పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Sharada Sivapurapu కవిత

ఏందరో హృదయాలు ద్రవించి కవితలు రాశారు. ఏంత చదివినా, ఇన్ని రోజులు గడుస్తున్నా, మనసుని పూర్తిగా ఆక్రమించి నిద్ర పోనీయని బాధ. ఫొయినోళ్ళు అందరూ తల్లితండ్రులకి మిగిల్చిన జీవితాంతం మానని గాయం. మనసులో బాధ చెప్పుకుంటే పోతుందంటారు. ఆందుకే వారందరి బాధ కొంత పంచుకునే ప్రయత్నం నేను కూడా చేసాను కొంత స్వార్ధంతో. ఎలా చెప్పనురా నువ్విక రావని // శారద శివపురపు మా కొర్కెల అద్దాలలొ మీరేగా ప్రతిబింబాలు మా ప్రతి ర క్తపు బొట్టు మీకొసం మెట్లుగ పరిచి నే పుజించే చదువులతల్లి నిను కరుణించి నన్ను కాకున్నా సిరులతల్లి నిను వరించి ఇంతవరకు నువ్వెక్కిన ఎ త్తులను కిందనుంచి చూ స్తూ , ఇంకెంతో ఎ త్తుకు ఎదగాలని ఆశించి నీ కళ్ళతో నువు చూసే అందాలకి మా మనసులో ఆనందాలు నింపుకుంటూ, క్షణ క్షణం కలతపడె మనసుని ఘడియ ఘడియకి నీతో మాట్లాడి సమాధానపెడుతూ నువు వచ్చిన రోజున నువు దోచుకుని మనసున నింపుకున్న అనందమంతా పంచుకోవాలని ఆశగా ఎదురుచూ స్తున్న మా అందరికీ నిర్లక్ష్యం నిర్దయగా నలిపేసిన పసిమొగ్గలు ఎవరోకాదు, మీరేనని తెలిసిన క్షణాల్లో, మీఅందరి ప్రాణాలు తీసి, మా కనులనుండి కసిగా పరవళ్ళు తొక్కిన బియాస్ నది జలాలు, కరుగలేదు లోన వెన్న అనుకున్న శిలలు, కాదు.... అలలతోకూడి మీ ర క్తం తాగిన రాళ్ళు కబళించే మృత్యువు కదం తొక్కుతూ వ స్తుంటే కాళ్ళు తడుపుకుందామనుకున్నారా , నిండా మునిగిపొతుంటే చేతులు కట్టుకు నిలిచారా మరణంతో పోరాటానికి ముందే సిద్దపడ్డారా ఇంత జరిగినా, ఎంత చూ స్తున్నా, ర క్తం గడ్డకట్టే చల్లని నీటిలో ఎవరికీ లేని జాలి, నాకు మా త్రం ఎందుకని కురు స్తూన్న వర్షంలో నైనా, తిండి లేకున్నా, ఏ చెట్టు కొమ్మనో, ఏ గుండెగల బండరాయినో ఆసరా చేసుకుని నువు నవ్వుతూ తిరిగొ స్తావని నమ్ముతోందిరా .... నీ పిచ్చి తల్లి ఎలా చెప్పనురా, నువ్విక రావని, నా గుండె కొట్టుకోనని మొరాయి స్తూంటే ఎలా చెప్పనురా, పెదవులు మౌనం వహి స్తే ఎలా చెప్పనురా, మనుసు తిరిగబడుతుంటే ఎందుకు నీకీ అన్యాయం జరిగిందని ఏమని అడగనురా, చి త్తు కాయితాలతో నీ జీవితాన్ని వెలక ట్టిన ప్రభుత్వాన్ని? సమాధానం లేదని తెలిసిన ప్రశ్నకు జవాబెవరిని అడగనురా? 13/06/2014

by Sharada Sivapurapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pqEN0K

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి