పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

John Hyde Kanumuri కవిత

ఆ రాత్రి - ||జాన్ హైడ్ కనుమూరి|| గజల్ కలలోనైనా మెలకువనైనా గుర్తుండేదీ ఆ రాత్రి నీతో నడచీ అలుపును మరచీ సాగినదీ ఆ రాత్రి నిన్ను నన్నూ కలినదెవరో తెలిసేలోగా కాలం పరిచిన తిన్నెలపై వెన్నెల పరచినదీ ఆ రాత్రి నిట్టూర్పు సెగలతో క్షణాలు యుగాలుగా నీకై వేచివున్న మదిగదిని రెప్పవేయనిదీ ఆ రాత్రి శిశిరానికి ఆకురాలిన కొమ్మను నేనై పొటమరింతల చిగురుకై ప్రసవవేదనైనదీ ఆ రాత్రి హోరు గాలిలోచిక్కి ఒంటరైన పక్షికి దిగులుగా గుబులు గుబులుగా గడచినదీ ఆ రాత్రి కలలుకన్న తనువున నిదురనే తరిమి వేలవేల వీణెలు మీటిన సంగీతమైనదీ ఆ రాత్రి ఎదురెదురు రేవులలో కలవలేని కనులుగా దరి చేరని నది అలలపై ఊగి ఊగి సాగినదీ ఆ రాత్రి అప్పగింతల పర్వమే తెగిన శాశ్వత బంధంగా తలచి తలచి వర్షించే కనులతో తడిసినదీ ఆ రాత్రి నెలరాజునిండిన తోటలో రేయంతా పాటగా కూ'జాను'వొంపిన గజళ్ళతో కడుపు నిండినదీ ఆ రాత్రి ---------------------------------- May 14th, - June 12th 2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v6YbQn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి