పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Yessaar Katta కవిత

సురెక || తెలుగు గజల్ -14 .. ఊహల తలయేఱులే మెదిలింది చిన్నెలవాలే అయినా ఊసుల సెలయేఱులే కదిలింది వన్నెలబాలే అయినా. .. సఖునికి తాపమే చెలితలపుల వేడిలో కనుదోయిని తడిపింది వెన్నెలవేళే అయినా. .. చెలికంతా కోపమే పొరిచూపుల వాడిలో సిగమాటుగ ఒదిగింది మల్లెలమాలే అయినా. .. పెదవికి బిగువే చిరుకులుకుల నీడలో మదిగదిలో కురిసింది నవ్వులహేలే అయినా. .. సవ్వడితో సిగ్గులే ఇరుతనువుల క్రీడలో పొదగూటిలో విరిసింది గువ్వలగోలే అయినా. .. సంబరాల జల్లులే సుధచినుకుల తోడులో బాల్యములను కలిపింది గవ్వలజోలే అయినా. .. (తెలుగు గజల్ -14 * 13/06/2014)

by Yessaar Kattafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v8lWYe

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి