పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Chi Chi కవిత

_వనిత_ నువ్విష్టం నువ్వుగావుంటే నిన్నొదలని లోకం నీ చుట్టే కాపు కాస్తావని కాయలిస్తావని చూపునిలిపే చూపు చూస్తావని!! ప్రకృతే నీకు పరిచారికై ప్రస్థానమిచ్చింది పరువాలకు.. ప్రాణాన్ని మరిపించు ప్రణయాలతో మౌనమూ మొహమై మనసు కట్టేసి మాట లేకుండా మాయకొడతావు.. మనువు ముసుగని కూడా తెలుసు నీకు!! ప్రాణం పోస్తావ్ గింజకు తల్లనుకోకు!! గింజలెవరివైనా పూస్తావ్ మానభయం నీకు!! లెక్క తప్పని స్వేచ్చతో గూడెతికి కొలువుకున్నా నిక్కపొడవలేవు నీ మీదకు నిజమొస్తే !! పలాన కాని పడుచుకి ప్రపంచమే చులకన .. పడకేసే పనిలోనే పరిచయాల ప్రకటన!! నాటకమే పతి పత్ని నాటకమే మాతృమూర్తి నాటకమే పడుపు వృత్తి నిజమొకటే నీకు నీవు ఎవరికెవరు ఏమవ్వరు.. నువ్విష్టం నువ్వుగా ఉంటే నీ కష్టం ఉండనివ్వదని తెలుసు నాకు.. నాటకాలు నాకెందుకు నేను ప్రకృతికి పరిచారకున్ని పురుషున్ని!!_____________(13/6/14)

by Chi Chifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pQTO9K

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి