పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, జనవరి 2014, శుక్రవారం

Jagadish Yamijala కవిత

మనసు ఆట ---------------------- ఆనందంలోనూ సరే ఆవేదనలోనూ సరే పక్కనే ఎందరున్నా ఎక్కడో కంటికి కనిపించనంత దూరాన ఉన్న వారి కోసం నా మనసు పరితపిస్తోంది ఎందుకనో.....? అందరి విషయంలోనూ అంతేనా లేక నా మనసు నాతో ఆట ఆడుతోందా? పోనీ పడే బాధ మనసుదేకదా అని వదిలేద్దామన్నా కుదరడం లేదు -------------------------------- యామిజాల జగదీశ్ 31.1.2014 ------------------------------------

by Jagadish Yamijalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klOp7M

via IFTTT

Srivalli Radhika T కవిత || శిక్షణ

శిక్షణ//టి. శ్రీవల్లీ రాధిక అన్నీ వున్న ఐశ్వర్యవంతుడే అయినా అపుడపుడూ నాకేమిస్తావంటూ కొంటెగా అడుగుతాడు నావి అనుకున్నవాటన్నిటినీ మరెవరికో పంచేసి నన్నేడిపించాలని చూస్తాడు నేనెవరికీ యివ్వనంటూ దేన్నైనా గట్టిగా పట్టుకుంటే నా గుప్పెటలోనుంచి దానిని సున్నితంగా తప్పిస్తాడు ఉక్రోషంతో నేను వాదనకు దిగితే నేనిచ్చిందేకదా తల్లీ అంటూ నాన్నలా నవ్వుతాడు ప్రలోభాలనే బండరాళ్ళను తెలియక మెడకి కట్టుకున్న ప్రతిసారీ పరీక్షల ప్రవాహానికి కట్టలు తీస్తాడు తెలివితెచ్చుకుని నేనా బరువులొదిలించుకునేవరకూ నిర్లిప్తంగా నను గమనిస్తాడు మరొకప్పుడు… నేనూహించని పురస్కారాలని పూలదండలా నా మెడలో వేస్తాడు నేను దానిని తడిమి మురిసే లోపూ ఆ పూరేకులన్నీ నాపైనే రాల్చేసి వాటి వెనుకనున్న సూత్రాన్ని గమనించమంటాడు నిష్కామమనే నావని తయారుచేసుకునేవరకూ నన్నో కంట కనిపెడుతూనే ఉంటాడు ఒక్కసారి దానినధిరోహించి నిర్భయంగా కూర్చున్నానంటే ఇక వేల వరాలు నాపై కురిపిస్తాడు ***

by Srivalli Radhika Tfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1klzcmX

via IFTTT

Kavi Yakoob కవిత || యాకూబ్ | నువ్వు వచ్చివెళ్ళాక .................................... నువ్వొచ్చావని చెప్పాక గానీ తెలియలేదు నేను లేనని ; నువ్వున్న స్థలంలో నేను లేను , నేనున్న కాలంలో నువ్వు లేవు నేనొక దారిలోకి ప్రయాణం మొదలుపెట్టి, ఇంకా అక్కడికి చేరుకునేందుకు మధ్యన ఆగుతూ సాగుతున్నాను నువ్వేమో నేను లేని శూన్యంలోకి ప్రవేశించావ్ .. కొన్నేళ్ళ క్రితం నువ్విప్పుడు బతుకునేల మీదే నేనూ బతికాను, నువ్వోచ్చావంటే నా నేల వచ్చినంత సంబరం. ఆ సంబరం నిన్ను కలుసుకోలేనందుకు కోల్పోయానని లోపల్లోపల అదనపు బెంగ. అన్నీ బెంగలే దూరంగా బతకడం బెంగ ; ఇన్నేళ్ళ తరవాత కూడా ఇక్కడే అని చెప్పుకోలేని బెంగ ; ఎంచక్కా ఆకాశం కింద ఆరబోసుకున్నట్లు జీవించలేకబోతున్నందుకు బెంగ ; జేబుల్లోనే కుదించుకుపోయిన బతుకు బెంగ ; ఇవాల్టిని రేపటిలోకి పొడిగించే బెంగ; మాటల్ని బిగబట్టుకుని ,లోపలే కుక్కుకుని వొళ్ళంతా ఒక యంత్రంలా మారిపోయిన బెంగ; దినదిన గండంలాంటి మనసులోని బెంగ నేను లేను ,నువ్వు మాత్రం వచ్చి వెళ్ళిపోయావు కూడా ! అపుడపుడూ నాలోకి వొంపిపోయే ఊరిని ఈసారి నీతోనే వెంటపెట్టుకు తిరిగెళ్ళిపోయావ్ మళ్ళీ ఎప్పటికో నాలో ఆ సంబరం ! 31.1.2014 ||

యాకూబ్ | నువ్వు వచ్చివెళ్ళాక .................................... నువ్వొచ్చావని చెప్పాక గానీ తెలియలేదు నేను లేనని ; నువ్వున్న స్థలంలో నేను లేను , నేనున్న కాలంలో నువ్వు లేవు నేనొక దారిలోకి ప్రయాణం మొదలుపెట్టి, ఇంకా అక్కడికి చేరుకునేందుకు మధ్యన ఆగుతూ సాగుతున్నాను నువ్వేమో నేను లేని శూన్యంలోకి ప్రవేశించావ్ .. కొన్నేళ్ళ క్రితం నువ్విప్పుడు బతుకునేల మీదే నేనూ బతికాను, నువ్వోచ్చావంటే నా నేల వచ్చినంత సంబరం. ఆ సంబరం నిన్ను కలుసుకోలేనందుకు కోల్పోయానని లోపల్లోపల అదనపు బెంగ. అన్నీ బెంగలే దూరంగా బతకడం బెంగ ; ఇన్నేళ్ళ తరవాత కూడా ఇక్కడే అని చెప్పుకోలేని బెంగ ; ఎంచక్కా ఆకాశం కింద ఆరబోసుకున్నట్లు జీవించలేకబోతున్నందుకు బెంగ ; జేబుల్లోనే కుదించుకుపోయిన బతుకు బెంగ ; ఇవాల్టిని రేపటిలోకి పొడిగించే బెంగ; మాటల్ని బిగబట్టుకుని ,లోపలే కుక్కుకుని వొళ్ళంతా ఒక యంత్రంలా మారిపోయిన బెంగ; దినదిన గండంలాంటి మనసులోని బెంగ నేను లేను ,నువ్వు మాత్రం వచ్చి వెళ్ళిపోయావు కూడా ! అపుడపుడూ నాలోకి వొంపిపోయే ఊరిని ఈసారి నీతోనే వెంటపెట్టుకు తిరిగెళ్ళిపోయావ్ మళ్ళీ ఎప్పటికో నాలో ఆ సంబరం ! 31.1.2014

by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvYAZI

via IFTTT