పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

శ్రీనివాస్ వాసుదేవ్॥ఏ వాక్యమూ మరణించదు॥


నువ్వు మౌనివో, యోగివో
నీ చుట్టూ నిశ్శబ్ద సమాధి కట్టుకుంటావు
మరణానికెలాగూ భాషలేదు, ఇక జీవితమా
కొన్ని గుర్తులసమ్మేళనమే అని చెప్తూనె ఉంటావు....నిశ్శబ్దంగా!

తెల్లవాడివో, రంగద్దుకున్న అతివాదివో
నువ్వంటించిన ఆ కూ క్లక్స్ క్లాన్ శిలువ
మండుతూనె ఉంది, తెల్లగా! ఏంచెప్పలేక సతమతమవుతూ!

మనిషివో, మరమనిషిలా తయారయ్యావో
కణాన్నీ, క్షణాన్నీ విస్ఫోటిస్తే
వచ్చేది మన మనిషే, జీవం తాడు పేనుకుంటూ......
జెన్‌‌లు, సూఫీలందరూ చెప్పివెళ్ళిపోయారు

ఏ యూదుడవో, యోధుడవో
మనసుల్నీ, మతాల్నీ విడదియ్యలేక ఓడిపోతుంటావు
నీకు తెలియందికాదులే మానవత్వం.....

ఇలియట్‌‌ లీజుకు తీసుకున్న ఓమ్ శాంతి ఓం అన్నా
రుడ్యార్డ్ కిప్లింగ్ కిమ్మన్నా,
ఆ భావమేమీ మరణించదు
ఆ వాక్యమేదీ మరణించదు........

రెండు నగ్నాక్షరాల మధ్య పోరాటంలో
ఓ కవిగద్ద తన్నుకుపోయే బాధలో
భావమేదీ మరణించదు....
అదెప్పుడూ జీవిస్తూనే ఉంటుంది
ఈ కవితల్లొ.....

మనిషిగానో, రోబోగానో
ఓ పర్గేషన్ కోసమే, ఓ భావశుధ్ధికోసమో
రాసే వాక్యమేదీ మరణించదు
అవును, ఇక్కడ వాక్యానికి మరణమే లేదు
*7.7.2012

6 కామెంట్‌లు:

  1. **రెండు నగ్నాక్షరాల మధ్య పోరాటంలో
    ఓ కవిగద్ద తన్నుకుపోయే బాధలో
    భావమేదీ మరణించదు....**

    భావం అమృతాత్మ..
    యే భాషైనా.. భావమే దాన్ని బ్రతికించేది..
    కవులందరి ఎకైక దైవం అది..
    చాల బాగుంది దేవ్ జీ..

    రిప్లయితొలగించండి
  2. భావం అమృతాత్మ అన్న మీ భావన ఓ అద్భుతమైన భావనమళ్ళీ..

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. మరణానికెలాగూ భాషలేదు, ఇక జీవితమా
    కొన్ని గుర్తులసమ్మేళనమే-
    మండుతూనె ఉంది, తెల్లగా! ఏంచెప్పలేక సతమతమవుతూ!-
    కణాన్నీ, క్షణాన్నీ విస్ఫోటిస్తే వచ్చేది మన మనిషే-
    ఓ కవిగద్ద తన్నుకుపోయే బాధలో-

    లోతైన భావనలు వాసుదేవా!గొప్ప కవిత. చెప్పాలనుకున్న విషయానికి చరిత్రని,మనిషి స్వభావాన్ని నేపధ్యంగా మలిచి మంచి కొత్తా ఆలోచనని,క్లుప్త సందేశాన్ని అందించారు.తత్న దృష్టితో కూడా కవిత చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. కృతజ్ఞతలు కిషోర్... మీ ప్రశంసతో నాకవిత సార్ధకమయింది.

    రిప్లయితొలగించండి
  6. "రెండు నగ్నాక్షరాల మధ్య పోరాటంలో
    ఓ కవిగద్ద తన్నుకుపోయే బాధలో
    భావమేదీ మరణించదు....
    అదెప్పుడూ జీవిస్తూనే ఉంటుంది
    ఈ కవితల్లొ....."చాలాబాగుంది వాసుదేవ్ గారూ

    రిప్లయితొలగించండి