పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, జూన్ 2014, శనివారం

Lanka Kanaka Sudhakar కవిత

పూలపొట్లం ----డా.యల్.కె.సుధాకర్ హఠాత్తుగా హద్దులు గీసుకుని ఉదయాన్నేయుధ్ధం చేసుకున్న రెండు హృదయాల మధ్య సాయంత్రం శాంతి సందేశం పూలపొట్లమై టీపాయ్ మీద తనని తాను విప్పుకుంటుంది శత్రు రాజ్యాధిపతులు ఒకరికొకరు యెదురుపడకపోయినా సువాసనల రాయబారం సాగుతూనేఉంటుంది ప్రక్కరాజ్య ప్రతినిధి లా చంటిది ముసిముసి నవ్వుల పత్రికని బెడ్రూమ్నుంచి హాలు దాకా మోసుకొచ్చి నాన్న చేత చిరునవ్వుల సంతకం పెట్టిస్తుంది అత్యధిక సమయం హాల్లోనేగడిపేందుకు వార్తాపత్రికని మించిన మార్గం దొరకదు మహరాజుకి మూడోసారికూడా పూర్తిగా చదివేసాక ఉదయం మాటల రైలుబండి గడితప్పిందెవరినోటనో తెల్సుకుందికి పరిశోధన మొదలౌతుంది... సువాసనల రాయబారంసాగుతూనే ఉంటుంది... అసహనానికి ఆహుతైన టీకప్పొకటి వంటింట్లో భళ్ళున బద్దలౌతుంది-అతడేమో దోమలతోనూ,టీవీ చానళ్ళతోనూ,ఆలోచనలతోనూ ఆటలాడుతూ ఉంటాడు...సువాసనల రాయబారం సాగుతూనే ఉంటుంది.. చిట్ట చివరికి- అంతకంతకూ బరువెక్కిన గాలి ఆ ఇంట్లో ప్రేమకి ప్రాణం పోస్తుంది ఉదయపు మనస్పర్ధలన్నింటినీ ఆమె-చిరునవ్వుల పంచదార కలిపిన కాఫీతో మాఫీ చేస్తుంది... అతడు-నిలువెత్తు నవ్వుల స్తంభమై, మల్లెచెండు తెల్ల జెండానెగరేస్తాడు.

by Lanka Kanaka Sudhakar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mWpZRe

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి