగదు పోనీ ఏదైనా మళ్లీ తెప్పించుకునే వీలు కూడా కాకపోవచ్చు మన దాకా చేరవేసే కాలానికి అప్పటికి మన చిరునామా ఖాళీ కనిపించవచ్చు నీకూ నాపని చెప్పలేను నిజానికి నీది నీకు మోపెడంత దించే దిక్కుండదు కలిస్తే మాత్రం కళ్ళను ఊరడించుకుంటూ పాదాలను పవిత్రం చేసుకోవచ్చు. అంతుపట్టని ఆత్మ చేసే మంత్రజాలంలో ఎవరి వంతు ఎంతనేది తెలిసేవీలుందో లేదో... ఏదీ వెంటరాకుండా ఓ ఏర్పాటు ఉన్నాకూడా అన్నీ కూర్చుకుందామనే కోరిక వెంట పరుగే పెద్ద వ్యసనం కొన్ని క్షణాల్ని మాత్రం నిలబెట్టుకోవచ్చు మనకోసం అవి నిత్యం వాడిపోని పరిమళపు సొంపుని పూయడం చేత . ..... 24-4-2014

by Pulipati Guruswamy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ihgGIB

Posted by Katta

Ln DrKvnm Prasad కవిత

http://ift.tt/1tFfGaS

by Ln DrKvnm Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tFfGaS

Posted by Katta

Ramaswamy Nagaraju కవిత

....॥ స్పర్శ! ॥.... ఒక కమ్మతెమ్మర ఒక కాంతి కిరణం ఒక సితమేఘచ్ఛాయ ఒక శైశవ స్మిత హేల ఒక పరిమళ పారిజాతం ఒక పడిలేచిన కెరటం ఒక నింగికి సాచిన రెక్క ఒక రేయిని మీటిన చుక్క ఒక ఆత్మీయ వాక్కు ఒక అభయ హస్తం ఒక్కొక్కటీ నా ఎదను మేల్కొల్పే ఒక పంచభూత పరామర్శ ! నా ఎడదను శృతి చేసే ఒక విశ్వాత్మ స్పర్శ ! Dt:24.04.2014

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jRIrtU

Posted by Katta

Praveena Kolli కవిత

తోడు /ప్రవీణ నువ్వూ నేనూ రెండు విరుద్ద భావాలను వ్యక్తీకరిస్తున్నాం అనుకుంటున్నాం తరచి తరచి చూస్తే వాటి మూలం ఒకటే నేస్తం! నువ్వన్నావు, కష్టాన్ని పంచుకునే తోడొకటి లేకపోవటమే పెద్ద లోటని నేనన్నాను, సంతోషాన్ని పంచుకోలేని తోడు ఒక తోడే కాదని హుటాహుటిన పెద్ద పెద్ద గ్రంధాలను మోసుకోచ్చావ్ నీ చూపుడు వేలితో ఆ నీతుల వెంట పరుగులు పెడుతూ కన్నీటిని తుడిచే చెయ్యే ముఖ్యమన్నావ్ అయ్యో నా ప్రియ నేస్తమా, నీకెలా చెప్పనూ? అ ముని వేళ్ల నుంచీ ధారలుగా కారుతున్న జాలిని దాటుకుని నాలుగడుగులు ముందుకెళ్ళి ఓ సారి వెనక్కి తిరిగి చూడు చప్పట్ల మోతలు కాదని అవి మెటికల శబ్దాలని తెలుసుకుని నివ్వెర పోతావ్! అందుకే అంటాను, సంతోషాన్ని పంచుకునే సాహచర్యమే అసలైన తోడని

by Praveena Kolli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1psbM5l

Posted by Katta

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు ( అనుదిన వ్యాయామం ) నేను ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో వాకింగ్ చేస్తుంటా, ఒంటికి నలుపు రంగు పూసుకొన్న తెల్ల కోకిల “కూ”, “కూ” అంటూ వెన్నెల రాగాలు తీస్తున్నది... ఒంటి నిండా తెల్ల బొచ్చు అంటించుకున్న నల్ల కుక్క “కవ్”, “కవ్” అంటూ చీకటి గోల చేస్తున్నది... నేను ఆధునిక సౌకర్యాల హాలులో ప్రాణాయామం చేస్తుంటా, రోగాల గొడ్డళ్ళకు, ఇంగ్లీషు మందుల కత్తులకు బలైన పొలం తూలిపడటం, తట్టుకొని నిలబడటం అభ్యసిస్తున్నది... ముడతలు పడిన చర్మ ఖర్జూరం ఒలిచేసుకొని మనిషితనం కొత్త రూపాయల కుర్ర చర్మం తొడుక్కొని కులుకుతున్నది... నేను మా ముసినిపల్ పార్కులో మునుల్ని, ఋషుల్ని పిడికిళ్ళలో పెట్టుకొని కొత్త ధ్యానం చేస్తుంటా, పక్క అపార్టుమెంటులో ఆడుకుంటున్న పిల్లకాయలు సూర్యభవనాలకు, చంద్ర నక్షత్రాల వీధులకు కొత్త విద్యుత్తు అందిస్తున్నారు... బయటకు కదలొద్దని మనుషులు శాసించిన దేవుళ్ళు నిగ్రహాల విగ్రహాలలో పగలైనా నిద్రపోతూనే ఉన్నారు... ఇక నేనిప్పుడు సూర్యు డిచ్చిన రెక్కల్ని తొడుక్కొని గరుడ గమనంతో అవకాశ ఆకాశంలోకి బయలుదేరాను, సోదరులారా, రస హృదయ భావుకులారా, నన్ను ఉచితాసనంగానో, పదునైన ఆయుధంగానో చేసుకోండి, కదలకుండా చచ్చిపోతారో, కదులుతూ కంపల్ని నరుక్కుంటారో మీరే తేల్చుకోండి. 24-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8zUpb

Posted by Katta

Rama Krishna Perugu కవిత

Perugu Haiku.. పొలం మధ్యలో కొంగల అసెంబ్లీ ..

by Rama Krishna Perugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iOp07t

Posted by Katta

ఎం.నారాయణ శర్మ కవిత

కొస ________________ ఒకానొక మహాస్వప్నం సాకారమౌతున్న ఘడియన వంచనలో ఇరుక్కున్న తల్లిగొంతుక పెనుగులాడుతున్న క్షణాన దిగులుని ఊపిరిగామింగి నిలబడ్డ నిమిషాన మీనీడల దాగుడుమూతల్ని అలసిన దేహాలింకా మరచిపోలేదు పేగులు నిప్పులైకాలుతున్నప్పుడు మట్టికీ ఆకాశానికీమధ్య రేపటిరోజు కొమ్మలకు వేళాడుతున్నప్పుడు పిడికిళ్ల కళ్లలో కన్నీటిగాలుల్ని చిమ్మి నవ్వినప్పుడు మీ మౌనం అర్థాంగీకారంలా కూడా అనిపించలేదు స్వచ్చమైన గుండెకోతని ఎరుకజేయని చెవులు దుఃఖమైన పిడికిలిని అణగదొక్కినకాళ్లు ఇపుడు ప్రాణం పోసింది మేమేనంటే బతికిన ప్రాణన్ని కూడా మళ్లీ మట్టి పాల్జేయాలనిపిస్తుంది.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iOoZQR

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/మట్టి వాన ............................ నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఆరుబయటంతా ఒకటే మట్టి వాసన ఎంత ఆపుదామన్నా గుండె పుటాల్లో జ్ఞాపకమై కూర్చుంది పచ్చి ఆకులు ఒంటి నిండా తడిసిన తన్మయంలో ఓ తేనె పులకింత అప్పుడో ఇప్పుడో అన్నట్టుగా తట్టి వెళ్ళే వసంతంలా ఓ పులకరింత కారుమేఘాల మధ్య భళ్ళున ఓ శృతి మనసుకినసొంపుగా యదలోతుల్లో మరోవాటిక రెక్కలు రాలిన పువ్వులెన్నో ఒంటరిదారి నిండా పరుచుకొని ఈవేళ తృప్తి చెందాయి ఈ వానకి చీకటి ముసుగును అప్పుడే తొలగిస్తూ ఆకాశం ఇంకిన చినుకుల్ని రుచిచూపిస్తూ దోసిళ్ళలో కాసిని ఇప్పుడే స్థిమితపడ్డాయి రహదారులన్ని కురచయిపోయాక చిన్నప్పుడు వేసిన కాగితం పడవలు ఇంకా ఎక్కడో తిరుగాడుతున్నట్టుగా ఓ మధుర సంతకం ఈ వర్షంలో మళ్ళా ఎప్పుడో గగనాన మేఘమధనం నా కళ్ళలో కొట్ల విత్తనాలు మొలకెత్తడానికి ఎదురు చూస్తూ తిలక్ బొమ్మరాజు 20.04.14 24.04.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hlVUf6

Posted by Katta

Pulikonda Subbachary A Poet కవిత

Dear friends read my poem on chundur judgement and feel free to respond. Subbachary పులికొండ సుబ్బాచారి. ఆడర్ ఆడర్.... నేను గుడ్డిదాన్ని (శీర్షిక) కళ్ళకు గంతలు కట్టుకున్నాను తరాజు సమంగా ఉందో లేదో ఎలా కనిపిస్తుంది. ఒక పళ్ళెం ఒరిగిందా ఏమో.... అవును నిజమే... అక్కడ రక్తం పారింది నిజమే కొన్ని 'అంటరాని' దేహాలు కసిగా నరకబడ్డాయి వరిపొలాల్లో నీటికి బదులు నెత్తురు పారింది నిజమే.. గుండె తరుక్కుపోతూంది.. నిజమే.. ఏండ్లు పూండ్లయినయ్ బుగ్గమీదికి జారిన కన్నీటి చుక్క ఇన్నేండ్లయినా ఇంకా ఆరలేదు.... నిజమే.... అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ ఆడర్ ఆడర్... అన్యాయం జరిగిందా... ఎక్కడా ఎక్కడా సాక్ష్యాలు లేవు.. నమ్మేలేను. ఇంకా జైల్లో ఉన్నారా.. వదిలేయండి వాళ్ళు నిర్దోషులు... మిలార్డ్... మిలార్డ్... మిలార్డ్..వినండి.... ఒక గావుకేక... ఇష్ మాట్లాడకండి వాళ్ళు నిర్దోషులు... వదిలేయండి.... న్యాయం వర్థిల్లుతూనే ఉంది.

by Pulikonda Subbachary A Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) https://www.facebook.com/329598603759565/posts/742940605758694

Posted by Katta

Uday Dalith కవిత

చుండూరు దళిత స్వరం రాముడు శంభూకుని వధించవచ్చును ద్రోణుడు ఏకలవ్యుని బొటనవ్రేలును తెంచవచ్చును అదే న్యాయం అదే ధర్మం పశుపక్షాదులు పూజలు అందుకోనూవచ్చు రాళ్ళు రప్పలు దైవత్వాన్ని పొందవచ్చు అదే మానవత్వం అదే సమానత్వం పుట్టుకే నీచమైనది అవనూవచ్చు అదే పవిత్రత కానూవచ్చు అదే యుక్తి అదే భక్తి అంటరానితనమే వసంతం అస్పృశ్యతే సేవ మనిషిని మనిషే చంపి తింటుంటే మనువు మళ్లీ పుట్టి న్యాయానికి తీర్పు చెబుతుంటే పుట్టుకే చావు అర్హతను నిర్ణయిస్తే సమసమాజానికి అదే నీతి అదే ప్రీతి

by Uday Dalith



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1igiFwT

Posted by Katta

Sreedhar Babu Pasunuru కవిత



by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1npx5Ta

Posted by Katta